కమలాపూర్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ అగ్నిమాపక కేంద్రం అధికారి చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో అన్ని రకాల అగ్ని ప్రమాదాల నివారణపై హనుమకొండ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో గురువారం అవగాహన కల్పించారు. గ్యాస్ లీకై నప్పుడు, విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, మంటలను ఆర్పే విధానాలపై ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్‌మెన్ జనార్దన్, ఫైర్‌మెన్లు యాకూబ్, రత్నాకర్, డ్రైవర్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ జ్యోతి, అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, కవిత, రజిత, కుమార్, సరోజ, కుమారస్వామి, శోభాదేవి, యామిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment