మీరైనా మా సమస్య తీర్చండి
నక్సలైట్‌గా ఉన్న నా భర్త కట్టెల రామకృష్ణ 2004లో ప్రభుత్వానికి లొంగిపోయాడు. పునరావాసం కింద మా కుటుంబానికి 300 గజాల ఇంటి జాగా, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కానీ, 20 ఏళ్లు గడిచినా ఉత్తర్వులు అమలు చేయలేదు. నా భర్త అధికారుల చుట్టూ తిరిగాడు. 2017లో కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో వినతిపత్రం అందజేసినా ఫలితం లేకపోయింది. 2019లో నా భర్త రామకృష్ణ గుండెపోటుతో మృతిచెందాడు. అప్పటినుంచి నేను మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురయ్యా. నాకు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. పైగా మాది కులంతార వివాహం. నా అమ్మగారు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటారు. ప్రస్తుతం కూలి పనులకు వెళ్తూ, పిల్లలను పోషించుకుంటూ సర్వేల్‌లో గ్రామంలో ఉంటున్నాం. పునరావాసం కింద ప్రకటించిన సహాయాన్ని వర్తింపజేయాలని సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ భార్య పద్మ ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌ను వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment