వామ్మో వణుకు!
ఎంజీఎం: చలి వణికిస్తోంది. రోజురోజుకూ విశ్వరూపం దాలుస్తోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న చలి తీవ్రత వల్ల వచ్చే వ్యాధులు, పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన ‘సాక్షి’కి వివరించారు.
చలికాలంలో వచ్చే వ్యాధులివే..
● దగ్గు, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలు, గొంతునొప్పి, తుమ్ములు వస్తాయి.
● చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్లోటో జోవన్ల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
● గాలి ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి తెల్ల రక్త కణాలను నిర్వీర్యం చేయడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
● పిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధికి గురై ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు..
● పిల్లలకు స్వెటర్లు, సాక్సులు, గ్లౌజులు వేయాలి.
● నెలల వయసు ఉన్న చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ఉదయం పూట ఎండలో కా సేపు ఉంచాలి.
● చిన్నారులతో ఉదయం, రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు.
● పిల్లలకు అవసరమైన టీకాలు ఇప్పించాలి.
● ముఖ్యంగా ఆస్తమా వ్యాధి ఉన్న వారు చలి గాలిలోని తేమను పీల్చుకోవద్దు.
● రాత్రి వేళలో చల్లగాలి రాకుండా ఇంట్లో కిటికీలు, తలుపులు మూసి వేసి వెచ్చదనం కోసం వేడినిచ్చే హై వోల్టేజీ బల్బులను వాడాలి.
● వాకింగ్‌కు వెళ్లే వారు చలి ఎక్కువగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
● ద్విచక్ర వాహనదారులు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే చేతులకు గ్లౌజులు, హెల్మెట్, స్వెటర్లు ధరించాలి.
రోజురోజుకూ పెరుగుతున్న చలి
ఆరోగ్య రక్షణకు డీఎంహెచ్‌ఓ
అప్పయ్య సూచనలు
వారం రోజుల
ఉష్ణోగ్రతలు
(డిగ్రీలు సెల్సియస్‌లలో)
తేదీ గరిష్టం కనిష్టం
15 30 18
16 31 16
17 30 15
18 29 15
19 29 14
20 29 15
21 29 15
22 28 14
Comments
Please login to add a commentAdd a comment