స్థానికం.. మరింత జాప్యం!
తుది దశకు ఏర్పాట్లు
మార్చి రెండో వారం నాటికి ప్రాదేశిక, సర్పంచ్ ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్లుగానే యంత్రాంగం సైతం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. ఇప్పటికే ఓటర్లు తుది జాబితాను ప్రదర్శించింది. అలాగే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరాయి. రెండు రోజుల క్రితం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. కలెక్టర్, అధికారులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలి ఉంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల బరిలో నిలువాలన్న ఆశావహుల్లోనూ నిరాశ నెలకొంది.
సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతుండగా.. మరోవైపు కులగణన రీసర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అయోమయం నెలకొంది. ఈనెల 15లోపు పరిషత్, ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కులగణలో పాల్గొనని వారికోసం ఈనెల 16నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆతరువాత బిసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వ ప్రకటన, అసెంబ్లీలో బిల్లు పెట్టడం, గవర్నర్ ఆమోదం ఇవన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మార్చిలో పరీక్షలు, ఏప్రిల్, మేలో ఎండలు
మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలు ముగియగానే ప్రైమరీ, సెకండరీ స్కూల్ పిల్లలకు పరీక్షలు మొదలవుతాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. ఈనెల కులగణన రీసర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ తరువాత అసెంబ్లీలో, గవర్న్‌చేత బిల్లు ఆమోదింపజేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.
ఫ 16 నుంచి కులగణన రీసర్వే
ఫ బీసీ బిల్లు ఆమోదం కోసం మరికొంత సమయం
ఫ ఆ తరువాతనే ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ
ఫ నిరాశలో ఆశావహులు
Comments
Please login to add a commentAdd a comment