పాఠశాలల్లో తనిఖీలు
బీబీనగర్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను డీఈఓ సత్యనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. బోధనా తీరు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదవ తరగతిలో ఉత్తమ పలితాల సాధనకు రూపొందించిన కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలను పరిశీలించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈఓ సురేష్‌రెడ్డి, జిల్లా ప్రణాళికా విభాగం కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగారు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
కేంద్రం పరిశీలన
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రం ఉండాలని, సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
పైరవీలకు రావొద్దు
ఆలేరు రూరల్ : సర్పంచ్ టికెట్ల కోసం పైరవీల కు రావద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించారు. శుక్రవారం ఆలేరులోని వైఎస్సార్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా శ్రేణులు పనిచేయాలన్నారు. మనస్పర్థలు, విభేదాలను వీడి సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చైతన్య, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, ఎంఏ ఎజాజ్, అశోక్, వెంకటేశ్వర్లు, తుంగకుమార్, సాగర్‌రెడ్డి, ఆరె ప్రశాంత్, బుగ్గ నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ మందిర్‌లలో హెల్త్ మేళా
భువనగిరి : జిల్లాలోని 21 పీహెచ్‌సీలు, 99 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో శుక్రవారం హెల్త్ మేళా నిర్వహించారు. ఈఎన్‌టీ, అప్తామాలజీ, కంటి, దంత, టీబీ, క్యాన్సర్ తదితర 12 రకాల పరీక్షలు చేశారు. అలాగే ఆయుష్మాన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేశారు. భువనగిరి మండలం అనంతారం సబ్‌సెంటర్‌లో హెల్త్ మేళాకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శిల్పిని హాజరయ్యారు. హెల్త్ క్యాంపులను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాఠశాలల్లో తనిఖీలు
పాఠశాలల్లో తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment