భువనగిరి : జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 నుంచి 5గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో ఏఈ సాయికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిల్ప హోటల్ నుంచి గాంధీ పార్కు వరకు 33 కేవీ లైన్ టవర్లకు లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా తాతానగర్, శిల్వ హోటల్ వెనుక వైపు, ఎల్ఐసీ కార్యాలయం, పట్టణ పోలీస్స్టేషన్, జిల్లా కోర్టు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్వీ కాంప్లెక్స్, చర్చి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment