డీసీసీబీ, పీఏసీఎస్‌ల పదవీకాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కిందట (2020 ఫిబ్రవరి 15వ తేదీన) సహకార సంఘాల ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. పాలక వర్గాల గడువు శుక్రవారం నాటితో (ఈనెల 15వ తేదీతో) ముగియడంతో ప్రభుత్వం పాలకవర్గాల గడువును మరో ఆరు నెలలు పెంచింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు గురువారం జీవో 74 జారీ చేశారు.
గత ఏడాది చైర్మన్‌గా ఎన్నిక
ఉమ్మడి జిల్లాలో 107 పీఏసీఎస్‌లు ఉన్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గం 2020 ఫిబ్రవరి 29న ఎన్నికై ంది. బీఆర్‌ఎస్‌కు చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనపై 2024 జూన్ 28న అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి గత ఏడాది జూలై 1వ తేదీన చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం సహకార సంఘాల గడువును పెంచడంతో డీసీసీబీ చైర్మన్‌గా కుంభం శ్రీనివాస్‌రెడ్డి మరో ఆరు నెలలుపాటు కొనసాగనున్నారు. అలాగే జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు.
ఫ ఆరు నెలల పాటు కొనసాగనున్న ప్రస్తుత పాలకవర్గాలు
ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జిల్లా పీఏసీఎస్‌లు
నల్లగొండ 42
సూర్యాపేట 44
యాదాద్రి 21
మొత్తం 107
రైతులకు సేవలందించేందుకు మరో అవకాశం
రైతులకు మరో ఆరు నెలలు సేవలు అందించే అవకాశం లభించింది. పదవీ కాలం పొడగించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు. ఈ అవకాశంతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా.
– కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment