ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి

Published Tue, Nov 26 2024 1:12 AM | Last Updated on Tue, Nov 26 2024 1:12 AM

ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి

ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి

డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్‌ పాండే

తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై సదస్సు

హన్మకొండ అర్బన్‌: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందించే ఉచిత న్యాయ సలహాలను బాధితులు వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమాదేశ్‌ పాండే కోరారు. తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం–2007పై జిల్లా సంక్షేమ శాఖ అధ్యక్షతన జిల్లా న్యాయసేవాధికార సంస్థ, హెల్ప్‌ ఏజ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా క్షమాదేశ్‌ పాండే మాట్లాడుతూ.. బాధితులెవరైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని సూచించారు. అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులంతా సంబంధిత కార్యాలయాలన్నింట్లో వృద్ధులకు ప్రత్యేక సేవలందించాలన్నారు. కార్యాలయాలకు వచ్చే వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్వర సేవలందించాలన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల్లో వయోవృద్ధుల చట్టంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధులను వారి పిల్లలు, కుటుంబీకులు పట్టించుకోకపోతే ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ గణేశ్‌, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, కె.నారాయణ, హెల్ప్‌ ఏజ్‌ ఇండియా సంస్థ అధికారి శ్యాంకుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణ్యపురి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement