ఎయిమ్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
పులివెందుల టౌన్ : తమ కుమార్తె ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే తల్లిదండ్రుల కల.. అది తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరినపుడే సాధ్యమవుతుంది. ఇది గట్టిగా నమ్మిన సాయిరెడ్డి రాఘవి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రేయింబవళ్లు కష్టపడి చదివి ఎయిమ్స్ ఫరీక్షలు రాసి జాతీయ స్థాయిలో 220వ ర్యాంకు సాధించి వావ్ అనిపించింది. పులివెందుల పట్టణంలోని లక్ష్మీ హాల్ సమీపంలో నివాసముంటున్న గవిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సుగుణమ్మల దంపతులకు సాయి రాఘవి, సాయి శివాణీ కుమార్తెలు. తొలి సంతానమైన సాయి రాఘవి చదువులో రాణిస్తుండడంతో ఎలాగైనా ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు తపించారు. కిరాణాకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ చంద్రశేఖర్‌రెడ్డి వారిని ఉన్నతంగా చదివించాలని కష్టపడ్డారు. తల్లిదండ్రుల కష్టం చూసిన సాయిరాఘవి తన మెదడుకు పదును పెట్టింది. రేయింబవళ్లు చదువుతూ ఎయిమ్స్ పరీక్షలకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో చదువుతూ ఎయిమ్స్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 220వ ర్యాంకు సాధించి వావ్ అనిపించింది. బాగా చదివి పేదలకు వైద్య సేవలందిస్తానని సాయిరాఘవి పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకు రావడంతో తల్లిదండ్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడప విద్యార్థికి 102వ ర్యాంకు
కడప ఎడ్యుకేషన్: ఆల్ ఇండియా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు(ఎయిమ్స్) జాతీయ స్థాయి పీజీ అర్హత పరీక్షలో కడప విద్యార్థి ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు కై వసం చేసుకున్నారు. కడప పరిధిలోని ఎర్రముక్కపల్లెలో నివాసముంటున్న డైట్ ప్రిన్సిపల్ కె.రాజేంద్ర ప్రసాద్, ఆట్లూరు జెడ్పీ హైస్కూల్‌లో పాధ్యాయులురాలిగా పనిచేస్తున్న వరలక్ష్మి దంపతుల కుమారుడు కె.మోహిత్ మెడికల్ పీజీ ఎంట్రెన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment