క్రికెట్ టోర్నీలో బ్యాట్స్‌మన్ జోరు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల అండర్–14 క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్ సత్తా చాటారు. వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో గుంటూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 89.3 ఓవర్లలో గుంటూరు జట్టు 276 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని డింకూ రామ్‌చరణ్ 126 పరుగులతో రాణించాడు. అభినవ్ డేవిడ్ 48 పరుగులు చేశాడు. అనంత బౌలర్ రోహిత్ 4 వికెట్లు తీశాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.
చెలరేగిన సిక్కోలు జట్టు..
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో శ్రీకాకుళం, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీకాకుళం జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసింది. జట్టులోని ఎస్.వి.ఎస్. వివేకానంద 151 బంతుల్లో 27 ఫోర్లు, 1 సిక్సర్‌తో 178 పరుగులు చేశాడు. ఈయనకు జతగా నేత్రా కిరణ్ 75 పరుగులతో రాణించాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.
కేఓఆర్‌ఎం మైదానంలో..
కేఓఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో విజయనగరం, కృష్ణా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కృష్ణా జట్టు 78.3 ఓవర్లలో 286 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని భానుచంద్ యాదవ్ 75 పరుగులు, తమన్‌సాయి 60 పరుగులు చేశారు. విజయనగరం బౌలర్లు మణిధర్మతేజ 2, జహీరుద్దీన్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయనగరం జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment