NIMS Hospital
-
ఫలితాలకు షార్ట్‌కట్స్ ఉండవు!
‘పనిలో షార్ట్ కట్స్ ఉండచ్చు. కానీ, ఫలితాలు అందుకోవాలంటే దీర్ఘకాలం ప్రయత్నించాల్సిందే’ అంటారు డాక్టర్ పింగళి ఉషారాణి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మకాలజీలో డీఎమ్‌గా ఉన్న డాక్టర్ పింగళి ఉషారాణి చేసిన పరిశోధనలకు గాను ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్‌సీఆర్) నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాతికేళ్లుగా క్లినికల్ ఫార్మకాలజీలో తాను చేస్తున్న కృషి గురించి వివరించారామె ...‘మా వర్క్‌లో పేషెంట్ కేర్, రీసెర్చ్ రెండూ ఉంటాయి. గాంధీ, నిమ్స్ ఫార్మాస్యుటికల్ విభాగాలలో ఎలాంటి వర్క్ జరుగుతుందో బయటి వారికి తెలియదు. అకడమిక్ విభాగంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, పంపుతారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ, దీని వెనకాల ప్రతిరోజూ పరిశోధన ఉంటుంది. విద్యార్థులకుప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం ఉంటుంది.మందుల పనితీరుపై పరిశోధనలుకార్డియో, లివర్ చికిత్సలకు, నొప్పులకు వేసుకునే మందులు పేషంట్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి... అనే అంశంపై పీహెచ్‌డి స్టూడెంట్స్‌తో కలిసి పరిశోధన చేశాం. దేశవ్యాప్తం గా ఉన్న ఫార్మకాలజీ స్టూడెంట్స్‌కి ప్రతియేటా ట్రైనింగ్ ఇస్తుంటాం. పరిశోధనలు చేయడానికి అన్ని మెడికల్ కాలేజీలకు సరైన పరికరాలు ఉండకపోవచ్చు. అందుకని అందరికీ అర్ధమయ్యే విధంగా మా పరిశోధనల ఫలితాలు తీసుకువస్తున్నాం. పాతికేళ్ల ప్రయాణంఈ రంగంలో నా వర్క్ మొదలు పెట్టినప్పుడు ఏదీ సులువుగా లేదు. ఒక్కోసారి 15–18 గంటలు వర్క్‌లో ఉండాల్సిన రోజులు ఉన్నాయి. పనికి షార్ట్‌కట్స్ ఉండచ్చు, ఫలితాలకు మాత్రం షార్ట్ కట్స్ ఉండవు అనేది తెలుసుకున్నాను. ప్రతి నిమిషమూ విలువైనదేఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, సవాళ్లు ఉంటేనే మరింత బాగా పనిచేయగలం. ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్స్‌కు బ్లడ్ లెవల్స్‌లో మందుల వాడకం పైన వర్క్ చేస్తున్నాం. మన వర్క్‌ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకుని, ఆపైన కృషి చేస్తూ పోతే మంచి గుర్తింపు వస్తుంది. మన వర్క్‌ని మనం బాగా ఇచ్చాం అనే సంతృప్తి కూడా దానికి తోడవుతుంది. నేర్చుకోవాలనే తపన ఏ వయసులోనైనా ఉండాలి’ అని వివరించారు ఉషారాణి. క్లినికల్ ఫార్మకాలజీలో డిఎమ్ అంటే ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదా డిఎమ్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పేషంట్ కేర్ – రీసెర్చ్ డెవలప్మెంట్ లో చేసిన ఇన్నేళ్ల కృషికి ఫలితంగా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. ఐఎస్‌సిఆర్ ప్రెసిడెంట్ పురస్కారంతో పాటు క్లినికల్ రీసెర్చ్‌లో భాగంగా అవార్డులు, ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో పాల్గొనే అవకాశాలూ లభించాయి. – డాక్టర్ పింగళి ఉషారాణి – నిర్మలారెడ్డి -
‘లగచర్ల’ రైతుకు బేడీలు!
సంగారెడ్డి/ సంగారెడ్డిటౌన్/దుద్యాల్/సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’కేసులో అరెస్టయి జైలులో ఉన్న రైతు ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురైతే.. చేతులకు సంకెళ్లు వేసి, గొలుసుతో కట్టి ఆస్పత్రికి తరలించిన ఘటన కలకలం రేపింది. ఆరోగ్యం బాగోలేని రైతుకు బేడీలు వేయడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సంగారెడ్డి జైలులో అస్వస్థతకు గురైన రైతు హీర్యానాయక్‌ను జైలు అధికారులు, పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారమే అస్వస్థతకు గురైన రైతు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ వద్దని, తమ భూములు ఇవ్వబోమని గిరిజన రైతులు ఆందోళనకు దిగడం.. ‘లగచర్ల’గ్రామంలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో అరెస్టయిన 45 మంది రైతులు సుమారు నెల రోజులుగా సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిలో దుద్యాల్ మండలం పులిచర్లకుంట తండాకు చెందిన గిరిజన రైతు హీర్యా నాయక్ బుధవారం సాయంత్రం ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక పరీక్షలు చేసిన జైలు వైద్యులు, అధికారులు.. చికిత్స కోసం గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రైతును పోలీసు జీపులో.. చేతులకు బేడీలు వేసి, గొలుసుతో కట్టి తీసుకువచ్చారు. అలాగే బేడీలు, గొలుసుతో ఆస్పత్రి లోపలికి నడిపించుకుని తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం చెలరేగింది. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి... సంగారెడ్డి ఆస్పత్రి వైద్యులు హీర్యానాయక్‌కు పలు వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. అక్కడి అనుభవజు్ఞలైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ మేరకు జైలు అధికారులు, పోలీసులు హీర్యానాయక్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ యూనిట్లో కార్డియాలజీ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు నిమ్స్ అధికారులు తెలిపారు. హీర్యానాయక్ వెంట ఆయన భార్య దేవిబాయి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఛాతీలో నొప్పి వస్తోందని రోదిస్తూ.. జైలులో ఉన్న హీర్యానాయక్ బుధవారం రాత్రి తండ్రి రూప్లానాయక్, తల్లి జెమినీబాయి, భార్య దేవిబాయిలతో ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తనను ఎలాగైనా తీసుకెళ్లాలని, అక్కడే ఉంటే చనిపోయేలా ఉన్నానని రోదించాడని తెలిపారు. దీనితో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం సంగారెడ్డికి బయలుదేరారు. అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలిసి, అక్కడికి వెళ్లారు. అయితే హీర్యానాయక్‌ను చూసేందుకు పోలీసులు చాలాసేపు అనుమతించలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గుండె పోటుకు గురైన వ్యక్తికి ఇలా బేడీలు వేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుక్కి ఏం జరిగినా సీఎం బాధ్యత వహించాలి.. నా కొడుకును అనవసరంగా కేసులు పెట్టి జైలులో పెట్టారు. నా కొడుక్కి ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి. హీర్యాను వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్యం బాగోలేనివారికి బేడీలు వేయడం ఏమిటి? – రూప్లానాయక్, హీర్యానాయక్ తండ్రి రైతుకు బేడీలపై సీఎం సీరియస్ – ఇలాంటి చర్యలను సహించబోమని అధికారులకు హెచ్చరిక – ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం ‘లగచర్ల’ఘటనలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై అధికారులతో మాట్లాడి వివరాలను ఆరాతీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి సమీక్షించిన ఐజీ జైలులో రైతుకు గుండెపోటు, బేడీలు వేసి ఆస్పత్రికి తరలించిన అంశం వివాదాస్పదం కావడంతో మలీ్టజోన్ ఐజీ సత్యానారాయణ గురువారం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జైలర్ సస్పెన్షన్.. సూపరింటెండెంట్‌పై విచారణ లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలు జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్‌పై విచారణకు ఆదేశించారు. -
ఆందోళన చెందొద్దు..ఆరోగ్యంగానే ఉన్నా: ఆర్.నారాయణ మూర్తి
‘పీపుల్ స్టార్’ ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం నారాయణ మూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా ఆర్. నారాయణ మూర్తే తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తాను నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని..దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నానని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. అన్ని వివరాలు చెబుతానన్నారు.కాగా, నారాయణ మూర్తి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు సైతం స్పందించారు. నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. -
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందో? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే.. ఆయనది స్వల్ప అస్వస్థతేనని వైద్యులు ప్రకటించారు. ప్రసాద్ ల్యాబ్‌లో ఉండగానే నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. అయితే నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారు. (చదవండి: గాయం వల్ల షూటింగ్స్‌కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్)ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ..‘పీపుల్ స్టార్’గా ఎదిగారు నారాయణ మూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు..కథ- కథనం, దర్శకత్వం, సంగీతం, గానం.. ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. (చదవండి: సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి)అయితే గత కొంతకాలంగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సీటీ’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. -
నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ బలవన్మరణం
సనత్‌నగర్/లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రాచీకార్ (46) బలవన్మరణానికి పాల్పడ్డారు. నెల రోజుల క్రితమే ఖాళీ చేసిన ఇంటికి ఒంటరిగా వచ్చిన ఆమె అధిక మోతాదులో అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ప్రాచీకార్, దీపక్‌లు దంపతులు. ప్రాచీకార్ నిమ్స్‌లో ఎనస్థీషియా విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, భర్త దీపక్ మరో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా ఉన్నారు. వీరికి ఒక కుమారుడు. గత నెల రోజుల క్రితం వరకు బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న వీరి కుటుంబం..మూసాపేటలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బేగంపేటలోని ఇల్లు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాత ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ప్రాచీకార్ వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భర్త దీపక్ ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అక్కడికి వచి్చన భర్తకు ఇంటి లోపలి గడియ వేసుకుని ఉండడంతో పాటు ఎంతకీ తలుపు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అపస్మారక స్థితిలో కనిపించిన ప్రాచీకార్ను హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా ప్రాచీకర్ అధిక మోతాదులో మత్తు మందు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి గాం«దీలో పోస్టుమార్టం నిర్వహించి..నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. అయితే ప్రాచీకార్ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచి్చందనేది అంతుపట్టడం లేదు. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి స్థితిలో ఉన్న ప్రాచీకార్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బంది ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రాచీకర్ ఆత్మహత్య విషయం తెలిసి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉద్యోగులు అర్ధరాత్రి నిమ్స్‌కు వచ్చారు. ప్రాచీకర్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఆమె విధుల్లో ఉన్నారని, రెండేళ్ల బాలుడి సర్జరీకి సహకరించారని కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరేష్ తెలిపారు. -
మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్‌రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్‌రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీలు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం నుంచి రోబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రూ.31.50 కోట్లతో నిమ్స్ కొనుగోలు చేసిన డావెన్నీ ఎక్స్ఐ రోబో యంత్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రోబోటిక్ సర్జరీల నిర్వహణకు నిమ్స్ యాజమాన్యం ఇప్పటికే సీనియర్ ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోబోటిక్ సర్జరీ సిస్టంతో పాటుగా స్పెషా లిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలకు సంబంధించిన ఆధునిక వైద్య పరికరాలనూ మంత్రి ప్రారంభించనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. కార్పొరేట్ ఆస్పత్రులలో సుమారు రూ.1.75 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్న ఈ రోబోటిక్ సర్జరీలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయనున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా నూటికి నూరు శాతం ఉంటుంది. క్లిష్టమైన మూత్రాశయం, పెద్దపేగు, చిన్న పేగు, క్లోమం, కాలేయం, గర్భసంచి, అన్నవాహిక.. తదితర సర్జరీలను రోబో విధానంలో మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. అతి సూక్ష్మమైన కేన్సర్ కణతులను సైతం తొలగించడానికి వీలుంటుంది. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, గైనకాజీ విభాగాల్లో మరింత మెరుగైన శస్త్ర చికిత్సలు చేయడానికి వీలుంటుంది. వైద్య సేవల్లో దేశానికే రోల్‌మోడల్ : నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వైద్య సేవల్లో నిమ్స్ ఆస్పత్రి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చేస్తున్నామన్నారు. ఎంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా రోగి మూడో రోజునే ఇంటికి వెళ్లే విధంగా దోహదపడే రోబోటిక్ సిస్టంను సమకూర్చుకున్నామన్నారు. స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్లలో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ సర్జరీ సిస్టంను ప్రస్తుతానికి సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ విభాగాలలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డాక్టర్ బీరప్ప తెలిపారు. -
ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్లు రావొచ్చని ఇద్దరు ఎంటమాలజిస్టులు తనతో చెప్పారని.. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచామని.. 2014లో రూ.2,100 కోట్లు కేటాయించగా, 2023–24 నాటికి ఏకంగా రూ.12,365 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను 17 వేల నుంచి 50 వేలకు పెంచామని, అలాగే 50 వేల ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా 2 వేల పడకలతో మరో బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అది వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యత! ‘‘మన రాష్ట్రంలో మిడతల బెడద లేదు. కానీ మిడతల దండు హరియాణాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆదిలాబాద్ సరిహద్దు దాకా వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం ఇద్దరు ఎంటామాలజిస్టులను పంపింది. అయితే మహారాష్ట్రలోనే మిడతలను మట్టుపెట్టడంతో మన వరకు రాలేదు. తర్వాత ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మిడతల సమస్యకు పరిష్కారం కనుక్కోలేరా? అని నేను ప్రశ్నించాను. మనిషి 4 లక్షల ఏళ్ల క్రితం పుడితే.. మిడతలు, బ్యాక్టీరియాలు అంతకన్నా ముందు 8 లక్షల ఏళ్ల క్రితమే పుట్టాయి. వాటికి వ్యతిరేకంగా మనిషి చర్యలు చేపడితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే మిడతలను చంపలేమని, పూర్తిగా నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు వివరించారు. కరోనా కూడా అలాంటిదేనని, భవిష్యత్తులో దానిని మించిన వైరస్లు రావొచ్చని నాతో అన్నారు. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. నష్టం తక్కువగా ఉంటుందని, లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది. భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు నిమ్స్ ఆస్పత్రి భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం దేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే.. మళ్లీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్తున్నవే న్యూట్రిషన్ కిట్లు. గాంధీ ఆస్పత్రి సేవలు అమోఘం కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. ఆ సమయంలో రోగులకు ధైర్యంగా సేవలు అందించిన గాంధీ ఆస్పత్రి వైద్యులను అభినందిస్తున్నా. అయితే ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయి. నిరుపేదలు వైద్యం కోసం వస్తే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఉదార హృదయంతో ఒక అరగంట ఎక్కువ పనిచేసైనా, కింద బెడ్డు వేసి అయినా వైద్యం అందిస్తారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకోవాలి. సేవలు మరింత పెరగాలి వైద్యారోగ్య రంగంలో చాలా మార్పులు రావాలి. ఆస్పత్రుల నిర్మాణాలే కాదు.. ఆస్పత్రుల్లో సేవలు కూడా పెరగాలి. ఈ రోజు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలేమిటన్న ప్రణాళికల కోసం సమయం కేటాయించాలి. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి. అపవాదులను తొలగించుకొని రాష్ట్రంలో వైద్యశాఖనే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి. భారీగా ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో గొప్పగా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే.. తెలంగాణ వచ్చాక 1,500 పడకలకు పెంచాం. మరో 2 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సేవలు అందుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం నిమ్స్ కార్యక్రమం సందర్భంగా.. హైదరాబాద్‌లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తన చేతుల మీదుగా ఆరుగురికి న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు నాగ్‌పూర్‌కు కేసీఆర్ – బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ బయట మూడో కార్యాలయం.. నాగ్‌పూర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ వెలుపల మూడో కార్యాలయం కానుంది. ఇప్పటికే ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర శాశ్వత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఓ అద్దె భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తాజాగా నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. -
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం భూమిపూజ చేశారు. మొత్తం 33 ఎకరాల్లో చేపడుతున్న నిమ్స్ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 1,571 కోట్లు కేటాయింది. అదే విధంగా నిమ్స్‌లో.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మిస్తున్న దశాబ్ధి బ్లాక్‌కు నూతన భవనం ‘దశాబ్ది టవర్’కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా కొత్త భవనం నిర్మాణంలో 4వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలోకి నిమ్స్ చేరనుంది. కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మూడు బ్లాక్‌లుగా దశాబ్ది టవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఓపీ,ఏపీ, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక బ్లాక్‌లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఓపీ సేవల కోసం 8 అంతస్తుల్లో ఓ బ్లాక్, ఎమర్జెన్సీ సేవల కోసం 8 అంతస్తులతో ఓ బ్లాక్ నిర్మాణం చేస్తున్నారు. ఇన్ పేషంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్ నిర్మిస్తున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ ధియేటర్లు ఉండనున్నాయి. ప్రతి రోజు నిమ్స్‌కు రోజుకు 2000-3000 ఔట్ పేషెంట్లు వస్తుంటారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిమ్స్‌లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి న్యూట్రిషన్ కిట్ల పంపిణీ జరగుతుండగా.. తెలంగాణలో 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌ను 17 వేల పడకల నుంచి 50 వేల పడకలకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్ ఉండనుందని అన్నారు. చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్? -
వైఎస్ భాస్కర్ రెడ్డి నిమ్స్‌కు తరలింపు..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు అధికారులు శనివారం ఉదయం భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో వైద్య చికిత్సలు, యాంజియోగ్రామ్ చేయనున్నారు వైద్యులు. కాగా, వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. భాస్కర్‌రెడ్డికి బీపీ లెవల్స్ తగ్గడంతో జైలు అధికారులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డికి హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు ఆయనకు యాంజియోగ్రామ్ చేయించాలని సూచించినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు భాస్కర్‌రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
నిమ్స్‌లో 2 వేల పడకల భవనం
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 2,000 పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనికోసం సత్వరమే ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించేలా నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో హరీశ్‌రావు మాట్లాడారు. 8 అంతస్తుల్లో నిర్మించే నూతన భవనం అందుబాటులోకి వస్తే, పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. అంతేగాక, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3,700 పడకలు ఉంటాయన్నారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇదే దేశంలో తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుందని చెప్పారు. సంతాన సాఫల్య కేంద్రం పనుల వేగం పెంచండి గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేస్తున్న సంతాన సాఫల్య, అవయవ మార్పిడి కేంద్రాల పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను నిర్దేశించారు. బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖానా, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు. ఆదర్శప్రాయంగా ఉండాలి ఆసుపత్రికి అందరికంటే ముందుగా వచ్చి, అందరి తర్వాత వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రాయులని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రతి రోజూ రెండు గంటలపాటు ఆసుపత్రుల్లో రౌండ్లు వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు. -
కారేపల్లి ఘటనలో కుట్ర కోణం.. కేటీఆర్ ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కారేపల్లి అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కారేపల్లి ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. చదవండి: కాళ్లు తెగి ముక్కలై.. బతుకుల్లో నిప్పు పెట్టిన బాణసంచా కాగా, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. కారేపల్లి మండలం చీమలపాడులో ఈఘటన చోటుచేసుకుంది. బాణసంచాతో గుడిసెకు నిప్పు అంటుకోవడతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి కాళ్లు తెగిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరికొందరికి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె.. యాజమాన్యం ఏం చెబుతోందంటే?
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ అసుపత్రిలో నర్సులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. ఇంచార్జ్ డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి నిమ్స్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. నర్సుల ఆందోళనతో ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది. నర్సుల ధర్నాపై యాజమాన్యం స్పందంచింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి నర్సులు స్ట్రైక్ చేయడం దురదృష్టకరమని కమిటీ మెంబర్ శ్రీ భూషణ్ తెలిపారు. ఎవరికీ చెప్పకుండా ఆందోళన చేస్తున్నారని, కనీసం కారణం కూడా చెప్పడం లేదన్నారు. ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ తనతో మాట్లాడటానికి ఎవరూ రావడం లేదని తెలిపారు. హెచ్‌వోడీ, డైరెకర్టర్ను దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ‘నర్సుల ధర్నాతో ఆసుపత్రిలో సేవలు ఆగిపోయాయి. ఒకరికి ఇద్దరికీ ఉన్న సమస్య లను అందరికీ ఆపాదిస్తున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారనే కారణం వారికి కూడా తెలియదు. పాత కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. బాధ్యతయుతమైన హోదాలో ఉండి పద్దతి లేకుండా విధులు బహిష్కరణ చేశారు. నర్సుల ఆందోళనతో ఆపరేషన్ థియేటర్స్ లో పిల్లలు ఆపరేషన్ కోసం ఫాస్టింగ్‌తో ఉన్నారు. ఇప్పుడు వారి తల్లదండ్రులకు ఏం చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 1400 మంది రోగులు ఉన్నారని, ఎంతో మంది పేషెంట్లకు వారి అవసరం ఉందని ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తెలిపారు. ఒక స్ట్రైక్ చేయాలంటే పద్దతి ఉంటుందని.. ఒకరిద్దరికీ మెమో ఇస్తే అందరూ సమ్మె చేయడం ఏంటని మండిపడ్డారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నానని. రోజూ ప్రతి ఒక్కరినీ కలుస్తున్నానని తెలిపారు. తాను ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి ఫేవరేటిజం ఉండదని స్పష్టం చేశారు. నర్సుల సమస్యల వినడానికి ఉదయం 9:30 నుంచి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నిరసనలో కూర్చున్న చాలా మందికి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో కూడా తెలియదు. ఇవాళ స్ట్రైక్ చేయాలి అని చెప్తే చేస్తున్నారు. ముగ్గురుకి ఇచ్చిన మెమోల కారణంగా అందరినీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఒక నర్సు ఏడాదిలో 143 రోజులు ఆలస్యంగా వచ్చారు. అది రిజిష్టర్‌లో రికార్డు కాలేదు. అందుకే మెమో ఇచ్చాం. మరో నర్సు 19 రోజులు రాలేదు. కానీ సీఎల్ లీవులు వాడలేదు. అందుకే మెమోలు ఇచ్చాం’ అని తెలిపారు. -
నిమ్స్ బిల్లింగ్ విభాగానికి మోక్షం
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో అతి కీలకమైన బిల్లింగ్ విభాగానికి యాజమాన్యం సరికొత్త హంగులను సమకూర్చింది. ఆస్పత్రిలో మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగానికి మోక్షం లభించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్పేషేంట్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులను ఈ విభాగం నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విభాగం పాత బిల్డింగ్‌లో ఓ మూలకు ఉన్నట్టుగా ఉండేది. ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే రోగులు డిశ్చార్జి సమయంలో తీవ్ర జాప్యం ఎదురయ్యేది. బిల్లింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ విభాగం ఆరంభంలో రోజుకి కేవలం 400 మంది రోగులు మాత్రమే ఓపీ సేవలు పొందేవాళ్లు. ప్రస్తుతం దాదాపుగా మూడు వేల మంది వరకు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రి పడకల సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 1500 పడకల వరకు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు. అయినా బిల్లింగ్ విభాగం మాత్రం నానాటికి సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. గతంలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ విభాగంలో విధులు నిర్వహించే పరిస్థితి. వాళ్లలో 11 మంది పదవీ విరమణ చెందారు. ఆ స్థానంలో ఎలాంటి భర్తీలు చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది పాటి సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ విభాగం ఆధారపడి పని చేస్తుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓ మూలకు ఉండే బిల్లింగ్ విభాగానికి సర్వ హంగులు కల్పిస్తూ.. సరికొత్త విభాగాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు చొరవతో తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ నిర్మించిన ఈ విభాగాన్ని సోమవారం ఉదయం ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించనున్నారు. పేషెంట్ కేర్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లింగ్ విభాగాన్ని ఆధునీకరించిన విధంగా ఆ విభాగం సిబ్బందిని కూడా బలపేతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఆ దిశగా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పుడు రోగులకు సకాలంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
గుండెలు పగిలేలా రోదిస్తున్న ప్రీతి తల్లిదండ్రులు
జనగామ: నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన మెడికో విద్యార్థి ప్రీతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. మరొకవైపు ప్రీతికి కడసారి వీడ్కోలు పలికేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కొడకండ్ల మండలం గిర్ని తండాలో ప్రీతి భౌతికకాయానికి నేడు అంత్యక్రయలు జరుగనున్నాయి. తమతో పాటు తిరిగే కూతురు ఇలా విగత జీవిలా పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు దుఃఖం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ప్రీతి తండ్రి నరేందర్ శోకతప్ప హృదయంతో తమ కూతుర్ని హత్యే చేశారంటూ విలపిస్తున్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని తండ్రి నరేందర్ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ప్రీతి మృతదేహాన్ని బలవంతంగా గిర్ని తండాకు తరలించారని, బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్తామన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆమె ఏం తీసుకుందో ఇప్పటి వరకు నిర్థారణ కాలేదు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలి. మరొకరు ప్రీతిలా మారకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడిన సైఫ్ పై ఉరితీయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడిను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. బంధుమిత్రులు వచ్చాక మద్యాహ్నం అంతిమయాత్ర చేపడుతాం.’ అని తండ్రి నరేందర్ తెలిపారు. మరొకవైపు ప్రీతి మృతి చెందడానికి సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రేమయం ఉందని ఆమె సోదరి ఆరోపించింది. తనకు తానుగా మత్తు ఇంజక్షన్ తీసుకోలేదు.. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేదు. అంటూ ప్రీతి సోదరి పేర్కొన్నారు. -
పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి
-
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లు నిమ్స్‌కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్‌రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్‌వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్‌పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్‌దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
డాక్టర్‌గా ప్రీతి హెల్త్ కండీషన్ నాకు తెలుసు: తమిళిసై కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ సందర్భంగా తమిళిసై.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా నేను ప్రీతి కండీషన్ అర్థం చేసుకోగలను. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది.. ఆరోగ్యపరంగా తనకు ఎటువంటి సహాయం అందజేయాలో నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. ప్రీతి ఆరోగ్యంతో బయటకు రావాలని అందరం ప్రార్థిద్దాము. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ ర్యాగింగ్ అని పేరెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పుడే ఒక కంక్లూషన్కి రాలేము. ఆమె యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక బెస్ట్ స్టూడెంట్ ఇలా అవ్వడం బాధాకరం. డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై
-
ప్రీతి కేసు: పోలీస్ కస్టడీలో సీనియర్ మెడికో సైఫ్!
వరంగల్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి కేసుకు సంబంధించి సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ప్రీతి కేసులో కీలకంగా పరిగణిస్తున్న సైప్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని వేధించిన కేసులో సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వేధింపుల కేసు నమోదు చేశారు మట్టేవాడ పోలీసులు. ఈ క్రమంలోనే ఎంజీఎం ఆసుపత్రిలోని అనస్తీషియా విభాగంలోని సీనియర్ వైద్యులను పోలీసులు విచారించారు. ఇదిలాఉంచితే, ప్రీతికి ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. సీఆర్ఆర్పీ ద్వారా కిడ్నీ ఫంక్షన్ చేయిస్తున్నామని, ప్రీతి మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయన్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తాజా హెల్త్ బులెటన్లో వైద్యులు వెల్లడించారు. -
ప్రాణాలతో పోరాడుతున్న ప్రీతి.. అత్యంత విషమంగా పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ వేధింపుల వల్లే.. కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వల్లే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. నవంబర్‌లో ప్రీతి కేఎంసీలో చేరిందని, డిసెంబర్ నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘జనవరి 20వ తేదీనకాలేజీ దగ్గరికి వెళ్లానని, ఉన్నతాధికారులకు వేధింపుల గురించి తెలియజేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాం. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పా. వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. మార్కులు తక్కువ వేస్తారు అని భయపడింది. ఎంతో ధైర్యంగా ఉండేది. కరోనాలో కూడా విధులు నిర్వర్తించింది. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధించాడో. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్‌కు తీసుకువచ్చారు. వరంగల్‌లో గొడవ అవుతుందని కావాలని హైదరాబాద్ తరలించారు. మాకు న్యాయం చేయాలి. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్ల నా బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలి. మా బిడ్డ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాడికి శిక్ష పడాలి. చాలా దారుణంగా వేధించాడు. మా బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ప్రీతికి ఎటువంటి ఆనారోగ్యం లేదు. చదువుల్లో నంబర్ వన్. పోలీసు ఫిర్యాదు తర్వాత సైఫ్ వేధింపులు తీవ్రతరమయ్యాయి. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు సరికావు: జూనియర్ డాక్టర్లు ఆధారాలు లేకుండా సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు చేయడం సరికాదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఘటనపై ప్రస్తుతం అధికారుల విచారణ జరుగుతోందని, విచారణపూర్తయ్యే వరకు తప్పుడు ఆరోపణలు చేయవద్దని పేర్కొన్నారు. అయితే ర్యాంగింగ్ లాంటిదేమి జరగలేదని కేఎంసీ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. -
చేయని ఆపరేషన్‌కు కుట్లు తీయాలన్న వైద్యులు..షాకైన పేషెంట్
సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన రోగమైనా ఇక్కడ ఇట్టే నయమవుతుందనే నమ్మకం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా దొరకని స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయనే భావన. అరుదైన చికిత్సలు..పరిశోధనలతో ఉత్తమ గుర్తింపు పొందిన నిమ్స్ నేడు కొంత మంది వైద్యుల తీరుతో అబాసు పాలవుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తోడు అక్రమార్జనకు అలవాటు పడిన కొంత మంది వైద్యులు రోగులను మభ్యపెట్టి ఆస్పత్రికి చెడ్డపేరు తీసు కొస్తున్నారు. ఫలితంగా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది. తాజాగా ఓ వైద్యుడు రోగికి ఎలాంటి సర్జరీ చేయకుండానే చేసినట్లు డిశ్చార్జ్ సమ్మరీలో చూపించడమే కాకుండా ఆయన వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 15 మంది రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సర్జరీ చేయకుండానే...చేసినట్లు రికార్డులు.. ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకటేశ్వర్రావు(47) వాంతులు, కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం2 2021 ఏప్రిల్4న నిమ్స్‌కు చేరుకున్నాడు. న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సమస్య ఉంది..ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, అం దులోనే సర్జరీ చేయాలని సదరు బాధితుడు వైద్యులకు మొర పెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ చికిత్స లేదని, డబ్బులు కట్టి సర్జరీ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైద్య ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెంకటేశ్వరరావు శస్త్రచికిత్స చేసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. అయితే, డాక్టర్లు ఇక్కడే తప్పులో కాలేశారు. డిశ్చార్జీ సమ్మరీలో వెంకటేశ్వరరావుకు సర్జరీ చేసినట్లు నమోదు చేయడమేగాకుండా.. కుట్లు తీయించుకునేందుకు ఫలానా తేదీనాడు రావాలని సూచించారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడం..లాక్డౌన్ కారణంగా ఆయన ఆస్పత్రికి రాలేకపోయారు. ఇటీవల ఆనారోగ్య సమస్య తీవ్రం కావడంతో గతేడాది డిసెంబర్ 28న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుల సమాధానం విని బిత్తెరపోయారు. నిమ్స్ వైద్యులు రాసిన డిశ్చార్జీ సమ్మరీ చూసి వైద్యులు ఆశ్చర్య పోయారు. ఆపరేషన్ చేయక పోయినా...చేసినట్లు సమ్మరిలో పేర్కొనడంతో వారు చికిత్సకు నిరాకరించి.. మళ్లీ నిమ్స్‌కు వెళ్లమని తిప్పిపంపారు. దీంతో ఆయన గురువారం నిమ్స్ న్యూరాలజీ ఓపీకి వచ్చాడు. ఇంతకు ముందు నిన్నెవరు చూశారో వాళ్ల దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. గతంలో చూసిన వైద్యుడెవరో తెలియని వెంకటేశ్వరరావు..ఏం చేయాలో అర్థంగాక తలపట్టుకున్నారు. ఇప్పటికే చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేసుకున్న తనకు సర్జరీ కోసం మళ్లీడబ్బులు సర్దుబాటు చేయడం తలకు మించిన భారమని వాపోయారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన మరో బాధితుడు అదే విధంగా బడంగ్‌పేటకు చెందిన అరుణ కుమార్ మెదడులో ఏర్పడిన కణితి సమస్యతో బాధపడుతూ నిమ్స్‌ను ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. డబ్బులు కట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రిలోని ఓ అధికారి సిఫార్సుతో వచి్చన ఆ రోగికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.50 వేలు కట్టించి పరీక్ష చేయించారు. అంతే కాకుండా ఓ అధికారి కూడా అతని వద్ద నుంచి ఆపరేషన్ చేయించేందుకు గానూ రూ. 20వేలు వసూలు చేశాడు. చివరికి ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. సదరు బాధితుడు ఇటీవల ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సదరు అధికారికి ఛార్జీ మెమో జారీ చేయడంతో పాటు డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ సాయిబాబాలతో విచారణ కమిటీ వేసింది. (చదవండి: వడ్డీలేని రుణాల పేరిట కేసీఆర్ మోసం ) -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్‌లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
నిమ్స్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి, సీనియారిటీ ప్రకారం వారిని రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. నిమ్స్ హాస్పిటల్లో 1,350 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో 25 ఏళ్లుగా పని చేస్తున్నా.. కనీస వేతనం నెలకు రూ.14,700 మాత్రమే వస్తోందని తెలిపారు. లేబర్ కమిషన్ ముసాయిదా ప్రకారం వీరికి రూ.20 వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ గెజిట్ జారీ చేయలేదని తమ్మినేని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీనియారిటీ ప్రకారం జూనియర్లకు రు.20 వేలకు తగ్గకుండా, సీనియర్లకి వారి సీనియారిటీని బట్టి జీతం పెంచేలా చూడాలని ఆ లేఖలో కోరారు. -
అధ్యయనం చేయండి.. అనుసరించండి..
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో అక్కడి ఆసుపత్రుల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. నిమ్స్, ఎంఎన్‌జే ఆసుపత్రుల పనితీరును ఆయన గురువారం సమీక్షించారు. ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరపకపోవడం వల్ల, అవయవదానానికి అవకాశం లేకుండా పోతోందని, కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని టీచింగ్ ఆసుపత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యమవుతుందన్నారు. ఒక్కరి నుంచి సేకరించిన అవయవాలు ఐదుగురి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని, జీవన్‌దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్‌రెడ్డి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, నిమ్స్, ఎంఎన్‌జే డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. గతేడాది వంద అవయవ మార్పిడులు వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి. గతేడాది వంద అవయవ మార్పిడులు జరిగాయి. ఈ ఏడాది వందకుపైగా జరిగేలా చూడాలి. అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెంటనే ఆయా విభాగాలకు పంపాలి. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉండేలాలి. బెడ్ ఆక్యుపెన్సీ 77 శాతం ఉంది.. ఇది చాలా తక్కువ. ఓ వైపు పడకలు లేవని, 27శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు రిపోర్టులో ఎలా పేర్కొంటారు? బెడ్ ఆక్యుపెన్సీ వంద శాతం పెరగాలి. మెరుగైన సేవలు అందించాలి మొబైల్ స్క్రీనింగ్ శిబిరాలు జిల్లాల్లో ఎక్కువగా జరగాలి. కేన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారానికి 3 క్యాంపులు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలి. ఇటీవల ప్రారంభించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా వినియోగించాలి. పాలియేటివ్ కేర్ సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలి. మొత్తం 300 పడకల కొత్త బ్లాక్ పనులు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో ఎక్విప్మెంట్ సరిపడా ఉండేలా చర్యలు తీసు కోవాలి. ఇక్కడి పిడియాట్రిక్ పాలియేటివ్ దేశానికే ఆదర్శం. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చా యి. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా అవసాన దశలో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించాలి. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అధ్య యనం చేసి కొత్త విధానం రూపొందించాలి. -
నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ రామ్మూర్తి
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ నెలరోజులు సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో డీన్ డాక్టర్ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన వచ్చే నెల 2వరకు ఇన్చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. -
‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ నలుమూలల నుంచి పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య ఆశాజ్యోతి అయిన నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆ ఆస్పత్రిని కాదని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం నిమ్స్‌లో పనిచేసే డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అక్కడ పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కూడా అవమానపరచినట్లేనని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ హోదాలో నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాల్సింది పోయి ఆయనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లడాన్ని బట్టి నిమ్స్‌లో మౌలిక సౌకర్యాలు లేవని అర్థమవుతోందని విమర్శించారు. చదవండి: ఈటలపై సస్పెన్షన్ వేటు? -
హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగులు ధర్నా
-
ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా..
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్‌గా పేర్కొనే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో నిరుపేదలకు ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకు పోవచ్చుగా.. అక్కడ కాకపోతే ఇక్కడికి రావాలి కానీ.. అందరూ నిమ్స్‌కు వచ్చేస్తే ఎలా అంటూ ఓ ఉన్నతాధికారి అగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు వెనువెంటనే వైద్యం అందించాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిమ్స్‌కు వచ్చిన ప్రతి రోగికీ మెరుగైన వైద్యసేవలను అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను మరింతగా ఆధునికీకరించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు సైతం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. ఆచరణలో నిమ్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పేద రోగులకు సరైన వైద్య సేవలు అందించకపోగా వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం బాధాకరంగా మారుతోందంటూ పేదరోగులు వాపోతున్నారు. గరీబోళ్లం సారూ.. డబ్బులు లేవంటే ఉన్నకాడికి కట్టించుకొని మిగతావి సీఎంఆర్ఎఫ్ నుంచి ఎన్వోసీ తెచ్చుకోమంటూ ఉచిత సలహాపడేస్తున్నారు. రేపు డిశ్చార్జి చేస్తాం.. పోయి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోవాలంటూ ఆయా రోగులపై ఒత్తిడి తేవడంతో జిల్లాలకు వెళ్లి ఎమ్మెల్యే ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్వోసీ లెటర్ తెచ్చుకోవాల్సి వస్తోంది. తీరా అప్పటికే నాలుగైదు రోజులు గడిచిపోతుండటంతో ఆ బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జీ చేయడం లేదు. సారూ.. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే పది రోజులు ఆగి రమ్మంటున్నారు. పది రోజుల తర్వాత వస్తే టెస్టులన్నీ చేసి బెడ్లు లేవు వారం రోజులు ఆగాలంటున్నారు. డబ్బులు చెల్లిస్తే మాత్రం వెంటనే బెడ్ ఇచ్చి అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా.. డబ్బులు కట్టించుకున్నారు.. ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కళావతి(54) కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రతరం కావడంతో ఈ నెల 4వ తేదీన మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ను ఆశ్రయించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా రూ. 5 వేలు కట్టించుకొని మరీ అడ్మిషన్ చేయించుకున్నారు. చికిత్సలో భాగంగా ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయంలో సగభాగాన్ని తొలగించారు. అందుకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు, చివరకు బ్యాండేజ్ సైతం బయట నుంచి తెచ్చుకోమన్నారు. అందుకు ఆమెకు రూ. 25 వేల వరకు ఖర్చయ్యింది. తీరా డిశ్చార్జి చేస్తాం.. సీఎంఆర్ఎఫ్ తెచ్చుకోమన్నారు. ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షలు సహాయం అందింది. బుధవారం డిశ్చార్జి సమ్మరీని ఇచ్చిన అధికారులు ఇంకా రూ. 13 వేలు కట్టమన్నారు. అంతంతమాత్రంగా ఉన్న తమ ఆర్థిక పరిస్థితితో ఆ మొత్తాన్ని కూడా కట్టలేని పరిస్థితి. ఆ రోజంతా అధికారుల చుట్టూ ఎంత తిరిగి ప్రయోజనం లేకుండా పోయింది. ఆస్పత్రి మెడికల్ సూపరిండెంటెంట్ను కలిసి డబ్బులు లేవంటూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని కళావతి తనయుడు నరేష్ వాపోయారు. పైగా ఇక్కడికి ఎందుకొచ్చారు. గాంధీకో.. ఉస్మానియాకో వెళ్లాల్సింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సారూ.. అంటే ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇస్తుంది.. అప్పటివరకు ఆస్పత్రి ఎలా నడవాలి అంటూ ప్రశ్నించారన్నారు. మా దగ్గర ఊరికి పోయేందుకు డబ్బులు లేవు సార్.. వేరే వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నాం.. అంటూ వేడుకున్నా నా పరిధిలో లేదు ఓ రెండు వేలు తగ్గిస్తా.. పొద్దున్నే మూడ్ ఆఫ్ చేయొద్దు.. వెళ్లిపోండి అంటూ ఆయన చిర్రుబుర్రులాడటంతో.. చివరికి మిత్రుల సహాయంతో ఆస్పత్రి నుంచి బయటపడ్డామని నరేష్ తెలిపారు. (క్లిక్: మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు.. నిర్లక్యం చేయొద్దు!) -
ఆర్టీసీ ఆస్పత్రిలో నిమ్స్ చార్జీలతో వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఆస్పత్రిలో సాధారణ ప్రజలకూ వైద్యం అందించాలని నిర్ణయించిన ఆ సంస్థ యాజమాన్యం.. ఆయా చికిత్సలకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న తరహాలో చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. శస్త్రచికిత్సల నుంచి ల్యాబ్ పరీక్షల దాకా అన్నిరకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నందున.. వాటిని సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ప్రచారం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మందులపై భారీ డిస్కౌంట్ ఇంతకాలం ఆర్టీసీ ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు అవసరమైన అన్ని మందులను ఆన్లైన్ ద్వారాగానీ, వేరే పెద్ద మెడికల్ షాపుల నుంచి తెప్పించిగానీ అందించాలని నిర్ణయించారు. ప్రైవేటు మెడికల్ షాపుల తరహాలో హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్పత్రికి అనుబంధంగా ఫార్మసీలు తెరవనున్నారు. ఇప్పటికే కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా, ఎంజీబీఎస్ బయట గౌలీగూడ సీబీఎస్ వద్ద, తార్నాక ఆస్పత్రిలో రిటైల్ ఫార్మసీలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫార్మసీలలో బ్రాండెడ్ మందులపై 15 శాతం, జనరిక్ మందులపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. అన్నీ తక్కువ ధరకే.. అన్ని రకాల హెల్త్ చెకప్‌లపై 40 శాతం రాయితీ ఇవ్వాలని కూడా ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా చికిత్సలు, పరీక్షలు, మందులు తక్కువ ధరతో అందుబాటులోకి వస్తుండటం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇలా సాధారణ ప్రజలకు చికిత్సలతో వచ్చే నిధులను ఆస్పత్రి అభివృద్ధికే వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు పొందిన సాధారణ ప్రజలు.. ఆర్టీసీ సిటీ బస్సుల్లో (రెండు గంటల పాటు) ఉచితంగా ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పించారు. త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు: సజ్జనార్ ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు త్వరలో నాలుగు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్యులు, అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి అనుబంధంగా ఏర్పాటవుతున్న ఫార్మసీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని ఎండీకి అధికారులు వివరించారు. ఆస్పత్రిలో రోజూ సగటున 10 శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు తెలిపారు. -
మూడేళ్ల ‘ఆకలి’ తీర్చారు
సాక్షి, సిటీబ్యూరో: గొంతు కేన్సర్‌తో బాధపడుతూ, ఆహారం కూడా తీసుకోలేకపోతున్న ఓ బాధితునికి నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగం వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూడేళ్లుగా పిడికెడు మెతుకులకు నోచుకోని ఆ బాధితునికి కడుపు నిండా ఆరగించే అవకాశం కల్పించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి గత మూడేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. సదరు ఆస్పత్రి వైద్యులు రేడియేషన్ చికిత్స అందించారు. దీంతో కేన్సర్ కణాలతో పాటు అన్నవాహిక, కృత్రిమంగా ఏర్పాటు చేసిన పైపు కూడా దెబ్బతింది. దీంతో గొంతుకు ఓ వైపు శస్త్రచికిత్స చేసి కేన్సర్ సోకిన భాగాన్ని పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత ఆహారనాళానికి ప్రత్యామ్నాయంగా ముక్కు నుంచి ఓ పైపును అమర్చి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆ పైపు ద్వారా నే ద్రవ పదార్థాలను తీసుకునేవారు. ఆకలైనప్పుడు నాలుగు మెతుకులు తినాలనుకున్నా తినలేక పోయే వాడు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలోని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్పను నెల రోజుల క్రితం ఆశ్రయించారు. పది మంది, పది గంటలు శ్రమించి... మూడేళ్లుగా ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని తెలిసి వైద్యులు చలించిపోయారు. బాధితునికి పెట్‌స్కాన్ సహా ఇతర వైద్య పరీక్షలు చేయించిన వైద్యులు కేన్సర్ లేదని నిర్ధారించుకున్నారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో పది మందితో కూడిన వైద్య బృందం సుమారు పది గంటల పాటు శ్రమించి ఈ నెల 9న ఆయనకు చికిత్స చేశారు. ముక్కు నుంచి వేసిన పైపులైన్‌ను తొలగించి, కొలాన్ బైపాస్ సర్జరీ చేశారు. అన్నవాహికను పెద్ద పేగుతో అనుసంధానించారు. పూర్తిగా కోలుకొని ఆహారం తీసుకుంటుండటంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో పది లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్లు డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. -
5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స
లక్డీకాపూల్: నిమ్స్ మరో అరుదైన చికిత్స చేసి తన ప్రత్యేకతను చాటుకున్నది. 5నెలల చిన్నారి కపాళ సమస్యను నిమ్స్ వైద్యులు పరిష్కరించారు. కాకినాడకు చెందిన ఓ చిన్నారికి కపాళంలో ఎముకలు అతుక్కుపోయాయి. కపాళంలోని ఎముకలు కొంత వయస్సు వచ్చిన తర్వాత కర్సుకుపోవడం సర్వసాధారణం. కానీ, పుట్టుకతోనే రావడంతో ఆ చిన్నారి ముఖం సహజ రూపురేఖలను కోల్పోయింది. దీంతో పాప తల్లిదండ్రులు నిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులను ఆశ్రయించారు. ఆ విభాగం అధిపతి డాక్టర్ ఎర్రం నేని వంశీకృష్ణ ప్రాథమిక వైద్యపరీక్షల ద్వారా ఆపరేషన్ అవసరాన్ని గుర్తించి, ముక్కు ద్వారా సమస్యను చక్కదిద్దారు. ఎండోస్కోపీ విధానంలో కపాళం ఎముకలో కొంత మేర తొలగించి రెండు ఎముకలను సరిచేశారు. ఈ శస్త్రచికిత్సతో చిన్నారి ముఖం మామూలుస్థితికి వచ్చిందని, ఆపరేషన్ విజయవంతం కావడంతో చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని డాక్టర్ వంశీ తెలిపారు. -
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్
లక్డీకాపూల్: సంచలనం సృష్టించిన నల్లగొండ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. గుండె నొప్పి రావడంతో ఆయనను గత నెల 22వ తేదీన నల్లగొండ జైలు అధికారులు చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ సాయి సతీష్ అతని ఆరోగ్య పరిస్థితిని విచారించిన నేపథ్యంలో మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. దీంతో ఆయనను నిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ విభాగానికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ బారీకి సీటీ సర్జన్ డాక్టర్ అమరేష్‌రావు మాలెంపాటి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. అతనికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన బైపాస్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. (చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన) -
నిమ్స్‌లో గుండె మార్పిడి సక్సెస్
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. బ్రెయిన్ డెడ్‌గా మారిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను శనివారం ఉదయం కేవలం 3 గంటల వ్యవధిలోనే మరో వ్యక్తికి అమర్చినట్లు ఆస్పత్రి సీటీ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేష్‌రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అస్తాపురం మల్లయ్య (51) ఈ నెల16న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన మల్లయ్య ఈ నెల 18న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ బృందం అవయవ దానంపై ఆయన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించింది. మృతుడి భార్య హేమలత, కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో రెండు కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను వైద్యులు సేకరించారు. అప్పటికి గుండె మార్పిడి కోసం నిమ్స్ ఆస్పత్రిలో ఎదురు చూస్తున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తికి మల్లయ్య నుంచి సేకరించిన గుండెను అమర్చినట్టు నిమ్స్ తెలిపారు. -
నిమ్స్‌లో వైద్య సేవలపై ఆరా
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్యసేవలపై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య ఆరా తీశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించారు. ఆయా రోగుల సహయకులను సైతం విచారించి ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా కలిశారు. అనంతరం నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ కె. మనోహర్‌తో సమావేశమై ఆస్పత్రికి సంబంధించి పరిపాలనా వ్యవహారాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
యశోద నుంచి నిమ్స్‌కు గుండె తరలింపు.. 15 నిముషాలల్లో 11 కి.మీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఛానల్ ద్వారా మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి నుంచి పంజగుట్ట నిమ్స్‌కు బుధవారం ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి ఈరోజు వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. రెండు ఆస్పత్రుల మధ్య దూరం 11కి.మీ కాగా కేవలం 15 నిమిషాల్లో అంబులెన్స్ నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. గుండెను తరలించే క్రమంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు, పోలీసులు ముందే ఏర్పాట్లు చేశారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ ఈ నెల 12వ తేదీన గొల్లగూడెం వద్ద కానిస్టేబుల్ వీరబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు మంగళవారం యశోద వైద్యులు ప్రకటించారు. కానిస్టేబుల్ గుండె దానానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండె కోసం జీవన్‌దాన్‌లో 30 ఏళ్ల వయసున్న ఓ పెయింటర్ నమోదు చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ గుండెను ఆ వ్యక్తికి నిమ్స్ వైద్యులు ఇవాళ అమర్చనున్నారు. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: వివాదస్పదంగా మారిన యూపీ సీఎం ‘అబ్బాజాన్’ వ్యాఖ్యలు -
నిమ్స్ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది. ♦ నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. ♦ లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ♦ మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు. ♦ ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్ రూపంలో నిమ్స్ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ♦ ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. ♦ క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్ చెల్లిస్తున్నారని ఓ సీనియర్ అధికారి వాపోయారు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ శాఖ లెక్కల విషయంలో నిమ్స్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్/5571/2021) జారీ చేసింది. ఆడిట్ అధికారుల వైఫల్యమా? ఇదిలా ఉండగా ఆడిట్ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం. -
నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు
-
నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ..'' వ్యాక్సిన్ అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడలేం. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కేవీ కృష్ణారెడ్డి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. ఆధార్ కార్డు లేకుండా వ్యాక్సిన్ ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ నివేదిక తర్వాత సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని'' తెలిపారు. -
భర్తకు కరోనా.. టీకా వేసుకున్న కవిత, ఎంపీ, మంత్రి కూడా
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా టీకా పొందారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి సోమవారం చేరుకుని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ‘వ్యాక్సిన్ తీసుకోవడంలో అపోహాలు వద్దు. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అందరూ జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించండి’ అని పిలుపునిస్తూ టీకా తీసుకుంటున్న ఫొటోను కవిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత కూడా హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆమెతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా కరోనా టీకా వేయించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్, ఆయన భార్య కూడా నిమ్స్ ఆస్పత్రిలో టీకా పొందారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ.. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడకం, మాస్క్ ధరించడం చేయాలని పిలుపునిచ్చారు. తాజాగా కొత్తగా శాసనమండలికి ఎన్నికైన పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవికి పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. I have taken first dose of COVID-19 Vaccine today at NIMS Hospital. Let us all take a pledge to get ourselves and our loved ones vaccinated at the earliest. In the wake of rising cases once again, I urge everybody to stay safe and wear a mask. pic.twitter.com/3AMFAFcSh8 — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2021 -
టేబుళ్లు.. కత్తెర్లు కరువు! రోగుల నిరీక్షణ!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ చికిత్సలతో పోలిస్తే స్పైన్, స్పాండలైటిస్, మెదడులో కణుతుల చికిత్సలు కొంత క్లిష్టమైనవి. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే వీటిని చేయగలుగుతారు. నిమ్స్ న్యూరో సర్జరీ విభాగం ఈ చికిత్సలకు ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి రోగులు పోటెత్తుతుంటారు. ఈ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, 60 పడకలతో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున ఆరు నుంచి ఏడు సర్జరీలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైద్యపరికరాలు కొనుగోలు చేయకపోగా, ఏళ్ల క్రితం కొనుగోలు చేసినవి కూడా సాంకేతిక లోపాలు తలెత్తి మూలకు చేరాయి. ఏడాది క్రితం 35 లక్షల రూపాయల ఖరీదు చేసే అనస్థీషియా వర్క్ స్టేషన్, ఓటీ లైట్లు పాడైపోవడంతో అప్పటి నుంచి సర్జరీలకు విఘాతం కలుగుతోంది. డ్రిల్లింగ్ మిషన్ లేక సర్జరీలు వాయిదా.. ఎముకలను కత్తిరించే డ్రిల్లింగ్ మిషన్ (రూ.15 లక్షలు ఖరీదు చేసే) పాడైపోయి ఐదు నెలలైంది. ఇప్పటికీ దీన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్న వారికి మరింతకాలం నిరీక్షణ తప్పడం లేదు. ఇలా ఒక్క స్పైన్ అండ్ స్పాండలైటిస్‌తో బాధపడుతున్న బాధితులే 60 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. ఇక మెదడులో కణతులు, రక్తంగడ్డకట్టిన బాధితులు మరో వంద మందికి పైగా ఉన్నారు. కింది చిత్రంలో కన్పిస్తున్న ఆయన పేరు కొప్పొజు శేఖరాచారి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం. ఫ్లోరైడ్ కారణంగా మెడ, వెన్నెముక వంగిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. లేచి నడవలేని స్థితిలో ఉన్న ఆయన చికిత్స కోసం ఇటీవల నిమ్స్ వైద్యులను సంప్రదించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఆయన్ను పరీక్షించి... సీసీఎం, సీ4, సీ5, సీ6 సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్ రాసి, ఆ మేరకు సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. నెలరోజులైంది కానీ ఇప్పటికీ సర్జరీ చేయలేదు. అదేమంటే ఆపరేషన్ టేబుల్ ఖాళీ లేదని ఒకసారి..బోన్ కటింగ్ కోసం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ లేదని మరోసారి తిప్పిపంపారు. సర్జరీ ఎప్పుడు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు’..ఇలా ఒక్క శేఖరాచారి మాత్రమే కాదు మెదడులో కణుతులు, మెడ, వెన్నె ముఖ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది చికిత్సల కోసం నాలుగైదు మాసాలు నిరీక్షించాల్సి వస్తోంది. చికిత్సలో జాప్యం వల్ల సమస్య మరింత ముదిరి చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. -
తొలి టీకా నేనే వేసుకుంటా: ఈటల
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి, ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదని, బర్డ్ ఫ్లూతో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా మేఘా సంస్థ నిమ్స్ ఆస్పత్రిలో రూ.18 కోట్లతో నిర్మించిన ‘ఆంకాలజీ బ్లాక్’ను మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...కోవిడ్ వ్యాక్సిన్ వందశాతం సురక్షితమైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు పది లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. సామాజిక బాధ్యతలో ముందుంటాం సామాజిక బాధ్యతలో మేఘా సంస్థ ఎప్పుడూ ముందుటుంది. కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా నిమ్స్ క్యాన్సర్ వార్డును నిర్మించాం. ఇక్కడి ఆర్థోపెడిక్ విభాగంతో పాటు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిని కూడా త్వరలో ఆధునీకరిస్తాం. –పి.పి.రెడ్డి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ 450 కోట్లతో అధునాతన భవనాలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు నిమ్స్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక భవనాలు, మౌలిక వసతులు సమకూర్చనున్నట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఏటా రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తే..అందులో ఆరోగ్యశ్రీ,, ఈహెచ్ఎస్ పథకాలకే ఏటా రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పేద, మధ్య తరగతి వర్గాలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించే స్థాయికి రాష్ట్రం ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ..కేన్సర్ రోగులకు నిమ్స్ ఆంకాలజీ బ్లాక్ ఓ వరమని, బయట ఆస్పత్రుల్లో రూ. 20 లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని నిమ్స్ కేవలం రూ. 2 లక్షలతోనే చేస్తుందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో కేన్సర్ వార్డులను పునఃనిర్మించిన మేఘా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ పి. సుధారెడ్డి, ఆంకాలజీ విభాగా« ధిపతి డాక్టర్ సదాశివుడు, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. కేవీ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రోగం వచ్చిందా.. మూడు రోజులు ‘ఓపి’క పట్టు!
న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్న స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన జనార్దన్ చికిత్స కోసం ఉదయం ఏడు గంటలకు నిమ్స్ అవుట్ పేషెంట్ విభాగానికి చేరుకున్నాడు. ఎనిమిది గంటలకు ఓపీ కార్డు తీసుకుని న్యూరో ఓపీ విభాగంలోని వైద్యుడి వద్దకు చేరుకున్నాడు. పరీక్షించిన వైద్యుడు బ్రెయిన్ సీటీ సూచించాడు. వైద్యుడు రాసిన ఆ చీటీ తీసుకుని ఆస్పత్రిలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లగా అప్పటికే అక్కడ పది మంది వెయింటింగ్‌లో ఉన్నారని, మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు రావాల్సిందిగా టెక్నీషియన్ సూచించారు. ఆ మేరకు రిజిస్ట్రర్‌లో పేరు నమోదు చేసుకుని పంపించాడు. మెడికల్ రిపోర్ట్ వస్తే కానీ మందులు రాయలేని పరిస్థితి. అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేని దుస్థితి. చేసేది లేక ఆ రోజు రాత్రంతా ఎమర్జెన్సీ ముందు ఉన్న నైట్‌షెల్టర్‌లో నిరీక్షించి.. మరుసటి రోజు ఉదయాన్నే లేచి సిటీ స్కాన్ సెంటర్‌కు చేరుకున్నారు. తీరా స్కాన్ చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే రిపోర్ట్ ఇస్తామని చెప్పడంతో చేసేది లేక మళ్లీ అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు రిపోర్ట్ తీసుకుని ఓపీకి వెళ్తే..తీరా అక్కడ వైద్యుడు లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది ఒక్క జనార్దన్‌కు ఎదురైన చేదు అనుభవం మాత్రమే కాదు.. తలనొప్పి, నడుం నొప్పి, కీళ్లనొప్పులు, హృద్రోగ, కిడ్నీ, కాలేయ, ఉదరకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనేక మంది రోగులకు నిమ్స్‌లో ఇదే అనుభవం ఎదురవుతోంది. సాక్షి, సిటీబ్యూరో/నిమ్స్: ప్రతిష్టాత్మక నిమ్స్‌లో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఓపీ చిట్టీల కోసం ఉదయం ఆరుగంటలకే క్యూ కట్టినా..డాక్టర్‌కు చూపించుకుని..మందులు తీసుకొని బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం ఆరవుతోంది. ఒక్కోసారి టెస్టులు రాస్తే వైద్యానికి రెండు మూడు రోజులు పడుతోంది. 1500 పడకల సామర్థ్యం ఉన్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1400–1600 మంది వస్తుంటారు. నగదు చెల్లింపు రోగులే కాకుండా ఆర్టీసీ, ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఎక్కువగా వస్తుంటారు. ఉదయం 8 గంటలకు ఓపీ ప్రారంభమై 2.55 గంటలకు ముగుస్తుంది. బాధితుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేక ఓపీ కార్డుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంది. తీవ్ర నిరీక్షణ తర్వాత ఓపీ కార్డు తీసుకుని కేటాయించిన వైద్యుడి గదికి చేరు కుంటే అప్పటికే అక్కడ భారీగా క్యూలైన్ ఉంటుంది. వైద్యులు పరీక్షించి రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక్కో ల్యాబ్ ఒక్కో భవనంలో ఉండటంతో వీటి గుర్తింపు రోగులకు కష్టంగా మారుతుంది. అటు ఇటు తిరిగి డయాగ్నోస్టిక్‌కు చేరుకుంటే అక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదు. రిపోర్టుల జారీలోనూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. మెడికల్ రిపోర్టులు చూడకుండా మందులు రాసే పరిస్థితి లేకపోవడం, తీరా రిపోర్టు తీసుకుని వెళ్లే సమయానికి ఓపీలో వైద్యులు లేకపోవడంతో రెండు మూడు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించాల్సి వస్తుంది. అప్పటికే రోగం మరింత ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది. పైరవీ ఉంటేనే ఎమర్జెన్సీలో పడక కేటాయింపు వంద పడకల సామర్థ్యం ఉన్న అత్యవసర విభాగానికి రోజుకు సగటున 15–25 మంది వస్తుంటారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉంటారు. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది తీరా ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత వెంటిలేటర్‌పై వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో అడ్మిషన్ దొరకడం కష్టంగా మారుతోంది. ► ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అధికారులతో ఫోన్ చేయించి ఒత్తిడి తెప్పిస్తే కానీ పడక దొరకని దుస్థితి. ► ఇదిలా ఉంటే అత్యవసర విభాగాల్లో 36 ట్రాలీలు ఉండగా, వీటిలో 15 రిపేరులో ఉన్నాయి. 26 వెంటిలేటర్లు ఉండగా వీటిలో 6 సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి. u ఒక వెంటిలేటర్‌కు ఒక స్టాఫ్ నర్సు అవసరం కాగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో 15 మంది ఉంటే, మొదటి అంతస్తులో తొమ్మిది మంది స్టాఫ్ నర్సులు మాత్రమే పని చేస్తున్నారు. ► అంతేకాదు కన్సల్టెంట్ డాక్టర్లు వార్డుకు వచ్చి రౌండ్స్ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఫలితంగా అత్యవసర విభాగం నుంచి ఆయా వార్డులకు కేసులను తరలించడంలోనూ జాప్యం చోటు చేసుకుని పడకల సమస్య తలెత్తుతుంది. ► ఎమర్జెన్సీ విభాగంలో పడకల సంఖ్యతో పాటు స్టాఫ్ నర్సులు, డ్యూటీ మెడికల్ డాక్టర్ల సంఖ్యను పెంచడం ద్వారా కొంత వరకు సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజులు అవుతోంది... నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే నమ్మకంతో వచ్చా. కానీ ఇక్కడ ఓపీ కార్డు తీసుకోవడం మొదలు, వైద్యుడికి చూపించుకోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, మందులు రాయించుకుని వెళ్లడం ఇలా అన్ని చోట్ల ఆలస్యమవుతోంది. సాధారణ చికిత్సకూ రెండు మూడు రోజుల సమయం పడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లం రాత్రిపూట ఎక్కడ ఉండాలో తెలియక ఆస్పత్రి ఆవరణలోనే చలికి వణుకుతూ, తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. – మల్లేష్, గజ్వేల్ ఇతర ఆస్పత్రులను డెవలప్ చేయాలి ప్రభుత్వం గతంలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో తెలంగాణ నలుమూలల నుంచి రోగులు ఇక్కడికే వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వైద్య సిబ్బంది లేక ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించలేని దుస్థితి. ఉస్మానియా, గాంధీ ఇతర ఆస్పత్రులను కూడా నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం ద్వారానే రోగుల రద్దీ తగ్గుతుంది. ఖాళీలను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వచ్చిన రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే వెసులుబాటు కలుగుతుంది. – డాక్టర్ జి.శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ -
అయ్యో జమీర్!
సాక్షి, ఆదిలాబాద్: ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ ఫారూఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ జమీర్ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారంక్రితం ఆదిలాబాద్ తాటిగూడలో పిల్లల క్రికెట్ విషయమై గొడవ చెలరేగగా.. ఫారుఖ్ తుపాకీ, తల్వార్‌తో వీరంగం సృష్టించాడు. పాత కక్షలతో ప్రత్యర్థి వర్గానికి చెందిన సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడిచేశాడు. మోతేషాన్‌పై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా అడ్డుగా వచ్చిన సయ్యద్ జమీర్పైనా కాల్పులకు దిగడంతో అతని శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే సయ్యద్ జమీర్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జమీర్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం ఫారుఖ్‌ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. (చదవండి: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు) క్రికెట్ పంచాయితీ ప్రాణం తీసింది జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) -
బాధితుల శరీరాల్లో తూటాల తొలగింపు
పంజగుట్ట (హైదరాబాద్): ఆదిలాబాద్‌లో శుక్రవారం చిన్నపిల్లల ఆట కాస్తా మాటా మాట పెరిగి కాల్పుల వరకు దారితీసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొతేషీన్ నడుము భాగంలో ఉన్న ఒక తూటా, సయ్యద్ జమీర్ శరీరంలో రెండు తూటాలను శనివారం నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం న్యూరోసర్జన్ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల నుంచి వారు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఆదిలాబాద్ ఏఐఎంఐఎం శాఖ రద్దు ఏఐఏంఐఎం ఆదిలాబాద్ శాఖను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆదిలాబాద్ ఘటన దురదృష్టకరమని, త్వరలోనే నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
ప్రముఖ రచయిత దేవిప్రియ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను దేవిప్రియ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా దేవీప్రియకు మంచిపేరుంది. "గాలిరంగు" కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కవిగా గుర్తింపు పొందారు. దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు... కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ ఎంతో కృషి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు "గాలిరంగు" రచన మచ్చుతునకగా వర్ణించారు. -
నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్- 3 ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి నగరానికి చెందిన భారత్ బయోటెక్స్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ దిశగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ శరవేగంగా జరుగుతున్నాయని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. కోవాగ్జిన్ టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి రెడీ చేసేందుకు ఐసిఎంఆర్ కార్యచరణ ప్రణాళికలను రూపొందించినట్టు సమాచారం. ఇప్పటి వరకు మొదటి రెండు దశల్లో ట్రయల్స్ విజయవంతంగా జరిగాయి. ఆయా దశల్లో టీకా వేయించుకున్న వాలంటీర్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ చివరి దశ టీకా ప్రయోగానికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రయిల్స్‌ని నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో ఒకటైన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) సోమవారం నుంచి ట్రయల్స్‌ను కొనసాగించేందుకు సమాయత్తమవుతుంది. ఈ దశలో దాదాపుగా 600 మంది వాలంటీర్లకు టీకాలు వేయనున్నామని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ వైద్య బృందం వెల్లడించింది. -
ఆరోగ్యశ్రీ కార్డుదారులకు షాక్
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులకు ఓపీ సేవల్లో కోత విధించారు. ఇక్కడ అవుట్ పేషెంట్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే 25 శాతం మేరకు ఆయా ఖర్చులను భరించాల్సిందే. సోమవారం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 2 వేల రూపాయల వరకు రాయితీ కల్పిస్తున్నారు. ఇక మీదట ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం అర్హులైన రోగులకు వైద్య సేవలను అందించేందుకు యాజమాన్యం సమాయత్తమైంది. ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో ఓపీ సేవల్లో రాయితీలలో కోత విధించినట్టు సమాచారం. కోవిడ్–19 నేపథ్యంలో నిమ్స్‌లో కూడా ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిమ్స్ ఆస్పత్రికి ఈ ఆరు నెలల్లో రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా నిమ్స్‌కు రోగుల నుంచి క్యాష్ కలెక్షన్స్ ద్వారా నెలకు రూ.8.5 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ లాక్డౌన్ కారణంగా ఆస్పత్రికి రూ. 2.5 కోట్ల వరకే ఆదాయం లభించింది. కాగా ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చక్కదిద్దేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ఆస్పత్రిలో క్యాష్ కలెక్షన్స్ గణనీయంగా పడిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ఓపీ సేవల్లో గతంలో వర్తింపచేసిన నిబంధనలనే అనుసరిస్తున్నామన్నారు. చదవండి: పోలీసు ఉద్యోగం.. విద్యార్థులకు శుభవార్త -
కొవాక్జిన్’: ఇప్పటివరకు అనారోగ్య సమస్యలు రాలేదు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజామ్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ప్రతిష్టాత్మ కంగా కొనసాగుతున్న కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా రెండో దశ తుది టీకా ప్రయోగం చేయనున్నారు. మంగళవారం నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బూస్టర్ డోస్ వేయనున్నారు. రెండో దశలో 55 మంది వలంటీర్లు కొవాక్జిన్ టీకాలు వేయించుకోనుండగా, మొదటి దశలో 45 మంది వలంటీర్లు టీకాలు వేయించుకున్నారు. భారతీయ కౌన్సిల్‌ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ సంయుక్త భాగస్వామ్యంతో మొట్టమొదటి స్వదేశీ కోవిడ్–19 వ్యాక్సిన్ కొవాక్జిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా టీకా ఇచ్చే జాబితాలో వీరికి ప్రాధాన్యం) ఇక ఈ వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియలో 105 మంది వలంటీర్లు భాగస్వాములయ్యారు. మరో 28 రోజుల్లో మూడో దశ ట్రయల్స్‌ను చేపట్టేందుకు వైద్యులు సిద్ధమవు తున్నారు. ఈ దశలో మరో 60 మంది వలంటీర్లకు కొవాక్జిన్ టీకాలు వేయనున్నట్టు నిమ్స్ వైద్య బృందం తెలిపింది. నిమ్స్ సంచాలకుడు డాక్టర్ కె. మనోహర్ పర్యవేక్షణలో క్లినికల్ ఫార్మకాలజీ ప్రొఫెసర్లు, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, రెస్పిరేటరీ మెడిసిన్, క్రిటికల్ కేర్ విభాగాలకు చెందిన సీనియర్ వైద్యుల సమన్వయంతో ఈ ట్రయల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ టీకా ఇచ్చిన వలంటీర్లలో కొవాక్జిన్ కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదని నిమ్స్ వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ టీకా ప్రయోగానికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులోని ఆరోగ్యవంతులని మాత్రమే ఎంపిక చేశారు. ఈ క్రమంలో మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన వలంటీర్ల స్క్రీనింగ్ టెస్టుల ప్రక్రియను మరో రెండ్రోజుల్లో చేపట్టనున్నట్టు వైద్యులు తెలిపారు. -
నిమ్స్‌లో సెకండ్ టీకా ప్రయోగానికి సన్నాహాలు
సాక్షి, లక్డీకాపూల్: నిజామ్స్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాక్జిన్ ట్రయల్స్‌లో భాగస్వాములైన వలంటీర్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. మొదటి దశ టీకా తీసుకున్న 53 మంది వలంటీర్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉత్పన్నం కాలేదు. వీరందరికీ తొలుత మూడు మైక్రో గ్రాముల మోతాదులో కోవాక్జిన్ టీకా ప్రయోగం చేశారు. ఆ తర్వాత 14 రోజులకు అదే కోడ్‌కు సంబంధించిన బూస్టర్ డోస్‌ను కూడా ఇచ్చారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ పర్యవేక్షణలో నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లినికల్ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు జనరల్ మెడిసిన్, అనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన్ వైద్యుల సమన్వయంతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వలంటీర్లంతా తమ ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నోడల్ అధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. 28 రోజుల తర్వాత సెకండ్ ఫేస్ టీకా ఇచ్చేందుకు నిమ్స్ వైద్యులు సంసిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలోని ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. మరో పక్క వలంటీర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధ్యయన ప్రాంతాల్లోనే.. స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వలంటీర్లు అధ్యయన ప్రాంతంలోనే నివసించాలి. ఆ దిశగా నిమ్స్ వైద్య బృందం అవసరమైన చర్యలు తీసుకుంది. వాస్తవానికి కోవాక్జి్జన్ టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపిన వాళ్లు తాము సిద్ధంగా ఉన్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంది. అందుకు ముందుకు వచ్చి న వాళ్లలో ఎక్కువగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లే పాల్గొన్నారు. మరి కొందరు ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు వీరికి టీకా ప్రయోగ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో తొలుత వారి రక్త నమూనాలను సేకరించి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి సంపూర్ణ ఆరోగ్యవంతులైన వలంటీర్లను మాత్రమే ఈ ట్రయిల్స్‌కు ఎంపిక చేశారు. ఇదే క్రమంలో ఆయా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌కు నివేదికను అందజేశారు. ఆ ల్యాబ్ వలంటీర్ల ఫిట్నెట్పై ఆమోదం తెలిపిన మేరకే టీకా ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి దశలో టీకా, బూస్టర్ డోస్ తీసుకున్నారు. 28 రోజుల తర్వాత రెండవ దశలో టీకా తీసుకోవాల్సి ఉంది. అది కూడా ఈ నెల 29వ తేదీ నుంచి అధ్యయన గడువు ముగుస్తుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ వలంటీర్లందరికీ సెప్టెంబరు రెండవ వారంలో రెండవ దశ టీకాలు ఇవ్వనున్నారు. 45 రోజులకు మూడవ దశ టీకా.. 90 రోజుల తర్వాత నాల్గోవ డోస్ టీకా.. చివరిగా 180 రోజులకు మలి దశ టీకా ప్రయోగం జరుగుతుంది. వాస్తవానికి ఈ టీకా ప్రయోగం జూలై 14న మొదలైంది. నవంబర్ నెలాఖరు నాటికి కోవాక్జిన్.. నవంబర్ నెలాఖరు నాటికి భారత్ బయోటెక్ ఫార్మసూటికల్ సంస్థ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్జి్జన్ టీకా అందుబాటులోకి వస్తుందని నిమ్స్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఫేజ్–2 ట్రయిల్స్ ముగిసిన తర్వాత దాదాపుగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. అయితే క్లినికల్ ట్రయిల్స్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కొంతమేర జాప్యం ఏర్పడుతుంది. ఏదిఏమైనా కోవిడ్–19కి ప్రివ్వెంటీ వ్యాక్సిన్ అయిన టీకా ఎంత కాలం తన ప్రభావాన్ని చూపుతుందన్న అంశంలో ఈ ఫేజ్–2లో స్పష్టమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. రెండు దశలలో నిర్వహించే హ్యూమన్ క్లినికల్ ట్రయిల్స్‌లో కోవాగ్జిన్ పనితీరుపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ మేరకు ఈ టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. దాని వల్ల ప్రజల్లో ఏర్పడిన ఆందోళన కూడా తగ్గుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు..
లక్డీకాపూల్: కరోనా మహమ్మారిని తుదముట్టించే క్రమంలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు నిమ్స్కసరత్తు చేపట్టింది. ఫార్మా దిగ్గజ భారత్‌బయోటెక్ సంస్థకు చెందిన ఈ వ్యాక్సిన్ మానవ ప్రయోగ ప్రక్రియను నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ ఆదేశాలకనుగుణంగా కొవాక్జిన్ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియను శరవేగంగాకొనసాగిస్తోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులపై ప్రయోగించే అంశంలో నిమ్స్ వైద్యులు ఏమాత్రం రాజీ లేకుండా ముందుకు అడుగులేస్తున్నారు. నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తూ.. 50 మంది వలంటీర్లకు కొవాక్జిన్ టీకాను 3 ఎంఎల్, 6 ఎంఎల్ మోతాదులో టీకాలను ఇచ్చింది. వీరంతా టీకా మందు తీసుకున్న గంటల వ్యవధిలోనే తమ తమ ఇళ్లకు వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరికి బూస్టర్ డోస్‌ను సైతం ఇస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా ముగింపు దశకు వస్తోంది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌లో ఫేజ్– 1ను విజయవంతంగా పూర్తి చేసినట్లవుతుంది. ఈ బూస్టర్ తీసుకున్న తర్వాత దాదాపు 28 రోజుల పాటు వ్యాక్సిన్ పనితీరుపై వైద్యులు దృష్టి పెట్టనున్నారు. వాస్తవానికి ఈ టీకా తీసుకున్న వలంటీర్లలో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానరాలేదు. ఇందుకు నిమ్స్ వైద్యులు తీసుకున్న జాగ్రత్తలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో రెండు మోతాదుల్లో ఇచ్చిన వ్యాక్సిన్లు ఏ విధంగా పని చేస్తున్నాయన్న అంశంపై నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం అధ్యయనం చేపట్టింది. దీంతో కొవాక్జిన్ పనితీరు తేటతెల్లమవుతుందంటున్నారు. అందులోనూ ఏ మోతాదు ఎంతవరకు పని చేస్తుందన్న అంశంపై స్పష్టత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ తరహా ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగుతుందని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. బూస్టర్ డోస్ ముగిసిన నాటి నుంచి 28 రోజుల వరకు ఆయా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత ఫేజ్–2 ప్రక్రియను చేపట్టేందుకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ వైద్య బృందం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా టీకాలు తీసుకున్న వలంటీర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత మొదటి ఫేజ్‌లో ఇచ్చిన మోతాదుల్లో మెరుగైన ఒక మోతాదు టీకాను ఇవ్వనున్నారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే కరోనా మహమ్మారికి చెక్ పెట్టినట్టే. సెకండ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్నిస్తున్నాయి. కొవాక్జిన్ సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని నిమ్స్ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. -
సాఫీగా కోవాక్జిన్ ట్రయల్స్
లక్డీకాపూల్ (హైదరాబాద్) : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగం ముగింపు దశకు చేరుకుంది. సోమవారం మరో ఇద్దరికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా 55 మంది వలంటీర్లు ఈ టీకాలు వేయించుకున్నారు. వీరిలో ఇద్దరికి మొదటి దశలోని మలి టీకా (బూస్టర్ డోస్)ను కూడా ఇచ్చారు. మరో రెండురోజుల్లో మిగిలిన మరో ఐదుగురికి టీకాలు వేస్తే నిమ్స్‌లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ముగుస్తాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్జిన్ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియకు ఐసీఎంఆర్ మొత్తం దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో నిమ్స్ ఒకటి. నిమ్స్‌లో జూలై 14న ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్ ప్రణాళిక ప్రకారం సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ టీకా వల్ల ఎవరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోవడం గమనార్హం. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె. మనోహర్ పర్యవేక్షణలో నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉందనేది మరో నెల తర్వాతే నిర్ధారణ అవుతుందన్న అభిప్రాయాన్ని నిమ్స్ వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. టీకా ప్రయోగం ఇలా.. వలంటీర్లకు తొలుత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రక్త నమూనాలు, స్వాబ్‌లను సేకరిస్తున్నారు. ఆ నమూనాలను ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఢిల్లీలోని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఢిల్లీ ల్యాబ్ జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికేట్ల ఆధారంగా నిమ్స్ వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి దశలో 3 మైక్రోగ్రాములు మోతాదులో టీకా ఇస్తున్నారు. ఇప్పటికి 55 మందికి వేశారు. ఈ టీకా తీసుకున్న వలంటీర్లకు 14 రోజుల తర్వాత అదే కోడ్ కలిగిన వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను అందిస్తున్నారు. సోమవారం నుంచి ఈ డోస్‌ను కూడా నిమ్స్ వైద్యులు ప్రారంభించారు.ఈ క్రమంలో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వలంటీర్ల ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం తెలుసుకుంటున్నారు. -
నిమ్స్‌లో వీఐపీ కరోనా రోగులు
హైదరాబాద్: నిమ్స్‌లో కరోనాతో బాధపడుతున్న పలువురు ప్రముఖులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. నిమ్స్ పాత భవనంలోని స్పెషల్ రూమ్‌లో చికిత్స పొందుతున్న వారిలో నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కె. సాంబశివరావు చికిత్స పొందుతున్నారు. నిమ్స్ వైద్యులు, ఉద్యోగులకే పరిమితమైన కోవిడ్ సేవలు రాష్ట్రంలోని ప్రముఖులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. నిమ్స్‌లో పని చేస్తున్న వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. -
