ఖిల్లాఘనపురం: బాలలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా కార్మికశాఖ అధికారి మహ్మద్ రఫీ హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా మంగళవారం ఆయనతోపాటు ఎస్‌ఐ మహ్మద్ అహ్మద్, సిబ్బంది కలిసి ఉదయం మండల కేంద్రంలో పర్యటించారు. బస్టాండు దగ్గర డిష్ కేబుల్ లాగుతూ 13 ఏళ్ల బాలుడు కనిపించగా అతడితో మాట్లాడి పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కౌన్సెలింగ్ ఇచ్చి జిల్లా బాలల సంరక్షణ యూనిట్‌కు అప్పగించారు. యజమాని సాదీఖ్‌పాషాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాసులు, రాచాల శ్వేత, హరికృష్ణ, రవిరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment