భద్రకాళి చెరువు నీటిని హసన్‌పర్తి మండలం నాగారం జలాశయంలోకి తరలింపు ప్రక్రియ శుక్రవారంనుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న కాల్వ ద్వారా ప్రతీరోజూ 500 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. క్రమంగా నీటి విడుదలను పెంచనున్నారు. భద్రకాళి సామర్థ్యం 0.1టీఎంసీ, నాగారం చెరువు కెపాసిటీ 0.1 టీఎంసీ కాగా, ఈ చెరువు ద్వారా 17 గ్రామాలకు సాగునీరు అందుతుంది. నగరం నుంచి వచ్చే మురికి నీరు ఈ చెరువులో చేరుతుంది. వెనువెంటనే చెరువునుంచి దిగువకు విడుదల చేయనున్నారు. భద్రకాళి చెరువు నీటిని అదనంగా తరలించే క్రమంలో పంట పొలాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానిక రైతులు హనుమకొండ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పంటపొలాలు ముంపునకు గురవకుండా సాఫీగా కాల్వల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment