గుర్రంకొండ ఏఎస్‌ఐపై కేసు నమోదు
మదనపల్లె : గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న మోజెస్(56)పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. ఏఎస్‌ఐ మోజెస్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆయన భార్య ఎస్తర్‌రాణి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువతి అదృశ్యంపై..
మదనపల్లె : యువతి అదృశ్యంపై కేసు నమోదుచేసినట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. ఇందిరానగర్‌కు చెందిన ఓ యువతి(23) జ్వరంగా ఉందంటూ తల్లిని వెంట పెట్టుకుని శనివారం సాయంత్రం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ తనకు నీళ్లు దప్పికగా ఉందని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. యువతి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం రాత్రి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వరకట్న వేధింపులపై..
మదనపల్లె : వరకట్న వేధింపులపై తాలూకా పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. మండలంలోని కొండామారిపల్లె పంచాయతీ సత్యసాయి కాలనీకి చెందిన కే.మహేశ్వరి(23), అదే కాలనీకి చెందిన మారెప్ప కుమారుడు పి.నరసింహులును ప్రేమించి 2019లో వివాహం చేసుకుంది. మూడేళ్ల తర్వాత నరసింహులు తన భార్య మహేశ్వరిని వేధించడం, దురలవాట్లకు లోను కావడంతో ఆమె భరించలేక ఆదివారం తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. ఆ మేరకు భర్త నరసింహులు, అత్త అంజమ్మపై కేసు నమోదుచేశారు.
రవీంద్రనగర్‌లో..
మండలంలోని ఎగువకురవంక రవీంద్రనగర్‌కు చెందిన షేక్‌జాఫర్‌వలీ కుమార్తె షేక్ కామ్యభాను(26) అదే కాలనీలో ఉండే షామీర్ కుమారుడు షఫీతో 2021లో వివాహమైంది. వీరికి 18 నెలల పాప ఉంది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి షామీర్, ఆయన కుటుంబ సభ్యులు కామ్యభానును వేధిస్తుండడంతో ఆమె ఆదివారం తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. భర్త షామీర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఉన్నంతలో తృప్తిపడేవారే
నిజమైన ఐశ్వర్యవంతులు
కురబలకోట : దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు ఆనందాన్ని ఉంటారని, ఉన్నంతలో తృప్తి పడేవారే నిజమైన ఐశ్వర్యవంతులని అంతర్జాతీయ సువార్త పరిచారకులు స్టీఫెన్ చిన్నప్ప పేర్కొన్నారు. మండలంలోని అంగళ్లు సీయో ను ప్రార్థనా మందిరంలో జరిగిన ఆరాధన, బల్ల వర్తమానం కార్యక్రమంలో ఆయన వాక్యోపదేశం చేశారు. క్రైస్తవులు శాంతియుత జీవనం అవలంభించాలని, ప్రతి ఒక్కరూ వా క్యాన్ని ధ్యానించడంతోపాటు అనుసరించాలన్నారు. ప్రతీకారం మనిషిని బంధిస్తే క్షమాప ణ విడుదల ఇస్తుందన్నారు. దేవుని కన్నా మరీ ఎక్కువుగా దేనిని ప్రేమించినా.. అది పాపంగానే పరిగణించవచ్చన్నారు. పరోపకారం మరువరాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పాస్టర్ విక్టర్ వేదనాయక్, నాతానురెడ్డి, శామ్యుయేల్, జయరాజ్‌రెడ్డి, భాస్కర్, తియోతి, నెహెమ్యా, జాన్, డోర్కా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment