డేటా ఎంట్రీలో తప్పులకు తావుండవద్దు
భువనగిరి రూరల్ : సమగ్ర కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీలో తప్పులకు తావులేకుండా నమోదు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న డేటా ఎంట్రీని సోమవారం ఆయన పరిశీలించి ఆపరేటర్లకు సూచనలు చేశారు. ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఎన్యుమరేటర్లు తప్పనిసరిగా దగ్గర ఉండాలన్నారు. నమోదు చేసే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలని పేర్కొన్నారు. సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ దినకర్ ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment