brexit
-
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రెగ్జిట్తో మారేవేంటంటే...
లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే.. 1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్‌టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. 2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు. 3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి. 4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి. 5. తమ వాహన లైసెన్స్‌తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి. 6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి. 7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు. ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు. -
దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..
బెంగళూరు: యూరోపియన్ యూనియన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బ్రిటన్‌లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్ దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో భారత్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
ఈయూ, బ్రిటన్లతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలు!
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ తదనంతర వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, భారత్ కూడా ఆ రెండు ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్నది ఇప్పుడే పూర్తి స్థాయిలో మదింపుచేయడం కష్టమని విశ్లేషిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), నిర్మాణం, పరిశోధనా–అభివృద్ధి, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి సేవల విషయంలో ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉంటుందని వారి విశ్లేషిస్తున్నారు. ఈయూ–బ్రిటన్ ఒప్పందం సేవల రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ అంచనాకు ప్రధాన కారణం. జనవరి 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ పూర్తిగా వైదొలగనుంది (బ్రెగ్జిట్). ఈ పరిస్థితుల్లో రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంపై అవరోధాలను తొలగించుకోవడానికి గురువారం జరిగిన చర్చలు కొంతవరకూ సఫలీకృతం అయ్యాయి. సేవల రంగానికి ప్రయోజనం... భారత్ వస్తువులకు ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటు బ్రిటన్ ఇటు ఈయూ మార్కెట్లలో సేవల రంగానికి సంబంధించి మనం చక్కటి అవకాశాలను సొంతం చేసు కోవచ్చు. దీనికి తగిన వ్యూహముండాలి. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డీజీ కేంద్రానికి సిఫారసు చేశాం... యూరోపియన్ యూనియన్, బ్రిటన్లతో ఎఫ్టీఏలకు ఇప్పటికే ప్రారంభమైన చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. వచ్చే నెల్లో భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తున్న సందర్భంగా దీనిపై చర్చలు జరగాలని ప్రభుత్వాన్ని కోరాం. – శరద్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ బ్రిటన్‌తో వాణిజ్య అవకాశాలు... ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలను ముందుకు తీసుకుని వెళ్లడానికి భారత్‌కు ఎన్నో క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని భావించవచ్చు. – బిశ్వజిత్ ధర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
మార్కెట్ మూడోరోజూ ముందుకే..!
ముంబై: క్రిస్మస్కు ముందురోజు స్టాక్ మార్కెట్‌కు భారీగా లాభాలొచ్చాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. బ్రెగ్జిట్ ఒప్పందం సఫలీకృతమవచ్చనే ఆశలతో అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 46,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 13,749 వద్ద నిలిచింది. మూడురోజుల వరుస ర్యాలీతో సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో కోల్పోయిన భారీ నష్టాలన్నీ రికవరీ అయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ఈ వారం ఆరంభం నుంచి పరుగులు పెట్టిన ఐటీ షేర్ల జోరుకు బ్రేక్ పడింది. రూపాయి బలపడటం ఇందుకు కారణమైంది. అలాగే మీడియా, రియల్టీ రంగాల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ వారంలో జరిగిన నాలుగురోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్లను నష్టపోయింది. సెంటిమెంట్ బలంగానే... డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు తేది దగ్గర పడుతున్న తరుణంలో సూచీలు స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, అయితే ఓవరాల్‌గా మార్కెట్ సెంటిమెంట్ బలంగానే ఉందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐపీఓకు అనుపమ్ రసాయన్ స్పెషాలిటీ కెమికల్ రంగంలో సేవలు అందించే అనుపమ్ రసాయన్ ఐపీఓకు సిద్ధమైంది. ఐష్యూ ద్వారా కంపెనీ రూ.760 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఇందు కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. సమీకరించిన నిధుల్లో అధిక భాగం అప్పులను తీర్చేందుకు వినియోగిస్తామని పేర్కొంది. ఐపీఓ భాగంగా కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా షేర్లను కేటాయించనుంది. -
తప్పుడు ప్రచారం తడాఖా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కూ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కూ రూపురేఖల్లోనే కాదు... అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్ నిరూపించారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపో వాలా వద్దా అన్న అంశంపై నాలుగేళ్లనాడు జరిగిన రెఫరెండంను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ వెలువరించిన నివేదిక గమనిస్తే జాన్సన్ ప్రభుత్వ సహాయ నిరాకరణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాస్తవానికి ఈ నివేదిక తయారై తొమ్మిది నెలలు దాటింది. గత ఏడాది అక్టోబర్‌లో దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కానీ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇందులోని అంశాలు తెలిస్తే జనంలో ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయని, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో జనం తమను తిరస్కరించే అవకాశం వున్నదని కన్సర్వేటివ్ పార్టీ భయపడింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మొరాయిస్తూనే వుంది. కానీ ఈ విషయంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో గత్యంతరం లేక నివేదికను బయట పెట్టింది. అయితే ఇది రష్యా ప్రమేయం వుండొచ్చునని మాత్రమే తేల్చింది. లోతుగా దర్యాప్తు జరి పించి నేర నిర్ధారణ చేయాల్సింది మాత్రం జాన్సన్ ప్రభుత్వమే. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు శక్తిమంతమైనవి. ప్రపంచ రాజకీయా లను అవి దశాబ్దాలపాటు శాసించాయి. ఎన్నో దేశాల్లో వాటి మాటే చెల్లుబాటయింది. ఇప్పటికీ అవుతోంది. తాము చెప్పినట్టు వినడానికి సిద్ధపడని నేతల్ని అధికారం నుంచి కూలదోసిన చరిత్ర కూడా ఆ దేశాలకుంది. అలాంటి దేశాల అంతర్గత రాజకీయాల్లో రష్యా గుట్టు చప్పుడు కాకుండా జోక్యం చేసుకుని, తనకు అనుకూలంగా వుండే నేతల్ని అధికార పీఠాలపై కూర్చోబెట్టిందంటే వినడానికి ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఇది వాస్తవమని నిరుడు అమెరికాలో రాబర్ట్ మ్యూలర్ నివేదిక చెప్పింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చెబుతోంది. ఇంతకూ రష్యా తన కార్య సాధన కోసం ఏం చేస్తుంది? కోట్లాదిమంది ఓటర్లను మాయా జాలంలో ముంచెత్తే మంత్రదండం ఏమైనా పుతిన్ దగ్గర వుందా? బయటి దేశాలవారెవరో చేసిన ప్రచారానికి అమెరికా, బ్రిటన్ ప్రజలు బోల్తా పడ్డారా? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా ఖచ్చితమైన జవాబుల్లేవు. కానీ నిరుడు ఏప్రిల్‌లో అమెరికాలో వెల్లడైన రాబర్ట్ మ్యూలర్ నివేదిక 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం వున్నదని నిర్ధారించింది. ఇందులో నేరుగా ట్రంప్ బాధ్యత ఎంత అన్న అంశంపై ఆ నివేదిక ఏం చెప్పిందో ఇంతవరకూ తెలియదు. ఏ నివేదికనైనా ఎంతవరకూ బయటపెట్టాలో నిర్ణయించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్‌కు వుంటుంది. ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు. నివేదిక తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ట్రంప్ చేసుకున్న ప్రచారాన్ని మాత్రం స్వయానా మ్యూలరే ఖండించారు. రష్యా తీరుపై గత అయిదారేళ్లుగా కథలు కథలుగా మీడియాలో వెల్లడవుతూనే వున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం దండిగా వున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాల నిండా ఆమెకు వ్యతిరేకంగా భారీయెత్తున అబద్ధాలు ప్రచారమయ్యాయి. అవి ఏ స్థాయిలో వున్నాయంటే వాటిని ఖండించడానికి హిల్లరీ టీమ్‌కు బోలెడంత సమయం పట్టింది. వాటికి జవాబిచ్చేలోగా మరిన్ని ప్రచారంలోకొచ్చేవి. బ్రిటన్‌లోనూ స్కాట్లాండ్ రెఫరెండం సమయంలో, బ్రెగ్జిట్ ఓటింగ్ సమయంలో మార్ఫింగ్ ఫొటోలనూ, తప్పుడు కథనాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలో ట్రంప్ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ఇతరులు రష్యా ప్రచారానికి అండదండగా నిలిచారు. వీరు కేంబ్రిడ్జి ఎనలిటికా ఆసరా తీసుకోవడంతోపాటు ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వగైరా సామాజిక మాధ్యమాల్లో దొంగ పేర్లతో అకౌంట్లు తెరిచి నకిలీ సమాచారాన్ని, తప్పుడు వార్తల్ని వ్యాప్తిలోకి తెచ్చారని మ్యూలర్ నివేదిక తేల్చింది. తమ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలనూ ప్రస్తావించింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చూసినా ఇలాంటి అంశాల ప్రస్తావనే వుంది. బ్రిటన్‌లో న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఎస్టేట్ ఏజెంట్లు తెలిసో తెలియకో రష్యా ప్రచారంలో వాహకులుగా మారారని, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని కొందరు ఎంపీలు సైతం రష్యాలో తమ కున్న వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇందులో తలదూర్చారని ఆ నివేదిక అంటోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ సభ్యులతో పోలిస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులకు అదనపు హక్కులుంటాయి. ఈ పారదర్శకత లేమినే రష్యా ఉపయోగించుకుంటున్నదని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నివేదిక వెల్లడయ్యాక ఎప్పటిలాగే బ్రిటన్ ప్రభుత్వం రష్యా ప్రమేయాన్ని తోసిపుచ్చింది. 2019 ఎన్నికల్లో వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా అదేమీ ఫలించలేదన్నది ప్రభుత్వ వాదన. కమిటీ కోరుతున్నట్టు దర్యాప్తు అవసరం లేదన్నదే దాని భావన. కానీ ఇదంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదు. 2014లో స్కాట్లాండ్ రెఫరెండం జరిగినప్పుడు ట్విటర్లోని 4,000కుపైగా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగింది. అందులో 3,841 ఖాతాలు రష్యాకు, 770 ఖాతాలు ఇరాన్‌కి చెందినవని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ 2018లోనే వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా ఒక రోజంతా కోటి ట్వీట్లు విడుదలయ్యాయని కూడా అది లెక్కేసింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు కూడా నిస్సహాయంగా వుండటం, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బ్రిటన్ లేదా అమెరికా సమస్య మాత్రమే కాదు... రష్యాను ఆద ర్శంగా తీసుకుని తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూసేవారు అన్ని దేశాల్లోనూ బయల్దేరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతోపాటు, ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
బ్రిటన్ కొత్త వీసాకు తుదిమెరుగులు
లండన్: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్ బ్రెగ్జిట్ పాయింట్స్ బేస్డ్ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ఈయూకు టాటా..
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయం వద్ద బ్రిటన్ జెండాను తీసేస్తున్న అధికారులు ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ‘ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చింది. భారత్ సహా 13 దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం’అనిఅన్నారు. దేశ చరిత్రలో ఇది గొప్ప ఘటన అని బ్రెగ్జిట్ అనుకూల నేత నిగెల్ ఫరాజ్ వ్యాఖ్యానించారు. సంబరాలు.. నిరసనలు ఈ ప్రత్యేక సందర్భంలో లండన్‌లోని పార్లమెంట్ స్వే్వర్తోపాటు డౌనింగ్ స్ట్రీట్ వద్ద బ్రెగ్జిట్ కౌంట్‌డౌన్ తెలుపుతూ భారీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పబ్బులు, క్లబ్బుల్లో ప్రజలు బ్రెగ్జిట్ విందులు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, ఈయూలోనే కొనసాగాలంటూ కొన్ని చోట్ల బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు కూడా జరిగాయి. బ్రిటన్‌తోపాటు తమను కూడా ఈయూ నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ స్కాట్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. మరోసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బ్రెగ్జిట్తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది. మిశ్రమ స్పందన బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. డైలీ ఎక్స్‌ప్రెస్, ది సన్ వంటి పత్రికలు బ్రిటన్ శక్తివంతమవుతుందని వ్యాఖ్యానించగా, ముందున్నది గతులకు బాట అంటూ స్టాండర్డ్ పత్రిక, ది గార్డియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈయూను వీడిన బ్రిటన్ అంటూ బీబీసీ ప్రసారం చేసిన కథనంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా, బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే సమయంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సులోని కలైస్ పోర్టు నుంచి బ్రిటన్‌లోని డోవర్‌కు బయలుదేరిన ఓడలో మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు. ఆ ఓడ బయలుదేరిన సమయానికి ఈయూలో 28 సభ్యుదేశాలుండగా బ్రిటన్‌లోకి అడుగిడే సమయానికి ఈయూ 27 దేశాల సమాఖ్యగా మారనుంది. కాగా, కోట్ డెస్ డ్యూన్స్ అనే ఆ ఓడలో ప్రయాణీకుల్లో చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆడ్రే సెంటినెల్లా అనే మహిళ మాత్రం..‘ఇది విచారకరమైన రోజు. ఈ రోజుతో ఒక శకం ముగియనుంది. ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎన్ని లోటుపాట్లున్నా ఈయూతోనే బ్రిటన్ ముందుకు సాగితే బాగుండేది’అని పేర్కొన్నారు. ఈమె స్విట్జర్లాండ్‌లో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. రేపటి నుంచి ఫెర్రీ క్యాంటిన్లో బ్రిటిష్ ఫిష్, చిప్స్ తినే వారు కనిపించరని ఓడ కెప్టెన్ ఆంటోయిన్ పకెట్ అన్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్‌కు, ఈయూకు నిత్యం రాకపోకలు సాగించడం పెద్ద తలనొప్పిగా మారబోతోందని మరో ప్రయాణికుడు అలెస్సో బార్టన్ అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 దేశాల్లో తిరగగలిగే అవకాశాన్ని చాలా మంది కోల్పోనుండటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులు చెరిగిపోవాల్సిన సమయంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ పరిణామం భవిష్యత్తుకు మంచిది కాదని జర్మనీకి చెందిన మొహమ్మద్ మజోకా తెలిపారు. -
‘బ్రెగ్జిట్’కు బ్రిటన్ పార్లమెంట్ ఓకే
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్‌తో బ్రెగ్జిట్‌పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు. పార్లమెంట్లో ప్రధాని జాన్సన్ (మధ్యలో) -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది. హాంగ్‌కాంగ్ భగ్గు హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
జనవరి 31న ‘బిగ్‌బెన్’ బ్రెగ్జిట్ గంటలు
లండన్: లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి ప్రత్యేకంగా గంటలు మోగించనుంది. పార్లమెంట్ ఆవరణలోని ఎలిజబెత్ టవర్‌లో ఉన్న 160 ఏళ్లనాటి ఈ గడియారానికి ప్రస్తుతం రూ.554 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారు. పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇబ్బంది కలగరాదని ప్రస్తుతం ఈ గడియారం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గంటలు కొట్టేలా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరాదిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోగేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో గంటలు మోగాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరు పడుతున్న బ్రెగ్జిట్ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటలకు బిగ్‌బెన్ గంటలు కొట్టేలా చూడాలంటూ 50 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. -
సుస్థిరతకు బ్రిటన్ పట్టం
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న ‘బ్రెగ్జిట్’ నినాదం రాజుకుని రాజకీయ రూపం సంతరించుకున్నప్పటినుంచీ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ చివరకు దృఢమైన నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్‌ను గట్టిగా సమర్థిస్తున్న కన్సర్వేటివ్ పార్టీకి గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టి రాజకీయ అస్థిరత్వానికి తెరదించింది. అయిదేళ్లలో మూడో దఫా జరిగిన ఈ ఎన్నికల్లో సైతం హంగ్ పార్లమెంట్ తప్పదని, కన్సర్వేటివ్‌లకు బొటాబొటీ మెజారిటీ వస్తుందని, అది విపక్షాలతో కలిసి జాతీయ సంకీర్ణ ప్రభుత్వంతో సరిపెట్టుకోక తప్పదని అంచనా వేసిన రాజకీయ పండితులను శుక్రవారం వెలువడిన ఫలితాలు వెక్కిరించాయి. పార్లమెంటు లోని 650 స్థానాల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 365 స్థానాలు సాధించగా, దాని ప్రధాన ప్రత్యర్థి లేబర్ పార్టీ కేవలం 203 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశం ఈయూలోనే ఉండాలని బలంగా వాదించిన లిబరల్ డెమొక్రాట్లకు కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. స్కాటిష్ నేషనల్ పార్టీకి 48 లభించాయి. ఎగ్జిట్ పోల్స్ కన్సర్వేటివ్‌లు భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉన్నదని ముందే జోస్యం చెప్పాయి. అదే నిజమైంది. పద్నాలుగేళ్ల తర్వాత కన్సర్వేటివ్ పార్టీకి పార్లమెంటులో ఇంత స్పష్టమైన మెజారిటీ లభించడం ఇదే మొదటిసారి. అలాగే ఆ పార్టీకి 1987లో లభించిన స్థానాలకన్నా ఈసారి అత్యధిక స్థానాలు వచ్చాయి. అటు లేబర్ పార్టీది ఘోరమైన పరాజయం. తాజా ఎన్నికలతో కలుపుకొని చూస్తే అది వరసగా నాలుగు సాధా రణ ఎన్నికల్లో ఓటమిపాలైట్టు లెక్క. పైగా 80 ఏళ్లలో ఎప్పుడూ ఇంత కింది స్థాయికి అది పడిపోయిన దాఖలా లేదు. అయిదేళ్లలో మూడు పార్లమెంటు ఎన్నికలను చవిచూసిన బ్రిటన్ ప్రజానీకం ఈ అస్థిరతకూ, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలకూ విసుగెత్తి కన్సర్వేటివ్‌లకు తిరుగులేని ఆధిక్యతను అందించారు. అయితే ఈ ఫలితాల్లో మరో ప్రమాదం పొంచివుంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న స్కాటిష్ నేషనల్ పార్టీ ఆ గడ్డపై భారీగా సీట్లు సాధించింది. కనుక తమ డిమాండ్‌పై మరోసారి రెఫరెండం నిర్వహించాలని ఆ పార్టీ పట్టుబడుతుంది. అదే జరిగితే బ్రిటన్‌కు రాజ్యాంగ సంకటం ఎదురవుతుంది. 2014లో తొలిసారి జరిగిన రెఫరెండంలో 55 శాతంమంది ఐక్యతకే ఓటే యడంతో ఆ డిమాండ్ వీగిపోయింది. అయితే అప్పట్లో బ్రెగ్జిట్ గొడవ లేదు. ఈయూతో కలసి వుండాలన్న తమ ఆకాంక్షకు విరుద్ధంగా ఇప్పుడు జరగబోతోంది గనుక ఈసారి రెఫరెండం నిర్వహిస్తే వారు బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. 312 ఏళ్లక్రితం రెండు రాచ కుటుంబాల మధ్య ఏర్పడ్డ వివాహబంధంతో ఆ ప్రాంతం బ్రిటన్‌లో విలీనమైంది. ప్రపంచమంతా మితవాద ధోరణివైపు మొగ్గు చూపుతున్న వర్తమానంలో బ్రిటన్ అందుకు విరుద్ధమైన తీర్పునిస్తుందని కొందరు విశ్లేషకులు ఆశించిందంతా దురాశే కావొచ్చు. కానీ అందుకు కారణాలున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవలనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రూపంలో పోలికలున్న బోరిస్ జాన్సన్ ఆయన గుణాలనే పుణికిపుచ్చుకున్నారు. తరచుగా మహిళ లను కించపరిచే వ్యాఖ్యానాలు చేయడం, ఇస్లాంను పెనుభూతంగా చూడటం, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వంటì దురలవాట్లు జాన్సన్‌కు కూడా ఉన్నాయి. పైగా ఈయూతో ఒప్పందం కుదిరితే సరేసరి... లేదా ఏ ఒప్పందమూ లేకుండా బయటికొచ్చేయడానికి కూడా సిద్ధమని ఆయన చేసిన ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. మొన్న మే నెలలో మరో 27 సభ్య దేశాలతోపాటు బ్రిటన్లోకూడా జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ అంతకుముందున్న 19 స్థానాల్లో 15 కోల్పోయి, నాలుగుకు పరిమితమైంది. లేబర్ పార్టీ అంతకుముందున్న 20 స్థానాల్లో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. ఈయూతోనే ఉండాలన్న లిబరల్ డెమొక్రాట్లు అంతకుముందున్న ఒక స్థానం నుంచి ఏకంగా 15కు చేరుకున్నారు. బ్రెగ్జిట్‌కు పట్టుబడుతున్న తీవ్ర మితవాద రాజకీయ పక్షం బ్రెగ్జిట్ పార్టీ 29 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలకూ, ఆర్నెల్లక్రితం జరిగిన ఈయూ ఎన్నికల ఫలితాలకూ పొంతనే లేదు. ఆ ఎన్నికల్లో దెబ్బతిన్న కన్సర్వే టివ్‌లు చాలా త్వరగా కోలుకుని బలోపేతం కాగా, లేబర్ పార్టీకి అవే ఫలితాలు పునరావృతమ య్యాయి. ఈయూ ఎన్నికల్లో పుంజుకున్నట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం బ్రెగ్జిట్ పార్టీ ఈ ఎన్ని కల్లో సున్నా చుట్టింది. ఒక్క సీటూ గెల్చుకోలేక డీలాపడింది. బోరిస్ జాన్సన్ రూపంలో బలమైన మితవాది రంగంలో ఉండగా నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని బ్రెగ్జిట్ పార్టీ దండగని ఓటర్లు అనుకుని ఉండొచ్చు. భారీగా మెజారిటీ సాధించిన బోరిస్ జాన్సన్‌కు ఇప్పుడు చేతినిండా పని. ఆయన పరిపూర్తి చేయాల్సిన కర్తవ్యాలు సాధారణమైనవి కాదు. సాధ్యమైనంత తక్కువ నష్టంతో ఈయూ నుంచి బయటకు రావడం, ఆ సంస్థ సభ్య దేశాలతో విడివిడిగా మెరుగైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం రెండూ సంక్లిష్టమైనవి. బ్రెగ్జిట్‌ను వచ్చే జనవరి 31కల్లా పూర్తి చేస్తానని ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన పదే పదే చెప్పారు. అదంత సులభం కాదు. అందులో ఎన్ని చిక్కు ముడులున్నాయంటే...బ్రిటన్ ఏ ఒప్పందమూ లేకుండా నిష్క్రమించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. ఈ క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి కొన్ని ‘పొదుపు’ చర్యలు కూడా ఆయన తీసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్హెచ్ఎస్) సహా పలు పథకాలకు కోత, ప్రైవేటీకరణ వంటివి తప్పకపోవచ్చు. ఎన్‌హెచ్‌ఎస్‌ని ప్రైవేటీకరిస్తే ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుందని లేబర్ పార్టీ చేసిన ప్రచారాన్ని ఖాతరు చేయని జనం సుస్థిర ప్రభుత్వంతో తమకు మేలే తప్ప కీడు జరగదని విశ్వసించారు. దాన్ని జాన్సన్ ఎలా నిలబెట్టుకోగలరో చూడాలి. -
ముందస్తుకు బ్రిటన్ జై
లండన్: బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్ జాన్సన్ భావించారు. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్ క్రిస్మస్ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్‌లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని విపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్‌కు ఈయూ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా సహకరించింది. పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్‌బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ కన్జర్వేటివ్ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది. నాలుగేళ్లలో మూడో ఎన్నికలు బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్ జాన్సన్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది. -
బ్రెగ్జిట్ గడువు జనవరి 31
లండన్/బ్రసెల్స్: బ్రిటన్ పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్‌కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్‌పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందన్నారు. బ్రెగ్జిట్ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. బ్రెగ్జిట్ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్ నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది. డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. -
బ్రెగ్జిట్ ఆలస్యానికే ఓటు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం జాప్యం కానుంది. ఈ మేరకు శనివారం జరిగిన చారిత్రక సమావేశం నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్ కోసం ఈయూతో కుదుర్చుకున్న గొప్ప ఒప్పందానికి మద్దతు తెలపాలంటూ ఈ అంశంపై ప్రధాని జాన్సన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రెగ్జిట్ తర్వాత అవసరమయ్యే చట్టాలు రూపొందనందున ఈ గడువును 31వ తేదీ నుంచి పొడిగించాలని శనివారం అర్థరాత్రిలోగా ఈయూను కోరాలంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆలివర్ లెట్విన్ సవరణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానానికి అనుకూలంగా 322 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 306 ఎంపీలు ఓట్లేశారు. ప్రధాని కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందానికి ఎంపీల మద్దతు లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని లేబర్ పార్టీ నేత కార్బైన్ వ్యాఖ్యానించారు. ప్రధాని జాన్సన్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటింగ్ అర్థరహితం. అక్టోబర్ ఆఖరు కల్లా బ్రెగ్జిట్ అమలు చేయాలన్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, తాజా ఓటింగ్ మేరకు ఈయూను గడువు పొడిగించాలని కోరబోను’అని స్పష్టం చేయడం గమనార్హం. బ్రెగ్జిట్తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వచ్చే సోమవారం సభలో ప్రవేశపెట్టి, మంగళవారం ఓటింగ్‌కు కోరతామన్నారు. కాగా, పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రధాని జాన్సన్ ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం జరిగిన ‘ప్రతినిధుల సభ’ సమావేశాన్ని విశ్లేషకులు ‘సూపర్ సాటర్డే సెషన్’అని అంటున్నారు. ఇలాంటి అసాధారణ సమావేశం 1982లో మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉండగా ఫాక్‌ల్యాండ్ యుద్ధంపై ఓటింగ్ కోసం ఏర్పాటైంది. -
జాన్సన్‌కు అగ్నిపరీక్ష
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి తప్పుకోవడానికి తుది గడువు సమీపిస్తుండటంతో బేజారె త్తుతున్న బ్రిటన్ పౌరులకు ఊహించని కబురు అందింది. ప్రధాని బోరిస్ జాన్సన్‌కూ, ఈయూకు మధ్య దీనిపై ఒక ఒప్పందం కుదిరిందన్నదే దాని సారాంశం. అయితే అందుకు సంతోషించాలో, కంగారు పడాలో తెలియని అయోమయావస్థలో చాలామంది పౌరులున్నారు. ఎందుకంటే ఇప్పు డున్న పరిస్థితుల్లో జాన్సన్ ఈయూతో ఏ మేరకు మెరుగైన ఒప్పందానికి రాగలిగారో... దానికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. జాన్సన్ మాత్రం బ్రహ్మాండం బద్దలు చేశానని స్వోత్కర్షకు పోతున్నారు. దాన్ని పార్లమెంటు ఆమోదించి తీరాలం టున్నారు. శనివారం జరగబోయే ఓటింగ్‌లో ఆ కార్యక్రమం పూర్తయితే ఇతర ప్రాధాన్యతల దిశగా వేగం పెంచవచ్చునని హితవు చెబుతున్నారు. కానీ తనకు ముందు పనిచేసిన థెరిస్సా మే ఇలాగే ఒక ఒప్పందానికి వచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టి భంగపడ్డారు. వరసగా మూడుసార్లు పార్లమెంటులో ఓడిపోయి చివరకు ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పట్లో ఆమెకు వ్యతిరేకంగా ఓటేసినవారంద రినీ జాన్సన్ కొత్త ఒప్పందంపై ఒప్పించాల్సి ఉంటుంది. కన్సర్వేటివ్ పార్టీకి కొందరు గుడ్‌బై చెప్పగా, మరికొందరిని పార్టీయే బయటకు పంపింది. మిగిలినవారిలో అనేకులు బ్రెగ్జిట్‌ను ఆపాలని కోరు కుంటున్నారు. ఇదంతా చాలదన్నట్టు కన్సర్వేటివ్ పార్టీకి మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ(డీయూపీ) ఈ ఒప్పందంపై పెదవి విరుస్తోంది. ఆ పార్టీకి పార్ల మెంటులో పదిమంది సభ్యులున్నారు. విపక్షం లేబర్ పార్టీ సరేసరి. తాము ఈ ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. కనుక తాజా ఒప్పందం ఆమోదముద్ర పొందడం అంత సులభమేమీ కాదు. అయితే జాన్సన్ మాటల్ని మన దేశంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం విశ్వసిస్తున్నాయి. కనుకనే బోరిస్ జాన్సన్ ఒప్పందం గురించి ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీశాయి. ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పలికితే దాదాపు ఏడాదికాలంగా ఉన్న అనిశ్చితి తొలగి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతుందని... ఇది టాటా మోటార్స్, టీసీఎస్ వంటి సంస్థలకు లబ్ధి చేకూరుస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి. జాన్సన్ మొదలుకొని స్టాక్ మార్కెట్ల వరకూ ఎవరికెన్ని నమ్మకాలున్నా ఒప్పందం సజావుగా సాకారమవుతుందని చెప్పలేం. 2016లో తొలిసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరిగినప్పుడు బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్లు ఈయూ నుంచి దేశం తప్పుకోవాల్సిందేనని తీర్పునిస్తే...ఉత్తర ఐర్లాండ్ పౌరులు మాత్రం ఈయూలో కొనసాగాలని తేల్చారు. ఇది బ్రిటన్‌లో ప్రాణాంతక సమస్యగా మారింది. 1949లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న ఐర్లాండ్ దేశంతో ఉత్తర ఐర్లాండ్‌ను విలీనం చేయాలంటూ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ(ఐఆర్ఏ) ఆవిర్భవించింది. హింసాత్మక చర్యలతో బ్రిట న్ను హడలెత్తించింది. చివరకు రెండు ఐర్లాండ్ల మధ్యా సరిహద్దులేమీ ఉండబోవన్న హామీ ఇచ్చి 1998లో ఆ సంస్థతో బ్రిటన్ సంధి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే 2016 బ్రెగ్జిట్ రెఫరెండంలో ఉత్తర ఐర్లాండ్ వాసులు తాము ఈయూలో కొనసాగుతామని తేల్చిచెప్పారు. తాము ఈయూ నుంచి వైదొలగుతూ తమ ప్రాంతమైన ఉత్తర ఐర్లాండ్‌ను ఆ సంస్థ పరిధిలో ఎలా ఉంచాలో బ్రిటన్‌కు అర్ధం కావడం లేదు. ఈయూ నుంచి బయటకు వచ్చిన వెంటనే రెండు ఐర్లాండ్ల మధ్యా చెక్‌పోస్టులు నిర్మించాలి. సరుకు రవాణాపై సుంకాలు వసూలు చేయాలి. ఇదే జరిగితే ఉత్తర ఐర్లాండ్ జనం తిరగ బడతారు. సరిహద్దు రేఖలు గీస్తారా అంటూ ఆగ్రహిస్తారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఐఆర్ఏ మళ్లీ పుంజుకుని సమస్యలు సృష్టిస్తుందని, చివరకు దేశం నుంచి ఉత్తర ఐర్లాండ్ విడి పోతుందని బ్రిటన్ రాజకీయ నాయకత్వం భయపడుతోంది. దీన్నుంచి గట్టెక్కడం కోసమే తాము ఈయూ నుంచి విడిపోయినా సుంకాల విషయంలో మాత్రం ఆ సంస్థ పరిధిలోనే ఉంటామని థెరిస్సా మే ఒప్పందం నిర్దేశించింది. ఉత్తర ఐర్లాండ్‌కు ఇది సంతోషం కలిగించినా బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలవారు మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. ఒప్పందం ఓటమి పాలుకావడానికి అది ప్రధాన కారణం. దీనికి జాన్సన్ ఓ చిట్కా కనుక్కున్నారు. దాని ప్రకారం రెండు ఐర్లాండ్ల మధ్యా సరుకులపై ఎలాంటి తనిఖీలూ ఉండవు. చెక్పోస్టులుండవు. ఉత్తర ఐర్లాండ్ నుంచి బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే సరుకులపై మాత్రం ఈయూ నిర్దేశించిన సుంకాలను బ్రిటన్ వసూలు చేయాల్సి ఉంటుంది. తన ఒప్పందం మొత్తం బ్రిటన్ను ఈయూ సుంకాల పరిధిలో లేకుండా చూసింది గనుక ఎవరికీ అభ్యంతరం ఉండబోదని జాన్సన్ నమ్ముతున్నారు. వాస్తవానికి బ్రిటన్ పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవులు. కానీ దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి శనివారం రోజున పార్లమెంటు సమావేశం కాబోతోంది. పార్టీకి దూరమైన కన్సర్వేటివ్‌లను ఆ ఓటింగ్‌లో జాన్సన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అలాగే లేబర్ పార్టీ నుంచి కొందరినైనా చీల్చగలగాలి. డీయూపీని సైతం దారికి తెచ్చుకోవాలి. ఇవన్నీ అసాధ్యమని అందరూ అంటున్నారు. కానీ జాన్సన్ మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఓటింగ్ పూర్తయి విజయం సాధిస్తే ఒప్పం దానికి అనుగుణంగా చట్టం రూపొందించాలి. అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఈ నెల 31లోగా ఆమోదం పొందాలి. కానీ అంత ఆదరాబాదరాగా ఈ వ్యవహారం ముగుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. బిల్లుపై వెల్లువెత్తే అభ్యంతరాలూ, వాటికి ప్రభుత్వం ఇచ్చే వివరణలూ చాలా ఉంటాయి. అందరినీ సంతృప్తిపరిస్తే సరేసరి...లేనట్టయితే సవరణలకు సిద్ధప డాలి. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడైనా ఆటంకం ఎదురైతే బ్రెగ్జిట్ గడువు పెంచుతారా అన్నది ప్రధాన ప్రశ్న. దానికి ఎవరూ జవాబివ్వడంలేదు. చివరికిదంతా జాన్సన్ మెడకు చుట్టుకుని ఆయన నిష్క్రమిస్తారో, ఇది మరో రెఫరెండానికి దారితీస్తుందో వేచి చూడాలి. -
బ్రెగ్జిట్ డీల్.. జోష్!
గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారం కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటామని, మన దేశంలో మదుపు చేయాల్సిందిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగిశాయి. స్వల్పంగానైనా, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి 71.19కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 39,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 11,586 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈ అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ సూచీల్లో ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ‘రికవరీ’ ఆశలు...: ఉద్దీపన చర్యలు, పండుగల డిమాండ్, మంచి వర్షాలు కురియడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం... ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలను పెంచుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఫలితంగా నష్ట భయం భరించైనా సరే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశం పెరిగిందని, కొనుగోళ్లు జోరుగా సాగాయని వివరించారు. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 15% లాభంతో రూ.47.4 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, సునీల్ ముంజాల్‌లు ఈ బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు ఈ లాభాలకు కారణం. ► బ్రెగ్జిట్ డీల్‌పై అనిశ్చితి తొలగిపోవడంతో టాటా మోటార్స్ షేర్ జోరుగా పెరిగింది. టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ఇంగ్లాండ్‌లోనే ఉండటంతో తాజా బ్రెగ్జిట్ డీల్ ఈ కంపెనీకి ప్రయోజనకరమన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. టాటా మోటార్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. లాభాలు ఎందుకంటే.... ► బ్రెగ్జిట్ డీల్ బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారమైంది. దీంతో యూరోపియన్ యూనియన్‌తో ఉన్న 46 ఏళ్ల అనుబంధానికి బ్రిటన్ వీడ్కోలు పలకనున్నది. సూత్రప్రాయంగా కుదిరిన ఈ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ►సుంకాల పోరుకు స్వస్తి ! సుంకాల పోరుకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, దీనికనుగుణంగా సంప్రదింపులు వేగవంతం చేయాలని అమెరికాను చైనా కోరడం సానుకూల ప్రభావం చూపించింది. ►మరిన్ని ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థలో జోష్‌ను పెంచడానికి మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. ► వాహన స్క్రాప్ పాలసీ ముసాయిదా భారత్‌లో వాహన స్క్రాప్ పరిశ్రమను చట్టబద్ధం చే యడంలో భాగంగా రవాణా మంత్రిత్వ శాఖ వాహ న స్క్రాప్ పాలసీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ►జోరుగా విదేశీ కొనుగోళ్లు ఈ నెల తొలి 2 వారాల్లో నికర అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గత 4 ట్రేడింగ్ సెషన్లలో రూ.2,000 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. రూ.1.59 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.59 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.59 లక్షల కోట్లు పెరిగి రూ.147.90 లక్షల కోట్లకు చేరింది. -
బ్రెగ్జిట్‌కు కొత్త డీల్
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడానికి (బ్రెగ్జిట్) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. ఇది న్యాయంగా, సమతూకంతో ఉందన్న జంకర్.. దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్య దేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా సాగేందుకిదే సరైన సమయమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు జంకర్ ఒక లేఖ రాశారు. బ్రెగ్జిట్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఒప్పందం కూడా శనివారం బ్రిటన్ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మద్దతిస్తున్న డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) ఇటీవలే బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ.. కొందరు ఎంపీల రాజీనామా, దాదపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజారిటీ తగ్గి, ప్రస్తుతం డీయూపీ మద్దతుపై ఆధారపడింది. ఇదీ ఒప్పందం... ప్రస్తుత ఒప్పందం.. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకలాగే ఉన్నాయి. అయితే, బ్రెగ్జిట్ తరవాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందలో లేదు. తాజా ఒప్పందం ఇదీ... బ్రెగ్జిట్ తరవాత ఐర్లాండ్‌కు, యూకేలో భాగంగా ఉండే ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య మరీ కఠినతరమైన సరిహద్దు ఉండకూడదని అన్ని పక్షాలూ భావిస్తున్నాయి. తాజా ఒప్పందాన్ని కూడా దీన్ని పరిష్కరించటంలో భాగంగానే తీసుకొచ్చారు. ► యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ నుంచి యూకే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాలతో యూకే స్వతంత్రంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది. ► ఐర్లాండ్‌కు– ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య చట్టబద్ధమైన కస్టమ్స్ సరిహద్దు ఉంటుంది. కానీ ఆచరణలో అది ఐర్లాండ్– యూకే సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర ఐర్లాండ్‌లోకి ప్రవేశించే చోట సరుకుల తనిఖీలుంటాయి. ► బ్రిటన్ నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే సరుకులపై ఆటోమేటిగ్గా సుంకాలు చెల్లించటమనేది ఉండదు. కానీ ఈయూలో భాగమైన ఐర్లాండ్‌కు వచ్చే సరుకుల్ని గనక ఇబ్బందికరమైనవిగా పరిగణిస్తే... వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ ‘ఇబ్బందికరమైన’ సరుకులు ఏంటనేది యూకే– ఈయూ ప్రతినిధుల ఉమ్మడి కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది. ► ఈ సరిహద్దుల మధ్య వ్యక్తులు పంపించుకునే సరుకులపై పన్నులు విధించకపోవటం... ఉత్తర ఐర్లాండ్ రైతులకివ్వాల్సిన సాయం... సరుకుల నియంత్రణకు సంబంధించి ఈయూ సింగిల్ మార్కెట్ నిబంధనల్ని ఉత్తర ఐర్లాండ్ పాటించటం... సరిహద్దులో యూకే అధికారులతో పాటు ఈయూ అధికారులూ ఉండటం... సేవలకు మినహాయించి సరుకులకు మాత్రం ఉత్తర ఐర్లాండ్‌లో ఈయూ చట్టాలే అమలుకావటం... ఈయూలోని యూకే పౌరులు– యూకేలోని ఈయూ పౌరులు ఇకపైనా తమ నివాస, సోషల్ సెక్యూరిటీ హక్కుల్ని యథాతథంగా పొందగలగటం... ఇలాంటివన్నీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. -
అడుగడుగునా అడ్డంకుల్లో బ్రెగ్జిట్
యూరోపియన్ యూనియన్ నుంచి ఏ క్షణంలో బ్రిటన్ వైదొలగాలని నిర్ణయించుకుందో అప్పటినుంచి ఆ నిర్ణయానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాని దెబ్బకు ఒక ప్రధాని ఇప్పటికే పదవి నుంచి దిగిపోగా ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ సమస్యను పరిష్కరించలేక బ్రిటన్ చరిత్రలోనే అత్యంత స్వల్పకాలంలో ప్రధాని పదవిలో ఉన్న బలహీనుడిగా చరిత్రకెక్కనున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జాన్సన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హౌస్ ఆఫ్ కామన్స్ ఈ మంగళవారమే అడ్డుకట్టవేసింది. ప్రతినిధుల సభలో చుక్కెదురు కావడంతో జాన్సన్ మెజారిటీ కోల్పోయినప్పటికీ అధికారంలో ఉంటున్న వ్యక్తిగా మిగిలిపోయారు. ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్ యాక్ట్‌ను పక్కనపెట్టడానికి పార్లమెంటు అనుమతి తీసుకుని, అక్టోబర్ 15లోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరిపించాలని జాన్సన్ ప్రయత్నించారు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కానీ ప్రభుత్వ గెలుపునకు 133 ఓట్లు తక్కువయ్యాయి. బ్రెగ్జిట్ నుంచి తప్పుకోవడానికి అక్టోబర్ 31ని తుది గడువుగా నిర్దేశించారు. ఈలోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరపకుండా చేయాలని లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనలిస్టులు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేశారు. జాన్సన్ మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో ప్రతిపక్షాల కలయికతో తాను బ్రిటన్ ప్రధాని కావాలని లేబర్ పార్టీ నేత జెరెమి కోర్బిన్ చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ అండగా నిలబడటం లేదు. అక్టోబర్ 31లోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరపడానికి ప్రతిపక్ష లేబర్ పార్టీతో పాటు స్కాటిష్ నేషనలిస్టులు, లిబరల్స్ వంటి ఇతర చిన్నా చితకా పార్టీలు కూడా తమ ఆమోదం తెలుపటం లేదు. అక్టోబర్ 31లోగా యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలిగేలా చేయాలన్న తన నిర్ణయం కూడా అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. పైగా, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి పెట్టిన అక్టోబర్ 31 గడువు ముగిశాక పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే బ్రెగ్జిట్‌పై తాను చేసిన ప్రతిజ్ఞ విషయంలో విఫలమయ్యాడనే కారణంతో బ్రిటన్ ఓటర్ల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. జాన్సన్ స్వచర్మ సంరక్షణకోసం రెండు ఎత్తులు వేయవచ్చు. అక్టోబర్ 31లోగా బ్రిటన్ ఈయూని వదిలి వెళ్లడానికి నేరుగా బ్రస్సెల్స్ తోనే కొత్తగా ఒప్పందానికి ప్రయత్నించవచ్చు. తనకున్న ఆకర్షణ శక్తితో దీన్ని సాధిస్తానని ఆయన చెబుతున్నప్పటికీ తనపై పెద్దగా నమ్మకాల్లేవు. బ్రిటన్ ప్రధానిపై ఈయూకి కూడా నమ్మ కం లేకుండా పోవడం గమనార్హం. ఇక రెండోది ఏమిటంటే, బ్రిటన్ పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టి ఈయూతో ఎలాంటి ఒప్పం దమూ లేకుండానే బ్రెగ్జిట్ నుంచి బయటపడటం. ఇది శాసనోల్ఘంఘనే అవుతుంది. పైగా ఈయూనుంచి వైదొలిగేందుకు ఎలాంటి శాసనపరమైన అనుమతుల జోలికి తాను వెళ్లనని, ఈ విషయంలో ఆలస్యాన్ని తాను ఏమాత్రం కోరుకోవడం లేదని జాన్సన్ తేల్చి చెప్పారు కూడా. మూడో అవకాశం కూడా ఉంది. బ్రెగ్జిట్ నుంచి వైదొలగడాన్ని వాయిదా వేయాలని, గడువును మరింతగా విస్తరించాలని ఈయూను కోరడానికి బదులుగా జాన్సన్ తన ప్రధానపదవికి రాజీనామా చేయడం. ఇది వ్యక్తిగతంగా తన ప్రతిష్టను పెంచుతుందేమో కానీ రాజకీయ భవి ష్యత్తు ముగిసిపోతుంది. పైగా బ్రెగ్జిట్ గడువును పెంచాలంటున్న ప్రతిపక్షంతో కలిసి తనకు వ్యతి రేకంగా ఓటేసిన 21 మంది టోరీ ఎంపీలపై జాన్సన్ కఠిన చర్యతీసుకున్నారు. వీరిలో విన్స్టన్ చర్చిల్ మనవడు నికోలస్ సోమ్స్ కూడా ఉన్నారు. మరోవైపున నూరుమందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఈ బహిష్కరణ వేటును తీవ్రంగా అభిశంసిస్తూ ఉత్తరం రాశారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం బ్రిటన్ రాజకీయాలకు సంబంధించి గడ్డుదినంగా మారనుంది. అసాధారణ ఘటనల కారణంగా రాజ కీయ పరిస్థితి ఆకస్మిక మార్పులకు గురికావచ్చు. జాన్సన్ ఆశ మొత్తంగా ఇదేమరి. కానీ అలా జరగకపోతే, బ్రేకులు పనిచేయని కారు స్లోమోషన్లో గోడకు గుద్దుకున్న పరిస్థితిలో జాన్సన్ ఇరుక్కుపోవచ్చు కూడా. వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
గందరగోళంలో బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ పీటముడి మరింత జటిలమైపోయింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్ అక్టోబర్ 31కల్లా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సి ఉండగా.. ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్తా పార్లమెంటును సస్పెండ్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒప్పందంలో మార్పులు జరిగితే బ్రిటన్ వైదొలగేందుకు తనకు అభ్యంతరం లేదని బోరిస్ అంటూండగా.. విపక్షాలు తమకు అనుకూలమైన మార్పులు జరిగితేనే వీడాలని పట్టుపడుతున్నాయి. లేదంటే బ్రిటన్‌కు ఆర్థికంగా నష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్ 31లోగా బ్రెగ్జిట్ సాధ్యమేనా? అధికార, విపక్షల ముందున్న అవకాశాలు ఏంటి? రహస్య పద్ధతితో సాధిస్తారా? మెరుగైన ఒప్పందం లేకుండా విడిపోవడంపై పార్లమెంటు సభ్యులు అత్యధికుల్లో అభ్యంతరాలున్నాయి. కానీ ఇది జరక్కుండా ఉండాలంటే పార్లమెంటు పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సస్పెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు జటిలంగా మారినా.. ప్రతిపక్ష నేతలు జో స్విన్సన్ లాంటి వాళ్లు తమ గళాన్ని పెంచారు. ఇటీవలి బీబీసీ ఇంటర్వ్యూలో లిబరల్ డెమొక్రాట్స్ నేత అయిన జో స్విన్సన్ మాట్లాడుతూ తామూ బోరిస్ జాన్సన్ మాదిరిగా ఒక సీక్రెట్ పద్ధతి ద్వారా తమకు కావాల్సింది సాధించుకుంటామని సూచించారు. అదేంటో ఇప్పటికి స్పష్టం కాకపోయినా... అనూహ్య పరిణామమేదైనా జరగవచ్చునని మాత్రం తెలుస్తోంది. తుది అస్త్రంగా అవిశ్వాసం... మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందంపై చట్టం చేయలేని పరిస్థితి ఏర్పడితే బోరిస్ జాన్సన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతానికి ఇందుకు తగ్గ బలం లేకపోగా.. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకమూ లేదు. అవిశ్వాస తీర్మానం మేరకు ఒకవేళ బోరిస్ జాన్సన్ దిగిపోయినా రెండు వారాల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, లేదంటే సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరగాలని బ్రిటన్ చట్టాలు చెబుతూండటం దీనికి కారణం. ఆపద్ధర్మ ప్రధాని నియామకం ద్వారా బ్రెగ్జిట్‌ను వాయిదా వేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఆపద్ధర్మ ప్రధాని ఎవరన్న అంశంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. లేబర్ పార్టీ తరఫున జెరెమీ కార్బిన్... ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి కావచ్చుగానీ... యూనియన్ వ్యతిరేకిగా ముద్ర ఉన్న కారణంగా అతడిని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపడతాడు అనుకుంటే.. బోరిస్ మరో ఎత్తు వేయవచ్చు. రాజీనామా చేయకుండా నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో మెరుగైన ఒప్పందం లేకుండానే అక్టోబర్ 31 తరువాత బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చేస్తుంది. ఒప్పందంతో బయటకు... థెరెసా మే ప్రధానిగా ఉండగా సిద్ధమైన ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరోసారి చర్చలు లేవని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 –18లలో జరిగే యూనియన్ నేతల సమావేశం కీలకం కానుంది. ప్రధాని బోరిస్ ఏదో ఒక రకంగా యూనియన్ నేతలను ఒప్పించి ఒప్పందంలో మార్పులు తీసుకు వస్తే.. ఆ మార్పులను బ్రిటన్ పార్లమెంటు ఆమోదిస్తేనే బ్రిటన్‌కు నష్టదాయకం కాని ఒప్పందంతో బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుంది. ఒప్పందం లేకుండానే వీడుతుందా..? మెరుగైన ఒప్పందం కుదుర్చుకునేందుకు బోరిస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే ఒప్పందం లేకుండానే యూనియన్ను వీడేందుకు ఆయన సిద్ధం కావచ్చు. కాలపరిమితి కారణంగా పార్లమెంటు కూడా దీన్ని అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందంలో మార్పులు జరిగినా, జరక్కపోయినా అక్టోబర్ 31 తరువాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో భాగం కాదు కాబట్టి. ఇదే జరిగితే జాన్సన్ బ్రెగ్జిట్ మద్దతుదార్లను కూడగట్టుకుని ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మొదట్లో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ యూనియన్ నుంచి వైదొలగిన తరువాతి ఆర్థిక పరిణామాల కారణంగా ఆ ఎన్నికలను గెలవడం బోరిస్‌కు కష్టం కావచ్చు. ముందస్తు ఎన్నికలు..? పార్లమెంటు సస్పెన్షన్ మొదలయ్యేలోపు ఎంపీలు అందరూ మెరుగైన ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్ కుదరదని చట్టం చేయగలిగితే.. ఆ వెంటనే బోరిస్ జాన్సన్ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడి ఆధిక్యంతో సభ నడుస్తూండగా.. ఎన్నికలు జరిగితే జాన్సన్‌కు మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే అవి అక్టోబర్ 17 లోగానే జరగవచ్చునని తద్వారా బోరిస్ గెలిస్తే.. యూరోపియన్ యూనియన్ సదస్సుకు వెళ్లి తన బలాన్ని ప్రదర్శించవచ్చునని అంచనా. కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే హౌస్ ఆఫ్ కామన్స్‌లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే.. బోరిస్‌కు ప్రతిపక్ష నేతల సభ్యులు కొందరు మద్దతు పలకాలి. లేబర్ పార్టీ కూడా తక్షణ ఎన్నికలు కోరుకుంటున్నా బోరిస్‌పై ఉన్న అపనమ్మకం కారణంగా అతడికి మద్దతిచ్చే అవకాశాలు తక్కువే. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా? పార్లమెంటును సస్పెండ్ చేయడంపై ఇప్పటికే బ్రిటన్ న్యాయస్థానాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. గతంలో పార్లమెంటును కాదని యూనియన్‌తో చర్చలకు సిద్ధమైన థెరెసా మే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసి గెలుపొందిన గినా మిల్లర్ ఇప్పుడు కూడా బోరిస్ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో బ్రెగ్జిట్ బంతి బ్రిటన్ కోర్టులో పడిపోతుంది! -
జాన్సన్ దారెటు?
నాలుగేళ్లనాడు జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలన్న ఆత్రుతలో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ ఇచ్చిన ఒక హామీ కన్సర్వేటివ్ పార్టీకి దండిగా సీట్లు సాధించిపెట్టింది. అంతక్రితం తమకున్న 306 స్థానాలనూ 331కి పెంచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించింది. కానీ ఆ హామీయే తమను క్రమేపీ సంక్షోభం వైపు నెడుతుందని పార్టీ నేతలు అనుకొని ఉండరు. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఏడాదిలో నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండం మూడేళ్లకు ముగ్గురు ప్రధానుల్ని మార్చేలా చేసింది. కామెరాన్ తప్పుకున్నాక థెరిసా మే ప్రధాని కాగా, రెండేళ్లు గడిచేసరికి ఆమె కూడా రాజీనామా చేయాల్సివచ్చింది. తాజాగా ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు కన్సర్వేటివ్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్‌కు మేలు చేకూరేవిధంగా ఈయూతో మాట్లాడి మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందానికి కృషి చేస్తాననడా నికి బదులు, అసలు ఏ ఒప్పందమూ అవసరం లేదంటూ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. బ్రెగ్జిట్ వ్యవహారం నిప్పుతో చెలగాటం వంటిది. ఈ సంగతి మొదట కామెరాన్, తర్వాత థెరిసా మే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈయూతో ఒప్పందంలో ఎన్ని సంక్లిష్టతలున్నాయో రెండేళ్లకు మే గ్రహించారు. ఈయూతో ఆమె కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరిలో బ్రిటన్ పార్లమెంటు తోసిపుచ్చింది. ఆ తర్వాత మార్చిలో ఆమె మరో ముసా యిదా ఒప్పందానికి ఈయూను ఒప్పించారు. కానీ దాన్ని సైతం పార్లమెంటు తోసిపుచ్చింది. ఆమె వ్యవహారశైలిపై సొంత పార్టీలో అసంతృప్తి నానాటికీ తీవ్రమై చివరకు ఆమె రాజీనామా చేశారు. వచ్చే అక్టోబర్ 31నాటికి ఏదో ఒప్పందానికి రాకపోతే బ్రిటన్‌పై దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతిని జాన్సన్ గ్రహించలేకపోతున్నారో లేక అప్పటివరకూ ఏదో రకంగా నెట్టుకు రావొచ్చునని భావిస్తున్నారో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఒప్పందం కుదుర్చుకుని తప్పుకుంటే బ్రిటన్కొచ్చే లాభం ఒకటుంది. అది కొత్త విధానంలోకి పరివర్తన చెందడానికి 21 నెలల సమ యాన్ని... అంటే దాదాపు రెండేళ్ల గడువు తీసుకోవచ్చు. ఈలోగా ఎదురయ్యే సమస్యలను ఒక్కొ క్కటిగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఒప్పందం లేకుంటే ఒక్కసారిగా బ్రిటన్ అనిశ్చితిలోకి జారు కుంటుంది. బ్రిటన్, ఈయూల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి దేశ పౌరులకు సమస్యలేర్పడతాయి. తమ సభ్య దేశం కాదు గనుక బ్రిటన్‌పై ఈయూ భారీ సుంకాలు విధిస్తుంది. ఫలితంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. కొత్త నిబంధనలు రూపొందించుకునేవరకూ బ్రిటన్ నుంచి వచ్చే ఉత్పత్తులకు ఈయూ అనుమతి నిరాకరిస్తుంది. దేశం వెలుపలి నుంచి రావా ల్సిన విడి భాగాలు, ముడి సరుకు వగైరాల దిగుమతికి సమస్యలేర్పడతాయి గనుక ఉత్పత్తిదారులు బ్రిటన్ వదిలిపోవచ్చు. దానివల్ల లక్షలాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. అటు ఈయూ, ఇటు బ్రిటన్ కొత్త విధానాలు రూపొందించుకునే వరకూ రెండు ప్రాంతాల్లోనూ వలసదారులకు తిప్పలు తప్పవు. బ్రిటన్‌లో 37 లక్షలమంది యూరపియన్లు ఉంటే... ఈయూ దేశాల్లో 13 లక్షలమంది బ్రిటన్ పౌరులున్నారు. వీరంతా కొత్తగా రూపొందబోయే నిబంధనలకు అనుగుణంగా తమ స్థితి గతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈయూ బడ్జెట్ కోసం ఏటా చెల్లించాల్సిన 1,300 కోట్ల పౌండ్ల భారం నుంచి బ్రిటన్ తప్పుకోవచ్చు. కానీ అటు నుంచి వచ్చే సబ్సిడీలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా ఉమ్మడి వ్యవసాయ విధానం కింద బ్రిటన్ రైతులకిచ్చే 300 కోట్ల పౌండ్లు ఆగిపోతాయి. ఇప్పటికే ఆమోదించిన ఈయూ బడ్జెట్‌కు, దానికింద పరస్పరం చేసుకునే చెల్లింపులకూ ఇరు దేశాలూ కట్టుబడి ఉండాలి. ఈయూ న్యాయస్థానం తీర్పులను బ్రిటన్ పాటించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈయూ దేశాలతో బ్రిటన్ వేర్వేరుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది. అందుకు చాన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ ఇకపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం నడుచుకుంటుంది. ఇందువల్ల కొన్ని రంగాల్లో బ్రిటన్ మెరుగైన స్థితిలో ఉండే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో సమస్యలేర్పడతాయి. కన్సర్వేటివ్ ఎంపీల్లో బ్రెగ్జిట్‌పై స్పష్టత లేకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. ఆ పార్టీలో ఒప్పందం వద్దనే వారితోపాటే, దాన్ని గట్టిగా సమర్థిస్తున్నవారున్నారు. ఆ అస్పష్టతే పార్టీలో ప్రధాని పదవికి పోటీపడిన జెరిమీ హంట్‌కు బదులు జాన్సన్‌ను ఎన్నుకోవడానికి కారణ మైంది. ఈయూతో సమర్థవంతంగా సంప్రదింపులు జరిపి దేశానికి లాభం చేకూర్చే ఒప్పందానికి వారిని ఒప్పిస్తానని హంట్ చెప్పినా అత్యధికులు ఆయన్ను విశ్వసించలేదు. కానీ జాన్సన్లో మరో డోనాల్డ్ ట్రంప్ ఉన్నారని వారు గ్రహించలేకపోయారు. అట్లాంటిక్ మహా సముద్రానికి అటున్న ట్రంప్, ఇటువైపున్న జాన్సన్ చూడటానికి కవలల్లా ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అప్పటికి లండన్ మేయర్‌గా ఉన్న జాన్సన్ న్యూయార్క్ వెళ్లినప్పుడు ఆయన్ను చాలా మంది ట్రంప్‌గా పొరబడ్డారు. అప్పట్లో ఆయన విపరీత వ్యాఖ్యలను తప్పుబట్టిన జాన్సన్ ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నారు. జాత్యహంకార వ్యాఖ్యల్లో, మహిళలను కించేపరిచేలా మాట్లాడటంలో, ఇస్లాంను భూతంగా చూడటంలో ఆయన ట్రంప్కెక్కడా తీసిపోరు. ఈయూతో ఒప్పందం లేకపో యినా మిన్ను విరిగి మీద పడబోదని జాన్సన్ చేసిన వ్యాఖ్య కూడా ఆ కోవలోనిదే. ఈయూతో ఏ ఒప్పందమూ ఉండబోదన్న అనుమానం వస్తే పార్లమెంటులో జాన్సన్‌పై సొంత పార్టీవారే అవి శ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోలేదు. తాననుకున్నది సాధించడానికి పార్లమెంటును ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ ఉనికికే ముప్పు ముంచుకొస్తుంది. ఎలా చూసినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో బ్రిటన్ సంక్షోభం ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీన్నుంచి ఆ దేశం ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. -
బ్రెగ్జిట్ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్
మాంచెస్టర్: బ్రెగ్జిట్ ద్వారా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లవచ్చనీ, ఇది గొప్ప అవకాశమని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కానీ థెరిసా మే ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రతికూలాంశంగానే చూసిందన్నారు. మాంచెస్టర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో బోరిస్ మాట్లాడుతూ.. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన ప్రాంతాల్లో కొత్తగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఆగిపోయిన బ్రెగ్జిట్ చర్చలను వేగవంతం చేస్తామనీ, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఫ్రీపోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఉత్తర ఐర్లాండ్, పొరుగునున్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు ఉండాలన్న నిబంధనను తొలగిస్తే ఈయూతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని చెప్పారు. ఒప్పందం కుదిరినా, కుదరకున్నా అక్టోబర్ 31 నాటికి ఈయూ నుంచి బయటకొచ్చేస్తామన్నారు. -
బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్ (55) ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ మంగళవారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. కాగా బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో మాజీ ప్రధాని థెరిసా మేకి పలుమార్లు ఎదురుదెబ్బలు తగలడంతో ఆమె పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో నూతన ప్రధానని ఎన్నుకున్నారు. దీని కోసం కేంద్రమంత్రుల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో రహస్య ఓటింగ్ పద్దతి జరపగా.. దానిలో బోరిస్ జాన్సన్ విజయం సాధించారు. బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు బుధవారం మధ్యాహ్నాం చేపట్టనున్నారు. గతంలో ఆయన విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా నూతన ప్రధాని జాన్సన్ కూడా బ్రెగ్జిట్‌కు తొలినుంచి అనుకూలంగా ఉన్నారు. మే కూడా మొదటి నుంచి ఆయనకే మద్దతు ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. జాన్సన్ 2001 నుంచి బ్రిటన్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతూ వస్తున్నారు. -
అత్యంత ఖరీదైన నగరం అదే!
న్యూయార్క్ : విదేశీయులకు ఆశ్రయం కల్పించే దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది.వరుసగా రెండో ఏడాది ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 లో రెడ్-హాట్ హౌసింగ్ మార్కెట్, కరెన్సీలో హెచ్చుతగ్గుల కారణంగా యుఎస్ డాలర్‌తో పోటీని తట్టుకొని మొదటి స్థానంలో నిలిచింది. మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక ప్రమాణాలు పాటించినందు వల్లే ప్రపంచం హాంకాంగ్ వైపు చూస్తుందని మెర్సెర్ ఆసియా, మిడిల్ ఈస్ట్, గ్లోబల్ మొబిలిటీ ప్రాక్టీస్ లీడర్ మారియో ఫెరారో అన్నారు. ఈ మేరకు కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ తన వార్షిక నివేదికను వెల్లడించింది. ఇక.. ఈ ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ లో టాప్ 10 నగరాల్లో ఎనిమిది ఆసియాలోనే ఉండటం విశేషం. ఈ జాబితాలో టోక్యో రెండో స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాల్లో సింగపూర్, సియోల్, జూరిచ్ షాంఘైలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాట్ చివరి స్థానంలో నిలిచింది. దిగుమతి విపరీతంగా పెరగడం, కరెన్సీ కొరత ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. మరోవైపు.. డాలర్ క్రమేపీ బలపడడం వల్ల యుఎస్ఏలోని అనేక నగరాలు ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉన్నాయి. ‘బిగ్ ఆపిల్’ సిటీ న్యూయార్క్ నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి 10 స్థానాల్లోకి ప్రవేశించగా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వరుసగా 16 ,18 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో డాలర్‌తో పోటీపడలేక అనేక యూరోపియన్ నగరాలు వెనుకంజలో ఉన్నాయి. ఇందుకు వివిధ దేశాలతో ముదిరిన వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ అంశాలను ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు. ఇక ఈ తాజా నివేదికలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ 47 వ స్థానంలో, జర్మన్ నగరాలు బెర్లిన్, డ్యూసెల్డార్ఫ్ స్టుట్గార్ట్ ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. కాగా ప్రపంచంలోని 209 నగరాల ఆధారంగా మెర్సెర్ ప్రతీ ఏటా ఈ ర్యాంకింగ్ ఇస్తోంది. ప్రతి ప్రదేశంలో 200 కి పైగా వస్తువుల వ్యయాన్ని అంచనా వేసి ఈ మేరకు ఖరీదైన నగరాల నివేదిక వెల్లడిస్తుంది. ఇందుకు గృహ, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర అంశాలను కొలమానాలుగా తీసుకుంటుంది. ఇక ఆసియా దేశాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన వసతి సేవలు,సౌకర్యాల వల్ల విదేశీయుల అక్కడ నివసించేందుకు నిర్వాసితులు మొగ్గు చూపిస్తున్నారని ఫెరారో తెలిపారు. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెనకబడడానికి డాలర్‌తో పోటీ పడలేకపోవడమే కారణంగా చెప్పవచ్చు.ఆస్ట్రేలియా ప్రధాన నగరం సిడ్ని 50వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే మొంబై 67వ స్థానంలో నిలవగా న్యూఢిల్లీ 118 వ స్థానంలో నిలిచింది. తక్కువ ఖరీదైన నగరాల జాబితాల్లో ట్యునీషియా ప్రాంతానికి చెందిన ట్యునీస్ నిలవగా ,ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్, పాకిస్తాన్‌కి చెందిన కరాచీ తరువాత స్థానాల్లో నిలిచాయి. -
బ్రిటన్ ప్రధాని రేసులో ఎనిమిది మంది!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ప్రధాని పదవికోసం చాలా మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతానని తేల్చడంతో.. మే నుంచి అధికార పగ్గాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. బ్రిటన్ ప్రధాని పదవి కోసం దాదాపు ఎనిమిది మంది నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో బ్రెగ్జిట్‌ను సమర్ధించే బోరిస్ జాన్సన్‌తో ముందంజలో ఉన్నారు. గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బోరిస్ జాన్సన్ ఈ బరిలో ముందున్నా మరో ఏడుగురు రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో జరుపనున్న మూడురోజుల అధికార పర్యటన ముగిసిన తర్వాత జూన్ 7న ప్రధాని పదవి నుంచి వైదొలుగుతానని థెరెసా మే ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ నాయకుల్లో బోరిస్ జాన్సన్, బ్రిటన్ పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్, బ్రెగ్జిట్ మాజీ మంత్రి డొమినిక్ రాబ్, బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) మాజీ నేత ఆండ్రియా లీడ్సమ్, విదేశాంగ శాఖ మంత్రి జెరేమీ హంట్, అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రి రోరీ స్టీవర్ట్, ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హంకాక్, ప్రజా పనులు, పెన్షన్ల శాఖ మాజీ మంత్రి ఎస్థర్ మెక్వే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. -
బ్రిటన్ ప్రధాని రాజీనామా
లండన్: కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే శుక్రవారం ప్రకటించారు. జూన్ 7న తాను పదవి నుంచి వైదొలగుతాననీ, తమ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానన్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి తమ సొంత పార్టీ ఎంపీల నుంచే తాను మద్దతు కూడగట్టలేకపోయాననీ, దేశ ప్రయోజనాల కోసం పదవి నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూన్ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్ పార్టీలో మొదలవుతుందని చెప్పారు. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. ‘నా జీవితకాలంలో నాకు దక్కిన గొప్ప గౌరవం ఈ పదవి. త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నాను. నేను ప్రేమించే ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత చూపుతూ పదవికి రాజీనామా చేస్తున్నాను తప్ప ఏ రకమైన దురుద్దేశంతో కాదు’ అని మే వెల్లడించారు. తన రాజీనామా విషయాన్ని రాణి ఎలిజబెత్–2కి ఇప్పటికే తెలియజేశాననీ, జూన్ 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని మే తెలిపారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్ మాట్లాడుతూ మే ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నారనీ, ఆమెతోపాటు ఆమె పార్టీకి కూడా దేశాన్ని పాలించే బలం లేదని అన్నారు. కాగా, తదుపరి ప్రధాని రేసులో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ముందంజలో ఉన్నారు. -
బ్రెగ్జిట్ వైఫల్యం : థెరిసా మే రాజీనామా
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మే సంచలన నిర్ణయం. జూన్ 7 శుక్రవారం నాడు తాను రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశంకోసం నిబద్ధతతో పనిచేశానని ఇందుకు తాను గర్వపడుతున్నానన్నారు. జూన్ 7న కన్జర్వేటివ్ పార్టీ నేతగా రాజీనామా చేయనున్నానని, కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ ఆ తరువాతి వారం మొదలుకానుందని పేర్కొన్నారు. అప్పటివరకు తాను ప్రధానిగా కొనసాగుతానని తెలిపారు బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలు, ఆందోళనలు, బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం, బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒత్తిడికి తలవొంచిన మే చివరకు రాజీనామా బాట పట్టారు. ‘‘రెండవ మహిళా ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించడం నా అదృష్టం. కానీ ఖచ్చితంగా ఇది చివరిది కాదు." అని మే వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ‘కాంప్రమైజ్ ఈజ్ నాట్ ఏ డర్టీ వర్డ్’ నికోలస్ వింటన్ కోట్‌ను ఆమె ఉటంకించారు. -
ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్ ప్రధాని
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగే విషయమై ప్రధాని థెరెసా మే మంగళవారం పార్లమెంటులో నూతన బ్రెగ్జిట్ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిపై అవసరమైతే రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలన్న అంశాన్నీ పొందుపరిచారు. ప్రతిపక్షాలు కోరుతున్న డిమాండ్లకు చోటు కల్పించారు. బిల్లులో కార్మికులు, దేశ రక్షణ, పర్యావరణం, వలసలకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈయూ నుంచి వైదొలగాలన్న తమ నిర్ణయానికి చివరి అవకాశం ఇవ్వాలని బ్రిటన్ ఎంపీలను థెరిసా కోరారు. ప్రజల నిర్ణయం కొరకు అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడదామని, దీనికి సంబందించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈయూ నుంచి బయటకు రావాలంటూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు పలుమార్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆమె సొంత పార్టీ సభ్యులే ఓటింగ్‌లో ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది.మరోవైపు ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై పార్లమెంట్లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ నుంచి వైదొలగాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. -
బ్రెగ్జిట్‌పై ఓ ఒప్పందానికి వద్దాం: థెరిసా మే
లండన్: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు అధికార కన్జర్వేటివ్ ప్రభుత్వం, విపక్ష లేబర్ పార్టీ ఒక రాజీ బ్రెగ్జిట్ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఆదివారం పార్టీ పత్రిక మెయిల్ ఆన్ సండేలో ఆమె ఈ మేరకు రాశారు. ‘ఓ ఒప్పందానికి వద్దాం’అని లేబర్ పార్టీ నేత జెర్మయి కార్బైన్‌ను ఉద్దేశించి ఆమె పిలుపునిచ్చారు. పార్టీల రాజీ అవకాశంపై అధికార పార్టీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. చివరకు మే కూడా తాను కూడా అలా కోరుకోవడం లేదన్నారు. ‘కానీ సంక్షోభాన్ని సడలించే మార్గాన్ని కనుక్కోవాల్సి ఉంది. అంతేకాదు స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా దాని అత్యవసరతను పేర్కొంటున్నాయి..’అని బ్రిటన్ ప్రధాని లేఖ రాశారు. -
బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31 వరకు పెంపు
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ గడువు మరోసారి పెరిగింది. బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది. ఈ గడువులోగా బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని థెరెసా మేకు సూచించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో గురువారం సమావేశమైన 28 ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల మేరకు వచ్చే నెల 23న జరిగే ఈయూ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్క్లౌడే జంకర్ తెలిపారు. -
బ్రిటన్ను వణికిస్తున్న ‘బ్రెగ్జిట్’
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం శరాఘాతమవుతుం దని, ‘ముందు నుయ్యి... వెనక గొయ్యి’ చందంగా మారుతుందని బ్రిటన్‌కు ఆలస్యంగా అర్ధ మైంది. మూడేళ్లనాడు ఈయూ నుంచి బయటకు రావాల్సిందేనని ఒక రెఫరెండంలో బ్రిటన్ పౌరులు తేల్చి చెప్పిన నాటినుంచి ఆ దేశాన్ని కష్టాలు వెన్నాడుతున్నాయి. మరో అయిదు రోజుల్లో నిష్క్రమించక తప్పని ఈ స్థితిలో కూడా ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో ప్రధాని థెరిస్సా మే పడ్డారు. రెండేళ్లపాటు ఆమె ఈయూ పెద్దలతో బ్రెగ్జిట్‌పై చర్చలు సాగించారు. నిరుడు నవంబర్‌లో ముసాయిదాఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. తీరా దాన్ని ఆమోదించడం కోసం పార్లమెంటులో ప్రవేశపెడితే విపక్ష లేబర్ పార్టీ నుంచి మాత్రమే కాదు...స్వపక్షమైన కన్సర్వేటివ్ పార్టీ నుంచి, ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్ పార్టీ డీయూపీ నుంచి కూడా దానిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పర్యవసానంగా ఆ ముసాయిదా ఒప్పందం పార్లమెంటులో ఒకసారి కాదు... మూడుసార్లు వీగిపోయింది. జనవరి 15న తొలిసారి ఒప్పందాన్ని పార్లమెంటు కాదన్నాక, థెరిస్సా మే మరోసారి ఈయూ పెద్దల్ని కలిశారు. ఒప్పం దంలో మరికొన్ని మార్పులకు వారిని అంగీకరింపజేశారు. అయినప్పటికీ మార్చిలో రెండు సార్లు(12, 29 తేదీల్లో) కూడా ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటులో చుక్కెదురైంది. ఈయూ భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నందువల్ల అందుకు పరిహారంగా బ్రిటన్ 3,900 కోట్ల పౌండ్లు చెల్లించాలని ముసాయిదా నిర్దేశిస్తోంది. దీంతోపాటు బ్రిటన్‌లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండ్‌లో ప్రస్తుతానికి ఈయూ నిబంధనలే వర్తించాలని అది కోరుతోంది. ప్రధానంగా ఈ రెండు అంశాలనూ అటు లేబర్ పార్టీ, ఇటు కన్సర్వేటివ్ పార్టీలోని అత్యధికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 2016 జనవరిలో బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరిగినప్పుడు బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ ఈయూ నుంచి వైదొలగాలని ఓటేస్తే... ఉత్తర ఐర్లాండ్ పౌరులు మాత్రం ఈయూకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ కారణంవల్లే ఆ ప్రాంతంలో సరుకు రవాణాకు చెక్‌పోస్టులు పెట్టరాదని ఈయూ స్పష్టం చేస్తోంది. ఇది బ్రిటన్‌లో అత్యధికులకు రుచించడం లేదు. ఈ ఏర్పాటు తాత్కాలికమేనని చెబుతున్నా... బ్రిటన్‌లో భాగమైన ప్రాంతాన్ని స్వల్పకాలానికైతే మాత్రం ఈయూ పరిధికి తీసు కెళ్లడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏమైతేనేం, ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. అటు పార్లమెంటును ఒప్పించి ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించమని కోర డమా... ఇటు ఈయూకు నచ్చజెప్పి ఈ నెల 12న ముగుస్తున్న గడువును మరికొంతకాలం పొడిగిం చమని ప్రాథేయపడటమా అన్నది థెరిస్సా మే ముందున్న ప్రశ్నలు. జూన్ 30 వరకూ గడువు పొడిగించమని యూరప్ మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌కు ఆమె లేఖ రాశారు. ఈ గడువును వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించడానికి ఈయూ కూడా సిద్ధంగానే ఉంది. కానీ అందుకోసం బ్రిటన్ వచ్చే నెలలో జరగబోయే ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనవలసి వస్తుంది. ఎటూ విడిపోదల్చుకున్నప్పుడు ఈ ఎన్నికలు వృథా అని కన్సర్వేటివ్లలో అత్యధికులు వాదిస్తున్నారు. అందుకే ఆమె జూన్ 30 గడువు సరిపోతుందని కోరారు. కానీ ఈసారి ఈయూ అందుకు సిద్ధపడేలా లేదు. సమస్య మీ దగ్గరుంటే పరిష్కారం కోసం మాపై ఒత్తిడి తెస్తారేమిటన్న ఈయూ సారథుల ప్రశ్న సహేతుకమైనది. వచ్చే బుధవారం జరగబోయే ఈయూ సమావేశంలో థెరిస్సా వినతికి సానుకూలత వ్యక్తం కాకపోవచ్చు. బ్రెగ్జిట్ ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని థెరిస్సా అనుకుని ఉండరు. విపక్ష లేబర్ పార్టీ నాయకుడు కోర్బిన్‌తో ఆమె బుధవారం సమావేశం కాబోతున్నారు. అది సానుకూల ఫలితం ఇస్తుందన్న గ్యారెంటీ లేదు. లేబర్ పార్టీలో కోర్బిన్ వ్యతిరేకులు అదును కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. పార్లమెంటులో ముసాయిదా ఒప్పందాన్ని గట్టెక్కిస్తానని థెరిస్సాకు ఆయన మాటిచ్చిన మరుక్షణం ఆ పార్టీలో ముసలం పుట్టే ప్రమాదం ఉంది. ఆ అవగాహనపై రిఫరెండమైనా నిర్వహిం చాలి లేక ప్రస్తుత పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నది వారి డిమాండు. సంక్షోభం తలెత్తినప్పుడు దాని మూలాలు ఎక్కడున్నాయో, అందుకు గల కారణాలేమిటో చిత్తశుద్ధితో తెలుసు కుంటే పరిష్కారం సులభమవుతుంది. కానీ ఆ పని ఎవరూ చేయలేకపోయారు. రోగం ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్టు ఈయూ నుంచి వెలుపలకి రావడమే పరిష్కారమని మితవాదులు ప్రచారం చేయడం, అందుకు ప్రధాన పార్టీలు రెండూ అనాలోచితంగా మద్దతు పలకడంతో సమస్య జటిలంగా మారింది. బ్రిటన్ పదే పదే బ్రెగ్జిట్ గడువు పొడిగించమని కోరడం, అందుకు ఈయూ సిద్ధపడటం సభ్య దేశాలకు రుచించడం లేదు. ముఖ్యంగా ఫ్రాన్స్ ఈ విషయంలో పట్టుదలగా ఉంది. బ్రెగ్జిట్‌ను పొడిగించుకుంటూపోతే అటు బ్రిటన్, ఇటు ఈయూ అనిశ్చితిలో పడ తాయని అది హెచ్చరిస్తోంది. ఇందులో నిజం లేకపోలేదు. ఈయూ నుంచి ఎవరైనా నిష్క్రమిస్తే అనుసరించవలసిన విధివిధానాలేమిటో నిర్దేశిస్తున్న 50వ అధికరణ పర్యవసానాలేమిటో వాస్త వంగా ఎవరికీ తెలియదు. ఇంతవరకూ ఎవరూ సంస్థను విడిచిపెట్టకపోవడమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా మితవాదులు, ఛాందసవాదులు బలపడుతున్న దశలో బ్రిటన్‌లో యూకే ఇండిపెండెంట్స్ పార్టీ(యూకే ఐపీ) ఈయూ నుంచి బయటకు రావాలన్న నినాదం అందుకుంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇదే పరిష్కారమని అది మొదలెట్టిన ఉద్యమం ఊపం దుకోవడం చూసి తాము సైతం దానికి వ్యతిరేకం కాదని అప్పటి లేబర్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. అది దేశాన్ని ఈ దుస్థితికి నెడుతుందని అప్పట్లో వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఏదేమైనా బ్రిటన్ సంక్షోభం నాలుగురోజుల్లో ఒక కొలిక్కి వస్తుందా లేక ఎప్పటిలా మరో వాయిదాలోకి జారుకుంటుందా అన్నది చూడాలి. -
ఒడిదుడుకుల వారం..!
ముంబై: మార్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయినందున రుణ మార్కెట్ల నుండి ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇదే సమయంలో రిడెంప్షన్ ఒత్తిడికి ఆస్కారం ఉండడం వల్ల దేశీ సంస్థలు (డీఐఐ)లు కూడా భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘కొంత దిద్దుబాటు జరిగిన తరువాత నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ సంకేతాలు కూడా పురోగతికి ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు లార్జ్‌క్యాప్ ఇండీసెస్ను అవుట్పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచన’ అని ఎడిల్వీస్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం (29న) విడుదల కానుండగా.. విదేశీ రుణ గణాంకాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇవి ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా నిఫ్టీ 11,380 వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. ఇక్కడ కీలక మద్దతు లభించకపోతే మరింత దిద్దుబాటుకు ఆస్కారం ఉందన్నారు. మార్కెట్ పెరిగితే 11,572 కీలక నిరోధంగా పనిచేయనుందని విశ్లేషించారు. అమెరికా–చైనాలు బీజింగ్‌లో భేటీ: వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య గురువారం బీజింగ్‌లో ఇరుదేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు పునర్ప్రారంభంకానున్నాయి. ఇక్కడ నుంచి వెలువడే కీలక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆలస్యం అవుతున్న ఈ అంశం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూలత చూపుతుందన్నారు. ఈసారి ఏమైనా పురోగతి ఉంటే మాత్రం సూచీలకు సానుకూలం అవుతుందన్నారాయన. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని రాయిటర్స్ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ తిరస్కరణకు గురైన బ్రెగ్జిట్ ఒప్పందంపై త్వరలోనే మరోసారి ఓటింగ్ ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బ్రెగ్జిట్ అంశంపై కొత్త ప్రజాభిప్రాయ సేకరణను డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో దాదాపు 10లక్షల మంది పౌరులు మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై సైతం ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈనెల 14–15న జరిగిన పాలసీ మీటింగ్‌కు సంబంధించిన తన బోర్డ్ సభ్యుల అభిప్రాయ సారాంశాన్ని సోమవారం ప్రకటించనుంది. రూపాయికి 68.30 వద్ద మద్దతు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పతనమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే ఆందోళనలు, తగ్గిన డిమాండ్ నేపథ్యంలో ముడిచమురు ధరలు దిగివచ్చి డాలరుతో రూపాయి మారకం విలువకు బలాన్నిచేకూర్చాయి. వరుసగా ఆరోవారంలోనూ బలపడిన రూపాయి.. గతవారంలో 15 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. రూపాయికి కీలక నిరోధం 69.50 వద్ద ఉండగా, సమీపకాల మద్దతు 68.30 వద్ద ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా అన్నారు. విదేశీ నిధుల వెల్లువ.. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మార్చి 1–22 కాలంలో వీరు ఏకంగా రూ.38,211 కోట్ల పెట్టుబడులను పెట్టారు. రూ.27,424 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.10,787 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. సాధారణ ఎన్నికల్లో సానుకూలత ఉండవచ్చనే ప్రధాన అంశం కారణంగా వీరి పెట్టుబడి గణనీయంగా పెరిగిందని వినోద్ నాయర్ అన్నారు. ఇక నుంచి నిధుల ప్రవాహం ఏవిధంగా ఉండనుంది.. రూపాయి కదలికల ఆధారంగా మార్కెట్ గమనం ఉండనుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్ విశ్లేషించారు. -
బ్రెగ్జిట్ అనిశ్చితి.. మే రాజీనామాకు ఒత్తిడి
లండన్: బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై వచ్చే వారం పార్లమెంట్లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దిగిపోవాలంటూ మే ను హెచ్చరించాలని వారు భావిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. అలా జరిగితే, ఆమె స్థానంలో డిప్యూటీ ప్రధానిగా ఉన్న డేవిడ్ లిడింగ్టన్ ఆపద్ధర్మ ప్రధానిగా అవుతారని పేర్కొన్నాయి. -
బ్రెగ్జిట్‌కు జూన్ 30 దాకా గడువివ్వండి
లండన్: యురోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని బ్రిటన్ ఈయూ నాయకులను కోరింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు లేఖ రాసినట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం పార్లమెంట్లో చెప్పారు. జూన్ 30కి మించి గడువు కోరుకోవడం లేదని, అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, గురువారం, శుక్రవారం బ్రసెల్స్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ సభ్య దేశాలు బ్రిటన్ వినతిపై ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. -
ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత
పారిస్: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార– అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత తగ్గించినట్టయింది. ‘‘విధానపరమైన అధిక అనిశ్చితి, కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వ్యాపార, వినియోగ విశ్వాసం మరింత క్షీణించడం అనేవి వృద్ధి తగ్గుదలకు దారితీస్తాయి’’ అని ఓఈసీడీ తన మధ్యంతర ఆర్థిక నివేదికలో వివరించింది. జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా సవరించింది. 19 దేశాల యూరో జోన్ వృద్ధి అంచనాలు ఏకంగా 1.8% నుంచి 1%కి తగ్గిపోయాయి. జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7%కి తగ్గగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్ 0.2 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య మందగమనంతో ఈ రెండు దేశాలకు ఎక్కువ అవినాభావ సంబంధం కలిగి ఉండడమే వీటి వృద్ధి అంచనాల్లో భారీ కోతకు కారణమని ఓఈసీడీ వివరించింది. బ్రిటన్ అంచనాలూ తగ్గింపు అలాగే, బ్రెగ్జిట్ సహా యూరోప్‌లో విధానపరమైన అనిశ్చితి ఎక్కువగా ఉందని తెలిపింది. అసంబద్ధంగా యూరోప్ నుంచి బ్రిటన్ వైదొలిగితే యూరోపియన్ ఆర్థిక వ్యవస్థల వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.4%నుంచి 0.8%కి సవరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 2009 తర్వాత ఇటలీ వృద్ధి అంచనాలు ఒక శాతం లోపునకు రావడం ఇదే ప్రథమం. అయితే, బ్రెగ్జిట్ (బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం) ప్రక్రియ సాఫీగా సాగిపోవడం ఆధారంగానే ఈ మాత్రం వృద్ధి అంచనా వేసినట్టు ఓఈసీడీ తెలిపింది. అమెరికా, చైనా గతేడాది విధించుకున్న వాణిజ్య నియంత్రణలు... వృద్ధి, పెట్టుబడులు, జీవన ప్రమాణాలను పడదోస్తాయని వ్యాఖ్యానించింది. -
బ్రిటన్ లేబర్ పార్టీలో చీలిక
లండన్: బ్రెగ్జిట్, యూదు వ్యతిరేక వాదం అంశాలపై బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ అనురిస్తున్న విధానాలకు నిరసనగా ఏడుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. లేబర్ పార్టీకి రాజీనామా చేశామనీ, పార్లమెంటులో ఓ ప్రత్యేక స్వతంత్ర బృందంగా తాము వ్యవహరిస్తామని ఏడుగురు ఎంపీలు చెప్పారు. ఎంపీలు చుకా ఉమున్నా, లూసియానా బర్జర్, క్రిస్ లెస్లీ, ఎంజెలా స్మిత్, మైక్ గేప్స్, గావిన్ షుకర్, అన్నే కోఫీ మీడియాతో ఈ విషయం చెప్పారు. యూదులపై మత విద్వేషం, వారిని గేలి చేయడం, భయపెట్టడం వంటివి భరించలేక, బ్రెగ్జిట్‌పై పార్టీ వైఖరి నచ్చక తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని బర్జర్ తెలిపారు. తమకు సొంత పార్టీ పెట్టే ఆలోచనేదీ లేదన్నారు. కాగా, 1981లో నలుగురు లేబర్ పార్టీలో ప్రధాన నేతలు పార్టీ నుంచి బయటకొచ్చి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత లేబర్ పార్టీలో వచ్చిన అతి పెద్ద చీలిక ఇదే కావడం గమనార్హం. ఫేస్బుక్.. ఓ డిజిటల్ గ్యాంగ్‌స్టర్ నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం నియంత్రణలో ఫేస్బుక్ వ్యవహారశైలిపై బ్రిటన్ పార్లమెంటు కమిటీ మండిపడింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ను ‘డిజిటల్ గ్యాంగ్‌స్టర్’గా కమిటీ అభివర్ణించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో ఏర్పాటైన హౌస్ ఆఫ్ కామన్స్ డిజిటల్ కల్చర్, మీడియా, స్పోర్ట్(డీసీఎంఎస్) సెలక్షన్ కమిటీ 18 నెలల విచారణ అనంతరం నివేదికను సమర్పించింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బ్రిటన్ పార్లమెంటు ముందు హాజరుకాకుండా ధిక్కారానికి పాల్పడ్డారని కమిటీ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్బుక్ లాంటి డిజిటల్ గ్యాంగ్ స్టర్లను చట్టానికి అతీతంగా వ్యవహరించేందుకు అనుమతించరాదని అభిప్రాయపడింది. సీఏ మాతృసంస్థ ఎస్సీఎల్, దాని అనుబంధ సంస్థలు భారత్, పాక్, కెన్యా, నైజీరియా ఎన్నికల కోసం నైతికతను ఉల్లంఘించి పనిచేశాయని తెలిపింది. -
థెరెసా మేకు ఊరట
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకు స్వల్ప ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 19 ఓట్ల తేడాతో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఈ అవిశ్వాస పరీక్షను నెగ్గింది. అంతకు ముందు మంగళవారం ఈయూతో బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వంద మందికి పైగా సొంత పార్టీకి చెందిన ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెగ్జిట్ ప్రక్రియ మరో రెండు నెలల గడువే ఉండటంతో.. అవిశ్వాస పరీక్ష నెగ్గిన మే వేగంగా స్పందించారు. మూడు పార్లమెంటు పనిదినాల్లో ప్రత్యామ్నాయ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రతిపక్ష నేతలను థెరెసా మే ఆహ్వానించారు. బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. ఒకవేళ ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
బ్రెగ్జిట్ బిల్లుకు రెడ్ సిగ్నల్
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆధునిక బ్రిటన్ చరిత్రలో ఇటువంటి అపజయం ఏ ప్రధానికీ ఎదురుకాలేదు. రెండేళ్లు చర్చలు జరిపి యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఆమె కుదుర్చుకున్న బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించడం) ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించింది. థెరిసా మే కుదుర్చుకొచ్చిన ఒప్పందంపై సొంతపార్టీ ఎంపీల్లో కూడా తొలి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం తెలిసిందే. ఈ కారణంగా ఇటీవలే ఆమె సొంతపార్టీలోనే అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఒప్పందంపై మంగళవారం బ్రిటన్ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా 202 మంది ఈ ఒప్పందాన్ని సమర్థించగా, 432 మంది వ్యతిరేకించారు. అంటే బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లు 230 ఓట్ల తేడాతో ఓడిపోయింది. వంద మందికి పైగా సొంత పార్టీ ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ్టలోని అవిశ్వాస పరీక్షనే అతి కష్టం మీద గట్టెక్కిన థెరెసా మేకి తాజాగా పార్లమెంటులో మరో కఠిన పరీక్ష ఎదురైంది. ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు దీనిపై ఓటింగ్ జరగనుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమె సొంత పార్టీ ఎంపీలు కూడా తిరస్కరించినప్పటికీ ప్రతిపక్ష లేబర్ పార్టీ దృక్పథాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అవిశ్వాసంలో మే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ మీడియా అంచనా వేస్తోంది. తర్వాత ఏం జరుగుతుంది? బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసేందుకు ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంటులో తిరస్కరణకు గురవడంతో దీనిపై తదుపరి చర్చలు జరిపి తగు మార్పులు చేసేందుకు మే బుధవారం బ్రస్సెల్స్ వెళ్తారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఒప్పందంలో మళ్లీ మార్పులు చేసేందుకు ఈయూ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురవడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఏ ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో వారిని ఒప్పించి, కొన్ని రాయితీలు పొంది, మళ్లీ కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మేకి సవాలే. ఒకవేళ ఆమె గట్టిగా ప్రయత్నించి కొత్త ఒప్పందం చేసుకొచ్చినా దానిపై మళ్లీ పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుంది. దీనిని కూడా పార్లమెంటు తిరస్కరిస్తే మేకి మరో మూడు వారాల సమయం లభిస్తుంది. బ్రెగ్జిట్ బిల్లును పార్లమెంటు ఎప్పటికీ ఆమోదించకపోతే ఇక ఏ ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇంకో రెండు నెలలే మిగిలింది.. బ్రెగ్జిట్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కానుంది. 21 నెలల పాటు ఇది సాగుతుంది. ఆ కాలంలో ఈయూ–బ్రిటన్ల మధ్య వాణిజ్య, పౌర సంబంధాలు ఎలా ఉండాలో తెలిపేదే ఈ బ్రెగ్జిట్ ఒప్పందం. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు థెరెసా మే రెండేళ్లపాటు ఈయూ నేతలతో చర్చలు జరిపారు. మార్చి 29తో బ్రెగ్జిట్ ప్రారంభం కావాల్సి ఉండటంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుని దాన్ని ఆమోదింపజేసుకునేందుకు బ్రిటన్‌కు దాదాపు ఇంకో రెండు నెలల సమయమే మిగిలి ఉంది. కానీ తర్వాత ఏం చేయాలో ఇప్పటికీ బ్రిటన్ నిర్ణయించుకోలేదు. తాను అవిశ్వాసంలో గెలిస్తే ప్రత్యామ్నాయ ప్రణాళికను వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెడతానని మే వెల్లడించారు. మంగళవారం రాత్రి ఆమె మాట్లాడుతూ ‘సభ మాట్లాడింది. ప్రభుత్వం ఆలకించింది. ఏం చేయాలో నిర్ణయించేందుకు అన్ని పార్టీలతోనూ చర్చలు జరుపుతాం. ఎంపీలు తమకు ఏం వద్దో చెప్పారు. కానీ వారికి ఏం కావాలో ఎవరూ చెప్పలేదు. ఈ ఓటింగ్‌తో అది మనకు తెలియదు’అని అన్నారు. ‘అన్ని పార్టీల ఎంపీలను నేను కోరేది ఒక్కటే. బ్రిటిష్ ప్రజల మాట వినండి. ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు. అందుకోసం మా ప్రభుత్వానికి సహకరించండి’అని ఆమె అభ్యర్థించారు. ఇంకా సమయం ఉంది: మెర్కెల్ బెర్లిన్: బ్రెగ్జిట్‌పై చర్చలు జరిపేందుకు ఇంకా సమయం ఉందని జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ అన్నారు. ‘మనకు ఇంకా సమయం ఉంది అయితే బ్రిటిష్ ప్రధాని ఏ ప్రతిపాదన తెస్తారోనని మేం ఎదురుచూస్తున్నాం. ఒప్పందాన్ని బ్రిటిష్ దిగువసభ తిరస్కరించడం పట్ల నేను మిక్కిలి చింతిస్తున్నాను. నష్టాన్ని మేం పరిమితంగా ఉంచాలనుకుంటున్నాం. అందుకే ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలనుకున్నాం. కానీ పద్ధతి లేకుండా అస్తవ్యస్తంగా చేసేందుకు మేం సిద్ధమే. ఇలా అయితే బాగా ఎక్కువ నష్టం జరుగుతుంది’అని ఆమె ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఓటు కోసం కాన్పు వాయిదా గర్భంతో ఉన్న ఓ మహిళా ఎంపీ బ్రెగ్జిట్ బిల్లుపై ఓటు వేసేందుకు తన కాన్పును వాయిదా వేసుకున్నారు. ఆమె బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజీబుర్ రహ్మాన్‌కు మనవరాలు, ఈమె ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాకు దగ్గరి బంధువు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన టులిప్ సిద్దిఖీ అనే మహిళా ఎంపీ ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఫిబ్రవరి 4న సిద్దిఖీకి కాన్పు చేయాలని వైద్యులు అనుకున్నారు. అయితే మధుమేహం రావడంతో గత మంగళవారమే కాన్పు చేయాల ని నిర్ణయించారు. ఓటు వేసేందుకు వెళ్లాలని ఆమె చెప్ప డంతో అందుకు వైద్యులు అనుమతించి, కాన్పును గురువారానికి మార్చారు. ఓడిపోతే మళ్లీ ఎన్నికలేనా? బ్రిటన్ ప్రధాని థెరెసాపై ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలు కానుంది. బ్రిటన్ పార్లమెంటులో అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుండటం గత 26 ఏళ్లలో ఇదే ప్రథమం. బ్రెగ్జిట్ బిల్లు విషయంలో ఓడిపోయినా ఈ పరీక్షలో మే నెగ్గుతారనే అంచనాలున్నాయి. ఒకవేళ ఆమె ఓడిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. స్థిర పదవీకాల పార్లమెంటు చట్టం–2011 ప్రకారం అవిశ్వాసంలో ఓడిపోతే అధికార పార్టీకి రెండు వారాల సమయం లభిస్తుంది. అప్పట్లోపు ప్రభుత్వం మళ్లీ మెజారిటీ సంపాదించుకుని, విశ్వాస తీర్మానం పెట్టి నెగ్గాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ప్రధాన విపక్షమైన లేబర్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తుంది. తగిన బలం సంపాదిస్తే అధికారం వస్తుంది. లేదంటే దిగువ సభ రద్దయ్యి మళ్లీ ఎన్నికలు వస్తాయి. బ్రిటన్‌లో చివరిసారిగా ఇలా 1979లో అవిశ్వాసంలో ప్రభుత్వం ఓడిపోయి ఎన్నికలు వచ్చాయి. వ్యతిరేకత ఎందుకు? ఒప్పందంలోని కొన్ని అంశాలు ఈయూకి అనుకూలంగాను, వివాదాస్పదంగాను ఉన్నాయని ఈ డీల్‌ను విమర్శిస్తున్నవారు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ నియమాలకు కట్టుబడేలా చేయడం ద్వారా ఈ ఒప్పందం దేశాన్ని ఈయూపై ఆధారపడే స్థితికి నెడుతుందని వారు వాదిస్తున్నారు. కాబట్టి ఒప్పందంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈయూ నుంచి కొన్ని రాయితీలు పొందేందుకు థెరిసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒప్పందంలో మార్పులు అంగీకరించబోమని ఈయూ నేతలు ప్రకటించారు. మరోవైపు, బ్రిటన్‌లోని ఈయూ అనుకూల రాజకీయవేత్తలు ఐరోపాతో మరింత దగ్గర ఆర్థిక సంబంధాలుండాలని కోరుతున్నారు. ఈయూలో వుండటం వల్ల సామాజిక భద్రతా హక్కులకు ముప్పు వుండబోదనే అభిప్రాయం వినవస్తోంది. బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరాదని ఈ ఒప్పందంలో పేర్కొనడం కూడా వివాదాస్పదమైంది. థెరిసాపై విమర్శల వెల్లువ ఒప్పందంపై అటు థెరిసా కేబినెట్లోనూ, ఇటు దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలను ఒక్క తాటిపైకి తీసుకురావడానికి బదులు వారి మధ్య చీలికల్ని ఆమె ఇంకాస్త పెద్దవి చేశారని బ్రిటన్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె తన పక్షంతోనే చర్చించడం, భిన్నాభిప్రాయాలు గలవారితో చర్చలు జరపకపోవడం వల్ల పరిస్థితి మరింత గడ్డుగా మారిందంటున్నారు. ఈయూకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇరు శిబిరాల మధ్య దూరాన్ని పెంచాయని, ఈయూలో ఏ ఒక్కరితోనూ ఆమె స్నేహాన్ని పెంపొందించుకోలేకపోయారని విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయవేత్తగా ఆమె ఇరుకు ఆలోచనా ధోరణి, కఠిన వైఖరి దేశానికి చెరుపు చేస్తోందంటున్నారు. ఆర్థిక మాంద్యం తప్పదు ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రిటన్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా ఈయూ నుంచి బయటకు వస్తే – ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాలకు అనుగుణంగా వాణిజ్యం చేయాల్సివుంటుంది. ఒప్పందం కుదరకపోతే బ్రిటన్‌కు మంచిదేనని, ఆ విధంగా ఈయూ నియమాల నుంచి విముక్తి లభించినట్టవుతుందని, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలవుతుందని మరికొందరి వాదన. ఒప్పందం లేకుంటే నష్టమే.. ఒప్పందం లేకుండా, ఎలాంటి పరివర్తనా వ్యవధి లేకుండా (మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమించాల్సివుంది. తర్వాత 21 మాసాల పరివర్తనా కాలం మొదలవుతుంది) బ్రిటన్ నిష్క్రమించడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రత్యేకించి ఐర్లాండ్ (ఈయూ)లోని పలు రంగాలపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదముంది. తమ దేశంలో ఆహారానికి, మందులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని ఐర్లాండ్ ఆందోళన చెందుతోంది. ఈయూకి బ్రిటన్ చేసే ఎగుమతుల్లో ఐర్లాండ్ వాటా 12.4 శాతం. పెట్రోలియం, మందుల కోసం ఐర్లాండ్ భారీ ఎత్తున యూకేపై ఆధారపడుతోంది. ఒప్పందంలోని ముఖ్యాంశాలు 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ – యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ఈ కాలంలో ఈయూ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు యూకే కట్టుబడి వుండాలి. యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఈసీజే) పరిధిలోనే కొనసాగాలి. అవసరమనుకుంటే, జాయింట్ కమిటీ 2020 జూలె ఒకటిలోగా పరివర్తనా కాలాన్ని పొడిగించవచ్చు. ఎంతకాలం పొడిగిస్తారనే విషయమై స్పష్టత లేదు. ఆర్థిక లావాదేవీలు పరిష్కరించుకోవడంలో భాగంగా.. విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5,100 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాల్సివుంటుంది. పలువురు రాజకీయ వేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది. బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో బాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. -
థెరెసా మేకి మరో ఎదురుదెబ్బ
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మేకి బుధవారం మరో ప్రధాన పార్లమెంటరీ అపజయం ఎదురైంది. ఒప్పందమేదీ లేకుండా బ్రెగ్జిట్ అయ్యేందుకు ఒప్పుకోడానికి నిరాకరిస్తూ, మేకి వ్యతిరేకంగా మంగళవారమే ఎంపీలు ఓటు వేయడం తెలిసిందే. అది జరిగి 24 గంటలు గడవక ముందే పార్లమెంటులో ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకవేళ ప్రస్తుతం మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించకపోతే, ఆ తర్వాత మూడు రోజుల్లోపే మరో ప్రత్యామ్నాయ ఒప్పందాన్ని ఆమె తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సవరణను 20 మంది ఎంపీలు బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టగా, 308 మంది అనుకూలంగా, 297 మంది వ్యతిరేకంగా ఓటేశారు. -
బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ఓకే
లండన్/బ్రస్సెల్స్: బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆదివారం ఈయూ నేతలు ఆమోదించారు. బ్రిటన్ మినహా ఈయూలో మిగిలిన మొత్తం 27 దేశాలూ ఈ ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇక డిసెంబర్లో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది అంత సులభమైన విషయంలా కనిపించడం లేదు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం అనంతరం ఈ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా 2019 మార్చి 29కి ముందే పూర్తయ్యి, అప్పటి నుంచి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొత్తానికి 21 నెలలు పడుతుంది. ఒకవేళ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించకపోతే పరిస్థితి దిగజారి, అసలు ఒప్పందమే లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాల్సి రావచ్చు, లేదా కొత్త ఒప్పందం కోసం మళ్లీ చర్చలు జరగొచ్చు. మే ప్రభుత్వం కూలిపోయి బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది. -
బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ర్యాలీ
-
చిందేసిన ప్రధాని.. నెటిజన్ల కుళ్లు జోకులు
బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రెగ్జిట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా దక్షిణాఫ్రికాతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పాఠశాల విద్యార్థులతో సమావేశమైన థెరిసా మే... వారితో కలిసి కాసేపు డాన్స్ చేశారు. విద్యార్థులను అనుకరిస్తూ స్టెప్పులు వేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార శాఖ ట్విటర్లో పోస్ట్ చేసింది. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు... థెరిసా మే డాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. ‘థెరిసా మే డాన్స్ చూస్తుంటే.. ఆమెకు ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లుగా అన్పిస్తోందని’ ఒకరు కామెంట్ చేస్తే.... ‘థెరిసా మే డాన్స్ ఇంత ఘోరంగా ఉంటుందని తెలియదు. అస్సలు చూడలేకపోతున్నానంటూ’ మరొకరు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఓసారి మేబోట్ డాన్స్ చూడండి’ అంటూ థెరిసా మేపై జోకులు పేలుస్తున్నారు. Theresa May dances like she’s had her freedom of movement surgically removedpic.twitter.com/PaiSEtcRE9 — James Felton (@JimMFelton) August 28, 2018 I never knew that seeing Theresa May dance would be so uncomfortable to watch pic.twitter.com/TQmymi6W8q — Ali San (@TheSanPlanet) August 28, 2018 Watching Theresa May dance is one of the cringiest things I’ve ever seen in my life! 😬🤢🤮 pic.twitter.com/3bESRnXZPf — Alex (@AlexKyri_) August 29, 2018 -
మొట్టమొదటిసారి పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులు
గత దశాబ్దకాలంలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ వైపు బ్రెగ్జిట్ చర్చలు, మరోవైపు అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, దాని ప్రతీకారంగా ఇతర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొడుతున్నాయి. బ్రెగ్జిట్ చర్చలతో వ్యాపార మార్కెట్లో అస్థిరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అస్థిరత ఇంకా కొనసాగుతూ ఉండగానే... అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌లను తీవ్రంగా నిరసిస్తూ.. ఇతర దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం సన్నగిల్లుతోందని ప్రపంచ నేతలు అంటున్నారు. తాజాగా కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో కూడా అంతర్జాతీయ ప్రతినిధులు ఇదే విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల అధినేతలందరూ తమ తమ ఆందోళనను వెల్లబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల జాబితా కూడా మారిపోయిందని తెలిసింది. అసలు 2017లో టాప్ ఎగుమతిదారులుగా ఉన్న దేశాలేమిటో ఓ సారి చూద్దాం.. ఏడాదికి 2.26 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో 2017లో చైనా ఆధిపత్య స్థానంలో ఉంది. ఆ అనంతరం జర్మనీ భారీ మొత్తంలో ఆటోమొబైల్స్‌ను ఎగుమతి చేసి.. ప్రతేడాది 1.45 ట్రిలియన్ డాలర్లను ఆర్జించింది. అంటే ఒక్కో వ్యక్తికి 18వేల డాలర్లు వచ్చాయన్న మాట. అయితే అమెరికా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం ఎగుమతుల్లో జర్మనీ కంటే తక్కువ స్థాయిల్లోనే ఉన్నట్టు వెల్లడైంది. 2017లో అమెరికా 1.55 ట్రిలియన్ డాలర్ల ఎగుమతలు చేపట్టింది. అంటే ఒక్కో వ్యక్తికి 4,800 డాలర్లు మాత్రమే ఆర్జించింది. -
2018లో మారనున్న ప్రపంచ తలరాత
బల్గేరియా : 2018లో ప్రపంచ దశ దిశను మార్చే సంఘటనలు జరగనున్నాయా?. ఇందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం వంగా బాబా. 2018లో అమెరికా ఆర్ధిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని ఆమె పేర్కొన్నట్లు బల్గేరియాకు చెందిన సూపర్ నేచురలిస్టులు పేర్కొన్నారు. వంగా బాబా ఓ మహిళ. పుట్టుకతోనే ఆమె అంధురాలు. 85 ఏళ్ల వయసు(1996)లో ఆమె మరణించారు. చనిపోయేముందు 51వ శతాబ్దం వరకూ భూమి భవిష్యత్ ఎలా ఉండబోతోందో చెప్పారు. 51వ శతాబ్దం తర్వాత భూమి అంతం అవుతుందని పేర్కొన్నారు. 2028వ సంవత్సరానికి ప్రపంచంలో ఆకలి కేకలు కనిపించవని చెప్పారు. వంగా బాబా చెప్పిన కొన్ని సంఘటనలు ఇప్పటికే జరిగి ప్రపంచ దశ దిశలను మార్చివేశాయి. ఐసిస్ ఉద్భవించడం, అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి, యూరప్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకోవడం లాంటి సంఘటనలను వంగా బాబా 1996లోనే చెప్పారట. మరికొద్ది రోజుల్లో రానున్న నూతన సంవత్సరం 2018లో రెండు ప్రముఖ సంఘటనలు చోటు చేసుకుంటాయని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్లు చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టి చైనా అగ్రరాజ్య హోదాను దక్కించుకుంటుంది వీనస్ గ్రహంపై పరిశోధనల్లో కొత్త శక్తిని శాస్త్రవేత్తలు కనుగొంటారు 1970 దశకంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా 4.1 శాతం. 2015కల్లా ఈ వాటా శాతం 15.6కు పెరిగింది. 2015లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 16.7. 2025 కల్లా అమెరికా వాటా 14.9కి పడిపోతుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. అయితే, వీనస్ గ్రహంపైకి ప్రత్యేక మిషన్‌తో వెళ్తున్న ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఏవీ లేవు. 2256వ ఏడాదిలో మనుషులు అంగారకుడిపై కాలనీలు నిర్మించుకుంటారని వంగా బాబా చెప్పినట్లు బల్గేరియన్ జోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడే అణు ఆయుధాలను ఉత్పత్తి కూడా చేస్తారని వెల్లడించారు. 2341వ సంవత్సరంలో భూమిపై నివసించడం మనిషి కష్టసాధ్యం అవుతుందని పేర్కొన్నారు. -
క్రిస్మస్ గిఫ్ట్ : కొత్త రంగుల్లో పాస్‌పోర్టు
లండన్ : బ్రిటన్ ప్రభుత్వం తన దేశీయులకు క్రిస్మస్ గిఫ్ట్ అందించింది. కొత్త రంగుల్లో పాస్‌పోర్టును అందించనున్నట్టు ప్రకటించింది. 2019లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత నీలం, బంగారపు రంగుల డిజైన్‌లో పాస్‌పోర్టు అందించనున్నామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. తమ జాతీయ గుర్తింపును పునరుద్ధరించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బుర్గండి రంగు ట్రావెల్ డాక్యుమెంట్‌ను తీసివేయనున్నామని చెప్పింది. యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా వాడే ఈ ట్రావెల్ డాక్యుమెంట్‌ను బ్రెగ్జిట్ నేపథ్యంలో తొలగించనున్నట్టు తెలిసింది. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడం... తమ జాతీయ గుర్తింపును పునరుద్ధరించుకోవడానికి ఓ ప్రత్యేక అవకాశమని ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ బ్రాండన్ లెవిస్ చెప్పారు. ప్రపంచంలో తమకోసం ఓ కొత్త మార్గాన్ని నియమించకుంటున్నామన్నారు. ఈ కొత్త పాస్‌పోర్టులు దేశంలోనే అత్యంత భద్రతాపరమైన డాక్యుమెంట్లని అభివర్ణించారు. మోసం, ఫోర్జరీల నుంచి కాపాడేందుకు సెక్యురిటీ చర్యలను అప్డేట్ చేస్తూ ఈ పాస్‌పోర్టులను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న పిక్చర్ పేజ్ ఆధారిత పేపర్‌ను, కొత్తదానితో రీప్లేస్ చేయనున్నామని, మంత్రిత్వశాఖ చెప్పింది. కొత్త నీలం, బంగారం డిజైన్ పాస్‌పోర్టు, కొన్ని దశాబ్దాల కింద బ్రిటన్ వాడింది. ప్రస్తుతం 2019 అక్టోబర్ నుంచి వీటిని బ్రిటన్ ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పుడున్న పాస్‌పోర్టును 1988 నుంచి వాడుతున్నారు. -
బ్రెగ్జిట్.. 2020 డిసెంబర్ 31
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై బుధవారం మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. -
బ్రెగ్జిట్: మరో కీలక అడుగు
బ్రసల్స్: యురోపియన్ యూనియన్‌తో బ్రేకప్ చెప్పే ప్రక్రియలో బ్రిటన్ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా జరిగిన బ్రెగ్జిట్ చర్చలు ఫలప్రదమైనట్లు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్ తెలిపారు. ఈ మేరకు చర్చల తొలి దశలో భాగంగా 15పేజీల ఒప్పందంపై జీన్ క్లాడ్, థెరెసా మే సంతకాలు చేశారు. యురోపియన్ యూనియన్ ఒప్పందాలకు బ్రిటన్ అంగీకరించడంతో బ్రెగ్జిట్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. గత వారం రోజులుగా బ్రిటన్ కన్జర్వేటివ్‌లు, యురోపియన్ కమిషన్ నేతల మధ్య చర్చలు జరిగాయి. అధికారికంగా ఆ తెగతెంపుల కోసం ప్రస్తుతం ఈయూతో బ్రిటన్ చర్చలు నిర్వహించింది. దాని కోసం ఈయూ కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులకు బ్రిటన్ తాజాగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రిటన్ ప్రధాని థెరిసా మే... బ్రసల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐర్లాండ్‌తో ఉన్న బోర్డర్ సమస్యపై కీలకమైన ఒప్పందం కుదరడం వల్ల బ్రెగ్జిట్ చీలిక మరో దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్‌తో బోర్డర్ సమస్య ఇక ఉండదని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఈయూ పౌరులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.. తద్వారా 2019లో బ్రెక్సిట్‌కు వీలుగా వచ్చే ఏడాది ప్రారంభంలో మరోసారి చర్చలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందు(బ్రెక్సిట్)కు వీలుగా జరుగుతున్న వెల్లడికావడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. -
ఆమె ఒంటరైపోయారు..! వైరల్ ఫొటో
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఒంటరిగా కూర్చున్న ఫొటో ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన 'బ్రెగ్జిట్ చర్చల్లో' భాగంగా ఆమె ఓ చాంబర్లో ఒంటరిగా కూర్చుని.. ఇతరుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోను ఉపమానంగా వాడుకొని థెరిసా మేపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకొని ఒంటరైపోతున్న వైనానికి ఈ ఫొటో నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెగ్జిట్ చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్చల్లో భాగంగా ఆమె యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌తో చర్చల కోసం గదిలో ఒంటరిగా ఎదురుచూస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది కావడంతో ఈ విషయమై నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మధ్యంతర పార్లమెంటు ఎన్నికలకు వెళ్లి చేజేతులా పార్టీ మెజారిటీ కోల్పోయిన థెరిసా..ఇటు సొంత కన్జర్వెటీవ్ పార్టీలో, అటూ బ్రెగ్జిట్ చర్చల్లోనూ ఒంటరి అయిపోయారు. ఈయూలోని 27 దేశాలు ఒకవైపు మోహరించగా.. బ్రిటన్ మరోపక్షంగా ఆమె బ్రెగ్జిట్ చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీరుపై సెటైర్లు, ఘాటు వ్యాఖ్యలతో ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. 'పూర్ థెరిసా మే' అని కామెంట్లు చేస్తున్నారు. -
ట్రంప్ ఎఫెక్ట్ : అమెరికాపై తగ్గుతున్న మోజు
బెంగళూరు : ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్ వెళ్లేందుకు భారత యువత ఆసక్తిని చూపడం లేదా? వెళ్లినా ఉపయోగం లేదనే భావనలో యువత ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాలో వలస చట్టాలను డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతో ఆయా దేశాలకు వెళ్లేందుకు భారతీయ యువత కొద్దిగా జంకుతోంది. ప్రముఖ జాబ్ సైట్ ‘ఇండీడ్’ ప్రకటించిన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉద్యోగాల కోసం అమెరికా, బ్రిటన్ వెళ్లేవారి శాతం 38-నుంచి 42 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది అంటే 2016 సెప్టెంబర్ నుంచి 2017 అక్టోబర్ వరకూ ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఇదే 2015-16 మధ్యలో ఆయా దేశాలకు వెళ్లేందుకు యువత ఆసక్తిని ప్రదర్శించింది. ఇదిలావుంటే గతంతో పోలిస్తే విదేశీ ఉద్యోగాలపై భారతీయుల్లో ఆసక్తి 5 శాతం మేర తగ్గిందని ఇండీడ్ తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వదేశంలోనే ఉద్యోగాలు చేసుకునేందుకు భారతీయులు ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగావకాశాలు వెతికే వారు 25 శాతం మేర పెరిగాయి. ఇదిలా ఉండగా.. ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు 10 శాతం ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగింది. ఐరోపా దేశాల్లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం వల్ల ఆయా దేశాలపై భారతీయులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతుండడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు భారతీయ యువత ఆసక్తిని చూపడం లేదు. గతంతో పోలిస్తే ఇది 21 శాతానికి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. -
ఓటమికి నాదే కారణం, నన్ను క్షమించండి!
లండన్: గతవారం జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవానికి బాధ్యురాలిని తానేనని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. ఈ ఓటమికి బాధ్యత తనదేనని, ఇందుకు తనను క్షమించాలని ఆమె పార్టీ ఎంపీలను కోరారు. భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నాయకత్వంపై ఎంపీల విశ్వాసాన్ని కూడగట్టేందుకు ఆమె సోమవారం కన్జర్వేటివ్ ఎంపీలతో వెస్ట్ మినిస్టర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత గందరగోళానికి నేనే కారణం. నా వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చల నేపథ్యంలో అనూహ్యంగా ఎన్నికలకు వెళ్లిన థెరిసా మేకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు కాగా, గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైంది. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ, అభిప్రాయాలు వెల్లువడలేదని ఎంపీలు తెలిపారు. మరోసారి ప్రధానిగా థెరిసా మేను కొనసాగించాలని పార్టీలోని ఎక్కువమంది ఎంపీలు కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమెను మార్చాలంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. థెరిసా మేను తొలగిస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. థెరిసా మేను ప్రధానిగా కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించే అవకాశముందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరముందని భావిస్తున్నారు. చదవండి:‘థెరిసా మే’ను తప్పిస్తారా? -
‘థెరిసా మే’ను తప్పిస్తారా?
భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 650 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు గెలవాలి. కానీ గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమె నాయకత్వ సామాజిక మాధ్యమాల ద్వారా ఈమేరకు ప్రచారం చేస్తున్నారు. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రభావంతమైన టాబ్లాయిడ్లలోనూ ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. కొందరు ఎంపీలతో మంతనాలు సాగిస్తూ లాబీయింగ్ సైతం చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద థెరిసా మే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగి ఈయూతో ఒప్పందం కుదిరేదాకా... థెరిసా మేను కొనసాగించాలని కన్జర్వేటివ్ పార్టీలోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. ఆరునెలలు సమయమిచ్చి... బ్రెగ్జిట్ కొలిక్కి వచ్చాక క్రిస్మస్ అనంతరం కొత్త నాయకుడిని ఎన్నుకోవడం మంచిదనేది వారి అభిప్రాయం. అవతలివైపు లేబర్ పార్టీ బలపడుతుండటం (గత ఎన్నికలతో పోలిస్తే గురువారం లేబర్ పార్టీ 29 స్థానాలు అధికంగా నెగ్గింది. ఆ పార్టీ బలం 261కి చేరింది) కూడా కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు థెరిసా మే నాయకత్వాన్ని సవాల్ చేసి... అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వాన్ని నడపలేక చివరకు లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రానివ్వకూడదనేది వీరి వాదన. నాయకులను అనూహ్యంగా సాగనంపుతుందనే పేరు కన్జర్వేటివ్ పార్టీకి ఉంది. కాబట్టి పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. ప్రధాని పదవికి పోటీపడే వారిని ఎన్నుకోవడానికి మొదట కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రతి రౌండ్లో పోటీదారులందరిలోకి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని రేసు నుంచి తప్పిస్తారు. ఇలా చివరకు ఇద్దరు మిగిలేదాకా ఎంపీలు ఓటింగ్ చేస్తారు. ఈ ఇద్దరిలో ప్రధాని పదవి ఎవరు చేపట్టాలనే దాన్ని దాదాపు లక్షా యాభై వేల మంది పార్టీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. థెరిసా మేను తప్పించే పరిస్థితి వస్తే రేసులో ముందుండేదెవరు? వారి బలాబలాలేమిటో చూద్దాం. బోరిస్ జాన్సన్ 52 ఏళ్ల జాన్సన్ ‘బ్రెగ్జిట్’’కు అనుకూలంగా నిలబడి పూర్తి శక్తియుక్తులు ఒడ్డిన వాడు. ప్రస్తుతం విదేశాంగ మంత్రి. కన్జర్వేటివ్ ఎంపీల్లో జాన్సన్ నాయకత్వంపై అపనమ్మకం. పార్టీ సిద్ధాంతాలను కూడా కాదనే స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా పరిగణిస్తారు. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారీ లండన్ మాజీ మేయర్. బ్రెగ్జిట్‌లో ఓడిపోయి డేవిడ్ కామెరూన్ రాజీనామా చేశాక... బోరిస్ జాన్సన్యే తదుపరి ప్రధాని అవుతాడని అత్యధికులు విశ్వసించారు. అయితే బ్రెగ్జిట్ సహచరుడు, తనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మైకేల్ గోవ్ అనూహ్యంగా ప్రధాని రేసులోకి రావడంతో జాన్సన్ తాను పోటీ నుంచి తప్పుకున్నాడు. ప్రధానిగా థెరిసా మేను తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో... తాను ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు జాన్సన్ ట్వీట్ చేశారు. ఫిల్ హమండ్ కన్జర్వేటివ్ పార్టీలో బలమైన నాయకుడు. ఆర్థికమంత్రిగా ఉన్న ఈయన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత మేకు వ్యతిరేకంగా గళమెత్తారు. డిప్యూటీ ప్రధానమంత్రిని నియమించాలని, థెరిసాకు సన్నిహితులైన ఇద్దరు మంత్రులను తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు శనివారం రాజీనామా చేయడం పార్టీలో పెరుగుతున్న హమండ్ పలుకుబడికి నిదర్శనంగా భావిస్తున్నారు. బ్రెగ్జిట్‌ను పూర్తిచేసేందుకు కావాల్సిన అనుభవం ఈయనకు ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే థెరిసా మేను ఎన్నికలకు వెళ్లమని ప్రోత్సహించిన వారిలో ఈయన ముఖ్యుడు. అంబర్ రూడ్ హోంశాఖను చూస్తున్న 53 ఏళ్ల అంబర్ రూడ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అంచనా. ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల సందర్భంగా ఈమె తన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. కామెరూన్ రాజీనామా చేశాక ప్రధాని రేసులో థెరిసా మే పేరు పెద్దగా వినపడలేదు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆమె ప్రధాని పదవి చేపట్టారు. నాడు థెరిసా మే ఉన్న స్థానంలో ఇప్పుడు అంబర్ రూడ్ ఉన్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే గురువారం నాటి ఎన్నికల్లో ఆమె అతితక్కువ మెజారిటీ (346 ఓట్లు)తో బయటపడ్డారు. ఇది ఆమెకు ప్రతికూలంగా కావొచ్చు. అలాగే ప్రధాని పదవిని చేపట్టడానికి కావాల్సిన అనుభవం, అర్హత ఆమెకు లేవని కన్జర్వేటివ్ పార్టీలోని ఓ వర్గం వాదన. డేవిడ్ డేవిస్ 2005లో ప్రధాని పదవికి ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా కామెరూన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను చూస్తున్నారు. ప్రధాని పదవికి రేసులో ఉంటానని మద్దతుదారుల ద్వారా ఎంపీలకు సంకేతాలు పంపుతూ లాబీయింగ్ చేస్తున్నారు. -
రసకందాయంలో బ్రెగ్జిట్ భవితవ్యం?
లండన్ : భారీ మెజారిటీ ఆశించి మధ్యంతర ఎన్నికలు జరిపించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే వ్యూహం బెడిసికొట్టింది. ఓట్ల శాతం పెరిగినా ఉన్న మెజారిటీ కోల్పోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రతిపక్షనేత జెరిమీ కార్బిన్ నాయకత్వాన లేబర్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి అనూహ్యంగా బలం పుంజుకుంది. ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంటుతో ఈ ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. తన నేతృత్వంలో కన్సర్వేటివ్ పార్టీ బలం ఏడెనిమిది సీట్లు తగ్గినా థెరిసా పదవికి రాజీనామా చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుకే పట్టుదలతో ఉన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలిగే ప్రక్రియను బ్రిటన్‌కు లాభసాటిగా చేయడానికి తగిన ఒప్పందం చేసుకోవడానికి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలంటూ టోరీ ప్రధాని ప్రజాతీర్పు కోరిన విషయం తెలిసిందే. మరి ఎన్నికల ఫలితాల వల్ల బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఎలా ముందుకు సాగుతాయి? ఒక వేళ కార్బిన్ ప్రధాని అయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఐరోపా, బ్రిటిష్ ప్రజలను వేధిస్తున్నాయి. బ్రిటన్‌కు బ్రెగ్జిట్ గుదిబండేనా? ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడానికి అవసరమైన ఒప్పందంపై చర్చలు అక్కడి రాజకీయ సంక్షోభం కారణంగా ఆలస్యమైతే ఇంగ్లండ్ బాగా నష్టపోతుంది. ఈ విషయాన్నే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ ‘బ్రెగ్జిట్ చర్చలు ఎప్పుడు ఆరంభమౌతాయో తెలియదు. ఎప్పుడు ముగించాలో తెలుసు. సంప్రదింపులు లేకుండా ఒప్పందమే కుదరని పరిస్థితి రాకుండా చేయాల్సింది చేయండి’ అంటూ అధికారం చేపట్టే కొత్త బ్రిటిస్ సర్కారుకు హెచ్చరికను ట్విట్టర్ ద్వారా జారీచేశారు. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రభుత్వం కిందటి మార్చిలో 50వ అధికరణను అమలులోకి తేవడంతో చర్చలు సకాలంలో ప్రారంభించి ఈయూతో ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఈ అధికరణ కారణంగా రెండేళ్లలో అంటే 2019 మార్చి ఆఖరుకు బ్రిటన్ ఈయూ నుంచి బయటపడుతుంది. చర్చలు జరిపి ఈలోగా ఒప్పదం చేసుకుంటే లబ్ధిపొందుతుంది. లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఈయూ నుంచి తప్పుకోవాలి. థెరిసాకు ఐరిష్ డీయూపీ తోడైతే కొంత మేలే! బ్రెగ్జిట్‌కు అనుకూలమైన ఉత్తర ఐర్లండ్‌కు చెందిన డెమొక్రాటిక్ యూనియనియనిస్ట్ పార్టీ(డీయూపీ-10 సీట్లు)తో కలిసి కన్సర్వేటివ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయూతో జరిపే చర్చలు కొంత మెరుగైన ఫలితాలు సాధించే వీలుంది. స్కాట్లండ్ స్వాతంత్ర్యమే లక్ష్యంగా పుట్టిన స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎసెన్పీ) బ్రెగ్జిట్ కు వ్యతిరేకం. హంగ్ పార్లమెంటులో 34 సీట్లున్న ఈ పార్టీ మాటనూ వినక తప్పదు. ఇక లేబర్ నేత కార్బిన్ కూడా బెగ్జిట్కు వ్యతిరేకమే. జనాభిప్రాయం వెల్లడయ్యాక ఆయన బ్రెగ్జిట్‌ను అమలు చేస్తాననే చెబుతున్నారు. అధికారంలోకి వస్తే మొదట బ్రెగ్జిట్ పై జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతానని ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ఈయూతో చర్చల సమయంలో బ్రిటిష్ కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలనేదే లేబర్ వాదన. బ్రెగ్జిట్ నుంచి ఇతర అంశాలపై దృష్టి మళ్లినందుకే...! ఇంగ్లండ్‌కు లాభదాయకమైన బ్రెగ్జిట్ కోసం అధిక మెజారిటీ ఇవ్వాలంటూ ప్రజాతీర్పు కోరిన థెరిసా మే ఎన్నికల ప్రచారంలో నెమ్మదిగా ఈ ప్రధానాంశానికి దూరమై ఇతర వివదాస్పద విషయాలను ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఇతరత్రా రంగం మీదకు తేవడంతో ఏప్రిల్ 20 నాటి జనాదరణను కోల్పోయారు. వృద్ధులకు మేలు చేసే ఆరోగ్య పరిరక్షణ పథకాలకు ప్రభుత్వ సహాయం తగ్గించడం, పోలీసు శాఖకు నిధులు, నియామకాల్లో కోత విధించడం వంటి అనేక అంశాలు కన్సర్వేటివ్ పార్టీకి తగిన మెజారిటీ రాకుండా చేశాయి. ఏదేమైనా బ్రెగ్జిట్ పేరిట జరిగిన ఎన్నికలు పాలకపక్షం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం విశేషం. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘దేశ రాజకీయాల్లోకి మళ్లీ నేనొస్తున్నాను..’
లండన్: తాను మరోసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్(63) స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకే తాను తిరిగి దేశీయ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. లేబర్ పార్టీ బాధ్యతలను 1994 నుంచి 2007 వరకు నిర్వహించిన టోనీ.. 1997నుంచి దాదాపు పదేళ్లపాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. అయితే, జూన్ 8న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని చెప్పారు. ప్రజాభీష్టాలకు అనుగుణంగా పనిచేసే ఒక రాజకీయ సంస్థలాంటిదానిని ఏర్పాటుచేసి దాని ద్వారా ప్రజల గొంతును ప్రజల మధ్యే ఉండి వినిపిస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అయితే, తన నిర్ణయం భారీ స్థాయిలో విమర్శలు వస్తాయని కూడా తనకు తెలుసని, అయినా, వాటన్నింటికీ తానే సంపూర్ణ బాధ్యత వహిస్తానని చెప్పారు. టోనీ బ్లేయర్ తాను పదవీ కాలం ముగిసేవరకు కూడా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా సమస్యలపైనే పెద్ద మొత్తంలో పనిచేసిన ఆయన తాజాగా బ్రెగ్జిట్ విషయంలో ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రెగ్జిట్ అనే అంశమే మరోసారి రాజకీయాల్లోకి వచ్చేలా తనను పురికొల్పిందని అన్నారు. ఒక చారిత్రాత్మకమైన ఈ సందర్భంలో తాను మౌనంగా ఉండలేనని, అలా ఉంటే తాను తన దేశ బాగోగుల గురించి పట్టించుకోని వాడినవుతానంటూ వ్యాఖ్యానించారు. -
యూకే లేకుండానే బ్రెగ్జిట్ చర్చలు!
యూకే లేకుండానే యూరోపియన్ యూనియన్ దేశాలు బ్రెగ్జిట్ చర్చలు జరుపబోతున్నాయి. ఈమేరకు ఈయూ సభ్య దేశాలు బ్రుస్సెల్స్ లో సమావేశం కాబోతున్నాయని శనివారం రిపోర్టులు వచ్చాయి. ఈ చర్చలో 27 ఈయూ దేశాలు పాల్గొంటాయని బీబీసీ రిపోర్టు చేసింది. భవిష్యత్తు వాణిజ్య సంబంధాల గురించి ఎలాంటి చర్చలైనా ప్రారంభించబోయే ముందు యూకే లేకుండా తమ పురోగతి గురించి ఓసారి చర్చించాలని ఈయూ నిర్ణయించినట్టు తెలిసింది. జూన్ 8న యూకేలో సాధారణ ఎన్నికల ముగిసే వరకు ఈయూ సైతం లండన్ తో ఎలాంటి అధికారిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. ఈయూలోని 27 దేశాల లీడర్లకు లేఖ రాసిన యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్.. యూకేతో భవిష్యత్తు సంబంధాలు గురించి చర్చించే ముందు ప్రజలు, నగదు, ఐర్లాండ్ విషయంలో ఓ అగ్రిమెంట్ కు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు గురించి చర్చించే ముందు మన గతాన్ని కూడా ఓసారి గుర్తుచేసుకోవాలని టస్క్ ఈయూ సభ్యులకు తెలిపారు. ఈయూ నుంచి యూకే వైదొలిగిన ప్రధాన సమస్యలపై తాము పురోగతి సాధించేంత వరకు యూకేతో భవిష్యత్తు సంబంధాలపై చర్చించేది లేదని తేల్చిచెప్పారు. ఒక్కసారి బ్రెగ్జిట్ చర్చలు ముగిశాక, ఎలాంటి ప్రయోజనాలను ఈయూ సభ్యుల నుంచి యూకే పొందడానికి లేదని జర్మన్ ఆర్థిక మంత్రి వోల్ఫ్‌గ్యాంగ్ స్చ్యూబ్లే చెప్పారు. -
29,100 మద్దతు కోల్పోతే మరింత క్షీణత
మార్కెట్ పంచాంగం బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల తర్వాత ప్రపంచ మార్కెట్లకు మళ్లీ కొత్త సవాళ్లు ఏర్పడ్డాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు, ఫ్రాన్స్ ఎన్నికలు వంటి పరిణామాల్ని ఇప్పటివరకూ మార్కెట్లు పెద్దగా లెక్కచేయడం లేదనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో గతవారం ప్రపంచ ప్రధాన మార్కెట్లలో స్వల్పంగా హెడ్జింగ్ కార్యకలాపాలు మాత్రం జరిగాయి. ఈ హెడ్జింగ్ ఫలితంగా భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లు కాస్త నెమ్మదించాయి. ఇక్కడ కూడా ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల్ని పరిరక్షించుకునే క్రమంలో తాజాగా షార్ట్ పొజిషన్లను బిల్డ్ చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ డేటా సూచిస్తున్నది. గత గురువారం వరకూ 30 పాయింట్ల ప్రీమియంతో వున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ ప్రీమియం శుక్రవారం 10 పాయింట్లకు తగ్గడంతో పాటు దాదాపు 3 శాతం ఓపెన్ ఇంట్రస్ట్ పెరగడం షార్ట్ బిల్డప్‌కు సూచన. సెన్సెక్స్ సాంకేతికాలు ఏప్రిల్ 21తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 29,701 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 29,259 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 96 పాయింట్ల స్వల్పనష్టంతో 29,365 పాయింట్ల వద్ద ముగిసింది. ఫ్రాన్స్ ఎన్నికల ప్రభావంతో ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే సెన్సెక్స్‌కు తొలి మద్దతు 50 రోజుల చలన సగటు (50 డీఎంఏ) రేఖ సంచరిస్తున్న 29,100 పాయింట్ల వద్ద లభించవచ్చు. గ్యాప్‌అప్‌తో మొదలైతే తొలి అవరోధం 29,585 పాయింట్ల వద్ద కలగవచ్చు. 29,100 పాయింట్ల మద్దతును కోల్పోతే 28,950–28,800 శ్రేణి వరకూ పతనం కావొచ్చు. రానున్న రోజుల్లో ఈ శ్రేణిని కూడా వదులుకుంటే క్రమేపీ 28,382 పాయింట్ల వరకూ (గత డిసెంబర్ కనిష్టస్థాయి అయిన 25,754 పాయింట్ల నుంచి 30,007 పాయింట్ల గరిష్టం వరకూ జరిగిన ర్యాలీలో ఇది 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) తగ్గే ప్రమాదం వుంది. తొలి అవరోధస్థాయిని దాటితే సెన్సెక్స్ 29,660–29,840 శ్రేణి వరకూ పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి 30,000 శిఖరాన్ని అధిరోహించాలంటే 29,840 నిరోధస్థాయిని దాటాల్సివుంటుంది. నిఫ్టీ 9,015 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్ కొనసాగింపు... ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 130 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 31 పాయింట్ల తగ్గుదలతో 9,119 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 50 డీఎంఏ రేఖ కదులుతున్న 9,015 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 9,185 పాయింట్ల సమీపంలో నిరోధం ఎదురుకావొచ్చు. 9,015 పాయింట్ల దిగువన ముగిస్తే 8,945–8,890 పాయింట్ల శ్రేణిని పరీక్షించవచ్చు. ఈ శ్రేణిని సైతం నష్టపోతే, రానున్న రోజుల్లో క్రమేపీ 8,747 వరకూ క్షీణించవచ్చు. 9,185 నిరోధస్థాయిని దాటితే 9,200–9,250 పాయింట్ల శ్రేణి మధ్య తిరిగి గట్టి అవరోధం కలగవచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తేనే మళ్లీ కొత్త గరిష్టస్థాయిని నిఫ్టీ అందుకునే అవకాశంవుంటుంది. -
లగ్జరీ, బ్రాండెడ్ కార్లపై భారీగా ధర తగ్గింపు
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి, గతేడాది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ బ్రెగ్జిట్ పరిణామాలు ఆ దేశంలో ఎలా ఉన్నాయో కాని, భారత్‌కు మాత్రం బాగానే ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. బ్రాండెడ్, ఖరీదైన లగ్జరీ కార్లపై భారీగా ధరలు తగ్గాయి. బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక కార్ల దిగ్గజాలన్ని భారత్‌లో భారీగా ధరలు తగ్గించేశాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్, ఫెర్రరి వంటి సంస్థలు తమ కార్లపై ధరలను 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా తగ్గించినట్టు వెల్లడైంది. ఇంత భారీ మొత్తంలో ధరలు తగ్గించడానికి కారణం బ్రెగ్జిట్ నిర్ణయం అనంతరం పౌండ్ విలువ భారీగా పతనం కావడమే. రూపాయితో పోలిస్తే పౌండ్ విలువ ఏడాది వ్యవధిలోనే 20 శాతం దిగజారింది. దీంతో బ్రిటన్‌కు చెందిన తయారీసంస్థలు భారత్‌కు ఎగుమతి చేయడానికి ధరలు చౌకగా మారాయి. బ్రిటిష్ కరెన్సీలోనే భారత్ అమ్మకాలను గణిస్తారు. ఇలా ఎగుమతులు చౌకగా మారడంతో ఈ ప్రయోజనాలను భారత్‌లోని వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్టు కంపెనీలు చెబుతున్నాయి. 5 శాతం నుంచి 15 శాతం ధరలు కోత పెట్టి, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాయి. రెండు కోట్లకు పైగా ధర ఉన్న కార్ల విక్రయాలు భారత్‌లో 2016లో 200 యూనిట్లు నమోదయ్యాయి. దీనిలో సగానికి పైగా కార్లు బ్రిటన్‌కు చెందినవే కావడం విశేషం. భారత్‌లో జీఎస్టీ అమలైతే, మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పాటుచేసి వృద్ధిని నమోదుచేసుకుంటామని ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుడు లలిత్ చౌదరి చెబుతున్నారు. గత ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలను భారీగా తగ్గించిందని పేర్కొన్నారు. ఏ కారుపై ఎంత తగ్గింది.... కారు అసలు ధర ప్రస్తుత ధర రేంజ్ రోవర్ స్పోర్ట్ 1.35 కోట్లు 1.04 కోట్లు రేంజ్ రోవర్ వోగ్ 1.97 కోట్లు 1.56 కోట్లు ఫెర్రరి 488 3.9 కోట్లు 3.6 కోట్లు రోల్స్ రాయిస్ ఫాంటమ్ 9 కోట్లు 7.8-8.0 కోట్లు రోల్స్ రాయిస్ గోస్ట్ 5.25 కోట్లు 4.75 కోట్లు ఆస్టన్ మార్టిన్ డీబీ11 4.27 కోట్లు 4.06 కోట్లు -
యూరోపియన్ యూనియన్‌కు బై!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి అధికారికంగా వైదొలగడానికి (బ్రెగ్జిట్) కౌంట్‌డౌన్ సిద్ధమయింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్రెగ్జిట్ నుంచి వెళ్లిపోయే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 ఈయూ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూ బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌కు అందజేశారు. ఈ రెండేళ్లలో 27 సభ్యదేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. ఈయూ దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులూ ఉంటాయని మే భరోసా ఇచ్చారు. 2016లో నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు బ్రెగ్జిట్‌కు ఓటు వేయడం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ప్రధాని పార్లమెంటులోనూ అధికారికంగా ప్రకటన చేశారు. -
సుప్రీంకోర్టులో బ్రిటన్‌కు చుక్కెదురు
లండన్: బ్రిటన్ ప్రభుత్వానికి ఆ దేశ సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే కార్యక్రమం(బ్రెగ్జిట్.. బ్రిటన్ ఎగ్జిట్)కోసం జరిగే అధికారిక చర్చను ఇప్పుడే ప్రారంభించడానికి వీల్లేదని, తొలుత పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం పార్లమెంటు ఎంపీల మద్దతు స్పష్టంగా తెలుసుకునేంత వరకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే చర్చలు ప్రారంభించరాదు. మార్చి 31లోగా ఎంపీల మద్దతు పొందాలని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అయితే, స్కాటిష్ పార్లమెంటు, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ అసెంబ్లీలు మాత్రం తమ అభిప్రాయం చెప్పాల్సిన పని లేదని పేర్కొంది. బ్రెగ్జిట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న డేవిడ్ డేవిస్ ఎంపీలకు ఈ విషయాన్ని ఈ రోజే తెలియజేయనున్నారు. మరోపక్క, బ్రెగ్జిట్ మద్దతుదారులు మాత్రం బ్రిటన్ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించడం అప్రజాస్వామిక చర్య అని అంటున్నారు. కాగా, గతంలోనే ఈ విషయంపై బ్రిటన్ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. పార్లమెంటు అనుమతి లేకుండా లిస్బన్ ట్రిటీకి చెందిన ఆర్టికల్ 50ను ప్రభుత్వం అమలుచేయలేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ గత ఏడాది నవంబర్‌లో హైకోర్టు స్పష్టం చేసింది. బ్రిగ్జిట్ విషయంలో ప్రధాన మంత్రి ఏకపక్షంగా వ్యవహరించే వీలు లేదని, ఈ విషయంలో పార్లమెంటే ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్ థామస్ ఆ సమయంలో తీర్పిచ్చారు. ఈయూ నుంచి ఏదైనా సభ్యదేశం వైదొలగాలంటే అది అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించినదే లిస్బన్ ట్రిటీకి ఆర్టికల్ 50. -
మార్కెట్ నుంచి తప్పుకోవడమే
బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రధాని ∙ప్రపంచ దేశాలతో కొత్త ఒప్పందాలకు చర్చలు లండన్: బ్రెగ్జిట్ అంటే ఒక్క యూరోపియన్ యూనియన్ (ఈయూ) మార్కెట్ నుంచి తప్పుకోవడం మాత్రమేనని, భారత్ వంటి దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుపుతున్నామని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. ఈయూ మార్కెట్ నుంచి రెండేళ్లలో విడతల వారీగా నిష్క్రమిస్తామని తెలిపారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవడం(బ్రెగ్జిట్)పై ఆమె మంగళవారమిక్కడ అధికారులు, విదేశీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. బ్రెగ్జిట్‌కు సంబంధించిన తుది ఒప్పందంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈయూతో పూర్తిగా సంబంధాలు తెంపుకునే ఉద్దేశం తనకు లేదన్న ఆమె బ్రెగ్జిట్ కోసం 12 సూత్రాల కార్యాచరణను ప్రకటించారు. ‘ఈయూకు మంచి పొరుగు దేశంగా ఉండాలనుకుంటున్నాం. అయితే బ్రిటన్ను శిక్షించే ఒప్పందం కావాలని కొందరంటున్నారు. అదే జరిగితే ఈయూ దేశాలకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. మేం చైనా, బ్రెజిల్ వంటి ప్రపంచ దేశాలన్నిటితో వ్యాపారం చేయాలనుకుంటున్నాం. భారత్, న్యూజి లాండ్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించాం’ అని చెప్పారు. వలసలపై నియంత్రణ,బ్రిటన్‌లోని ఈయూ పౌరులకు, ఈయూలోని బ్రిటన్ పౌరులకు హక్కులు, ఈయూతో పన్ను రహిత ఒప్పం దంలాంటివి మే ప్రతిపాదనల్లో ఉన్నాయి. -
బంగారం ధరలు పైపైకి..ఎందుకు?
ఒక పక్క ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు యూకే ప్రధాని థెరెసా మే నేడు బ్రెగ్జిట్ ప్రణాళికలను ప్రకటించనున్న నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి పయనిస్తున్నాయి. అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా నాటో, చైనాలపై చేస్తున్న వ్యాఖ్యలు ఇన్వెస్లర్లను ప్రభావితం చేస్తున్నాయి. మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా బంగారం ధరలు బలపడి ఏడు వారాల గరిష్టానికి చేరాయి. మరోపక్క డాలరుతో మారకంలో యూకే పౌండ్ 3 నెలల కనిష్టాన్ని తాకగా, జపనీస్ యెన్ స్వల్పంగా బలపడింది. ఈ ఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే మార్కెట్ లోతీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన ట్రేడ్ ఎనలిస్ట్ , గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 9 డాలర్లకుపైగా(0.8 శాతం) ఎగసి 1206 డాలర్లుగా నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో తొలుత 1,208 డాలర్ల వరకూ జంప్‌చేసింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.5 శాతం పుంజుకుని 16.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 149 పెరిగి రూ. 28,529కు చేరింది. ఇదే బాటలో పయనిస్తున్న వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 73 బలపడి రూ. 40,960ను తాకింది. ఈ ఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. డాలర్ ర్యాలీలో విరామం, పసిడికి పెరిగిన డిమాండ్ సంకేతాలతో బులియన్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది. బ్లూమ్‌బెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్, మంగళవారం 0.2 శాతం పడిపోయింది, అయితే మార్కెట్ లోతీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన ట్రేడ్ ఎనలిస్ట్ , గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. ఈఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే ఈక్విటీ మార్కెట్ లో తీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే. -
బ్రెగ్జిట్‌లో కీలక పరిణామం
మరికొన్ని నెలల్లో బ్రెగ్జిట్ చర్చలు ప్రారంభం కాబోతున్నాయనే తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూరోపియన్ యూనియన్‌కు బ్రిటన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సర్ ఇవాన్ రోజర్స్ తన పదవికి రాజీనామా చేశారు. సర్ ఇవాన్ రోజర్స్ రాజీనామా చేసినట్టు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈయనకు యూకేలో అత్యంత అనుభవం కల్గిన యూరోపియన్ రాయబారిగా పేరొంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ చర్చలు అధికారికంగా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానున్నాయి. బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్స్ దశాబ్దం వరకు పట్టవచ్చని సర్ ఇవాన్ రోజర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రివీల్ చేసి నెల తిరగక ముందే ఆయన రాజీనామా చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం. 2013లో సర్ ఇవాన్‌కు శాశ్వత ప్రతినిధి బాధ్యతను అప్పజెప్పుతూ ఆ దేశ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో ఈయన కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. కానీ ఆయన అనూహ్యంగా తన పదవి నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ కారణాలచే సర్ ఇవాన్ తన బాధ్యత నుంచి వైదొలుగుతున్నారో విదేశీ కార్యాలయం వెల్లడించలేదు. -
‘ట్రంప్ విజయంతో ప్రజల్లో నియంతృత్వం’
లండన్: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం, బ్రెగ్జిట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో నియంతృత్వం పెరుగుతోందని బ్రిటన్వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎంజీ నిర్వహించిన సర్వే వివరాలను ‘ది ఇండిపెండెంట్’ వార్తా పత్రిక ప్రకటించింది. యూకేతో సహా యూరప్ అంతటా ప్రజల్లో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ట్రంప్ విజయంతో అమెరికా వ్యాప్తంగా ఫాసిజమ్ వేళ్లూనుకుంటుందని బ్రిటిష్ ప్రజలు చెప్పారు. -
బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ లీక్!
బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ బయటపడ్డాయి. బ్రెగ్జిట్ మీటింగ్ అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేత సహాయకుడు తీసుకెళ్తున్న నోట్స్ వివరాలను డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) దగ్గర ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ సీక్రెట్ మెమో బయటపడటంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు చెలరేగాయి. అయితే అది బ్రెగ్జిట్ వివరాలు కావని, ఆయన వ్యక్తిగత నోట్స్ మాత్రమేనని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. వ్రాతపూర్వకంగా రాసుకున్న ఈ పత్రాలను కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ మార్క్ ఫీల్డ్ సహాయకుడు పట్టుకెళ్తుండగా బయటపడ్డాయి. స్టీవ్ బ్యాక్ అనే ఫోటోగ్రాఫర్ లాంగ్ లెన్స్ కెమెరాలో ఈ నోట్స్‌ను బంధించాడని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే ఈ నోట్స్ ప్రభుత్వ అధికారులకు లేదా ఏ స్పెషల్ అడ్వయిజరీకి సంబంధించింది కాదని, వ్యక్తిగత నోట్స్ మాత్రమేనని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నోట్స్‌లో యూరోపియన్ యూనియన్‌తో చర్చించబోయే అంశాల్లో వచ్చే అనేక సమస్యలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ సింగిల్ మార్కెట్‌గా ఉండే అవకాశాన్ని ఆఫర్ చేయబోవనే అంశం కూడా బయటపడింది. వాణిజ్య పరిమితులు లేని సింగిల్ మార్కెట్ నుంచి యూకే వైదొలిగితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశంలో మళ్లీ కొత్తగా వాణిజ్య ఒప్పందాలను బ్రిటన్ కుదుర్చుకోవాల్సి వస్తోందని ముందు నుంచి వాదన వినిపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ వివరాలను ప్రకటించడానికి మొదటి నుంచి బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తిరస్కరిస్తూ వస్తున్నారు. బ్రెగ్జిట్ అనంతరం యూరోపియన్ యూనియన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోబోతున్నారో థెరిస్సా రివీల్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఒప్పందం వివరాలు లీక్ అయితే, యూకే చర్చలు బలహీనమయ్యే అవకాశాలున్నాయని ఆమె చెబుతూ వచ్చారు. కానీ కన్జర్వేటివ్ పార్టీ సహాయకుడు చేతిలోని నోట్స్‌ను ఓ ఫోటోగ్రాఫర్ తీసి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది మార్చి నుంచి అధికారిక డైవర్స్ ప్రక్రియ ప్రారంభం చేయాలని థెరిస్సా ప్లాన్ చేస్తున్నారు. -
బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యం
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ను తప్పుకునే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. బ్రెగ్జిట్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తున్న బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి థెరిస్సా మేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు నుంచి కాస్త ప్రతికూల తీర్పు వెలువడింది. బ్రిగ్జిట్ విషయంలో ప్రధాన మంత్రి ఏకపక్షంగా వ్యవహరించే వీలు లేదని, ఈ విషయంలో పార్లమెంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్ థామస్ గురువారం తీర్పు చెప్పారు. బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌కు మాత్రమే సార్వభౌమాధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి తప్పుకోవాలంటూ ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ రెఫరెండమ్‌ను బ్రిటన్ ప్రజలు మెజారిటీ ఓట్లతో ఆమోదించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో యూరోపియన్ నాయకులతో చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా కూటమి నుంచి తప్పుకునే ప్రక్రియను ముగించాలని ప్రధాని థెరిస్సా భావించారు. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. -
భారీగా పెరుగనున్న ఆపిల్ ఉత్పత్తుల ధరలు
రాత్రికి రాత్రే టెక్ దిగ్గజం ఆపిల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీ ఆఫర్ చేసే మ్యాక్ ప్రొ లాంటి కొన్ని ఉత్పత్తుల ధరలు 20 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా స్వీడన్ ఎలక్ట్రోలక్స్ కూడా తమ గృహోపకరణాలపై ధరలను 10 శాతం పెంచుతున్నట్టు తెలిపింది. ఈ సడెన్ నిర్ణయాలకు వెనుక కారణం బ్రెగ్జిట్ బాటలో యూకే వేగవంతంగా పయనిస్తుందనే వార్తలేనని తెలుస్తోంది. గత రెండేళ్లలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుందని, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా పౌండ్ క్షీణిస్తుండటంతో, ఈ ప్రభావం దిగుమతులపై పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల మరింత ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతవారం 2,499 పౌండ్లకు(రూ.2,03,504) లభించిన ఆపిల్ డెస్క్‌టాప్ మిషన్ మ్యాక్ ప్రొపై కంపెనీ ప్రస్తుతం 2,999 పౌండ్ల(రూ.2,44,221) ధర పలుకుతోంది. మ్యాక్ మినీ ధర కూడా 399 పౌండ్ల(రూ.32,492) నుంచి 479 పౌండ్ల(రూ.39,007)కు పెరిగింది. అయితే అమెరికన్ మార్కెట్లో మాత్రం మ్యాక్ మినీ, మ్యాక్ ప్రొ ధరల్లో మార్పులు లేనట్టు ఆపిల్ తెలిపింది. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, స్థానిక దిగుమతి చట్టాలు, వ్యాపార పద్దతులు, పన్నులు, వ్యాపార ఖర్చులు వంటి ప్రభావంతో అంతర్జాతీయంగా ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెంచినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. అయితే ఈ కారణాలు అన్ని దేశాల్లో ఒకేవిధంగా ఉండవని, ప్రాంతానికి ప్రాంతానికి మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ధరలను, అమెరికా రిటైల్ ధరలతో పోల్చిచూడదని తెలిపారు. పౌండ్ క్షీణిస్తుండటంతో, ఆ నష్టాన్ని భర్తీచేసుకోవడానికి ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు పెంచుతున్నట్టు ఎలక్ట్రోలక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోనస్ సామ్యూల్సన్ చెప్పారు. బ్రెగ్జిట్‌కు మొగ్గుచూపుతూ యూకే తీసుకున్న సంచలన నిర్ణయంతో డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ 18 శాతం మేర కుదేలైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా క్షీణించిన కరెన్సీ పౌండే. ఈ పతనంతో దిగుమతి ధరలు పెరుగుతున్నాయని, దీంతో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరుగుతుందని అక్కడి విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి..
♦ తగ్గనున్న నియామకాలు ♦ నాస్కాం ప్రెసిడెంట్ చంద్రశేఖర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ ఐటీ కంపెనీల లాభాలపై ఈ ఏడాది ఒత్తిడి ఉంటుందని నాస్కాం చెబుతోంది. నియామకాలూ తగ్గుతాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ బుధవారమిక్కడ వెల్లడించారు. ఈ పరిస్థితులు ప్రస్తుత ఏడాది ప్రస్ఫుటంగా కనపడతాయని అన్నారు. ‘అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఉంది. యూరప్‌లో వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా దక్షిణ యూరప్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో పౌండ్ విలువ తగ్గింది. పౌండ్ల రూపంలో కాంట్రాక్టులను కుదుర్చుకున్న ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రభావం ఉండే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆటోమేషన్తో... ఐటీ కంపెనీల్లో నియామకాలు స్వల్పంగా తగ్గుతాయని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆటోమేషన్ విస్తృతం కావడంతోపాటు ఉద్యోగుల సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. దేశంలో ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పుడు మొత్తం 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టింది. మరో 100 బిలియన్ డాలర్లు జతకూడేందుకు కొత్తగా 15 లక్షల మంది అవసరమవుతారని అంచనాలు ఉన్నాయన్నారు. -
అమెరికా మందకొడి వృద్ధి పసిడికి బలం..!
• అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌కు 1,358 డాలర్ల పైకి... • మూడు వారాల గరిష్ట స్థాయి దేశీయంగానూ రెండు వారాల నష్టానికి బ్రేక్ ముంబై/న్యూయార్క్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం (బ్రెగ్జిట్)తో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్, ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.25-0.50 శ్రేణి నుంచి మరింత పెంచే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండడం వంటి అంశాలతో సమీప మూడు నెలల్లో పసిడి పటిష్టతకు ఢోకాలేని అంశాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) అంచనాలను అందుకోలేకపోవడం కూడా మున్ముందూ పసిడి పటిష్టంగానే ఉంటుందన్న ఇన్వెస్టర్ల భరోసాకు కారణం అవుతోంది. రెండవ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.6 శాతం ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే దీనికి భిన్నంగా కేవలం 1.2 శాతం వృద్ధి రేటు నమోదుకావడం ఆర్థిక విశ్లేషకులను నివ్వెర పరిచింది. దీనితో ఆ దేశంలో వృద్ధి ఊపందుకోలేదన్న ధోరణి వ్యక్తమవుతోంది. ఇది డాలర్ బలహీనతకూ దారితీసే అంశం. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ధర ఔన్స్ (31.1 గ్రా.)కు గడచిన వారంలో 36 డాలర్లు పెరిగి 1,358 డాలర్లకు చేరింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. ఇక వెండి కూడా లాభాల్లోనే 20 డాలర్ల పైన ట్రేడవుతోంది. పసిడి 1,509 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని, ఇదే జరిగితే కనిష్ట స్థాయి నుంచి 61.8% బలపడినట్లు (రిట్రేస్‌మెంట్) అవుతుందని, ఈ స్థాయిని దాటితే తిరిగి పసిడి తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉందనీ అంచనా. దేశీయంగా రూ.31,000 పైకి... ఇక దేశీయంగా రెండు వారాలుగా కొంచెం వెనక్కు నడిచిన పసిడి తిరిగి శుక్రవారంతో ముగిసిన వారంలో బలపడింది. ముంైబె ప్రధాన మార్కెట్లో 99.9 స్వచ్ఛత పసిడి 10 గ్రాముల ధర వారం వారీగా రూ.125 లాభపడింది. రూ.31,110 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో లాభపడి రూ.30,960కి చేరింది. ఇవి దాదాపు రెండున్నర సంవత్సరాల గరిష్ట స్థాయి. కనీసం ఆరు నెలలు, గరిష్టంగా 18 నెలలు పసిడి మెరుపు కొనసాగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా వెండి కేజీ ధర వారంలో ఏకంగా రూ.650కి చేరింది. రూ.47,470 వద్ద ముగిసింది. పసిడి వెలుగులే... ‘‘గణాంకాల’’ ప్రాతిపదికననే ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఆధారపడి ఉంటుందన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయం, ఈ నేపథ్యంలో రెండవ త్రైమాసిక ఫలితాలు కూడా బలహీనంగానే ఉండడం వంటి అంశాలు పసిడి బలిమికి మున్ముందు కలసి వచ్చేవి అనడంలో సందేహం లేదు. - కార్స్టన్ ఫ్రీట్చ్, కామర్జ్ బ్యాంక్ విశ్లేషకులు -
అమెరికా ‘ఫెడ్’ రేటు యథాతథం
న్యూయార్క్ : అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం ఈ రేటు 0.25- 0.50 శాతం శ్రేణిలో ఉంది. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతున్నాయని బుధవారం రాత్రి కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఫెడ్ వ్యాఖ్యానించడం గమనార్హం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నదంటూ ఫెడ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే వడ్డీ రేట్ల పెంపు వుండవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తామంటూ ఫెడ్ అధికారులు ఇప్పటివరకూ చెపుతూవస్తున్నారు. దాంతో డిసెం బర్లో మాత్రమే ఫెడ్ రేటు పెరిగే అవకాశం 40 శాతం వరకూ వుందని ఆర్థికవేత్తలు అంచనావేస్తువచ్చారు. ఫెడ్ తాజా అభిప్రాయంతో సెప్టెం బర్ లేదా డిసెంబర్లో రేటు పెంపు తప్పదన్నది తాజా అంచనాలు. శుక్రవారం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసిక ఫలితాలు (ఏప్రిల్-జూన్) వెలువడుతుండడమూ తాజా ఫెడ్ నిర్ణయానికి నేపథ్యం. క్యూ1లో ఈ రేటు 1.1 శాతం కాగా, క్యూ2లో 2 శానికి కొంచెం పైనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. -
ఫ్రాన్స్ ప్రతీకారం!
డోవర్: ఒకదాని వెంటే మరో వాహనం.. 20 కిలోమీటర్లకుపైగా స్తంభించిన ట్రాఫిక్. వేలాది వాహనాల్లో లెక్కకు మించిన జనం.. పైన ఎండ వాత.. లోన ఉక్కపోత.. గంటా రెండు గంటలూ కాదు గడిచిన రెండు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి. ఇప్పుడు స్తంభించిన ట్రాఫిక్ క్లియర్ చేయాలంటేనే ఇంకో రెండు రోజులు పడుతుంది. వాహనాల్లో చిక్కకుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళలదైతే అరిగోస! ప్రభుత్వం తన వంతుగా ప్రయాణికులకు 11వేల నీళ్ల బాటిళ్లను సరఫరా చేస్తోంది. ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రం చేతులెత్తేసింది. ఎందుకంటే ఆ పని చేయాల్సింది పొరుగుదేశం కాబట్టి! బ్రిటన్- ఫ్రాన్స్ సరిహద్దులోని డోవర్ పట్టణంలో గడిచిన 50 గంటలుగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నీస్ ట్రక్కు దాడి తర్వాత అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసిన ఫ్రాన్స్.. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి చానెల్ టన్నెల్ మీదుగా ఫ్రాన్స్ వెళ్లాల్సిన వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో వాహనం తనిఖీకి 40 నిమిషాలు పడుతుండటంతో ఇప్పుడున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కే రెండు లేదా అంతకు మించి రోజుల సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ బ్రిటన్ సరిహద్దును దాదాపు మూసేసినంత పని చేయడంతో బ్రిటిషర్లు భగ్గుమంటున్నారు. ఫ్రాన్స్ బ్రెగ్జిట్ కు ప్రతీకారం తీర్చుకుంటోందని నెటిజన్లు భావిస్తున్నారు. -
ఉమ్మడి ఆర్థిక విధానాలే బ్రెగ్జిట్‌కు సమాధానం
ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పిలుపు షాంఘై : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన (బ్రెగ్జిట్) ప్రభావంతో ఎదురవుతున్న సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొనడానికి ప్రధాన ఆర్థిక దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రి జైట్లీ సూచించారు. తదనుగుణంగా తగిన ఉమ్మడి ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలని ప్రధాన ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు, ఇతర రెగ్యులేటర్లను అభ్యర్థించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మొదటి సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జైట్లీ సమావేశాలకు హాజరుకాలేకపోవటంతో దాన్ని సమావేశంలో ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ చదివి వినిపించారు. -
వృద్ధి రేటు అంచనాలకు ఐఎంఎఫ్ కోత
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా 2016, 2017 వృద్ధి రేటు అంచనాకు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) కత్తెర వేసింది. వచ్చే రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా రెండేళ్లలో ఈ రేటు వరుసగా 3.1 శాతం, 3.4 శాతంగా ఉంటుందనీ విశ్లేషించింది. వృద్ధి అంచనా కోతకు ప్రధానంగా యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడం (బ్రెగ్జిట్) కారణమని పేర్కొంది. -
కష్టాల కడలిలో కంపెనీలు..!
ప్రస్తుతం యూరోపియన్ కంపెనీలన్నీ కష్టాల కడలిలో ఉన్నాయని బిజినెస్ లీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల్లో నెలకొంటున్న మాదిరిగా యూరోపియన్ దేశాల్లో ప్రాంతీయ రాజకీయ ప్రమాదాలు, యూరోపియన్ శరణార్థ సంక్షోభం, వ్యాపారాల విజయానికి పెద్ద ప్రమాదాలుగా మారుతున్నాయని బిజినెస్ లీడర్లు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్ లో బ్రెగ్జిటే అత్యంత ప్రమాదకరంగా మారిందని డెలాయిట్ నిర్వహించిన తాజా యూరోపియన్ సీఎఫ్ఓ సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 17 యూరోపియన్ దేశాల్లో 1,500 సీఎఫ్ఓలపై డెలాయిట్ ఈ సర్వేను చేపట్టింది. క్యాపిటల్ మార్కెట్, ఫండింగ్, బిజినెస్ రిస్క్, మొత్తంగా మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాలపై విశ్లేషణ చేపట్టింది. 2016లో యూరప్ లో అతిపెద్ద కంపెనీలు సాధించే ఫైనాన్సియల్ విజయాలకు ఎదురవుతున్న సవాలపై ప్రధానంగా దృష్టిసారించి డెలాయిట్ ఈ రిపోర్టును రూపొందించింది. ప్రాంతీయ రాజకీయాల ఆధిపత్యం, జనాభా పెరుగుదల, కరెన్సీ విలువలు పడిపోవడం, ఆర్థిక విధానంలో భయాందోళనలు, డీప్లేషన్, వంటివి దేశాల్లో ఉన్న ప్రధాన అవరోధాలుగా సర్వే పేర్కొంది. ప్రాంతీయ రాజకీయాల సంక్షోభం అత్యధిక యూరప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల మదిలో కొనసాగుతున్న అతిపెద్ద సమస్యగా సర్వే గుర్తించింది. దురదృష్టవశాత్తు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ ప్రజాభిప్రాయం రావడం ప్రస్తుతం బిజినెస్ లకు అతిపెద్ద నష్టంగా సీఎఫ్ఓలు పరిగణించారని సర్వేలో వెల్లడైంది. ఈ ఫలితాలు యూకే సీఎఫ్ఓల్లో సెంటిమెంట్ ను బలహీనపరస్తోందని రిపోర్టు నివేదించింది. యూకే ఎజెండాను బ్రెగ్జిట్ రెఫరెండం డామినేట్ చేస్తుందని పేర్కొంది. యూకేలోని చాలా అతిపెద్ద కంపెనీలు ఊహించని విధంగా రెఫరెండం వచ్చిందని, బ్రెగ్జిట్ కు ఇంకా కంపెనీలు ప్రిపేర్ కాన్నట్టు డెలాయిట్ రిపోర్టు తెలిపింది. -
బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
-
బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
రేపు ప్రమాణ స్వీకారం: కామరాన్ ప్రకటన లండన్ : బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రస్తుత ప్రధాని డేవిడ్ కామెరాన్ సోమవారం ప్రకటించారు. థెరిసా (59) ప్రస్తుతం దేశ హోంమంత్రిగా ఉన్నారు. ఉక్కు మహిళగా పేరుపడ్డ మార్గరెట్ థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న మహిళా నేత థెరిసాయే. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ (బ్రెగ్జిట్) జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో తీర్పు వెల్లడవటంతో.. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన కామెరాన్ తాను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయూతో బ్రెక్జిట్ చర్చలను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని కొత్త ప్రధాని చూస్తారని ఆయన అప్పుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామెరాన్ తర్వాత ప్రధాని పదవి కోసం అధికార కన్సర్వేటివ్ పార్టీలో.. హోంమంత్రి థెరిసా మే, ఇంధనశాఖ మంత్రి ఆంద్రియా లీడ్సమ్ల (53) మధ్య పోటీ నెలకొంది. అయితే నాటకీయంగా సోమవారం ఉదయం ఆంద్రియా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు థెరిసా బలమైన నాయకురాలంటూ ఆమెకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో.. థెరిసా ఒక్కరే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో కన్సర్వేటివ్ పార్టీ బోర్డు సభ్యులు 22 మంది సోమవారం నాడే అత్యవసరంగా సమావేశమై.. పోటీ లేనందున ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. థెరిసా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కామెరాన్ సోమవారం తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద మీడియాతో మాట్లాడారు. థెరిసా బుధవారం ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. తాను మంగళవారం తన చివరి మంత్రివర్గ భేటీకి హాజరవుతానని, బుధవారం ప్రధానిగా తన చివరి ప్రశ్నల కోసం హౌస్ ఆఫ్ కామన్స్‌కు హాజరవుతానని.. ఆ తర్వాత నబకింగ్హామ్ పాలస్‌కు వెళ్లి రెండో ఎలిజబెత్ రాణికి రాజీనామా సమర్పిస్తానన్నారు. ‘థెరిసా బలమైన నాయకురాలు. రానున్న సంవత్సరాల్లో మన దేశానికి అవసరమైన నాయకత్వాన్ని అందించటంలో ఆమె చాలా సమర్థులు’ అని కితాబునిచ్చారు. -
కాబోయే ప్రధాని ఆమెనే
బ్రిటన్ పీఠాన్ని అధిష్టంచనున్న థెరిసా మే బ్రెగ్జిట్ అనుకూల రెఫరెండం తీర్పుతో రాజకీయ అనిశ్చితిలో మునిగిపోయిన బ్రిటన్ లో తదుపరి ప్రధానమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. డేవిడ్ కామెరాన్ వారసురాలిగా బ్రిటన్ పగ్గాలను థెరిసా మే చేపట్టనున్నారు. నాటకీయ పరిణామాల నడుమ ఆమె ప్రధాన పోటీదారు అయిన ఆండ్రియా లీడ్సమ్ పోటీ నుంచి వైదొలగడంతో ప్రధాని రేసులో ఇప్పుడు థెరిసా ఒక్కరే నిలిచారు. బ్రిగ్జిట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకొంటానని కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో ఆండ్రియా, థెరిసా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. థెరిసాకు పిల్లలు ఉండటం వల్ల ఆమె ప్రధాని పదవిని సమర్థంగా నిర్వహించలేరంటూ ఆండ్రియా ఇటీవల చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఆండ్రియా సోమవారం ఊహించనిరీతిలో ప్రకటన చేశారు. ప్రధాని రేసు తుదకంటూ కొనసాగడం సబబు కాదని, కాబట్టి తాను ఈ రేసు నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ విస్మయ పరిచారు. బ్రిటన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్రెగ్జిట్ ప్రక్రియను థెరిసా సమర్థంగా నిర్వహించగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే బ్రిటన్ ప్రధానిగా థెరిసా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. -
బంగారం, వెండి పైపైకి..
♦ ఎంసీఎక్స్‌లో రూ. 32,000 దాటిన పసిడి ♦ రూ. 48,000పైకి వెండి న్యూఢిల్లీ/న్యూయార్క్ : ఫైనాన్షియల్ మార్కెట్లలో మళ్లీ బ్రెగ్జిట్ భయాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించే పసిడి ధర మంగళ, బుధవారాల్లో ప్రపంచ మార్కెట్లో దూసుకుపోయింది. ఈ రెండు రోజుల్లో ఔన్సు ధర 40 డాలర్ల వరకూ పెరిగి 1,377 డాలర్ల స్థాయిని చేరింది. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ మన దేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బుధవారం రాత్రి 10 గ్రాముల ధర రూ. 32,000 స్థాయిని అధిగమించింది. కడపటి సమాచారం అందేసరికి ప్రపంచ మార్కెట్లో 1,372 డాలర్ల వద్ద, ఎంసీఎక్స్‌లో రూ. 32,260 వద్ద ట్రేడవుతోంది. కాగా రంజాన్ సందర్భంగా ముంబై, హైదరాబాద్‌ల్లో స్పాట్ బులియన్ మార్కెట్లకు సెలవు. దేశరాజధాని ఢిల్లీ బులియన్ స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి బుధవారం ఒక్కరోజే రూ. 400 వరకూ పెరిగి రూ. 31,050 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో ప్రపంచ మార్కెట్ ధర ప్రకారం పుత్తడి ధర పలుకుతుండగా, స్పాట్ మార్కెట్లో కొద్ది వారాల నుంచి డిస్కౌంట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడుల డిమాండ్ మినహా భౌతిక కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ ట్రేడర్లు ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో తక్కువ ధరకు పసిడిని విక్రయిస్తున్నారు. వెండిదీ అదే బాట...: పుత్తడి బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 21 డాలర్ల స్థాయిని చేరగా, ఎంసీఎక్స్‌లో కేజీ ధర రూ. 48,000 స్థాయిని దాటింది. కడపటి సమాచారం ప్రకారం ఈ స్థాయి నుంచి వెండి కాస్త దిగి రూ. 47,900 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక వ్యవస్థ పట్ల భయాలు యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన(బ్రెగ్జిట్) ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్న భయాలు ఇన్వెస్టర్లలో తిరిగి తలెత్తాయని, దాంతో విలువైన లోహాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తున్నారని బులియన్ విశ్లేషకులు చెప్పారు. జపాన్ నుంచి అమెరికా దాదాపు అన్ని స్టాక్ మార్కెట్లూ క్షీణించగా, బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి జారిపోయింది. డాలరు మారకంలో ఈ విలువ 1.28 డాలర్లకు పడిపోయింది. బ్రెగ్జిట్ రిఫరెండంకు ముందు ఇది 1.5 డాలర్లు వుండేది. ఇందుకు తగ్గట్లే చైనాతో సహా వర్థమాన దేశాల కరెన్సీ విలువలు పతనంకాగా, అమెరికా డాలరు, జపాన్ యెన్ బలపడ్డాయి. ఈ అంశాలన్నీ పుత్తడి ర్యాలీకి కారణమయ్యాయి. -
మరోసారి పతనమైన స్టెర్లింగ్ పౌండ్
లండన్ :యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన ప్రభావం ఇంకా పౌండ్ ను పట్టి పీడిస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటువేయడంతో భారీగా పతనమైన కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ మంగళవారం మరింత దిగజారింది. డాలర్ కంటే యూరో కు వ్యతిరేకంగా మరింత తక్కువ పడిపోయింది ఆర్థిక, ద్రవ్య అనిశ్చితి పరిస్థితులపై ఇన్వెస్టర్ల ఆందోళనతో పౌండ్ మరోసారి 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 1.3 శాతం నష్టంతో 1985 నాటి కంటే కిందికి క్షీణించింది. అలాగే రెఫరెండం తర్వాత సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా పౌండ వాల్యూని దెబ్బ తీసింది. యూరో కి వ్యతిరేకంగా పౌండ్ విలువ 84.90 పెన్స్ కు పడిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డాలర్ కు వ్యతిరేకంగా పౌండ్ విలువ 10 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్ పరిణామంతో యూరోజోన్ కూడా బలహీనంగా ఉంది. అయితే బ్రిటన్ కేంద్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ను ప్రకటించనుంది. ఇది బ్యాంకుల స్థిరీకరణకు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవకాశం ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. తన సామర్థ్యం పునరుద్ఘాటించుకోనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీని ప్రభావం పౌండ్ మీద ఉండదని తెలిపారు. అయితే రెఫరెండానికి ముందు స్థాయికి పౌండ్ విలువ చేరాలంటే మరిన్ని వారాలు పడుతుందని ఆర్ బీసీ క్యాపిటల్ మార్కెట్స్ కి చెందిన అదాం అలే చెప్పారు. మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనావేశారు. మరోవైపు బ్రిటిష్ ఆర్థిక మంత్రి జార్జ్ ఓస్ బోర్న్ బ్యాంకు ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ అయ్యారు. ఈయూ నుంచి నిష్క్రమణ ఎలా స్పందించాలనే దానిపై చర్చలు జరిపారు. బ్రెగ్జిట్ బ్లాస్ట్ ఫలితంగా బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ లో ముఖ్యమైన స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సోమవారం తన ట్రేడింగ్ ను సస్పెండ్ చేసింది. అటు ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు. -
బ్రెగ్జిట్ ప్రపంచానికి మంచిది కాదు...
బ్రెగ్జిట్ పై ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య స్పందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఛైర్ పర్సన్ గా బాధ్యతలు కొనసాగిస్తున్న ఆమె... బ్రెగ్జిట్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావాలని బ్రిటిష్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం... సరైంది కాదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో బ్రెగ్జిట్ ప్రతికూల ప్రభావాన్ని అందిస్తుందని ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య అన్నారు. భారతదేశంపై బ్రెగ్జిట్ ప్రభావం ఉన్నా లేకున్నా... యూరోపియన్ యూనియన్, బ్రిటన్ లతో వాణిజ్య సంబంధాలపై మాత్రం పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ ఫేస్ బుక్ లైవ్ ఛాట్ సందర్భంలో బ్రెగ్జిట్ పై అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు. గ్లోబలైజేషన్ సమయంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే నిర్ణయం సరైంది కాదని, ఓ అడుగు వెనక్కు వేయడమేనని వివరించారు. ప్రపంచం మొత్తం మమేకం అవ్వాల్సిన సమయంలో విడిపోవాలనుకోవడం.. తిరిగి ఓ అడుగు వెనక్కు వేయడమేనన్న ఆమె... మనకు ప్రపంచీకరణ మరింత ప్రయోజనాలను ఇస్తుందని నమ్ముతున్నానన్నారు. సైద్ధాంతిక పరంగా చూస్తే... బ్రెగ్జిట్ సరైన నిర్ణయం కాదనిపిస్తోందని న్యూయార్క్ లో జరిపిన ఓ ఫేస్ బుక్ లైవ్ ఛాట్ సందర్భంలో తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలోని పెట్టుబడిదారులు, రేటింగ్ ఏజెన్సీలతో ఆమె సమావేశమయ్యారు. -
బ్రెగ్జిట్ ఉద్యమ నేత సంచలన నిర్ణయం
లండన్: బ్రెగ్జిట్ ఉద్యమ రథసారధి నిగెల్ ఫరాగ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యునైటెడ్ కింగ్ డమ్ ఇండిపెండెండ్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం సెంట్రల్ లండన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిగెల్ తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. 'బ్రిటన్ స్వతంత్ర్యదేశంగా ఉండాలన్నది నా కల. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే లక్ష్యంగా 20 ఏళ్లు పోరాడాం. బ్రెగ్జిట్ రెఫరెండం నెగ్గడంలో యూకే ఇండిపెండెంట్ పార్టీ పాత్ర అద్వితీయం. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించా. మిగతా పని భవిష్యత్ నేతలదే. బ్రెగ్జిట్ విజయం కంటే నేను సాధించేది ఏదీ ఉండబోదు. 'నా దేశం నాకు తిరిగి కావాలి'(ఐ వాంట్ మై కంట్రీ బ్యాక్) అని నినదించా. ఇప్పుడు మాత్రం నా జీవితం నాకు కావాలని కోరుకుంటున్నా(ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్). నిజానికి రాజకీయాలు నా వృత్తికాదు. సరైన సమయంలోనే యూకేఐపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా. అయితే బ్రెసెల్స్(ఈయూ రాజధాని) నుంచి బ్రిటన్ పూర్తిగా వేరయ్యే వరకు యురోపియన్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతా' అని నిగెల్ అన్నారు. (చదవండి: బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!) (చదవండి: బ్రిటన్‌లో అల్లకల్లోలం ఖాయం!) తొలి నుంచీ కన్జర్వేటివ్ పార్టీ రాజకీయాల్లో పాల్గొన్న నిగెల్ ఫరేజ్.. మొదటి నుంచి ఈయూలో బ్రిటన్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. 1992లో కన్జర్వేటివ్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తర్వాత యూకే ఇండిపెండెన్స్ పార్టీలో చేరారు. 2010లో ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఇన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రచారాన్ని చాలా మంది తేలికగా తీసుకున్నారు. కానీ నిగెల్ మాత్రం పరిహాసాలను పట్టించుకోకుండా ముందుకుసాగారు. బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించేలా ప్రధాని కామెరాన్‌పై ఒత్తిడి తెచ్చారు. చివరికి జూన్ 23న జరిగిన రిఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 52శాతం బ్రిటిషర్లు బ్రెగ్జిట్ కు ఓటు వేశారు. కాగా, నిగెల్ రాజీనామా చేసినప్పటికీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమని, గతంలోనూ ఒకటిరెండు సార్లు ఇలా జరిగిందని బ్రిటిష్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. (చదవండి: పేద దేశాల వలసలే కొంప ముంచాయి) (చదవండి: బ్రెగ్జిట్‌కు బ్రేక్!?) -
బ్రెగ్జిట్ కు పోటీగా కొత్త నినాదం వచ్చేసింది!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలన్న తాజా రెఫరెండం తీర్పును చాలామంది బ్రిటన్ వాసులు జీర్ణించుకోవడం లేదు.ఈయూను వీడాలన్న బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా కొత్తగా ‘బ్రిమెయిన్’ నినానాదాన్ని తెరపైకి వచ్చారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలన్న ఈ నినాదంతో ‘మార్చ్ ఫర్ యూరప్’ పేరిట శనివారం వేలమంది ప్రజలు లండన్‌లో ఓ పెద్ద నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు ‘బ్రిమెయిన్’ , ‘వుయ్ లవ్ ఈయూ’ ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు వ్యక్తుల తప్పుడు ప్రచారం ఆధారంగానే బ్రెగ్జిట్ రిఫరెండం జరిగిందని, అది పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించలేదని ఈ ర్యాలీలో ప్రధాన పాత్ర పోషించిన కామెడియన్ మార్క్ థామస్ పేర్కొన్నారు. మరోవైపు తాజా రెఫరెండం తీర్పు ఎలా ఉన్నా.. బ్రిటన్ మాత్రం ఈయూలోనే ఉంటుందని మూడోవంతు మంది ఆ దేశ ప్రజలు భావిస్తున్నట్టు తేలింది. బీబీసీ, ఐపీఎస్వోఎస్ 1077 మందితో నిర్వహించిన సర్వేలో 22శాతం మంది ఈయూ నుంచి బ్రిటన్ వీడుతుందని తాము చెప్పలేమని పేర్కొనగా, 16శాతం మంది బ్రిటన్ ఈయూలోనే ఉంటుందని తెలిపారు. కాగా, 50శాతం మంది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన తర్వాతే ఈయూ నుంచి బ్రిటన్ వీడే ప్రక్రియను చేపట్టాలని అభిప్రాయపడ్డారు. -
నాలుగో రోజూ మార్కెట్ కళకళ
♦ తగ్గిన బ్రెగ్జిట్ భయాలు ♦ ‘వేతన సిఫారసుల’ జోరు ♦ ఈ ఏడాది గరిష్ట స్థాయికి నిఫ్టీ ♦ 84 పాయింట్ల లాభంతో 8,288 వద్ద ముగింపు ♦ 259 పాయింట్లు లాభపడి 27,000కు సెన్సెక్స్ బ్రెగ్జిట్ భయాలను భారత స్టాక్ మార్కెట్ అధిగమించింది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు దేశీయ సానుకూలతలు తోడవడంతో గురువారం స్టాక్ సూచీలు లాభపడ్డాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 27 వేల పాయింట్లను, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,300 పాయింట్లను తాకాయి. నిఫ్టీ ఈ స్థాయిని తాకడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా గత నాలుగు రోజులగా స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతోంది. గురువారం ట్రేడింగ్ చివరలో జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల షార్ట్ పొజిషన్ల కవరింగ్, తక్కువ ధరల్లో ఉన్న షేర్ల కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 259 పాయింట్లు (0.97 శాతం) లాభపడి 27,000 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు (1.02 శాతం) లాభపడి 8,288 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీకి ఇది ఈ ఏడాది గరిష్ట స్థాయి, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, టెలికం, టాటా గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషనల్లో సెన్సెక్స్ 602 పాయింట్లు లాభపడింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన క్వార్టర్ ఇదే. వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్టీ...! వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళీకరించడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడం, కొత్త గనుల అన్వేషణ విధానానికి ఆమోదం, మాల్స్, సినిమాహాళ్లు 24 గంటలూ తెరిచి ఉంచేలా చట్టాన్ని సవరించడం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ జోరును పెంచాయని నిపుణులు పేర్కొన్నారు.ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి. -
'పీఎం పదవి రేసు నుంచి తప్పుకుంటున్నా'
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో లేనని లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థత తనకు లేదని, ఐక్యత దిశగా దేశాన్ని నడిపించలేనని అన్నారు. తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నానని న్యాయశాఖ మంత్రి, బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేసిన మైఖేల్ గోవ్ ప్రకటించిన తర్వాత బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడం గమనార్హం. హోంమంత్రి థెరెసా మే కూడా ప్రధాని పదవి ఆశిస్తున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రజలు మద్దతు పలకడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ సెప్టెంబర్ 9న కొత్త కామెరాన్ వారసుడిని ఎంపిక చేయనుంది. -
బ్రిటన్ పాస్‌పోర్టుకు వన్నె తగ్గుతోంది
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోనుండడంతో బ్రిటన్ పాస్‌పోర్టులకు వన్నె తగ్గుతోంది. ఇప్పటి వరకు మిగతా 27 యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎలాంటి వీసాలు అవసరం లేకుండా స్వేచ్ఛగా పర్యటించే అవకాశం బ్రిటన్ పాస్‌పోర్టుల ద్వారా లభిస్తోంది. రెండేళ్ల తర్వాత ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా యూరోపియన్ యూనియన్ నుంచి రెండేళ్లలోగా బ్రిటన్ తప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బ్రిటన్ పాస్‌పోర్టు హోల్డర్లకు యూరోపియన్ యూనియన్ కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వస్తాయి. అలాంటప్పుడు బ్రిటన్ పాస్‌పోర్టుదారులకు ఎంతమేరకు వెసులుబాటు ఉంటుందనే విషయం యూరోపియన్ యూనియన్‌తో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్ల తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లాలంటే మహా అంటే టూరిస్ట్ వీసాలను తీసుకోవాల్సిన రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ పాస్‌పోర్టుపై యూరోపియన్ యూనియన్ దే శాలు సహా ప్రపంచంలో వీసా లేకుండా 157 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ముందు ఈ సంఖ్య 123 దేశాలకే పరిమితం అవుతుందని ప్రపంచ దేశాల పాస్‌పోర్టులకు రేటింగ్‌లు ఇచ్చే ఆర్టన్ కేపిటల్ సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం ప్రపంచంలో బ్రిటన్ పాస్‌పోర్టులకు రెండో స్థానం ఉందని, యూరోపియన్ యూనియన్ నుంచి నిష్ర్కమించాక ఆ స్థానం 26కు పడిపోతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ప్రపంచంలో వీసా లేకుండా 158 దేశాల్లో పర్యటించేందుకు వీలు కల్పిస్తున్న జర్మనీ, స్వీడన్ పాస్‌పోర్టులు మొదటి స్థానంలో ఉన్నాయి. బ్రిటన్ పౌరసత్వాన్ని కోరుకునే బడా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోవచ్చని చెబుతోంది. సంపన్నులైన వ్యాపారవేత్తలకు బహుళ పౌరసత్వం కల్పించేందుకు ఆర్టన్ కేపిటల్ సంస్థ ప్రధానంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. బ్రిటన్ పాస్‌పోర్టులకు వన్నె తగ్గనుందన్న విషయాన్ని ముందుగానే అంచనా వేస్తున్న బ్రిటన్ పౌరులు యూరోపియన్ యూనియన్లోనే కొనసాగనున్న ఉత్తర ఐర్లాండ్ పాస్‌పోర్టుల కోసం ఎగబడుతున్నారు. తల్లిదండ్రులుగానీ, వారి తల్లిదండ్రులుగానీ ఐర్లాండ్ పౌరులైతే బ్రిటన్ పాస్‌పోర్టుదారులకు కూడా ఐర్లాండ్ పాస్‌పోర్టులు లభిస్తాయి. ఇలాంటి అవకాశం ఉన్నవారంతా ఇప్పుడు ఆ దేశం పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ఐర్లాండ్ విదేశాంగ శాఖ వెల్లడించింది. -
వేతనాల బూస్ట్.. 216 పాయింట్ల ర్యాలీ
♦ 26,740 వద్ద సెన్సెక్స్ ముగింపు ♦ నిఫ్టీ 76 పాయింట్లు అప్ ♦ జీఎస్టీ బిల్లు ఆమోదంపై అంచనాలు ♦ ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు ♦ బ్రెగ్జిట్ భయాలు వెనక్కి ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యల ఫలితంగా బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు ర్యాలీ జరిపి 26,740 పాయింట్ల వద్ద ముగిసింది. కేంద్ర కేబినెట్ 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించడం ఇన్వెస్టర్లకు భారీ బూస్ట్‌నిచ్చింది. వేతనాల పెరుగుదల, బకాయిల చెల్లింపులతో దేశంలో వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు తాత్కాలికంగా బ్రెగ్జిట్ భయాలను పక్కనపెట్టారు. అలాగే మాల్స్, సినిమా థియేటర్లు 24 గంటలూ తెరిచివుంచేందుకు తగిన చట్ట సవరణను, ఖనిజ తవ్వక విధానాన్ని కేబినెట్ ఆమోదించడం మార్కెట్‌కు మరింత ఊపునిచ్చిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను బలపర్చిందని వారు వివరించారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్ల పెరుగుదలతో 8,200 శిఖరంపై 8,204 వద్ద ముగిసింది. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ ఆమోదం పొందవచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురికొల్పాయి. ఆటో షేర్ల జోరు: వేతన సిఫార్సుల అమలుతో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాల ఫలితంగా ఆటోమొబైల్ షేర్లు తాజా ర్యాలీకి నేతృత్వం వహించాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా హీరోమోటో కార్ప్ 3.95%పెరిగింది. రిటైల్ షేర్ల హవా: మాల్స్, సినిమాహాళ్లు 24 గంటలూ తెరిచివుంచేందుకు అవసరమైన బిల్లును కేబినెట్ ఆమోదించడంతో రిటైల్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన షేర్లు పెరిగాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్‌ను నిర్వహించే ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్, స్టోర్వన్ రిటైల్ షేర్లు 10 శాతం ర్యాలీ జరిపాయి. మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్వహణలో వున్న ఐనాక్స్ లీజర్ 7 శాతం, పీవీఆర్ 3 శాతం చొప్పున పెరిగాయి. -
బ్రెగ్జిట్తో నష్టం తక్కువే..!
♦ ఇతర దేశాలతో పోలిస్తే మనం మెరుగైన స్థితిలో ఉన్నాం ♦ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి ♦ యూకేకు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలకు అవకాశం ♦ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సాక్షి, హైదరాబాద్: యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయంతో భారత్‌కు జరిగే నష్టం తక్కువేనని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్రెగ్జిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పదవ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. సి.ఆర్.రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమ్యాటిక్స్, స్టాటస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అరవింద్ సుబ్రమణియన్ కీలకోపన్యాసం చేస్తూ భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు అనేక అంశాలపై విసృ్తతంగా మాట్లాడారు. బ్రెగ్జిట్ తదనంతరం రెండు రోజుల పాటు తాము అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని, కరెన్సీ ఒడిదుడుకులను నిశితంగా పరిశీలించిన తరువాత మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉందన్న అంచనాకు వచ్చామని అన్నారు. కాకపోతే బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం కొంచెం నెమ్మదించవచ్చునని చెప్పారు. మౌలికాంశాల పునాదులు దృఢంగా ఉన్నందున భారత్‌కు నష్టం తక్కువేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ కారణంగా భారత్ యునెటైడ్ కింగ్డమ్కు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలు జరిపే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. కొత్త అంకెలపై అనుమానాలొద్దు.. స్థూల జాతీయోత్పత్తితోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన కొత్త ప్రమాణాలపై ఎవరూ అనుమానాలు పెట్టుకోనవసరం లేదని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలు, నిపుణులు ఈ కొత్త గణాంకాలను తయారు చేశారని ఆయన అన్నారు. జీడీపీ వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు, నేతల ప్రమేయం ఉందన్నది అహేతుకమైందని స్పష్టం చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక శాఖకు సమాచార లభ్యత ఎంతో పెరగిందని, దాదాపు 6 లక్షల కంపెనీల వివరాలను తాము సేకరించగలుగుతున్నామన్నారు. 1 శాతం లోపునకు క్యాడ్... కనిష్ట చమురు ధరల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 1 శాతంలోపునకు దిగివస్తుందని సుబ్రమణియన్ చెప్పారు. విదేశీ కరెన్సీ రాక, పోక మధ్య వ్యత్యాసాన్నే క్యాడ్‌గా వ్యవహరిస్తారు. బంగారం ధర పెరుగుతున్నప్పటికీ, ఇది క్యాడ్‌పై ప్రభావం చూపదని, చమురు దిగుమతి బిల్లుతో పోలిస్తే బంగారం దిగుమతి బిల్లు సగానికంటే తగ్గిపోయినందున నికరంగా క్యాడ్ సానుకూలంగానే వుంటుందని ఆయన వివరించారు. బ్యాంకుల మొండి బకాయిల్ని ఆయన ప్రస్తావిస్తూ చైనాలో బ్యాంకులు కార్పొరేట్లకు ఇచ్చిన రుణాలు జీడీపీలో 165 శాతం వున్నాయని, ఇదే ఇండియాలో 35 శాతమేనని చెప్పారు. ఈ సమస్య పరిష్కరించుకోలేనంత సవాలేమీ కాదన్నారు. మొండి బకాయిల సమస్య టైమ్‌బాంబ్‌లా మారకుండా రిజర్వుబ్యాంక్, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. పన్నుల సేకరణ విషయంలో మనం పాశ్చాత్యదేశాలతో పోలిస్తే చాలా దిగువన ఉన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. జీఎస్టీతో పేద రాష్ట్రాలకు మేలు... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తే దేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని సుబ్రమణియన్ తెలిపారు. మేకిన్ ఇండియా కావాలంటే... దేశం మొత్తాన్ని ఒకటిగా (పన్నుల విషయంలో) చేయాలని, జీఎస్టీ ఇందుకు ఉపయోగపడుతుం దన్నారు. అంతేకాకుండా జీఎస్టీతో పన్నులు ఎగ్గొట్టే వారు తగ్గుతారని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందేందుకైనా వర్తకులు తాము కొనుగోలు చేసే ముడివస్తువులకు తగిన రసీదులు పొందుతారన్నది దీంట్లోని తర్కమని వివరించారు. కార్యక్రమంలో సి.ఆర్.రావు ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కాగ్నిజెంట్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ వైస్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణన్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.అప్పారావు, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ఆర్.రావు తదితరులు పాల్గొన్నారు. పదవ జాతీయ గణాంక దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాటస్టిక్స్ ఒలింపియాడ్ విజేతలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు. -
బ్రెగ్జిట్తో భారత్‌కు నష్టం తక్కువే...
- ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నాం - ఆర్థిక రంగం మూలాలు బలంగా ఉన్నాయి.. - యూకేకు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలకు అవకాశం సాక్షి, హైదరాబాద్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయంతో భారత్‌కు ఒరిగే నష్టం తక్కువేనని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే బ్రెగ్జిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పకతప్పదని ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పదవ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. సి.ఆర్.రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమ్యాటిక్స్, స్టాటస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అరవింద్ సుబ్రమణియన్ కీలకోపన్యాసం చేస్తూ భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు అనేక అంశాలపై విసృ్తతంగా మాట్లాడారు. బ్రెగ్జిట్ తదనంతరం రెండు రోజుల పాటు తాము అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని, కరెన్సీ ఒడిదుడుకులను నిశితంగా పరిశీలించిన తరువాత మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉందన్న అంచనాకు వచ్చామని అన్నారు. కాకపోతే బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం కొంచెం నెమ్మదించవచ్చునని చెప్పారు. మౌలికాంశాల పునాదులు దృఢంగా ఉన్నందున భారత్‌కు నష్టం తక్కువేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ కారణంగా భారత్ యునెటైడ్ కింగ్డమ్కు మరిన్ని వస్తు, సేవల అమ్మకాలు జరిపే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. కొత్త అంకెలపై అనుమానాలొద్దు.. స్థూల జాతీయోత్పత్తితోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన కొత్త ప్రమాణాలపై ఎవరూ అనుమానాలు పెట్టుకోనవసరం లేదని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలు, మచ్చలేని జాతీయ సమగ్రత దృక్పథంతో కూడిన నిపుణులు ఈ కొత్త గణాంకాలను తయారు చేశారని ఆయన అన్నారు. జీడీపీ వంటి అంశాల్లో రాజకీయ పార్టీలు, నేతల ప్రమేయం ఉందన్నది అహేతుకమైందని స్పష్టం చేశారు. పైగా ఈ కొత్త గణాంకాల రూపకల్పనపై ఐదారేళ్లుగా కసరత్తు జరుగుతోందన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక శాఖకు సమాచార లభ్యత ఎంతో పెరగిందని, దాదాపు ఆరులక్షల కంపెనీల వివరాలను తాము సేకరించగలుగుతున్నామని వివరించారు. సంపన్నుల సబ్సిడీల భారం రూ.76 వేల కోట్లు 2015-16 ఆర్థిక సర్వేపై డాక్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు ఎక్కువా? తక్కువా? అదే సమయంలో ప్రజల కోసం ఖర్చుపెడుతున్న మొత్తం ఎక్కువా? తక్కువ? అన్నది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అని, దీనికి సమాధానం కూడా వేర్వేరు రకాలుగా ఉంటుందని అన్నారు. అయితే పన్నుల సేకరణ విషయంలో మనం పాశ్చాత్యదేశాలతో పోలిస్తే చాలా దిగువన ఉన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. జీడీపీతో పోలిస్తే సేకరిస్తున్న పన్నులు 16.6 శాతం ఉండగా, ప్రపంచదేశాల సగటు 21.4 శాతంగా ఉందని, ఖర్చు పెట్టడంలోనూ ఇదే తీరు కనిపిస్తుందని వివరించారు. జీఎస్టీతో పేద రాష్ట్రాలకు మేలు... వస్తు, సేవ పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జీఎస్టీ) అమల్లోకి వస్తే దేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. మేకిన్ ఇండియా కావాలంటే... దేశం మొత్తాన్ని ఒకటిగా (పన్నుల విషయంలో) చేయాలని, జీఎస్టీ ఇందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాకుండా జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నులు ఎగ్గొట్టే వారు తగ్గుతారని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందేందుకైనా వర్తకులు తాము కొనుగోలు చేసే ముడివస్తువులకు తగిన రసీదులు పొందుతారన్నది దీంట్లోని తర్కమని వివరించారు. కార్యక్రమంలో సి.ఆర్.రావు ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్, కాగ్నిజెంట్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ వైస్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణన్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.అప్పారావు, వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.ఆర్.రావు తదితరులు పాల్గొన్నారు. పదవ జాతీయ గణాంక దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాటస్టిక్స్ ఒలింపియాడ్ విజేతలను కూడా ఈ సమావేశంలో ప్రకటించారు. -
బ్రిటన్‌లో పెరుగుతున్న జాతి విద్వేష దాడులు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలనే బ్రెగ్జిట్ కు అనుకూలంగా పౌరులు తీర్పు ఇచ్చిన తర్వాత బ్రిటన్‌లో జాతి విద్వేష దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ఒక్క యూరోపియన్లకు వ్యతిరేకంగానే కాదు, భారతీయులకు వ్యతిరేకంగా కూడా దాడులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఇంతవరకు నాలుగైదు కేసులే దాఖలైనప్పటికీ ఈ వారం రోజుల్లో వందకుపైగా జాతి విద్వేష దాడులు జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది. ఈ దాడులు ప్రస్తుతానికి ఎక్కువ వరకు జాతివిద్వేష వ్యాఖ్యలకే పరిమితమవుతున్నాయని, అవి భౌతిక దాడులకు దారితీస్తే బ్రిటన్‌లో కొనసాగడం కష్టమని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరుగుతాయన్న భయంతో లండన్ పౌరసత్వం కలిగి అక్కడే స్థిరపడిన విదేశీయులు తమ పాస్‌పోర్టులను ఎక్కడికెళ్లినా బహిరంగంగా బాటసారులకు చూపిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇది, దేశానికి నిజంగా సిగ్గు చేటని, ఇక ఇలాంటి దాడులు ఏమాత్రం సహించమని, దోషుల పట్ల కఠినంగా వ్వవహరిస్తామని ప్రధాన మంత్రి డేవిడ్ కేమరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్న నిఖిల్ పాండే అనే భారతీయ విద్యార్థి ఇటీవల ఎయిర్‌పోర్టులో జాతి విద్వేష వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఓ వ్యక్తి నన్ను ఎయిర్ పోర్టులో ఏ దేశం నుంచి వచ్చావని అడిగారు. నేను భారత్ నుంచి వచ్చానని చెప్పాను. వెంటనే నా పాస్‌పోర్టు గుంజుకున్నారు. బ్రిటన్‌లో నా నివాసం ధ్రువపత్రాన్ని కూడా లాక్కున్నాడు. పాస్‌పోర్టుపై నేను రెండేళ్ల క్రితం తీసుకున్న ఫొటో ఉంది. ఆ ఫొటోలో నాకు గడ్డం ఉంది. దాన్ని చూసి ఆయన నన్ను టైస్టులాగా ఉన్నావంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి అవమానం నాకు బ్రిటన్‌లో ఎప్పుడూ జరగలేదు. నేను రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్నా నేనెప్పుడూ ఈ దేశం జాతి విద్వేష దేశమని ఎప్పుడూ భావించలేదు’ అని పాంగే తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వివరించారు. ఇలాంటి సంఘటనలపై తక్షణమే దర్యాప్తు జరపాలని లండన్ మేయర్ పాదిక్ ఖాన్ పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనల గురించి పౌరులు కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. -
ఇక స్కాటెగ్జిట్...?
బ్రెగ్జిట్ ప్రకంపనలు సద్దుమణగడం ప్రారంభం కాకముందే బ్రిటన్ పలు విధాలుగా రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పర్యవసానాలు బ్రిటన్ సరిహద్దులను దాటి, ఐరోపా ఖండం అంతటికీ వ్యాపిస్తాయేమోననే ఆందో ళన సైతం వ్యక్తమౌతోంది. ఈయూ సభ్యత్వంపై మరోమారు ప్రజాభిప్రాయసేక రణ జరపాలనే ఒత్తిడి పెరుగుతుండగా, స్కాట్లాండ్ ప్రథమ మంత్రి నికోలా స్టర్జన్ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుతూ మరోమారు ప్రజాభిప్రాయసేకరణ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటించారు. స్కాటెగ్జిట్కు అనుకూలంగా స్కాట్లు మొగ్గుతున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకున్నా స్కాట్లాండ్ మాత్రం కొనసాగడానికి తగు ఏర్పాట్లు చేయాలనే తన వాదనను అది లగ్జెంబర్గ్‌లో జరిగిన ఈయూ కౌన్సిల్ సమావేశానికి విన్నవించింది. బ్రిటన్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా ఉన్న స్కాట్లాండ్కు విడిగా ఈయూలో సభ్యత్వాన్ని కొనసాగించడం సాధ్యం కాదనే చెప్పాలి. ఇంగ్లిష్ వారి ఆధిపత్యం పట్ల స్కాటిష్ ప్రజలకున్న అసం తృప్తికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ జాతీయ ఆకాంక్షల ఆధారంగానే స్టర్జన్ నేతృ త్వంలోని స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని చాలా కాలంగా డిమాండు చేస్తోంది. 2014లో స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో 55 శాతం బ్రిటన్‌లో భాగంగా ఉండాలని కోరుకున్నారు. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం అంటే ఈయూలో సభ్యత్వాన్ని కోల్పోవడమనే వాదన ఆనాడు ఐక్యతావాదుల ప్రధాన అస్త్రం అయింది. బ్రిటన్ పౌరులుగా కంటే ఈయూ పౌరులుగా తమ అస్తిత్వానికి ఎక్కువ విలువనిచ్చే స్కాట్లు ఈయూ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనే ఐక్యతావాదుల వైపు మొగ్గు చూపారు. అలాగే బ్రెగ్జిట్ ఓటింగ్‌లో కూడా ఈయూ సభ్యత్వానికి అనుకూలంగా వారు 62 శాతం మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే స్టర్జన్ ఏది ఏమైనా స్కాట్లాండ్ ఈయూలో సభ్యత్వాన్ని కొనసాగిస్తుందని, స్వాతంత్య్రం కోసం మరోమారు ప్రజాభిప్రాయసేకరణకు వెళ తామని ప్రకటిస్తున్నారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్‌తో సైతం చర్చిస్తున్నారు. 2014 స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ మౌనం వహించింది. బ్రెగ్జిట్ తదుపరి కూడా అది అదే వైఖరిని అనుసరిస్తుందా అని చెప్పలేం. కానీ జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్ ముఖ్య మిత్రపక్షానికి చెందిన సీనియర్ సెనేటర్ గుంథర్ క్రిచ్బామ్ ‘‘బ్రిటన్ నిష్ర్కమించినా ఈయూ సభ్యత్వం 28గానే ఉంటుంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం కొత్తగా ప్రజాభిప్రాయసేకరణను కోరుతుంది, అది ఎలాగూ నెగ్గుతుంది’’ అని చేసిన వ్యాఖ్యలు బ్రెగ్జిట్ తదుపరి కొందరు ఈయూ ప్రముఖుల ఆలోచనా సరళిలో వచ్చిన మార్పును సూచిస్తుంది. ఇదిలా ఉండగా బ్రిటన్‌లోని మరో స్వయంప్రతిపత్తి ప్రాంతం ఉత్తర ఐర్లాండ్‌లో సైతం బ్రిటన్ నుంచి విడిపోయి, ఐర్లాండ్‌లో ఐక్యం కావాలనే డిమాండు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఓటింగ్ లో స్కాట్లలాగే ఐరిష్ ప్రజలు కూడా ఈయూ సభ్యత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా ఓటు చేశారు. స్కాట్లలాగే, ఐరిష్ ప్రజలకు కూడా బ్రిటన్‌తో ఉన్న వైషమ్యాలు చారిత్రకమైనవి. ఉత్తర ఐర్లాండ్‌లోని ఐఆర్ఏ తిరుగుబాటు 1997కుగానీ సద్దుమణగ లేదు. 2014లో స్కాట్లాండ్ స్వాతంత్య్రం ప్రజాభిప్రాయం తమ వంటి దేశాలలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తుందని స్పెయిన్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెగ్జిట్ తదుపరి స్పెయిన్‌లోని కెటలోనియా స్వాతంత్య్రం డిమాండు ఊపందుకుంటోంది. గత ఏడాది కెటలోనియన్ పార్టీలు నిర్వహించిన అనధికారిక ప్రజాభిప్రాయసేకరణలో 80 శాతం కెటలోనియన్లు స్వాతంత్య్రం కోరారు. స్పెయిన్ నుంచి విడిపోయినా సంపన్న వంతమైన కెటలోనియాను ఈయూ వదులుకోదని స్వాతంత్య్రవాదులవాదన. గ్రీస్, పోర్చుగల్, ఇటలీలలాగే స్పెయిన్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. 21 శాతం నిరుద్యోగంతో దారీతెన్నూ లేని స్థితిలో ఉంది. పైగా 1975లో ఫ్రాంకో మరణానంతర పరిస్థితికి మించిన తీవ్ర రాజకీయ ప్రతిష్టంభనలో కొట్టుమిట్టాడుతోంది. స్పానియార్డులు ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో కూడా గత డిసెంబర్లోలాగే ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితిని పునరావృతం చేశారు. ఏకైక ప్రధాన పార్టీగా తిరిగి అవతరించిన పాప్యులర్ పార్టీ నేత ప్రధాని మరియానో రజాయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ పరిస్థితుల్లో కెటలోనియన్ స్వాతంత్య్రం డిమాండు తిరిగి తెరపైకి వస్తోంది. బ్రెగ్జిట్, కెటలోనియన్లలోనే కాదు, దూరంగా ఉన్న కెనడాలోని క్యుబెక్ జాతి స్వాతంత్య్ర కాంక్షలకు సైతం కొత్త ఊపిరు లూదుతోంది. ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత యూరప్ నిర్మాణమనే ఈయూ మౌలిక లక్ష్యానికి బ్రెగ్జిట్ పర్యవసానంగా విషమిస్తున్న జాతి వైరుధ్యాలు సవాలుగా నిలుస్తున్నాయి. జాతీయవాదం, జాత్యహకారవాదం, గుడ్డి ముస్లిం వ్యతిరేకత, వల సదార్లపట్ల వ్యతిరేకత వంటి ధోరణులు బలపడుతుండటం దేశాలకు, జాతులకు అతీతంగా యూరప్‌ను ఆర్థికంగా, రాజకీయంగా ఐక్యం చేయాలనే దాని ఆకాంక్షకు అపవా దంగా నిలుస్తున్నాయి. బ్రెగ్జిట్ ఫలితాల తదుపరి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, జర్మనీ తదితర దేశాల్లోని పచ్చి మితవాద పార్టీలు ఈయూ నుంచి నిష్ర్కమణకు ప్రజాభిప్రాయ సేకరణలు జరపాలని కోరడం ప్రారంభిం చాయి. ఫ్రెగ్జిట్ (ఫ్రాన్స్), నెగ్జిట్ (నెదర్లాండ్స్) వంటి పిలుపులు వెల్లువెత్తుతు న్నాయి. ఇవన్నీ నేడు బలహీన ధోరణులే అయినా ఈయూ ఆర్థిక విధానాలను, అది ప్రజలపై అమలు చేసిన, చేస్తున్న కఠోరమైన పొదుపు చర్యలు, సంక్షేమ వ్యయాల కోతల పర్యవసానాలుగా ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా తలెత్తుతున్న సామాజిక అసంతృప్తికి యూరప్‌కు వలస వచ్చేవారు బలిపశువులు అవుతుండటం విషాదకరం. 2011-12లలోని ఈయూ సంక్షోభం పరిష్కారం కాకపోవడమే స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి జాత్యహంకార, విచ్ఛిన్నకర, విధ్వంసకర ధోరణుల వరకు అన్ని అవాంఛనీయ ధోరణులకు ఊపిరులు పోస్తోంది. ‘చారిత్రక శత్రువులు ఎలా సన్నిహిత భాగస్వాములు కాగలరో ఈయూ నిరూపించి చూపించింది’ అని నోబెల్ కమిటీ 2012లో ఈయూకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ పేర్కొంది. నేటి పరిణామాలు ఆ మాటలను అపహాస్యం చేస్తున్నట్టుండమే వైచిత్రి. ఐరాపా సంయుక్త రాష్ట్రాలను ఏర్పరచాలనే ఈయూ వ్యవస్థాపకుడు జీన్ మన్నెన్ కల నిజమౌతున్నదా? కరిగిపోనున్నదా? -
వెలుగులో ఎఫ్ఎంసీజీ షేర్లు
♦ బ్రెగ్జిట్ పతనం నుంచి కోలుకుంటున్న మార్కెట్ ♦ సెన్సెక్స్ 122 పాయింట్లు అప్ ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ నిర్ణయించిన ప్రభావంతో గత శుక్రవారం జరిగిన పతనం నుంచి మార్కెట్ నెమ్మదిగా కోలుకొంటోంది. బ్రెగ్జిట్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జపాన్ ఒక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలతో మంగళవారం ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. ఇదేక్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 26,525 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్ల పెరుగుదలతో 8,128 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితంరోజు సైతం స్వల్పలాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎఫ్ఎంసీజీ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. రుతుపవనాలు దేశంలో వేగంగా వ్యాపిస్తున్నాయన్న వార్తలతో హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) 3.25 శాతం ఎగిసింది. మరో ఎఫ్ఎంసీజీ షేరు ఐటీసీ 2.6 శాతం పెరుగుదలతో రెండేళ్ల గరిష్టస్థాయి రూ. 368 వద్ద క్లోజయ్యింది. వివిధ రంగాల సూచీల్లో కూడా అధికంగా ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.75 శాతం పెరిగింది. ఇక సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా లుపిన్ 4.4 శాతం పెరిగింది. యూరప్ మార్కెట్ల ర్యాలీ ఆసియా ప్రధాన మార్కెట్లలో ఒక్క హాంకాంగ్ తప్ప, మిగిలినవి స్వల్ప పెరుగుదలతో ముగిసాయి. సంక్షోభానికి కేంద్ర బిందువైన యూరప్ సూచీలు 1.5-3 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 2.5 శాతం ఎగిసింది. జర్మనీ డాక్స్ 1.7 శాతం ఫ్రాన్స్ కాక్ 2.4 శాతం చొప్పున ఎగిసాయి. అమెరికా సూచీలు కడపటి సమాచారం అందేసరికి 1 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. -
భారత్ ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ఎఫెక్ట్!: మోర్గాన్ స్టాన్లీ
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడిన (బ్రెగ్జిట్) ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ పరిణామం వల్ల రానున్న రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి 60 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గే అవకాశం ఉంటుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వాణిజ్య, ఫైనాన్షియల్ మార్గాల్లో ఈ ప్రతికూలత ఉంటుందనీ వివరించింది. అయితే ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్‌పై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. కనీస స్థాయిలో జీడీపీపై ఈ ప్రభావం 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు ఉంటుందన్నది తమ అంచనాఅనీ, గరిష్ట స్థాయిలో 30 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని భావిసున్నామనీ వివరించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో రికవరీ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. -
బ్రెగ్జిట్‌పై బ్రెసెల్స్‌లో రచ్చరచ్చ
- 'నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?' అని బ్రెగ్జిట్ ఉద్యమ నేత నెగెల్కు ఈసీ అధ్యక్షుడి ప్రశ్న - పార్లమెంట్‌లోనే ఈయూపై విమర్శలు కురిపించిన నెగెల్ - విడిపోయినా కలిసే సాగుదామంటూ ప్రధాని కామెరూన్ వేడుకోలు - ఈయూలో బ్రిటన్ జాతీయ జెండా తొలిగింపు.. ప్రధాని బృందం రాకకు ముందే మళ్లీ ఏర్పాటు బ్రెసెల్స్: పరస్పర దూషణలు, విమర్శలతో బ్రెగ్జిట్ పై యురోపియన్ పార్లమెంట్ లో జరిగిన చర్చ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. రెఫరెండం ద్వారా యురోపియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో 751 మంది సభ్యుల యురోపియన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశాలకు బ్రిటన్ ప్రతినిధులుగా(మొత్తం 73 మంది ప్రతినిధులుంటారు) ప్రధాని డేవిడ్ కామెరూన్, యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) నేత నెగెల్ ఫరాగ్, మరి కొందరు నేతలు హాజరయ్యారు. ఈయూ సభ్యదేశంగా బ్రెసెల్స్ లోని ఈయూ పార్లమెంట్ భవనంలో బ్రిటన్ జాతీయ జెండా తప్పక ఉండాలి. కానీ బ్రెగ్జిట్ నిర్ణయం దృష్ట్యా అధికారులు ఆ జెండాను తొలిగించారు. అయితే బ్రిటన్ నేతలు రావడానికి కొద్ది నిమిషాల ముందే మళ్లీ బ్రిటన్ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ చర్య ద్వారా ఈయూ నేతలు బ్రిటన్ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నామని చెప్పకనే చెప్పారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు జేన్ క్లాడ్ జంకర్, యూకేఐపీ నేత నెగెల్ ను తిట్టిపోశారు. బ్రెగ్జిట్ ఉద్యమనేతగా పేరు తెచ్చుకున్న నెగెల్ ను.. 'విడిపోవాలనుకున్నవాడివి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?'అని జేన్ క్లాడ్ ప్రశ్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జేన్ ను ఆయన సహచరులు లోపలికి తీసుకెళ్లడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నెగెల్ కు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్ మార్టిన్ షుల్ట్జ్. ప్రసంగం మొదట్లో ఈయూకు ధన్యవాదాలు తెలిపిన నెగెల్.. తర్వాత విమర్శలు గుప్పించారు. జేన్ క్లాడ్ తనను అవమానించిన తీరును సభలో వివరించారు. దానికి స్పీకర్.. జేన్ ను గట్టిగా మందలించారు. కాగా, సెషన్ పూర్తయిన తర్వాత నెగెల్, జేన్ లు ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం విశేషం. అడకత్తెరలో కామెరూన్ రెఫరెండం నిర్వహించి బ్రెగ్జిట్, ఊహించని ఫలితాన్ని చవిచూసిన ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రెసెల్స్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒవైపు ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియను కొనసాగిస్తూనే భవిష్యత్ అవసరాల దృష్యా ఈయూ నేతల మెప్పుకోసం పాకులాడినట్లు కనిపించారు. పలువురు ఈయూ కీలక నేతలు కామెరూన్ రెఫరెండం నిర్వహించడంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈయూ నుంచి బయటికి వచ్చినప్పటికీ సత్పంబంధాలు కొనసాగేలా కృషిచేస్తానని చెప్పారు. -
ఈయూ గాథ, బ్రిటన్ బాధ
రెండో మాట ‘పశ్చిమ రాజ్యాల ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా ఆయా దేశాలకు ఇతర దేశాల నుంచి జరుగుతున్న వలసల విషయంలో కలుషిత వాతా వరణాన్ని సృష్టిస్తూ వచ్చాయి. పశ్చిమ దేశాలలో ఏర్పడిన కార్మికులు, శ్రామి కుల కొరతను తీర్చుకోవడం కోసం వీరిని అతిథి సేవకులుగా (గెస్ట్ వర్కర్స్) దిగుమతి చేసుకోవలసి వచ్చిందన్న మిషతో ఈ వలసలని అనుమతించడం జరిగింది. ఇలా సరిహద్దులను అతిక్రమించి ఏ అధికారిక పత్రాలు లేకుండా దూసుకువస్తున్న ఆ అసంఖ్యాక వలస కార్మికుల వల్ల సరిహద్దులను కాపాడు కోగల శక్తి గురించి కూడా పశ్చిమ రాజ్యాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అవాస్తవికంగా ఉంటున్నాయి. యూరప్ దేశాల ప్రజలకు ఇతర చోట్ల నుంచి జరుగుతున్న వలసలు యూరప్ ఆర్థిక సమస్యలకన్నా పెద్ద తలనొప్పిగా మారాయి.’ -ది ఎకానమిస్ట్ (లండన్) ప్రత్యేక నివేదిక; మే 28, 2016 నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క తుపానుతో సరి. రవి అస్తమించని మహా సామ్రాజ్యంగా రెండున్నర శతాబ్దాల పాటు ఇతర దేశాలను వలస లుగా మార్చి, ప్రజలను దోపిడీ, దురాక్రమణలతో పీడించి పిప్పి చేసిన దేశం ‘గ్రేట్ బ్రిటన్’. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఒకనాటి ఈ మహా సామ్రాజ్యం వలసల రూపంలో వచ్చిన సమస్యతో నేడు తన ఉనికికే పరీక్ష సమయాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. నలభై ఏళ్ల క్రితం 28 యూరోపియన్ రాజ్యాలు సభ్యులుగా యూరో పియన్ యూనియన్ (ఈయూ) ప్రయాణం ఆరంభమైంది. అందులో బ్రిటన్ కూడా సభ్యదేశమే. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఆ సమాఖ్య నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చింది? అధికార ప్రయోజనాల కోసం పాలక, ప్రతిపక్షాలు (కన్సర్వేటివ్, లేబర్ పార్టీలు) పడుతున్న తంటాల నేపథ్యంలో ఈయూ నుంచి బయట పడితేగానీ దేశానికి సుఖం లేదని తాజా ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం)లో బ్రిటిష్ పౌరులు ఎందుకు తీర్పు చెప్పవలసి వచ్చింది? ఆ తీర్పు ఫలితంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ ఎందువల్ల దారుణంగా పతనమైంది? దీనితో పాటే ఇండియా సహా పెక్కు దేశాల (అమెరికన్ డాలర్, జాపనీస్ కరె న్సీ మినహా) కరెన్సీల విలువ కూడా ఎందుకు దిగజారవలసి వచ్చింది? బ్రిటన్ నిర్ణయం గురించి ఈయూ ప్రత్యేక కమిషన్ చర్చించి ఇంకా ఒక నిర్ణయానికి రాక ముందే బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ (కన్సర్వేటివ్ పార్టీ) ఎందుకు రాజీనామా నిర్ణయానికి రావలసి వచ్చింది? బ్రిటన్‌తో పాటు ఇంకొన్ని సభ్య దేశాలు కూడా ఈయూ నుంచి వైదొలగాలని ఎందుకు అనుకుంటున్నాయి? ఈ సంక్షోభంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్ రక్షణకు దన్నుగా ఆగమేఘాల మీద 250 బిలియన్ పౌండ్లను ఎందుకు ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించవలసి వచ్చింది? బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత జెరేమీ కార్బిన్ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితం మీద, దేశ పరిణామాల మీద చేసిన వ్యాఖ్యలనే ఈ ప్రశ్నావళికి సమాధా నాలుగా పరిగణించాలి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పైన కార్బిన్ చేసిన నిశిత వ్యాఖ్యగా కూడా భావించాలి. ఇదంతా పాలక, ప్రతిపక్షాలకూ, వారి నాయకులకూ మధ్య కేవలం వ్యక్తిగత తగాదాలతో తలెత్తిన సమస్య కాదు. విపక్షం విశ్లేషణ ఇది కార్బిన్ విశ్లేషణ: ‘‘2015 ఎన్నికలలో 63 శాతం ఓటర్లు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న లేబర్ పార్టీ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. ఇతర దేశాల నుంచి ప్రవాసులుగా వలస రావడం బ్రిటన్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది. వలసలు ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయి. పారిశ్రామి కీకరణ వెనుకబడి, కొత్తగా పెట్టుబడులు అందని స్థితిలో... ప్రజా బాహు ళ్యంలోని బలహీనవర్గాలకు ప్రభుత్వం పొదుపు పథకాలను ఎర చూపడం వల్ల, ఆర్థిక రంగంలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వలసలు పెరిగిపో యాయి. గనుల పరిశ్రమలు పెట్టుబడుల కొరతతో కుప్పకూలిపోయాయి. చివరికి 1980లలో వలే అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగాలకు అవకాశం ఉన్న పరిస్థితులు కూడా నేడు లేవు. నిపుణతతో లభించే ఈ ఉపాధిని కూడా కాపాడుకోలేని స్థితి కూడా నేడు నెలకొని ఉంది. కనీసం తక్కువ వేతనాలతో గడిపేవారి ఉపాధికి కూడా భద్రత లేని దుస్థితి. దేశంలోని అలాంటి విభా గాలలో తీవ్ర దారిద్య్ర పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఇలా బయట నుంచి బ్రిటన్లోకీ, దేశంలోనే పట్టణ ప్రాంతాలకూ వలసలు పెరిగిపోయాయి. ఫలితంగా ఉపాధికి రక్షణ లేని పరిస్థితి. ఆపైన ప్రభుత్వ పథకాలు, బడ్జెట్లలో భారీ కోతలు.’’ ఈయూ సభ్యదేశంగా బ్రిటన్ వాస్తవ దృశ్యం ఇదే. నిజానికి కార్బిన్ కూడా బహిర్గతం చేయని మరో రహస్యం, అసలు దోపిడీ కూడా ఉన్నాయి. ఈ సమాఖ్యలోని సభ్య దేశాల మధ్య పరస్పర దోపిడీ వల్ల పెరుగుతున్న వలసలు (ఉదా: రెండేళ్ల నాడు గ్రీస్ వామపక్ష పాలన కింద ఉన్నందున దాని మీద జర్మనీతో కలసి బ్రిటన్ కూడా ఆర్థిక ఆంక్షలూ, పొదుపు ఆంక్షలూ పెట్టి లొంగదీయడానికి ప్రయత్నించింది) మరొక వాస్తవం. దాంతో పాటు ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల ప్రజలనుంచి దోచుకున్న ధన, సహజ వనరుల సంపదతో తన పారిశ్రామిక విప్లవ ఫలితాలను ఇంతకాలం బ్రిటన్ చెక్కుచెదరకుండా కాపాడుకుంటోంది. కానీ, వలస దేశాలు మాత్రం ఆకలిదప్పులతో కాలం గడిపాయి. వీరు అనేక త్యాగాల ద్వారా రాజకీయ స్వాతంత్య్రం సాధించుకున్నా మళ్లీ ఆంగ్లో- అమెరికన్ సామ్రాజ్య పెత్తందారీ వలస పెత్తందారీతనం, బహుళ జాతి గుత్త పెట్టుబడుల నీడలలో ఇప్పటికీ మగ్గ వలసి వస్తున్నది. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ‘సరళీకరణ’, ‘ప్రపంచీకరణ’, ‘ఆర్థిక వ్యవస్థల పునర్ వ్యవ స్థీకరణ’, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల ద్వారా ప్రజా వ్యతిరేక సంస్క రణలను నూతన ప్రపంచ వ్యవస్థ నిర్మాణం ముసుగులో కొనసాగు తున్నాయి. వర్ధమాన దేశాలు ఆర్థిక సంస్కరణల ఎండమావుల మధ్య ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. వర్తక, వ్యాపార, వాణి జ్యాలూ అనేక ఆంక్షల మధ్య అసమస్థాయిలో సాగుతూనే ఉన్నాయి. ఆంగ్లో- అమెరికన్ సామ్రాజ్య దురాక్రమణ యుద్ధాలు ఈ 20వ శతాబ్దం తొలి పాతిక సంవత్సరాలుగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలపై (ఆఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, పాలస్తీనా వగైరా) కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఉపాధి, పనుల కోసం పాత వలసల ప్రజలు సంపన్న దేశాలవైపు ఇప్పటికీ పరుగులు పెడుతున్నారు. నాడు దోచుకున్న పశ్చిమ రాజ్యాలే నేడు వర్ధమాన దేశాలనుంచి సాగుతున్న వలసలని ఆడిపోసుకుంటున్నాయి. అమెరికాను అంటకాగిన ఫలితం ఈయూ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి మరొక కారణం - దురాక్రమణ యుద్ధాల ద్వారా అభాసుపాలైన అమెరికా రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పరచిన ‘నాటో’ సైనిక కూటమితో పాలు పంచుకోవటంవల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడడం కూడా. ఈ దుస్థితి నుంచి బయట పడకుంటే ప్రగతి కంటక మార్గంలో చిక్కుకుంటుందన్న ప్రజల ఆందోళననే కార్బిన్ వ్యక్తం చేశాడు. ఎందుకంటే, సామ్రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థను సాకుతున్న నాయకులు ఎలాంటివారో విస్కాన్సిన్ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు రూడీ కూజెల్ ఇలా వర్ణించాడు: ‘వీళ్లు ప్రజల గొంతుల్ని సునాయాసంగా కోసే స్తారు, ఆ పిమ్మట ఆ గాయపడిన గొంతులకు ఏ రకం బాండ్-ఎయిడ్ వేయాలా అని వాదించుకుంటుంటారు’. అంతేగాదు, ఈ సామ్రాజ్యవాద దేశాలలో జాతీయోత్పత్తుల విలువను లెక్కగట్టే పద్ధతులు కూడా మోసపూరితమైనవేనని ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, పరిశోధకుడు మారిస్ హెర్మాన్ బయటపెట్టాడు : ‘పేద దేశాల నుంచి అభి వృద్ధి చెందిన దేశాలకు భారీ ఎత్తున సాగే వలసల వల్ల అటు దోపిడీకి గురైన దేశాలు, ఇటు దోచుకునే దేశాల తలసరి జాతీయోత్పత్తుల విలువ పెరుగు తుంది. ఎందుకంటే, పేద దేశాల ఎగుమతుల విలువను తగ్గించి చూపే ప్రయత్నంలో సంపన్న దేశాలలో తలసరి జాతీయోత్పత్తుల విలువను పెంచి చూపడం జరుగుతోంది.’ అన్నాడు. ఈ ప్రమాణాలతో చూస్తే ఆ యూనియన్ బడ్జెట్లో బ్రిటన్ ఏటా తన వాటాగా 12 బిలియన్ డాలర్లను జమ చేస్తోంది. ఈ దశలో ఇండియా-బ్రిటన్ వాణిజ్య లావాదేవీల విలువా పడిపోతుంది. భారత్ ఐటీపై ప్రభావం బ్రిటన్ యూరప్ సమాఖ్య నుంచి తప్పుకోవడంవల్ల జర్మనీ, ఫ్రాన్స్ వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది. అందుకే బ్రిటన్ తన నిర్ణయాన్ని పునరా లోచించుకోమని జర్మనీ ప్రాధేయపడవలసి వచ్చింది. ఇప్పటిదాకా బ్రిటన్ చేసుకుంటున్న దిగుమతులలో ఇండియా ఐదవ స్థానంలో ఉంది. చిన్న చిన్న బ్రిటిష్ వ్యాపార సంస్థలు, చిన్న వ్యాపారులు, యూరోప్ సమాఖ్యతో వాణి జ్యంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ వైదొలగాలను కుంటున్న వారిలో వీరిది పెద్ద సంఖ్యే. యూరోప్ సమాఖ్య బ్రిటన్ ఆంత రంగిక వ్యవహారాల్లో తరచుగా జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణ కూడా బ్రిటన్ నిర్ణయానికి మరో ప్రధాన కారణం. ఈయూ పెట్టిన 100 నిబంధనల వల్ల ఏటా ఇంగ్లండ్ భారీగా 33 బిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి వస్తోంది. వీటన్నింటికన్నా మిన్నగా యూరప్-అమెరికా సామ్రాజ్య ప్రభుత్వాలు కల్పించిన యుద్ధాల మూలంగా సిరియా, లెబనాన్, ఇరాక్, అఫ్గానిస్తాన్‌ల నుంచే లక్షలాదిమంది పౌరులు అమెరికా, బ్రిటన్లకు వలస వెళ్లారు. భారత ఐటీ వలసలకూ బ్రిటన్ తీర్పు గండమే! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ (సీనియర్ సంపాదకులు) abkprasad2006@yahoo.co.in -
బ్రెగ్జిట్తో వృద్ధికి ఢోకా ఉండదు: క్రిసిల్
♦ 7.9% అంచనాలు కొనసాగింపు ♦ ఐటీ సహా పలు రంగాలపై ఒత్తిళ్లు ముంబై: బ్రెగ్జిట్ వల్ల కొన్ని రంగాలపై ప్రభావం ఉంటుందని, అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిపై చెప్పుకోతగ్గ ప్రభావం ఏమీ ఉండదని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధికి వ్యవసాయం చోదకంగా నిలుస్తుందని, వృద్ధి సాధించడంలో జూలై, ఆగస్టులో కురిసే వర్షాలు కీలకమని పేర్కొంది. డిమాండ్ తగ్గుదల, కమోడిటీల ధరల్లో ఒడిదుడుకులతో భారతీయ కంపెనీలపై ప్రభావం ఉంటుందని క్రిసిల్ తన తాజా నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఐటీ, ఆటో, టెక్స్టైల్స్, ఫార్మా, లెదర్, మెటల్స్ రంగాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయని అంచనా వేసింది. యూకే, యూరోప్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలపై కూడా ప్రభావం ఉంటుందని, హెడ్జింగ్ లేని విదేశీ రుణాల రూపంలో బ్యాలన్స్ షీట్లపై ఒత్తిడి పడుతుందని పేర్కొంది. ఐటీ రంగం... రూపాయి: దేశ ఎగుమతుల్లో అధిక భాగం ఐటీ రంగం నుంచే ఉంటున్నాయి. భారతీయ మొత్తం ఐటీ ఎగుమతుల్లో 17% బ్రిటన్‌కే వెళుతున్నాయి. యూరప్ వాటా 29%. బ్రెగ్జిట్ వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీలపై ఒకేసారి పలు కష్టాలు వచ్చి పడ్డాయి. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అధిక కేటాయింపులు చేయడంతోపాటు... యూకే నుంచి యూరోప్‌కు ఉద్యోగుల తరలింపు కారణంగా పరిపాలనా ఖర్చులు పెరిగిపోతాయి. రూపాయిపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. 2017 మార్చి నాటికి డాలర్‌తో పోలిస్తే 66.50 స్థాయిలో ఉంటుంది. భారత్ నుంచి బ్రిటన్‌కు సరుకుల ఎగుమతులు కేవలం 3 శాతంగానే ఉండడంతో ఎగుమతులపై భారీగా ప్రభావం ఉండదని అంచనా వేసింది. పోటీ కరెన్సీల గమనం భారత్‌కు కీలకమని పేర్కొంది. అయితే, మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు తగ్గుతాయి. -
రెండో రెఫరెండం వైపే బ్రిటన్ల చూపు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలన్న షాకింగ్ తీర్పుతో బిత్తరపోయిన ఆ దేశ వాసుల్లో, మరోసారి రెఫరెండం నిర్వహించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. బ్రిటన్‌లో మళ్లీ రెఫరెండం నిర్వహించాలన్న ఆన్లైన్ పిటిషన్‌కు మద్దతుగా ఏకంగా ముప్పై లక్షలకుపైగా మంది సంతకాలు చేశారు. అధికారిక పార్లమెంటరీ పిటిషన్ వెబ్సైట్లో ఈ పిటిషన్‌కు మద్దతుగా వెల్లువెత్తుతున్న సంతకాలతో ఓ దశలో ఈ వెబ్సైట్ క్రాష్ అయింది. వేలసంఖ్యలో బ్రిటన్ వాసులు ఈ పిటిషన్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్నారు. ‘ఉండాలా? విడిపోవాలా? అన్న అంశంపై రెఫరెండ్లో మెజారిటీ ఓట్లు 60శాతానికి తక్కువగా ఉండి.. మొత్తం ఓటింగ్ 75శాతానికి తక్కువగా ఉన్నప్పుడు ఆ సమయంలో రెండోసారి రెఫరెండం నిర్వహించాలన్న నిబంధనను ఇప్పుడు అమలుచేయాలని కోరుతూ మేం ఈ సంతకాలు చేపడుతున్నాం’ అని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈయూలో బ్రిటన్ ఉండాలా? వద్దా? అనే అంశంపై గురువారం జరిగిన చరిత్రాత్మక రెఫరెండంలో 72.2శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే. సాధారణంగా పార్లమెంటు అధికారిక వెబ్సైట్లో నమోదైన పిటిషన్‌కు లక్ష సంతకాలు వస్తే.. ఆ అంశంపై దిగువ సభైన హౌస్ ఆఫ్ కామన్స్ లో చర్చిస్తారు. తాజా పిటిషన్ కు ఇందుకు అవసరమైన సంతకాల కన్నా అధికంగా వచ్చిన నేపథ్యంలో మంగళవారం సమావేశం కానున్న పార్లమెంటు పిటిషన్ కమిటీ.. ఈ పిటిషన్ పై పార్లమెంటులో చర్చించాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. -
ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..!
బ్రెగ్జిట్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం * ఫెడ్ వడ్డీరేటు పెంపు ఆలస్యమయ్యే ధోరణీ ‘ప్లస్’! * క్రూడ్ ధరలు వెనకడుగు మరోకారణం న్యూయార్క్/న్యూఢిల్లీ: ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా పసిడి వెలుగులు సమీప కాలంలో కొనసాగుతాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల ధర రూ.33,500 స్థాయికి చేరుతుందన్న అంచనా ఉండగా, అంతర్జాతీయ స్థాయికి సంబంధించి అంచనాలు చూస్తే న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడయ్యే కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర 1,350 డాలర్లు, 1,475 డాలర్ల శ్రేణిలో తిరుగుతుంది. కమోట్రెండ్జ్ రిసెర్ట్ డెరైక్టర్ జ్ఞాన్‌శేఖర్ త్యాగరాజన్ అంచనాల ప్రకారం... ⇒ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం.. ఫలితంగా అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనటం పసిడిలో పెట్టుబడుల పటిష్టతకు కారణం. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు వేర్వేరుగా ఉద్దీపనలను ప్రకటించే అవకాశం. ⇒ అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.50% నుంచి ఇప్పట్లో పైకి పెంచదన్న అంచనా రెండవ కారణం. అమెరికా ఎన్నికల నేపథ్యమూ గమనార్హం. ⇒ ఇక మూడవ అంశానికి వస్తే- ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో క్రూడ్ ధరలు సైతం వెనకడుగు వేయడం. ⇒ అమెరికా డాలర్ మరింత బలహీన పడే అవకాశాలు ఉన్నాయని, ఇది పసిడికి మరింత మెరుపు తీసుకువస్తుందని ఏంజిల్ బ్రోకింగ్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ బిజినెస్ ఈక్విటీ రిసెర్చ్ విభాగం డెరైక్టర్ నవీన్ మాథూర్ అభిప్రాయపడ్డారు. దీనితో స్వల్ప కాలంలో రేటు దేశీయంగా రూ.31,500-32,500 శ్రేణిలో తిరిగే అవకాశం ఉందని అంచనావేశారు. ⇒ అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీథర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆయా ఆర్థిక మందగమన అంశాలకు తోడు దేశంలో తగిన వర్షపాతమూ పసిడి డిమాండ్ బాగుండడానికి కారణమవుతుందని ఆయన అంచనా వేశారు. వారంలో భారీ జంప్.. బ్రెగ్జిట్ వార్తల నేపథ్యంలో పసిడి నెమైక్స్‌లో సమీక్షా వారంలో పరుగు పెట్టింది. శుక్రవారం ఒక దశలో మార్చి 2014 గరిష్ట స్థాయికి ఔన్స్‌కు 1,359 డాలర్లకు ఎగసింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 డాలర్ల లాభంతో 1,319 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగానూ పసిడి ఇదే దూకుడు ప్రదర్శించింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా శుక్రవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 లాభంతో (3 శాతం) రూ.30,905 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం ఎగసి రూ.30.755 వద్దకు చేరింది. ఇక వెండి కూడా కేజీకి రూ.1,370 ఎగసి రూ. 42,930 వద్దకు భారీ జంప్ చేసింది. -
గతవారం బిజినెస్
బ్రెగ్జిట్ కల్లోలం యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ తాజా రిఫరెండంలో బ్రిటన్ ప్రజలు నిర్ణయించడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. పౌండు, యూరోలతో సహా వర్ధమాన కరెన్సీలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం రివ్వున ఎగిసింది. ఎఫ్‌డీఐలకు మరోసారి రెడ్‌కార్పెట్ మోదీ సర్కారు మరోమారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. రక్షణ, పౌర విమానయాన, ఫార్మా, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో (డీటీహెచ్), కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రై వేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయ పన్ను చెల్లించకుంటే జైలుకే ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారికి అరదండాలు విధించే దిశగా తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ అస్త్రాలను సిద్ధం చేసిం ది. ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులకు రుణాలు లభించకుం డా, ఆస్తుల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా చేయనుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ను బ్లాక్ చేయడం సహా వారికి వంట గ్యాస్ సబ్సీడీని రద్దు చేయనున్నది. సాఫ్ట్‌బ్యాంక్‌కు అరోరా గుడ్ బై సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలిగారు. ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజెంటెటివ్ ైడె రెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఇది జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈయన సాఫ్ట్‌బ్యాంక్ అడ్వైజర్‌గా కొత్తగా ఏడాదిపాటు సేవలు అందించనున్నారు. ఇక నికేశ్ అరోరా స్థానాన్ని కెన్ మియాచి భర్తీ చేయనున్నారు. రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్‌కు ఊరట విశిష్టమైన ఉత్పత్తులను విక్రయించే యాపిల్ వంటి కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి విడిభాగాలను దేశీయంగానే సమీకరించాలన్న తప్పనిసరి నిబంధన విషయంలో కొంత వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. 30 శాతం విడిభాగాలను దేశీయంగానే సమీకరించాలన్న తప్పనిసరి నిబంధనలో మూడేళ్ల వెసులుబాటును కల్పిస్తున్నట్లు డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. నిధుల సమీకరణ దిశగా జేఎస్పీఎల్ నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) కంపెనీ, ఎన్సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధులు సమీకరించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపిందని జేఎస్పీఎల్ వెల్లడించింది. మెగా స్పెక్ట్రం వేలానికి గ్రీన్‌సిగ్నల్ దేశీ టెలికం రంగంలో మెగా స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్ అయింది. మొత్తం ఏడు రకాల బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రంను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.5.66 లక్షల కోట్లు జమవుతాయని అంచనా. ప్రధానంగా హైస్పీడ్ 4జీ డేటా, వాయిస్ సేవలను టెల్కోలు విస్తరించేందుకు ఈ స్పెక్ట్రంతో వీలవుతుంది. సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్ సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నది. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్లను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించింది. టాటా సన్స్‌కు భారీ జరిమానా జపాన్‌కు చెందిన ఎన్టీటీ డొకొమో కు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చె ల్లించాలని భారత్‌కు చెందిన టాటా సన్స్ ను లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో జాయింట్ వెంచర్ విషయమై మోసానికి పాల్పడినందుకు టాటా సన్స్ ఈ పరిహారం చెల్లించాలని లండన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని ఎన్టీటీ డొకొమో తెలిపింది. టయోటా డీజిల్ ఇంజిన్ ప్లాంటు రెడీ జపాన్ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టయోటా’ తాజాగా రూ.1,100 కోట్ల వ్యయంతో బెంగళూరులో నిర్మించిన డీజిల్ ఇంజిన్ తయారీ ప్లాంటును గురువారం లాంఛనంగా ప్రారంభించింది. కంపెనీ ఇందులో శక్తివంతమైన గ్లోబల్ డీజిల్ (జీడీ) ఇంజిన్లను తయారు చేయనున్నది. దేశంలో కంపెనీకి ఇది తొలి జీడీ ఇంజిన్ ప్లాంట్. ఇక్కడ 1జీడీ-ఎఫ్‌టీవీ 2.8 లీటర్, 2జీడీ-ఎఫ్‌టీవీ 2.4 లీటర్ ఇంజిన్లను రూపొందిస్తామని కంపెనీ పేర్కొంది. రాస్‌నెఫ్ట్ వాటాపై దేశీ చమురు సంస్థల కన్ను రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌లో వాటా కొనుగోలు కోసం భారత చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, రాస్‌నెఫ్ట్ ఓజేఎస్సీలో 19.5 శాతం వాటాను రష్యా విక్రయించనున్నదని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 1,100 కోట్ల డాలర్ల విలువైన ఈ వాటాను భారత, చైనా కంపెనీలకు విక్రయించడానికి రష్యా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. డీల్స్.. * చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లో అత్యాధునిక హెల్త్‌కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా హైనాన్ ఎకొలాజికల్ స్మార్ట్ సిటీ గ్రూప్ (హెచ్ఈఎస్సీజీ)తో అపోలో హాస్పిటల్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. * భారత సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్, సెర్నోవ ఫైనాన్షియల్ కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. తర్వాతి తరం క్లౌడ్ ఆధారిత డెరివేటివ్ పోస్ట్ ట్రేడ్ ప్రాసెసింగ్ సర్వీస్‌ను అందించడం కోసం ఈ సంస్థలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. * స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎస్‌యూడీ)లో 18 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(డీఐఎల్ఐసీ)కు రూ.540 కోట్లకు విక్రయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వాటా విక్రయం కారణంగా ఈ జేవీలో దైచీ వాటా 26 శాతం నుంచి 44 శాతానికి పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 48 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌కు మిగిలిన 26 శాతం వాటా ఉంది. * మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్, లండన్‌కు చెందిన మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ ‘మ్యాజిక్ పోని’ను కొనుగోలు చేసింది. డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. * టెక్ మహీంద్రా కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీ తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన బయో ఏజెన్సీ కంపెనీని 4.5 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. * ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఐ కేర్ చెయిన్, ‘దృష్టి’లో పెట్టుబడులు పెట్టారు. -
భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఉండదు: అరవింద్
పాట్నా: ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్) విచారించదగిన పరిణామమే అయినా, దీని ప్రభావం భారత్‌పై ఉండదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం అన్నారు. భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్నారు. పాట్నాలో భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఓ సదస్సులో అరవింద్ పాల్గొని మాట్లాడారు. బ్రెగ్జిట్తో రాజకీయంగా, ఆర్థికంగా బ్రిటన్, యూరోప్లపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. -
ఒడిదుడుకుల వారం..
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ ప్రకంపనలకు తోడు జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారమే (ఈ నెల 30న)ముగియనుండడంతో స్టాక్ మార్కెట్లో ఈ వారం ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. బలహీన రూపాయి, విదేశీ నిధుల ప్రవాహం తక్కువ స్థాయిలో ఉండడం, నైరుతి రుతు పవనాల విస్తరణ, తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అయితే వేల్యూ బయింగ్, షార్ట్ కవరింగ్, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం, బ్రెగ్జిట్ నేపథ్యంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్రకటించే ఉద్దీపనలు ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చని వారంటున్నారు. ఈ వారమే విడుదలయ్యే ఎనిమిది కీలక రంగాలకు సంబంధించిన గణాంకాలు, మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ ఈ శుక్రవారం వెల్లడించనున్న భారత తయారీ రంగ పీఎంఐ గణాంకాల ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం... ఇవన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరింత క్షీణత... వారం ప్రారంభంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, స్టాక్ సూచీలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగానే ఉందని, రానున్న 18-24 నెలల్లో మరో రెండు ప్రతికూల సంఘటనల ప్రభావం తప్పదని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం... ఈక్విటీలపై అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించిందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. అయితే ఈ అనిశ్చితి స్వల్పకాలమే ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంకేతాలతో పాటు వర్షపాత విస్తరణను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని వివరించారు. జూన్ నెల డెరివేటివ్స్ ముగింపు కారణంగా ట్రేడర్లు ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో పొజిషన్లను రోల్ ఓవర్ చేస్తారని, ఫలితంగా హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో ముఖ్యంగా బ్రిటన్‌తో వ్యాపార సంబంధాలు అధికంగా ఉన్న కంపెనీల రాబడులు, లాభదాయకత తీవ్రంగానే ప్రభావితమవుతాయని, కరెన్సీలు నిలకడ స్థాయికి వచ్చేదాకా ఈ పరిస్థితులు కొనసాగుతాయని మిజుహో బ్యాంక్ ఇండియా వ్యూహకర్త తీర్థాంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. వాహన కంపెనీలు జూన్ నెల వాహన విక్రయ గణాంకాలను ఈ శుక్రవారం(వచ్చే నెల 1న) వెల్లడించనున్న నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లు వెలుగులో ఉంటాయి. యూరప్, ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో వ్యాపార సంబంధాలున్న వాహన, ఫార్మా, ఐటీ కంపెనీలపై ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచుతారని మార్కెట్ విశ్లేషకుల ఉవాచ. భారత్ బెటర్: అంతర్జాతీయ అంశాల ప్రభావం భారత్‌పై తప్పక ఉంటుందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. మన ఆర్థిక స్థితిగతులు బావుండటం, అంతర్జాతీయ ఒడిదుడుకుల ప్రభావానికి స్వల్పంగానే లోనవడం వంటి కారణాల వల్ల ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ కొంచెం నయమని పేర్కొంది. బ్రెగ్జిట్ కొనుగోళ్లకుఅవకాశం.. బ్రెగ్జిట్.. భారత ఇన్వెస్టర్లకు దేవుడిచ్చిన అవకాశమని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోది చెప్పారు. స్టాక్ సూచీలు నిట్టనిలువునా పతనమయ్యాయని, అయితే భారత మార్కెట్ల మార్గం ముందుకేనని ఆయన వ్యాఖ్యానించారు. దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బ్రెగ్జిట్ ఒక కొనుగోలు అవకాశమని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ ఎస్. నరేన్ చెప్పారు. స్వల్పకాలంలో మార్కెట్ గమనాన్ని అంచనా వేయడం కష్టమని, అయితే ఇటీవల పతనం దీర్ఘకాల కొనుగోళ్లకు ఒక మంచి అవకాశమని వివరించారు. భవిష్యత్తులో బ్రెగ్జిట్ భయాలేమీ ఉండవని, వర్షాలు సరిగ్గా కురవకపోతేనే ఆందోళన పడాల్సి వస్తుందని తెలిపారు. బ్రెగ్జిట్ రెఫరెండమ్ ఫలితాలు వెలువడిన రోజు బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,100 పాయింట్లు పతనమై, చివరకు 605 పాయింట్లు నష్టపోయింది. గతవారంలో సెన్సెక్స్ 228 పాయింట్లు (1.07 శాతం) నష్టపోయి 26,367 పాయింట్ల వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు (0.99 శాతం) నష్టపోయి 8,089 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్రెగ్జిట్‌కు ఎదురీదిన రిటైల్ ఇన్వెస్టర్లు బ్రెగ్జిట్ కారణంగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, భారత్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.118 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ రూ.115 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కంటే రిటైల్ ఇన్వెస్టర్ల నికర కొనోగుళ్లు అధికంగా ఉండడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు రూ.1,723.4 కోట్లుగా, అమ్మకాలు రూ.1,605.7 కోట్లుగా ఉన్నాయి. దీంతో వీరి నికర కొనుగోళ్లు రూ.117.74 కోట్లుగా ఉన్నాయి. మార్చి 23 నుంచి చూస్తే రిటైల్ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు ఇదే అత్యధికం. ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు రూ.100 కోట్లకు మించడం నాలుగు సందర్భాల్లోనే జరిగింది. ఇక బ్రెగ్జిట్ కారణంగా గత శుక్రవారం భారత ఇన్వెస్టర్ల సంపద రూ.1.8 లక్షల కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద 2.5 లక్షల కోట్ల డాలర్లు హరించుకుపోయింది. భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. బ్రోకర్లు కూడా నికర అమ్మకందారులుగా నిలిచారు. -
భారత్‌తో అమెరికా మైత్రికి ఉజ్వల భవిష్యత్
-టీ హబ్‌ను సందర్శించిన అమెరికా ఉప సహాయ కార్యదర్శి ఏంజెలా -బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి -ఎన్ఎస్జీ అంశంతో మద్దతు కొనసాగుతుందని ప్రకటన హైదరాబాద్: భారత్‌తో అమెరికా మైత్రీ బంధానికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఏంజిలా ప్రైస్ అగ్లేర్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ( క్లైమేట్ ఛేంజ్) రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏంజెలా.. శనివారం హైదరాబాద్‌లోని టీ హబ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. టీ హబ్‌లోని స్టార్టప్‌ల సీఈఓలతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్న భారత్, అమెరికా సంబంధాలు.. ఇటీవలి కాలంలో మరింత బలోపేతం అయ్యాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి వాషింగ్టన్ పర్యటన.. అమెరికా కాంగ్రెస్‌లో మోడి చారిత్రాత్మక ప్రసంగం.. ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయి వంటివని వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా అత్యంత ఆసక్తితో వున్నారన్నారు. మిలిటరీ, రక్షణ, ఇంధనం, ఆర్దిక అంశాలు.. తదితరాల్లో భారత్‌తో తాము బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ఏంజెలా వెల్లడించారు. వాణిజ్య సంబంధాల పరంగా భారీగా వృద్ది సాధించే అవకాశం ఇరు దేశాలకు వుందన్నారు. 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో 40శాతం మంది 20ఏళ్ల లోపు వారే కావడంతో భారీ వృద్దిరేటుకు అవకాశం వుందన్నారు. కేవలం ఏడాది వ్యవధిలో అమెరికాతో పాటు విదేశీ పెట్టుబడుల్లో హైదరాబాద్ 27శాతం వృద్ది రేటు సాధించడాన్ని ఏంజెలా ప్రస్తుతించారు. బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తి ప్రజాస్యామ్యాన్ని ముఖ్యమైన, సంక్షిష్టమైన వ్యవస్తగా పేర్కొన్న ఏంజెలా.. బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పౌరులు అనుకూలంగా ఓటు వేయడాన్ని ఏంజెలా ప్రస్తావించారు. బ్రెగ్జిట్ పరిణామాలపై భారత్ తరహాలో తామూ ఆసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు. అక్కడి వ్యవస్త గాడిన పడేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అణు సరఫరా బృందంలో ఇతర దేశాల వైఖరిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని.. అయితే సభ్యత్వం విషయంలో భారత్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ఏంజెలా వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ప్యారిస్‌లో భారత్, అమెరికాతో సహా పలు దేశాల నడుమ కుదిరిన ఒప్పందాన్ని ఆచరణలోకి తేవడంపై దృష్టి సారించామన్నారు. టీ -హబ్ పనితీరు భేష్ టీ హబ్ పనితీరు అద్భుతంగా వుందని.. గత నెలలో ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలోని ఐ హబ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రస్తావించారు. ఈ రెండు ప్రముఖ హబ్‌ల నడుమ కుదిరిన ఒప్పందం.. క్లైమేట్ ఛేంజ్‌ను ఎదుర్కొనేందుకు ఔత్సాహికులకు ప్రోత్సాహంగా వుంటుందన్నారు. ఔత్సాహికులకు ప్రోత్సాహం, శిక్షణ , అభివృద్ది, పెట్టుబడులు సమకూర్చడం ద్వారా టీ హబ్.. యువతకు కొత్త అవకాశాలు లభించేందుకు తోడ్పడుతుందన్నారు. 20 ఏళ్లుగా హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోందని ఏంజెలా ప్రైస్ అగ్లెర్ వ్యాఖ్యానించారు. -
బ్రెగ్జిట్‌పై గోవా వాసుల గోడు..
పణాజి: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం పట్ల ప్రపంచం బాధంతా ఒకటైతే మన గోవా ప్రజల బాధ అందులో ప్రత్యేకమైనది. పణాజిలోని పోర్చుగీస్ కాన్సులేట్ కార్యాలయం ఎప్పుడూ చాంతాడంతా గోవా వాసుల క్యూలతో కళకళలాడేది. బ్రెక్జిట్కు బ్రిటన్ పౌరులు ఓటేసిన శుక్రవారం నుంచి మాత్రం ఈ కార్యాలయం బోసిపోయింది. రోజుకు 30 నుంచి 40 వరకు పాస్‌పోర్టులు జారీచేసే ఈ కార్యాలయం శుక్రవారం రెండు, మూడుకు మించి పాస్‌పోర్టులు జారీ చేయలేక పోయింది. కారణం పాస్‌పోర్టుల కోసం గోవా వాసులు ఆసక్తి చూపకపోవడమే. గోవాను 450 సంవత్సరాలపాటు పాలించిన పోర్చుగీస్ 1961లో దాన్ని భారత్‌లో కలిపేసింది. అంతకుముందు పుట్టిన వారితోపాటు వారికి పుట్టిన పిల్లలు, ఆ పిల్లలకు పుట్టిన పిల్లలను పోర్చుగీసు పౌరులుగా పోర్చుగీస్ ప్రభుత్వం పరిగణిస్తూ వస్తోంది. అందుకనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారికి పోర్చుగీసు పాస్‌పోర్టులను జారీ చేస్తూ వస్తోంది. 1961 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది గోవా వాసులకు పోర్చుగీసు పాస్‌పోర్టులను జారీ చేసింది. పోర్చుగీసు యూరోపియన్ యూనియన్‌లో ఉండడం వల్ల పోర్చుగీసు పాస్‌పోర్టు కలిగిన వారు యూరోపియన్ యూనియన్‌లోని ఏ దేశంలోనైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఈ కారణంగా ప్రస్తుతం పోర్చుగీసు పాస్పోర్టుతో దాదాపు పాతిక వేల మంది గోవా వాసులు బ్రిటన్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎక్కువ మంది గోవా వాసులు బ్రిటన్‌వైపే మొగ్గు చూపడానికి కారణం గోవా వాసులకు ఇంగ్లీషు భాష రావడం ప్రధాన కారణం. ఇప్పుడు బ్రిగ్జిట్ కారణంగా వారికి పోర్చుగీసు వీసాపై బ్రిటన్ వెళ్లి ఉద్యోగం చేయడానికి, అక్కడే స్థిరపడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాన్ని వారు ఆశనిపాతంలా భావిస్తున్నారు. పోర్చుగీసు వీసాపై ఇక్ బ్రిటన్ వెళ్లేందుకు వీలు పడకపోవచ్చని, ముఖ్యంగా నైపుణ్యంలేని కార్మికులకు ఈ ఇబ్బంది తప్పదని గోవాలోని ఎన్ఆర్ఐ కమిషనర్ డాక్టర్ విల్ఫ్రెడా మిస్క్విటా వ్యాఖ్యానించారు. బ్రెగ్జిట్ కారణంగా తలెత్తే సమస్యలను ప్రపంచ దేశాలతోపాటు గోవా వాసులు కూడా భరించాల్సిందేనని ఆయన అన్నారు. గోవాలోని పోర్చుగీసు కాన్సులేట్ కార్యాలయం శుక్రవారం నుంచి బోసిపోవడమే కాకుండా ఫోన్ ద్వారా ఎంక్వైరీలు కూడా బాగా తగ్గిపోయాయని కాన్సులేట్ అధికారులు తెలిపారు. బ్రెగ్జిట్ గురించి తెలియని దక్షిణ గోవా ప్రాంతానికి చెందిన ఓ 76 ఏళ్ల జెన్నీ ఫెర్నాండెజ్, ఆమె కూతురు కరోలిని శుక్రవారం నాడు కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. జెన్నీ ఫెర్నాండెజ్ కొడుకు, కోడలు బ్రిటన్‌లో ఉద్యోగాలు చేస్తున్నారట. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారట. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తుండడంతో తన రెండేళ్ల మనవడిని చూసుకోవడానికి బ్రిటన్ వెళ్లేందుకు ఆమె పోర్చుగీసు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారట. బ్రెగ్జిట్ గురించి ఇప్పుడు తెలియడంతో ఆమె తనకు బ్రిటన్ వెళ్లేందుకు అవకాశం వస్తుందా, రాదా? అని దిగులు చెందుతున్నారు. చివరకు తన కొడుకు ఏం చెబితే అదే చేస్తామని ఆమె చెప్పారు. ఇక బ్రిటన్ వెళ్లేందుకు పోర్చుగీసు పాస్‌పోర్టు ప్రాసెస్ కోసం ఇక్కడికి వచ్చిన మరో ఇద్దరు పౌరులు కూడా బ్రెగ్జిట్ పరిణామంపై స్పందించారు. బ్రిటన్ వెళ్లేందుకు అవకాశం దొరక్కపోతే జర్మనీగానీ స్పెయిన్గానీ వెళతామని వారు చెప్పారు. -
బ్రెగ్జిట్ తో ఇండియాకు లాభమేనట..!
ఒక వైపు బ్రెగ్జిట్ వల్ల ప్రపంచ మార్కెట్ల కోటానుకోట్ల సంపద తుడిచిపెట్టుకుపోవడంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోఉంటుందని విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తున్నారు. మరోవైపు ఈ విపత్కర పరిణామం వల్ల భారత దేశానికి వచ్చి ముప్పు ఏమీ లేదని, పైగా ముఖ్యమైన లబ్దిదారుగా అవతరించనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్రెగ్జిట్ పరిణామం మూలంగా రాబోయే కాలంలో భారత్ కు అంతా మంచి జరగనుందని ఎస్ బ్యాంక్ సీఈవో రానా కపూర్ వ్యాఖ్యానించారు. చాలా తక్కువ సమయంలోనే మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత ఆర్థిక సంబంధాల్లో ప్రతికూల వెల్లువ ఉంటుందని తెలిపారు తదుపరి ఆరు నెలల్లో అమెరికాలో వడ్డీ రేటు పెంపులో ఆలస్యం కూడా దీనికి మరింత తోడ్పడుతుందన్నారు. ఈ అసమంజసమైన అస్థిరతను ఎదుర్కొనే సత్తామన పాలకులకు ఉందంటూ, ప్రభుత్వం సంస్థాగత ఆర్థిక సంస్కరణలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమ పెట్టుబడులకు ఇండియాను కేంద్రంగా ఎంచుకుంటారని, వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు భారత్ వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. కనుక ఈ పరిణామం బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ లాంటిదని సీఈవో కపూర్ శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, భారతదేశం మాత్రం స్థిరంగా నిలబడిందన్నారు. సంస్థాగత, నిర్మాణ చర్యల ద్వారా తన ఆర్థిక సత్తాను చాటుకుందని కపూర్ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సరళీకరణ, జీఎస్టీ బిల్లు లాంటి కీలక సంస్కరణల్లో ప్రభుత్వం పట్టుదల భారతదేశ అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. . అలాగే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగే అంశం పూర్తిగా ఊహించనిది కాదనీ, ఈ ఆందోళన మొత్తం తదుపరి వారాంతానికి మాయమవుతుందని కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
యూత్ కలిసుందామని.. పెద్దలు విడిపోదామని..
లండన్: చరిత్రాత్మక బ్రెగ్జిట్ నిర్ణయంతో బ్రిటిషర్లు తమ దేశ భవిష్యత్తును కొత్త మార్గంలోకి తీసుకెళ్లారు. కష్టనష్టాలతో కూడుకున్న ఆ దారిలో బ్రిటన్ సంతోషతీరాలకు చేరుతుందా? దుఃఖసాగరంలోనే ఎదురీదుతుందా? అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇంతకీ ఇంతటి కీలకమైన బ్రెగ్జిట్ రెఫరెండం ఓటింగ్ ఎలా జరిగింది? ఏయే వర్గాలు అనుకూలంగా, ఏయే వర్గాలు ప్రతికూలంగా ఓటు వేశాయి? మహిళల పాత్ర ఏమిటి? బ్రెగ్జిట్ తో బ్రిటన్ బాధలు తీరిపోతాయా? అనే అంశాలపై పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు గ్రాఫిక్ తో కూడిన నివేదికలు వెల్లడించాయి. ఆ నివేదికల్లోని చాలా అంశాలు షాక్ కు గురిచేసేలా ఉన్నాయి. ఉదాహరణకు యువకుల్లో అత్యధికులు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని ఓటువేయగా, 50 ఏళ్ల పైబడినవారు మాత్రం బ్రెగ్జిట్ కు మద్దతు పలికారు. కంపెనీల మేనేజర్లు నో చెప్పగా, కార్మికులు మాత్రం బ్రెగ్జిట్ కు జై కొట్టారు. బ్రెగ్జిట్ తో బ్రిటన్ కు మరిన్ని కష్టాలు తప్పవని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. రెఫరెండం సందర్భంగా బ్రిటన్ లో ఏం జరిగిందో ఈ గ్రాఫిక్స్ ను చూస్తే మీకే అర్థం అవుతుంది.. పిల్లలు కలిసుందామని.. పెద్దలు విడిపోదామని.. ఓటు హక్కు పొందేందుకు ప్రాథమిక వయసైన 18 ఏళ్ల నుంచి 24 వయసున్న యువకుల్లో అత్యధికులు బ్రిటన్ ఈయూలో కొనసాగాలని ఓటేయగా, 50 ఏళ్ల పైబడినవారిలో చాలా మంది బ్రెగ్జిట్ కు మద్దతు పలికారు. మేనేజర్లు నై.. లేబరర్లు జై.. బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల మేనేజర్లు తమ దేశం ఈయూలో కొనసాగాలని ఓటువేయగా, కార్మికులు, మాజీ కార్మికులు, వితంతువులు మాత్రం బ్రెగ్జిట్ కు ఓటేశారు. డోలాయమానంలో మహిళలు చాలా విషయాల్లో కచ్చితత్వాన్ని ప్రదర్శించే బ్రిటిష్ మహిళలు బ్రెగ్జిట్ ఓటింగ్ లో మాత్రం తడబాటుకు గురయ్యారు. ఓటు వేసిన వారిలో ఏకంగా 16 శాతం మంది 'ఏమీ తెలియదు'అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పురుషుల్లో 46 శాతం మంది బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా, 43 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటేసిన లండన్ నగరం గ్రేట్ బ్రిటన్ లోని ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్ లాండ్ రీజియన్లలో బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటింగ్ ఇలా సాగింది. లండన్ ప్రజల్లో 51 శాతం మంది బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని కోరుకున్నారు. అన్ని ప్రధాన పార్టీల్లో చీలికలు బ్రెగ్జిట్ రెఫరెండంపై ఒక్క యూకే ఇండిపెండెండ్ పార్టీలో తప్ప అన్ని ప్రధాన పార్టీల్లో చీలిక ఏర్పడింది. అధికార కంజర్వేటివ్ పార్టీలో 55 శాతం మంది బ్రెగ్జిట్ కు అనుకూలంగా, 38 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆర్థికంగా దెబ్బే! ఈయూ నుంచి విడిపోవడం ద్వారా బ్రిటన్ ఆర్థికంగా దెబ్బతినడం ఖాయమని 45 శాతం మంది భావిస్తోండగా, లేదు.. లాభపడుతుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. శరణార్థుల వలసలు ఆగినట్లే! ఈయూ సభ్యురాలిగా బ్రిటన్ మొన్నటివరకు.. సిరియా సహా ఇతర మధ్య ఆసియా దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. బ్రెగ్జిట్ రెఫరెండంకు ప్రధాన కారణమైన శరణార్థి సంక్షోభం నుంచి బ్రిటన్ బయటపడుతుందని, యూకేకు వలసలు తగ్గుతాయని 49 శాతం మంది నమ్ముతున్నారు. -
మన దేశం పరిస్థితి ఏమవుతుంది?
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం వల్ల తమ దేశంపై పడే ఆర్థిక ప్రభావం గురించి చర్చించేందుకు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రతినిధులు ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద బ్రెగ్జిట్ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. యెన్ ఎలా ఉండబోతోంది, బ్రిటిష్ ప్రాంతంలో ఉన్న జపనీస్ కంపెనీల పరిస్థితి ఏంటో కూడా సమీక్షిస్తారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటు వేయడంతో టోక్యో స్టాక్ ఎక్స్చేంజి దారుణంగా దెబ్బతింది. జపాన్ కంపెనీల ఎగుమతుల మీద కూడా దీనిప్రభావం గట్టిగానే ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే బ్రసెల్స్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని టోక్యో భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అశనిపాతంలా తగిలింది. యూకేలో జపాన్ కంపెనీలు 1300కు పైగా ఉన్నాయి. అమెరికా తర్వాత ఈ దేశమే యూకేతో వాణిజ్యం ఎక్కువగా చేస్తోంది. -
గూగులమ్మను తెగ వెతికేశారు
అసలు బ్రెగ్జిట్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే ఏం జరుగుతుంది, ఈయూ ఎప్పుడు రూపొందింది.. ఇలాంటి విషయాలేవీ రిఫరెండంలో ఓటు వేసే ముందు చాలామంది బ్రిటిషర్లకు తెలియదు. ఎందుకంటే, ఓటింగ్ పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెలువడిన తర్వాత చాలామంది ఈ తరహా ప్రశ్నలతో గూగుల్ సెర్చిని మోతెక్కించారట. కేవలం రిఫరెండం ఫలితాల గురించే కాక.. బ్రెగ్జిట్ గురించిన ప్రాథమిక సమాచారం కోసం చాలామంది గాలించినట్లు గూగుల్ తెలిపింది. ‘‘మనం యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతే ఏమవుతుంది’’ అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చిందని ప్రకటించిది. ఇంకా చాలామందికి అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, అందులో ఎన్ని దేశాలున్నాయి.. ఇలాంటి విషయాలు కూడా తెలియవని, ఇలాంటి అనేక ప్రశ్నలను గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వేశారని తెలిపింది. డేవిడ్ కామెరాన్ వయసెంత, ఆయన రాజీనామా చేశారా, ఆ తర్వాత ప్రధాని ఎవరవుతారు.. ఇలాంటి ప్రశ్నలు సైతం వచ్చాయి. అలాగే అసలు మనం యూరోపియన్లమేనా అనే ప్రశ్నను కూడా చాలా ఎక్కువ మంది అడిగారంటూ గూగుల్ వివరించింది. వాళ్లు వేసిన మరికొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి... నేను ఈయూ రిఫరెండంలో ఎలా ఓటు వేయాలి బ్రెగ్జిట్ అంటే ఏంటి ఈయూ రిఫరెండంలో ఎవరెవరు ఓట్లు వేయచ్చు ఈయూ రిఫరెండం ఎప్పుడు నిర్వహిస్తారు నేను ఎక్కడ ఓటు వేయచ్చు మనం ఈయూలో ఎందుకు ఉండాలి మనం ఈయూను ఎందుకు వదిలేయాలి మనం వదిలేస్తే ఏం జరుగుతుంది ఈయూ డిబేట్లో ఎవరు నెగ్గారు ఈయూలో ఏవేం దేశాలు ఉన్నాయి డేవిడ్ కామెరాన్ తర్వాత ఎవరు వస్తారు డేవిడ్ కామెరాన్ రాజీనామా చేశారా అసలు కామెరాన్ ఎందుకు రిఫరెండం పిలిచారు డేవిడ్ కామెరాన్ వయసెంత -
అయ్యయ్యో... ఎందుకలా ఓటేశాం!
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలంటూ ఓటు వేసి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసిన బ్రిటిషర్లు ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారట. అలా ఎందుకు ఓటు వేశామా అని తల పట్టుకుంటున్నారట. బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు మొత్తం అతలాకుతలమయ్యాయి. యూరప్ నుంచి విడిపోవాలంటూ ఉద్యమించిన నాయకుల వరకు సంబరంగానే ఉన్నా, ఓట్లు వేసిన బ్రిటిషర్లలో అసలు చాలామందికి తాము ఎందుకలా ఓటు వేశామో ఇప్పటికీ తెలియడం లేదట. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువ స్థాయికి బ్రిటిష్ పౌండు పడిపోవడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం, ఆస్తుల విలువలు కూడా దారుణంగా దిగిపోవడంతో ఒక్కసారిగా బ్రిటిషర్లకు దిమ్మతిరిగినట్లయింది. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఇది మరింత దిగజారుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాను సైతం విడిపోవడానికే మద్దతిస్తూ ఓటేశానని, కానీ ఈరోజు పొద్దున్న లేచి చూసుకున్నాక.. వాస్తవం చూసి మతి పోయిందని ఓ బ్రిటిష్ మహిళ తెలిపారు. మరోసారి ఓటు వేసే అవకాశం ఉంటే మాత్రం.. కలిసుందామనే అంటానన్నారు. -
'బ్రెగ్జిట్'కు కారణం నేనే: విష్ణు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం బ్రిటన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని భారీగా దెబ్బతీస్తున్న ఈ పరిణామంపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ జోక్ వేశాడు. అసలు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవటానికి కారణం తానే అంటూ కామెంట్ చేశాడు విష్ణు. '22వ తేదీన లండన్ వచ్చాను. ఇప్పుడు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయింది. పౌండ్ విలువ భారీగా పతనం అయ్యింది. నా మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు 007 (జేమ్స్ బాండ్) ఏం చేస్తాడో చూద్దాం' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విష్ణు, ఇండియాకు తిరిగి రాగానే తన తదుపరి ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నాడు. Came to London on 22nd. Leaving now, after bringing Britain out of EU & crashing the Pound. Mission accomplished. Now whatcha gonna do 007? — Vishnu Manchu (@iVishnuManchu) 24 June 2016 -
'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు'
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు మంచి నిర్ణయం అని కితాబిచ్చిన ట్రంప్‌పై హిల్లరీ బృందం తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాదన్న విషయాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయని హిల్లరీ సినియర్ పాలసీ ఆడ్వైజర్ జాక్ సుల్లివాన్ మండిపడ్డారు. పౌండ్ విలువ పతనం కావడం అనేది ట్రంప్ గోల్ఫ్ బిజినెస్‌కు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టే ట్రంప్ 'బ్రెగ్జిట్' నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చారని ఆయన విమర్శించారు. 'ట్రంప్ ఎల్లప్పుడూ ప్రపంచదేశాల మిత్రుత్వం, భాగస్వామ్యాల పట్ల అలక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ బలహీన, సురక్షితం కాని, ఆత్మవిశ్వాసం లోపించిన అమెరికా గురించి ఆయన మాట్లాడుతారు. ట్రంప్ స్వభావం అమెరికా అధ్యక్ష పదవికి పనికిరాదు' అని జాక్ విమర్శించారు. -
బ్రెగ్జిట్ ఎఫెక్ట్: సాఫ్ట్వేర్ పరిశ్రమకు ముప్పు?
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయం అక్కడ ఉంటున్న భారతీయుల ఉద్యోగాలకు ఎసరు తెస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. దాంతోపాటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా కొంతవరకు ముప్పు తప్పదని అంటున్నారు. యూరోపియన్ దేశాల నుంచి బ్రిటన్‌లోకి వలసలు ఎక్కువయ్యాయన్న ఆందోళనే ‘బ్రెగ్జిట్’ నిర్ణయానికి ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే కారణంతో అక్కడున్న భారతీయులకు సైతం ముప్పు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన లోకనాథన్ గణేశన్ యూకేలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన కంపెనీ ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉండటంతో.. ఇప్పుడు తన ఉద్యోగం ఏమవుతుందో తెలియట్లేదని భయపడుతున్నారు. 2015లో బ్రిటిష్ వనితను పెళ్లాడి ఆయన బ్రిటన్‌కు వచ్చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉందని, పరిస్థితి ఇంతకుముందులా లేదని లీడ్స్ ప్రాంతంలో ఉండే గణేశన్ చెప్పారు. యూకేకు వలస రావాలన్న ఆశలు ఇక వదులుకోవాల్సిందేనని తెలిపారు. యూరప్, బ్రిటన్లలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఐటీ కంపెనీల మీద కూడా బ్రెగ్జిట్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో అనిశ్చితి తప్పదని, యూకేలో తమ కార్యకలాపాలను మూసేసుకోవాలని ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయని తృప్తి పటేల్ అనే సాఫ్ట్వేర్ వాలిడేషన్ మేనేజర్ చెప్పారు. భారతదేశ ఐటీ ఎగుమతులలో 17 శాతం వరకు బ్రిటన్‌కే వెళ్తాయి. దాని విలువ దాదాపు రూ. 6.70 లక్షల కోట్లు!! ఇప్పుడు అక్కడి కంపెనీల కార్యకలాపాలు ఆగిపోతే.. మన సాఫ్ట్వేర్ పరిశ్రమ కూడా ఇబ్బంది పడక తప్పదని అంటున్నారు. -
బ్రిటన్‌తో విడిపోతాం
- ఈయూతో కలిసుంటాం - బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు - ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు ఎడిన్బర్గ్: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూసిన బ్రెగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి.. యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమైంది.. మరి బ్రిటన్ అధీనంలో ఉన్న స్కాట్లాండ్ పరిస్థితి ఏంటి? మొదట్నుంచీ ఈయూలో ఉండేందుకే మొగ్గుచూసిన స్కాట్లాండ్ ఇప్పుడు ఏం చేస్తుంది? బ్రెగ్జిట్‌పై నిర్వహించిన ఎన్నికల్లో స్కాట్లాండ్లో మెజారిటీ ప్రజలు ఈయూలో కొనసాగేందుకే మొగ్గుచూపారు. ఏకంగా 62 శాతం మంది ఈయూకే జైకొట్టారు. 38 శాతం మంది మాత్రమే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. దేశంలో ఎక్కువ మంది ఈయూలో ఉండేందుకే మొగ్గుచూపారు కాబట్టి భవిష్యత్తులో తమ అడుగులు అటువైపే ఉంటాయని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్, స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎన్‌ఎన్‌పీ) అధినేత నికోలా స్టర్జియన్ ప్రకటించారు. ‘‘ఈయూలోనే కొనసాగుతామంటూ స్కాట్లాండ్ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారు. నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి విడిపోవాలా వద్దా అన్న అంశంపై 2014లో స్కాట్లాండ్ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అయితే మెజారిటీ ప్రజలు బ్రిటన్‌లో ఉండేందుకే మొగ్గుచూపారు. అయితే ప్రస్తుతం ఈయూ నుంచి బయటకు వచ్చే బ్రిటన్‌తో కలిసి ఉండాల్సిన అవసరం లేదన్న డిమాండ్లు స్కాట్లాండ్లో వెల్లువెత్తుతున్నాయి. బ్రెగ్జిట్ తీర్పు నేపథ్యంలో స్కాట్లాండ్లో రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మాజీ ఫస్ట్ మినిస్టర్ అలెక్స్ సాల్మాండ్ డిమాండ్ చేశారు. ఒకవేళ స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోతే మూడు శతాబ్దాల చారిత్రక బంధాన్ని తెంచుకున్నట్టు అవుతుంది. అయితే బ్రిటన్‌తో విడాకులు అంత సులువు కాదని, ఒకవేళ విడిపోతే నిలదొక్కుకోవడం కష్టమని మరికొందరు వాదిస్తున్నారు. బ్రిటన్‌లేని ఈయూతో ఉండడం స్కాట్లాండ్కు పెద్దగా లాభించదని వారు చెబుతున్నారు. అటు ఉత్తర ఐర్లాండ్‌లో కూడా మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా, ఈయూలో కొనసాగేందుకు అనుకూలంగా ఓటేశారు. దీంతో అక్కడ కూడా బ్రిటన్ నుంచి బయటకు వచ్చేసి, ఐర్లాండ్‌తో కలిసిపోవాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ‘మాకు స్వాతంత్య్రం కావాలి’: యూకే రాజధాని లండన్‌ను యురోపియన్ యూనియన్‌లో ఉంచాలనే కొత్త ఉద్యమం మొదలైంది. మేయర్ సాదిక్ ఖాన్ నేతృత్వంలో దాదాపు 40వేల మంది లండన్ ప్రజలు తమ నగరాన్ని యూకే నుంచి స్వతంత్య్రం చేసి యురోపియన్ యూనియన్‌లో కలపాలంటూ సంతకాలు సేకరించారు. గురువారం నాటి రెఫరెండంలో 60 శాతం మంది లండన్ ప్రజలు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. 1958 నుంచి 58 ఏళ్లు... ప్రస్తుతం మనం చూస్తున్న యూరోపియన్ యూనియన్ మాస్ట్రిచ్ ఒప్పందం ద్వారా 1993 నవంబర్ 1న ఏర్పడింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ, ఆర్థిక కూటమి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్... సోవియట్, పశ్చిమ దేశాల ప్రభావిత ప్రాంతాలుగా చీలిపోయింది. యూరోప్ దేశాల మధ్య యుద్ధాల నివారణ, ఆర్థికాభివృద్ధి ఉద్దేశంతో 1945లో ప్రారంభమైన ‘ఏకీకరణ’ ఆలోచన... ఎన్నో పరిణామ దశలు దాటుకుంటూ ప్రస్తుతం 28 దేశాల స్థాయికి విస్తరించింది. 28 ఈయూ దేశాల్లో 19 ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ను అనుసరిస్తున్నాయి. 1958: యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఈఈసీ) ఏర్పాటు. 1963: కామన్ మార్కెట్లో చేరడానికి బ్రిటన్ దరఖాస్తు. ఫ్రాన్స్ వీటో. 1967లోనూ ఇదే పరిస్థితి. 1973: ఎట్టకేలకు కామన్ మార్కెట్లోకి బ్రిటన్ ప్రవేశం. 1975: జూన్ 5న ఈఈసీలో కొనసాగాలా? వద్దా? అన్న అంశంపై బ్రిటన్‌లో రెఫరెండమ్. కొనసాగడానికే 67 శాతంమంది అనుకూలం. 1992: ఎక్స్ఛేంజ్ రేట్ వ్యవస్థ నుంచి తప్పుకున్న బ్రిటన్. దీనితో బ్రిటన్ పౌండ్ భారీ పతనం. యూనియన్‌లో కొన్ని దేశాల మధ్య ఏకైక కరెన్సీ ‘యూరో’ ఏర్పాటుకు దారితీసిన పరిణామం. 1996: మ్యాడ్ కౌ వ్యాధి నేపథ్యంలో... బ్రిటన్ బీఫ్‌ను నిషేధించిన ఈయూ 2002: 12 ఈయూ దేశాలు యూరోలోకి ప్రవేశం. బ్రిటన్ దూరం. 2008: ప్రపంచ ఆర్థిక సంక్షోభం. గ్లోబల్ బెయిల్ అవులవుట్ ఫండ్ ఏర్పాటు. బ్రిటన్ భాగస్వామ్యం. 2011: రెండవ బ్యాంకింగ్ సంక్షోభం. బ్రిటన్‌సహా మరొక యూరోప్ ఇంటర్నేషనల్ బెయిలవుట్. 2016: ఈయూ నుంచి విడిపోవాలని బ్రిటన్ ప్రజల నిర్ణయం. -
భయపడొద్దు: రాజన్
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. తొలుత ఇన్వెస్టర్లలో ఆందోళన ఉన్నా... భారత్ మూలాలు పటిష్ఠంగా ఉన్న దృష్ట్యా తిరిగి దేశానికి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు ఏ దేశమూ తమ కరెన్సీ విలువను తగ్గించకూడదని సూచించారు. ‘‘కీలక పరిస్థితుల్లో ఏ దేశమూ రక్షణాత్మక చర్యలు తీసుకోకూడదు. మేమైతే అంతర్జాతీయ, దేశీ మార్కెట్లన్నిటినీ పరిశీలిస్తున్నాం. లిక్విడిటీ సమస్య రాకుండా చూస్తాం’’ అని బాసెల్ నుంచి ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ రాజన్ చెప్పారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ నుంచి విదేశాలకు తరలిపోయే నిధులు తక్కువే ఉంటాయని పేర్కొన్నారు. -
ఆందోళన అక్కర్లేదు: జైట్లీ
బీజింగ్: బ్రెగ్జిట్‌పై ఆందోళన అక్కర్లేదని, భారత ఆర్థిక వ్యవస్థ రక్షణ వలయాలు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఎదురయ్యే స్వల్ప-మధ్య కాలిక సవాళ్లను ఎదుర్కోవటానికి భారత్ సిద్ధమయిందన్నారు. ‘‘ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు, తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు వంటి స్థూల ఆర్థికాంశాలు పటిష్ఠంగా ఉన్నాయి. తక్షణం కొన్ని ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో వీటిని ఎదుర్కొనగలం’’ అని చెప్పారాయన. 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొనడానికి జైట్లీ ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నారు. -
బంగారం భగభగ!
♦ బ్రెగ్జిట్ దెబ్బకు దూసుకెళ్లిన పసిడి.. ♦ అంతర్జాతీయ మార్కెట్లో 8% జూమ్; ఔన్స్ 1,360 డాలర్లకు... ♦ దేశీయంగానూ దూకుడు; ముంబైలో 10 గ్రాములు రూ.30,905 లండన్/ముంబై: బ్రెగ్జిట్ తీర్పు ఊహించని విధంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంలో పెట్టుబడులకు పరుగులు తీశారు. ఫలితం... అంతర్జాతీయ మార్కెట్లో అన్నీ పతనం కాగా, పుత్తడి మాత్రం భగ్గుమంది. దేశీయంగానూ దూసుకెళ్లింది. లండన్ మార్కెట్లో శుక్రవారం ఒకానొక దశలో ఔన్స్ బంగారం ఏకంగా 8.1 శాతం ఎగబాకి 1,359 డాలర్లను తాకింది. 2008 తర్వాత ఒకే రోజులో ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి. అంతేకాదు!! ధర కూడా 2014 మార్చి తరవాత ఈ స్థాయికి చేరటం ఇదే. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో (కామెక్స్) కూడా ఔన్స్ బంగారం ధర ఒక దశలో 95 డాలర్లకుపైగా (8 శాతం) ఎగసి 1,362 డాలర్లను తాకింది. అయితే, రాత్రి 12 గంటల సమయానికి 59 డాలర్ల పెరుగుదలతో(5 శాతం మేర) 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సైతం కామెక్స్‌లో 5 శాతం దూసుకెళ్లి ఔన్స్‌కు 18.35 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3.5 శాతం పెరుగుదలతో 18 డాలర్ల వద్ద కదలాడుతోంది. దేశీయంగానూ రయ్య్.్ర.. బ్రెగ్జిట్ ప్రభావంతో దేశీ మార్కెట్లోనూ బంగారం భగ్గుమంది. శుక్రవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ఉండే మేలిమి బంగారం 10 గ్రాముల రేటు దాదాపు రూ.31 వేలకు దూసుకెళ్లింది. క్రితం ముగింపు రూ.29,680తో పోలిస్తే రూ.1,225 లాభపడి రూ.30,905కు చేరింది. ఇది 26 నెలల గరిష్టస్థాయి. 99.5 శాతం స్వచ్ఛత ఉండే పసిడి ధర కూడా ఇదే స్థాయిలో ఎగబాకి రూ.30,775 వద్ద స్థిరపడింది. వెండి ధర కేజీకి రూ.1,575 దూసుకెళ్లి రూ.42,930కి చేరింది. ‘రూపాయి భారీ పతనం, ఈక్విటీల్లో అమ్మకాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడివైపు మళ్లిస్తున్నారు. అందుకే ఈ జోరు’ అని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ కుమార్ జైన్ చెప్పారు. ఫ్యూచర్స్‌లో రూ.32 వేలకు... దేశీయంగా మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఫ్యూచర్స్ (ఆగస్టు కాంట్రాక్టు) ధర శుక్రవారం రూ. 1,935(6.7%) దూసుకెళ్లిరూ.31, 849కి చేరింది. ప్రస్తుతం 5% లాభంతో రూ. 31,400 వద్ద ట్రేడవుతోంది. అక్టోబర్ కాంట్రాక్టు ఒకానొక దశలో రూ.32,103ను తాకడం గమనార్హం. ఇదే జోరు కొనసాగి ముగిస్తే.. స్పాట్ మార్కెట్లో పసిడి రేట్లు మరింత ఎగబాకుతాయన్నది మార్కెట్ నిపుణుల మాట. బంగారానికి ఫుల్ డిమాండ్...: బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయని.. దీంతో రిస్క్‌తో కూడిన స్టాక్స్ వంటి సాధనాల్లో భారీ అమ్మకాలు జరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సురక్షితమైన బంగారం వైపు అంతా చూస్తుండటంతో దీనికి భారీగా డిమాండ్ పెరుగుతుందని క్రెడిట్ సూసీ గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మైఖేల్ స్ట్రోబెక్ చెప్పారు. -
ఐటీ రంగంలో అనిశ్చితి తప్పదు...
♦ భవిష్యత్తులో సవాళ్లతోపాటు అవకాశాలు ♦ నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రెగ్జిట్ వల్ల 108 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగంలో స్వల్పకాలంలో అనిశ్చితి తప్పదని నాస్కామ్ హెచ్చరించింది. దీర్ఘకాలంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉంటాయని వెల్లడించింది. ‘భారత్‌కు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో యూరప్ ఒకటి. మనకు రెండో అతిపెద్ద మార్కెట్. దేశీ ఎగుమతుల్లో 30 శాతం యూరప్దే. ఈ విపణిలో యూకే చాలా కీలకం. యూరోపియన్ యూనియన్‌లో పెట్టుబడులకు యూకే ద్వారంగా నిలుస్తోంది’ అని నాస్కామ్ వివరించింది. స్వల్పకాలంలో ప్రభావమిలా.. ♦ పౌండ్ విలువ పడిపోవచ్చు. క్లయింట్లను సంప్రతించి కాంట్రాక్టు విలువ సర్దుబాటు చేసుకోకపోతే కంపెనీ ఆదాయం తగ్గుతుంది. ♦ ఈయూలో భారీ ప్రాజెక్టులు అనిశ్చితిలో పడతాయి. ♦ ఈయూ కోసం ప్రత్యేకంగా కార్యాలయాలు, కార్యకలాపాలను భారత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలో యూకే నుంచి కొంత పెట్టుబడుల ఉపసంహరణ జరగొచ్చు. ♦ నిపుణులైన మానవ వనరులను ఈయూ, యూకేకు సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ♦ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకుల మార్పుల వల్ల కరెన్సీపై ప్రభావం. స్పష్టత ఇవ్వాలి..: చంద్రశేఖర్ బ్రసెల్స్, లండన్‌లోని విధాన నిర్ణేతలు తదుపరి చర్యలపై సాధ్యమైనంత త్వరగా స్పష్టతనిస్తే యూకే, యూరప్‌లో పెట్టుబడులు కొనసాగించేందుకు నమ్మకం ఏర్పడుతుందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. రెఫరెండం వల్ల ఏర్పడే వ్యతిరేక ప్రభావం తగ్గించేందుకు యూకే కట్టుబడి ఉందన్న విషయం అక్కడి విధాన నిర్ణేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందన్నారు. యూకేలోని 800 భారత కంపెనీల్లో 1,10,000 మంది స్థానికులు పనిచేస్తున్నారు. కాబట్టి భారత్‌తో పటిష్టమైన భాగస్వామ్యం కోసం బ్రిటన్ ఆసక్తి చూపవచ్చు. ఈయూకు చెందిన ఇతర సభ్యదేశాల మానవ వనరులపై యూకే పెద్దగా ఆధారపడలేదు. ఈ క్రమంలో భారత్‌తో సహా ఈయూయేతర దేశాల నిపుణులకు యూకే ద్వారాలు తెరిచినట్టే’ అని అన్నారు. ఐటీకి ప్రతికూలం:గోపాలకృష్ణన్ స్వల్పకాలంలో మన ఐటీ రంగానికి ప్రతికూలమేనని ఇన్ఫోసిస్ మాజీ సీఈవో ఎస్.గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. అనిశ్చితి పరిశ్రమకు శ్రేయస్కరం కాదన్నారు. -
అంతా మన మంచికే..!
అటు పరిపాలకుల నుంచి ఉన్నత అధికారుల వరకూ దాదాపు ఒకేఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నా... దీర్ఘకాలంలో బ్రెగ్జిట్ భారత్‌కు లాభించే అంశమేనన్నది వీరి వాదన. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే... స్థిరత్వం కొనసాగుతుంది పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. లిక్విడిటీ విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ తగిన చర్యలను తీసుకుం టుంది. ప్రస్తుతం ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలోనే కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. - జయంత్ సిన్హా, ఆర్థికశాఖ సహాయమంత్రి కలిసి వచ్చే అంశమే అనిశ్చితి సమయాల్లో పెట్టుబడుల అవకాశాలకు భారత్ వేదికగా మారబోతోంది. బ్రెగ్జిట్ భారత్‌కు పూర్తిగా సానుకూల అంశమే. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడం లాభిస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచకపోవటమూ సానుకూలమే. - అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు భవిష్యత్ బాగుంటుంది బ్రెగ్జిట్ ప్రభావం తక్షణం ఇతర అన్ని దేశాల్లానే భారత్‌పైనా పడుతుంది. అయితే పెట్టుబడులకు చక్కటి ప్రాం తంగా భారత్ కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వ్యూహాత్మకంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్లు భారత్‌కు చక్కటి మార్కెట్‌ను సృష్టించే అవకాశం ఉంది. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఎగుమతులకు దెబ్బే... భారత్ ఎగుమతులపై తాజా పరిణామాలు ప్రతికూలత చూపిస్తాయి. కరెన్సీ ఒడిదుడుకులు చాలా ముఖ్యాంశం. బ్రిటన్ పౌండ్, యూరోలు బలహీనపడతాయి. దీంతో ఆయా దేశాల ప్రొడక్టులతో విదేశాలకు విపరీతమైన పోటీ పెరుగుతుంది. అయితే ఆ రెండు ప్రాంతాలతో భారత్ వాణిజ్యంపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. - భారత ఎగుమతి సంఘాల సమాఖ్య భారత్-బ్రిటన్ బంధం పటిష్టం తాజా పరిణామం భారత్, బ్రిటన్ బంధం మరింత పటిష్టమవడానికి దారితీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. తాజా బ్రిటన్ పరిణామాలు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల దృష్టి వర్ధమాన దేశాలకు ప్రత్యేకించి భారత్‌వైపు మళ్లేట్లు చేస్తుంది. - జీపీ హిందూజా, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ -
ముడిచమురు మునిగింది..!
♦ బ్యారెల్ ధర 46.75 డాలర్లకు ♦ ఒకేరోజు 6.6 శాతం పతనం న్యూయార్క్: బ్రెగ్జిట్ దెబ్బకు ముడి చమురు (క్రూడ్) రేట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోనుందనే ఆందోళనలు తలెత్తటంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా డాలరు మారకం విలువ వివిధ కరెన్సీలతో దూసుకెళ్లడం కూడా క్రూడ్ పతనానికి కారణమయింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(నెమైక్స్)లో శుక్రవారం లైట్ స్వీట్ క్రూడ్ ధర ఏకంగా 6.6 శాతం క్షీణించి బ్యారెల్‌కు 46.75 డాలర్ల స్థాయికి క్రాష్ అయింది. ప్రస్తుతం ఇది 5 శాతం మేర నష్టంతో 47.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర కూడా ఒకానొక దశలో 6.5 శాతం క్షీణించి బ్యారెల్‌కు 47.55 డాలర్లకు పడిపోయింది. కడపటి సమాచారం ప్రకారం 4.5 శాతం నష్టంతో 48.7 డాలర్ల వద్ద కదలాడుతోంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఎంసీఎక్స్‌లో కూడా క్రూడ్ రేటు భారీగా దిగజారింది. శుక్రవారం ఒకొనొక దశలో(ఇంట్రాడే) జూలై కాంట్రాక్టు ధర 4.4% దిగజారి ఒక్కో బ్యారెల్‌కు రూ.3,207 కనిష్టాన్ని తాకింది. -
ఫార్మా, టెక్స్‌టైల్స్‌పై తీవ్ర ప్రభావం
బ్రెగ్జిట్ ప్రభావం యూరోపియన్ యూనియన్‌కు మాత్రమే పరిమితం కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటి మీదా ఉంటుంది. ఎగుమతులపై ఆధారపడిన దేశీ ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలపై ఈ ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఆటోమొబైల్ పరికరాల ఎగుమతి సంస్థలు, బ్రిటన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలపైనా కొంత ఉంటుంది. ఇక ఐటీ, బీపీవో కంపెనీలు అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవచ్చు. ఒకవేళ పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలిపోయి... రూపాయి విలువ క్షీణించి... ముడిచమురు ధరలు పెరిగితే గనక సమస్య తీవ్రమవుతుంది. దేశీయంగా వివిధ రంగాలు ఒడిదుడుకులకు లోనుకాక తప్పదు. కానీ త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయి. ఆర్బీఐ, ఆర్థిక శాఖ కలిసి ఈ దిశగా పనిచేస్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండు సుమారు 20 శాతం మేర పతనమయ్యే అవకాశముంది. ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో డి.ఎస్.రావత్, సోచామ్ సెక్రటరీ జనరల్ -
బ్రిటన్‌తో లింకుంటే కుదేలే!!
♦ పలు కంపెనీల షేర్లు దారుణంగా పతనం ♦ మధ్యాహ్నానికి పరిస్థితి మార్పు; ♦ కాస్త రికవరీ కలసి వచ్చిన దేశీయ సంస్థల కొనుగోళ్లు టాటా మోటార్స్‌కు దశ తిరిగిందల్లా లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొన్నాకే. లాభాల వర్షం మొదలయ్యింది కూడా ఆ టేకోవర్ తరవాతే. కాకపోతే ఇపుడు జేఎల్ఆర్ వ్యాపారంలో 20 శాతం బ్రిటన్‌లోనే ఉంది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్లిపోవటం ఖాయమవటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేరు విపరీతమైన కుదుపులకు లోనయింది. ఒక దశలో 15 శాతం వరకూ పడిపోయింది. తరవాత కొంత తేరుకుంది. ఇదే కాదు. బ్రిటన్‌లో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలన్నిటి పరిస్థితీ ఇదే. ఆ మాటకొస్తే బ్రిటన్‌తో ఏమాత్రం సంబంధంలేని కంపెనీల పరిస్థితీ ఇదే. స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా పతనమై... అంతలోనే తేరుకున్నాయి. ఆయా కంపెనీల పరిస్థితిని చూస్తే... ఫార్మా షేర్లు బేర్: యూరప్‌తో వ్యాపార సంబంధాలున్న బారత ఫార్మా కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఇంట్రాడేలో 3-8% నష్టపోయిన ఫార్మా షేర్లు... చివర్లో కాస్త కోలుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే పౌండ్ మారకం విలువ 10% పతనం కావడంతో... ఈ మేరకు ఫార్మా కంపెనీల ఆదాయం క్షీణిస్తుందని అంచనా. యూరప్ నుంచి అరబిందో ఫార్మాకు 22%, టొరంట్ ఫార్మాకు 13%, గ్లెన్‌మార్క్‌కు 9%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు 5%, లుపిన్కు 3% చొప్పున ఆదాయాలు వస్తున్నాయి. ఐటీ కాస్తంత తక్కువే: పలు భారత ఐటీ కంపెనీలకు యూరప్ నుంచి... ముఖ్యంగా ఇంగ్లండ్ నుంచే ఆర్డర్లు వస్తున్నాయి. భారత ఐటీ- ఐటీఈఎస్ రంగాలకు యూరప్ రెండో అతి పెద్ద మార్కెట్. 10వేల కోట్ల డాలర్ల ఐటీ పరిశ్రమలో 30 శాతం ఆదాయం యూరప్ నుంచే వస్తోంది. దీంతో యూరప్ నుంచి అధికాదాయం వచ్చే ఐటీ కంపెనీలు.... టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 నుంచి 5% మధ్య నష్టపోయాయి. వాహనాలది నష్టాల పరుగు: బ్రెగ్జిట్ కారణంగా వాహన విక్రయాలు తగ్గుతాయనే అంచనాలున్నాయి. దీంతో యూరప్‌తో వ్యాపార సంబంధాలున్న వాహన షేర్లు 10% వరకూ నష్టపోయాయి. టాటా మోటార్స్ 8% నష్టపోయింది. ఇది ఇంట్రాడేలో 15% పడిపోయింది. జేఎల్ఆర్కు కావలసిన విడిభాగాల్లో 40%న్ని యూరప్ నుంచే సమీకరిస్తున్నారు. లోహ షేర్లు విలవిల: టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత... ఈ లోహ షేర్లన్నీ 5-7 శాతం రేంజ్లో నష్టపోయాయి. బ్రెగ్జిట్ వల్ల ఈ కంపెనీల అమ్మకాలు తగ్గుతాయని, కార్యకలాపాల వ్యయాలు పెరుగుతాయని అంచనాలున్నాయి. ఈ రికవరీకి కారణాలను చూస్తే: బ్రెగ్జిట్‌ను ఎవ్వరూ ఊహించలేదు కనక ఒక్కసారిగా మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడే స్థాయిలో వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే మధ్యాహ్నం ఆరంభమైన యూరప్ మార్కెట్లు ఊహించినంత పతనం కాలేదు. కొంత రికవరీ కూడా అయ్యాయి. ఇది కాస్త ఊతమివ్వగా... దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో మార్కెట్ కొంత కోలుకుంది. మార్కెట్ల పతనం ఎప్పుడెక్కువ? 2008 ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోన్న బ్రె గ్జిట్ అది 2008, సెప్టెంబర్-15. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి కారణం లేమన్ బ్రదర్స్ దివాలా తీయడమే. ఇప్పుడు ఆ ఘటనలను గుర్తుకు తెస్తోంది బ్రెగ్జిట్ ఉదంతం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2008తో పోలిస్తే ఇప్పటి బ్రిటన్ బ్రెగ్జిట్తో కారణంగానే కొన్ని ప్రపంచ మార్కెట్లు పాయింట్ల పరంగా ఎక్కువగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే మాత్రం ఆ సమయంలోనే మార్కెట్లు ఎక్కువగా పడ్డాయి. -
డాలర్ డ్రీమ్స్.. రూపాయి క్రాష్
71 పైసలు డౌన్; 67.96 వద్ద క్లోజ్ ముంబై: బ్రెగ్జిట్ ప్రకంపనలతో రూపాయి విలవిల్లాడింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలడం, డాలర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవటంతో డాలరుతో రూపాయి మారకం విలువ నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం ఒక్క రోజే 71 పైసలు ఆవిరై.. 67.96 వద్ద ముగిసింది. 2015, ఆగస్టు 24 తర్వాత ఒకే రోజు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో 67.78- 68.22 శ్రేణిలో రూపాయి కదలాడింది. ఇప్పటివరకూ డాలరుతో రూపాయి ఆల్‌టైమ్ కనిష్టస్థాయి 68.7 పౌండ్ క్రాష్... బ్రెగ్జిట్ ప్రభావం కారణంగా పౌండ్తో రూపాయి మారకం విలువ 8% ఎగబాకి 93.13కు చేరింది. గడిచిన వారం రోజుల్లో పౌండు ధర రూపాయితో పోలిస్తే 103 నుంచి 93.13కు రావటం గమనార్హం. ఇక యూరోతో పోలిస్తే రూపాయి విలువ కూడా 2.4 శాతం ఎగసి 74.8 వద్ద స్థిరపడింది. -
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం
జాతిహితం పిరికితనంతో డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్‌ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగును చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వహించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్లో పేషంట్‌ను నిలువునా కోసేసి పారిపోయారు. బ్రెగ్జిట్ పర్యవసానాలు ద్రవ్య మార్కెట్లపై చూపే ప్రభావం పట్ల ఆందో ళనకు పరిమితమై మనం ఆ పరిణామాన్ని సంకుచితమైన, ఏక ముఖ దృష్టితో చూస్తూ తప్పు చేస్తున్నాం. లేదా, ప్రపంచీకరణను తిరగదోడి, తిరిగి పాత జాతీయవాదానికి తిరిగి పోవడంగా మాత్రమే దీన్ని చూస్తున్నాం. కానీ బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం) రాజకీయ పర్యవసానాలు అంతకంటే చాలా ప్రబలమైనవి, తీవ్రమైనవి. ఆగ్రహభరితమైన నేటి కాలంలో ఈ పరిణామం... శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఆధునిక, ప్రజాస్వామ్య రాజ్యపు అసలు పునాదినే సవాలు చేస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కావాలని గావుకేకలుపెట్టే కొత్త ధోరణి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. కీలక నిర్ణయా లపై, సమస్యలపై తరచుగా ప్రజాభిప్రాయ సేకరణలను చేపట్టడం, ప్రజా ప్రతినిధులను తిరిగి పిలిచే హక్కు, దామాషా పద్ధతి ప్రాతినిధ్యం, వ్యవస్థ సాధికారతను బలహీనపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది అరాచ కానికి మాత్రమే దారి తీస్తుంది. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిపై ప్రజాభిప్రాయ సేక రణ జరపాలని అరవింద్ కేజ్రీవాల్ కోరడం గురించి కాదు నా ప్రధానమైన ఆందోళన. అదృష్టవశాత్తూ మన రాజ్యాంగం అందుకు అవకాశం కల్పించ లేదు లేదా మనం మొట్టమొదటిసారిగా ఆ భావనను కశ్మీర్లో పరీక్షించాలనీ అనుకోలేదు. ఆధునిక రాజ్యం విశ్వసనీయతను దెబ్బతీసే అంతకంటే పెద్ద ముప్పే ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణల వల్ల ఉంది. ప్రజాస్వామ్యం పునాదికే చేటు ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ప్రత్యక్ష ఓటింగును నిర్వహించడం ప్రధానంగా యూరోపియన్ వ్యామోహం. అయితే అత్యంత కీలకమైన ఒక అంశాన్ని నిర్ణయించడానికే కాదు, సర్వసత్తాకశక్తిగా దేశం కట్టుబడి ఉండాల్సిన అంశా లను నిర్ణయించడానికి కూడా దాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. పాఠశాల బోధనాంశాలకు, కొన్ని వివాదాస్పదమైన జాతీయ స్థాయి పన్ను లకు పరిమితమైతే ప్రజాభిప్రాయ సేకరణలు గమ్మత్తుగానూ, ముద్దుగానూ ఉంటాయి. ఇటీవల స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మినార్ల వంటి నిర్మాణాలను నిషేధించడం పూర్తి అధికసంఖ్యాకవాదం, జాత్యహం కార పూరితం కాకున్నా మొరటుదనం. స్విట్జర్లాండ్ పలు రంగాలలో ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పి ఉండవచ్చు. కానీ అక్కడి ప్రజాస్వామ్యం స్త్రీలకు 1971లోగానీ ఓటు హక్కును ఇవ్వలేక పోయింది. అది కూడా పార్లమెంటు అలా నిర్ణయించాక 12 ఏళ్లకు గానీ అది జరగలేదు. బహుశా అంతా పురుషులతోనే జరిపే ప్రజాభిప్రాయ సేకరణ దాన్ని అడ్డు కుంటుందని భయపడటమే అందుకు కారణం కావచ్చు. అతి భయంకరమైన వైరస్ల కంటే ఎక్కువ త్వరగా సోకే అంటు వ్యాధులు చెడు భావాలు. ఇప్పటికే నెదర్లాండ్‌లో ఈయూపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమాండు ఊపందుకుంటోంది. క్యుబెక్, స్కాట్లండ్ల వేర్పాటువాద ఒత్తిడులను కెనడా, బ్రిటన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి అపకేంద్రక ధోరణులు మరింత సంక్లిష్టమైన, వైవిధ్యభరితమైన ఇతర దేశాలకు కూడా విస్తరించగలుగుతాయి. సుస్థిరత, నమ్మకం ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణీత కాలంపాటూ అధికారంలో ఉండటం అనే పునాదిపై ఆధునిక ప్రజాస్వామ్యం నిర్మితమైంది. తరచుగా ప్రజాభి ప్రాయ సేకరణల పేరిట జరిగే ఓటింగులు, అనూహ్యమైన అంతరాయాలు ఆ పునాదిని పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఏ ప్రభుత్వమైనాగానీ విశాల దేశ లేదా ప్రజా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలను తీసుకోవడాన్ని అసాధ్యం అయ్యేలా చేస్తాయి. తమను ఎవరు పరిపాలించాలనే విషయంలో ఓటర్లకు అత్యున్నత నిర్ణయాధికారం ఉండగా... రాజ్యాంగం, చట్టాలు, ప్రాథమిక సూత్రాలకు ఒక మేరకు స్థిరత్వం, ఉల్లంఘనీయత ఉండటమే ఆధునిక ప్రజాస్వామ్యం గొప్పదనం. కాబట్టి ఆధిక్యతావాద అతిక్రమణలకు ప్రత్యక్ష ఓటు సాకుగా మార రాదు. మన దేశానికి అన్వయిస్తే... అతిగా సరళీకరించిన ఉదాహరణలతో దీన్ని మరింత వివ్లవకరంగా భారత దేశానికి అన్వయిద్దాం. ఢిల్లీ పూర్తి రాష్ట్ర స్థాయి అధికారాల కోసం ఓటిం గ్ను నిర్వహిస్తుంది. తమిళనాడు తనను ఆర్టికల్ 370 జాబితా కిందకు తేవాలని లేదా 2010 నాటి రాళ్లు రువ్విన కాలపు ఆగ్రహావేశపూరిత క్షణాల్లో జమ్మూ కశ్మీర్ తనకు సర్వసత్తాకత కావాలని, పాకిస్తాన్లో భాగం కావాలని ‘ఎంచు కుంటే’నో? విదర్భ, బుందేల్‌ఖండ్ వాటికవే రాష్ట్రాలుగా ప్రకటించుకో వచ్చు. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి, యావద్భారతం దానికి ఒకప్పటి పూర్తి కేంద్రపాలిత రాష్ట్ర స్థాయిని పునరుద్ధరించాలని కచ్చితంగా ఓటు చేస్తుంది. ప్రజల మానసిక స్థితులలోని ఊగిసలాటల వల్ల కలిగే అస్థిరత్వాన్ని నివా రించడం కోసమే రాజ్యం అధికారాన్ని కచ్చితంగా నిర్వచించారు, సువ్యవ స్థితం చేశారు. వాటికి పరిమితులున్నాయి. పక్షపాతరహిత సంస్థలైన కోర్టులు, ఎన్నికల కమిషన్, కాగ్, సీఐసీ, తదితరాల ద్వారా ప్రధానంగా అవి అమలవుతుంటాయి. ప్రభుత్వం తమకు ఓటు చేయని, లేదా లెక్కలోకి రాని ఓట్లున్న వారిపట్ల వివక్ష చూపకుండా నివారించడం వాటి లక్ష్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నేడు ఉదారవాద ఉద్యమపు ప్రధాన నినా దంగా అవతరించింది. కాబట్టి ఇదీ ప్రశ్న: మీరు కోర్టు తీర్పును ఎంచు కుంటారా? అది జరగకపోతే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377లోని కాల దోషంపట్టిన అంశాలకు పార్లమెంటరీ సవరణ కావాలా? లేక అయోధ్యలో ఆలయ నిర్మాణ ం కోసమూ, 370 అధికరణాన్ని, సింధు లోయ ఒప్పందా లను, సిమ్లా ఒప్పందాన్ని, తాష్కెంట్ ప్రకటనను రద్దుచేస్తూ ఓటింగ్‌ను నిర్వహించడం కావాలా? ఇవన్నీ ఒక పక్షానికి మొగ్గుచూపేలా ప్రేరేపించేవే. ఓటింగుకు పెడితే, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి అండతో అగ్రకుల ఉన్నత వర్గాలు తమకు కల్పించుకున్న విశేషహక్కులను కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం జనాభాలో 20 నుంచి 25 శాతంగా ఉన్న అగ్రకులాలకు తమకు తాముగా శాశ్వత ‘ప్రతిభ’ను అంటగట్టేసుకుని అను భవిస్తున్న అవకాశాలలో సగం మాత్రమే వారికి మిగులుతాయి. అవునూ, మీరు... 2001 డిసెంబర్లో పార్లమెంటుపై దాడి తర్వాత లేదా 26/11 ముంబై దాడుల తర్వాత వారంలోగా పాకిస్తాన్‌పై యుద్ధానికి పోవాలా, లేదా? అని జాతీయ స్థాయి ఓటింగ్‌ను నిర్వహించేవారా? ఆ రెండు సంద ర్భాల్లోనూ నాటి ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని విస్మరించి వివేకవంతమైన మార్గాన్ని అనుసరించాయి. నిర్ణీత పదవీ కాలంపాటూ మనల్ని పరిపాలిం చాలని ప్రభుత్వంపై మనం విశ్వాసం ఉంచడమే సరిగ్గా అందుకు కారణం. ఈ అసంబద్ధత ఇలాగే సాగిపోతూ ఉండగలదు. ఓ సీనియర్ బీజేపీ ఎంపీ ట్విటర్లో రఘురామ్ రాజన్‌కు రెండో దఫా పదవి ఇవ్వాలా, వద్దా? అని ఓటింగ్ నిర్వహించారు. ‘‘ఓటర్లు’’ అంతా ఆయన అనుచరులే. ‘‘వద్దు’’ అంటూ అత్యధిక ఆధిక్యతతో వారంతా ఓటింగ్ చేశారు. మరొక బీజేపీ రాష్ట్ర మంత్రి కూడా అలాగే పులికి బదులుగా ఆవును మన జాతీయ జంతువుగా గుర్తించాలంటూ ట్విటర్/సోషల్ మీడియాలో ఓటింగ్ చేపట్టారు. భారీ ఆధిక్యతతో ‘‘ప్రజాభిప్రాయం’’ ఆవును ఎన్నుకుంది. వెర్రిబాగుల పులికి తాను తన స్థానాన్ని కోల్పోయానని తెలియనైనా తెలియదు. అరాచకం పరిష్కారం కాదు ప్రపంచ అర్థిక వ్యవస్థలు ప్రతిష్టంభలో పడి, నిరుద్యోగం పెరుగు తుండగా పాత వ్యవస్థ పట్ల కొత్త అసంతృప్తి పెల్లుబుకుతోంది. కానీ పరిష్కారం అరాచకం కాదు. గతం పట్ల, ప్రత్యేకించి ‘‘ప్రాచీనులు’’ చేసిన గొప్ప పనుల పట్ల కొత్త ఆకర్షణ పెరుగుతోంది. రోమన్ చక్రవర్తులు తమ నిర్ణయాలకు సమంజసత్వాన్ని కల్పించడం కోసం అలాంటి సర్కస్లను మహా సొగసుగా నిర్వహించగలిగినా కొంతవరకు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేశారు. అయితే అంతకంటే ప్రాచీన కాలంనాటి వాటి గురించి కూడా చాలానే చెప్పారు. ప్రత్యేకించి మన వైశాలి అలాంటిదే. బిహార్‌లోని ముజ ఫర్పూర్కు కార్లో పయనిస్తుంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజా స్వామ్యమైన వైశాలి ఆహ్వానం పలుకుతున్న బోర్డులు కనిపి స్తాయి. మగధ సైన్యాలు దండెత్తగా వైశాలి వారితో యుద్ధం చేయాలా, చేస్తే ఎప్పుడు, ఎక్కడ చేయాలని చర్చిస్తూ ఉండగానే... మగధ సేనలు వైశాలిని ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశాయని చరిత్రకారులు చెబుతారు. క్రీడలలో తరచుగా మనం విజయం చేతికి అందిందనగా కూడా ఓటమిని వరిస్తుండవచ్చు. భారతీయులకు ఇతరుల చర్చను లాగేసుకోవడం అనే ప్రత్యేకమైన, దీర్ఘకాలిక బలహీనత ఉంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యంలేని పిరికితనంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్‌ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆయన ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగ్‌ను చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వ హించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్లో పేషం ట్ను పడుకోబెట్టి నిలువునా కోసేసి పారిపోయారు. ఇది ఏవిధంగానూ అనుసరించకూడని ఉదాహరణ. తాజా కలం: 1974 పోఖ్రాన్-1 అణు పరీక్షకు ‘‘బుద్ధుడు నవ్వు తున్నాడు’’ అనే పేరు ఎందుకు పెట్టారు? చూడబోతే ఇందిరా గాంధీకి, ఆమె సలహాదారులకు కూడా మగధ, వైశాలిని ధ్వంసం చేసిన చరిత్ర తెలిసే ఉండాలి. బుద్ధుడు దాని పట్ల చాలా కలత చెందాడని, ఎవరూ కఠిన నిర్ణయాలను తీసుకోలేని ప్రత్యక్ష ప్రజాస్వామానికి బదులు వైశాలికి కూడా ప్రతినిరోధకంగా పనిచేయగల సైనిక శక్తి ఉండివుంటే అది ఈ విధ్వంసాన్ని నివారించగలిగేదని ఆయన భావించారనే గాథ ప్రచారంలో ఉంది. సైనిక శక్తిలోని అసమతూకం వల్ల కలిగే ప్రమాదాల గురించి బుద్ధుడు కలత చెందారు. భారత్ ఎట్టకేలకు సైనికపరమైన ప్రతినిరోధక శక్తిని సాధించిదని విన్నప్పుడు ఆయన నవ్వకపోతే ఏంచేస్తాడు? శేఖర్ గుప్తా twitter@shekargupta -
బ్రెగ్జిట్ బాంబు!
అందరూ భయపడిందే నిజమైంది. బ్రెగ్జిట్ బాంబు పేలింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి నిష్ర్కమణే తమ అభీష్టమని 51.9 శాతంమంది బ్రిటన్ పౌరులు తేల్చిచెప్పారు. ఈయూలోనే కొనసాగాలని భావించినవారు 48.1 శాతం మాత్రమే ఉన్నారని శుక్రవారం వెల్లడైన రెఫరెండం ఫలితాలు తేల్చి చెప్పాయి. రెఫరెండం హడావుడి మొదలైన నాలుగు నెలలనాడు బ్రెగ్జిట్ అనుకూల వాదుల కంటే ఎంతో ముందున్న యధాతథవాదులు రోజులు గడుస్తున్నకొద్దీ బలహీనపడుతున్న వైనాన్ని వరస సర్వేలు వెల్లడిస్తూనే ఉన్నాయి. చిట్టచివరి దశలో సేకరించిన సర్వేల్లో యధాతథవాదులు 51 శాతంగా ఉన్నారు. ప్రత్యర్థుల బలం 49 శాతం మాత్రమే. అయితే ఇది పోలింగ్ రోజున తిరగబడవచ్చునని కూడా సర్వేలు జోస్యం చెప్పాయి. ముఖ్యంగా ఓటింగ్ శాతం తగ్గిన పక్షంలో విడిపోదామనేవారి గెలుపే ఖాయమన్నాయి. అయితే ఓటింగ్ ముమ్మరంగా జరిగినా అంతిమ విజయం బ్రెగ్జిట్వాదులకే దక్కింది. ఫలితాలు వెలువడ్డ కాసేపటికే ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బ్రిటన్... ఆ దేశంతోపాటు పాశ్చాత్య దేశాలూ, అటుపై మొత్తం ప్రపంచ దేశాలూ ఎదుర్కొనబోయే అనేకానేక ఉత్పాతాలతో పోలిస్తే కామెరాన్ రాజీనామా ఓ చిన్న కుదుపు మాత్రమే. చూడటానికిది ఈయూలో ఉండటమా, బయటికి రావడమా అన్న అంశంపై జరిగిన హోరాహోరీ పోరుగా మాత్రమే కనబడుతున్నా... సారాంశంలో అంతకు మించిన వైరుధ్యాలు ఎన్నో ఇందులో దాగున్నాయి. అవి రాగలకాలంలో బ్రిటన్‌లో ఎలాంటి విపత్తులను సృష్టించగలవో ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేరు. ఆ వైరు ద్యాలతో పాలకులు వ్యవహరించే తీరుతెన్నులు వాటిని నిర్ణయిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్ ఖండ దేశాలను ఏకం చేయడానికి సుదీర్ఘకాలం సాగిన చర్చోపచర్చలు 1958లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఈఈసీ)కి జన్మనిస్తే ఆ తర్వాత అది ఈయూగా రూపుదిద్దుకోవడం 1973లో సాధ్యపడింది. ఉచ్ఛస్థితిలో ఉన్న 60వ దశకంలో ఈఈసీ సభ్యత్వ విస్తరణను ఫ్రాన్స్ గట్టిగా వ్యతిరేకిస్తే అనంతరకాలంలో అందుకు భిన్నమైన వాదనలకు బలం చేకూరింది. యూరప్ ఖండంలోని చిన్నా చితకా దేశాలను కూడా కలుపుకుంటేనే తిరుగులేని శక్తిగా ఎదగగలమన్న అభిప్రాయానిది పైచేయి అయింది. 90వ దశకం మొదట్లో తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు రాజ్యాల పతనం దీనికి తోడైంది. పర్యవసానంగా ఈయూలో కొత్త దేశాలు చేరుతూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మితవాదులు, ఛాందసవాదులు ఇటీవలి సంవత్సరాల్లో బలపడుతున్న జాడలు కనబడుతూనే ఉన్నాయి. అమెరికాలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీ పెన్, నెదర్లాండ్స్‌లో పార్టీ ఫర్ ఫ్రీడం నాయకుడు గిర్ట్ వైల్డర్స్, ఇటలీలో నార్తర్న్ లీగ్ నేత మేటియో సాల్విని వంటి మితవాదులు జాతీయవాదాన్ని నూరిపోస్తున్నారు. మన దేశం, మన ఉద్యోగాలు, మన జాతి అనే నినాదాలిస్తున్నారు. ఇప్పుడు యూరప్‌కు గుదిబండగా మారిన శరణార్థుల సమస్య, అక్కడక్కడ చోటుచేసుకుంటున్న ఉగ్రవాద ఘటనలు ఇందుకు మూల కారణాలని వస్తున్న విశ్లేషణల్లో అర్ధ సత్యం మాత్రమే ఉంది. అవి తక్షణ కారణం అయితే కావొచ్చుగానీ అంతకుమించి దశాబ్దాలుగా అమలవుతున్న ప్రపంచీకరణ విధానాల్లో ఇందుకు సంబంధించిన బీజాలున్నాయి. ప్రపంచీకరణ తళుకుబెళుకులు చూసి మూర్ఛిల్లి దాన్ని పెట్టుబడి దారీ విధాన విజయంగా అభివర్ణించినవారు ఆ విధానాలు పెంచుతూ పోతున్న అసమానతలను విస్మరించారు. అన్ని దేశాల్లోనూ స్వల్ప సంఖ్యాకులైన కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లో సంపదంతా కేంద్రీకృతమవుతున్నదన్న వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నించారు. కింది వర్గాల బాగోగుల్ని, సంక్షేమాన్ని పట్టించుకోని విధానాలు అసంతృప్తికీ... చివరకు తిరుగుబాటుకు దారితీస్తాయని గ్రహించలేకపోయారు. పాశ్చాత్య దేశాల్లో చాలాచోట్ల కార్మికుల వేతనాలు 2008 తర్వాత స్తంభించి పోయాయని, ఉపాధి కల్పన అంతంతమాత్రమేనని గుర్తిస్తే ప్రపంచీకరణ సామాన్య పౌరుల జీవితాలను ఎంతగా దిగజార్చిందో అర్ధమవుతుంది. అమె రికాలో బెర్నీ శాండర్స్ వంటివారు సంక్షేమ పథకాలను ప్రతిపాదించి, సహజ వనరులపై కార్పొరేట్ దిగ్గజాల ఆధిపత్యాన్ని తొలగించడమే సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమని సూచించారు. ఇందుకు భిన్నంగా మితవాదులు దేశ సరిహద్దుల్ని మూసేయడం, ముస్లింలను వెళ్లగొట్టడం, జాతి ఔన్నత్యాన్ని పునరుద్ధరించడం అన్ని సమస్యలకూ పరిష్కారమార్గాలుగా చెబుతు న్నారు. ఉగ్రవాద భూతాన్ని చూపి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రస్తుత రెఫరెండంలో ఇంగ్లండ్, వేల్స్లు రెండూ బ్రెగ్జిట్ వైపు బలంగా నిల బడ్డాయి. ఈయూ నుంచి వైదొలగాలన్న వాదనకు ఇంగ్లండ్‌లో 53.2 శాతంమంది అంగీకరిస్తే...వేల్స్లో 51.7 శాతంమంది మద్దతుగా నిలిచారు. అందుకు భిన్నంగా స్కాట్లాండ్లో 62శాతంమంది, నార్తర్న్ ఐర్లాండ్‌లో 55.7 శాతంమంది ఈయూలో ఉండటానికే మొగ్గు చూపారు. నిరాదరణకు గురైన వర్గాలు, శ్వేతజాతీయులు అధికంగా ఉండే ఇంగ్లండ్ ప్రాంతంలో బ్రెగ్జిట్‌కు అనుకూలత వ్యక్తం కావడంలో వింతేమీ లేదు. వేల్స్‌లోనూ అదే స్థితి. ఈయూలో కొనసాగడానికి మొగ్గుచూపిన స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో సైతం కార్మికవర్గ ప్రాబల్యం ఉన్న చోట్ల బ్రెగ్జిట్‌కు అనుకూలత రావడం కింది వర్గాల్లో వర్తమాన స్థితిపై ఉన్న అసంతృప్తిని వెల్లడిస్తుంది. ఈయూలో కొనసాగడమే సురక్షితమని లేబర్ పార్టీ అగ్రనేతలంతా కలిసికట్టుగా ప్రకటించినా ఈ వర్గాలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. సమస్యలపట్ల సూత్రబద్ధ వైఖరిని ప్రదర్శించడం కాక అధికారమే పరమావధిగా స్వరం మార్చడం వల్ల అంతిమంగా నష్టపోక తప్పదని ప్రధాని కామెరాన్ ఈపాటికి గ్రహించి ఉంటారు. నిరుడు జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో రెఫరెండం ప్రతిపాదన తెచ్చిందీ, ఈయూనుంచి వైదొలగడానికి అనుకూలమని చెప్పిందీ ఆయనే. ఇది ఎలాగూ అయ్యేది కాదనుకుని ఆయన ఈ హామీ ఇచ్చారు. తీరా ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి స్వరం మార్చారు. మొత్తానికి రెఫరెండం ఉదారవాద పక్షాలకు ఒక హెచ్చరిక. పౌరుల్లో ఇప్పుడు నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే చర్యలు చేపట్టకపోతే అది అంతి మంగా బ్రిటన్ విచ్ఛిన్నానికి దారితీయొచ్చునని ఫలితాలు చాటిచెబుతున్నాయి. -
నాడు చర్చిల్ ఏమన్నారంటే..
లండన్: యూరోపియన్ యూనియన్ ఏర్పడాలనే ఆకాంక్ష సాకారమైంది 1993, నవంబర్ ఒకటవ తేదీనే కావచ్చు. ఆకాంక్షకు అంకురార్పణ జరిగింది మాత్రం 1948లోనే. నెదర్లాండ్స్‌లోని ఫ్రాగ్ సిటీలో జరిగిన యూరప్ కాంగ్రెస్‌లో బ్రిటిన్ మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ ప్రసంగిస్తూ యూరప్ దేశాలన్నీ ఒకటి కావాలని, ‘యూనెటైడ్ యూరప్’ అంటూ తొలిసారిగా పిలుపునిచ్చారు. అందుకు యూరప్ దేశాల నుంచి కాంగ్రెస్‌కు హాజరైన 20 మంది దేశాధినేతల్లో ఎక్కువ మంది అందుకు అంగీకరించారు. ‘యూరప్ దేశాలన్నీ ఒకటికావాలంటే అందుకు బలమైన ఆకాంక్ష ఉండాలి. స్వేచ్ఛను ప్రేమించే అన్ని దేశాల ప్రజలు, రాజకీయ పార్టీల్లో మెజారిటీ సభ్యులు మనస్ఫూర్తిగా ఐక్యతకు కోరుకోవాలి. ఓటు ఎటు వేస్తారన్నది అప్రస్తుతం. యూరప్ అంతా ఒక్కటి కావాలనే లక్ష్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. అప్పుడే ఏదోరోజు మనమంతా ఒక్కటవుతాం. ఆ రోజు కోసం నిరీక్షిద్దాం’ అని చర్చిల్ సభా ముఖంగా మాట్లాడారు. యూరప్ ఒకటికావాలనే ఆకాంక్ష వ్యక్తం కావడమే కాకుండా కార్యరూపం దాల్చింది కూడా నెదర్లాండ్స్‌లోనే అవడం ఓ విశేషం. వాస్తవానికి ఆ నాటి యూరప్ సభను ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దానికి అధికారిక గుర్తింపు కూడా లేదు. కొన్ని యూరప్ దేశాలు అప్పటికప్పుడు అనుకొని సమావేశమయ్యాయి. భారత్ నుంచి 1948లో బ్రిటీష్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. భారత్ నుంచి ఈ సైనిక ఉపసంహరణ యూరప్ కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకే ‘బ్రిటీష్ పాతే’ అనే బ్రాడ్‌క్యాస్టింగ్ సంస్థ చర్చిల్ ప్రసంగాన్ని రికార్డు చేసింది. భారత్ నుంచి బ్రిటీష్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న చారిత్రక నేపథ్యం లేకపోయినట్లయితే చర్చిల్ ప్రసంగాన్ని వీడియో తీసేవారే కాదు. అప్పుడు చర్చిల్ యూరోపియన్ యూనియన్ గురించి ఏమన్నారో కూడా మనకు తెలిసేకాదు. ఇప్పుడు బ్రిటన్ పౌరులు బ్రెక్జిట్కు ఓటేసిన సందర్భంలో చర్చిల్ బతికి ఉంటే ఆయన ఎలా స్పందించేవారో! -
బ్రెగ్జిట్‌కు బ్రేక్!?
- యూరోపియన్ కమ్యూనిటీస్ చట్ట సవరణ బిల్లుపై 'రాజకీయ' మేఘాలు - ఆమోదం పొందకుండా ఎంపీల వ్యూహాలు.. అదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయం లండన్: బ్రెగ్జిట్ కథ ఇంకా ముగియలేదు. మరో మలుపు తీసుకుని పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశమూ లేకపోలేదు! అవును. శుక్రవారం వెల్లడైన బ్రెగ్జిట్ రెఫరెండంకు సంబందించిన బిల్లును పార్లమెంట్ లో అడ్డుకుని, వీగిపోయేలా అన్ని పార్టీల ఎంపీలు వ్యూహరచనలు చేస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ వర్గాల సమాచారం. బ్రిటన్ లో అధికార కంజర్వేటివ్ పార్టీ సహా ప్రతిపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, లిబరల్ డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ఎంపీల్లో అత్యధికులు మొదటి నుంచి బ్రెగ్జిట్ ను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. వీరిలో కొందరు బ్రిటన్ ఈయూలోనే కొనసాగేలా 'రిమెయిన్' కు ఓటు వేయాల్సిందిగా పెద్ద ఎ్తతున ప్రచారం చేశారు. లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్ బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. గత వారం బిర్ స్టల్ లో ఆమెను హత్యచేసిన దుండగుడు.. బ్రెగ్జిట్ పై కాక్స్ అభిప్రాయం నచ్చకే హత్యచేశానని పేర్కొనడం గమనార్హం. 'బ్రెగ్జిట్ ను అడ్డుకునే క్రమంలో సహచర ఎంపీ ప్రాణాలు పణంగా పెట్టినప్పుడు మనం పదవులను పణంగా పెట్టలేమా?' అనే వాదన ప్రస్తుతం ఎపీల మధ్య నడుస్తున్నట్లు సమాచారం. ప్రజాతీర్పు (రెఫరెండం)నకు వ్యతిరేకంగా వెళ్లాలనుకోవడం అన్ని పార్టీలకూ రాజకీయ ఆత్మహత్య వంటిదే. ఎంపీలుగానీ బ్రెగ్జిట్ బిల్లును ఆమోదించకుంటే దేశంలో అలజడి మొదలవుతుంది. తద్వారా ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఎంపీలు తిరిగి ప్రజా తీర్పు కోరాల్సి ఉంటుంది. అప్పుడు జనం చేత చీత్కారం ఎదుర్కోవాల్సిఉంటుంది. ఇదంతా ఓ ప్రహాసనం. అయితే ఎంపీలు రెఫరెండంను కాదనే దుస్సాహసం చేయబోరని, బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని బ్రిగ్జిట్ ను బలంగా సమర్థిస్తోన్న యూకే ఇండిపెండెంట్ పార్టీ నేతలు అంటున్నారు. బ్రిగ్జిట్ రిఫరెండం ఫలితాలపై చర్చించేందుకు అతి త్వరలోనే సమావేశం కానున్న బ్రిటన్ పార్లమెంట్.. 1972నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టానికి సవరణలు చేయనుంది. ఈ చట్టానికి సవరణలు చేస్తేనేగానీ 28 దేశాల కూటమి(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే మార్గం సుగమంకాదు. వైదొలిగే ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ల కాలం పడుతుంది. అయితే ఆదిలోనే ఎంపీలు బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటువేస్తే ప్రభుత్వం కూలిపోయి 2020లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాదే జరిగే అవకాశం ఉంది. -
బ్రిటన్‌కు వెన్న పూస్తూనే వాతలు
బెర్లిన్: వెన్నపూస్తూ వాతలు పెట్టిన చందంగా.. బ్రెగ్జిట్ బాధాకరం అంటూనే పాత ఒప్పందాల విషయంలో బ్రిటన్‌కు హెచ్చరికలు జారీచేశారు జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారయిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆమె.. బ్రెగ్జిట్ ఫలితం ఈయూనే కాక యావత్ యూరప్ ఐక్యతను విచ్ఛిన్నం చేసిందని అన్నారు. (చదవండి: బ్రిటన్ లో అల్లకల్లోలం ఖాయం) శుక్రవారం మధ్యాహ్నం(స్థానిక కాలమానం ప్రకారం) మీడియాతో మాట్లాడిన మోర్కెల్ బ్రెగ్జిట్ అనంతర పరిణామాలపై మాట్లాడుతూ నిన్నటివరకు ఈయూతో చేసుకున్న అన్ని ఒప్పందాలను సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. 'విడిపోయే ప్రక్రియ పూర్తయ్యే చివరి నిమిషం దాకా బ్రిటన్ తన వాగ్ధానాలు నిరవేర్చాల్సిన అవసరం ఉంది' అని మోర్కెల్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈయూ నేతలు, సభ్యదేశాధినేతలు బ్రిటన్ కు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం మనమున్నది గందరగోళ ప్రపంచమని, శాంతిసమాధానాలతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా.. 'ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటిషర్ల నిర్ణయం బాధాకరం. అది ఐరోపా సమాజ ఐక్యతను విచ్ఛినం చేసింది. యూరప్ దేశాలు వేటికవే భిన్నత్వాన్ని కలిగిఉన్నాయో, ఈయూ అంతకంటే భిన్నమైనది. రెండో ప్రపంచ యుద్ధానంతరం తోడ్పాటును అందించుకునేందుకే ఈయూ ఏర్పాటయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం కూటమిలోని సభ్యదేశాలే ఈయూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పటాపంచలు చేయాల్సిన సమయం వచ్చింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఈయూ మనుగడ సాధించగలదన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు అందరితో చర్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే సోమవారం యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఇటలీ ప్రధాని మాటియో రెంజీలతో భేటీ అవుతున్నా' అని ఏంజిలా పేర్కొన్నారు. -
ఈయూకు మరో షాక్ ?
స్టాక్‌హోమ్: బ్రెగ్జిట్ ఓటుతో యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి విడిపోయిన బ్రిటన్.. ఆ దిశగా ఆలోచనలు చేస్తోన్న ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తోంది. ఈయూలో మూడో అతి పెద్ద దేశం స్విడన్ కూడా స్వెగ్జిట్(స్విడన్+ఎగ్జిట్) నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. గురు, శుక్రవారాల్లో ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఓటింగ్ లో స్విడిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకే మొగ్గుచూపారు. నిజానికి నిన్నమొన్నటి వరకు కూడా స్విడన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేకుండేది. ఎప్పుడైతే కల్లోలిత మధ్య ఆసియా దేశాల నుంచి శరణార్థులు రాక పెరిగిందో.. అప్పటి నుంచి వారి మనోభావాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈయూ నంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి వస్తోన్నారు స్విడిష్ లు. బ్రిగ్జిట్ విషయంలో బ్రిటిషర్లు చెబుతున్న కారణాన్నే స్విడిష్ లు కూడా వల్లెవేస్తున్నారు. అది.. తమ దేశాలపై 'బ్రెసిల్స్ పెత్తనం'. స్విడన్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు స్టాక్ హోమ్ (స్విడన్ రాజధాని)లో కాకుండా బ్రెసిల్స్ నుంచి వెలువడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఈయూలో ఉండటం వల్ల నష్టమేతప్ప లాభం లేదని, ఈయూలో ఉన్నందుకే శరణార్థుల బాధ్యతలను బలవంతంగా తలకెత్తుకోవాల్సి వస్తోందని ఓటింగ్ లో పాల్గొన్న స్విడిష్ లు అంటున్నారు. టీఎన్ఎస్ సిఫో సంస్థ శుక్రవారం నిర్వహించిన పోలింగ్ లో 36 శాతం మంది స్విడిష్ లు ఈయూ నుంచి వైదొలకేందుకు ఓటు వేయగా, 32 శాతం మంది ఈయూలో కొనసాగేందుకు మద్దతు పలికారు. మిగిలిన 32 శాతం మంది ఏమీ తెలియదని చెప్పారు. బ్రిటన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న వాదన ఊపందుకోవడంలో రాజకీయ పక్షాలు కీలక పాత్ర పోశించాయి. అదే స్విడన్ లో ఈ ఉద్యమంలోకి ఇంకా రాజకీయ శక్తులు ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశిస్తేగనుక సెగ్జిట్ నిర్ణయానికి విపరీతమైన మద్దతు లభించే అవకాశం ఉంది. స్విడన్ కాకుండా ఈయూ సభ్యులైన బల్గేరియా, హంగరీ, రొమేనియా, పోలండ్, గ్రీస్, ఆస్ట్రియా వంటి దేశాలు శరణార్థి సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. -
ఐటీ రంగాన్ని ముంచేసిన బ్రెగ్జిట్
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఐటి షేర్లను తీవ్ర నష్టాల్టోకి నెట్టేసింది. డాలర్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ పౌండ్ విలువ భారీగా పతనంకావడంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటి ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఈ ప్రభావం స్వల్ప కాలం మాత్రమేని ఐటి నిపుణులు వ్యాఖ్యానించారు. టెక్ మహీంద్రా దాదాపు 7 శాతం, హెచ్ సీఎల్ టెక్ ఎక్కువ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 3 నుంచి 6 శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 శాతం, హెచ్ సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్ , విప్రో లు కూడా దాదాపు 7 నుంచి11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. బ్రెగ్జిట్ నిర్ణయం మూలంగా పౌండ్ విలువ 31 సంవత్సరాల కనిష్ఠానికి కూలిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) వైదొలగుతున్న ప్రభావం ఐటి పరిశ్రమ పై స్వల్పకాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయ పడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. కాగా బ్రిటన్ గురువారం జరిగిన ఒక చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణలో 43 సంవత్సరాల తర్వాత ఈయూని వీడింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన
లండన్: బ్రెగ్జిట్ పై బ్రిటన్ ప్రజల నిర్ణయం ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. యూరోపియన్ యూనిన్ లోనే బ్రిటన్ కొనసాగాలన్న ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బ్రెగ్జిట్ పై ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పోరాడానని చెప్పారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అక్టోబర్ లో కొత్త ప్రధాని వస్తారని సంచలన ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నట్టు చెప్పారు. యూకే ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయన్నారు. మొదటి నుంచి బ్రెగ్జిట్ ను వ్యతిరేకించిన ఆయన ప్రజాతీర్పుతో కంగుతిన్నారు. తన ఆకాంక్షకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో ప్రధాని పదవిని వదులు కోవాలని నిర్ణయించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కామెరాన్ 2010లో తొలిసారిగా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2015లో రెండో పర్యాయం ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ తీర్పుతో మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా ప్రకటన చేశారు. -
భగ్గుమన్న పసిడి
ముంబై: విశ్లేషకుల అంచనా వేసినట్టుగానే 'బ్రెగ్జిట్' ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతమవుతున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడానికి రెఫరెండం అనుకూలంగా ఉందన్న వార్తలతో దాదాపు గ్లోబల్ మార్కెట్లన్నీ కుదేలైనాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైగా కోల్పోగా, నిఫ్టీ ఎనిమిదివేలకు దిగువన ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తల ప్రభావంతో అటు వివిధ కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్ గా ఉండగా ... బులియన్ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఒకప్పటి బూం తర్వాత మళ్లీ తొలిసారి 31 వేలను దాటి రాకెట్ లా నింగిలోకి దూసుకుపోతున్నాయి. ఆరుశాతానికి పైగా లాభపడి మూడేళ్ల గరిష్ట స్తాయికి చేరుకుంది. ఎంఎసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 31 రూ. లక పైన స్థిరంగా ఉంది. 1794 రూపాయలు లాభపడి 31,708 దగ్గర ట్రేడవుతూ మదుపర్లను మురిపిస్తోంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.11గా ఉంది. -
విడిపోవడానికే బ్రిటన్ వాసి పట్టం
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. బ్రిటన్ వాసులు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికే మొగ్గుచూపారు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో రెండు శాతం ఓట్లు స్వల్ప తేడాతో 'బ్రెగ్జిట్' వాదన గెలుపొందింది. దీంతో రెండో ప్రపంచ యుద్దం అనంతర కాలం నుంచి యూరప్ ఐక్యతలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఐరోపా సమాఖ్య(ఈయూ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మొత్తానికి 52 శాతం ఓటర్లు విడిపోవాలని, 48 శాతం ఓటర్లు కలిసుండాలని తీర్పుఇచ్చారు. బ్రెగ్జిట్ ఫలితాలతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. పౌండ్ విలువ భారీగా నష్టపోయింది. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల వరకూ కోల్పోయింది. రూపాయి విలువ పతనమైంది. ఈ ఫలితాలతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ రాజీనామా చేయాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్
ముంబై: 'బ్రెగ్జిట్' ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. తర్వాత 10.5 గంటల సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 1000-900 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది. నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. 'బ్రెగ్జిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.17గా ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 8 శాతం పతనమైంది. దీంతో 10 నిమిషాల పాటు జపాన్ స్టాక్ మార్కెట్ ను నిలిపివేశారు. -
బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఐరోపా సమాఖ్య(ఈయూ)లో బ్రిటన్ కొనసాగాలా వద్ద అనే దానిపై నిర్వహించిన రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. బ్రిటన్ వాసులు ఎటువైపు మొగ్గు చూపారో మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సండర్లాండ్, కోవెంట్రి, కోల్బస్టర్ ఓటర్లు ఈయూ నుంచి విడిపోవడానికి మొగ్గు చూపారు. ఇక గ్తాస్గో, లివర్ పూల్, లండన్ ఓటర్లు మాత్రం ఈయూలో కలిసే ఉండాలని తేల్చారు. పూర్తి ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. మొత్తం 382 కౌంటింగ్ ఏరియాలలో ఇప్పటివరకూ 171 చోట్ల ఫలితాలు వెలువడగా.. 51.3 శాతం మంది ప్రజలు విడిపోవాలని, 48.7 శాతం ప్రజలు కలిసుండాలని తీర్పు ఇచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కలిసుండాలి, విడిపోవాలనే ఓటర్ల మధ్య కేవలం రెండు శాతం మాత్రమే తేడా ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎర్లీ ట్రెండ్స్ బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉండటంతో పౌండ్ విలువ భారీగా పతనమైంది. -
బ్రెగ్జిట్ కూల్.. మార్కెట్ జూమ్!
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ఛాన్స్ తక్కువంటూ సర్వేలు ర్యాలీ జరిపిన ఈక్విటీలు ♦ సెన్సెక్స్ తిరిగి 27,000 పైకి ♦ నిఫ్టీ 67 పాయింట్లు అప్ ♦ పెరిగిన రూపాయి...తగ్గిన బంగారం ముంబై: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే అవకాశాలు తక్కువంటూ రిఫరెండంకు ముందస్తు సర్వేలు వెల్లడించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గురువారం కదంతొక్కాయి. ఇదేబాటలో భారత్ సూచీలు ఎగిసాయి. మళ్లీ రిస్క్ ఆస్తులవైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో బంగారం తగ్గింది. వర్థమాన కరెన్సీలతో పాటు రూపాయి సైతం బలపడింది. బ్రిటన్ రిఫరెండం ఫలితం భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున వెల్లడవుతాయి. 51 శాతం మంది ప్రజలు ఈయూలో కొనసాగాలని కోరుకుంటుండగా, 49 శాతం మంది వైదొలిగేందుకు మొగ్గుచూపుతున్నట్లు డెయిలీ టెలిగ్రాఫ్, టైమ్స్ నిర్వహించిన తుది సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ తిరిగి 27,000 శిఖరాన్ని అధిరోహించింది. 237 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్ 27,002 వద్ద ముగిసింది. ఈ ముగింపు దాదాపు నెలరోజుల గరిష్టస్థాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు ఎగిసి 8,270 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. యూరప్ మార్కెట్ల ప్రారంభంతో... ట్రేడింగ్ ప్రారంభంలో ఆసియా ట్రెండ్‌ను అనుసరిస్తూ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన భారత్ మార్కెట్ మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పరుగులు తీసాయి. యూరప్ మార్కెట్లు జోరుగా మొదలుకావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లలో కూడా బ్రెగ్జిట్ భయాలు తొలగిపోయాయని, దాంతో ఎంపికచేసిన షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. యూరప్ పటిష్టంగా ప్రారంభంకావడం మన మార్కెట్లో సెంటిమెంట్‌ను మెరుగుపర్చిందని బీఎన్పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. యూరప్‌లోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 1,5 శాతం మేర ర్యాలీ జరిపాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు సైతం 0.8 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. బ్రిటన్‌తో లింకున్న షేర్ల కొనుగోలు... బ్రిటన్‌తో వ్యాపార సంబంధాలున్న భారత్ కంపెనీల షేర్లలో తాజాగా కొనుగోళ్లు జరిగాయి. టాటా మోటార్స్ 3.2 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి రూ. 488 వద్ద ముగిసింది. అలాగే భారత్ ఫోర్జ్, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం వరకూ ఎగిసాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతంపైగా ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, లుపిన్, మహీంద్రా, హెచ్‌యూఎల్‌లు 1-2 శాతం మధ్య పెరిగాయి. ఆయా రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బ్యాంకెక్స్ 1.61 శాతం ఎగిసింది. ఈ సూచీలో భాగస్వామ్యమున్న హెచ్డీఎఫ్సీ, బ్యాంక్, యస్ బ్యాంక్‌లు రికార్డు గరిష్టస్థాయిలో ముగి యడం విశేషం. పుత్తడి ర్యాలీకి బ్రేక్... బ్రిటన్ రిఫరెండం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తాత్కాలికంగా రిస్క్ ఆస్తులుగా పరిగణించే ఈక్విటీవైపు దృష్టిసారించి, బంగారాన్ని విక్రయించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహం మందకొడిగా ట్రేడయ్యింది. బ్రిటన్ వైదొలిగే అవకాశాలు తక్కువంటూ గత ఆదివారం నుంచే సర్వేలు వెలువడుతుండటంతో ప్రపంచ మార్కెట్లో ఈ మూడురోజుల్లో ఔన్సు బంగారం ధర 35 డాలర్లకుపైగా క్షీణించింది. బ్రెగ్జిట్ జరగవచ్చన్న అంచనాలతో గతవారం పుత్తడి ధర 1300 డాలర్ల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. గురువారం కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ మార్కెట్లో ఇది 1265 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 130 తగ్గి రూ. 29,680 వద్ద ముగిసింది. ఇటీవల ఈ ధర రూ. 31,000 స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. రూపాయికి బలం... అటు అమెరికా డాలరు ఇతర ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడటంతో స్థానికంగా రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా 24 పైసలు పెరిగి 67.24 స్థాయికి బలపడింది. బ్రెగ్జిట్ జరగకపోతే తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం భారత్‌లోకి కొనసాగుతుందన్న అంచనాలతో రూపాయి పెరిగిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. ఫలితం తర్వాత...? ఈయూలో కొనసాగేందుకే బ్రిటిషర్లు మొగ్గుచూపుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ, ఉండాలా...వద్దా అనే అభిప్రాయాల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా వుంది. ఫలితం ఎటువైపైనా రావొచ్చు. బ్రిటన్ ఎగ్జిట్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చన్న అంచనాల్ని దాదాపు విశ్లేషకులందరూ వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ 5-8 శాతం మధ్య పతనం కావొచ్చన్నది అంచనా. ఇక కరెన్సీల్లో బ్రిటన్ పౌండ్, యూరోలతో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ 5 శాతం వరకూ క్షీణించే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం తిరిగి 1320 డాలర్ల స్థాయిని అందుకోవొచ్చని, కొద్దిరోజుల్లో 1400 డాలర్లకు సైతం పెరగవచ్చని నిపుణులు చెపుతున్నారు. భారత్‌లో పసిడి 5 శాతాన్ని మించి పెరగవచ్చని, 10 గ్రాముల ధర రూ. 32,000 మార్క్‌ను చేరే అవకాశం వుందని విశ్లేషిస్తున్నారు. ఇక డాలరు, బాగా పెరగవచ్చని, దీంతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ గరిష్టస్థాయి 68.7కి తగ్గవచ్చన్నది అంచనా. అంతా బావుంటే..: బ్రిటన్ ఈయూలోనే వుండాలని నిర్ణయించుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ల గమనంపై విశ్లేషకులు భిన్నమైన అంచనాల్ని విన్పిస్తున్నారు. తాజా సర్వేలతో అమెరికా, భారత్‌లు వారం రోజుల్లో 2%, యూరప్ 5% పెరిగాయని, ఇప్పటికే పాజిటివ్ వార్తల్ని మార్కెట్ డిస్కౌంట్ చేసుకుందని విశ్లేషకులు చెపుతున్నారు. అయినా 2-5% మధ్య మరికొంత ర్యాలీ జరిగే ఛాన్స్ వుందని కొంతమంది మార్కెట్ నిపుణులు అంటుండగా, రిఫరెండం సంగతి ముగిస్తే తిరిగి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ తెరపైకి రావొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. దీంతో మార్కెట్ ర్యాలీకి బ్రేక్ పడుతుందని వారంటున్నారు. బంగారం ధర తిరిగి 1200 డాలర్ల స్థాయికి తగ్గవచ్చని, రూపాయి 66.5 స్థాయికి బలపడవచ్చని అంచనా. -
బ్రెగ్జిట్‌కు సర్వసన్నద్ధం..!
ఏ పరిణామాలైనా ఎదుర్కొంటాం ♦ బ్రెగ్జిట్ పై ప్రభుత్వం ధీమా ♦ అప్రమత్తమైన ఆర్బీఐ ♦ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ల సన్నద్ధం ముంబై/న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా షేర్లు, బాండ్లు, రూపాయి.. ఒడిదుడుకులకు గురవుతుండటంతో సెబీ, ఆర్బీఐ, తదితర నియంత్రణ సంస్థలు అప్రమత్తం అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలా? వద్దా అన్న విషయమై నేడు (గురువారం) బ్రిటన్‌లో రిఫరెండమ్(ప్రజాభిప్రాయ సేకరణ) జరుగుతోంది. వైదొలగాలని బ్రిటన్ నిర్ణయిస్తే అంతర్జాతీయంగా ఫైనాన్స్ మార్కెట్లలో ప్రకంపనలు భారీగా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ పరిణామాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసానిచ్చింది. మరోవైపు తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడడమే కాకుండా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ అభయం ఇచ్చింది. కాగా తమ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను కట్టుదిట్టం చేశామని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లు పేర్కొన్నాయి. వివరాలు.., పుష్కలంగా ఫారెక్స్ నిల్వలు... బ్రెగ్జిట్ పరిణామాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసానిచ్చింది. ఒకవేళ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే ఏర్పడే పరిణామాలను తట్టుకునే స్థాయిలో తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సూచనలను బట్టి చూస్తే ఈయూలో బ్రిటన్ కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగినా తట్టుకోగలమని పేర్కొన్నారు. మన దగ్గర 36,000 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, బ్రెగ్జిట్ కారణంగా భారత వాణిజ్యంపై ప్రభావం స్వల్పమేనని వివరించారు. ఆ అంశాలన్నింటి కారణంగా ఎలాంటి కరెన్సీ ఒడిదుడుకులనైనా తట్టుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్బీఐ అభయం..: బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా భారత్‌తో సహా అంతర్జాతీయ ఫైనాన్స్ మార్కెట్లలలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జరిగే పరిణామాలపై ఒక కన్నేసి ఉంచామని ఆర్బీఐ పేర్కొంది. తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులు సక్రమంగా ఉండేలా చూడడం వంటి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ అభయం ఇచ్చింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల సన్నద్ధత... బ్రెగ్జిట్ అనిశ్చితి నేపథ్యంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి నిఘా వ్యవస్థను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లు మరింత కట్టుదిట్టం చేశాయని ఒక అధికారి వెల్లడించారు. కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్లో భారీ పతనం సంభవించడం/ తీవ్రస్థాయిలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం వంటి సంఘటనలు సంభవిస్తే తగిన విధంగా స్పందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ అధికారి వివరించారు. మనకు సమస్య ఏంటి? యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగితే ఆ ప్రభావం ఒక్క యూరప్పైనే కాదు...ప్రపంచమంతటా పడుతుంది. ఆర్థిక ఫండమెంటల్స్ మెరుగుపడుతున్నంత మాత్రాన ఇండియా దీనికి మినహాయింపు కాదు. బ్రిటన్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్ డాలర్లు. ఇది అంతర్జాతీయ జీడీపీలో నాల్గవ వంతు. అలాంటిది అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొంటే ఇండియా ఎగుమతి మార్కెట్‌కు పెద్ద దెబ్బే. యూరోపియన్ యూనియన్ భారత్‌కు అతిపెద్ద ఎగుమతుల మార్కెట్. ఈ నేపథ్యంతో ఆ దేశంతో పాటు యూరప్‌తో వాణిజ్య సంబంధాలున్నందున, మన ఎగుమతులు, కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎగుమతుల క్షీణత... బ్రిటన్‌తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 14 బిలియన్ డాలర్ల మేర వుంది. ఇందులో 8.83 బిలియన్ డాలర్లు ఎగుమతులుకాగా, 5.19 బిలియన్ డాలర్లు దిగుమతులు. అంటే బ్రిటన్‌తో వాణిజ్యం వల్ల మనకు 3.64 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు వుంది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి జరిగే ఎగుమతులు రెండేళ్లలో 25 శాతం క్షీణించవచ్చని వాణిజ్య వర్గాలు అంచనావేస్తున్నాయి. రూపాయిపైనా...: బ్రెగ్జిట్తో వర్థమాన దేశాల కరెన్సీలన్నీ క్షీణిస్తాయి. ఇదేబాటలో రూపాయి విలువ కూడా బాగా తగ్గవచ్చని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం డాలరుతో 67.5 వద్ద వున్న రూపాయి మారకపు విలువ స్వల్పకాలంలో 69.5 స్థాయికి పడిపోవొచ్చని, కొద్ది నెలల్లో 70 దిగువనకూ పతమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే మనం దిగుమతి చేసుకునే క్రూడ్, బంగారం, వంటనూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు బాగా పెరిగిపోతాయి. 5-8 శాతం మార్కెట్ పతనం ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే అమెరికాతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఏర్పడుతుందంటూ ఇటీవల అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్ జెనెట్ ఎలెన్ చేసిన వ్యాఖ్య అతిశయోక్తి ఏమీ కాదు. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద పతనమే సంభవించవచ్చన్న భయాల్ని మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి విదేశీ ఇన్వెస్టర్లు రిస్క్ ఆస్తులుగా పరిగణించే భారత్ వంటి వర్థమాన మార్కెట్లలో క్షీణత ఎక్కువగా వుంటుంది. పైగా ఇప్పటికే చాలా దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్ సూచీలు 50% అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నందున, ఇక్కడ ప్రభావం అధికంగా వుంటుందన్న అంచనాలు వున్నాయి. స్వల్పకాలంలో ఫండ్ మేనేజర్లు వ్యూహాల్ని మార్చివేసి, ప్రభుత్వ బాండ్లు, పసిడి తదితరాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తారని విశ్లేషకులు అంటున్నారు. స్టాక్ సూచీలు స్వల్పకాలంలో 5-8% మధ్య పతనం కావొచ్చన్న అంచనా వేస్తున్నారు. -
లాభాల స్వీకరణ.. ర్యాలీకి బ్రేక్
♦ 54 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ♦ బ్రెగ్జిట్‌కు ముందు జాగ్రత్త ♦ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు ముంబై: రెండు రోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. బ్రిటన్ రిఫరెండం మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 26,813 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రెగ్జిట్ భయాలు తగ్గడం, కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళీకరించడం వంటి అంశాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 342 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఇక తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్ల క్షీణతతో 8,220 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. డాలరుతో రూపాయి మారకపు విలువ మరో 20 పైసలు తగ్గడం కూడా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెప్పారు. బ్రిటన్ రిఫరెండం దగ్గరపడటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకుంటున్నారని, దాంతో మార్కెట్ బలహీనంగా ముగిసిందని బీఎన్పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. ఇతర ప్రపంచ మార్కెట్లలో కూడా ట్రేడింగ్ మందకొడిగా సాగింది. సెన్సెక్స్-30లో 21 షేర్లు డౌన్... సెన్సెక్స్-30 షేర్లలో 21 షేర్లు తగ్గుదలతో ముగిసాయి. ఆదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ షేర్లు 1-2 శాతం మధ్య క్షీణించాయి. ఎస్బీఐ, హెచ్‌యూఎల్, సిప్లా, లుపిన్, గెయిల్‌లు 0.5-1 శాతం మధ్య తగ్గాయి. పెరిగిన షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా 1.68 శాతం ఓఎన్జీసీ ఎగిసింది. మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీలు అరశాతం వరకూ పెరిగాయి. -
జాగ్వార్ పై బ్రిగ్జిట్ దెబ్బ..!
ముంబై : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే దెబ్బ ఇటు ఆర్థిక వ్యవస్థలతో పాటు అటు కార్ల కంపెనీలపై పడనుంది. టాటా మోటార్స్ యూకే సబ్సిడిరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కార్యకలాపాలపై ఈ ప్రభావం ఉండనుందని ఈ కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. సంస్కరించబడిన యూరోపియన్ యూనియన్ లో యూకే మెంబర్ షిప్ కొనసాగించడంపై జేఎల్ఆర్ మద్దతు పలుకుతోంది. అయితే బ్రిటన్ ఎగ్జిట్ తో ఏదైనా మార్పు సంభవిస్తే తమ కార్ల అమ్మకాలు, ఖర్చులు, స్కిల్ బేస్ పై తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొన్నారు. 23 జూన్ లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ పై రెఫరాండంలో యూకే ఎలక్ట్రోరేట్ కూడా పాల్గొననుంది. ఇప్పటికే ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్లపైనా, కరెన్సీలపై, గ్లోబల్ ఎకనామీలపై, కార్పొరేట్లపై ఎఫెక్ట్ చూపనున్నాయని ఆర్థికవేత్తలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ను టాటా మోటార్స్ పెట్టుబడిదారులు దగ్గరగా పర్యవేక్షిస్తున్నారని జేఎల్ఆర్ పేర్కొంది. ఏదైనా మార్పు సంభవిస్తే కొంత ప్రతికూల ప్రభావమే చూపొచ్చని తెలిపింది. ఇప్పటివరకూ యూరోపియన్ యూనియన్ లో ఉత్పత్తులకు ఫ్రీ మూవ్ మెంట్ ఎక్కువగా కలిగి ఉన్నాయని, దీంతో యూరోపియన్ దేశాల్లో కార్లను అమ్మినందుకు జేఎల్ఆర్ ఎటువంటి టారిఫ్ లను చెల్లించలేదని చెప్పింది. ఈ ఈవెంట్ జేఎల్ఆర్ పై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశాలున్నాయని, ఆర్థికలోటు పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూకే వృద్ధి తక్కువ నమోదవుతుందని , ఉద్యోగాలు తగిన స్థాయిలో ఉండక పడిపోతాయని పేర్కొంటున్నారు. వలసదారులపై ఆంక్షలు పెరుగుతాయని, దీంతో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కంపెనీ కోల్పోయే ప్రమాదం ఉందని స్థానిక బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. బ్రిగ్జిట్ మొదలైనప్పటి నుంచి గ్రేట్ బ్రిటీష్ పౌండ్ క్షీణిస్తుంది. ఒకవేళ బ్రిటన్ వైదొలిగితే మరింత పడిపోయే అవకాశాలున్నాయి. ఈ క్షీణతతో ఎగుమతుల వల్ల కొంత ప్రయోజనం చేకూరినా.. కంపెనీ దిగుమతుల బిల్లు మాత్రం పెరిగిపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
'తప్పుకుంటే మీ దేశానికే మంచిది'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రెక్సిట్ కు తాను మద్ధతిస్తున్నానని పేర్కొటూనే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలని చెప్పారు. జూన్ 23న ఈ విషయంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పైగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగితే ఆ దేశానికే మంచిదని హితవు పలికారు. తాను బ్రిటన్ పౌరుణ్ని కానప్పటికీ, తనకు తోచింది చెప్పాను అని వివరణ ఇచ్చుకున్నారు. ట్రంప్ తల్లి స్కాట్లాండ్ మహిళ అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే వలసలు ఎక్కువగా ఉండే దేశాల్లో బ్రిటన్ ఒకటి. అత్యథికంగా శరణార్థులు బ్రిటన్ రావడానికే మొగ్గు చూపుతారని, ఆ కారంణంతో ఈయూ నుంచి వారు బయటకు రావడం మంచిదన్నారు. మహిళా ఎంపీ కో జాక్స్ ను ఓ దుండగుడు దారుణంగా కాల్చి హత్య చేసిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగు పరుస్తానని, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తోనూ చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ముస్లింలను అమెరికాలో కాలు పెట్టనివ్వను, ఇతర దేశాలు కూడా ఇదే తీరుగా వ్యవహరించాలని సూచించినప్పుడు.. కామెరూన్ ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. ట్రంప్ ఆలోచన తెలివి తక్కువ నిర్ణయంతో పాటు తప్పుడు పద్ధతి అని కామెరూన్ విరుచుకుపడ్డారు.