ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
భువనగిరి: 2024–25 సంవత్సరానికి గాను ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్) పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. భువనగిరి డివిజన్ పరిధిలో 3, చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈపరీక్షకు 971 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 939 మంది హాజరయ్యారు. 32 మంది గైర్హాజరయ్యారు. చౌటుప్పల్‌లోని మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఈఓ సత్యనారాయణ, భువనగిరిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రభుత్వ పరీక్షల విభాగం అదికారి రఘురాంరెడ్డి పరిశీలించారు. ఎంపికై న వారికి నాలుగేళ్ల పాటు ఒక్కో విద్యార్థికి ఏటా రూ. 12 వేలు అందించనున్నారు.
ప్రతిభను వెలికితీసేందుకే గ్రామీణ క్రీడలు
భువనగిరి: క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు గ్రామీణ క్రీడలు దోహదపడతాయని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు అన్నారు. ఈశ గ్రామోత్సవంలో భాగంగా ఆదివారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రూరల్ ప్రీమియర్ లీగ్–2024 సౌత్ ఇండియా లెవెల్ గ్రామీణ క్రీడా ఉత్సవం జరిగింది. మహిళలకు త్రో బాల్, వాలీబాల్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ బాలకృష్ణ, ఈశ ఫౌండేషన్ వలంటీర్ పవన్, దివ్య, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
నష్టపరిహారం చెల్లించాలి
భువనగిరిటౌన్: బస్వాపురం రిజర్వాయర్ బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ భువనగిరి మండల, పట్టణ సమితిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదా శ్రీరాములు మాట్లాడుతూ.. బస్వాపురం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన బాధితులకు చాలా సంవత్సరాలుగా నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వాయర్ పనుల్లో నాణ్యత లేమి, ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి వాటిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, మండల కార్యదర్శి మరిపెళ్లి రాములు, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, మండల కార్యవర్గ సభ్యులు రాఘవులు, కౌన్సిల్ సభ్యులు అబ్బులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి
పోటీలకు ఎంపిక
ఆలేరురూరల్: రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఆలేరు ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రాజబోయిన మణి, శనిగరం పార్థసారఽథి ఉమ్మడి జిల్లా 68వ క్రీడల్లో ఎస్‌జీఎఫ్ హాకీ–14 విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పూల నాగయ్య తెలిపారు. ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు కరీంనగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులు నరేంద్రస్వామి, పోరెడ్డి రంగయ్య, రావుల సత్యనారాయణ, శ్రీధర్, మల్లేశం, సైదులు, రోహిణి, పరమేష్, శంకర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment