వినతులు సత్వరమే పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణి వినతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డిలతో కలిసి కలెక్టర్ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను అధికారులు పెండింగ్ ఉంచొద్దని తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 107 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. ఈ దరఖాస్తుల్లో రెవెన్యూ భూ సంబంధిత సమస్యలపై 43, డీఆర్డీఓ 12, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సెక్షన్ 9, డీఎంహెచ్ఓ 6, జిల్లా విద్యాశాఖ 3, జిల్లా సంక్షేమ శాఖ 1, ఇరిగేషన్ శాఖ 5, జిల్లా వ్యవసాయశాఖ 4, జెడ్పీ సీఈఓ 2, జీడబ్ల్యూఎంసీ 6, రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీస్ 2, ఉపాధి కల్పన శాఖ 3, సివిల్ సప్లయీస్ 2, లీడ్ బ్యాంకు మేనేజర్ 1, జిల్లా పంచాయతీ శాఖ 3, ఎస్సీ కార్పొరేషన్ 4, ఎండోమెంట్ శాఖకు ఒక దరఖాస్తు వచ్చిందని వెల్లడించారు. అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణిలో పలు శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment