నల్లబెల్లి: రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకే రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని మేడపల్లి, రాంపూర్, గోవిందాపూర్, కన్నారావుపేట, అర్శనపల్లి, రంగాపురం, ముచ్చింపుల, నాగరాజుపల్లి, గుండ్లపహాడ్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ కృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, జిల్లా నాయకులు ఎర్రబెల్లి రఘుపతి, తేజావత్ సమ్మయ్య నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జ్యోతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఏడాకుల సంపత్ రెడ్డి, మధర్ థెరిస్సా మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment