మోత్కూరు వాసికి డాక్టరేట్
మోత్కూరు : మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన జిలుకరస్వామి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి జంతుశాస్త్రం విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా పొందారు. ప్రొఫెసర్ సునితాదేవి పర్యవేక్షణలో కృష్ణబొచ్చె, చేపల పెరుగుదల, ఆహారమార్పిడి, జీవరసాయన మార్పులపై చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ వచ్చినట్లు స్వామి తెలిపారు. స్వామి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. డాక్టరేట్ పట్టా పొందడంతో తల్లిదండ్రులు ఈదమ్మ, వెంకటయ్య, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
స్వర్ణగిరి క్షేత్రంలో
కార్తీక వనభోజనాలు
భువనగిరి : కార్తీకమాసం సందర్భంగా సోమవారం భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వస్వామి దేవాలయంలో వనభోజ నాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ వ్యవస్థపాక చైర్మన్ మానేపల్లి రామారావు కార్తీక వనభోజనాలను ప్రారంభించారు. సుమారు 3 వేల మంది వనభోజనాల్లో అందజేశారు. అదే విధంగా ఆలయంలో సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్యకల్యాణం తదితర పూజలు చేపట్టారు.
వ్యాక్సినేషన్‌పై అవగాహన
రాజాపేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా ఇమ్యూనైజేషన్ (డీఐఓ)అధికారి డాక్టర్ రామకృష్ణ సందర్శించారు. వైద్యసిబ్బందితో సమావేశమై గ్రామ, మండలస్థాయిలో వ్యాక్సినేషన్ అమలు, ఆస్పత్రిలో కేసుల నివేదికలు, వ్యాధుల నియంత్రణ, నివారణ తదితర అంశాలపై సమీక్షించారు. ఆరోగ్య సిబ్బందికి ఇమ్యూనైజేష న్‌పై అవాహన కల్పించారు. సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్ భరత్ పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ : క్రిస్మస్– 2024 వేడుకల్లో పురస్కారాలు పొందడానికి అరులైన క్రైస్తవులనుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు నల్లగొండ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, విశిష్ట వైద్య సేవలు, విద్యాబోధన, రచనారంగం, ఫైన్ ఆర్ట్స్ థియేటర్, క్రీడారంగంలో పదేళ్ల పైబడి సేవలు అందించిన క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను డిసెంబరు 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నల్లగొండలోని జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని, వివరాలకు 94407 27085 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
శివకేశవులకు సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : శివకేశవులకు నిలయమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నిత్య పూజలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో పాటు కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చన చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీపత్రాలతో అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, జోడు సేవత్సం తదితర పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment