అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
కలెక్టర్ నాగరాణి
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చే అర్జీల ప రిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూ పాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యా దుదారు సంతృప్తి చెందేలా చర్యలు ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 164 వినతులు అందా యి. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● వీరవాసరం మండలం నవుడూరులో ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసుకున్నారని, వీటిని తొలగించాలని గుబ్బల సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.
● భీమవరం మండలం కొమరాడలో పశువుల చెరువు గట్టును ఆక్రమించుకుని సెప్టిక్ ట్యాంకులు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు ఆర్.శక్తిశ్వరరావు అర్జీ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment