భార్యను వదలి వెళ్తూ.. యువకుడు దుర్మరణం
బి.కొత్తకోట: భార్యను పుట్టింటిలో వదిలిన భర్త తిరిగి ఇంటికి వెళ్తూ ప్రమాదానికి గురైన సంఘటన ఆదివారం రాత్రి బి.కొత్తకోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..మండలంలోని నాయనబావి పంచాయతీ ఆకులవారిపల్లెకు చెందిన ఆర్.అజయ్ (24)కు సత్యసాయి జిల్లా బాలసంద్రానికి చెందిన శ్రావణితో రెండేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం బైక్‌లో బాలసంద్రానికి వెళ్లి భార్య శ్రావణిని పుట్టింటిలో వదిలిపెట్టాడు. తిరిగి స్వగ్రామం ఆకులవారిపల్లెకు వెళ్లేందుకు బి.కొత్తకోట మీదుగా వస్తుండగా.. కస్తూర్భా బాలికల విద్యాలయం సమీపంలోని మర్రిమాను వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. అజయ్‌కు తీవ్ర గాయాలవడంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడు అంగళ్లులోని ఓ ప్రైవేట్ కళాశాలలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అజయ్ మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న కుటుంబీకులు గుండెలవిసెలా విలపిస్తుండటం స్థానికులను కలచివేసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మదనపల్లెకు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్మశాన వాటిక ప్రహరీ కూల్చివేత
పుల్లంపేట : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. పుల్లంపేట మండల వ్యాప్తంగా యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. శ్మశాన వాటిక పక్కనే తమ భూమి ఉండటంతో కొందరు నాయకులు అడ్డదారిలో నకిలీ పత్రాలు సృష్టించారు. శ్మశాన వాటికనే కబ్జా చేసేందుకు ప్రహరీ గోడను రాత్రికి రాత్రి జేసీబీతో శనివారం కూల్చి వేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్దా బాబుల్ రెడ్డి సహకారంతో రూ.5 లక్షల నిధులు వెచ్చించి ఈ ప్రహరీ నిర్మించారు. సంఘటనా స్థలాన్ని సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి, తహసీల్దారు అరవింద కిషోర్, పుల్లంపేట ఎస్‌ఐ మోహన్ కుమార్ గౌడ్ పరిశీలించారు.
విలపిస్తున్న కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment