రాజకీయ ఒత్తిళ్లు..
పన్ను వసూలు కోసం బిల్ కలెక్టర్లు, ఇతర అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు కొందరు కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఫలితంగా బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చాల్సిన వారే అడ్డు పడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు మురికి వాడల్లో ఏళ్ల తరబడి అవగాహన కల్పించక పోవడంతో బకాయిలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, కొందరు బకాయిదారుల పేర్లతో కూడిన నోటీసులను అధికార యంత్రాంగం జారీ చేస్తుంటే.. కొందరు రాజకీయ నాయకులు తమ అనుచరులను నోటీసుల్లోంచి తొలగించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తుండటం గమనార్హం.
●
Comments
Please login to add a commentAdd a comment