భువనగిరిటౌన్: చలికాలంలో జాగ్రత్తలతో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు చేపట్టిన ఆరోగ్య శాఖ అధికారుల హాస్టల్ బాటలో భాగంగా శని, ఆదివారం రెండు జిల్లాలోని 89 ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం భువనగిరిలోని ఆయా హాస్టళ్లను డీఎంహెచ్‌ఓ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యలు ఎదురైన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని, అశ్రద్ధ చేయొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment