15 నుంచి స్కీం వర్కర్లకు రాష్ట్ర స్థాయి శిక్షణ
ప్రొద్దుటూరు : ఈ నెల 15, 16వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం పథకంతోపాటు ఇతర స్కీం వర్కర్లకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు స్కీం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు జె.లలితమ్మ తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం ఆమె మాట్లాడుతూ ప్రొద్దుటూరులో జరిగే శిక్షణ తరగతులకు మహిళా నేతలు హాజరవుతారన్నారు. గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు అందడంలేదని, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు మంజుల, విజయ, సుజాత, చంద్రిక, పద్మావతి, గౌసియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment