సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప సెవెన్‌రోడ్స్: అర్జీదారులు విన్నవించే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన పరిష్కారాన్ని వేగవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, నేషనల్ హైవేస్ ఎస్డీసీ వెంకటపతి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మిలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు.. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు.
డయల్ యువర్ కలెక్టర్
అంతకుముందు డీఆర్వో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో నలుగురు తమ సమస్యలను ఆయనకు వివరించారు.
డీఆర్వో గంగాధర్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment