మత్స్యకారులకు అండగా..
భువనగిరిటౌన్: మత్స్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకాన్ని తీసుకువచ్చింది. రైతులకు వ్యవసాయం కాకుండా అనేక ఉపాధి అవకాశాలను కల్పించి ఆదాయం ఉత్పాదకత పెంచడం మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం దీని ఉద్దేశం. పీఎంఎంఎస్‌వై పథకానికి జిల్లా వ్యాప్తంగా 9,856 యూనిట్లు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 187 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
ఎవరైనా ప్రయోజనం పొందవచ్చు..
మత్స్యరంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందవచ్చు. మత్స్యకారులు, మత్స్యకార్మికులు, చేపల విక్రయదారులు, మత్స్య అభివృద్ధి కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాలు, మత్స్యరంగం, మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు సద్వినియోగం చేసుకోవచ్చు. చేపల పెంపకానికి నాణ్యమైన విత్తనాల సేకరణ, మెరుగైన నీటి నిర్వహణ ఈ పథకం ద్వారా కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్‌తో సమీపంలోని సీఎస్‌సీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. https://dof.gov.in/ pmmsy వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అనంతరం మత్స్యశాఖ అధికారులు విచారణ చేసి పథకానికి అర్హులైతే ఎంపిక చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
సీఎస్‌సీ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. లబ్ధిదారులు ధ్రువపత్రాలు తీసుకువస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆధార్‌కార్డు తప్పనిసరిగా తప్పనిసరిగా ఫోన్‌నంబర్‌కు లింక్ అయి ఉండాలి. ఈ పథకాన్ని మత్స్య పరిశ్రామక రంగంలో ఉన్న వారు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి.
– బుగ్గ శ్రీధర్, సీఎస్‌సీ మేనేజర్
మత్స్య సంపద యోజన పథకం తీసుకువచ్చిన కేంద్రం
దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
ఈ యూనిట్లకు అవకాశం
ఈ పథకం కింద 8 రకాల యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. మంచినీటి హెచరీలు, చేపల పెంపకానికి పాండ్స్ నిర్మాణం, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్, జలాశయంలో చేపల పెంపకం, ఇన్సూలేటెడ్ వాహనాల సరఫరా, మూడు చక్రాల వాహనాల సరఫరా, చిన్న తరహా చేపల దాణా మిల్లుల ఏర్పాటు, మొబైల్ ఫిష్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment