వైవీయూ రిజిస్ట్రార్ రాజీనామా ఆమోదం
వెవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి రిజిస్ట్రార్ తప్పెట రామప్రసాద్ రెడ్డి రాజీనామాకు వర్సిటీ వీసీ కె. కృష్ణారెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. అక్టోబర్ 1న ఆచార్య టి.రామప్రసాద్‌రెడ్డిని రిజిస్ట్రార్‌గా నియమించగా, 3న ఆయన బాధ్యతలు స్వీకరించారు. లైంగిక ఆరోపణలున్న ఆయన నియామకంపై దుమారం రేగడంతో ఆయన బాధ్యతలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం ఒక్కరోజు వ్యవధిలోనే 5న అనారోగ్య కారణాలతతో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ రాజీనామాను వీసీకి పంపారు. దసరా సెలవులు అనంతరం సోమ వారం వర్సిటీ ప్రారంభం కావడంతో ఆయన రాజీనామాను వీసీ ఆమోదించారు. కాగా, రిజిస్ట్రార్ పదవికి పలువురు ఆచార్యులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment