Electricity Supply
-
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్సీ, లైన్ల మరమ్మతులు, సబ్ స్టేషన్ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్ కోసం..భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్ డిమాండ్ ప్రధాన సూచికగా భావిస్తుంటారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్ ఫార్మర్ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్ మహమ్మద్ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
విద్యుత్ డిమాండ్‌కు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓ వైపు వేసవి తాపం పెరగడం.. మరోవైపు బోరుబావుల కింద పెద్ద మొత్తంలో యాసంగి పంటల సాగు జరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ అమాంతంగా పెరిగిపోతోంది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈనెల 20న 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది. గతేడాది మార్చి 8న రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు ఇదే అత్యధికం. ఫిబ్రవరి 6న గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,752 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించగా, నాటి నుంచి రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలోనే 16 వేల మెగావాట్లు, ఆ తర్వాత 17 వేల మెగావాట్ల మైలురాళ్లను దాటింది. గత ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు గడిచిన 39 రోజుల్లో ఏకంగా 31 పర్యాయాలు రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లు, ఒకసారి 17 వేల మెగావాట్లకు మించిపోయింది. గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడంలో ఈ ఏడాది విద్యుత్ సంస్థలు సఫలమయ్యాయి. మార్చి, ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్ 17,500 మెగావాట్లకు చేరవచ్చని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఎక్స్ఛేంజీల నుంచి రోజూ 80 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోళ్లు జరుపుతోంది. రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 290–335 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా, అందులో 50–80 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేస్తుండడం గమనార్హం. దక్షిణాది రీజియన్‌లో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీల (ఐఈఎక్స్) రోజువారీగా విక్రయిస్తున్న మొత్తం విద్యుత్‌లో 80– 90 శాతాన్ని తెలంగాణనే కొనుగోలు చేస్తోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో యూనిట్‌కు రూ.10 గరిష్ట ధరతో పవర్ ఎక్స్ఛేంజీలు విద్యుత్‌ను విక్రయిస్తుండగా డిమాండ్ లేని సమయాల్లో యూనిట్‌కు రూ.2.5 కనిష్ట ధరతో విక్రయిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కోసం నిత్యం సగటున రూ.50 కోట్ల మేర డిస్కంలు వెచ్చిస్తున్నాయి. పేరుకే 20 వేల మెగావాట్ల సరఫరా సామర్థ్యం రాష్ట్రం 20,275 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని (కాంట్రాక్ట్ కెపాసిటీ) కలిగి ఉంది. అందులో ప్రధానంగా జెన్కోకి సంబంధించిన 4,842.5 మెగావాట్ల థర్మల్, 2,442.76 మెగావాట్ల జలవిద్యుత్‌తో పాటు 1,200 మెగావాట్ల సింగరేణి, 3186.76 మెగావాట్ల కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌తో పాటు 839.45 మెగావాట్ల సెమ్‌కార్ప్ విద్యుత్ ఉంది. అయితే 1,000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్, 807.31 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ సరఫరా జరగడం లేదు. దీంతో రాష్ట్ర వాస్తవ విద్యుత్ సరఫరా సామర్థ్యం 18,467.69 మెగావాట్లకు తగ్గిపోయింది. ఇందులో 6,123 మెగావాట్ల సౌర విద్యుత్ లభ్యత పగటి పూటే ఉండనుంది. -
బాబూ.. విద్యుత్ బాదుడు ఆపండి
సాక్షి, అమలాపురం: ‘ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుకే చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బాబూ... విద్యుత్ బాదుడు ఆపండి... ఆక్వా రైతులను ఆదుకోండి’ అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వ విద్యుత్ విధానాల వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ లో ఓల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమవుతోంది. దానిని సాకుగా చూపించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం రూ.లక్షలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపుతున్నారు. ఎస్పీఎల్ చార్జీలని, అదనపు లోడని, షార్ట్ ఫాల్ చార్జీలని ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు, చేపలు ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రొయ్యల కొనుగోలుదారులు సిండికేటుగా మారి రైతులను ముంచేస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెంచుతున్నారు.పట్టుబడుల సమయంలో రేటు తగ్గించేస్తున్నారు. మేత, ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశామని బడ్జెట్లో ప్రకటించినా ధరలు యథాతథంగా ఉన్నాయి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రైతు సంఘాల ప్రతినిధులు యాళ్ల వెంకటానందం, రుద్రరాజు వెంకట రాజు (నానీరాజు), మోటూరి నాని, యేడిద శంకరం, బొలుసు రాంబాబు, టీడీపీ అల్లవరం మండల అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, జనసేన నేత త్సవటపల్లి నాగభూషణం పాల్గొన్నారు. -
గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం సాయంత్రం 4.39 గంటలకు గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకొని కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో విద్యుత్ డిమాండ్ 17వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,557 మెగావాట్లే. గతేడాది మార్చి 8న నమోదైన 15,523 మెగావాట్ల గరిష్ట డిమాండే ఈ ఏడాది ప్రారంభం వరకు అత్యధికం కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5న డిమాండ్ 15,752 మెగావాట్లకు పెరిగి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పలుమార్లు కొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుత నెలలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16వేల మెగావాట్లకు మించి నమోదవుతోంది. ఈ నెల 18న 335.19 మిలియన్ యూనిట్ల రోజువారీ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో సైతం గురువారం 11,017 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. డిమాండ్ ఎంత పెరిగినా కోతల్లేని సరఫరా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, రెప్పపాటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సంస్కరణలు, రూపొందించిన ముందస్తు ప్రణాళికలతో పాటు విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి తీసుకున్న చర్యలతో ఇది సాధ్యమైందన్నారు. ఒక్క వినియోగదారుడికి సమస్య రావొద్దు: సందీప్‌కుమార్‌సుల్తానియా వేసవిలో ఏ ఒక్క వినియోగదారుడికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై గురువారం ఆయన సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 30 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. గత వేసవి అనుభవాల దృష్ట్యా ఈ వేసవిలో ఓవర్ లోడ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్ట డిమాండ్ 5,000 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశామని, ఆ మేరకు సరఫరాకు సిద్ధంగా ఉన్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. -
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్‌లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. = రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. = రాష్ట్రంలోని సబ్స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. ప్రోత్సాహకాలివీ.. –పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. –డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. –సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు. –ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. –భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. – ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు. –పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది. -
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో తరచూ తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, మెరుగైన సరఫరా కోసం డిస్కం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం‘థర్మో విజన్’ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. కంటికి కన్పించని అతి సూక్ష్మమైన లోపాలను కూడా ఈ కెమెరాతో గుర్తించే అవకాశం ఉంది. రాబోయే ముప్పును ముందే పసిగట్టడం ద్వారా సరఫరాలో అంతరాయాలను నివారించొచ్చు. ప్రస్తుతం గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 35 కెమెరాలను సమకూర్చింది. తద్వారా జాయింట్లలో లోపాలు, సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లపై పడుతున్న ఒత్తిడి, ట్రాన్స్పార్మర్లలో ఆయిల్ లీకేజీలు, కేబుళ్లలో తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. నిజానికి భగ్గున మండే ఎండలకు తోడు అధికలోడు కారణంగా ఇన్సులేటర్ల మధ్య పగుళ్లు ఏర్పడుతుంటాయి. వర్షపు చినుకులు పడగానే టఫ్...మంటూ పేలిపోతుంటాయి. లైన్లు, జాయింట్ల మధ్య లూజు కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ ప్రసారం జరిగే క్రమంలో చర్..చర్..మనే శబ్ధంతో ఎర్రటి మినుగురులు ఎగిసిపడుతుంటాయి. షార్ట్‌సర్క్యూట్ తలెత్తి..వైర్లు తెగిపడే వరకు ఈ సమస్య గుర్తించలేని దుస్థితి. ఈ కెమెరాతో ఈ లోపాలను ముందే గుర్తించే అవకాశం ఉంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఆపరేషన్స్ విభాగం ఇంఛార్జీ డైరెక్టర్ నరసింహులు, సీఈ నరసింహస్వామి, బాలస్వా మిలతో కూడిన ఇంజనీర్ల బృందం ఈ థర్మోవిజన్ పరికరాల పనితీరును పరిశీలించారు. -
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానం సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను రూపొందించనున్నాయి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్ఓడీ)కి ఆ పోర్టల్‌ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్ పోర్టల్‌లో చేర్చడం/తొలగించడం/సవరణలు(యాడ్/డిలీట్/ఎడిట్) చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్ఓడీలు పొందనున్నారు. ఇన్‌చార్జీలకు ‘ఉచిత’బిల్లులు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినా ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్చార్జి అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి. విభాగాధిపతుల పర్యవేక్షణ... విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్‌లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వేడి తగ్గింది. ఫలితంగా కరెంటు వినియోగం కూడా తగ్గింది. అది కూడా సాధారణంగా కాదు. ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్.. వాతావరణం అనుకూలించడంతో తగ్గుదలలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 211 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోలిస్తే.. ప్రస్తుతం ఇది 15.26 శాతం తక్కువగా నమోదైంది.ఈ నెల ప్రారంభంలో విద్యుత్ డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా పైపైకి పరుగులు తీసింది. భానుడి భగభగలను తట్టుకోలేని ప్రజలు ఏసీలు, ఫ్యాన్లను ఆపాలంటేనే భయపడిపోయారు. ఈ నెల 5న రోజువారీ డిమాండ్ 259.173 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇది గతేడాది జరిగిన వినియోగం 193 మిలియన్ యూనిట్ల కంటే 34.29 శాతం ఎక్కువ. అయినప్పటికీ రాష్ట్రంలో వినియోగదారులకు అవసరమైనంత విద్యుత్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడా కోతలు లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయడంలో విజయవంతమైంది.అత్యధికంగా థర్మల్ ఉత్పత్తి కొద్దిరోజుల క్రితం వరకూ రాష్ట్రంలో సౌర విద్యుత్ భారీగా పెరిగి దాదాపు రెట్టింపు విద్యుత్‌ను అందించేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో అది కాస్త తగ్గింది. అనూహ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ నుంచి 95.221 మిలియన్ యూనిట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం జెన్కో థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది. ఇందుకోసం వీటీపీఎస్‌లో 48,141 మెట్రిక్ టన్నులు, ఆరీ్టపీపీలో 28,984 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 18,313 మెట్రిక్ టన్నుల చొప్పున బొగ్గు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.63 మి.యూ., ఏపీ జెన్కో సోలార్ నుంచి 1.98 మి.యూ. వస్తోంది. ఇక సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 32.999 మి.యూ., సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 30.939 మి.యూ., విండ్ నుంచి 10.937 మి.యూ., సోలార్ నుంచి 15.738 మిలియన్ యూనిట్ల చొప్పున సమకూరుతోంది. సౌర విద్యుత్ గత వారంతో పోలిస్తే దాదాపు సగానికిపైగా పడిపోయింది. మరోవైపు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా సగానికిపైగా తగ్గింది. ప్రస్తుతం యూనిట్ సగటు రేటు రూ.8.433 చొప్పున రూ.17.983 కోట్లతో 21.324 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్‌కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది. -
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్‌తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీతో.. విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్‌చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్‌పేమెంట్ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అదనపు సర్‌చార్జీ బాదుడు వద్దు దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి. -
ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్‌కట్.. రోగి మృతి
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్‌తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్‌వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్‌రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్‌తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు. -
విద్యుత్ పొదుపుతో భవిష్యత్‌కు వెలుగు
సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాల కోసం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బొగ్గు కొరతతో తిప్పలు.. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపీడీసీఎల్‌కు ఈఈఎస్ఎల్ ప్రశంసలు సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్‌ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్‌కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: బీజే పీ శిష్యరికంతో రాష్ట్ర మంత్రి కేటీరామారావు అసత్య ప్రచారాల్లో రాటుదేలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఏం చేయాలో అర్థంకాక కోట్లాదిరూపాయలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోని రైతులకు విద్యుత్ సరఫరాపై మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్‌కు శనివారం ఆయన కౌంటర్ పోస్ట్ చేశారు. ‘నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిత్రపార్టీ బీజేపీ 40% కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గ్యారంటీలను 100 రోజుల్లోపు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ‘తెలంగాణలో కూడా కాంగ్రెస్ దూసుకెళుతుంటే ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ప్రజలు మీ తోడుదొంగల దుమ్ము దులపడం ఖాయం. కాంగ్రెస్ వస్తుంది. తెలంగాణ గెలుస్తుంది’ అని రేవంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
Fact Check: కరెంటుంది.. కోతల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు లేవు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కరెంటు కోతలు లేవు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందుతోంది. అయినా ఈనాడు పత్రిక ‘రైతులకు జగన్ షాక్’ అంటూ ఓ పసలేని కథ అచ్చేసింది. రైతులను అనవసర ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాన్ని ఇచ్చింది. ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కచ్చితంగా ఉచిత విద్యుత్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈనాడు గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గ్రామాల్లో రోజుకి నాలుగైదు గంటలు మించి కరెంటు అందడంలేదన్నది పచ్చి అబద్ధమని, అనధికార కోతలు విధిస్తున్నారన్నదీ అవాస్తవమేనని తెలిపారు. అన్నదాతలకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి రాజీ లేదని,. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే అదే రోజు మరొక సమయంలో భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ‘సాక్షి’ ప్రతినిధికి సీఎండీలు వెల్లడించిన వివరాలు.. ► గ్రిడ్ లో ఏర్పడే ఫ్రీక్వెన్సీ హె చ్చు తగ్గులను అదుపు చేయడానికి దక్షిణ భారత లోడ్ డిస్పాచ్ సెంటర్ (బెంగళూరు) ఆదేశాలతో ఆటోమాటిక్ లోడ్ షెడ్డింగ్ విధానం అప్పుడప్పుడు అమల్లోకి వస్తుంటుంది. వెంటనే సంబంధిత విద్యుత్ సంస్థల ఇంజనీర్లు పరిస్థితిని అదుపు చేసి సరఫరాలో అంతరాయంలేకుండా చేయడానికి కృషి చేస్తున్నారు. ► ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అక్టోబర్ నెలలో రోజుకు 210 నుంచి 215 మిలియన్ యూనిట్లు ఉండాల్సిన విద్యుత్ వినియోగం దాదాపు 245 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి సరాసరి రోజువారీ వినియోగం 170 నుంచి 180 మిలియన్ యూనిట్లు ఉండేది. బుధవారం రాష్ట్రంలో 234 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. తక్కువ వర్షపాతం వల్ల తగినంత సాగు నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరిగిపోయింది.వాతావరణ మార్పుల వల్ల పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ కారణాలతో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా నిలకడగా ఉంది. ఏ విధమైన ఒడిదొడుకులు ఏర్పడినా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా స్వల్పకాలిక మార్కెట్లో విద్యుత్ కొని, సరఫరా చేయడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని విద్యుత్ కొరత ఏర్పడే సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్తున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి బుధవారం యూనిట్ సగటు రేటు రూ.8.963 చొప్పున రూ.62.554 కోట్లతో 69.789 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి. ► మన రాష్ట్రంలో విద్యుత్ కొరత పరిస్థితులు లేవు. బీహార్‌లో 7.60 మిలియన్ యూనిట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5.73 మిలియన్ యూనిట్లు, కర్ణాటకలో 4.40 మిలియన్ యూనిట్లు, రాజస్థాన్‌లో 3.10 మిలియన్ యూనిట్లు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో 47.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ లోటు సున్నాగా ఉంది. -
24 గంటలు కరెంటు ఇవ్వాలి
గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరు చీకట్లో మగ్గుతోందని..
(సూర్యాపేట) : అసలే ఎడతెరిపి లేని వర్షాలు, ఆపై చెరువును తలపించేలా చుట్టూ నీరు.. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఊరు ఊరంతా చికట్లో మగ్గిపోతోంది. దీనిని చూడలేని ఓ యువకుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి సాహసం చేశాడు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి.. విద్యుత్ స్తంభంం ఎక్కి మరమ్మతులు చేసి విద్యుస్ సమస్యను తీర్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన కొప్పుల సంతోష్ గౌడ్ స్థానిక లైన్‌మన్ కింద హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనికి తోడు గ్రామానికి పైభాగంలో ఉన్న అయ్యవారికుంట తండా చెరువు నుంచి శంభుని చెరువుకి వచ్చే కరకట్ట తెగిపోయింది. ఈ వరదంతా పాతర్లపహాడ్లోని ముదిరాజ్ కాలనీని ముంచెత్తింది. దీంతో గురువారం రాత్రి నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని సరిచేయాలని ప్రయత్నించగా చెరువును తలపించేలా చుట్టూ వరద నీరు ఉన్న ఓ స్తంభంపై సమస్య ఉందని గుర్తించారు. ఈ స్తంభంపై మరమ్మతులు చేస్తేనే గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతుందని, లేదంటే చీకట్లోనే గడపాల్సి ఉందని భావించారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న విద్యుత్ హెల్పర్ సంతోష్ గౌడ్ వరదను లెక్కచేయకుండా దిగాడు. చాలా దూరం ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చాడు. సంతోష్ గౌడ్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్‌షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్‌హెచ్‌వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్‌షెహర్‌కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్‌ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
ఏపీలో ఆల్‌టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్‌శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్‌ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్‌కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు. చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం -
కోతల్లేని కరెంట్..
నాడు చీకటి రోజులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్ సరఫరా ఉండదు’ అని అధికారికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్ కట్ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు. నేడు వెలుగు జిలుగులు ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో అక్కడక్కడ ఓవర్‌లోడ్‌తో ట్రిప్ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్ 248.985 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్ డిమాండ్ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది. అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్‌గా చెప్పవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్ నుంచి 25.605 మి.యూ, విండ్ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్‌లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్‌లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. సరిపడా బొగ్గు నిల్వలు దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్‌ను పెంచాలని ఏపీజెన్కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి. 14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి, సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్‌లో 83,479 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్ పునరుద్ధరణ సోలార్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్ జనరేటర్లు పీక్ లోడ్‌లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్ వద్ద జనరేటర్లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్ అయ్యాయి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్ ఉత్పత్తి అందుబాటులో లేదు. గ్యాస్ పరిమితి కారణంగా గ్యాస్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్‌లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ఎక్కడా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది. జిరాక్స్ మిషన్లు, పిండి మరలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, కూలింగ్ వాటర్ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది. -
‘24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం’
సాక్షి, విజయవాడ: విద్యుత్ కోతలు ఉండకూదనే తరచు సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతలు అనే సమస్యే రాలేదన్నారు. ఈరోజు(గురువారం) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ‘ 2016లో శంకుస్థాపనలు చేసి వదిలేసిన సబ్స్టేషన్లను మేం పూర్తి చేశాం. విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతల్లేవు. 24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం. రైతులు, పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని సీఎం నెరవేర్చారు. రైతులకు పగటిపూటే విద్యుత్ ఇస్తున్నాం. ఒక విద్యుత్ కనెక్షన్ కూడా పెండింగ్‌లో లేదు. మేం వచ్చాక లక్షా 25వేల పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. రైతులు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు -
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్‌ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్‌క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అమెరికాలో భీకర మంచు తుపాను.. 1989 తర్వాత తొలిసారిగా బ్లిజ్జార్డ్ వార్నింగ్
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన
జగిత్యాల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు. -
పంటలకు ‘కట్’కట!
రైతు: సర్.. నమస్తే! ఏఈ: నమస్తే..చెప్పండి రైతు: సర్.. త్రీఫేజ్ కరెంట్ ఏమైంది? ఇట్లా కట్ చేస్తున్నారు? ఏఈ: (మధ్యాహ్నం) మూడింటికి త్రీఫేజ్ తీయమన్నారండి. మూడింటికి తీస్తున్నాం. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మూడింటి వరకు ఇవ్వమన్నారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఇస్తారో తెల్వదు. రైతు: ఎన్నిరోజులు సర్ ఇట్లా? ఏఈ: తెల్వదండి మాకు. ఇన్ఫర్మేషన్ ఏం ఉండదు. పై నుంచి ఎలా వస్తే అలా ఫాలో అవుతున్నాం. రైతు: 24 గంటలు అంటున్నారు. కనీసం 10 గంటలు కూడా కరెంట్ ఇస్తలేరు. నైట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎండలు కొడ్తున్నాయి. ఇన్ని రోజుల్లాగా కాకుండా ఇప్పుడు పంటలకి వాటర్ అవసరం. మందు కొడ్తామన్నా నీళ్లు లేవు. ఒకసారేమైన (కరెంట్) ఆన్ చేయగలుగుతరా సర్? ఏఈ: లేదండి.. సాధ్యం కాదు. పై నుంచి ఆర్డర్స్ కదా. మనం ఏమీ చేయలేం. రైతు: 24 గంటలని చెప్పి ఇట్లా కట్ చేస్తే మా పంటలు ఏం కావాలి? ఇప్పుడు కరెంట్ తీస్తే ఎట్లా? .. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన ఓ రైతు, విద్యుత్ శాఖ ఏఈ మధ్య ఇటీవల జరిగిన ఈ ఫోన్ సంభాషణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ రైతు కాల్‌ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అనధికారికంగా గణనీయ స్థాయిలోనే కోతలు అమలవుతున్నాయి. వ్యవసాయానికి కేవలం 8–10 గంటలు మాత్రమే.. అదీ ఉదయం, రాత్రి రెండు దఫాలుగా త్రీఫేజ్ కరెంట్ సరఫరా జరుగుతోంది. జిల్లాలు, సబ్స్టేషన్ల వారీగా సరఫరా వేళల్లో తేడాలు ఉంటున్నాయి. మధ్య మధ్యలో విద్యుత్ ట్రిప్ అవుతుండటంతో మోటార్లు ఆగిపోయి.. పంటలకు నీళ్లు అందడం లేదని రైతులు వాపోతున్నారు. వేసవికి ముందే కోతలు మొదలవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నిర్మల్, గద్వాల, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పలువురు రైతులు ఆందోళన బాట పట్టారు. విద్యుత్ వినియోగ అంచనాలు తప్పడం, భారీ నష్టాల నేపథ్యంలో బహిరంగ కొనుగోళ్లను తగ్గించడమే కోతలకు కారణమని ట్రాన్స్‌కో వర్గాలు చెప్తున్నాయి. వినియోగ అంచనాలు తప్పడంతో.. రాష్ట్రంలో మొత్తం 1,65,48,929 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. గృహ విద్యుత్ కనెక్షన్లు 72.85 శాతం, వ్యవసాయ కనెక్షన్లు 15.49 శాతం, పరిశ్రమలు, ఇతర వాణిజ్య కనెక్షన్లు 11.66 శాతం ఉన్నాయి. లెక్కల ప్రకారం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 27 లక్షలకుపైగా ఉంటుంది. గత ఏడాదికి కంటే ఈసారి 5 నుంచి 10 శాతం వరకు విద్యుత్ వినియోగం పెరగొ చ్చని అధికారులు అంచనా వేసుకుంటే.. ఇప్పటికే 15 నుంచి 20 శాతం వరకు పెరిగినట్టు సమాచారం. భారీ నష్టాలు.. తగ్గిన కొనుగోళ్లు.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత సరఫరాతో డిస్కంలపై భారం పడుతోంది. మరోవైపు కాళేశ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాలతోపాటు ప్రభుత్వ శాఖలు/విభాగాల నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించక.. డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఎన్నడూ లేనట్టుగా 2022–23లో రూ.5,597 కోట్ల మేర చార్జీలను పెంచినా డిస్కంల నష్టాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లను విద్యుత్ సంస్థలు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రోజుకు రూ.70–100 కోట్ల ఖర్చుతో 20–30 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం రూ.20–30 కోట్లతో 5 మిలియన్ యూనిట్లలోపే కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. వేసవిలో కష్టమే! వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్టంగా 14,160 మెగావాట్ల డిమాండ్ నమోదవగా.. ఈసారి 16,000 మెగావాట్ల వరకు ఎగబాకే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో విద్యుత్ కొరత, ధరలు భారీగా పెరగొచ్చని అంటున్నాయి. దీనితో గృహ వినియోగానికీ కోతలు పెట్టక తప్పని పరిస్థితి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫొటోలోని రైతు గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురానికి చెందిన కృష్ణయ్య. నాలుగెకరాల భూమి, అందులో 2 బోర్లు ఉన్నాయి. యాసంగిలో ఎకరా పొగాకు సాగు చేశాడు. 3ఎకరాల్లో వరి సాగుకు సిద్ధమైనా.. కరెంటు కోతలు మొదలవడంతో ఒక ఎకరాలోనే వరి నాటు వేశాడు. మిగతా రెండెకరాలు బీడుగానే వదిలేశాడు. ఇప్పటికీ రాత్రి, పగలు బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ పొగాకు, వరికి నీరు పారించుకుంటున్నట్టు చెప్తున్నాడు. రోజంతా బావి వద్దనే.. యాసంగిలో రెండెకరాల్లో మొక్కజొన్న వేశా. పంట 45 రోజుల వయసులో ఉంది. పది రోజులుగా కరెంటు సరిగా ఉండటం లేదు. త్రీఫేజ్ కరెంట్ తరచూ ట్రిప్ అవుతోంది. రెండు, మూడు గంటలు కూడా నీరు పారడం లేదు. రోజంతా పడిగాపులు కాస్తూ మోటార్ ఆన్ చేసుకోవాల్సి వస్తోంది. మరో 10 రోజులు ఇలాగే ఉంటే పంట దెబ్బతింటుంది. – జంగిలి రవి, గుడ్డెలుగులపల్లి, దుగ్గొండి, వరంగల్ -
Telangana: ఇక ప్రతి నెలా సర్దుబాదుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతి నెలా ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) వసూలు చేసేందుకు లేదా వారికి తిరిగి చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మూడో సవరణ నిబంధనలు–2023ను బుధవారం ప్రకటించింది. ఇంధన/ విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు చార్జీల భారాన్ని ఆటోమేటిక్‌గా విద్యుత్ బిల్లులకు బదిలీ చేసేందుకు ..కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు చేంజ్ ఇన్లా) రూల్స్ 2021ను అమల్లోకి తెచ్చింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో సైతం ఇంధన సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విజ్ఞప్తి చేయగా, తాజాగా ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన సర్దుబాటు చార్జీలను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములాను సైతం ప్రకటించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల వసూళ్లు అమల్లోకి రానున్నాయి. రుణాత్మకంగా తేలితే రిఫండ్ ► తెలంగాణ ఈఆర్సీ నిబంధనల ప్రకారం.. ఎన్ (ఒక నెల) నెలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీలను ఎన్+2 (మూడవ నెల)కు సంబంధించిన బిల్లుతో కలిపి ఎన్+3 (4వ నెల) నెలలో డిస్కంలు జారీ చేస్తాయి. ఉదాహరణకు జనవరి నెల ఇంధన సర్దుబాటు చార్జీలను డిస్కంలు మార్చి నెల బిల్లుతో కలిపి ఏప్రిల్ నెలలో వినియోగదారులపై విధించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించిన తర్వాత రుణాత్మకంగా తేలితే ఆ మేరకు వినియోగదారులకు రిఫండ్ (తిరిగి చెల్లించాలి) చేయాల్సి ఉంటుంది. 30 పైసలకు మించితే ముందస్తు అనుమతి తప్పనిసరి ► యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒక వేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కు 30 పైసలకు మించితే ఆపై ఉండే అదనపు మొత్తాన్ని ఈఆర్సీ ముందస్తు అనుమతి లేకుండా విధించడానికి వీలులేదు. వ్యవసాయం మినహా అందరిపై వడ్డన.. ► ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయ వినియోగదారులు మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు విధించడానికి ఈఆర్సీ అనుమతినిచ్చింది. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోరింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఆ మొత్తాలను తర్వాతి కాలంలో ఇతర వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించబోమని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గడువులోగా వసూలు చేసుకోవాల్సిందే.. ► నిర్ణీత కాల వ్యవధిలోపు ఎఫ్ఎస్ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాత వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. 45 రోజులు దాటితే ఆ నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను అనుమతించరు. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతో పాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేయాలి. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి అందజేయాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు కీలకం.. ► ప్రతి ఏటా నవంబర్ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకుని ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభ, నష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైన పక్షంలో వీటిని సమర్పించే వరకు ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన చార్జీలకు, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ వ్యయానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల పేరిట వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అనుమతిస్తుంది. -
బొగ్గు కొరతతోనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ బంద్
సాక్షి, హైదరాబాద్: బొగ్గు లభ్యత లేకనే ఛత్తీస్‌గఢ్ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలుపుదల చేయడంలో వాస్తవం లేదని పేర్కొంది. మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. ‘రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ట్రాన్స్‌కో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘సొంత అవసరాల బొగ్గు గని (క్యాప్టివ్ మైన్) నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో అడ్డంకుల నేపథ్యంలో రోడ్డుతోపాటు రైలు మార్గాన్ని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తోంది. ఇతర వనరుల నుంచి కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. ఆలస్యంగానైనా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి కాప్టివ్ గని కేటాయింపులు జరగడంతో బొగ్గు లభ్యత చేకూరడంతోపాటు విద్యుత్ వేరియబుల్ ధర తగ్గింపునకు దోహదపడింది. దీంతో అధిక ధరలతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను నివారించినట్టు అయింది. తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులకు లోబడి ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సిన బకాయిలను అంగీకరించడం జరిగింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 కింద ఆర్ఈసీ/పీఎఫ్‌సీల ద్వారా పాత బకాయిల చెల్లింపునకు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ స్థిర ధర (ఫిక్స్డ్ కాస్ట్) మినహా టారిఫ్ విషయంలో ఇతర తీవ్రమైన వివాదాలేమీ లేవు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర ధరను ఢిల్లీలోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాం. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర చార్జీలను పరిగణనలోకి తీసుకున్నా, షార్ట్ టర్మ్ మార్కెట్, ఎక్సే్ఛంజీల విద్యుత్ ధరలతో పోటీపడేలానే ఉంది. విద్యుత్ ధరలను ఛత్తీస్‌గఢ్ అసాధరణంగా పెంచేసిందనడం సరికాదు. ఎందుకంటే, ఈఆర్సీ ఖరారు చేసిన టారిఫ్‌ను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది’అని ట్రాన్స్‌కో తెలిపింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా లేకున్నా, అందుకోసం బుక్ చేసుకున్న ట్రాన్స్మిషన్ లైన్లకు చార్జీలు చెల్లిస్తున్న అంశంపై సైతం ట్రాన్స్‌కో వివరణ ఇచ్చింది. పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్లతోపాటు పవర్ బ్యాంకింగ్ అవసరాలకు ఈ లైన్లను వాడుకుంటున్నట్టు తెలిపింది. ట్రాన్స్‌కో, డిస్కంల భిన్న వాదనలు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై తెలంగాణ ఈఆర్సీకి రాష్ట్ర డిస్కంలు ఇచ్చిన వివరాలు, ‘సాక్షి’ కథనంపై తెలంగాణ ట్రాన్స్‌కో ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. బొగ్గు కొరత వల్లే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ఆగినట్టు ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో డిస్కంలు ఎక్కడా పేర్కొనలేదు. ఛత్తీస్‌గఢ్‌కి ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలతోపాటు మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయంపై వివాదంతోనే సరఫరా జరగడం లేదని తెలిపాయి. బకాయిలిచ్చే వరకు సరఫరా చేయం: ఛత్తీస్‌గఢ్ ‘మాకు బకాయిపడిన దీర్ఘకాలిక బకాయిలను చెల్లించేవరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయం. తెలంగాణకు 2023–24లో ఎలాంటి విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకోబోం’ అని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీఎస్పీడీసీఎల్).. ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలియజేసింది. ఈ విషయాన్ని తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)–2023–24లో పొందుపర్చింది. -
ముదిరిన వివాదం.. తెలంగాణకు ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా పూర్తిగా బంద్ అయింది. ప్రస్తుత (2022–23) ఆర్థిక సంత్సరంలో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ఛత్తీస్‌గఢ్ సరఫరా చేయలేదు. ధరతోపాటు బకాయిలను ఛత్తీస్‌గఢ్ భారీగా పెంచేయగా, తెలంగాణ డిస్కంలు అంగీకరించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేస్తున్న విజ్ఞప్తులను ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీఎస్పీడీసీఎల్) నిరాకరిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టంచేసింది. తెలంగాణ డిస్కంలు, సీఎస్పీడీసీఎల్ మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం రాష్ట్రానికి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. 2020–21లో 39.67శాతం, 2021–22లో కేవలం 1,631 మిలియన్ యూనిట్ల (19శాతం) విద్యుత్ మాత్రమే ఛత్తీస్‌గఢ్ సరఫరా చేసింది. 2022–23లో పూర్తిగా నిలిపేసింది. తాజాగా ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు.. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి నివేదించాయి. ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు సద్దుమణిగితే 2022–23 రెండో అర్ధ వార్షికంలో 2,713 ఎంయూల (31%) విద్యుత్ సరఫరా జరగొచ్చని అంచనా వేస్తున్నామన్నాయి. భారీగా పెంచేసిన ఛత్తీస్‌గఢ్ 2022 జూన్ 3 నాటికి బకాయిపడిన రూ.3,576.89 కోట్లను చెల్లిస్తేనే ఒప్పందం మేరకు 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని 2022 సెప్టెంబర్ 23న ఛత్తీస్‌గఢ్ ఇన్వాయిస్ పంపింది. అయితే, రూ.2,100 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని అప్పట్లో తెలంగాణ డిస్కంలు బదులిచ్చాయి. తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం యూనిట్ విద్యుత్‌కు రూ.3.90 మాత్రమే చెల్లిస్తామన్నాయి. అయితే, ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయం ఆధారంగా ధర చెల్లించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఉత్తర్వులతోపాటు పీపీఏ తుది అనుమతులను సవాల్ చేస్తూ.. తెలంగాణ డిస్కంలు 2018లో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్)లో కేసు వేశాయి. ఎంవోయూ ఆధారంగా ఒప్పందం! ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు, సీఎస్పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్ 22న ఒప్పందం (పీపీఏ) జరిగింది. టెండర్లకు బదులుగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్ 3న జరిగిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఆధారంగా ఈ పీపీఏ జరిగింది. నాడు చౌకగా వస్తుందని.. నేడేమో నష్టమని.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్ల ఒప్పంద కాలంలో రూ.12వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లో విద్యుత్ రంగ నిపుణులు రఘు ఈఆర్సీకి వివరించారు. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీని కోరింది. తాజాగా ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో మాత్రం రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతోందని తెలంగాణ డిస్కంలు అంగీకరించడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో జరగనున్న నష్టంపై నాటి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ టీఎస్ఈఆర్సీకి 2016 డిసెంబర్లో లేఖ సైతం రాశారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీవేటు వేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పంపింది. ఛత్తీస్‌గఢ్ పీపీఏను కొన్ని మార్పులతో అనుమతిస్తూ టీఎస్ఈఆర్సీ 2017 మార్చి 31న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. డిస్కంలకు భారీగా నష్టం వివాదాల్లో ఉన్న బకాయిలను అప్టెల్ తీర్పునకు లోబడి చెల్లిస్తామని, వివాదాల్లేని బకాయిలను.. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం చెల్లిస్తామని డిస్కంలు ఛత్తీస్‌గఢ్‌కు తెలిపాయి. అయినా ఛత్తీస్‌గఢ్ అంగీకరించడం లేదు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నామని డిస్కంలు ఈఆర్సీకిచ్చిన వివరణలో పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను తెచ్చేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఎల్)కు చెందిన వార్ధా–డిచ్పల్లి–మహేశ్వరం ట్రాన్స్మిషన్ లైన్లో 1000 మెగావాట్ల కారిడార్‌ను 12 ఏళ్ల కోసం తెలంగాణ డిస్కంలు బుక్ చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ రాకపోయినా పీజీసీఎల్‌కు ట్రాన్స్మిషన్ చార్జీల (ఏటా రూ.400 కోట్లకు పైగా)ను చెల్లించి నష్టపోతున్నామని ఈఆర్సీకి తెలిపాయి. -
ఇంధన పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్‌కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు. నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు. ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్సీ జనరల్ మేనేజర్ మదన్మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ కోసమే మీటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. ‘రైతు చేనుకు కడప మీటరు’ పేరుతో ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులో వాస్తవాలతో వారు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు.. రైతుల ప్రయోజనానికే మీటర్లు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోఎంఎస్ 22, తేదీ 01.09.2020) ప్రకారం పెడుతున్న ఈ మీటర్ల వల్ల మోటార్లు కాలిపోవు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ఎంత విద్యుత్ వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల సరిపడా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. మీటర్ల ఏర్పాటుకు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో.. దానికయ్యే చార్జీలను మొత్తం ప్రభుత్వమే నేరుగా రైతుల ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద జమచేస్తుంది. ఆ డబ్బు నేరుగా రైతుల ద్వారా డిస్కంలకు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియల వల్ల పూర్తి పారదర్శకత ఉంటుంది. కరెంటు సరఫరా కంపెనీలను ప్రశ్నించేహక్కు రైతులకు లభిస్తుంది. కంపెనీలకు కూడా బాధ్యత పెరుగుతుంది. తగ్గుతున్న నష్టాలు ప్రస్తుతం ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చాం. రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాల్సి ఉంది. ఈ వ్యవసాయ సర్వీసులు దూర ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల ఈ పద్ధతిలో రీడింగ్ తీయడం కష్టంగా ఉంది. అందుకే స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలు సంకల్పించాయి. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లను ఏర్పాటుచేసిన తర్వాత ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (స్వతంత్ర గ్రూప్) సర్వే రిపోర్టు ప్రకారం నష్టాలు 15–20 శాతానికి తగ్గినట్లు నమోదైంది. ఆ టెండర్లు ఎప్పుడో రద్దు విద్యుత్ సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లోని త్రీఫేజ్ మీటర్లకు డీబీటీ విధానం కోసం ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. ఆర్డీఎస్ఎస్ కింద స్మార్ట్ మీటర్లను గడువులోపు పూర్తిచేస్తే 22.50 శాతం గ్రాంటు రూపంలో సమకూరుతుంది. మొదటి రీడింగ్ తీసిన తర్వాత కాంట్రాక్టర్‌కు ఒక్కో మీటరుకు కెపెక్స్ కింద రూ.1,800 చొప్పున చెల్లిస్తాం. తర్వాత మిగిలిన మొత్తంతోపాటు ఆపరేషన్, మెయింటెనెన్స్, రీడింగ్‌ల కోసం అయ్యే మొత్తాన్ని నెలవారీగా ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలవ్యవధిలో ప్రాజెక్టు వ్యయాన్ని ఇస్తాం. వీటికి నెలకు రూ.254 చొప్పున గుత్తేదార్లు టెండర్లను దాఖలు చేశారు. కోవిడ్–19 సమయంలో రూపొందించిన అంచనాల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వం టెండర్లు రద్దుచేసింది. ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించిన తర్వాతే కొత్తగా టెండర్లు పిలుస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్ల కోసం ఆఫర్ చేసిన బిడ్లలో ఒక్కో మీటరుకు నెలకు వ్యయం రూ.200.96 పైసలుగా ఖరారైంది. ఏడున్నర సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వీటిలో 80 శాతం సింగిల్‌ఫేజ్ మీటర్లు కాగా 20 శాతం మాత్రమే త్రీఫేజ్ మీటర్లు. కానీ ఏపీలో వ్యవసాయ సర్వీసులన్నీ త్రీఫేజ్ మీటర్లే. ఒక్కో మీటరుకు కేంద్రప్రభుత్వ అంచనా ధర పదేళ్ల కాలపరిమితికి రూ.6 వేలు. దీనికి అనుగుణంగా మీటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట తొమ్మిదిగంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి సుమారు రూ.1,700 కోట్లు ఖర్చుచేసి ఫీడర్లను ఏర్పాటు చేశాం. గడచిన 90 రోజుల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 48 గంటల్లోపే కొత్తవాటిని బిగించాం. రానున్నరోజుల్లో నూటికి నూరుశాతం 48 గంటల్లోపే మార్చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి అన్ని రకాల చర్యలను విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయం మీటరుకు అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతోందని ఈనాడు దినపత్రిక రాసిన కథనంలో వాస్తవం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.14,455 వ్యయంతో, మీటరు బాక్స్‌తో పాటు, పీఈసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్లో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంకు సమకూరుతుంది. అనుబంధ పరికరాలను అమర్చడానికి, అవి పాడైపోకుండా ఉండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. వ్యవసాయ పంపుసెట్లకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని సంస్థలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన వోల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. -
తీగ తెగితే.. కరెంటు ఆగాలి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం విద్యుత్ వైర్లను తాకడం వల్లనే జరుగుతున్నాయని, వీటి నుంచి ప్రజలను రక్షించేందుకు విదేశాల్లో అమల్లో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ స్టాండింగ్ కమిటీ సూచించింది. వైరు తెగిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేసే ఫీడర్ ప్రొటెక్షన్ రిలే విధానంపై అధ్యయనం చేయాలని చెప్పింది. విద్యుత్ భద్రతపై జాతీయస్థాయిలో మూడేళ్ల తరువాత 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. విద్యుత్ భద్రత, సరఫరాకు ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనలు–2010లో సవరణలు చేయాలని కమిటీ సూచించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. కమిటీ చైర్మన్ గౌతమ్ రాయ్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు రాష్ట్రాలు సూచన లివ్వాలని కోరారు. వాటిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని సవరిం చేందుకు సీఈఏకి నివేదిక పంపుతామని తెలిపారు. కమిటీ మెంబర్ సెక్రటరీ రమేష్‌కుమార్ మాట్లాడుతూ 2017లో ఈ కమిటీ ఏర్పడి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తోందని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ భద్రతపై అవగాహన నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కండక్టర్ల స్నాపింగ్, లైవ్‌వైర్లతో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంద న్నారు. సీఈఏ అసిస్టెంట్ డైరెక్టర్ ముకుల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్ర ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం ఆ«ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముంబై (వెస్ట్), చెన్నై (సౌత్), ఢిల్లీ (నార్త్), కోల్‌కతా (ఈస్త్), మేఘాలయ (నార్త్ఈస్ట్) ప్రాంతీయ ఇన్స్పెక్టరేట్ల డైరెక్టర్లు, వివిధ రాష్ట్రాల ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ల సిబ్బంది పాల్గొన్నారు. -
సత్ఫలితాలిస్తున్న ‘పాట్’
సాక్షి, అమరావతి: భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) పదేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాట్ వల్ల రాష్ట్రంలోని 36 భారీ పరిశ్రమల్లో దాదాపు రూ.5,709 కోట్ల విలువైన బొగ్గు, చమురు, గ్యాస్, లిగ్నైట్‌తో కూడిన 0.818 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనం ఆదా అయింది. అంతేకాదు.. 2.464 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను కూడా తగ్గించింది. ‘బీఈఈ’ ప్రోత్సాహం పరిశ్రమలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ కరెంటును సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) పాట్ పథకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను అందిస్తోంది. రాష్ట్రంలో ఏపీఎస్ఈసీఎం ద్వారా 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది. ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందిస్తాయి. తద్వారా ఇంధన ఆదాకు దోహదపడతాయి. పాట్ పథకం లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కూడా బీఈఈ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 4,01,496 సర్టిఫికెట్లను అందించింది. వీటిని పవర్ ఎక్సే్ఛంజ్‌లో విక్రయించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించని పరిశ్రమలు ఆ సర్టిఫికెట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయాలి. అలా 2,79,667 సర్టిఫికెట్లను పలు పరిశ్రమలు కొన్నాయి. అన్ని పరిశ్రమలు ‘పాట్’ పరిధిలోకి రావాలి భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో పాట్ పథకం వల్ల భారీ పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం పెరిగింది. ఈ పథకం పరిధిలోకి రావాలని అన్ని పరిశ్రమలను కోరుతున్నాం. –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని, ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అమలుపై ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశం వివరాలను రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పైసా చెల్లించక్కర్లేదు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులైన రైతులెవరూ కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, వారి ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆ డిస్కంలను డిమాండ్ చేసే హక్కు రైతులకు లభిస్తుందన్నారు. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా నిరోధించేందుకు మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. ఒక రైతుకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదని స్పష్టం చేశారు. అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్దీకరిస్తామన్నారు. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. మీటర్ల ఏర్పాటుకు రైతులు అనుకూలం మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్రంలో లక్షలాదిమంది రైతులు(97 శాతం) ఇప్పటికే అంగీకార పత్రాలను అందజేశారని అధికారులు మంత్రికి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని, ఆ జిల్లాలో మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. ఈ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 30 ఏళ్ల పాటు ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ప్రత్యేకంగా వ్యవసాయం కోసమే 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సమీక్షలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీట్రాన్స్కో సీఎండీ శ్రీధర్ పాల్గొన్నారు. -
లైన్‌మెన్‌తో గొడవ, రైతుకు షాకిచ్చిన విద్యుత్ సిబ్బంది, ఏకంగా రూ.65వేల బిల్లు
సాక్షి, వికారాబాద్: ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్ వ్యవసాయ కూలీ.. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్ నంబర్ 58లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతినెల విద్యుత్ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్మెన్.. రెడ్యానాయక్‌తో మీటర్ బాగాలేదు వేరే మీటర్ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్మెన్కు రూ.2వేలు ఇచ్చాడు. డబ్బులిచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్ బిగించకపోవడంతో రెడ్యానాయక్ గత నెల (జూన్)లో లైన్మెన్ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు లైన్మెన్ వచ్చే నెల చూడు నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65,240 బిల్లు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక రైతు విద్యుత్ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కాలుస్తేనే అంత బిల్లు వస్తదిగా అని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. ఎన్నడూ రానంతగా ఇంతమొత్తంలో విద్యుత్ బిల్లు వస్తే ఎం చేయాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతినెల రూ.100లోపు బిల్లు వచ్చేదని దానిని నిర్ణీత గడువులోపు చెల్లిస్తూనే ఉన్నాని.. లైన్మెన్ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ ఖజాను వివరణ కోరగా 2014నుంచి రైతు మినిమం బిల్లును ప్రతి నెల కడుతున్నాడని అందుకే రీడింగ్ జామ్ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. -
యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, పోటెత్తుతున్న గోదావరి వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలోని విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనేక చోట్ల ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు కుప్పకూలాయి. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని రాజమండ్రి, అమలాపురం, రంపచోడవరం, రామచంద్రపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు డివిజన్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 5 దెబ్బతినగా ఒక సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. 33 కేవీ ఫీడర్ ఒకటి పాడైంది. 11 కేవీ ఫీడర్లు 29 పాడయ్యాయి. 11 కేవీ స్తంభాలు 534, 11 కేవీ లైన్లు 20 కిలోమీటర్లు, ఎల్టీ స్తంభాలు 557, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,326 దెబ్బతిన్నాయి. 4 మండలాలు, 241 గ్రామాలు, 2548 వ్యవసాయ,33226 వ్యవసాయేతర సర్వీసులకు 62 ప్రత్యేక బృందాలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు డిస్కం సీఎండీ సంతోషరావు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, సీఆర్డీఏ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో 33 కేవీ ఫీడర్లు 2, 33కేవీ స్తంభాలు 7, 11కేవీ ఫీడర్లు 13 దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 11కేవీ స్థంభాలు 173 పడిపోగా వాటిలో 104 నిలబెట్టారు. డిస్కం మొత్తం మీద 11కేవీ లైన్లు 3.54 కిలోమీటర్ల మేర తెగిపోగా బుధవారానికి 2.56 కి.మీ మేరకు బాగు చేశారు. ఎల్టీ లైన్లు 12.73 కి.మీ దెబ్బతినగా, 5 కి.మీ సరిచేశారు. ఎల్టీ స్తంభాలు 242 ఒరిగిపోగా 211 స్తంభాలను పునరుద్ధరించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) 77 దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో 31 డీటీఆర్లను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగవచ్చు.. జాగ్రత్త భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశముందని, విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని డిస్కంల సీఎండీలు విజ్ఞప్తి చేశారు. కరెంటుతో సంబంధం ఉండే ఏ వస్తువునైనా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరువాతే తాకాలని సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియజేయాలన్నారు. -
అన్ని చోట్లా పరిశ్రమలు
పటాన్చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఆల్ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆల్ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరాయంగా విద్యుత్
సీలేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): భవిష్యత్‌లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని ఏపీ జెన్కో హైడల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో పలు జలవిద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్‌కల్లా పోలవరం ప్రాజెక్టులో మూడు యూనిట్లు, 2024 జూలైలో మరో మూడు యూనిట్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2026 జనవరి నాటికి అన్ని యూనిట్లను పూర్తిస్థాయిలో ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. విండ్, సోలార్, హైడల్ విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలోని 4 యూనిట్లలో 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా.. అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా కూడా సీలేరు కాంప్లెక్సులో 1,035 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ ప్రాజెక్టు కోసం సర్వేలు చేపట్టామన్నారు. ఇవి పూర్తయితే రాష్ట్రమంతటికీ నిరంతరాయంగా విద్యుత్ అందించగలుగుతామని చెప్పారు. డొంకరాయి పవర్ కెనాల్ మరమ్మతు పనులు 80 శాతం పూర్తయినట్టు చెప్పారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!
వజ్రపుకొత్తూరు రూరల్: బుధవారం ఉదయం 8.30 గంటల సమయం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 15 గ్రామాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడి ఓ వైపు.. ఉక్కపోత మరోవైపు.. వెంటనే పలువురు వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఐదుగురు లైన్మెన్లు, సచివాలయ విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి లైన్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. గంట సమయం గడిచినా సమస్య ఏంటనేది మాత్రం తేలలేదు. కిడిసింగి గ్రామం నుంచి మొదలైన వీరి అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. చివరకు రెండున్నర గంటల తర్వాత డోకులపాడులోని చర్చి వద్దనున్న స్తంభంపైన అసలు విషయం బయటపడింది. తీగల మధ్య ఓ తొండ చిక్కుకుపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు ‘హమ్మ తొండా.. ఎంత పని చేశావే!’ అంటూ నవ్వుకున్నారు. -
పరిశ్రమలకు పూర్తి విద్యుత్తు
సాక్షి, అమరావతి: ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశ్రామిక రంగానికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత్ సంస్థల అధికారులతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై అన్ని పరిమితులను ఎత్తివేసి సాధారణ స్థితిని పునరుద్ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో అధిక ధరలతో కొనుగోలుకు కూడా వెనుకాడలేదన్నారు. విదేశీ బొగ్గుకు టెండర్లు రాష్ట్రంలో బొగ్గు సరఫరా పర్యవేక్షణకు కోర్ మేనేజ్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా స్థితిగతులను సీఎం తరచూ సమీక్షిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, 32 లక్షల టన్నుల విదేశీ బొగ్గు దిగుమతి కోసం టెండర్లు జారీ చేశామని వివరించారు. దేశంలో బొగ్గు సరఫరా ఇంకా సమస్యాత్మకంగానే ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్ సంస్థలకు సూచించారు. ఖరీఫ్‌కు కొరత రాకూడదు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాకూడదని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటున్నామని, బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఏండీ ఐ. పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు కె.సంతోషరావు, జే పద్మజనార్దనరెడ్డి, హెచ్. హరనాథరావు, డైరెక్టర్ ఏవీకే భాస్కర్ పాల్గొన్నారు. -
పరిశ్రమలకు 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఇంకా కొనసాగుతున్నా, రాష్ట్రంలో నిత్యం 195.26 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నప్పటికీ పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచే పరిశ్రమలపై ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ఏపీఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. బొగ్గు కొరత, ఎండలతో.. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావంతో గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 235 మిలియన్ యూనిట్లకు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుదుత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పవర్ ఎక్ఛ్సేంజీల్లో యూనిట్ ధర రూ.16 నుంచి రూ.20 వరకూ పెరిగింది. ఫలితంగా సరఫరా తగ్గి కోతలు అనివార్యమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై నియంత్రణ విధించాల్సి వచ్చింది. డిస్కమ్‌ల అభ్యర్ధన మేరకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తూ ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో.. మే 9న పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసి ప్రభుత్వం ఊరట కలిగించింది. నిరంతరం నడిచే పరిశ్రమలు 70 శాతం విద్యుత్ వాడుకోవడానికి అనుమతిచ్చింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ ఈ నెల 13న ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 తరువాత పరిశ్రమలపై ఆంక్షలను పొడిగించలేదు. పరిశ్రమలకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని ఆంక్షలు, నియంత్రణలను తొలగించడంతో పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఊరట లభించింది. వ్యవసాయం, గృహ విద్యుత్ అవసరాలకు కోతలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరుగుతోంది. -
ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ
నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరేందుకు ఫిన్లాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా విద్యుత్ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్ కంపెనీగానీ, అటు ఫిన్గ్రిడ్ మాత్రం వెల్లడించలేదు. ఫరక్ పడదు ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్ మాత్రమే. ఆ లోటును స్వీడన్ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చదవండి👉🏼: ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం -
పరిశ్రమలపై తొలగనున్న ఆంక్షలు
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలపై విధించిన ఆంక్షలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సరఫరాపై పరిశ్రమలకు విధించిన కొద్దిపాటి ఆంక్షలను వీలైనంత త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై డిస్కంల సీఎండీలు స్పందిస్తూ.. బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అంతరాయాలు లేకుండా గృహాలకు నిరంతరం, వ్యవసాయానికి పగటిపూట 7గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డైరెక్టర్ ఏవీకే భాస్కర్, డిస్కంల సీఎండీలు సంతోషరావు, పద్మజనార్ధనరెడ్డి, హరనాథరావు పాల్గొన్నారు. -
కరెంట్ కష్టాలకు చెక్.. పునరుత్పాదక విద్యుత్‌కు ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్ముందు కరెంట్ కష్టాలు తలెత్తకుండా.. పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించే లక్ష్యంతో 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ (పీఎస్పీ) ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి పుష్కలంగా నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు ఇంధన రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అంతేకాక.. మన విద్యుత్ అవసరాలు తీర్చుకుంటూనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండటంతో, రాష్ట్రానికి ఆదాయం సమకూరనుంది. రిపోర్టులన్నీ సిద్ధం.. రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల 33,240 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ పీఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లను అధికారులు రూపొందించారు. మొదటి దశలో 6,600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడుచోట్ల నిర్మించే ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేస్తున్నారు. వీటిలో నాలుగు రిజర్వాయర్ల ఆధారిత ఆన్ రివర్ ప్రాజెక్టులు కాగా.. మరో మూడు ఆఫ్ రివర్ ప్రాజెక్టులని అధికారులు చెబుతున్నారు. ఇక మొదటి దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లకు అధికారులు పంపించారు. గండికోట, కురుకుట్టి, కర్రివలసల్లో ఏర్పాటుచేసే పీఎస్పీ ప్రాజెక్టులకు సంబంధించి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేను పూర్తిచేశారు. అలాగే.. చిత్రావతి, గండికోట, సోమశిల, కురుకుట్టి, కర్రివలసలలో ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. రెండో దశలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ఫీజిబిలిటీ రిపోర్టులను కూడా న్యూ–రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అధికారులు రూపొందిస్తున్నారు. ఆదాయంతోపాటు యువతకు ఉపాధి ప్రతి వినియోగదారునికి ఇరవై 4 గంటలూ విద్యుత్ సరఫరాను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి పీఎస్పీ ప్రాజెక్టులు దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెన్యువబుల్ ఇంధన ఎగుమతి విధానం కింద పీఎస్పీ ప్రాజెక్టుల్లో తయారయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. అదే విధంగా వీటివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది. – ఎస్ రమణారెడ్డి, వైస్‌చైర్మన్/ఎండీ, ఎన్ఆర్ఈడీసీఏపీ -
సింహాద్రిలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
పరవాడ/పెదగంట్యాడ/సీలేరు: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను కలపాక, గాజువాక 400 కేవీ సబ్స్టేషన్లకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వల్ల సబ్స్టేషన్ల లైన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సింహాద్రి ఎన్టీపీసీలోని 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా నాలుగో యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతుందని, బుధవారం ఉదయానికి మిగిలిన 3 యూనిట్ల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. హిందూజా, సీలేరులోనూ అంతరాయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోనూ 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెందుర్తి 400 కేవీ సబ్‌స్టేషన్ నుంచి గ్రిడ్‌కు వెళ్లాల్సిన లైన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో యూనిట్లు ట్రిప్ అవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోని పలు చోట్ల తెల్లవారుజామున 3.15 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో కలపాక వద్ద గల సబ్‌స్టేషన్‌లో హై ఇన్సులేషన్ ఫీడర్ ఆగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
సాగు, ఇళ్లకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్‌లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో.. రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది. సగం తగ్గించుకుంటే.. గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది. పవర్ హాలిడే ఇలా ► ఏపీఎస్పీడీసీఎల్లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు. ► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
‘చీకటి’ రాజకీయంపై విచారణకు ఆదేశం
శాంతిపురం/తిరుపతి రూరల్: టీడీపీ నాయకులు ప్రమాదం పేరిట విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించి, విద్యుత్ కోతలపై నిరసనలకు దిగిన వ్యవహారంపై ఎస్పీడీసీఎల్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ హరనాథరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ నాయకులు శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కెనమాకులపల్లిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని శాంతిపురం సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. కరెంటు పోగానే విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఎమ్మెల్సీ భరత్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.హరిని విచారణ అధికారిగా నియమించింది. ఘటనతో సంబంధం ఉన్న షిఫ్ట్ ఆపరేటర్‌ను తొలగించేందుకు ఆదేశాలిచ్చారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులైన ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు సిఫార్సు చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నారు. -
త్వరలో మరింత విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల 15వ తేదీ నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నామని, దీంతో త్వరలోనే మరింత విద్యుత్ అందుబాటులోకొస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అనూహ్యంగా విద్యుత్ కొరత ఏర్పడినా, భవిష్యత్‌లో భారీగా డిమాండ్ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. పవర్ ఎక్సే్చంజ్‌లో యూనిట్ రూ.12 నుంచి 16 వరకు ఉండగా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల చొప్పున పాతికేళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడం కోసం ‘సెకీ’ ద్వారా యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. నేడు టెండర్లకు ఆహ్వానం కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్‌లో(800 మెగావాట్లు) ఉత్పత్తిని పెంచేందుకు ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే లక్ష టన్నులు దిగుమతి చేసుకున్న (ఇంపోర్టెడ్) మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచినట్టు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల మేరకు ఏపీజెన్కో 18 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం, ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లను సోమవారం ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రక్రియను నెలలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణపట్నం ఫేజ్–2 ప్లాంట్‌ను ఈ నెలాఖరుకుగానీ, జూన్ మొదటి వారానికి గానీ ప్రారంభించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు బి.శ్రీధర్ చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్దన్ రెడ్డి, కె.సంతోషరావు, ట్రాన్స్ కో డైరెక్టర్ ఏవీకే భాస్కర్, జెన్ కో డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ప్రజల్ని కాల్చిచంపిన వారిని మర్చిపోయారా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై మాట్లాడుతున్న వారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమాలు చేసిన రైతులపై కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలను మరిచిపోయారా.. అని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కావని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై దృష్టిసారించి సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరాపై ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్, ఏపీఎస్ఈసీఎంల అధికారులతో సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ల నుంచి త్వరలో మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆరువేల మెగావాట్ల హైడల్ (పంప్డ్ హైడ్రో స్టోరేజీ) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్యుత్ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుంచి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల కొరత రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని పెద్దిరెడ్డి చెప్పారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీన్లో 30 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఎక్సే్ఛంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసున్నామన్నారు. గృహవిద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్‌లోను 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. బొగ్గుసరఫరాలో ఎదురవుతున్న సమస్యల కారణంగా థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ వినియోగానికి పరిమితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, నెడ్‌క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఆంక్షలకు మినహాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి పరిశ్రమలకు అమలుచేస్తున్న ఆంక్షలపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూనే పలు పరిశ్రమలు, హెచ్‌టీ వినియోగదారులకు వాటి నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలపై అదనపు చార్జీలు విధించడానికి అనుమతిస్తూ, తద్వారా విద్యుత్ డిమాండ్‌ను సమతుల్యం చేసి, కోతలు పెరగకుండా చర్యలు చేపట్టింది. ఈనెల 22 వరకూ ఆంక్షలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత ప్రభావం రాష్ట్రంపైనా పడిన విషయం తెలిసిందే. రోజుకు సగటున 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఇందులో కనీసం 40 మిలియన్ యూనిట్లు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కానీ, అక్కడ తీవ్రపోటీతో విద్యుత్ దొరకడంలేదు. ఈ నేపథ్యంలో.. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు నివారించడానికి పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక నిరంతరం విద్యుత్ వాడే పరిశ్రమలు తమ వినియోగంలో 50 శాతం తగ్గించుకుని, మిగతా సగంతో నడుపుకునే అవకాశం కల్పించారు. అంతేకాక.. పగటిపూట నడిచే ఇతర పరిశ్రమలు వారాంతపు సెలవుతో పాటు ఈనెల 22 వరకూ మరోరోజు విద్యుత్ వినియోగించడం కుదరదు. ఈనెల 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా ఇలా డిస్కంలు తాము తీసుకున్న నిర్ణయాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకువెళ్లాయి. వాటిని పరిశీలించిన మండలి.. పవర్ హాలిడే, ఇతర నిబంధలను సమర్థిస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 22 విభాగాలకు మాత్రం వీటి నుంచి మినహాయించాలని సూచించింది. అదే విధంగా.. ఈ నిబంధనలను పరిశ్రమలు ఖచ్చితంగా పాటించేలా చేసేందుకు డిస్కంలు చేపట్టిన చర్యలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇకపై పరిశ్రమలు పవర్ హాలిడే, ఇతర నిబంధనలను అతిక్రమించి విద్యుత్ వినియోగిస్తే వాటిపై డిమాండ్ చార్జీలు విధిస్తారు. అవి ప్రస్తుత ధరలకు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పవర్ హాలిడే రోజు విద్యుత్ వాడితే ఒకటిన్నర రెట్లు ఎనర్జీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యలవల్ల పరిశ్రమలు నిబంధనల మేరకే విద్యుత్ వినియోగిస్తాయి. దీనివల్ల సగటున రోజుకు పరిశ్రమల నుంచి ఆదా అవుతున్న 20 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు మళ్లించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మినహాయింపు పొందిన పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులు.. ► ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ► ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ► వార్తాపత్రికల ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ► పోర్టులు, ఏఐఆర్, దూరదర్శన్ ► విమానాశ్రయాలు, విమానయాన సంబంధిత సేవలు ► డెయిరీలు, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు ► ఐస్‌క్రీమ్ తయారీ పరిశ్రమలు ► కేంద్ర ప్రభుత్వ ఆర్ అండ్ డీ యూనిట్లు ► నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా ► నావల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం ► చమురు అన్వేషణ సర్వీస్ కనెక్షన్లు, చమురు శుద్ధి కర్మాగారాలు ► రైల్వే ట్రాక్షన్, రైల్వే వర్క్‌షాప్‌లు, గూడ్స్ షెడ్లు, రైల్వేస్టేషన్లు ► ఆసుపత్రులు ► పోలీస్స్టేషన్లు, అగ్నిమాపక స్టేషన్లు ► రక్షణ సంస్థలు ► వీధి దీపాలు ► తాగునీటి సరఫరా పథకాలు ► నీటి పనులు, నీటి పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు ► మతపరమైన ప్రదేశాలు ► యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ► మెడికల్ ఆక్సిజన్ తయారీ కర్మాగారాలు -
నెలాఖరుకు నిశ్చింత!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొరత తాత్కాలికమేనని, ఈ నెలాఖరు నాటికి సరఫరా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ఈ నెల 18న విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి తొలి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ పరిస్థితి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా డిమాండ్, సరఫరాలో అంతరం తలెత్తి పలు రాష్ట్రాలు విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నాయని ఇంధన శాఖ అధికారులు మంత్రి పెద్దిరెడ్డికి తెలియచేశారు. బొగ్గు కొరతతో మహారాష్ట్రలో 1375 మెగావాట్ల లోడ్ చొప్పున రోజూ 3 గంటల పాటు లోడ్ రిలీఫ్ విధిస్తుండగా గుజరాత్లో పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో గురువారం 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఏపీ జెన్కో నుంచి 71 ఎంయూ, కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి 40 ఎంయూ, జల విద్యుత్తుతో 6.6 ఎంయూ, సౌర విద్యుత్తుతో 24 ఎంయూ, పవన విద్యుత్ 16 ఎంయూ, హిందుజా 9.4 ఎంయూ, ఇతర ఉత్పత్తి కేంద్రాల ద్వారా 4 ఎంయూ, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారుల నుంచి 11 ఎంయూల చొప్పున మొత్తం 182 మిలియన్ యూనిట్లు సమకూరిందని వివరించారు. మరో 26 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నాటికి విద్యుత్ సరఫరా చాలావరకు మెరుగుపడుతుందని వెల్లడించారు. రాబోయే 25 ఏళ్ల పాటు వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఇబ్బందుల్లోనూ నాణ్యమైన కరెంట్ బహిరంగ మార్కెట్లో కూడా తగినంత విద్యుత్ దొరకని పరిస్థితుల్లోనూ గృహ వినియోగదారులకు వీలైనంత మేర తక్కువ అంతరాయాలతో నాణ్యమైన కరెంట్ సరఫరా జరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మే 1నుంచి రైతులకు పగటిపూటే 9 గంటలు అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. గృహ, వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నవరత్నాల అమల్లో భాగంగా విద్యుత్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యుత్తు రంగాన్ని ఆదుకునేందుకు రెండున్నరేళ్లలో దాదాపు రూ.35 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలతో రాష్ట్రంలో విద్యుత్ కొరత అదుపులోకి వస్తోంది. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి సైతం పగటిపూట 7 గంటల విద్యుత్ అందుతోంది. 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు రాష్ట్రంలో మంగళవారం 226 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఏపీ జెన్కో, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల, సౌర, పవన, గ్యాస్ ఆధారిత కేంద్రాల ద్వారా మొత్తం 197 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. 29 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడటంతో బహిరంగ మార్కెట్ నుంచి డిస్కంలు 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాయి. వ్యవసాయ రంగానికి 7 గంటలు, గృహావసరాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి 17.6 మిలియన్ యూనిట్ల మేర లోడ్ రిలీఫ్ అమలు చేసినట్లు ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంటలు చాలా వరకూ కోతలు పూర్తవ్వడం, కొన్ని పంటలు చివరి దశలో ఉన్నందున వ్యవసాయావసరాలకు రోజుకి 7 గంటలు విద్యుత్ సరఫరా సరిపోతుందని, అయినప్పటికీ కొన్ని చోట్ల 9 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నామని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలాఖరుకు పరిశ్రమలకూ సంపూర్ణంగా.. ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పవర్ హాలిడేలో భాగంగా ఈ నెల 11 వరకూ పరిశ్రమలకు 72.04 మిలియన్ యూనిట్ల లోడ్ రిలీఫ్ ఇచ్చినట్లు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పరిశ్రమలకు కూడా పూర్తిస్థాయి సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కొన్ని పరిశ్రమలకు ముందు, మిగతా వాటికి తరువాత దశల వారీగా నియంత్రణలు తొలగిస్తామని ఆయన వెల్లడించారు. -
ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్‌కూ డిస్కమ్‌లు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజూ 50 ఎంయూల కొరత రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్ డిమాండ్ 63,605 మిలియన్ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్ డిమాండ్ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 17,781 మిలియన్ యూనిట్ల నుంచి 18,844 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్ యూనిట్ల నుంచి 12,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా రోజూ 50 మిలియన్ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ 6,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొరతకు రెండు ప్రధాన కారణాలు.. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్ ధర పీక్ అవర్స్‌లో రూ.12 వరకూ ఉంది. నెలాఖరుకు సాధారణ పరిస్థితి.. ‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యుత్ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్‌ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించడంలో రాజీ లేదు’’ – బి.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంపు
సాక్షి, అమరావతి: ఇటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే అటు డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 2022–23 రిటైల్ విద్యుత్ సరఫరా ధరలను సవరించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి గృహ విద్యుత్ వినియోగదారులపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం తిరుపతిలో వెల్లడించారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా సగటున 3.26 శాతం పెరిగిన చార్జీల కారణంగా మూడు డిస్కమ్‌లకు ఏటా దాదాపు రూ.1,400 కోట్ల రాబడి అదనంగా సమకూరనుంది. ఏప్రిల్ 1వతేదీ నుంచి ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి. కామన్ టెలిస్కోపిక్ విధానం డొమెస్టిక్ కేటగిరీలో ఉన్న మూడు గ్రూపులను కామన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్‌తో ఒకే గ్రూపుగా కమిషన్ తాజాగా విలీనం చేసింది. ఈ విధానంలో వినియోగదారుడు తక్కువ స్లాబ్‌లో చేసిన వినియోగానికి సంబంధిత తక్కువ స్లాబ్ టారిఫ్‌లో బిల్ వేస్తారు. పేద గృహ వినియోగదారుల కోసం 0–30 యూనిట్ల కొత్త స్లాబ్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల యూనిట్లు పెరిగినప్పటికీ స్లాబుల ప్రకారమే బిల్లు పడుతుంది. కమర్షియల్ 2 కేటగిరీ కింద ఉన్న మైనర్, మేజర్ సబ్ కేటగిరీలను విలీనం చేయడంతో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులకు ఎనర్జీ ఛార్జీలు తగ్గుతాయి. గృహ విద్యుత్ టారిఫ్‌ను స్వల్పంగా పెంచినా వీరిలో 90 శాతం మంది సగటు సరఫరా వ్యయం యూనిట్ రూ.6.98 కంటే తక్కువ టారిఫ్‌లోకి వస్తారు. 75 యూనిట్ల వరకు వినియోగానికి సంబంధించి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య మొత్తం గృహ వినియోగదారుల సంఖ్యలో 50 శాతం ఉంటుంది. వీరికి డిస్కమ్‌లు కొనుగోలు ధర కంటే తక్కువకే విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. కామన్ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.65, తర్వాత 50 యూనిట్లకు రూ.3.35, ఆ తర్వాత 100 యూనిట్లకు రూ.5.40, చివరి 50 యూనిట్లకు రూ.7.10 చొప్పున పడుతుంది. ఈ లెక్కన మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే. పరిశ్రమలకు ‘టైమ్ ఆఫ్ డే’ రాయితీలు టీఓడీ చార్జీలు పగలు 0.75 పైసలు తగ్గించడం ద్వారా పగటిపూట మాత్రమే పనిచేసే అధిక శాతం పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లకు రాయితీ టారిఫ్, ఆక్వా, పౌల్ట్రీ హేచరీలకు టీఓడీ నుంచి మినహాయింపునిచ్చారు. 2 కిలోవాట్ కంటే తక్కువ, 2 కిలోవాట్ కంటే ఎక్కువ కనెక్టెడ్ లోడ్ కలిగిన మతపరమైన ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని టారిఫ్‌ను కిలోవాట్‌కు ప్రస్తుతం ఉన్న రూ.4.80 నుంచి రూ.3.85కు మండలి తగ్గించింది. గోశాలలకు వర్తించే టారిఫ్‌ను కూడా ఇదే ప్రకారం కుదించారు. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు.. గ్రిడ్ సపోర్ట్ చార్జీలను పునరుద్ధరించాలని డిస్కమ్‌లు కోరగా కిలోవాట్‌కి రూ.15 నుంచి రూ.50 వరకు విధించడం ద్వారా సంబంధిత విద్యుదుత్పత్తిదారులకు ఊరట కల్పించారు. ఓ కేటగిరిలోని పారిశ్రామిక వినియోగదారులపై ఓల్టేజ్ సర్‌చార్జీ విధించాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనను మండలి అంగీకరించలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా 132 కేవీ కంటే 220 కేవీ ఓల్టేజీ వినియోగదారులకు 0.5 పైసలు తక్కువ టారిఫ్‌ను మండలి నిర్ణయించింది. పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించి విద్యుత్ పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఖర్చులను రూ.3,368, రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే 2022–23లో వినియోగదారుల నుంచి రూ.2,910.74 కోట్ల కంటే తక్కువ మొత్తం మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ వసూలు మొదలవుతుంది. సరఫరా వ్యాపారం సర్దుబాటు ఖర్చులకు సంబంధించి 3వ నియంత్రణ కాలానికి రూ.492 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే ఏపీ ట్రాన్స్‌కోకు రానున్న పాయింట్ ఆఫ్ కనెక్షన్ (పీఓసీ) ఛార్జీల నుంచి దీన్ని సర్దుబాటు చేయాలని ఆదేశించడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు పోర్టల్ వినియోగదారులు అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు పంపిణీ సంస్థల వెబ్సైట్లలో సౌకర్యాన్ని కల్పించాలని మండలి ఆదేశించింది. పైలట్ ప్రాజెక్ట్‌లకు రూ.3 కోట్లు విద్యుత్ పొదుపు ఉపకరణాలు, సౌర విద్యుత్తుతో వ్యవసాయం మొదలైన ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టడానికి నెలలోగా తమ బకాయిల నుంచి రూ.కోటి చొప్పున ఏపీసీడ్కోకు మూడు డిస్కంలు మొత్తం రూ.3 కోట్లు విడుదల చేయాలని మండలి ఆదేశించింది. అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయం తిరుపతి రూరల్: వినియోగదారులకు ఊరట కల్పించటంతోపాటు డిస్కంలకు ఆర్థిక భరోసా కల్పించేలా విద్యుత్ టారిఫ్‌లను ఆమోదించినట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనెట్ హాలులో ఆయన విద్యుత్ టారిఫ్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి టారిఫ్ ప్రకటించినట్లు తెలిపారు. గతంలో ఉన్న మూడు రకాల శ్లాబ్‌లను ఎత్తివేసి అందరికీ ఉపయోగపడేలా కొత్తగా కామన్ టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫంక్షన్ హాళ్లు తెరవకున్నా గతంలో నెలకు కిలోవాట్‌కు విధించిన రూ.100 కనీస చార్జీల్ని ఎత్తివేశామన్నారు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్‌కు రూ.6.70 ధరను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, సంతోషరావు పాల్గొన్నారు. -
కరెంట్ బకాయిలపై బాధ్యత తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ నెలకొల్పాలని కోరారు. పన్నుల వాటాలో మినహాయించైనా.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్‌ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో గతేడాది నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. వినతిపత్రంలో ఇతర అంశాలు.. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్బీపీపీఎల్ ప్లాంట్ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ జాయింట్ వెంచర్‌తో పవర్ ఎక్విప్మెంట్ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా మార్చాలి. ► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. ఆక్వా రైతులకు బీమా కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు. నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్‌కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ.. ► సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే. ► ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ తోడ్పాటు ఇవ్వాలి. ► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. ► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. -
వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర ఇంధన శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. విజయవాడ 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్‌సెట్ మెడోస్‌లో రూ.3.60 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..వేసవిలో ఎటువంటి పవర్‌కట్ లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా అందించాలని, అవసరమైతే అదనంగా విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. టీడీపీ హయాంలోని రూ.26 వేల కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన ట్రూఅప్ చార్జీలను సైతం తిరిగి చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రూ.2.49కు లభించే విద్యుత్ రూ.4.84 చెల్లించడానికి గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పీపీఏ చేసుకున్నారో టీడీపీ నేతలు చెప్పాలని అన్నారు. 86 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. తమ పథకాలే తమ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని, వచ్చే ఎన్నికల్లో 150కు పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. -
పీపీఏ ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) పేర్కొన్న ధరల ప్రకారమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేయాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) ఆదేశించింది. ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. పవన విద్యుత్‌కు యూనిట్ రూ.2.43, సౌర విద్యుత్‌కు యూనిట్ రూ.2.44 చొప్పున చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది. అలాగే, పీపీఏలను పునః సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఉందని, అభ్యంతరాలన్నీ ఈఆర్సీ ముందు ప్రస్తావించుకోవాలని పవన, సౌర విద్యుత్ సంస్థలకు స్పష్టంచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం రద్దుచేసింది. ఈఆర్సీ ముందున్న ఓపీ 17, ఓపీ 27కు సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కొట్టేసింది. ఇక పవన, సౌర విద్యుత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో కోత విధిస్తూ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలుచేస్తూ లోడ్ డిస్పాచ్ సెంటర్ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పవన, సౌర విద్యుత్ కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. పీపీఏ నిబంధనలను మార్చలేం.. ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల పవన, సౌర విద్యుత్ కంపెనీలకు పీపీఏల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతున్నామన్న డిస్కంల వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలను వసూలుచేస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులని చెప్పడం సరికాదని ధర్మాసనం స్పష్టంచేసింది. పీపీఏ నిబంధనలను పార్టీలు గానీ, కోర్టుగానీ మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పీపీఏలను ఏపీఈఆర్సీ పునః సమీక్షించేంత వరకు మధ్యంతర ఏర్పాటుకింద పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు యూనిట్‌కు రూ.2.43, రూ.2.44 చొప్పున చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని, అవి చట్టానికి అనుగుణంగాలేవని ధర్మాసనం ఆక్షేపించింది. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దుచేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అలాగే.. 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవరించి రేట్లను కుదించే అధికారం ఈఆర్సీకి లేదని ధర్మాసనం తెలిపింది. టారిఫ్‌లో మార్పులతో పెట్టుబడులపై ప్రభావం ‘ప్రజాభిప్రాయాన్ని సేకరించి, డిస్కంల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఏపీఈఆర్సీ పవన విద్యుత్ టారిఫ్‌ను ఖరారుచేసింది. దీనికి అనుగుణంగానే రూ.30 వేల కోట్ల మేర పవన విద్యుత్ రంగంలో దీర్ఘకాల ప్రణాళికల ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. గ్లోబల్ వార్మింగ్, ఉద్గారాల తగ్గింపులో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి దానికి సంబంధించిన టారిఫ్, నిబంధనల్లో మార్పుచేస్తే అది ప్రపంచంలోని పెట్టుబడిదారులపై పడుతుంది. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఒప్పందాలను కొనసాగించేందుకు డిస్కంలు సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. డిస్కంలు వినియోగదారుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలుచేస్తున్నాయి. కాబట్టి డిస్కంల ఆర్థిక పరిస్థితికి మరేదైనా కారణం కావొచ్చుగానీ, పీపీఏలో నిర్ణయించిన టారిఫ్ కాదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
కొందామన్నా బొగ్గు ఇవ్వని కేంద్రం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఎటువంటి కొరత రాకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడటం లేదు. పాత, కొత్త బకాయిలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు ఎంత ధర అయినా చెల్లించి బొగ్గును, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. భవిష్యత్‌లోనూ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కొనేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం మేరకు బొగ్గు అందించకపోగా, కొరత రాకుండా నిల్వలు పెంచుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తోంది. సరిపడా బొగ్గు ఇవ్వాల్సిన కేంద్రమే ఇవ్వడం తగ్గించేసి, ఇలా చెప్పడమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నిల్వలు పెంచుకోండి.. బయటకు అమ్మకండి దేశ విద్యుత్ అవసరాల్లో సుమారు 60 శాతం వరకు థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా రాష్ట్రాలకు తెలిపింది. ఈ అవసరాలు తీర్చడానికి థర్మల్ పవర్ స్టేషన్లలో 9 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడం ద్వారా నిల్వలు పెంచుకోవాలని దేశంలోని దాదాపు 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ఉత్పత్తి సంస్థలు తాము చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొనుగోలుదారుల అనుమతి లేకుండా బయటివారికి విద్యుత్‌ను విక్రయిస్తే పవర్ ఎక్స్చేంజ్లో మూడు నెలలపాటు పాల్గొనకుండా డిబార్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానా విధిస్తామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. దీనికోసం విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 మార్గదర్శకాల్లో క్లాజ్ 6.4లో కొత్తగా ‘జి’ నిబంధన తెచ్చింది. అడిగినా ఇవ్వని కేంద్రం ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం బొగ్గు నిల్వలు పెంచుతాయి. ఈ వేసవిలో రాష్ట్రంలో 225 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా. కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచితే తప్ప వేసవి అవసరాల నుంచి బయటపడలేం. గతేడాది బొగ్గు కొరత ఏర్పడినప్పటి నుంచి కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతోపాటు కోల్, రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి బొగ్గు కేటాయింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియా నుంచి రాష్ట్రానికి రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు కేటాయింపు జరుగుతోంది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్ నుంచి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవి కోసం బొగ్గు నిల్వ చేయడానికి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ఆ మేరకు కూడా ఇవ్వడం లేదు. కేవలం 10 నుంచి 12 ర్యాక్‌లు మాత్రమే వస్తున్నాయి. ఏపీ జెన్కో నుంచి 45 శాతం విద్యుత్ రాష్ట్రంలో ప్రస్తుతం 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. మనకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటినుంచి 85 మిలియన్ యూనిట్లు, హైడల్ 8.5 మిలియన్ యూనిట్లు, సోలార్ 2.4 మిలియన్ యూనిట్ల చొప్పున 97 మిలియన్ యూనిట్ల మేర రోజు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అంతర్గత వినియోగం పోనూ 92 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు వెళుతోంది. అంటే మొత్తం డిమాండ్‌లో 45 శాతం ఏపీ జెన్కో ద్వారా సమకూరుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ, కృష్ణపట్నం, ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఎంతైనా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జెన్కో సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి కేటాయింపులు రావడం లేదు. – బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్ కోతలంటూ రాతలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీఎస్పీడీసీఎల్ ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాధరావు స్పష్టం చేశారు. ‘ఎందుకీ కోతలు!’ శీర్షికన ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్టీ కేబుల్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి అంతరాయాలు లేవు. ► రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందడం లేదన్న కథనంలో నిజం లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మంగళవారం ఆర్టీపీపీలో కెపాసిటర్ ఓల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ సమస్య కారణంగా సబ్ స్టేషన్లు ట్రిప్ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► చిత్తూరు జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవు. ► అనంతపురం జిల్లాలో గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేవు. బుధవారం 18.227 ఎంయూల విద్యుత్‌ను సరఫరా చేశాం. ప్రతి నెలా రెండో శనివారం లేదా 3వ శనివారం సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌లో దాదాపు 45 శాతం సౌర, పవన, ఇతర వనరుల స్థాపిత విద్యుత్ ఉంది. వీటి నుంచి వచ్చే విద్యుత్ ’తప్పక సేకరణ’ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు ఈ వనరుల నుంచి విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుంది. సౌర కేంద్రాల నుంచి సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ పగటి పూట మాత్రమే లభ్యత ఉంటుంది. ► రోజువారీ గ్రిడ్ డిమాండ్‌లో కేవలం 4 గంటలు (ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ సమయంలో) మాత్రమే కొంత వరకూ విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి బహిరంగ మార్కెట్ లో ముందురోజు బిడ్డింగ్ విధానంలో సమకూర్చుకుంటున్నాం. ఈ విధానంలో అందుబాటులోకి రాకపోతే రోజువారీ మార్కెట్లో కానీ అత్యవసర మార్కెట్లో కానీ విద్యుత్ సేకరించి కొనుగోలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నంతవరకు ఎలాంటి బ్యాక్ డౌన్ లేకుండా విద్యుత్ సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రాన్ని షట్ డౌన్ చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నా వినియోగదారుల సౌకర్యార్ధం ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం ప్రస్తుత రబీ సీజన్లో ఒక్క సెంటు భూమికి కూడా సాగు నీటి కొరత తలెత్తకుండా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. కోతలు లేవు.. నాణ్యమైన కరెంట్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.జనార్దనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎందుకీ.. కోతలు!’ శీర్షికతో ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో నిజం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయనడం అవాస్తవమన్నారు. బుట్టాయగూడెం విద్యుత్ శాఖ అధికారులు లోడ్ రిలీఫ్ కోసం కోతలు విధిస్తున్నారనడం కూడా అవాస్తవమేనని, విద్యుత్ అధికారులు అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదని వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులందరికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రి 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన అంతరాయాలను సరిదిద్ది త్వరితగతిన పునరుద్ధరిస్తున్నారని వివరించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేయాలని ఎస్ఈ కోరారు. మడకశిరలో కరెంట్ కోతలు లేవు అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం కరెంట్ కోతలు విధించారన్న వార్తల్లో నిజం లేదని హిందూపురం డివిజన్ డీఈ డి.భూపతి స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో సాంకేతిక సమస్యలతో మంగళవారం ఉదయం మాత్రం కొద్ది గంటలు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్ కోతలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని మడకశిర ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆ ఫొటో... ఇప్పటిది కాదు నా ఫ్యాక్టరీలో కరెంటు లేకపోవడంతో కార్మికులు ఖాళీగా కూర్చున్నట్లు ఓ పత్రికలో ఫొటో ప్రచురించారు. అసలు ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఇటీవల కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం ఓ ఛానల్ వాళ్లు వచ్చి విద్యుత్తు కోతల గురించి మాట్లాడాలని కోరారు. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం అన్యాయం. అందుకు నేను ఒప్పుకోలేదు. బుధవారం కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. మంగళవారం మాత్రం రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు మాకు ముందుగానే సెల్‌ఫోన్‌కు సమాచారం ఇచ్చారు. – ఆనంద్, టెక్ మనోరా ప్యాకింగ్ పరిశ్రమ యజమాని, మడకశిర ఆగింది అరగంటే.. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గలో విద్యుత్తు కండెక్టర్ తెగిపోవడంతో బుధవారం సాయంత్రం 6.40 నుంచి 7.14 వరకు 34 నిమిషాల పాటు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ కరెంట్ లేక రాత్రంతా గాడాంధకారం నెలకొందనే తరహాలో ఓ పత్రిక ఫోటోలు ప్రచురించింది. -
సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు
సీలేరు: సీలేరు విద్యుత్ కేంద్రం..50 ఏళ్ల చరిత్ర.. నిరాటంకంగా విద్యుత్ కాంతులు..ఇప్పటికీ నంబర్ వన్..అదే వెలుగు..అదే ఖ్యాతి. విద్యుత్ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒకచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి బలిమెల నదిగా పేరు పొందింది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి పచ్చని కొండల మధ్య నుంచి ఒంపుసొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు, ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుత్ ఉత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తోంది. మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రం స్వాతంత్య్రం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటి సారిగా మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి. తొలుత మూడు యూనిట్లు ప్రారంభించి, తర్వాత మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసి 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఏపీ, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉత్పత్తి అయిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 కేవీ లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవగా ఏపీ వాటా పెందుర్తి కూడా చేరుతోంది. సీలేరు: 240 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్‌లో మాచ్‌ఖండ్ తర్వాత 1960లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఒకటి, రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1964లో 3,4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 220 కేవీ లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది. డొంకరాయి: 25 మెగావాట్స్ సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రానికి పైన డొంకరాయి డ్యామ్‌ను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృథా కాకుండా రెండు మార్గాల్లో నీరు విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం. మోతుగూడెం(పొల్లూరు): 460 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ గొడవలు పడిన విద్యుత్ కేంద్రం ఇది. 1976లో నిర్మించిన ఈ జలవిద్యుత్ కేంద్రంలో ఒకేసారి నాలుగు యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇదే ప్రాజెక్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.537 కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు నిర్మించి మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. సీలేరు నది ఇరు రాష్ట్రాలకు సిరి సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలు, జలాశయాలకు నేటికి గొప్ప చరిత్ర ఉంది. పత్రికల్లో ఎన్నో కథనాలు, ఎన్నో రికార్డులు, అవార్డులు వచ్చాయి. బలిమెల నది బలిమెలలో పుట్టి గోదావరి వరకు చేరుతుంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఐడల్ విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేయడంలో బలిమెల నదే కీలకం. రెండు రాష్ట్రాల విద్యుత్, వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇక్కడ నుంచే నీటిని సరఫరా చేస్తారు. బలిమెల 32 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. శతకోటి ఘనపుటడుగుల నీటి సామర్ధ్యంతో ఉంటుంది. ముందుగా మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం నీరు 86 కిలోమీటర్లు కొండల మధ్య ప్రవహించి బలిమెలలోకి చేరుతోంది. ఇరు రాష్ట్రాలు నీటిని సమానంగా పంచుకుంటారు. ఏపీ వాటాగా ఉన్న నీరు 18 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడలోకి చేరుతోంది. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 30 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడ జలాశయంలోకి చేరుతోంది. డొంకరాయిలో విద్యుత్ తయారై రెండు మార్గాల్లో నీటి విడుదల జరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయిన, గోదావరి పంటలకు నీరు కావాల్సి ఉన్న మెయిన్ డ్యాం ద్వారా నీరు విడుదల చేస్తారు. అలా కాకుండా విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు కెనాల్ ద్వారా ఏవీపీ డ్యామ్‌కు చేరుతుంది. అక్కడ నుంచి మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి చేరుకుని 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 38 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని కలుపుకుని శబరి నదిలో కలుస్తోంది. అక్కడ నుంచి గోదావరిలోకి చేరుతోంది. గ్రిడ్‌కు విద్యుత్ అందించడంలో సీలేరుదే ఘనత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో సీలేరు కాంప్లెక్సుకు నేటికి ఓ రికార్డు ఉంది. 50 ఏళ్లు పూర్తయినా విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం విద్యుత్ సీలేరు నుంచే అందుతుంది. ఇటీవల సీలేరును సందర్శించినప్పుడు ఇక్కడ విద్యుత్ కేంద్రాల గొప్పతనం మరింత తెలుసుకున్నాం. – బి.శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ జెన్కో ఇంజనీర్లు, కార్మికుల కృషి వల్లే .. 50 ఏళ్లకు ముందు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగుల కృషి ఈ విద్యుత్ కేంద్రాల ఘనత. ప్రతి ఏటా డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను మించి సమయానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈ విద్యుత్ కేంద్రాలకు ఉంది. ప్రతి ఏటా సీలేరు నుంచి గోదావరి పంట భూములకు నీరు అందిస్తున్నాం. – రాంబాబు, చీఫ్ ఇంజనీర్, మోతుగూడెం అధికారుల ప్రశంసలు మర్చిపోలేను సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉద్యోగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యుత్కేంద్రాలు కన్నతల్లిలాంటివి. ఇక్కడ ఉద్యోగం చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంపై అధికారుల ప్రశంసలు మర్చిపోలేను. – రమేష్‌కుమార్, ఏడీ, జలవిద్యుత్ కేంద్రం, సీలేరు. -
వైజాగ్–చెన్నై కారిడార్ పనులు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలకమైన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.5,544 కోట్లతో రెండు దశల్లో ఈ కారిడార్ పనులు జరుగుతున్నాయి. తొలి దశ కింద రూ.2,278.61 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే రూ.815.17 కోట్ల విలువైన పనులు పూర్తికాగా.. మిగిలిన పనులు తుది దశలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.306.56 కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే.. గడచిన రెండున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.508.61 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఇందులో ఇప్పటికే నాయుడుపేట క్లస్టర్లో 1 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి యూనిట్, శ్రీకాళహస్తి–ఏర్పేడు క్లస్టర్‌కు సంబంధించి విద్యుత్ సరఫరా పనులు పూర్తయ్యాయి. నాయుడుపేట, అచ్యుతాపురం క్లస్టర్‌కు సంబంధించి నీటి సరఫరా, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేవిధంగా ఏపీఐఐసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదలైన రెండో దశ పనులు కాగా, రూ.2,599.56 కోట్లతో రెండో దశకు సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ చేపట్టింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4,125 కోట్లు రుణం రూపంలో సమకూర్చనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,419 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద విశాఖ నోడ్‌లో నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, చిత్తూరు సౌత్ బ్లాక్ నోడ్‌లో 13,319 ఎకరాలు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 2,596 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కసారి వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి ఏడు రెట్లు, రాష్ట్ర జీడీపీ ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా. 2015లో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి 2035 నాటికి రూ.7,82,300 కోట్లకు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11.60 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అదనంగా 1.10 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. -
ఏపీ ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్)కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. విద్యుత్ పంపిణీలో ఆవిష్కరణల అంశంలో చేస్తున్న కృషిలో ఏపీ ఎస్పీడీసీఎల్ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డులు–2022 ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యూరీ సభ్యుల నుంచి ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథరావు అందుకున్నారు. ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. -
ఇక స్మార్ట్ సబ్స్టేషన్లు!
► అదో విద్యుత్ సబ్‌స్టేషన్. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ► ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ... ఇందుకు కారణం సదరు సబ్‌స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్‌స్టేషన్.. స్మార్ట్ సబ్‌స్టేషన్. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్ (స్మార్ట్ సబ్‌స్టేషన్)గా తీర్చిదిద్దనుంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అంతా కంట్రోల్ రూమ్ నుంచే.. వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్ స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మారనుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్ కంట్రోల్ రూమ్ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది. మరింత నాణ్యమైన సేవలు.. ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లను ఆటోమేషన్ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్ -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్‌లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్‌లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్‌పై ఏపీ ట్రాన్స్‌కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్‌లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
AP: కరెంట్ కోతలంటూ కట్టుకథలు
సాక్షి, అమరావతి: అదిగో పులి.. ఇదిగో తోక లాంటి బెదిరింపులు, కట్టు కథలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై వదంతులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కోవిడ్ ప్రభావం తగ్గి పారిశ్రామిక విద్యుత్ వినియోగం పెరగడం, డిమాండ్ – సరఫరాలో వ్యత్యాసం తదితర పరిణామాలతో దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా విద్యుత్తు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసరంగా గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని ఊహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, బొగ్గు కొనుగోలుకు అత్యవసర నిధులను వెచ్చించడం, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడలేదు. కానీ దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా భారీగా విద్యుత్ కోతలుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గంటల తరబడి చీకట్లు తప్పవంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఈ తరహా వదంతులతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. రాత్రి సమయంలో విజయవాడ ఇలా.. లోటు.. లేదు విద్యుత్ కోతలంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, డిస్కమ్‌ల సీఎండీలు అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈనెల 10వతేదీ నుంచి 14 వరకు విద్యుత్ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ లోటు మన దగ్గర కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్ 14న ఏపీలో 0.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా జీరో అయ్యింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా డిస్కమ్ పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అత్యవసర నిధులతో తీరుతున్న బొగ్గు కొరత ఇంధనశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కోకు రూ.250 కోట్ల మేర అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తి మెరుగు పరచేందుకు రాష్ట్రానికి అదనంగా ఎనిమిది బొగ్గు రైళ్లు తరలి వస్తున్నాయి. వీటీపీఎస్‌లో 13,097 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండగా శనివారం 29,806 మెట్రిక్ టన్నులు వచ్చింది. దీనిలో 25,410 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 17,493 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. ఆర్టీపీఎస్లో 70,411 మెట్రిక్ టన్నుల బొగ్గుకు అదనంగా 19,457 మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఇందులో 12,925 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 76,943 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నంలో 68,459 మెట్రిక్ టన్నులు ఉండగా 8,533 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఇంకా 59,926 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఈ నిల్వలతో మరో మూడు నాలుగు రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. దీనికితోడు వచ్చే ఏడాది జూన్ వరకూ 400 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు శుక్రవారం రూ.20 నుంచి రూ.6.11కి పడిపోవడం గమనార్హం. ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. సాధారంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ఈ నెల 8వతేదీ తరువాత రూ.15 – రూ.20 వరకూ పెరిగినా తాజాగా తగ్గుముఖం పట్టింది. ఆర్టీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం ఏపీ జెన్కో యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని, థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఇంధనశాఖను ఆదేశించారు. థర్మల్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి 1,600 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి సింగరేణి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చించి సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లలో ఈనెల 15న అధికారులు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. నిరంతర పర్యవేక్షణ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ సరఫరాను సమీక్షిస్తూ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి సీఎండీ స్థాయి వరకూ అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోష్‌రావు, డైరెక్టర్/గ్రిడ్ – ట్రాన్స్మిషన్, కె.ప్రవీణ్‌కుమార్, సీఈ/గ్రిడ్, ఏవీ భాస్కర్లతో ఇంధన శాఖ కార్యదర్శి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. సీఎం సూచనల ప్రకారం.. రాష్ట్రంలో నిత్యం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా గత 16 రోజులుగా సగటున రోజుకు ఒక మిలియన్ యూనిట్ కంటే తక్కువగానే లోటు ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. పదహారు రోజులకు కేవలం పది మిలియన్ యూనిట్లు మాత్రమే లోటు నమోదైందన్నారు. దీంతో లోడ్ రిలీఫ్‌లు చాలా తక్కువగానే విధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, పవర్ యుటిలిటీల అద్భుత పనితీరుతో నాణ్యమైన సరఫరా జరుగుతోందన్నారు. బొగ్గు కొరతను అధిగమించి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సీఎం సూచనల ప్రకారం తగిన చర్యలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలాంటి విద్యుత్ కోతలను ఎదుర్కోవడం లేదని, రాబోయే రోజుల్లో కూడా కోతలు ఉండవని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వినియోగదారులకు రోజంతా నాణ్యమైన విద్యుత్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా గణనీయంగా పెరిగినట్లు ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ వివరించారు. నమ్మొద్దు.. మేమే చెబుతాం –విద్యుత్ పంపిణీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎలాంటి సమాచారానైన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వినియోగదారులకు అధికారికంగా తెలియచేస్తామని ప్రకటించాయి. -
కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: బొగ్గు కొరత నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనధికారిక కరెంటు కోతలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బ్లాక్ అవుట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను షట్‌డౌన్ చేశారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. దేశంలో 116 థర్మల్ విద్యుత్ కేంద్రాలకుగాను 18 కేంద్రాల్లో బొగ్గు లేదు. మిగతా వాటిలో బొగ్గు నిల్వలు ఒక రోజు నుంచి వారం రోజులకు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా 15 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొగ్గు సంక్షోభాన్ని అధిగమించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా కరెంటు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రానికి బొగ్గు సరఫరా కొంత మెరుగైంది. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు సెప్టెంబర్‌లో సగటున రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24 వేల టన్నుల వంతున సరఫరా అయింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఇటీవల అది 40 వేల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు రేక్‌లను కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడానికి అవసరమైన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు చేస్తున్నాయి. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు, బొగ్గు అనుసంధానం లేకుండానే అత్యవసర ప్రాతిపదికన నిలిచిపోయిన, పనిచేయని పిట్ హెడ్ బొగ్గు గనులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. బాగా పెరిగిన విద్యుత్ డిమాండ్ దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య తేడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో 5,010 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న ఏపీ జెన్కో ప్రస్తుతం 2,300 నుంచి 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆర్టీటీపీఎస్కి చెందిన కొన్ని యూనిట్లు షట్‌డౌన్ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ కూడా వాటి సామర్థ్యం కంటే తక్కువగానే విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ నెలలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజుకు 190 మిలియన్ యూనిట్లకు చేరింది. బుధవారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లు ఉంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈనెలలో రోజుకు సగటున 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎక్కువ వినియోగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 వరకు వెచ్చించి కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. సాధారణంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ధర భారీగా పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. -
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్‌ఎన్‌పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్‌లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్‌లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్‌లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
తేరుకున్న గ్రామాలు
దొండపర్తి (విశాఖ దక్షిణ)/వంగర/విజయనగరం/సీతానగరం/మునగపాక: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,512 మందిని తరలించగా.. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8,352 మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 2,160 మంది మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలో 12 సబ్స్టేషన్లు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 198 వీధి దీపాలు ధ్వంసం కాగా.. మరమ్మతులు పూర్తిచేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. 74 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించారు. పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు, నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో వరద ప్రవాహానికి ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. అధికారులు అక్కడకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించి లంకెలపాలెం, పరవాడ గ్రామాల మధ్య ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విశాఖలో జాతీయ రహదారి పక్కన మురుగు కాలువల్లో పూడిక తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళంలో ముమ్మరంగా సహాయక చర్యలు శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టును వరద ముంచెత్తింది. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు నీటమునిగాయి. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్ డ్రోన్ కెమెరాల సాయంతో వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. నాగావళి ఉగ్రరూపంతో అంపిలి, అన్నవరం, గోపాలపురం, చిన్నమంగళాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. కోలుకుంటున్న విజయనగరం తుపాను దెబ్బ నుంచి విజయనగరం జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వగలిగారు. మరోవైపు తుపాను బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,205 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుతుండటంతో పంట నష్టాల గణన వేగవంతమైంది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీలు కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్‌లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు రైతులు, ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొర్రెల కాపరి సురక్షితం విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని కొత్తవలస ఆనకట్ట దిగువన గల మెట్టపైకి గొర్రెలను తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్య సోమవారం చిక్కుకుపోయిన విషయం విదితమే. అతడిని అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం నేవీ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. గోడకూలి వృద్ధురాలి దుర్మరణం విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు కర్రి జోగులమ్మ (65) అనే వృద్ధురాలిపై మంగళవారం ఉదయం పక్కింటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులపాటు భారీ వర్షాలకు గోడ తడిసిపోవడంతో ఈ ఘటన జరిగింది. గోదావరి పరవళ్లు కొవ్వూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4,43,330 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతుండంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అధికమైంది. అక్టోబర్ నెలాఖరున గోదావరికి ఈ స్థాయి వరద రావడం ఇదే ప్రథమం. 2005 అక్టోబర్ 21 తర్వాత ఇప్పుడే ఈ సమయంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. -
విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, అమరావతి/అరసవల్లి: గులాబ్ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శరవేగంగా పునరుద్ధరణ పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్ శాఖ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్, 33/11 కేవీ సబ్స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్ 403, ట్రాన్స్ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు. -
విద్యుత్ సంస్థలు చట్టాన్ని అనుసరించాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు చట్టం పరిధిలోనే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి చెప్పారు. విద్యుత్ చట్టం–2003 సెక్షన్ 88 ప్రకారం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. వర్చువల్‌గా సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు ఏపీఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్ రామసింగ్ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి, సలహామండలిలోని 16 మంది సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు పౌరసేవల ప్రమాణాలను (ఎస్‌వోపీని) సవరించినట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యంపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు డిస్కంలు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సీ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. డిస్కంలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమంగా ప్రయోజనాలు అందించాలని ఆయన సూచించారు. సేవా ఖర్చు తగ్గింపు, విద్యుత్ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, మెరుగుపరచడం, డిస్కంల పనితీరు, ప్రజల సమర్థమైన భాగస్వామ్యం, నియంత్రణ నిర్ణయ ప్రక్రియ, విద్యుత్ లైన్లు పంట చేలపై నుంచి వేయాల్సి వచ్చినపుడు రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యుల సూచనలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. -
ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇళ్లు నిర్మించే సమయంలో నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా బోర్లు వేస్తోంది. అంతటితో సరిపెట్టకుండా వాటికి మోటార్లు సైతం బిగించడం.. అందుకు విద్యుత్ సరఫరా సమకూర్చడం.. ప్లాట్ల వద్ద కుళాయిల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 76 శాతం లేఅవుట్లలో బోర్లు తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 9,112 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీటిలో 8,830 లేఅవుట్లలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రూ.920 కోట్లు కేటాయించింది. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లను కేటాయించి పనులను అప్పజెప్పింది. మొత్తం 8,830 లేఅవుట్లకు గాను ఇప్పటివరకు 8,096 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు ప్రారంభించారు. వీటిలో 6,687 (76 శాతం) లేఅవుట్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా బోర్లు వేయడం, పక్కనున్న చెరువులు, కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. 10–20 ఇళ్లకు చేతి బోరింగ్లు, 50–60 ఇళ్లకు రోటరీ బోర్లు, 100–200 ఇళ్లకు డీటీహెచ్ బోర్లు వేస్తున్నారు. ప్లాట్లు ఎక్కువగా ఉండి నీటి వినియోగం ఎక్కువ ఉన్నచోట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందుల్లేకుండా నీటి నిల్వ కోసం స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా బోర్ల నుంచి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నీటిని వినియోగించుకునేందుకు అనుగుణంగా కుళాయి పాయింట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులకు తావివ్వం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వం. లబ్ధిదారులకు అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తుంది. నీటి సౌకర్యం లేకపోతే నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం వైఎస్ జగన్ ముందే భావించారు. లబ్ధిదారులు ఆ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే బోర్లువేసి, మోటార్లు బిగించి, విద్యుత్ సరఫరా అందిస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం లేఅవుట్లలో నీటి సరఫరా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 76 శాతం లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో ఈ నెలాఖరులోపు నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ పనులు పూర్తిచేస్తాం. ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ -
ఇక సాఫీగా సొరంగం పనులు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాలపై ఆధారపడి చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులకు కరెంట్ కష్టాలు తొలగనున్నాయి. ఇన్లెట్ సొరంగంలోకి చేరే నీటిని తొలగించడానికి (డీ వాటరింగ్) అయ్యే కరెంటు చార్జీలను ఇకపై ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో సొరంగం పనులు సాఫీగా ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యింది. గడిచిన రెండేళ్లుగా నీటిని తోడుతున్న ఏజెన్సీ కరెంట్ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తోంది. ఈ కారణంగా టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో, సొరంగం పనులు ముందుకు సాగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వలు సమృధ్ధిగా పెరగడంతో అటువైపుగా ఉన్న ఇన్లెట్ సొరంగంలోకి భారీగా నీరు చేరింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మరో 10 కిలోమీటర్లు తవ్వాలి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పదిహేనేళ్లయినా సరి గా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టును 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టగా, 15 ఏళ్లయినా పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం రూ.3,152 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. ఒక సొరంగం పూర్తి కాగా రెండో టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, మరో 10.10 కి.మీలకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. అయితే ఈ టన్నెల్ తవ్వకానికి శ్రీశైలం ప్రాజెక్టులో చేరే నీటి నిల్వలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ప్రాజెక్టుకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండి ఇన్లెట్ టన్నెల్లోకి భారీగా సీపేజీ నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ ఎక్కువ ఉన్నప్పుడు నిమిషానికి 5 వేల నుంచి 7 వేల లీటర్ల మేర నీరు ఉబికి వస్తోంది. దీంతో రెండు, మూడు స్టేజీల్లో 20 హెచ్‌పీ, 30 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. దీంతో నెలకు రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ బిల్లులు చెల్లించడంలో విఫలమవుతోంది. ఇప్పటికి రూ.58 కోట్ల మేర బిల్లులు (ఇరిగేషన్ శాఖ నుంచి ఏజెన్సీకి రావాల్సినవి) పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో డీ వాటరింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్లుగా సొరంగం తవ్వకం పనులు కూడా నిలిచిపోయాయి. టీబీఎంకు ముప్పు నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ ప్రక్రియ జరగక, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో టన్నెల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీబీఎం మునగడం ఖాయం. ఇదే జరిగితే టీబీఎం ముఖ్యమైన పరికరాలతోపాటు విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ వ్యవస్థలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో భారీ ఆర్థిక నష్టంతో పాటు పనులు కొనసాగించేందుకు మరింత గడువు అవసరమవు తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్ భేటీ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈ అంశాన్ని ప్రభు త్వం దృష్టికి తెచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేబినెట్ ఇకపై ఏజెన్సీ కాకుండా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని, కరెంట్ కట్ చేయరాదని విద్యుత్ శాఖను ఆదేశించింది. టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు సూచించింది. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
Telangana : నష్టాల బాటలో డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లు 2019–20లో మరో రూ.6,061 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.4,940.24 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.1,116.29 కోట్లు. దీంతో 2019– 20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటి నికర నష్టాలు ఏకంగా రూ.42,292 కోట్లకు ఎగబాకాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.29,303 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.12,983 కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికల్లో ఈ వివరాలను రెండు డిస్కంలు వెల్లడించాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నికర నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 ముగిసే నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా వ్యయంతో పోలిస్తే బిల్లు ల వసూళ్లు, ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీల ద్వారా వస్తున్న ఆదాయం తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచకపోవడం కూడా డిస్కంల నష్టాలకు కారణంగా చెబుతున్నారు. ఖర్చులు ఎక్కువ.. ఆదాయం తక్కువ.. ► టీఎస్ఎస్పీడీసీఎల్ 2019–20లో 45,247 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ కొనుగోళ్లకు రూ.24,907 కోట్లు, జీతాల చెల్లింపులకు రూ.2,314 కోట్లు, ఆపరేషన్ ఇతర ఖర్చులు రూ.261 కోట్లు, రుణాలపై వడ్డీలు రూ.1,489 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.986 కోట్లు, అసాధారణ ఖర్చులు రూ.148 కోట్లు కలిపి మొత్తం రూ.30,108 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.24,600 కోట్లు, ఇతరాత్ర ఆదాయం రూ.46 కోట్లు కలిపి మొత్తం రూ.24,647 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థకు 2019–20లో రూ.4,940 కోట్ల నష్టాలు వచ్చాయి. ► టీఎస్ఎన్పీడీసీఎల్ 2019–20లో 20,504 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లకు రూ.11,326 కోట్లు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రూ.1,429 కోట్లు, రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.626 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.444 కోట్లు, ఇతర ఖర్చులు రూ.305 కోట్లు కలిపి మొత్తం రూ.14,132 కోట్ల వ్యయం చేయగా, 18,650 ఎంయూల విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.24,647.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థ 2019–20లో స్థూలంగా రూ.1,116 కోట్లను నష్టపోయింది. -
అత్యధిక సోలార్ ఉత్పాదక స్టేషన్‌గా విజయవాడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విద్యుత్ ఆదాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో అడుగు ముందుకేసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో అదనంగా రూ.62 లక్షలతో మరో 65 కిలో వాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌తో ప్లాట్ ఫారాల పైకప్పులు ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ రైల్వేలోనే తొలిసారిగా 130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించింది. బుధవారం డీఆర్ఎం శ్రీనివాస్ స్టేషన్‌లోని సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్‌ను ప్రారంభించారు. 2019 డిసెంబర్లో 4, 5 ప్లాట్‌ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా మరో 54 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్‌ను 4, 5 ప్లాట్‌ఫారాలలో, 11 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్‌ను 8, 9 ప్లాట్‌ఫారాలలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్టేషన్ అవసరాలకు వినియోగించే విద్యుత్ సరఫరాలో ఏడాదికి 2.12 లక్షల యూనిట్లను తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.16.36 లక్షలు ఆదా అవుతుంది. -
జగనన్న కాలనీల్లో ‘పవర్’ఫుల్ లైన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అత్యాధునిక హంగులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక 90 శాతం తయారైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై గురువారం సమీక్షిస్తారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పటిష్టంగా విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. లే అవుట్లలో ఇళ్ల సంఖ్య, వినియోగించే విద్యుత్ ఆధారంగా ముందే లోడ్‌ను అంచనా వేశారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునేలా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతకు ఇందులో ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి వీధిలో రాత్రి వేళ అధిక వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను అమరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహజసిద్ధమైన గాలి, వెలుతురు వినియోగించుకుంటూ తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా విదేశీ సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టనున్నారు. పోల్స్ కనిపించకుండా పవర్.. జగనన్న కాలనీల్లో ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.6,475.41 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. 500 ఇళ్ల కన్నా ఎక్కువ ప్లాట్లు ఉండే లే అవుట్లలో పూర్తిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కాలనీల్లో వీధి దీపాలకు మినహా పెద్దగా విద్యుత్ పోల్స్ అవసరం ఉండదు. భూగర్భ విద్యుత్ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు తెలిపారు. తక్కువ ఇళ్లు ఉండే లే అవుట్లలో మాత్రం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో 2,271 లేఅవుట్లకు నెలాఖరుకు డీపీఆర్ కోర్టు వివాదాల్లో ఉన్నవి, వ్యక్తిగతంగా ఇంటి స్థలం ఉన్నవారిని మినహాయిస్తే ఇప్పటివరకూ 17,005 లే అవుట్లకు సంబంధించి 18,77,263 ఇళ్ల విద్యుదీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. 17,92,225 ఇళ్లకు సంబంధించి 14,734 లేఅవుట్ల పరిధిలో విద్యుదీకరణకు సమగ్ర నివేదికలు (డీపీఆర్) రూపొందించారు. ఇందులో భూగర్భ విద్యుత్ సరఫరా చేసే లే అవుట్లు 432, ఇళ్లు 8,36,705 ఉన్నాయి. మరో 2,271 లేఅవుట్లకు సంబంధించి 85,038 ఇళ్లకు విద్యుదీకరణ డీపీఆర్ ఈ నెలాఖరుకు సిద్ధం కానున్నట్లు అధికారులు తెలిపారు. 50 శాతం భూగర్భ విద్యుత్తే జగనన్న కాలనీల్లో 50 శాతం వరకూ భూగర్భ విద్యుదీకరణకే ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం డీపీఆర్‌లు పూర్తయ్యాయి. మిగతా డీపీఆర్‌లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. రెండు దశల విద్యుదీకరణ ప్రక్రియను 2023కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. విద్యుదీకరణకు అయ్యే మొత్తాన్ని రుణంగా తీసుకుని డిస్కమ్‌లకే అందిస్తాం. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. – అజయ్‌జైన్ (గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) -
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా.. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్‌కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్‌వర్క్‌ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది. సదరన్ గ్రిడ్‌లో అమలు చేసేలా.. ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్‌వోసీవో)లు ఏపీ ట్రాన్స్‌కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్‌లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్‌కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్‌తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్‌ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి. -
అసత్య కథనాలతో దుష్ప్రచారం: ఆదా.. కానరాదా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించడాన్ని ఇంధనశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏలున్న విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాలో కోత పెట్టినప్పటికీ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజుల్లో రూ.22.7 కోట్లు లాభం చేకూర్చామని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా డిస్కమ్‌లకు రూ.48 కోట్లు నష్టం వాటిల్లిందంటూ వాస్తవ విరుద్ధ కథనాలు ప్రచురించారని ఇంధనశాఖ పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లను కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని, దీన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గుర్తు చేశారు. ఏపీఈఆర్సీ నిరంతర పర్యవేక్షణ.. నిజానికి విద్యుత్ కొనుగోళ్లపై గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చౌక విద్యుత్‌నే సాధ్యమైనంత వరకూ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 17 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వివరాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విశ్లేషించింది. బొగ్గు కొరత, కోవిడ్, ఇతర కారణాలు.. ఈ నెల రోజుల వ్యవధిలో ఏపీ విద్యుత్ సంస్థలు 894.1 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్ర డిస్కమ్‌లు కొన్ని చౌకగా విద్యుత్ అందించే ఉత్పత్తి కేంద్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రకారం వీటి ద్వారా డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకూ 3,289.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ యూనిట్ రూ.3.13 చొప్పున డిస్కమ్‌లకు అందాలి. అయితే ఆయా కేంద్రాల్లో బొగ్గు కొరత, కోవిడ్ ప్రభావం, ఇతర కారణాల వల్ల ముందు రోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2,470.79 మిలియన్ యూనిట్లే విద్యుత్ ఇస్తామని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. కానీ వాస్తవంగా విద్యుత్ అందించే రోజుకు రీ షెడ్యూల్ చేసుకుని చివరకు 2,253.27 ఎంయూలే ఇచ్చాయి. 818.5 ఎంయూల విద్యుత్‌ను అందించలేకపోయాయి. లేని విద్యుత్ ఎలా కొంటారు? పీపీఏల ప్రకారం 818.5 ఎంయూల కొరత ఏర్పడటంతో పీపీఏలున్న ఇతర ఉత్పత్తిదారుల నుంచి అదనంగా విద్యుత్ తీసుకోవాలి. అయితే వాటి దగ్గర ఆ సమయంలో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.68 ఉంది. కానీ మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.38 చొప్పున మాత్రమే ఉంది. అంటే ప్రతీ యూనిట్‌కు సంస్థ 30 పైసల చొప్పున, మొత్తం రూ. 24.6 కోట్లు ఆదా చేసింది. ఇందులో గ్రిడ్ బ్యాలన్స్ కోసం రూ.1.9 కోట్లు తీసివేసినా... రూ.22.7 కోట్లు ఈ నెలలోనే విద్యుత్ కొనుగోళ్లలో ఆదా అయింది. కానీ ఒక వర్గం మీడియా మాత్రం పీపీఏ సంస్థల నుంచే ఈ విద్యుత్ కొంటే నష్టం రాదని అసత్యాలు ప్రచారం చేసింది. అసలు వాళ్ల దగ్గర విద్యుత్ లేనప్పుడు ఎలా కొనుగోలు చేస్తామని విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్‌ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్లు ఎలా ఇస్తారు? విద్యుత్ కొనగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. నష్టమని మేం చెప్పలేదే? – జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ ఛైర్మన్ విద్యుత్ కొనుగోళ్లు మరింత పారదర్శంగా ఉండాలని కమిషన్ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కమ్‌ల నుంచి వివరణ కోరాం. అంతేతప్ప మార్కెట్ నుంచి విద్యుత్ కొనడం వల్ల డిస్కమ్‌లకు నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదు. డిస్కమ్‌లు పంపే వివరాలను కమిషన్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం. -
విత్తుకు ముందే.. విద్యుత్ సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరు శాతం ఫీడర్ల పరిధిలో ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ అవసరాలకు పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీజన్ ప్రారంభం కాకముందే విద్యుత్ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. నమ్మకమైన, నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఇంధనశాఖ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 2021–22లో 12,232 మిలియన్ యూనిట్ల మేర వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉండవచ్చని అంచనా వేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా సరఫరాకు ఆటంకం కలగకుండా మిగులు విద్యుత్‌నూ సిద్ధం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్లో కొనుగోలు చేసి రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వంద శాతం ఫీడర్లు రెడీ రాష్ట్రంలో 6,616 వ్యవసాయ ఫీడర్లు ఉండగా పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని 2019లో భావించినప్పుడు 58 శాతం ఫీడర్లకు అందుకు తగ్గ సామర్థ్యం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు రూ.1,700 కోట్లు మంజూరు చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లైన్లు, సబ్ స్టేషన్ల శక్తి పెంచారు. 515 ఫీడర్ల స్థాయిని సమూలంగా మార్చారు. ఫలితంగా వంద శాతం ఫీడర్ల పరిధిలో రైతులు వినియోగించే ఉచిత విద్యుత్ సామర్థ్యాన్ని తట్టుకునే వ్యవస్థ అందుబాటులోకొచ్చింది. ప్రతి రైతుకు రూ.35 వేలపైనే ఉచితం కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కృత్రిమ మేధోశక్తి (ఏఐ) ద్వారా 2021–22లో వ్యవసాయ విద్యుత్ వాడకం ఏ సీజన్లో ఎంత ఉంటుందనేది శాస్త్రీయంగా అంచనా వేశారు. ప్రతి హెచ్‌పీకి వార్షిక విద్యుత్ వినియోగం 1,059 యూనిట్లు ఉంటుందని అంచనా. అంటే ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో 5 హెచ్‌పీ మోటార్ అమర్చుకుంటే ఏడాదికి 5,295 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ ధర రూ.6.65 చొప్పున ఐదు హెచ్‌పీ మోటార్ ఉన్న ప్రతీ రైతు కోసం ఉచిత విద్యుత్ కింద ప్రభుత్వం కనిష్టంగా రూ. 35,212 దాకా చెల్లిస్తోంది. కొంతమంది రైతులు గరిష్టంగా 10 హెచ్పీపైనే వాడుతున్నారు. వారికి రెట్టింపు మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏటా రూ.8 వేల కోట్లకుపైనే సబ్సిడీ.. రాష్ట్రంలో ప్రస్తుతం 17.55 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వీటి మొత్తం సామర్థ్యం 116 లక్షల హెచ్‌పీ ఉంటుంది. ఇవి ఏటా దాదాపు 12,232 మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా రైతుల ఉచిత విద్యుత్ కోసం వెచ్చిస్తోంది. సీజన్ల వారీగా విద్యుత్ వాడకం ఇలా ఖరీఫ్ (జూన్ నుంచి అక్టోబర్).. 4,744.44 మిలియన్ యూనిట్ల (39 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ సీజన్లో రైతులు సగటున 2.20 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. రబీ (నవంబర్ నుంచి మార్చి).. 6,192 మిలియన్ యూనిట్ల (51 శాతం) విద్యుత్ వినియోగం ఉంటోంది. రైతులు సగటున రోజుకు 4.30 గంటల పాటు పంపుసెట్ వినియోగిస్తున్నారు. అన్ సీజన్ (ఏప్రిల్ నుంచి మే).. 1,296 మిలియన్ యూనిట్ల (11 శాతం) వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉన్నట్టు లెక్క తేలింది. ఈ సీజన్లో రైతులు సగటున 1.80 గంటల పాటు మోటార్ ఆన్ చేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం విద్యుత్ లభ్యతపై అధికారులు దృష్టి పెట్టారు. ఒక్క పంప్సెట్కూ ఇబ్బంది లేకుండా... ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నాణ్యమైన సరఫరా కోసం పంపిణీ సంస్థలను నిలదీసే అధికారం కల్పించేలా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోనే వేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా ఏ ఒక్క రోజూ ఏ ఒక్క పంపుసెట్కూ విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. అన్ని స్థాయిల్లో విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈ ఏడాది మరింత మెరుగ్గా రైతులకు ఉచిత విద్యుత్ అందబోతోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
ఈదురుగాలులు, వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడి ఐదుగురు మృతిచెందారు. ఈ గాలులు, వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పిడుగులు పడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మృతిచెందిన వ్యక్తి వైఎస్సార్ జిల్లాకు చెందినవారు. గాలులు, వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లాలో కళ్లాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. నెల్లూరు జిల్లాలో పసుపు పంట దెబ్బతింది. గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. చింతలచెర్వు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ధ్వజస్తంభం పీఠ భాగం పిడుగుపాటుకు దెబ్బతింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండుగంటల పాటు వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలతో కొండలు ప్రతిధ్వనించాయి. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం కారణంగా గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రెండురోజుల పాటు వర్షాలు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం, అమరావతిల్లోని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రానున్న 48 గంటల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా తనకల్లులో 5 సెంటీమీటర్లు, ఉరవకొండలో 4, కదిరిలో 2, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 3, గుంటూరు జిల్లా జంగమేశ్వరపురం, ప్రకాశం జిల్లా దర్శి, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాడేపల్లిగూడెంలలో ఒక సెంటిమీటరు వంతున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
ట్రాన్స్ఫార్మర్లు ఇక చల్లగా..!
సాక్షి, అమరావతి: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెండేళ్లుగా గణనీయంగా పెంచింది. సాధారణంగా వేసవిలో ట్రాన్స్ఫార్మర్లపై అత్యధిక లోడ్ పడుతుంది. దీంతో అవి తేలికగా వేడెక్కి, కాలిపోవడమో లేదా ట్రిప్ అయి ఆగిపోవడమో జరుగుతుంటాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వాస్తవ లోడ్‌ను క్షేత్రస్థాయి సిబ్బంది ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వేడిని తగ్గించేందుకు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటినప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్‌కో ట్రాన్స్ఫార్మర్లలో లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా అందులో ఉండే ఫ్యాన్లు ఆన్ అయ్యి వాటిని కూల్ చేస్తాయి. వినియోగదారులకు అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మజనార్థన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం లోడ్‌ను కంట్రోల్ చేయడం ద్వారానే వేడిని అదుపు చేస్తున్నామని చెప్పారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఎక్కువ లోడ్ ఉండే ప్రాంతాలను గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ఆయిల్ మార్పిడి వేసవి ముందే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల స్థితిని అంచనా వేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ముందే ఆయిల్ మార్పు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని చెప్పారు. తరచూ చెడిపోతున్న, కాలిపోయే వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
బలమైన గాలి వీచినా ఇక చెక్కుచెదరవ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ లైన్లను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకునేలా నూతన డిజైన్‌ను తీసుకురాబోతోంది. దీని కోసం కొన్ని నెలలుగా దేశ, విదేశీ సాంకేతికతను అధ్యయనం చేసింది. తుపానుల నేపథ్యంలో తరచూ టవర్లు కూలుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటకు 300 కిలోమీటర్ల గాలి వీచినా తట్టుకునేలా టవర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వేసే లైన్లలో ముందుగా దీన్ని పాటించనుంది. ప్రస్తుతం ఉన్న లైన్లను క్రమంగా ఈ స్థాయికి తీసుకువచ్చే వీలుందని గ్రిడ్ అధికారులు వెల్లడించారు. ఎంతకైనా తట్టుకునేలా... ► ఏపీ ట్రాన్స్‌కోకు రాష్ట్రవ్యాప్తంగా 400 కేవీ, 220, 132 కేవీల లైన్లు, సబ్స్టేషన్లు, లైన్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లైన్లు వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ► ప్రస్తుతం ట్రాన్స్‌కో టవర్స్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా తట్టుకుంటాయి. భూమి తీరును బట్టి వీటి నిర్మాణం చేపడతారు. నేల మెత్తగా ఉంటే మరింత లోతుగా, ఎక్కువ ఇనుము వాడి పునాది గట్టిగా వేస్తారు. ► హుద్‌హుద్ తుపాను సమయంలో బలమైన ట్రాన్స్‌కో టవర్లకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. తుపాను తాకిడికి దాదాపు 62 విద్యుత్ టవర్లు నేలకూలాయి. కల్పక–ఖమ్మం లైన్లో 400 కిలోవాట్ల సామర్థ్యం గత 14 టవర్స్ పడిపోయాయి. ► సాధారణంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని మించి గాలి వీచిన దాఖలాలు అప్పటి వరకూ లేవు. హుద్‌హుద్ అనుభవాన్ని పరిశీలించిన తర్వాత గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే టవర్స్ నిర్మాణం అవసరమని ట్రాన్స్‌కో భావిస్తోంది. ► తుపాను ప్రభావిత ప్రాంతాలపైనే ముందుగా అధికారులు దృష్టి పెట్టారు. అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్‌కు రూపకల్పన చేశామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడున్న దానికన్నా టవర్ ఎత్తు పెంచడం, మరింత బలమైన మెటీరియల్ ఉపయోగించేలా డిజైన్‌లో మార్పు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ► కొత్త డిజైన్‌ను అందుబాటులోకి తెస్తే టవర్ నిర్మాణ వ్యయం స్వల్పంగా పెరిగే వీలుందని, అయితే, ఎలాంటి తుపానులొచ్చినా కూలిపోయే వీల్లేదని చెప్పారు. ఆ సమయంలో జరిగే నష్టంతో పోల్చుకుంటే ఇప్పుడే కొంత ఎక్కువ వెచ్చించడం భారం కాదన్నారు. -
కరెంటు కోతల్లేని పల్లె
సాక్షి, అమరావతి: పల్లెల్లో ఏడాదిగా విద్యుత్ కోతల్లేవు. లోవోల్టేజీ మాటే వినిపించడం లేదు. ఫ్యూజుపోతే చీకట్లో మగ్గే దుస్థితి కనుమరుగైంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటే సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు. 48 గంటల్లోనే కొత్తది బిగిస్తున్నారు. రైతన్నకు తొమ్మిది గంటల పగటి విద్యుత్ నాణ్యంగా ఉంటోంది. విద్యుత్ కనెక్షన్ల కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలు, వర్గాలతో పనిలేకుండానే దరఖాస్తు చేసుకున్నవారికి కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులివి. ఏడాదిలోనే 37 శాతం తగ్గిన అంతరాయాలు కరెంట్ పోతే.. గ్రామ సచివాలయానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. ప్రతి గ్రామంలోను దీనిపై విస్తృత అవగాహన ఏర్పడింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలోనే విద్యుత్ అంతరాయాలు 37 శాతం తగ్గాయి. గతంలో మూడూళ్లకు ఒక కరెంట్ లైన్మెన్ ఉండేవారు. ఇప్పుడు ప్రతి గ్రామ సచివాలయంలోను ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారు. అతడికి అన్ని విధాల శిక్షణ ఇచ్చారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు. ట్రాన్స్‌కో రూ.382.18 కోట్లతో.. 400 కేవీ, 200 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.85.40 కోట్లు వెచ్చించి 389.75 కిలోమీటర్ల మేర కొత్తగా విద్యుత్ లైన్లు వేశారు. దీనికితోడు పల్లెపల్లెకు నాణ్యమైన విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యుత్ సంస్థలు 77 కొత్త సబ్స్టేషన్లు నిర్మించాయి. 19,502.57 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేశాయి. ఇందుకోసం రూ.524.11 కోట్లు ఖర్చు పెట్టాయి. ఫలితంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. దీంతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. ఊరూరా ఆధునిక పరిజ్ఞానం పల్లెకు అందించే విద్యుత్ వ్యవస్థను అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం చేశారు. విద్యుత్ లోడ్‌ను ఇట్టే పసిగట్టి, అవసరమైన విద్యుత్‌ను కొనైనా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలోను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ డిమాండ్‌ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై లోడ్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2019–20లో ట్రాన్స్‌కో నష్టాలు 2.91 శాతానికి, డిస్కమ్‌ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. -
మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు.. బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా నిమిత్తం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6,400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ఆహ్వానించిన టెండర్ల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. బిడ్డింగ్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డర్లను సైతం ఖరారు చేసుకోవచ్చునని.. అయితే బిడ్డింగ్‌లో విజయం సాధించిన వారితో ఒప్పందాలు మాత్రం చేసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీజీఈసీఎల్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. 6,400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏపీజీఈసీఎల్ జారీచేసిన రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ (ఆర్ఎఫ్ఎస్), విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లను సవాలు చేస్తూ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీజీఈసీఎల్ జారీచేసిన ఆర్ఎఫ్ఎస్, పీపీఏలు విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. టాటా పవర్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీజీఈసీఎల్ జారీచేసిన ఆర్ఎఫ్ఎస్, పీపీఏలు కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనల ప్రకారం ఏదైనా వివాదం ఏర్పడితే, రెగ్యులేటరీ కమిషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు జారీచేసిన ఆర్ఎఫ్ఎస్, పీపీఏల్లో ఆ నిబంధనను తొలగించారని, ఏదైనా వివాదం తలెత్తితే ప్రభుత్వమే పరిష్కరిస్తుందని పేర్కొన్నారని ఆయన తెలిపారు. రైతుల కోసం తీసుకొస్తున్న ప్రాజెక్టు ఇది.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఈ ప్రాజెక్టును రైతుల కోసం తీసుకొస్తున్నామని తెలిపారు. ఇందులో విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని, రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. అసలు టెండర్ ప్రక్రియలో టాటా పాల్గొనలేదన్నారు. టెండర్లలో పాల్గొన్న వారికి లేని అభ్యంతరం టాటా పవర్‌కు ఎందుకుని ప్రశ్నించారు. ఏదో రకంగా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు ఉందని వివరించారు. టెండర్ ప్రక్రియ ముగిసిన తరువాత చివరిలో అర్ధరహితమైన అభ్యర్థనతో టాటా పవర్ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. అసలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వారికున్న అర్హత ఏమిటో చెప్పలేదన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ఆర్ఎఫ్ఎస్, పీపీఏ ఉన్నాయని శ్రీరామ్ తెలిపారు. అసలు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని, తదుపరి విచారణకల్లా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తానని ఆయన కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. టెండర్ల ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, బిడ్డర్లను ఖరారు చేసుకోవచ్చునన్నారు. అయితే.. ఒప్పందాలు మాత్రం చేసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీచేశారు. -
కొమ్మాలపాటి.. అవినీతి కోటి
‘పవర్’ను వాడేశాడు.. ఎమ్మెల్యేగా అధికారాన్ని అడ్డదారుల్లో ఉపయోగించాడు.. నిబంధనల్ని పాతేశాడు.. ప్రభుత్వ ఖజానాకే షాక్ ఇచ్చాడు.. లక్షల రూపాయల విద్యుత్ బకాయిలు కట్టకపోవడమేగాక అక్రమంగా కరెంటు వాడుకున్నాడు.. ఆవైపు చూసినవారి గొంతుల్ని పవర్‌తో నొక్కేశాడు.. పలువురు అధికారుల్ని మేనేజ్ చేశాడు.. పెద్దమనిషిగా చలామణి అవుతూ అవినీతిని కొమ్మలుకొమ్మలుగా విస్తరించాడు.. ఇదీ.. తెలుగుదేశం నాయకుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అవినీతి కథ. సామాన్యుడు ఒక నెల విద్యుత్ బిల్లు కట్టకపోయినా అధికారులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. అలాంటిది కొమ్మాలపాటి శ్రీధర్ అక్రమంగా విద్యుత్ నొక్కేస్తుంటే అధికారులు తెలియనట్లే వ్యవహరించారు. కొందరు అధికారానికి భయపడి, మరికొందరు అవినీతికి పాల్పడి మౌనంగా తలవంచారు. ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి పడుతున్నా తమది కాదుగా.. అన్నట్లు వ్యవహరించారు. సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సుమారు నాలుగేళ్లుగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారు. ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో శ్రీనాగమల్లేశ్వరి స్పిన్‌టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో స్పిన్నింగ్ మిల్లు, గాయత్రి శ్రీనారాయణస్వామి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి సర్వీసు నంబరు జీఎన్టీ 3231కి విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో 2016 డిసెంబర్ 15న అధికారులు తనిఖీ చేశారు. బిల్లు చెల్లించనందుకు డీఫాల్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. రూ.19 లక్షల విద్యుత్ బిల్లు, రూ.ఐదు లక్షల సర్‌చార్జీ మొత్తం రూ.24 లక్షలు పెండింగ్ ఉండటంతో విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. ఆ తర్వాత కూడా కొమ్మాలపాటి ఆ బిల్లును చెల్లించలేదు. అప్పట్లో కొమ్మాలపాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎవరూ ఆయనవైపు చూడలేకపోయారు. భూగర్భంలో అవినీతి లైను జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో కొమ్మాలపాటి అక్రమమార్గం ఎంచుకున్నారు. అక్కడికి 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లు నుంచి భూగర్భంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి జిన్నింగ్‌మిల్లుకు కనెక్షన్ ఇచ్చారు. విద్యుత్ మాల్‌ప్రాక్టీస్‌కు తెరతీశారు. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. విద్యుత్ శాఖ మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ఏ ఆర్మ్‌స్ట్రాంగ్ బిల్లు స్టాప్, బిల్లు చెల్లించని కనెక్షన్లను తనిఖీ చేయాలని నవంబర్ 16, 17 తేదీల్లో ఏడీఈలు, ఏఈలను ఆదేశించారు. దీంతో నవంబర్ 23న అధికారులు తనిఖీ చేయగా భూగర్భ విద్యుత్ లైను బయటపడింది. తరువాత 24, 25, 26 తేదీల్లో విజిలెన్స్ అధికారులు కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. భూగర్భ మార్గంలో నుంచి విద్యుత్ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. సుమారు నాలుగేళ్లుగా ఇలా ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్న కొమ్మాలపాటి అవినీతిని బట్టబయలు చేశారు. జిన్నింగ్ మిల్లుకు విద్యుత్ కనెక్షన్ కట్‌చేసి నోటీసులిచ్చారు. రూ.1.69 కోట్లు చెల్లిస్తేనే తిరిగి కనెక్షన్ జిన్నింగ్మిల్లును పరిశీలించిన విజిలెన్స్ అధికారులు రూ.1.69 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. పాత బకాయిలు, ఫైను కలిపిన ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులపై అనుమానాలు జిన్నింగ్ మిల్లుకు 2016 డిసెంబర్ నుంచి ఇప్పుడు 2020 నవంబర్ వరకు సుమారు నాలుగేళ్లపాటు కోటిరూపాయలకు పైగా విలువైన విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నా ఉన్నతాధికారులకు తెలియలేదంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పిన్నింగ్ మిల్లు నుంచి జిన్నింగ్ మిల్లుకు భూగర్భ లైన్ వేశారంటే విద్యుత్ అధికారుల ప్రమేయం ఉండే ఉంటుందని ఆ శాఖలోని కొందరు చెబుతున్నారు. గతనెలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసినా టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్నతాధికారుల లాలూచీ ఉండొచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై గుంటూరు విజిలెన్స్ ఈఈ విజయకృష్ణను వివరణ కోరగా ఈ విషయాలు బయటకు చెప్పేవి కాదన్నారు. జిన్నింగ్ మిల్లుకు సంబంధించి రూ.1.69 కోట్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
లో వోల్టేజీకిక చెక్!
సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి విద్యుత్ బల్బులు డిమ్‌గా మారిపోవడం, ట్యూబ్‌లైట్లు ఆరిపోవడం, విద్యుత్ సరఫరా ఎక్కువ, తక్కువ కావడం వంటి సమస్యలు ఇక సమసిపోనున్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం విద్యుత్ లోవోల్టేజీ సమస్య తలెత్తదని అంటున్నారు. ఏపీ ట్రాన్స్‌కో రూ.6,610.5 కోట్ల వ్యయంతో 85 ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రపంచబ్యాంక్‌తో పాటు పలు ఆర్థిక సంస్థలు సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. ► సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, లైన్లు వేయడం కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ పెరిగినా లోవోల్టేజీ అన్న సమస్యే తలెత్తదు. ► రాష్ట్రంలో ఏటా 20 శాతం మేర విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పంపుసెట్లకు పీక్ అవర్స్‌లోనే విద్యుత్ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే లోడ్‌ను తట్టుకునేందుకు విద్యుత్ వ్యవస్థల బలోపేతం తప్పనిసరి. ► ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ► ఈ ప్రాజెక్టులకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే కొంత భాగానికి పాలనపరమైన అనుమతులు కూడా లభించాయి. -
కరెంట్.. ఇక దైవాధీనం కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సబ్స్టేషన్ల ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు అధికారులు టెండర్ నిబంధనలు రూపొందించి న్యాయసమీక్షకు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పనుల్లో మరింత వేగం పుంజుకుంటుంది. సబ్స్టేషన్ల ఆటోమేషన్ పూర్తయితే తొమ్మిది గంటల పగటి విద్యుత్‌కు మరింత భరోసా లభిస్తుంది. చెప్పినవేళకు ఆటోమేటిక్‌గా వ్యవసాయ విద్యుత్ సరఫరా అవుతుంది. ► సబ్‌స్టేషన్‌లో వ్యవసాయ ఫీడర్లను ఇప్పటివరకు విద్యుత్ సిబ్బంది ఆన్, ఆఫ్ చేసేవాళ్లు. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందా? లేదా? అనేదానికి శాస్త్రీయతా కనిపించడంలేదు. ఈ విధానాన్ని సమూలంగా మారుస్తూ సబ్స్టేషన్ల ఆటోమేషన్‌కు విద్యుత్‌శాఖ శ్రీకారం చుట్టింది. ► మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోనూ కొన్ని సబ్స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆటోమేషన్ చేపట్టారు. ఇవి మంచి ఫలితాలిచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచైనా విద్యుత్ సరఫరాను పరిశీలించగలిగారు. వ్యవసాయ విద్యుత్ లోడ్‌ను శాస్త్రీయంగా తెలుసుకున్నారు. రిమోట్ ద్వారా విజయవాడ నుంచి కూడా ఆపరేట్ చేయగలమని నిరూపించారు. ► ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్లను ఆటోమేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 విద్యుత్ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 1,068 సబ్స్టేషన్లలో పూర్తి ఆటోమేషన్ చేపడతారు. మిగిలిన వాటిని తరువాత దశలో ఆటోమేషన్ చేస్తారు. ప్రపంచబ్యాంకు రుణం ఆటోమేషన్ ప్రక్రియకు వెయ్యికోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఇంటలెక్చువల్ ఎల్రక్టానిక్ డివైజ్ ద్వారా పనిచేసే ఈ సాంకేతికత రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విద్యుత్ సరఫరా దైవా«దీనం అనే గత అనుభవాలను పూర్తిగా మారుస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే ఫీడర్లు ఆన్ అవుతాయి. తొమ్మిది గంటల సమయం పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. పైలెట్ ప్రాజెక్టు ద్వారా అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వందశాతం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ చేపట్టబోతున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి నాణ్యత పెరుగుతుంది విద్యుత్ లోడ్‌ను సాంకేతికంగా తెలుసుకోవచ్చు. దీంతో సబ్‌స్టేషన్ పరిధిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఫలితంగా విద్యుత్ సరఫరా నాణ్యత మరింత పెరుగుతుంది. – పద్మా జనార్దన్‌రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ -
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, వరదల సమయంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తుపాను, వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సీఎం విద్యుత్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మీడియాకు వెల్లడించారు. ముందస్తు వ్యూహంతో తప్పిన ముప్పు ► విద్యుత్ పునరుద్ధరణ పనులపై సమగ్ర సమాచారాన్ని అధికారులు సీఎం ముందుంచారు. రాష్ట్రంలో 13,648 ఫీడర్లున్నాయి. తుపాను కారణంగా 170 ఫీడర్ల పరిధిలో బ్రేక్ డౌన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 165 ఫీడర్లలో విద్యుత్‌ను పునరుద్ధరించారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. వీటిని కూడా చాలా వరకు పరిష్కరించారు. మొత్తం 1,263 ఫీడర్లలో 23 బ్రేక్ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 22 ఫీడర్లు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ► తాత్కాలిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టే ఏర్పాట్లు చేశామని ఇంధనశాఖ ఉన్నతాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి, బ్రేక్‌డౌన్స్ రాకుండా చూడగలిగామని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి తెలిపారు. -
ఉచిత విద్యుత్‌కు కొత్త ఎనర్జీ
రాష్ట్రంలో రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 2019 నాటి ఈ ఫీడర్లలో 58 శాతమే 9 గంటల విద్యుత్‌ను అందించే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఫీడర్ల వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం రూ.1,700 కోట్లతో పనులు మొదలుపెట్టింది. కోవిడ్ ఇబ్బందుల మధ్యనే ఇప్పటికి 97.5 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ నాటికి వంద శాతం పూర్తవుతాయి. ఇక మీటర్లు బిగిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎంత విద్యుత్ వాడుతున్నారనే వివరాలు తెలుస్తాయి. తద్వారా సరఫరాలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తద్వారా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదని చెప్పారు. ఈ విషయంపై విస్తృత ప్రచారంతో రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఇంధన శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి బాలినేని, అధికారులు నాణ్యత–ఐఎస్ఐ ప్రమాణాలు ► ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్ఎల్– ఎనర్జీ ఎఫిషియన్షీ సర్వీసెస్ లిమిటెడ్)తో మాట్లాడండి. రైతులు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన మోటార్లు వినియోగించేలా అవగాహన కల్పించాలి. ► కెపాసిటర్లు కూడా ఐఎస్ఐ ప్రమాణాలతో ఉండాలి. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలి. ► మరోవైపు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ► మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్మెన్లకు శిక్షణ ఇచ్చామని అధికారులు వెల్లడించారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. ► ఈ సమీక్షలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక అంతా ఆటోమేటిక్
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాలో వినూత్న విప్లవం రాబోతోంది. పూర్తి సాంకేతికతతో వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు పనిచేయబోతున్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లన్నింటినీ ‘ఆటోమేషన్’ చేసేందుకు ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకు అవసరమైన నిధులు సమకూర్చనుంది. ఆటోమేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. రైతన్నకు ఇది చేయబోయే మేలుపై సమగ్ర సమాచారం సేకరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 విద్యుత్ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో అర్ధరాత్రి అపరాత్రి అతి కష్టం మీద ఏడు గంటల విద్యుత్ ఇవ్వగా నవరత్నాల్లో భాగంగా పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పుడేం చేయబోతున్నారంటే.. గతంలో వ్యవసాయ క్షేత్రానికి మూడు వైర్లు (త్రీ ఫేజ్) ద్వారా విద్యుత్ అందించాల్సి ఉండేది. అంటే.. 9 గంటల పాటు త్రీఫేజ్ ఆన్ చేయాలి. ఏబీ స్విచ్‌లు, ఫీడర్ బ్రేకర్లను అక్కడ ఉండే షిప్ట్ ఆపరేటర్ పనిచేయించాల్సి ఉంటుంది. అతడు ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. ఆ సమయంలో సబ్‌స్టేషన్‌కు వెళ్లలేకపోయినా రైతులకు త్రీఫేజ్ విద్యుత్ అందదు. ఈ ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3 వేలకు పైగా ఉన్న సబ్స్టేషన్లలో మొదటి దశలో 1,068 స్టేషన్లను రూ.900 కోట్లతో ఆటోమేషన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ఆటోమేషన్ స్టేషన్లు పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. విద్యుత్‌ను ఎంతసేపు ఇవ్వాలో ప్రోగ్రామింగ్ ద్వారా నిర్ణయిస్తే చాలు. క్షణం ఆలస్యం కాకుండా నిర్దేశిత సమయానికి త్రీ ఫేజ్ ఆన్ అవుతుంది. 9 గంటల తర్వాత ఆగిపోతుంది. మానవరహితంగా పనిచేసే ఈ టెక్నాలజీ దేశంలోనే తొలిసారి. సబ్ స్టేషన్లో నాలుగు ఫీడర్లుంటాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో 300 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుంటాయి. త్రీఫేజ్ విద్యుత్ వైర్లను, స్విచ్ బ్రేకర్స్‌ను తిప్పడం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ ప్రక్రియను ఇంటలెక్చువల్ ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా సబ్‌స్టేషన్ పరిధిలోనే రిలే కంట్రోల్ ప్యానల్‌కు కనెక్ట్ చేస్తారు. ఇందులోనే ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది. దీనిద్వారా ఏ సమయంలో విద్యుత్ సరఫరా జరగాలి? ఎప్పుడు ఆగిపోవాలనే సమయాన్ని కమాండ్‌గా ఇస్తారు. ఆ సమయానికి సిగ్నల్ వెళ్లి ఆయస్కాంతీకరణ ద్వారా స్విచ్ బ్రేకర్స్‌ను తిప్పుతాయి. దీంతో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుంది. సబ్ స్టేషన్లో ఉండే “మోడెమ్’ ద్వారా వల్లూరుపాలెం సబ్‌స్టేషన్‌లోని ఫీడర్లను విజయవాడ విద్యుత్ సౌధ నుంచి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన పాస్‌వర్డ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంచుతారు. జవాబుదారీతనం పెరుగుతుంది ఆటోమేషన్ వల్ల అంతరాయం లేకుండా పగటిపూట 9 గంటల విద్యుత్ రైతులకు అందించవచ్చు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్రంలో రెండు కంపెనీలు పైలెట్ ప్రాజెక్టులు పూర్తి చేశాయి. మంచి ఫలితాలు వచ్చాయి. – పద్మా జనార్దన్ రెడ్డి, సీఎండీ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే లక్ష్యం రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఆటోమేషన్ చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టు ఫలితాలు, ప్రాజెక్టు సమగ్ర నివేదికను ప్రపంచబ్యాంకుకు పంపించాం. ఒక్కో సబ్ స్టేషన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వరకు ఖర్చు కావచ్చు. బహిరంగ టెండర్లు పిలిచి పోటీ ద్వారా ధర తగ్గించేలా కృషి చేస్తున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి వ్యవసాయ విద్యుత్ ఇలా.. రాష్ట్రంలో పంపుసెట్లు: 17,54,906 ఫీడర్లు: 6,616 లోడ్ (మెగావాట్లు): 1,15,55,552 సాగుకు విద్యుత్ సరఫరా సీజన్ వారీగా మిలియన్ యూనిట్లలో.. ఖరీఫ్ (జూన్–సెప్టెంబర్) 4,744.44 (39 శాతం) రబీ (సెప్టెంబర్–మార్చి) 6,192 (51 శాతం) అన్ సీజన్ (ఏప్రిల్–మే) 1,296 (11 శాతం) మొత్తం (ఏప్రిల్–మార్చి) 12,232.44 (100 శాతం) – నోట్: ప్రతి హెచ్‌పీకి వార్షిక వినియోగం 1,059 (మిలియన్ యూనిట్లు) -
‘ఉచితం’ శాశ్వతానికే
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని రాష్ట్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడటం, ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. నగదు బదిలీపై వ్యక్తమవుతున్న సందేహాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం సమగ్రంగా నివృత్తి చేశారు. ఏడాదిగా రైతుకు ఎంతో మేలు.. ► ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతోంది. 2019 వరకు కేవలం 58 శాతం ఫీడర్లే 9 గంటల విద్యుత్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండేవి. వీటి బలోపేతం కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లోనే 89 శాతం ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందుతోంది. రబీ నాటికి అన్ని ఫీడర్లు సిద్ధమవుతాయి. ► ఉచిత విద్యుత్‌కు మరో 30 ఏళ్లు ఢోకా లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపడుతోంది. ► 31.3.2019 నాటికి ఉన్న బకాయిల్లో రూ. 8655 కోట్లు, 2019–20లో ప్రభుత్వం చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలు మొత్తం రూ.7,172 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ► వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు 7,523 మంది జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించింది. సాగు అవసరాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఫీడర్లలో అంతరాయాలు 2018–19తో పోలిస్తే 2019–20లో 38.4 శాతం మేర తగ్గాయి. నగదు బదిలీ ఎవరికి వర్తిస్తుంది? ► ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. ఏ ఒక్క రైతు తన జేబు నుంచి పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. మీటర్లు ఎందుకు? ► మీటర్లు అమరిస్తే ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో అర్థమవుతుంది. రైతులే డిస్కమ్‌లకు చెల్లిస్తారు కాబట్టి నిలదీసి మెరుగైన సేవలు పొందవచ్చు. ► డిస్కమ్‌లు ఇప్పటివరకు వార్షిక నష్టాలన్నీ రైతుల ఖాతాలో వేస్తున్నాయి. మీటర్లు అమరిస్తే వినియోగం, వృధా తెలుస్తుంది. వీటికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరమ్మతుల ఖర్చు డిస్కమ్‌లే చూసుకుంటాయి. పరిమితులుంటాయా? ► ఉచిత విద్యుత్తు కనెక్షన్లు తగ్గిస్తారని, పరిమితులు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు. ► నగదు బదిలీ ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా ఆపవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ► అనధికార కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అదనపు లోడ్ కనెక్షన్ల్ల క్రమబద్ధీకరణ కూడా చేస్తున్నాం. కౌలు రైతులు ఎలా సాగు చేస్తున్నారో అలాగే ఇకపై కూడా ఉచిత విద్యుత్ పొందుతూ సాగు చేసుకోవచ్చు. -
విద్యుత్ పంపిణీ సంస్థల పటిష్టానికి రోడ్‌మ్యాప్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసినట్టు ఇంధనశాఖ ప్రకటించింది. నిధులు సమకూర్చుకోవడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే దీని ముఖ్యోద్దేశమని తెలిపింది. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో రూపొందించిన రోడ్‌మ్యాప్ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. నష్టాలకు బ్రేక్ ► సాంకేతిక నష్టాలను కనిష్టంగా 12 శాతానికి తగ్గించాలని ఇంధనశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019–20లో ఇవి 13. 36 శాతానికి తగ్గించటం ద్వారా చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తెలిపారు. నిజానికి 2018–19లో 16.36 శాతంమేర సాంకేతిక నష్టాలు ఉన్నట్టు వివరించారు. ► 2024–25 నాటికి ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసర నివేదికకు, వాస్తవ ఖర్చుకు తేడా లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈ గ్యాప్ 2019 లో యూనిట్ కు రూ.2.26 ఉండగా, 2020లో రూ.1.45కి తగ్గించారు. దీనివల్ల రూ 4,783 కోట్లు ఆదా చేయగలిగారు. ఫీడర్ల విభజన ► గృహ, వ్యవసాయ ఫీడర్ల విభజన ద్వారా విద్యుత్ సరఫరాలో మరింత నాణ్యత పెంచనున్నారు. వ్యవసాయ విద్యుత్ లోడ్ ను గ్రీన్ ఎనర్జీ కిందకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సోలార్ విద్యుత్‌తో వ్యవసాయ ఫీడర్లను అనుసంధానం చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. ► మౌలిక సదుపాయాల పెంపులో భాగంగా డిస్కమ్‌లు ఇప్పటికే 77 నూతన సబ్ స్టేషన్లు, 19,502. 57 కిలోమీటర్ల పొడవైన 33 కే వీ, 11 కే వీ ఎల్టీ లైన్లను పూర్తి చేశాయి. దీనికోసం రూ.524.11 కోట్లు ఖర్చు చేశాయి. ► విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంలో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ సేవల నిర్వహణకు ప్రత్యేకంగా ఐటీ క్యాడర్ ను ఏర్పాటు చేయనున్నారు. సూపర్వైజరి కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టంను అన్ని స్థాయిల్లోనూ తీసుకురాబోతున్నారు. -
కావాల్సినంత కరెంట్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. రబీ నాటికి వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్‌ను వందశాతం ఫీడర్ల ద్వారా ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ► రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోటుపాట్లకు సంబంధించి చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కీలకమైన పవర్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలి. ► రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయానికి 9 గంటల పగటి పూటే విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఖరీఫ్‌లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలకు అనుగుణంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు çచేసుకోవాలి. ► వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలి. బ్రేక్ డౌన్ సమయంలో తక్షణ విద్యుత్తు పునరుద్ధరణకు వీలుగా విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. ► సబ్ స్టేషన్లు, జిల్లా వారీగా పనితీరు స్కోర్ నమోదు చేసి ర్యాంకులివ్వాలి. సమీక్ష సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్దన రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రానికే ‘పవర్’!
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికే సంపూర్ణ అధికారాలు ఉండాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలు కేంద్రానికి స్పష్టం చేశాయి. అప్పుడే విద్యుత్ చార్జీలు అ న్ని వర్గాలకు భారం కాకుండా ఉంటాయని పేర్కొన్నాయి. విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్ పంపిణీ సంస్థలను తీసుకురావాలన్న ఆలోచనపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థల అధికారాలను కేంద్రీకరిస్తూ 2003 విద్యుత్ సంస్కరణల చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు తెలియచేయాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల రాసిన లేఖ వివరాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్ష సబ్సిడీకి ప్రతికూలత రైతులు, పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చౌకగా విద్యుత్ అందిస్తోంది. అయితే దీని స్థానంలో సబ్సిడీని వారి ఖాతాల్లోకే జమ చేయాలని కేంద్రం చట్ట సవరణల్లో పేర్కొంది. దీనివల్ల ఆయా వర్గాలు పలు ఇబ్బందులకు గురవుతాయి. సబ్సిడీ వారి ఖాతాల్లోకి వచ్చినా ముందుగానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సామాజిక సమస్యలకు కారణమవుతుంది. విద్యుత్ చార్జీలు ఎలా ఉండాలనేది స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ అధికారాన్ని కేంద్రం తీసుకుంటే పలు వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి. కేంద్రం చేతుల్లోకి కమిషన్ సరికాదు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, ఇద్దరు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. ఈ అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ చేసిన చట్ట సవరణ ప్రతిపాదన ఏమాత్రం సమంజసంగా లేదని విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిదారులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యుత్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధారిటీ ఏర్పాటుపై రాష్ట్ర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రతి వివాదానికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి డిస్కమ్‌లకు కొత్త సమస్యలు సృష్టిస్తాయని స్పష్టం చేశాయి. ఆర్థికంగానూ ఇది డిస్కమ్‌లకు ఇబ్బందేనని తెలిపాయి. విద్యుత్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) స్థానంలో కేంద్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)కి సర్వాధికారాలు కట్టబెట్టే యోచనను విద్యుత్ సంస్థలు వ్యతిరేకించాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికం గా నష్టపోయే వీలుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రైవేట్ పవర్‌కు జవాబుదారీ ఎవరు? ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలను రంగంలోకి దించే ఈ చట్ట సవరణ ప్రతిపాదనపై డిస్కమ్‌లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విద్యుత్ పంపిణీ విషయంలో ఎవరు జవాబుదారీగా ఉంటారనేది చట్టంలో స్పష్టత ఇవ్వలేదని తెలిపాయి. ఫ్రాంచైజ్, లైసెన్స్‌లు, సబ్ లైసెన్స్‌ల విధానాన్ని వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను ప్రజల ముందుంచాలని సూచించాయి. ఏదేమైనా రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్నా, పేదలకు చౌకగా విద్యుత్ సరఫరా జరగాలన్నా విద్యుత్ సంస్థలపై రాష్ట్రాలకే అధికారం ఉండాలని అభిప్రాయపడ్డాయి. -
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో రికార్డు
-
కోరినన్ని కనెక్షన్లు
సాక్షి, అమరావతి: రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఏడాది కాలంలోనే 63,068 కొత్త కనెక్షన్లు జారీ చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి ఆన్లైన్లోనే మంజూరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఫలితంగా రైతులు వ్యవసాయ కనెక్షన్ కోసం రోజులు తరబడి అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి తప్పింది. 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 18,07,100 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 18,70,168కి పెరిగింది. వీటన్నింటికీ నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రబీ కల్లా అన్నీ ఫీడర్లలో... రాష్ట్రంలో ప్రస్తుతం 6,663 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లున్నాయి. వీటిల్లో 5,383 ఫీడర్లు మాత్రమే (81 శాతం) 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగే స్థాయిలో ఉన్నాయి. మిగతా ఫీడర్లను కూడా బలోపేతం చేసి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం అదనంగా రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 426.88 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 64 కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రబీ నాటికల్లా వందశాతం ఫీడర్లలో 9 గంటల వ్యవసాయ విద్యుత్ అందించాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. మరికొన్ని కనెక్షన్లు! నాణ్యమైన విద్యుత్ అందుతుండడంతో వ్యవసాయ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లపై అనధికారిక కనెక్షన్లు తొలగించి కొత్తవి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు లైన్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు సాధ్యమైనంత వరకు కనెక్షన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంధనశాఖ అధికారులు వివరించారు. రైతుల కోసం ఎంతైనా ‘రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్త కనెక్షన్ల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
చౌక విద్యుత్ వల్ల రూ.700 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో స్వీయ నియంత్రణ పాటించడం వల్ల ఏడాది కాలంలోనే డిస్కమ్‌లు రూ.700 కోట్లు ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డుగా పేర్కొంది. ఏడాది కాలంలో సాధించిన పురోగతిని వివరిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సబ్సిడీ బకాయిలు చెల్లింపుతో. ► గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,391 కోట్లు ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019–20లో రూ.8,655 కోట్లను డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించింది. ► విద్యుత్ సబ్సిడీ కింద మరో రూ.9,249 కోట్లను (మొత్తం రూ.17,904 కోట్లు) చెల్లించింది. ► విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం 2019–20లో రూ.20,384 కోట్లు విడుదల చేసింది. డిస్కమ్‌లు మరో రూ.14 వేల కోట్లను ఉత్పత్తిదారులకు చెల్లించాయి. రైతులకు ఉచిత విద్యుత్ ► రాష్ట్రంలోని 18.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు వచ్చే రబీ సీజన్ ప్రారంభం నాటికల్లా పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలని విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ► ఇప్పటికే 81 శాతం ఫీడర్ల పరిధిలో ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. మిగిలిన ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఆధునికీకరణ నిమిత్తం ప్రభుత్వం రూ.1,700 కోట్లు విడుదల చేసింది. ► విద్యుత్ సంస్థల పురోగతిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. వ్యవసాయానికి పగటి పూటే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.8,353.58 కోట్లు కేటాయించిందన్నారు. -
కరోనా షాక్ 4,700 కోట్లు!
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్ర విద్యుత్ సంస్థలను కోలుకోలేని దెబ్బ తీసింది. లాక్‌డౌన్‌తో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వాడకం పూర్తిగా స్తంభించడంతో అంచనాలు తారుమారయ్యాయి. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే వ్యవసాయ, గృహ విద్యుత్తు వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ విద్యుత్ సంస్థల వాస్తవ పరిస్థితిని విశ్లేషిస్తూ ఇంధనశాఖ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ వివరాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ► 2020–21లో 59,957 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేయగా కరోనా ప్రభావంతో 53,657 ఎంయూలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. వాడకం 6,300 ఎంయూలు (11 శాతం) తగ్గవచ్చు. ► రెవెన్యూ వసూళ్లు రూ.30,032 కోట్లు ఉంటాయని అంచనా వేసినా రూ.25,346 కోట్లకే పరిమితం కానున్నాయి. రూ.4,686 కోట్లు (16 శాతం తక్కువ) నష్టం వాటిల్లే వీలుంది. మొదటి త్రైమాసికంలో నష్టం 38 శాతం వరకు ఉంది. ► లాక్డౌన్ అమలైన మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 4,666 మిలియన్ యూనిట్లకు బదులుగా 1,854 మిలియన్ యూనిట్లే ఉంది. వాణిజ్య విద్యుత్ డిమాండ్ 833 మిలియన్ యూనిట్లకు బదులుగా 697 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. గృహ విద్యుత్ వినియోగంలో ఎలాంటి మార్పు లేదు. కానీ సబ్సిడీతో అందించే ఈ కరెంట్‌తో విద్యుత్ సంస్థలకు అదనపు రెవెన్యూ ఉండదు. భారీ నష్టమే విద్యుత్ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.4,700 కోట్ల మేర నష్టపోవడం సాధారణ విషయం కాదు. సేవాభావంతో పని చేస్తున్న విద్యుత్ సంస్థలు ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పరిస్థితిపై నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందుంచాం.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) -
వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: వేసవిలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కోసం ప్రత్యేకంగా ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. కరోనా, వేసవి కాలంలో విద్యుత్ సంస్థల పనితీరుపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల రెవెన్యూ బాగా పడిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అధిగమించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. ► లాక్డౌన్ ఎత్తివేస్తే.. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్, లభ్యతపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్ల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, మండు వేసవిలోనూ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. ► మరో రెండు వారాల పాటు వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ ఉండే వీలున్నందున ఉదయం సమయంలోనే మోటార్లకు విద్యుత్ సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. ► వ్యవసాయ పంపు సెట్ల కోసం ఉద్దేశించిన 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. టెండర్లు పిలిచేందుకు వీలుగా అవసరమైన ప్రక్రియకు సిద్ధం కావాలన్నారు. ► విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ బిల్లులు రాకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రామ సచివాలయాల ద్వారా విద్యుత్ బిల్లుల వసూలు చేస్తే ఎలా ఉంటుందనే అంశం చర్చకొచ్చింది. ఈ సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, జెన్కో ఎండీ శ్రీధర్, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
గ్రిడ్ కుప్పకూలే అవకాశమే లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దేశ ప్రజలందరూ విద్యుత్ బల్బులను ఆర్పివేసినా పవర్ గ్రిడ్ ఏమీ కూలిపోదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, డిమాండ్‌లో వచ్చే తేడాలను నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతీయులందరి సామూహిక సంకల్ప బలాన్ని ప్రదర్శించేందుకు ప్రధాని ఆదివారం రాత్రి విద్యుత్ దీపాలను తొమ్మిది నిమిషాలపాటు ఆర్పివేయాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేస్తే అకస్మాత్తుగా వినియోగం తగ్గి విద్యుత్ గ్రిడ్ కుప్పకూలుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీపాలన్నీ ఆర్పితే దాదాపు 13 గిగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు జల, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గిస్తామని విద్యుత్ గ్రిడ్ నిర్వహణను చూస్తున్న పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లను తగు విధంగా పనిచేయించడం ద్వారా అత్యధిక స్థాయి డిమాండ్‌ను అందుకునేందుకు ఏర్పాట్లు చేశామని పవర్ సిస్టమ్ కార్పొరేషన్ తెలిపింది. దేశీ విద్యుత్తు వ్యవస్థ పటిష్టంగా ఉందని, వోల్టేజీలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు తగిన పద్ధతులు పాటిస్తామని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు లేఖ రాశారు. ఇళ్లల్లో దీపాలను మాత్రమే ఆర్పివేయాల్సిందిగా మోదీ కోరారని, వీధి దీపాలు, కంప్యూటర్, టీవీ, ఫ్యాన్, ఫ్రిజ్ వంటివి నడుస్తూనే ఉంటాయని తెలిపారు. ఆసుపత్రులు, ఇతర ప్రజా సంబంధిత వ్యవస్థల్లోనూ విద్యుత్తు వినియోగం ఉంటుందని గుర్తు చేశారు. ఆదివారం రాత్రి నాటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య లోడ్ షెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆదివారం రాత్రి విద్యుత్తు డిమాండ్ పది నుంచి పన్నెండు గిగావాట్ల మేర తగ్గే అవకాశముందని ఇది గ్రిడ్ కూలిపోయేంత స్థాయిదేమీ కాదని అధికారులు కొందరు తెలిపారు. -
లైట్లు మాత్రమే ఆర్పండి..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆపేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందిలేకుండా చూడటానికి రాష్ట్ర విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్‌ను అదుపు చేయడానికి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నిరంతరం పనిచేస్తుంది. విద్యుత్‌ను చేరవేసే వ్యవస్థ (పవర్ గ్రిడ్)పై డిమాండ్ పెరిగినప్పుడు విద్యుత్ లభ్యత పెంచుతారు. డిమాండ్ తగ్గినప్పుడు ఉత్పత్తి తగ్గిస్తారు. ఎస్ఎల్డీసీ శుక్రవారం రాత్రి నుంచే ఈ కసరత్తు మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి వరకూ అప్రమత్తంగానే ఉంటుంది. ► రాష్ట్రంలో సాధారణంగా 9 గంటల సమయంలో విద్యుత్ డిమాండ్ 6,800 మెగావాట్లు ఉంటుంది. ► 9 నిమిషాలు ఇళ్లల్లో లైట్లు ఆపేస్తే ఒక్కసారిగా డిమాండ్ 500 మెగావాట్ల మేర పడిపోతుంది. ఆతర్వాత ఒక్కసారే డిమాండ్ యథాతథ స్థితికి వస్తుంది. ► ఈ సమయంలో గ్రిడ్‌కు అనుసంధానమైన విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం, పెంచడం చేయకపోతే ఉత్పత్తి స్టేషన్లు సాంకేతికంగా దెబ్బతింటాయి. ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అవుతాయి. ► ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం ఉదయం నుంచే తగ్గిస్తారు. థర్మల్ను వెనువెంటనే ఉత్పత్తిలోకి తేవడం కొంత కష్టం. జల విద్యుత్ ఉత్పత్తిని అప్పటికప్పుడే ప్రారంభించవచ్చు. అందుకే సీలేరులోని 450 మెగావాట్లు, శ్రీశైలంలో 550 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ► లైట్లు ఆపేసిన సమయంలో లోడ్ తగ్గి గ్రిడ్ ఫ్రీక్వెన్సీ అదుపులో ఉండటం కష్టం. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు నడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం మార్గదర్శకాలివీ.. ► ఇళ్లల్లో లైట్లు తప్ప అన్ని విద్యుత్ ఉపకరణాలు నడుస్తాయి. ► వీధి దీపాలు ఆన్‌లోనే ఉంటాయి. ► ఆసుపత్రులు, మున్సిపల్ సర్వీసులు, పోలీసు కార్యాలయాలు, ఇతర అత్యవసర విభాగాల్లో లైట్లు యథావిధిగా వెలుగుతాయి. వినియోగదారులు గమనించాలి ఆ తొమ్మిది నిమిషాలు ఇళ్లల్లో కేవలం లైట్లు మాత్రమే ఆపండి. ఏసీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు ఇతర ఉపకరణాలు ఆన్‌లోనే ఉంచండి. గ్రిడ్ బ్యాలెన్స్ కోసం వినియోగదారులు దీన్ని గమనించాలి. అన్నీ ఆపేస్తే డిమాండ్ ఒక్కసారే పడిపోయి గ్రిడ్‌పై ప్రభావం పడుతుంది. ఇది జరిగితే పునరుద్ధరణకు చాలా సమయం పడుతుంది. – హెచ్.హరినాథరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ కేంద్రంతో సమన్వయం తొమ్మిది నిమిషాలు లైట్లు ఆపాలన్న నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ఇంధనశాఖతోనూ సమన్వయం చేసుకుంటున్నాం. దక్షిణ, జాతీయ గ్రిడ్ అధికారులతో ఇప్పటికే మాట్లాడాం. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్, జెన్కో స్టేషన్స్, ఇతర ఉత్పత్తిదారుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని విభాగాల నుంచి నివేదికలు తీసుకుంటున్నాం. డిస్కమ్‌లకు అవసరమైన ఆదేశాలిచ్చాం. – శ్రీకాంత్ నాగులాపల్లి ఇంధనశాఖ కార్యదర్శి ఆ 9 నిమిషాలు ఓ సవాల్ మాకు ఆ తొమ్మిది నిమిషాలు ఓ సవాల్. దీనికోసం శుక్రవారం నుంచే కసరత్తు ముమ్మరం చేశాం. మనం కేంద్ర విద్యుత్ సంస్థల నుంచీ విద్యుత్ తీసుకుంటున్నాం. కాబట్టి ముందే దీనిపై సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పవన, సౌర విద్యుత్‌ను ఆపేయడానికి ఏర్పాట్లు చేశాం. తీసుకున్న చర్యల కారణంగా గ్రిడ్‌పై ప్రభావం ఉండదనే భావిస్తున్నాం. – భాస్కర్, లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజనీర్ -
ఆసుపత్రులకు నిరంతర విద్యుత్తు
సాక్షి, అమరావతి: ఆసుపత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగరాదని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవల్లో సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సరఫరా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, జెన్కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ► విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఫీడర్లు మొదలుకొని అన్నిటిని పర్యవేక్షిస్తున్న అధికారులు ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే అప్రమత్తమయ్యేలా చర్యలు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్లను సిబ్బంది నిరంతరం పరిశీలిస్తున్నారు. ► రోగుల తాకిడి ఎక్కువగా ఉండేచోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఉపకరణాలు, సిబ్బందిని తయారుగా ఉంచారు. ► లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 196 – 200 మిలియన్ యూనిట్ల వరకు ఉండగా ప్రస్తుతం ఇది 154 ఎంయూలకు పడిపోయింది. అయితే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగం తగ్గినా గృహ విద్యుత్‌కు మాత్రం డిమాండ్ పెరుగుతోంది. ► విద్యుత్ డిమాండ్ తగ్గడంతో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో ఐదు యూనిట్లు, ఎన్టీటీపీఎస్ లో నాలుగు యూనిట్లు, ఎస్డీఎస్టీపీఎస్లో ఒక యూనిట్, కుడిగిలో ఒక యూనిట్, వల్లూరులో 40 మెగావాట్లతో కలిపి మొత్తం 3,370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. ► థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించడంతో వివిధ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచు కోవడంపై ఏపీ జెన్కో దృష్టి పెట్టింది. మొత్తం 14,89,703 మెట్రిక్ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. ఇది 20 రోజులకు సరిపోతుంది. ► బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం విద్యుత్ అమ్మకం ధరలు పడిపోయాయి. వాణి జ్య, పారిశ్రామిక డిమాండ్ బాగా తగ్గడం తో గతవారం సగటున ఒక యూనిట్ ధర రూ.2 నుంచి రూ.2.50 వరకు ఉంది. సొంతంగా ఉత్పత్తి కన్నా బహిరంగ మార్కెట్లోనే విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుండడంతో డిస్కమ్‌లు అటు వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గడం తోపాటు డిస్కమ్‌లపై ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశముంది. -
కరెంట్.. కొత్త రికార్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ శుక్రవారం ఉదయం 7.52 గంటల ప్రాంతంలో 13,168 మెగావాట్లుగా నమోదైంది. 13 వేల మెగావాట్ల డిమాండ్‌ను రాష్ట్రం అధిగమించడం ఇది రెండోసారి. ఈ నెల 25న నమోదైన 13,040 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను శుక్రవారం రాష్ట్రం దాటేసింది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఏమాత్రం కోత, లోటు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగామని ట్రాన్స్‌కో ఓ ప్రకటనలో తెలిపింది. 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఏపీలోనే 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనే అంతకు మించి డిమాండ్ ఏర్పడింది. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్ర గరిష్ట డిమాండ్ 9,770 మెగావాట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. ప్రస్తుత వేసవి తీవ్రత పెరిగినా కొద్దీ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకో కొత్త రికార్డు సృష్టించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటికి తెలంగాణ ప్రాంతంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు కాగా, ఇప్పుడు 132.6 శాతం వృద్ధిని సాధించింది. పెరిగిన వార్షిక వినియోగం రాష్ట్రంలో గరిష్ట డిమాండ్‌తో పాటు వార్షిక విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. 2014లో రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018–19లో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఆరేళ్లలో 44 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 23 శాతమే. పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం సుస్థిర అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ విషయంలో తెలంగాణ దేశ సగటును మించింది. ప్రస్తుతం రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లు కాగా, జాతీయ సగటు 1,181 యూనిట్లు మాత్రమే. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుండగా, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకం, అనుక్షణం పర్యవేక్షణ, విద్యుత్ సంస్థల ఉద్యోగుల అవిరళ కృషితోనే రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా సాధ్యమవుతోందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. డిమాండ్ పెరిగింది ఇలా.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, భారీ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా జరుపుతుండటంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 6 వేల మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 24,31,056కు పెరిగాయి. ఎత్తిపోతలకూ అంతే.. 2014లో ఎత్తిపోతల పథకాలకు 680 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా పంపుహౌస్‌ల నిర్వహణకు ప్రస్తుతం 2,200 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం అవుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో తెలంగాణవ్యాప్తంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల వృద్ధి రేటు అధికంగా ఉంది. -
ప్రైవేటు ‘పవర్’
సాక్షి, అమరావతి: ప్రజలకు చౌకగా విద్యుత్తు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సరఫరా రంగంలోకి ప్రైవేటు పంపిణీదారులను తీసుకురానుంది. ఇందుకోసం విద్యుత్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. పోటీ ప్రపంచంలో విద్యుత్ సంస్థలనూ పరుగులు పెట్టించేందుకే ఈ మార్పులని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలో ఇంధన మంత్రిత్వశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి రాష్ట్రం తరపున ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి హాజరవుతున్నారు. ప్రతిపాదిత డ్రాఫ్ట్లోని సవరణలు ఈ విధంగా ఉన్నాయి. పోటీతత్వమే శరణ్యం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పంపిణీ సంస్థలే విద్యుత్ సరఫరా చేసేవి. వీటి స్థానంలో ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రోత్సహించాలి. ఏ సంస్థ తక్కువకు విద్యుత్ ఇస్తే దాన్నే వినియోగదారుడు తీసుకోవచ్చు. అంతే ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌ల తరహాలోనే విద్యుత్ పంపిణీలోనూ ప్రైవేటు సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉండాలి. ఈ పోటీ వాతావరణాన్ని ఎలా ప్రోత్సహించాలి? ప్రభుత్వ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలోనా? పంపిణీని ఫ్రాంచైజ్ ఇవ్వడమా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. తక్కువ ధరకే విద్యుత్ వినియోగదారుడికి అతి తక్కువ ధరకే విద్యుత్ చేరాలి. దీనికోసం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేలా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాలి. సరఫరా పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించాలి. ఏ రకమైన విద్యుత్ సబ్సిడీ అయినా నేరుగా ప్రజలకే చేరేలా డిస్కమ్లుండాలి. నేరుగా ప్రయోజనం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డిబిటీ) విధానాన్ని వచ్చే రెండేళ్లలో అమలులోకి తేవాలి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తేవాలి. ఈ విధానాన్ని రెండేళ్లలో అమలులోకి తెచ్చే ఏర్పాటు చేయాలి. డిస్కమ్‌లకు జరిమానా 2003 విద్యుత్తు యాక్ట్‌కు 2016లో చట్ట సవరణ ద్వారా తొలిసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరోసారి ఇదే దారిలో కొన్ని ప్రతిపాదనలు రాష్ట్రాల ముందుకు తెచ్చింది. నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు పంపిణీ, ఉత్పత్తిదారుల పనివిధానాన్ని విద్యుత్ నియంత్రణ మండళ్లు బేరీజు వేయాలి. సరైన విద్యుత్ సేవలు అందించడంలో డిస్కమ్‌లు విఫలమైతే వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. నిర్థారిత సమయంలో విద్యుత్ అంతరాయాల పరిష్కరించకపోయినా, వినియోగదారులకు ముందుగా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ కోతలు విధించినా డిస్కమ్‌లకు జరిమానా విధించాలి. నష్టాలులేని వ్యాపారం విద్యుత్ సంస్థలు నష్టాలు లేకుండా ఉండాలంటే వాణిజ్య విధానాన్ని మార్చుకోవాలని, వ్యాపారణ ధోరణిలోనే వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిదారులకు జెన్కో వంటి సంస్థలు బకాయిలు పడే వీలుండదని పేర్కొంది. ఈ తరహా విధానాలను కొత్త డ్రాఫ్ట్ పాలసీలో పేర్కొంది. విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రస్తావిస్తోంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేలా చర్యలకు కేంద్ర సవరణ చట్టం వీలుకల్పిస్తోంది. -
విద్యుత్ అంతరాయాలకిక చెక్
సాక్షి, అమరావతి: విద్యుత్ సరఫరాలో ఇక మీదట ఎలాంటి అంతరాయాలు లేకుండా చేస్తామని ఇంధన శాఖ ప్రకటించింది. ఇందుకోసం రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఓవర్‌లోడ్‌ను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపింది. అన్ని వర్గాలకు విద్యుత్ సరఫరాతో పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు కూడా ఈ విధానం బలం చేకూరుస్తుందని వివరించింది. రియల్ టైం పర్యవేక్షణపై ఉన్నతాధికారులు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. రియల్ టైం పర్యవేక్షణలో ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ల వద్దే మీటర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి, ఆన్లైన్ ద్వారా విద్యుత్ కార్యాలయాలకే విద్యుత్ సరఫరా వివరాలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తెలిసేలా చేస్తారు. దీంతో పంపిణీ సంస్థలు ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నాయనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే డిస్కమ్‌లను ఆదేశించింది. సరఫరా చేసే విద్యుత్ వివరాలను ప్రతీనెతి 5న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీకి పంపాల్సి ఉంటుంది. మీటర్లు లేకపోవడంవల్ల ఉచిత విద్యుత్ సరఫరా వివరాలు కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు. పైగా విద్యుత్ సరఫరాలో జరిగే నష్టాలన్నీ ఉచిత విద్యుత్ ఖాతాలోనే వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని రైతు సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. రియల్ టైం వ్యవస్థ ద్వారా ట్రాన్స్ఫార్మర్ వద్దే సరఫరాను లెక్కించడంవల్ల ఇక మీదట ఇలాంటి అశాస్త్రీయ విధానాన్ని తొలగించవచ్చని విద్యుత్ శాఖ తెలిపింది. అలాగే, ఎనర్జీ ఆడిట్‌ను కూడా నిక్కచ్చిగా అమలుచేయడం ఇక మీదట సులువని తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తిరగక్కర్లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, మరమ్మతు అవసరమైనా వినియోగదారులు సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ, రియల్ టైం వ్యవస్థలో ఈ తరహా సమస్యలను గుర్తించొచ్చు. తద్వారా ట్రాన్స్ఫార్మర్ బిగించడమో, మరమ్మతు చేయడమో వెంటనే జరగాలి. పరిష్కారం జరిగిన సమయం సైతం రికార్డు అవుతుంది కాబట్టి మరింత జవాబుదారీతనానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాలో రైతులు నెలల తరబడి అసౌకర్యానికి గురవ్వకుండా చూడొచ్చు. రియల్ టైమ్ పర్యవేక్షణ శుభ పరిణామం : బాలినేని కాగా, రియల్ టైం పర్యవేక్షణను విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే పగటిపూట 9 గంటల విద్యుత్‌ను శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆర్థికంగా దివాలా తీయించినా ప్రజలపై భారం వేయకుండా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది తమ ధ్యేయమన్నారు. ఇందులో భాగంగానే వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ టారిఫ్ ఇచ్చిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిని మంత్రి అభినందించారు. కేవలం గృహ విద్యుత్ వినియోగదారులకే ప్రభుత్వం రూ. 1,707.07 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని గుర్తుచేశారు. మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ సంస్థలకు రూ.10,060.65 కోట్లు సబ్సిడీ ఇవ్వడాన్ని బట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే, ఐదేళ్ల కాలంలో విద్యుత్ సంస్థలను ఏ స్థాయిలో గత ప్రభుత్వం అప్పులపాల్జేసిందో మంత్రి గణాంకాలతో సహా వివరించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబుతో పాటు డిస్కమ్‌ల సీఎండీలు పాల్గొన్నారు. -
కరెంట్ చౌర్యం ఖరీదు రూ.3,158 కోట్లు
సాక్షి, అమరావతి: మీ పక్కనే కరెంట్ చౌర్యం జరుగుతున్నా నాకెందుకులే అనుకుంటున్నారా? అయితే ఆ దోపిడీకి మీరు కూడా మూల్యం చెల్లిస్తున్నారని మరిచిపోకండి! రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు ఏటా సగటున 9.5 % వరకు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం 6,526 మిలియన్ యూనిట్ల విద్యుత్ లెక్కకు చిక్కడం లేదు. దీని ఖరీదు అక్షరాలా రూ.3,158 కోట్లు అని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజిలెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. టారిఫ్ పెంచడం, లోడ్ చార్జీల భారం మోపడం ద్వారా ఈ మొత్తాన్ని డిస్కమ్‌లు వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. ప్రత్యేక డ్రైవ్ పంపిణీ, సరఫరా నష్టాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిస్కమ్‌లకు సూచించినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ చౌర్యంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్‌కో సీనియర్ ఇంజనీర్ రాజబాబు అభిప్రాయపడ్డారు. ఎవరో చేసిన చౌర్యం వల్ల నిజాయితీ కలిగిన వినియోగదారుడిపై భారం పడుతున్నట్లు తెలియచేయాలన్నారు. ఎందుకంటే... ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ఏటా 62 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారుల వద్దకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై యూనిట్‌కు రూ.4.84 చొప్పున రెవెన్యూ రావాలి. కానీ 6,526 మిలియన్ యూనిట్లు లెక్కకు రావడం లేదు. దీనికి పలు కారణాలున్నాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కొందరు మీటర్లు సరిగా తిరగకుండా చేస్తున్నారు. మరికొందరు లైన్లపై నేరుగా వైర్లు వేసి మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటివి వ్యవసాయ విద్యుత్ విషయంలో ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని రకాల పరిశ్రమల్లోనూ మీటర్‌ను టాంపర్ చేసి చౌర్యానికి పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అడ్డదారిలో విద్యుత్ వాడుకుంటున్నారు. పబ్లిక్ మీటింగ్‌లు, ఫంక్షన్ల కోసం తాత్కాలిక మీటర్లు లేకుండా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇలా ఏటా నష్టపోయే రూ.3,158 కోట్ల విలువైన విద్యుత్ భారాన్ని అధికారులు టారిఫ్ రూపంలో ప్రజలపైనే వేస్తున్నారు. చౌర్యంపై ఇక నిఘా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ఫీడర్ల వారీగా వివరాలు సేకరించనున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తున్నామని ఈపీడీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఓ ఫీడర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతుంది? ఎంత రీడింగ్ జరుగుతుంది? అనే వివరాలను సాఫ్ట్వేర్ జిల్లా కార్యాలయానికి అందిస్తుంది. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో చౌర్యాన్ని గుర్తించే వీలుంది. విద్యుత్తు సిబ్బంది సహకారంతో కొన్ని పరిశ్రమలు చౌర్యానికి పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. ఇక నుంచి పంపిణీ, సరఫరా నష్టాలకు స్థానిక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే బాధ్యులని కొద్ది నెలల క్రితం ఇంధనశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌ల పరిధిలోని విజిలెన్స్ విభాగం కూడా ప్రతి మూడు నెలలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సిబ్బంది పాత్ర ఉంటే కఠిన చర్యలు విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలని సిబ్బందికి సూచించాం. విద్యుత్ చౌర్యం వెనుక వారి పాత్ర ఉందని తెలిస్తే కఠిన చర్యలుంటాయి. చౌర్యాన్ని గుర్తించడానికి వినియోగదారుల సాయం కూడా తీసుకుంటాం. – శ్రీకాంత్ నాగులపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
‘కరెంట్ షాక్’లకు స్వస్తి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 98 శాతం మంది విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం పడకుండా అప్పుల నుంచి బయటపడే ప్రతిపాదనలను డిస్కమ్‌లు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. ఈమేరకు 2020–21 వార్షిక ఆదాయ అవసర నివేదికలను (ఏఆర్ఆర్) ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) అందచేశాయి. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి నేతృత్వంలో తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హరినాథ్‌రావు ఏఆర్ఆర్ ప్రతులను బుధవారం హైదరాబాద్‌లో విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి అందజేశారు. ఏఆర్‌ఆర్‌లపై ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మార్చి 31వ తేదీన కొత్త టారిఫ్ ప్రకటిస్తుంది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. నెలకు 500 యూనిట్లు దాటినవారిపై మాత్రమే... వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.44,840.96 కోట్ల మేర ఆర్థిక వనరులు కావాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ప్రస్తుతం టారిఫ్ రూపంలో రూ.30,399.72 కోట్ల ఆదాయం లభిస్తుండగా మరో రూ.14,441.24 కోట్లు అవసరమని తెలిపాయి. ఈ లోటు పూడ్చుకునేందుకు కొన్ని వర్గాలపై చార్జీల పెంపు ద్వారా రూ.1,373.27 కోట్లు రాబట్టకునేందుకు కమిషన్ అనుమతి కోరాయి. అయితే దాదాపు 98 శాతం మంది విద్యుత్ వినియోగదారులపై ఈ పెంపు ప్రభావం ఉండదు. నెలకు 500 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటిన వారిపై మాత్రమే యూనిట్‌కు 90 పైసలు చొప్పున పెంపు ఉండేలా డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలపై స్వల్పంగా విద్యుత్ భారం పడనుంది. మిగిలిన రూ.13,067.97 కోట్ల లోటుకు సంబంధించి ఉచిత విద్యుత్, ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి. పెంపులేని ప్రతిపాదనలు.. ‘పేదలు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిపై ఒక్కపైసా కూడా విద్యుత్ భారం మోపలేదు. శ్లాబుల వర్గీకరణ పేరుతో కానరాని భారాన్ని వేయలేదు. అప్పుల భారం వెంటాడుతున్నా ప్రజలకు ఇబ్బంది కలగించకూడదన్న ప్రభుత్వ లక్ష్యాన్నే అనుసరించాం. దాదాపు 98 శాతం వినియోగదారులకు ప్రయోజనం కలిగించాం’ – శ్రీకాంత్ నాగులపల్లి డిస్కమ్‌ల ప్రతిపాదనలు ఇవీ - గతంలో శ్లాబుల వర్గీకరణ పేరుతో పరోక్షంగా ప్రజలపై భారం పడింది. విద్యుత్తు వాడకందారులను 900 (ఏ), 900–2700 (బి), 2700 ఆపై యూనిట్లు వినియోగించే వారిని ‘సి’ కేటగిరీలుగా విభజించారు. పొరపాటున ఒక్క యూనిట్ ఎక్కువైనా ఏడాది పొడవునా అధిక విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. ఈ విధానాన్ని ఇప్పుడు ఎత్తివేశారు. నెలకు 75 యూనిట్ల వరకు (ఏ), 75–225 (బి), 225 ఆపైన (సి) కేటగిరీలుగా పరిగణిస్తారు. పెరిగిన నెలకు మాత్రమే బిల్లు చెల్లించేలా మార్పు చేశారు. - టౌన్‌షిప్‌లు, కాలనీలు (హెచ్‌టీ–1) కేటగిరీలకు రూ. 6.30 నుంచి రూ. 7కి పెంచాలని ప్రతిపాదించారు. - అడ్వర్టైజింగ్, హోర్డింగ్, ఫంక్షన్ హాల్స్‌కి రూ. 11.75 నుంచి రూ. 12.25కి పెంచాలని ప్రతిపాదన. - పర్యాటకం, ఇతర వాణిజ్య అవసరాలకు రూ. 6.95 నుంచి రూ. 7.35కి పెంపు ప్రతిపాదన. - స్థానిక సంస్థలు ఇక నుంచి యూనిట్‌కు రూ.7 చొప్పున చెల్లించాలని ప్రతిపాదించారు. - ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాలయాల నుంచి ఫిక్స్డ్ చార్జీల కింద నెలకు రూ. 475 చొప్పున వసూలు ప్రతిపాదన. - రైల్వే శాఖకు విద్యుత్ టారిఫ్ యూనిట్ రూ. 3.75 నుంచి రూ.6.70కి పెంచాలి. - హార్టీకల్చర్, ఫ్లోరీ కల్చర్‌కు యూనిట్ రూ. 3.85 నుంచి రూ. 4.50కి పెంచాలి. - ఎత్తిపోతల పథకాలకు యూనిట్ రూ. 5.80 నుంచి రూ.7.15కి పెంచి వసూలు చేయాలి. -
రూఫ్‌టాప్ అదరాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో 2020 నాటికి 40 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 9.4 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధిపరుచుకోవాలని నీతి ఆయోగ్ స్ప ష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం 2 వేల మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కోసం 370 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను 2020లోగా అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. దేశంలో విద్యుత్ నిల్వ వ్యవస్థ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేందుకు ‘ఎనర్జీ స్టోరేజీ సిస్టం–రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా 2019–32’ పేరుతో నీతి ఆయోగ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. పర్యావరణ మార్పుల సవాళ్లను అధిగమించడంలో భాగంగా కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పునరు త్పాదక విద్యుదుత్పత్తిని కేంద్రం ప్రోత్సహిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ను నిల్వ చేసుకొని అవసరమైనట్లుగా వినియోగించుకునే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే బొగ్గు, గ్యాస్, పెట్రోలియం వంటి కాలుష్యకారక శిలాజ ఇంధనాలను మండించి విద్యుదుత్పత్తి చేసే అవసరం తగ్గనుంది. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్ నిల్వ సదుపాయాన్ని దేశం అందుకోవాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సాధించాల్సిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాలు ఇలా.. ►2020: దేశం 40 గిగావాట్లు, రాష్ట్రం 2,000 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యు త్ ఉత్పత్తిని సాధించాలి. ప్రస్తుతం తెలంగాణ 68 మెగావాట్లు, దేశం 1,350 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ►2022: దేశం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోగా తెలంగాణ 5,490 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి, 2,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి. తెలంగాణ ఇప్పటికే 3979.18 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంది. ►2027: దేశం 100 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 23.01 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధిపరుచుకోవాలి. అందులో తెలంగాణ లక్ష్యాలు 6,800 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుతుత్పత్తితోపాటు 1,258 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం ఉండాలి. ►2032: దేశం 150 గిగావాట్ల రూఫ్టా ప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడానికి 32.675 గిగావాట్ గంటల విద్యు త్ నిల్వ వ్యవస్థను కలిగి ఉండాలి. తెలంగాణ 8,000 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్, 1,480 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. గృహాలకు 100 శాతం రూఫ్‌టాప్.. రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి అనుమతుల జారీకి సంబంధించి అనుసరించా ల్సిన పరిమితులను నీతి ఆయోగ్ రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్దేశించింది. తెలంగాణ లో గృహాలు, ప్రభుత్వ వినియోగదారుల కు అనుమతించిన లోడ్ (కాంట్రాక్టు లో డ్)లో 100 శాతం వరకు, పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు వారి కాం ట్రాక్టు లోడ్‌లో 80 శాతం వరకు, లోటెన్ష న్ (ఎల్టీ) వినియోగదారులకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం లో 50 శాతం, హైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులకు సంబంధిత ఫీడర్ లోడ్ సామర్థ్యంలో 50 వరకు వ్యక్తిగత రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట్రాన్ని కోరింది. -
పవర్ కెనాల్‌కు గండి:విద్యుత్‌కు అంతరాయం
సాక్షి, అమరావతి: సీలేరు ఏజెన్సీలో భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డొంకరాయి, దిగువ సీలేరు మధ్య విద్యుత్ కెనాల్‌కు గండి పడటంతో ఇబ్బందులు తలెత్తినట్లు విద్యుత్ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు కారణంగా జెన్కో నిర్వహిస్తున్న మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పతికి అంతరాయం కలిగింది. వీలైనంత త్వరగా విద్యుత్ కెనాల్ మరమ్మతులు పూర్తి చేస్తామని జెన్ కో తెలిపింది. -
విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, ఒంగోలు మెట్రో: విద్యుత్ సమస్యలకు సత్వరమే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల్లో మరింత బాధ్యతని, వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారాలను సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా చర్యలు చేపట్టనున్నది. విద్యుత్ నియంత్రణ మండలి కార్యకలాపాలు ప్రారంభం అయ్యే క్రమంలో ఏర్పడే ప్రత్యేక విద్యుత్ అంబుడ్స్మన్లు మరింతగా ప్రజలకు సేవలు అందిస్తాయి. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేసి వినియోగదారులు, అధికారుల సమన్వయంతో పనిచేయనున్నారు. తద్వారా మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇంకోవైపు నియంత్రణ మండలి ద్వారా వినియోగదారుల బాధ్యతలను కూడా గుర్తు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూలనడిన విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పుడు కదలిక వచ్చి కార్యాచరణలోకి వస్తున్నది. నిజానికి విద్యుత్ వినియోగదారులకు హక్కులే కాదు, బాధ్యతలూ ఉంటాయి. అలాగే విద్యుత్ రంగంలోని అధికారుల్లో కూడా అంకితభావం, బాధ్యత మరింతగా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రయత్నాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రారంభిస్తున్నది. క్షేత్రస్ధాయిలో ఆచరణ కోసం సంబంధిత అధికారులకు కూడా శిక్షణ ఇస్తున్నది. ప్రస్తుతం ఒక్కో ఇంటికి ఏడాదికి 1000 యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు విద్యుత్ సేవల సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ వినియోగదారుల రక్షణ చట్టం వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం.. విద్యుత్ సరఫరాలో ఏవైనా లోపాలు ఏర్పడితే తక్షణం తీసుకునే చర్యల గురించి చర్చించాలి. ఈ చట్టాన్ని అనుసరించే విద్యుత్ సరఫరాను ‘సేవ అనే నిర్వచనంలోకి తెచ్చారు. ఈ క్రమంలో న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987 కూడా ప్రజలకు చేసే విద్యుత్ సరఫరాను ప్రజా వినియోగ సేవల నిర్వచనంలో చేర్చారు. దీని ప్రకారం విద్యుత్‌కు సంబంధిచిన ఏదైనా వివాద పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్‌ను కూడా వినియోగదారుడు ఆశ్రయించే అవకాశం కల్పించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం–1981 అత్యవసర సేవల నిర్వహణ చట్టం 1981లో కూడా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా లేదా పంపిణీకి సంబంధించిన అంశాల గురించి పేర్కొన్నారు. చట్టంలోని పరిచ్చేధమం 2(ఏ) కింద అత్యవసర సేవల పరిధిలోకి విద్యుత్‌ను కూడా చేర్చారు. విద్యుత్ రంగంలోని ఇతర విషయాలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం, విద్యుత్ సరఫరాని అన్ని ప్రాంతాల్లో విస్తరించటం కోసం ‘విద్యుత్ చట్టం–2003’లో ప్రధానంగా చర్చించారు. ► చాలామంది విద్యుత్ వినియోగదారులకు కానీ, లబ్ధిదారులకు కానీ, శాసనపరమైన, పాలనా పరమైన హక్కుల గురించి బాధ్యతల గురించి పెద్దగా తెలియడం లేదు. కనీసం వినియోగదారుల హక్కులు, ప్రయోజనాల కోసం ప్రత్యక్షంగా ప్రభావం చూపగల అనేక కేంద్ర రాష్ట్ర చట్టాలు, శాసనపరమైన నిబంధనలు, ఆచరణకు లోబడే ఆదేశాలు, ఉత్తర్వులు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ► ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణ మండలి చర్యలు చేపడుతున్నది. అయితే, ఇంకా విద్యుత్ సమస్యల కోసం పనిచేసే ప్రత్యేక అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉండాలని విద్యుత్ నియంత్రణ మండలి కోరుతున్నది. అదే విధంగా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రత్యేక ఫోరం కూడా ఏర్పాటు కావాలని నియంత్రణ మండలి సూచిస్తున్నది. ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ అధికారులను, వినియోగదారులను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నది. సమస్య తలెత్తితే.. విద్యుత్ సంబంధ సమస్యలు, వాటి పరిష్కారాల కోసం వినియోగదారులకు ఉండే హక్కులు, శాఖాపరమైన నిబంధనల గురించి వినియోగదారులు తెలుసుకోవాలి. ► విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరాకు సంబందించి విద్యుత్ నియంత్రణ మండలి కొన్ని షరతులు, నిబంధనలు విధించింది. మండలి చట్టం సెక్షన్–14లో వినియోగదారుల సమస్యల గురించి వివరించారు. ► విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు, లేదా, అంతరాయం కలిగినప్పుడు, నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరాని నిలిపివేసినప్పుడు, లో–వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పడు, కొత్త కనెక్షన్ కోరినప్పుడు, పరికరాలు మార్చడం కానీ, వేరే స్థలంలో అమర్చడం అవసరమైనప్పుడు, మీటరు లోపాలపై ఫిర్యాదులు, బిల్లింగ్ ఫిర్యాదులు, సరఫరా సర్వీసు కనెక్షన్ తొలగించడం, లేదా తిరిగి ఇవ్వడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం తదితర సమస్యలు పరిష్కారం కాని సమయంలో ఫోరం లేదా విద్యుత్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించి పరిష్కారం పొందవచ్చని నియంత్రణ మండలి చట్టం చెబుతున్నది. ► వినియోగదారుని హక్కుల గురించి, సాధారణ షరతులు, నిబంధనల గురించి, ఇందులోని సెక్షన్ 14.8, 14.9లో పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం వినియోగదారుల ఫోరం, ప్రత్యేక అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉండాలని ఈ సెక్షన్ చెబుతోంది. కాగా ప్రకాశం జిల్లాలో విద్యుత్ వినియోగదారుల ఫోరం కానీ, అంబుడ్స్‌మన్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయలేదు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కానీ జిల్లా స్థాయి ఫోరంలు, అంబుడ్స్మన్లు ఇచ్చిన తీర్పులను పరిశీలించడానికి మాత్రం రాష్ట్ర స్థాయిలో విద్యుత్ అంబుడ్స్‌మన్ పనిచేస్తోంది. ► విద్యుత్‌కు సంబంధించిన సేవాలోపంపై ‘వినియోగదారుల రక్షణ చట్టం–1986’ కింద వినియోగదారుల ఫోరంలో కానీ, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కానీ పరిష్కారం పొందవచ్చు. -
‘ఆ గ్రామాల్లో మల్లన్నసాగర్ పనులు ఆపేయండి’
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని తోగుట, వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్ని వారం రోజుల పాటు నిలిపేయాలని, ఆ గ్రామాల్లో నిలిపేసిన విద్యుత్‌ను తిరిగి సరఫరా చేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచి్చంది. తోగుట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారికి పునరావాస చర్యలపై నివేదిక ఇవ్వాలని గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని రైతుల తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. రైతులు దాఖలు చేసిన రిట్లను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. విచారణను 30కి వాయిదా వేసింది. -
ఇంజన్ నుంచే కరెంట్..!
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో బోగీలకు విద్యుత్ సరఫరా కోసం కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కొన్నేళ్లుగా యత్నిస్తోంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రతి రైలుకు రెండు పవర్‌కార్లను వినియోగిస్తున్నారు. డీజిల్‌తో ఇందులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి బోగీలకు సరఫరా చేస్తుంటారు. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో పాటు శబ్ద, వాయు కాలుష్యాలకు కారణమవుతోంది. దీంతో పవర్కార్లు లేకుండా నేరుగా ఇంజన్ నుంచే విద్యుత్‌ను సరఫరా చేసే ‘హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్ఓజీ)’పేరుతో కొత్త విధానానికి రైల్వే శ్రీకారం చుట్టింది. తొలుత హైదరాబాద్–ఢిల్లీ మధ్య తిరిగే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం నుంచి ప్రారంభించారు. ఏంటా విధానం.. విద్యుత్‌తో నడిచే రైళ్లకు ఈ విధానం అందుబాటులో ఉంటుంది. విద్యుత్ వైర్ల నుంచి రైలుకు 25 కేవీ విద్యుత్ తీసుకుంటారు. వైర్ల నుంచి యాంటీనా వంటి ఉపకరణం విద్యుత్‌ను ఇంజన్‌కు అందిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మరో ఉపకరణాన్ని ఇంజన్ వద్ద అమరుస్తారు. అది 25 కేవీ విద్యుత్‌ను 110 వోల్టులకు మార్చి ఇంజన్‌కు అవసరమైన దాన్ని ఇంజన్‌కు సరఫరా చేసి మిగతా దాన్ని బోగీలకు మళ్లిస్తుంది. ఆ విద్యుత్‌తో బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ పనిచేస్తాయి. -
అంత డబ్బు మా దగ్గర్లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్ఈ హాజరయ్యారు. కేంద్రం ఆదేశాల అమలుకు ఒక్కరోజు మాత్రమే వ్యవధి నేపథ్యంలో ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
‘విద్యుత్’పై ఎల్సీ వద్దు
సాక్షి, హైదరాబాద్: నిరంతర విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగేలా, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేలా ఏకపక్ష నిబంధనలను తమపై రుద్దొద్దని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సమన్వయ కమిటీ (ఎస్సార్పీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేశాకే డిస్కంలు కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు(సీజీఎస్), ఇతర ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆం దోళన వ్యక్తం చేసింది. ఎస్సార్పీసీ చైర్మన్, కర్ణాటక ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.సెల్వ కుమార్ నేతృత్వంలో మంగళవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆరు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొని కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరఫున ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ. గోపాల్‌రావుతోపాటు పలువురు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతూ ఎస్.సెల్వ కుమార్ కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. లోడ్ సమతౌల్యతపై తీవ్ర ప్రభావం... దక్షిణాది రీజియన్‌లో చాలా వరకు డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు బ్యాలెన్స్ నిర్వహించ డం సాధ్యం కాదని సెల్వ కుమార్ లేఖలో స్పస్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఎల్సీ జారీ చేయలేదని కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు, ప్రైవేటు ప్లాంట్ల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే విద్యుత్ సరఫరా లోడ్ సమతౌల్యతను పర్యవేక్షించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలతో పవర్ ఎక్సే్చంజీలు, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నుంచి అత్యవసర విద్యుత్ కొనుగోళ్లకు మార్గాలు సైతం మూసుకుపోతాయన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ప్రధానంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదన్నారు. బొగ్గు రవాణా జరిపినందుకు రైల్వేలు, బొగ్గు కంపెనీలకు సకాలంలో బిల్లులు అందేలా తీసుకొచ్చిన ఈ నిబంధనలు మంచివేనని, కానీ వాటికి ముందే డిస్కంలకు బిల్లులు అందేలా నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. డిస్కంలకు బిల్లులు అందితేనే అవి విద్యుత్ కంపెనీలకు బిల్లులు చెల్లించగలుగుతాయని గుర్తుచేశారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు... దక్షిణాదిన తీవ్ర వర్షాభావం నెలకొందని, గతేడాది ఇదే సమయానికి దక్షిణాది ప్రాంత రిజర్వాయర్లలో 6,629 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తికి సరిపడా నీటి నిల్వలుండగా ప్రస్తుతం 3,137 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్రం దృష్టికి సెల్వ కుమార్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భారీగా థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేయక తప్పదని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కొనుగోళ్లు సాధ్యం కావన్నారు. కేంద్రం ఇలాంటి నిబంధనలను తీసుకురావడానికి ముందే భాగస్వాములైన రాష్ట్రాల డిస్కంలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల అభిమతమని పేర్కొన్నారు. ఎల్సీ అంటే? డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రాల డిస్కంలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లు చేసిన 60 రోజుల్లోగా వాటికి సంబంధించిన బిల్లులను విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లిస్తున్నాయి. అయితే ఆర్థిక సమస్యల వల్ల డిస్కంలు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడంతో అన్ని రాష్ట్రాల్లో బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోతున్నాయి. దీంతో బొగ్గు గనుల కంపెనీలు, రైల్వేకు విద్యుదుత్పత్తి కంపెనీలు సైతం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్నాయి. డిస్కంల నుంచి ఎప్పటికప్పుడు విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లులు అందేలా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్లను జారీ చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. విద్యుత్ కొనుగోళ్లకు ముందుగానే ఆ మేర డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఎల్సీని విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిస్కంలకు విద్యుత్ సరఫరా కానుంది. అయితే కొనుగోలు చేసిన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసి, నెలా రెండు నెలల తర్వాత వాటికి సంబంధవించిన బిల్లులను వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటేనే డిస్కంలకు ఆదాయం వస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
విద్యుత్ పీపీఏలపై కమిటీ
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పరిశీలించే ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది మందితో కూడిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళ వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఆర్థిక ఊబిలో కూరుకుపోయాయి. దాదాపు రూ.20 వేల కోట్ల మేర విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు బాకీ పడ్డాయి. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు సౌర, పవన విద్యుత్‌ను అవసరానికి మించి, అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడమే. బిడ్డింగ్‌కు వెళ్లి ఉంటే, సంప్రదాయేతర ఇంధన వనరుల రేట్లు గణనీయంగా తగ్గేవి. కానీ గత ప్రభుత్వం ఈ పనిచేయలేదు. ఎక్కడా లేనివిధంగా యూనిట్ పవన విద్యుత్‌కు యూనిట్ రూ.4.84 వరకూ, సౌర విద్యుత్‌కు గరిష్టంగా రూ.6.14 వరకూ చెల్లించాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల తప్పనిసరి (రెన్యూవబుల్ ఆబ్లిగేషన్) 5 శాతం ఉంటే, ఏకంగా 22 శాతం మేర కొనుగోలు చేశారు. ఈ కారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా థర్మల్ ఉత్పత్తిదారులకు విద్యుత్ తీసుకోకపోయినా యూనిట్‌కు రూ.1.10 మేర స్థిర వ్యయం (ఫిక్స్డ్) ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఏపీ డిస్కమ్‌ల మీద రూ.2636 కోట్ల భారం పడింది. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలు ఇంకా కొనసాగితే డిస్కమ్‌లు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం విండ్, సోలార్ విద్యుత్ ధరలను తగ్గించి, ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాలనే ప్రయత్నం చేస్తోంది. పీపీఏల్లో మార్పులు చేయాల్సిందే.. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ విద్యుత్ ధరలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు యూనిట్ ధరలను తగ్గించుకోవాలంటూ సోలార్, విండ్ పవర్ కంపెనీలకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు త్వరలో నోటీసులు జారీ చేయనున్నాయి. యూనిట్ విద్యుత్ ధరను రూ.2.50 చొప్పున ఇచ్చేందుకు ముందుకు రావాలని ఈ నోటీసుల్లో కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా నోటీసులు జారీ చేయనున్న కంపెనీల జాబితాలో ప్రైవేట్ కంపెనీలతో పాటు నెడ్‌క్యాప్ సంస్థ కూడా ఉండటం గమనార్హం. ఇన్ని రోజులుగా అధిక ధరకు విద్యుత్‌ను విక్రయించినందుకుగాను కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా ఈ నోటీసుల్లో కోరనున్నట్టు సమాచారం. గత చంద్రబాబు ప్రభుత్వం ఆయా విద్యుత్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు విధించిన ‘కచ్చితంగా నిర్వహించాలి, ఆ విద్యుత్‌ను ప్రభుత్వం కొనాలి’ (మస్ట్ రన్) అనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లో డిస్కంలు పిటీషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా 82 కంపెనీలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు చేయాలని కూడా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరుతున్నాయి. పై నిబంధనతో ఏకంగా రూ.2,636 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు తేల్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి విద్యుత్‌ను కొనుగోలు చేయడంలో డిస్కంలు అవేలబులిటీ బేస్డ్ టారీఫ్ (ఏబీటీ) పాటిస్తుంటాయి. అంటే తమకు అందుబాటులో ఏ విద్యుత్ తక్కువ ధరకు దొరుకుతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వడం. కానీ ‘మస్ట్ రన్’ నిబంధన వల్ల డిస్కంలు ధరతో సంబంధం లేకుండా విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. తద్వారా మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ సోలార్, విండ్ కంపెనీలకు అధిక ధరను చెల్లించాయి. ఆస్తులు, అప్పుల పంపకానికి ప్రత్యేక కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పలు అంశాలపై చర్చలు జరిపిన ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. విద్యుత్ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన, బకాయిల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సానుకూలంగా సంప్రదింపులు జరిపారు. అంతిమంగా ఆస్తులు, అప్పుల లెక్క తేల్చేందుకు రెండు రాష్ట్రాలకు కలిపి ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను నియమించాలని నిర్ణయించారు. ఆయన అందించే నివేదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకం ఉంటుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఉద్యోగుల విభజన విషయమై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ధర్మాధికారి కమిటీ నివేదికతో పాటు రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఏపీ స్థానికత ఆధారంగా 1,152 మందిని తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015లోనే రిలీవ్ చేశాయి. ఈ వివాదం అప్పటి నుంచి న్యాయస్థానాల పరిధిలో నలుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి, సామరస్య ధోరణితో పరిష్కారం చూపాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలోనూ ఏకాభిప్రాయం దిశగా చర్చలుంటాయని, కన్సల్టెన్సీ సంస్థ నివేదిక తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులు వీరే.. కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖ మంత్రి బి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీఎం స్పెషల్ సెక్రటరీ డి.కృష్ణ, ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం పలు కీలక అంశాలను ఈ సంప్రదింపుల కమిటీ ముందు ఉంచింది. కమిటీ ఏం చేస్తుందంటే.. - గత ప్రభుత్వం పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులతో అత్యధిక రేట్లకు చేసుకున్న ఒప్పందాలను పరిశీలిస్తుంది. - విండ్, సోలార్ ఉత్పత్తిదారులతో కమిటీ నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. డిస్కమ్‌లకు అందించే విద్యుత్ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. - చర్చల నేపథ్యంలో ప్రభుత్వానికి కీలకమైన, అవసరమైన సిఫార్సులు చేస్తుంది. - గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకునే సమయంలో పవన, సోలార్ విద్యుత్ రేట్లు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తుంది. ఇప్పుడెలా ఉన్నాయో అధ్యయనం చేస్తుంది. - ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ల నుంచి, కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అవకాశాలను పరిశీలిస్తుంది. - 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. -
ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ‘ప్రత్యేక కేటగిరీ’కింద విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 కేవీల భారీ లోడ్‌తో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండటంతో ఇందు కోసం కొత్త కేటగిరీని సృష్టించనుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టులకు హెచ్‌టీ–4 (ఏ) కేటగిరీ కింద యూనిట్‌కు రూ.5.8 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 11కేవీ, 33 కేవీ, 132 కేవీ లోడ్ లోపు విద్యుత్ సరఫరాకు ఈ కేటగిరీ వర్తిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే రోజుకు 3 టీఎంసీ ల నీటిని తరలించేందుకు గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. ఇంత భారీ మొత్తంలో విద్యుత్‌ను 400 కేవీ లోడ్‌తో సరఫరా చేస్తారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాల కోసం విద్యుత్ సరఫరా కోసం కొత్త కేటగిరీ సృష్టించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కొత్త కేటగిరీ కింద విద్యుత్ టారీఫ్ ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించనున్నాయి. 2019–20కు సంబంధించి త్వరలో ఈఆర్సీకి సమర్పించనున్న వార్షిక టారీఫ్ ప్రతిపాదనల్లో కొత్త కేటగిరీని చేర్చే అవకాశముంది. కొత్త కేటగిరీ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంది. ఒకట్రెండేళ్ల తర్వాతే స్పష్టత కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ వ్యయభారంపై ఒకట్రెండేళ్లు గడిచిన తర్వాతే స్పష్టత రానుందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు చెబుతున్నాయి. నీటిపారుదల శాఖ కోరిన మేరకు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్‌ను సమీకరించి పెట్టుకున్నా, వాస్తవానికి వినియోగం ఎంతో ఇప్పుడే చెప్పలేమంటున్నాయి. ఇంకా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల నీటినే తరలిస్తారు. దీంతో ఈ ఏడాది 3,800 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించాలని నిర్ణయించడంతో 4,992 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు అవసరాల కోసం ఏటా 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని ప్రాజెక్టు డీపీఆర్‌లో అంచనా వేశారు. ఒకటి రెండేళ్లు గడిస్తే ప్రాజెక్టు విద్యుత్ వినియోగంపై స్పష్టత వస్తుందని, అప్పుడు విద్యుత్ వ్యయ భారంపై స్పష్టత వస్తుందని అధికారవరాలు చెబుతు న్నాయి. కొత్త కేటగిరీ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా చేసే విద్యుత్ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించాల్సి ఉంది. యూనిట్‌కు రూ.3 చొç ³్పున తక్కువ ధరతో విద్యుత్ సరఫరా చే యాలని నిర్ణయించినా, డీపీఆర్ అంచనాల ప్ర కారం ఈ ప్రాజెక్టు విద్యుత్ చార్జీల వ్యయం ఏటా రూ.4,067 కోట్లు కానున్నాయి. యూనిట్‌కు రూ.4 చొప్పున విద్యుత్ సరఫరా చేయా లని నిర్ణయిస్తే, ఏటా రూ.5,423 కోట్ల విద్యుత్ వ్యయం కానుంది. యూనిట్‌కు రూ.5 చొప్పున విద్యుత్ సరఫరా చేయాలని కోరితే ఏటా రూ. 6,779 కోట్ల విద్యుత్ చార్జీలు కానున్నాయి. -
'మేఘా' రికార్డు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనతి కాలంలో పూర్తి చేయడంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్ణీత గడువుకు ముందే పంప్‌హౌజ్‌లు, విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి ఈ నెల 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో గోదావరి నీటి ఎత్తిపోతలకు మార్గం సుగమం చేసింది. ముఖ్యంగా లింక్–1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్– 2లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ–8లను రెండేళ్లలోనే సిద్ధం చేసి మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు నీటి తరలింపు ప్రక్రియకు రాచమార్గం పరిచింది. ప్రపంచంలోనే తొలిసారి.. కాళేశ్వరం ద్వారా రోజూ గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో 17 కేంద్రాల నిర్మాణాలను మేఘా చేపట్టింది. ఇందులో మొత్తం 120 మెషీన్లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు ఉంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్లను మేఘానే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లను, ప్యాకేజీ–8 పనులను పూర్తి చేసి పాక్షికంగా నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేసింది. మొదటిదశలో 63 మెషీన్ల ఏర్పాటు లక్ష్యంగా ఎంఈఐఎల్ పనులు ప్రారంభించగా రెండేళ్ల కాలంలో 33 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ–8, ప్యాకేజీ–14లోని పంపుహౌజ్‌లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌లోని గ్రేట్ మేన్‌మేడ్ రివర్‌కు పేరు పొందగా, వీటి పంపు సామర్థ్యం హార్స్‌పవర్‌లోనే ఉంది. వీటి నిర్మాణానికి మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, 40 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. కానీ కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను వినియోగిస్తున్నారు. తొలిదశలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో 3,057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సిద్ధం చేసింది. ప్యాకేజీ–8లో ఆవిష్కృతం.. అద్భుతమైన పంపింగ్ స్టేషన్‌ను భూ ఉపరితలానికి 330 మీటర్ల లోతున మేఘా నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ పంపుల యూనిట్లను ఇక్కడ సిద్ధం చేసింది. ప్రతి పంపు మోటారు బరువు 2,376 మెట్రిక్ టన్నులు ఉందంటే ప్రతి యూనిట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ పంప్ హౌజ్‌లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం చేసింది. ట్రాన్స్ఫార్మర్ బేలు, కంట్రోల్ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్ రూమ్ ఒక్కొక్కటి చొప్పున నిర్మించగా, ఎల్టీ ప్యానెల్స్, పంప్ ఫ్లోర్, కంప్రెషర్లు కలిపి మొత్తం 4 అంతస్తుల్లో నిర్మించారు. ఈ పంపుమోటార్లను భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా అత్యంత శ్రద్ధతో వీటి నిర్మాణాలు చేశారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద బీహెచ్ఈఎల్, మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ–8 వద్దకు తీసుకొచ్చాక వాటిని బిగించే 60 శాతం పనిని ఎంఈఐఎల్ తన ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది. గడువుకు ముందే మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల నిర్మాణం గోదావరి నీటి ఎత్తిపోతలకు పనులు పూర్తి చేసిన మేఘా 3,057 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా పనులు పూర్తి ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ స్టేషన్ ప్యాకేజీ–8లో సిద్ధంగా ఉంచిన మేఘా ఇది మా అదృష్టం ‘ఈ ఎత్తిపోతల పథకంలో భాగస్వాములం కావడం మా అదృష్టం. ఈ ఇంజనీరింగ్ అద్భుతం లో పాలు పంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్‌ను, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 6 మెషీన్లను 10 నెలల సమయంలో పూర్తి చేయడం ప్రపంచ రికార్డు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలుస్తుంది’ - బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ -
రైతన్నకు కొత్త ‘శక్తి’
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలులోకి తెచ్చేందుకు మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని విద్యుత్ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఈ అంశంపై సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా అనుసంధానించి అనుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితిని విద్యుత్ అధికారులు సీఎంకు వివరించారు. వారంపాటు ట్రయల్ రన్ నిర్వహించండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ వినియోగం అవుతోందని, వీటిలో 3,854 ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. మొత్తం ఫీడర్లలో ఇవి 60 శాతంగా ఉన్నాయని, వీటన్నింటినీ వారం రోజులపాటు ట్రయల్ రన్చేసి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధ్యయనం చేసి లోపాలను సవరించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. అనంతరం వారం రోజుల్లోగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా విషయమై ప్రకటన చేస్తామన్నారు. మిగిలిన 40 శాతం.. అంటే 2,809 ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లేవని సీఎం గుర్తించారు. అయితే, వాటి సామర్థ్యాన్ని పెంచి వాటిని కూడా పూర్తిస్థాయిలో వాడుకలోకి తెచ్చేవిధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన రూ.1,700 కోట్లను వెంటనే కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు ఫీడర్ల వారీగా షెడ్యూల్ కాగా, ఏ ప్రాంతానికి ఎప్పుడు విద్యుత్ సరఫరా చేస్తున్నామో రైతులకు స్పష్టంగా తెలియజేయాలని, దీనిలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఫీడర్ల వారీ టైం షెడ్యూల్‌ను తయారుచేసి ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా చేసే సమయాలను ఖచ్చితంగా వెల్లడించడమే కాకుండా సరిగా అమలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి, జెన్కో ఎండీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ పీపీఏలపై చర్చ ఇదిలా ఉంటే.. గత ఐదేళ్లుగా విద్యుత్ పంపిణీ సంస్థలతో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ముఖ్యమంత్రి వద్ద చర్చకు వచ్చినట్టు తెలిసింది. కేవలం ప్రైవేటు విద్యుత్ కొనుగోలు కోసమే అనవసరంగా విద్యుత్ డిమాండ్‌ను చూపించారని, దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దేందుకు ఏపీ జెన్కో ఉత్పత్తికి గండికొట్టారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా వాడకం కింద కేవలం ఏటా 5 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ తీసుకోవాల్సి ఉందని, కానీ.. రాష్ట్రంలో ఏకంగా 25 శాతం వరకూ తీసుకున్నారని, ఈ కారణంగా నిలిపివేసిన థర్మల్ ప్లాంట్లకు వృథాగా యూనిట్‌కు రూ.1.25 చెల్లించారని చెప్పినట్లు సమాచారం. ఈ రకంగా దాదాపు రూ.3 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని సీఎం దృష్టికి తేవడంతో, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైఎస్ జగన్ కోరినట్టు తెలిసింది. విద్యుత్ నాణ్యతలో రాజీపడొద్దు : సీఎం పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా అమలుచేసే బాధ్యత అధికారులపైనే ఉందని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. కొంత సమయం పట్టినా 9 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే దిశగానే చర్యలు ఉండాలన్నారు. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చేలా నిర్దిష్టమైన ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి ప్రత్యేకంగా ఫీడర్లను ఏర్పాటు చేయాలని, దీనిపైనా అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. -
సాకారమవుతున్న రైతు కల.. సాగుకు కొత్త కళ
సాక్షి, అమరావతి, ఒంగోలు, కాకినాడ: రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం నాంది పలికింది. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వైఎస్ జగన్ తన హామీపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. అంతిమంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల వ్యవసాయ విద్యుత్ ఫీడర్లలో 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ప్రయోగాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు. ఏకబిగిన వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల గ్రిడ్‌పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, విద్యుత్ లభ్యతపై ప్రభావం వంటి అంశాలను ముందుగా పరిశీలిస్తారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాలి? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను విభజించాలి? లోడ్ పడకుండా సాఫీగా సరఫరా చేసేందుకు ఏం చేయాలి? తదితర విషయాలపై నివేదిక రూపొందిస్తారు. దీనిపై అధ్యయనం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నిరంతర విద్యుత్ పథకం అమలులోకి వస్తుంది. 18 లక్షల మంది రైతులకు ఆనందం రాష్ట్రంలో 18 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటికి పగలు, రాత్రి నిర్ణీత సమయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కూలీలు ఉన్నప్పుడు విద్యుత్ లేకపోవడంతో పనులు జరగడం లేదు. అర్ధరాత్రి విద్యుత్ ఉన్నా కూలీలు లేకపోవడంతో ఉపయోగం ఉండటం లేదు. చీకట్లో బోర్లు ఆన్ చేసేందుకు వెళ్తూ రైతన్నలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పగటి పూట 9 గంటల విద్యుత్ అందిస్తానని భరోసా ఇచ్చారు. వాస్తవానికి వేసవి మినహా ఇతర కాలాల్లో పగటిపూట విద్యుత్ డిమాండ్ సాధారణంగానే ఉంటుంది. వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చినా గ్రిడ్‌పై పెద్దగా లోడ్ పడదు. కానీ రాత్రిపూట ఇవ్వడం వల్ల, అదే సమయంలో గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి అధిక లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో వారాల తరబడి విద్యుత్ సరఫరా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి ఈ బాధలు ఉండవని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తోంది. రెండు షిఫ్టుల్లో సరఫరా! తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పథకంపై రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. వాస్తవ పరిస్థితిని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ మంత్రి బాలినేనికి వివరించారు. రాష్ట్రంలో 11కేవీ వ్యవసాయ ఫీడర్లు 6,663 ఉన్నాయని, ఇందులో కేవలం 1,712 (26 శాతం) ఫీడర్లకు మాత్రమే అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. అదనపు అత్యధిక సామర్థ్యం గల 16 సబ్ స్టేషన్లు (ఈహెచ్‌టీ), 32 కెపాసిటర్ బ్యాంకులు, 52 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 112 కిలోమీటర్ల అదనపు హై ఓల్టేజీ లైన్లు వేయాల్సి ఉందన్నారు. దీనికి రూ.1,700 కోట్ల నిధులు అవసరమని వివరించారు. ప్రస్తుతం 26 శాతం వ్యవసాయ ఫీడర్లు పగలు 5 గంటలు, రాత్రి 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంతమందికి, ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో దఫా విద్యుత్ ఇచ్చే ప్రతిపాదనలను మంత్రి వద్ద ఉంచారు. కాగా, మంత్రి బాలినేని ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు గృహ వినియోగానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతులకు సబ్సిడీ ధరలపై కరెంటు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ పీపీఏల విషయాన్ని ఇటీవల తిరుపతిలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో పీపీఏలపై సమీక్షించి కొనుగోలు ధరలు అడ్డగోలుగా ఉంటే వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ సరఫరాకు కొత్తగా మౌలిక సదుపాయాలు అవసరం లేని ప్రాంతాల్లో ముందుగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కన్నబాబు అధికారులకు సూచించారు. -
ఐదేళ్లుగా ‘కోతలే’
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌ను తెలుగుదేశం సర్కార్ ఐదేళ్లూ ప్రచారాస్త్రంగానే వాడుకుంది. ఎప్పటికప్పుడు కోత వేస్తూ.. సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచినట్టు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వం చెప్పినవన్నీ అవాస్తవాలేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో వ్యవసాయ రంగానికి సరఫరా చేసినది 2014లో 28 శాతం ఉంటే, 2018–19 నాటికి అది 25 శాతానికి తగ్గింది. వ్యవసాయ పంపుసెట్లకు ఏటా భారీ సంఖ్యలో రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వం అరకొరగా మంజూరు చేసింది. వ్యవసాయ విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పంపుసెట్లన్నీ ఐదు అశ్వసామర్థ్యం (5 హెచ్‌పీ) కలిగినవే. ఒక్కో పంపుసెట్టు రోజుకు 7 గంటలు నడిపితే 35 యూనిట్ల విద్యుత్ కావాలి. ప్రస్తుతం ఉన్న 18.02 లక్షల పంపుసెట్లకు ఏటా 23,020 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. డిస్కమ్‌లు ఇస్తున్న విద్యుత్ కేవలం 13,480 మిలియన్ యూనిట్లు మాత్రమే. దాదాపు 10 వేల మిలియన్ యూనిట్ల మేర తక్కువ సరఫరా అవుతోంది. అంటే, రోజుకు 4 గంటలకు మించి వ్యవసాయ విద్యుత్ ఇవ్వడం లేదనేది సుస్పష్టం. వాస్తవానికి రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. ఏడాదికి సగటున 15 వేల మిలియన్ యూనిట్ల కొనుగోలు చేసినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏటా 10 వేల మిలియన్ యూనిట్ల మిగులు ఉన్నట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంది. అయినప్పటికీ వ్యవసాయ విద్యుత్‌కు కత్తెర తప్పలేదు. ఈ రంగానికి ఇచ్చే విద్యుత్ భారాన్ని డిస్కమ్‌లకు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ భారాన్ని ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచించింది. దీని పర్యవసానమే విద్యుత్ రంగానికి ఐదేళ్లుగా భారీ కోతలు తప్పలేదు. ఎన్నికల సమయంలో రోజుకు 9 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటించిన టీడీపీ సర్కార్, అదనంగా విద్యుత్ రంగానికి ఒక్కపైసా ఇవ్వలేదు. -
హైదరాబాద్‌కు ‘హై’పవర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. కొత్త టవర్లు నిర్మించకుండానే, కొత్త లైన్లు వేయకుండానే ప్రస్తుత లైన్లకు ‘హై టెంపరేచర్ లాసాగ్’ (హెచ్‌టీఎల్‌ఎస్) కండక్టర్లను అమర్చి హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల డబుల్ సర్క్యూట్ 220 కేవీ విద్యుత్ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో రూ.1,100 కోట్లు ఆదా చేయడంతోపాటు మూడేళ్లు పట్టే పనిని 3నెలల్లో పూర్తిచేసింది. సామర్థ్యం పెంచేందు కు ఏర్పాటు చేసిన కండక్లర్లను విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం ప్రారంభించారు. అధిక లోడ్ లైన్ల సామ ర్థ్యం పెంపుతో హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాలో అప్పుడప్పుడు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కారం కానున్నాయి. రూ.1,100 కోట్లు ఆదా..: పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా, ఈ ఏడాది 3,276 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతమున్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగింది. ఎక్కువ లోడ్ గల రూట్లలో సరఫరాలో అప్పుడప్పుడు అవాంతరాలు తప్పట్లేదు. 400 కేవీ లైన్ల నుంచి 220 కేవీ విద్యుత్‌ను తీసుకొచ్చే మామిడిపల్లి– శివరామ్‌పల్లి, మల్కాపురం– షాపూర్‌నగర్, శంకరపల్లి–గచ్చిబౌలి లైన్లపై అధిక ఒత్తిడి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లైన్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మూడు లైన్లు కలిపి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కేవీ లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా చేయడం వల్ల రూ.1,200 కోట్ల వ్యయం అవుతుంది. పైగా మూడేళ్ల సమయం పట్టేది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి టవర్లు, లైన్లు నిర్మించకుండానే ప్రస్తుతమున్న లైన్ల సామర్థ్యాన్ని ప్రత్యేక కండక్టర్లు అమర్చడం ద్వారా రెట్టింపు చేసింది. ఈ కండక్టర్ల సామర్థ్యాన్ని మొదట నార్కట్‌పల్లి ప్రాంతంలో 20 కిలోమీటర్ల 132 కేవీ లైన్లలో పరీక్షించారు. ట్రాన్స్‌కో సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ కండక్టర్లను వాడాలని సిఫారసు చేసింది. టెస్ట్ రన్ కూడా విజయవంతం చేసిన తర్వాత, బుధవారం నుంచి అధికారికంగా ఈ మూడు లైన్లలో కండక్టర్లను అనుసంధానం చేశారు. దీంతో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. 4 వేలకు పైగా డిమాండ్ తట్టుకునే సామర్థ్యం పెరిగింది. మూడేళ్ల వరకు ఢోకా లేకుండా హైదరాబాద్‌కు విద్యుత్ సరఫరా చేయొచ్చు. దీనికి రూ.100 కోట్ల వ్యయమైంది. 400 కేవీ రింగ్ ఏర్పాటు ‘హైదరాబాద్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్ర మలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్ కోతల్లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ ఏర్పాటు చేశాం. నాలుగు 400 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’ – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
ఒడిశాకు మన కరెంటోళ్ల సాంత్వన
సాక్షి, హైదరాబాద్: ఫొని తుపాను సృష్టించిన విధ్వంసంతో అతలాకుతలమైన ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మన రాష్ట్ర విద్యుత్ సిబ్బంది పడుతున్న శ్రమ ఆ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకుంటోంది. తుపాను దెబ్బకు విద్యుత్ సరఫరా కుదేలై అంధకారం నెలకొన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు సాయం చేస్తున్నారు. మన రాష్ట్ర విద్యుత్ సిబ్బంది సహకారంతో మంగళవారం నాటికి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో పాటు చుట్టుపక్కల 34 కిలోమీటర్ల మేర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఫొని తుపాను కారణంగా భీకరంగా వీచిన గాలులతో ఒడిశావ్యాప్తంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. దీంతో 16 జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సహకరించాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో భాగం కావాలని సీఎస్ ఎస్కే జోషి, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు 1,000 మంది ఉద్యోగులను ఈ నెల 7న ఒడిశాకు పంపాయి. మన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సామగ్రి, ఆహార సామగ్రి, గుడారాలు కూడా వెంట తీసుకెళ్లారు. టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎల్.గోపయ్య పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో 34 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. 537 కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న 74 ట్రాన్స్ ఫార్మర్లను మళ్లీ పనిచేసేలా చేశారు. భువనేశ్వర్‌తో పాటు, పూరీ జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేశారు. తెలంగాణ ఉద్యోగులు కష్టపడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారని కోర్దా కలెక్టర్ భూపేందర్‌సింగ్ పూనియా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రశంసలు ఒడిశాలో తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న విద్యుత్ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఒడిశాకు వెళ్లి సహాయక చర్యలు అందిస్తున్నారని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే అక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులు విజయవంతం చేశారని అభినందించారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనియాడారు. కొన్ని గంటల సమయంలోనే అక్కడికి చేరుకుని, వర్షంలో కూడా పనిచేసి సామాజిక బాధ్యత నెరవేర్చారని కొనియాడారు. -
కాళేశ్వరానికి నిరంతరం కరెంటు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు నిరంతరం విద్యుత్‌సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్‌కు నీళ్లు తరలించడానికి సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ పంపుహౌస్ వద్ద 134.8 మెగావాట్ల సామర్థ్యం గల పంపునకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందులో 400 కేవీ సబ్ స్టేషన్, నీటిపంపింగ్ వ్యవస్థను నియంత్రించే కంట్రోల్ రూమ్ ఉన్నాయి. అక్కడి విద్యుత్లైన్లు, మోటార్లు, టన్నెల్‌ను ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఏర్పాట్లపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పంపింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ప్రాజెక్టు కోసం ప్రతి పంపుహౌస్ వద్ద డెడికేటెడ్ సబ్‌స్టేషన్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నందున అన్ని సాంకేతిక అం శాలపై ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నామన్నారు. పంపుసెట్ల పనితీరును ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నట్లు వెల్లడించారు. పంపుసెట్లకు అవసరమైన విద్యుత్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు భవిష్యత్తులో నిర్వహణకు సంబంధించి కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. నీటిని ఎత్తిపోయడం అత్యంత ముఖ్యం తెలంగాణకు లైఫ్‌లైన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన విషయమని ప్రభాకర్‌రావు చెప్పారు. నీటిని లిఫ్టు చేయడానికి సకాలంలో సబ్ స్టేషన్లు నిర్మించి, లైన్లు ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. మిడ్‌మానేరుకు చేరిన నీరు అక్కడి నుంచి అంతగిరి రిజర్వాయర్ చేరుకుంటుంది. అంతగిరి నుంచి రంగనాయక్ సాగర్‌కు వస్తుంది. రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు నీరు చేరాలంటే 110 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 539.20 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపులతో లిఫ్టు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక్కోటి 134.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను బిగించారు. దీనికి కావాల్సిన విద్యుత్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు చంద్లాపూర్ లో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించారు. అక్కడే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో జేఎండీ సి.శ్రీనివాస రావు, డైరెక్టర్లు సూర్యప్రకాశ్, జగత్ రెడ్డి, నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ తదితరులు పాల్గొన్నారు. -
300 గ్రామాల్లో అంధకారం
సాక్షి, అమరావతి: ఫొని తుపాను ఉత్తరాంధ్రలో విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మొత్తం 2 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలగా, దాదాపు 300 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంతిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, పలాస, కవిటి, నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, గార, పొలాకీ మండలాల్లో విద్యుత్ నష్టాలు భారీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 32 కేవీకి చెందిన 19 ఫీడర్లలోని 733 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగినట్టు, అయితే శుక్రవారం సాయంత్రానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ రాజబాపయ్య వివరించారు. కడపటి వార్తలు అందే సమయానికి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. విద్యుత్ శాఖ సలహాదారు రంగనాథం, ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ ఆడమ్స్ పరిస్థితిని చక్కదిద్దడానికి శ్రీకాకుళంలోనే మకాం వేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకూ తుపాను బాధిత ప్రాంతాల్లోనే ఉంటామని ఆడమ్స్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 2,600 మంది సిబ్బందిని రప్పించామని, వాళ్ళంతా రాత్రింబవళ్ళు విద్యుత్ పునరుద్ధరణకే కృషి చేస్తున్నారని రంగనాథం వివరించారు. తిత్లీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలకు వీలుగా 400 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచారు. అయితే, వీటి అవసరం పెద్దగా కన్పించలేదని, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం తప్ప ట్రాన్స్ఫార్మర్లకు నష్టం వాటిల్లలేదని ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్య తెలిపారు. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో కొన్ని నెలల క్రితమే తిత్లీ బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఈ ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు, తీగలు వేశారు. ప్రస్తుతం గాలికి వీటిల్లో చాలా వరకు నేలకూలాయి. కొద్ది నెలల్లోనే వీటిని మళ్ళీ వేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. తుపాను తగ్గుముఖం పట్టిన కారణంగా శనివారం సాయంత్రానికి అన్ని గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించే అవకాశం ఉందని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. -
విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా భారీగా పెరగనుంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించి వచ్చే ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు తొలిసారిగా సాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు సమయానికి పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు గోదావరి జలాలను ఎత్తిపోయడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక ఎత్తిపోతల పథకాలకు 1,080 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ సంస్థ (డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా 600–2,600 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రారంభం కానున్న నేపథ్యం లో వచ్చే జూలై నుంచి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చే సరికి రికార్డు స్థాయిలో 14,500 మెగావాట్లకు ఎగబాకనుందని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) అంచనా వేసింది. మార్చి 4న ఏర్పడిన 10,501 మెగావాట్ల విద్యుత్ డిమాండే ఇప్పటివరకు రాష్ట్ర అత్యధిక విద్యుత్ డిమాండ్‌కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బకు వచ్చే జూలైలో ఈ రికార్డు కనుమరుగు కానుంది. జూలైలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,000 మెగావాట్లకు చేరనుంది. బోరు బావుల కింద పంటల సాగు లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సగటున 8,200 మెగావాట్లకు తగ్గిపోయింది. జూలై నుంచి బోరు బావుల కింద ఉన్న ఆయకట్టుతోపాటు కాళేశ్వరం కొత్త ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యం లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేయండి.. వచ్చే జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నీటిపారుదలశాఖ విజ్ఞప్తి చేసింది. భక్త రామదాసు, దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎల్లంపల్లి తదితర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే విద్యుత్ సంస్థలు గరిష్టంగా 1,080 మెగావాట్ల వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపో తల కోసం అదనంగా 600–2,600 మెగా వాట్ల విద్యుత్‌సరఫరా చేయాలని నీటిపారుదలశాఖ కోరింది. ఈ ప్రాజెక్టుకు ఏ నెలలో ఎంత విద్యుత్ అవసరమన్న లెక్కలను అందించింది. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే జూలై నుంచి అదనంగా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్ల ను పిలిచామన్నారు. నిర్మాణంలో ఉన్న 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం నుంచి డిసెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుందన్నారు. డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం! కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం డిస్కంలు ముందస్తుగా భారీ ఎత్తున విద్యుత్‌ను సమీకరించి పెట్టుకుంటున్నాయి. ఇందుకోసం రూ. వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా లేక ఈ ప్రాజెక్టు కోసం సమీకరించిన విద్యుత్‌ను పూర్తిగా వాడుకోవడంలో విఫలమైనా డిస్కంలు భారీగా నష్టపోనున్నాయి. డిస్కంలు మరింత సంక్షోభంలో కూరుకుపోనున్నాయి. థర్మల్, సోలార్, జల విద్యుత్ ప్లాంట్లు కలిపి రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా 16,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 9,000 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మినహాయిస్తే జల, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎప్పడు అవసరముంటే అప్పుడు విద్యుదుత్పత్తి చేసుకొని వాడుకోవడానికి అవకాశం లేదు. రాష్ట్రంలో 3,700 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లోనే ఉత్పత్తి అవుతుంది. 2,441 మెగావాట్ల సామర్థ్యంగల జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నా ఆయా జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నప్పుడే జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలను తీర్చడానికి వచ్చే జూలై నుంచి మరో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి. -
విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఓ వైపు డిస్కంల ఆర్థికలోటు ఏడాదికేడాది పెరిగిపోతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు విద్యుత్ రాయితీలు కేటాయించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎదురైన విద్యుత్ సంక్షోభాన్ని డిస్కంలు కేవలం 6 నెలల్లోనే అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచిత్విద్యుత్ సరఫరా పథకాన్ని 9 గంటల నుంచి 24 గంటలకు పొడిగించాయి. ఈ చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించడంలో డిస్కంలు చేతులెత్తేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,356 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్టీపీసీ) గతనెలలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ప్రైవేటు కంపెనీకు సైతం రూ.1,000 కోట్ల వరకు బకాయిలను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు పెంచి ఆదుకుంటుందని డిస్కంల యాజమాన్యాలు ఆశించాయి. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అరకొరగా విద్యుత్ రాయితీ నిధులు కేటాయించడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర నిరాశకు గరయ్యాయి. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన ఈఆర్సీ లెక్కలు ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతేడాది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ రాయితీ నిధులతో కొంతవరకు ఆర్థికలోటు భర్తీ కానుండగా, మిగిలినలోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. విద్యుత్‌చార్జీల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2018–19 రాష్ట్ర బడ్జెట్లో సైతం డిస్కంలకు ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు మాత్రమే కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన ఈఆర్సీ డిస్కంల ఆర్థికలోటు అంచనాలను రూ.5,980 కోట్లకు కుదించి పాతచార్జీలతోనే వార్షిక టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెలతో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా, ఇప్పటికే డిస్కంలు రూ.5 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయని ట్రాన్స్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది కొనసాగిస్తే 2019–20లో డిస్కంలు రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థికలోటును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019–20లో విద్యుత్‌శాఖకు రూ.4,002 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ నిధులు కలుపుకున్నా విద్యుత్ రాయితీలు రూ.5 వేల కోట్లకు మించవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్లకుపైగా ఆర్థికలోటులో కొంతభాగాన్ని అయినా పూడ్చుకోవడానికి విద్యుత్‌చార్జీల పెంపు తప్పదని చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే జూన్‌లో విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలున్నాయి. -
హడలెత్తించిన రాళ్లవాన
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి రాళ్లవాన హడ లెత్తించింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వృక్షాలు, స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భీకర గాలులకు పలు ఇళ్ల రేకులు కొట్టుకుపోయాయి. హోర్డింగ్‌లు ఊడిపడటంతో పలువురు గాయపడ్డారు. వృక్షాలు కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. మొక్కజొన్న, కందులు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో మొక్కజొన్న, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జగిత్యాల మార్కెట్‌యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన కందులతోపాటు వ్యాపారులకు చెందిన వరిధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మెట్పల్లి డివిజన్లో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో చేతికి వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నువ్వుల పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లి బస్టాండ్ వద్ద భవనంపై ఉన్న భారీ హోర్డింగ్ ఊడి పడటంతో పలువురు గాయపడ్డారు. మార్కెట్‌యార్డులో నిల్వ ఉంచిన సుమారు వెయ్యి క్వింటాళ్ల పసుపు, 200 క్వింటాళ్ల కందులు తడిసిపోయాయని అధికారులు తెలిపారు. కొండాపూర్‌లో మర్రిచెట్టు విరిగి పడటంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. గాలికి పలు గృహాల రేకులు కొట్టుకుపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు తడిసింది. అమ్మక్కపేట నుంచి డబ్బా దారిలో తాటిచెట్టు విరిగి పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాళ్ల వానతో మామిడి పూత, పిందె రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలితో కూడిన వాన రావడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. అలాగే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మెండోరా, ముప్కాల్, బాల్కొండ మండలాల్లో వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో సుమారు 10 వేల క్వింటాళ్ల పసుపు తడిసింది. -
విద్యుత్ సరఫరాపై తిత్లీ ప్రభావం
సాక్షి, హైదరాబాద్: తిత్లీ తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులపాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) సూచించింది. సోమవారం విద్యుత్ సౌధలో జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన టీఎస్పీసీసీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించి తిత్లీ తుపాను ప్రభావం వల్ల కలుగుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అన్ని రంగాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్, హైడల్ పవర్ స్టేషన్ల ద్వారా పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని థర్మల్ స్టేషన్లలో చాలినంత బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కేవలం రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారానే విద్యుత్ అందాల్సి ఉన్నందున ఏ ఒక్క పవర్ ప్లాంటులో కూడా ఏ ఒక్క యూనిట్‌లోనూ ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని జెన్కో అధికారులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎంత దొరికితే అంత విద్యుత్‌ను ఎంత ధరైనా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇవీ ఇబ్బందులు.. తిత్లీ తుపాను వల్ల ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య విద్యుత్ సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. హైటెన్షన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు దేశంలో ఎటువైపు నుంచి కూడా విద్యుత్ అందడం లేదు. ఉత్తర–దక్షిణాది గ్రిడ్‌కు అంతరాయం ఏర్పడింది. తాల్చేరు–కోలార్, అంగూల్–శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణకు రావాల్సిన 3 వేల మెగావాట్ల విద్యుత్ అందడం లేదు. దీనికి తోడు సెంట్రల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత వల్ల కూడా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్ షేర్ కింద రాష్ట్రానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అందాల్సి ఉండగా, కేవలం 1,500 మెగావాట్లు మాత్రమే అందుతోంది. ఛత్తీస్‌గఢ్ ద్వారా 1,000 మెగావాట్లు రావాల్సి ఉండగా, కేవలం 350 మెగావాట్లు మాత్రమే వస్తోంది. ఒకవైపు బయట నుంచి రావాల్సిన విద్యుత్ రాకపోవడం సరఫరాపై ప్రభావం చూపుతుండగా, మరోవైపు ఏడాది కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 40 శాతం మేర పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 7,538 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌కు అది 10,600 మెగావాట్లకు చేరింది. ప్రజలు సహకరించాలి తిత్లీ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలన్నింటితోపాటు రాష్ట్రంపైనా ఉంది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థల అధికారులు సిద్ధం గా ఉండాలి. లైన్ల పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం ప్రతిబంధకంగా మారింది. మరో 3 రోజులపాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. విద్యుత్ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి కరెంటు కోతలు లేకుండా చూస్తున్నారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. – దేవులపల్లి ప్రభాకర్‌రావు,సీఎండీ జెన్కో, ట్రాన్స్‌కో ‘అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా’ ఎలాంటి అంతరాయం లేకుండా గ్రేటర్ వాసులకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. టీఎస్జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయా సర్కిళ్ల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో రఘుమారెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం గ్రేటర్లో 55.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం, డిస్కం పరిధిలో 155 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతుందని చెప్పారు. తిత్లీ తుపాన్ ప్రభావం వల్ల ఉత్తరాది నుంచి రావాల్సిన విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు రఘుమారెడ్డి తెలిపారు. -
కరెంట్ సరఫరాకు ‘తిత్లీ’ షాక్ !
సాక్షి, హైదరాబాద్: కరెంటు సరఫరాకు తిత్లీ తుపాన్ దెబ్బ తగిలింది. తిత్లీ తుపాన్ సృష్టించిన బీభత్స ప్రభావం దేశ వ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాపై పడింది. తీవ్ర వేగంతో వీచిన ఈదురుగాలులతో దేశంలోని ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య విద్యుత్ కారిడార్ (విద్యుత్ సరఫరా లైన్లు) దెబ్బతింది. తాల్చేరు–కోలార్, అంగూల్–శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనితో ఉత్తరాది నుంచి తెలంగాణకు రావాల్సిన 3,000 మెగావాట్ల విద్యుత్ అకస్మాత్తుగా నిలిచింది. సగటున రాష్ట్రంలో స్థిరంగా 10,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోంది. తాజాగా పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా అంశాలపై కేసీఆర్ శనివారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమీక్షించారు. ఉత్తర భారత్ నుంచి రావాల్సిన విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని, బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లూ నిలిచిపోయాయని ప్రభాకర్‌రావు వివరించారు. ఈ పరిస్థితి ఎదుర్కొని రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని, ఆ మేరకు సరఫరాలో కొరత ఏర్పడవచ్చని ప్రభాకర్‌రావు తెలియజేశారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి తప్పా బయట నుంచి విద్యుత్ వచ్చే పరిస్థితి లేదని వివరించారు. రాష్ట్రానికి 3 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని వెల్లడించారు. వచ్చే 3 రోజులు దక్షిణ భారత దేశంలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడే అవకాశముందన్నారు. తెలంగాణలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశముందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ రాకున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేసీఆర్‌కు ప్రభాకర్‌రావు వివరించారు. -
సిక్కోలు.. ఇంకా చీకట్లోనే..
(శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) /అరసవల్లి (శ్రీకాకుళం): ఎక్కడ చూసినా నేలకూ లిన, వాలిపోయిన విద్యుత్తు స్తంభాలు... ఊగులాడుతున్న... నేలపై దొర్లాడుతున్న వైర్లు.. వందలాది పల్లెల్లోనే కాదు.. టెక్కలి, ఇచ్ఛాపురం లాంటి ప్రధాన పట్టణాల్లోనూ మూడురోజులుగా గాఢాంధకారమే. విద్యుత్ సరఫరా లేక పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్దాన ప్రాంతమైన సోంపేట, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు, కవిటి, కంచిలితోపాటు పాతపట్నం, సంతబొమ్మాళి మండల కేంద్రాల్లోనూ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రజలు చీకట్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు వర్షాలవల్ల పారిశుధ్యం దెబ్బతిని ఈగలు, దోమలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్తు లేకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణించనలవిగాకున్నాయి. తిత్లీ తుపాను విధ్వంసం సృష్టించిన సిక్కోలు పల్లెలు, పట్టణాల్లో అలుముకున్న చిమ్మచీకట్లు ఎప్పుడు తొలగిపోతాయా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో మొత్తం 4,319 గ్రామాలు అంధకారంలో మునిగిపోగా 2,762 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు శనివారం ప్రకటించారు. 1,557 గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి 2,600కుపైగా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయని సమాచారం. 23 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం శ్రీకాకుళం జిల్లాలో 33 కేవీ, 11కేవీ, లోటెన్షన్ వెరసి 23 వేల వరకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని అధికారులు చెబుతున్నారు. 33 కేవీ వైర్లు 1,358 కిలోమీటర్లు, లోటెన్షన్ వైర్లు 5,316 కిలోమీటర్లు, 11 కేవీ వైర్లు 3,102.7 కిలోమీటర్ల మేరకు తెగిపోయాయని అధికారిక సమాచారం. వీటన్నింటినీ సరిచేసి అన్ని ఆవాస ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడానికి ఎన్ని రోజులు పడుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. టెక్కలి నుంచి పలాస మధ్య టవర్లు 5, పలాస–ఇచ్ఛాపురం మధ్య ఒకటి కలిపి మొత్తం ఆరు 132 కేవీ టవర్లు పడిపోయాయి. వాటిని సరిచేయడానికి సాంకేతికంగా సమస్యలున్నాయని, అందువల్ల పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఎప్పటిలోగా పునరుద్ధరించగలమనేది చెప్పలేమని ఒక ఉన్నతాధికారి(ఆఫ్ ద రికార్డు) చెప్పారు. జిల్లాలోనే ఉన్న సీఎం చంద్రబాబు కూడా పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో చెప్పకపోవడం గమనార్హం. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు కూలిపోయిన ప్రాంతాల్లో వేరే స్తంభాలు ఏర్పాటుచేసి, వైర్లు సరిచేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శేషుకుమార్, జనరల్ మేనేజరు(ఆపరేషన్స్) సూర్యప్రతాప్ తెలిపారు. తాగునీటికి సమస్య.. విద్యుత్తు సరఫరా లేక జిల్లాలో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతోపాటు ఇచ్ఛాపురం, టెక్కలి, సోంపేట తదితర ప్రాంతాలకు నదులనుంచి శుద్ధి చేసిన నీటిని పైపులైన్లద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించినా అనేక పట్టణాలు, 1,557 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా లేదు. దీనివల్ల తాగునీటి సరఫరా ఆగిపోయింది. కరెంటు లేక బోర్లూ పనిచేయట్లేదు. ఫలితంగా ప్రజలకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. వైద్య సేవలకు అంతరాయం తప్పట్లేదు. గణాంకాల్లో నిజమెంత? విద్యుత్తు స్తంభాలు విరిగిపోయినట్లు, వంగిపోయినట్లు ఈపీడీసీఎల్ చెబుతున్న లెక్కలపై విద్యుత్‌రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వంగిపోయిన, పడిపోయిన విద్యుత్తు స్తంభాలు 23 వేలు అనేది చాలా పెద్దమొత్తమని, అన్ని ఉండకపోవచ్చని ఈ విభాగంలో అపార అనుభవమున్న ఒక అధికారి అన్నారు. అత్యధిక గ్రామాలు, పట్టణాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది కదా? అని ప్రశ్నించగా.. ‘కరెంటు సరఫరా ఆగిపోవడానికి స్తంభాలు పడిపోవడమొక్కటే కారణం కాదు. వైరును వైరును కలిపే జాయింట్ ఊడిపోయినా, ట్రాన్స్ఫార్మర్లతో సమస్య ఏర్పడినా విద్యుత్తు సరఫరా కాదు’ అని ఆయన వివరించారు. అధికారులు ఇలా అసత్య లెక్కలు ఎందుకు చూపుతారని ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని వాకబు చేయగా.. ‘తుపాను పునరుద్ధరణ పనులపై ఆడిటింగ్ ఉండదు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలనికూడా ఉండదు. అత్యవసర పనుల కింద ఇష్టారాజ్యంగా చేయించి భారీగా నిధులు మింగేయవచ్చు. ఇలా చేయడానికి తప్పుడు లెక్కలు చూపుతుంటారనే అభిప్రాయముంది’ అని ఆయన బదులిచ్చారు. -
త్వరలో విద్యుత్ వివాదాలను పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటా మని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలి పారు. సదరన్ రీజినల్ పవర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. రాష్ట్రాల పునర్విభజన వివాదాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాల వివాదంపై దాదాపు మూడున్నరేళ్ల కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అప్పటి కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) చైర్మన్ నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిందా? లేదా? అన్న సమాచారం తన వద్ద లేదన్నారు. వివాదం నా దృష్టికి రాలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌కు సంబంధించి విభజన వివాదాలు నెలకొని ఉన్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ రంగం సాధించిన విజయాలపై మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతులకు సౌర విద్యుత్ పంప్ సెట్లను సరఫరా చేసేందుకు కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తమ్ మహాభియాన్) పేరుతో కొత్త పథకా న్ని అమల్లోకి తీసుకురానున్నామన్నారు. దీనిద్వా రా దేశ వ్యాప్తంగా 27.5 లక్షల సోలార్ పంప్సెట్ల ను పంపిణీ చేస్తామని, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో 17.5 లక్షల పంప్సెట్లు ఇస్తామన్నారు. త్వరలో కొత్త టారిఫ్ విధానం విద్యుత్ ధరలను నిర్ణయించే టారిఫ్ విధానంలో సమూల సంస్కరణల కోసం ముసాయిదా టారిఫ్ విధానాన్ని ప్రకటించామని ఆర్కే సింగ్ పేర్కొన్నా రు. త్వరలో అమల్లోకి వచ్చే ఈ విధానం ప్రకారం పలు కేటగిరీల వినియోగదారుల మధ్య క్రాస్ సబ్సిడీ 25 శాతానికి మించరాదన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 15 శాతం లోపు ఉండాలన్నారు. -
విద్యుత్ వివాదం మళ్లీ మొదటికి
గైర్హాజరైన తెలంగాణ అధికారులు సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ వివాదానికి పీటముడి పడింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) సోమవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రా ల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అరవిందకుమార్ రాలేకపోయారు. దీంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తమ వాదనను సీఈఏ ముందుంచారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 53.89శాతం, ఏపీకి 46.11శాతం విద్యుత్ వాటాలు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగతా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. దీంతో అటు తెలంగాణలో, ఇట ఏపీలో కొత్త ప్రాజెక్టుల విద్యుత్ వాటాలపై వివాదం తలెత్తింది. ఏపీలోని కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల పీపీఏలు అంగీకరించలేదు. కాబట్టి ఇందులో తెలంగాణకు ఎలాంటి హక్కు లేదని ఏపీ పట్టుబట్టిం ది. వివాదం పరిష్కారం కోసం కేంద్రం ఏర్పా టు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండానే కాల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో సీఈఏ నేరుగా రెండు రాష్ట్రాల అధికారులతో సమాలోచనలు జరపాలని నిర్ణయించింది. తాజా భేటీలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణపట్నం విద్యుత్ అవసరం లేదని తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు లేఖ రాసిందన్నారు. కనుక దీన్ని తమకే కేటాయించాలన్నారు. అలాగే హిందూజా కూడా ఏపీకే చెందాలన్నారు. తెలంగాణలో 600 మెగావాట్లతో నిర్మిస్తున్న కాకతీయ థర్మల్ పవర్‌స్టేషన్ రెండో దశలో ఏపీకి 46.11 శాతం వాటా రావాలన్నారు. 120 మెగావాట్ల పులిచింత విద్యుత్ కేంద్రంలో ఇదే నిష్పత్తిలో వాటా కోరారు. ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మిస్తున్న సింగరేణి ప్రాజెక్టులోనూ 484 మెగావాట్లు ఏపీకి హక్కు ఉందని స్పష్టం చేశారు. ఏపీలో కొత్తగా రాయసీమ థర్మల్ స్టేషన్ నాలుగో దశ, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ఆంధ్రప్రదేశ్‌కే ఇవ్వాలన్నారు. తమ వాదనపై తెలంగాణ అభిప్రాయాలు తెలుసుకుని, నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఈఏ ఛైర్మన్ చెప్పినట్టు విజయానంద్ తెలిపారు. -
విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
- కేటీపీఎస్ ఆరవ దశలో .. - ప్రస్తుతం 350 మెగావాట్లకే పరిమితం - జెన్కోకు సుమారు - రూ.12 కోట్ల వరకు నష్టం పాల్వంచ : విద్యుత్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 6వదశలో నిలిపి వేసిన 500 మెగావాట్లను శనివారం రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. గత నాలుగు రోజుల క్రితం రాష్ర్ట వ్యాప్తంగా వర్షాలు పడటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి జెన్కో లోడ్ డిస్పాచ్ అధికారుల ఆదేశాల మేరకు విరామం ఇచ్చారు. ఈక్రమంలో ఇంజనీర్లు లైటప్‌లను పూర్తి చేశారు. తిరిగి వినియోగం పెరుగుదల చూపడంతో రాష్ట్ర గ్రిడ్‌కు 500 మెగావాట్లలో 350 మెగావాట్లను అనుసంధానించాలని ఆదేశాలు జారీఅ య్యూరుు. ఉత్పత్తిని పున :ప్రారంభించారు. అయితే నాలుగు రోజులుగా రోజుకు 12 వేల మిలియన్ యూనిట్ల చొప్పున మొత్తం 48 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి గండి పడటంతో జెన్కోకు రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పీఎల్ఎఫ్ శాతం గ ణనీయంగా తగ్గడంతో 5 శాతం మానిటరింగ్ బెనిఫిట్స్‌లో కూడా ఉద్యోగులకు కోత విధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే కరెంటు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ వాటాను గల్లాపట్టి సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుల పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటే సాగర్ నుంచి నీళ్లు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలను గుర్తించి త్వరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. -
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అందు లో 4,300 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని, అయితే మిగిలిన దానికోసం యుద్ధ ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవస రం ఉందని సింగరేణి సంస్థ డెరైక్టర్లు వివేకానం ద (ఫైనాన్స్, (పా)), బి.రమేష్‌కుమార్ (ఆపరేషన్స్), ఎ.మనోహర్‌రావు (ప్రాజెక్టు, ప్లానింగ్) అన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లోటుగా ఏర్పడిన విద్యుత్‌ను అందించేందుకు జైపూర్‌లో 1200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని, అయితే వీటి కోసం ఏటా 9 మిలియన్ టన్నుల బొగ్గును అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2015-16లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60.30 మిలి యన్ టన్నులు నిర్ణయించిన నేపథ్యంలో భూగ ర్భ గనులు, ఓపెన్‌కాస్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడిని కలిసి సంస్థ, గని, ఓపెన్‌కాస్టులో ఉన్న స్థితిగతులను వివరించేందుకు మల్టీ డిపార్ట్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ త్వరలో నిర్దేశించిన ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం తన పెట్టుబడులను తానే సంపాదించుకుంటూ తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు ప్రణాళికలు రూపొందిం చిందన్నారు. భూగర్భ గనుల్లో ప్రతి కార్మికుడు తన ఎనిమిది గంటల సమయంలో కేవలం రెం డున్నర నుంచి మూడు గంటలు మాత్రమే పని చేస్తున్నారని, ఓపెన్‌కాస్టుల్లో యంత్రాలు రోజు లో 12 నుంచి 14 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ఇలా కాకుండా కార్మికులు, యంత్రాలను బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పని గంటలను పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతోపాటు ఎక్కువ బొగ్గు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి కార్మికుడికి తాము చేసే పని గురించి, సంస్థకు నిర్దేశించిన లక్ష్యాన్ని వివరిస్తూ కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా సహకారం అందించాలని కోరనున్న ట్లు తెలిపారు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీల్లో మైనింగ్, పర్సనల్, ఫైనాన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల నుంచి అధికారులు ఉంటార ని, వారు గనుల్లో, ప్రాజెక్టుల్లో బడ్జెట్ కు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు వివరా లు, రవాణా వివరాలు, ఓఎంఎస్, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి కార్మికులకు ఉద యం, మధ్యాహ్నం షిప్టుల ప్రారంభ సమయం లో వివరించి వారికి అవగాహన కల్పిస్తారన్నా రు. త్వరలో రానున్న ప్రైవేట్ బ్లాకుల నుంచి వెలికితీసే బొగ్గు చౌకగా లభించడం, విదేశీ బొగ్గు దిగుమతి, సింగరేణి బొగ్గును సిమెంట్ కంపెనీలు వాడకపోవడం, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో సింగరేణిలో బొగ్గుకు డిమాండ్ తగ్గనున్నదని, ఈ క్రమంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని కార్మికులకు తెలుపనున్నారన్నారు. వచ్చే మా ర్చి 31 నాటికి ఈ ప్రక్రియ ప్రతి రోజు జరుగుతుందన్నారు. కాగా, తొలుత అధికారులు, కార్మిక సంఘాల నాయకుల నుంచి సూచనలు తీసుకునేందుకు మొదటిసారిగా శనివారం గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమాలోచన సమావేశాన్ని నిర్వహించి సలహాలు స్వీకరించారు. కార్పొరేట్ పర్సనల్ జీఎం సి.మల్లయ్యపంతులు, జీఎంలు సుగుణాకర్‌రెడ్డి, సుభానీ, వెంకట్రామయ్య, భాస్కర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, మేరుగు రవీందర్‌రెడ్డి, గోవర్దన్, ఆరెళ్లి పోషం, ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్య, హెచ్ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఐఎన్టీయూసీ నాయకుడు డాలయ్య పాల్గొన్నారు. -
ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం తగినన్ని బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ కోరారు. రానున్న 4 నెలల్లో తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని, కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి కేసీఆర్ రెండు లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి తీవ్రమైన విద్యుత్ ఉందని, ఉత్తరాది గ్రిడ్ మిగులు విద్యుత్ ను తమ రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. విభజన ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం గౌరవించకపోవడం వల్లే తెలంగాణ ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కనీసం 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధానికి రాసిన లేఖ ప్రతిని కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్ కూడా కేసీఆర్ పంపారు. -
పుస్తక జ్ఞానంతోనే ప్రకృతి సేద్యం!
బతుకును పచ్చగా మార్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉన్న పట్టభద్రుడైన ఒక యువ రైతు జగదీశ్వర్‌రెడ్డి కేవలం పుస్తకాలు చదివి, వీడియోలు చూసి ప్రకృతి సేద్యాన్ని నేర్చుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి తొలుత వ్యతిరేకత వచ్చినా దీక్షతో ముందడుగేసి.. వారితోనే శభాష్ అనిపించుకుంటున్నాడు. విద్యుత్ సంక్షోభాన్ని సౌర విద్యుత్ మోటారుతో అధిగమిస్తున్నాడు. తాను పండించిన బియ్యం,కూరగాయలను సొంత దుకాణం ద్వారా సహజాహార ప్రేమికులకు అమ్ముతున్నాడు. చక్కని ఆదాయాన్ని పొందుతూ తోటి అన్నదాతలకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కే గుణమే అన్నదాతలకు శ్రీరామరక్ష అని రుజువు చేస్తున్నాడు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గడ్డం జగదీశ్వర్ రెడ్డి(41). కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్‌లో పుట్టిన ఆయన బీఎస్సీ మ్యాథ్స్ పాసై.. కంప్యూటర్ శిక్షణ, సేల్స్, సర్వీసింగ్ రంగాలలో ఆరేడేళ్లపాటు కష్టపడినా ఫలితం లేకపోవడంతో వ్యవసాయంపైన దృష్టి పెట్టాడు. పాలేకర్ పుస్తకాలు.. వీడియోలు.. పదెకరాల సొంత భూమిలో సాగుకు రసాయన ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. లక్ష వరకు ఖర్చయ్యేది. ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి అప్పులే మిగులుతుండడంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం మానేద్దామనుకున్నాడు. అటువంటి సమయంలో మహారాష్ట్రకు చెందిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి తెలిసింది. పాలేకర్ పుస్తకాలు తెప్పించుకొని నాలుగైదు సార్లు క్షుణ్ణంగా చదివి.. యూట్యూట్‌లో వీడియోలు చూసి వ్యవసాయంలో తాను చేస్తున్న తప్పులేమిటో.. చేయాల్సిందేమిటో తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో క్రమంగా, దశలవారీగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తూ మూడేళ్లలో పూర్తిస్థాయి ప్రకృతి సేద్యంలోకి మారాడు. నాటు ఆవును కొని షెడ్డు వేసి, ఆవు మూత్రం ఒక పక్కకు వచ్చి నిలిచేలా ఏర్పాటు చేశాడు. ఆవు మూత్రంతో ఘన జీవామృతం, జీవామృతం తయారు చేసి పంటలకు వేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయం రైతుకు ఎంత లాభదాయకమో తెలుసుకున్న ఆయన తల్లితండ్రులతోపాటు, ఇతర రైతులూ ఆశ్చర్యపోతున్నారు. జీవామృతం.. ఆవు మూత్రం 4 ఎకరాల్లో వరి పొలం, మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, రెండెకరాల్లో పండ్ల తోటలు, ఎకరంలో కూరగాయలు, పూలను 2014 ఖరీఫ్ నుంచి పూర్తిగా ప్రకృతి సేద్యపద్ధతుల్లోనే సాగు చేస్తున్నాడు. పంట ఏదైనా దుక్కిలో యూరియా, డీఏపీకి బదులు ఎకరానికి క్వింటా చొప్పున ఘనజీవామృతం, వేపపిండి, ఆముదం పిండి వేస్తాడు. తర్వాత ప్రతి 15 రోజులకోసారి జీవామృతం సాగు నీటిలో కలిపి పంటలకు అందిస్తాడు. పురుగులేమైనా కనిపిస్తే 15 లీటర్ల నీటికి 2 లీటర్ల ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తాడు. సాగు ఖర్చు సగానికి సగం తగ్గింది. పంటలు నిగ నిగలాడకపోయినా ఆరోగ్యంగా పండుతున్నాయి. ఆదుకున్న సౌర విద్యుత్తు బోర్లు, వ్యవసాయ బావులే ఆధారం. ఎకరం తడవడానికి సరిపోయేంత సిమెంటు తొట్టిని కట్టించి, నీటిని అందులోకి తోడి.. డ్రిప్, స్ప్రింక్లర్లు, కాలువల ద్వారా పంటలకు అందిస్తున్నాడు. విద్యుత్ కోతలతో మోటర్లు నడవక రెండెకరాల్లో వరి, కొంత పసుపు ఎండిపోయింది. మిగిలిన పంటలనైనా రక్షించుకోవాలంటే సౌర విద్యుత్తే దిక్కని సకాలంలో గుర్తించి.. అప్పుచేసి మరీ రూ.3.5 లక్షలతో 5 హెచ్‌పీ సోలార్ పంపును పెట్టించాడు. ఇప్పటికీ కరెంటు రోజు మార్చి రోజు ఇస్తున్నారని, సోలార్ పంపు లేకపోతే పంటేదీ చేతికొచ్చేది కాదని జగదీశ్వర్‌రెడ్డి చెప్పాడు. మూడింతల నికరాదాయం 2014 ఖరీఫ్ సీజన్లో జై శ్రీరాం అనే సన్న రకం వరిని జగదీశ్వర్ రెడ్డి సాగు చేసాడు. నాలుగెకరాలకు విత్తనాలు, కూలీలు ఇతర ఖర్చుల రూపేణా రూ. 70 వేల వరకు ఖర్చు చేశాడు. కానీ, కరువుతో రెండెకరాల్లో వరి పంట ఎండిపోయింది. ధాన్యం మర పట్టిస్తే 30 క్వింటాళ్ల బియ్యం చేతికొచ్చాయి. నేరుగా వినియోగదారులకు అమ్మితేనే గిట్టుబాటు ధర వస్తుందని గ్రహించిన జగదీశ్వర్‌రెడ్డి సొంతంగా సహజాహార దుకాణం తెరిచాడు. జై శ్రీరాం బియ్యం క్వింటా ధర మార్కెట్లో రూ. 4 వేలుండగా రూ.6,500కు అమ్ముతున్నాడు. కిలో రూ.10-15 అధిక ధరకు కూరగాయలు అమ్ముతున్నాడు. తక్కువ ఖర్చుతో పండించడం, శ్రమకోర్చి నేరుగా తానే అమ్ముతున్నందున సాధారణ రైతులతో పోల్చితే ప్రతి పంటలోనూ మూడింతల నికరాదాయం పొందుతున్నాడు. తనంతట తానే నేర్చుకున్న ప్రకృతి సేద్యం జగదీశ్వర్‌రెడ్డికి ఆదాయ భద్రతను, వినియోగదారులకు ఆరోగ్య భద్రతను ఇస్తుండడం హర్షదాయకం. - పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్, కరీంనగర్ జిల్లా ఖర్చంతా కూరగాయల ద్వారా రాబట్టాలి! గత మూడేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటలు పండిస్తున్నా. పెట్టుబడి ఎకరానికి రూ. 5 వేల వరకు తగ్గింది. ఇప్పుడిప్పుడే ఇతర రైతులూ ఈ వ్యవసాయం వైపు చూస్తున్నారు. మా బియ్యం, కూరగాయలు తిన్న వాళ్లు తేడా గుర్తిస్తున్నారు. మార్కెట్లో కొన్న కూరగాయలు వండినప్పుడు పురుగుమందు వాసన వస్తుంటే పారేశామని చెప్పినవాళ్లున్నారు. కూరగాయ పంటల ద్వారా ఖర్చులన్నీ రావాలి.. వరి, పసుపు తదితర ప్రధాన పంటలపై ఆదాయం నికరంగా మిగలాలి. వచ్చే ఏడాది నుంచి ఈ లక్ష్యం సాధిస్తా. - గడ్డం జగదీశ్వర్‌రెడ్డి (93915 11076), రాంపూర్, మల్యాల మండలం, కరీంనగర్ జిల్లా -
‘సోలార్’ కోసం భూముల అన్వేషణ
పరిశీలించిన ఎన్టీపీసీ, ఉన్నతాధికారుల బృందం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించిన సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులైన సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కొంతైనా విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కవచ్చని భావిస్తోంది. ఇందులో భాగం గా ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను నిపుణుల బృందం అన్వేషిస్తోంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దోడంద గట్టేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని టెకిడిగూడ శివారులోని భూములను ఎన్టీపీసీ, ఎన్‌వీవీఎన్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఈఈపీసీవో, ఎన్‌హెచ్‌పీసీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బృందం పరిశీలించింది. ఇప్పటికే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం ఆదిలాబాద్‌లో మావల గ్రామ పంచాయతీ పరిధిలోని భూములను కూడా పరిశీలించింది. వీరి వెంట తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ అధికారుల బృందం కూడా ఉంది. 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు? రాష్ట్రంలో ఐదు వందల మోగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కనీసం ఐదు ఎకరాల భూమి అవసరం ఉంటుందని టీఎస్ ఐఐసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన భూ ములను అన్వేషిస్తున్నారు. ఈ ప్లాంట్లు పూర్త యి.. ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన పక్షంలో ఆ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించేందుకు అనువైన విద్యుత్ లైన్లు, సబ్‌స్టేష న్లు వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడిని చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆదివారం స్థానిక జగన్నాథ్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కరెంటు సంక్షోభానికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, ఉపసర్పంచ్ కారింగుల సుమన్, నాయకులు కరిపె శ్రీనివాస్, నయీం, కమ్మరి బీమన్న, రాచకొండ గోపి గోడాపురం సందీప్, సల్ల చంద్రహస్, గాడ్పు చందు, నిట్ట రవి, రాజేశ్వర్, గంగన్న, ముత్యం పాల్గొన్నారు. -
‘కాడెడ్లతో కరెంటు’ ప్రయోగం భేష్
సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి అఫ్జల్‌గంజ్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత సమయంలో మజల్ ఎనర్జీ ఎన్విరో మిషన్(మీమ్) పేరిట మాడెక్స్ సంస్థ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కాడెడ్లతో కరెంటు ఉత్పత్తి యంత్రం అద్భుతంగా ఉందని, ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామని మాజీ మంత్రి, సీఎల్పీనేత కె. జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కాడెడ్లతో కరెంటు ఉత్పత్తి అవగాహన ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాజీ ఎంపీలు జి.వివేక్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేనారెడ్డి, మాజీ మేయర్ ఎన్.లక్ష్మీనారాయణలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాడెడ్లతో కరెంటు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోరి మాడెక్స్ సంస్థ సీఈఓ బత్తుల జగదీష్ ఈ పరికరాన్ని కనుగొనడం అభినందనీయమన్నారు. అసలు ఈ ఆలోచన రావడం, వచ్చిన వెంటనే ఆచరణలోకి తీసుకురావడం జగదీష్ పట్టుదలకు నిదర్శనమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్‌కు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రైతులందరికీ అందుబాటు ధరల్లో లభించేలా.. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి నరోత్తమ్‌రెడ్డి, ఎకనామిక్ కమిటీ కార్యదర్శి వనం వీరేందర్, కోశాధికారి అనిల్ స్వరూప్‌మిశ్రా, ప్రతినిధులు హరినాథ్‌రెడ్డి, కృష్ణాజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్పందన బాగుంది: సీఈఓ బత్తుల జగదీష్ కాడెడ్లతో కరెంటు ఉత్పత్తి ప్రదర్శనకు రైతుల నుంచి విశేష స్పందన లభించిందని మాడెక్స్ సంస్థ సీఈఓ జగదీష్ అన్నారు. 3 రోజుల్లో 300 పరికరాలకు బుకింగ్ రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తమ వద్ద ఈ పరికరాన్ని కొనుగోలు చేసిన రైతులకు రెండేళ్ల పాటు గ్యారెంటీ ఇవ్వడంతో పాటు నిర్వహణ కూడా తామే చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుకింగ్ చేసిన 3 నెలల్లోగా పరికరాన్ని డెలివరీ చేస్తామన్నారు. ఈ పరికరం ద్వారా 4-5 ఎకరాలకు సరిపడా సాగునీరు అందించడంతో పాటు రైతుల ఇతర విద్యుత్ అవసరాలకు కూడా వినియోగించవచ్చన్నారు. మూడేళ్లు శ్రమించి 20 మంది ప్రతినిధులతో కలిసి ఈ పరికరాన్ని రూపొందించామన్నారు. ధరలో రాయితీకి కృషి: మంత్రి పోచారం అఫ్జల్‌గంజ్: కాడెడ్లతో విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మంగళవారం రాత్రి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. పరికరం పనితీరును పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి పరికరాలు రూపొం దించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు సోలార్ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మాడెక్స్ సంస్థ రూపొందించిన ఈ పరికరాన్ని రైతులకు అందుబాటు ధరల్లో రాయితీపై అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. -
గ్రామాలకైతే మరో వారం రోజులు!
ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ రూరల్ ప్రాంతాల్లో పలు సమస్యలు ప్రతిబంధకంగా మారారుు. శ్రీకాకుళం జిల్లాలో 3.6 మి.యూ, విజయనగరంలో 5.3 మి.యూ విద్యుత్ డిమాండ్ అంత త్వరగా పరిష్కారం సాధ్యమయ్యే సూచనలు కన్పించడం లేదు. విద్యుత్ లైన్లన్నీ దెబ్బతిన్నాయి. టవర్లు పూర్తిగా పాడయ్యాయి. పెందుర్తి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే మార్గంలో మూడు ప్రధాన టవర్లు కుప్పకూలాయి. దాదాపు 20 వరకూ 132 కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. 12 వేల స్తంభాలు నేలకొరిగారుు. ఇవన్నీ మారిస్తే తప్ప, గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా సాధ్యం కాదు. జాతీయ గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం ఉన్నా లైన్లు లేక వీలు కుదరడం లేదు. లైన్లు, టవర్లు పునరుద్ధరించడానికి వారం రోజులు పడుతుందనేది అధికారిక సమాచారం. అయితే మరో 48 గంటల్లో జిల్లా కేంద్రాలకు విద్యుత్ అందిస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ క్షేత్రస్థాయి సమాచార క్రోడీకరణ జరగలేదు. స్తంభాలు, ఇతర సామగ్రి ఉన్నప్పటికీ వాటిని చేర్చడం కష్టంగా ఉంది. ప్రధాన రహదారుల్లో కూలిపోయిన చెట్లే ఉన్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు సామగ్రి సరఫరా కష్టంగా ఉంది. -
ఇమ్రాన్ ఖాన్ ఇంటికి కరెంట్ కట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహరీక్ ఇన్పాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాలాటియల్ లోని ఆయన ఇంటికి అధికారులు కరెంట్ కట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ లక్ష రూపాయలు పైగా విద్యుత్ బకాయిలు ఉండడంతో ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు ఇస్లామాబాద్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అధికారులు తెలిపారు. కరెంట్ బిల్లు కట్టకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని గతంలో నోటీసు ఇచ్చినా ఇమ్రాన్ ఖాన్ స్పందించలేదని వెల్లడించారు. కరెంట్ బిల్లులు, పన్నులు కట్టొద్దని ఆగస్టు నెలలో పాకిస్థాన్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. నవాజ్ షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి దించేందుకు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ పిలుపునిచ్చారు. -
కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర
ఖమ్మం/వరంగల్: కరెంటు కోతలపై ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు కన్నెర్ర చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు భారీగా విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కోతల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఈ తిరుమలరావుకు వినతి పత్రం అందచేశారు. పరిశ్రమలకు పవర్ హాలీడే విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఎస్ఈకి వినతి పత్రం అందచేశారు. అలాగే, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. చేర్యాల మండలంలోని ముస్త్యాల సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, దాని అనుబంధ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్లో రైతుల నిరసన వరంగల్ : జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు తమ సమస్యలపై శుక్రవారం నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేష్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వ్యవసాయానికి ఆరు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, కరెంట్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
దమ్ముంటే బదులివ్వండి!
‘విద్యుత్’పై కాంగ్రెస్, టీడీపీలకు మంత్రి కేటీఆర్ సవాల్ తెలంగాణలో థర్మల్ విద్యుదుత్పత్తికి వనరులున్నా.. ప్రాజెక్టులు పెట్టలేదేం? చంద్రబాబు పీపీఏలు రద్దు చేసినా, విద్యుత్ వాటాను లాక్కున్నా ప్రశ్నించరేం? ఆ పార్టీల ద్రోహమేమిటో గణాంకాలే చెబుతున్నాయంటూ బహిరంగ లేఖ హైదరాబాద్: తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. కానీ మళ్లీ వారే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదున్నర దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని వాద్రా-డిచ్పల్లి విద్యుత్‌లైన్ ఏర్పాటుకు పవర్‌గ్రిడ్ టెండర్లు పిలిచేలా చేసింది తమ ప్రభుత్వమేనని.. దక్షిణ భారతదేశంలోని మార్కెట్లో 20 మిలియన్ యూనిట్ల విద్యుత్‌లో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే 17.5 ఎంయూలను కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్, టీడీపీలకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఆ పార్టీలు సమాధానం ఇవ్వాలని సవాలు చేశారు. ఈ లేఖ సారాంశం... ‘దేశంలోనే అధికంగా బొగ్గు నిల్వలు ఉన్న తెలంగాణలో విద్యుత్ కొరత ఉండటానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలే కారణం. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని వనరులూ ఉన్న తెలంగాణ ఎందుకు స్వయం సమృద్ధి సాధించలేకపోయింది? 40 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు పాలించిన టీడీపీ తెలంగాణకు చేసిన ద్రోహమేమిటో గణాంకాలే చెబుతున్నాయి. రామగుండంలో 1,320 మెగావాట్లు, సత్తుపల్లిలో 600 మెగావాట్లు, కేటీపీఎస్‌లో 800 మెగావాట్లు, భూపాలపల్లిలో 800 మెగావాట్లు... మొత్తం 3,520 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించి ఉంటే తెలంగాణలో విద్యుత్ కొరత ఉండేదా? చంద్రబాబు పీపీఏలు రద్దు చేసినా, తెలంగాణకు రావాల్సిన వీటీపీఎస్, ఆర్టీపీపీ, సీలేరు విద్యుత్ వాటాను ఆంధ్ర రాష్ర్టం లాక్కున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు. పీపీఏల రద్దులో కృష్ణపట్నం విద్యుత్‌ప్లాంట్ లేనప్పటికీ.. చంద్రబాబు ఎందుకు తెలంగాణకు వాటా ఇవ్వడం లేదు. బాబు హయాంలో శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మునిగిపోయిన విషయాన్ని ఆయన మరిచిపోయారా? ఇప్పుడు ప్రమాదవశాత్తూ జూరాల, సాగర్ ఎడమగట్టు విద్యుత్ ప్లాంట్ మునిగిపోతే కేసీఆర్ పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించడం గురివింద గింజ సామెతను గుర్తుకుతెస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. 1966లోనే ప్రతిపాదించిన కుంటాల, ప్రాణహిత, ఇచ్చంపల్లి, కంతనపల్లి, దిండి, సింగారెడ్డిపల్లి జల విద్యుత్‌ప్లాంట్లను నిర్మించకుండా వదిలేసింది కాంగ్రెస్ కాదా? 1971లో నిర్మించిన 62.5 మెగావాట్ల రామగుండం బి థర్మల్‌స్టేషన్‌ను విస్తరించకుండా గాలికొదిలేసినదీ.. 1978లో మణుగూరులో నిర్మించాలని ప్రతిపాదించిన 1,760 మెగావాట్ల థర్మల్‌స్టేషన్‌ను విజయవాడకు తరలించిందీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా? 2000వ సంవత్సరంలోనే అన్ని అనుమతులు పొందిన శంకర్పల్లి, కరీంనగర్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు జరగకపోవడానికి మొన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదా? చంద్రబాబు పీపీఏలను రద్దు చేసుకుని, సీలేరు ప్రాజెక్టులో వాటా ఇవ్వనప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు? కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైనా.. ట్రయల్ రన్ పేరుతో 350-400 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రా ప్రభుత్వం వాడుకుంటున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనేందుకు కారిడార్ లేకుండా చేసిందెవరు? రాయచూర్ నుంచి కర్నూలుకు, కృష్ణపట్నం నుంచి శ్రీకాకుళానికి నిర్మించిన 765 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ లైన్లు ఎక్కడా తెలంగాణ ప్రాంతంలో నుంచి పోకుండా వేసిందెవరు? -
ఢిల్లీకి కేసీఆర్
ప్రధాని, కేంద్ర మంత్రులతో , భేటీ అయ్యే అవకాశం రాష్ర్ట సమస్యలను ప్రస్తావించనున్న సీఎం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తుతోనూ సమావేశం హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ఇతర సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మూడు రోజుల పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో సమావేశం కావాలని ఆయన భావిస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే నియమితులైన జస్టిస్ హెచ్ఎల్ దత్తును కూడా ముఖ్యమంత్రి కలువనున్నారు. ఈ పర్యటనలోభాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకురానున్నారు. నెల కిందట ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రానికి చేసిన పలు విజ్ఞప్తుల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరని నేపథ్యంలో ఆయన మరోసారి కేంద్ర మంత్రులను కలసి ఆయా అంశాలను గుర్తు చేయనున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల తర్వాత 13న ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి మొదట నిర్ణయించారు. అయితే ‘హుదూద్’ తుపాను కారణంగా ప్లీనరీ వాయిదా పడటంతో ఢిల్లీ పర్యటనను ఖరారు చేశారు. కాగా, ఢిల్లీలోనే ముఖ్యమంత్రి కంటి పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు ఆయన భార్య, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు వెళ్లారు. -
రికార్డులకెక్కని చావులు
పరిహారం అందని అన్నదాతల కుటుంబాలు - 16 ఏళ్ల నుంచి పరిశీలనలో 1191 - 642 మంది కుటుంబాలే అర్హులట - సర్కారుకు నివేదించినజిల్లా యంత్రాంగం కరీంనగర్ అగ్రికల్చర్ : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. కరువు.. అప్పులు అన్నదాతను చుట్టుముట్టి విధిలేని పరిస్థితుల్లో తనకు తానే మరణశాసనం రాసుకుంటుంటే అధికారులకు మాత్రం అవేమీ పట్టడంలేదు. 16 ఏళ్లలో 1,191 మంది రైతుల బలవన్మరణానికి పాల్పడితే.. 642 మందిని మాత్రమే అర్హులుగా నివేదిక సిద్ధం చేసి మిగిలిన 549 మందిని మరోసారి చంపేశారు. 642 కుటుంబాలకు రూ.1.50 లక్షల చొప్పున 9.63 కోట్ల పరిహారం మంజూరు చేయాలని కోరుతూ జిల్లా యంత్రాంగం శనివారం ప్రభుత్వానికి నివేదించింది. ఆత్మహత్యలు రికార్డులకెక్కకపోవడం.. విచారణకు నియమించిన త్రీమెన్ కమిటీ మొక్కుబడిగా పనిచేయడం... ప్రభుత్వానికి నివేదికలో ఆలస్యం.. వెరసి ఏళ్లుగా సర్కారు సాయమందక బాధిత కుటుంబాలు దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్లుగా సాగులో, దిగుబడిలో అగ్రస్థానంలో నిలుస్తున్న జిల్లా వ్యవసాయరంగం తీరు వెలుగునీడలుగా సాగుతోంది. ప్రకృతి ప్రకోపం, వర్షాభావం, కరెంటు కోతలతో పంటలు నష్టపోయి అన్నదాతను అప్పులు వెంటాడుతున్నాయి. ఏటే టా బలవన్మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తుండగా.. అధికార యంత్రాంగం మాత్రం ఇదంతా తేలిక గా తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. 2014లో ఇప్పటివరకు 22 మందికి పైగా రైతులు అప్పులు, ఆర్థిక ఇబ్బందుల తో ఆత్మహత్య చేసుకోగా... ఇప్పటివరకు రికార్డులకు ఎక్కకపోవడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలనే తలంపుతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 421 జీవో అమల్లోకి తెచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బానికి రూ.1.50 లక్షల సాయమందించడం ఈ జీవో ముఖ్య ఉద్దేశం. విపత్తులు, పంట నష్టం, అప్పులబాధ తాళలేక జిల్లాలో 1995 నుంచి 2012 వరకు 4,324మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. ప్రభుత్వ సాయం కేవలం 624 మందికే అందింది. 2010 నుంచి 2013 వరకు ప్రభుత్వం అధికారికంగా 167 కేసులకు సంబంధించి 110 మంది అర్హులుగా తేల్చి విడతల వారీగా 2014 ఆగస్టు వరకూ పరిహారాన్ని మంజూరు చేసింది. రికార్డులకెక్కని ఆత్మహత్యలు వేలల్లో ఉండడం అధికార యంత్రాంగం అలసత్వానికి అద్దంపడుతోంది. ఏటా ఆత్మహత్యలు చేసుకున్న వారికి ఆ యేడు పరిహారం అందడం లేదు. కాలయాపనకే త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో రైతుల ఆత్మహత్యలను గుర్తించి పరిహారమివ్వడంలో యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం వేసిన త్రిసభ్యకమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతు కుటుంబాలకు పరిహారం దక్కడంలేదు. సంబంధిత ఆర్డీవో, మండల వ్యవసాయాధికారి, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిసభ్యకమిటీ కాలయాపనకే పరిమితమవుతోంది. వ్యవసాయాధికా రి, ఎస్సై, తహశీల్దార్, ఆర్డీవో, డీఎస్పీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల పేరిట కాలయాపన చేస్తూ రైతు ఆత్మహత్యలను నిర్ధారించడంలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో అర్హులైన రైతు కుటుంబాలకు పరిహారం దక్కడం లేదు. రైతు ఆత్మహత్యలకు, సర్కారు నివేదికలకు పొంతన కుదరడం లేదు. 2011-13 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ల వివరాలను నమోదు చేయడంలో విచారణ పేరిట అలసత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఏడాది గడిచిపోగా ఇప్పటికీ నివేదిక రూపొందించకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనం. ఆ రెండేళ్లలో వందలాది మంది రైతులు మృతి చెందగా.. 33 మంది కుటుంబాలే అర్హులంటూ పరిహారం ప్రకటించారు. వీరిలో 11 మందికి మాత్రం ఆ మొత్తం విడుదల కాగా 22 కుటుంబాలకు ఇప్పటికీ అందలేదు. ఏ యేడు కాయేడు ఆత్మహత్యలు.. అందిన పరిహారాన్ని కూడా సం బంధిత అధికారులు గోప్యంగా ఉంచుతుండడం అనుమానాలకు తావిస్తోంది. -
విద్యుత్ సంక్షోభంపై రాజ్యసభలో చర్చ
పరిష్కారానికి పలు సూచనలు చేసిన సభ్యులు న్యూఢిల్లీ: దేశంలో నెలకొని ఉన్న విద్యుత్ సంక్షోభంపై మంగళవారం రాజ్యసభ స్పందించింది. విద్యుత్ కోతలను నివారించేందుకు సభలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు పలు సూచనలు చేశారు. కోల్ ఇండియా లిమిటెడ్‌ను పునర్వ్యవస్థీకరించడం, రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ఆర్థికసాయం చేసి వాటిని నష్టాల్లోంచి బయటకు తీసుకురావడం, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మరింత మెరుగుపర్చడం, విద్యుత్ చట్టాన్ని సమీక్షించడం.. మొదలైనవి అందులో ఉన్నాయి. అలాగే, విద్యుదుత్పత్తి చేసేలా గ్రామపంచాయితీలను ప్రోత్సహించాలని, అణు విద్యుత్ సహా సంప్రదాయేతర విద్యుదుత్పత్తిని పెంచాలని, సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలని సభ్యులు సూచించారు. కాంగ్రెస్‌కు చెందిన సభ్యుడు పీ భట్టాచార్య చర్చను ప్రారంభిస్తూ.. గ్రామీణ విద్యుదీకరణకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. సరఫరా నష్టాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని బీఎస్పీ సభ్యుడు అవతార్ సింగ్ కోరారు. యంత్ర సామగ్రిని చైనా, కొరియాల్లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా దేశీయ బీహెచ్ఈఎల్కు ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వరంగ ఎన్టీపీసీని ఆదేశించాలని కాంగ్రెస్ సభ్యుడు నచియప్పన్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపర్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఎన్సీపీ సభ్యుడు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. విద్యుత్ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ కోరారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా ఉన్న విద్యుత్ సమస్యను పలువురు సభ్యులు ప్రస్తావిస్తూ.. ఆ రాష్ట్రం నుంచి గెలిచిన ప్రధాని, ఇతర మంత్రులు.. తక్షణమే స్పందించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఎంకే సభ్యురాలు కళిమొణి డిమాండ్ చేశారు.