గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి వద్ద పెన్నా నది నీటిలో శుక్రవారం గల్లంతైన యువకుడి ఆచూకీ ఆదివారం లభ్యమైనట్లు వల్లూరు ఏఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగిరికి వచ్చిన పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రెడ్డిపల్లె గణేష్(27) నీటిలో మునుగుతున్న ఒక బాలుడిని రక్షించబోయి గల్లంతైన విషయం విదితమే. పోలీసులు, బంధువులు శనివారం ఉదయం నుంచి ట్యూబుల సహాయంతో జాలర్లు, రబ్బర్ బోట్ సహాయంతో రెస్క్యూ టీమ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సిద్దవటం మండలం లింగంపల్లె సమీపంలోని నదిలో మృతదేహం వుండడాన్ని స్థానికులు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆ గ్రామ వీఆర్ఏ గణేష్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు విషయాన్ని తెలపగా వల్లూరు ఏఎస్ఐ ప్రసాద్ లింగంపల్లె వద్దకు వెళ్లి గణేష్ తండ్రితో బాటు బంధువుల మృతదేహం గణేష్దిగా గుర్తించారు. దీంతో మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment