ఘనంగా సీపీఐ వందేళ్ల పండుగ
యాదగిరిగుట్ట : సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజానాట్యమండలి కళాకారులు, అనుబంధ సంఘాల నాయకులు పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యపై పోరాటాలు చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా 10లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిందని గుర్తు చేశారు. నేడు పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నామని, యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, జిల్లా సమితి సభ్యులు బబ్బూరి ఽశ్రీధర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, సహయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన బంగారు, గోపగాని రాజు, బండపల్లి నర్సయ్య, రాయగిరి బాలకిషన్, ఆరె పుష్ప, మూనుకుంట్ల నర్సమ్మ, మాటూరి మల్లయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షురాలు ఇంజ హేమలత, ఆరెకంటి సాయి, భగత్, జగన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment