ఆర్టీసీకి సంక్రాంతి ధమాకా
యాప్‌లోనే పద్దులు
‘నా పంచాయతీ’ యాప్ ద్వారా గ్రామాల అభివృద్ధి వివరాలు తెలుసుకోవచ్చు.
వాతావరణం
చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. అప్పుడప్పుడు చల్లటి గాలులు వీస్తాయి.
ఉదయం వేళ మంచు కురుస్తుంది.
వివరాలు 8లో u
స్టేషన్ మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులు నడిపింది. పండుగ సందర్భంగా మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ప్రయాణీకుల కోసం 320 అదనపు బస్సులను నడిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని తమ సొంత స్థలాలకు ప్రయాణికులు వెళ్లడానికి అధికంగా బస్సులు అందుబాటులో ఉంచారు. సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగింది. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో బస్సుల్లో గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఆక్యుపెన్సీ రేషియా అమాంతం పెరిగింది.
పెరిగిన ఆదాయం
మహాలక్ష్మి పథకం కింద ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 10 నుంచి 20 వరకు మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు సర్వీసులు నడపగా రూ.27.1 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే జనవరి 7 నుంచి 18 వరకు ఆర్టీసీ రీజియన్‌కు రూ.21.53 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి దాదాపు రూ.5.90 కోట్లు అధికంగా రావడం విశేషం. 10 నుంచి 20వ తేదీ వరకు రీజియన్‌లోని బస్సులు 37,11,743 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 46,11,545 మంది బస్సుల్లో ప్రయాణించారు. అదేవిధంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియా గతేడాది సంక్రాంతి పండుగ రోజుల్లో 96 శాతం ఉండగా.. ఈ ఏడాది 123 శాతం వచ్చింది.
పండుగ రద్దీతో మెరుగైన ఆదాయం
ఈ నెల 10 నుంచి 20 వరకు రూ.27 కోట్ల రాబడి
రీజియన్ పరిధిలో 46 లక్షల ప్రయాణికుల రాకపోకలు
37 లక్షల కిలోమీటర్ల మేర
బస్సుల ప్రయాణం
అమాంతంగా పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో
Comments
Please login to add a commentAdd a comment