ఆన్‌లైన్ నమోదు పక్కాగా ఉండాలి
భువనగిరిటౌన్ : సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదు పక్కాగా ఉండాలని, పొరపాట్లకు ఆస్కారం ఉండవద్దని డేటీ ఎంట్రీ రాష్ట్ర పరిశీలకుడు రవిచంద్ర ఆపరేటర్లకు సూచించారు. భువనగిరి ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, సిద్ధార్థ ఐటీఐ, బీబీనగర్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌లో కొనసాగుతున్న డేటా ఎంట్రీని సోమవారం అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఆన్‌లైన్ నమోదులో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం మరోసారి వివరాలను క్రాస్ చేసుకోవాలన్నారు. తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్లు దగ్గర ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, శ్యామూల్, ఇతర అధికారులు ఉన్నారు.
ఫ సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పరిశీలకుడు రవిచంద్ర
Comments
Please login to add a commentAdd a comment