సమస్యలు ఆలకించి.. భరోసా ఇచ్చి
ఫ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్
ఫ న్యాయం చేస్తానని బాధితులకు హామీ
ఫ వివిధ సమస్యలపై 30 అర్జీలు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 30 మందికి పైగా బాధితులు వచ్చారు. కలెక్టర్ హనుమంతరావు వారినుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు ఆలకించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 30 అర్జీలు రాగా వాటిని పరిశీలించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు రెఫర్ చేశారు. వినతుల్లో సగానికి పైగా రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, జిల్లా అధికారులు ప్రజావాణిలో పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
● ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, మీరైనా సమస్య పరిష్కరించాలంటూ రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య కలెక్టర్‌ను వేడుకున్నారు.
● చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం కోఆపరేటివ్ టెనెంట్ ఫార్మింగ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని సొసైటీ ప్రతినిధులు విన్నవించారు. సొసైటీకి 2023 నవంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా జాప్యం చేస్తున్నారని, కమిటీ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment