3 వరకు కేంద్ర బృందం పర్యటన
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును కేంద్ర మానవాభివృద్ధి వనరుల సంస్థ అధికారుల బృందం డిసెంబర్ 3వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించనుందని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర బృందం ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్, తాటికాయల, పెద్ద పెండ్యాల, ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, కామారం, పెంచికలపేట గ్రామాలతో పాటు పరకాల మున్సిపాలిటీని సందర్శించనుందని చెప్పారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా మహిళా సంఘాల బలోపేతానికి చేపట్టిన చర్యలు, నిరుపేదలకు అందించే జాతీయ భద్రత పెన్షన్(ఎన్‌ఓఏపీ), నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా అమలవుతున్న వైద్య సేవలను పరిశీలిస్తుందన్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా ధర్మసాగర్ మండలంలో పరిశీలనకు వెళ్లినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment