మెనూ ప్రకారం భోజనం అందించాలి
హన్మకొండ అర్బన్: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో ని ప్రభుత్వ రెసిడెన్షియల్, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం అమలు తీరు, ఫుడ్ సేఫ్టీపై అధికారులు, ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆహార పదార్థాలు, కూరగాయలు నాణ్యత లేకపోతే తిరిగి పంపించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం.. అందించే భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూ డాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే నోటీసులివ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిరంతరం పరిశీలించాలన్నారు.
కరదీపిక, కరపత్రం ఆవిష్కరణ
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూ పొందించిన కరదీపికను కలెక్టర్ పి.ప్రావీణ్య సోమవారం ఆవిష్కరించారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై రూపొందించిన ఈ కరదీపిక వైద్యాధి కారులకు చాలా ఉపయోకరంగా ఉంటుందని, ప్లానింగ్, సిబ్బందికి శిక్షణ అందించేందుకు ఉపయోగపడుందన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన చలికాలంలో తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు నారాయణ, రమేశ్, డీఈఓ వాసంతి, జిల్లా సంక్షేమాధికారి జయంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి కొమరయ్య, పౌరసరఫరాల శాఖ మేనేజర్ మహేందర్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
అధికారులు,
ఫుడ్ సప్లయర్స్‌తో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment