తుమ్మలమయం
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లోu
దుగ్గొండి: తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ.. ప్రతిఏటా అన్నదాతల పంటలకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు. అయితే ప్రాజెక్టు పరిధిలోని కాల్వలకు ఇరువైపులా ఉన్న రహదారులు సర్కారు(పట్నం) తుమ్మలతో నిండిపోయాయి. దీంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ ద్వారా పంటలకు నీరు అందుతోంది. డీబీఎం–38, 42, 48, 30, 31, 23, 24, 25, 27 ప్రధాన కాల్వల ద్వారా 2,93,367 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వర్షాలు సమృద్ధి గా కురవడంతో శ్రీరాంసాగర్,మిడ్‌మానేర్, లో యర్ మానేర్‌లలో నీరు పుష్కలంగా నిల్వ ఉంది. దీంతో కాల్వల ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు రబీ పంటలు సాగు చేయడానికి సిద్ధం అవుతున్నారు. పత్తి పంటలు తీసి ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో రబీలో మొక్కజొన్న సాగు చేసేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. మరో లక్ష ఎకరాల్లో వరి పంట వేయడానికి నార్లు పోస్తున్నారు.
81.6 కిలోమీటర్ల పొడవునా తుమ్మలు
ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్, ములుగు, భూ పాలపల్లి జిల్లాల రైతులకు సాగునీరు అందించే 81.6 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన కాల్వకు ఇరువైపులా రహదారులు పట్నం తుమ్మలతో నిండిపోయాయి. దీంతో రైతులు కాల్వల వెంట నడవలేని పరిస్థితి నెలకొంది. డీబీఎం 38 కాల్వ పరిధిలో 78,614 ఎకరాల్లో రబీ పంటలు సాగు కానున్నా యి. కాల్వకు ఇరువైపులా పెరిగిన తుమ్మలను తొలగించాలని అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి సర్కారు తుమ్మలు(పట్నం తు మ్మలు) తొలగించాలని రైతులు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
ఎస్సారెస్పీ కెనాల్‌కు ఇరువైపులా పెరిగిన చెట్లు
రాకపోకలకు అంతరాయం
ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతులు
పట్టించుకోని అఽధికారులు
ఎస్సారెస్పీ కాల్వలు.. ఆయకట్టు వివరాలు..
కాల్వలు ఆయకట్టు
(ఎకరాల్లో)
డీబీఎం–38 78,614
డీబీఎం–42,48 1,43,000
డీబీఎం–30,31 51,118
డీబీఎం–23,27 20,635
ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం..
డీబీఎం –38 కాల్వ 81.6 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. దాని పొడవునా రహదారి ఉంది. రహదారికి ఇరువైపులా పట్నం తుమ్మలు ఉన్నాయి. వాహనాలు, ఎడ్లబండ్లు వెళ్లడం కష్టంగా మారింది. మరో నెల రోజుల్లో సాగునీరు విడుదల చేసే సమయం వచ్చింది. కాల్వకు ఇరువైపులా ఉన్న పట్నం తుమ్మలను తొలగించడానికి ఎస్టీమేట్‌లు చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం. నిధులు మంజూరు కాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం..
– రామకృష్ణ, ఎస్సారెస్పీ డీబీఎం–38 డీఈ
Comments
Please login to add a commentAdd a comment