వసతిలో వణుకు..
ఆలేరులోని ఎస్సీ హాస్టల్‌లో ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లను కప్పుకున్న పలువురు విద్యార్థులు
ఆలేరులోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో 33 మంది విద్యార్థులకు గాను 16 మంది మాత్రమే ఉన్నారు. మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుకు మూత లేదు. కొందరు విద్యార్థులకు దుప్పట్లు ఇచ్చారు. ఒక్కో దుప్పటిని ఇద్దరు విద్యార్థులు కప్పుకుంటున్నారు. కొందరి దుప్పట్లు చిరిగిపోయి ఉన్నాయి. గదుల్లో లైట్లు లేవు. మరుగుదొడ్లు, హాస్టల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నాయి. వార్డున్ అందుబాటులో ఉండడం లేదని తెలిసింది.
●
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గదులకు కిటికీలు, తలుపులు సరిగ్గా లేక, చలిని తట్టుకునే దుప్పట్లు ఇవ్వక, గ్రీజర్లు ఏర్పాటు చేయక చన్నీటి స్నానం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు నాణ్యత లేని భోజనం, బాత్రూంలు, టాయిలెట్ల నిర్వహణలేమితో అవస్థలు పడుతున్నట్లు సాక్షి విజిట్‌లో వెలుగుచూశాయి.
సాక్షి, యాదాద్రి : జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇలా అన్ని రకాల ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికాలం మొదలైనా చాలా చోట్ల విద్యార్థులకు దుప్పట్లు అందజేయలేదు. గత ఏడాది ఇచ్చినవాటితోనే సరిపెట్టుకున్నారు. కొందరు ఇంటినుంచి తెచ్చుకున్న దుప్పట్లను కప్పుకుంటున్నారు. ఒక్కో దుప్పటిని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు కప్పుకుంటున్నారు. అదే విధంగా పలు హాస్టళ్లలో నేటికీ గ్రీజర్లు ఏర్పాటు చేయలేదు. ఉన్న చోట పని చేయకపోవడంతో విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. మరమ్మతులు చేయించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. వీటితో పాటు మంచాలపై పూర్తి స్థాయిలో పరుపులు లేకపోవడంతో విద్యార్థులు దుప్పట్లు పరుచుకుని నిద్రిస్తున్నారు. నిధులలేమితో కొత్తవి కొనుగోలు చేయలేకపోతున్నారు.
అమలుకాని మోనూ..
వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావడం ఏదు. నాసిరకం సరుకులు, కూరగాయలను వండిపెడుతున్నారు. అరటిపండ్లు, స్నాక్స్, గుడ్డ క్రమంతప్పకుండా ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. దోమ తెరలు, స్వెట్టర్లు పంపిణీ చేయలేదు. విద్యార్థుల ఆరోగ్యంపైనా వార్డెన్లు అశ్రద్ధ చూపుతున్నారని, వైద్య పరీక్షలు చేయించడం లేదని తెలిసింది. ఇక చాలా చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూంలు, మరుగుదొడ్లు లేవు. ఉన్నవి కూడా తలుపులు సరిగా లేకపోవడం, నిర్వహణ లేమితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టళ్ల పరిసరాలు పిచ్చిమొక్కలు, కంపచెట్లతో నిండిపోయాయి. గదుల్లోకి కీటకాలు, పాములు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు.
హాస్టళ్లలో ఉండని వార్డెన్లు!
వార్డెన్లు తప్పనిసరిగా హాస్టళ్లలోనే ఉంటూ విద్యార్థుల యోగక్షేమాలు చూస్తుండాలి. భోజనంపై పర్యవేక్షణ ఉంచాలి. కానీ, ఏ ఒక్కరూ హాస్టళ్లలో ఉండకుండా సిబ్బందిపై వదిలేస్తున్నారు. విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినా అందుబాటులోకి రావడం లేదు. గత ఏడాది భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో కలుషిత నీటి కారణంగా ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలా పలు చోట్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా వార్డెన్లకు పట్టింపు ఉండడం లేదు.
హాస్టళ్లలో సౌకర్యాల కొరత.. చలికి విద్యార్థులు గజగజ
ఫ కొందరికే దుప్పట్లు.. అవి కూడా నాణ్యతలేనివి పంపిణీ
ఫ గ్రీజర్లు ఉన్నా నిరుపయోగం
ఫ గదులకు విరిగిపోయిన తలుపులు, కిటికీలు
ఫ అపరిశుభ్రంగా మరుగుదొడ్లు
ఫ హాస్టళ్ల పరిసరాలు అధ్వానం
ఫ భోజనమూ నాసిరకమే..
భువనగిరిలోని గిరిజన బాలుర వసతి
గృహంలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. మంచాలపై బెడ్లు లేకపోవడంతో విద్యార్థులు దుప్పట్లు పరుచుకుంటున్నారు. అంతేకాకుండా నాణ్యతలేని దుప్పట్లు పంపిణీ చేశారు. ఇవి చలిని తట్టుకోలేకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటి నుంచి బ్లాంకెట్స్, చద్దర్లు తెచ్చుకున్నారు. ఉదయం చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. వంటలు చేయడానికి ప్రత్యేకంగా కిచెన్ లేకపోవడంతో డైనింగ్ హాల్ వండుతున్నారు. దీంతో విద్యార్థులు కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంచార్జ్ వార్డెన్‌తో నెట్టుకొస్తున్నారు.
భువనగిరిలోని తారకరామానగర్ బీసీ హాస్టల్‌లో రికార్డుల పరంగా 75 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ, హాస్టల్‌లో 40 మందికి మించి ఉండడం లేదు. విద్యార్థులకు దుప్పట్లు మాత్రమే ఇచ్చారు. దోమ తెరలు, స్వెట్టర్లు ఇవ్వలేదు.
వసతిగృహాలు, విద్యార్థులు ఇలా..
శాఖ హాస్టళ్లు విద్యార్థుల
సంఖ్య
ఎస్సీ 21 1,600
ఎసీ ్సగురుకుల 08 4,960
బీసీ 19 1,100
ఎస్టీ 08 823 మైనార్టీ 03 840
Comments
Please login to add a commentAdd a comment