భీమవరం: పితృవియోగంతో బాధపడుతున్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు. శ్రీనివాసవర్మ నివాసం వద్ద ఆయన తండ్రి సూర్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేత్రపర్వం.. దేదీప్యమానం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారికి శనివారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ముందుగా ఆల య సిబ్బంది మండపంలోని దీపాలను వెలిగించారు. అనంతరం అర్చకులు స్వామి, అ మ్మవార్ల ఉత్సవమూర్తులను మండపంలోని ఉ య్యాలపై వేంచేపు చేసి, ఉయ్యాలను ఊపుతూ వేడుకను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జార్ఖండ్‌లో జిల్లా జడ్జి ఉద్యోగాలు
ఏలూరు (టూటౌన్): జార్ఖండ్ హైకోర్టు పరిధిలో 15 జిల్లా జడ్జిల నియామకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు జార్ఖండ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వివరాలు పంపారని జిల్లా జడ్జి సి.పురుషోత్తమకుమార్ తెలిపారు. బార్ అసోసియేషన్ నుంచి అర్హులైన వారి నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నా రు. జనరల్ అభ్యర్థులు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ.1,44,840–1,94,660 (లెవెల్ జె–5) పే స్కేలు అమలుచేస్తారన్నారు. మరిన్ని వివరాలను జార్ఖండ్ హైకోర్టు వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.
జనవరిలో హేలాపురి బాలోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే జనవరి 24, 25 తేదీల్లో నిర్వహించే హేలాపురి బాలోత్సవం ఐదో పిల్లల సంబరాలు విజయవంతం కావాలని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ అన్నారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో బాలోత్సవం కరపత్రాలను ఆహ్వాన సంఘం ప్రతినిధుల సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పెద్దలు హేలాపురి బాలోత్సవం పేరుతో పిల్లల సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించేలా అందరూ తోడ్పాటు అందించాలన్నారు. విద్యాలయాల ప్రతినిధులు ప్రోత్సహించి బాలోత్సవంలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. అడుసుమిల్లి నిర్మల, ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు పిల్లల సంబరాల నిర్వహణకు తోడ్పడిన విధంగా ఈసారీ సహకరించాలని కోరారు. బాలోత్సవాన్ని వట్లూరులోని సిద్ధార్థ ఫెస్ట్ స్కూల్‌లో నిర్వహించడానికి కమిటీ నిర్ణయించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment