inquiry
-
కాళేశ్వరం కమిషన్ ముందుకు.. ఆ మూడు సంస్థల ప్రతినిధులు
-
పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. నా తప్పేమీ లేదు: కౌశిక్రెడ్డిమాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. -
ట్యాక్సీ సేవల యాప్స్‌పై విచారణకు ఆదేశం
ట్యాక్సీ, ఆటో సేవల యాప్‌లు చార్జీల విషయంలో ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలపై విచారణ(inquiry) జరపాలంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ(CCPA)ను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి తెలిపారు. ఆండ్రాయిడ్, యాపిల్(Apple) డివైజ్‌లపై ఒకే తరహా రైడ్‌కి సంబంధించి వేర్వేరు రేట్లు చూపిస్తుండటం అసమంజసమైన వాణిజ్య విధానమే అవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన జోషి పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు లభించాల్సిన పారదర్శకత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ, టికెట్ బుకింగ్ యాప్స్ తదితర రంగాలకు కూడా దీని పరిధిని విస్తరించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటున్నాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్(Tweet), ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024 -
కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్.. హాజరుకానున్న మాజీ సీఎస్
-
నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కమిషన్ ఇవాళ విచారణ జరిపింది.హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ చంద్రఘోష్, స్మితా సబర్వాల్‌తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?స్మితా సబర్వాల్: అది నా దృష్టిలో లేదుకమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?స్మితా సబర్వాల్: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు.. అవగాహన కూడా లేదుకమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? స్మితా సబర్వాల్: నాకు తెలీదుకమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలిస్మితా సబర్వాల్: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశాసీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?స్మితా సబర్వాల్: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదుఇదిలా ఉంటే.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే! -
వైఎస్ వివేకానందరెడ్డి కేసు మళ్లీ విచారణ
-
18 నుంచి బీసీ కమిషన్ విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులను అధ్యయనం చేసే క్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ రెండోదఫా బహిరంగ విచారణ కార్యక్రమాలు నిర్వహించనుంది. గత నెలలో ఐదురోజుల పాటు ఐదు ఉమ్మడి జిల్లాల్లో కమిషన్ బృందం పర్యటించింది. రెండో విడతగా ఈనెల 18వ తేదీనుంచి 26వతేదీ వరకు మిగిలిన జిల్లాల్లో, ఆలా గే హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో బహిరంగ విచారణ ప్రక్రియ చేపట్టనుంది.ఈ సందర్భంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరపడంతో పాటు వినతిపత్రాలను కూడా స్వీకరిస్తుంది. 25, 26వ తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు తెలంగాణ బీసీ కమిషన్ జిల్లాల వారీగా షెడ్యూల్ విడుదల చేసింది. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమగ్ర సర్వే తెలంగాణ బీసీ కమిషన్‌కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ఏ రోజు, ఏ ప్రాంతం, ఏయే కుటుంబాల వద్దకు వెళతారో ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఖచి్చతమైన సమాచారం ఇస్తేనే వెనుకబాటుకు సంబంధించిన సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. -
12 నుంచి ఐఏఎస్‌ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్‌లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్‌కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్‌కుమార్, వికాస్‌రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్‌కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
తిరుమల లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు. ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయనున్నా మని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలోవాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారమే విచారిస్తామని, ఈలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.నాపై విజిలెన్స్ విచారణను కొట్టేయండి: వైవీటీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డానంటూ తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తనకు అందచేయకుండానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వివరణలు కోరడాన్ని సవాలు చేస్తూ ఎంపీ, టీటీడీ పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను కొట్టేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. టీటీడీ వ్యవహారాలపై విచారణ జరిపే పరిధి చట్ట ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు లేదన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారణ జరపనున్నారు. -
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కాళేశ్వరం’పై ఐఏఎస్‌ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై చేపట్టిన విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లను ప్రశ్నించనుంది. సోమవారం విచారణకు రావాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరైన సోమేశ్‌కుమార్, ఎస్కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి రజత్‌కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్లకు సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన చేసిన కమిషన్.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టిందని, ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్‌లను విచారించనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నిర్మాణ సమయంలో ఉన్నవారిని.. తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరంప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపత్యంలో.. కమిషన్ ఆయనను విచారణకు పిలిచింది. ఎస్కే జోషి రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో సోమేశ్‌కుమార్ వ్యవహరించడంతో ఆయనను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మిత సబర్వాల్ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యదర్శి హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నేపథ్యంలో.. ఆమెను కమిషన్ విచారించనుంది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్ విచారణకు రమ్మని కోరింది. నేడు కమిషన్‌కు కె.రఘు ప్రజెంటేషన్ ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. తర్వాత కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషన్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను కమిషన్ విచారణకు పిలిచింది. -
NEET-UG 2024: నీట్‌పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం నుంచి విచారణ మొదలుకానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్‌కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలు విననుంది. అయితే, పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని, పేపర్ లీకేజీ భారీపెద్ద ఎత్తున జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. -
కాళేశ్వరం లిఫ్టులపైనా విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ (సుందిళ్ల) పంప్ హౌస్‌ల నిర్మాణంపై సైతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ నిర్వహించే బాధ్యతలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అప్పగించగా, విచారణలో అనుబంధ అంశాలుగా పంప్‌హౌస్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లతో పాటు పంప్ హౌస్‌లపై సైతం విచారణ జరిపించాలని పలువురు కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1 ప్యాకేజీలో భాగంగా ఈ పంప్‌హౌస్‌ల నిర్మాణం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నుంచి చీఫ్ ఇంజనీర్ (సీఈ) స్థాయి వరకు.. పంప్‌హౌస్‌ల నిర్మాణంలో భాగస్వాములైన అధికారులందరూ సోమవారం విచారణకు హాజరు కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తాజాగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి జారీ చేసిన పరిపాలన అనుమతులు, సాంకేతిక పరిశీలనలు, ఏ మేరకు నీటిని పంపింగ్ చేయడానికి వీటికి అనుమతినిచ్చారు? చేసిన పంపింగ్ ఎంత? వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? గత ఐదేళ్లుగా పంప్ హౌస్‌ల పరిస్థితి ఏంటి? అనే అంశాలపై కమిషన్ ఆరా తీయనున్నట్టు సమాచారం. మూడేళ్ల కింద గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు నీట మునగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా, శనివారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన కార్యాలయంలో కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. సత్వరంగా నివేదిక సమర్పించాలని వారిని కోరారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించాలిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికను సత్వరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో ఆయన శనివారం ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై విచారణ ప్రక్రియలో ఈ నివేదిక కీలకమని స్పష్టం చేశారు. తుది నివేదిక కోసం కమిషన్ తరఫున ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ అధికారులను సైతంఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నిర్వహిస్తున్న విచారణకు సంబంధించిన తుది నివేదికను కూడా సత్వరం తెప్పించుకోవాలని ఆయన సూచించారు. త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులందరినీ అఫిడవిట్ రూపంలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వాదనలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.ఇదిలా ఉండగా కమిషన్‌ను తప్పుదోవపట్టించే క్రమంలో కొందరు అధికారులు పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో సమర్పించినట్టు తెలిసింది. దీంతో వీరిని సైతం మళ్లీ క్రాస్‌ఎగ్జామినేషన్‌కు కమిషన్ పిలవనుంది. ఇక బరాజ్‌లు దెబ్బతినడానికి కారణాలేంటో తెలుసుకోవాలని కమిషన్ ఓ అధికారిని పుణెలోని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు పంపించింది. విచారణ ముగింపులో బహిరంగ విచారణను సైతం కమిషన్ నిర్వహించనుందని సమాచారం. తొలుత అఫిడవిట్ల పరిశీలన, ఆ తర్వాత నోటీసుల జారీ, క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బహిరంగ విచారణ ఉంటుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం నీట్ అవకతవకలపై సీబీఐతో కాకుండా సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని పౌరహక్కుల నేత, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని నీట్లో జరిగిన అక్రమాలకు ఈ విద్యా విధానమే కారణమని ఆయన ఆరోపించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ కార్యనిర్వాహక కార్య దర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారా యణ, ఉపాధ్యక్షుడు కె.నారాయణలతో కలిసి హరగోపాల్ మాట్లాడారు. నీట్ అక్రమాల వల్ల 24 లక్షలమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, నీట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరిగా వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల కొరత వంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
తెలంగాణలో కొనసాగుతోన్న కాళేశ్వరం కమిషన్ విచారణ
-
ముఖ్తార్ అన్సారీ మృతిపై విచారణ జరిపించాలి: మాయావతి
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత 'ముఖ్తార్ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ముఖ్తార్ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి. पूर्व विधायक मुख्तार अंसारी जी का असामायिक निधन बेहद दुखद, मैं विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के प्रति हैं, प्रकृति उन्हें यह असीम दुख सहने की शक्ति प्रदान करें। पूर्व में ही उन्होंने अपनी हत्या की आशंका व्यक्त की थी, मैं माननीय उच्च… — Chandra Shekhar Aazad (@BhimArmyChief) March 28, 2024 -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై 15న సుప్రీం అత్యవసర విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీలు) నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 15వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. సీఈసీ, ఈసీ నియామకం కోసం ఉద్దేశించి ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స(ఏడీఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏడీఆర్ విజ్ఞప్తి చేసింది. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్– 2023’లోని సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. శుక్రవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. -
సీబీఐ విచారణకు 26న ఢిల్లీ రాలేను
సాక్షి, హైదరాబాద్: ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా ఈనెల 26న ఢిల్లీలో విచార ణకు హాజరుకావడం సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీ సుల రద్దు లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఆదివారం కవిత సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇటీవల సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా రాసిన లేఖలో కవిత కీలకాంశాలను ప్రస్తావించారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం వల్ల తాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత చెప్పారు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేస్తే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని, అది పెండింగ్‌లో ఉందన్నారు. తనను విచార ణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పు డు విచారణకు సహకరించానని, సీబీఐ దర్యా ప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ‘ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ (బీఆర్ఎస్) కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించండి’ అని కవిత సీబీఐకి సమాధానమిచ్చారు. -
బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణ నాలుగో రోజు ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఏసీబీ అధికారులు విచారించారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను ఏసీబీ విచారించింది. ఏసీబీ కార్యాలయానికి పిలిపించి సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. బాలాజీ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు తేలింది. బాలకృష్ణ కాసుల కక్కుర్తిపై విచారణ అధికారులు షాక్ అవుతున్నారు. రెరా కార్యాలయం నాలుగో అంతస్తులోని బాలకృష్ణ చాంబర్లో లాకర్‌ను అధికారులు బ్రేక్ చేశారు. 12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. వాటితో బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్‌లు, కీలకమైన భూముల పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఆ కార్లు ఎక్కడివి? -
మేడిగడ్డపై విచారణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శాసన మండలిలో ప్రకటించారు. నిష్పక్షపాత విచారణ జరిపించి.. కాంట్రాక్టులు ఎవరిచ్చారో, సమస్యలకు కారణం ఎవరో తేల్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వంలో నచ్చితే నజరానా (పురస్కారం), నచ్చకపోతే జుర్మానా (జరిమానా) ఉండవని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో శనివారం చేపట్టిన ధన్యవాద తీర్మానం చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడ్డాయని.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మాత్రం కళ్లముందే కుంగిపోయాయని వ్యాఖ్యానించారు. అలాంటిది తామేదో గొప్ప ప్రాజెక్టు కట్టామని, చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్టును ఇసుకపై కట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సభ్యులను తీసుకెళ్లి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను చూపిస్తామన్నారు. సాంకేతిక నిపుణులతో పరిశీలించాలి.. సీఎం రేవంత్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం వద్ద ఏదో ఘోరం జరిగిపోయిందంటూ.. ఏదో పర్యాటక ప్రదేశానికి వెళ్లినట్టు శాసనసభ, మండలి సభ్యులను తీసుకెళ్లడం కంటే సాంకేతికంగా నిపుణులతో పరిశీలించడం మంచిదని సూచించారు. తాము ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై రేవంత్ ప్రతిస్పందిస్తూ.. మేడిగడ్డ పరిశీలనకు బీఆర్ఎస్ వారు రానంటే తమకు అభ్యంతరమేమీ లేదని, మిగతా సభ్యులకు అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్ వారికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం వద్ద బుంగలు పడటంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా సరే.. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, మహాలక్ష్మి పథకం అమలు, పింఛన్లను రూ.4 వేలకు పెంచడం వంటి హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇది తమ గ్యారంటీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక.. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం మార్పు, టీచర్లు–ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో, స్కూల్ సర్విసెస్, జీతాలు వంటి అంశాలపై ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తీసుకొస్తుందని, రైతుబీమా పథకాన్ని కూడా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. నా భాష ఇలాగే ఉంటుంది..! అసెంబ్లీ ఎదుట ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను తొలగించే విషయంపై అన్నిపార్టీలతో చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజానికి ఈ ప్రాంగణం ప్రభుత్వ పరిధిలోనిది కాదని.. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ సమావేశమై ఏ ఆదేశాలిస్తే వాటిని పాటిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో సీఎం సంయమనం, సహనంతో ఉండాలని, పరుష పదజాలంతో భయపెట్టేలా మాట్లాడవద్దని కోరుతున్నామని దేశపతి పేర్కొన్నారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘గ్రామం నుంచి వచ్చాను. రైతుబిడ్డను. ప్రభుత్వ బడిలో చదువుకున్నాను, నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చాను. నా భాష ఇలాగే ఉంటుంది. ఏం అనుకున్నానో అదే చెబుతాను. నా మాటలకు తప్పు చేయనివారు ఎందుకు భయపడాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి నమూనా చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడే అభివృద్ధి నమూనాగా మార్చుతామని సీఎం రేవంత్ చెప్పారు. మూసీ నదిని శుభ్రమైన నీటితో కళకళలాడేలా చేస్తామని.. మూసీ పరీవాహకం మొత్తం (నల్లగొండ దాకా>) ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. తనకు శాసన మండలిపై ప్రత్యేక అభిమానం ఉందని.. పదిహేనేళ్ల కింద తాను ఎమ్మెల్సీగా అడుగుపెట్టి సీనియర్ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వంటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాగా.. మైనారిటీలకు ఇచ్చిన రూ.లక్ష సబ్సిడీ చెక్కు బౌన్స్ అయిందని, ఆ సొమ్మును ఇప్పించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ కోరగా.. గతంలో ఉన్నది నకిలీ ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ సొమ్ముపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కవిత సవరణ.. వెనక్కి.. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో భాషా ప్రయోగం సరిగా లేదని, దానిని మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కోరారు. ఈ మేరకు ధన్యవాద తీర్మానానికి సవరణలు కోరారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు కల్పించుకుని.. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, సవరణ డిమాండ్‌ను ఉప సంహరించుకోవాలని కోరారు. కవిత ప్రతిస్పందిస్తూ.. గవర్నర్ ప్రసంగంలోని భాషతో తాము ఏకీభవించడం లేదని, దానిపై నిరసన తెలుపుతూనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సవరణ డిమాండ్‌ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. కాగా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల సమయంలో మండలిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి తెచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. -
‘ఉమ్మడి ఆస్తుల’పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పలు అంశాల నేపథ్యంలో పిటిషన్‌ను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
విజయనగరం రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ
సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా? విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది. నేడు కూడా పలు రైళ్ల రద్దు కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?
ముంబయి: డ్రీమ్ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్ఐ సోమనాథ్పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎస్ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఓటర్లపై ఉచితాల వల విసురుతున్నాయి. మళ్లీ అధికారం అప్పగిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని, ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇస్తున్నాయి. ప్రజాధనాన్ని దురి్వనియోగం అవుతోందని, ఈ ఉచిత పథకాలను అడ్డుకోవాలని కోరుతూ భట్టూలాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. -
అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర లబ్ధి కోసమే ఐఆర్ఆర్ భూ దోపిడీ
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) భూ దోపిడీ వ్యవహారంలో అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసు అప్పటి ప్రభుత్వ పెద్దల పరస్పర సహకారానికి సంబంధించినదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసు అని చంద్రబాబు తరపు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కుటుంబానికి, పార్టీ కి, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు పరస్పరం సహకరించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో అప్పటి ప్రభుత్వ పెద్దలు సాగించిన భూదోపిడీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, బాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరపున ఏజీ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పోలీసు కస్టడీ కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి వీల్లేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడానికి వీల్లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికే అరెస్టయిన నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన డీఫాల్ట్‌గా కస్టడీలో ఉన్నట్లు భావిస్తూ ఆయన న్యాయవాదులు ప్రస్తావిస్తున్న తీర్పులు ఇక్కడ వర్తించవన్నారు. ఈ కేసులో సీఐడీ పీటీ వారెంట్, మరో కేసులో పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. చంద్రబాబు డీఫాల్ట్ కస్టడీలో ఉన్నట్లు భావించడంలేదు కాబట్టే, ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందని చెప్పారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదన్నారు. కింది కోర్టుకెళ్లకుండా నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం శ్రీరామ్ వాదనల నిమిత్తం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గత ప్రభుత్వం, అధికారులు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలకు నేర స్వభావాన్ని ఆపాదిస్తున్నారని తెలిపారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగలేదని, ఎలాంటి భూమినీ సేకరించలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. హెరిటేజ్ కంపెనీతో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. అది లిస్టింగ్ కంపెనీ అని, లక్షల మంది వాటాదారులున్నారని తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా 2014లో ఆ కంపెనీ అమరావతి పరిధిలో కొన్న భూమి రింగ్ రోడ్డుకు 9 కి.మీ. దూరంలో ఉందన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పు ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చారని, అందులో భాగంగానే కరకట్ట వద్ద ఉన్న ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లింగమనేని రమేష్ ఖాతాలో జమ చేసిన రూ.27 లక్షలు అవినీతి సొమ్ము కాదని, ఈ డబ్బు చంద్రబాబు తను ఉంటున్న ఇంటికి చెల్లించిన అద్దె మొత్తమని తెలిపారు. -
మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం -
పీటీ వారంట్!
అటాచ్ చేయనున్న ఆస్తుల వివరాలు.. ఏ–1 చంద్రబాబు కరకట్ట నివాసం (లింగమనేని రమేశ్ కుటుంబం పేరిట ఉన్న ఈ నివాసాన్ని చంద్రబాబు క్విడ్ ప్రో కో కింద పొందారు) ఏ–2 పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు. ఏ–2 నారాయణ భార్య పొత్తూరి ప్రమీల, కుటుంబ సభ్యులు, బంధువులు రాపూరి సాంబశివరావు, ఆవుల మునిశంకర్, వరుణ్ కుమార్ ఇప్పటివరకు పొందిన కౌలు మొత్తం రూ.1,92,11,482. సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన కుంభకోణాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజినీ కుమార్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఆ కేసులో కూడా ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి కోరనుంది. దీంతో కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించవచ్చని సీఐడీ భావిస్తోంది. చంద్రబాబు, చినబాబు భూ దోపిడీ టీడీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. వారి బినామీ లింగమనేని రమేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారు.అప్పటివరకు రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారు. అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరిగేలా పథకం వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములు వీటికి అదనం. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు వాటా కల్పించారు. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉండటం గమనార్హం. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించారు. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది. చంద్రబాబు, నారాయణ ఆస్తుల అటాచ్ ఈ కేసులో చంద్రబాబు, నారాయణ బినామీల ద్వారా పొందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ప్రతిపాదనను ఆమోదిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు పొందిన కరకట్ట నివాసంతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను అటాచ్ చేయనుంది. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
రామోజీ, శైలజాకిరణ్ మళ్లీ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజాకిరణ్ మరోసారి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారు. తద్వారా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదన్న వైఖరిని పునరుద్ఘాటించారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల నిధులను మళ్లించిన కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు రామోజీరావు, శైలజాకిరణ్‌కు నోటీసులు జారీ చేశారు. వీరు ఈ నెల 16న (బుధవారం) విచారణకు హాజ రు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరుకాలేదు. సీఐడీ దర్యాప్తునకు రామోజీరావు, శైలజాకిరణ్ ముఖం చాటేయడం ఇది రెండోసారి. ఈ కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జూలై 5న విచారణకు హాజరు కావాలని గతంలో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు కూడా కేవలం మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగానే తాము చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కానీ రామోజీరావు, శైలజాకిరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. తాము విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేమని సీఐడీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు. మళ్లీ కూడా అదే వైఖరి రామోజీరావు, శైలజాకిరణ్‌కు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఈ నెల 9న నోటీసులు జారీ చేసింది. ఈసారీ వారిద్దరూ విచారణకు ముఖం చాటేశారు. ఈ కేసులో రామోజీరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఓసా రి, శైలజాకిరణ్‌ను రెండుసార్లు సీఐడీ అధికారులు విచారించారు. ఆ విచారణ సమయంలో ఇంటి గేట్లు ఉద్దేశ పూర్వకంగా తెరవకుండా అధికారులను వేచి చూసేలా చేశారు. ఆపై విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల నిధులు మళ్లించినందున.. అంటే నేరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగినందున వారిద్దరినీ రాష్ట్రంలోనే విచారించాల్సి ఉంది. అందుకే ఏపీలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. ‘‘రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించాం. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. కేసు నమోదు.. పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ -
ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్ రాజ్యాంగ బెంచ్‌కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగంపై నియంత్రణ తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయిదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల డివిజన్ బెంచ్ సిఫారసు చేసింది. ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తర్వాత దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
విచారించాలి.. ఏపీకి రండి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థి క అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్‌ను ఆంధ్ర ప్రదేశ్‌లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది. దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్‌ను రెండుసార్లు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరిని గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది. న్యాయ సూత్రాల ప్రకారం.. రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో నేరానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మళ్లించింది. ఎఫ్ఐఆర్లు కూడా ఇక్కడే నమోదయ్యాయి. దీంతో న్యాయ సూత్రాల ప్రకారం ఈ కేసులో నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోనే విచారించాల్సి ఉంది. రామోజీరావు, శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించినప్పుడే సీఐడీ అధికారులు వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి విచారిస్తామని సీఐడీ అధికారులు గతంలోనే మీడియాకు తెలిపారు. దేశంలో అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. హాజరు కావడం ఆనవాయితీ నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాలు ఇదే రీతిలో నిందితులను విచారిస్తున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు, శైలజా కిరణ్ ప్రముఖులు కావడం, వారికి ఈనాడు పత్రిక, సొంత మీడియా ఉన్నందున ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యులకు ఒక విధానం, మీడియా బలం ఉన్న వారికి మరో విధానమా? వారికి చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్‌లో శైలజా కిరణ్‌ను విచారించిన సందర్భంగా సీఐడీ అధికారులను తన నివాసంలోకి రానివ్వకుండా గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టి అవమానకర రీతిలో వ్యవహరించినా సంయమనంతో వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సీఐడీ భావిస్తోంది. గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి జూలై 5న రామోజీరావు, శైలజా కిరణ్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్‌పేట బ్రాంచి కార్యాలయ మేనేజర్(ఫోర్మేన్)కు కూడా నోటీసులు జారీ చేశారు. -
గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం
జైపూర్: రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దూకుడు పెంచారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న తన డిమాండ్‌ను ఈ నెలాఖరులోగా నెరవేర్చకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ సొంత పార్టీకే చెందిన సీఎం అశోక్ గహ్లోత్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ డిమాండ్ సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఐదు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తన మద్దతు దారులైన 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జైపూర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ)ని రద్దు చేసి, పునర్వ్యవస్థీకరించాలని, పేపర్ లీక్‌తో పరీక్షలను రద్దు వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలన్న రెండు కొత్త డిమాండ్లను వినిపించారు. నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
తిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
సునాక్‌పై పార్లమెంటరీ కమిషనర్ విచారణ!
లండన్: తన భార్య అక్షతా మూర్తి నిర్వహిస్తున్న ‘కొరు కిడ్స్ లిమిటెడ్’ అనే సంస్థకు లబ్ధి చేకూరేలా బడ్జెట్లో కొత్త పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించారని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ‘యూకే పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్స్’ విచారణ ప్రారంభించింది. అతి త్వరలో రిషి సునాక్‌ను ప్రశ్నించనుంది. కొరు కిడ్స్ లిమిటెడ్ సంస్థ చిన్నపిల్లల సంరక్షణ సేవలను అందిస్తోంది. -
మార్గదర్శి కేసు: విచారణకు సహకరించాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సీఐడీ అధికారుల విచారణకు మార్గదర్శి ఉద్యోగులు సహకరించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేంద్ర కార్యాలయ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. తనిఖీలు, విచారణను అడ్డుకునేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మీడియాకు అధికారులు వివరాలు వెల్లడించకుండా కూడా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మార్గదర్శి కేంద్ర కార్యాలయ ఉద్యోగులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తనిఖీలు ముగిశాక పిటిషనా? మార్గదర్శి ఉద్యోగులు గురువారం లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోకుండా నిరోధించాలని, తనిఖీలు నిలిపివేసేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విన్నవించారు. అయితే బుధవారం ప్రారంభమైన తనిఖీలు గురువారం ఉదయం 9 గంటలకే ముగిశాయని, అలాంటప్పుడు తనిఖీలు ఆపాలని పిటిషన్ దాఖలు చేయడంలో అర్థం లేదని ఏపీ స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సీఐడీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఏ ఉద్యోగిపైనా చర్యలు తీసుకోలేదు. ఎవరినీ బలవంతపెట్టలేదు.. భయపెట్టలేదు. అరెస్టులు చేయలేదు. చట్టప్రకారమే తనిఖీలు జరిగాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు. పలువురు బ్రాంచ్ మేనేజర్లకు, బ్రాంచ్ ఉద్యోగులకు నోటీసులిచ్చాం. కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు’ అని హైకోర్టుకు నివేదించారు. విచారణలో జోక్యం వద్దన్న ‘సుప్రీం’.. ‘ఏ–1 రామోజీరావు, ఏ–2 శైలజ సహా పలువురు మేనేజర్లు ముందస్తు బెయిల్ పొందారు. వారిని కనీసం కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చట్టబద్ధమైన సంస్థలు కేసును విచారించే సమయంలో పూర్తి వివరాలను పరిశీలించకుండా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశాలిచ్చింది. నిహారికా ఇన్ఫ్రా. వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 438 సీఆర్పీసీ కింద ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వకూడదని పేర్కొంది. పిటిషనర్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ‘వెకేట్’ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ప్రతివాదులను ఆదేశించడం సమర్థనీయం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ఎలాంటి రిలీఫ్ ఉత్తర్వులు ఇవ్వవద్దు’ అని గోవింద్‌రెడ్డి అభ్యర్థించారు. -
సిట్ విచారణకు బండి సంజయ్ గైర్హాజరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) సిట్ విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ సిట్ నోటీసుల ద్వారా ఆయన్ని కొరిన సంగతి తెలిసిందే. అయితే గతంలో జారీ చేసిన నోటీసులు తనకు అందలేదని ఆయన విచారణకు గైర్హాజరు కాగా.. తాజాగా ఇవాళ ఆయనకు సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో హైదరాబాద్ లిబరేషన్ కార్యక్రమంతో పాటు.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం బీదర్(కర్ణాటక) వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు బదులు లీగల్‌టీం సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. -
కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ఏప్రిల్ 5న విచారణ: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా వాడుకుంటోందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 5వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, టీఎంసీ, ఎన్సీపీ, జేఎంఎం, జేడీయూ, సీపీఎం ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం వాదనలు వింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల నేతలపై ఉన్నవేనని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి తెలిపారు. -
ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు
సాక్షి, కణేకల్లు: కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తిక్షేత్రంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రంగంలో దిగిన ఆడిటర్లు తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. పూర్వ ఏడీఏ సనావుల్లా పదేళ్ల కాలంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకుండా, ఆదాయ వ్యయాలు సరిగా చూపకుండా, నిధులను భారీస్థాయిలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫారం బకాయిపడిన సొమ్మును ఓటీఎస్ ద్వారా రూ.78.36 లక్షలను ప్రభుత్వం ఇటీవలే చెల్లించగా... ఇందులో కూడా ఓ వ్యక్తి ఖాతా నుంచి తన భార్య ఖాతాకు రూ.13.85 లక్షలు మళ్లించుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.. సనావుల్లా పని చేసిన సమయంలోని రికార్డులన్నీ పరిశీలించేందుకు ఆడిటర్లను నియమించింది. ఆడిటర్లు యోగానందరెడ్డి, రాంబాబు, మాధవి, అన్నపూర్ణ ఐదు రోజుల పాటు రికార్డులన్నీ క్షుణ్ణంగా ఆడిట్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆడిటర్లను అడిగితే ‘ఆ ఒక్కటి అడక్కండి.. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం’ అని సమాధానమిచ్చారు. నివేదికలో ఏముంది.. పూర్వ ఏడీఏపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!) -
Demonetisation: తిరగదోడకండి.. నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్‌దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు. మార్చుకునే చాన్సే ఇవ్వలేదు! పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్‌కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్‌లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే. -
అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్’ విచారణ
డెహ్రాడూన్/రిషికేశ్: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్–బద్రీనాథ్ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్ దకొడుకు పులకిత్ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు. -
అఖిల మృతిపై డీఎంఈ విచారణ
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతి చెందిన ఘటనపై సోమవారం డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలిసి విచారణ నిర్వహించారు. మగశిశువుకు జన్మనిచ్చిన అఖిల తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేం«ద్రంలో ఉన్న వార్డులను డీఎంఈ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది తమను కించపరిచేవిధంగా దుర్భాషలాడుతున్నారని పలువురు ఆయనకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి వర్గాల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ అఖిల మృతిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ప్రాథమిక విచారణంలో తేలిందని తెలిపా రు. కాన్పుల సందర్భంగా సిబ్బంది తీరుపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. మరోవైపు మృతు రాలి అత్త, మామ, భర్త, కుటుంబసభ్యులు శిశువుతోపా టు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్నవారిని డీఎంఈ కనీసం పలకరించకపోవడం గమనార్హం. ధర్నా లో కాంగ్రెస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా పాల్గొన్నారు. న్యాయంచేయాలని అఖిల మామ పోలీసు ల కాళ్లపైపడి ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. -
ఖాతాలు ఎవరివి.. కాసులు ఎక్కడివి? రెండో రోజు చీకోటిపై ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ విచారణ రెండో రోజూ కొనసా గింది. మంగళవారం ప్రవీణ్‌తోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి కూడా విచారణకు హాజరయ్యా రు. తొలిరోజు విచారణలో భాగంగా ప్రవీణ్ లావా దేవీల్లో కొన్ని విదేశీ ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. హవాలా మార్గంలో ఆ విదేశీ ఖాతాలకు డబ్బు వెళ్లినట్టు గుర్తించిన అధికా రులు.. ఆ కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. ఆ విదేశీ ఖాతాలు ఎవరివి? ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్, మొబైల్లోని ఈ–మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లలో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో విదేశీ ఖాతాల నంబర్లు, వాటికి పంపించిన సొమ్ము లావాదేవీల వివరాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ 18 ఖాతా లెవరివి, హవాలా ద్వారా అంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎందుకు తరలించారన్న వివరాలపై ప్రవీణ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక నేపాల్, ఇండోనేషియాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బు తరలించడాన్ని ప్రస్తావిస్తూ.. హవాలా కోసం హైదరాబాద్‌లో ఇచ్చిన డబ్బులు ఎక్కడివని ప్రవీణ్‌ను, మాధవరెడ్డిని ఆరా తీసినట్టు సమాచారం. ఒక్క జూన్‌లోనే రూ.40 కోట్లకుపైగా నేపాల్‌కు చేరినట్టు ఈడీ గుర్తించింది. ఆ డబ్బు ఎవరెవరి నుంచి ఎంత మేర తీసుకున్నారు? ఏ హవాలా ఏజెంట్ ద్వారా నేపాల్‌కు చేరవేశారు? అక్కడ ఎవరి ద్వారా తీసు కున్నారన్న వివరాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే క్యాసినో ఆడిన వా రిలో చాలామంది వీఐపీలు ఉండటంతో వారి పేర్లు చెప్పేందుకు ప్రవీణ్, మాధవరెడ్డి భయపడుతున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సినీ సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ప్రవీణ్ వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసి, క్యాసినోల కోసం డబ్బులు ఇచ్చినవారి వివరాలు తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మీడియాపై రుసరుస.. రెండో రోజు విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రవీణ్ మీడియాపై రుసురుసలాడారు. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రకంగా తనపై ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, చినజీయర్ స్వామిలను కూడా విచారించాలని ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. -
నేడు ఈడీ విచారణకు సోనియా గాంధీ
-
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ
-
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
-
ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్/ములకలపల్లి: ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు గొత్తికోయ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని హామీఇచ్చారు. అడవిలో జీవనాధారం కోసం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించామని, అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని విచారణ అధికారిగా నియమించింది. దీంతో ములకలపల్లి తహసీల్దార్ వీరభద్రం ఐటీడీఏ అధికారులతో కలసి దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీ సిబ్బందిని విచారించారు. మరో పక్క బాధిత మహిళలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమతోపాటు ఇద్దరు బాలికలపై కూడా అటవీ సిబ్బంది దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై గొత్తికోయ మహిళలతోపాటు అటవీ సిబ్బంది కూడా తమకు ఫిర్యాదు చేశారని స్థానిక ఎస్సై తెలిపారు. మహిళలు తమ విధులకు ఆటంకం కలిగించినట్లు అటవీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. -
సర్పంచ్ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..
భువనేశ్వర్/బొలంగీరు: రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ఎన్నికల తొలి దశలోనే ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇలా ప్రారంభమైందో లేదో పలుచోట్ల పదవుల వేలం పాట చోటుచేసుకుంటుండడం సంచలనం రేకిత్తిస్తోంది. తాజాగా బొలంగీరు జిల్లాలో సర్పంచ్ పదవిని వేలం వేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనివెనక నిజానిజాల నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. బొలంగీరు జిల్లా, పుంయింతొల మండలం, బిలెయిసొర్డా పంచాయతీలో సర్పంచ్ పదవి వేలం పాట జరిగింది. ఎన్నికల ప్రారంభ దశలోనే ఇటువంటి ఘటన తారసపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే పంచాయతీలో బిలెయిసొర్డా, బొందొనొకొటా, కొస్రుపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ సాధారణ వర్గాలకు కేటాయించారు. అయితే గ్రామ సమగ్రాభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలనే సంకల్పం గ్రామస్తుల్లో బలపడింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన గ్రామసభ ఏర్పాటు చేశారు. చదవండి: తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థానిక జగన్నాథ మందిరం ఆవరణ వేదికగా జరిగిన ఈ సమావేశానికి పంచాయతీలో 3 గ్రామాల ప్రజలు(ఓటర్లు), ఔత్సాహిక సర్పంచ్ అభ్యర్థులు హాజరయ్యారు. తర్వాత సర్పంచ్ పదవి కోసం వేలం పాట ప్రారంభించారు. గ్రామ ప్రగతి కోసం పలువురు ఔత్సాహిక అభ్యర్థులు ముందస్తు ఆర్థికపరమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. మొత్తం నలుగురు వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం వేలం పాటలో పాల్గొని, పోటీపడగా చివరికి సుశాంత ఛత్రియా అనే వ్యక్తి అధిక వేలం పాటతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. రూ.7 లక్షల నుంచి మొదలై.. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మాత్రమే సర్పంచ్ అభ్యర్థి అని, వేరెవ్వరూ ఆ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయకూడదన్నది వేలం పాట ఒప్పందం. దీంతో సుశాంత ఛత్రియానే బిలెయిసొర్డా పంచాయతీ సర్పంచ్ అని స్థానికంగా వినిపిస్తోంది. సర్పంచ్ పదవి కోసం రూ.7 లక్షల నుంచి మొదలైన వేలం పాట ఆఖరికి రూ.44.10 లక్షలు ధర పలికినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇదంతా అవాస్తవమని సుశాంత ఛత్రియా కొట్టిపారేశారు. గ్రామ ప్రగతికి విరాళంగా రూ.44 వేలు మాత్రమే తాను అందజేసేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. తనను ఏకగ్రీవంగానే గ్రామసభ ఎన్నుకుంటుందన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా నివేదిక దాఖలుకు ఆదేశాలు.. బిలైసొర్డా పంచాయతీ సర్పంచ్ పదవి వేలం పాట సంఘటనపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, వాస్తవాలతో సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ పదవి రూ.44.10 లక్షలకు వేలం వేసినట్లు ప్రధాన ఆరోపణ కాగా, ఈ క్రమంలో దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వాస్తవ, అవాస్తవాలను తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఆర్.ఎన్.సాహు బొలంగీరు జిల్లా కలెక్టరు చంచల్ రాణాకు లేఖ జారీ చేయడం విశేషం. గతంలోనూ ఏకగ్రీవమే.. ప్రధానంగా ఎన్నికల వ్యయం పరిమితం చేసేందుకు ఈ విధానానికి గ్రామసభ ఏకీభవించింది. ఈసారి జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరమితి రూ.2 లక్షలుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతకన్నా తక్కువ ఖర్చుతో(రూ.44 వేలు) గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆయన సర్దిచెప్పుకొచ్చాడు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికలో ఇక్కడి సర్పంచ్‌గా రీతా బొఢియా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. గుర్తింపు ఇవ్వలేం.. ఇలాంటి ప్రక్రియలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేమని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, సంబందిత ఫారం నింపాల్సి ఉంటుందన్నారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం వెళ్లిన వ్యక్తికే సర్పంచ్ పదవి దక్కుతుందని, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చని, ఆఖరికి వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి అయినా కావొచ్చని అధికారులు తేల్చి చెప్పారు. -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రమాదమే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణించిన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14మంది దుర్మరణం పాలయ్యారు. ‘కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు. మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి కోసం రైల్వే లైన్‌ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నివేదికలో వెల్లడించింది. -
AP: స్కిల్ డెవలప్మెంట్ కేసు: దూకుడు పెంచిన సీఐడీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో రూ.242 కోట్ల స్వాహాపై విచారణ చేపట్టింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని సీఐడీ విచారిస్తోంది. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్న సీఐడీ.. ఇవాళ అరెస్టు చూపించే అవకాశం ఉంది. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ‘ఏపీఎస్ఎస్డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
Amazon: ఎంతకి తెగించార్రా ! ఇంత పని చేస్తారా ?
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల విక్రయ లావాదేవీలకు తమ ప్లాట్‌ఫాం వేదికగా మారిందన్న ఆరోపణలపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా అంతర్గతంగా విచారణ చేపట్టింది. కేసు సత్వరం పరిష్కారమయ్యేలా అటు దర్యాప్తు సంస్థలకు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో మధ్యప్రదేశ్‌లోని భిండ్ పోలీసులు ఆన్లైన్ మారిజువానా విక్రయ రాకెట్‌ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు 20 కిలోల మారిజువానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ–కామర్స్ సంస్థ ద్వారా నిందితులు ఈ రాకెట్ నిర్వహించారని, వచ్చిన లాభాల్లో సంస్థకు మూడింట రెండొంతుల లాభాలు అందినట్టు తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల లావాదేవీలకు వేదికగా నిల్చినందుకు గాను సదరు ఈ–కామర్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు. ఎన్సీబీ ఎంక్వైరీకి డిమాండ్ ఈ కామర్స్ వేదికగా నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా కావడమనేది తీవ్ర నేరమని, మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరపాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది. అమెజాన్ సీనియర్ మేనేజ్మెంట్ను కూడా అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. -
‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణలో సాక్షుల నుంచి విచిత్ర సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘దిశ’ హత్యాచారం నిందితులను సీన్ రీ-కన్స్ట్రక్షన్కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ ఓ పంచ్ సాక్షిని శుకవ్రారం విచారించింది. నేరానికి ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు, కేసు పూర్తిగా సందర్భానుసారాలపై ఆధారపడి ఉన్నప్పుడు.. అలాంటి పంచనామాకు ఎలాంటి అపఖ్యాతి లేని వ్యక్తులను పంచ్ విట్నెస్గా తీసుకెళతారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: కేటీఆర్ అలాగే ‘దిశ’ కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్కు.. షాద్‌నగర్ ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్, ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ పంచ్ సాక్షులుగా ఉన్నారు. గతంలో రాజశేఖర్‌ను విచారించిన కమిషన్ శుక్రవారం అబ్దుల్ రహుఫ్‌ను విచారించింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులతో పాటు తాము కూడా వెళ్లామని, ఆ సమయంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారని తెలిపాడు. రాళ్లతో కొట్టారని త్రిసభ్య కమిటీ ముందు ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబ్దుల్ రహుఫ్ కొన్ని ప్రశ్నలకు మాత్రం అస్పష్టమైన సమాధానాలు చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఎవరి చేతుల్లో నుంచి ఎవరు తుపాకులు లాక్కున్నారు? మిగిలిన వాళ్లు ఎవరి మీద రాళ్లు విసిరారు? అని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తన కళ్లలో మట్టి పడిందని, అందుకే సరిగా చూడలేకపోయానని రహుఫ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నేడు, రేపు సెలవు కావడంతో సోమవారం ఉదయం అబ్దుల్ రహుఫ్‌ను విచారించి.. మధ్యాహ్నం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉందని ఇండిపెండెంట్ కౌన్సిల్ అడ్వొకేట్ పీవీ కృష్ణమాచారి ‘సాక్షి’కి తెలిపారు. ‘దిశ’ ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల తరఫున కృష్ణమాచారి హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్‌పై కార్వీ ఛైర్మన్‌ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవీ చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే.. -
ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్ నోట్ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోందని థామ్సన్ అగ్రిగేట్స్, క్రిస్టల్ అగ్రిగేట్స్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్ 14లోని సబ్‌సెక్షన్ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు. ఆర్టికల్ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు ఆర్టికల్ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్ కూడా ట్రిబ్యునల్‌కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు. శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్‌కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్ మెహతా పేర్కొన్నారు. అధికారం లేకున్నా చట్టం ద్వారా నిరోధించలేం ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్‌కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. నేషనల్ ఎన్విరానిమెంటల్ అప్పీలేట్ అథారిటీ యాక్ట్ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఉందని గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. లా కమిషన్ నివేదిక చెబుతోంది ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. -
రియా చక్రవర్తితో సంబంధమేంటి?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించారు. శుక్రవారం ఉదయం 9:10 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో రకుల్ పేరు బయటకు రాలేదు. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డ్రగ్స్ కేసు నమోదు చేసింది. అందులో రకుల్ పేరు వెలుగులోకి రావడంతోపాటు ఇక్కడి కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. రియాతో సంబంధాలపై ఆరా... గతేడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రకుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ప్రధానంగా సుశాంత్‌సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి (రియాను అప్పట్లో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే)తో సంబంధాలపై ఆరా తీశారు. అప్పటి విచారణకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఎన్సీబీ నుంచి తీసుకున్నారు. వాటితోపాటు రెండు నెలల క్రితం కెల్విన్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రశ్నలు సంధించారు. గతేడాది ఎన్సీబీ విచారించడానికి కారణం అదేనా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రకుల్ తన బ్యాంకు లావాదేవీలన్నీ పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. మాదకద్రవ్యాల కొనుగోలు, వినియోగాలకు తాను ఎప్పుడూ దూరంగానే ఉన్నానంటూ స్పష్టం చేసి బ్యాంకు లావాదేవీల రికార్డులు ఈడీకి అందించారు. ముందే వచ్చిన రకుల్... ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. విచారణకు రావాల్సిందిగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు గత నెల్లో సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు శుక్రవారం రావడానికి ఈడీ అధికారులు అంగీకరించారు. ఇప్పటివరకు విచారణకు హాజరైన పూరీ, చార్మీ ఉదయం 10–10:30 గంటల మధ్య ఈడీ కార్యాలయానికి రాగా, రకుల్ మాత్రం ఉదయం 9:10 గంటలకే వచ్చారు. ఆమె వెంట సహాయకులు, మేనేజర్, ఆడిటర్, న్యాయవాది ఉన్నారు. సాయంత్రం తిరిగి వెళ్తున్న సమయంలో రకుల్ మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపారు. బుధవారం నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. -
వేటపాలెం సొసైటీపై విచారణ చేపట్టాలి: కన్నబాబు
సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై వాస్తవాలతో నివేదిక అందజేయాలన్నారు. డిపాజిట్‌దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సహకార శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి పని చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. వేటపాలెం సొసైటీ కార్యదర్శి, సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
తల మీద గన్ను పెడితేగానీ పనిచేయరా?
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకాల్లో తీవ్ర జాప్యంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హోంశాఖ అధికారులు తల మీద గన్ను పెడితేగానీ పనిచేయరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ జస్టిస్ సిస్టంను బలోపేతం చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అసహనం వ్యక్తం చేసింది. ‘హోంశాఖ గాఢనిద్రలో ఉందా.. న్యాయవ్యవస్థ కూడా నిద్రపోవాలని భావిస్తోందా.. ఏపీపీ నియామకాలను పూర్తి చేయాలని లేకుంటే, కేసుకు తగిన ముగింపు ఇస్తాం’అని హెచ్చరించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో అదేభాషలో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. 174 ఏపీపీల నియామకాలు పూర్తి చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో రెండువారాల్లో చెప్పాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను ధర్మాసనం హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో ఏపీపీల పోస్టులను భర్తీ చేయడం లేదని, దీంతో క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను ధర్మాసనం 2018లో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం మరోసారి విచారింఇచింది. ఏపీపీల నియామకాలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని గత ఏప్రిల్ 1న ధర్మాసనం ఆదేశించినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ హోంశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. అఫిడవిట్ దాఖలు చేయనందుకు క్షమించాలని, మరికొంత సమయం ఇస్తే పూర్తి వివరాలు సమర్పిస్తామని శ్రీకాంత్‌రెడ్డి నివేదించగా ‘మీ క్షమాపణలు ఎవరికి కావాలి ? ఏపీపీల నియామకం ద్వారా మాకేమైనా లబ్ధి జరుగుతుందా? క్రిమినల్ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. డీవోపీ నియామకానికి మూడేళ్లు.. ‘‘ప్రాసిక్యూషన్ విభాగం పూర్తికాలం డైరెక్టర్ నియామకానికి మూడేళ్ల సమయం తీసుకున్నారు. 414 ఏపీపీల నియామకాల్లో 200 భర్తీ చేశామని గత విచారణ సందర్భంగా చెప్పారు. ఇటీవల భర్తీ చేసిన 40 పోస్టులు పోను మిగిలిన నియామకాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని ఆదేశించి దాదాపు రెండున్నర నెలలు గడిచినా అఫిడవిట్ దాఖలుకు ఇంకా సమయం కోరుతున్నారు. కోర్టుల్లో ఏపీపీలు లేకపోవడంతో క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, లేకపోతే తదుపరి విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను జూలై 7కు వాయిదా వేసింది. -
తిరుపతి రుయా ఘటనపై కలెక్టర్ విచారణ
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా ఘటనపై కలెక్టర్ హరినారాయణన్ విచారణ చేపట్టారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్ల 11 మంది చనిపోయారని కలెక్టర్ తెలిపారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు. సకాలంలో ఆక్సిజన్ అందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. రుయాలో వెయ్యి మందికి చికిత్స జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. తిరుపతి రుయా ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి తిరుపతి రుయా ఘటనపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి 11 మంది చనిపోవడం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ఆక్సిజన్ ను వెంటనే పునరుద్ధరించి వందల మంది ప్రాణాలు కాపాడిన వైద్యులకు, సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి దిగ్భ్రాంతి తిరుపతి రుయా ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరంబదూర్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి రాలేదని.. ఆక్సిజన్ ప్రెజర్ తగ్గి, అందరికి అవసరమైన ఆక్సిజన్ అందలేదని ఆమె వివరించారు. ప్రత్యామ్నాయంగా బల్క్ సిలిండర్లు ఏర్పాటు చేశామని డాక్టర్ భారతి తెలిపారు. చదవండి: ‘రుయా’లో విషాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి -
వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సీసీఐ విచారణ
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా అప్డేట్ చేస్తున్న ప్రైవసీ విధానంపై క్షుణ్నంగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) తమ దర్యాప్తు విభాగం డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని సూచించింది. వాట్సాప్ అప్డేట్ పాలసీపై మీడియా వార్తల ఆధారంగా సుమోటో ప్రాతిపదికన విచారణ చేపట్టిన సీసీఐ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వాట్సాప్ తీరు .. పోటీ చట్టాల నిబంధనలను ఉల్లంఘించేదిగాను, పాలసీ అప్డేట్ ముసుగులో దోపిడీ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగాను ఉందని సీసీఐ ఆక్షేపించింది. వాట్సాప్ వినియోగించుకోవడాన్ని కొనసాగించాలంటే .. దాని మాతృ సంస్థ ఫేస్బుక్లో భాగమైన ఇతర కంపెనీలతో డేటాను పంచుకునే విధంగా యూజర్లు తప్పనిసరిగా కొత్త పాలసీకి అంగీకరించి తీరాల్సిందే అన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనికి సహేతుకమైన కారణాలేమీ కనిపించడం లేదని సీసీఐ అభిప్రాయపడింది. -
నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్రంలో నివాసమే ఉండకుండా ప్రతినెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ గవర్నర్ కార్యాలయం ఆదేశించినట్టు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్(యూఎఫ్ఆర్టీఐ) ప్రతినిధులు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తమకు గవర్నర్ కార్యాలయం సమాచారమిచ్చిందని వారు వెల్లడించారు. యూఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు నిమ్మగడ్డపై గత డిసెంబర్ 14న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ యూఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, నస్రీన్‌బేగంలు తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం కోరారు. దీనికి గవర్నర్ కార్యాలయ కార్యదర్శి ముఖేష్‌కుమార్ బదులిస్తూ.. ఆ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్ 24న ఆదేశించినట్టు తెలిసినట్టు వారు పేర్కొన్నారు. (చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!) ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం -
మారడోనా మృతిపై దర్యాప్తు...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మృతిపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మారడోనా వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపోల్డో లుక్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. ఆయనకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు రావడంతో అర్జెంటీనా పోలీసులు ఆయన వ్యక్తిగత వైద్యుడైన లియోపోల్డోను విచారిస్తున్నారు. పోలీసులతో పాటు కోర్టు నియమించిన ప్రత్యేక అధికారులు మారడోనా సంబంధీకుల నుంచి డిక్లరేషన్ సేకరిస్తున్నారు. మారడోనా వైద్య రికార్డులను భద్రపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 60 ఏళ్ల మారడోనా గుండెపోటు కారణంగా గత బుధవారం కన్నుమూశారు. మెదడులో రక్త ప్రసరణలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు నవంబర్ 3న శస్త్రచికిత్స జరిగింది. ఈ చికిత్స నుంచి కోలుకుంటూనే అనూహ్యంగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. -
మేల్కోకపోతే ముప్పే!
అనంతపురం హాస్పిటల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల పనితీరులో ఏమ్రాతమూ మార్పు రాలేదు. ఇటీవల ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ డీసీస్ వార్డు (ఐడీ)లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పాటు రెండు వారాల క్రితం సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగినా అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఎఫ్ఎం వార్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు. ఇప్పటికైనా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మేలుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తవని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. పూర్తి కాని పనులు కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో సర్వజనాస్పత్రిలో కోటి రూపాయలతో పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.36 లక్షలతో 150 పడకలకు వన్ లైన్ ఎయిర్, 30 పడలకు టూ లైన్ ఎయిర్, జూన్ 12న రూ.64 లక్షలతో 60పడకలకు మెడికల్ గ్యాస్‌లైన్ త్రీ లైన్, 400 పడకలకు వన్ లైన్ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సన్డాట్కామ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సంబంధించి 700 పాయింట్లలో ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇంకా 150 నుంచి 200 పాయింట్లలో పైప్‌లైన్ పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యతేదీ? ఆక్సిజన్ పైప్‌లైన్ పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైప్‌లైన్ పనులు జరిగే సమయంలో సంబంధిత ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు కానీ, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితోనే వాల్స్‌కు తూతూమంత్రంగా వెల్డింగ్ పనులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే రెండు చోట్ల పైప్‌లైన్ లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది. గండం గడిచింది సర్వజనాస్పత్రిలో ఈ నెల ఆరో తేదీన జరిగిన ఆక్సిజన్ పైప్‌లైన్ లీకేజీ పట్ల ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ సకాలంలో స్పందించడంతో గండం గడిచింది. ఏమాత్రం జాప్యం చేసినా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల మీదున్న రోగుల ప్రాణాలకే ఇబ్బంది కలిగేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. విచారణకు ఆదేశం ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ గంధం చంద్రుడు విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఆర్ఎంఓ, అనస్తీíÙయా హెచ్ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్‌తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు అందుబాటులో ఉండి ఆస్పత్రిలో ఎక్కడైనా ప్రమాదకర ప్రాంతాలుంటే వాటిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ లక్ష్మీపతిరెడ్డి ఏమన్నారంటే..‘ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవమే. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మరో రెండ్రోజుల్లో విధులకు హాజరై తదుపరి వాటిపై స్పష్టత ఇస్తా. పైప్‌లైన్ పనులు అసంపూర్ణం ఆస్పత్రిలో పైప్‌లైన్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. పైప్‌లైన్ వాల్స్ ఊడిపోవడం కారణంగానే లీకేజీ జరిగింది. రెండు వారాల క్రితం తన కార్యాలయం సమీపంలోనే లీకేజీ అయ్యింది. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను కోరుతాం. ఆస్పత్రిలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ రామస్వామినాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
ఆ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతా...
యశవంతపుర: డ్రగ్స్ దందాకు సంబంధించి మత్తు పదార్థాల నియంత్రణ దళం (ఎన్సీబీ) అధికారులు నటులు, సంగీత దర్శకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి మధ్య పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ తనకు రక్షణ కల్పిస్తే సినిమా రంగానికి చెందిన ముఖ్యల పేర్లను బయటపెడతానని ప్రకటించడం శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు కలిగిస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణ తప్పదని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు. కొన్నేళ్లుగా డ్రగ్స్ సరఫరా గత గురువారం డ్రగ్స్ డీలర్లు అనికా, అనూప్, రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఆసక్తికర వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పలువురు నటీ–నటులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. టీవీ రియాలీటీ షో కళాకారులు, డ్యాన్సర్లు కూడా డ్రగ్స్ వాడేవారని, నటీమణులు ఎక్కువగా మత్తు పదార్థాలను కొనేవారని చెప్పినట్లు వెల్లడి. సౌందర్య పోషణ కోసం నటీమణులు డ్రగ్స్‌ను ఉపయోగించేవారని తెలిపారు. సినిమా విడుదలైన వెంటనే నటీనటులు, యూనిట్ సిబ్బంది నగరంలో పేరుమోసిన హోటల్స్, పబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకునేవారు. లాక్డౌన్ సమయంలో అనికా డ్రగ్స్‌ను కోరినచోటికి సరఫరా చేసేవారు. ఇంద్రజిత్ లంకేశ్‌కు పిలుపు నటీనటులు ఎక్కడ డ్రగ్స్ తీసుకొనేవారో వెళ్లడిస్తానని పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ చెబుతున్నారు. ఎన్సీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పోలీసు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు. కేసును తమకు అప్పగించిన కేసును విచారిస్తామని అయన తెలిపారు. ఇంద్రజిత్ ప్రకటనపై దృష్టి పెట్టామన్నారు. విచారణకు రావాలని లంకేశ్‌కు శనివారం నోటీసులు పంపినట్లు చెప్పారు. విద్యాసంస్థలూ పారాహుషార్ బనశంకరి: పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమైన తరువాత మాదకద్రవ్యాల దుష్పరిణామాల పట్ల జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తాం, కాలేజీలు, హాస్టళ్లలో డ్రగ్స్ దొరికితే సంబంధిత విద్యాసంస్థలనే బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి బసవరాజబొమ్మై తెలిపారు. శనివారం హావేరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీసీబీ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, మాదకద్రవ్యాల ముఠా గురించి కీలక సమాచారం తెలిసిందన్నారు. విదేశీయుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది, ఆ ముఠాలను కూకటి వేళ్లతో పెకలిస్తామన్నారు. – హోంమంత్రి -
కాళేశ్వరం విస్తరణపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై వేముల్గాట్ భూనిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భారీ విస్తరణ పనులు చేపట్టారని పిటిషనర్లు ధర్మాసనానికి నివేదించారు. కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పనులు జరపరాదని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్ ఢిల్లీ బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్న విషయంపై చెన్నై బెంచ్ ఆరాతీసింది. ఒకే ప్రాజెక్టుపై 2 బెంచ్‌ల్లో విచా రణ సాధ్యమేనా అని చెన్నై బెంచ్ న్యాయ విభాగం సభ్యుడు జస్టిస్ రామకృష్ణన్ ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో పెండింగ్ కేసుకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, తెలంగాణ చెన్నై బెంచ్ పరిధి లో ఉన్నందువల్ల సౌత్ జోన్ బెంచ్‌లో కేసు వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ నివేదించారు. కేసును చెన్నై బెంచ్ విచారిం చినా, ఢిల్లీ ప్రధాన బెంచ్‌కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని విన్నవించారు. ఢిల్లీ బెంచ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పెండింగ్‌లో ఉన్నందు వల్ల చెన్నైలో విచారణ సరికాదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై దాఖలైన పిటిషన్ చెన్నై బెంచ్ విచారించవచ్చా లేదా అనేదానిపై ఆదేశాలివ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్‌ను కోరుతూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. -
విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై విచారణ
-
నాంపల్లి ACB ఆఫీస్‌లో కొనసాగుతున్న విచారణ
-
సహస్ర కాదు వినయశ్రీ...
కరీంనగర్‌క్రైం/తిమ్మాపూర్(మానకొండూర్): పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, చెల్లి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. సత్యనారయణరెడ్డి కారు ఏ తేదీన, ఏ సమయంలో పడిందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈమేరకు సీపీ కెమెరాల ఫుటేజీలను మంగళవారం పరిశీలించారు. సత్యనారాయణరెడ్డి ఒక్కడే జనవరి 26న హైదరాబాద్ వెళ్లొచ్చినట్లు తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించారు. జనవరి 26వ తేదీఉదయం 11.44 గంటలకు రేణిగుంట టోల్‌ప్లాజా నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాడని... తిరిగి సాయంత్రం 8.15 గంటలకు కరీంనగర్ వైపు వచ్చాడని గుర్తించారు. ఈమేరకు సీసీ ఫుటేజీలు స్వీకరించినట్లు ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి వెల్లడించారు. కాలువలో పడిన కారు ఫిట్నెస్ రిపోర్టు కోసం రవాణాశాఖ అధికారులను సంప్రదించామని తెలిపారు. వాహనానికి సంబంధించి ఏదైనా తప్పిదంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. రవాణాశాఖ అధికారుల నుంచి వాహనం కండీషన్ రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 27న కరీంనగర్‌లోనే.. కరీంనగర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ప్రకారం జనవరి 27న సాయంత్రం వరకు నారాయణరెడ్డి కారు పలు ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం. దీంతో కరీంనగర్ బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వరకూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నమోదుకాని దృశ్యాలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా 27వ తేదీ సాయంత్రం బయల్దేరినట్లు అతడి షాపులో పనిచేసే వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు 27 తేదీన అల్గునూర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కారు అటుగా వచ్చినట్లు కనిపించలేదని తెలిసింది. రాత్రి నమోదైన దృశ్యాల్లో వాహనాల నంబర్లు సరిగా కనిపించకపోవడంతో మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపా రు. 27 తేదీ సాయంత్రం వరకు మాత్రం కారు అటువైపు రాలేదని తేలడంతో కారు ఏ సమయంలో పడిందనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్‌డాటా వస్తే మరిన్ని విషయాలు... సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లకు సంబంధించి కాల్‌డేటా వివరాలు నేడు పోలీసులకు అందనున్నట్లు తెలిసింది. కాలే డేటా వస్తే వారు చివరి ఫోన్ ఎవరికి చేశారు. ఏం మాట్లాడారు.. ఎప్పుడు మాట్లాడారు. అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసుల భావిస్తున్నారు. సహస్ర కాదు వినయశ్రీ... సత్యనారాయణరెడ్డి–రాధ దంపతులతోపాటు కూతురు వినయశ్రీ మృతి గురించి తెలియగానే బీడీఎస్ చదువుతున్న వినయశ్రీ స్నేహితులు బాధపడ్డారు. వినయశ్రీతోపాటు ఆమె తల్లిదండ్రుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే వినయశ్రీ ఫొటోపై సహస్ర అని ఉండడంతో కొంతమంది సహస్ర అని భావించారు. అన్ని ధ్రువపత్రాల్లో మాత్రం వినయశ్రీగానే పేరు నమోదై ఉంది. బంధువులు కూడా వియశ్రీగానే రికార్డుల్లో ఉందని, పూర్తిపేరు అదే అని నిర్ధారించారు. -
దేవికా రాణి చుట్టూ.. ఈడీ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది. ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్‌లో నిందితురాలైన దేవికా రాణి చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ.. దేవికారాణిని కస్టడీ కోరుతూ నేడు పిటిషన్ దాఖలు చేయనుంది. 200 కోట్ల వ్యవహారంలో దేవికారాణిని ఈడీ విచారించనుంది. అధికారంలో ఉండగా ఆమె పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఫార్మా కంపెనీలతో పాటు దేవికారాణి సొంతంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. షెల్ కంపెనీల ద్వారా దేవికా రాణి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికా రాణిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఐఎంఎస్ స్కామ్‌లో నిందితురాలైన ఆమె విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. ఏసీబీ వద్ద ఉన్న ఆస్తుల చిట్టా ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే దేవికా రాణిపై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. -
పెండింగ్ కేసుల్ని పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం హైకోర్టు నుంచి ఆయన అన్ని జిల్లాల జడ్జిలు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెరోపేరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) సర్వీసులను ప్రారంభించారు. ఐసీజేఎస్ సర్వీసులను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ విధానం ద్వారా క్రిమినల్ కేసుల విచారణ కూడా పూర్తి చేసి పెండింగ్ కేసుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
ప్రియాంక హత్య: ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు!
సాక్షి, హైదరాబాద్ : ప్రియాంకరెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేయించడానికి ఆమె కుటుంబీకులు బుధవారం అర్ధరాత్రి రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇది కేవలం వీరొక్కరికే కాదు... ఏటా అనేక మంది బాధితులకు ఎదురవుతున్న సమస్య. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం జ్యురిస్‌డిక్షన్‌లోకి (పరిధి) వచ్చే అంశాలను మాత్రమే కేసుగా నమోదు చేయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది ఇక్కడా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాల నేపథ్యంలో జరిగే మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రతి పోలీసు స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. దీన్ని విస్మరిస్తే చట్ట పరంగా అధికారులు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెప్తుంటారు. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. అప్పటికే సమస్య ఎదురైన, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని నష్టపోయిన బాధితులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగేలా చేస్తోంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికే ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానం అమలు చేస్తున్నారు. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్య కేటాయిస్తారు. ముంబైలో పరిధులు కాని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నెంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తున్నారు. 2014లో వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించిన ముంబై మోడల్‌పై అఘాయిత్యం కేసే దీనికి ఉదాహరణ. 2013 డిసెంబర్ 31న కొందరు దుండగులు కుట్రతో ముంబై మోడల్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. చదవండి : శంషాబాద్‌లో మరో ఘోరం స్ఫృహలో లేని స్థితిలో ఉన్న ఆమెను ముంబై పంపేశారు. అక్కడకు చేరుకున్న ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’తో కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ నేపథ్యలంలో ఉదంతం హైదరాబాద్‌లో జరిగినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు కేసును ఇక్కడకు బదిలీ చేశారు. దాదాపు ప్రతి ఉదంతంలోనూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేసి, సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేసే ఆస్కారం ఉంది. బాధితుడు ఠాణాకు వచ్చినప్పుడు పరిధులు పేరు చెప్పి తిప్పడం కంటే ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపడితే ఉత్తమం అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంక హత్య; అనేక ప్రశ్నలు ప్రియాంక హత్యపై స్పందించిన నిర్భయ తల్లి అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్ -
ఆర్టీసీ సమ్మె విచారణ రేపటికి వాయిదా
-
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ
-
ట్రంప్‌పై మళ్లీ అభిశంసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉంది. బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ట్రంప్ చర్యలన్నీ జాతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ డెమొక్రాట్లు వాదిస్తున్నారు. డెమొక్రాట్ ప్రజాప్రతినిధుల్ని కలుసుకొని చర్చించిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్‌పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అధ్యక్షుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని నాన్సీ అన్నారు. అభిశంసన ప్రక్రియపై ట్రంప్ స్పందించారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్‌పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది. పదవి నుంచి ఎలా తొలగిస్తారు ? అమెరికా అధ్యక్షుడిని గద్దె దింపాలంటే సెనేట్ అత్యంత కీలకం. సెనేట్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. గతంలో ఎదుర్కొన్నవారెవరు? అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు సభలో 60సార్లకు పైగా అభిశంసన ప్రక్రియ జరిగింది. -
ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!
ఢిల్లీ: తెలంగాణలోని గోదావరినదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నివేదికల్లో స్పష్టంమవుతోదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలించింది. అయితే సుమారు నాలుగు కోట్ల పది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా.. ఎలా తవ్వుతారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల్లో పూడికతీతలో భాగంగా ఇసుకను తీశామని తెలిపింది. కాగా అన్నారం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు పూరైనప్పటికీ.. వాటిలో పూడికతీత ఎలా సాధ్యమైందని నిలదీసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి చట్టం ఏర్పాటు చేయలేదా అని ఎన్జీటీ మండిపడింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
అన్యమత ప్రచారంపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టిమ్ రోల్స్ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లుపై రవాణా శాఖ విచారణ చేపట్టింది. టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే బస్ టికెట్ల టిమ్ రోల్స్ పంపిణీ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. నెల్లూరు డిపో నుంచి తిరుమలకు టిమ్ రోల్స్‌ను కాంట్రాక్టర్ సరఫరా చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ ఆర్టీసీ ద్వారా అన్యమత యాత్రా ప్రచారం జరగలేదని తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ టికెట్ల వెనుక ముద్రించి ఉన్నవి గత టీడీపీ ప్రభుత్వ పథకాల వివరాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిపోలలోని ఆర్టీసీ టికెట్ల వెనుక ఇవి ముద్రించి ఉన్నాయని, అలా గత ప్రభుత్వ పథకాలతో ముద్రించిన కొన్ని రోల్స్ తిరుమల డిపోకు వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వ పథకాల గురించి ముద్రించి ఉన్న టికెట్లను వెనక్కు పంపించి వేశామని తెలిపారు. -
కొనసాగుతున్న విచారణ
సాక్షి, కంకిపాడు(పెనమలూరు): బిస్కెట్ కంపెనీ గోదాములో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదం ఎలా జరిగింది? నష్టం ఎంత వాటిల్లింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ దిశగా విచారణ సాగిస్తున్నారు. మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడులో నిర్మించిన బ్రిటానియా బిస్కెట్ గోదాములో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించే లోపే మంటలు గోదామును చుట్టుముట్టి సర్వం బుగ్గిపాలైంది. గోదాము షట్టర్లకు తాళాలు ఉండటంతో ప్రమాద స్థాయి అధికంగా ఉండటంతో షట్టర్ల తాళాలు తీయటం సాధ్యం కాలేదు. దీంతో జేసీబీ సాయంతో గోదాము గోడలను ధ్వంసం చేయించారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గోదాములో నిల్వ చేసిన సరుకు బూడిదైంది. గోదాము రేకులు మంటల ధాటికి కాలిపోయాయి. ఆదివారం కూడా గోదాము నుంచి పొగ వెలువడింది. కొనసాగుతున్న విచారణ.. అగ్ని ప్రమాదం ఘటనపై అగ్నిమాపక శాఖ దర్యాప్తు సాగిస్తోంది. ప్రమాదం విద్యుత్ షార్టు సర్క్యూ వల్ల జరిగిందా? గోదాములో నిర్వహించిన వెల్డింగ్ పనులు వల్ల ఏర్పడిందా? మరేదైనా కారణమా? అన్న వివిధ కోణాల్లో ఆ శాఖ విచారణ చేస్తుంది. ఆదివారం కూడా ప్రమాదం జరగటానికి గల కారణాలు వెలుగులోకి రాలేదు. ప్రమాదంలో ఏర్పడ్డ నష్టం వివరాలు కూడా తేలలేదు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోకపోవటం, ప్రమాద నివారణ జాగ్రత్తలు చేపట్టకపోవటంతో అగ్నిప్రమాద స్థాయి, నష్ట తీవ్రత అధికంగా ఉన్నాయన్న వాదన అగ్నిమాపక శాఖలో వ్యక్తమవుతుంది. అన్ని అనుమతులు ఉన్నాయా? బ్రిటానియా కంపెనీ ఉత్పత్తులు నిల్వ చేసిన గోదాముకు పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా? అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవని ఆ శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ ఇప్పటికే వెల్లడించారు. మరో వైపు మే నెలలో గోదాములో సరుకు నిల్వ చేయటం ప్రారంభించారని తెలుస్తుంది. సీఆర్డీఏ నుంచి గోదాము నిర్మాణానికి అనుమతులు కోసం పంచాయతీని సంప్రదించారని, తరువాత పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక ఎన్వోసీ కోసం ఎలాంటి అనుమతి పత్రాలను ప్రొద్దుటూరు పంచాయతీకి అప్పగించలేదని సమాచారం. కనీసం అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రమాద నివారణకు సైతం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల నష్టం భారీగా సంభవించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ విషయమై ప్రొద్దుటూరు పంచాయతీ పూర్వ కార్యదర్శి శివకృష్ణను వివరణ కోరగా, సీఆర్డీఏ అనుమతులు కోసం పంచాయతీని సంప్రదిస్తే అందుకు అవసరమైన తీర్మానం ఇచ్చామన్నారు. అయితే పూర్తి అనుమతులకు సంబంధించి ఎలాంటి ప్రతులు తమకు అందలేదన్నారు. అనుమతి పత్రాలు, పన్నుల విధింపులకు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా స్పందించలేదన్నారు. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్‌గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్‌కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్‌ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్‌పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
బ్రేకింగ్ తీర్పు
నిజం గడపదాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగొస్తుందట!చలనం చెప్పులేసుకొనే లోపలే సంచలనం భూభ్రమణం చేసేస్తుందట!న్యాయానికి కళ్లుండవు... మీడియాకు కళ్లెం ఉండదు!న్యాయం ్రçప్రభవించే లోపలే నిందితుడు నేరస్థుడైపోతాడు!జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్...చివరకు జైలు నుంచి మనిషిని బయటకు తేవచ్చు కానిమనిషిలోంచి జైలును బయటకు తేలేం కదా!సమాజం ఇచ్చే బ్రేకింగ్ తీర్పులో ఉండే క్రైమ్...క్రిమినల్ జస్టిస్!! ఆదిత్య శర్మ.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి.. ఏంబీఏకు ప్రిపేర్ అవుతున్న మధ్యతరగతి యువకుడు. ఫుట్‌బాల్ ప్లేయర్. అమ్మా, నాన్న, అక్క, బావ.. అతని కుటుంబం. అమ్మ, నాన్న కిరాణా షాప్ నడిపిస్తుంటారు. అక్క స్టార్ హోటల్లో ఫ్రంటాఫీస్ ఎంప్లాయ్. బావ.. బ్యాంక్ లోన్‌తో కారు కొనుక్కొని క్యాబ్ రన్ చేస్తుంటాడు. ఆ రోజు.. ఆదిత్యశర్మ వాళ్ల జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ గెలుస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ రాత్రి పార్టీ చేసుకోవాలనుకుంటారు. ఆ రోజే ఆదిత్య వాళ్ల అక్క పెళ్లిరోజు. ఆమె ప్రెగ్నెంట్ అనే శుభవార్తా తెలుస్తుంది ఆదిత్యకు. ఆ సంతోషంతోనే రెడీ అయ్యి పార్టీకి వెళ్లబోతున్న ఆదిత్యను ‘‘నీ పార్టీకి ఇంకా టైమ్ ఉంది కదా.. రెండుమూడు రైడ్స్ చేసి పార్టీకి వెళ్లవా?’’ అంటూ బతిమాలుతుంది అక్క. కాదనలేక సరే అని రైడ్‌కి వెళ్తాడు. ఆ రాత్రి.. రైడ్స్ కంప్లీట్ చేసేసి పార్టీకి టర్న్ అవుతూండగా పొరపాటున ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేస్తాడు ఆదిత్య. పికప్ చేసుకోలేను రైడ్ క్యాన్సల్ చేయమని ఆ ప్యాసెంజర్ని రిక్వెస్ట్ చేసి పక్కనే ఉన్న మెడికల్షాప్కి వెళ్తాడు. వచ్చేటప్పటికి వెనకసీట్లో ఓ అమ్మాయి కూర్చుని ఉంటుంది. ఆమె పేరు సనాయా. ఆశ్చర్చపోయి ‘‘ఎవరు మీరు’’ అని అడుగుతాడు. ఇందాక రైడ్ బుక్ చేసింది తనే అని చెప్తుంది ఆమె. క్యాన్సిల్ చేయమన్నాను కదా అని ఆదిత్య అంటున్నా వినకుండా డెస్టినేషన్‌లో డ్రాప్ చేయమని దబాయిస్తుంది. కార్లో వెళ్తున్నంత సేపూ టెన్షన్‌గా ఫోన్లో అరుస్తూ.. మాటిమాటికి డెస్టినేషన్స్ మారుస్తూ ఆదిత్యకు చిరాకు తెప్పిస్తుంది. అయినా ఓపిగ్గానే∙ గమ్యానికి చేరుస్తాడు. దిగకుండా అక్కడి నుంచి మళ్లీ ఇంకో డెస్టినేషన్ సెట్ చేస్తుంది. తీసుకెళ్లకపోతే కంప్లయింట్ చేస్తానని బెదిరిస్తుంది. కామ్‌గా ఆమె చెప్పిన అడ్రస్‌కు డ్రైవ్ చేస్తాడు. టెన్షన్ తగ్గి నార్మల్ అయ్యాక అతనితో మాట కలుపుతుంది. అతనిని ఇబ్బంది పెట్టినందుకు నొచ్చుకుంటుంది. గమ్యం వచ్చాక థ్యాంక్స్ చెప్పి దిగి వెళ్లిపోతుంది ఆమె. ఆదిత్య కూడా పార్టీకి చేరుకోవాలనే తొందరలో కారు స్పీడ్ పెంచుతాడు. ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర వెనక సీట్లోంచి ఏదో కిందపడ్డ చప్పుడు వినపడి చూస్తాడు. ఫోన్ కనపడుతుంది. రివర్స్ చేసుకొని మళ్లీ ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ ఇస్తాడు. లోపలికి రండి అంటూ ఇన్సిస్ట్ చేస్తుంది. తటపటాయిస్తూనే వెళ్తాడు ఆదిత్య. త్వరగానే మచ్చికవుతారు. డ్రింక్స్ తీసుకుంటారు. వంటింట్లో కూరగాయల కత్తితో ఆమె ఓ ఆట నేర్పిస్తుంది అతనికి. ఆ ఆటలో గురి తప్పి ఆమెకు గాయం చేస్తాడు అతను. గాబరాపడ్తాడు. బాధపడ్తాడు. చనువు పెరుగుతుంది. ఇద్దరూ బెడ్రూమ్లోకి వెళ్తారు. మత్తు వదిలి మెలకువ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాడు ఆదిత్య. అప్పటికే మధ్య రాత్రి దాటుంటుంది. గబగబా బట్టలు వేసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. వీడ్కోలు చెబ్దామని ఆమెను కదపబోతుంటే వీపు మీద విచక్షణారహితంగా పొడిచిన కత్తిగాట్లతో రక్తం మడుగులో ఉంటుంది. భయంతో అక్కడి నుంచి పారిపోబోతూ అంతకుముందు ఆడుకున్న కత్తిని కడిగి జర్కిన్‌లో పెట్టుకుంటాడు. నేల మీద తనకు కనిపించిన రక్తపు మరకల్నీ శుభ్రం చేసి కిందకు పరిగెడ్తాడు. ఆ కంగారులో పార్కింగ్‌లో కార్ కీ పడిపోతుంది. గమనించుకోకుండా కార్ దగ్గరకు వెళ్లి డోర్ లాగుతాడు. సెన్సార్ మోగుతుంది. ఆ చప్పుడికి పక్కింటి వ్యక్తి కిటికీలోంచి ఆదిత్యను చూస్తాడు. ఆదిత్య మళ్లీ వెనక్కి వచ్చి పార్కింగ్‌లో కీ తీసుకొని కార్లో వెళ్లిపోతాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ చేస్తాడు. పోలీసులొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కింద స్టేషన్లో కూర్చోబెడ్తారు. ఈలోపు ఆదిత్యను చూసిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇస్తాడు మర్డర్ అయిందని. తర్వాత? పోలీస్ ఎంక్వయిరీలో భాగంగా స్టేషన్‌కు వచ్చిన ఆ పక్కింటి వ్యక్తి అక్కడ ఆదిత్యను చూసి హత్య చేసింది అతనే అని పోలీసులకు చెప్తాడు. ఆదిత్యను తనిఖీ చేసిన పోలీసులకు అతని దగ్గర కత్తి దొరుకుతుంది. కేస్ నమోదవుతుంది. మీడియా ఎంట్రెన్స్ రైడ్ మొదలు అతను ఆమె ఇంటికి వెళ్లడం, క్రైమ్ సీన్.. కత్తి.. అన్నీ ఆదిత్యను నేరస్థుడిగా చూపిస్తుంటాయి. డ్రింక్స్ తీసుకుని బెడ్రూమ్కి వెళ్లిన తను మెలకువ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా ఉన్నాడో? ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాదు. ఆ రాత్రి ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ కోసం సబ్ ఇన్స్పెక్టర్ నామ్‌దేవ్ పిలిస్తే వచ్చిన మాధవ్ మిశ్రా అనే లాయర్.. అది మర్డర్ కేస్‌గా టర్న్ అయ్యాక ఆదిత్య తరపున వాదించాలనుకుంటాడు. ఆదిత్యకు పరిచయం చేసుకొని కేస్ టేకప్ చేస్తానని భరోసా కూడా ఇస్తాడు. కొడుకు మర్డర్ కేస్‌లో ఇరుక్కొనేసరికి కుప్పకూలి పోయిన ఆదిత్య తల్లిదండ్రులు, సోదరికీ ధైర్యం చెప్తాడు మాధవ్. ఈలోపు మీడియా సంచలనం చేయడం మొదలుపెడ్తుంది. క్యాబ్‌డ్రైవర్ ఓ లేడీ ప్యాసెంజర్‌ను రేప్ చేసి, దారుణంగా చంపాడంటూ కథనాలు.. మానసిక విశ్లేషకులతో ప్యానల్ డిస్కషన్స్‌తో. ఇవి చూసిన క్యాబ్ కంపెనీ తమ క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి ఇందినా మథుర్ అనే పేరున్న లాయర్‌ను హైర్ చేసుకొని ఆదిత్య తరపున వాదించడానికి పంపిస్తుంది. అయితే ఆదిత్యకు బెయిల్ నిరాకరిస్తుంది కోర్ట్. మాధవ్ మిశ్రాకు మాత్రం ఆదిత్య ఎరక్కపోయి ఇరుక్కున్న అమాయకుడిగానే కనిపిస్తూంటాడు. ఆ దిశగానే ఆ కేస్ పరిశోధనలో పడ్తాడు అతను. కాని ఆదిత్యే నేరస్థుడని నిర్ధారణకు వచ్చేసిన ఇన్స్పెక్టర్కు మాధవ్ ఎంక్వయిరీ అంతా దోషిని విడిపించే ట్రయల్‌గా తోస్తుంది. అదేం లెక్క చేయక ఎస్ఐ నామ్దేవ్కి లంచం ఇస్తూ పరిశోధన సాగిస్తూనే ఉంటాడు మాధవ్. అక్కను.. అమ్మను.. ఆదిత్య కేసు వాదనలను వింటున్న మహిళా జడ్జి నేరం రుజువు కానిదే ఆదిత్యను దోషి అనడాన్ని ఖండిస్తూ ఉంటే మీడియా మాత్రం తన ప్రసారాల్లో ఆదిత్యను నేరస్థుడిగానే ప్రచారం చేస్తూంటుంది. ఆదిత్య సోదరిని, తల్లిని మిస్ లీడ్ చేసి.. ఎడిటింగ్ గిమ్మిక్కులతో వాళ్లతోనే అతనిని అపరాధిగా చెప్పిస్తుంది. దీనివల్ల ఆ కుటుంబం వీధికెక్కుతుంది. జైల్లో.. దొమ్మీలు, గ్యాంగ్ వార్స్, డ్రగ్స్, సెల్ ఫోన్ల స్మగ్లింగ్స్తో అండర్ వరల్డ్‌ను తలపిస్తున్న జైలును చూసి షాక్ అవుతాడు ఆదిత్య. ముస్తఫా, లాయక్ అనే ఇద్దరు కరడు గట్టిన ఖైదీల మధ్య శాండ్విచ్ అవుతాడు. ఆ జైల్ ముస్తఫా ఆధిపత్యంలో ఉంటుంది. అయిదు లక్షలు ఇస్తే లాయక్ నుంచి రక్షణ కల్పిస్తానని చెప్తాడు ముస్తఫా. అతనిచ్చిన ఫోన్‌తోనే వాళ్లక్కకు కాల్చేసి అయిదు లక్షలు సర్దమంటాడు ఆదిత్య. భర్తకు తెలియకుండా అయిదు లక్షలు పంపుతుంది ఆమె. కార్ ఈఎమ్ఐలు కట్టకుండా తమ్ముడికి డబ్బు సర్దిందని తెలిసీ ఆమెతో గొడవపెట్టుకుంటాడు భర్త. తమ్ముడు మర్డరర్, అక్క దొంగ అంటూ నిందలేస్తాడు. ఇటు జైల్లో ఆదిత్యకు బాసటగా ఉంటూనే అతని చేత డ్రగ్స్‌ను స్మగుల్ చేయిస్తుంటాడు ముస్తఫా. ఈ విషయాన్ని మాధవ్ పసిగట్టి జాగ్రత్త అంటూ ఆదిత్యను హెచ్చరిస్తాడు. యావజ్జీవ కారాగారం.. ఇందిరా మాథుర్ తన వాదనతో ఆదిత్య రేప్ చేయలేదని మాత్రం నిరూపించగలుగుతుంది కాని హత్య చేయలేదనడానికి కావల్సిన సాక్ష్యాలను సంపాదించలేకపోతుంది. అవి కూడా మాధవ్ మిశ్రా సంపాదించినవే. నిర్దోషి అని రుజువు చేయడానికి ఆధారాల్లేవ్ కాబట్టి గిల్టీగా ఒప్పుకోమని ఆదిత్య మీద ఒత్తిడి తెస్తుంది ఇందిరా. అంతకుముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో ఒప్పందానికి వచ్చి. సందిగ్ధంలో పడ్తాడు ఆదిత్య. ఇందిర అసిస్టెంట్ సలహా మేరకు నాట్ గిల్టీ అనే చెప్తాడు జడ్జి ముందు. ఆ నిర్ణయానికి కోపం తెచ్చుకున్న ఇందిర ఆ కేస్‌ను తప్పుకొని అసిస్టెంట్‌కు ఇస్తుంది. మాధవ్ మిశ్రా సలహా, సహకారంతో కేస్ టేకప్ చేస్తుంది కాని ఓడిపోతుంది ఆ అసిస్టెంట్. హత్యానేరం కింద ఆదిత్యకు యావజ్జీవిత కారాగార శిక్ష పడ్తుంది. ఆ తీర్పు రోజే వాళ్లక్క డెలివరీ అవుతుంది. మగపిల్లాడు పుడతాడు. మరోవైపు జైలు వాసం తప్పదని తెలిసిన ఆదిత్య దానికి అలవాటు పడిపోతాడు. ముస్తఫాకు రైట్ హ్యాండ్‌గా మారుతాడు. లాయక్ పీచమణిచే నాయకుడిగా ఎదుగుతాడు. అసలు నేరస్థులు.. ఇంకోవైపు చనిపోయిన సనయా గురించి ఆరా తీస్తుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్తుంటాయి మాధవ్ మిశ్రాకు. ఒకప్పుడు సనాయా డ్రగ్ ఎడిక్ట్. తన సవతి తండ్రి స్నేహితుడు నడిపే డీ ఎడిక్షన్ సెంటర్లో చేరి ఆరోగ్యవంతురాలవుతుంది. తర్వాత న్యూయార్క్ వెళ్తుంది. కొన్నాళ్లకు తిరిగొచ్చి ఆ డీ ఎడిక్షన్ సెంటర్లోనే వలంటీర్‌గా చేరుతుంది. స్లమ్స్‌లోని పిల్లలకూ ఆ సెంటర్ ఫ్రీ ట్రీట్మెంట్.. చదువు.. బట్టలు ఇప్పిస్తూంటుంది. ఆ పిల్లల పట్ల సనాయా చాలా శ్రద్ధ తీసుకుంటూంటుంది. అయితే ఆమె హత్య జరిగేకంటే కొన్ని గంటల ముందు ఆ సెంటర్‌కు సంబంధించి ఓ ఘోరమైన నిజం తెలుస్తుంది ఆమెకు.. ఆ పిల్లలతో తన తండ్రి స్నేహితుడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నాడని. హతాశురాలై ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఆ నిర్వాహకుడిని బెదిరిస్తుంది. ఆ నిర్వాహకుడి భార్య కూడా సెంటర్ నిర్వహణలో భాగస్వామే. సనాయాకు నిజం తెలిసిందని ఆమెకూ అర్థమవుతుంది. ఇదంతా మాధవ్ మిశ్రా ఆరా తీస్తాడు. వీటితో కేస్‌ను అనఫీషియల్‌గా రీ ఓపెన్ చేయమని ఇన్స్పెక్టర్ను కోరుతాడు. కన్విన్స్ అయిన ఇన్స్పెక్టర్ ఓకే అంటాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్, క్రైమ్ సీన్ ఎవిడెన్సెస్ రీ చెక్ చేస్తారు. చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఎలిగేషన్ మీద ఆ ఇద్దరినీ స్టేషన్‌కు రప్పించి ఇంటారగేషన్ చేస్తాడు. సనాయాను చంపింది తనే అని ఒప్పుకుటుంది డీ ఎడిక్షన్ సెంటర్ ఓనర్ భార్య. అంటే సనాయా సవతి తండ్రి స్నేహితుడి భార్య. నిర్దోషిగా విడుదలవుతాడు ఆదిత్య. మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి, ఆదిత్యగా విక్రాంత్ మస్సే, ఇందిరా మాథుర్గా మీతా వశిష్ట్, ముస్తఫాగా జాకీ ష్రాఫ్ నటించారు. సరస్వతి రమ -
ఆ డబ్బు ఎవరిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు – కోట్లు’కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డబ్బు ఎక్కడ నుంచి వచ్చిం దన్న విషయంపై టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి ఆయన కుమారులను ఈడీ విచారించిన సం గతి తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ విచారణకు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందే తయారు చేసిన ప్రశ్నల జాబితా(బ్యాంకు స్టేట్మెంట్లు, ఏసీబీ ఇచ్చిన అధారాలు)ను ఆయన ముందుంచి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసిం ది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచంగా ఇవ్వజూపిన రూ.50 లక్షలను మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేరవేసారని ఉదయసింహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ వీడియోలో త్వరలోనే మరో రూ.4.5 కోట్లు ఇస్తామని రేవంత్ చెప్పారు. మిగతా నగదు ఎవరు ఇచ్చేవారని ప్రశ్నించి నట్లు సమాచారం. దీనిపై తొలుత పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ఉదయ సింహ నుంచి తరువాత విచారణలో పలు కీలక అంశాలు ఈడీ డైరెక్టర్ రాజశేఖర్ బృందం రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 9 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ.. 2015 మేలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచంగా ఎరవేశారు. ముందస్తు సమాచారంతో మాటువేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,సెబాస్టియన్, ఉదయసింహా, మత్తయ్యలపై ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదా జరిపిన సంగతి తెలిసిందే. తరువాత ఈకేసును ఏసీబీ అధికారులు ఈడీకి బదిలీ చేశారు . ఈ కేసులో మత్తయ్య, సెబాస్టియన్, ఉదయసింహా, రేవంత్‌రెడ్డితోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి అతని కుమారులను కూడా ఈడీ విచారించింది. నేడు ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి ఈ కేసులో ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. 19న విచారణకు రావాలంటూ రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన ప్రశ్నావళిని ఈడీ అధికారులు ముందే సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా ఉదయసింహా, వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తొలి నుంచి రేవంత్‌రెడ్డి అన్నీ తానై నడిపించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, స్టీఫెన్సన్లనూ విచారణకు రావాలని ఈడీ పిలిచే అవకాశముంది. -
మళ్లీ ఈడీ ముందుకు వాద్రా
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు వాద్రాను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండు రోజు విచారణకు పిలిచింది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. బికనీర్ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా ఈ నెల 12న జైపూర్‌లో మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మరో కేసులో కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్‌నగర్ హౌజ్ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా, 11.25 గంటలకు వాద్రా వచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాల్యాతో తల్వార్‌కు సంబంధాలు: ఈడీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో కార్పొరేట్ మధ్యవర్తి దీపక్ తల్వార్‌కు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. విదేశాల్లో ఉన్న తల్వార్ కొడుకు ఫిబ్రవరి 11న తమ ముందు విచారణకు హాజరవుతున్నారని, ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని వెల్లడించింది. తల్వార్ కస్టడీని వారం పాటు పొడిగించాలని కోరగా కోర్టు ఫిబ్రవరి 12 వరకు అనుమతిచ్చింది. -
ఈడీ విచారణకు వాద్రా
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విదేశాల్లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తన న్యాయవాదులతో కలిసి వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదున్నర గంటలపాటు వాద్రాను విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. రేపు ఉదయం 10.30కి మళ్లీ విచారణకు రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు. అంతకుముందు వాద్రా మాట్లాడుతూ తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది. ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. నా కుటుంబం వెంటే ఉంటా: ప్రియాంక భర్త వాద్రాకు తోడుగా ఈడీ కార్యాలయం వరకు ప్రియాంక వచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మీరు బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో ఏదైనా రాజకీయ సందేశం పంపడానికే మీరు ఇక్కడకు వచ్చారా?’ అని మీడియా ప్రియాంకను ప్రశ్నించగా ‘ఆయన నా భర్త. ఆయనే నా కుటుంబం. నేను నా కుటుంబానికి మద్దతుగా ఉంటాను’ అని ఆమె చెప్పారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఇది జరుగుతోందా అన్న ప్రశ్నకు ‘ఇదంతా ఎందుకు జరుగుతోందో అందరికీ తెలుసు’ అని ఆమె బదులిచ్చారు. బెంగాల్ సీఎం మమత కాంగ్రెస్ పక్షాన నిలుస్తూ, ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కావాలనే ఆరోపించారు. వాద్రాను కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని స్థానిక కాంగ్రెస్ నేత, ఈ కేసులో ఇంతకుముందే ఈడీ విచారణను ఎదుర్కొన్న జగదీశ్ శర్మ అన్నారు. మరో హవాలా కేసుకు సంబంధించి ఈ నెల 12న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా రాజస్తాన్ హైకోర్టు గతంలో వాద్రాను ఆదేశించింది. కాగా, వాద్రాకు సన్నిహితుడు, ఆయనకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పీలో ఉద్యోగి మనోజ్ అరోరాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ కోర్టు ఈ నెల 16 వరకు పొడిగించింది. పెట్రోలియం, రక్షణ ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు: బీజేపీ వాద్రా ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీజేపీ ఆయనపై బుధవారం పలు ఆరోపణలు చేసింది. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో పెట్రోలియం, రక్షణకు సంబంధించిన ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు అందాయని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ ‘2008–09 కాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అందిన ముడుపులతో వాద్రా లండన్‌లో 8 నుంచి 9 స్థిరాస్తులు కొన్నారు’ అని పేర్కొన్నారు. ‘రోడ్ల వెంట తిరిగే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి సూత్రం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అవినీతికి పాల్పడటమే. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో ప్రతి ఒక్కరూ బెయిల్‌పై బయటే ఉన్నారని అందరికీ తెల్సు. అవినీతి ముఠాకు, పారదర్శక మోదీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమే 2019 లోక్‌సభ ఎన్నికలు’ అని అన్నారు. విధుల్లో ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించనున్నారు. భర్త వాద్రాను ఈడీ ఆఫీస్ వద్ద దించిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలను చేపట్టారు. తర్వాత కార్యకర్తలతో మాట్లాడారు. ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె అన్న, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గత నెలలో నియమించడం తెల్సిందే. ప్రియాంక పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారమే తన తొలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహ రచనకు రాహుల్ అధ్యక్షతన అందరు ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్–చార్జ్‌లతో ఈ సమావేశం జరగనుంది. -
ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసు విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు వాయిదావేసింది. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా అప్పటి ఎమ్యెల్యే స్టీఫెన్సన్కు కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు తొలగించడాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2016లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. అయితే ఏసీబీ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహ గత విచారణ సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరేన్ రావల్ ఆనాడు వాదించారు. దీనిపై ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థలూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు రాగా ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రాతన మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని సమాచారం పంపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా రెండు వారాలు తాను అందుబాటులో ఉండటం లేదని నివేదించగా ధర్మాసనం నాలుగు వారాలపాటు విచారణను వాయిదావేసింది. నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: మత్తయ్య ఓటుకు కోట్లు కేసులో తనను ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. దీనిపై త్వరలో ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో తన వాదనలు తానే వినిపించుకునే అవ కాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తనను నిందితుడిగా చేర్చగా హైకోర్టు చార్జ్‌షీట్ నుంచి తన పేరును తొలగించిందని, దీనిని ఏసీబీ సవాల్ చేసిందని వివరించారు. న్యాయస్థానం తన తరఫున వాదనలు వినిపించేందుకు వీలుగా అమికస్ క్యూరీని నియమించిందని, కానీ లోపలికి వెళ్లేందుకు తనకు పాస్ దొరకకుండా చేశారన్నారు. -
సీవీసీ చౌదరిపై చర్య తీసుకోలేకపోయాం
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)పై వచ్చే అవినీతి ఆరోపణల విచారణకు అవసరమైన మార్గదర్శకాలు ఇంకా రూపొందలేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. అందుకే సీవీసీ కేవీ చౌదరిపై గతేడాది అందిన రెండు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని స్పష్టం చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా జనవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ.. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ కమిషనర్ విషయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కేంద్ర చీఫ్ విజిలెన్స్ కమిషనర్, ఇతర కమిషర్ల విషయంలో కానీ అవినీతి, చెడు ప్రవర్తన ఆరోపణలు వస్తే దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి మార్గదర్శకాలు లేవు’అని సమాచార హక్కు చట్టం కింద ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సంజీవ్ చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సమాధానం ఇచ్చింది. ఎయిమ్స్‌లో జరిగిన అవినీతి కేసులను మూసివేయాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరీ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు అక్రమంగా సిఫారసు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా 2017లో రాష్ట్రపతికి సంజీవ్ లేఖలు రాశారు. ఎయిమ్స్‌లో సీనియర్ అధికారుల ప్రమేయం ఉన్న అవినీతి కేసును అధికారులు మూసేశారని సంజీవ్ ఆరోపించారు. ఈ మేరకు దాదాపు వెయ్యి పేజీల పత్రాలను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. -
‘నా భర్తను చంపుకుంటే నాకేం వస్తుంది.. ఎలా బతుకుతా’
అతడు : నా బొట్టు చెరిపేసే సమయం వచ్చింది. ఆమె : ఆ పని నా చేతుల మీదుగా చేస్తాను. అతడు : అప్పుడు నేను ఇంటి నుంచి బయటపడతాను. ఆమె : అప్పుడు నిన్ను నాదాన్ని చేసుకుంటాను. పోలీసులు ఈ సంభాషణ చదివి కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆగస్టు 26, 2017. ఉదయం. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం. ఏరియా ఆస్పత్రిలో పోలీసులు అడుగుపెట్టే సరికి పెద్ద హడావుడిగా ఉంది. చిన్న ఊరు కనుక సంబంధం ఉన్నవాళ్లు లేనివాళ్లు కూడా పోగై ఉన్నారు. లోపల ఒక మనిషి చావుబతుకుల మధ్య ఉన్నాడు. పోతే? అని ఒక డిస్కషన్. పోయాడేమో అని మరో డిస్కషన్.పోలీసులు ఎమర్జెన్సీ చేరుకునేసరికి ఒకామె తల బాదుకుంటూ ఎదురొచ్చింది. ‘సార్... మీరైనా చెప్పండి... ఇప్పటి దాకా డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలెట్టలేదు. నా భర్త చావుబతుకుల్లో ఉన్నాడు’... ఎస్.ఐ ఆమెను దాటుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. ఇలాంటి సమయంలో పక్కకు వెళ్లి మాట్లాడటం మామూలే కనుక డాక్టర్ నోరు తెరిచి ఏమీ చెప్పకముందే అతనితో పాటు పక్కకు వెళ్లి నిలబడ్డాడు.‘సర్... నా పేరు డాక్టర్ రఘు. ఇతని పేరు రాకేష్. నోటి నుంచి రక్తం కారుతుందని తీసుకొచ్చారు. కాని టెస్ట్ చేస్తే మూడు – నాలుగు గంటల ముందే చనిపోయాడని అనిపిస్తోంది. ఈ విషయం వాళ్లకు చెప్పడానికన్నా ముందు మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను’ అన్నాడతను. ఎస్.ఐ ఊపిరి పీల్చుకున్నాడు.ఇద్దరూ కలిసి రాకేష్ భార్య దగ్గరకు చేరారు.‘అతను చనిపోయాడమ్మా’ డాక్టర్ చెప్పాడు.ఆ మాట వినడంతోటే అతని భార్య స్పృహ తప్పి పడిపోయింది.రాకేష్ అనే వ్యక్తి చనిపోయాడు.ఎలా చనిపోయాడు? గుండెపోటు వచ్చిందని కొందరు అంటుంటే, ఆత్మహత్య అని కొందరు లేదు ఎవరో హత్య చేసి ఉంటారని మరికొందరు.రాకేష్ మృతదేహాన్ని ఎస్సై, సీఐలు పరిశీలించారు. చేతి మీద చాలా చిన్నదిగా ఉన్న గాయం మినహా మరెక్కడా గాయాల ఆనవాళ్లు లేవు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ‘బలవంతంగా ఊపిరాడకుండా చేయడం వల్ల జరిగిన హత్యగా అనుమానించాల్సి వస్తోంది’ అని ఉంది అందులో.అయితే అలా ఎవరు చేసి ఉంటారు? రాకేష్ భార్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. అలాంటి సమయంలో ఆమెను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని పోలీసులు భావించారు. అయినా వారిపనిలో వారు పడ్డారు. రాకేష్ నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌కి చేరుకున్నారు. ఆ ఫ్లాట్‌లోకి ఎవరూ రాకుండా అప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్.ఐ రాకేష్ బెడ్ రూంను నిశితంగా పరిశీలించాడు.క్లూస్ టీం వచ్చింది. అయినా ఏమీ దొరకలేదు.‘రాకేష్ ఎలాంటివాడు?’ స్నేహితులను ఆరాతీశారు.‘బజారులో అతనికి ఒక షాప్ ఉంది సార్. అందులో కూచుని ఫైనాన్స్ చేస్తుంటాడు. చిన్న చిన్న మొత్తాలే. అప్పులేమీ లేవు. భార్యతో కూడాగొడవలులేవు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. ఫేస్బుక్ చూసే పిచ్చి ఉంది. ఇరవై నాలుగ్గంటలు అందులో ఉంటాడు’ అన్నారు వాళ్లు.ఫేస్బుక్లో అతని వాల్ మీదకు వెళ్లి చూశారు పోలీసులు.ఇంటి ఫొటోలు, భార్య ఫొటోలు, పిల్లల ఫొటోలు ఇలాంటివే తప్ప పెద్దగా అనుమానించాల్సింది ఏమీ కనిపించలేదు.ఫేస్బుక్ ఫ్రెండ్షిప్స్ ఈ మధ్య ప్రమాదాలు తెస్తున్నాయి. అలాంటి పరిచయం ఏమైనా ఈ సంఘటనకు కారణమా అనేది చూశారు. ఏమీ దొరకలేదు.కేసు ఎలా సాల్వ్ చేయాలి? రాకేష్ చనిపోయి 11 రోజులు గడిచిపోయాయి.ఇక భార్యతో మాట్లాడవచ్చని అతని భార్యను పిలిపించారు.‘సార్... నా పేరు రమ్య. రాకేష్ అంటే నాకు ప్రాణం. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన బయటకు వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లడం మామూలే. అలా వెళ్లి లేటుగా వస్తుంటాడు. ఆ రోజు కూడా ఇంచుమించు ఒంటి గంటకు ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు టీ కావాలని అడిగితే ఇచ్చాను. అది తాగకుండానే కడుపులో నొప్పి అని వెళ్లి పడుకున్నాడు. ట్యాబ్లెట్ ఇవ్వనా అని అడిగితే వద్దన్నాడు. ఉదయం పిల్లలను స్కూల్‌కు రెడీ చేసేందుకు లేచి చూస్తే ఆయన నోట్లోంచి రక్తం వస్తున్నట్టు కనిపించింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే ఇంటి చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చాను’ ఏడుస్తూ చెప్పింది రమ్య. ‘మీ ఫోన్ హ్యాండొవర్ చేసి వెళ్లండి’ అన్నాడు ఎస్.ఐ.ఆమె సంకోచం లేకుండా దానిని ఇచ్చేసి వెళ్లింది.రమ్య కాల్‌డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఆమె వాట్సప్‌ను చెక్ చేశారు. అనుమానించాల్సింది ఏమీ కనిపించలేదు.రాకేష్ మృతి వెనుక ఆమె హస్తం ఉన్నట్టయితే ఒక్కత్తే ఆమె అతణ్ణి చంపే అవకాశం లేదు. ఎవరితోడో కావాలి. కావాలంటే ఎవరితో ఒకరితో ఏదో ఒక పద్ధతిలో మాట్లాడాలి. కాని ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అది చిన్న ఊరు.అపార్ట్‌మెంట్‌కు సిసి కెమెరాల ఏర్పాటు లేదు. కేసును ఛేదించడం ఎలా? రమ్యను మళ్లీ పిలిపించాడు ఎస్.ఐ.‘రమ్యా... ఎలా చూసినా ఈ చావు వెనుక మీ హస్తం ఉన్నట్టు కనపడుతోంది. ఏం జరిగిందో నిజం చెప్పండి’ రమ్య మళ్లీ బోరుమంది. ‘నాకేం తెలుసు సార్! నా భర్తను చంపుకుంటే నాకేం వస్తుంది. నేను ఎలా బతుకుదామని’.... ఏడుస్తూనే ఉంది.ఎస్.ఐ ఆ రోజు వేరే ఏ పనీ పెట్టుకోలేదు.మళ్లీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లాడు.రాకేష్ వాల్ మీదకు వెళ్లి అన్ని ఫొటోలు చూడటం మొదలెట్టాడు. రెండు మూడు చోట్ల రాకేష్‌తో పాటు మరో అతను కూడా ఫొటోల్లో ఉన్నాడు. ఒక ఫొటోలో రాకేష్, రమ్య, ఆ మూడో వ్యక్తి ఉన్నారు. క్యాజువల్‌గా దిగిన ఫొటోయేగాని రమ్య బాడీ లాంగ్వేజ్‌ను బట్టి ఆ మూడో వ్యక్తికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. రాకేష్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో అతను ఉన్నాడు. పేరు కిశోర్. రమ్య కూడా ఉంది. వెంటనే ఎస్.ఐ రమ్య వాల్ మీదకు వెళ్లి చూశాడు. పెద్దగా ఏమీ కనిపించలేదు.జానకి రామ్ వాల్ మీదకు వెళ్లి చూశాడు. అక్కడా ఏమీ కనిపించలేదు.కాని ఏదో ఉందని అనిపించింది.ఈ ఇద్దరి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ల మీద ఇంకేమైనా ఫేస్బుక్ అకౌంట్లు ఉండొచ్చా అనే అనుమానం వచ్చింది ఎస్.ఐ.కి. వెంటనే టెక్నికల్ టీమ్‌కు ఆ పని అప్పగించాడు. సరిగ్గా రెండు మూడు గంటల్లోనే రిజల్ట్స్‌తో వచ్చాడు కానిస్టేబుల్.‘ఏమైంది?’ ఎస్.ఐ అడిగాడు.‘ఇద్దరికీ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి సార్.కానీ...’‘కానీ..’‘ఆమె అబ్బాయి పేరుతో అకౌంట్ ఓపెన్ చేసింది. అతడు అమ్మాయి పేరుతో ఓపెన్ చేశాడు. బహుశా వాళ్లిద్దరూ మెసెంజర్లో మాట్లాడుకుంటూ హత్యకు ప్లాన్ చేసి ఉంటారు’ఎస్.ఐ నిమిషం ఆలస్యం చేయలేదు.వెంటనే రమ్య ఇంటికి వెళ్లి ఆమె ఫోన్ హ్యాండోవర్ చేసుకున్నాడు. అందులో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ‘నిఖిల్’ పేరుతో ఓపెన్ అయ్యింది.ఎస్.ఐ రమ్యను అరెస్ట్ చేశాడు.‘ఏంటయ్యా.. ఇది. చాలా సింపుల్‌గా అనిపిస్తోంది. కానీ, క్రిటికల్‌గానూ ఉంది. ఎవరు హత్య చేసి ఉండచ్చు..’ కానిస్టేబుల్‌తో మాట్లాడుతున్న సీఐ ఫోన్లో ఫేస్‌బుక్‌ని ఓపెన్ చేశాడు. ‘నిఖిల్ అకౌంట్..’ అని ఉంది. ‘ఏంటిదీ..??’ అనుకుంటూ మెసెంజర్‌లోకి వెళ్లి వచ్చిన మెసేజ్‌లను చూస్తున్నాడు. ఒక మెసేజ్ చూసిన సీఐ భృకుటి ముడిపడింది. ఆ తర్వాత వరుసగా ఉన్న మెసేజ్‌లను చదివాడు.అంతే, పోలీసు జీపు రయ్యిమంటూ రాకేష్ ఇంటికి వెళ్లింది. 15 ఏళ్ల క్రితం రమ్య, రాకేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. అంతా హ్యాపీగా గడిచిపోతుండగా అనుకోకుండా వారి జీవితంలోకి కిషోర్ వచ్చాడు. కిశోర్ రాకేష్ ఫ్రెండ్స్. ఫైనాన్స్ లావాదేవీలు కలిసి చేసేవారు. ఇంటికి రాకపోకల్లో రమ్యకు అతడితో స్నేహం ఏర్పడింది. అది సంబంధంగా మారింది. కాని రాకేష్‌కు ఇది తెలిసిపోయింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలై ప్రశాంతత లేకుండా పోయింది. ఈ విషయం బంధువులకు ఎక్కడ చెబుతాడోనని భయపడింది రమ్య. రాకేష్ అడ్డు తొలగించుకుంటే సమస్యే ఉండదనే ఉద్దేశంతో కిషోర్‌తో చేతులు కలిపింది. ఫోన్లో సంభాషించుకుంటే తెలిసిపోతుందని ఫేస్బుక్లో రమ్య అబ్బాయి పేరుతోను, కిషోర్ అమ్మాయి పేరుతోను ఫేక్ అకౌంట్లు ప్రారంభించారు. మెసెంజర్ ద్వారా చాట్ చేసుకుంటూ కలిసేవారు. హత్యకు కూడా అలానే ప్లాన్ చేశారు. పథకం ప్రకారం ఆగస్టు 25వ తేదీ రాత్రి కిషోర్ పట్టణంలోని రాకేష్ ఉంటున్న అపార్టుమెంటుకు చేరుకున్నాడు. సిద్ధంగా ఉన్న రమ్య అతను ఇంట్లోకి చేరే విధంగా చేసింది. రాకేష్‌కు అప్పటికే నిద్రమాత్రలు ఇవ్వటంతో అతను మత్తులోకి వెళ్లిపోయాడు. మంచంపై ఉన్న రాకేష్‌ను ఇద్దరూ కలిసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. కిషోర్‌కు 2 లక్షల రూపాయలు ఇచ్చిన రమ్య ఈ విషయం ఎక్కడా బయటపడకుండా ఉండాలని జాగ్రత్తలు చెప్పింది. ఉదయం యథాప్రకారం ఏమీ తెలియనట్టు రమ్య వ్యవహరించింది. ఇది జరిగాక కిశోర్ హైదరాబాద్ పారిపోయాడు. అక్కడే కిషోర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ అకౌంట్లు ఫేట్‌ను మారుస్తాయి.నకిలీ పనులు అసలు జీవితాన్ని ధ్వంసం చేస్తాయి.మాట్లాడకూడని వారితో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే మాట్లాడ్డానికి మనిషి ఉండని జైలు జీవితం గడపాల్సి వస్తుంది. బీ కేర్‌ఫుల్. రాకేష్ మృతి వెనుక ఆమె హస్తం ఉన్నట్టయితే ఒక్కత్తే ఆమె అతణ్ణి చంపే అవకాశం లేదు. ఎవరి తోడో కావాలి. కావాలంటే ఎవరితో ఒకరితో ఏదో ఒక పద్ధతిలో మాట్లాడాలి. కాని ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అది చిన్న ఊరు. అపార్ట్‌మెంట్‌కు సిసి కెమెరాల ఏర్పాటు లేదు. కేసును ఛేదించడం ఎలా? – చెల్లుబోయిన శ్రీనివాసు, సాక్షి, రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా -
ఇంటెల్‌పై సీసీఐ విచారణ
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలకు సంబంధించి చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన వేలాంకని ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేలాంకని సంస్థ.. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు సాగిస్తోంది. వీటికి కీలకమైన ప్రాసెసర్స్, చిప్సెట్స్, మదర్‌బోర్డు/సర్వర్ బోర్డులు మొదలైన వాటిని ఇంటెల్ తయారు చేస్తోంది. అయితే, ప్రధానమైన రిఫరెన్స్ డిజైన్ ఫైల్స్‌ను ఇచ్చేందుకు ఇంటెల్ నిరాకరించిందని, తద్వారా సర్వర్ బోర్డులను రూపొందించకుండా తమను నిరోధించినట్లయిందని వేలాంకని ఆరోపించింది. ఫలితంగా మార్కెట్లో తమ అవకాశాలను దెబ్బతీసినట్లయిందని పేర్కొంది. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం.. 52 మందిని విచారించిన సిట్
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిట్ ఇప్పటి వరకు 52మందిని విచారించింది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్, ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సిట్ విచారణ జరిపింది. నిందితుడు శ్రీనివాసరావు ఎక్కువగా మాట్లాడినట్లు నిర్థారనకు వచ్చిన 321మంది కాలర్స్‌తో మాట్లాడిన సిట్ వారి స్టేట్మెంట్స్ను రికార్డు చేసింది. శుక్రవారం విచారణ జరపాల్సిందేమీ లేదని సిట్ అధికారులు తెలిపారు. కోర్టుకి సబ్మిట్ చేసేందుకు రికార్డు వర్కు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు లైవ్ డిటెక్టర్ పరీక్ష కోసం నిందితుడి అభిప్రాయం రికార్డు చేయబోతున్నట్లు చెప్పారు. సిట్ అధికారులు! నిందితుడు శ్రీనివాసరావు అంగీకరిస్తే కోర్డులో పిటిషన్ వేయనున్నారు. జగన్ షర్టు ఇప్పించాలని కోరుతూ వేసిన పిటిషన్‌తో పాటు ప్లెక్సీ, 11 పేజీల లేఖ పరీక్షించేందుకు, ఫోరెన్సిక్ లాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. సిట్ అధికారులు నిందితుడికి మధ్యాహ్నం స్టేషన్లోనే కేజీహెచ్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుచనున్నారు. అనంతరం అక్కడినుంచి సెంట్రల్ జైలుకి నిందితుడ్ని తరలించనున్నారు. -
జగన్‌ను చంపేయాలనుకున్నా
-
జగన్‌ను చంపేయాలనుకున్నా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం: ‘‘నా టార్గెట్.. నాకు అప్పగించిన పని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాణాలు తీయడమే. ఎప్పటి నుంచో ఆ రోజు కోసం వెయిట్ చేశా. ఆ రోజు కత్తి వేటు గొంతులోనే దిగాలి. పొరపాటున మిస్ అయింది’’ అని జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో ఎట్టకేలకు అంగీకరించినట్లు తెలిసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల విచారణలో శ్రీనివాసరావు ఇవే మాటలను స్పష్టంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ‘‘కేవలం సంచలనం కోసమే చేశా. నేను వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానిని. నేను రాసిన లెటర్ ఆయన చదవాలనే ఇదంతా చేశా’’ అని ఘటన జరిగిన మొదటి రోజు నుంచీ ఇప్పటివరకు మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు పదేపదే వల్లె వేస్తున్న డైలాగులన్నీ పచ్చి అబద్ధాలేనని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని, ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవి’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసు అధికారులపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. కుట్రకోణం దాచి రిమాండ్ రిపోర్ట్ రాసినప్పటికీ విశాఖ పోలీసు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి అక్షింతలు తప్పలేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా మీరు రిమాండ్ రిపోర్ట్ రాశారంటూ పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసును విచారించాలని ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అయితే, తమ సిబ్బంది రాత్రింబవళ్లు కేసును విచారిస్తుండగా, ఇంటెలిజెన్స్ వర్గాల జోక్యం ఏమిటని ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐపీఎస్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడు శ్రీనివాసరావును తమదైన శైలిలో ప్రశ్నించడంతో అతడు ఎట్టకేలకు నోరు విప్పి, వాస్తవాలను బయటపెట్టినట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతం చేయడమే లక్ష్యంగా కత్తితో దాడి చేశానని నిందితుడు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక తేలాల్సింది కుట్రకోణమే.. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్మోహన్రెడ్డిపై జరిగింది హత్యాయత్నమేనని ప్రత్యక్ష సాక్షులు, వైఎస్సార్సీపీ నేతలు మొత్తుకున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు, టీడీపీ నాయకులు తేలిగ్గా తీసిపారేశారు. అది చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కేసును విచారిస్తున్న ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ మళ్ల శేషు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జగన్‌పై కత్తి దాడి హత్యాయత్నమేనని, కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని పేర్కొన్నారు. కానీ, నిందితుడు నేరాన్ని అంగీకరించడం లేదని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. మంగళవారం నాటి విచారణలో తాను జగన్‌ను హత్యచేయడమే లక్ష్యంగా దాడి చేశాడని శ్రీనివాసరావు అంగీకరించాడని తెలిసింది. దీంతో ఇక తేలాల్సింది కుట్ర కోణమే. బడాబాబుల అండ లేకుండా ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఓ దుండగుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడే అవకాశం లేదని చెబుతున్నారు. సూత్రధారుల పేర్లు బహిర్గతం? జగన్‌ను చంపాలనే కత్తి దూశానని స్పష్టం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆ పని ఎవరు చేయించారో కూడా వెల్లడించాడనే అంటున్నారు. ప్రధాన కుట్రదారుల పేర్లు తనకు తెలుసో లేదో గానీ తనకు ‘ఆ పని’ అప్పగించిన సూత్రదారుల పేర్లను మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశాడని సమాచారం. విచారణలో నిందితుడు బయటపెట్టిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు పభుత్వ పెద్దలకు, పోలీస్ బాస్‌లకు ఇప్పటికే చేరవేసినట్టు తెలుస్తోంది. నిందితుడి పోలీసు కస్టడీ గడువు శుక్రవారం ముగుస్తున్న నేపథ్యంలో విచారణ డ్రామాను రక్తి కట్టించి, అతడిని తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా వాసులను విచారిస్తున్న ‘సిట్’ కనిగిరి: వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్‌డేటాను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోది. ఇందులో భాగంగా ప్రకారం జిల్లా కనిగిరి మున్సిపాల్టీలోని దేవాంగనగర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుంది. హత్యయత్నానికి ముందు నిందితుడి ఫోన్ నుంచి దేవాంగనగర్‌కు చెందిన కాశీంబీ కోడలు సైదాబీ షేక్ సెల్‌కు పలుమార్లు ఫోన్ చేసినట్టు కాల్ డేటాలో నిర్ధారణ అయింది. దీంతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు సోమవారం సైదాబీ షేక్, ఆమె మరిది రసూల్, తోడికోడలు అమ్మాజీ షేక్, అత్త కాశీంబీలను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సైదాబీ, అమ్మాజీ, కాశీంబీలను అక్కడే ఉంచి, రసూల్‌ను తిరిగి పంపించారు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం పిడుగురాళ్ల పోలీసులు రసూల్‌కు ఫోన్ చేశారు. ‘సిట్’ పోలీసులు విచారణ చేయాల్సి ఉందని చెప్పడంతో రసూల్ వైజాగ్‌కు వెళ్లాడు. సైదాబీ షేక్, అమ్మాజీ షేక్, కాశీంబీ, రసూల్‌లు వైజాగ్ ‘సిట్’ అదపులో ఉన్నట్లు సమాచారం. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. ‘‘నన్ను చూడాలనుకుంటే రేపే చూసుకోండి. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. టీవీలో వస్తుంది. తర్వాత కనిపిస్తానో లేదో’’ అంటూ నిందితుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు కాల్ డేటా ఆధారంగా ‘సిట్’ చేపట్టిన విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నిందితుడి సెల్ ఫోన్ నుంచి ఎక్కువగా కాల్స్ వెళ్లడంతో ప్రత్యేక బృందాలు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకొని విశాఖకు తరలించారు. కనిగిరిలోని దేవాంగనగర్ నుంచి తీసుకొచ్చిన సైదాబీ షేక్, అమ్మాజీ షేక్, రసూల్‌లను నిందితుడు శ్రీనివాసరావు నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌పై ఆరా తీశారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన ముందురోజు రసూల్ ఫోన్‌కు మిస్ట్‌కాల్ రావడంతో అతడు ఆ నెంబర్‌కు పదేపదే ఫోన్ చేయడంతో శ్రీనివాసరావు ఒకసారి లిఫ్ట్ చేసి కట్ చేశాడు. సైదాబీ షేక్ ఫోన్‌కు కూడా నిందితుడి నుంచి మిస్డ్‌కాల్ వచ్చింది. తిరిగి అదే నంబర్‌కు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేసిన శ్రీనివాసరావు చాలాసేపు మాట్లాడాడు. అస్తమానం కాల్ చేస్తున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి చేస్తున్నావ్.. ఎందుకు చేస్తున్నావు.. అంటూ ఆమె ఫోన్లో నిలదీసింది. ‘‘నేనెవరో తెలియాలంటే రేపు టీవీ చూడండి మీకే తెలుస్తుంది. జగన్‌పై అటాక్ చేస్తున్నా.. అన్ని టీవీల్లో బాగా చూపిస్తారు. ఆ తర్వాత కనిపిస్తానో లేదో’’ అని శ్రీనివాసరావు బదులివ్వడంతో ఆమె విస్తుపోయింది. మనకెందుకులే ఈ గొడవ అనుకుంటూ ఫోన్ కట్ చేసింది. -
బోగస్ కులధ్రువీకరణ పత్రాలపై విచారణ
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలంలో రెండో రోజైన శనివారం కులధ్రువీకరణ పత్రాలపై సమగ్ర విచారణ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాజవొమ్మంగి తహసీల్దార్ కార్యాలయం ద్వారా మంజూరైన 7,209 కులధ్రువీకరణ పత్రాల్లో అనేకం బోగస్‌వి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత రెవె న్యూ అధికారులకు ఈ నెల 15న ప్రజా ప్రతిఘటన ఎదురైన సంగతి విదితమే. అనర్హులకు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ రాజవొమ్మం గిలో జరిగిన ఉద్యమానికి స్పందించిన జేసీ మల్లి కార్జున, ఐటీడీఏ పీఓ నిషాంత్ కుమార్ విచారణకు ఆదేశించారు. కులధ్రువీకరణ పత్రాలపై రాజవొమ్మంగి మండలంలోని పలు పంచాయతీల్లో తొలి రోజు జరిగిన గ్రామసభల్లో ప్రజల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాలేదు. అయితే రెండో రోజు రాజవొమ్మంగి, కొండపల్లి, వాతంగి గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో లిఖిత పూర్వక అభ్యంతరాలు వచ్చాయి. రాజవొమ్మంగి పం చాయతీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విచారణలో ఆదివాసీ సంక్షేమ సంఘం నేత కంచెం బాబూరావు నేతృత్వంలో పలువురు ఆదివాసీలు విచారణాధికారిగా వచ్చిన సామర్లకోట తహసీల్దార్ శివకుమార్‌కు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను అందజేశారు. వీటిని పరిగణనలోకి తీసుకొని సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో ఈ బోగస్ కులధ్రువీకరణ పత్రాలపై ఇంటింటికీ వెళ్లి ప్రజల సమక్షంలో విచారణ నిర్వహిస్తామని విచారణాధికారులు తెలిపారు. విచారణ ఇలా... కిర్రాబులో 275, శరభవరంలో 389, రాజవొమ్మంగిలో 332 కులధ్రువీకరణ పత్రాలపై తహసీల్దార్ శివకుమార్ విచారణ చేపట్టారు. అలాగే కొండపల్లిలో 238, అమీనాబాద్‌లో 68, వాతంగిలో 625 కులధ్రువీకరణ పత్రాలపై చింతూరు తహసీల్దార్ పి.తేజేశ్వరరావు విచారణ నిర్వహించి, కొండపల్లిలో 7, వాతంగిలో 3 లిఖిత పూర్వక అభ్యంతరాలు వచ్చాయని వెల్లడించారు. పెద్దాపురం తహసీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం లబ్బర్తిలో 138 పత్రాలపై విచారణ చేపట్టగా ఒక లిఖిత పూర్వక అభ్యంతరం అందినట్లు చెప్పారు. లాగరాయిలో 119 పత్రాలపై విచారణ జరిగింది. ఈ గ్రామంలో మంజూరైన 3 కొండకాపు, ఒక కోయదొర సర్టిఫికెట్లు బోగస్ అంటూ ఆదివాసీల నుంచి లిఖితపూర్వక అభ్యంతరాలు అందాయని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. వీటిపై కూడా మరో రెండు రోజుల్లో విచారణ చేస్తామన్నారు. ప్రత్తిపాడు తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు చెరువుకొమ్ముపాలెంలో 212 సర్టిఫికెట్లపై విచారణ చేపట్టగా 12 బోగస్ ఉన్నాయంటూ ఫిర్యాదులు అందాయన్నారు. వంచంగిలో నిర్వహించిన విచారణ సభలో 470 కులధ్రువీకరణ పత్రాల వివరాలు వెల్లడించగా 7 పత్రాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. గడుఓకుర్తిలో 322 పత్రాలను పరిశీలించగా ఇక్కడ అభ్యంతరాలు ఏవీ రాలేదన్నారు. -
నాకు సంబంధం లేదు
బుల్లితెర నటి నీలాణి ప్రియుడి ఆత్మహత్య కేసులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీలాణికి ఇంతకుముందే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. భర్తను వదిలి పిల్లలతో నివశిస్తున్న నీలాణికి సహాయ దర్శకుడు గాంధీలలిత్‌కుమార్ పరిచయం కావడం, అతనితో ప్రేమ, సహజీవనం చేసిన విషయాలు బయటపడ్డాయి. తిరువణ్ణామలైకి చెందిన గాంధీలలిత్కుమార్కు తల్లిద్రండులు లేరు. అన్నయ్యనే పెంచి పెద్ద చేశాడు. సినిమారంగంపై ఆశతో చెన్నైకి వచ్చిన లలిత్‌కుమార్‌కు నటుడు ఉదయనిధిస్టాలిన్ సంస్థలో పని లభించింది. ఆ తరువాత సహాయ దర్శకుడిగా కొన్ని చిత్రాలకు పని చేశారు. తిరువణ్ణామలై ప్రాంతంలో ఉదయనిధిస్టాలిన్ అభిమాన సంఘం నిర్వాహకుడిగా ఉన్నాడు. కొంత కాలం తరువాత లలిత్‌కుమార్‌కు పని లేకుండా పోయింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో నిలాణీ, లలిత్‌కుమార్‌ను వదిలి ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల టీవీ సీరియల్ షూటింగ్లో ఉన్న నీలాణి వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని లలిత్‌కుమార్ ఒత్తిడి చేశాడు. దీనిపై ఆమె మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది లలిత్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇదిలాఉండగా నటి నీలాణితో లలిత్‌కుమార్ అనుబంధాన్ని తెలిపే వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమే.. నటి నీలాణి మంగళవారం సాయంత్రం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి లలిత్‌కుమార్ ఆత్మహత్మకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అనంతనం మీడియా ముందుకు వచ్చి లలిత్‌కుమార్‌తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పానని తెలిపింది. లలిత్‌కుమార్ తన గురించి అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్బుక్లో పెట్టడం, వేధించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాకుండా తన వద్ద సొమ్ము తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ కంటతడి పెట్టింది. -
రెండో సీసా
అస్తి హత్యలు చేయిస్తుంది. ఒక్కోసారి అపరాధులు ఎవరో నిరపరాధులు ఎవరో తెలియని కన్ఫ్యూజన్లో కూడా పడేస్తుంది.మహబూబాబాద్ జిల్లా. తొర్రూర్.2014, అక్టోబరు 4. రాత్రి 8 గంటలు.నిజానికి అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించే టైమ్ అది. కానీ ఊరు కంగాళీగా ఉంది. సగం ఊరు ఆ ఇంటి ముందు భోజనం సంగతి మరిచి గుమికూడి ఉంది. ఆ ఇంటి ముందున్న కరెంట్ పోల్కి లైట్ వెలుగుతూ ఆరుతూ చికాకు పెడుతోంది.పడీ పడని వెలుతురులో ఆ ఇంటి వసారాలో పడి ఉన్న రెండు మృతదేహాలు భయం గొలిపేలా ఉన్నాయి. రెండూ పురుషులవి. కాసేపటి క్రితం ప్రాణాలతో ఉండి ఇప్పుడు చలనం లేని దేహాలు.ఇంటామె అప్పుడే షాక్ నుంచి బయట పడ్డట్టుంది... జరిగిన దారుణానికి కడుపు తరుక్కుపోయే లా శోకాలు పెడుతోంది. ‘ఓరి నా మొగుడో... అయ్యో నా తమ్ముడో’కాని గుంపుకు జాలి కలగడం లేదు.జవాబుగా గుంపు గుసగుసలు పోతూ ఉంది.‘చేసిందంతా చేసి ఎలా ఏడుస్తోందో చూడు.’‘కొడుకుతో కలిసే ఈ పని చేసి ఉంటుంది’ ‘ఎన్నాళ్ల నుంచి చూస్తున్నాం ఈ గొడవలు..’‘అంత మాత్రానికే ఇంత పని చేస్తారా?!’సడన్‌గా గ్రామస్తులకు కోపం పెరిగింది. ‘వీళ్లకు తగిన శాస్తి చేస్తే గాని బుద్ధి రాదు...’ముందుకు కదిలారు నలుగురు వ్యక్తులు ఆమె జుట్టు పట్టుకోవడానికి. తోడు ఇంకొందరు కదిలారు. ఇది గమనించిన ఇంటామె అక్కడే చేష్టలిడిగి నిలుచుని ఉన్న ఆమె కొడుకుతో పరిగెత్తుకెళ్లి తలుపులేసుకుంది. ఆ తలుపులు విరిగిపడతాయేమో అన్నంతగా ‘దఢేల్ దఢేల్..’మని కొడుతున్నారు గుంపులోని వాళ్లు. పోలీసులు అడ్డురాకపోతే ఆ ఊరి వాళ్ల కోపానికి ఆ ఇంటి సభ్యుల ప్రాణాలు గాల్లో కలిసేవే! కాస్తలో తప్పింది. ఆ ఇద్దరి మీద ఆ ఊరివాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది? ఆ కింద పడి ఉన్న ఆ ఇద్దరిని ఎందుకు చంపి ఉంటారు?ఎవరూ చెప్పడం లేదు. ఊరి జనాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.అంబులెన్స్ సిబ్బంది కిందపడి ఉన్న ఇద్దరు వ్యక్తులను పరీక్షించి ‘వారు చనిపోయారు సార్’ అన్నారు ఎస్సైతో. శవాలను ఆసుపత్రికి తరలించారు. ఇంటి దగ్గర విచారణ కష్టంగా అనిపించడంతో ముందుగా ఆ ఇంట్లో వాళ్లను అక్కణ్ణుంచి తీసుకెళ్లి పంచాయితీ హాల్లో కూర్చోబెట్టారు. ఊళ్లో నలుగరు పెద్దవాళ్లను అక్కడ ఉంచి, మిగతావారిని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల ప్రతాపానికి జyì సిన జనం పలచబడ్డారు. కానీ, కాసేపటికి పంచాయితీ హాల్ వద్దకూ జనం మెల్లగా పోగవుతున్నారు. పంచాయితీ హాల్‌కి వచ్చిన ఎస్సై ...‘ఏం జరిగింది?’ అడిగాడు ఆ ఇంటి పెద్దావిడను. ఆమె పేరు సుభద్రమ్మ (పేరు మార్చాం). వయసు అరవై పైనే ఉంటుంది.‘ఏముంది సార్! ఆస్తుల గొడవ! ఈళ్ల పనే ఇది’ అన్నాడు అక్కడే ఉన్న ఓ గ్రామస్తుడు.అతని వైపు కోపంగా చూసిన ఎస్సై అతన్ని బయటకు పంపించాడు.ఆమె ఏడుస్తూనే ‘సార్.. నేను చంపలేదు! ఊరి నుంచి మా తమ్ముడొచ్చాడు. మా ఆయనా మా తమ్ముడూ మాట్లాడుకుంట చాలా సేపు కూసున్నరు. ఇద్దర్నీ భోజనానికి రమ్మన్నాను. అప్పుడే వద్దని మా ఆయన మందుబాటిల్ తెచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ మందు తాగారు. అరగంటసేపు బాగానే ఉన్నారయ్యా. తర్వాత ఏమైందో ఏమో! నురగలు కక్కుకంటూ నేలమీద పడిపోయారు. చూస్తుండగానే శవాలయ్యారు’ గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంది ఆమె. సుభద్రమ్మ కొడుకు ప్రతాప్ వైపు చూశాడు ఎస్సై. అతను హడలిపోయాడు.‘సార్! నేను టౌన్‌కు పోయి ఇందాకనే ఇంటికి వచ్చాను. అమ్మ ఏడుపు విని పరిగెత్తుకువచ్చాను. చూస్తే ఇద్దరూ పడిపోయున్నారు’ అన్నాడు ప్రతాప్.విషయం అంతా పోలీసులు నోట్ చేసుకుంటున్నారు. సుభద్రమ్మ భర్త పేరు వెంకటయ్య. డెభ్బై ఏళ్లుంటాయి. ప్రతాప్‌కి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా! తండ్రికి కొడుక్కి నాలుగేళ్లుగా ఆస్తి విషయమై పడటం లేదు. ఉన్న నాలుగెకరాల భూమిలో తన వాటా తనకు పంచమంటాడు కొడుకు. అది నా కష్టార్జితం. సెంటు భూమి కూడా ఇవ్వ అంటాడు తండ్రి. ఒక్కింటి వాళ్లయినా ఇంటికి మధ్యలో గోడ కట్టుకొని ఎవరి వంట వాళ్లు వండుకుంటున్నారు. సుభద్రమ్మ కూడా ఆ భూమిని కొడుకు పేర రాసిమ్మని గొడవ పెడుతోంది. కానీ, వెంకటయ్య వినిపించుకోవట్లేదు. ‘అది నేను సంపాదించిన భూమి. ఎవరూ లేనో ళ్లకైనా ఇస్తా కానీ, వీడికి (ప్రతాప్) ఇవ్వ. ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్లిపొమ్మను’ అని గొడవ పెట్టుకుంటున్నాడు. ‘ఉన్నది ఒక్కడే కొడుకు కదా! వాడికి కాకపోతే ఎవరికిస్తవ్! ఇచ్చేయరాదు’ అని నచ్చజెప్పారు ఊళ్లో కొంతమంది. అయినా వెంకటయ్య వినిపించుకోలేదు. తన పేరన ఆస్తి రాసివ్వడం లేదని కన్నతండ్రినే చంపేశాడు ప్రతాప్, అతని తల్లి సుభద్రమ్మ అని ఊళ్లో వాళ్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇలాంటోళ్లను చంపేయక ఇంకా ఎందుకు సార్ ఈ మాటలు అంటున్నారు బయట నుంచి. ‘మాకేం పాపం తెలియదు సార్! ఊళ్లో వాళ్లు చెప్పేది నిజమే అయ్యుంటే నా తమ్ముడిని ఎందుకు చంపుకుంటాను...’ తమ్ముడి కోసం ఏడుస్తూనే చెప్పింది సుభద్రమ్మ. ‘ప్రతాప్ ఊళ్లో కూడా లేడు. వీళ్లు గిల గిల కొట్టుకుంటున్నప్పుడే అరిచాను మా ప్రతాప్‌ని పిలుస్తూ. నా ఏడుపు విని వాడు పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే ఏం చేయాలో కాలూ చేయి ఆడలేదు. చూస్తుండగానే తన్నుకులాడటం ఆగిపోయింది సార్!’ చెప్పిన విషయమే మళ్ళీ మళ్లీ చెబుతోంది సుభద్రమ్మ. పోలీసులు ఆలోచనలో పడ్డారు. సుభద్రమ్మ చెప్పిందాన్నిబట్టి చూస్తే వాళ్లు అంతకుముందు మందు తాగారు. ఆ మందు సీసాను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ప్రాబ్లమ్ ఏమీ లేదని నిపుణులు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేవరకు టైమ్ పడుతుంది. ‘ఊళ్లో వాళ్లు చెప్పినట్టు వీళ్లే చంపారా? అలా అయితే, ఈమె తమ్ముణ్ణి కూడా ఎందుకు చంపుకుంటుంది?’ ఆలోచనలో పడ్డారు పోలీసులు.‘ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తారు. ఈ ముసల్దే చంపేసి ఈ నాటకం ఆడుతోంది. నాలుగు తగిలిస్తే నిజం కక్కుతుంది’ అన్నాడు ఊరి పెద్ద. ‘అవునవును’ అన్నారు మిగతా వాళ్లు. భర్త, తమ్ముడు పోయిన దుఃఖం నుంచి సుభద్రమ్మలో భయం గూడు కట్టుకుంది తననేం చేస్తారో అని. పోలీసులు మళ్ళీ విచారణ మొదలుపెట్టారు. ‘సుభద్రమ్మా! మందు ఎక్కడి నుంచి తెచ్చాడు మీ ఆయన?’ అడిగారు పోలీసులు. ‘ఇంట్లనే ఓ బాటిల్ ఉందయ్యా! అదే తాగారు. ఆ... అది సరిపోలేదని మా కొడుకు ఇంటికి వెళ్లి ఇంకో బాటిల్ తెచ్చాడయ్యా’ గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది సుభద్రమ్మ!పోలీసులు ముఖముఖాలు చూసుకున్నారు. ‘నీ కొడుకు, కోడలు టౌన్కెళ్లారుగా! ఇంటికి తాళం వేసి ఉంటే ఇతనెలా వెళ్లాడు’ గద్దించాడు ఎస్సై.‘నిజమే సార్! వాళ్లు ఎక్కడికైనా వెళితే తాళం చేతులు మా ఇంట్లనే కొయ్యకు తగిలించి వెళతారు. అది మా ఆయనకు తెలుసు. తాళం తీసే వెళ్లి తెచ్చుకున్నాడు..’సుభద్రమ్మ బలంగా చెబుతుండగా ఎస్సై ప్రతాప్ వైపు చూశాడు. అయోమయంగా చూశాడు ప్రతాప్ ఏమీ అర్థంకానట్టు. ‘వాళ్లిద్దరూ పడున్న చోట ఒకటే ఖాళీ బాటిల్ పడి ఉంది. రెండో బాటిల్ ఏమైంది?’ సుభద్రమ్మను అడిగాడు ఎస్సై‘మందు చేదుగా ఉందని తాగిన మా తమ్ముడు అన్నడు సర్! నీకు మందెక్కువై ఆ మాట అంటున్నావ్రా అని మా ఆయనా ఆ మందు తాగాడు! నిజమేన్రోయ్ ఈ మందు మహా చేదుగా ఉంది... దిక్కుమాలినోడు చేదు మందు తెచ్చిపెట్టిండు అని ప్రతాప్‌ను తిట్టుకొని దాన్ని బయటకు విసిరేశాడు’ అంది.ఎస్సై ఆలోచిస్తూనే తన సిబ్బందిని పురమాయించాడు. ఆ బాటిల్‌ను వెతకమని. పోలీసులు ఆ ఇంటి పరిసరాలను అణువణువూ గాలించారు.గుమ్మానికి ఎడమవైపున ప్రతాప్ ఇంటి ముందు కరివేపాకు చెట్టు పొదల్లో ఓ వైన్ బాటిల్ దొరికింది. దానిని వాసన చూసిన పోలీసుల కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది పురుగుల మందు వాసన వస్తోంది. ‘క్లూ దొరికింది. ఈ మందుబాటిలే వాళ్లని చంపింది. అయితే, ఈ వైన్ బాటిల్లోకి పురుగుల మందు ఎలా వచ్చింది? ఎవరు కలిపారు? తేలాలి.’ ‘ఏంటిది?’ అడిగాడు ఎస్సై ప్రతాప్‌కి దగ్గరగా చూపుతూ. ప్రతాప్ ఆ మందుబాటిల్ను, దాని వాసన చూడగానే ‘సార్! ఒక్క నిమిషం. ఒక్కసారి ఇంట్లకెళ్లి చూసొస్తా. నాతో రండి’ అన్నాడు.అతనితో పాటు పోలీసు సిబ్బంది పంచాయతీ హాల్ నుంచి బయటకొచ్చారు. ప్రతాప్ ఇంట్లోకి వెళ్లి తన గదిలోని షెల్ఫ్‌లో ఓ మూలకు వెతుకుతున్నాడు. ‘దేనికోసం వెతుకుతున్నావ్’ గద్ధించాడు ఎస్సై.‘వారం క్రితం పొలానికి మందు కొట్టాలని మా నాయన్ని డబ్బులడిగిన. నా భూమిలో పొలం వేసుడే కాకుండా నన్నే డబ్బులు అడుగతావ్రా.. పురుగు పడితే పట్టనీయ్, నాశనం కానీయ్.. అన్నడు.మందెయ్యకపోతే పంట చేతికి రాదు. మా పొలం పక్కన ఉన్న రాములయ్యను అడిగితే ఒకటే డబ్బా ఉందని తన పొలానికి కొట్టాలని చెప్పాడు. పైసలొచ్చినంక ఇస్త.. సగం మందు ఇవ్వమని అడిగా. రాములయ్య సరే అని ఆ రోజు సాయంకాలం ఇంటికే తీసుకొచ్చాడు మందు డబ్బా! మందు పోయడానికి సీసా కోసం వెతికితే ఖాళీ వైన్‌బాటిల్ కనిపించింది. సగం పురుగుల మందు వైన్ బాటిల్లో పోసి, ఈ మూలన ఎవరికంటా పడకుండా జాగ్త్రతగా పెట్టా. మా ఆవిడ పిల్లలతో కలిసి పుట్టింటికి బయల్దేరితే వాళ్లను ఆ ఊళ్లో దిగబెట్టడానికి నేనూ వెళ్లా. ఊర్నొంచి వచ్చినంక పొలానికి మందు కొడదాంలే అనుకున్న. మా అత్తగారి ఇంటి నుంచి టౌన్లో పనుంటే చూసుకుని ఇంటికి వచ్చేసరికి రెండ్రోజులయ్యింది. ఇప్పుడే చూశాను సార్! ఆ బాటిల్ లేదు. మా నాయిన నా దగ్గర మందుబాటిల్ ఉందని వెతికి ఉంటాడు. ఇది దొరికింది. తీసుకెళ్లాడు!’ ఏడుస్తున్నాడు ప్రతాప్. నిజం తేలడంతో ఊరివాళ్లు శాంతించారు. లేకుంటే వారి ఆవేశం వల్ల మరో రెండు ప్రాణాలు బలి అయ్యేవి. చేయని తప్పుకు శిక్షను అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడిన వాళ్లకు పోలీసులు నిజ నిర్ధారణ చేసి నేరస్తులు కాదని ఊరటనిచ్చారు. – నిర్మలారెడ్డి -
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీఐడీ మొక్కుబడి విచారణ
-
యాదాద్రి విషవలయంపై కలెక్టర్ సమీక్ష
-
కోర్టుకెక్కిన ఏపీ వైద్యారోగ్యశాఖ అవినీతి
-
ఫేస్బుక్ డేటా దుర్వినియోగంపై విచారణ
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్రం తెలిపింది. ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాకు నోటీసులు జారీచేయగా, డేటా చౌర్యం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ బదులిచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. మనుషుల అక్రమరవాణా బిల్లు ఆమోదం మనుషుల అక్రమ రవాణా నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్, సీపీఎం బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేయగా, చట్టం చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ బదులిచ్చారు. బాధితులను దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తెస్తున్నామని, దోషులకు శిక్షలు పడే రేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, సాక్షులు, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మూడేళ్లలో అధ్యాపక పోస్టుల భర్తీ వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను మూడేళ్లలోగా భర్తీ చేయాలని వర్సిటీలను కేంద్రం ఆదేశించింది. ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016–17 ప్రకారం దేశవ్యాప్తంగా 3,06,017 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రి జవడేకర్ చెప్పారు. వీటిలో 1,37,298 పోస్టులు పట్టణ ప్రాంతాల్లో, 1,68,719 అధ్యాపక పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మహిళల సాధికారతకు కొత్త పథకం ప్రజల భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘మహిళా శక్తి కేంద్ర’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర‡ రాజ్యసభకు తెలిపారు. 2017–20 మధ్యకాలంలో ఈ పథకం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పంచాయితీ స్థాయి కార్యక్రమంలో భాగంగా 115 జిల్లాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థి వాలంటీర్లు గ్రామీణ మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో పాటు ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని కుమార్ పేర్కొన్నారు. -
నా తండ్రి హత్యపై సమగ్ర విచారణ జరపాలి
జనగామ అర్బన్: ప్రెస్టన్ పాఠశాల కరస్పాండెంట్ దైదా క్రిస్టోఫర్ హత్యకు సంబంధించి పోలీసులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలన్నీ అవాస్తవమని, క్రిస్టోఫర్ కూతురు, న్యాయవాది దైదా ప్రియాంక ప్రియదర్శని అన్నారు. ప్రెస్టన్ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులు ఉపేష్, ఉప్పలయ్య ప్రెస్టన్ భూములను పెద్దమొత్తంలో తమకు విక్రయించాలని ఒత్తిడి తెచ్చినా తన తండ్రి ఒప్పకోకపోవడంతో కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ విషయంలో 17 నెలల క్రితం దాడికి పాల్పడి త్రీవంగా గాయపరిచారని అన్నారు. బాణపురానికి సంబంధించిన ఇంటి విషయంలో ఎలాంటి గొడవలు లేవని, అది మా వ్యక్తిగత ఆస్తి అని తెలిపారు. ఇక తన తండ్రిపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపేష్‌ను అరెస్టు చేయలేదన్నారు. పోలీసులు చెప్పినట్లు ఉపేష్ తన తండ్రికి రూ.6 లక్షలు ఇచ్చి ఉంటే సదరు విషయాన్ని ఉపేష్ ఎప్పుడు పోలీసుల దృష్టికి గాని, న్యాయపరంగా కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దాడి జరిగిన క్రమంలో సైతం బాణపురానికి సంబంధించిన ఆస్తిగొడవ అని ఫిర్యాదు ఇవ్వలేదని, ఇప్పటికైనా వాస్తవాలను వెలికితీసే విధంగా సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. కేసును పది రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
సీజేఐపైనే అనుచిత వ్యాఖ్యలా?
న్యూఢిల్లీ: ఓ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినందుకు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచేలా పరోక్షంగా వ్యాఖ్యానించిన లాయర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో సదరు లాయర్ చేసిన వ్యాఖ్యలు, పంపిన సందేశాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని మండిపడింది. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. తామిచ్చే తీర్పులను ఏ వేదికపై చర్చించినా అభ్యంతరం లేదని, కానీ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. ‘కుప్పలుతెప్పలుగా వచ్చిపడే పిటిషన్లలో వేటిని అత్యవసరంగా విచారించాలో సీజేఐ నిర్ణయిస్తారు. ఏదైనా పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినంత మాత్రాన సీజేఐని లక్ష్యంగా చేసుకుని సదరు లాయర్ సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తారా?’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ జడ్జి వ్యాఖ్యలను లాయర్ ఉటంకించడాన్ని కూడా బెంచ్ తప్పుపట్టింది. కోర్టులో ఊరట లభించకపోతే జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని బెంచ్ పేర్కొంది. -
ఆ బాల్య వివాహంపై విచారణ
కర్నూలు, కౌతాళం రూరల్: మండల పరిధిలోని ఉప్పరహల్ గ్రామంలో గత నెల 27న బాలుడికి, మేజర్ యువతికి జరిగిన బాల్యవివాహంపై శుక్రవారం జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. జేసీ–2 రామస్వామి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ఏపీడీ విజయ, డీసీపీఓ శారద, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ తిమ్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, ఆర్ఐ భీమేష్ గ్రామానికి చేరుకుని విచారించారు. సదరు కుటుంబం గ్రామంలో లేకపోవడంతో స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. వివాహం గుట్టుచప్పుడు కాకుండా జరిపించారని, వారు త్వరలో గ్రామానికి వస్తే అధికారుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చేలా చూస్తామని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏకాంబరెడ్డి అధికారులకు చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతూ బాల్యవివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి వాటి గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
నిర్మలాదేవిని విచారించిన సంతానం
టీ.నగర్: లైంగిక ఆరోపణలకు గురైన ప్రొఫెసర్ నిర్మలాదేవి వద్ద ప్రత్యేక విచారణ అధికారి సంతానం గురువారం విచారణ జరిపారు. అరుప్పుకోటై దేవాంగ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయిత్నంచినట్టు వచ్చిన ఆరోపణలు తెలిసిందే. దీనికి సంబంధించి ఆడియో టేపులు విడుదల కావడంతో నిర్మలాదేవిని అరెస్టు చేసి ఆమె వద్ద సీబీసీఐడీ పోలీసులు ఐదు రోజులుగా విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించి మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఏకసభ్య విచారణ అధికారి సంతానం ఇది వరకే మదురై అరుప్పుకోటై ప్రాంతాల్లో ప్రాథమిక విచారణ జరిపారు. బుధవారం ఆయన రెండవ విడత విచారణను ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా పేర్కొనబడుతున్న నిర్మలాదేవి వద్ద సమగ్ర విచారణ జరిపేందుకు సంతానం నిర్ణయించారు. ఇందుకోసం మదురై సెంట్రల్ జైల్లో ఉన్న నిర్మలాదేవిని నేరుగా కలుసుకునేందుకు జైలు అధికారుల అనుమతి కోరారు. దీంతో అనుమతి లభించడంతో గురువారం ఉదయం సంతానం మదురై సెంట్రల్‌జైలుకు నేరుగా వెళ్లి నిర్మలాదేవి వద్ద విచారణ జరిపారు. ఆయనతో పాటు ప్రొఫెసర్లు కమలి, త్యాగేశ్వరి వెంట వెళ్లారు. శుక్రవారం సంతానం అరుప్పుకోటై కళాశాల నిర్వాహకులు, విద్యార్థినుల వద్ద విచారణ జరపనున్నారు. -
విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం
హసన్‌పర్తి: పనులపై విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని వార్డు సభ్యులు హెచ్చరించారు. ఈ మేరకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విచారణకు వచ్చిన అధికారులు వెనుదిగిరారు. వివరాల్లోకి వెళితే.. హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో వివిధ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని వెంటనే విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ వరంగల్ అర్బన్ జిల్లా డీఈఈ సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఎల్కతుర్తి సబ్ డివిజన్ డీఈఈ శ్వేతలను విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం వారు విచారణకు రాగా అప్పటికే అక్కడ ఉన్న నలుగురు వార్డుసభ్యులు విచారణను అడ్డుకున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం.. గ్రామసర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడిందని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మద్య ఉన్న వైరం వల్ల గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. గో–బ్యాక్ అంటూ నినాదాలు.. విచారణ చేపట్టొదని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. గో–బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో సీతంపేటలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అధికారులు విచారణ చేపట్టకుండా వెనుదిరిగారు. రూ.55 లక్షల అవినీతి.. సీతంపేటలో రూ.55లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 1100 మీటర్ల పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కేవలం 340 మీటర్లు మాత్రమే పైప్‌లైన్ వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మురికికాల్వలు నిర్మించి ఒకే పనికి రెండు బిల్లులు డ్రా చేశారని పేర్కొన్నారు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. విచారణను అడ్డుకున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు పైప్లైన్ల నిర్మాణంపై విచారణ చేపట్టడానికి వెళ్లాం. కాగా, కొంతమంది వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని కిరోసిన్ పోసుకున్నారు. దీంతో వెనుతిరిగాం. – హంజ, ఏఈ -
బోర్డు తిప్పేసిన మోసాలపై విచారణ
కమలాపూర్: వాయిదాల పద్దతిలో డబ్బులు చెల్లిస్తే తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా మోసగిస్తున్న ఘటనపై మండలంలోని గుండేడులో గురువారం కాజీపేట ఏసీపీ కె.సత్యనారాయణ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఏసీపీ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా శ్రీరాం రియల్ ఎస్టేట్, బిజినెస్ సొల్యూషన్ లిమిటెడ్ పేరిట కొందరు ఓ సంస్థను నెలకొల్పారు. వరంగల్లోనూ ఆ సంస్థ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థకు చెందిన జయశంకర్ జిల్లా మొగుళ్లపెల్లి మండలం వేములపల్లికి చెందిన పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 2012లో కన్నూరుకు చెందిన వీఓ అధ్యక్షురాలు పబ్బు కవితతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురిని 2 శాతం కమీషన్‌తో ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారు మండలంలోని పలువురు మహిళలను సంస్థలో సభ్యులుగా చేర్పించుకుని రెండు నుంచి ఆరేళ్ల కాలంలో వారు చెల్లించిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి వారి నుంచి వాయిదా పద్దతిలో డబ్బులు వసూలు చేసి కంపెనీకి అప్పగిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు రీ–పేమెంట్లు సైతం సక్రమంగా జరుగగా ఆ తర్వాత సంస్థ సీఎండీ అరెస్టై సంస్థ మూడపడింది. అప్పటి నుంచి మండలానికి చెందిన పలువురికి రావాల్సిన సుమారు రూ.4 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో పలుమార్లు ఏజెంట్లను డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా లాభంలేకపోవడంతో ఈ నెల 2న డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం 10న మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అందిన సమాచారం మేరకు గుండేడులో విచారణ చేపట్టి ఏజెంట్లు, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ కె.సత్యనారాయణ తెలిపారు. ఈ విచారణలో ఎల్కతుర్తి సీఐ రవికుమార్, కమలాపూర్ ఎస్సై సందీప్‌కుమార్, సర్పంచ్ రాజబోస్, ఏజెంట్లు, బాధితులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ప్రమాదంపై అధికారుల విచారణ
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధి పడమటితండాలో ఏఎమ్మార్పీ లింక్ కెనాల్లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘట నలో తొమ్మిది మంది మృతిచెందిన కేసుపై ఆదివారం అధికారులు విచారణ జరిపారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖ అధికారులు, పడమటితండావాసుల సమక్షంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన ప్రాంతాన్ని నిర్ధారించేందుకు, ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో మిషన్ భగీరథ గుంత ఉండడంతో ప్రమాదానికి గుంత కారణమా కాదా అనే కోణంలో కొలతలు తీసుకున్నారు. పడమటితండావాసుల నుంచి వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. విచారణ జరిపిన వారిలో సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ భగీరథ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈలు నగేశ్, వెంకటేశ్వర్లు, అజిత్, పలువురు తండావాసులు ఉన్నారు. -
మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలలో జరిగిన అక్రమాలపై ఈఓపీఆర్డీ సీహెచ్‌ఎస్‌ఎన్‌ఎం రాజు, మండల జేఈ బర్ల భాస్కరరావు మంగళవారం విచారణ చేపట్టారు. గ్రామంలో కొందరిని విచారణ చేసే సమయంలో అక్రమాల అనకొండ, టీడీపీ నాయకుడు అక్కడే ఉండి అందరినీ భయబ్రాంతులకు గురిచేసే యత్నం చేశాడు. దీంతో కొందరు బయటకు రాలేకపోయారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులు అల్లాడ నగేష్ వివరాలు చెబుతుండగా ముప్పేట దాడికి యత్నించారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకొంది. అక్రమాల చిట్టా వివరించిన నగేష్ సాంకేతికంగా కొన్ని వివరాలు విచారణాధికారులు నమోదు చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడ్డవారు అక్కడే ఉంటే విచారణ ఎలా చేస్తారని, మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే యత్నాలు టీడీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. విచారణాధికారులు మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. విచారణ కొనసాగిస్తామని తెలిపారు. విచారణాధికారిని మార్చిన నాయకులు... పారాది అక్రమాలపై ఆర్డీఓ సుదర్శనదొర ఆర్డబ్ల్యూఎస్ జేఈ శంకరరావును నియమించగా, టీడీపీ నాయకులు డమ్మీ ఎంపీపీ కలిపి మండల జేఈ బర్ల భాస్కరరావును నియమించారు. శంకరరావు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడతారని, తిరిగి తమకు నష్టం కలుగుతుందనే భావంతో రాత్రికి రాత్రి విచారణాధికారి పేర్లు మార్చి తక్షణమే విచారణ చేయించేలా చర్యలు చేపట్టారు. ఏదోలా తూతూమంత్రంగా విచారణ చేయిస్తే ఊరుకోబోమని, ఆర్డబ్ల్యూఎస్ జేఈ శంకరరావును విచారణాధికారిగా ఆర్డీఓ నియమిస్తే ఆయనను ఎందుకు తప్పించారని పలువురు ప్రశ్నిస్తూ ఈ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము లోకాయుక్తకు వెళ్తామని, న్యాయవాది, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లాడ నగేష్ తెలిపారు. -
రబడ అప్పీలుపై 19న విచారణ
కేప్‌టౌన్: రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబడ అప్పీలుపై సోమవారం (ఈ నెల 19న) విచారణ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి తెలిపింది. న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్ లాయర్ హెరాన్‌ను జ్యూడిషియల్ కమిషనర్‌గా ఐసీసీ నియమించింది. ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా రబడ వాదన వింటారు. ఈ విచారణ ముగిసిన 48 గంటల్లో కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో మూడో టెస్టులోపే రబడ ఆడేది లేనిది తెలిసిపోతుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు న్యూలాండ్స్‌లో గురువారం మొదలవుతుంది. రెండో టెస్టులో ప్రత్యర్థి కెప్టెన్ స్మిత్‌తో రబడ దురుసుగా ప్రవర్తించడంతో మ్యాచ్ రిఫరీ అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలుపు హరారే: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్‌లో జింబాబ్వే ముందంజ వేసింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా... ఐర్లాండ్ 34.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), బౌలింగ్‌లో క్రీమర్ (3/18) రాణించారు. -
మీడియా వార్తలు.. నిలదీసిన వర్మ
సాక్షి, సినిమా : సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల విచారణలో జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ చిత్ర తెరకెక్కించిన ఘనత తనకే దక్కినప్పుడు.. అందులో తాను భాగస్వామిని కాలేదన్న విషయాన్ని ఎలా ప్రచురిస్తారంటూ నిలదీస్తున్నాడు. ‘అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ను అసలు తాను తీయలేదని.. కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించానని చెబుతున్నారు. సినిమా తెరెక్కించిన ఘనత నాదే అయినప్పుడు ఆ వార్తలను నేను ఖండించకుండా ఎలా ఉంటా?’ అని వర్మ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. కాగా, వర్మ తాను అసలు జీఎస్టీ తీయలేదని.. కేవలం స్క్రిప్టు మాత్రమే అందించానని విచారణలో వెల్లడించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాయగా.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడంటూ మరికొన్ని కథనాలు ప్రచురించాయి. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో, మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు అందుకున్న వర్మ గత శనివారం సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యాడు. సుమారు 3గంటలకు పైగా వర్మను విచారించిన పోలీసులు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను సీజ్ చేసి మళ్లీ ఈ శుక్రవారం(23వ తేదీ) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. For all those false news circulating that I have denied making #GodSexTruth,its only a production and technical process that I was detailing ..How can I deny when I am credited in the film? https://t.co/eJrULnCBUJ — Ram Gopal Varma (@RGVzoomin) 19 February 2018 -
ఏం జరుగుతోందిక్కడ?
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖలో గతంలో డిఐజీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ జాయింట్ ఐజీ జి.సుబ్బారాయుడు జిల్లాకు వచ్చినట్టు ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఈయన రెండు రోజులుగా రాజమహేంద్రవరం, కాకినాడలలో సబ్రిజిస్ట్రార్లతో గోప్యంగా విచారణ జరిపుతున్నట్టు తెలిసింది. గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ విశ్రాంత డీఐజీ లక్ష్మీకుమారి అక్రమాలకు పాల్పడుతున్నారని, నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో ‘స్టాంప్ డ్యూటీకి రూ.5.50 కోట్లుకు గండి’ అంటూ ‘సాక్షి’లో 2017 మే మూడో తేదీన కథనం కూడా ప్రచురితమైంది. గతంలో అందిన ఫిర్యాదు, సాక్షిలో వచ్చిన కథనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలపై జాయింట్ ఐజీ జి. సుబ్బారాయుడు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈయన మంగళవారం రాజమహేంద్రవరం జిల్లా పరి«ధిలో ఉన్న 18 మంది సబ్ రిజిస్ట్రార్లను విచారణ చేపట్టారు. అనంతరం బుధవారం కాకినాడ డీఐజీ కార్యాలయానికి చేరుకుని కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 14 మంది సబ్‌రిజిస్ట్రార్లతోపాటు, డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆరా తీసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులపై డీఐజీ వేధింపులకు పాల్పడడం, అకారణంగా తిట్టడం వంటివి చేస్తుండడంతో అప్పట్లో చాలా మంది ఉద్యోగులు మూడునుంచి ఆరు నెలల వరకు సెలవుల్లోకి వెళ్లినట్టు ఉద్యోగులు విచారణలో చెప్పారు. అలాగే జిల్లాలో ఒక మెట్ట ప్రాంతానికి చెందిన సబ్‌రిజిస్ట్రార్ ఆర్థిక లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు డీఐజీకి అండగా ఉంటూ అక్రమ లావాదేవీలు జరిపేవారని చెప్పినట్టు తెలిసింది. -
‘దక్షిణ సమర్పయామి’పై సర్కారు సీరియస్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ పేరుతో దేవాలయ ఉద్యోగులు, పూజారుల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దేవాదాయ శాఖలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన సవరణ తామే చేయించామని, అందుకు ప్రతీ ఒక్క లబ్ధిదారుడు నిర్ధారిత మొత్తం ఇవ్వాలని కొందరు నమ్మబలికారు. లేకపోతే జాబితా నుంచి పేరు గల్లంతు చేస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఈ ఉదంతంపై ‘దక్షిణ సమర్పయామి’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో అలజడి సృష్టించింది. విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఎందుకు గుర్తించలేదని ఆ శాఖ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాల వారీగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులు, అర్చకుల జాబితా ఆధారంగా వేతన సవరణ చేస్తున్నందున మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరు కూడా ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించాలని పేర్కొన్నారు. కాగా, వేతన సవరణ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఉదంతంపై ప్రభుత్వం విచారణ జరపాలని దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. -
మాల్యా అప్పగింతపై విచారణ
లండన్: భారత బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేరకు రుణాలు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. మాల్యాపై బ్యాంకులను మోసగించడం, మనీల్యాండరింగ్ తదితర కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనను తమకు అప్పగించాలని భారత్ కోరడంతో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణ సందర్భంగా మాల్యా కోర్టుకు హాజరయ్యారు. తనపై అభియోగాలను కొట్టిపారేసిన మాల్యా.. ఇవన్నీ నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా చేసిన అభియోగాలని చెప్పారు. కాగా, మాల్యా కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఫైర్ అలారం మోగడంతో విచారణకు ఆటంకం ఏర్పడింది. కోర్టు రూమ్‌ను ఖాళీ చేయించడంతో మాల్యా, ఇతరులు కోర్టు బయటే వేచి ఉన్నారు. అనంతరం కేసు విచారణ కొనసాగింది. మాల్యాపై విచారణ ఈ నెల 14 వరకూ కొనసాగనుంది. ఈ కేసులో న్యాయమూర్తి ఎమ్మా లూయీస్ ఆర్బుత్నాట్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మాల్యా తరఫున యూకే మాట్రిక్స్ చాంబర్స్‌కు చెందిన బారిస్టర్ క్లేర్ మాంట్గోమరి నేతృత్వంలోని న్యాయవాదుల బృందం.. భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రొటెక్షన్ సర్వీస్(సీపీఎస్) నేతృత్వంలోని బారిస్టర్ మార్క్ సమ్మర్స్ బృందం వాదనలు వినిపించనున్నాయి. -
చిక్కేది ఎవరో?
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై కమ్ముకున్న అనుమానాల మేఘాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఏట్టకేలకూ పనిచేయడం ప్రారంభించింది. కమిషన్ చైర్మన్‌గా గతంలో బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి శుక్రవారం చెన్నై ఎళిలగం భవనంలోని కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణ పనుల్లో నిమగ్నమయ్యారు. జయ మరణ మిస్టరీకిబాధ్యులను చేసే ప్రయత్నంలో ఎవరెవరు విచారణకుగురవుతారోననే చర్చ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. కోలుకుని ఇంటికెళ్లాల్సిన జయలలిత కానరానిలోకాలకు పోవడంపై అమ్మ అభిమానులు కోపంతో భగ్గుమన్నారు. న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని అప్పటి అన్నాడీఎంకే చీలిక వర్గనేత పన్నీర్‌సెల్వం, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నలువైపులా ఒత్తిడి పెరగడంతో న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సీఎం ఎడపాడి పళనిస్వామి గత నెల 25వ తేదీన ఒక ప్రకటన చేశారు. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామిని నియమించి జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చెన్నై మెరీనాబీచ్రోడ్డులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ఎళిలగం భవనంలో కమిషన్ కార్యాలయాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా కమిషన్ ఏర్పాటై నెలరోజులు పూర్తయినా దాటినా విచారణ ప్రారంభం కాలేదు. కార్యాలయ పనులు పూర్తికానందున మరింత జాప్యం ఖాయం, గడువులోగా నివేదిక సమర్పణ అసా«ధ్యమని రెండురోజుల క్రితం మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమిషన్ కార్యాలయానికి వచ్చి పనులు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీన పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని పరిశీలించడం ద్వారా ఆర్ముగస్వామి తన విచారణకు శ్రీకారం చుట్టనున్నారు. న్యాయవిచారణ సందర్భంగా ఎవరెవరిని విచారణకు పిలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పోయెస్‌గార్డెన్‌లోని జయ ఇల్లు వేదానిలయం పరిశీలనతో విచారణలో అసలైన అంకం సోమవారం ప్రారంభం అవుతుంది. విచారణ పారదర్శకంగా జరుగుతుందాని ప్రశ్నించగా ‘తప్పకుండా’ అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఒక నోటీసు బోర్డు పెట్టారు. అందులో...జయలలిత మరణం గురించి ప్రత్యేక సమాచారం ఉన్నవారు, నేరుగా సంబంధాలు ఉన్నవారు తగిన ఆధారాలతో సత్యప్రమాణ పత్రం ద్వారా లిఖితపూర్వకంగా తెలుపవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 22వ తేదీలోగా నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమాచారాన్ని చేరవేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, జయ మరణ నేపథ్యంతో సంబంధం ఉన్నవారిని ఆయన నేరుగా పిలిపించి మాట్లాడతారా లేక ఆయన వెళ్లి విచారిస్తారు, విచారణ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి అనే ప్రశ్నలు నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా, పార్టీ నుంచి చీలిపోయిన తరువాత పన్నీర్‌సెల్వం వర్గంలోని కొందరు నేతలు తమ వద్ద సాక్ష్యాధారాలున్నట్లు మీడియా వద్ద ప్రకటించారు. అయితే ప్రస్తుతం వారంతా ఎడపాడితో కలిసిపోయారు. ప్రజలు ఎక్కువగా అనుమానిస్తున్న శశికళను ప్రధానంగా విచారించాలని కోరుకుంటున్నారు. విచారణ కోసం ఆమెను చెన్నైకి రప్పిస్తారా, కమిషన్ చైర్మనే బెంగళూరు జైలుకు వెళతారా, చికిత్స చేసిన లండన్ వైద్యుడి మొదలుకుని అపోలో వైద్యబృందం కూడా కమిషన్ వద్ద క్యూకట్టాల్సిందేనాని చర్చోపచర్చలు సాగుతున్నాయి. -
విచారణలో జాప్యం
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీపై న్యాయ విచారణలో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. విచారణ కమిషన్ కార్యాలయ ఏర్పాటు పనులు పూర్తికాకపోవడమే జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయ కోలుకుంటున్నారు.. కోలుకున్నారు.. నేడో రేపో డిశ్చార్జ్.. అంటూ పార్టీ నేతలు, వైద్యులు ప్రచారం చేశారు. 75 రోజులపాటు జరిగిన ప్రచారానికి భిన్నంగా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జయ కన్నుమూశారు. చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలు విడుదల చేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోర్కెను ఎవరూ వినిపించుకోలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. జయ మరణంపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చీలిక వర్గ నేతగా ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం సైతం న్యాయవిచారణకు డిమాండ్ చేశారు. నలువైపులా ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి న్యాయవిచారణ కమిషన్ ఏర్పాటుచేసి రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామిని చైర్మన్‌గా నియమించారు. జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని గత నెల 25వ తేదీన సీఎం ఆదేశాలు జారీచేశారు. చెన్నై మెరీనాబీచ్ రోడ్డులోని ఎళిలగం భవనంలోని ప్రత్యేక కార్యాలయంలో విచారణ కమిషన్ చైర్మన్‌గా ఆర్ముగస్వామి గత నెల 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. గతంలో నిర్ణయించిన ప్రకారం బుధవారం నుంచి విచారణ ప్రారంభించాల్సి ఉంది. చైర్మన్ ఆరుముగస్వామి బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభిస్తారని అధికార వర్గాల్లో మంగళవారం ప్రచారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి చేరుకున్నారు. మ«ధ్యాహ్నం 2 గంటలు దాటినా చైర్మన్ రాలేదు. కారణం కోసం ఆరా తీయగా, రిటైర్డు న్యాయమూర్తికి కేటాయించిన చాంబర్లో తలుపులు, కిటికీలు, టైల్స్ అమరిక పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పారు. అంతేగాక టేబులు, కుర్చీలు, టెలిఫోన్ వసతి కూడా కల్పించలేదని తెలిపారు. విచారణ కమిషన్‌కు సహకరించే సిబ్బంది కార్యాలయపు గదుల్లో సైతం పనులు సాగుతున్నాయని అన్నారు. విచారణ ప్రారంభించడానికి ఇంకా కొన్నిరోజులు పడుతుందని సిబ్బంది వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి పరిశీలిస్తే నివేదిక సమర్పణకు ఇచ్చిన మూడు నెలల గడువులో ఒక నెల పూర్తయింది. విచారణ ప్రారంభం కాకుండానే నెలరోజులు పూర్తికావడం, కార్యాలయ పనులు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో గడువు ప్రకారం డిసెంబరు 25వ తేదీ నాటికి నివేదిక అనుమానమేని నిర్ధారించుకోవాల్సి వస్తోంది. -
జయ్షా అక్రమాలపై విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్షా అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ నోరువిప్పాలన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ప్రధాన కార్యదర్శులు దాసోజు శ్రవణ్, వినోద్‌రెడ్డి, నిరంజన్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మూడున్నరేళ్ల పాలనలో దేశం నిండా స్కాములేనని, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పేరిట చేసిన హడావుడి వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, వేలాది కంపెనీలు కుప్పకూలి దేశం ఆర్థికంగా దివాలా తీసిందని పేర్కొన్నారు. దీనివల్ల బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు లాభపడ్డారని, దీనికి తాజా ఉదాహరణ జయ్ షా కంపెనీ వ్యవహారమేనని అన్నారు. -
అమిత్ షా కొడుకుపై విపక్షాల ఫైర్
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ అమిత్ షాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జయ్ షా డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల టర్నోవర్ అసాధారణ రీతిలో భారీగా పెరిగిందంటూ ఒక న్యూస్ వెబ్సైట్ ఇటీవల బయటపెట్టింది. జయ్‌కు చెందిన ‘టెంపుల్ ఎంటర్ప్రైజెస్’ కంపెనీ టర్నోవర్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16,000 రెట్లు పెరిగిందనీ, పెరిగిన డబ్బు విలువ రూ.80 కోట్లని ఆ వెబ్సైట్ తెలిపింది. ఆయనకు 60 శాతం వాటా ఉన్న ‘కుసుమ్ ఫిన్సర్వ్ ఎల్ఎల్పీ’ కంపెనీ నిజానికి స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేది అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఓ పవన విద్యుత్తు ప్రాజెక్టు ఆ సంస్థకు దక్కిందని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత సిబల్ మాట్లాడుతూ ‘దేశానికి ప్రధాన సేవకుడిని అని చెప్పుకున్న మోదీని అడుగుతున్నా. ఆయన ఇప్పుడేం చెప్తారు? వారిని అరెస్టు చేసి దీనిపై విచారణ జరపమని ఆదేశిస్తారా?’ అని అన్నారు. కాగా వెబ్సైట్లో ప్రచురితమైనదంతా అసత్యమని, వెబ్‌సైట్‌పై రూ.వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ జయ్ ఇచ్చిన ఒక ప్రకటనను కేంద్రమంత్రి పియూశ్‌గోయల్ మీడియాకు చూపారు. -
గతేడాది ముంబైకి దావూద్ భార్య
-
గతేడాది ముంబైకి దావూద్ భార్య
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ అలియాస్ జుబీనా జరీన్ గతేడాది ముంబైకి వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మూడ్రోజుల క్రితం అరెస్టైన దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కార్ నుంచి విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలిపారు. అతని సమాచారం మేరకు.. తన తండ్రి సలీమ్ కశ్మీరీని కలుసుకునేందుకు జుబీనా గతేడాది ముంబైకి వచ్చినట్లు, ఆ తర్వాత దేశం దాటి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. దావూద్ ఇప్పటికీ పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు చెప్పాడన్నారు. కరాచీలో అతనికి నాలుగు నివాసాలు కూడా ఉన్నాయని తేలిందన్నారు. పాకిస్తాన్లో దావూద్‌తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీం, సహచరుడు చోటా షకీల్ అందరూ కలిసే ఉంటున్నట్లుగా తెలిసిందన్నారు. -
నీళ్లా.. కన్నీళ్లా?
♦ కావేరిపై పాత ఒప్పందాలు చెల్లవు ♦ తమిళనాడు వాటా ప్రశ్నేలేదు ♦ సుప్రీం కోర్టులో కర్ణాటక వాదన ♦ 15 రోజులపాటూ తుది విచారణ ♦ రైతన్నల్లో ఆందోళన కావేరి జలాల పంపిణీపై సుమారు వందేళ్ల క్రితం జరిగిన ఒప్పందాలు తమను కట్టడి చేయలేవని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. తమిళనాడుకు వాటా జలాల మాటే లేదని సుప్రీం కోర్టులో స్పష్టంచేసింది. కావేరి ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అప్పీలు పిటిషన్‌పై కర్ణాటక ప్రభుత్వం తన తుది వాదనను మంగళవారం ప్రారంభించింది. దీనిపై విచారణ 15 రోజులపాటూ ప్రతిరోజూ సాగుతుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : కావేరి జలాల వాటాకు సంబంధించి సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణపై తమిళనాడు రైతుల్లో ఆందోళన నెలకొంది. కావేరి నదీజలాల వాటా కేసులో ట్రిబ్యునల్ కోర్టు 2007లో తుది తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీలుచేశాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమిత్రాయ్, ఏఎమ్ కన్విల్గర్‌తో కూడిన బెంచ్ విచారణ ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి 21వ తేదీ విచారణకు వచ్చినపుడు, కావేరికి సంబంధించిన అన్ని కేసులు, పిటిషన్లను జూలై 11వ తేదీ నుంచి 15 రోజులపాటూ మంగళ, బుధ, గురువారాల్లో తుది విచారణ జరపాలని, ఈ 15 రోజుల్లో పిటిషన్‌దారులంతా తమ వాదనను పూర్తిచేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అంతేగాక ఈ కేసులో తుది తీర్పు వెలువడేవరకు సెకనుకు రెండువేల ఘనపుటడుగుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తుదిదశ విచారణ ఈనెల 11వ తేదీన సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రారంభం కాగా తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల న్యాయవాదులు హాజరయ్యారు. కర్ణాటక న్యాయవాదులు తమ వాదనలో.. ‘‘కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అస్థిరమైనది, చట్టానికి వ్యతిరేకమైనది. 1882, 1924లో మైసూరు, మద్రాసు రాష్ట్రాలకు మధ్య జరిగిన ఒప్పందాన్ని కావేరి నది వాటా జలాలతో ముడిపెట్టేందుకు వీలులేదు. అప్పటి మద్రాసుతో చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పటి మైసూరుపై ప్రయోగించేందుకు వీలులేదు. అలాగే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 తరువాత అంతకు ముందు చేసుకున్న ఒప్పందంపై ఒత్తిడి చేసేందుకు వీలులేదు. 1956లో కర్ణాటక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత గతంలో చేసుకున్న ఒప్పందాలపై కర్ణాటకను ఏమాత్రం కట్టుబాటు చేయలేరు. ఆయా కారణాల వల్ల సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కేవలం సుప్రీంకోర్టు అభిప్రాయంగానే పరిగణిస్తున్నాం. ట్రిబ్యునల్ సైతం ఇదే విషయాన్ని తన తీర్పులో స్పష్టం చేసింది’’అని కర్ణాటక న్యాయవాదులు తమ వాదనలో పేర్కొన్నారు. తమిళ రైతుల్లో ఆందోళన కావేరి వాటా జలాలపై ఆశలు పెట్టుకున్న తమిళనాడు రైతులకు కర్ణాటక ప్రభుత్వ వాదనతో న్యాయం చేకూరేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. 15 రోజుల్లో తుది విచారణ పూర్తయిన తరువాత వెంటనే తీర్పు వెలువడేనా, ఈ తీర్పు తమిళనాడుకు అనుకూలమా, ప్రతికూలమా అనే మీమాంస రాష్ట్రంలో నెలకొంది. -
పెద్దాసుపత్రిలోని పలు ఘటనలపై విచారణ
సాక్షి, అమరావతి ఇటీవల కర్నూలు పెద్దాసుపత్రిలో జరిగిన పలు ఘటనలపై విచారణ మొదలైంది. వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్) డా.కె.బాబ్జిని ఈ ఘటనలపై విచారణకు ఆదేశించారు. ప్రధానంగా కర్నూలు పెద్దాసుపత్రిలో కరెంటు లేకపోవడంతో 20 మంది చనిపోవడం, ఎలుకల నివారణలో భాగంగా ఒక్కో ఎలుకను పట్టుకునేందుకు రూ.25 వేలు చెల్లించడం, బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీకి నిధులు ఇప్పించేందుకు మంత్రి కామినేని పేషీ నుంచి ఫోన్లు వెళ్లడం తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైనా విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.బాబ్జిని నియమించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో డా.బాబ్జి మంగళవారం కర్నూలు పెద్దాసుపత్రిలో విచారణ చేపట్టారు. -
ఆ కుటుంబంలో కొనసాగుతున్న వార్
► నేడు చిన్నమ్మ కేసు విచారణ ► శశికళను కలిసిన దినకరన్ కేకేనగర్: అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉన్న దినకరన్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం చెన్నై బీసెంట్ నగర్‌లోగల తన ఇంట్లో ప్రతి రోజూ మద్దతుదారులతో కలిసి సమావేశాలు జరుపుతున్నారు. తరచూ పరప్పన అగ్రహారినికి వెళ్లి శశికళతో కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు శశికళను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెను కలిసినప్పుడు పార్టీలో జరుగుతున్న గందరగోళం, సమస్యల గురించి మాట్లాడేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆరోసారిగా దినకరన్ బెంగళూరు జైలుకు వెళ్లి శశికళను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో శశికళ దినకరన్‌తో పార్టీ పాలన విషయాల్లో తలదూర్చవద్దని, రాజకీయ విషయమై పర్యటనలు చేయవద్దని హితవు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకనూ మద్దతుదారులతో బహిరంగ సభలు, పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం వంటివి చేయవద్దని శశికళ ఆదేశించినట్లు సమాచారం. 7వ తేదీ విచారణ : తనపై విధించిన శిక్షను రద్దు చేయాలని గత మే నెల 17వ తేదీ శశికళ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణను జూలై 7వ తేదీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తమ చిన్నమ్మ విడుదల కావాలని ఆమె మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ముంబైలో కూడా ఆమె పేరుతో యాగాలు చేస్తున్నట్లు సమాచారం. శశికళ కుటుంబంతో కొనసాగుతున్న వార్ : టీటీవీ దినకరన్ మాటలను వినకపోవడం ఇంకనూ తన పలుకు బడిని అందరికీ తెలిపే విధంగా మన్నార్‌కుడిలో జూలై 18వ తేదీ ఎంజీఆర్ శతదినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ జైలు నుంచి విడుదలైన టీటీవీ దినకరన్ పార్టీకి రాకూడదని సీనియర్ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా శశికళ తమ్ముడు దినకరన్ మేనమామ అయిన దివాకరన్, దినకరన్ పార్టీలోనికి రాకూడదని తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాడు. ఈనేపథ్యంలో మేనమామను మంచి చేసుకోడానికి దినకరన్ తన మద్దతుదారులను రాయబారానికి పంపినా ఎలాంటి పొత్తు కుదరకపోవడంతో శశికళ కుటుంబంలో వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలపై ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలపై వివిధ శాఖల్లోని ఐదు గురి సర్టిఫికెట్లను జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ మంగళవారం పరిశీలించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పని చేస్తున్న ఉపేంద్ర, బీఎస్ఎన్లో పని చేస్తున్న మద్దిలేటి, పెద్దాసుపత్రిలో పని చేస్తున్న కొండయ్య, సవారన్న, వెంకటస్వామిలు బుడగ జంగాల కులానికి చెందిన వారైతే లింగదారికోయ సర్టిఫికెట్తో ఉద్యోగాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్ఓ విచారణ జరిపారు. అయితే తమ కులాలను నిరూపించుకునేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో విచారణను వాయిదా వేశారు. కాగా మాదాసి కురువ, మాదాసి కురుమ కుల ధ్రువీకరణ పత్రాల జారీపై కూడా డీఆర్ఓ విచారణ జరిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ ఉసేన్‌సాహెబ్, తహసీల్దార్ రమేష్‌బాబు, సి.సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ, జిల్లా స్థాయి స్క్రూటిని కమిటీ సభ్యులు, గిరిజన ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బి.మద్దిలేటి, చైర్మన్ బద్దూనాయక్, ఉపాధ్యక్షుడు మద్దయ్య, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంపరింగ్ కుంభకోణంపై జేసీ విచారణ
► బాద్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ► విచారణ తరువాత నిందుతులపై కేసులు ► మీడియాతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, విశాఖపట్నం: కొమ్మాది, మధురవాడ గ్రామాల్లో 1–బీ రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన విచారణ చేయనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విచారణ అనంతరం బాధ్యులైన అధికారులతో పాటు వెనక ఉన్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం తన చాంబర్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల పరిరక్షణ కోసమే ఈ కుంభకోణాన్ని బయటపెట్టామే తప్ప, తమకు ఎలాంటి వ్యక్తిగత శ్రద్ధ లేదన్నారు. కొమ్మాదిలో 1బీ రికార్డుల ట్యాంపరింగ్‌పై వారం రోజుల పాటు క్షేత్రస్థాయి విచారణ చేస్తామన్నారు. అనంతరం మధురవాడలో కూడా మరో రెండువారాల పాటు సర్వే చేయిస్తామని చెప్పారు. పరదేశీపాలెం, అన్నవరంలలో రెండు వారాల పాటు సర్వే జరిపిస్తామన్నారు. ఏడు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వివరించారు. మొత్తం రికార్డులన్నీ సరిచేస్తామని, ట్యాంపరింగ్ వల్ల ఎవరూ ఇబ్బందిపడకుండా చర్యలు చేపడతామన్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వడాన్ని కూడా ఈ కారణంగా తాత్కాలికంగా నిలిపేశామన్నారు. గ్రామాల్లో భూగర్భ జల పరిశోధన జిల్లాలో అన్ని గ్రామల్లో భూగర్భజలల స్థితిని తెలిసుకునేందుకు పరిశోధన చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఈ పరిశోధన 15 మండలాల్లో ప్రారంభించామన్నారు. ప్రతి గ్రామంలో వేసవికాలం, శీతకాలం, వర్షకాలం భూగర్బజలాల మట్టం ఏ స్థాయిలో ఉంటున్నాయో అంచనాలు వేసి భవిష్యత్‌లో నీరు నిల్వ ఉంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ శాటలైట్ బేస్డ్ డేటాలో ఎంటర్ చేస్తామన్నారు. గ్రామల్లో భూగర్భ జల పరిశోధన ప్రతి ఇంటికి వచ్చేనెల 8వ తేదీ నాటికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా దీపం పథకం కింద మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఇందు కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామల వారీగా గ్యాస్ కనెక్షన్ లేని వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్వే ఈ నెల 24 నాటికి పూర్తవుతుందని, ఇందులో గ్యాస్ లేని వారికి జూన్ 8లోగా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖలో ఆలస్యంగా బదిలీలు జిల్లాలోని అన్ని శాఖల్లో ఈ నెల 24వ తేదీలోగా బదిలీలు పూర్తి అవుతాయని, ఆరోగ్య శాఖలో మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి గైడ్‌లైన్స్ రావడం ఆలస్యం కావడం వల్లే బదిలీల ప్రక్రియకు సమయం పడుతుందని చెప్పారు. గిరిజన ప్రాంతంలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు, మైదానపు ప్రాంతంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేస్తున్నామన్నారు. ‘విద్యార్థుల సేవలో రెవెన్యూ’ కార్యక్రమం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా విద్యార్థులకు ధ్రువపత్రాలు జారీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. -
మూడు బృందాలతో గాలింపు
గోవిందపల్లె ( శిరివెళ్ల ) గోవిందపల్లెలో జరిగిన జంట హత్య కేసులో నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ఈశ్వరరెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలోని బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కోణాల్లో సమగ్రంగా విచారణ చేసి నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామన్నారు. దర్యాప్తు వేగంగా సాగుతుందని, ఈ దశలో వివరాలు వెల్లడించలేమన్నారు. నియోజక వర్గాలలో నాయకులకు కౌన్సెలింగ్ ఇస్తామని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సీఐ ప్రభాకరెడ్డి ఉన్నారు. -
మళ్లీ విచారణకు విజయ్‌భాస్కర్?
► ఐటీ ఎదుట సతీమణి రమ్య హాజరు ► ఇతరులకు మళ్లీ సమన్లు ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తదితరులకు ఆదాయ పన్నుశాఖ అధికారులు మరోసారి సమన్లు పంపే సూచనలు కనపడుతున్నాయి. సతీమణి రమ్యకు సైతం సమన్లు జారీచేయడం, గురువారం ఆమె విచారణకు హాజరుకావడం మంత్రిని మరింత ఆందోళనకు గురిచేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీగా మారిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని భర్తీ చేసేందుకు మేలో నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ ఓటుకు నోటుతో ధన ప్రవాహం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందిన ఫిర్యాదుల మేరకు గత నెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన స్నేహితులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాలు సహా 32 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.89 కోట్ల మేరకు ఎన్నికలకు ఖర్చు చేసినట్లు విలువైన ఆధారాలు లభించడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదాపడింది. అంతేగాక మంత్రి ఇంటి నుండి రూ.50 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ అధికారులు సమన్లు జారీచేసి తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. ఆ తరువాత అనేకసార్లు మంత్రి విచారణకు హాజరుకాగా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని సీఎం ఎడపాడిపై కొందరు వత్తిడిపెంచారు. అయితే ఆనాడు మంత్రికి టీటీవీ దినకరన్ అండగా నిలిచి మంత్రి పదవి కోల్పోకుండా కాపాడారు. అయితే ప్రస్తుతం దినకరన్ జైల్లో ఉండగా మంత్రికి ఆదరణ కరువై కష్టాల్లో పడిపోయారు. దీనికి తోడు గత రెండువారాలుగా స్థబ్దత పాటించిన ఐటీ అధికారులు అకస్మాత్తుగా మంత్రి సతీమణి రమ్యకు ఈనెల 2వ తేదీన సమన్లు జారీచేసి 3వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె బుధవారం కాకుండా గురువారం హాజరైనారు. చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు ఆమె చేరుకున్నారు. ఐటీ అధికారులు తమ విచారణలో సుమారు 50 ప్రశ్నలను సంధించి రమ్యను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు లె లిసింది. గత నెల 7వ తేదీన ఐటీ తనిఖీలకు గురైన ఎంజీఆర్ సంగీతవర్సిటీ వైస్ చాన్సలర్ గీతాలక్ష్మి, నటుడు శరత్‌కుమార్, మాజీ ఎంపీ చిటలంపాక్కం రాజేంద్రన్‌లను సైతం గతంలో అనేకసార్లు విచారించారు. శరత్‌కుమార్ సతీమణి, నటి రాధికకు చెందిన రాడాన్ టీవీ కార్యాలయంలో కూడా ఐటీ దాడులు చేసింది. ఇద్దరినీ తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. మంత్రి సతీమణి రమ్యకు సమన్లు జారీచేయడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక అక్రమాల కేసును ఐటీ అధికారులు మరోసారి ముందుకు తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ఐటీ దాడులతో ముడివడి ఉన్న మంత్రితోపాటూ ఇతరులకు మరోసారి సమన్లు జారీచేసి విచారించనున్నట్లు తెలుస్తోంది. -
నిజనిర్ధారణ కమిటీ నియామకం
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీలో కీలకమైన రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులపై విచారణకు వీసీ వై. నరసింహులు త్రిసభ్య కమిటీని నియమించారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆర్యూ నుంచి ఈసీ మెంబర్లు ప్రొఫెసర్ జి.టి.నాయుడు, ప్రొఫెసర్ కె.సంజీవరాయుడు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. వీరు విచారణ చేసి మూడు రోజుల్లో నివేదిక అందించనున్నారు. -
దంపతుల బలవన్మరణం కేసుపై డీఎస్పీ విచారణ
జంగారెడ్డిగూడెం : దంపతుల ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ఈ నెల 20వ తేదీన స్థానిక రాజుల కాలనీలో ఆటోమొబైల్ వ్యాపారి చిక్కాల సీతారామరాజు(రాజా), అతని భార్య శ్రీదేవి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే ముందు రాజా మూడు పేజీల సూసైడ్‌నోట్ రాశాడు. సూసైడ్ నోట్‌ను రాజా రాశాడా? లేక అతని భార్యతో రాయించి సంతకం పెట్టాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. రాజా చేతిరాతను, అతని భార్య శ్రీదేవి చేతిరాతను, సూసైడ్ నోట్‌ను హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. వీరిద్దరూ తాగిన విషం ఏమిటన్నది తెలియాల్సి ఉందని, ఇందుకోసం పోస్టుమార్టం నుంచి సేకరించిన నమూనాలను విజయవాడలో ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. రాజా రాసిన సూసైడ్‌నోట్‌లో తన తల్లికి పట్టణానికి చెందిన గొట్టుముక్కల రాయపరాజు, ఆయన భార్య విజయలక్ష్మి, కొడుకు వంశీ రూ.14 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఆ సొమ్ము కోసం చాలా మంది పెద్దల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని రాజా పేర్కొనడంతో సూసైడ్ నోట్లో పేర్కొన్న పెద్దలను కూడా విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే ఆటోమొబైల్ షాప్ కోసం స్థానికంగా ఉన్న ఓ బ్యాంక్‌లో రాజా రుణం తీసుకున్నాడని, దానిని కూడా సక్రమంగా చెల్లించడం లేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. రాజా ఎవరెవరి వద్ద అప్పులు తీసుకున్నది కూడా విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే గొట్టుముక్కల రాయపరాజు, కొడుకు వంశీలను అరెస్ట్ చేశారు. -
పురుడుకోసం వస్తే పాడెక్కిస్తున్నారు!
-
కేజ్రీవాల్ విచారణను ఎదుర్కోవాలి
ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలు అశుతోష్ కుమార్, విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్‌పాయ్‌లు కూడా విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును శనివారం చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుమిత్ దాస్ విచారించారు. విచారణకు జైట్లీ హాజరుకాకపోవడంపై కోర్టులో పలువురు న్యాయవ్యాదులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో తమకు ముప్పు ఉందని నిందితులు పేర్కొనడంతో... కేసుకు సంబంధించినవారు మినహా మిగిలిన వారందరినీ బయటకు పంపేయాలని భద్రతా సిబ్బందిని జడ్జి ఆదేశించారు. అనంతరం, తాము ఏ తప్పు చేయలేదని, విచారణకు సిద్ధమని నిందితులు పేర్కొన్నారు. దీంతో ఐపీసీ సెక్షన్ 500 కింద కేజ్రీవాల్, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేస్తూ జడ్జి తదుపరి విచారణను మే 20కి వాయిదా వేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో అరుణ్‌జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. -
ఫోర్జరీలతో పాగా!
సిటీబ్యూరో: మహానగరంలో ఖాళీ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. జాగా కనిపిస్తే చాలు పాగా వేయడం అక్రమార్కుల నిత్యకృత్యంగా మారింది. ఫోర్జరీ దస్తావేజులతో ప్లాటింగ్ బిజినెస్‌కు సైతం తెర లేపుతున్నారు. ఏకంగా నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వం నుంచి ఎన్వోసీలకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం విచారణలో ఫోర్జరీ వ్యవహారం బట్టబయలై అక్రమార్కులపై వరుసగా పోలీసులకు ఫిర్యాదులు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు ఖాళీ స్థలాలపై పాగా వేయడం రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే కోర్టు ఆశ్రయించడం సర్వ సాధారణంగా మారింది. రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం స్థలాల రక్షణకు చర్యలు తీసుకున్న ఫలితం లేకుండా పోతోంది. ఖాళీ స్థలాలు ఇలా.. నగరంలో ప్రభుత్వ, ప్రభుత్వ యేతర ఖాళీ స్థలాలు సుమారు లక్షకు పైగానే ఉంటాయి. అందులో ప్రభుత్వ పరిధిలో 54, 447 స్థలాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన 15,376, ఇతర శాఖలకు చెందిన 33,184, శిఖం, నాలా, కాల్వలకు సంబంధించిన 669, శ్మశాన వాటిలకు సంబంధించిన 961, ఇనామ్ 73, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 826, వక్ఫ్ బోర్డు 1188, ఎండోమెంట్ 1359, మిగులు భూమి 543 ప్యాకేజీలు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు 1316 స్థలాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీకి ముచ్చు తునకలు.. షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 102/1లో గల సుమారు ఐదెకరాలకుపైగా ప్రభుత్వ భూమిపై ముషీరాబాద్ జమీస్తాన్పూర్కు చెందిన ఒక వ్యక్తి పాగా వేశాడు. హకీంపేట కు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేసినట్లు ప్రతాలు సృష్టించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాట్ల విక్రయానికి సిద్ధమయ్యాడు. ప్రభుత్వ భూమిగా గుర్తించిన రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ భూమిపై విచారణ జరిపి, ముగ్గురు వ్యక్తులకు సంబంధం లేదని గుర్తించిన షేక్ పేట రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్‌పేట మండల పరిధిలో టీఎస్ నెంబర్ 8/1 బ్లాక్–బిలో సుమారు రెండు వేల గజాల ఖాళీ స్థలం ఉంది. డి.హైమాచౌదరి అనే మహిళ ఏకంగా హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి, బోగస్ ఎన్వోసీ సృష్టించింది. దీనిని గుర్తించిన షేక్‌పేట రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్ మండలం నామాలగుండు, సీతాఫల్ మండి టీఎస్ 42 అండ్ 2 వార్డు నంబర్ 141, జమిస్తాన్పూర్ గ్రామ పరిధిలోని ఇంటికి సంబంధించిన రుక్కమ్మ తదితరులు జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి బోగస్ డాక్యుమెంట్లతో జీహెచ్ఎంసీ నుంచి ఎన్వోసీ పొందారు. దీనిని గుర్తించిన ముషీరాబాద్ తహసీల్దారు చిలుకలగూడ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారు. బంజారాహిల్స్‌లో 3.37 ఎకరాల భూమి తమదేనని ఒక వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోజగుట్టలోని 70 ఎకరాల ప్రభుత్వం భూమి తమదేనంటూ ఒక వ్యక్తి ఏకంగా సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకున్నారు. అప్రమత్తత అవసరం భూములు, ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ , మున్సిపల్ అథారిటీలను సంప్రదించాలి. ఫోర్జరీకి పాల్పడే వారిపై చర్యలు తప్పవు. – ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ -
అల్‌ఖైదా ఉగ్రవాదుల విచారణ
నెల్లూరు (క్రైమ్): బాంబు పేలుళ్ల ఘటనలో అల్‌ఖైదా ఉగ్రవాదులను వీడియో కాన్ఫరెన్స్ (వీడియో లింకేజీ) గురువారం విచారించారు. నెల్లూరు కోర్టులో బాంబు పేలుడు ఘటనలో నిందితులైన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఎ.అబ్బాస్ అలీ, షంషూన్ కరీం రాజా, మహ్మద్ అయూబ్, దావూద్ సులేమాన్, షంషుద్దీన్ అలియాస్ కరువ షంషుద్దీన్‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి ఈ నెల 15న నెల్లూరు నాలుగో నగర పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారిని నెల్లూరు కోర్టులో హాజరు పర్చగా మార్చి 1 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు మేరకు ఈ నెల 18న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. కర్ణాటకలోని మైసూర్, కేరళలోని కొల్లాం, మలపురం, ఏపీలోని చిత్తూరు కోర్టులో బాంబు పేలుళ్లలకు వీరు పాల్పడ్డారు. దావూద్ సులేమాన్ ప్రధాన సూత్రధారిగా వారు అను మానిస్తున్నారు. ఆదివారం ప్రధాన నిందితుడిని కోర్టు ప్రాంగణంలోకి తీసుకెళ్లి బాంబు పేలుడు ఎలా చేశారనే వివరాలను విచారించారు. ఈ కేసులకు సంబంధించి గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే నిందితులు నెల్లూరు పోలీసుల కస్టడీలో ఉండటంతో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేలా ఎన్ఐఏ చర్యలు తీసుకుంది. -
పోలీసుల అదుపులో ఏడుగురు తమిళ కూలీలు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల– కమలాపురం మార్గంలో ఆర్టీసీ బస్సులో వెళుతున్న ఏడుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఆర్ఐ అలీబాషా, ఎఫ్ఆర్వో రమణారెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళ కూలీల ఆచూకీ కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ, కానిస్టేబుళ్లు హుస్సేన్, నర్సింహలు ఆర్టీసీ బస్సులో వస్తుండగా బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పూర్తి సమాచారం కోసం వారిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. -
తారుమారుకు ప్రణాళిక!
బాలుడి మృతి దురదృష్టకర ఘటనగా చిత్రీకరణ అయిన వారితోనే విచారణ హడావుడిగా నివేదిక 20న పూనం మాలకొండయ్య రాక ‘ఈఎన్టీ’ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు విశాఖపట్నం : ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాతపడ్డ బాలుడి ఉదంతాన్ని దురదృష్టకరంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుల తప్పేమీ లేదంటూ తేల్చేం దుకు సన్నాహాలు మొదలయ్యాయి. నగరంలోని పెదవాల్తేరు ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి పెందుర్తి మండలం పురుషోత్తపురానికి చెందిన మూడేళ్ల జయశ్రీకర్ మంగళవారం మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటి దాకా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో చనిపోయిన ఘటనలు లేవు. సాక్షిలో ప్రచురితమైన ఈ కథనంపై కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్ స్పందించారు. ఆంధ్రమెడికల్ కళాశాల (ఏఎంసీ) ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో,ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోకమిటీనియమించారు. విచారణ తీరుపై సందేహాలు ఎనస్థీషియా విభాగాధిపతి సత్యనారాయణ శుక్రవారం ఈఎన్టీ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రామెడికల్ కళాశాల మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ, బాలుడికి మత్తు ఇచ్చిన వైద్యుడు వేణుగోపాల్ క్లాస్‌మేట్లని, శస్త్రచికిత్స చేసిన వైద్యుడు కృష్ణకిషోర్‌కు కమిటీ సభ్యుడైన డాక్టర్ సూర్యప్రకాష్ తోటి ఉద్యోగి కావడం విచారణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల కిందట కూడా మూడు నెలల కిందట కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి మరో బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతం గా ఉండేందుకు మరో ఆస్పత్రి లేదా పొరుగు జిల్లా ఆస్పత్రుల వైద్యులతో విచారణ జరిపిస్తారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా కమిటీ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాఉండగా శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి చెందిన విషయంపై తనకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లిన ఈఎన్టీ వైద్యులు తమ తప్పేమీ లేదని చెప్పుకున్నట్టు సమాచారం. యూనిట్ రద్దు చేస్తాం! ఈఎన్టీ ఆస్పత్రిలో వరుసగా చిన్నారులు మృత్యువాత పడుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీలిప్ ప్రతినిధులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం వీరు ఆస్పత్రిని సందర్శించి, గతంలో ఒక బాలుడు మరణించినప్పుడు మిన్నకున్నామని, ఇప్పుడు మరో చిన్నారి చనిపోవడాన్ని ఉపేక్షించబోమని, ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించినట్టు భోగట్టా. 20న పూనం మాలకొండయ్య రాక..! కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు వికటించడాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆమె ఈనెల 20న విశాఖ వస్తున్నట్తు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి వర్గాల్లో కలవరం మొదలైంది. సెలవుపై సూపరింటెండెంట్? కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఫెయిలై బాలుడు మరణించిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ఆందోళన చెందుతున్న ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథబాబు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలి
సీపీఎం కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్: కార్మికుల సొమ్ముతో విద్యా వ్యాపారం చేస్తున్న నల్ల మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని విజ్ఞప్తి చేశారు. ఘట్కేసర్ సమీపంలోని కాచవాని సింగారంలో సింగరేణి కార్మికులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయగా, వాటి డెవలప్మెంట్ చార్జీల నిమిత్తం నల్ల మల్లారెడ్డి డబ్బులు వసూలు చేసి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఎవరైనా ప్లాట్ అమ్ముకునేందుకు వెళితే ప్రైవేట్ సైన్యంతో వేధింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. ఆక్రమించుకున్న ప్లాట్లను యజమానులకు తిరిగి అప్పగించాలని కోరారు. మల్లారెడ్డి, ఆయన రియల్ ఎస్టేట్ సంస్థపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. -
నిలోఫర్ ఘటనపై కలెక్టర్‌తో విచారణ
వారంలో నివేదిక ఇవ్వాలని లక్ష్మారెడ్డి ఆదేశం • కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాకు విచారణ బాధ్యతలు అప్పగించింది. నిలోఫర్ ఘటనపై ఇప్పటికే అంతర్గత విచారణ జరగగా... ముగ్గురు సభ్యుల విచారణకు ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మరోసారి అధికారులతో భేటీ అయ్యారు. నిలోఫర్ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఉన్నత అధికారులతో మంగళవారం మరోసారి సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని... అలాగని ప్రస్తుతం జరిగిన తప్పును గుర్తించి సరిదిద్దడం, తప్పు చేసిన వాళ్లను శిక్షించడం జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒక ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని... నిష్పాక్షికత ఉంటుందని భావించినట్లు మంత్రి తెలిపారు. రోగుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి కలెక్టర్‌కు ఆదేశించారు. వైద్య మంత్రి రాజీనామా చేయాలి... ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలకు బాధ్యత వహించి రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రిని టీపీసీసీ నేతలు, యువజన కాంగ్రెస్ నేతలతో కలసి మంగళవారం సందర్శిం చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. మల్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యరంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లోనే నిర్లక్ష్యంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు పట్టిన నిర్లక్ష్యపు రోగాన్ని తగ్గించాలంటే మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. నిలోఫర్ సూపరింటెండెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ, స్వైన్‌ఫ్లూ, మెదడువాపు వంటి తీవ్రమైన జ్వరాలు గ్రామీణ ప్రాంతాల్లో విజృంభిస్తు న్నాయన్నారు. వీటిని పట్టించుకోకుండా కేవలం ప్రచారంతో ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారని ఆరోపించారు. నిర్వహణ లోపంతోనే... హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ నిలోఫర్‌లో రోగుల మరణాలు బాధాకరమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి... వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రి మరణాలపై, ప్రభుత్వ వైద్యశాలలకు సరఫరా అవుతున్న మందులు, ఫ్లూయిడ్స్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కొత్త పాలకుల పేర్లు సూచించండి
కేంద్రం, బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్త పరిపాలకుల పేర్లను సూచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈనెల 27న సీల్డ్ కవర్లో వీటిని తమకు అందించాలని కోరింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బోర్డు ఎన్నికలు జరిగి నూతన పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఈ తాత్కాలిక కమిటీ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని కోర్టు పేర్కొంది. అలాగే వచ్చేనెల మొదటి వారంలో జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ప్రతినిధుల పేర్లను సూచించాల్సిందిగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బీసీసీఐని కోరింది. అంతకుముందు అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం తొమ్మిది మందితో కూడిన పరిపాలకుల జాబితాను సీల్డ్ కవర్లో అందించారు. అయితే 70 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు కమిటీలో చోటు కల్పించకూడదని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తాము కూడా వ్యక్తుల పేర్లను సూచిస్తామని బీసీసీఐ కోరడంతో కోర్టు అంగీకరించింది. అంతేకాకుండా కేంద్రానికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఏం చేస్తున్నారు? జూలై 18న కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతంగా ఉన్న బీసీసీఐ ప్రతిష్ట దెబ్బతిందని రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అందుకే ఈ తీర్పును నిలుపుదల చేయాలని రోహత్గీ కోరడంపై సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. తాము జూలైలో తీర్పు ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారంటూ రోహత్గీని ప్రశ్నించింది. లోధా ప్యానెల్ సంస్కరణలతో ఈ మూడు సంఘాలు తమ ఓటు హక్కును కోల్పోయాయి. -
మేయర్ దంపతుల హత్య కేసు 30కి వాయిదా
చిత్తూరు (అర్బన్): చిత్తూరు దివంగత మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు గురువారం చిత్తూరు కోర్టులో హాజరుపరచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కపర్తి తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
పర్వేందర్ కోసం పంజాబ్‌కు..
తీవ్ర ప్రయత్నాల్లో రూరల్ పోలీసులు నిజామాబాద్ రూరల్ (మోపాల్) : రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవనగర్ గ్రామశివారులో డిసెంబర్ 8వ తేదీన పాతనోట్ల మార్పిడి చేసి ఇస్తామని రూ.14లక్షలతో పారిపోయిన పర్వేందర్ సింగ్ కోసం సౌత్‌జోన్ రూరల్‌పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి వెళ్లారు. రెండురోజులుగా అక్కడ తీవ్రంగా గాలిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎస్ఎచ్వో ఇందూరు జగదీష్ ఆధ్వర్యంలో ఐడీపార్టీ హెడ్‌కానిస్టేబుళ్లతో కూడిన బృందం పంజాబ్‌కు బయలుదేరి వెళ్లింది. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాగైనా నిందితుడి ని పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. గత నెలలో సంఘటన జరగగానే ఎస్సై చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లిన పోలీసు బృందం వారం రోజుల తరువాత తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి పర్వేం దర్సింగ్ పాస్‌పోర్టు, వీసా ఆయన ఏ ప్రాంతాలకు వెళ్లాడనే కోణంలో విచారణచేసి వచ్చారు. అయితే కోర్టులో లొంగిపోతాడని ప్రచారం జరిగినప్పటికీ తర్వాత ఎలాం టి స్పందనా లేదు. ఈ సంఘటనలో నిందితులు పర్వేం దర్ సింగ్, కమల్‌లు బాధితులకు పిస్తోలు, తల్వార్ చూ పి బెదిరించి డబ్బులతో కారులో పారిపోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనలో నిందితుల్లో కమల్జిత్ సింగ్, కరణ్‌బీర్‌సింగ్, జగ్‌ప్రీత్‌సింగ్, అలియాస్ జగ్గాలను పోలీసులు డిసెంబర్లో అరెస్ట్ చేశారు. వీరు పంజాబ్‌కు చెందిన వారిగా విచారణలో తేలిందని రూరల్ స ర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇందూరు జగదీష్ తెలిపారు. -
పెద్దముడియం తహసీల్దార్ సస్పెన్షన్
కడప అగ్రికల్చర్, జమ్మలమడుగు : జమ్మలమడుగు నియోకవర్గంలోని పెద్దముడియం తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, వీఆర్వోలు ఓబయ్య, షహబుద్దీన్‌ను కలెక్టర్ కేవీ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయానికి తహసీల్దార్ వెంకటసుబ్బయ్య తరుచూ మద్యం సేవించి వస్తుండడం... ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తించలేకపోవడం తదితర కారణాలపై సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పదిరోజుల కిందట వీఆర్వోలు షహబుద్దీన్, ఓబయ్యతో కలిసి తహసీల్దార్ ఆళ్లగడ్డలోని ఓబార్లో మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీఓ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. దీని ఆధారంగా కలెక్టర్ తహసీల్దార్, వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జయ మృతిపై నేడు విచారణ
-
జయ మృతిపై నేడు విచారణ
టీనగర్ (చెన్నై): జయలలిత మృతిపై గురువారం మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. అనుమానాస్పద రీతిలో తమిళనాడు సీఎం జయలలిత మృతి చెందినందున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని చెన్నై అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను అన్నాడీఎంకేలో సభ్యునిగా ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే వాస్తవ విషయం ప్రజలకు తెలియలేదన్నారు. తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు. -
యాసిడ్ దాడి కేసుపై విచారణ
కేకేనగర్: వేలూరు జిల్లా తిరుపత్తూర్ సమీపంలోని కురిసిలా పట్టు మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న లావణ్య 2009లో ఉద్యోగంలో చేరింది. అనంతరం శిక్షణ పూర్తిచేసుకుని వేలూరు సాయుధదళం పోలీసుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన సొంత ఊరైన తిరుపత్తూర్‌కు బదిలీ అయ్యారు. ఇలా ఉండగా గత శుక్రవారం ఇద్దరు అగంతకులు లావణ్యపై యాసిడ్ దాడి జరిపిన సంఘటన తెలిసిందే. దీంతో ఆమె కుడికన్ను పూర్తిగా దెబ్బతిని చూపు కోల్పోయింది. దీనిపై ఎస్పీ పగలవన్, ఐజీ తమిళచంద్రన్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న లావణ్య వద్ద విచారణ జరిపారు. లావణ్య వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా సంఘటన రోజు ఆమె ఎవరితో మాట్లాడిందనే వివరాలను పోలీసులు పరిశీలించారు. అవి పోలీసుల నంబర్లుగా తెలిశాయి. ఈ నంబర్ల ద్వారా విచారణ జరుపుతున్నారు. సంఘటన రోజు లావణ్య తనకు ఒంటరిగా ఇంటికి వెళ్లేందుకు భయంగా ఉందని, తండ్రికి ఫోన్ చేసి తోడు రమ్మని పిలిచినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెపై దాడి జరిగే విషయం ఆమెకు ముందుగానే తెలిసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నారు. -
విద్యార్థుల ఘర్షణపై పోలీసుల ఆరా
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడిన ఉదంతంపై ఏఎస్ఐ మల్లికార్జున తమ సిబ్బందితో కలసి మంగళవారం విచారణ చేశారు. వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాముడితో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే -
గురుకుల పాఠశాలలో డీఎస్పీ విచారణ
- పోలీసుల అదుపులో నిందితుడు ఆళ్లగడ్డ: పడకండ్ల సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి..బుధవారం విచారణ చేపట్టారు. ఈ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థినికి ఐదు నెలల గర్భం రావడం.. ఈ వార్త సంచలనం కావడంతో డీఎస్పీ స్పందించారు. విద్యార్థిని ఎప్పుడెప్పుడు సెలవు పెట్టారు..ఆమె కోసం ఎవరెవరు వచ్చేవారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని..నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. డీఎస్పీ వెంట సీఐలు దస్తగిరిబాబు, ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? ఇదిలా ఉండగా.. విద్యార్థిని గర్భానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పడకండ్ల గ్రామానికి చెందిన యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అహోబిలంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వీరిద్దరి మధ్య మాటమాట కలిసి ప్రేమగా మారినట్లు..పెళ్లి చేసుకుంటానని నిందితుడు నమ్మించినట్లు సమాచారం. గర్భం పోయేలా మాత్రలు వేసుకోమని సలహా ఇచ్చినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చెప్పినట్లు తెలిసింది. అమ్మాయి, కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారం. -
19న డు ప్లెసిస్ విచారణ
దుబాయ్: బాల్ టాంపరింగ్ ఆరోపణలపై దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ చేసుకున్న అప్పీల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈనెల 19న విచారించనుంది. జ్యుడీషియల్ కమిషనర్ మైకేల్ బెలాఫ్ అతడి వాదనలు వింటారని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరుగుతుంది. ఐసీసీతో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చెందిన లీగల్ కౌన్సిల్లు కూడా ఇందులో పాల్గొంటారు. డు ప్లెసిస్ స్వయంగా హాజరుకాకుండా టెలిఫోన్ లింక్ ద్వారా అందుబాటులో ఉంటాడని ఐసీసీ తెలిపింది. -
ఎరక్కపోయి..ఇరుక్కుపోయాడు
దుబాయ్ పోలీసుల చెరలోపాతబస్తీ యువకుడు సాయం చేయబోరుు నిషేధిత మత్తు టాబ్లెట్లు ఉండటంతో అరెస్టు విషయం తెలిసి తప్పించుకున్న సూత్రధారులు సిటీబ్యూరో: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పరిచయస్తులకు సాయం చేయబోరుు ఇబ్బందుల్లో పడ్డాడు. తనకు తెలియకుండానే స్మగ్లర్‌గా మారడంతో దుబాయ్ విమానాశ్రయంలో అధికారులకు చిక్కాడు. విషయం తెలిసి సూత్రధారులు తప్పించుకుని పారిపోగా... ఎరక్కపోరుు ఇరుక్కుపోరుున యువకుడు మాత్రం ప్రస్తుతం దుబాయ్‌లో విచారణ ఎదుర్కోబోతున్నాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం వెళ్తుండగా పాతబస్తీలోని బార్కస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత నెలలో ఉద్యోగం కోసం దుబాయ్ పయనమయ్యాడు. ఈ విషయం తెలిసిన పరిచయస్తులు దుబాయ్‌లోనే ఉన్న తమ వారికి స్వీట్లు తీసుకువెళ్ళాల్సిందిగా కోరారు. కేవలం మిఠారుులే కదా అనే ఉద్దేశంతో సదరు యువకుడు అందుకు అంగీకరించాడు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఆ పరిచయస్తులు ఓ స్వీట్ ప్యాకెట్‌ను పార్శిల్ చేసి తీసుకువచ్చి అతడికి ఇచ్చారు. తన లగేజ్‌తో పాటు దానిని తీసుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన యువకుడు దుబాయ్‌లో దిగిన తర్వాత ఇబ్బందులు మొదలయ్యారుు. తనిఖీల్లో బయటపడిన ట్యాబ్లెట్స్... దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు సదరు యువకుడితో పాటు అతడు తీసుకువచ్చిన లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్వీట్ బాక్స్ అడుగున ఉన్న మూడు స్ట్రిప్స్ మత్తు ట్యాబ్లెట్లను గుర్తించారు. వీటిపై ఆ దేశంలో నిషేధం ఉన్నందున వీటిని కలిగి ఉంటే అక్కడి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో నిషేధిత ట్యాబ్లెట్లు తీసుకువచ్చిన యువకుడిని దుబాయ్ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ స్వీట్ ప్యాకెట్ తనది కాదని, పరిచయస్తులు దుబాయ్‌లో ఉన్న తమ వారి కోసం పంపించారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. ఫోన్ చేయడంతో కథ అడ్డం తిరిగి... యువకుడు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు ఆ ప్యాకెట్ ఎవరికి అందించాల్సి ఉందో వారికి ఫోన్ చేసి రప్పించాల్సిందిగా ఆదేశించారు. ఇందుకోసం ఓ ఫోన్ కాల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అరుుతే నగర యువకుడు దుబాయ్‌లో వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన వారికి ఫోన్ చేయకుండా... నగరంలో దాన్ని తనకు ఇచ్చిన పరిచయస్తులకు కాల్ చేసి విషయం చెప్పాడు. తన ప్రమేయం లేకుండా తనను ఇబ్బందుల పాలు చేశారంటూ వాపోయాడు. దుబాయ్‌లో స్వీట్ ప్యాకెట్ తీసుకోవాల్సిన వారి వివరాలు వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడి అధికారులు అరెస్టు చేస్తారని భావించిన ‘పరిచయస్తులు’ వెంటనే ఫోన్ ద్వారా అక్కడి తమ వారిని అప్రమత్తం చేశారు. ఢిల్లీకి పారిపోరుు వచ్చిన సూత్రధారులు... హైదరాబాద్‌లో ఉన్న వారి ద్వారా విషయం తెలుసుకున్న ‘ప్యాకెట్ రిసీవర్లు’ తక్షణం దుబాయ్ వదిలేశారు. ఆఘమేఘాల మీద ఆ దేశం విడిచిపెట్టి, వివిధ దేశాలు తిరుగుతూ ఢిల్లీకి వచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు సూత్రధారులకు సహకరించడానికే హైదరాబాద్ యువకుడు ఫోన్ చేిసినట్లు భావింస్తూ సదరు యువకుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు అక్కడి న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఢిల్లీ పారిపోరుు వచ్చిన, నగరంలో ఉన్న సూత్రధారులు చిక్కితే తప్ప పాతబస్తీ యువకుడు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకు నిషేధించారంటే... మత్తు ట్యాబ్లెట్స్ను దుబాయ్‌లో నిషేధించడానికి పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు ఈ తరహా ట్యాబ్లెట్లు అక్కడ కూడా లభించేవి. మరోపక్క దుబాయ్‌లో నివసిస్తున్న పాకిస్థానీయులు జర్దాను విరివిగా వినియోగిస్తున్నారు. ఆ దేశానికి చెందిన యువత మత్తు మందులు, డ్రగ్స దొరకని సందర్భాల్లో ఈ రెంటినీ శీతలపానీయాల్లో కలిపి తాగుతున్నారు. దీంతో నిషాలో జోగుతూ ఆ మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు వదులుతున్నారు. వరుసగా వెలుగులోకి వచ్చిన ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అక్కడి అధికారులు మత్తు ట్యాబ్లెట్స్, జర్దా విక్రయాలను నిషేధించారు. కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే అనుమతులు తీసుకున్నాక పరిమితంగా విక్రరుుంచే అవకాశం ఉంది. -
కార్యదర్శి స్వాహాకారం
► సభ్యులకు ఇవ్వాల్సిన ప్లాట్లు సొంతవారికి ధారాదత్తం.. ► మరికొన్ని ఇతరులకు అక్రమంగా విక్రయం ► రు.5 కోట్ల విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతం ► ఆ ప్లాట్లలోనే అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకం ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీలో స్వాహాకాండ ► అరెస్టరుునా ఆగని దందా.. అధికార పార్టీ నేతల అండ ► విచారణ పేరుతో సాగదీస్తున్న అధికారులు కబ్జాకు కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు ప్రబుద్ధులు.. అనడమేంటి.. ఆచరణలోనూ చూపిస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా.. సొసైటీ పాలక పెద్దలే ప్లాట్లను అన్యాక్రాంతం చేసి.. ఎడాపెడా స్వార్జనకు పాల్పడుతున్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత కుటుంబ సభ్యులకు గిఫ్ట్.. అన్న ముద్దు పేరుతో రెండేసి ప్లాట్లు ధారాదత్తం చేసేశారు. ఆనక వాటిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఎంచక్కా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు నగర శివారులోని పీఎంపాలెం పరిధిలో ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సొసైటీ నిలయంగా మారింది. కోట్ల విలువైన ఈ స్వాహాకాండ గురించి వింటే ఎవరైనా ఔరా.. అనక మానరు. విశాఖపట్నం: ఫొటోలో ఈ అపార్టుమెంట్ చూశారుగా.. నగరంలో సొసైటీల స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. సెంట్రల్ ఎకై ్సజ్ అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సోసైటీ(నెం.1561) 1971లో సహకార సంఘంగా రిజిస్టర్ ్రఅరుు్యంది. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 5వ వార్డు పరిధిలోకి వచ్చే పీఎంపాలెంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వే నెం.359, 360లలో చెరో 10 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి చాణక్యపురి లే అవుట్‌గా అభివృద్ధి చేసి సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి 267 గజాలు చొప్పున సర్వే నెం.359లో 107, సర్వే నెం.360లో 102 ప్లాట్లు కేటారుుంచారు. అదే విధంగా నగరపాలెంలోని అయోధ్యనగర్‌లోని సర్వే నెం.63లో 15, సర్వే నెం.2లో 72 ప్లాట్లు కూడా ఇచ్చారు. అక్కడి వరకు అంతా సజావుగానే సాగినా.. ప్లాట్ల విభజన తర్వాతే అసలు కథ మొదలైంది. ఇష్టారాజ్యంగా తనవారికి కేటారుుంపులు సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన డబ్బీరు గౌరీశంకరరావు అనే వ్యక్తి కోట్ల రూపాయల విలువైన సొసైటీ ప్లాట్లను సభ్యులకు తెలియకుండా తెగనమ్ము కున్నాడు. అక్కడితో ఆగకుండా సొసైటీ సభ్యులకే కేటారుుంచాల్సిన సర్వే నెం.359లో 94, 95.. సర్వే నెం. 360లో 24, 25, 26, 27 ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులకు గిఫ్టుల పేరుతో కట్టబెట్టేశాడు. మరో రెండు ప్లాట్లను మైనర్లకు అమ్మేశాడు. ఇలా సుమారు రు.ఐదు కోట్లు విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతమయ్యారుు. ఈ ప్లాట్లలోనే ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నారుు. ఇక సర్వే నెం.2లోని 79 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో సభ్యులకు కూడా తెలియని పరిస్థితి.రిటైరైన తర్వాత ఇల్లు కట్టుకుని శేష జీవితం హారుుగా గడుపుతామనుకున్న పలువురు సొసైటీ సభ్యులు తమ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పదవి నుంచి తొలగించినా.. సొసైటీ అస్తులకు కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన కార్యదర్శే తమ స్థలాలను అమ్ముకున్నాడని.. సొంతవారికి కట్టబెట్టేశాడని ఆలస్యంగా గుర్తించిన సొసైటీ సభ్యులు అవాక్కయ్యారు. తర్వాత తేరుకొని కార్యదర్శిని తొలగిస్తూ సొసైటీ సమావేశంలో తీర్మానం చేశారు. అరుుతే సొసైటీ తన చేతుల్లో ఉందని, తనను తొలగించే అధికారం సభ్యులకు లేదని గౌరీ శంకరరావు తేల్చిచెప్పడంతో అతనిపై న్యాయపోరాటానికి సభ్యులందరూ సిద్ధమయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ హౌస్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. బైలాకు వ్యతిరేకంగా స్థలాల కేటారుుంపులు జరిపినట్లు విచారణలో సహకార శాఖాధికారులు గుర్తించారు. ఈ కేటారుుంపులు అక్రమమేనని కో-ఆపరేటివ్ సోసైటీ ‘51 ఎంకై ్వరీ రిపోర్టు ప్రకారం’ నిర్థారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గౌరీశంకరరావును అరెస్ట్ కూడా చేశారు. అధికార పార్టీ నేతల అండ మరోవైపు జైలుకు వెళ్లిన వ్యక్తి కార్యదర్శిగా కొనసాగటం చెల్లదంటూ సహకార శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆదేశాలిచ్చారు. అరుునా పట్టించుకోని గౌరీశంకరరావు అధికార పార్టీ నేతల అండదండలతో ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి సాగదీస్తున్నాడని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి కోర్టు తప్పుబట్టినా..సహకార శాఖాధికారులు కాదు పొమ్మన్నా సరే పట్టించుకోకుండా సొసైటీకి చెందిన ప్లాట్లలో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ అమ్మేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించాం దీనిపై సహకార శాఖ జారుుంట్ రిజి్ట్రార్ గౌరీశంకర్‌ను వివరణ కోరగా. ఇటీవలే కొంతమంది సొసైటీ సభ్యులు తమకు మరోసారి ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంపై విచారణ జరపమని జిల్లా రిజి్ట్రార్ను ఆదేశించామన్నారు. జిల్లా రిజి్ట్రార్ సన్యాసినాయుడ్ని వివరణ కోరగా, ప్లాట్ల అన్యాక్రాంతం..అక్రమ నిర్మాణం వ్యవహారం కోర్టులో ఉందన్నారు. కాగా కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాలని కార్యదర్శి వ్యతిరేక వర్గీయులు తమను కోరారని.. త్వరలోనే ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా గిఫ్టులు డబ్బీరు గౌరిశంకరరావు అనే వ్యక్తి ఈ సొసైటీకి కార్యదర్శిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా తన తమ్ముడి కుమారునికి, తన కూతురికి రెండేసి ప్లాట్లు గిప్ట్గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం చెల్లదని సహకార శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. పైగా మరో రెండు ప్లాట్లు మైనర్లకు గిప్ట్ ఇచ్చారు.. అదీ చెల్లదు. వీటన్నిటిలో అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. - డి.సత్యనారాయణ, రిటైర్డ్ ఏడీఈ, విద్యుత్ శాఖ సొసైటీ సభ్యుడు -
నోట్ల రద్దు స్కాం అన్నవారే అవకతవకలకు..
పాతనోట్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై ఆ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చార్జీల రూపంలో వసూలుచేసిన చిన్నమొత్తంలో విలువ కలిగిన నోట్లను, కాయిన్లను టీడీసీ పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తుందని పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించినట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిజంగానే పాత నోట్ల మార్పిడిలో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతుందనే తెలిస్తే, ఈ విషయంలో ప్రభుత్వం క్రిమిషన్ విచారణకైనా వెనుకాడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూలుగా డీటీసీ రూ.3కోట్లను డిపాజిట్ చేసిందని, అవన్నీ పాత కరెన్సీ నోట్లేనని ఢిల్లీ ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెవెన్యూలు ఎక్కువగా రద్దైన నోట్ల రూపంలోనే ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డీటీసీ అవతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నగదంతా ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల రూపంలో సేకరించిన మొత్తమేనని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ విరాళాలుగా సేకరించిన మొత్తాన్ని ఈ రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ కూడా లెఫ్టినెట్ గవర్నర్ నజీబ్ జంగ్కు లేఖ రాశారు. డీటీసీ బస్సులో ప్రయాణించే వారంతా దిగువ మధ్యతరగతికి చెందినవారే ఉంటారని, వారందరూ చిల్లర రూపంలోనే టిక్కెట్లను కొనుగోలుచేస్తారని ఉపాధ్యాయ చెప్పారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజాసంస్థలకు మరక అంటకముందే టీడీసీ మేనేజ్మెంట్ను మేలుకొల్పాలని ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం ప్రకటించగానే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మండిపడ్డారు. ఇది ఓ పెద్ద స్కాం అంటూ తెగ రాద్ధాంతం చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వంలోనే పాత నోట్ల మార్పిడిలో అవకతవకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
అక్రమాలపై జేసీ విచారణ
గోనెగండ్ల: మండల కేంద్రంలో మీసేవా నిర్వాహకుడు మునిస్వామి, వీబీకే రంగన్నలు పాల్పడిన అక్రమాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.బతికి వున్న వారి పేరుపై మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమ్ఆద్మీ పథకం కింద బీమా సొమ్మును కాజేశారని, మీసేవా కేంద్రం, ఆధార్ కేంద్రాల్లో పలు అక్రమాలు పాల్పడటమే కాకుండా భూ అక్రమాలకు తావిచ్చారని మానవ హక్కుల కమిషన్‌కు బాధితులు ఫిర్యాదులు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు జేసీ గత నెల18వ తేదీన విచారణ జరపాల్సి ఉంది. అనివార్య కారణాలతో విచారణ వాయిదా పడింది. ఎట్టకేలకు బుధవారం జేసీ బహిరంగ విచారణ చేశారు. భూములు కోల్పోయిన రైతులను ఒక్కొక్కరిని విచారించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. మీసేవా నిర్వాహకులు, కావేరి గ్రామైక్య సంఘం సభ్యులు, వీబీకేలపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ విచారణ చేశామని, బాధితులు కొన్ని ఆధారాలు ఇచ్చారన్నారు. కొన్ని అక్రమాలున్నయని దీనిపై మరింత విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని జేసీ పేర్కొన్నారు. విచారణలో అక్రమాలు తేలితే మీసేవా కేంద్రాన్ని కూడా రద్దు చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో మీసేవా ఏఓ లక్ష్మిదేవి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి వాదన వారిది!
- రాష్ట్ర బీసీ కమిషన్‌కు పోటాపోటీగా కుల సంఘాల అభిప్రాయాలు - పాములపాడులో స్వల్ప వాగ్వాదం - కరివేనలో ప్రశాంతంగా ముగిసిన విచారణ పాములపాడు: కాపు, బలిజలను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట కుల సంఘాలు పోటాపోటీగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం పాములపాడు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను జస్టీస్ మంజునాథ్, సభ్యులు ఎదుట వ్యక్తపరిచారు. అంతకు ముందు జస్టీస్ మంజునాథ్ మాట్లాడుతూ మండలంలోని కులాలు, జనాభా, వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతుల గురించి వివరించాలని కోరగా.. తహసీల్దార్ నాగేంద్రరావును వినిపించారు. అనంతరం బీసీ, ఎస్సీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే బీసీ జాబితాలో 140 కులాలున్నాయని, మరో 14 కులాలను చేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన విచారణను తప్పుబట్టారు. అలాగే బలిజ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఏ మాత్రం పట్టించకోకుండా ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా బలిజలు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారని బీసీ సంఘం నాయకుడు సంజీవరాయుడు అనడంతో కొంత వాగ్వావాదం చోటు చేసుకుంది. జస్టీస్ మంఽజునాథ్ కల్పించుకొని ఒకరి గురించి ఇంకొకరు విమర్శించడం తగదని, ఎవరి వాదనలు వారు వినిపించుకోవాలని చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. కుల సంఘాల నాయకులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. మంజునాథ్ కమిటీ సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ఆచార్య మల్లెలపూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, సభ్య కార్యదర్శి కృష్ణమోహన్, బీసీ వెల్ఫేర్ ఈడీ ఉశేన్సాహెబ్, ఆర్డీ రఘుబాబు, తహసీల్దార్ నాగేంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరనాయక్, సిబ్బంది, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హత్యోదంతం.. అనుమానాలే ఆసాంతం
కడప అర్బన్ : స్థానిక ప్రభుత్వ బాలుర గృహం ఆవరణలోని బాలుర పరిశీలన గృహం(జువైనల్ హోం)లో బాలుడు ముస్తఫా సహచర బాలుడి చేతిలో బుధవారం రాత్రి దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ గృహంలో సిబ్బంది 24 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటారు. అయినా హత్య చోటు చేసుకోవడం వెనుక కారణాలను పరిశీలిస్తే.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ముస్తఫా (16), మహబూబ్ బాషా, గౌతమ్ ఇటీవల చోరీలకు పాల్పడటంతో పోలీసులు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కడప ప్రభుత్వ బాలుర గృహం ఆవరణలోని బాలుర పరిశీలన గృహానికి తరలించారు. ఈ ముగ్గురితోపాటు నేరాలకు పాల్పడి పర్యవేక్షణ పరిధిలోకి వచ్చిన మరి కొందరిని అదే గృహంలో ప్రత్యేక పరిశీలనా విభాగంలో ఉంచి గృహం సిబ్బంది 24 గంటలు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే మహబూబ్ బాషా, గౌతమ్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను ముస్తఫా అడ్డుకున్నాడు. దీంతో మహబూబ్ బాషాకు, ముస్తఫాకు మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ముస్తఫా బాత్రూముకు వెళ్లాడు. అది గమనించిన మహబూబ్‌బాషా అక్కడికి వెళ్లి ముస్తఫాతో గొడవపడి తన దగ్గరున్న టవల్‌తో అతని గొంతు చుట్టూ బిగించి దారుణంగా హత్య చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యం: ఈ మొత్తం సంఘటనలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిశీలన గృహంలో తప్పనిసరిగా ప్రభుత్వ బాలుర గృహం సూపర్వైజర్ నిరంతరం విధుల్లో ఉండాలి. కానీ సంఘటన జరిగిన సమయంలో సంబంధిత సిబ్బంది అక్కడ విధుల్లో ఉన్నారా? లేక నిర్లక్ష్యంగా నిద్రపోయారా? అనే వ్యవహారంపై విచారణ చేయాల్సి ఉంది. అలాగే సంఘటనకు ముందు రోజు అక్కడున్న ఏడుగురు బాలురుల్లో నిందితుడు మహబూబ్‌బాషా.. గౌతమ్ కోసం ముస్తఫా వాగ్వివాదానికి దిగడం లాంటి సంఘటనలపై నిరంతర పరిశీలన ఉంటే సర్దుబాటు చేసే అవకాశం ఉండేది. కానీ అలాంటిదేమి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణ సంఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హత్య జరగక ముందు మహబూబ్‌బాషా.. ముస్తఫా మెడ చుట్టూ టవల్ వేసుకుని బాత్రూము వైపు లాక్కెళ్లాడా? లేదంటే మరెవరి సహాయమైనా తీసుకున్నాడా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. మృతుడు ముస్తఫా, నిందితుడు మహబూబ్‌బాషా సమాన వయస్సు, సమాన శరీర సౌష్టవం కలిగిన వారే! కానీ మహబూబ్‌బాషా చేతిలో దారుణంగా హత్యకు గురి కావడం ఎంత వరకు అవకాశం ఉంది? అలాగే మరొకరి సాయం లేకుండా ఇలాంటి సంఘటన అసాధ్యమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పోలీసులు, అధికారులు ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ ముస్తఫా బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి ముస్తఫా మృతదేహానికి కడప ఆర్డీఓ చిన్నరాముడు సమక్షంలో మెజిస్ట్రీరియల్ విచారణ అనంతరం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. జేడీ విచారణ ముస్తఫా సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ బాలుర సంక్షేమ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌మూర్తి విచారణ చేపట్టారు. ఆయన శుక్రవారం కడపకు వచ్చి బాలుర పరిశీలన గృహంలో పని చేస్తున్న సూపర్వైజర్లు, సూపరింటెండెంట్, సిబ్బందిని విచారణ చేశారు. సంఘటన జరిగిన బాత్రూము, తదితర ప్రదేశాలను పరిశీలించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని ప్రత్యేకంగా విచారణ చేశారు. ముస్తఫా బంధువులు కలిసి తమ స్టేట్మెంట్ను ఇచ్చారు. అనంతరం జేడీ మీడియాతో మాట్లాడుతూ ముస్తఫా మరణంపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నామన్నారు. సంఘటన బాత్రూములో జరిగిందని తమకు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించారనే విషయాన్ని తెలుసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిబ్బంది 24 గంటల పాటు పరిశీలిస్తూనే ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. సమగ్రంగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తామని ఆయన వివరించారు. -
నగల మాయంపై కొనసాగుతున్న విచారణ
సీసీ టీవీ పుటేజీల పరిశీలన భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. సీతమ్మ వారి పుస్తెలతాడు, లక్ష్మణస్వామి లాకెట్ మాయమై, పది రోజుల తర్వాత తిరిగి అదే చోట కనిపించిన వ్యవహారంలో కొంతమంది అర్చకులు, దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఉందనే ప్రచారం సాగింది. దీనిపై డీఈ రవీందర్‌ను విచారణ అధికారిగా నియమించారు. గర్భగుడిలో నగలు భద్రపరిచే బీరువాలోకి ఎవరెవరు వెళ్లారో సీసీ టీవీ పుటేజీలను ఆదివారం పరిశీలించారు. పవిత్రోత్సవాలు ప్రారంభమైన ముందు రోజు ఓ అర్చకుడు నగలు భద్రపరచగా.. పవిత్రోత్సవాలు ముగిసిన తరువాత స్వామివారి కల్యాణం ప్రారంభించిన రోజున మరో అర్చకుడు నగలు బీరువాలోంచి తీసుకొచ్చినట్లుగా వెల్లడైంది. నగలు మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకు మొత్తం 12 మంది అర్చకులు గర్భగుడిలోని బీరువా వద్దకు వెళ్లి వచ్చినట్లుగా సీసీ పుటేజీల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఈవో రమేశ్‌బాబుతో చర్చించిన తర్వాత అర్చకుల నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, దేవస్థానంలోని అధికారితోనే నగల మాయంపై విచారణ జరిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణుడి లాకెట్‌ను అమెరికాలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు అమ్మే క్రమంలోనే వాటిని మాయం చేశారని, ఇందులో దేవాదాయశాఖకు చెందిన ఓ కీలక వ్యక్తి ప్రమేయం కూడా ఉందనే ప్రచారం సాగింది. భక్తుల నుంచి వస్తున్న విమర్శలతో దీనిని మరుగున పరిచేందుకే దేవస్థానం అధికారులు విచారణకు ఇక్కడి అధికారిని నియమించారనే ఆరోపణలు వస్తున్నారుు. ఈ మొత్తం పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఉన్న కొంతమంది అర్చకులు త్వరలోనే దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వైదిక కమిటీలోని ఓ కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది.