వినతులు సత్వరమే పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి వచ్చిన వినతులు సత్వరమే పరిష్కరించి దరఖాస్తులపై తీసుకున్న నిర్ణయం విషయంలో వారికి సమాచారం ఇవ్వాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణికి వివిధ సమస్యలపై 156 వినతులు రాగా.. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ శ్రీను ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. అర్జీల్లో అధికంగా పెన్షన్, భూముల సమస్యలు, ఉపాధి తదితర సమస్యలపై ఉన్నాయి. వినతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
ఉపాధి అవకాశం కల్పించండి..
నేను పీజీ పూర్తి చేశాను. నాకు ఏదైనా ఉపాధి కల్పించాలని గతంలో పలు మార్లు దరఖాస్తు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం లేదా ఇతర ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
– రాధిక, దివ్యాంగురాలు, ఎల్లాపూర్
పెన్షన్ ఇప్పించండి..
నాకు గతంలో ఒక కిడ్నీ తొలగించారు. ప్రస్తుతం కేన్సర్‌తో పోరాడుతున్నాను. నాకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రావడంలేదు. గతంలో చాలాసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. ఆసరా పెన్షన్ ఇప్పించండి.
– సకినాల లింగయ్య, పెగడపల్లి,
అక్రమంగా ఆస్తి రాయించుకున్నాడు..
నాకు నలుగురు కొడుకులు. మూడో కొడుకు ప్రభాకర్‌రెడ్డి నా పేరుతో ఉన్న ఉమ్మడి ఆస్తి 1.33 ఎకరాల భూమి తన పేరుపై రాయించుకుని నాతోపాటు మిగతా ముగ్గురు కొడుకులకు అన్యాయం చేశాడు. చట్టరీత్యా చర్యలు తీసుకుని భూమిని తిరిగి నాపేరుపై చేయాలి.
– రేకుల కౌసల్య, కొప్పూరు, భీమదేవరపల్లి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
ప్రజావాణికి పోటెత్తిన జనం
వివిధ సమస్యలపై 156 వినతులు
Comments
Please login to add a commentAdd a comment