ఎంజీయూలో సమూల మార్పులు
యూనివర్సిటీలో సమయ పాలన కఠినంగా అమలు చేస్తున్నాం. విద్యార్థులు, అధ్యాపకుల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా ఉండాల్సిందే. విద్యార్థుల హాజరు శాతం కూడా 75 శాతం ఉండాలి. ఏదైనా కారణం చేత తరగతులకు హాజరు కాకపోతే కనీసం 65 శాతం ఉండాల్సిందే. మరో 10 శాతానికి డాక్టర్ సర్టిఫికెట్ కూడా తేవాల్సి ఉంటుంది. కొందరు కాలేజీకి డుమ్మా కొట్టడంతో 25 శాతం కూడా లేదు. అటువంటి వారు 63 మంది డిటెన్షన్ అయ్యారు. కచ్చితంగా హాజరు శాతాన్ని, కాలేజీ పనివేళలు అమలు చేస్తుండడంతో మెరుగైన ఉత్తీర్ణత రానుంది.
కొత్త కోర్సులకు నిర్ణయం
యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు ప్రవేశ పెడుతున్నాం. కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ భవనం నిర్మించనున్నాం. కొత్తగా 56 ప్రోగ్రామ్ కోర్సులను తీసుకువచ్చేందుకు ఇప్పటికే డిజైన్ చేశాం. ప్రతి డిపార్‌మెంట్‌లో రెండు కోర్సులకు తగ్గకుండా కొత్త కోర్సులు తీసుకొస్తాం. లైబ్రరీని వారంలో రెండు రోజులు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నడిపించనున్నాం. అక్కడ విద్యార్థులకు క్రెడిట్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఇంటర్న్‌షిప్ కోసం ఒక డైరెక్టర్‌ను కూడా నియమించాం. కంపెనీలతో మాట్లాడి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
పని వేళలు సీరియస్‌గా
అమలు చేస్తున్నాం
విద్యార్థులకు 75 శాతం
హాజరు ఉండాల్సిందే
మెస్ బిల్లు రూ.2200లకు తగ్గించాం
రూ.322 కోట్లతో కొత్త భవనాల నిర్మాణాలకు డీపీఆర్ రూపొందించాం
‘సాక్షి’తో ఎంజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
Comments
Please login to add a commentAdd a comment