యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేశారు. కార్తీక మాసం ముగుస్తున్న నేపథ్యంలో యాదగిరిగుట్ట క్షేత్రానికి భక్తులు అధికంగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment