ఎస్సారెస్పీ రోడ్లను బాగుచేయాలి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారుగా 3లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఈ సారి సరిపడా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నిండా నీరు ఉండటంతో రబీ పంటకు నీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ కాల్వను పట్టించుకోకపోవడంతో తుమ్మలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. దీంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది కాకుండా కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాల్వకు ఇరుౖవైపులా ఉన్న రహదారులు అనేక గ్రామాలను కలుపుతున్నాయి. దీంతో రవాణా దూరం తగ్గి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్షణం రహదారులను మరమ్మతులు చేయించి భవిష్యత్లో తారు రోడ్లుగా మార్చాలి.
– సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment