Crypto Currency
-
క్రిప్టో మార్కెట్ వైపు అతివల అడుగులు: కారణం ఇదే..
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది. -
ట్రంప్ ప్రకటన: భారీగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్‌తో సహా.. అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది.డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర 91,000 డాలర్లను (సుమారు రూ.80 లక్షలు) దాటింది. ఎక్స్ఆర్పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎంఎస్టీఆర్, కాయిన్, హెచ్ఓఓడీ, ఎంఏఆర్ఏ, ఆర్ఐఓటీ వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్‌లు కూడా బుల్లిష్ బిడ్లను చూసే అవకాశం ఉంది.మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్‌కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది.క్రిప్టో కాయిన్స్ విలువలు ఇలా..భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:55 గంటల సమాయానికి సొలనా కాయిన్ (ఎస్ఓఎల్) విలువ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్ఆర్పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.ఇతర దేశాల్లోనూ క్రిప్టో నిల్వలుఈ చొరవ ఇతర దేశాలు ఇలాంటి నిల్వలను అభివృద్ధి చేయడానికి, తద్వారా ప్రపంచ డిమాండ్‌ను పెంచడానికి ప్రేరేపిస్తుంది. పెద్ద సంస్థలు బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో ఆస్తులను తమ బ్యాలెన్స్ షీట్లలో చేర్చడానికి ఎక్కువ మొగ్గు చూపుతాయని కూడా అంచనా ఉంది. ఇది క్రిప్టోకు మరింత స్వీకరణను తెస్తుంది. క్రిప్టో వ్యవస్థను మరింత స్థిరీకరిస్తుంది. యూఎస్ ప్రభుత్వం క్రిప్టోను ఇంత పెద్ద ఎత్తున స్వీకరించడం దీర్ఘకాలంలో క్రిప్టోపై మరింత నమ్మకాన్ని తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. భారత్‌లోనూ వచ్చే 12 నుండి 18 నెలల్లో క్రిప్టోకు సంబంధించిన స్పష్టమైన నియంత్రణ చట్రాల రూపకల్పన జరగవచ్చు. - విక్రమ్ సుబ్బరాజ్, సీఈవో, జియోటస్ క్రిప్టో ప్లాట్ఫామ్గమనిక: క్రిప్టోకరెన్సీలో విపరీతమైన రిస్క్ ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటి విలువ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు పతనావస్థకు చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే.. దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, లేదా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా? -
మిల్కీ బ్యూటీపై స్కామ్ ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌కే పరిమితమైంది. తమన్నా చివరిసారిగా సికందర్ కా ముఖద్దర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తెరకెక్కుతోన్న ఓదెల-2 మూవీలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.టఅయితే తాజాగా మిల్కీ బ్యూటీపై క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో పాత్ర ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న కథనాలపై తమన్నా స్పందించింది. రూ. 2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. తనకు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదని పేర్కొంది. తనపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సమస్యను న్యాయపరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపింది.తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా. అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్ పనిచేస్తుంది' అని తెలిపింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా.. ఇవాళ ఉదయం నుంచి క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో విచారణ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌లను పుదుచ్చేరి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమన్నా స్పందించింది.అసలేం జరిగిందంటే?కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది. -
క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్?
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్‌చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్‌లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.🇮🇳Big Breaking News:- Jiocoin Launched On Polygon.Reliance Jio, the world's largest mobile operator, has just surprised the crypto world by officially launching Jiocoins!What are Jiocoins?Jiocoins are digital tokens issued on Polygon.Jiocoins is a mechanism to reward… pic.twitter.com/MNRb5HGa08— Kashif Raza (@simplykashif) January 16, 2025 -
2024లో 120 శాతం: 2025లో బిట్‌కాయిన్ వృద్ధి ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్లో బిట్‌కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్‌కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.2025లో బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్‌కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.2024లో కంటే ఈ ఏడాది బిట్‌కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హార్డ్ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాటక్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్‌కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్‌కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. -
ట్రంప్ మాట.. అమాంతం ఎగిసిన బిట్ కాయిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ హైకి చేరింది.యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు. -
చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’కు షాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్‌ను ఆదేశించింది. వర్చువల్ డిజిటల్ అస్సెట్ (ఆన్లైన్లో డిజిటల్ ఆస్తులను అందించే) ప్రొవైడర్‌గా బినాన్స్, పీఎంఎల్ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సరీ్వస్ ప్రొవైడర్లు ఎఫ్ఐయూ కింద రిపోరి్టంగ్ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్ఏ కింద బినాన్స్ నమోదు చేసుకోకుండానే భారత్‌లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్ యూఆర్ఎల్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్ ఎంటిటీగా ఎఫ్ఐయూ కింద బినాన్స్ నమోదు చేసుకుంది. బినాన్స్తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. -
అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్ అంబానీపై క్రిప్టోముఠా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్ హెడ్డింగ్లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్ఫామ్లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. -
క్రిప్టో కింగ్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష: కారణం ఇదే..
బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్'. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్‌టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు. FTX కస్టమర్లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎవరీ శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. -
Sam Bankman-Fried : క్రిప్టో కింగ్‌కి 40 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష?
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోనే అపరకుబేరుడు, క్రిప్టో కింగ్, ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ 40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారా? తప్పు చేశానని ఒప్పుకుంటూనే తానెవరిని మోసం చేయలేదన్న శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరుపున వాదించే ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని ఎందుకు కోరుతున్నారు. క్రిప్టో మొగల్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌కు 40 నుంచి 50 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించాలనిప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఎందుకు జైలు శిక్ష విధించాలో చెబుతూ.. కస్టమర్లను 8 బిలియన్ల భారీ మోసానికి పాల్పడ్డారంటూ అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టుకు అందజేశారు. గత ఏడాది నవంబర్‌లో ఎఫ్‌టీఎక్స్‌లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్‌ను దోషిగా పరిగణలోకి తీసుకుంది. కుట్ర, మనీ ల్యాండరింగ్, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రైడ్కు అనారోగ్య సమస్యలు అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు 98 పేజీల మెమోలో ప్రైడ్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఐదు నుండి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్ (ప్రైడ్) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నారని పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తారా? దీనిపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్లు ప్రైడ్ కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. నిందితుడి తల్లిదండ్రులిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.కానీ అత్యాశ, మదుపర్లు పెట్టిన పెట్టుబడులతో జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్ జైలు శిక్షను అనుభవిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
రూ.83 వేల కోట్ల మోసం : జైలు శిక్ష పడుతుందని.. ప్రియురాల్ని ఇరికించాడు!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కోర్టు విచారణ సందర్భంగా తనని తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ కుప్పకూలిపోవడంతో నా వల్ల చాలా మంది బాధపడ్డారు. అయితే, తానెవరినీ మోసం చేయలేదని, కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల మొత్తాన్ని దోచుకోలేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 83వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మోసానికి గాను ఏళ్ల తరబడి జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశ్యంతో చేసిన నేరాన్ని తన ప్రియురాలు కరోలిన్ ఎల్లిసన్పై నెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 134 ఎఫ్‌టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు, 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు నష్టం’ వంటి కారణాలతో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫ్రైడ్పై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ (టెలికమ్యూనికేషన్, టెక్నాలజీని వినియోగించి చేసే మోసం), మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందుకు డజనకుపైగా కేసులు నమోదు చేశాయి. వీటిపై న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్‌ను విచారిస్తుంది. ప్రియురాల్ని ఇరికించి తాజాగా,ఫెడరల్ కోర్టు నిర్వహించిన విచారణకు ఫ్రైడ్, అతని తరుపు వాదించే లాయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రైడ్‌ను విచారిస్తున్న న్యాయమూర్తులతో రిస్క్-మేనేజ్మెంట్ టీమ్‌ను నియమించుకోవడం వంటి తప్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదే సమయంలో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో తన ప్రియురాలు, 2017లో ఫ్రైడ్ స్థాపించిన ట్రేడింగ్ కంపెనీ అలమెడా రీసెర్చ్ సీఈవో కరోలిన్ ఎల్లిసన్‌ను ఇరికించారు. ఆరు గంటల వాంగ్మూలంలో ‘మేం మార్కెట్లో అత్యుత్తమ ప్రొడక్ట్‌ను తయారు చేయగలమని భావించాము. కానీ ఊహించిన దానికి విరుద్ధంగా మారింది. దీంతో కస్టమర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. కంపెనీ దివాలా తీసింది’అని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో తన ఆరు గంటల వాంగ్మూలంలో చెప్పాడు. నేరం రుజువైతే దశాబ్ధాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే తనపై నమోదైన డజనకు పైగా కేసుల్లో తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశాడు. 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ ఫండ్లను అలమెడా రీసెర్చ్‌కు తరలించారని, ఎన్నికల ప్రచారం కోసం అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులకు 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. డిఫెన్స్ లాయర్ మార్క్ కోహెన్ ప్రశ్నలకు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ స్పందిస్తూ.. స్పాన్సర్‌షిప్‌లు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే నిధులు ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ల నుండి రాలేదని, కంపెనీ ఆదాయం,ఈక్విటీ పెట్టుబడిదారుల నుండి పొందిన కమీషన్ల నుంచి వచ్చినట్లు తాను నమ్ముతున్నానని అన్నాడు. రాజకీయ విరాళాలు ఇచ్చేందుకు తనకున్న ఆలమేడ నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం ప్రియురాలే చేసింది 2022 జూన్‌లో క్రిప్టో మార్కెట్ క్రాష్ అయ్యింది. దీంతో పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అల్మెడ బ్యాలెన్స్ షీట్లను తప్పుగా మార్చమని చెప్పినట్లు ఫ్రైడ్ వివరించాడు. ఆ బ్యాలెన్స్ షీట్లను చూసే అవసరలేదని భావించానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సుదీర్ఘ విచారణలో ఫ్రైడ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం విచారణను కోర్టు వాయిదా వేసింది. ఎవరీ బ్యాంక్మన్-ఫ్రైడ్ క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్‌టీఎక్స్‌ను 2019లో బ్యాంక్మన్-ఫ్రైడ్ స్థాపించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఇది విస్తరించింది. 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ డిగ్రీని ఆయన పూర్తి చేశారు. అనంతరం క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. ఆయన సంపదలో అధిక మొత్తాన్ని స్వచ్ఛంద సేవకు ఇస్తానని హామీ ఇచ్చారు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
G20 Summit: క్రిప్టో సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం
న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్ రిపోరి్టంగ్ ఫ్రేమ్‌వర్క్ (సీఏఆర్ఎఫ్) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ–20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి. 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ, స్థిర, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల సహకారాన్ని కొనసాగించాలనే నిబద్ధతను అభివృద్ధి చెందుతున్న, చెందిన 20 దేశాల నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పెద్ద కంపెనీల కోసం పన్ను నియమాలను మార్చడానికి, బహుళజాతి సంస్థల పన్ను ప్రణాళికను పరిమితం చేయడానికి మరింత శాశ్వత, సమర్థవంత ప్రణాళికను కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు పన్నులు చెల్లించే అంశాలను మార్చడం, ప్రపంచవ్యాప్తంగా కనీస పన్నును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రెండు మూల స్తంభాలుగా పేర్కొంటూ కసరత్తు చేస్తున్నారు. రెండు స్తంభాల పరిష్కారంలో జీ–20 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఓఈసీడీ సహకారంతో పన్ను, ఆర్థిక నేర పరిశోధన కోసం దక్షిణాసియా అకాడమీ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్‌సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
ప్రపంచ ఆర్థిక నేరాలను నిరోధించాలి
గాందీనగర్: ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్, క్రిప్టో కరెన్సీలతో సహా వివిధ అసెట్ క్లాస్‌ల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ఆయా సవాళ్లను నిరోధించడం కోసం గ్లోబల్ ఆర్కిటెక్చర్‌ను మరింత బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా చట్ట అమలు సామర్థ్యం పెరగాలని ఉద్ఘాటించారు. పన్ను ఎగవేతలు, అవినీతి, అక్రమ ధనార్జన నిరోధంపై ఇక్కడ జరిగిన జీ20 అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. జీ20 ప్రెసిడెన్సీ కింద, ఓఈసీడీ సహకారంతో దక్షిణాసియా ప్రాంతంలో పన్ను, ఆర్థిక నేర పరిశోధనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం ముందుందని సీతారామన్ అన్నారు. కీలక భేటీలు.. ఇండోనేíÙయా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతి, కెనడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్లతో కూడా ఆమె ఈ సందర్భంగా సమావేశమై, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. 3వ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)ప్రెసిడెంట్ జిన్ లిక్వెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల భేటీలో పాల్గొనడానికిగాను అమెరికా ఆర్థికమంత్రి జానెత్ యెల్లెన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు కూడా గాంధీనగర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫెసిలిటీని సందర్శించారు. పట్టణ మౌలిక రంగంపై పెట్టుబడులు కాగా, జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై జరిగిన మరో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక రంగం అభివృద్ధికి ప్రైవేటు పె ట్టుబడులను ఆకర్షించడం అవసరమని పేర్కొన్నా రు. అభివృద్ధి చెందుతున్న పలుదేశాల్లో కఠిన ద్రవ్య విధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి కీలక సవాలుగా మారిందని కూడా అన్నారు. -
భవిష్యత్తు కరెన్సీ క్రిప్టో.. డిజిటల్ ఆస్తిగా పరిగణన
న్యూఢిల్లీ: భారతీయుల్లో 37 శాతం మంది క్రిప్టో కరెన్సీలను భవిష్యత్తు కరెన్సీగా భావిస్తున్నారు. భవిష్యత్తు డిజిటల్ ఆస్తిగా 31 శాతం మంది పరిగణిస్తున్నారు. ఈ విషయాలు యూగోవ్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. వెబ్ఈ, క్రిప్టో ఎకోసిస్టమ్‌పై ప్రజల్లో అవగాహన తెలుసుకునేందుకు భారత్ సహా 15 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే 18 మధ్య దీన్ని నిర్వహించారు. మన దేశం నుంచి 1013 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో భాగం కావడంగా క్రిప్టోలను మన దేశీయులు పరిగణిస్తున్నారు. సర్వే ఫలితాలు క్రిప్టోపై విస్తృతమైన అవగాహనతో పాటు క్రిప్టో ఆధారిత భవిష్యత్తును తెలియజేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ♦ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 92 శాతం మంది క్రిప్టో పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పారు. ♦ 37 శాతం మంది భవిష్యత్తు డబ్బుగా క్రిప్టోని పేర్కొంటే, భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా 31 శాతం మంది తెలిపారు. ♦ మరీ ముఖ్యంగా 17 శాతం మంది క్రిప్టోని స్పెక్యులేటివ్ సాధనంగా చెప్పగా, ఏకంగా 20 శాతం మంది అయితే స్కామ్‌లుగా చెప్పడం గమనార్హం. ♦ ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఇప్పటికే క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారు. ♦ వచ్చే 12 నెలల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెడతామని 57 శాతం మంది తెలిపారు. ♦ క్రిప్టోలను పర్యావరణ అనుకూల టెక్నాలజీగా 57% మంది పేర్కొన్నారు. ♦ ఉత్తరాది, మధ్య, తూర్పు భారత్, ఈశాన్య రా ష్ట్రాల్లో అత్యధికంగా 94% మంది క్రిప్టో కరెన్సీ ల పట్ల ఆసక్తితో ఉంటే, పశ్చిమభారత్లో 92%, దక్షిణాది రాష్ట్రాల్లో 89% ఆసక్తి వ్యక్తమైంది. ♦ డేటా గోప్యత ముఖ్యమని 62% మంది చెప్పగా, ఇంటర్నెట్లో తమ గుర్తింపుపై తమకు మరింత నియంత్రణ అవసరమని 53% మంది తెలిపారు. ♦ క్రిప్టో మార్కెట్లో ఉన్న తీవ్ర ఆటుపోట్లు, స్కాముల భయం ఈ పరిశ్రమలో ప్రవేశానికి పెద్ద అడ్డంకులుగా ఈ సర్వే పేర్కొంది. అలాగే, క్రిప్టో ఎకోసిస్టమ్ సంక్లిష్టంగా ఉండడాన్ని కూడా అవరోధంగా పేర్కొంది. ♦ 53% మంది మెటావర్స్, 41% మంది వెబ్3, 42% మంది ఎన్ఎఫ్టీ గురించి అవగాహన ఉన్నట్టు ఉన్నారు. క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి సంబంధం లేదు రతన్ టాటా స్పష్టీకరణ ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా తనకు క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి అనుబంధం ఏ రూపంలోనూ లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల్లో రతన్ టాటాకు పెట్టుబడులు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను బలంగా ఖండించారు. ‘‘నెటిజన్లూ ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీతో నాకు ఏ రూపంలోనూ అనుబంధం లేదు. క్రిప్టో కరెన్సీతో నాకు అనుబంధం ఉందంటూ ఏదయినా ప్రకటన కానీ లేదా ఆర్టికల్‌ను కానీ చూస్తే అది వాస్తవం కాదు. కేవలం నెటిజన్లను మోసపుచ్చేందుకే’’ అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. 2021లో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఇదే విధంగా క్రిప్టో కరెన్సీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’!
రతన్ టాటా..పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది..దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, ఆన్లైన్లో తన పేరుతో జరుగుతున్న మోసాలపట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని రతన్ టాటా కోరారు. ‘దయచేసి అప్రమత్తంగా ఉండండి. నేను ఏ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టలేదు. ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో సంబంధం లేదు’ అని అన్నారు. క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధం ఉందని ఏవైనా కథనాలు లేదా ప్రకటనలను మీరు చూసినట్లయితే, అవి పూర్తిగా అవాస్తవమని, పౌరులను మోసం చేయడానికి ఉద్దేశించినవి అని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. క్రిప్టో మోసాలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. I request netizens to please stay aware. I have no associations with cryptocurrency of any form. pic.twitter.com/LpVIHVrOjy — Ratan N. Tata (@RNTata2000) June 27, 2023 చదవండి👉 రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం? -
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మూసివేత
న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. ‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్‌డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్‌డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
సైబర్ వలలో మహిళలు!
సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. లింక్‌లు పంపించి బురిడీ.. ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్లైన్ ట్రేడింగ్ వంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో.. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్లైన్ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!
విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి ఎంతకైనా తెలిగిస్తాడు, ఎంతమందినైనా మోసగిస్తాడు. గతంలో ఇలాంటి సంఘటనలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల అలాంటి మరో సంఘటన కెనడాలో తెరపైకి వచ్చింది. క్రిప్టో కింగ్ 'ఐడెన్ ప్లెటర్స్కై' (Aiden Pleterski) కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ఇతనిపైన టోరంటోలో కేసు కూడా నడుస్తోంది. అధికారులు ఇతని వద్ద నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడిన ఐడెన్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని కెనడాలోని బ్యాంక్రప్టసీ ట్రస్ట్ నివేదించింది. వారి వద్ద నుంచి సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 330 కోట్లు కంటే ఎక్కువ) వసూలు చేసి కేవలం 2 శాతం మాత్రమే, అంటే రూ. 6 కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టాడని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఐడెన్ ప్లెటర్‌స్కైని గత ఏడాది డిసెంబర్లో దక్షిణ ఒంటారియోకు చెందిన దుండగులు కిడ్నాప్ చేసారని, అక్కడే మూడు రోజులు బందించి మూడు మిలియన్ డాలర్లు (సుమారు 24 కోట్లు) ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టినట్లు అతని తండ్రి చెప్పాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఐడెన్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మోసపోయిన ఇన్వెస్టర్ల డబ్బుని తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే...
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల్లాంటి వర్చువల్ అసెట్స్ నియంత్రణపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో దేశీ క్రిప్టో ఎక్సే్చంజీలు ఇకపై అనుమానాస్పద లావాదేవీలేవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్డీ)కి తెలియ జేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో పద్ధతుల్లో జనరేట్ చేసిన కోడ్ లేదా నంబరు లేదా టోకెన్లను వర్చువల్ డిజిటల్ అసెట్లుగా పరిగణిస్తారు. (ఇదీ చదవండి: ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు) -
‘కింగ్ ఆఫ్ క్రిప్టో’ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్‌కు భారీ షాక్!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్‌కు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫ్రీడ్ అభ్యర్ధనని తిరస్కరిస్తూ ఆయనపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిన ఘటనలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ అభ్యర్ధనను కోర్టు కొట్టిపారేసింది. ఫ్లిప్ ఫోన్ లేదంటే స్మార్ట్ ఫోన్ వినియోగించేందుకు ఫ్రీడ్‌కు అనుమతి ఇవ్వబోమని అమెరికా న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌టీఎక్స్ పతనం తర్వాత ఫ్రీడ్పై పలు దేశాల్లో ఆర్థిక నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి. అ అభియోగాలతో అమెరికా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్లో 250 మిలియన్ డాలర్ల బాండ్ పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.కోర్టు సైతం ఫ్రీడ్‌ను విడుదల చేస్తూ కఠిన ఆంక్షలు విధించింది. దివాలా కేసులో నిజానిజాలు తేలే వరకు న్యాయ స్థానం చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ బెయిల్‌పై విడుదలైన అనంతరం కాల్ఫిపోర్నియాలో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ కోర్టు నిబంధనల్ని లైట్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో యూఎస్ ఎఫ్‌టీఎక్స్ జనరల్ కౌన్సిల్ రైన్ మిల్లర్‌కు ఎన్క్రిప్టెడ్ మెసేజ్, ఫిబ్రవరి నెలలో థర్డ్ పార్టీ పీఎన్‌ను నెట్‌వర్క్‌ను రెండు సార్లు వినియోగించారు. తాజాగా కోర్టు విధించిన నిబంధనల్ని సడలించాలని ఫ్రీడ్ తన తరుపు లాయర్లతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఫ్రీడ్ సాక్షుల్ని ప్రభావితం చేసేలా గతంలో పలు మార్లు ఇంటర్నెట్ను వినియోగించడం, ఎన్ క్రిప్టెడ్ మెసేజ్‌లను పంపించారని ప్రతివాదులు కోర్టులో వాదించారు. అందుకు తగ్గ ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. అనంతరం ఇరుపక్షాల వాదనల విన్న న్యాయవాది లూయిస్ ఏ.కప్లాన్ ఫ్రీడ్ అభ్యర్ధనల్ని తిరస్కరించారు. -
G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలను కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విధానం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే అంతర్జాతీయ రుణ సమస్యలను ఎదుర్కొనేందుకు, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జీ20 మంత్రుల సమావేశానికి ముందు అమెరికా, జపాన్, స్పెయిన్ తదితర దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలు చర్చించారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నేతలు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్, జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ షునిచి సుజుకీ తదితరులతో సీతారామన్ భేటీ అయ్యారు. సార్వభౌమ రుణాల పునర్వ్యవస్థీకరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంపై యెలెన్ అభినందించినట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఇదీ చదవండి: Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?) -
కూకట్పల్లి: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో నగరంలో కూకట్‌పల్లిలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోకని XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంది. రూ. లక్షకు నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించి వారిని మోసం చేసింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. దీంతో, బాధితులు.. అప్పుచేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తీరా.. కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, మంజీరా మాల్లోని ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం
-
‘క్రిప్టో’పై ఏకాభిప్రాయానికి భారత్ కసరత్తు..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. వీలైతే, జీ–20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత తరుణంలోనే ఇది కుదిరేలా చూసేందుకు ఆర్థిక స్థిరత్వ బోర్డు (ఎఫ్ఎస్బీ)తో కలిసి పని చేస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ ఈ వివరాలు తెలిపారు. క్రిప్టో అసెట్స్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి రూపొందించిన నివేదికపై జనవరి 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో వర్ధమాన దేశాలు చర్చించుకున్నాయని సేథ్ చెప్పారు. ఫిబ్రవరి 23న బెంగళూరులో జరగబోయే జీ–20 ఆర్థిక మంత్రులు, సెంట్రల బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా .. క్రిప్టో అసెట్స్ పాలసీపైనా ఏకాభిప్రాయ సాధనకు ఒక సెమినార్ జరగనున్నట్లు వివరించారు. దీని కోసం చర్చాపత్రం రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను కట్టడి చేసే దిశగా క్రిప్టో అసెట్స్‌పై అన్ని దేశాలూ కలిసి అంతర్జాతీయంగా నియంత్రించేలా చూసేందుకు జీ–20 అధ్యక్షత సందర్భంగా భారత్ కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తెలిపారు. ఎటువంటి నియంత్రణలు లేని క్రిప్టో కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇన్వెస్టర్లను నష్టాలపాలు చేస్తుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. 2021 నవంబర్‌లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ వేల్యుయేషన్ 2023 జనవరి నాటికి 1 ట్రిలియన్ డాలర్ దిగువకు పడిపోయింది. -
బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? మీరేం అనుకుంటున్నారు?
‘బడ్జెట్ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’ ‘బడ్జెట్ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్‌కు ముందు, బడ్జెట్‌కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది. సివిల్స్ కలలు కనే వారి నుంచి స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్‌లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు... కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్ కలలు కనే యంగ్‌స్టర్స్‌కు బడ్జెట్ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్‌లో సివిల్స్ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్‌లో సక్సెస్ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్‌కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక. యంగ్పీపుల్ బడ్జెట్ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో సివిల్స్‌లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు. ‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్‌పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. కంపెనీల లే ఆఫ్‌లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్‌పై ఒక కన్ను వేస్తున్నారు. దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్‌కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్‌ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్ ప్రసంగం వినాల్సిందే. సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది. ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వింటున్నారు. తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్‌పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్‌ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష. ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్ యూనివర్శిటీ. ‘డిజిటల్ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్లో డిజిటల్ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్‌కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష. ‘బడ్జెట్’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా! స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. -
గాంబ్లింగ్ తప్ప మరోటి కాదు, క్రిప్టోపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ ఆస్తులు పెరగడానికి అనుమతినిస్తే మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని గతంలోనే హెచ్చరించిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం( జనవరి 13న) భారత ఆర్థిక వ్యవస్థలు, క్రిప్టో కరెన్సీ, ఆస్తులపై మాట్లాడినా ఆయన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జూదం తప్ప మరోటి కాదని అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటి అనియంత్రిత వృద్ధికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుందన్నారు. క్రిప్టోకరెన్సీల పెరుగుదల వల్ల భారత ఆర్థికవ్యవస్థపై ఆర్బీఐ 'నియంత్రణ' కోల్పోయే అవకాశం ఉన్నందున భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు ఆర్బీఐ గవర్నర్. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి విలువ లేదని కొంతమంది క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని, కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. దీని మూలంగా ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'డాలరైజేషన్'కు దారితీయవచ్చని అన్నారు. ఆర్బిఐ నియంత్రణలో ఉన్న డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయిపై వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ కరెన్సీకి లాభదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యాంకుల ఐటీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని, డేటా గోప్యతపై దృష్టి పెట్టాలని దాస్ సూచించారు క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని గవర్నర్ గుర్తు చేశారు. -
94 శాతం సంపద ఆవిరి, బిలియనీర్‌కు మరో ఊహించని షాక్!
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్గా పేరు సంపాదించిన ఎఫ్‌టీఎక్స్ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫ్రైడ్ అనుమానాస్పద రీతలో నిధులను తరలించారనే ఆరోపణలతో బహమాస్‌లో అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహామాస్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దీని తర్వాత ఫ్రైడ్ని యునైటెడ్ స్టేట్స్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మాన్‌హట్టన్‌లోని యూఎస్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌ను అరెస్టు చేసినట్లు ధృవీకరించినా, అతనిపై ఉన్న ఆరోపణల గురించి తెలిపేందుకు మాత్రం నిరాకరించారు. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ $10 బిలియన్ల FTX కస్టమర్ల నిధులను అల్మెడకు రహస్యంగా తరలించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కనీసం $1 బిలియన్ల కస్టమర్ల నిధులు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ అంశంపై బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కంపెనీ నిధులను ఎప్పుడూ రహస్యంగా బదిలీ చేయలేదని చెప్పారు. నవంబర్, డిసెంబరు చివరిలో జరిగిన ఇంటర్వ్యూలతో పాటు బహిరంగాను బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ తన రిస్క్ మేనేజ్మెంట్ వైఫల్యాలను అంగీకరించాడు. అయితే మోసం చేశాడనే ఆరోపణలను మాత్రం అంగీకరించలేదు. తన యాజమాన్య వ్యాపార సంస్థ అయిన అల్మెడ రీసెర్చ్‌లోని నిధులతో FTXలో కస్టమర్ ఫండ్స్‌ని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తరలించలేదని వివరణ ఇచ్చాడు. కాగా నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయని పేర్కొంది. చదవండి ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్! -
నిండా ముంచిన క్రిప్టో.. రూ.27 లక్షలు టోకరా
సాక్షి, హైదరాబాద్: తొలుత రూ.10వేలు క్రిప్టోలో పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి లాభం రాలేదు. ఆ తర్వాత రూ.20వేలు పెట్టాడు, దీనికి లాభాలు రాలేదు. మళ్లీ ఒకేసారి రూ.80వేలు పెట్టాడు.. దీనికి కూడా ఒక్క రూపాయి రాలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కోటీశ్వరుడిని కావాలనే ఆశతో రూ.లక్షలు ముట్టజెప్పాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు ఓ వ్యక్తి. గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాస్ ఫోన్ నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. తాము చెప్పినట్లు చేస్తే తక్కువ టైంలో కోటీశ్వరుడిని చేస్తామంటూ మాయ మాటలు చెప్పారు. అందుకు అంగీకరించిన శ్రీనివాస్ పైన చెప్పుకున్న విధంగా పెట్టుబడి పెట్టుకుంటూ పోయాడు. రూ.80వేల తర్వాత ఒకేసారి రూ.2.50 లక్షలు పెట్టాడు. దీనికి లాభాలు కనిపించాయి, తీసుకునేందుకు వీలు లేకుండా ఆ డబ్బును సైబర్ నేరగాళ్లు ఫ్రీజ్ చేశారు. లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయి పలు దఫాలుగా రూ.27లక్షలు పెట్టాడు. ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి మంగళవారం సిటీసైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం : -
700 ఖాతాల నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కారణాలతో 700 పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు క్రిప్టో ఎక్సే్చంజీ వజీర్ఎక్స్ వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం అకౌంట్లను యూజర్ల అభ్యర్ధనల మేరకు నిలిపివేసినట్లు వివరించింది. 3వ పారదర్శకత నివేదికను విడుదల చేసిన సందర్భంగా వజీర్ఎక్స్ ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం సమీక్షాకాలంలో దాదాపు 1 కోటి లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో ఈడీ, సీబీఐ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్‌బీఐ వంటి విదేశీ ఏజెన్సీల నుండి 828 అభ్యర్ధనలు వచ్చాయి. వీటిలో 764 దేశీ దర్యాప్తు సంస్థల నుంచి రాగా మిగతావి విదేశీ ఏజెన్సీల నుంచి వచ్చినట్లు వివరించింది. ఎక్కువగా అక్రమంగా నిధుల బదలాయింపులు, క్రిప్టో స్కాములు, చీటింగ్, ఫోర్జరీ లాంటి నేరాలపై ఫిర్యాదులు అందినట్లు వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, అలాగే మోసాలను నివారించేందుకు నియంత్రణ సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని వజీర్ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి తెలిపారు. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ రక్షణ
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్ డాలర్ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్–ఫ్రైడ్ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది. ఆర్బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి.. అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్ డిజిటల్ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా. ప్రభుత్వం, ఆర్బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్ ప్లాట్‌ఫాం సెన్సిబుల్డాట్కామ్ సీఈవో ఆబిద్ హసన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ కమ్లేష్ షా అభిప్రాయపడ్డారు. -
నట్టేట ముంచిన ఉద్యోగి, రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి!
క్రిప్టో మార్కెట్లో అలజడి. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసింది. ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కొద్దిరోజుల క్రితం1600 కోట్ల డాలర్ల (రూ.1 లక్షా 36 వేల కోట్లు)తో ప్రపంచ ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు 1లక్షా 28వేల కోట్ల రూపాయలు నష్టపోయి బిలియనీర్ కాస్తా చిక్కుల్లో పడ్డాడు.అందుకు కారణం ఓ ఉద్యోగి. నవంబర్ 11న క్రిప్టో ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిందనే వార్త క్రిప్టో పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురి చేసింది. దీంతో 72 గంటల్లో మదుపర్లు 6 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ఆ సంస్థ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 12న రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీక్స్ ఎక్ఛేంజీ నుంచి వందల మిలియన్ల డాలర్లు అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్ చేసింది ఎవరో కాదు ఆ సంస్థ ఉద్యోగి నిషాద్ సింగ్. నిషాద్ వల్ల శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద 1లక్షా 28వేల కోట్లు తగ్గింది నిషాద్ సింగ్ ఎవరు? ►ఎన్నారై నిషాద్ సింగ్ ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలలో ఒకటైన ఎఫ్‌టిఎక్స్ దివాలా తీసేందుకు కారణమైన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారు. నిషాద్ సింగ్‌తో పాటు మరో 8 మంది రూమ్మెట్స్. వారిలో ఎఫ్‌టిఎక్స్ సీఈవో శామ్ బ్యాంక్మన్ ఒకరు. ►బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నిషాద్ సింగ్ పట్టభద్రుడయ్యాడు. ►ఆ తర్వాత నిషాద్ సింగ్ ఫేస్బుక్లో మెషిన్ లెర్నింగ్ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. డిసెంబర్ 2017లో ఎఫ్‌టీఎక్స్ కాంపిటీటర్ అలమేడ రీసెర్చ్‌లో చేరారు. ►అలమెడ రీసెర్చ్‌లో 17 నెలల పాటు ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏప్రిల్ 2019లో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్‌కి మారాడు. అప్పటి నుండి అదే టాప్ పొజీషన్లో కొనసాగుతున్నాడు. ►నిషాద్ సింగ్, శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్, గ్యారీ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గ్యారీ వాంగ్)లు క్రిప్టో ట్రేడర్లకు అనుగుణంగా క్రిప్టో మార్కెట్‌ను, ఫండ్స్‌ను కంట్రోల్ చేస్తారని కాయిన్‌డెస్క్ తెలిపింది. ►రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఎఫ్‌టీఎక్స్ కాంపిటీటర్ అలమెడ రీసెర్చ్‌లో 10 బిలియన్ డాలర్ల కస్టమర్ నిధులను రహస్యంగా బదిలీ చేశారు. ఆ ఘటన తర్వాత శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫారెన్స్‌లో సంస్థలోని ఇద్దరు ఉద్యోగులు, నిషాద్ సింగ్ , గ్యారీ వాంగ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యారీ వాంగ్ మాట్లాడుతూ ఎఫ్‌టీఎక్స్ నుంచి.. అలమెడ రీసెర్చ్‌కు సెండ్ చేసిన నిధుల గురించి తనకు తెలుసని నివేదించారు. కాగా, ప్రస్తుతం అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోంది. చదవండి👉 షాకింగ్,ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు -
కుప్పకూలిన క్రిప్టో కరెన్సీ విలువ
-
చరిత్రకెక్కిన యంగ్ సీఈఓ.. రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి, 94 శాతం సంపద కరిగిపాయే!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. జీవితంలో ఒక్కోసారి అకస్మిక ప్రమాదాలు , అదృష్టాలు, అలానే నష్టాలు.. ఇవన్నీ సడన్ సునామీలా మన లైఫ్‌లోకి వచ్చి పలకరిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ యంగ్ బిలియనీర్‌కి భారీ షాక్ తగిలింది. రాత్రికి రాత్రి లక్షల కోట్లు పొయాయి. ఎలా అని అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.. క్రిప్టో కరెన్సీల (Cryptocurrency) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి నియంత్రణలో లేకుండా లావాదేవీలు జరుగుతున్న వ్యవస్థ. అందుకే ఇందులో షాకింగ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా క్రిప్టో ఎక్స్చేంజీ కంపెనీ అయిన FTX ఫౌండర్, సీఈఓ, అయిన సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాత్రికి రాత్రే తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. తన వ్యక్తిగత సంపద ఏకంగా 94 శాతం ఆవిరై ప్రస్తుతం 991.5 బిలియన్ డాలర్లకు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఒక్కరోజులో అత్యధిక సంపద కోల్పోయిన బిలియనీర్‌గా చరిత్రలోకెక్కారు ఈ యంగ్ బిలియనీర్. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టిఎక్స్‌ను( Crypto Exchange FTX) తన ప్రత్యర్థి కంపెనీ బినాన్స్( Binanace) కొనుగోలు చేస్తున్నట్లు ఈ యంగ్ బిలియనీర్ ప్రకటించిన తర్వాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సంపద కరిగిపోయింది. కాయిన్‌డెస్క్ ప్రకారం, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ FTX అమ్మకంపై వార్త వెలువడే ముందు $15.2 బిలియన్ల విలువ ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత అతని సంపద నుంచి దాదాపు $14.6 బిలియన్లు తుడిచిపెట్టుకుపోయాయి. బినాన్స్ హెడ్ చాంగ్‌పెంగ్ జావో ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం అయిన బినాన్స్.. FTXను కొనుగోలు చేయడానికి తమ కంపెనీ ఆసక్తి చూపిస్తుందని, డీల్ కూడా కుదిరిందని తెలిపారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్కిట్లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు. గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్ ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు. -
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్, యూకేలో క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత?
బ్రిటన్ 47వ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టడంతో ఆదేశంలో క్రిప్టో కరెన్సీపై మరోసారి చర్చ మొదలైంది. క్రిప్టో కరెన్సీని ఆర్ధిక వ్యవస్థలో భాగం చేసేందుకు సునాక్ డిజిటల్ కరెన్సీని చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ వినియోగించాలనుకునే వారిలో రిషి సునాక్ సైతం ఉన్నారు. 500 ఏళ్లుగా ఆర్ధిక స్థిరత్వానికి కంచుకోటగా ఉన్న బ్రిటన్ గడ్డు పరిస్థితుల్లోకి జారుకుంది. దీంతో ఆర్ధిక నిపుణుడైన సునక్..దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కే దిశగా ప్రయత్నాలు చేశారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో యూకేని క్రిప్టోకరెన్సీకి కేంద్రంగా మార్చాలనే తన కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే క్రిప్టో నిపుణులు యూకే ప్రధానిగా సునక్ ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరిస్ జాన్సన్ ప్రధానిగా పాలన పగ్గాలు నిర్వహిస్తున్న సమయంలో సునక్ స్టేబుల్కాయిన్లకు సంబంధించిన నియంత్రణ సంస్కరణలను ప్రతిపాదించారు. క్రిప్టో అసెట్స్ టెక్నాలజీ హబ్‌గా యూకేని మార్చడం నా ఆశయం. మేం పెట్టిన ప్రతిపాదనలు సంస్థలు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సహాయ పడతాయని నాడు ఓ సందర్భంలో అన్నారు. 2021లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), లేదా ‘బ్రిట్కాయిన్’ ను 2025 చివరి నాటికి యూకే ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని సునక్ ప్రతిపాదించారు. ప్రయోజనాల్ని హైలెట్ చేశారు. ప్రభుత్వం రెండుసార్లు మారడం వల్ల సునాక్ క్రిప్టో ప్లాన్లు వాయిదా పడింది. అయితే, ఇప్పుడు సునక్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని యూకే దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
సైబర్ మాయ.. లక్షలు పాయె
సాక్షి, హిమాయత్‌నగర్: ‘‘నగరానికి చెందిన పావని ఫోన్ నంబర్‌ను ఓ వ్యక్తి వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. మీరు చెప్పినట్లుగా విని నేను పెట్టుబడి పెట్టి ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యానంటూ ఏవో కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం. వీటిని చూసిన పావని తాను కూడా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరాలిని కావొచ్చనే ఆశతో డబ్బు పెట్టి మోసపోయింది.’’ ‘‘నాలుగు రోజుల క్రితం హైటెక్‌సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేసే యువతికి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి పరిచయమై క్రిప్టోలో డబ్బు పెట్టమన్నాడు. అతగాడి మాటలకు బుట్టలో పడ్డ యువతి పలు దఫాలుగా రూ.92లక్షలు పెట్టుబడి పెట్టినాక మాయగాడి ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్ మాయమైంది.. అప్పటికి గాని యువతికి అర్థం కాలేదు తాను మోసపొయినట్లు’’. ఈ రెండు ఉదాహారణలే కాదు ఇలా వారంలో పది, పదిహేను మంది ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ వలలో పడి మోసపోయిన బాధితులు సైబర్‌క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోసపోతున్న వారిలో వందకు వందశాతం విద్యావంతులే ఉండటం అందులోనూ ఐటీ రంగానికి చెందిన వారు, వ్యాపార రంగానికి చెందిన వారు ఉండటం మరింత హాస్యాస్పదానికి గురిచేస్తుంది. కోటీశ్వరులైనట్లుగా నకిలీ ఆధారాలతో బురిడీ ముక్కూ మెహం తెలియని కొందరు వ్యక్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్లు ఉంటుంటే మిగత వారు రాజస్థాన్, యూపీ, అస్సాంలకు చెందిన వారు ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్స్, డబ్బు వచ్చినట్లుగా వారికి వారే వాట్సప్ చాటింగ్‌లో గొప్పలు చెప్పుకోవడం వంటివి చేస్తున్నారు. పెట్టుబడి పెడుతున్న వారిని నమ్మించేందుకు రూ.5వేలకు 10వేలు ఇవ్వడం లేదా రూ.10వేలకు 20వేలు ఇవ్వడం చేస్తున్నారు. ఇదిగో లాభాలు వస్తున్నాయి కదా అంటూ ఏమాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు పెట్టేస్తూ అప్పులపాలౌవుతున్నారు. హెచ్చరిస్తున్నాం అయినా వలలో పడిపోతున్నారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ అధికారిక పేజీల్లో ఇన్వెస్ట్మెంట్లు, క్రిప్టో కరెన్సీలు చేసి మోసపోవద్దంటూ పోలీసులు పోస్టులు పెడుతున్నారు. ఆయా కమీషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లకు సంబం«ధించిన వారు కూడా అవగాహాన కలి్పస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. కొత్తవారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ లక్షల రూపాయిలు మోసపోతున్నారు. – కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైం ఏసీపీ -
మొబైల్‌కు మెసేజ్.. క్రిప్టో పేరుతో లూటీ!
లక్కీ డ్రా గిఫ్టు పేరుతో ప్రజలు మొబైళ్లకు ఓటీపీ పంపించి వారి బ్యాంకు అకౌంట్లను కాజేసే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఆశ చూపించి దోచేస్తున్నారు. దీనికి ఇన్‌స్టా గ్రాంలో చురుకుగా ఉంటున్న యువతనే టార్గెట్ చేసుకున్నారు. మెసేజ్‌లు, లింక్‌లు పంపించి పలు నకిలీ కంపెనీల బ్రోచర్లను చూపి అధిక లాభాల పేరుతో వలలో వేసుకుంటారు. క్రిప్టో కరెన్సీ మోజులో పడి మోసపోతున్న వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా ఉన్నారు. ఎలా వంచనకు పాల్పడతారంటే అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీ పై తీవ్ర చర్చ జరుగుతోంది. కోవిడ్, ఆ తరువాత కాలంలో ఈ సైబర్ డబ్బు విలువ పెరిగింది. దీంతో వంచకులు క్రిప్టో బాట పట్టారు. యువత, టెక్కీలు చాలామంది ఇన్‌స్టా వినియోగిస్తారు. సైబర్ మోసగాళ్లు వారికి లింక్‌లు పంపుతూ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే అచిర కాలంలోనే భారీ లాభాలు వస్తాయని చెబుతారు. పెట్టుబడి పెట్టాక అకౌంట్‌ను, ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేస్తారు. దీంతో బాధితులు మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తారు. సైబర్ వంచకులు ఇతరుల ఇన్‌స్టా అకౌంట్లను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడతారు. వారు పంపించిన లింక్, యుఆర్‌పీఎల్ కొద్దిరోజుల్లోనే డీ యాక్టివేట్ అవుతాయి. వంచకులు నగదు జమచేసుకునే బ్యాంకు అకౌంట్లు కూడా నకిలీల పేరుతో ఉంటాయి. దీంతో కేసుల విచారణ కష్టంగా ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే అధికారిక కంపెనీలు ఏవి, వాటికి అనుమతులు ఉన్నాయా? ఇలా పలు విషయాలను తెలుసుకున్న తరువాతనే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మి మదుపు చేస్తే మోసపోతారని సైబర్ నిపుణులు తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయని దుండగులు నకిలీ సక్సెస్ స్టోరీలను పోస్ట్ చేసి మాయకు గురిచేస్తారు. కాబట్టి క్రిప్టో విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సీఐ ఆర్.సంతోష్‌రామ్ తెలిపారు. లక్షల రూపాయలు పోయాయి నగరంలో పేరుపొందిన ఐటీ కంపెనీ ఉద్యోగి ఇన్ స్టా ఖాతాకు క్రిప్టోలో పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయల లాభం పొందవచ్చని ఒక సక్సెస్ స్టోరీ వచ్చింది. స్నేహితులు పంపిన లింక్ కదా అని నమ్మి దశలవారీగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజులు గడిచినప్పటికీ లాభాలు రాకపోగా అకౌంట్లో ఉన్న నగదు మాయమైంది. దీనిపై బాదితుడు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చదవండి: మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్! -
టెకీకి టోకరా..
హిమాయత్‌నగర్: ఇన్‌స్ట్రాగామ్ వేదికగా పరిచయమైన ఇద్దరు వ్యక్తులు క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేశారు. కొద్దిరోజులు సాన్నిహిత్యంగా మాట్లాడిన అనంతరం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కోటీశర్వురాలిని చేస్తానంటూ నగరానికి చెందిన ఓ టెకీకి చైనీయుడు వల వేశాడు. వలలో పడ్డ టెకీ పెద్ద మొత్తంలో మోసపోయి సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..జూబ్లిహిల్స్‌కు చెందిన యువతి హైటెక్‌సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తోంది. కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన హువాంగ్‌వినూ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రతిరోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. క్రమంలో క్రిప్టో కరెన్సీకు సంబంధించిన పోస్టులను, కోట్లు గెలుచుకున్నట్లుగా కొందరి ఫొటోలతో అభిప్రాయాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. ప్రతిపోస్ట్‌కు లైక్ కొడుతున్న టెకీ ఓ రోజు తాను కూడా చేయొచ్చా అంటూ సంప్రదించింది. తక్కువ టైంలో తక్కువ సంపాదనతో కోటీశ్వరురాలిని చేస్తానంటూ భరోసా ఇచ్చాడు. అంతే కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే పలు దఫాలుగా రూ.91లక్ష పెట్టుబడి పెట్టింది. ఒక్క రూపాయి కూడా లాభం రాకపోగా ఉన్నవి ఇవ్వకుండా వేధిస్తున్న క్రమంలో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్‌క్రైం పీఎస్ మెట్లు ఎక్కింది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. మరో కేసులో... సుల్తాన్‌బజార్‌కు చెందిన ఓ యువకుడికి రీకా పేరుతో ఓ అమ్మాయి పరిచయమైయ్యింది. ఫోన్లో సైతం ఇద్దరూ సంభాíÙంచుకుంటున్నారు. తాను ఇన్వెస్టర్ని అంటూ మాటలు కలిపింది. రీకా మాటలకు బుట్టలో పడ్డ యువకుడు పలు దఫాలుగా రూ.42లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఒక్క రూపాయి లాభం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా మోసపోయినట్లు తేరుకుని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఒక్కసారి ప్రచారానికి రండి అన్నా) -
ఝన్‌ఝన్‌వాలా తరువాత నేనే! కట్ చేస్తే..ఓ టీస్టాల్ కుర్రోడి వైరల్ స్టోరీ
బెంగళూరుకు చెందిన ఒక టీ స్టాల్ ఓనర్ ఏకంగా క్రిప్టో కరెన్సీ చెల్లింపులను యాక్సెస్ చేయడం సెన్సేషన్‌గా మారింది. అది కూడా 'ఫ్రస్ట్రేటెడ్ డ్రాప్ అవుట్' టీ స్టాల్ నిర్వహిస్తూ బిట్‌కాయిన్ లావాదేవీలు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిన 22 ఏళ్ల శుభమ్ సైనీ వైరల్ స్టోరీ.. శుభమ్ సైనీ రేవారి, ఇందిరా గాంధీ యూనివర్సిటీ నుంచి బీసీఏ డ్రాప్ అవుట్. ఇంటర్నషిప్ చేద్దామని బెంగళూరు వచ్చాడు. అతనికి స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో క్రిప్టో ప్రపంచం అతనికి పరిచయమైంది. రాకేష్ ఝన్ ఝన్‌వాలా అంతటివాడిని కావాలని కలలు కన్నాడు. అలా 2020లో, మార్కెట్ 60శాతం క్రాష్ అయిన సమయంలో లాభాలను ఆర్జించాలనే ఆశతో క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. రూ. 1.5 లక్షలపై వెయ్యి శాతం లాభాలు గడించాడు. అలా రూ. 30 లక్షల మేర లాభాలు రావడంతో గాల్లో తేలిపోయాడు. 2021 మార్కెట్ పతనంతో ఆ ఆనందం గాల్లోనే కలిసిపోయింది. ఎక్కడ నుంచి మొదలయ్యాడో అక్కడికే చేరాడు. కానీ అక్కడితో కుంగిపోలేదు. ఏమైనా చేయాలనే పట్టుదలతో కేవలం 30వేల పెట్టుబడితో ఆరు నెలల క్రితం టీ దుకాణం ప్రారంభించాడు. మట్టికప్పులో రూ. 20 లకి టీని విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా క్రిప్టో లావాదేవీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. 'చాయ్ విత్ క్రిప్టో' దుకాణం చాయ్ లవర్స్ హ్యాంగ్అవుట్గా మారిపోయింది. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తరువాత నేనే అనుకున్నా. కానీ అనుకున్నట్టుగా జీవితం సాగుదుగా. అనుకోని నష్టాలతో కంగిపోలే.. ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఎదగాలని భావించాను. అందుకే చిన్నగా టీ స్టాల్ మొదలు పెట్టాను. ముఖ్యంగా పర్యావరణహితంగా మట్టి కప్పులనే వాడుతున్నాను. వారానికి సగటున 20-30 లావాదేవీలు జరుగుతాయనీ, తన పేమెంట్ సిస్టం యూజర్లకు బాగా నచ్చుతోందని శుభమ్ చెప్పారు. యూపీఐ లాంటి నగదు లావాదేవీలతోపాటు కస్టమర్లు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు తన వద్ద చేయవచ్చని తెలిపాడు. దీంతోపాటు నార్త్ ఇండియా వంటకాలతో ‘క్లౌడ్ కిచెన్’ తో మరింత ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు అతిపెద్ద గ్రీన్ అండ్ సక్సెస్‌పుల్ కేఫ్ బ్రాండ్ యజమానిగా ఎదగాలని శుభమ్ సైనీ భావిస్తున్నాడు. దీంతో నెటిజనులంతా ఆల్ ది బెస్ట్ బ్రో అంటు విషెస్ అందిస్తున్నారు. -
కిమ్ కర్దాషియన్ క్రిప్టో వివాద సెటిల్మెంట్
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ .. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్నూ ప్రచారం చేయబోనని కిమ్ తెలిపారు. వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్ క్రిప్టోకరెన్సీని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతా ద్వారా కిమ్ ప్రమోట్ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్ కర్దాషియన్ సెటిల్మెంట్కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. -
100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
న్యూఢిల్లీ:చిన్న పొరపాటు, నిర్లక్క్ష్యం ఒక్కోసారి భారీ ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే చూశాం. తాజాగా పొరపాటుగా ఒక మహిళ ఖాతాలో మిలియన్ల డాలర్లను పంపించిన ఘటన ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే దీన్ని గుర్తించడానికి సంస్థకు ఏకంగా ఏడునెలలు పట్టిందిట. (WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు) సింగపూర్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ క్రిప్టో డాట్‌కామ్ ఈ పొరపాటుచేసింది. అనుకోకుండా ఆస్ట్రేలియన్ మహిళ దేవమనోగారి మణివేల్ ఖాతాకు ఏకంగా 10.5 మిలియన్ల డాలర్లను సెండ్ చేసింది. అదీ కేవలం 100 డాలర్ల రీఫండ్‌కు బదులుగా ఇంత సొమ్మును ఆమె ఖాతాలో జమ చేసింది. గత ఏడాది మేలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా పొరపాటును గ్రహించి చర్యలకు దిగింది. ఆమె ఖాతాలో అంత పెద్ద మొత్తంలో సొమ్మును జతచేశామంటూ లబోదిబోమంది. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభో అంటూ దేవమనోగారి మణివేల్ , ఆమె సోదరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది చదవండి: Starbucks: స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్, ప్రత్యేకత ఏంటంటే? ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే తనఖాతాలో వచ్చిన సొమ్ము ద్వారా గుట్టుచప్పుడుకాకుండా మెల్బోర్న్లో 1.35 మిలియన్ డాలర్లు విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసింది మణివేల్. ఆ తరువాత తెలివిగా ఆ ఇంటిని సోదరి పేరుతో బదిలీ కూడా చేసేసింది. దీంతోపాటు 4,30,000 డాలర్లను తన కుమార్తెకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత చేసినా.. తప్పించుకోలేకపోయింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆస్తిని విక్రయించి, మిగిలిన డబ్బును వడ్డీతో సహా తిరిగి క్రిప్టో డాట్‌కాంకు ఇవ్వాలని ఆదేశించారు. -
డెత్ డ్రాప్.. డ్రగ్ ట్రాప్! ఎవరికీ చిక్కకుండా కొత్త పంథాలో ‘సరుకు’ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: సంపన్నుల పిల్లలు, యువత, విద్యార్థులే టార్గెట్.. ఎక్కడా చిక్కొద్దు.. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం.. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం.. ‘డెడ్ డ్రాప్’ విధానంలో డ్రగ్స్ అందజేయడం.. లేదంటే కొరియర్లో సరఫరా చేయడం.. ఎక్కడా ‘అసలు’ మనుషులు నేరుగా కనిపించరు. డ్రగ్స్ మాత్రం చేరిపోతాయి. ఎవరికీ చిక్కకుండా అత్యాధునిక, సరికొత్త విధానాల్లో వ్యవస్థీకృతంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఇద్దరు సప్లయర్లు, రాష్ట్రానికి చెందిన ఆరుగురు పెడ్లర్స్ (స్థానిక డ్రగ్స్ విక్రేతల)ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సంపన్నుల పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులపైనా కేసులు నమోదు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. ఫర్హాన్ మహ్మద్, నరేంద్ర ఆర్య డార్క్ వెబ్‌లో ఆర్డర్లు తీసుకుని.. హరియాణా, మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవా, రాజస్తాన్‌లలో స్థిరపడిన నరేంద్ర ఆర్య, ఫర్హాన్ మహ్మద్ అన్సారీ దేశవ్యాప్తంగా పెడ్లర్స్ (స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవారు) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ ముఠాల నుంచి తెప్పించుకుని.. దేశవ్యాప్తంగా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నారు. బికర్మీ యాప్‌లో హోలీ షాప్, ట్రిమినేటర్ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో ఈ ఐడీలతోపాటు తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు ‘జుంబద కార్టెల్’ అనే ఐడీ ద్వారానూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఐడీ ఎవరిదన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. ►హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉత్కర్‡్ష ఉమంగ్, సాహిల్ శర్మ, అబ్దుల్లా అన్సారీ అహ్మద్‌ఖాన్, ఇంద్రకుమార్, అవిటి చరణ్‌కుమార్, పి.భూషణ్‌రాజ్ డార్క్‌వెబ్‌లోని ఆ ఐడీలతో చాటింగ్ చేస్తూ డ్రగ్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. బినాన్స్, వజీరెక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా క్రిప్టో కరెన్సీని సరఫరాదారులకు పంపుతున్నారు. ►క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు అందాక.. సరఫరాదారులు కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్‌ను పంపిస్తున్నారు. కొరియర్లో అయితే వస్తువులు, వస్త్రాల మాదిరిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపేదీ, ఎవరు పంపేదీ తెలియకుండా తప్పుడు వివరాలు ఇస్తున్నారు. అయితే ఎక్కువశాతం డెడ్ ట్రాప్ విధానంలో డ్రగ్స్ అందిస్తున్నారు. ఏమాత్రం ఊహించని ఓ ప్రాంతంలో డ్రగ్ పార్శిల్ ఉంచి.. ఆ వివరాలను మెసెంజర్ ద్వారా పెడ్లర్స్‌కు అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. ►ఇలా డ్రగ్స్ అందుకున్న పెడ్లర్స్ దాన్ని హైదరాబాద్‌లో ధనికుల పిల్లలు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు టార్గెట్‌గా విక్రయిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఈ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొన్నవారిలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించినట్టు తెలిసింది. బీబీఏ విద్యార్థులైన అన్సార్, ఉమంగ్, సాహిల్‌లు కొన్ని సందర్భాల్లో ఇంద్రకుమార్ నుంచీ డ్రగ్ ఖరీదు చేస్తున్నారు. గతంలో ఓసారి అరెస్టైన ఉమంగ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో రేవ్ పార్టీలు ఇస్తుండేవాడని గుర్తించారు. నిఘా పెట్టి.. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌పై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియల్ బృందం పక్కాగా నిఘా పెట్టింది. అదను చూసి వలపన్ని ఇద్దరు సరఫరాదారులతోపాటు ఆరుగురు పెడ్లర్స్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి 140 గ్రాముల చరస్, 184 బోల్ట్స్ ఎల్ఎస్డీ, 10 గ్రాముల ఎండీఎంఏ, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హూమయూన్నగర్, చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. నరేంద్రకు దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లు ఉండగా గత ఏడాదిలో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను, ఫర్హాన్ ఆరు నెలల కాలంలో రూ.15 లక్షల డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు గుర్తించారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో సంపన్నులు, విద్యాధికుల పిల్లలు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తున్న పార్శిళ్లపై కన్నేసి ఉంచాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని విప్పి పరిశీలించాలి. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే నిఘా పెట్టాలి. డ్రగ్స్ సప్లయర్లతోపాటు వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కౌన్సెలింగ్, రీహ్యాబ్ తర్వాత ఏడాదిపాటు పరిశీలనలో ఉంచుతున్నాం. చార్జి షీట్ దాఖలు సమయానికి మార్పు వచ్చిన వారిని ఆయా కేసుల్లో సాక్షులుగా మారుస్తున్నాం. డ్రగ్స్ బానిసల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. –సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
ట్రేడింగ్ పేరుతో హాంఫట్
హిమాయత్‌నగర్: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్‌కు చెందిన రోషన్‌అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ ఫోన్‌నంబర్‌పై రూ.3లక్షలు పర్సనల్ లోన్ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్లో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ రఘురాంని హాంగ్‌కాంగ్‌లో ఉండే వ్యక్తికి వాట్సప్ ద్వారా పరిచయం చేశాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్‌టీఎక్స్ అనే ట్రేడింగ్‌లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్.. ఆ తర్వాత..) -
క్రిప్టోలను నిషేధించాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్బీఐ అభిప్రాయం‘ అని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్‌పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా? -
క్రిప్టో దారుణ పతనం, దివాలా బాటలో ఎక్స్చేంజీలు, భవిష్యత్తేంటి?
క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా ఈ స్థాయిలో పడిపోతాయని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీకి కారణమేంటి? క్రిప్టోల దారుణ పతనం పెట్టుడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందా, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై నిపుణుల అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థిచే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017-2021 మధ్య ఈక్విటీలు-క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30-40 శాతం నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. ఎక్స్చేంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్స్చేంజీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆరి్థకంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్స్చేంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆరి్థక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50-60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30-40 చిన్న ఎక్స్చేంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10-15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. -
ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్స్చేంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గమనించాల్సిన ముఖ్య విషయాలు ► ఫండమెంటల్స్ లేని సాధనాలు ►స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ ►నియంత్రణల్లేని చోట రిస్క్ అపరిమితం ►అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ►ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు ►నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం ►అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
ఎలన్ మస్క్ వీడియోలు చూస్తున్నారా?
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పే క్రిప్టో ప్రిడిక్షన్స్ నమ్ముతున్నారా? ఆయన పేరు మీదున్న యూట్యూబ్ వీడియోలు, ట్విట్ లింక్స్ ఓపెన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరస్తులు ఎలన్ మస్క్ ఫోటోలు, వీడియోలు చూపించి మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తులు తెలివి మీరారు. ఎలన్ మస్క్ ఫోటోల్ని, వీడియోల్ని చూపించి అమాయకుల్నే కాదు బ్రిటిష్ ఆర్మీని సైతం మోసం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గార్డియన్ రిపోర్ట్ ప్రకారం.. బ్రిటిష్ ఆర్మీకి చెందిన ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు వాటి పేర్లను మార్చారు. పనిలో పనిగా అధికారిక ఆర్మీ ప్రొఫైల్ ఇమేజెస్‌కు బదులు మంకీ కార్టూన్ ఇమేజ్ను అప్డేట్ చేశారు. ఆర్మీ రిక్రూట్ట్మెంట్తో పాటు ట్రైనింగ్ గురించి అలర్ట్ ఇచ్చారు. ఇక యూట్యూబ్‌లో సైతం ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడిన వీడియోల్ని టెలికాస్ట్ చేశారు. ఎలన్ మస్క్ చెప్పినట్లు చేస్తే క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాల్ని గడించవచ్చని నమ్మించారు. దీంతో అప్రమత్తమైన బ్రిటిష్ ఆర్మీ దేశ ప్రజలకు క్షమాణలు చెప్పింది. హ్యాకింగ్ జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం హ్యాకింగ్ ఎవరు చేశారు. ఎక్కడి నుంచి చేశారనే అంశంపై బ్రిటిష్ ఆర్మీ విచారణ ముమ్మరం చేసింది. -
క్రిప్టో కరెన్సీతో ముమ్మాటికీ ప్రమాదమే
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థకు ముమ్మాటికీ ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టంచేశారు. అంతర్లీనంగా ఎటువంటి పటిష్టతా లేకుండా కేవలం విశ్వాసం, ఊహాగానాల ఆధారంగా విలువను పొందే ఏ ఇన్స్ట్రమెంటైనా అది చివరకు తీవ్ర అనిశ్చితికే దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ గురువారం విడుదల చేసిన 25వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడు దల సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభా వం ఎకానమీలపై ఉంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ రికవరీ బాటలో పయనిస్తోంది. ఎటువంటి సవాళ్లనైనా తట్టుకోడానికి వీలుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పటిష్ట మూలధనాన్ని కొనసాగిస్తున్నాయి. ► 2021లో అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం 10.1 శాతం పెరిగితే 2022లో ఇది 5 శాతానికి పడిపోతుందని అంచనా. ► దేశీయంగా బ్యాంకింగ్ మొండిబకాయిల నిష్పత్తి మార్చిలో ఆరేళ్ల కనిష్టం 5.9 శాతానికి పడిపోయింది. 2023 మార్చి నాటికి మొండిబకాయిలు 5.3 శాతానికి దిగివస్తాయని భావిస్తున్నాం. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. దీర్ఘకాలంలో రూపాయి స్థిరత్వం ఆర్బీఐ లక్ష్యం. ► మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారత్ విదేశీ రుణ భారం 47.1 బిలియన్ డాలర్లు పెరిగి, 620.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే జీడీపీ నిష్పత్తిలో చూస్తే 2021 మార్చిలో 21.2%గా ఉంటే, 2022 మార్చిలో 19.9%కి తగ్గింది. ► పరిశ్రమకు రుణ వృద్ధి మే 2022లో 8.7 శాతానికి పెరిగింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి ఈ రేటు 11.8 శాతం పెరిగింది. పరిశ్రమకు రుణ వృద్ధి 2021 మేలో కేవలం 0.2 శాతం కావడం గమనార్హం. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వినియోగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు... ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. -
క్రిప్టో కరెన్సీపై టీడీఎస్, సీబీడీటీ ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్ టు పీర్/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 194 ఎస్ కింద.. పీర్‌టుపీర్ లావాదేవీల్లో వర్చువల్ డిజిటల్ అస్సెట్ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్ఎఫ్టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్‌ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్‌టూపీర్ అంటే ఎక్సే్ఛంజ్ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సే్ఛంజ్‌ల్లో అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌లు క్లయింట్ల తరఫున టీడీఎస్ మినహాయిస్తాయి. ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్ అసెట్స్‌ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ నిబంధన 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. -
మారనున్న ట్యాక్స్ రూల్స్, క్రిప్టో కరెన్సీలపై!
న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాల వెల్లడికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిడక్షన్ చేసిన నెల ముగిశాక, 30 రోజుల్లోగా టీడీఎస్‌ను జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చలానా–కమ్–స్టేట్మెంట్ ఫారం 26క్యూఈని ఉపయోగించాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ) బదలాయింపు తేదీ, విలువ, చెల్లింపు విధానం మొదలైన వివరాలన్నీ దగ్గర ఉంచుకోవాలి. జూలై 1 నుంచి వీడీఏలు లేదా క్రిప్టోకరెన్సీలపై 1 శాతం టీడీఎస్ విధించనున్న నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా నిబంధనలు వీడీఏ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరిగిపోతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. -
భారత దేశ చరిత్రలో 90వేల కోట్ల బిట్ కాయిన్ స్కాం..చేసింది ఎవరంటే!
ఈ ఏడాది మార్చి నెలలో భారీ బిట్ కాయిన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కాం వెనుక మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్‌పై కోర్ట్‌లో కేసు నడుస్తుండగా.. తాజాగా ఆ మొత్తం కుంభ కోణం విలువ సుమారు రూ.90,500 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు పోంజి స్కాం చేశాడు.ఇక, బిజినెస్ వాడుక భాషలో పూంజి స్కాం అంటే..ఉదాహరణకు..నిందితుడు లక్షమందిని మోసం చేయాలని అనుకుంటే..ఆ డిజిట్‌కు రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తాడు.ఇందుకోసం తన మాట విని బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పెట్టిన మొత్తాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇస్తాడు. ఆ మాటలు నమ్మిన మదుపర్లు బిట్ కాయిన్లపై భారీగా ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పినట్లుగానే అమాయకులైన ఇన్వెస్టర్లకు మొదట్లో లాభాలు చూపిస్తారు. ఆ లాభాలతో నిందితులకు పబ్లిసిటీ పెరుగుతుంది. దీంతో అనతి కాలంలో స్కాం టార్గెట్‌ను రీచ్ అవ్వొచ్చు. అలా టార్గెట్ రీచ్ అయితే ఇన్వెస్టర్లకు ఆదాయం చూపించడం మానేస్తారు. ప్రతినెలా డబ్బులే డబ్బులు సేమ్ ఇలాగే పైన అమిత్ భరద్వాజ్ కుంభకోణం విషయంలో జరిగింది. భారీ ఎత్తున మల్టీ లెవల్ మార్కెటింగ్‌తో 18 నెలల పాటు బిట్కాయిన్లపై పెట్టుబడి పెడితే ప్రతినెలా డిపాజిట్లలో 10శాతం ఆదాయం చూపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాలంలో తమ పెట్టుబడులు పెరుగుతాయని హామీ ఇస్తూ బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ఇలా అమిత్ పెట్టు బడిదారుల్ని భారీ ఎత్తున మోసం చేసి, చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో ప్రతి నెల ఒక్కసారి వచ్చి పడుతున్న ఆదాయం కనుమరుగు కావడంతో పెట్టుబడిదారులకు అనుమానం రావడం, కేసు ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో ఉండగా..ఈడీ బిట్‌కాయిన్ కుంభకోణానికి పాల్పడిన నిందితుల క్రిప్టో వాలెట్‌కు యాక్సెస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. అంతేకాదు వివేక్ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ తదితరుల సహకారంతో అమిత్ భరద్వాజ్ (ఈ ఏడాది జనవరిలో మరణించాడు) 80వేలకు పైగా బిట్కాయిన్లు సేకరించినట్లు తాము నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. రూ.90వేలకోట్ల స్కాం ఈ నేపథ్యంలో తాజాగా ఈ బిట్‌కాయిన్ స్కాంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలినట్లుగా అమిత్ చేసిన పోంజి కుంభ కోణం విలువ రూ.90వేల కోట్లకు పైగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పోంజీ స్కాం సూత్రధారి అమిత్ భరద్వాజ్ మదుపర్ల నుంచి వచ్చిన వేల కోట్లతో 385,000 నుండి 600,000 మధ్య బిట్ కాయిన్లను సేకరించారు. వాటి విలువ సుమారు వన్ ట్రిలియన్ కంటే ఎక్కువేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్కాంలో నిందితుడిపై 40 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 40ఎఫ్ఐఆర్లు ఈడీ విచారణతో బాధితులు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. మహారాష్ట్ర, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు బిట్ కాయిన్ కుంభ కోణంలో బాధితులు సంపాదించిన మొత్తాన్ని కోల్పోయారు. దాదాపు ప్రస్తుత బిట్ కాయిన్ ధరను పరిగణనలోకి తీసుకుంటే? ప్రతి బిట్ కాయిన్ విలువు రూ. 23,57,250గా ఉంది.పూణే పోలీసులు 60వేల మందికి పైగా యూజర్లు, ఐడీ, ఈమెయిల్ అడ్రస్‌ల ఆధారాలకు అనుగుణంగా ఆ బిట్ కాయిన్ స్కాం రూ.90,500 కోట్లని అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా..బాధితులు తమకు న్యాయం చేయాలని కోర్ట్‌లను కోరుతున్నారు. చదవండి👉 యూట్యూబ్‌లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! -
క్రిప్టోకరెన్సీపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్రిప్టో కరెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్ ఫంగబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వంటి క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌లు బూటకమని కొట్టిపారేశారు. గతంలో క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని..ఎందుకంటే అవి విలువ లేని పెట్టుబడులని అన్నారు. ఇతర పెట్టుబడుల్లాగా క్రిప్టోలు ఉండవని..ఎవరో నిర్ణయించిన రేటుకు కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొట్టి పారేశారు. అయితే తాజా బిల్ గేట్స్ వ్యాఖ్యలు క్రిప్టో మార్కెట్లో సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు ఆవిరవ్వగా..గేట్స్ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని క్రిప్టో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కాలిఫోర్నియా బర్కిలీ టెక్ క్రంచ్ కార్యక్రమంలో గేట్స్ ఎన్ఎఫ్టీలపై మాట్లాడుతూ " కోతుల ఖరీదైన డిజిటల్ చిత్రాలు ప్రపంచాన్ని మెరుగుపరుస్తాయి" అని వ్యంగ్యంగా అన్నారు. 2015లో తాను ప్రారంభించిన క్లైమేట్ ఫోకస్డ్ ఫండ్, బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌కు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు అవసరమయ్యే రసాయనాలు, ఉక్కు ఉత్పత్తి వంటి పరిశ్రమలలో పనిచేయడానికి సిలికాన్ వ్యాలీ ఇంజనీర్లను నియమించుకోవడంలో ఉన్న ఇబ్బందులను గుర్తించినట్లు గేట్స్ తెలిపారు. బిట్ కాయిన్ ఢమాల్ బిట్‌కాయిన్ సోమవారం 15% కంటే ఎక్కువ పడిపోయింది. మంగళవారం సైతం 5.4శాతం నష్టపోయింది. అయితే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోవడానికి అమెరికా ద్రవ్యోల్భణంతో ఇతర అంశాలు అందుకు కారణమని తెలుస్తోంది. క్రిప్టోతో పాటు బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్ (బీఏవైసీ)తో సహా ప్రసిద్ధ ఎన్ఎఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు..నష్టం మామూలుగా లేదుగా!
లాభాలే..లాభాలని బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అనుభవంతో పనిలేకుండా, డబ్బులున్నాయని పెట్టుబడులు పెట్టారా? అంతే సంగతులు. మీ జేబుకు చిల్లు తప్పదిక! మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను రోడ్డున పడేస్తుంది. ఇన్నిరోజులు లాభాలతో ఇన్వెస్టర్లకు స్వర్గదామంగా మారిన బిట్‌కాయిన్ ఇప్పుడు నష్టాలతో కుదేలవుతుంది. ఇందులో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు (జూన్ 13) జనవరి 2021 తరువాత తొలిసారి 1ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు క్రిప్టో డేటా బ్లాగ్ 'కాయిన్ మార్కెట్ క్యాప్' తెలిపింది. 2021 నవంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ 2.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కానీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, కొత్తగా పుట్టుకొచ్చిన మంకీ పాక్స్ లాంటి వైరస్లు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సెంట్రల్ బ్యాంకుల (మన దేశంలో ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు, వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు క్రిప్టో మార్కెట్ భారీగా పడిపోయింది. ఎంతలా అంటే గత రెండు నెలల వ్యవధిలో ఇన్వెస్టర్లు 1 ట్రిలియన్ వ్యాల్యును కోల్పోయింది. 18నెలల్లో లక్షల కోట్లు ఉఫ్ ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ గడిచిన 18నెలల కాలంలో రోజులో 10 శాతానికి పైగా క్షీణించి, 18 నెలల కనిష్ట స్థాయి $23,750కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 శాతం తగ్గింది. చిన్న కాయిన్ ఈథర్ 15 శాతం పైగా పడిపోయి $1,210కి చేరుకుంది. -
రష్యా ఊగిసలాట.. పుతిన్ డబుల్ గేమ్‌లో భాగమేనా?
రష్యా మరోసారి తన ఊగిసలాటను ప్రపంచానికి ప్రదర్శిస్తోంది. యుద్ధంతో కాదు.. ఈసారి క్రిప్టోకరెన్సీ చట్టబద్ధత విషయంలో!. ముఖ్యంగా ఉక్రెయిన్ యద్ధం మొదలైనప్పటి నుంచి క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ డబుల్ గేమ్ నడిపిస్తున్నారు. ఇదంతా పాశ్చాత్య దేశాల క్రిప్టో ఇన్వెస్టర్లను ముంచడానికే అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకున్నా.. గత కొన్ని నెలలుగా బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అంతా కలిసి మల్లాగుల్లాలు పడుతున్నా క్రిప్టోకరెన్సీ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తాజాగా క్రిప్టో ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు రష్యాలో చెల్లవంటూ కీలక నిర్ణయం తీసుకుంది రష్యా. ఈ మేరకు.. రష్యా పార్లమెంట్ దిగువ సభలో ఓ ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. జూన్ 7వ తేదీన ఈ చట్టాన్ని ప్రతిపాదించగా.. డిజిటల్ చెల్లింపులు చెల్లవంటూ చేసిన తీర్మానానికి ఆమోద ముద్ర లభించడమే తర్వాయిగా మిగిలింది. రష్యాకు అధికారిక కరెన్సీ రూబుల్. ఇతర ఏ తరహా చెల్లింపులు కుదరవంటూ స్పష్టత ఇచ్చింది ఆ చట్టం. దేశీయ-విదేశీ చెల్లింపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. తాజా ప్రకటనతో ఎక్కువగా నష్టపోయేది యూరప్, ఉత్తర అమెరికా ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ప్రతిపాదన కంటే ముందు రష్యాలో విరుద్ధమైన పరిస్థితులు కనిపించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్.. విదేశీ చెల్లింపుల కోసం క్రిప్టో తరహా పేమెంట్లకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వాణిజ్య శాఖ మంత్రి డెనిస్ మంట్రురోవ్ కూడా క్రిప్టో పేమెంట్స్‌కు అనుకూల వ్యాఖ్యలే చేశాడు. ఏ క్షణమైనా క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత రష్యాలో లభించవచ్చని ఒక ప్రకటన చేశారు. ఆ ధైర్యంతో పాశ్చాత్య దేశాల నుంచి భారీగా క్రిప్టో ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. తాజా నిషేధంతో వాళ్లంతా పూర్తిగా మునిగిపోయినట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా ఇలా డబుల్ గేమ్ ఆడడం కొత్త విషయమేమీ కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. సుమారు లక్షన్నర మంది ఇన్వెస్టర్లు నష్టపోగా.. అమెరికన్ ఇన్వెస్టర్లను భారీగా దెబ్బ కొట్టే స్కెచ్‌తోనే పుతిన్ అలాంటి ప్రకటనలు ఇప్పించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈసారి ఏకంగా మంత్రి వ్యాఖ్యలు, సెంట్రల్ బ్యాంక్ భరోసా నేపథ్యంలో భారీగానే పెట్టుబడులు పెట్టారు పాశ్చాత్య దేశాల ప్రముఖులు. ఈ ఏడాది మొదట్లో క్రిప్టో చెల్లింపులతో అక్రమ వ్యవహారాలకు తెర లేస్తుందంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది రష్యా సెంట్రల్ బ్యాంక్. మరోవైపు రష్యా ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ ఇవాన్ చెబెస్కోవ్ మాత్రం సెంట్రల్ బ్యాంక్ వాదనను తప్పుబట్టి, నియంత్రిస్తే చాలని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకుని.. ఇరు వర్గాలను ఒక ఒప్పందానికి రావాలంటూ సూచించారు. దీంతో తాత్కాలిక ఊరట కింద.. రష్యా సెంట్రల్ బ్యాంక్ విదేశీ చెల్లింపులకు అనుమతులు జారీ చేసింది.అప్పటి నుంచి బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చదవండి: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలపై నియంత్రణల లోపిస్తే లేదా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగం లేకపోతే అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం మాదిరే తయారయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం, రూపాయి స్థిరత్వం పరంగా వచ్చిన లాభాలు దెబ్బతినకుండా ఎంతో తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో టెర్రా–లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఎంతో ముఖ్యమైన హెచ్చరికగా పేర్కొన్నారు. ‘‘క్రిప్టో కరెన్సీలను చూసి నేను ఉద్వేగం చెందను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బలీయమైన శక్తుల ప్రభావాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. అందుకే నేను ఫిన్‌టెక్ ఆధారిత ఈ తరహా ఆవిష్కరణలైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డెఫి), క్రిప్టోలను ఆహ్వానించే విషయంలో రక్షణాత్మకంగా వ్యవహరించాను. ఈ విషయంలో నేను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీలు, డెఫీలను అచ్చమైన ఫైనాన్షియల్ ఆవిష్కరణలుగా చూడడం కంటే.. నియంత్రణపరమైన మధ్యవర్తిత్వం అవసరమని రవిశంకర్ చెప్పారు. అవి మరింత వికేంద్రీకృతమైతే, నియంత్రణ లేకపోతే.. అది కరీబియన్ సముద్రపు దొంగల ప్రపంచం లేదా అందరి దగ్గర ఉన్నవి ఎవరో ఒకరు లాగేసుకునే ప్రపంచంగా మారిపోవచ్చు’’అని నాగేశ్వరన్ క్రిప్టోలపై తన అభిప్రాయాలను, నియంత్రణ అవసరాన్ని తెలియజేశారు. క్రిప్టోలను చట్టబద్ధం చేయవద్దని ఆర్బీఐ కేంద్రానికి బలంగా సూచించడం తెలిసిందే. దీంతో క్రిప్టో లాభాలపై పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సొంతంగా డిజిటల్ రూపీని ఆవిష్కరించే కార్యక్రమంలో ఉండడం తెలిసిందే. చదవండి: Bloodbath In Crypto Markets: మార్కెట్ క్యాప్ ఢమాల్! -
లావాదేవీలపై టీడీఎస్‌ను తగ్గించండి
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫారమ్‌లోని వ్యాపారులతో కాయిన్ డీసీఎక్స్ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్‌పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్‌చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్ విధించాలని బడ్జెట్ 2022–23 ప్రతిపాదించింది. ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్ చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు టీడీఎస్ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్‌కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
భారత్‌లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
వాషింగ్టన్: భారత్‌లో ఇన్వెస్ట్ చేసే విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అమెరికన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి సలహాలు, సూచనలేమైనా ఉంటే స్వీకరించేందుకు, తగు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. భారత డిజిటల్ విప్లవంలో పెట్టుబడులు అంశంపై రౌండ్‌టేబుల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు మరింతగా పెంచాలని ఇన్వెస్టర్లను కోరారు. దేశీ స్టార్టప్‌లతో చేతులు కలిపేందుకు ఆసక్తిగా ఉన్న వారి కోసం స్టార్టప్ సెల్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. భారీ సంఖ్యలో యూనికార్న్‌లను (1 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే అంకుర సంస్థలు) తీర్చిదిద్దే సామర్థ్యాలు భారత్‌కు పుష్కలంగా ఉన్నాయని సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్లు అభిప్రాయపడినట్లు పేర్కొంది. మహిళా సీఎక్స్‌వోలతో భేటీ.. ఇన్వెస్టర్లతో భేటీకి ముందు..ఫిన్‌టెక్, ఆరోగ్యం, విద్య, ఐటీ తదితర రంగాల సంస్థల మహిళా చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లతో (సీఎక్స్‌వో) నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారత్ వృద్ధిలో వారు పోషించగలిగే పాత్ర గురించి చర్చించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. అటు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందాన్ని కూడా నిర్మలా సీతారామన్ కలిశారు. అటు అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి జేమ్స్ మాటిస్‌తో సమావేశమై ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చగల అంశాలపై చర్చించారు. బయోటెక్ స్టార్టప్ సంస్థ పర్ఫెక్ట్ డే సహ వ్యవస్థాపకుడు పెరుమాళ్ గాంధీతోనూ మంత్రి భేటీ అయ్యారు. మేకిన్ ఇండియాలో భాగం అయ్యేందుకు తమ ప్రణాళికలను ఆమెకు గాంధీ వివరించారు. క్రిప్టోలపై తగు నిర్ణయం తీసుకుంటాం.. క్రిప్టో కరెన్సీలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వర్చువల్ కరెన్సీల నియంత్రణ అంశాన్ని లోతుగా పరిశీలించి, భారత్ తగు నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ విషయంలో తొందరపడబోమని పేర్కొన్నారు. అలాగని, కొత్త ఆవిష్కరణలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశ్యం కాదని .. నవకల్పనలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు. చదవండి👉అంతా మోదీ చలవే!, దేశంలో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం! -
ఘోస్ట్ సినిమా షూటింగ్లో నాగార్జున
-
సైబర్ వలలో టెకీలు... బాధితులంతా ఐటీ ఉద్యోగులే
సాక్షి హైదరాబాద్: నగరానికి చెందిన ఓ యువతి మాదాపూర్‌లోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్ నంబర్‌ను వాట్సాప్, టెలిగ్రాం ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌లలో యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో అడ్వైజర్ ఆదిత్య సంతోష్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని సూచించాడు. దీంతో సదరు 39 ఏళ్ల టెకీ.. నెల రోజుల వ్యవధిలో రూ.2.2 లక్షల పెట్టుబడి పెట్టింది. యాప్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ రూ.5.8 లక్షలని చూపిస్తుండటంతో ఆనందానికి గురైంది. కానీ, ఆ సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం లేదని తెలుసుకున్న టెకీ.. తాను మోసపోయానని గ్రహించింది. దీంతో గత నెలాఖరున సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని సూచించడంతో వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. 25 లేదా 35 రోజుల లాకిన్ పీరియడ్ తర్వాతే విత్‌డ్రాకు అవకాశముంటుందనే షరతును పట్టించుకోలేదు. దశల వారీగా రూ.10.2 లక్షల పెట్టుబడులు పెట్టాడు. కానీ, లాగిన్ పీరియడ్ పూర్తయ్యాక.. సంబంధిత వాట్సాప్ గ్రూప్ నుంచి సదరు టెకీని తొలగించేశారు, గ్రూప్‌నూ డిలీట్ చేసేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హఫీజ్‌పేటకు చెందిన 22 ఏళ్ల ఓ మహిళా ఇంజినీర్.. ఐడీబీఐ పాస్‌బుక్ అప్డేట్ చేయడం కోసం బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో వెతికింది. వెంటనే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సౌరవ్ శర్మ నుంచి తనకు ఫోన్ వచ్చింది. పాస్‌బుక్‌ను అప్డేట్ చేయడానికి మీ సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని సూచించడంతో.. సరేనని ఇన్స్టాల్ చేయగా క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.1.68 లక్షలు మాయమైపోయాయి. .. ఇలా ఒకరిద్దరు కాదు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్న వారిలో ఐటీ ఉద్యోగులు, టెకీ గ్రాడ్యుయెట్లే ఎక్కువగా ఉన్నారు. అత్యాశే బాధితుల కొంప ముంచుతోంది. తక్కువ టైంలో రెట్టింపు లాభాలను పొందొచ్చనే వల విసిరి నట్టేట ముంచేస్తున్నారు సైబర్ నేరస్తులు. 80 శాతం ఐటీ బాధితులే.. కస్టమర్ కేర్, ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్రెడిట్ కార్డ్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇలా రకరకాలుగా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. గత నెలలో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో 70 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. ఇందులో 80 శాతం బాధితులు ఐటీ నేపథ్యం ఉన్న వారే ఉండటం గమనార్హం. విద్యావంతులు సైబర్ మోసాల బారిన పడరన్నది అపోహ మాత్రమే. నిజం చెప్పాలంటే నిరుద్యోగులు, నిరక్షరాస్యుల కంటే వీరిని మోసం చేయడమే సులువేమో. మోసపూరిత స్కీమ్‌లలో పెట్టుబడులు, ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్‌ను ఇచ్చే నకిలీ యాప్‌లను డౌన్లోడ్ చేయడం లేదా వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వంటి రహస్య వివరాలను బహిర్గతం చేయడం వంటి సైబర్ నేరాల బారిన పడటానికి ప్రధాన కారణం. అవగాహనతోనే అడ్డుకట్ట.. సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు 200 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వటమే సైబర్ నేరాలకు ప్రధాన కారణం. అవగాహనే సైబర్ నేరాల నివారణకు మందు. – స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ (చదవండి: కాలుతూ.. పేలుతూ..) -
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ
హిమాయత్‌నగర్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ.కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కవాడిగూడకు చెందిన శ్రీనివాస్‌ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్‌లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్‌తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్‌ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73లక్షలకు గాను అతడి సైట్లో ఇతని పేరుపై రూ.4కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ.కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్‌పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పెళ్లి పేరుతో వంచన...పరారైన ప్రియుడు) -
ఉక్రెయిన్ పౌరులకు అండగా క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ..!
ప్రముఖ యుఎస్ ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ క్రాకెన్ ఉక్రెయిన్ పౌరులకు $10 మిలియన్లకు పైగా(సుమారు రూ.76 కోట్లు) ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. 2022 మొదటి అర్ధభాగంలో రష్యా ఖాతాదారుల నుంచి సేకరించిన మొత్తం ట్రేడింగ్ ఫీజులకు సమానమైన మొత్తాన్ని ఈ ఎక్స్ఛేంజ్ కంపెనీ ఉక్రెయిన్ పౌరులకు విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ సహాయం వెంటనే అందించేందుకు మార్చి 9కి ముందు తమ క్రిప్టో ఎక్స్ఛేంజ్'లో ఖాతా తెరిచిన ఉక్రెయిన్ వినియోగదారులకు $1,000(సుమారు రూ.76,300) డాలర్లకు సరిసమానమైన బిట్ కాయిన్స్ అందించనున్నట్లు తెలిపింది. అది, అలా ఉంటే.. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. పుతిన్ సైనిక దళాలు సాధారణ పౌరుల పైనా కాల్పులు జరుపుతున్నారు. మానవతా కారిడార్‌కు సహకరించినట్లు చెప్పుకుంటున్న రష్యా.. ఆ మార్గం గుండా వెళ్లిన ప్రజలపై దాడులు చేసిందని ఉక్రెయిన్ నుంచి బయటపడిన శరణార్థులు చెబుతున్నారు. పోల్లోని ప్రసూతి ఆస్పత్రిపైనా రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అనేక మంది గర్భిణులు, చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నారు. మరో నగరంలో రెండు ఆస్పత్రులపైనా బాంబు దాడులు జరిగాయి. Kraken will distribute over $10 million worth of to aid clients in 🇺🇦Ukraine. Tranche 1 recipients will be credited $1000 of #BTC, withdrawable tomorrow. The package is funded by historical Ukraine revenues and H1 2022 revenues from Russia-based trading.https://t.co/DdkY2TsVoB — Kraken Exchange (@krakenfx) March 9, 2022 (చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!) -
దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్ పోలీసులు
14 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, కమ్ బ్యాక్ అలైవ్ అనే స్వచ్చంద సంస్థలు విరాళాల సేకరణ చేపట్టాయి. కమ్ బ్యాక్ అలైవ్ అనేది ఉక్రేనియన్ ప్రభుత్వేతర ఎన్జిఓ సంస్థ. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నగదును రుస్సో-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న ఉక్రెయిన్ మిలిటరీ, వాలంటీర్లు & వారి కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఉక్రెయిన్ పోలీసులు కూడా ఇతర దేశాల నుంచి క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. మార్చి 6న ట్విటర్ వేదికగా చేసిన పోస్టులో ఉక్రేనియన్ సైబర్ పోలీసులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి క్రిప్టోకరెన్సీలను విరాళం ఇవ్వాలని ప్రపంచాన్ని కోరారు. వివిధ క్రిప్టోకరెన్సీలు అయిన బిట్ కాయిన్(బీటీసీ), ఈథర్ (ఇటిహెచ్), యుఎస్ డిటి టెటర్(యుఎస్ డిటి), ట్రాన్ (టిఆర్ఎక్స్), పాలిగాన్ (మాటిక్), బినాన్స్ ఎక్స్ఛేంజ్ టోకెన్(బిఎన్ బి)లను విరాళ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపింది. సేకరించిన క్రిప్టోకరెన్సీలను నేషనల్ పోలీస్, నేషనల్ గార్డ్, స్టేట్ బోర్డర్ గార్డ్ సర్వీస్, స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వినియోగిస్తామని ఉక్రెయిన్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే, ఈ నిధులను ఔషధం & ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం, ఇంకా రష్యా దాడుల బాధితులకు వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తామని తెలిపింది. రష్యన్ ఆక్రమణ నుంచి బయటపడటానికి కైవ్ అధికారులు వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరించడంలో విజయవంతమైంది. ఇప్పటికే బిట్ కాయిన్, ఈథర్, యుఎస్ డీటీ టీథర్, పోల్కాడాట్, డాగీకాయిన్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీల రూపంలో $60.5 మిలియన్లను సేకరించింది. ఇంకా ఉక్రెయిన్ జెండాను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేయడం ద్వారా కూడా $6.5 మిలియన్లను సేకరించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!) -
భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది. క్రిప్టో కరెన్సీల వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ అస్థిరంగా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ ఆస్తి. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. (చదవండి: అదిరిపోయిన హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!) -
లాభాల కోసం క్రిప్టోల రిస్క్‌లో పడొద్దు
క్రిప్టో మార్కెట్ పట్ల మిలీనియల్స్ (26–41), జనరేషన్ జెడ్ (25 ఏళ్ల వరకు) వారిలో ఆసక్తి పెరిగిపోయింది. యువ ఇన్వెస్టర్లు క్రిప్టో పెట్టుబడుల పట్ల తమకు తెలియకుండానే ఆకర్షితులవుతున్నారు. స్వల్పకాలంలోనే ఊహించలేనంత లాభాలే ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా చెప్పుకోవాలి. పెట్టుబడి కోణంలో క్రిప్టో కరెన్సీలు/ఎన్ఎఫ్టీలకు చోటు ఇస్తున్న వారు కూడా ఉంటున్నారు. కానీ, క్రిప్టోలకు మనదేశంలో చట్టబద్ధతకు అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాభాలపై 30 శాతం పన్ను విధించింది. ప్రతీ లావాదేవీ రూపంలో వచ్చే లాభంపై 1 శాతం టీడీఎస్ నిబంధన తీసుకొచ్చింది. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రిప్టో లాభాల కోసం పరుగులు తీసే ఇన్వెస్టర్లు.. ఈక్విటీ పెట్టుబడులతో పోల్చి చూస్తే క్రిప్టో పెట్టుబడులు ఏ మేరకు అనుకూలం? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అందించే కథనమే ఇది. ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రిప్టో మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య 2021లో గణనీయంగా పెరిగింది. 2020 నాటికి 4.2 కోట్లుగా ఉన్న ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్య 2021 డిసెంబర్ చివరికి 8 కోట్లను దాటింది. ఒక నివేదిక ప్రకారం క్రిప్టో సాధనాల అనుసరణ విషయంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా సుమారు 1.5 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ శాతం యువ ఇన్వెస్టర్లే. 32 శాతం 18–24 వయసులోని వారు. మరో 33 శాతం మంది 25–34 వయసు గ్రూపునకు చెందిన వారు. క్రిప్టోలనే కాదు ఎన్ఎఫ్టీలు, ఇతర ఏ రూపాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులు (వర్చువల్ అసెట్స్) కూడా 30 శాతం మూలధన లాభాల పన్ను రేటు కిందకు వస్తాయి. ‘‘వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను రేటు పడుతుంది. కొనుగోలు వ్యయాన్నే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. మరే ఇతర వ్యయాలను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోలేరు. పైగా క్రిప్టోలపై వచ్చే లాభాల నుంచి మరే ఇతర నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లేదు’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్ తెలిపారు. అనుకూలతలు/రిస్క్ క్రిప్టోలతో పోలిస్తే ఈక్విటీల్లో వ్యయాలు తక్కువ. క్రిప్టోల్లో రిస్క్ చాలా అధికం. త్వరితగతిన లాభాలను చూసే ఇన్వెస్టర్లు ఈ రిస్క్ అంశాన్ని ఆలోచించడం లేదు. ఈక్విటీలు మెరుగైన నియంత్రణ వాతావరణంలో పనిచేస్తుంటాయి. కానీ, క్రిప్టోలన్నవి నియంత్రణ పరిధిల్లో లేని సాధనాలు. రిస్క్, వ్యయాల పరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం అని విశ్లేషకులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు.. క్రిప్టో కరెన్సీల్లో అతిపెద్దది అయిన బిట్‌కాయిన్ విలువ 2021 సంవత్సరంలో గరిష్ట స్థాయి 68,789 డాలర్ల నుంచి, కనిష్ట స్థాయి 28,130 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 సూచీ 14,018 పాయింట్ల నుంచి 17,345 మధ్య ట్రేడ్ అయింది. మరో నిదర్శనం బిట్ కాయిన్ ధర 2021 సెప్టెంబర్ 29న 41,041 డాలర్ల స్థాయి నుంచి నవంబర్ 9న 67,553 డాలర్లకు పెరిగింది. అంటే కేవలం నెలన్నర వ్యవధిలోనే 70 శాతం పెరిగింది. అక్కడి నుంచి మరో నెలన్నర రోజుల్లో డిసెంబర్ 31 నాటికి 47,128 డాలర్లకు పడిపోయింది. 30 శాతానికి పైగా నష్టపోయింది. భారీ అస్థిరతలకు బల మైన నిదర్శనాలు ఇవి. పన్ను ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 10 శాతంగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించి కొనసాగిన పెట్టుబడులపై/ఎల్టీసీజీ) గడించినప్పుడు పన్ను ఉండదు. రూ.లక్షకు మించి పొందే లాభంపైనే 10 శాతం పన్ను, 4 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. అదే కొనుగోలు చేసి ఏడాది నిండకముందు విక్రయించే ఈక్విటీ పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (ఎస్టీసీజీ) చట్టం పరిగణిస్తోంది. ఈ మొత్తంపై పన్ను 15 శాతంగా అమల్లో ఉంది. కనుక క్రిప్టోలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీలే ఆకర్షణీయమని ఐడీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ హెడ్ అనూప్ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను విధించింది. అంతేకాదు ఈ లాభంపై వెంటనే ఒక శాతాన్ని తగ్గించుకునే టీడీఎస్ నిబంధన కూడా తీసుకొచ్చింది. అంటే ఇన్వెస్టర్ లాభం నుంచి ఒక శాతాన్ని క్రిప్టో ఎక్సేంజ్‌లు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమచేయాల్సి ఉంటుంది. క్రిప్టోల్లో మూలధన లాభం రూ.50లక్షలు మించితే 30 శాతం పన్నుపై సర్‌చార్జ్ కూడా అమలవుతుంది. వర్చువల్ అసెట్స్‌ను బంధువు కాని వారికి బహుమానంగా ఇస్తే, ఇలా ఇచ్చే వాటి విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ లావాదేవీని విక్రయంగానే చట్టం పరిగణిస్తుంది. కనుక ఈ మొత్తంపైనా మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కనుక క్రిప్టోలకు సంబంధించి ప్రతిపాదిత పన్ను పెద్ద ప్రతికూలమని అనూప్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘‘చిన్న ఇన్వెస్టర్లు, సాధారణంగా పన్ను చెల్లించేంత ఆదాయం పరిధిలో లేని వారు సైతం ఇప్పుడు క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంది’’ అని క్రిప్టో సలహాదారు అజీత్ ఖురానా పేర్కొన్నారు. కానీ, నష్టాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్ల నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినప్పుడు నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం కింద, ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించగా వచ్చిన నష్టాన్ని దీర్ఘకాల మూలధన నష్టంగా పరిగణిస్తారు. వీటిని ఏడు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలన్నింటినీ లాభాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే.. తర్వాతి ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (లావాదేవీ జరిగిన సంవత్సరం సహా మొత్తం ఎనిమిది అసెస్మెంట్ సంవత్సరాలు) వచ్చే లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. దాంతో పన్ను పరంగా క్రిప్టో ఇన్వెస్టర్లతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పుకోవాలి. క్రిప్టో నష్టాలకు ఈ క్యారీ ఫార్వార్డ్ సదుపాయం లేదు. నష్టాలు ఏవైనా అదే ఏడాది క్రిప్టో లాభాలతోనే సర్దుబాటుకు పరిమితం కావాలి. మరే ఇతర మూలధన లాభాల నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు కల్పించలేదు. అలాగే, మరే ఇతర మూలధన నష్టాన్ని క్రిప్టో లాభాల నుంచి మినహాయించుకునే అవకాశం కూడా కల్పించలేదు. నియంత్రణలు నియంత్రణపరంగా చూస్తే ఈక్విటీలు మెరుగైన సాధనం. స్టాక్‌బ్రోకర్, మ్యూచుల్ ఫండ్, మార్కెట్ పార్టిసిపెంట్, ఇంటర్ మీడియరీ ఇలా మార్కెట్ వ్యవస్థలో భాగమైన ప్రతీ సంస్థ కూడా సెబీ నియంత్రణల పరిధిలోనే పనిచేయాలి. అన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీనివల్ల రిస్క్ చేయిదాటి పోకుండా సెబీ చర్యలు తీసుకుంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీలపై ఈ నియంత్రణ లేదు. ఈక్విటీల విషయంలో లావాదేవీల గురించి, సేవలు, చార్జీల గురించి సెబీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని వాటిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం తెలిసిందే. ఈ అంశంలో సెబీ వెంటనే జోక్యం చేసుకుని తనఖాలో ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు దక్కేలా వేగంగా చర్యలు తీసకుంది. కానీ, క్రిప్టో లావాదేవీల విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రభుత్వం లాభాలపై 30 % పన్ను విధించింది కానీ, నియంత్రణ అంశం జోలికి పోలేదు. ఎందుకంటే క్రిప్టో ఆస్తులన్నవి అంతర్జాతీయంగా ట్రేడ్ అవుతున్నవి. కొనుగోలు చేసిన వర్చువల్ అసెట్స్‌ను ఎక్కడ హోల్డ్ చేస్తున్నారు? సైబర్ మోసాల నుంచి వాటికి రక్షణ ఉంటుందా? పెట్టుబడి పెట్టిన వారికి జరగరానిది జరిగితే, వారి వారసులు ఆ వర్చువల్ ఆస్తులను పొందగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఈక్విటీలకు సంబంధించి ఈ రిస్క్ ఉండదు. లావాదేవీల ట్రాకింగ్ క్రిప్టో లాభాలపై ఒక శాతం టీడీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రతీ లావాదేవీ సమాచారం ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. కనుక పన్ను ఎగవేతకు అవకాశం ఉండదనే భావించాలి. ఇప్పటి వరకు క్రిప్టో ఎక్సేంజ్‌లు ఇచ్చిన సమాచారంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ, ఇక మీదట టీడీఎస్ నిబంధనతో వివరాలు పక్కాగా తెలుస్తాయి. ‘‘టీడీఎస్ రూపంలో ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలను గుర్తించగలదు. డేటాను తీసుకోగలదు. ఇది భవిష్యత్తులో క్రిప్టోల నియంత్రణ విషయంలో సాయపడొచ్చు’’అని క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్‌పే’ సీఈవో అవినాష్ శేఖర్ తెలిపారు. టీడీఎస్ నిబంధనతో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీలను నియంత్రించగలదని, ఆదాయం రాబట్టుకోగలదని ఫెలిక్స్ అడ్వైజరీ పార్ట్నర్ అమిత్ జిందాల్ పేర్కొన్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే వ్యక్తికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో బిట్ కాయిన్లో ట్రేడింగ్‌పై రూ.6 లక్షలు లాభం వచ్చిందనుకుందాం. అలాగే, ఎథీరియం ట్రేడింగ్‌లో రూ.2 లక్షలు నష్టం వచ్చిందనుకుంటే, అప్పుడు నికర లాభం రూ.4లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. లాభం రూ.50లక్షల్లోపు ఉంది కనుక సర్‌చార్జీ లేదు. 30 శాతంపై 4 శాతం సెస్సు అమలవుతుంది. అంటే 1.2 శాతం సెస్సు కూడా కలుపుకుంటే వచ్చిన లాభంపై చెల్లించాల్సిన నికర పన్ను 31.2 శాతం అవుతుంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్) మార్కెట్ ఓపెన్‌సీ హ్యాక్‌కు గురి అయ్యింది. ఓపెన్‌సీపై ఫిషింగ్ అటాక్ జరగడం వల్ల.. కనీసం 32 మంది యూజర్లు 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12.6 కోట్లు) విలువైన ఎన్ఎఫ్టీలను కోల్పోయినట్టు ఓపెన్‌సీ కో ఫౌండర్ & సీఈఓ డెవిన్ ఫిన్జర్ ప్రకటించారు. ఇప్పటివరకు 32 మంది వినియోగదారులు ఎన్ఎఫ్టీలను కోల్పోయారని ధృవీకరించారు. వారు కోల్పోయిన విలువ $200 మిలియన్ డాలర్లు అనేది అబద్ధమని అన్నారు. దాడి చేసిన వ్యక్తి దొంగిలించిన ఎన్ఎఫ్టీలలో కొన్నింటిని విక్రయించి 1.7 మిలియన్ డాలర్లను ఇథీరియం రూపంలోకి మార్చుకున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ ఇటీవలే కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్ అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. కొత్త అప్‌గ్రేడ్ వల్ల.. ఓపెన్‌సీలో ఇన్ యాక్టివ్‌లో ఉన్న ఎన్ఎఫ్టీలు డీలిస్ట్ అవుతాయి. అందుకోసం యూజర్లు.. ఈటీహెచ్ ఇథీరియంలో తాము లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీలను కొత్త స్మార్ట్ కాంట్రాక్ట్‌కు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ చైన్ పరిశోధకుడు పెక్ షీల్డ్ మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడి గురైన వినియోగదారుని సమాచారం(ఇమెయిల్ ఐడీలతో సహా) లీక్ అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్‌సీ హ్యాకింగ్ కి సంబంధించిన వార్తలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రూ.29 వేల శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!) -
క్రిప్టోకరెన్సీలపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీలపై నేడు రాజ్యసభలో మాట్లాడారు. నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వర్చువల్ కరెన్సీల వల్ల వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం పన్ను విధించడానికి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల వల్ల వచ్చిన లాభంపై పన్ను విధించే సార్వభౌమ హక్కు ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. "క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుంది" అని రాజ్యసభలో ఎఫ్ఎం సీతారామన్ తెలిపారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఎఫ్ఎం సీతారామన్ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌తో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీ వ్యాపారాల లాభాలపై 30 శాతం పన్ను విధించే ప్రతిపాదనను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే, చాలా మంది మన దేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయం మీదే నేడు సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 10న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ.. తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి ఆ రెండు బ్యాంకులు శుభవార్త..!) -
డిజిటల్ ఆదాయ స్వప్నం
నిజాలెంత నిష్ఠూరంగా ఉన్నా, కనీసం కలలైనా కమ్మగా ఉండాలంటారు. నిరుద్యోగం పెరిగి, మధ్య, దిగువ మధ్యతరగతి నడ్డి విరిగిన కరోనా కష్టకాలంలో... తాజా కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపిన భవిష్యత్ డిజిటల్ చిత్రం రకరకాల రంగులీనుతోంది. కాగితంతో పని లేకుండా డిజిటల్ ఉపకరణం సాయంతో ప్రసంగాన్ని చదువుతూ డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికం.. అన్ని రంగాలనూ డిజిటల్ బాట పట్టించే ప్రతిపాదనలు చేశారు. కొత్తగా వర్చ్యువల్ డిజిటల్ కరెన్సీ తెస్తామంటూ ‘డిజిటల్ భారతావని’ని అరచేతిలో చూపారు. క్రిప్టో మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో వర్చ్యువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏల) లావాదేవీలపై 30 శాతం పన్ను ప్రతిపాదించారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చర్చంతా వీడీఏలతో జనం గడించే ఆదాయంపై 30 శాతం పన్ను వేయడం మీదే! కొన్నేళ్ళుగా దేశంలో క్రిప్టో పరిశ్రమ ప్రాచుర్యానికి ఈ ప్రతిపాదన ఓ తార్కాణం. ఇటీవల వీడీఏలపై వాణిజ్యం భారీయెత్తున సాగుతుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఒక వీడీఏను బదలాయించి నందుకు చెల్లింపులు కూడా అలాంటి మరో వీడీఏ రూపంలోనే సాగేలా మార్కెట్ ఆవిర్భవించడాన్ని గమనించింది. వెరసి, ఈ డిజిటల్ ఆస్తుల వ్యవహారం పన్ను రాబడికి వనరు అని గ్రహించింది. అందుకే, బడ్జెట్లో వీడీఏల లావాదేవీలపై 30 శాతం మేర పన్ను వేసింది. అలాంటి అమ్మకాలు ఒక నియమిత పరిమితి దాటితే, 1 శాతం మేర టీడీఎస్ (మూలం దగ్గరే పన్ను మినహాయింపు) కూడా విధించింది. ఇలా క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వ్యాపారంలో లాభాలు రానున్న ఏప్రిల్ 1 నుంచి దేశంలోకెల్లా అత్యధిక పన్ను శ్లాబ్‌లోకి వస్తున్నాయి. డిజిటల్ కరెన్సీలకు ఆమోదముద్ర కోరుతున్నవారికి ఇది తీపి, చేదు అనుభూతుల సమ్మిశ్రమం. క్రిప్టో లాంటి డిజిటల్ ఆస్తులకు అధికారికంగా గుర్తింపు ఉన్నదీ, లేనిదీ తేల్చకుండానే ప్రభుత్వం పన్ను విధింపునకు దిగడం గమ్మల్తైన విషయమే. 2018లో రిజర్వ్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను నిషేధించడం, ఆ తర్వాత రెండేళ్ళకు సుప్రీమ్ కోర్ట్ ఆ నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. అది జరిగీ మరో రెండేళ్ళవుతున్నా కేంద్రం ఈ క్రిప్టోలపై ఒక కచ్చితమైన విధాన నిర్ణయానికి రాలేకపోవడం విడ్డూరం. లాటరీ, జూదం, ఇతర గేమింగ్ల లాంటి స్పెక్యులేషన్ కార్యకలాపాలతో సమానంగా 30 శాతం భారీ పన్ను క్రిప్టో వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికేనని కొందరి అభిప్రాయం. అది కొంత నిజమే. లాభాలకు పన్ను కట్టినా, డిజిటల్ ఆస్తుల బదలాయింపులో నష్టాలు ఎదురైతే మాత్రం ఇతర ఆదాయంతో దాన్ని సమం చేస్తూ లెక్కలు చూపడానికి లేదన్న నిబంధన అందుకు నిదర్శనం. అయితే, అసలంటూ పన్ను విధింపు ద్వారా పరోక్షంగా డిజిటల్ ఆస్తుల్ని గుర్తిస్తున్నట్టు సర్కారు సంకేతాలిచ్చిందని ఇంకొందరు నిపుణుల మాట. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించాలని ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ తాజా చర్యలు అందులో భాగమే. మోదీ సర్కార్ 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తగ్గట్లే ఇప్పుడు కొత్త డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన తెచ్చింది. పొరుగున ఉన్న చైనా డిజిటల్ యువాన్ తేవడంపై మల్లగుల్లాలు పడు తుండగానే, రిజర్వ్ బ్యాంక్ సారథ్యంలో డిజిటల్ రూపీ తేనున్నట్టు మనం ప్రకటించడం పెద్ద విషయమే. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మైనింగ్లను నిషేధించిన చైనా ఈ నెలలో శీతకాలపు ఒలింపిక్స్ నాటికి డిజిటల్ యువాన్ తేవాలని ప్రయత్నిస్తోంది. బ్రిటన్ కూడా డిజిటల్ కరెన్సీ తేవాలనుకుం టోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోట డిజిటల్ రూపీ మాట క్రిప్టో కరెన్సీ వ్యాపారులకు హర్షమే. నిజానికి, మన దేశంలో దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లున్నారని అంచనా. వారి మొత్తం క్రిప్టో ఆస్తుల విలువ రూ. 40 వేల కోట్లని లెక్క. కరోనా దెబ్బతో ఖజానాకు ఆదాయం తగ్గుతున్నవేళ, జనం ఎగబడుతున్న క్రిప్టో పరిశ్రమ కొత్త పన్ను రాబడి కోసం ప్రభుత్వానికి పాడి ఆవులా కనిపించింది. అందుకే, బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టింది. మొదటి నుంచీ క్రిప్టో పరిశ్రమ పట్ల సదభిప్రాయం లేని సర్కారు తెలివిగా బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ అనే పదం వాడలేదు. డిజిటల్ ఆస్తులు అనే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇంతకీ, క్రిప్టో తదితర ఆస్తుల్ని అధికారికంగా ఏ మేరకు గుర్తిస్తున్నదీ, వాటి చట్టబద్ధత ఎంత అన్నదీ ప్రభుత్వమే వివరించాలి. తీవ్రవాద సంస్థల చేతిలో క్రిప్టో కరెన్సీ దుర్వినియోగమయ్యే ప్రమాదానికి నివారణ చర్యలనూ ఆలోచించాలి. రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ కరెన్సీల మార్కెట్లో ప్రధాన వాటా కోసం డిజిటల్ రూపీ ఆలోచన బాగుంది. కానీ, ఇవాళ్టికీ దేశంలో సగానికి సగం మందికి డిజిటల్ నగదు లావాదేవీలు తెలియని చోట, కొత్తగా తెచ్చే అధికారిక డిజిటల్ రూపీ ప్రయోజనాలను పరిచయం చేసే బాధ్యత చేపట్టాలి. ఇక, క్రిప్టోతో ఈ డిజిటల్ రూపీ ఏ మేరకు పోటీపడుతుందన్నది మరో ప్రశ్న. రెండూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ మీద ఆధారపడినా, క్రిప్టోలో లాగా ఇక్కడ ఇన్వెస్టర్ల వివరాలు అజ్ఞాతంగా ఉండడం కుదరదు. ఒక్కమాటలో పరిశ్రమలో అగ్రభాగంలో నిలవడానికి డిజిటల్ రూపీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాలి. క్రిప్టో ట్రేడింగ్‌పై పూర్తి నిషేధానికీ, ఇటు నియంత్రణలకూ మధ్యేమార్గంలో ప్రభుత్వం రెండు వ్యవస్థలూ సామరస్యంగా కొనసాగే చర్య చేపడుతుందేమో వేచి చూడాలి. అది ఎంత త్వరగా స్పష్టతనిస్తే అమాయక ఇన్వెస్టర్లకు అంత మేలు! -
సాక్షి కార్టూన్(03-02-2022)
-
ఏంటా స్పీడు! అందుబాటులోకి డిజిటల్ రూపీ.. జారీ చేసేది అప్పటి నుంచే..
Union Budget 2022: డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు, సమర్థమంతమైన కరెన్సీ నిర్వహణకు తోడ్పడేలా రిజర్వ్ బ్యాంక్ తాజాగా దేశీ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టబోతోంది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని అందుబాటులోకి తేనుంది. మంగళవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు. ‘కరెన్సీ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత సమర్థంగా, తక్కువ వ్యయాలతో నిర్వహించేందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో 2022–23 నుంచి బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుంది‘ అని ఆమె పేర్కొన్నారు. ప్రాథమికంగా సబ్సిడీ పథకాలకు సంబంధించిన చెల్లింపులు మొదలైన వాటికి దీన్ని ఉపయోగించవచ్చని పరిశ్రమవర్గాలు తెలిపాయి. నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఊతమివ్వగలదని, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో సానుకూల మార్పులు తేగలదని పేర్కొన్నాయి. రియల్ టైమ్‌లో, వేగవంతంగా సీమాంతర రెమిటెన్సులకు కూడా తోడ్పడగలదు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు లావాదేవీల వ్యయాలు కూడా తగ్గగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డిజిటల్ కరెన్సీ అంటే.. ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్ వంటి డిజిటల్/క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు కుప్పతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ ఈ క్రోనా ఈ నేపథ్యంలో దేశాల ప్రభుత్వాలు అధికారికంగా డిజిటల్ కరెన్సీలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే భారత్ కూడా డిజిటల్ రూపీకి రూపమిస్తోంది. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఈ తరహా ‘ఈ–క్రోనా’ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. చదవండి:భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ వచ్చేసింది -
కేంద్ర బడ్జెట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం..!
న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1న) లోక్ సభలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే, ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను ప్రస్తుతం విధానంలో ఏదైనా మారుస్తారని అందరూ ఆశించారు. కానీ, ఈ విషయంలో బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే, క్రిప్టో కరెన్సీ లాభాలపై కేంద్రం 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించడంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా #Budget2022, #IncomeTax అనే ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో.. మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ అంతకంటే ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మీమ్స్ కూడా మీరు చూసేయండి. ఆదాయపన్ను శ్లాబులో ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచేయడంతో మధ్యతరగతి వర్గాలకు నిరాశ ఎదురైందంటూ బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంతోకూడిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆదాయపన్ను గురించి పోస్టులు ట్విట్టర్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇంటర్నెట్లో మొత్తంగా ‘మధ్యతరగతి’వర్గాలు బడ్జెట్‌పై స్పందిస్తున్న పోస్టులు టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి. నవ్వు తెప్పించే విధంగా ఉన్న ఆ పోస్టుల్లో కొన్ని... ► డాక్టర్ ప్రశాంత్ మిశ్రా తన ట్విట్టర్ నుంచి.. మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ ప్రతీఏటా ఆశగా ఎదురుచూడటం తప్పట్లేదు అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేశారు. ► ట్రెండూల్కర్ ట్విట్టర్ నుంచి ఆదాయపన్ను పరిమితి పెంపుపై ఇంటి బయటనుంచి లోపలికి ఆశగా ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ► అమిత్ జూనియర్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ప్రతిఏటా బడ్జెట్ అనంతరం మధ్యతరగతి ప్రజల స్పందన ఇదేనంటూ నిరాశగా ఉన్న అక్షయ్‌కుమార్ ఫొటోను షేర్ చేశారు ► అరవింద్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్‌కు ఓ వేతనజీవి నేరుగా ఫోన్ చేసి సామాన్యుడంటే విలువలేకుండా పోయిందని వాపోతున్న ఫొటోను షేర్ చేశారు Tax payers waiting for the good news...#Budget2022 #incometax pic.twitter.com/b7Ek3DxEZd — सख्याहरी (@sakhyahari) February 1, 2022 Bring it on, FM! I've suffered enough.#BudgetSession2022 #Budget2022 #Budget22 #Memes #budgetmemes pic.twitter.com/hvygDlAsbw — Prashasti Shandilya (@PrashastiiS) February 1, 2022 View this post on Instagram A post shared by Meme Raja (@meme_raaja) View this post on Instagram A post shared by Chai Bisket (@chaibisket) View this post on Instagram A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu) View this post on Instagram A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu) Middle class meme#Budget2022 #BudgetSession2022 pic.twitter.com/fVY58zn0XD — Black Adam 🔥 (@blackadameveee) February 1, 2022 People discussing about #BudgetSession2022..... Me with zero knowledge of finance : pic.twitter.com/rHtiZcnfnL — UmderTamker (@jhampakjhum) February 1, 2022 (చదవండి: PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!) -
తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్ !
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరు నడవనిది ఆ దార్లో నడిచెదరో అనే పాటకే కాదు నాకొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే పాపులర్ డైలాగ్‌కి కానీ పర్ఫెక్ట్గా సూటయ్యే పేరు ఎలన్‌మస్క్. భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయడం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపిన నేర్పు అతన్ని ప్రపంచ కుబేరుడిని చేసింది. అయితే తన అలవాటు ప్రకారం ఏ మాట్లాడినా.. ఏ పని చేసినా వెటకారం జోడించడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ వెటకారానికి మంచి రిటార్ట్ పడింది. కొంటె ట్వీట్ క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో వందల కొద్దీ కాయిన్స్ ఉన్నాయి. ఇందులో మీమ్స్ కాయిన్‌గా వచ్చింది డోజ్కాయిన్. ఎలన్‌మస్క్ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఇది వరల్డ్ ఫేమస్ అయ్యింది. తాజాగా టెస్లా కార్లు కొనే సమయంలో డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీని సైతం అంగీకరిస్తామంటూ మరింత పాపులర్ చేశారు ఎలన్‌మస్క్. తాను పెట్టుబడి పెట్టిన డోజ్ కాయిన్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చే పనిలో మరో ట్వీట్ చేశాడు. డోజ్కాయిన్ తీసుకుంటారా? ఫేమస్ ఫుడ్ సప్లై చెయిన్ మెక్‌డొనాల్ట్స్ కనుక డోజ్ కాయిన్‌ను అంగీకరిస్తే నేను ఎంతో హ్యాపీగా మెక్‌డొనాల్డ్స్ అందించే ఫుడ్ తింటాను అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఒకరోజు సమయం ఇచ్చిన మెక్‌డొనాల్డ్ ఎలన్‌మస్క్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తీసుకుంటాం.. కానీ క్రిప్టో కరెన్సీలో బాగా పాపులరైన బినాన్స్ స్మార్ట్ చెయిన్ నుంచి గ్రిమాకే కాయిన్స్ అంటూ కొత్త రకం మీమ్ కాయిన్ని రెడీ చేయించింది. ఆ తర్వాత ట్విట్టర్‌కి వెళ్లి డోజ్‌కాయిన్‌ని మెక్‌డొనాల్డ్‌లో అంగీకరిస్తాం. కానీ ఒక్క షరతు టెస్లా కార్లు కొనేప్పుడు మీరు గ్రిమాకే కాయిన్స్‌ను తీసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చింది. only if @tesla accepts grimacecoin https://t.co/CQrmAFelHR pic.twitter.com/to9HmYJhej — McDonald's (@McDonalds) January 25, 2022 ఎలన్‌మస్క్‌కి మెక్‌డొనాల్డ్ కంపెనీ ఇచ్చిన కౌంటర్ నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది. క్రిప్టో కరెన్సీ గురించి టెక్ వరల్డ్‌లో బోలెడంత చర్చ జరుగుతోంది. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఐనప్పటికీ క్రిప్టో కరెన్సీ ఇంకా జనసామాన్యంలోకి చొచ్చుకుపోలేదు. చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే! -
అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు
డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్‌గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
భారత్ నుంచి రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..: మోదీ
న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్ అజెండా 2022 సదస్సునుద్దేశించి ‘ప్రపంచ స్థితిగతులు (స్టేట్ ఆఫ్ ద వరల్డ్)’ అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపారనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్‌లో లైసెన్స్ రాజ్ నడిచేదని, కానీ తాము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్నిచ్చామని అన్నారు. పప్రంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో (సప్లై ఛైన్స్) ఆటంకాల్లాంటివి ఆర్థికవ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు. నవ భారత్ రికార్డులు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్‌లో ఉందని, ఒక్క డిసెంబర్లోనే భారత్‌లో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీలు జరిగాయని, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారని మోదీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై భారత్‌కు ఎనలేని నమ్మకమన్నారు. దేశంలో పలు భాషలు, భిన్నసంస్కృతులున్నా అంతా కలిసి మానవాభివృద్ధికి కృషి చేస్తాయని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు. -
వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. మెటావర్స్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్ సాధించబోతోంది ఈ కాబోయే జంట. తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ ఎస్పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్ ద్వారా. ఇది గనుక సక్సెస్ అయితే భారత్‌లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. ఇన్‌స్టా పరిచయం దినేశ్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్.. మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్‌లో ‘ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్’ తమదేనంటూ దినేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హ్యారీ పోటర్ యూనివర్స్ థీమ్‌తో ఈ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్ జరగనుండగా.. ల్యాప్ ట్యాప్ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్ రిసెప్షన్ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్‌లు(గిఫ్ట్ వౌచర్ల ట్రాన్స్ఫర్, గూగుల్‌పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది. I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4 — Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022 మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్లతో ఇంటెరాక్ట్ కావడం. అగుమెంటెడ్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్, వర్చువల్ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్సెల్వరాజ్ టీం ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ద్వారా ఈ మెటావర్స్ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్!!
ఓ స్వచ్ఛంద సంస్థ తాము ఎంపిక చేసిన ప్రాంతంలో నివసించే వారికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు 10వేల డాలర్లు(రూ.7లక్షల పై మాటే) విలువ చేసే బిట్కాయిన్లను ఉచితంగా అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది. అమెరికాకు చెందిన నార్తవెస్ట్ ఆర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్..ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడేవారికి భారీ ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు 2020నవంబర్ నుంచి ఫ్రీగా 10 వేలడాలర్లతో పాటు రోడ్ బైక్ లేదంటే మౌంటెన్ బైక్ అందిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి లాభపేక్షలేకుండా ఫ్రీగా అంతపెద్దమొత్తాన్ని ఎలా చెల్లిస్తారనే ప్రశ్నకు సమాధానంగా నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్ కౌన్సిల్ సభ్యులు స్పందించారు. నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్‌కు వలసల్ని ప్రోత్సహించడంతో పాటు ఆ ప్రాంతాన్ని క్రిప్టో హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోత్సహకాల్ని అందిస్తున్నాం. బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలను ఆకర్షించాలనదే మా ఉద్దేశం. ఈ ఆఫర్లో ఎవరైనా పాల్గొనచ్చని కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈఓ నెల్సన్ పీకాక్ తెలిపారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం..ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి 50మంది తరలి వచ్చినట్లు తెలుస్తోంది. బిట్కాయిన్ల ఇన్సెంటీవ్లను అందించడం ద్వారా రానున్న రోజుల్లో 7,500 ఓపెన్ టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో సహాయపడుతుందని కౌన్సిల్ భావిస్తోంది. చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు! -
క్రిప్టో ఇన్వెస్టర్లకు శుభవార్త! బాంబే స్టాక్ ఎక్సేంజీ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీల ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (గిఫ్ట్ సిటీ)లో వీటిని తొలిసారిగా ఆవిష్కరించడంపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చెయిన్ ఐఎఫ్ఎస్సీ, బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ) అంతర్జాతీయ విభాగం ఇండియా ఐఎన్ఎక్స్ చేతులు కలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. ఈటీఎఫ్‌లు, డిస్కౌంట్ సర్టిఫికెట్ల ద్వారా బ్లాక్‌చెయిన్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లతో తొలి రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) సాధించాలని నిర్దేశిం చుకున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చెయిన్ ఐఎఫ్ఎస్సీ సీఈవో కృష్ణ మోహన్ మీనవల్లి తెలిపారు. చదవండి: అఫీషియల్: భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ లాంఛ్ -
Bitcoin: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర..!
ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోతుంది. క్రిప్టోకరెన్సీలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ నేడు 4.9 శాతం క్షీణించి 41,008 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. నాలుగు నెలల క్రితం బిట్‌కాయిన్ జీవితకాల గరిష్ఠం 69,000 అమెరికన్ డాలర్లకు చేరుకున్నప్పటి నుంచి సుమారు 40 శాతం పడిపోయింది. ఇక రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఈథర్ విలువ సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు 9 శాతం పడిపోయింది. బైనాన్స్ కాయిన్, సొలానా, కార్డనో, ఎక్స్ఆర్పీ సైతం గత ఏడు రోజుల్లో 10 శాతానికి పైగా తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశం తర్వాత క్రిప్టోకరెన్సీ ధర భారీగా పడిపోతూ వస్తుంది. వడ్డీ రేట్ల పెంపు ఊహించిన దాని కంటే ఎక్కువ ఉండొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్‌లో వెల్లడవ్వడం తాజాగా క్రిప్టో కరెన్సీ పతనానికి దోహదం చేసింది. "క్యూ1 2022లో బ్యాలెన్స్ షీట్ తగ్గించాలనే ఫెడ్ తీసుకున్న నిర్ణయం ఈ పతనానికి ప్రధాన కారణం" అని ఫండ్ స్ట్రాట్ వ్యూహకర్తలు తెలిపారు. వివిధ దేశాల్లో దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందన్న అంచనాలు, ద్రవ్యోల్బణ నుంచి రక్షణ, మదుపర్ల పోర్ట్‌ఫోలియోకు క్రిప్టోను కూడా జత చేయడం వంటి పరిణామాలతో బిట్‌కాయిన్ విలువ గత ఏడాది 60 శాతం మేర పెరిగింది. వీటిలో కొన్ని అంశాల్లో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండడంతో తాజా కొనుగోళ్లకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే క్రిప్టోల విలువ క్రమంగా పడిపోతున్నట్లు నిపుణులు తెలిపారు. జెఎస్‌టి క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టాడ్ మొరాకిస్ ప్రకారం.. కజఖ్‌స్థాన్‌లోని అశాంతి, అక్కడ గణనీయమైన సంఖ్యలో క్రిప్టో-మైనింగ్ కార్యకలాపాలపై చైనా అణచివేత, విద్యుత్-సరఫరాలో ఇబ్బందులు వంటి కారణాలు కూడా బిట్‌కాయిన్ ధరను ప్రభావితం చేశాయి. నెట్ వర్క్ కంప్యూటింగ్ శక్తి కొలత అయిన బిట్‌కాయిన్ హాష్ రేటు(Blockchain.com డేటా ప్రకారం) జనవరి 1న సుమారు 208 మిలియన్ల రికార్డు నుంచి గురువారానికి 176 మిలియన్ టెరాహాషెస్ కు పడిపోయింది. (చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?) -
క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్..
క్రిప్టో కరెన్సీ చట్టబద్ధత మీద దేశంలో విస్తృతమైన చర్చ ఓ వైపు జరుగుతుంటే మరో వైపు చాప కింద నీరులా క్రిప్టో వ్యవహారం దేశమంతటా విస్తరిస్తోంది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న వజీర్ఎక్స్ ఉదంతమే ఉదాహారణగా నిలుస్తోంది. సిషెల్స్కి చెందిన బినాన్స్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఆధీనంలోని వజీర్ ఎక్స్ సంస్థ మన దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు అనధికారికంగా నిర్వహిస్తోంది. దీంతో ఇటీవల ఈ కంపెనీ రికార్డులను ప్రభుత్వ విభాగాలు పరిశీలించగా పలు అవకతవకలు వెలుగు చూశాయి. అందులో ప్రభుత్వ కళ్లు గప్పి రూ. 40 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగ్గొట్టినట్టుగా అధికారులు గుర్తించారు. వజీర్ ఎక్స్ సంస్థ రూపాయలను తీసుకుని క్రిప్టో లావాదేవీలకు అనువైన డబ్ల్యూఆర్ఎక్స్గా మారుస్తుంది. అదే విధంగా డబ్ల్యూఆర్ఎక్స్ని రూపాయలుగా మార్చే సేవలు అందిస్తోంది. ఇందు కోసం కమీషన్ వసూలు చేస్తోంది. ఇలా కమీషన్ సేవలకు సంబంధించి 18 శాతం పన్నును చెల్లించాల్సి ఉంది. అయితే వజీర్ ఎక్స్ ఈ పని చేయలేదు. వజీఆర్ ఎక్స్ జీఎస్టీ చెల్లించని అంశాన్ని గుర్తించిన అధికారులు వడ్డీ, జరిమానతో సహా కలిపి రూ.49.20 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వజీర్ ఎక్స్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధమే మేలు: ఆర్బీఐ -
టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్.. ధర తెలిస్తే షాకే!
Bat Signed by 2011 World Cup winning team fetches 25,000 USD.. క్రికెట్లో టీమిండియాకు '2011' ఒక గోల్డెన్ ఇయర్. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ధోని నాయకత్వంలోని టీమిండియా ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. 1983 కపిల్ డెవిల్స్ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ను అందుకున్న ఘనత ధోని సేనకే సాధ్యమైంది. ఇక శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్లో ధోని తన స్టైల్లో సిక్స్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించి కప్‌ను చేతిలో పెట్టాడు. ఇక విజయం సాధించిన అనంతరం టీమిండియా చేసిన రచ్చ అంత తొందరగా మరిచిపోలేం. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను తమ భుజాలపై మోస్తూ అతనికి ధోని సేన కప్‌ను గిఫ్ట్‌గా అందివ్వడం ఒక చరిత్ర. ఆరోజు ధోని ట్రోఫీ అందుకున్న తర్వాత.. టీమిండియా ఆటగాళ్లంతా ఒక బ్యాట్‌పై తమ సంతకాలను చేశారు. దానికి 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాట్ అని పేరు పెట్టారు. తాజాగా ఆ బ్యాట్‌కు నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) రూపంలో భారీ ధర దక్కింది. చదవండి: 'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్' ఇక క్రిక్ఫ్లిక్స్, రెవ్‌స్పోర్ట్స్, ఫనాటిక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కలిసి సంయుక్తంగా ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. మొత్తంగా డిజిటల్ ఆర్టిక్రాప్ట్కు (335,950 అమెరికన్ డాలర్లు) ఎన్ఎఫ్టీ టోకెన్ రూపంలో బిడ్ వేశారు. ఇందులో టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్ ..వేలంలో 25వేల అమెరికన్ డాలర్లు పలికింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.18 లక్షలకు పైనే ఉంటుంది. అయితే ఇంతకముందు 2016లో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతకం చేసిన ఎస్ఆర్హెచ్ జెర్సీకి ఎన్ఎఫ్టీ రూపంలో 30వేల అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.22 లక్షలుపైన) పలకింది. దుబాయ్ వేదికగా ఈ ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించారు. ఇక సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్ క్రికెట్ కలెక్షన్ పేరుతో డిజిటర్ రైట్స్ రూపంలో వేలం నిర్వహించారు. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్‌ను టెండూల్కర్ వీరాభిమాని.. ముంబైకి చెందిన అమల్ ఖాన్ 40వేల అమెరికన్ డాలర్లకు(ఇండియన్ కరెన్సీలో రూ .30,01,410) దక్కించుకోవడం విశేషం. చదవండి: Dinesh Karthik: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: NFT: ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే.. -
అకౌంట్ హ్యాక్.. ఖాతా తెరచి చూస్తే షాక్.. 2 కోట్ల కరెన్సీ మాయం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారవేత్తకు చెందిన క్రిప్టోకరెన్సీ అకౌంట్ హ్యాక్ అయ్యింది. క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెట్టిన పెట్టుబడులను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. వ్యాపారవేత్తకు తెలియకుండా భారీ మొత్తంలో నిధులు స్వాహా అవ్వడంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త లోక్‌జిత్ సాయినాథ్ కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ చేస్తున్నాడు. దీనిలో అధిక లాభాలను చూశాడు కూడా. అతనికి సంబంధించి ఇప్పటి వరకు అకౌంట్లో రూ. 2.2 కోట్లు ఉన్నాయి. ఐదు రోజులుగా క్రిప్టో కరెన్సీ అకౌంట్‌ను లోక్‌జిత్ సాయినాథ్ ఓపెన్ చేయలేదు. శుక్రవారం క్రిప్టోకరెన్సీకి చెందిన షేర్‌ను చూసుకునేందుకు, వ్యాపార లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించగా..అందులోని రూ. 2.02 కోట్ల కరెన్సీ మాయమైంది. సైబర్ నేరగాళ్లు లోక్‌జిత్ సాయినాథ్కు చెందిన క్రిప్టో కరెన్సీ లాగిన్ ఐడీని మార్చేశారు. పాస్‌వర్డ్‌ను సైతం చేంజ్ చేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. చదవండి: బోరబండలో దారుణం.. మహిళను బెదిరించి.. ఇద్దరు యువకుల అత్యాచారం -
క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ బోర్డులో చర్చ
ముంబై: సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డు చర్చించింది. ఆర్బీఐ గవర్నర్ చైర్మన్‌గా ఉన్న రిజర్వ్‌బ్యాంకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల 592వ సమావేశం లక్నోలో జరిగినట్టు శుక్రవారం ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంకు ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ (రూపాయి), ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కొత్తగా వస్తున్న సవాళ్లు, దిద్దుబాటు చర్యలపైనా సమీక్షించింది. ఆర్బీఐ అర్ధ సంవత్సర నివేదిక, స్థానిక మండళ్ల నిర్వహణపై సమావేశం చర్చించింది’’ అని పేర్కొంది. అధికారిక డిజిటల్ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టో కరెన్సీల నియంత్రణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తీసుకురానున్నట్టు కేంద్ర సర్కారు లోగడ ప్రకటించడం తెలిసిందే. కానీ, వచ్చే వారం ముగియనున్న ప్రస్తుత సమావేశాల్లో బిల్లును తీసుకువచ్చే అవకాశాల్లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిప్టో కరెన్సీలకు వ్యతిరేకంగా ఆర్బీఐ ఇప్పటికే ఆందోళనలను వ్యక్తం చేయడం తెలిసిందే. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్..! -
పారా హుషార్: కొత్త ఏడాది.. కొత్త ఆశలతో పాటు కొత్త సమస్యలు
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటోంది! కానీ..ఏళ్లుగా పీడిస్తున్న హ్యాకింగ్, స్కామింగ్ చికాకులు మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు సరికదా... వచ్చే ఏడాది మరింత పెరుగుతాయంటోంది నార్టన్ ల్యాబ్స్!! కొత్త పోకడలతో, కొంగొత్త పద్ధతులతో ఐటీ వినియోగదారుల నుంచి డబ్బు లాగేసేందుకు స్కీములేస్తారని... పారాహుషార్ అని హెచ్చరిస్తోందీ సంస్థ! సాక్షి, హైదరాబాద్: 2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ల్యాబ్స్. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్ ఆక్టివిజమ్ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్ ల్యాబ్స్ అంచనాల మేరకు... క్రిప్టో కరెన్సీ తోడుగా... 2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్‌లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐడీలు? వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ కాల్, ఆన్లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎల్రక్టానిక్ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి. సైబర్ నిరసనలు, ఉగ్రవాదమూ... సైబర్ టెర్రరిజమ్, ఆక్టివిజమ్ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్ క్రిమినల్స్ చేసే పనైతే.. హ్యాకింగ్ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేరగాళ్లకూ అండగా ఏఐ... మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. ఎందుకింత గలీజ్ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు -
క్రిప్టో కరెన్సీకి అనుమతి? సీఐఐ సూచనలు
న్యూఢిల్లీ: క్రిప్టోలు లేదా డిజిటల్ టోకెన్లను ప్రత్యేక తరగతికి చెందిన సెక్యూరిటీలుగా పరిగణించాలని సీఐఐ అభిప్రాయపడింది. వీటికి ప్రస్తుత సెక్యూరిటీలకు అమలు చేస్తున్న నియంత్రణలు, నిబంధనలు కాకుండా.. కొత్త తరహా నియంత్రణలను రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రిప్టోల జారీపై కాకుండా.. లావాదేవీలు, భద్రతపైనే నియంత్రణపరమైన దృష్టి ఉండాలని సూచించింది. సీఐఐ ఇతర సూచనలు - ఆదాయపన్ను చట్టం, జీఎస్టీ చట్టాల పరిధిలో క్రిప్టోలు/డిజిటల్ టోకెన్లను ప్రత్యేక తరగతి సెక్యూరిటీలుగా.. క్యాపిటల్ ఆస్తులుగా చూడాలి. - చట్ట ప్రకారం పన్నులు విధించాలి. - ప్రజల ప్రయోజనాల దృష్ట్యా క్రిప్టో/డిజిటల్ టోకెన్ల జారీపై చట్టబద్ధమైన అధికారం ఆర్బీఐకే ఉండాలి. అదే సమయంలో ఆర్బీఐ కాకుండా ఇతర ఏ సంస్థ అయినా జారీ చేసేట్టు అయితే అందుకు అనుమతి తీసుకునే విధానం ఏర్పాటు చేయాలి - ‘కేంద్రీకృత ఎక్సేంజ్‌లు, కస్టడీ సేవలు అందించే సంస్థలు తప్పకుండా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. - ఫైనాన్షియల్ మార్కెట్ ఇంటర్మీడియరీలకు మాదిరే కేవైసీ, యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలను పాటించాలి. - ఈ సంస్థలు క్రిప్టోల లావాదేవీలు, వ్యాలెట్ల సేవలను ఆఫర్ చేయడానికే పరిమితం కాకుండా.. యూజర్లకు సంబంధించిన క్రిప్టో ఆస్తులకు రక్షణ కల్పించేలా చట్టపరమైన బాధ్యతను తీసుకునేలా చూడాలి. - ఈ బాధ్యతకు మద్దతుగా క్రిప్టో ఎక్సేంజ్‌లు కొంత క్యాపిటల్‌ను హామీ నిధిగా నిర్వహించాలి. ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థలు నిర్ధేశించే సమాచార వెల్లడి నిబంధనలను అమలు చేయాలి. సమావేశాల నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే క్రిప్టోలు, అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం సభ ముందుకు తీసుకొస్తామని ఆమె ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో సీఐఐ సూచనలకు ప్రాధాన్యం నెలకొంది. అనుమతిస్తే.. నియంత్రణలకు ముప్పు: సుబ్బారావు క్రిప్టో కరెన్సీలను అనుమతిస్తే నగదు సరఫరా, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్బీఐకి ఉన్న నియంత్రణాధికారం బలహీనపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఎన్ఎస్ఈ, న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ మన దేశంలో అంత బలంగా ఉండకపోవచ్చన్నారు. ‘‘క్రిప్టో అనేది ఆల్గోరిథమ్‌ల ఆధారితంగా ఉంటుంది. వీటివల్ల నగదు సరఫరా, ద్రవ్యోల్బణం నిర్వహణపై కేంద్ర బ్యాంకు నియంత్రణ కోల్పోతుందన్న ఆందోళన ఉంది. మానిటరీ పాలసీకి సైతం క్రిప్టోలు విఘాతం కలిగిస్తాయన్న ఆందోళనలు కూడా ఉన్నాయి’’ అని సుబ్బారావు పేర్కొన్నారు. దేశంలో కరెన్సీ వినియోగం తగ్గిపోతోందంటూ.. డిజిటల్ చెల్లింపులు ఆదరణ పొందుతున్నట్టు చెప్పారు. చదవండి: క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్‌లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..! -
వాట్సాప్‌లో మరో ఫీచర్.. ఇకపై క్రిప్టో కరెన్సీ కూడా
వివాస్పద క్రిప్టో కరెన్సీ విషయంలో మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మెటాకు చెందిన వాట్సాప్ ద్వారా క్రిప్టో లావాదేవీలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొంత మంది యూజర్లకు నోవి పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రిప్టో కరెన్సీ చట్ట బద్దతపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వాల అజమాయిషీ లేని ఈ కరెన్సీ వల్ల ఆర్థిక గందరగోళ పరిస్థితుల తలెత్తుతాయని చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టెక్నాలజీ దిగ్గజాలు భవిష్యత్తు క్రిప్టో కరెన్సీదే అంటున్నారు. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ లాంటి టెక్‌సావీలు ఇందులో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో క్రిప్టో లావాదేవీలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. మెటా సంస్థ అమెరికాలో ఎంపిక చేసిన యూజర్ల వాట్సాప్‌లలో నోవి ఫీచర్‌ను జోడించింది. నోవీ ఫీచర్లోకి వెళ్లి సంబంధిత సమాచారం అందివ్వాల్సి ఉంటుంది. సమాచార గోప్యత పాటించడంతో పాటు ఎండ్ టూ ఎండ్ ఎన్స్క్రిప్షన్గా ఈ ఫీచర్ ఉంటుంది. ఇందులో యూఎస్ డాలర్లను ఎంటర్ చేస్తే డిజిటల్ కరెన్సీలోకి మారుస్తుంది. ఈ పనిని పాక్సోస్ ట్రస్ట్ అనే చట్టబద్ధమైన కంపెనీ నిర్వహిస్తుంది. ఇప్పుడు నోవి వాలెట్లో ఉన్న మనీ ద్వారా క్రిప్టో లావాదేవీలను జరుపుకునే వీలుంది. ఆరు వారాల క్రితం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీలను మెటా నిశితంగా పరిశీలిస్తోంది. క్రిప్టో లావాదేవీలను మరింత మెరుగు పరచడం ఎలా అంశాలపై ఫోకస్ చేసింది. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా అందరికీ అందుబాటులోకి తేవాలా ? లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. -
డేటా గోప్యత, క్రిప్టో కరెన్సీ బిల్లులపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
బిలియనీర్ ముఖేష్ అంబానీ నేడు డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లులకు మద్దతు ఇచ్చారు. భారతదేశం అత్యంత ముందుచూపు విధానాలను అనుసరిస్తూ.. కొత్త కొత్త నిబంధనలను అమలులోకి తెస్తోందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ఈ విషయంపై ఆయన తన అభిప్రాయలు వ్యక్తం చేశారు. దేశంలో డిజిటల్ సమాచారాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎలా పంచుకోవాలో గురుంచి కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది అని అయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి దేశాలకు హక్కు ఉందని అన్నారు. డేటా ఒక 'కొత్త చమురు' అని పేర్కొంటూ.. ప్రతి పౌరుడి గోప్యత హక్కును కాపాడాలని ఆయన అన్నారు. "భారతదేశం అత్యంత ముందుచూపుతో విధానాలు, నిబంధనలను అమలు చేస్తోంది. ఆధార్,డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా దేశం ఇప్పటికే గొప్ప డిజిటల్ ఫ్రేమ్ వర్క్ కలిగి ఉందని ఆయన అన్నారు. మేము డేటా గోప్యతా బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాము. మేము సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాము నేను అనుకుంటున్నాను" అని ఫోరంలో పేర్కొన్నారు. చిన్న పెట్టుబడిదారులను కాపాడుతూ క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తిగా పరిగణించడానికి ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తున్నందున ఫోరంలో ముఖేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని చట్టం నిర్దేశించవచ్చు, అదే సమయంలో చట్టపరమైన టెండర్‌గా వాటి ఉపయోగాన్ని నిషేధించవచ్చు అని అన్నారు. నవంబర్ 29న ప్రారంభమైన పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల కోసం శాసన ఎజెండా "క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికత, దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు" మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును తీసుకురానున్నట్టు పేర్కొంది. క్రిప్టోకరెన్సీ నుంచి వచ్చే లాభాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీలపై పూర్తి నిషేధాన్ని కోరుతోంది. ఎందుకంటే, ఇది దేశం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ భావిస్తుంది. (చదవండి: నవంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!) డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం "డేటా, డిజిటల్ మౌలిక సదుపాయాలు భారతదేశంతో సహ ప్రపంచంలోని ప్రతి ఇతర దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. ఈ వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి ప్రతి దేశానికి హక్కు ఉంది" అని ఆయన అన్నారు. సరిహద్దు లావాదేవీలు, సహకారాలు & భాగస్వామ్యాలకు ఆటంకం కలిగించకుండా ఏకరీతి ప్రపంచ ప్రమాణం అవసరమని ఆయన అన్నారు. ప్రతి పౌరుడి గోప్యతహక్కును కాపాడాలని పేర్కొంటూ, సరైన విధానాలు, సరైన నియంత్రణ గల ఫ్రేమ్ వర్క్ రూపొందించి డేటా & డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడాల్సిన అవసరం ఉంది ముఖేష్ అంబానీ అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని నమ్ముతున్నాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ ఇంకా మాట్లాడుతూ.. "నేను బ్లాక్ చైన్ టెక్నాలజీని నమ్ముతున్నాను, ఇది క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉంటుంది" అని అన్నారు. "బ్లాక్ చైన్ ఆధారిత టెక్నాలజీ సమాజానికి చాలా ముఖ్యమైనది" అని తెలిపారు. క్రిప్టోకరెన్సీని నియంత్రించే బిల్లు పనిలో కేంద్రం ఉండగా, కరెన్సీ లేకుండా కూడా క్రిప్టోకరెన్సీలకు ఆధారమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ తనంతట తానుగా ఉనికిలో ఉండవచ్చని భావించే వారిలో ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఉన్నారు. “బ్లాక్‌చెయిన్‌ని ఉపయోగించి, మేము అపూర్వమైన భద్రత, నమ్మకం, ఆటోమేషన్ సామర్థ్యాన్ని దాదాపు ఏ రకమైన లావాదేవీలకైనా అందించగలము” అని అంబానీ చెప్పారు. (చదవండి: టిమ్ కుక్కు కొత్త తలనొప్పులు, చివాట్లు పెడుతున్న ఐఫోన్ యూజర్లు!) -
చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్!
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ యుగంలో యూజర్ల వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయి అనేది మనకు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యకర్స్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఒక హ్యాకర్ల బృందం డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్(డిఫై) సంస్థ బాడ్జర్ డీఏఓకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో సరికొత్త ట్రేడింగ్‌గా మారిన క్రిప్టోకరెన్సీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్ టెక్నాలజీని కూడా హ్యాకర్లు చేధించారు. చరిత్రలో మరోసారి 120.3 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వందల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే బాడ్జర్ డీఏఓ యాప్‌ను హ్యాక్ చేసినట్లు ప్రముఖ బ్లాక్ చైన్ సెక్యూరిటీ సంస్థ పెక్ షీల్డ్ మొదట కనుగొంది. Here is the current whereabouts as well as the total loss: $120.3M (with ~2.1k BTC + 151 ETH) @BadgerDAO pic.twitter.com/fJ4hJcMWTq — PeckShield Inc. (@peckshield) December 2, 2021 పెక్ షీల్డ్ సంస్థ ఈ హ్యాకింగ్ గురుంచి బయట పెట్టిన తర్వాత సదురు సంస్థ ఈ విషయం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లు మరోసారి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి తాత్కాలికంగా లావాదేవీలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి బాడ్జర్ డీఏఓ యుఎస్, కెనడియన్ అధికారులతో పాటు చైన్లాలైసిస్ కంపెనీని కూడా నియమించింది. ఈ మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. Badger has received reports of unauthorized withdrawals of user funds. As Badger engineers investigate this, all smart contracts have been paused to prevent further withdrawals. Our investigation is ongoing and we will release further information as soon as possible. — ₿adgerDAO 🦡 (@BadgerDAO) December 2, 2021 బాడ్జర్ డీఏఓ బాడ్జర్ డీఏఓ అనేది ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఈ బాడ్జర్ డీఏఓ అప్లికేషన్లలో వినియోగదారులు రుణాలను పొందడానికి బిట్ కాయిన్‌ను తాకట్టు పెట్టుకోవచ్చు. డిఏఓ అనేది ఆటోమేటెడ్ & డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఇది బ్లాక్ చైన్ ఆధారిత స్మార్ట్టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాడ్జర్ డీఏఓ ఎథెరియం ప్లాట్ ఫారంను నిర్మించారు. (చదవండి: పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..) -
క్రిప్టో బిల్లుకి అంతా రెడీ.. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఒక బిల్లును తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం బిల్లును ప్రవేశపెడతామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 23 వరకు కొనసాగుతాయని తెలిసిందే. క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు సభ్యుల నుంచి వ్యక్తం అవుతుండడంతో మంత్రి దీనిపై స్పందించారు. వర్చువల్ కరెన్సీల్లో వేగంగా వస్తున్న మార్పులను నూతన బిల్లు పరిగణనలోకి తీసుకుంటుందని, క్రితం బిల్లులో లేని అంశాలను పొందుపరచనున్నట్టు చెప్పారు. ‘క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. ‘‘చివరిగా వర్షకాల సమావేశాల్లోనూ బిల్లును తీసుకొస్తామనడం నిజమే. కానీ, ఇతర పరిణామాల వల్ల బిల్లుపై తిరిగి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. గత సమావేశాల్లోనూ బిల్లును తీసుకొచ్చేందుకు నిజాయితీ ప్రయత్నాలే చేశాం. ఇప్పుడు నూతన బిల్లుతో సభ ముందుకు వస్తున్నాం’’ అని మంత్రి సీతారామన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలను దేశంలో నియంత్రించడం లేదని, క్రిప్టోకరెన్సీల లావాదేవీల సమాచారాన్ని ప్రభుత్వం సమీకరించడం లేదని స్పష్టం చేశారు. పోలీసు రుణాలపై పోలీసు సిబ్బంది తదితర సున్నితమైన ఉద్యోగాల్లో ఉన్న వారికి రుణాలు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని మంత్రి సీతారామన్ మరో ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభకు తెలియజేశారు. నిషేధించడం అవివేకమే: ఓఆర్ఎఫ్ భారత్‌లో 1.5 కోట్ల మంది డిజిటల్ కరెన్సీలను కలిగి ఉన్నందున.. వీటిని ఇతర ఆర్థిక సాధనాల మాదిరి నియంత్రించాలే కానీ, నిషేధించడం అవివేకమే అవుతుందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో క్రిప్టో ఆస్తుల పరిశ్రమ భారత్‌లో బాగా వృద్ధిని చూసిందని, సుమారు 1.5 కోట్ల మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని తెలిపింది. ‘‘భారత్‌లో ఇప్పుడు 350 వరకు క్రిప్టో స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా క్రిప్టోలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ, అన్నింటిపైనా నిషేధం విధించడం సరైనది కాదు. దీనివల్ల ప్రభుత్వం గణనీయమైన ఆదాయం కోల్పోతుంది. అంతేకాదు చట్టవిరుద్ధమైన సంస్థలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’ అంటూ ఓఆర్ఎఫ్ తన నివేదికలో ప్రస్తావించింది. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం! ఈలోపే భారత్‌లో మరో.. -
Cyptocurrency : క్రిప్టోకరెన్సీ చట్టం.. అనూహ్య పరిణామం!
Coinstore Exchange India: క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వ నియంత్రణా? ఆంక్షలా? లేదా పూర్తి నిషేధమా?.. అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్ బిట్‌కాయిన్‌స్టోర్ భారత్‌లో అడుగుపెట్టింది. సింగపూర్‌కి చెందిన వర్చువల్ కరెన్సీ ఏజెన్సీ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ భారత్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్‌టవర్(సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యింది) తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ కావడం విశేషం. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై బ్రాంచ్‌లతో కాయిన్‌స్టోర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాదు 20 మిలియన్‌డాలర్ల బడ్జెట్‌తో భారత మార్కెట్లో పెట్టనున్నట్లు.. ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు కాయిన్‌స్టోర్ మార్కెటింగ్ హెడ్ చార్లెస్ టాన్ వెల్లడించారు. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల పట్ల ఇవాళ్టి నుంచి(నవంబర్ 29, 2021) మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని తరుణంలో.. కాయిన్‌స్టోర్ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం హెల్తీ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు చార్లెస్ టాన్ తెలిపారు. భారత్‌తో పాటు జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు Coinstore సిద్ధమైంది. Cryptocurrency.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిలా ఉంటే ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్.. ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. కానీ, క్రిప్టోబిల్లు పరిణామాల తర్వాత వాటి విలువ పడుతూ.. లేస్తూ ఇన్వెస్టర్లను కంగారుపెడుతోంది. మరి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు -
క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్ హవా
న్యూఢిల్లీ: క్రిప్టోలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అంటూ ఒకవైపు ఆర్బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. నియంత్రణలపరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మరోవైపు క్రిప్టో మార్కెట్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. 2021లోనే ఇప్పటి వరకు 100 స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఏర్పాటయ్యాయంటే ఈ మార్కెట్ ధోరణులు ఎలా ఉందీ అర్థం చేసుకోవచ్చు. దేశంలో క్రిప్టో స్టార్టప్‌ల సంఖ్య 400కు చేరుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రిప్టోలకు సంబంధించి పలు రకాల సేవలను ఈ స్టార్టప్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి క్రిప్టో స్టార్టప్‌లు 380 వరకు ఉండగా.. నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) ఆధారిత స్టార్టప్‌లు మరో 12 వరకు ఉన్నాయని సమాచారం. ‘‘కొత్త కాయిన్ల ఏర్పాటుపై ఎన్నో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. కొన్ని స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్ల కమ్యూనిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటి కార్యకలాపాలు ఈ ఏడాది మరింత బలోపేతమయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 వరకు స్టార్టప్‌లు కొత్తగా ఏర్పాటు కాగా, 2020లోనూ 50–60 స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి’’ అని క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ ‘యూనోకాయిన్’ సహ వ్యవస్థాపకుడు సాత్విక్ విశ్వనాథ్ తెలిపారు. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వృద్ధి క్రిప్టోకరెన్సీలకు సంబంధించి చెల్లింపులను అంగీకరించరాదంటూ గతేడాది బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో క్రిప్టో లావాదేవీలు దేశీయంగా నిలిచిపోయాయి. కానీ, ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయడం క్రిప్టో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందేందుకు సాయపడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2020 పూర్తి సంవత్సరంతో పోలిస్తే.. 2021 మొదటి ఆరు నెలల్లోనే క్రిప్టో స్టార్టప్‌ల నిధుల సమీకరణ 73 శాతం పెరిగింది. బెంగళూరుకు చెందిన క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌స్విచ్ కుబేర్, ముంబైకు చెందిన కాయిన్‌డీసీఎక్స్ ఇప్పటికే ‘యూనికార్న్’ స్థాయి విలువల(బిలియన్ డాలర్లు)కు చేరాయి. సగటు ఇన్వెస్టర్ క్రిప్టోల్లో చేసే పెట్టుబడులు ఏడాది క్రితం రూ.6,000–8,000 మధ్య ఉంటే, అది రూ.10,000కు పెరిగింది. రక్షణ కావాలి కానీ, నిషేధం కాదు.. ‘‘విధాన నిర్ణేతలు క్రిప్టోల విషయంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన నియంత్రణలు ప్రవేశపెట్టే ముందు.. క్రిప్టో ఎకోసిస్టమ్ వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అన్నది పరిశ్రమ వర్గాల డిమాండ్‌గా ఉంది. ఫిన్‌టెక్ సంస్థ వాల్రస్ వ్యవస్థాపకుడు అయిన భగబాన్ బెహెరా సైతం ఈ విభాగంలో వృద్ధిని చూసి క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించడం గమనార్హం. సోషల్ క్రిప్టో ఎక్సేంజ్ డెఫీని ఏర్పాటు చేయాలని బెహెరాతోపాటు ఇతర వ్యవస్థాపకులు నిర్ణయించుకున్నారు. క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్లు తమ ప్రొఫైల్‌ను ఈ సోషల్ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవడంతోపాటు, తమ పోర్ట్‌ఫోలియో వివరాలు, తమ ఆలోచనలను పంచుకునే వేదికగా దీన్ని మలచాలన్నది వ్యవస్థాపకుల ఆలోచనగా ఉంది. ‘‘భారత్‌లో క్రిప్టోల ఎన్ఎఫ్టీ విభాగం ఆరంభంలోనే ఉంది. సులభమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, అంతిమంగా క్రిప్టో మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో క్రెడిట్‌కార్డ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సిప్ ప్లాన్‌ను ప్రారంభించాలన్నది ఆలోచన’’ అని బెహెరా తెలిపారు. వృద్ధి అవకాశాలు.. ఎన్ఎఫ్టీల మార్కెట్ మన దేశంలో క్రమంగా బలపడుతోంది. ఎక్సేంజ్‌ల తరఫున అన్ని రకాల ఎన్ఎఫ్టీ స్టార్టప్‌లు.. క్రిప్టో ఎక్సేంజ్‌లు, ఏపీఐలు, టూల్స్, మౌలిక సదుపాయాల వృద్ధికి సంబం ధించి ఇప్పటికే దేశంలో ఏర్పాటయ్యాయి. ‘‘వినోదం, క్రీడలు, యుటిలిటీ ఆధారిత ఎన్ఎఫ్టీల పట్ల ప్రజల్లో మంచి ఉత్సాహం ఉంది. మార్కెట్లో ఎన్ఎఫ్టీలకు సంబంధించి ఫోమో (కోల్పోతామనే ధోరణి) వాతావరణం కూడా నెలకొని ఉంది. ఇది మరికొంత కాలం పాటు ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఎన్ఎఫ్టికల్లీ వ్యవస్థాపకుడు, సీఈవో తోషేంద్ర శర్మ తెలిపారు. తొందరపడొద్దు.. ప్రశాంతంగా ఉండండి: క్రిప్టో పరిశ్రమ న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం సూక్ష్మంగా వ్యవహరించాలని పరిశ్రమ కోరింది. ఇన్వెస్టర్లు తొందరపాటుతో ఓ ముగింపు నిర్ణయానికి రావద్దని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోలకు సంబంధించి ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అన్ని రకాల క్రిప్టోకరెన్సీలను ఈ బిల్లు నిషేధించనున్నట్టు సమాచారం వెలుగు చూడడంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలకు మొగ్గు చూపించారు. ఫలితంగా కొన్ని క్రిప్టోలు బుధవారం నష్టపోయాయి. ఈ క్రమంలో క్రిప్టో ఎక్సేంజ్‌లు, పరిశ్రమకు చెందిన ఇతరులు స్పందించారు. ‘‘దేశంలో క్రిప్టోల వృద్ధి అవకాశాలపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన క్రిప్టో ఇన్వెస్టర్లు, క్రిప్టో స్టార్టప్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లు ఉంటుందని భావిస్తున్నాం. నూతన బ్లాక్‌చైన్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా బిల్లు సౌకర్యవంతంగా ఉండాలి. కొత్త క్రిప్టో కరెన్సీ ఏదైనా కానీ, భారత ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అవ్వడానికి ముందు నిర్ధేశిత ప్రామాణిక విధానం అంటూ ఒకటి ఉండాలి. పన్నుల అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం’’ అని బైయూకాయిన్ సీఈవో శివమ్ తక్రాల్ పేర్కొన్నారు. అందరితో సంప్రదిస్తున్నాం.. ‘‘ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణే ప్రధానంగా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు చేస్తున్నాం. కస్టమర్లకు రక్షణ ఉండాలి. ఆర్థిక స్థిరత్వం బలోపేతం కావాలి. క్రిప్టో టెక్నాలజీ విప్లవం నుంచి భారత్ ప్రయోజనం పొందాలన్న దానిపై విస్తృతమైన అంగీకారం వచ్చింది’’ అని కాయిన్‌స్విచ్ కుబేర్ సీఈవో ఆశిష్ సింఘాల్ తెలిపారు. ఇన్వెస్టర్లు ప్రశాతంగా ఉండాలని సూచిం చారు. ‘‘తగినంత విశ్లేషణ, ఆలోచనతో కూడిన నియంత్రణ విధానం ఈ టెక్నాలజీని విస్తృతంగా మోదించడానికి దారితీస్తుంది’’ అని కాయిన్‌డీసీఎక్స్ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. క్రిప్టోలకు చట్టబద్ధత వద్దు 54 శాతం మంది అభిప్రాయమిదే న్యూఢిల్లీ: దేశంలో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం లేదని 54 శాతం మంది అభిప్రాయంతో ఉన్నారు. వీటిని విదేశాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులుగా పరిగణిస్తే చాలని చెప్పారు. డిజిటల్ కమ్యూనిటీ ‘లోకల్‌సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 342 జిల్లాల పరిధిలోని 56,000 మంది అభిప్రాయాలను ఈ సర్వే కింద లోకల్ సర్కిల్స్ సేకరించింది. క్రిప్టో కరెన్సీలను చట్టపరంగా అనుమతించాలని 26 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 87 శాతం మంది భారతీయ కుటుంబాలు క్రిప్టోల్లో ట్రేడింగ్ లేదా పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. క్రిప్టోల ప్రకటనల్లో రిస్క్‌ల గురించి స్పష్టంగా పేర్కొనడం లేదని 9,942 మంది చెప్పారు. క్రిప్టోల్లో మిగిలేవి కొన్నే: రాజన్ న్యూఢిల్లీ: క్రిప్టోల్లో చివరికి కొన్నే మిగిలి ఉంటాయని, మిగతవాన్నీ కనుమరుగైపోతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అభిప్రాయపడ్డారు. ‘‘చెల్లింపుల కోసం 6,000కుపైగా క్రిప్టో కరెన్సీలు మనకు నిజంగా అవసరమా? ఒకటి లేదా రెండు లేదంటే కొన్ని మాత్రమే చెల్లింపులకు వీలుగా మిగిలి ఉంటాయి. అది కూడా టెక్నాల జీ అత్యంత ఉపయోగకరంగా ఉంటే. కనుక భవిష్యత్తులో చాలా వరకు క్రిప్టోలు అధిక వ్యాల్యూమ్‌తో కొనసాగడం కష్టమే’’ అని ఒక టీవీ చానల్‌కు రాజన్ చెప్పారు. నియంత్రణలో లేని చిట్‌ఫండ్స్ మాదిరే క్రిప్టోలతోనూ నష్టపోయే సమస్య ఎదురవుతుందన్నారు. -
క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే!
దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్న వారిలో చాలామంది బోలెడన్ని లాభాలు వచ్చిపడతాయన్న నమ్మకంతో ఉన్నారు. కొంతమందికి డబ్బుల లాటరీ తగలడం వరకూ నిజమే కావచ్చు. కానీ.. మిగిలిన చాలామంది నష్టాల బారిన పడే అవకాశాలే ఎక్కువ. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై భారత్‌లో ఇప్పటికీ సరైన చట్టాలు లేవన్న విషయం గుర్తుంచుకోవాలి. క్రిప్టో వ్యవహారాలు చాలావరకూ అంతర్జాతీయ ప్లాట్ఫార్మ్పై, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తూంటాయి. కాబట్టి నిషేధం విధించడం ఏ రకంగానూ పరిష్కారం చూపదని నిపుణుల భావన. క్రిప్టో కరెన్సీని నిషేధించడం కంటే, దాని నియంత్రణే సరైన మార్గమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దీంతో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధంగా పన్ను పరిధిలోకి తీసుకొచ్చి లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుందని ఖాయంగా తెలుస్తోంది. భారత్ ఇప్పుడు ఓ కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది! క్రిప్టో కరెన్సీలు, ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతున్న వారు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు. వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ప్రకటనలు క్రిప్టో క్రేజ్‌ను మరింత పెంచాయి. క్రిప్టో సంబంధిత ఆస్తులు, కరెన్సీలపై అన్నివైపులా ఉత్సాహం వెల్లువెత్తుతున్న విషయం నిజమే అయినప్పటికీ ఈ అంశం చుట్టూ ఉండే పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగానైతే లేవు. క్రిప్టో కరెన్సీ, ఆస్తుల విషయాల్లో ప్రభుత్వాలు విధానపరంగా ఎలా వ్యవహరిస్తాయి? తప్పులు జరక్కుండా ఎలా నియంత్రిస్తారు? వంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. క్రిప్టో వ్యవహారాల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై భారత ప్రభుత్వం ఇప్పటికీ కొంత అస్పష్టతతోనే ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ క్రిప్టో వ్యవహారాలు నిర్వహించే చట్టబద్ధ సంస్థలకు బ్యాంకింగ్ సర్వీసులు అందవని ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టు దీన్ని పక్కనబెట్టింది. అయితే ఈ క్రమంలోనే క్రిప్టో అంశాలపై అన్ని నిర్ణయాలు తీసుకునే నోడల్ అథారిటీ ఆర్బీఐ మాత్రమేనని కూడా తన చారిత్రాత్మక తీర్పు ద్వారా స్పష్టం చేసింది కూడా. ఇంకోపక్క ఆర్బీఐ స్వయంగా తనదైన క్రిప్టో, డిజిటల్ కరెన్సీలను ప్రవేశపెట్టవచ్చునన్న ప్రకటనలూ కొన్ని వెలువడ్డాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్న వారిలో చాలామంది బోలెడన్ని లాభాలొస్తాయన్న ఆశతో ఉన్నారు. కొంతమందికి డబ్బుల లాటరీ తగలడం వరకూ నిజమే కావచ్చు. కానీ.. మిగిలిన చాలామంది నష్టాల బారిన పడే అవకాశాలే ఎక్కువ. 2000 నాటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్నే తీసుకుంటే.. క్రిప్టో వ్యవహారాలకు, దీనికీ అస్సలు పొంతన లేకుండా ఉంటుంది. ఈ చట్టంలో క్రిప్టో కరెన్సీ, ఆస్తుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయానికి ఏ విధమైన వెసలుబాట్లూ లేవు. క్రిప్టో కరెన్సీలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన చట్టమే కాదు ఇది. ఐటీ చట్టాన్ని 2008లో చివరిసారి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో మార్పులు వచ్చిపడ్డాయి. మరీ ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో క్రిప్టో కరెన్సీ, ఆస్తుల వ్యవహారాలు గణనీయంగా పెరిగాయి. ఈ నిమ్మకు నీరెత్తిన ధోరణి ఏమాత్రం సరికాదన్న స్పృహ ఇప్పుడిప్పుడే భారత్ గుర్తిస్తోంది. దీనిపై స్పష్టమైన విధానాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంది. నిషేధం మార్గం కానే కాదు... క్రిప్టో వ్యవహారాలపై నిషేధం విధిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే నిషేధాలు అంత మంచిపని కాదన్నది ఇప్పటికే చాలా అంశాల విషయంలో స్పష్టమైంది. పైగా ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచమంతా ఒక కుగ్రామమైపోయిన ఈ రోజుల్లో అస్సలు సరి కాదు. క్రిప్టో వ్యవహారాలు చాలావరకూ అంతర్జాతీయ ప్లాట్ఫార్మ్పై, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తూంటాయి. కాబట్టి నిషేధం విధించడం ఏ రకంగానూ పరిష్కారం చూపదు. కాబట్టి నిషేధం కంటే.. క్రిప్టో వ్యవహారాలకు చట్టపరమైన గుర్తింపునివ్వడమే కాకుండా.. కనీస నియంత్రణకు విధానాలు రూపొందించడం మేలు. బెలరూస్, మాల్టాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. బ్లాక్‌చెయిన్ ఐలాండ్‌గా పేరొందిన మాల్టాలో వీటికి సంబంధించి మూడు వేర్వేరు చట్టాలు చేశారు. క్రిప్టో వ్యవహారాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు కూడా మనం ఏ రకంగా వ్యవహరించాలో తెలిపే సూచికలు అవుతాయి. మొత్తమ్మీద చూస్తే... మన దేశానికి సరిగ్గా సరిపోయే విధానం ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ప్రత్యేకంగా లేదు. అంటే.. పలు దేశాల విధానాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వాటిల్లోని మంచి అంశాలతో మనకు ఉపయోగపడే విధానాన్ని రూపొందించుకోవాలి. క్రిప్టో వ్యవహారాల్లో కరెన్సీ అంశంపై భారత్‌కు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ కోసం ప్రత్యేకంగా బ్యాంకులేవీ లేని నేపథ్యంలో ఇవేవీ అర్థం చేసుకోలేనంత క్లిష్టమైనవీ కావు. ఈ నేపథ్యంలో భారత్ క్రిప్టో కరెన్సీ విషయంలో సంప్రదాయ మార్గాల ద్వారానే విధాన రూపకల్పన చేయవచ్చు. అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన అంశాలతో మొదలుపెట్టి క్రమేపీ చట్టం పరిధిని విస్తరింపజేయవచ్చు కూడా. ఇంకో ముఖ్యమైన విషయం. బ్లాక్‌చెయిన్/క్రిప్టో వ్యవహారాల్లో పెట్టుబడులు పెడుతున్న వారి రక్షణ కోసం తగిన చట్టాలు అవసరం. అంతేకాదు. క్రిప్టో వ్యవహారాల్లో సేవలందించే వారి కోసం ప్రత్యేక నియమ నిబంధనల అవసరం ఏమీ ఉండరాదు. క్రిప్టో వ్యవహారాలు కేవలం భవిష్యత్తు అంచనాలపైనే ఆధారపడి ఉంటాయన్న విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ అవి కాలంతోపాటు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఏ చట్టం కూడా సాయపడదు. కానీ.. పెట్టుబడులు పెట్టే వారి హక్కులకు రక్షణ ఉండేలా చట్టంలో కొన్ని ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. పెట్టుబడిదారుల హక్కుల రక్షణ అన్న అంశం అస్పష్టమైందే. కానీ నిపుణులతో సంప్రదింపులు జరపడం ద్వారా స్పష్టత సాధించాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఏర్పడింది. క్రిప్టో వ్యవహారాల నియంత్రణకు భారత్ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా... పలు దేశాలు దీనిపై దృష్టి పెడతాయన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సంపూర్ణమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయం ప్రస్తుతం చాలా అవసరం. క్రిప్టో వ్యవహరాలు వర్తమానానికి సంబంధించినవే అయినప్పటికీ అవి భవిష్యత్తుకు సూచికలన్న విషయం మరచిపోరాదు. కాబట్టి క్రిప్టో వ్యవస్థ అభివృద్ధిని ఏ విధంగానూ కుంచించని, తక్కువ చేయని విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. వ్యాపార, చట్ట అవసరాల దృష్ట్యా మాత్రమే కాకుండా.. వినియోగదారులు, పెట్టుబడులు పెట్టే వారి అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా ఈ క్రిప్టో చట్టాలు ఉండాలి. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతలపై ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడాలి. క్రిప్టో కరెన్సీ నియంత్రణ దిశగా... భారత్‌లో క్రిప్టోకరెన్సీపై ప్రజలు మక్కువ చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మితిమీరుతున్న క్రిప్టో కరెన్సీ వాడకంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రభుత్వం ఆమోదించే డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించనున్నారు. ఈ అంశంపై ఇటీవలే వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్బీఐ అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించారు. అయితే ప్రపంచమంతటా విస్తృతంగా అమల్లో ఉన్న క్రిప్టో కరెన్సీని నిషేధించడం తగదని, దాని నియంత్రణే సరైన మార్గమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దీంతో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధంగా పన్ను పరిధిలోకి తీసుకొచ్చి లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై కేంద్రప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుందని తెలిసింది. క్రిప్టో కరెన్సీని అధికారికంగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతున్నం దున అటు ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించడం, ఇటు ‘ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021’ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఖాయమని తెలుస్తోంది. – పవన్ దుగ్గల్, సైబర్ చట్టాల నిపుణుడు -
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించి కీలక బిల్లును ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బిల్లును మంగళవారం కేంద్రం లిస్ట్ చేసింది. కేంద్ర క్యాబినెట్ బుధవారం చర్చకు లిస్ట్ చేసిన మొత్తం 26 బిల్లుల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు ఒకటని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులూ లిస్టింగ్‌లో ఉన్నాయి. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకూ పార్లమెంటు సీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. క్రిప్టోకరెన్సీ అంశంపై వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్బీఐ అధికారులతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. క్రిప్టోకరెన్సీ నిషేధం తగదని, నియంత్రణే సరైన మార్గమని పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది.. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించడంతో దేశంలో క్రిప్టో కరెన్సీ ఖాయమన్న సందేహాలూ వ్యక్తం అయ్యాయి. అయితే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ మాత్రం దీనివల్ల దేశ ఫైనాన్షియల్, ఆర్థిక స్థిరత్వాల కు విఘాతమని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. భిన్న వాదనలు...: ‘ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021’ శీర్షికన బిల్లు లిస్ట్ కావడంతో దీనిపై భిన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. కొన్ని క్రిప్టో కరెన్సీలను నిషేధించి, మరికొన్నింటిపై నియంత్రణ విధిస్తుందని, దీనితోపాటు ఆర్బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీ రెగ్యులేట్ చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి బిల్లు దోహదపడుతుంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కూడా కోరుతోంది, అయితే, క్రిప్టోకరెన్సీ, దాని ప్రయోజనాల కోణంలో అంతర్లీన సాంకేతికతను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులను బిల్లు అనుమతిస్తుంది‘అని లోక్‌సభ వెబ్సైట్లో బిల్లు లిస్టింగ్ వివరాలు తెలియజేస్తున్నాయి. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇంకా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లుపై కూడా బుధవారం చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. చదవండి: క్రిప్టో కరెన్సీపై ఆర్ఎస్ఎస్ శాఖ కీలక వ్యాఖ్యలు -
వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్‌కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..!
El Salvador Plans to Build the World's First Bitcoin City: త్వరలో ప్రపంచంలోనే 'బిట్ కాయిన్ సిటీ' నిర్మాణం జరగనుంది. ఇందు కోసం నిర్వాహకులు బిట్ కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సేకరించనున్నారు. ఇప్పటికే పలు దేశాలు బిట్ కాయిన్‌ను చట్టబద్ధత చేసే దిశగా అడుగులు వేస్తుండగా.. ఈ దేశం మాత్రం ఏకంగా బిట్‌కాయిన్ సిటీని నిర్మించడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి సెంట్రల్ అమెరికాకు చెందిన ఎల్ శాల్వడార్ దేశం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్ శాల్వడార్ దేశం బిట్ కాయిన్ అంశంలో మరో అడుగు ముందుకేసింది. ఎల్ శాల్వడార్ ప్రపంచంలోని మొట్టమొదటి 'బిట్‌కాయిన్ సిటీ'ని నిర్మించాలని యోచిస్తోంది. దీనికి ప్రారంభంలో బిట్‌కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సమకూరుతాయని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే చెప్పారు. ఎల్ సాల్వడార్ దేశంలో బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించే దిశగా అధ్యక్షుడు నయీబ్ బుకెలే కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ అవెర్నెస్ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో ముగియనున్న సందర్భంగా ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిట్ కాయిన్ ల కోసం అగ్నిపర్వతం నుంచి ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని, త్వరలోనే ఈ ప్రాంతంలో బిట్ కాయిన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సిటీలో విలువ ఆధారిత పన్ను (VAT) మినహా ఎలాంటి పన్నులను ప్రభుత్వం విధించదని చెప్పారు. 'ఈ బిట్ కాయిన్ సిటీని కోసం 2022లో నిధులు సమకూర్చడం ప్రారంభిస్తామని, 2022లో బాండ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. బుకెల్తో పాటు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రొవైడర్ బ్లాక్‌స్ట్రీమ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శాంసన్ మోవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్ శాల్వడార్ దేశంలో బిట్ కాయిన్ సిటీని ఏర్పాటు చేసేందుకు బిట్‌కాయిన్ మద్దతుతో $1 బిలియన్ బాండ్‌ను జారీ చేస్తుందని స్పష్టం చేశారు. -
ఇది కనపడని కరెన్సీ బూమ్!
లాటరీ తగులుతుందంటే కాదనడం కష్టమే! ఆర్థికసేవల్లో టెక్నాలజీని అంతర్భాగం చేసుకొనే ‘ఫిన్‌టెక్’ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీలతో కనివిని ఎరుగని రాబడి వస్తుందంటే సగటు భారతీయుడు మోజు పడకుండా ఉంటాడా? అందుకే, 2020లో 92.3 కోట్ల డాలర్లున్న భారతీయ క్రిప్టో పెట్టుబడులు 2021లో 660 కోట్ల డాలర్లకు చేరి, బ్రిటన్ను సైతం దాటేశాయి. ఇది ఒకింత ఆశ్చర్యకరం. మరింత ఆందోళనకరం. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచే ప్రమాదం క్రిప్టోలతో ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మొత్తుకుంటోంది. మరోపక్క ఈ కంటికి కనపడని డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టి, కొద్దిరోజుల్లోనే కోట్లు గడించవచ్చని ఆశపడుతున్న అమాయకుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే శనివారం ప్రధాన మంత్రి మోదీ, సోమవారం పార్లమెంటరీ స్థాయీ సంఘ సభ్యులు చర్చలు జరిపారు. వీటన్నిటి క్రోడీకరణగా రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీపై చట్టం తేవాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. ప్రపంచ వ్యాప్త క్రిప్టో విజృంభణ ధోరణిని భారత్ ఒక్కటీ ఎలా నియంత్రించగలదన్నది ప్రశ్న. మొన్న సెప్టెంబర్‌లో ఎల్సాల్వడార్లా క్రిప్టోను కరెన్సీగా అంగీకరించాలా, లేక చైనాలా పూర్తిగా నిషేధించాలా అంటే తేల్చి చెప్పడం కష్టమే. నిజానికి, 2013 నుంచి మనదేశంలో క్రిప్టో చర్చనీయాంశమే. 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, 2018లో క్రిప్టోపై ఆర్బీఐ నిషేధం, 2020 మార్చిలో నిషేధాన్ని సుప్రీమ్ కోర్టు కొట్టేయడం అంతా చరిత్ర. ఆపైన కరోనా కాలంలో భారత్‌లో బంగారాన్ని మించిన పెట్టుబడి మార్గంగా క్రిప్టో అవతరించింది. పన్నెండేళ్ళ క్రితం జరిగిన ఓ కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని చుట్టేసిందంటే ఆశ్చర్యమే. 2009లో ‘బిట్‌కాయిన్’ పేరుతో క్రిప్టో కరెన్సీ విధానం మొదలైతే, ఇప్పుడు ఎథీరియమ్, రిపుల్, డోజ్కాయిన్ – ఇలా 10 వేల క్రిప్టో కరెన్సీలున్నాయి. క్రిప్టోగ్రఫీ, కరెన్సీల కలగలుపుగా కొత్త సృష్టి – క్రిప్టో కరెన్సీ. మామూలు మాటల్లో– క్రిప్టోకరెన్సీ అంటే ఎలక్ట్రానిక్ చెల్లింపు నెట్వర్క్. నెట్‌వర్క్‌లోని కంప్యూటర్ల లాంటివి లావాదేవీలను సరిచూసి, ధ్రువీకరిస్తాయి. హద్దుల్ని చెరిపేస్తూ, ప్రపంచమంతటా విస్తరించిన ప్రభుత్వేతర ఆన్లైన్ కమ్యూనిటీలు ఈ కరెన్సీలను సృష్టించి, నడుపుతుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలు చలామణీలో ఉన్నాయి. అత్యధికంగా భారత్‌లోనే 10 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. అందుకే, జాతీయ కరెన్సీలకు క్రిప్టోలు పోటీగా అవతరిస్తాయా అన్న చర్చ. క్రిప్టోల ప్రాచుర్యానికి కారణం– దాని ప్రత్యేకతలు. సాధారణ బ్యాంకుల్లో లాగా కాక, ఇక్కడ లావాదేవీల ధ్రువీకరణ పని ఇంటర్నెట్తో వికేంద్రీకృతంగా సాగుతుంది గనక యూజర్ ఛార్జీలు ఉండవు. ప్రపంచంలో ఎక్కడికైనా ఇప్పుడున్న చెల్లింపు వ్యవస్థల కన్నా చౌకగా, వేగంగా చెల్లింపులు జరిపేయచ్చు. దీనికి వాడే ‘బ్లాక్‌చెయిన్’ విధానంలో రికార్డులను తారుమారు చేయడం అసాధ్యం. అత్యంత సురక్షితం. విశ్వవ్యాప్త కరెన్సీల్లో లోపాలూ ఉన్నాయి. కంప్యూటర్లు, వ్యాలెట్ల లాంటివి అవసరం కాబట్టి, సాంకేతికంగా పట్టున్నవారికే తప్ప అత్యధికులైన సామాన్యులకు ఈ క్రిప్టో కరెన్సీలు దూరమే. ఇక, వర్చ్యువల్ కరెన్సీలో మదుపరులెవరో ఎవరికీ తెలీదు గనక డ్రగ్స్, అంతర్జాతీయ హవాలాకు ఇది మంచి వాటం. తీవ్రవాదానికీ ఈ డిజిటల్ ఆస్తులు అండగా మారే ముప్పుంది. దేశంలో ద్రవ్యవిధానానికి మార్గదర్శనం చేసే కేంద్రీయ బ్యాంకులేవీ వీటిని నియంత్రించలేవు. కాబట్టి, ఈ కరెన్సీ కాని కరెన్సీకీ, రకరకాల క్రిప్టో కరెన్సీల నిర్వాహకులకీ అడ్డూ ఆపూ ఉండదు. మరోపక్క 5 వేల బిట్‌కాయిన్స్‌ను నిందితుడు కొట్టేసిన కర్ణాటకలోని బిట్‌కాయిన్ కుంభకోణం లాంటివి ఇప్పటికే జనాన్ని భయపెడుతున్నాయి. అయినా సరే, మన దేశంలో సాంప్రదాయిక స్టాక్ మార్కెట్లో కన్నా 5 రెట్లు ఎక్కువ మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారన్నది విస్తుపోయే వాస్తవం. వారిలో 15 శాతం మంది స్త్రీలే. ఎక్కువగా 18 నుంచి 35 – 40 లోపు వాళ్ళే. లెక్కిస్తే భారతీయ క్రిప్టో యూజర్ సగటు వయసు పట్టుమని పాతికేళ్ళే. యువతరం, అందులోనూ ఎక్కువగా దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్నవాసులు క్రిప్టో మోజులో పడుతున్నారు. సినీతారలు సైతం క్రిప్టోలకు ప్రచారకర్తలవుతున్నారు. అమితాబ్, కమలహాసన్, సల్మాన్ ఖాన్ తదితరులు ఒకరకం క్రిప్టో ఆస్తులైన ‘నాన్ఫంగిబుల్ టోకెన్’ (ఎన్ఎఫ్టి)లతో తమ బ్రాండ్లను సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. ఒకప్పటి స్టాక్‌మార్కెట్, డాట్‌కామ్ విజృంభణల ఫక్కీలో ఇప్పుడీ క్రిప్టో బూమ్ వచ్చింది. ఇది నిజంగా బూమా? లేక వట్టి బుడగేనా? ఆర్బీఐ నో అంటున్నా, ఈ కొత్త విశ్వవ్యాప్త కరెన్సీ ధోరణిని కట్టగట్టి కాదనలేం. నిషేధించలేం. అలాగని కొత్త కుంపటిని యథాతథంగా నెత్తికెత్తుకోలేం. అందుకే, గత ఫిబ్రవరిలో నిషేధ చట్టం తేవాలనుకున్నా, ఇప్పుడు కొన్ని నియంత్రణలతో క్రిప్టోను స్వాగతించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుంది. క్రిప్టో సమస్యల్ని అధిగమించాలంటే, కేంద్రీయ బ్యాంకులే డిజిటల్ కరెన్సీలను జారీ చేయడం ఓ మార్గం. కానీ, ద్రవ్యసృష్టిలో, చెల్లింపు వ్యవస్థల్లో ప్రభుత్వ పాత్ర లేకుండా చేయాలన్న క్రిప్టో కరెన్సీ ఆవిర్భావ ఆలోచనకే అది విరుద్ధం. ఇంతకాలం బ్యాంకులు, బీమాలు, బంగారమంటూ దేశంలోనే పెట్టుబడులుండేవి. ఇప్పుడీ క్రిప్టో పెట్టుబడులతో డబ్బు దేశం దాటే ప్రమాదం ఉంది. దేశభద్రత, ఆర్థిక సుస్థిరత, ఆశపడే సామాన్యప్రజల ప్రయోజనాల సంరక్షణే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. భవిష్యత్ టెక్నాలజీని కాదనకుండానే, భారీ సంక్షోభాన్ని నివారించడమెట్లా? ఇది సర్కారు వారి మిలియన్ డాలర్ల క్రిప్టో ప్రశ్న! -
భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్‌కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్‌కాయిన్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్‌కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. నవంబర్ 8న 67,582.60 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ ధర నేడు సుమారు 4% కంటే ఎక్కువ 60,718.80 డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో రూ. 3 వేల డాలర్లు పైగా నష్టపోయింది. అలాగే, మార్కెట్ విలువ పరంగా రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ 6.18% క్షీణించి $4,291.60 వద్ద ఉంది. అయితే, ఈ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పడిపోవడానికి సరైన కారణాలు కనిపించడం లేదని, చాలా రోజులు నుంచి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర గరిష్టానికి చేరుకోవడంతో పెట్టుబడుదారులు లాభాలను వెనక్కి తీసుకోవడంతో క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పడిపోయినట్లు నిపుణులు సూచిస్తున్నారు. బిట్‌కాయిన్ విలువ జూన్ కంటే రెట్టింపు స్థాయిలో పెరిగింది. (చదవండి: Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..) -
Cryptocurrency: క్రిప్టోకి అనుమతులు వచ్చేనా ? కేంద్రం వరుస సమావేశాలు!
Crypto Finance: క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా ? క్రిప్టో కరెన్సీకి అనుమతులు జారీ చేస్తూనే చట్టబద్ద నియంత్రణ ఉండేలా ఏర్పాట్టు చేయబోతుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న క్రిప్టోపై ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జయంత్‌సిన్హా నేతృత్వంలో క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ పరంగా నిర్ణయం ప్రకటించే ముందు ఇందులో భాగస్వాములగా ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా క్రిప్టో ఎక్సేంజీ ప్రతినిధులు, బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ), ఇండస్ట్రీ బాడీస్‌తో పాటు ఈ లావాదేవీలతో సంబంధం ఉండే ఇతర వర్గాలతో పార్లమెంటరీ ప్యానెల్ సోమవారం సమావేశం కానుంది. దీనికి మాజీ ఆర్థిక మంత్రి, పార్లమెంట్ సభ్యుడు జయంత సిన్హా నేతృత్వం వహించనున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ సమీక్ష ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మరోసారి ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) కమిటీ సమీక్షిస్తుంది. అనంతరం క్రిప్టోకి సంబంధించిన అంశం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. అక్కడ క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇవ్వాలా ? ఇస్తే ఎలాంటి చట్టపరమైన షరతులు విధించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నలువైపులా ఒత్తిడి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒక్కటైన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి అనుమతులు ఇవ్వాలంటూ ప్రప్రంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తోంది. మరోవైపు చట్టపరమైన అనుమతులు లేకపోయినా దేశంలో క్రిప్టో లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో భవిష్యత్తుపై చర్చించేందుకు ఇప్పటికే ఓ దఫా మంత్రులు, ఆర్బీలతో చర్చలు పూర్తయ్యాయి. ఆ సమావేశంలో చర్చించినట్టుగా క్రిప్టో కరెన్సీలో భాగస్వామ్య పక్షాలు, మేనేజ్మెంట్ సంస్థల అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది ప్రభుత్వం. ఆర్బీఐ నుంచి క్రిప్టోకరెన్సీపై సుప్రీం కోర్టు నిషేధం కొనసాగుతోంది. అయితే మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నేరుగా డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా గతంలో అనేక చర్చలు జరిగాయి. అయితే దీనిపై ఇంత వరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. కాగా ప్రస్తుతం క్రిప్టోపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. చదవండి:క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం -
అతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరువాసి శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. శ్రీకి నుంచి రాజకీయ నేతలు, వారి సుపుత్రులు భారీగా బిట్కాయిన్ల డబ్బును స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పెద్ద రాజకీయ కలకలం ఏర్పడింది. ఇతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదంటారు. జయనగర నివాసి గోపాల్ రమేశ్ కుమారుడైన శ్రీకి అంతర్జాతీయ స్థాయి హ్యాకర్‌గా గుర్తింపు పొందాడు. తన ఆధారాలు చిక్కకుండా హ్యాక్ చేయడం ఇతని ప్రత్యేకత. ఇందుకోసం ఎప్పడూ సొంత ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్‌ఫోన్‌ను వాడింది లేదు. 4వ తరగతి నుంచి షురూ.. నాలుగో తరగతి చదువుతుండగానే మొబైల్‌ఫోన్‌ను హ్యాక్ చేసే నైపుణ్యం పొందిన శ్రీకి హైస్కూల్లో చేరేటప్పటికి ప్రముఖ హ్యాకర్‌గా గుర్తింపుపొందాడు. 17 ఏళ్లు వయసులోనే ఇళ్లు వదిలిపెట్టి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌కు పారిపోగా పోలీసులు కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఎప్పుడూ స్కూల్‌కి గైర్హాజరయ్యే ఇతడు తోటి విద్యార్థులు, పాఠశాల కంప్యూటర్లను హ్యాక్ చేసి ఔరా అనిపించేవాడు. వీవీ పురం ప్రైవేటు కాలేజీలో పీయూసీ కంప్యూటర్ సైన్సు చదువుతుండగా ప్రపంచస్థాయి హ్యాకర్లతో పరిచయమైంది. పీయూసీ తరువాత ఉన్నత విద్య కోసం నెదర్లాండ్‌కు వెళ్లడంతో అందులో నిష్ణాతునిగా మారాడు. అక్కడి హ్యాకర్లతో గొడవలు వచ్చి తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. పెద్దవాళ్లతో స్నేహం.. తెలివితేటలను ఉపయోగించి నగరంలో ప్రముఖ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ పోలీస్ అధికారులు, వారి పిల్లలతో స్నేహం పెంచుకున్నాడు. యుబీ సిటీలో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు నలపాడ్, విద్వత్ అనే యువకునిపై దాడిచేసిన సమయంలో శ్రీకి కూడా ఉన్నాడు. దాంతో కొన్నాళ్లు పరారయ్యాడు. డబ్బు కొల్లగొట్టి విలాసాలు.. బెంగళూరులో మకాం వేసి ప్రభుత్వ వెబ్సైట్లు, టెండర్లను హ్యాక్ చేసేవాడు. తద్వారా కోట్లాది రూపాయలను కొల్లగొట్టి స్టార్ హోటళ్లు, క్రూయిజ్ ఓడల్లో, విమానాల్లో విలాసంగా గడపడం ఇతని నైజం. అయితే గత జనవరిలో సీసీబీ పోలీసులు శ్రీకిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే క్రిప్టో కరెన్సీ దందా వెలుగుచూసింది. ఇతని అకౌంట్లలో ఉన్న సుమారు రూ.9 కోట్ల విలువచేసే బిట్కాయిన్ల సీజ్ చేశారు. కొన్నినెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యాడు. -
పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్.. కారణం ఇదేనా?
ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ ట్విట్టర్లో తన డిస్ప్లే పేరును మార్చుకున్నాడు. టెస్లా కంపెనీలో తన షేర్లను అమ్మేయాలనుకుంటున్నాను అని ప్రకటించిన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేమ్ ఛేంజ్ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని అయిన ఎలన్‌మస్క్ తీరు మిగిలిన బిజినెస్ టైకున్లకు భిన్నంగా ఉంటుంది. సంప్రదాయ పద్దతులకు ఎప్పుడు సవాల్ విసరడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఆ పరంపరలోనే అకస్మాత్తుగా ట్విట్టర్లో తన డిస్ప్లే నేమ్‌ని ఎలన్ మస్క్ బదులుగా లార్డ్ ఎడ్జ్ (Lorde Edge)గా మార్చేసుకున్నారు. Much is made lately of unrealized gains being a means of tax avoidance, so I propose selling 10% of my Tesla stock. Do you support this? — Lorde Edge (@elonmusk) November 6, 2021 తికమక పడ్డ యూజర్లు ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్లో 60.20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఉన్నట్టుంటి తమ లిస్టులో ఈ లార్డే ఎడ్జ్ ఎవరా అని విస్తుపోయారు. అయితే డిస్ప్లే పేరును మాత్రమే మార్చుకున్న మస్క్ డిస్ప్లే పిక్చర్‌గా రాకెట్‌ను ఉంచుకోవడంతో కొద్ది సేపటికే ఎలన్‌మస్క్ అకౌంటే అని పోల్చుకున్నారు. షేర్లు అమ్ముతానంటూ మొదలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఎలన్‌మస్క్‌కి 17 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. ట్యాక్స్ ఇబ్బందులు తొలగించుకునేందుకు ఇందులో పది శాతం షేర్లను అమ్మలని ఆలోచిస్తున్నట్టు.. ఈ నిర్ణయానికి మీరు మద్దతిస్తారా ? అంటూ నవంబరు 6న ట్విట్టర్లో ఎలన్ మస్క్ తన ఫాలోవర్లను కోరారు. ఎలన్ మస్క్ ప్రశ్నకు ఫాలోవర్లు భారీ స్థాయిలో స్పందిస్తున్న క్రమంలో ఆయన డిస్ప్లే పేరు మార్చేశారు. పేరు మార్పుకు గల కారణాలను ఎక్కడా వివరించలేదు. ఆ పద్దతిలో ప్రచారం అయితే డాగీకాయిన్ కో ఫౌండర్ షిబేతోషి నకమోటో ఈ పేరు మార్పుపై స్పందించారు. డాగీ కాయిన్ (Dogecoin)కి అనగ్రామ్ ( ఒక పదంలో ఉన్న అక్షరాలతో మరో పదం రాయడం)గా ఎలన్‌మస్క్ లార్డ్ ఎడ్జ్ (Lorde Edge) అని పెట్టుకున్నట్టు విశ్లేషించారు. బిట్‌కాయిన్, ఇథరమ్ తదితర క్రిప్టోకరెన్సీలు రాజ్యమేలుతున్న సమయంలో ఎలన్‌మస్క్ కొత్తగా వచ్చిన డాగీకాయిన్లో పెట్టుబడులు పెట్టారు. దీంతో డాగీకాయిన్ విలువ అమాంతం పెరిగిపోవడమే కాకుండా ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. lorde edge is an anagram for elder doge — Shibetoshi Nakamoto (@BillyM2k) November 8, 2021 గతంలో తను పెట్టుబడులు పెట్టిన డాగీ కాయిన్‌కి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా ఎలన్‌మస్క్ అనాగ్రామ్ పద్దతిలో లార్డ్ ఎడ్జ్ అని పేరు పెట్టుకున్నాడనే వివరణ సరిగానే ఉందని అంతా నమ్ముతున్నారు. గతంలో 2019లో కూడా ట్విట్టర్ డిస్ప్లే నేమ్‌ని 1గా పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఎలన్ మస్క్. షేర్లు అమ్మేయండి ఇక టెస్లా కంపెనీలో తన షేర్లను అమ్మాలా అంటూ ఎలన్ మస్క్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిపంచారు. ఇందులో ఎక్కువ మంది అంటే 57 శాతం మంది షేర్లు అమ్మేయాలంటూ సూచించారు. చదవండి:వెహికల్స్ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర్వాతే ఏదైనా -
క్రిప్టో ఇన్వెస్టర్లకు టోకరా ఇచ్చిన స్కిడ్ టోకెన్ డెవలపర్లు
-
Cryptocurrency: పేటీఎం.. బిట్ కాయిన్.. ఏం జరగబోతుంది ?
డిజిటల్ ప్లాట్ఫార్మ్పై ఫైనాన్షియల్ సర్వీసులు అందించే పేటీఎం సంస్థ తన మార్కెట్‌ను మరింత విస్త్రృతం చేసుకునే పనిలో ఉంది. వివాస్పద క్రిప్టోకరెన్సీ సేవలు దేశంలో ప్రారంభించేందుకు తాము సిద్ధమంటోంది. చాపకింద నీరులా ఆర్థిక రంగంలో ఎక్కువ మందికి అర్థం కాకపోయినా, చాలా మందికి పరిచయం లేకపోయినా సరే చాప కింద నీరులా మార్కెట్లో విస్తరిస్తోంది క్రిప్టో కరెన్సీ, పూర్తిగా డిజిటల్ రూపంలో ఉండే ఈ కరెన్సీతో పై స్థాయిలో భారీగానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్థిక నిపుణులు, బడా వ్యాపారవేత్తలు సైతం భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ హవా ఉంటుందంటున్నారు. కొందరు పెట్టుబడులు సైతం పెడుతున్నారు. క్రిప్టో కరెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేసే క్రిప్టోకరెన్సీ విభాగంలో అనేక డిజిటల్ కాయిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్ఆర్పీ, పొల్కడాట్ ఇలా అనేకం ఉన్నాయి. వీటిలో బిట్ కాయిన్ వరల్డ్ వైడ్‌గా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో బాగా ఫేమస్. ముందుగా బిట్‌కాయిన్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీకి చట్టపరమైన అనుమతులు ఇస్తే బిట్ కాయిన్ ట్రేడింగ్‌కి తాము సిద్దమేనంటూ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ప్రకటించింది. ‘ ప్రభుత్వం దృష్టిలో క్రిప్టో కరెన్సీ ఇంకా గ్రే ఏరియాలో ఉంది. ఈ ఏరియా నుంచి తొలగించి, చట్టపరమైన అనుమతులు ఇస్తే ముందుగా బిట్‌కాయిన్‌ని పేటీఎంలో అందుబాటులో ఉంచుతాం’ అని పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మధుర్ దేవ్రా తెలిపారు. సుప్రీం తీర్పుతో ప్రభుత్వ నిబంధనలకు లోబడని క్రిప్టో కరెన్సీతో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో.. ఈ తరహా లావాదేవీలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2020 మార్చిలో తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు లేదు. అయితే ఈ మార్కెట్‌పై ఉత్సాహం ఉన్న అనేక మంది రిస్క్ తీసుకుని క్రిప్టోపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. రక్షణపై సందేహాలు స్టాక్ మార్కెట్, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహాణలు అన్నీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరుగుతుంటాయి. ఇందులో మోసాలను అరికట్టి వ్యవస్థ సాఫీగా సాగిపోవడానికి అనుగుణంగా పలు ప్రభుత్వ విభాగాలు పని చేస్తుంటాయి, అయితే సాధారణంగా బిగ్ ప్లేయర్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటారు. చట్టాలకు చిక్కకుండా నిఘా నేత్రం ఆవల వీరు మార్కెట్‌ని మానిప్యులేట్ చేస్తారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల ప్రభావం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆజమాయిషీ కూడా ఉండదు. దీంతో ఇందులో పెట్టే డబ్బులకు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా రక్షణ ఉండదు. అందువల్ల క్రిప్టో కరెన్సీ భద్రతపై అనేక సందేహాలు ఉన్నాయి. చదవండి:బ్యాంకుల్లో క్రిప్టో కరెన్సీపై ట్రాన్సాక్షన్లు, మాస్టర్ కార్డ్ గ్రీన్ సిగ్నల్ -
బ్లాక్‌చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్‌కు భరోసా
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలు! ఆర్థిక రంగానికి వెన్నెముకగా భావించే బ్యాంకింగ్ మొదలు సేవల రంగం వరకూ.. అన్నింటా ఆన్లైన్ కార్యకలాపాలే!! ఇలాంటి పరిస్థితుల్లో.. సదరు లావాదేవీలను పారదర్శకంగా.. ఎలాంటి లోపాలు లేకుండా.. హ్యాకింగ్‌కు గురికాకుండా నిర్వహించాల్సిన పరిస్థితి! ఇది ప్రత్యేకమైన సాంకేతికతతోనే సాధ్యం! అదే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ!! అందుకే.. ఇప్పుడు బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సంస్థలు నైపుణ్యాలున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి.. ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు.. వినియోగిస్తున్న రంగాలు..అవసరమైన నైపుణ్యాలు.. అందుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. లావాదేవీలు వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తూ.. ఎలాంటి అవకతవకలు జరగకుండా.. హ్యాకింగ్‌కు గురికా కుండా..సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచేదే.. బ్లాక్ చైన్ టెక్నాలజీ. ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక పరమైన లావా దేవీలు, భూముల రిజిస్ట్రేషన్, క్రిప్టో కరెన్సీ వంటివి ఆన్లై న్లోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ రక్షణ కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేక రంగాలకు విస్తరించింది. పటిష్ట సైబర్ రక్షణ నిర్దిష్టంగా ఒక లావాదేవీని వికేంద్రీకృత వ్యవస్థలో పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వినియోగం, దానికి సంబంధించిన అప్లికేషన్స్‌పై పెద్ద కస రత్తే జరుగుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక పటి ష్టమైన సైబర్ రక్షణ వ్యవస్థగా పేర్కొనొచ్చు. ఏదైనా ఒక విలువైన లావాదేవీని నిర్వహించే సమయంలో.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాకింగ్‌కు గురి కాకుండా భద్రత కల్పించే టెక్నాలజీ ఇది. సదరు లావాదేవీ నిర్వహణలో పాల్పం చుకునే వ్యక్తులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిరోధించే డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్‌గా ఇది నిలుస్తోంది. వికేంద్రీకృత వ్యవస్థ బ్లాక్ చైన్ టెక్నాలజీ.. వికేంద్రీకృత విధానంలో.. లావా దేవీలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. నగదు నిర్వహణ లేదా రుణ మంజూరు వంటి విషయాల్లో అనేక దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో వ్యక్తి/అధికారి కీలక పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఏదో ఒక దశలో ఎక్కడో ఒక చోట అవక తవకలకు ఆస్కారం ఉంటుంది. కానీ అదే లావాదేవీని బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో నిర్వహిస్తే..ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో.. ప్రతి లావాదేవీలో భాగస్వా ములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతా యి. ఒక బ్లాక్‌లో ఉన్న వారితో కొత్త లావాదేవీ జరిగితే.. అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ చైన్ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్‌లో ఏ బ్లాక్‌లోనైనా.. ఏ చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌లో నమోదవుతుంది. ఇది సదరు నెట్‌వర్క్‌లో నిక్షిప్తం అవుతుంది. దీంతో..ఏదైనా తేడా వస్తే.. సదరు చైన్‌లోని వారందరికీ తెలిసిపోతుంది. అం టే.. ఏ స్థాయిలోనూ ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతంగా, అనధికారికంగా, ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా మోసాలు అరికట్టేందుకు సాధ్యమవుతుంది. ఒకవేళ సదరు లావాదేవీలో.. ఏదై నా మార్పు చేయాల్సి వస్తే.. సదరు డిస్ట్రిబ్యూటెడ్æనెట్ వర్క్‌లోని అధీకృత అధికారులు లేదా వ్యక్తులందరూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా హ్యాష్ ‘కీ’ పేరిట పాస్వర్డ్ కేటాయిస్తారు. అన్ని రంగాలకు విస్తరణ వాస్తవానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీని.. దశాబ్ద కాలం క్రితమే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం రూపొందించారు. క్రిప్టో కరెన్సీలో వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు ఉండవు. అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. దీనికి సంబంధించి సైబర్ దాడుల నుంచి రక్షణతోపాటు, అవకతవకలు జరగకుండా ఈ టెక్నాలజీని వినియోగించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ పనితీరు అత్యంత సమర్థంగా ఉండ టంతో.. ఇతర రంగాలు దీన్ని అందిపుచ్చుకుంటు న్నాయి. ముఖ్యంగా నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్ రంగం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రిటైల్, ఈ-కామర్స్, మొబైల్ వ్యాలెట్స్, హెల్త్‌కేర్ విభాగాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో సైతం ఇటీవల కాలంలో బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రధానం గా భూముల రిజిస్ట్రేషన్స్‌లో ఈ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల సంఘం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయం తో.. ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు, ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది. హెల్త్‌కేర్ రంగంలో.. రోగులకు నిర్వహించే పరీక్షల వివరాలను బ్లాక్‌చైన్ టెక్నాలజీ విధానంలో నమోదు చేస్తున్నారు. ఫలితంగా పారదర్శకంగా సదరు పరీక్షల నిర్వహణతోపాటు సమయం వృథా కాకుండా.. బ్లాక్ చైన్ టెక్నాలజీ దోహదపడుతోంది. కెరీర్ స్కోప్ ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ ఊపందుకుంది. సంస్థలు ఆన్లైన్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులను నియమించు కుంటున్నాయి. 2022 నాటికి అంతర్జాతీయంగా ఐటీ రంగంలోని కొలువుల్లో దాదాపు పదిహేను శాతం బ్లాక్ చైన్ టెక్నాలజీ విభాగంలోనే ఉంటాయని అంచనా. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఆయా రంగాల్లోని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను, ప్రోగ్రామ్స్‌ను రూపొందించడం తప్పనిసరిగా మారు తోంది. ముఖ్యంగా క్రిప్టోగ్రఫీ నెట్వర్క్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, గేమ్ థియరీ వంటి వాటికి సంబంధించి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పొందాలి. సాలిడిటీ ప్రోగ్రా మింగ్ నేర్చుకోవడం ద్వారా కూడా అవకాశాలు అందుకునే వీలుంది. కంప్యూటర్ సైన్స్‌కు అనుకూలం బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగం.. కంప్యూటర్ సైన్స్ విద్యా ర్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్ చైన్ టెక్నాలజీని రూపొందించడానికి అవసరమైన ప్రోగ్రా మింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్స్, జావా, ఆర్, పైథాన్ వంటివి సీఎస్ఈ విద్యార్థులు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో సీఎస్ఈ అభ్యర్థులు బ్లాక్‌చైన్ రంగంలో రాణించేందుకు వీలుంటుంది. ప్రత్యేక కోర్సులు బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. దాంతో విద్యాసంస్థలు.. బ్లాక్‌చై న్పై ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–హైదరాబాద్, ఐఐటీ-ముంబై వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. అదే విధంగా బ్లాక్‌చైన్ కౌన్సిల్, గవర్నమెంట్ బ్లాక్‌చైన్ అసోసియేషన్, సెంట్రల్ బ్లాక్‌చైన్ బాడీస్ ఆఫ్ అమెరికా, ఇతర మూక్స్ సైతం ఆన్లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నాయి. ఉద్యోగాలు గ్లాస్ డోర్ సంస్థ అంచనాల ప్రకారం-అంతర్జాతీయ స్థాయిలో బ్లాక్ చైన్ రంగంలో ఉద్యోగాలు గత ఏడాది మూడు వందల శాతం పెరిగాయి. మొత్తం ఉద్యోగాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అదే విధంగా లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం-2020లో టాప్ మోస్ట్ జాబ్ సెర్చెస్‌లో బ్లాక్ చైన్ ముందంజలో నిలవగా.. బ్లాక్ చైన్ డెవలపర్ ఉద్యోగాలు 330 శాతం పెరిగాయి. బ్లాక్ చైన్.. జాబ్ ప్రొఫైల్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో.. బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, బ్లాక్ చైన్ యుఎక్స్ డిజైనర్, క్వాలిటీ ఇంజనీర్, కన్సల్టెంట్, బ్లాక్ చైన్ లీగల్ కన్సల్టెంట్, బ్లాక్ చైన్ ఇంజనీర్, అనలిస్ట్,సెక్యూరిటీ మేనేజర్, కమ్యూనిటీ మేనేజర్, జూని యర్ డెవలపర్స్ తదితర జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఉపాధి వేదికలు ఇండియన్ బ్లాక్ చైన్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో.. ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్ రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్-46 శాతం, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ మాన్యు ఫ్యాక్చరింగ్-12 శాతం, ఎనర్జీ అండ్ యుటిలిటీస్-12 శాతం,హెల్త్‌కేర్-11 శాతం, ప్రభుత్వ విభాగాలు-8 శాతం, రిటైల్ అండ్ కస్టమర్ సర్వీసెస్-4 శాతం, ఎంటర్టైన్ మెంట్ అండ్ మీడియా-1శాతం మేర అవకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ స్కిల్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. దీనికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై అవగాహన తప్పనిసరి. ప్రాథమికంగా కోడింగ్ స్కిల్స్, సి++, డాట్ నెట్, ఎక్స్ఎంఎల్, పైథాన్, డెవ్ అప్స్, జనరిక్ ఎస్క్యూ ఎల్, హెచ్‌టీఎంఎల్, డేటాసైన్స్, నెట్ వర్క్ ప్రొటోకాల్స్, యూఐ డిజైన్ తదితర స్కిల్స్ ఉండాలి. -
క్రిప్టోపై కర్ర పెత్తనం? ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై రాష్ట్రీయ స్వయం సేవక్ కన్నెర్ర చేసింది. దేశంలో క్రమంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం నియంత్రించాలంటూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ డిమాండ్ చేశారు. విజయదశమిని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు దసరా పండుగ రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఓటీటీ కంటెంట్, డ్రగ్స్ వినియోగం, జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రించాలి ‘బిట్ కాయిన్లను ఏ దేశం, ఏ వ్యవస్థ దాన్ని నియంత్రించగలదో నాకు తెలియడం లేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ అప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాను మించి తాజాగా వెల్లడైన గణాంకాల్లో అమెరికాను మించి ఇండియాలో క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం పెరుగుతోంది. మరో రెండు మూడేళ్లలో యూరప్‌ని సైతం వెనక్కి నెట్టేలా క్రిప్టో ఇండియాలో దూసుకుపోతుంది. యువతలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పట్ల క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో సైతం బిట్‌కాయిన్, ఈథర్నెట్ తదితర కాయిన్లు వర్చువల్‌గా చలామనీ అవుతున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీ వ్యవస్థ మన ప్రభుత్వం దగ్గర నిర్థిష్టమైన విధానమంటూ లేదు. ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భద్రతపై సందేహాలు సాధారణ మార్కెట్లో మనుషుల పెత్తనం, ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో వీటిని శక్తివంతమైన వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీని వల్ల మిగిలినవారు నష్టపోయే ప్రమాదం ఉంది. క్రిప్టో కరెన్సీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇక్కడ మనుషులు, ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బుకి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. అందువల్ల క్రిప్టో ట్రేడ్‌పై అనేక సందేహాలు ఉన్నాయి. చదవండి :బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు -
‘కుబేర్’కు యూనికార్న్ హోదా
ముంబై: క్రిప్టో ఎక్సే్ఛంజీ నిర్వాహక స్టార్టప్ కాయిన్‌స్విచ్ కుబేర్ యూనికార్న్‌గా అవతరించింది. కంపెనీ విలువ బిలియన్ డాలర్లను తాకడంతో ఈ హోదాను పొందింది. పీఈ దిగ్గజాలు ఇతర సంస్థల నుంచి తాజాగా 26 కోట్ల డాలర్లు(రూ. 1,943 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 1.9 బిలియన్ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు బలపడింది. వెరసి క్రిప్టో ఎక్సే్ఛంజీ సంస్థలలో రెండో యూనికార్న్‌గా నిలిచింది. ఇంతక్రితం కాయిన్‌డీసీఎక్స్ సైతం బిలియన్ డాలర్ల విలువను అందుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2021)లో క్వాయిన్‌స్విచ్ కుబేర్ 30వ యూనికార్న్ స్టార్టప్‌గా ఆవిర్భవించడం విశేషం! క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ సంస్థలు సానుకూలంగా లేనప్పటికీ పెట్టుబడులు వెల్లువెత్తడం గమనార్హం! కాయిన్‌స్విచ్ కుబేర్‌లో ఆండ్రిస్సేన్ హోరోవిట్జ్(ఏ16జెడ్), కాయిన్‌బేస్ వెంచర్స్ తాజాగా ఇన్వెస్ట్ చేశాయి. వీటితోపాటు కంపెనీలో ఇప్పటికే వాటాదారులుగా కొనసాగుతున్న పారాడిగ్‌్మ, రిబ్బిట్ క్యాపిటల్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించాయి. కాగా.. బిట్‌కాయిన్ తదితర ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేయడంతోపాటు.. ఇటీవల ప్రభుత్వ దృష్టికి సైతం తీసుకెళ్లింది. వీటి ట్రేడింగ్‌లో అత్యధిక హెచ్చుతగ్గులు, పారదర్శకత లోపించడం వంటి అంశాలను ప్రస్తా వించింది. తాజాగా సమీకరించిన నిధులను క్రిప్టోకు ప్రాచుర్యాన్ని కలి్పంచడం, 5 కోట్ల మందికి ప్లాట్‌ఫామ్‌ను చేరువ చేయడం తదితర లక్ష్యాలకు వెచి్చంచనున్నట్లు కాయిన్‌స్విచ్ కుబేర్ తెలియజేసింది. లిషియస్ సైతం.. తాజా మాంసం, సీఫుడ్ బ్రాండ్ ఆన్లైన్ విక్రయాల స్టార్టప్ లిషియస్ సైతం యూనికార్న్ హోదాను పొందింది. 5.2 కోట్ల డాలర్లు(రూ. 389 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ తాజాగా బిలియన్ డాలర్లకు(రూ. 7,473 కోట్లు) చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఈ బెంగళూరు సంస్థ డైరెక్ట్ టు కన్జూమర్(డీటూసీ) విభాగంలో తొలి స్టార్టప్‌గా ఈ హోదాను సాధించినట్లు తెలియజేశాయి. సిరీస్ జీలో భాగంగా ముంబై సంస్థ ఐఐఎఫ్ఎల్ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు లిషియస్ వెల్లడించింది. మూడు నెలల క్రితమే కంపెనీ 3వన్4 క్యాపిటల్, టెమాసెక్ తదితరాల నుంచి 19.2 కోట్ల డాలర్లు సమకూర్చుకున్నట్లు టెక్‌క్రంచ్ తెలియజేసింది. దీంతో 65 కోట్ల డాలర్ల విలువను కంపెనీ అందుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ దేశవ్యాప్తంగా 14 నగరాలలో మాంసం, సీఫుడ్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
చైనా మూర్ఖపు నిర్ణయంతో..
China Crackdown Crypto Trading: అంతర్జాతీయ మార్కెట్లో రారాజుగా మారాలన్న చైనా ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. స్వీయ అపరాధాలతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. మరోవైపు చైనా కుబేరులు సైతం నష్టాల్ని చవిచూస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండడం చైనాకు మింగుడు పడడం లేదు. ఈ తరుణంలో డ్రాగన్ కంట్రీ చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ట్రేడింగ్‌లో క్రిప్టో కరెన్సీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీని నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది చైనా. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని వాదిస్తున్న చైనా.. వీలైనంత త్వరలో తమ దేశంలో నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. మరోవైపు క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది. పడిపోయిన టోకెన్ ధరలు డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డ్రాగన్ కంట్రీ ప్రకటన.. డిజిటల్ ట్రేడ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. వర్చువల్ కరెన్సీ విలువల్లో విపరీత మార్పులు తెచ్చింది. క్రిప్టోకరెన్సీల విలువ(బిట్ కాయిన్, ఎథెరియమ్)లు ఒక్కసారిగా పడిపోయింది. బిట్‌కాయిన్ విలువ ఐదు శాతం పడిపోయి 42,232 డాలర్లకు చేరింది. ఇక రెండో అతిపెద్ద టోకెన్‌గా పేరున్న ఎథెరియమ్ విలువ 6.3 శాతం డ్రాప్ అయ్యి 2,888కు చేరింది. సోలానా 6.9శాతం తగ్గిపోయి 134 డాలర్లకు చేరింది. ఇక లైట్‌కాయిన్ విలువ 5.9 శాతం తగ్గి 149 డాలర్లకు చేరుకుంది. కార్డానో విలువ 2.4 శాతం పడిపోయి.. 2.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది. చైనా అభ్యంతరాలు క్రిప్టో కరెన్సీ లావాదేవీల మనుగడ దేశీయ మార్కెట్‌కు నష్టమని చైనా అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. విదేశీ సంస్థలు అందించే క్రిప్టో సేవలు అక్రమమైనవేనని పేర్కొంది. అదే సమయంలో దేశంలో బిట్‌కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి చైనా సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. ► డిజిటల్ ట్రేడింగ్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ► ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్ల ప్రోత్సాహంతో.. జనాలు సైతం ఈ-కరెన్సీపై నమ్మకం పెంచుకుంటున్నారు. ► ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్ని అనుమతిస్తున్నాయి. ► చైనా అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మార్కెట్ కూడా. ► అయినప్పటికీ చైనా మాత్రం క్రిప్టో కరెన్సీని అంగీకరించడం లేదు ► ఆర్థిక వ్యవస్థకు ఒరిగేదీ ఏమి లేదని, పైగా వర్చువల్ కరెన్సీ వల్ల కార్బన్ ఉద్గారాలు ఉధృతంగా ఉత్పత్తి అవుతాయని సొల్లు కారణాలు చెబుతోంది. ► మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్‌కాయిన్ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ► నిషేధ నిర్ణయం గనుక అమలు అయితే.. భారీగా నష్టపోయేది ముందుగా చైనానే! చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీ! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు ఇదీ చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
చైనా దెబ్బకు భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్‌కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్‌కాయిన్ కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్‌కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. సెప్టెంబర్ 20న 43,000 డాలర్లుగా ఉన్న ధర నిన్న ఒక్కసారిగా సుమారు 40000 డాలర్లకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా డెవలపర్ ఎవర్‌గ్రాండే సంక్షోభంలో కూరుకు పోవడమే అని నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ మార్కెట్ పై ఈ ప్రభావం కొద్ది రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అని విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న ఈటీహెచ్ విలువ కూడా 5.07 శాతం క్షీణించింది. ఎథెరియం బ్లాక్ చైన్ అధికారిక క్రిప్టోకరెన్సీ. ఈథర్ ప్రస్తుత మారకం విలువ సుమారు 3,000 డాలర్లుగా ఉంది. చైనా డెవలపర్ ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్ల సంపదకు గండి కొట్టింది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు.(చదవండి: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...!) -
Cryptocurrency: ఆర్బీఐ ఆందోళన.. నిర్ణయం కేంద్రం పరిధిలో
ముంబై: బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐకి తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నట్లు కూడా గవర్నర్ పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్రానికి తెలిపినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ స్థిరత్వ కోణంలో ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోందని అన్నారు. ఇక దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం కేంద్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. రెండు ఆంగ్ల పత్రికలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో శక్తికాంత్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఎకానమీ వృద్ధిరేటు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతంగా నమోదవుతుందన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ వ్యక్తం చేశారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా క్రమంగా 4 శాతానికి దిగివస్తుందన్న ధీమాను కూడా ఆయన వెలిబుచ్చారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అని ఆయన అన్నారు. ►సెకండ్‌వేవ్ తర్వాత సడలించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందన్న సంకేతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పలు ఇండికేటర్ల నుంచి సానుకూల గణాంకాలు వెలువడుతున్నాయి. ►ప్రతి త్రైమాసికం అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఎకానమీ పురోగమిస్తోంది. జూన్ త్రైమాసికంకన్నా సెప్టెంబర్ త్రైమాసికంలో పరిస్థితులు మరింత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నాం. ►ద్విచక్ర వాహనాలు, పాసిజర్ కార్ల అమ్మకాలు పెరిగాయి. జీఎస్టీ, ఈ–వే బిల్లుల తీరు బాగుంది. విద్యుత్ వినియోగం, ట్రాక్టర్ అమ్మకాల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ ఎకానమీకి శుభ సూచికలే. ►ఇప్పుడు ఆందోళనఅంతా మూడవ వేవ్ రావచ్చన్న విశ్లేషణల వల్లే. ఇటువంటి సంక్షోభాలను, అవాంతరాలను తట్టుకొని ఎలా నిలబడాలన్న అంశాన్ని ఇంకా వ్యాపార సంస్థలు నేర్చుకోలేదు. ►రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది ఆర్బీఐకి కేంద్రం నుంచి నిర్దేశం. ఈ శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని భావిస్తున్నాం. ఈ అంశాన్ని అత్యంత జాగరూకతతో పరిశీలిస్తున్నాం. ►అధిక కమోడిటీ ధరలు, సరఫరాల్లో సమస్యలు ఇంకా ద్రవ్యోల్బణాన్ని ఎగువన ఉంచుతున్నాయి. ఈ అంశాల్లో సవాళ్లును ఎలా ఎదుర్కొనాలన్న అంశాలపై ప్రభుత్వంతో నిరంతరం ఆర్బీఐ చర్చిస్తుంది. వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు తగ్గించడానికి కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. ►సెకండ్‌వేవ్ సవాళ్లు వచ్చినప్పటికీ, జూన్ త్రైమాసికంలో మొండి బకాయిలు స్థిరంగా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో 7.5 శాతం స్థూల ఎన్పీఏలు ఉంటే, నాన్– బ్యాంకింగ్ విషయంలో ఇది ఇంతకన్నా తక్కువగా ఉంది. ►దివాలా కోడ్ పనితీరు మరికొంత మెరుగుపడాలన్న వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఇందుకు కొన్ని చట్ట సవరణలు చేయాలి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదిస్తున్న ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎకానమీ, ద్రవ్యోల్బణం తీరిది... కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! -
Cryptocurrency: ప్రత్యేక ఆస్తిగా క్రిప్టో కరెన్సీ !
న్యూఢిల్లీ: క్రిప్టోలు కరెన్సీ కాదని.. అదే సమయంలో వీటిని ఒక ప్రత్యేక అసెట్‌గా (ఒక ఆస్తి/పెట్టుబడి సాధనం) గుర్తించి, నియంత్రించాలన్న అభిప్రాయాన్ని మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వ్యక్తం చేశారు. వర్చువల్ కరెన్సీల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు మార్గంగా ఆయన దీన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. కరెన్సీ అంటే దానికి చట్టబద్ధత ఉంటుందని.. కనుక క్రిప్టోలు కరెన్సీ కాదన్న విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నట్టు గాంధీ చెప్పారు. క్రిప్టోలను ఒక ఆస్తిగా పరిగణించాలని కానీ.. చెల్లింపుల సాధనం, కరెన్సీ, ఆర్థిక సాధనంగా పరిగణించకూడదన్న సాధారణ అంగీకారం విధాన నిర్ణేతల్లో ఉన్నట్టు తెలిపారు. ఎందుకంటే క్రిప్టోలను జారీ చేసే వ్యక్తుల కచ్చితమైన గుర్తింపు లేదన్నారు. ‘‘కనుక దీన్ని ఒక ఆస్తిగా అర్థం చేసుకుని, ఆమోదించేట్టు అయితే.. నియంత్రించడం సులభం అవుతుంది’’ అని గాంధీ చెప్పారు. ప్రభుత్వాల నియంత్రణల పరిధిలో లేకపోతే క్రిప్టోలు నేరపూరిత కార్యకలాపాలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని సంఘటనలు దీన్ని సూచిస్తున్నాయన్నారు. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! -
Crypto Currency: గజిబిజి గందరగోళం.. ఉద్యోగాలు బోలెడు!
క్రిప్టో కరెన్సీ... ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం.ఇన్వెస్టర్లు క్రమంగా కొత్త తరహా ఆర్థిక వ్యవస్థకు అలవాటు పడుతున్నారు. అయితే భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పది వేల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇండియాలో కేవలం క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పుంజుకుంటాయని దీని వల్ల దేశవ్యాప్తంగా పది వేల వరకు నూతన ఉద్యోగాలు సృష్టించడతాయని ప్రముఖ నియామకాల సంస్థ జెనో పేర్కొంది. ప్రస్తుతానికి ఇండియాలో క్రిప్టో కరెన్సీలో పెద్దగా ఉద్యోగాలు లేవని, కానీ భవిష్యత్తు అలా ఉండబోదంటూ తెలిపింది. యాపిల్, అమెజాన్ వంటి సంస్థలు సైతం క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాయని తెలిపింది. ఇక్కడే ఎక్కువ క్రిప్టో కరెన్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో గుర్‌గ్రామ్, బెంగళూరు, ముంబైలు ప్రధాన కేంద్రాలుగా మారుతాయంటూ జోనో సంస్థ అభిప్రాయపడింది. దేశంలో క్రిప్టో కరెన్సీలో వచ్చే ఉద్యోగాల్లో 60 శాతానికి పైగా జాబ్స్ ఈ మూడు నగరాల పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది. నైపుణ్యం తప్పనిసరి క్రిప్టో కరెన్సీలో రంగంలో భారీ వేతనంతో ఉద్యోగం పొందాలంటే సాధారణ మెలకువలు సరిపోవడని జెనో తెలిపింది. క్రిప్టో కరెన్సీ నిర్వాహణకు అవసరమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ ఇంజనీరింగ్, రిపిల్ ఎక్స్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించింది. క్రిప్టో కరెన్సీ కోడ్లను ఉపయోగిస్తూ గజిబిజిగా గందరగోళంగా ఓ సమాచారాన్ని క్షేమంగా, రహస్యంగా చేర్చడం లేదా భద్రపరచాడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. అదే పద్దతిలో క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ వర్చువల్ కరెన్సీతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2009లో తొలి క్రిప్టో కరెన్సీగా బిట్ కాయిన్ రాగా ఆ తర్వాత వందల కొద్ది బిట్కాయిల్లు చలామనిలోకి వచ్చాయి. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, బ్యాంకులకు ఆవల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. చదవండి: క్రిప్టో.. కొలువుల మైనింగ్! -
Sunny Leone: మెగాస్టార్ తర్వాత సన్నీ లియోన్
అడల్ట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని.. ఆపై హిందీ బిగ్‌బాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సన్నీ లియోన్(కరణ్‌జిత్ కౌర్ వోహ్రా). మిగతా భాషల్లోనూ నటిగా, ఐటెం సాంగ్‌లతో అవకాశాలు అందిపుచ్చుకుంటోందామె. తాజాగా సన్నీ మరో ఫీట్ సాధించింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో నాన్-ఫంగిబుల్ టోకెన్స్(NFTs) వైపు అడుగులేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఫిమేల్ ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. ఈ మధ్యే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఈ ఘనత అందుకున్న తొలి సెలబ్రిటీగా నిలిచారాయన. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆస్తుల్ని వెనకేసుకునే పనిలో ఇప్పుడు సన్నీ లియోన్(40) కూడా తలమునకలైంది. ఇందుకోసం సన్నీ లియోన్.. సిలికాన్ వ్యాలీకి చెందిన మింట్డ్రోప్జ్తో చేతులు కలపింది. ప్రత్యేక వెబ్సైట్ తన ఆర్ట్ వర్క్‌కు చెందిన ఎన్ఎఫ్టీ కలెక్షన్లను(ఈథేరియం బ్లాక్ చెయిన్) వేలం వేయనుంది. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. అలా వీటిని నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. భారత్‌లో 2021 జూన్‌లో వాజిర్ ఎక్స్.. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లో అడుగుపెట్టిన మొదటి ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ టైంలో కాన్వాస్ ఆర్టిస్టులు, డిజిటల్ ఆర్టిస్టులు వాళ్ల టోకెన్లను అమ్ముకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే దేశంలో అమితాబ్ బచ్చన్ కంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్ఎఫ్టీ ఘనత దక్కించుకున్నారు. కానీ, అది వ్యక్తిగతంగా కాదు. శివాజీ ది బాస్ సినిమా 14 ఏళ్ల రిలీజ్ పూర్తైన సందర్భంగా మొన్న జులైలో ఇద్దరు టీనేజర్లు.. సినిమా పేరిట ఎన్ఎఫ్టీ కలెక్షన్‌ను ప్రారంభించారు. చదవండి: ఫ్రస్టేట్ జర్నలిస్ట్ వీడియో.. జాక్‌పాట్ -
Big B Amitabh: మరో ప్రయోగం.. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు చేయనిది!
బిగ్‌బి అమితాబ్ బచ్చాన్ మరో కొత్త అధ్యాయానికి తెర లేపారు. వెండితెర రారాజుగా వెలిగి బుల్లితెర మీద కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన ఒకప్పటి ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ ఎవరికీ అంతు చిక్కని రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. ప్రయోగాలకు వెరవసి సాహసి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి సిద్ధమయ్యారు. Amitabh Bachchan NFT Collection : అతి త్వరలోనే అమితాబ్‌బచ్చన్ నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) కలెక్షన్ ప్రారంభించబోతున్నారు. తన ఆర్ట్ వర్క్, పర్సనల్స్కి సంబంధించిన కలెక్షన్స్‌ని ఎన్ఎఫ్టీలోకి తీసుకు వస్తున్న మొదటి ఇండియన్‌గా అమితాబ్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు రితీ ఎంటర్టైన్మెంట్, ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తున్న నో కోడ్ సంస్థలతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. నవంబర్‌లో అమితాబ్ బచ్చన్‌కి సంబంధించి ఎన్ఎఫ్టీలు అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వారు వాటిని వేలంలో దక్కించుకోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్కార్లును ఉపయోగించి ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు BeyondLife.Club ద్వారా వేలంలో పాల్గొనవచ్చని రితీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఎన్ఎఫ్టీ అంటే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులు, వ్యక్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. ట్రెండ్ మారుతోంది మనకు గాంధీజి ఉపయోగించిన కళ్లజోడు, స్వామి వివేకనంద రాసిన ఉత్తరం, పికాసో వేసిన పెయింటింగ్, టిప్పు సుల్తాన్ వాడిన కత్తి, సచిన్ వందో సెంచరీ చేసిన బ్యాట్, షారూక్ఖార్ వాడిన బైక్ ఇలా ప్రముఖులకు సంబంధించిన ఆర్ట్‌వర్క్ లేదా వారు ఉపయోగించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు. వీటి కోసం వేలం పాటలు అక్కడక్కడా జరిగేవి. కొన్ని సార్లు ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం సెలబ్రిటీలే ముందుకు వచ్చి తమకు సంబంధించిన వస్తువులు వేలంలో ఉంచేవారు. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ట్రెండ్ మారింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత తమ ఆర్ట్‌వర్క్‌లను సెలబ్రిటీలే నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)గా వేలంలో ఉంచుతున్నారు. అమితాబ్‌తో మొదలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పాలిగజ్ వంటి డీఫై యాప్‌లు స్టార్టప్‌లుగా ఉండగా ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం ఇండియాలో కార్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్న అమితాబ్‌ను ఎంచుకున్నాయి. బిగ్‌బి బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటూ క్రిప్టోకరెన్సీ, ఎన్ఎఫ్టీ అస్సెట్స్కి ఇండియాలో మార్కెట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అమితాబ్‌కి సంబంధించిన ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. మీకెం కావాలో అడగండి గతంలో వేలం పాటలో సాధారణంగా గతానికి సంబంధించిన వస్తువులు లేదా ఆర్ట్‌వర్క్‌ను వేలంలో ఉంచేవారు. ఈ ఎన్ఎఫ్టీలో మీకేం కావాలో అడగండి సెలబ్రిటీలు ఆ పని చేసి మీకు డిజిటల్ ఫార్మాట్లో మీకు మాత్రమే స్వంతం అయ్యేలా అందిస్తారంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారను. దీనిపై రితి ఎంటర్టైన్మెంట్ ఎండీ ఆరుణ్ పాండే మాట్లాడుతూ టెక్నాలజీకి తగ్గట్టుగా సెలబ్రిటీలు, సినితారలు వేగంగా మారిపోతున్నారు. ఈ ఎన్ఎఫ్టీల ద్వారా సెలబ్రిటీలకు ఆదాయం తెచ్చి పెట్టడంతో పాటు వారి అభిమానులకు విలువైన ఆస్తులు అందివ్వడమే మా లక్ష్యం అని చెప్పారు. అభిమానులు ఆలస్యం చేయకుండా బిగ్ బి నుంచి ఏం కోరుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి అంటూ కోరుతున్నారు. చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి.. -
ట్విటర్లో పరిచయం.. ఆపై వాట్సాప్.. చివరికి నమ్మకంగా
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తితో ట్విట్టర్ ద్వారా పరిచయం పెంచుకున్నారు దిల్‌షుక్‌నగర్‌కు చెందిన రాసూరి రాహుల్, అతడి భార్య. కొద్దిరోజుల పరిచయం అనంతరం వాట్సాప్ నంబర్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో గుజరాత్ వ్యాపారస్తుడు నీల్ పటేల్ తనకు చెందిన ‘స్క్వాస్ టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ’ కంపెనీ పేరుతో ట్విట్టర్లో క్రిప్టో కరెన్సీపై ఎడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రమోట్ చేసుకుంటున్నాడు. దీనికి ఆకర్షితులైన రాసూరి రాహుల్, అతడి భార్య నీల్ పటేల్‌ను సంప్రదించారు. రూ.12 లక్షలు నీల్ పటేల్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేశారు. అనంతరం ఫోన్‌కు స్పందించకపోవడంతో శుక్రవారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. రూ.10కోట్లు.. 300మంది బాధితులు గూగుల్ ద్వారా నీల్ పటేల్ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన రాహుల్‌కు పలు విషయాలు తెలిశాయి. తాము కూడా నీల్ పటేల్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేసి మోసపోయామని కొందరు గూగుల్‌లో రివ్యూలు రాశారు. ఇలా ఇప్పటి వరకు 300మంది నుంచి రూ.10కోట్ల మేర ఇన్వెస్ట్ చేయించి వారికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. నీల్ పటేల్‌పై ముంబై, కలకత్తా, ఢిల్లీ, పూణే వంటి నగరాల్లో కేసులు కూడా కేసులు నమోదైనట్లు రాహుల్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు వెల్లడించాడు. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది
Bitpanda CEO Eric Demuth Success Story: ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది’.. ఇదే జరిగింది ఎరిక్ డెమ్యూత్(34) లైఫ్‌లో. వృథా ఖర్చులకు వెనుకాడే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన కలను సైతం వదిలేసుకుని.. మరో దారిలోకి దిగాడు. విజయమో.. ఓటమో ఏదో ఒకటి తేల్చుకుని కెరీర్లో పోరాడాలనుకున్నాడు. అతని ప్రయత్నానికి అదృష్టం తోడైంది. ఒకప్పుడు జేబులో పాకెట్ మనీకి మూడు డాలర్లు పెట్టుకుని తిరిగిన కుర్రాడు.. ఇప్పుడు మిలియన్ల సంపదతో యూరప్‌ను శాసించే క్రిప్టో ట్రేడర్‌గా ఎదిగాడు మరి. బిట్‌పాండా.. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఓ సంచలనం. యూరప్‌లో క్రిప్టో కరెన్సీని ప్రధానంగా ప్రచారం చేసింది ఇదే. ఆస్ట్రియా-వియన్నా నియోబ్రోకర్గా ఉన్న ఈ కంపెనీ.. కామన్ పీపుల్‌కు క్రిప్టోకరెన్సీని చేరువచేసింది. డిజిటల్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్, బిట్‌కాయిన్‌ను హ్యాండిల్ చేయడం, డిజిటల్ ఆస్తుల కొనుగోలు-అమ్మకం, గోల్డ్ దాచుకోవడం, సేవింగ్స్.. ఇలా క్రిప్టో బిజినెస్ తీరుతెన్నులను సాధారణ పౌరులకు సైతం అర్థం అయ్యేలా చేసింది బిట్‌పాండా. ఈ ప్రత్యేకత వల్లే ఏడేళ్లు తిరగకుండానే యూరప్‌లో బిట్‌పాండా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బిట్‌పాండా విలువ సుమారు 4.1 బిలియన్ డాలర్లపైనే ఉండగా.. అందులో డెమ్యూత్ వాటా దాదాపు 820 మిలియన్ల డాలర్లు. కష్టజీవి వియన్నాకి చెందిన ఎరిక్ డెమ్యూత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నప్పటి నుంచే పొదుపరిగా ఉండే ఈ కుర్రాడు ఏనాడూ పైసా విదిల్చేవాడు కాదు. పైగా తన చిన్నతనంలో పేరెంట్స్ చేసే వృథా ఖర్చులపై నిలదీసేవాడు. అలాంటి ఎరిక్‌కు షిప్‌కు కెప్టెన్ కావాలని కల ఉండేది. అందుకే చెప్పాపెట్టకుండా 23 ఏళ్ల వయసులో కంటెయినర్ షిప్స్ మీద కూలీ పనికి వెళ్లాడు. చైనా, జపాన్.. నైరుతి ఆసియా ప్రాంతాల్లో పని చేశాడు. షిప్ కెప్టెన్ కావాలన్నది అతని కల. ఆ కల కోసం అలా ఎన్నాళ్లైనా కష్టం భరించాలనుకున్నాడు. ఒక్కపూట తిండి.. చాలిచాలని జీతంతో గడిపాడు. కానీ, రెండున్నరేళ్లు గడిచాక అతని వల్ల కాలేదు. మెకానిక్‌గా, యాంకర్లు వేసే కూలీగా సంచార జీవనం గడపడం అతనికి బోర్‌గా అనిపించింది. అందుకే ఆ ఉద్యోగం వదిలేశాడు. వియన్నాకు తిరిగి వచ్చేశాడు. ఈసారి ఫైనాన్స్ చదవులోకి దిగాడు. పౌల్ క్లాన్స్చెక్తో డెమ్యూత్ కాళ్లు అరిగేలా తిరిగి, ఒప్పించి.. ఫైనాన్స్ కోర్స్ పూర్తి చేశాక.. డిజిటల్ బిజినెస్ ఎక్స్పర్ట్ పౌల్ క్లాన్స్చెక్ను కలిశాడు డెమ్యూత్. వీళ్లిద్దరూ మరో ఫైనాన్స్ ఎక్స్పర్ట్ క్రిస్టియన్ ట్రమ్మర్తో కలిసి క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పీటర్ థెయిల్ ‘వాలర్’ వెంచర్స్ సాయం కోసం ప్రయత్నించారు. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. అయినా టైం వేస్ట్ చేయకుండా వాలర్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. వాళ్ల ప్రయత్నం థెయిల్ను ఆకట్టుకుంది. కొంతమేర పెట్టుబడులకు ముందుకొచ్చాడు. వారం తిరగకముందే 263 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో బిట్‌పాండా కంపెనీ మొదలైంది. ఇందులో డెమ్యూత్ ఖర్చు పెట్టకుండా దాచుకున్న సొమ్మంతా కూడా ఉంది. ఫలితం ఎలా ఉన్నా సరే.. ఇదొక బిజినెస్ పాఠం కావాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే.. ఏడేళ్లకు యూరప్ క్రిప్టో కరెన్సీతో డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తోంది ఆపరేటింగ్ ట్రేడ్ ప్లాట్‌ఫామ్ బిట్‌పాండా. మనిషి జీవితంలో అన్ని అనుకున్నట్లు జరుగుతాయన్న గ్యారెంటీ ఉందా?. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా మిగతా వాళ్లలాగే నాకు సరదాగా ఉండాలని ఉండేది. కానీ, వృథా ఖర్చులతో ఏం ఉపయోగం ఉండదని అర్థం చేసుకున్నా. నా లక్క్ష్యం ఒకటి ఉండేది. అది తప్పినా మరోదారిని ఎంచుకుని విజయం కోసం ప్రయత్నిస్తున్నా.(తనది పూర్తి విజయంగా ఒప్పుకోవట్లేదు డెమ్యూత్). నాలాగే చాలామందికి ఏదో సాధించాలనే తాపత్రయం ఉంటుంది. అందరికీ కల నెరవేర్చుకునేందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. లేదంటే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అలాంటప్పుడే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నవాళ్లం అవుతాం. - ఎరిక్ డెమ్యూత్ చదవండి: బిజినెస్ పాఠాలు నేర్పిన చిరంజీవి సినిమా తెలుసా? -
ఘరానా దొంగకే చీఫ్ సెక్యూరిటీ జాబ్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి గట్టి దెబ్బ కొట్టిన వైట్ హ్యాట్ మరో సంచలనం సృష్టించాడు. ఏ చోటైతే 12 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టాడో.. తిరిగి అదే సంస్థ నుంచి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీసర్ జాబ్ సంపాదించాడు. దోపిడి చేసిన వాడికి దండన విధించే అవకాశం ఇవ్వకుండా అతని మెడలో దండలు వేయాలని ఆ కంపెనీ ఎందుకు అనుకుంటోంది. దానికి గల కారణమేంటీ ? సాక్షి, వెబ్‌డెస్క్: డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలిగాన్ డిఫై యాప్ గత వారం హ్యాకింగ్‌కు గురైంది. ఈ యాప్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ భారీ ఎత్తున దోపిడి అయ్యింది. పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా అయ్యాయి. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్ తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. మంచిదొంగ బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్‌కి పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన హ్యాకర్ మరుసటి రోజే హ్యాకర్ సానుకూలంగా స్పందించి కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని పాలినెట్‌వర్క్ డిఫై యాప్‌లో జమ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ హ్యాకర్ని వైట్హ్యాట్గా పేర్కొటోంది బాధిత పాలినెట్ వర్క్. వైట్‌హ్యాట్ సాధారణంగా హ్యాకర్లు ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. హ్యాకర్లను సూచించేందుకు నల్లటోపీ లేదా హుడీ క్యాప్ ధరించి ముఖం సరిగా కనిపించని వ్యక్తి ఇమేజ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాలక్రమేనా హ్యాకర్లకు బ్లాక్‌హ్యాట్ పేరు స్థిరపడిపోయింది. అయితే ఇందులో బాధితుల మేలు కోరి హ్యాక్ చేసే వారు కూడా ఉంటారు. వీరిని ఎథికల్ హ్యాకర్లుగా పేర్కొంటారు. ఏదైనా సంస్థకు సంబంధించి సైబర్ సెక్యూరిటీలో లోపాలను బయటపెట్టేందుకు వీరు హ్యాక్ చేస్తుంటారు. వీరిని వైట్ హ్యాట్గా పేర్కొనడం రివాజుగా మారింది. సెక్యూరిటీ చీఫ్ ప్రస్తుతం పాలినెట్వర్క్ని హ్యాక్ చేసింది ఒక్కరా లేక కొంత మంది హ్యకర్ల గ్రూపా అనే అంశంపై స్పష్టత లేదు. ఐనప్పటికీ వైట్హ్యాట్ను ఒక్కరిగానే గుర్తిస్తూ పాలినెట్ వర్క్ కబురు పంపింది. మీరు హ్యాక్ చేయడం వల్ల మా డిఫై యాప్‌లోని లోపాలు తెలిశాయి. మీలాంటి నిపుణుల అవసరం మాకు ఉంది. కాబట్టి పాలినెట్వర్క్కి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా సేవలు అందివ్వాలని కోరింది. అంతేకాదు హ్యాక్ చేసిన సొమ్ములో ఐదు మిలియన్ డాలర్లను మీ ఖర్చు కోసం అట్టే పెట్టుకుని హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీలో మిగిలిన దాన్ని తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. #PolyNetwork has no intention of holding #mrwhitehat legally responsible and cordially invites him to be our Chief Security Advisor. $500,000 bounty is on the way. Whatever #mrwhitehat chooses to do with the bounty in the end, we have no objections. https://t.co/4IaZvyWRGz — Poly Network (@PolyNetwork2) August 17, 2021 ఇది ఎత్తుగడా? వైట్హ్యాట్కి పాలినెట్‌వర్క్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది మంది పాలినెట్ చర్యను స్వాగతిస్తుండగా మరికొందరు హ్యాక్ అయిన సొమ్మను రాబట్టుకునేందుకు పాలినెట్‌వర్క్ వేసిన ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. మరికొందరు హ్యాక్ చేసిన సొమ్ము వందల మిలియన్ డాలర్లు ఉండగా హ్యాకర్‌కు జాబ్‌తో పనేంటి అంటూ స్పందిస్తున్నారు. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
మంచి దొంగలు.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా?
Hackers Returning Crypto: డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అతి పెద్ద చోరీగా చెప్పుకుంటున్న పాలి నెట్వర్క్ హ్యాకింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి క్షణాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసిన హ్యాకర్లు. ఆ తర్వాత ఎందుకనో మెత్తపడ్డారు. అందులో దాదాపు సగం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. హ్యాకింగ్‌లో కొత్త రికార్డు పటిష్టమైన భద్రతా వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్‌చైయిన్ ఫ్లాట్‌ఫామ్‌పై నడిచే డీఫై యాప్ పాలినెట్వర్క్ను ఇటీవల హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్ నుంచి ఏకంగా 611 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 12 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేశారు. పాలినెట్‌వర్క్ నుంచి తమకు అనుకూలమైన ఖాతాలకు క్రిప్టో కరెన్సీని తరలించుకుపోయారు. క్షణాల్లో జరిగిన ఈ మెరుపు హ్యాకింగ్‌తో బిత్తరపోయిన పాలి నెట్వర్క ఆ తర్వాత తేరుకుంది. కొన్ని వేల మందికి సంబంధించిన డిజిటల్ కరెన్సీని కొట్టేయడం సరికాదని... దయ ఉంచి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ హ్యాకర్లను సోషల్ మీడియా వేదికగా హ్యాకర్లను పాలిగాన్ నెట్వర్క్ కోరింది. $260 million (As of 11 Aug 04:18:39 PM +UTC) of assets had been returned: Ethereum: $3.3M BSC: $256M Polygon: $1M The remainings are $269M on Ethereum, $84M on Polygon — Poly Network (@PolyNetwork2) August 11, 2021 హ్యాకర్ల మంచి మనసు పాలిగాన్ నెట్వర్క్ చేసిన విజ్ఞప్తికి హ్యాకర్లు స్పందించారు. తాము దారి మళ్లించిన సొత్తులో కొంత భాగాన్ని పాలి నెట్వర్క్ సూచించిన ఖాతాలో జమ చేశారు. కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్లు ఉన్నాయంటూ పాలినెట్ వర్క్ ప్రకటించింది. హ్యాకర్లు విడదల వారీగా సొమ్మును పాలిగాన్ నెట్వర్క్కి తిరిగి బదిలీ చేస్తున్నారు. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!
వర్చువల్ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్నాయక్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: గజేశ్ నాయక్, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను నెలకొల్పిన బిజినెస్ యాప్ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్ కాకుండానే గజేశ్ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్. చదువులో దిట్ట గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్ హై స్కూల్ చెందిన గజేశ్ నాయక్ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్ రెడీ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్, జావా స్క్రిప్ట్, సోలిడిటీలలో ఆరితేరాడు. క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్ గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ సమావేశాల్లో గజేశ్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్ పేరుతో కొత్త డీయాప్‌ను రూపొందించాడు. డీ సెంట్రలైజ్డ్ పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్ రూపొందించిన పాలిగజ్ డీయాప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్‌ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్‌లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. 7 మిలియన్ డాలర్లు పాలిగజ్లో డీయాప్పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్ మిలియన్ డాలర్లకి చేరుకుంది. పాలిగజ్ యాప్ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్ యాప్ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్ చేస్తోంది. డీఫై ప్రోటోకాల్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. -
దూసుకొస్తున్న క్రిప్టో కరెన్సీ బ్యాంక్
సాక్షి, ముంబై: ఇటీవలి క్రిప్టోకరెన్సీకి ఆదరణపెరుగుతున్న నేపథ్యంలో యూకేకు చెందిన క్రిప్టో బ్యాంక్ కాషా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. కాషా, యునైటెడ్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ అయిన క్రిప్టో బ్యాంక్ యునికాస్ ఆగస్టు15 నాటికి దేశంలో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బ్యాంకుగా అవతరించనున్నామని యూనికాస్ వెల్లడించింది. ఇతర బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో బ్యాంక్ పొదుపు, రుణ, వాణిజ్య సేవలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన వెంటనే, బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలలో ఎఫ్డీలను,ఆర్డీలను ప్రారంభించాలని భావిస్తోంది. క్రిప్టో ఎఫ్డీకి నిర్దిష్ట మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అదేవిధంగా, ఇతర బ్యాంకుల ఆర్డీ మాదిరిగానే చిన్న పెట్టుబడిదారులు చిన్న మొత్తంలో రోజువారీ పెట్టుబడి పెట్టడానికి యూనికాస్ అనుమతించాలని యోచిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించడమే లక్ష్యమనీ, రీటైల్ పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల నిమితం పెట్టుబడిపెట్టేలా ప్రోత్సహిస్తామని యునికాస్ మేనేజింగ్ పార్టనర్, సీఈఓ దినేష్ కుక్రేజా చెప్పారు. ఎఫ్డిలతోపాటు ఆర్డీల మాదిరిగానే, చిన్నపెట్టుబడిదారులు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. ప్రస్తుతం యునికాస్కు దేశంలో ఢిల్లీ, జైపూర్, గుజరాత్లో మూడు శాఖలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించాలని భావిస్తున్నామని కుక్రేజా చెప్పారు. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ జెబ్‌పే, ఇప్పటికే ఎఫ్డీలను ఆఫర్ చేస్తోంది. ఇక్కడ క్రిప్టోకరెన్సీని 90 రోజుల వరకు డిపాజిట్ చేసి స్థిర వడ్డీని సంపాదించవచ్చు మరోవైపు యునికాస్ క్రిప్టో కరెన్సీ పొదుపు ఖాతాలపై సంవత్సరానికి 4 శాతం నుండి 9.67 శాతం దాకా వడ్డీ అందిస్తుంది. అంతేకాదు క్రిప్టో బ్యాంక్ ఫిజికల్ బ్రాంచెస్ ఉన్న నగరాల్లో తన ప్రీమియం కస్టమర్లకు డోర్-స్టెప్ సేవలను కూడా అందిస్తుంది. -
ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?
మనం కొన్ని సార్లు వార్తలలో ఒక్క రోజులో కోటీశ్వరడు అయినట్లు వచ్చిన వార్తలను ఇప్పటి వరకు చదివి ఉంటాం. కానీ, జార్జియా జరిగిన ఈ సంఘటన గురుంచి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. సాదరణంగానే మన లాగే క్రిస్ విలియమ్స్ ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాడు. అలా ఒక రోజు ఉదయం 9 గంటలకు లేవగానే విలియమ్స్ తన ఫోను చూసి షాక్‌కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని తన కళ్లు నులిమి చూసుకున్నాడు. క్రిప్టోకరెన్సీ రాకెట్ బన్నీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన క్రిస్ రాత్రికి రాత్రే ట్రిలియనీర్ అయిపోయాడు. జార్జియాలోని మాంచెస్టర్‌లో చదువుకుంటున్న నర్సింగ్ పాఠశాల విద్యార్థి క్రిస్ విలియమ్స్ గత ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గత వారం రాకెట్ బన్నీ అనే క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ విలువ ఆ మరుసటిరోజుకు 1.4 ట్రిలియన్లకు పెరిగింది. మన కరెన్సీలోకి మార్చుకుంటే దీని విలువ సరిగ్గా రూ.10,37,49,10,00,00,000. అక్షరాల దీని విలువ రూ.కోటి కోట్లకు పైమాటే. కాసేపటికి తేరుకున్న విలియమ్స్ ఆ మొత్తాన్ని వేరే వాలెట్‌లోకి మార్చుకునేందుకు ప్రయత్నించాడు. అది అదే ధరను ఇతర వాలెట్లో చూపించడం లేదని తాను ఇన్వెస్ట్ చేసిన కాయిన్‌బేస్ వాలెట్‌ను సంప్రదించాడు. తాము ఈ సమస్య పరిష్కారానికి రాకెట్ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది. చాలా రోజులు గడిచిన ఎటువంటి సమాధానం రాకపోవడంతో సలహా కోసం ఈ విషయాన్ని విలియమ్స్ ట్విటర్లో నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. క్రిప్టోకరెన్సీలపై ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేసే స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌నూ ట్యాగ్ చేసి, సలహా ఇవ్వాలని కోరాడు. తాను పెట్టుబడి పెట్టిన క్రిప్టోకరెన్సీ స్కామ్ కాకపోవచ్చని విలియమ్స్ భావిస్తున్నాడు. అతడు ఇంత మొత్తంలో వచ్చిన డబ్బును ఎన్నడూ ఖర్చు చేయలేనని కాబట్టి నేను దానిని మంచి పనుల కోసం వినియోగిస్తాను అని విలియమ్సన్ చెప్పాడు. ఆ డబ్బుతో కుటు౦బాన్ని మంచిగా చూసుకోవడం, సహోదరీలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు ఉచిత వైద్య క్లినిక్‌లను ప్రారంభిస్తానని క్రిస్ చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు కాయిన్ బేస్ యాప్ విలియమ్సన్ ఖాతాను స్తంభింపచేసింది. దీంతో అంత మొత్తంలో వచ్చిన ఆ నగదును కాయిన్ బేస్ నుంచి ఉపసంహరించుకోలేడు, ఎటువంటి వర్తకం చేయలేడు. ఒక వార్త కథనం ప్రకారం కాయిన్ బేస్ ఈ సంఘటన గురుంచి వివరించింది. అదే రోజు జార్జియాలోని జాస్పర్ లో నివసిస్తున్న అతని స్నేహితుడు అదే నాణెం కొన్నాడు. కానీ అతడికి అంత మొత్తం నగదు జమ కాలేదు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. సాంకేతిక లోపం వల్ల విలియమ్సన్ ఖాతాలో అంతా మొత్తం సంపద జమ అయినట్లు పేర్కొంది. -
అది ఎలన్ మస్క్‌కే సాధ్యం!
న్యూయార్క్: లక్షల కోట్లు సంపాదించాలన్న.. అలాంటి లక్షల కోట్లను క్షణాల్లో ముంచేయాలన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసే ఒక్క ట్వీట్ చాలు. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ ఫేట్‌ను మార్చేస్తున్న ఈ టెక్ బిలియనీర్.. తాజాగా చేసిన ఓ చిలిపి పని వైరల్ అవుతోంది. అడల్ట్ క్రిఫ్టో కరెన్సీ కోసం మస్క్ పోస్ట్ చేసిన ట్వీట్లు డిజిటల్ కరెన్సీ మార్కెట్లో అలజడిని సృష్టించాయి. తాజాగా మస్క్ చేసిన రెండు ట్వీట్లతో పోర్న్-థీమ్డ్ క్రిప్టో కరెన్సీ కమ్రాకెట్ కాయిన్ విలువ ఒకే రోజులో 352 శాతానికి పెరిగింది. అది కూడా ప్రారంభంలో కేవలం పది నిమిషాల్లో నాలుగు వందల రెట్లు పెరిగి.. నిదానంగా 352 శాతం దగ్గర ముగియడం విశేషం. ముందుగా ఎలన్ మస్క్ ‘కెనడా, యుఎస్ఎ, మెక్సికో’ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఈ మూడు దేశాల మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే క్రిప్టోకరెన్సీలను సూచిస్తున్నారని నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు అడల్ట్ సిగ్నేచర్స్‌తో చేసిన ట్వీట్స్ ఈ పోర్న్ థీమ్డ్ క్రిఫ్టో కరెన్సీ విలువ దూసుకుపోతోందని స్పష్టత ఇచ్చాడు. చదవండి: స్పేస్ఎక్స్కి ఇండియాలో ఎదురుదెబ్బ Canada USA Mexico — Elon Musk (@elonmusk) June 4, 2021 కమ్రాకెట్.. అడల్ట్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా పుట్టుకొచ్చిన క్రిప్టోకరెన్సీ. దీనితో పాటే కమ్మీ, కమ్మీన్స్ అనే మరో రెండు క్రిఫ్టో కాయిన్స్ చెలామణిలో ఉన్నాయి. ఎలన్ మస్క్ ట్వీట్స్ తర్వాత వాటి విలువలు కూడా 45 శాతం, 19 శాతం పెరగడం విశేషం. అసలే క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంటేనే గందరగోళం.. ఎలోన్ మస్క్ తన ట్వీట్లతో ఆ మార్కెట్‌ను మరింత గందరగోళంగా మార్చేస్తూ వస్తున్నాడు. 💦🚀 –> 🌙 — Elon Musk (@elonmusk) June 5, 2021 -
డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చేలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్‌కు రిజర్వ్ బ్యాంక్ సూచనలు జారీ చేసింది. ఈ తరహా కరెన్సీ లావాదేవీలు జరిపే కస్టమర్లకు సర్వీసులు అందించరాదంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌పై వివరణనిచ్చింది. ఈ సర్క్యులర్‌ను 2020లో సుప్రీంకోర్టు తోసి పుచ్చినందున అప్పట్నుంచి ఇది అమల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో వర్చువల్ కరెన్సీ లావాదేవీలు నిర్వహించే వారికి సర్వీసులను అందించకుండా ఉండటానికి ఈ సర్క్యులర్‌ను అడ్డుగా చూపరాదని స్పష్టం చేసింది. అయితే, కస్టమర్ల ఖాతాల వివరాల వెల్లడి (కేవైసీ), యాంటీ మనీ లాండరింగ్ తదితర చట్టాల నిబంధనలను పాటించాలని బ్యాంకులు మొదలైన వాటికి ఆర్బీఐ సూచించింది. చదవండి: విమానయానం, ఆక్సిజన్ ప్లాంట్లకూ రుణ హామీ.. -
మిస్టరీ అకౌంట్.. అదృష్టం అంటే ఇదే!
వెబ్‌డెస్క్: రెండువారాల క్రితం క్రిప్టోకరెన్సీ డోజ్కాయిన్ విలువ అమాంతం పడిపోయింది. చైనా క్రిప్టోకరెన్సీని బ్యాన్ చేయడంతోనే ఇది జరిగింది. అయితే ఈ క్రాష్‌ను కూడా తట్టుకుని ఈ ఏడాది ప్రారంభ నికర విలువ కంటే మెరుగ్గానే కొనసాగుతోంది డోజ్కాయిన్. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తరచూ డోజ్‌కాయిన్‌ను సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తుండడమే ఇందుకు ఒక కారణం. అయితే మిస్టరీ అకౌంట్ ఒకటి రికార్డు స్థాయిలో విలువ చేసే డోజ్‌కాయిన్లను కలిగి ఉండడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డోజ్కాయిన్ ‘వేల్’ అకౌంట్ ఒకటి తన ఖాతాలో వేల కోట్లు చేసే ఈ మీమ్ కరెన్సీని కలిగినట్లు ఉన్నట్లు బయటపడింది. దగ్గరదగ్గర 12 బిలియన్ల డాలర్లు విలువ చేసే కాయిన్స్ (మన కరెన్సీలో 8, 752 కోట్ల రూపాయల విలువైన) ఆ అకౌంట్ పేరిట ఉన్నాయి. ఇటీవల క్రిప్టోకరెన్సీ మార్కెట్లో వచ్చిన కుదుపులను తట్టుకుని మరీ ఈ అకౌంట్ అంత విలువైన కరెన్సీని కలిగి ఉండడం విశేషం. మరోవైపు డిజిటల్ కరెన్సీ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వహ్.. మేజర్ షేర్ బిట్ఇన్ఫోఛార్ట్స్ ప్రకారం.. ది డోజ్ కాయిన్ వేల్ అకౌంట్ DH5yaieqoZN36fDVciNyRueRGvGLR3mr7L అడ్రస్ మీద 2019, ఫిబ్రవరి 6న ఫస్ట్ కొనుగోలు చేసింది. ఆ టైంలో కాయిన్ విలువ మన కరెన్సీపరంగా పదమూడు పైసలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఇన్వెస్టర్ దగ్గర 3,671 కోట్ల డోజ్కాయిన్స్ ఉన్నాయి. వాటి మొత్తం విలువ 12 బిలియన్ల డాలర్లుగా తేలింది. ఈ విలువ ఇప్పుడున్న క్రిప్టోకరెన్సీలో 28 శాతంగా ఉండడం విశేషం. అయితే రెండువారాల క్రితం క్రాష్ కాకముందు ఈ అకౌంట్ క్రిప్టోకరెన్సీ విలువ 22 బిలియన్ల డాలర్లు(16వేలకోట్ల రూపాయలకుపైనే) ఉండిందట. ప్రస్తుతం కాయిన్మార్కెట్కాప్లో డోజ్కాయిన్ విలువ డాలర్లో మూడో వంతు (సుమారు23 రూపాయలుగా) ఉంది. అయితే ఈ మిస్టరీ అకౌంట్ బహుశా ఎలన్ మస్క్‌దే అయ్యి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జోక్‌గా మొదలై.. డోజ్కాయిన్ మీద ఫోకస్ ఎక్కువ కావడంతో.. ఈ ఏడాది మొదటి నుంచి ఆ కాయిన్స్‌కు గడ్డుకాలం నడుస్తోంది. షిబ ఇను అనే కుక్క బొమ్మతో డోజ్కాయిన్ 2013లో లాంఛ్ అయ్యింది. బిల్లీ మర్కస్, జాక్సన్ పామర్ అనే ఇద్దరు టెక్కీలు వీటిని స్టార్ట్ చేశారు. ట్రెడిషనల్ బ్యాంకింగ్ ఫీజును ఎగతాళి చేస్తూ జోక్‌గా ప్రారంభించిన డోజ్కాయిన్ ప్రయత్నం.. ఇప్పుడు లక్షల కోట్ల బిజినెస్‌కు చేరుకుంది. ఇక బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. సతోషి నకమోటో అనే వ్యక్తి 2008 అక్టోబర్‌లో బిట్ కాయిన్ని కనుగొన్నట్లు చెప్తుంటారు. -
కోవిడ్ ఫండ్: క్రిప్టో కరెన్సీ బిలియనీర్ భారీ విరాళం
సాక్షి,న్యూఢిల్లీ: క్రిప్టో బిలియనీర్,ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ భారతదేశ కోవిడ్ రిలీఫ్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఒక బిలియన్ డాలర్ల విలువైన(సుమారు రూ. 7400 కోట్లు) క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చారు. తాజా నివేదికల ప్రకారం తన సొంత క్రిప్టో కరెన్సీ 500 ఈథర్ని, 50 ట్రిలియన్ డాలర్లకు పైన (షిబా ఇను)మెమె డిజిటల్ కరెన్సీను దానం చేశాడు. బుటెరిన్ విరాళంపై భారత టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్లో బుటెరిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎథీరియంను ప్రారంభించింది నెయిల్వాల్. దేశంలోని కరోనా విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించినందుకు బుటెరిన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే షిబా ఇను పెట్టుబడిదారులకు కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే భారత్‌లో క్రిప్టో కర్సెన్సీ రద్దు కాలేదని, 60 లక్షల డాలర్లు క్రిప్టో కర్సెన్సీ విరాళాలు అందాయని వివరించారు. అయితే డిజిటల్ కరెన్సీ విరాళంగా ప్రకటించడంతో కొంతమంది పెట్టుబడిదారులలో భయాందోళనలకు దారితీసింది. ఫలితంగా గత 24 గంటల్లో షిబాఇను ధర 35శాతం పైగా క్షీణించింది. ప్రస్తుతం నష్టాలనుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. బిట్‌కాయిన్ తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథీరియం. దీని ధర మే 10న 3000 డాలర్లకు చేరుకున్నప్పుడు బుటెరిన్ నికర విలువ సుమారు 21 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈథర్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 376 బిలియన్ డాలర్లుకుపై మాటే.ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈథర్ విలువ 325 శాతానికి పైగా పుంజుకోవడం విశేషం. దీంతో గత నెలలో ప్రపంచంలోనే 27 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన క్రిప్టో బిలియనీర్‌గా విటాలిక్ బుటెరిన్ అవతరించిన సంగతి తెలిసిందే. చదవండి: గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి Thanks @VitalikButerin One thing we have learnt from Ethereum and @VitalikButerin is importance of community We will not do anything which hurts any community specially the retail community involved with $SHIB We will act responsibly! Plz dont worry $SHIB holders. https://t.co/M4GxTR0JAn — Sandeep - Polygon(prev Matic Network) (@sandeepnailwal) May 12, 2021 -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్
క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ విలువ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 62 వేల డాలర్ల మార్క్‌ను దాటి 63,825.56 డాలర్ల రికార్డు ధర పలికింది. మార్చి నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన బిట్ కాయిన్ ఇప్పుడు ఆ రికార్డును తుడిపేసింది. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంటే, ఆంతే స్థాయిలో బిట్ కాయిన్ విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుండటంతో దాని విలువ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో బిట్ కాయిన్ చాలా ప్రధానమైనది కాబట్టి దాని విలువ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా 70 నుంచి 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఇక, 2018లో కుదేలైపోయిన బిట్ కాయిన్ గతేడాది కరోనా మహమ్మారి నుంచి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. 2020 అక్టోబర్‌లో 12 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ గత నెలలో 60 వేల డాలర్ల మార్కు దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం మన కరెన్సీలో బిట్ కాయిన్ ధర దాదాపు 50 లక్షలకు చేరిపోయింది. టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ పెట్టుబడులు పెట్టడంతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సంస్థలు కూడా తమ వినియోగదారుల్ని బిట్ కాయిన్‌తో లావాదేవీలకు అనుమతించడం బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగిపోవడానికి తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి. చదవండి: డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా? -
టెస్లా విషయంలో ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం!
న్యూయార్క్: టెస్లా ఎలక్ట్రిక్-కార్ల తయారీ సంస్థ గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్లా ఇంక్ చీఫ్ ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు బిట్‌కాయిన్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో అమెరికా వెలుపల ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. "మీరు ఇప్పుడు బిట్‌కాయిన్‌తో టెస్లా కొనుగోలు చేయవచ్చ" అని బుధవారం ట్వీట్ చేస్తూ టెస్లాకు చెల్లించే బిట్‌కాయిన్ సంప్రదాయ కరెన్సీగా మార్చబడదని అన్నారు. ప్రపంచంలో బిట్‌కాయిన్‌ను అనుమతించిన మొదటి కార్ల తయారీ సంస్థ టెస్లానే కావడం విశేషం. ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ ధర రోజు రోజుకి పెరుగుతోంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహిస్తున్న మస్క్, గత నెలలో సంప్రదాయ కరెన్సీని విమర్శించారు. బిట్‌కాయిన్ లావాదేవీలను ఆపరేట్ చేయడానికి టెస్లా కేవలం అంతర్గత, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందని ఆయన తెలిపారు. మొదట్లో పరిమిత స్థాయిలో చట్టాల అనుగుణంగా బిట్‌కాయిన్‌ను అనుమతించి తమ ఉత్పత్తులను అమ్ముతామని టెస్లా స్పష్టం చేసింది. చదవండి: ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు -
డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా?
బిట్ కాయిన్‌కు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ కీలక వ్యాఖ్యలు చేసారు. సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికీ డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోకరెన్సీ వంటి వాటి సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది. ప్రజలు కూడా బిట్ కాయిన్ రిస్క్‌ను అర్థం చేసుకోవాలని సూచించారు. డాలర్ లేదా బంగారానికి బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఎప్పటికి ప్రత్యామ్నాయం కాదని అన్నారు. గత కొంత కాలంగా బిట్ కాయిన్ విలువ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే 60వేల డాలర్లను కూడా దాటి జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 58వేల డాలర్ల వద్ద ఉంది. కరోనా కాలంలో రాకెట్ కంటే వేగంతో దూసుకెళ్తూ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోన్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన అమెరికా కేంద్రం బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని అన్నారు. వాటి విలువ ఎల్లపుడు అస్థిరతతో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే, క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల టెస్లా, స్క్వేర్ ఇన్వెస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో జంప్ చేస్తోంది. చదవండి: రియల్టీ కింగ్ ఎంపీ లోధా -
రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న బిట్‌కాయిన్
ఒకవైపు భారత్‌లో క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధమవుతాయా లేదా అన్న దానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు అంతర్జాతీయంగా బిట్ కాయిన్ రేటు రోజు రోజుకూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తొలి సారిగా 61,000 డాలర్ల స్థాయిని(సుమారు రూ. 43,92,000) తాకింది. కోవిడ్-19 ఉపశమన చర్యల కోసం అమెరికా ప్రభుత్వం 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన దరిమిలా ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలు .. బిట్‌కాయిన్ వంటి కరెన్సీలకు ఊతమిస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో బిట్ కాయిన్ విలువ 1,000 శాతం ఎగిసింది. గతేడాది నాలుగో త్రైమాసికం ఆఖరు నాటికి 29,000 డాలర్ల స్థాయిలో ఉన్న విలువ ఆ తర్వాత ఏకంగా 40,000 డాలర్లకు పెరిగింది. మరికొద్ది రోజుల్లోనే మరో కొత్త గరిష్టం 61,000 డాలర్లకు ఎగిసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం ఎలాన్ మస్క్ తదితర దిగ్గజ ఇన్వెస్టర్ల ఊతంతో ఈ ఏడాది ఆఖరు నాటికల్లా బిట్‌కాయిన్ విలువ ఏకంగా 1,00,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చదవండి: క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం కసరత్తు! -
పెట్రో సెగలపై ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: దేశీయంగా రికార్డుస్థాయికి చేరుతున్న ఇంధన ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండుతున్న పెట్రోధరలపై ప్రభుత్వాలు సానుకూల పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అధిక ధరలు కార్లు, బైక్‌లను ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు తయారీ, రవాణా రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాపార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజలను, దేశాన్నిఈ భారం నుంచి బయట పడవేసేందుకు అధిక మొత్తంలో డబ్బు అవసరమని తెలుసు, కానీ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. వరుస బాదుడు తరువాత ప్రస్తుతం స్థిరంగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. (మళ్లీ రాజుకున్న పెట్రో సెగ) మరోవైపు డిజిటల్ కరెన్సీ ఆవిష్కారంపై కసరత్తు చేస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. డిజిటల్ రెవల్యూషన్లో తాము వెనకబడి ఉండాలనుకోవడం లేదంటూ క్రిప్టోకరెన్సీ లాంచింగ్‌పై ఇప్పటివరకు వస్తున్న అంచనాలపై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి తమకు ఆందోళనలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. అయితే తమ డిజిటల్ కరెన్సీ ప్రస్తుత క్రిప్టోకరెన్సీ కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలు ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. (బిట్‌కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ ) డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలి : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా క్రిప్టోకరెన్సీకి డిమాండ్ భారీగా పుంజుకున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా క్రిప్టోకరెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రెగ్యులేటర్స్ చొరవ తీసుకోవాలన్నారు. అంతేకాదు బిట్ కాయిన్లో తాను పెట్టుబడులు పెట్టేది లేదని తెగేసి చెప్పారు. మరోవైపు దేశీయంగా డిజిటల్ కరెన్సీ ఆందోళన నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పెట్టుబడులతో ఇటీవలి కాలంలోబిట్కాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దీంతో బిట్కాయిన్పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అయితే ధరలు చాలా హైలో ఉన్నాయంటూ ఉన్నట్టుండి ఎలాన్ మస్క్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌పై చేసిన ట్వీట్ కారణంగా భారీ నష్టాన్ని మూట గట్టుకున్నారు. దీనికి తోడు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ బిట్‌కాయన్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో బిట్ కాయిన్ ఏకంగా 17 శాతం క్షీణించి 45వేల డాలర్లకు పడిపోయింది. (పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో ఫైర్) Diesel &petrol prices do have an impact on the cost side. They play as cost push factor across a range of activities. It's not just that passengers who use cars and bikes. High fuel prices also have an impact on cost of manufacturing, transportation & other aspects: RBI Governor pic.twitter.com/zn4AzB5Ag8 — ANI (@ANI) February 25, 2021 -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(భారత్)లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బిఐ ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీల ద్వారా మోసానికి పాల్పడుతున్నారని తెలిసిన తర్వాత 2018లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్బీఐ వాటిని నిషేధించింది. కానీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్ యువాన్‌తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరనున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన సాంకేతికపై పనిచేతున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ ఇటీవలి ట్వీట్లలో బిట్ కాయిన్ ధరలు "అధికంగా కనిపిస్తున్నాయి" అని చెప్పారు. దీనితో ఒక్కసారిగా టెస్లా షేర్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఒక్కరోజులో ఎలోన్ మస్క్ 15.2 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్
కరోనా కారణంగా వ్యాపారాలు డీలా పడి, ఉద్యోగాలు పోయి ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దీనితో కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు భారీ ఉద్దీపన పథకాల ప్రకటిస్తున్నాయి. ఉద్దీపనల వల్ల కరెన్సీ విలువ పడిపోవడం వల్ల బ్యాంకింగ్ రంగం సుస్థిరతపై అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో బిట్‌కాయిన్ ధర మాత్రం రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. చాలా మంది పెట్టుబడి దారులు బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ బిట్‌కాయిన్ మార్కెట్ లో 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ కారణాల వల్ల బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా లక్ష కోట్లకు చేరుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక కాయిన్ ధర 56,620 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పెరిగింది. రెండు నెలలుగా బిట్‌కాయిన్ విలువ రోజురోజుకి పెరుగుతోంది. గత వారంలోనే 18శాతం లాభపడింది. అలాగే ఈ ఏడాదిలో 92శాతం పైకి చేరుకుంది. శనివారం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ట్రేడింగ్ విలువ లక్ష కోట్లు లేదా రూ.72.73 లక్షల కోట్లు దాటింది. 18.6 మిలియన్ డాలర్ల బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని 2009 జనవరిలో తీసుకువచ్చారు. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్
డిజిటల్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకుల ఆంక్షల విధించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. రూ.35 లక్షలు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సేవల సంస్థలైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ మద్దతునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కెనడాలో బంగారం మాదిరే బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్ ప్రపంచంలోనే బౌతికంగా బిట్ కాయిన్‌తో పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్టర్లు తేలిగ్గా పొందడానికి ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ వెసులుబాటు కల్పిస్తున్నది. బిట్‌కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో $ 48,975కు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63శాతం పెరిగింది. 2020 మార్చి నుండి సుమారు 1,130 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిపెట్టినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. -
త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ త్వరలో కేంద్ర కేబినెట్‌కు క్రిప్టోకరెన్సీ బిల్లును పంపనున్నట్లు సమాధానమిచ్చారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) 2018లో బ్యాంకులను నిషేధించింది. అయితే, గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. "బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల వినియోగంపై ఆర్బిఐ త్వరలో విధివిధానాలను తెలియజేస్తామని ప్రకటించింది. కానీ ఇది ఒక సమస్యాత్మకమైన అంశం. క్రిప్టోకరెన్సీని భారత్‌లో అరికట్టడానికి కేంద్ర ఆర్థికశాఖ ఏదైనా బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందా?" అని కర్ణాటక భాజపా ఎంపీ కె.సి.రామమూర్తి రాజ్యసభలో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఠాకూర్ మాట్లాడుతూ.. "ఆర్బిఐ, సెబి వంటి రెగ్యులేటరీ సంస్థలకు క్రిప్టోకరెన్సీలను నేరుగా నియంత్రించడానికి ఎటువంటి చట్టపరమైన అధికారాలు లేవు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ఆస్తులు, సెక్యూరిటీలు, వస్తువు కాదు. ప్రస్తుత చట్టాలు ఈ అంశాన్ని పరిష్కరించడానికి సరిపోవు. అందుకే ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించాం. అతి త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు ఈ బిల్లును తీసుకొస్తాం" అని ఠాకూర్ చెప్పారు. చదవండి: కుమారుడి ఫోటో షేర్ చేసిన ఎలోన్ మస్క్ మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త! -
క్రిప్టో కరెన్సీ చరిత్రలో మరో సంచలనం
ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ద కాలం నుంచి క్రిప్టోకరెన్సీకి సపోర్టర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మొదట ఈ క్రిప్టోకరెన్సీపై చాలా అపోహలు ఉండటం వల్ల దీనిపై ఎక్కువ శాతం మొగ్గు చూపలేదు. అయితే తర్వాత దీనిపై ఉన్న అనుమానులు తొలిగిపోవడంతో క్రిప్టోకరెన్సీకి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా బిట్ కాయిన్స్, డాగీ కాయిన్స్ లావాదేవీల కోసం వాడుతున్నారు. ఇంతకముందు బిట్ కాయిన్ సంచనాలను సృష్టిస్తే, ఇప్పుడు డాగీ కాయిన్ రికార్డు సృష్టిస్తుంది.(చదవండి: అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన హ్యాకర్?) గత 2వారాల నుంచి డాగీ కాయిన్ విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. కొద్దీ గంటల్లోనే డాగీ కాయిన్ విలువ 5 రెట్లు పెరిగిందని పలు నివేదికలు నివేదిస్తున్నాయి. జనవరి 27 వరకు పైసా కంటే తక్కువ విలువ ఉన్న ఈ కాయిన్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపాయి. జనవరి 27 తర్వాత 500 శాతం పైగా దాని ధర పెరిగినట్లు కాయిన్‌బేస్ తెలిపింది. బిట్‌కాయిన్ మాదిరిగానే డాగ్కోయిన్ అనేది కూడా డిజిటల్ నాణెం. ఇది ప్రధానంగా ఇ-లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది.(చదవండి: మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్!) It’s inevitable pic.twitter.com/eBKnQm6QyF — Elon Musk (@elonmusk) July 18, 2020 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిల్లీ మార్కస్, జాక్సన్ పామర్ 2013లో దీనిని కనుగొన్నారు. క్రిప్టో కరెన్సీలో ఇది మరో రకం. బ్యాంకింగ్ ఫీజులు లేకుండా తక్షణ చెల్లింపులు చెల్లించేందుకు గాను ఓ వ్యవస్థను సృష్టించాలని ఈ టెక్కీలు అనుకున్నారు. అప్పటికి షిబా ఇను అనే శునకం ఎంతో పాపులర్ సంపాదించింది. అందుకే ఆ కుక్క లోగోను ఈ కాయిన్‌కు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డాగీ కాయిన్ సృష్టించబడింది. మొదట్లో ఈ డాగీ కాయిన్ ను ఎవరు పట్టించుకోలేదు. అందరూ దీనిని ఒక జోక్ గా పరిగణించారు. అయితే కొద్దీ కాలంలోనే దీని విలువ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ డాగీ కాయిన్ కు మంచి విలువ ఉంది. జనవరి 27 తర్వాత 24 గంటలలో భారీ లావాదేవీల కారణంగా డాగ్కోయిన్ 7 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌లో ఉంది. టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ గతంలో డాగ్కోయిన్ గురించి 2020 జులై 18న ట్వీట్ చేశాడు. -
రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్‌కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. గత వారమే 30 వేల డాలర్లను దాటిన బిట్‌కాయిన్ ఈ వారం ముగిసే సరికి 40 వేల డాలర్లను తాకింది. 2021లో మొదటి మూడు రోజుల్లోనే దీని విలువ 5 వేల డాలర్లు పెరిగింది. 2017 నుంచి క్రమంగా పెరుగుతూ పోతున్న ఈ క్రిప్టోకరెన్సీ 2020 డిసెంబర్ 16న మొదటిసారి 20 వెల డాలర్లు నమోదైంది. అప్పటి నుంచి ఈ క్రిప్టో కరెన్సీ విలువ రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్ తో దూసుకెళ్తుంది. డిసెంబర్ 25వ తేదీ నాటికీ 25వేల డాలర్లు, 27వ తేదీ నాటికీ 27వేల డాలర్లకు పైగా చేరుకుంది. 2021 మొదటి వారంలోనే దీనివిలువ సుమారు 30 వేల డాలర్లకు పైగా చేరుకుంది. భవిష్యత్ లో లక్ష డాలర్లకు పైగా చేరుకొనునట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నిక కావడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమైంది.(చదవండి: వచ్చే వారం మార్కెట్లకు ఐటీ జోష్) -
ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా గురువారం హ్యాకయింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు పంపించాలంటూ మోదీ అకౌంట్ నుంచి ఆయన ఫాలోవర్లకు మెసేజ్‌లు వెళ్లాయి. ‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్‌లో డిజిటల్ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని ఖాతా నుంచి ‘‘ఈ అకౌంట్‌ని జాన్ విక్ హ్యాక్ చేసింది. అయితే పేటీఎం మాల్ని మాత్రం మేము హ్యాక్ చెయ్యలేదు’’అని సైబర్ నేరగాళ్లు మరో మెసేజ్ పంపారు. గత నెల 30న పేటీఎం డేటా తస్కరణ జాన్ విక్ పనేనంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాము ఆ పని చెయ్యలేదని నిరూపించడానికి ప్రధాని ఖాతాను హ్యాక్ చేసినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ సంస్థ రంగంలోకి దిగి ఆ మెసేజ్‌లు తొలగించింది. ప్రధాని ఖాతాను పునరుద్ధరించి అన్ని రకాలుగా భద్రతను కల్పించింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. మిగిలిన అకౌంట్లు భద్రం ప్రధాని ట్విటర్ ఖాతా హ్యాకయిందని తెలిసిన వెంటనే అన్ని చర్యలు చేపట్టామని, ఆయన మిగిలిన ఖాతాలకు వచ్చిన ముప్పేమీ లేదని ట్విట్టర్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. @narendramodi_in అని ఉండే ఈ అకౌంట్‌కి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు 37 వేల ట్వీట్లు చేశారు. ఆగస్టు 31న మన్‌కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ట్వీట్ ఆఖరిగా ట్వీట్ చేశారు. మోదీ ప్రసంగాలకు సంబంధించిన సమాచారం అంతా ఈ ఖాతా నుంచే ట్వీట్లు చేస్తారు. అయితే 6.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన మరో ఖాతాకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. గత జూలైలో బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ఖాతాలు కూడా హ్యాక్ అవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
ఫేక్ ఈమెయిల్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: భారత్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు తమకు వచ్చే ఫేక్ ఈ–మెయిల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సీఈఆర్టీ–ఇన్) హెచ్చరించింది. ఇంటర్నెట్లో అశ్లీల వెబ్సైట్ల వంటి వాటిని చూసినపుడు అందులోని సాఫ్ట్వేర్ ద్వారా వెబ్‌కామ్ వాడి దాన్ని వీక్షిస్తున్న వ్యక్తి వీడియోను రికార్డు చేస్తారు. అనంతరం దాన్ని ఆ వ్యక్తికి పంపి, ఫేస్బుక్ మిత్రులు, బంధువులకు షేర్ చేస్తామంటూ ఆ వ్యక్తిని బెదిరిస్తారు. షేర్ చేయకుండా ఉండాలంటే డబ్బును 24 గంటల్లోగా ఇవ్వాలని, అదికూడా క్రిప్టో కరెన్సీలోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ తతంగమంతా ఈ–మెయిల్లో నడిపిస్తారు. ఇలాంటి ఈ–మెయిల్స్ వస్తే భయపడవద్దని సీఈఆర్టీ–ఇన్ సూచించింది. తమకు పాస్‌వర్ట్‌లు తెలుసని బెదిరిస్తే వెంటనే పాస్‌వర్ట్‌లు మార్చుకోవాలని ఇంటర్నెట్ యూజర్లకు సీఈఆర్టీ–ఇన్ సూచించింది. -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ ‘నిషేధం’ ఎత్తివేత
న్యూఢిల్లీ: వివాదాస్పద క్రిప్టోకరెన్సీ అంశంపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఈ కరెన్సీలకు సంబంధించిన సేవలను అందించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను పక్కన పెట్టింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ ’నిషేధా’న్ని సవాల్ చేస్తూ .. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఓవైపు వర్చువల్ కరెన్సీలను నిషేధించలేదని ఆర్బీఐ చెబుతోందని, మరోవైపు అనేక కమిటీలు వేసినా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతోందని.. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ సరికాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెడితే.. బిట్కాయిన్ల వంటి వర్చువల్ కరెన్సీలతో ఆర్థిక నష్టాలతో పాటు అనేక రిస్కులు పొంచి ఉన్నాయని 2013లో ఆర్బీఐ హెచ్చరించింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 6న మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం వర్చువల్ కరెన్సీ లావాదేవీలు జరిపే ఎవరికీ సర్వీసులు అందించరాదంటూ తన పరిధిలో పనిచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది. దీంతో క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించినట్లయింది. దీన్ని సవాలు చేస్తూ 2018 జూలై 3న ఐఎంఏఐ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎకానమీపై క్రిప్టోకరెన్సీల ప్రభావాల గురించి గతంలో అధ్యయనాలేమీ జరగలేదని, కేవలం నైతికత ప్రాతిపదికగా ఆర్బీఐ వీటిని నిషేధించిందని వాదించింది. అయితే, ఆర్బీఐ సర్క్యులర్‌పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర సమాచార..సాంకేతిక శాఖను ఆదేశించింది. ఈ కేసులోనే తాజా తీర్పునిచ్చింది. -
క్రిప్టో కరెన్సీపై సుప్రీం కీలక తీర్పు
ముంబై: దేశంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌పై ఆర్బీఐ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేస్తు బుధవారం తీర్పును వెల్లడించింది. డిజిటల్, ఆర్థిక లావాదేవీలను భద్రపరిచే సాధనంగా క్రిప్టో కరెన్సీని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. పర్చుల్ కరెన్సీపై సరైన నియంత్రణ చేయలేమని 2018 అక్టోబర్‌లో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని నిషేధించింది. అయితే, ఈ నిషేధాన్ని సవాలు చేస్తు ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పలు క్రిప్టో కరెన్సీలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నారిమన్ నేతృత్వంలో అనిరుద్ బోస్, వి. సుబ్రహ్మణియన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆర్బీఐ నిర్ణయాన్ని సమీక్షించి తాజా తీర్పును ప్రకటించింది. -
గుప్త నిధుల పేరుతో మోసం
సాక్షి, మార్కాపురం: గుప్త నిధుల పేరుతో మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన తన్నీరు శివయ్య పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన గోదా నడిపి అనే వ్యక్తి వద్ద గుప్తు నిధుల సమాచారం చెబుతానని రూ. 1.50 లక్షలు, ఒంగోలుకు చెందిన మాదాల శ్రీదేవి వద్ద రూ. 3.50 లక్షలు, బేస్తవారిపేటకు చెందిన నాగరాజు వద్ద రూ. 2.50 లక్షలు తీసుకున్నారు. వాటితో ఒక కారు కొనుగోలు చేసి ప్రజలను గుప్త నిధుల పేరుతో మోసం చేస్తున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దారవీడు పోలీసులు గోదా నడిపి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తుండగా కుంట జంక్షన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి రూ. 2.20 లక్షల నగదును, నంబర్ లేని మహీంద్రా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు మాయమాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ తెలిపారు. బంగారం పేరుతో.. అమాయక ప్రజలను బంగారం పేరుతో మభ్యపెట్టి మోసం చేసిన వ్యక్తిని మంగళవారం పట్టణ సమీపంలోని బోడపాడు అడ్డరోడ్డు వద్ద పట్టణ ఎస్సై టి.కిశోర్‌బాబు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి మోసం చేస్తున్న చీమకుర్తి మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన నాగులూరి ప్రకాశం, దోర్నాల మండలంలోని రామచంద్రకోట గ్రామానికి చెందిన కర్రా సుబ్బరాయుడుకు బంగారు చైను ఇస్తానని 55 వేల రూపాయలు తీసుకుని చైను ఇచ్చాడన్నారు. దీనిని సుబ్బరాయుడు బంగారు దుకాణంలో తనిఖీ చేయించగా నకిలీదని తేలటంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా బోడపాడు అడ్డరోడ్డు వద్ద ప్రకాశం ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేసి అతని వద్ద నుంచి రూ. 50 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్సైలు రామకృష్ణ, కిశోర్‌బాబులను దర్యాప్తు చేసిన సీఐ కేవీ రాఘవేంద్రను డీఎస్పీ అభినందించారు. -
ఆ ఇంట్లో నిజంగానే గుప్త నిధులున్నాయా?
సాక్షి, కారేపల్లి(ఖమ్మం) : ఒకప్పుడు చుట్టుపక్కల 40 గ్రామాల రైతులకు బంగారం, వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని పెట్టుబడులు అందించిన ఓ షావుకారి ఇల్లు నేడు శిథిలావస్థకు చేరగా..అక్కడ ఓ నిధితో కూడిన ఇనుప పెట్టె లభ్యమైనట్లు స్థానికంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కారేపల్లి మసీదు రోడ్డులో గల షావుకారి, స్వాతంత్ర సమరయోధుడు యర్రా రామలింగయ్య నివాసం శిథిలమైంది. వీరి కుమారులు ఒకరు కారేపల్లి మెయిన్ రోడ్డులో నివాసం ఉంటుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యి హన్మకొండలో స్థిరపడ్డారు. 30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా సింగరేణి పంచాయతీ సిబ్బంది.. ఆదివారం సాయంత్రం జేసీబీతో ఈ పాడుబడిన ఇంటిని కూల్చేశారు. మట్టిని తొలగిస్తుండగా..ఓ ఇనుప పెట్టె బయట పడిందని, దానికి ఓ తాళం వేసి ఉందని, గమనించిన జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలోనే పాడుపడ్డ ఇంటికి సమీపంలో ఉన్న మరో నివాసం వారు వచ్చి ఆ పెట్టెను తమ ఇంట్లో భద్రపరుచుకున్నారని, అందులో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయని, ఐదుగురికి పంపకాల్లో తేడాలు రావడంతో..విషయం బయటకు పొక్కిందని చర్చ జరుగుతోంది. కారేపల్లిలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ పుకార్లు పోలీసులకూ చేరడంతో అసలు వాస్తవమేనా..? లేక కావాలని పుకార్లు సృష్టించారా..? అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే..యర్రా రామలింగయ్య కుమారుడు యర్రా వెంకటరమణ స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ‘ ఇంట్లో నాపరాళ్ల కింద ఇనుప పెట్టె ఉన్నదని..మా అమ్మకు మా నాన్నమ్మ చెప్పిందని, పలు సందర్భాల్లో ఒక చోట నాపరాళ్లు తీసి తవ్వినా కన్పించలేదని, ఒక వేళ నిధి దొరికితే..వారసులమైన తమకు లేదా ప్రభుత్వానికి చెందాలి’ అని వివరించారు. -
గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు
సాక్షి, అచ్చంపేట : గుప్తనిధుల కోసం వచ్చిన దుండగులను స్థానిక ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రామన్‌గౌడ్, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బద్వేల్ నియోజకవర్గం రాజేంద్రనగర్‌కు చెందిన మామిడి వెంకటేష్‌సాగర్, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడిపల్లికి చెందిన ముత్యాల లక్ష్మారెడ్డి, పెద్దముద్దునూరు మండల కేంద్రానికి చెందిన వేనేపల్లి శ్యాంసుందర్‌రావు, అతని కుమారుడు అక్షయ్‌రావు, వంగూరు మండలం జాజాలకు చెందిన సురభి హరిప్రసాదరావులు శనివారం వేనేపల్లి సాహితీ పేరు మీద ఉన్న ఓ కారులో పదర మండలం రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్దకు వచ్చారు. ఆలయ సమీపంలో తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో గుప్తనిధుల కోసం అన్వేషిస్తుండగా స్థానికులు నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కమిటీకి సమాచారం ఇచ్చారు. యురేనియం తవ్వకాల కోసమే వచ్చారు అనుకొని వెంబడించగా కారులో పారిపోతుండగా.. కుమ్మరోనిపల్లి, అమ్రాబాద్‌లో స్థానిక ప్రజలు అడ్డగించినా కారు ఆపకుండా పరారయ్యారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఉండగా ఎస్సీకాలనీ మీదుగా డ్రైవర్ కారును మరలించాడు. అయినా ప్రజలు అడ్డగించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామన్‌గౌడ్ పోలీసులతో వచ్చి వారిని, కారును అదుపులోకి తీసుకున్నారు. కారులో గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనెక్టర్, పౌడర్, వివిధ పరికరాలు ఉండటంతో పోలీస్టేషన్‌కు తరలించారు. -
క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్, ఎథేరియం, రిపిల్, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి ‘ది బ్యానింగ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2019’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును కూడా కమిటీ సిఫారసు చేసింది. క్రిప్టోకరెన్సీపై ఎటువంటి విధానాలను అవలంభించాలనే అంశంపై సిఫారసులు చేయడానికి కేంద్రం 2017 నవంబర్ 2న కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సభ్యులు. ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీతో ఇబ్బం దులు పొంచి ఉన్నాయి. ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అధికం’’ అని సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,116 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ 119.46 బిలియన్ డాలర్లు. తాజాగా కమిటీ నివేదిక, ముసాయిదా బిల్లులను సంబంధిత అన్ని శాఖలు పరస్పర సంప్రతింపుల ద్వారా సమీక్షిస్తాయి. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. -
లంకె బిందెలు దొరికాయ్.. సెల్‌ఫోన్ రికార్డ్స్ కలకలం
సాక్షి, కడప : బద్వేలులో లంకెబిందెలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా... బద్వేలు పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న జయరామిరెడ్డి రెండు నెలల కిందట అర్ధరాత్రి మంత్రగాడి సహాయంతో ఒక పురాతన బిందెను ఇంట్లోకి తీసుకెళ్లడం సమీపంలో ఉన్న ఒక మహిళ కంటబడింది. ఏమిటని ఆమె నిలదీయడంతో ఆయన బయటకు చెప్పవద్దంటూ బతిమాలుకున్నారు. తదుపరి ఆమె తన భర్త సుధాకర్‌రెడ్డితో విషయాన్ని చెప్పింది. ఆయన జయరామిరెడ్డితో విషయాన్ని అడిగి బయటకు చెప్పకుండా ఉండాలంటే మాకు ఏమి ఇస్తావని బేరం పెట్టారు. బిందెలను ఓపెన్ చేయడానికి సమయం పడుతుందని చెప్పాడు. ఎవరికి చెప్పకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కథ కొద్ది రోజులు నడిచింది. రెండు నెలలుగా అద్దెకు ఉంటున్న ఇంటికి జయరామిరెడ్డి రాకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. వీటి రికార్డ్స్ ప్రస్తుతం బయటకు రావడంతో పాటు పట్టణంలో వైరల్‌గా మారాయి. దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. పోరుమామిళ్ల మండలంలోని పురాతన ఆలయమైన చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో ఈ గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలో పూర్వకాలంలో రాజులు నివాసం ఉండేవారని, వారి కాలంలోని లంకెబిందె దొరికిందని సమాచారం. దీనిపై పూజారి గరుడాద్రి స్వామి మాట్లాడుతూ తాను శనివారం మాత్రమే ఆలయం వద్ద పూజలు చేసి వెళతానని, సమీపంలో తవ్వకాలు జరిపి, మళ్లీ మట్టితో కప్పెట్టినట్లు ఆనవాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బద్వేలు పట్టణంలో గుప్తనిధుల తవ్వకాల విషయమై కలకలం రేగుతోంది. -
పాస్వర్డ్ చెప్పకుండా మృతి.. 1,000 కోట్లు మటాష్!
ఒక వ్యక్తి మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టేసింది. ఏకంగా 19 కోట్ల కెనడా డాలర్ల (రూ.1,030 కోట్లు) సొమ్ము ఫ్రీజ్ అయిపోయింది. ఈ డబ్బును ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక టెక్ దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే క్రిప్టో కరెన్సీ అంటే తెలుసు కదా. కేవలం ఆన్లైన్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే డిజిటల్ కరెన్సీ. దీనిలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఈ మధ్య కాలంలో చాలామంది దానివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఆహ్వానించే ఒక కంపెనీయే కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్. సంస్థ ప్రస్తుత సీఈవో అయిన కెనడాకు చెందిన గెరాల్డ్ కాటన్ 5 ఏళ్ల కిందట నోవా స్కాటియాలో దీనిని స్థాపించారు. దీంతో ఈ కంపెనీలో ఎందరో ఇన్వెస్టర్లు తమ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో డిపాజిట్లు చేశారు. భారత్‌లోనే మరణం.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు చిక్కల్లా గతేడాది డిసెంబర్లో మొదలైంది. గత డిసెంబర్లో ఏదో పనుల నిమిత్తం కాటన్ భారత్‌కు వచ్చారు. 30 ఏళ్ల వయసున్న ఆయనకి అప్పటికే జీర్ణకోశ వ్యాధి బాగా ముదిరిపోయింది. మన దేశంలో పర్యటిస్తుండగానే ఆకస్మికంగా కాటన్ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా క్వాడ్రిగాసీఎక్స్‌లో పెట్టుబడి పెట్టినవారిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ వాలెట్ పాస్వర్డ్లు, రికవరీ కీలు కాటన్‌కు తప్ప మరెవరికీ తెలీదు. ఆయన వాటిని ఎక్కడా రాసి పెట్టి కూడా ఉంచలేదు. దీంతో కోట్లాది డాలర్లను ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక ఇన్వెస్టర్లంతా లబోదిబోమంటున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడానికి సాంకేతిక నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం శూన్యం. అతి భద్రతే కొంప ముంచింది డిజిటల్ కరెన్సీ అంటే అన్నీ ఆన్లైన్ లావాదేవీలే కాబట్టి గెరాల్డ్ కాటన్ భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. తాను వాడే ల్యాప్‌టాప్‌లు, ఈ మెయిల్, మొబైల్ ఫోన్లు, మెసేజింగ్ వ్యవస్థలన్నింటినీ ఎన్‌క్రిప్ట్ చేసేశారు. దీంతో ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడంలో ఐటీ దిగ్గజాలు కూడా చేతులెత్తేశారు. డిజిటల్ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా, ఎవరూ వాటిని హ్యాక్ చేయకుండా కాటన్ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతటి పకడ్బందీ భద్రతా చర్యల కారణంగా తాము ఆ సొమ్మును రికవరీ చేసే పరిస్థితుల్లో లేమంటూ ఆయన భార్య జెన్నిఫర్ రాబర్ట్సన్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు మాత్రం చేసేదేమీలేక న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అయితే కొందరు ఇన్వెస్టర్లేమో ఈ కంపెనీ కుట్ర పన్ని తమను మోసం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో క్వాడ్రిగాసీఎక్స్ డిపాజిట్లు ఆన్లైన్లో చేతులు మారుతున్నాయని, పాస్వర్డ్లు తెలీకుండా అదెలా జరుగుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తి మరణంతో రూ.1,000 కోట్లకు పైగా సొమ్ముకి అతీగతీ లేకపోవడం విస్మయం కలిగించే విషయమే. -
ఎక్స్చేంజ్ ఫౌండర్ కన్నుమూత : వందల కోట్లు గోవిందా?
కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫాంసంబంధించిన పాస్వర్డ్లు, రికవరీ కీ తదితర ముఖ్యమైన సమాచారం కేవలం గెరాల్డ్‌కు మాత్రమే య తెలుసు. కానీ గత ఏడాది డిసెంబరులో ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. పాస్వర్డ్, రికవరీ కీ మరెవ్వరికీ తెలియకపోవడంతో, దాదాపు 187 మిలియన్ల కెనడా డాలర్లు( రూ.982 కోట్లు) ఫ్రీజ్ అయిపోయాయి. దీనికి ఈ గండంనుంచి గట్టెక్కేందుకు టెక్ నిపుణులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో సంస్థలో ఇతర అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు గెరాల్డ్ ఎలా చనిపోయాడు? నిజంగా చనిపోయాడా లేదా కంపెనీ మోసం చేస్తోందా లాంటి పలు అనుమానాలు, ప్రశ్నలతో ఆన్లైన్ దుమారం రేగింది. అంతేకాదు గెరాల్డ్ భార్య జెన్నిఫర్ రాబర్ట్‌సన్‌కు వేధింపులు, బెదిరింపులు తీవ్ర మయ్యాయి. దీంతో వీటిని నుంచి తనకూ, కంపెనీకి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో బిట్‌కాయిన్, లైట్‌కాయిన్, ఎథిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది. ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ కూడా నిలిపివేసింది. కేవలం అతనికి మాత్రమే తెలిసిన పాస్వర్డ్లు ఎక్కడా రాసిపెట్టలేదని, దీంతో వాటిని కనుక్కోవడం చాలా కష్టంగా మారిందంటూ కంపెనీ తరపున జెన్నిఫర్ రాబర్ట్సన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే గెరాల్డ్ సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నామనీ, కానీ ఫలితం లభించలేదన్నారు. క్వాడ్రిగాలో 363,000 యూజర్లు నమోదుగాకా, సుమారు లక్షా పదిహేను వేల మందియూజర్లకు 250 మిలియన్ల కెనడా డాలర్లు రుణపడి ఉన్నామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాబర్ట్సన్ పేర్కొన్నారు. అటు ఇన్వెస్టర్లు కూడా ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధ పడుతున్నారు. కాగా ఇండియాలో ఒక అనాధాశ్రయానికి సేవలందిస్తున్న క్రమంలో గెరాల్డ్ కాటన్ డిసంబరు 9న చనిపోయారని జనవరి 14న సోషల్ మీడియా ద్వారా కంపెనీ ప్రకటించింది.