ధాన్యం.. దళారులపరం
లక్ష్యం కుదించి.. రైతులను వంచించి..
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో దళారుల రంగ ప్రవేశం కూటమి ప్రభుత్వ అండదండలతో విజయ వంతంగా జరిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయాలు జరిపి ప్రతి రైతుకూ మద్దతు ధర వచ్చేలా చేయడంతో పాటు దళారుల పాత్రను పూర్తిగా నిర్మూలించగలిగారు. అయితే అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రైతు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకోవచ్చని, 60 శాతం దిగుబడి మా త్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిబంధనలు విధించడంతో దళారుల విక్రయాలు తారాస్థాయికి చేరారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు పొరుగు జిల్లాలోని వ్యాపారులు ఇక్కడ కు వచ్చి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తున్నా రు. దీంతో ధాన్యం మద్దతు ధర (75 కిలోల బస్తా) రూ.1,725 ఉన్నా రైతులకు దళారులు రూ.1,300 నుంచి రూ.1,500 మాత్రమే ముట్టజెబుతున్నారు.
వేగంగా కొనుగోళ్లు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ గత నెలాఖరులో ప్రారంభమై ప్రస్తుతం వేగంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో మూడుసార్లు తుపా నులు, రెండుసార్లు గోదావరి వరదలతో 29 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో పాటు దిగుబడిపైనా తీవ్ర ప్రభావం చూపింది. కష్టనష్టాల నడుమ ఖరీఫ్ సీజన్ దిగుబడులు సాధించినా మద్దతు ధర మాత్రం అన్నదాతకు దక్కడం లేదు. ఏలూరు జిల్లాలో 1.80 లక్షల ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 2.19 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఏలూరు జిల్లాలో 5.60 లక్షల టన్నులు, పశ్చిమగోదావరి జిల్లాలో 6.10 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేశారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో 250 రైతు సేవా కేంద్రాలకుగాను 139 కేంద్రాల్లో, పశ్చిమగోదావరి జిల్లాల్లో 265 కొనుగోళ్లు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టింది. ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలో రూ.142 కోట్ల విలువైన 63 వేల టన్నుల ధా న్యాన్ని, ఏలూరు జిల్లాలో 79,900 టన్నుల ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా రెండు జిల్లాల్లోనూ ప్రైవేట్ కొనుగోళ్లు (దళారులు) అత్యధికంగా సాగుతున్నాయి.
న్యూస్‌రీల్
ఏలూరు జిల్లా
వరి సాగు 1.80 లక్షల ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా 5.60 లక్షల టన్నులు
కొనుగోలు లక్ష్యం 3.50 లక్షల టన్నులు
కొనుగోలు కేంద్రాలు 139
ఇప్పటివరకు కొనుగోళ్లు 79,900 టన్నులు
పశ్చిమగోదావరి జిల్లా
వరి సాగు 2.19 లక్షల ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా 6.10 లక్షల టన్నులు
కొనుగోలు లక్ష్యం 4.10 లక్షల టన్నులు
కొనుగోలు కేంద్రాలు 265
ఇప్పటివరకు కొనుగోళ్లు 63,000 టన్నులు
కొనుగోళ్లలో దందా
ఉమ్మడి జిల్లాలో భారీగా ప్రైవేట్ కొనుగోళ్లు
తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న దళారులు
రైతులకు మద్దతు ధర దక్కని వైనం
ఇతర జిల్లాల నుంచి భారీగా కమీషన్ ఏజెంట్ల రాక
నచ్చిన మిల్లుకు నిబంధనలతో అడ్డగోలుగా దందా
దిగుబడిలో 60 శాతమే ప్రభుత్వ కొనుగోలు
జిల్లాలో స్వర్ణ, సంపత్ స్వర్ణ, పీఎల్‌తో పాటు మరో 7 వైరెటీల వరి వంగడాలను అత్యధికంగా సాగుచేస్తుంటారు. ఈ క్రమంలో తేమ 17 శాతంలోపే ఉండాలని, అలాగే రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం తరలించవచ్చనే నిబంధనలతో ధర విషయంలో అన్నదాతలకు నష్టం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో 5.60 లక్షల టన్నుల దిగుబడికి 3.50 లక్షల టన్నులు, పశ్చిమలో 6.10 లక్షల టన్నుల దిగుబడికి 4.10 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యం నిర్దేశించింది. రెండు జిల్లాల్లో కలిపి 13.70 లక్షల టన్నుల దిగుబడి వచ్చినా 60 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించడంతో రైతులు అనివార్యంగా దళారులకు విక్రయిస్తున్నారు. తేమ 17 శాతం కంటే ఎక్కువగా ఉండటం, ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వం డ్రయర్లు గాని, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో కళ్లాల్లోనే దళారులకు అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తీసుకువెళ్లవచ్చని నిబంధన కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఏలూరు జిల్లాలో 100 మిల్లులు ఉంటే అత్యధికంగా ఏలూరులోనే ఉన్నాయి. సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో మిల్లులు తక్కువగా ఉండటంతో దళారులకు విక్రయించడం తప్పనిసరిగా మారింది. ఇదే అదనుగా దళారులు 75 కిలోల బస్తా ధాన్యానికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు ధర చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment