క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి
ఏలూరు టౌన్: క్రీడలు అంటే గెలుపోటములు మాత్రమే కాదనీ, సవాళ్లను స్వీకరిస్తూ కొత్త విధానాలను నేర్చుకోవడమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్‌మీట్–24 ముగింపు వేడుకలు శనివారం జరిగాయి. ముఖ్యఅతిథిగా ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ శక్తి, సా మర్థ్యాలను నిరూపించుకునేందుకు క్రీడలు వేదిక అని అన్నారు. కృషి, పట్టుదలతో విజయం వైపు పయనిస్తూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. పతకం గెలిచినా.. లేకున్నా వేదికపై మీరంతా విజేతలేనని అభినందించారు. పోలీస్ సిబ్బంది శారీరకంగా దృఢంగా ఉండాలని, ఆరోగ్య పరిక్షణకు వ్యా యామం తప్పనిసరి అని అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ఒక్కరుగా సాధించలేనిది జట్టుగా సాధించవచ్చనీ, ప్రతిభను ప్రదర్శించేందుకు స్పోర్ట్స్‌మీట్ వేదికగా నిలిచిందన్నారు. ఒత్తిళ్లు, బిజీ షెడ్యూల్‌లోనూ పోలీస్ అధికారులు పోటీల్తో సత్తాచాటడం అభినందనీయమన్నా రు. అధికారులు, సిబ్బంది ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. క్రమశిక్షణ, ఐక్యత, క్రీడాస్ఫూర్తితో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్ శేఖర్, డీఎస్పీలు డి.శ్రావణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, యు.రవిచంద్ర, డీటీసీ డీఎస్పీ పి.శ్రీహరి, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
ముగిసిన పోలీస్ స్పోర్ట్స్‌మీట్
Comments
Please login to add a commentAdd a comment