నిమ్స్‌లో ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంట ర్నేషనల్ మరో ముందడుగు వేసింది. తాము అభి వృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ను మనుషులకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఎయిమ్స్ (పాట్నా) సహా రోహతక్ (హరియాణా)లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆ సంస్థ తాజాగా సోమవారం హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోనూ మనుషులపై టీకాను ప్రయోగిం చింది. సోమవారం ఇద్దరు వలంటీర్లకు మూడు మైక్రోగ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారు. 24 గంటల పాటు వీరిని ఆస్పత్రి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తారు. బయట తిరిగితే ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉండటంతో వీరిని పూర్తిగా ఇంటికే పరి మితం చేయనున్నారు. వైద్యులు వీడియో కాల్లో రోజూ వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో వీరికి అవసరమైన పౌష్టికాహారం సహా అన్ని రకాల మందులను అందజేస్తారు. 14 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెం దాయి? వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటివి విశ్లేషించి, వచ్చే ఫలితాలను బట్టి వీరికి అదే బ్యాచ్‌కి చెందిన ఆరు మైక్రో గ్రాముల చొప్పున రెండో డోస్ ఇవ్వనున్నారు. మంగళవారం మరో ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మూడో ప్రయోగం.. కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ తెచ్చేందుకు అంతర్జాతీయంగా వందకుపైగా ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆయా దేశాలు వ్యాక్సిన్ల తయారీపై చేస్తున్న పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు సెప్టెంబర్‌లోగా వ్యాక్సిన్ తేనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్స్ మాత్రం అంతకంటే ముందే (అక్టోబర్) వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటించింది. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం నిమ్స్ సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 పరిశోధన కేంద్రాల్లో ఇప్పటికే 375 మంది వలంటీర్లపై ర్యాండమైజ్డ్ డబుల్ బ్లెండ్, ప్లాసిబో కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. జూలై 15న పాట్నా ఎయిమ్స్‌లో, 17న హరియాణాలోని రోహతక్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ముగ్గురికి వ్యాక్సిన్ ఇవ్వగా, ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదు. దీంతో తాజాగా నిమ్స్‌లో ఇద్దరు వలంటీర్లకు తొలి డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మిలీనియం బ్లాక్ 6వ అంతస్తులోని నిమ్స్ క్లినికల్ ఫార్మాకాలజీ విభాగం ఈ టీకా ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. కాగా, నిమ్స్‌లో ప్రయోగానికి ఇప్పటి వరకు 60 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరికి కరోనా సహా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారి పేర్లను ఐసీఎంఆర్‌కు పంపి, ఫిట్నెస్ అనుమతి వచ్చాకే వారికి వ్యాక్సిన్ డోస్ ఇస్తారు. -
నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
-
నిమ్స్‌లో వాలంటీర్‌కు తొలి డోస్ ఇచ్చిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని నిమ్స్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ తయారీ బృందం కీలక దశలోకి అడుగుపెట్టింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇద్దరు వాలంటీర్లుకు సోమవారం తొలి డోస్‌ను ఇచ్చారు. వ్యాక్సిన్ తయారీలో భాగంగా భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. దేశం వ్యాప్తంగా మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్సాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ నిమ్స్‌ను ఎంచుకుంది. (నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్) ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నివారణ వ్యాక్సిన్ కోసం భారత్ సహా అగ్రదేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు మానవులపై రెండో దశ ప్రయోగాల్ని కూడా పూర్తి చేశాయి. మరి కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ సైతం ముందంజలో ఉంది. భారతదేశంలో దేశీయంగా అభివృద్ది చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. -
నిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న అకౌంటెంట్లు, క్లర్కులు శుక్రవారం కోఠి పబ్లిక్ హెల్త్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కోవిడ్ కాలంలో తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. తమ జీతాలు పెంచకపోతే వచ్చే నెల నుంచి సమ్మెకు వెళతామని హెచ్చరించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలోనూ తమకు సరిగా జీతాలు చెల్లించడం లేదని అక్కడి పారామెడికల్, టెక్నికల్ సిబ్బంది ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అటు గాంధీ ఆస్పత్రిలోనూ ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగగా ప్రభుత్వం వారు కోరిన పలు డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించడంతో సమ్మె ఆలోచన విరమించి తిరిగి విధుల్లోకి చేరారు. (ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం) (కరోనా కోరల్లో నిమ్స్!) -
నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 కేంద్రాలను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కూడా ఉంది. ఈ క్రమంలో నిమ్స్ అధికారులు క్లినికల్ ట్రయల్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత జూలై 7 నుంచి ట్రయల్స్ ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ దానికి కాస్త బ్రేక్ పడింది. (తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్ డైరెక్టర్) తాజాగా మంగళవారం నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలయ్యాయి. వాలంటీర్ల బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించిన వైద్యులు వాటిని సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. కాగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చేసిన 12 కేంద్రాల్లో మొత్తం 375 మందిపై మొదటి డోస్‌ను పరీక్షించనున్నారు. నిమ్స్‌లో దాదాపు 60 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిపే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.(మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు) -
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు నిమ్స్‌లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 రోగులకు చికిత్స అందిస్తూ వైరస్ బారిన పడిన వైద్యులు, వైద్య సిబ్బందికి నిమ్స్‌లో చికిత్స చేయించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు నిమ్స్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తూ చాలా మంది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారని, ఈ నేపథ్యంలో వారందరికీ నిమ్స్‌లో చికిత్స అందించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై జేఏసీ నేతలు రమేశ్, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్, నరహరి తదితరులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
లక్డీకాపూల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది. వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసే విషయంలో నగరానికి చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ నిమ్స్‌ను ఎంచుకుంది. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపిక చేశారన్నారు. దేశంలో ట్రయల్స్ నిర్వహిస్తున్న 12 సంస్థల్లో నిమ్స్ ఒకటి కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో మూడు రకాల వ్యాక్సిన్‌ను రెండు డోస్‌ల చొప్పున ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్‌లో కూడా 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఉంటుందన్నారు. ఫేస్–1, ఫేస్–2 కింద ఈ క్లినికల్ ట్రయిల్స్ చేపడతామన్నారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందన్నారు. సమావేశంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ పాల్గొన్నారు. -
కరోనా: 7నుంచి నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చాక రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామని మనోహర్ పేర్కొన్నారు. (చదవండి : ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్ ఉన్నాయి. -
నిమ్స్‌లో వైద్యులకు కరోనా పరీక్షలు..!
లక్డీకాపూల్ : అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ వెంటాడుతుంది. ఫలితంగా ఆస్పత్రిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఉద్యోగులు వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ లక్షణాలు బయటపడగా మరికొంత మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో 22 మంది వైద్యులు, 20 మంది పారామెడికల్ సిబ్బంది నిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా వరకు వైరస్ ప్రభావం తీవ్రత తగ్గుముఖం పట్టడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లారు. తాజాగా పాజిటివ్‌గా నమోదైన నిమ్స్ నెఫ్రాలజీ విభాగం హెచ్ఓడీ సోమవారం హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్యాథ్లాబ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు వచ్చిన రోగుల ద్వారానే వైరస్ సోకినట్లు నిమ్స్ వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పక్క ఆపరేషన్ థియేటర్లలో కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని ఓ సీనియర్ వైద్యుడు పేర్కొన్నారు. ఏదైనా ఆపరేషన్ జరిగిన సందర్భంగా అక్కడున్న వైద్యులంతా కలిసి ఒకే చోట భోజనం చేయడం పరిపాటి. ఆ సమయంలో మాస్కులు ఉండవు. దాని వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదంటున్నారు. దీంతో వెద్యులందరికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్టు ఓ సర్జన్ పేర్కొన్నారు. వైద్యులతో పాటుగా పారామెడికల్ సిబ్బంది, ఉద్యోగులకు సైతం ప్రాధాన్యతా క్రమంలో పరీక్షళ/ నిర్వహించాలన్న యోచనలో యాజమాన్యం ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే శస్త్ర చికిత్సలను నిలిపివేయాలని యాజమాన్యం సూచించింది. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం 25మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు సమాచారం. నిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం 150 మంది వైద్యులు ఉండగా వీరిలో దాదాపు 25 మందికి పాజిటివ్‌గా నమోదైనట్టు తెలుస్తోంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 200 మంది ఉండగా వీరిలో 20మందికి పైగా వైరస్ సోకినట్లు సమాచారం. కాంట్రాక్టు సిబ్బంది 400మందిలో 25 శాతం మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రెసిడెంట్ డాక్టర్లు సుమారు 400మందికి గాను 75 శాతం మేరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదని, ఆ దిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినిహా చేయగలిగినదేమీ లేదని ఓ జూనియర్ డాక్టర్ పేర్కొన్నారు. ఏది ఏమైనా వైరస్ కారణంగా మరణాలు లేకపోవడం గమనార్హం. పాజిటివ్‌గా నమోదైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిలో చాలా వరకు ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి హోం క్వారంటైన్‌కు వెళుతున్నారు. కానీ వైద్యులు సైతం భయం భయంగానే వైద్య సేవలందిస్తున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. -
ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సభ్యుడికి పాజిటివ్!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీలో ఓ కీలక సభ్యుడికి కరోనా వైరస్ సోకింది. నిమ్స్‌లో ఓ విభాగానికి అధిపతిగా, ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సాంకేతిక సలహాదారుడిగా సైతం వ్యవహరిస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకినట్టు ఆదివారం ఫలితా లువచ్చాయి. కరోనా వైరస్ నియంత్రణకు అవలంభిస్తున్న విధానాలపై అధ్యయనం జరిపి సలహాలు ఇవ్వడానికి సీసీఎంబీ డైరెక్టర్, కాళోజి వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్, హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు/సీఈఓ, నిమ్స్ ప్రొఫెసర్‌తో గత మార్చి 22న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా నియంత్రణపై గతంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన పలు ఉన్నత స్థాయి సమీక్షల్లో ఈ నిపుణుల కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈటలకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్న ఈ ప్రొఫెసర్.. మంత్రి పాల్గొనే కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఈటల రాజేందర్ క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. -
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..
లక్డీకాపూల్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గవర్నర్ నిమ్స్ ఆసుప్రతిని సోమవారం సందర్శించారు. తొలుత మిలీనియం బ్లాక్ మొదటి అంతస్తులో కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నా, మాస్కులు ధరించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందని, ప్రజలు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైద్యశాఖ, పోలీసు, జర్నలిస్టుల ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించినట్లు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను గమనిస్తుంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పాటిస్తున్న విధానాల్లో మరిన్ని మార్పులు అవసరమన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి సంఖ్య మరింత పెంచాల్సి ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విశ్వాసం తనకుందన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేవీ కృష్ణారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కరోనా బాధితులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై
-
నిమ్స్‌లో ఓపీ బంద్!
లక్డీకాపూల్(హైదరాబాద్) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఓపీ, అడ్మిషన్ సేవలను ఆస్పత్రి యాజమాన్యం తాత్కాలికంగా నిలిపేసింది. అధికారికంగా 5 విభాగాల్లోనే ఈ సేవలను ఆపినట్లు ప్రకటించినా..పూర్తిస్థాయిలో ఓపీ బంద్ ఉన్నట్లు సమాచారం. ఇన్ పేషెంట్ సేవలను కూడా చాలా వరకు తగ్గించారు. అలాగే ఉద్యోగుల హాజరుపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కరోనా వ్యాప్తి తొలినాళ్లలో విధించిన లాక్డౌన్ పరిస్థితులే మళ్లీ ఆస్పత్రిలో నెలకొన్నాయి. లాక్డౌన్ నిబంధనల సడలింపులకు ముందు నిమ్స్‌లోని దాదాపు అన్ని వైద్య విభాగాలకు తాళాలు పడ్డాయి. ఓల్డ్ బిల్డింగ్‌లోని ఏ, బీ, సీ బ్లాక్లైతే ఇంకా తెరుచుకోనేలేదు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభా గంలో ఓ రోగికి కరోనా రావడం.. అది అలా ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేం దుకు సంసిద్ధమయ్యారు. దీని లో భాగంగా రోగుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అలాగే వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు, కార్మి కులు సైతం 70 శాతం మేరకే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన 30% మంది విధిగా హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ ఉత్తర్వులు మంగళవారమే వెలువడినట్లు నిమ్స్ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్ పేషెంట్లు సైతం ఖాళీ.. ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించే చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల నుంచి స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభాగంలో ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇదే ప్రక్రియను ఆస్పత్రిలోని ఇతర విభాగాలు కూడా అనుసరిస్తున్నాయి. దీంతో ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో వైద్యం అందుకుంటున్న వారు రెండు రోజులుగా డిశ్చార్జి అవుతున్నారు. అయితే, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆస్పత్రి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. కార్డియాలజీ ఐసీయూ సహా ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో దాదాపు 100 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరిలో కొంత మందిని డిశ్చార్జి చేయనున్నారు. మిగిలిన వారిని ఎక్కడికి తరలించాలన్న దానిపై యాజమాన్యం సమాలోచనలు జరుపుతోంది. ముఖ్యంగా ఆదివారం నుంచి స్పెషాలిటీ బ్లాక్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందింది ఈ బ్లాక్ నుంచే కావడంతో హైపో క్లోరైడ్, శానిటైజ్ వంటి ప్రక్రియతో పూర్తిగా శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. ఆస్పత్రిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైద్యులు, వైద్య సిబ్బంది, కార్మికులు.. అంతా కలిపి 20మంది కరోనా వైరస్ బారిన పడినట్లు యాజమాన్యం అధికారంగా వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్యకు మూడింతల మంది కరోనాతో బాధపడుతున్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం నిమ్స్ మిలీనియం బ్లాక్ మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్నది 12 మంది వైద్యులు మాత్రమే. అంతకుముందు దాదాపుగా 20 మంది ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లను నిమ్స్ యాజమాన్యం హోం క్వారంటైన్‌కు పంపించింది. కాగా, శనివారం ఓపీ విభాగం మూసివేతతో ఆస్పత్రిలో బంద్ వాతావరణం కనిపించింది. యూరాలజీ విభాగం మాత్రమే ఓపీ సేవలను అందించింది. మిగిలిన విభాగాలకు రోగులు కూడా రాకపోవడం గమనార్హం. -
కరోనా కోరల్లో నిమ్స్!
కరోనా వైరస్ కబందహస్తాల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను అందించే నిమ్స్ ఆస్పత్రి విలవిలాడుతున్నది. సోమవారం నుంచి కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఫలితంగా ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, కార్మికులు కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. వైద్యులకు నిమ్స్‌లోనే వైద్యం అందించి.. తమకు బయటి ఆస్పత్రుల్లో చికిత్స ఇప్పిస్తుండటంపై సిబ్బంది, కార్మికులు ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్: కోవిడ్ బారినపడి ఇప్పటికే పది మందికిపైగా వైద్యులు చికిత్స పొందుతున్నారు. మరో 20 మందిని హోం క్వారంటైన్‌కి సిఫార్సు చేశారు. డాక్టర్స్ క్లబ్‌లోని రెసిడెంట్ డాక్టర్లందరూ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్టు విశ్వనీయ సమాచారం. దీంతో యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు కీలకమైన విభాగాలలోని వైద్యులు, సిబ్బంది, కార్మికుల నమూనాలను సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల నుంచి 20 మంది చొప్పున నమూనాలను సేకరించి కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. శుక్రవారం మహిళా వైద్యురాలితోపాటు మహిళా ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం ఒక ప్రొఫెసర్, ముగ్గురు వైద్యులు, ఒక రోగి సహాయకునికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. వీరికి నిమ్స్ మిలీనియం బ్లాక్‌లోని మొదటి అంతస్తులో చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శస్త్ర చికిత్సలను నిలిపివేశారు.(నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా) నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది ఇంత వివక్షనా! ఉద్యోగులు, సిబ్బందికి ఇతర ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. యాజమాన్య వైఖరిని ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం ఉదయం కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమకు కూడా వైద్యులతోపాటు కోవిడ్–19 చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లను సరఫరా చేయాలని కోరారు. కరోనాకు గురైన డాక్టర్లకు నిమ్స్‌లో వైద్యం.., మిగిలిన సిబ్బందికి బయట ఆస్పత్రుల్లో వైద్యమా? ఇదెక్కడి న్యాయం అంటూ ముక్తకంఠంతో యాజమాన్యాన్ని నిలదీశారు. కోవిడ్–19 బారిన పడిన నిమ్స్ సిబ్బందికీ నిమ్స్‌లోనే వైద్యం అందించాలని ప్ల కార్డులను ప్రదర్శించారు. తమకు తగిన న్యాయం జరిగేంత వరకు విధుల్లోకి వెళ్లబోమని భీష్మించుకూర్చున్నారు. ఆందోళన వద్దు.. భద్రత కల్పిస్తాం కోవిడ్–19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ భద్రత కల్పిస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులతోపాటు సిబ్బందికి, కార్మికులకూ కోవిడ్ పరీక్షలు, చికిత్స అందిస్తాం. కార్మికుల సహా అందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, అవసరమైన వారికి పీపీఈ కిట్లను అందజేస్తాం. హైపోక్లోరైడ్ స్ప్రే చేయిస్తున్నాం. శానిటైజ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.– డాక్టర్.కె.మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
కరోనాకు ప్రైవేట్ వైద్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు/ల్యాబ్స్‌లో కరోనా వైద్య చికిత్స/పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్‌లో సౌకర్యాలను పరిశీలించిన తర్వాతే పరీక్షలు, చికిత్సలకు అనుమతివ్వాలని ఐసీఎంఆర్‌ను కూడా ఆదేశించింది. గాంధీ, నిమ్స్ వంటి నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రోగి ఎక్కడ వైద్యం చేసుకోవాలో ప్రభుత్వం నిర్దేశించడం రాజ్యాంగం కల్పిం చిన వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమని, జీవించే హక్కులో భాగమే ఆరోగ్యం ఉంటుందని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ధర్మాసనం పేర్కొంది. (జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు) ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల సేవలు కూడా ఎంతో ముఖ్యమని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించింది. అందుకే ఐసీఎంఆర్ ప్రైవేట్ ల్యాబ్స్‌ను గుర్తించి అనుమతులు ఇచ్చిందని తెలిపింది. అనుమతిస్తే తప్పేంటి? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతులు ఇస్తున్నప్పుడు కరోనా వైద్యానికి అనుమతిస్తే తప్పేంటని ప్రశ్నించింది. పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లను కాదనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అవుతుందని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్‌లో కరోనా చికిత్స, పరీక్షలు నిర్వహించడాన్ని నిలిపేయాలంటూ గత ఏప్రిల్ 11న హైదరాబాద్ డీఎంహెచ్ఓ జారీ చేసిన ఉత్తర్వులను నగరానికి చెందిన గంటా జయకుమార్ సవాల్ చేశారు. మార్చి 21న పరీక్షలు, చికిత్సలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు మాత్రమే వైద్యం, పరీక్షలు చేయాలని, ఇతర రోగాలకు వైద్యం చేయకూడదని ఏప్రిల్ 11న షరతు పెట్టి ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో అసలే పరీక్షలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనానికి పిల్లో పిటిషనర్ తెలిపారు. అయితే ఇది ప్రజాహిత వ్యాజ్యం కాదని, పిల్ వెనుక ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. డబ్బు చెల్లించే వ్యక్తి నచ్చిన చోట వైద్యం చేయించుకునే హక్కు ఉంటుందని, ప్రభుత్వం చెప్పిన చోటే వైద్యం చేయించుకోవాలనడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొంది. పరిశీలించాకే అనుమతులు.. ‘కరోనా పరీక్షలు, చికిత్స చేసే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల నుంచి ఐసీఎంఆర్ దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని వైద్య రంగ నిపుణులు పరిశీలించాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వైద్య నిపుణలు, ఇతర వసతులను అధ్యయనం చేశాక అనుమతి ఇవ్వాలి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అనుమతి పొందబోయే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి. కరోనా ఉన్న వారికి వైద్యం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలతో పాటు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారి వివరాలను అనుమతి పొందబోయే ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలి’అంటూ ఐసీఎంఆర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
‘శ్వాస’ వ్యవస్థ బాగుంటే వైరస్ భయం లేనట్టే!
‘శ్వాసనాళ, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇప్పటికే బాధపడుతున్న వారు తాము వాడుతున్న మందులను కొనసాగించాలి. ఆస్తమా, సీఓపీడీ, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలుంటే కరోనాకు గురయ్యే అవకాశాలెక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఇవి రాకుండా చూసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే వైరస్ వ్యాపించదనేది అపోహ మాత్రమే. కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మరో ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించడమొక్కటే మార్గం’అని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీకే పరంజ్యోతి సూచించారు. శ్వాసనాళ, శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్సపొందేవారు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వివరాలు డాక్టర్ మాటల్లోనే.. స్టెరాయిడ్ ఇన్హేలర్ను వాడండి ఆస్తమా రోగులు స్టెరాయిడ్ ఇన్హేలర్ను వాడుతూనే ఉండాలి. దీని వాడకం కరోనాను కొంతమేర నిరోధిస్తుందని చైనీయుల అనుభవాలు చెబుతున్నాయి. లేదంటే ఆస్తమా ముదిరి కరోనా లక్షణాలు పెరగొచ్చు. ఆస్తమా రోగులు కరోనా ద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారనే దానికి ఎలాంటి ఆధారాల్లేవు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలామందికి గతంలో ఎలాంటి శ్వాస సంబ«ంధ సమస్యలు లేవు. ఆస్తమాతో బాధపడుతూ కరోనా బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు స్వల్పంగానే ఉన్నా, చికిత్స తర్వాత వీరు రికవరీ అవుతున్నట్టే నివేదికలు చెబుతున్నాయి. కరోనాకు భయపడి ఆస్తమా కోసం తీసుకుంటున్న చికిత్సను అశ్రద్ద చేయొద్దు. హృద్రోగ, శ్వాసకోశ వ్యాధులతో జాగ్రత్త కరోనా బారినపడిన చాలామందిలో కొద్దిగా అస్వస్థతతో పాటు జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్ర హృద్రోగ, శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిపై ఇది ప్రభావం చూపుతుంది. శ్వాసనాళం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. శ్వాసనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఊపిరితిత్తుల నుంచి తెమడను బయటకు పంపి కరోనా బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది. ఒకవేళ దగ్గు, జ్వరం వచ్చినా శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా పెట్టుకోవడంతో పాటు, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడాలి. బ్రాంకియెక్టసిస్ (శ్వాసనాళం, దాని శాఖలు ఉబ్బడం) తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలంగా ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నా, శ్వాససంబంధ సమస్యలకు దీర్ఘకాలంగా యాంటీ బయోటిక్స్ వాడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి సామాజిక దూరం పాటిస్తూ, కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. వైరస్‌ను తట్టుకోలేని ‘సీఓపీడీ’ ఎంఫిసిమా, క్రానిక్ బ్రాంకైటిస్ తదితర ఊపిరితిత్తుల సమస్యలు సీఓపీడీ (శ్వాస మార్గం మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోవడం)కి దారితీస్తాయి. సీఓపీడీతో బాధపడుతున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. వీరి ఊపిరితిత్తులు కొంతమేర దెబ్బతిని ఉంటాయి కాబట్టి కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి తక్కువుంటుంది. వాస్తవానికి కరోనా బారినపడే వారిలో సుమారు 50 శాతం మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. కొందరిలో స్పల్పంగా జలుబు, ముక్కు కారడం, కండరాల నొప్పి, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటాయి. మరికొందరిలో ‘ఫ్లూ’తరహాలో జలుబు, కండరాల నొప్పి, అలసట ఉంటుంది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండే వారిలో న్యూమోనియా, శ్వాస ఆడకపోవడం, దగ్గు అదనపు లక్షణాలుగా ఉంటాయి. సీఓపీడీ రోగులకు ఊపిరితిత్తులతో సమస్య మొదలై కరోనా బారినపడితే ఊపిరాడని పరిస్థితికి చేరుకుంటారు. అయితే చాలామంది సీఓపీడీ రోగుల్లో కరోనా సోకినా లక్షణాలు బయట పడకుండానే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఆ ఔషధాలు వాడే వారిలో రిస్క్ ఎక్కువ గతంలో ఏవైనా ఇతర వ్యాధుల బారిన పడ్డవారికి కరోనా సోకే అవకాశాలెక్కువనేది నిజం కాదు. అయితే హృద్రోగ, శ్వాస సంబంధ, డయాబెటిస్ లేదా రోగ నిరోధకశక్తిని తగ్గించే ఔషధాలు వాడే వారిలో కరోనా రిస్క్ ఎక్కువ. ఇతరులతో పోలిస్తే టీబీ వ్యాధిగ్రస్తులు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు ఒకవేళ కరోనా బారినపడినా లక్షణాలు కొద్దిగా బయటపడవచ్చు లేదా అసలు కనిపించకపోవచ్చు. టీబీ చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సూచనతో మందులు వాడుతూ సామాజిక దూరం పాటించాలి. గతంలో ఊపిరితిత్తుల్లో కొంత భాగం తొలగించినా, ఊపిరితిత్తులు చిన్నవి (స్కోలియోసిస్)గా ఉన్నా కరోనా సోకుతుందనేది అపోహ మాత్రమే. న్యూమోథొరాక్స్‌తో భయం లేదు ఇతర అనారోగ్యంతో బాధపడేవారు లేదా ఆరోగ్యవంతుల్లోనూ న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల ఛాతీ గోడ నడుమ గ్యాస్) సంభవించినా కరోనా ప్రమాదం అంతగా ఉండకపోవచ్చు. అయితే న్యూమోథొరాక్స్‌తో పాటు సీఓపీడీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇతర ఊపిరితిత్తి సంబంధ సమస్యలు రిస్క్‌ను పెంచే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా న్యూమోథొరాక్స్ సంభవించడం అనేది చాలా అరుదు. గతంలో ఈ వ్యాధికి గురై కోలుకున్న వారు ఇతరుల కంటే కరోనా ప్రభావానికి ఎక్కువ గురవుతారనే దానికి దాఖలాల్లేవు. కరోనా బారినపడే వారిలో కొద్దిమందిలో మాత్రమే పల్మనరీ పైబ్రోసిస్ (ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుంది. దీనినెలా నివారించాలనే దానిపై పరిశోధనలు జరగాలి. ముందు జాగ్రత్తలే మందు కరోనాను అరికట్టేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సిన్ ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రావచ్చు. కరోనా కట్టడికి ఇప్పటివరకు ప్రత్యేక చికిత్సంటూ ఏమీలేదు. విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, జింక్ ప్రొటెక్టివ్ సప్లిమెంట్లు తీసుకోవాలి. కరోనా గాలి ద్వారా వ్యాపించదు. దగ్గు, తుమ్ముల నుంచి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. బయటకు వెళ్లేటపుడు మాస్కులు ధరించాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత మందులను యథావిధిగా వాడాలి. ‘కరోనా’ అనుమానాలు ఉంటే వైద్యులను సంప్ర దించాలి. -
నిమ్స్ ఓపీ సేవలు షురూ
సాక్షి, హైదరాబాద్: నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు మం గళవారం నుంచి మొదలయ్యాయి. దేశంలో అ మలవుతున్న లాక్డౌన్ కారణంగా గత కొంతకాలంగా బోసిపోయినట్లున్న ఆస్పత్రికి మళ్లీ రోగుల రాక మొదలైంది. రవాణా సదుపాయం లేకపోవడం ఒక కారణమైతే..నిమ్స్‌లో కరోనా అనుమానితులకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో చాలామంది ఆస్పత్రికి రావడానికి భయపడిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ను నాన్–కరోనా ఆస్పత్రిగా ప్రకటించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న రోగులు నిమ్స్‌కు రావడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సాధారణంగా అవుట్ పేషెంట్ విభాగాలను పాత భవనంలో ఓపీ బ్లాక్‌లోనూ, స్పెషాలిటీ బ్లాక్‌లోనూ నిర్వహిస్తారు. ప్రస్తుతం అన్ని ఓపీ సేవలను ఒక దగ్గరే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మిలీనియం బ్లాక్‌లో స్క్రీనింగ్ టెస్ట్.. ఓపీ సేవల కోసం వచ్చిన ప్రతిరోగికి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని నిర్థారించుకున్నాకే ఓపీ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే వారిని గాం ధీ ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. ఇలా మంగళవారం 280 మందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. అందులో తొమ్మిది మందిలో కరోనా వైరస్ లక్షణాలున్నట్టు అనుమానిస్తూ ఆయా రోగులను గాంధీకి తరలించినట్టు సమాచారం. గతంలో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ లక్షణాలు కన్పించిన నేపథ్యంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
నాన్ కోవిడ్ ఆస్పత్రిగా నిమ్స్
లక్డీకాపూల్: నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిని నాన్–కోవిడ్ ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను పొందుతున్న పేద రోగులకు కరోనాతో కొంత మేర అవాంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుపేద రోగులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక నుంచి ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీకి తరలించేలా చర్యలు తీసుకుంటారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అందరినీ అప్రమత్తం చేసేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణరావు ఆయా విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వనీయ సమాచారం. సోమవారం నుంచి ఆస్పత్రి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేందుకు యాజ మాన్యం చర్యలు తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఆస్పత్రికి వచ్చిపోయే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో కిటకిటలాడే నిమ్స్ ఓపీ విభాగాలు కొద్ది రోజులుగా బోసిపోతున్నాయి. అయితే వైరస్ భయం కొంత తగ్గడంతో రోగుల రాక మొదలై సందడి ఆరంభమైంది. శనివారం దాదాపు 250 మంది రోగులు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలు పొందినట్లు తెలిసింది. అలాగే కార్డియాలజీ విభాగంలో 2 శస్త్రచికిత్సలు జరిగినట్లు సమాచారం. పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీని ప్రకటించిన నేపథ్యంలో నిమ్స్‌ను పేద రోగులకు అందుబాటులోకి వచ్చేలా నాన్ కోవిడ్ ఆస్పత్రిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే నిమ్స్ లో రెండు రోజులుగా కరోనా అనుమానితులకు సంబంధిం చి వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు మిలీనియం బ్లాక్‌లోని ఐదవ అంతస్తులో ఉన్న బయాలజీ విభాగంలో జరుగుతున్నాయి. శుక్రవారం 70 నమూనాలను, శనివారం 120 నమూనాలను పరీక్షించారు. ఇకపై కూడా ప్రతిరోజూ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని నిమ్స్ వర్గాలు పేర్కొంటున్నారు. -
నిమ్స్‌కు విరాళమిచ్చిన మేఘా
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందే రోగులకు అవసరమైన వెంటిలేటర్ల ఏర్పాటుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్‌కు రాసిన లేఖతో పాటు, రూ. 41.95 లక్షల చెక్‌ను ఆదివారం అందజేశారు. "దేశ పురోగతిలో భాగస్వామి కావాలన్న మా నినాదంతో, భారతదేశం విలువైన వనరులను, దాని మానవశక్తిని కబళించే కోవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. ఈ విపత్తుతో పోరాడటానికి మీ పక్షాన నిలబడటానికి, మీకు మద్దతు ఇవ్వడానికి మేము ముందుంటాము. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర చికిత్స పొందే రోగులకు ఎంతో అవసరమైన వెంటిలేటర్లను సరఫరా చేస్తున్నాము. మీ రవాణా అవసరాలను తీర్చడానికి రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాము. భువిపై దేవతలైన మీకు సేవ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. రోగుల సేవకు మీకు ఏదైనా అత్యవసరం అయినపుడు సహకరించేందుకు తమ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అన్నది ఆ లేఖ సారాంశం. "దేశం మొత్తం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన కోవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈ సమయంలో, దేశం మొత్తం వైద్య సేవల కోసం ఎదురుచూస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు తమ ప్రాణాలను, సంబంధాలను పణంగా పెడుతున్నారు. 'జనతా కర్ఫ్యూ'లో దేశం వారి సేవలను కొనియాడింది. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా వారి ధైర్యం ఎప్పుడూ తగ్గకపోవడం అనిర్వచనీయం" అని నిమ్స్ డైరెక్టర్ కు రాసిన లేఖలో మేఘా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతేకాక మేఘా సంస్థ కరోనా వ్యాప్తి నిరోధించడానికై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.5 కోట్ల చెక్ అందించగా, కర్ణాటకకు రూ. రెండు కోట్లు, ఒడిశాలకు కోటి చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే. -
నిమ్స్‌లో పేరుకే డైట్ క్యాంటీన్..
లక్డీకాపూల్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తున్న నిమ్స్ ఆస్పత్రిలో అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. దీంతో పేదరోగులు విలవిల్లాడిపోతున్నారు. మెరుగైన వైద్య సేవలను పొందేందుకు వచ్చే రోగులను వ్యాపారస్తులు అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శ వ్యక్తమవుతోంది. చివరికి యాజమాన్యాన్ని కూడా మోసం చేస్తున్నారనే వ్యాఖ్య కూడా లేకపోలేదు. కేవలం ఆహార పదార్థాల విషయంలోనే కాదూ.. మందుల సరఫరాలో కూడా అదే తీరు కొనసాగుతోంది. జనరిక్ మెడిసిన్స్ అందించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల మందులను విక్రయిస్తున్నారు. మీకు అనుమతి దేనికిచ్చారు..? ఈ పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌లోని క్యాంటీన్ల నిర్వాహకులపై ఆస్పత్రి సంచాలకుడు డాక్టర్ కె.మనోహర్ కన్నెర చేసినట్టు సమాచారం. అసలు మీకు దేనికోసం అనుమతి ఇచ్చారు.. మీరు చేస్తున్న వ్యాపారమేంటని నిలదీసినట్లు తెలుస్తోంది.కేవలం టీ స్టాల్ నిర్వహించేందుకు అనుమతి పొంది దాదాపుగా 400 గజాల స్థలాన్ని ఎలా విస్తరిస్తావని ఓ క్యాంటీన్ నిర్వాహకుడిని ప్రశ్నించినట్టు విశ్వనీయ సమాచారం. నిజం చెప్పాలంటే నిమ్స్ నిబంధనల ప్రకారం లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా రెస్టారెంట్లను తలపించే విధంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిని ప్రక్షాళన చేసేందుకు యాజమాన్యం నడుంబిగించినట్లు తెలుస్తోంది. పేరుకే డైట్ క్యాంటీన్.. నిమ్స్‌లో పేరుకే డైట్ క్యాంటీన్.. వ్యాపారమంతా నిబంధనలకు వ్యతిరేకమే. రోగులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం లాభాపేక్షతో ఫాస్ట్‌ఫుట్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ రోగులకు అందించే ఆహార పదార్థాలతో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రోగుల సహాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్స్ వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు నిమ్స్ డైరెక్టర్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. -
నిమ్స్ 'ఖాళీ'!
దేశంలోని ఎయిమ్స్ సహా పలు జాతీయ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 67 నుంచి 70 ఏళ్లు.. ఉస్మానియా, గాంధీ సహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లు.. కానీ.. ఎయిమ్స్‌కు అనుబంధంగా కొనసాగుతున్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల పదవీ విరమణ వయసు మాత్రం 60 ఏళ్లే.. దీంతో ఈ ఆస్పత్రిలో మంచి హస్తవాసి, పేరున్న వైద్య నిపుణుల సేవలు రోగులకు అందడంలేదు. వీరి పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో కీలకమైన కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ వైద్యసంస్థలో వచ్చే జూలై చివరి నాటికి 12 మంది, 2022 నాటికి మరో 30 మంది సీనియర్ వైద్యులు రిటైర్డ్ కానున్నారు. సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వైద్యుల పోస్టులు ఒక్కొక్కటే ఖాళీ అవుతున్నాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు తక్కువగా ఉండటంతో మరికొందరు వైద్యులు బయటి వేతనాలకు ఆశపడి ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్లకే వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే యత్నం చేయడంలేదు. ఫలితంగా 311 పోస్టులకు 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీ ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు.. రోగుల చికిత్సపైనా ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేక, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పనిచేసేందుకు సుముఖంగా ఉన్నా.. యాజమాన్యం విముఖత చూపుతోంది. జూనియర్లే పెద్దదిక్కు అంతర్గత విబేధాలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఆఫర్లతో ఇప్పటికే చాలామంది వైద్యులు నిమ్స్‌ను వీడిపోయారు. 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి రావడంతో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు, మాజీ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డయాబెటిక్ నిపుణుడు వెంకటేశ్వరరావు, డాక్టర్ నరేందర్, డాక్టర్ సుభాష్‌కౌల్, డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు సహా పలువురు ఆస్పత్రికి దూరమయ్యారు. న్యూరో ఫిజీషియన్ విభాగాధి పతి డాక్టర్ వీణాకుమారి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. జూలై చివరికి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంరెడ్డి సహా సీటీ సర్జన్ ఆర్వీకుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప, డాక్టర్ జోత్స్న, డాక్టర్ ఉషారాణి, డాక్టర్నాగేశ్వరరావు తదితరులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా విభాగాలకు ఇక జూనియర్ వైద్యులే పెద్దదిక్కు కానున్నారు. ఇప్పటికే సీనియర్లు లేక రుమటాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సహా పలు విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. ఆయా విభాగాలపై ఆధారపడిన రోగులతోపాటు సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. రెసిడెంట్లపైనే భారమంతా.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది. 1986లో దీని పడకల సామర్థ్యం 500 కాగా, ప్రస్తుతం 1,500కి చేరింది. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగిన వైద్యులు లేకపోవడంతో రెసిడెంట్లపై భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పనిచేయా ల్సి వస్తుంది. ‘నిమ్స్‌లో రోగులకు ఇంకా సేవచేసే ఓపిక ఉంది! మరికొంత కాలం పనిచేసే అవకాశమివ్వండి’ అని పలువురు నిపుణులు నిమ్స్ పాలకమండలికి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. ‘ఒకటి రెండు రోజుల్లో పాలక మండలి సమావేశం ఉంది. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. పేరు గొప్ప.. అన్నింటా తీసికట్టు - నిమ్స్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ముఖ్యమంత్రే దీనికి ఛాన్సలర్‌గా ఉంటారు. - ఎయిమ్స్ నిబంధనల ప్రకారం ఇక్కడ నియామకాలు, పదోన్నతులు ఉంటా యి. ఉస్మానియా, గాంధీలో త్రిటైర్ విధానం అమల్లో ఉండగా, నిమ్స్‌లో ఫోర్టైర్ విధానం అమల్లో ఉంది. - ఉస్మానియాలో అసిస్టెంట్ కేడర్‌లో చేరిన ఓ వైద్యుడు ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫె సర్, చివరకు ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకుంటారు. ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుంది. - నిమ్స్‌లో అసిస్టెంట్ కేడర్‌లోని వైద్యు డు అసోసియేట్, అడిషనల్ ప్రొఫె సర్ కేడర్లను దాటుకుని ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ కేడర్ రావడానికి 12 నుంచి 14 ఏళ్లు పడుతోంది. - ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకునే అవకాశముంది. ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందుతాయి. కానీ నిమ్స్ వైద్యుల బయటి ప్రాక్టీస్ నిషేధం. ఆరోగ్య శ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందవు. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులతో పోలిస్తే వీరి వేతనాలు చాలా తక్కువ. -
డాక్టర్ మీనాకుమారి కన్నుమూత
లక్డీకాపూల్: నిమ్స్‌లో సీనియర్ న్యూరో ఫిజీషియన్, న్యూరాలజీలోని ఓ వి భాగానికి అధిపతి డాక్టర్ ఏకే మీనాకుమారి (59) శనివారం మధ్యాహ్నం 3.19 గంటలకు లండన్‌లో తుదిశ్వాస విడిచారు. లండన్‌లో ఈనెల 14న జరిగిన న్యూరో సదస్సు లో ప్రసంగిస్తూ ఛాతీలో నొప్పితో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆస్పత్రికి తరలించిన ఆమె కు శస్త్రచికిత్స నిర్వహించినా ఆరోగ్యం కుదుటపడకపోగా, ఎడమ వైపు బ్రెయిన్ చచ్చుపడిపోయింది. చివరికి బ్రెయిన్ డెత్ కావడంతో మీనాకుమారి మరణించినట్లు లండన్ వైద్యులు నిర్ధా రించారు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. న్యూరో ఫిజీషియన్ న్యూరాలజీ సమస్యతోనే మరణించడంతో కుటుంబ సభ్యు లు, నిమ్స్ వైద్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిమ్స్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, డాక్టర్‡ మీనాకుమారి మృతి చెందినట్లు యూకే డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మీ నాకుమారి కుటుంబానికి, సన్నిహితులకు సం తాపాన్ని ప్రకటించారు. తమిళనాడుకు చెందిన మీనాకుమారి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. రెసిడెంట్ డాక్టర్‌గా నిమ్స్‌లో వైద్య సేవలను ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్లుగా న్యూరో ఫిజీషియన్‌గా పనిచేస్తూ అందరి మనస్సులో చెరగని ముద్ర వేశారు. -
ఆ డాక్టరు ఇక లేరు
లండన్: అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన నిమ్స్ సీనియర్ ఫిజీషియన్ మీనా కుమారి తుది శ్వాస విడిచారు. లండన్ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ ప్రొఫెసర్ అక్కడ ఉపన్యసిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన సంగతి విదితమే. అంత్యత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసిన యూకే డిప్యూటి హై కమిషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్ ఆమె కుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ అనూహ్య ఘటనతో ఆమె కుటుంసభ్యులు, నిమ్స్ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. లండన్‌లో ఓ సదస్సులో ప్రసంగిస్తూ నిమ్స్ సీనియర్ న్యూరో ఫిజీషియన్ గుండెపోటుతో కుప్పకూలారు. నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఏకే మీనాకుమారి న్యూరో సదస్సులో పాల్గొనడానికి ఇటీవల లండన్ వెళ్లారు. అక్కడ సదస్సులో ఉపన్యసిస్తుండగా ఆమెకు తీవ్ర గుండెపోటుగు గురైనారు. కాగా తమిళనాడుకు చెందిన మీనాకుమారి గాంధీ ఆస్పత్రి నుంచి ఆమె ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మీనాకుమారి ప్రత్యేక గుర్తింపును సాధించారు. -
నాటి కాల్పుల ఘటనతో లింకు?
-
అంతుచిక్కని తూటా రహస్యం!
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట /చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మాబేగం శరీరం నుంచి బుల్లెట్ బయటపడిన ఘటన మిస్టరీగా మారింది. దీనిపై ఆస్మా కుటుంబీకులు నోరిప్పడం లేదు. శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా తూటాను పేల్చినప్పుడు దానిపై రైఫ్లింగ్ మార్క్స్ పడతాయి. వీటి ఆధారంగా సదరు ఆయుధం ఎటువంటిదనేది తెలుస్తుంది. అయితే తూటా సుదీర్ఘకాలం ఆస్మాబేగం శరీరంలో ఉండిపోవడంతో దానిపై ఎలాంటి రైఫ్లింగ్ మార్క్స్ లేవు. దీంతో బుల్లెట్‌ను పరిశీలించిన నిపుణులు .32 క్యాలిబర్‌కు చెందినదని అభిప్రాయపడుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించి బాలిస్టిక్ నిపుణులతో పరీక్ష చేయించాలనీ అంటున్నారు. నాటి కాల్పుల ఘటనతో లింకు? తూటా గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆస్మా కుటుంబీకుల కాల్ డిటైల్స్‌ను సేకరిస్తున్నారు. మరోపక్క రెండేళ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న హత్యా యత్నం కేసుతో ఈ ఉదంతానికి ఉన్న లింకును పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఆస్మాబేగం తండ్రి 20 ఏళ్లుగా పాతబస్తీకి చెందిన ఓ బడాబాబు వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ బడాబాబు కుమారుడు, మరొకరు కలిసి నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కింగ్స్ కాలనీలో ఉన్న బడాబాబు కుమారుడి కార్యాలయంలో 2017 నవంబర్‌లో విందు జరిగింది. అప్పుడు కాల్పులు జరిగి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బడాబాబు కుమారుడితో పాటు అతడి తుపాకీ కోసం కొన్ని రోజులు గాలించారు. అప్పట్లో అతగాడు తన తుపాకీని తన తండ్రి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆస్మా తండ్రి ఇంట్లో దాచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన మిస్‌ఫైర్‌తోనే తూటా ఆస్మాబేగం శరీరంలోకి దూసుకుపోయి ఉంటుందని, ఘటన బయటపడకుండా ఆస్మాకు రహస్యంగా వైద్యం చేయించి ఉండొచ్చని అనుకుంటున్నారు. తాజాగా ఆమె నొప్పితో నిమ్స్‌లో చేరగా, శస్త్రచికిత్సలో తూటా బయటపడిందని భావిస్తున్నారు. కాగా, బడాబాబు కుమారుడి ఆయుధాన్ని మళ్లీ బాలిస్టిక్ పరీక్షలకు పంపాలని భావిస్తున్నారు. జహనుమాలో కలకలం ఆస్మాబేగం ఘటనతో ఫలక్‌నుమా జహనుమాలో కలకలం రేగింది. జహనుమాలో ఉండే వజీర్, నూర్జహా దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఆస్మాబేగం (18) సంతానం. మూడేళ్లుగా ఆస్మా వెన్నునొప్పితో బాధపడుతోంది. శనివారం నిమ్స్‌కు వెళ్లగా, సర్జరీ చేసి తూటాను బయటకు తీసిన విషయం తెలిసిందే. కాగా వైద్యులు చెప్పినట్లు ఆస్మాబేగం కడుపులో ఎలాంటి బుల్లెట్ లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. అయితే, యువతి తల్లిదండ్రులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం విచారించారు. ఘటనపై కేసు నమోదు మొదట సాధారణ పేషంట్ కింద ఆస్మాకు సర్జరీ చేసిన నిమ్స్ వైద్యులు.. ఆమె వెన్నుపూస (ఎల్ 1, ఎల్ 2) ప్రాంతంలో బుల్లెట్ ఉండడంతో వెంటనే కేసును మెడికో లీగల్ కేసు (ఎమ్ఎల్సీ) కింద మార్చి ఉన్నతాధికారులకు, పోలీసులకు తెలిపారు. పోలీసులు ఐపీసీ 307 హత్యాయత్నం, 27 ఆఫ్ ఆరŠమ్స్ యాక్ట్ ఆయుధ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సర్జరీ అయిన మర్నాడే ఆస్మాబేగంను నిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేయడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
యువతి శరీరంలో బుల్లెట్
-
యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్!
సాక్షి, హైదరాబాద్ : వెన్నునొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి శరీరంలో బుల్లెట్ బయటపడటం నిమ్స్ ఆస్పత్రిలో కలకలం రేపింది. వివరాలు.. ఫలక్‌నుమా జహ్నుమా ప్రాంతంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె(18) స్థానికంగా కుట్టుమిషన్ పనిచేస్తోంది. 3 నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆమె నిమ్స్‌లో చేరింది. వైద్యులు ఎక్స్‌రేతోపాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వెన్నుపూస, ఉదర కోశం భాగంలో గాయమున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సదరు యువతికి శస్త్రచికిత్స నిర్వహించగా బుల్లెట్ బయటపడింది. దీంతో కంగుతిన్న వైద్యులు బుల్లెట్ ఎక్కడ నుంచి వచ్చిందని యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు తెలియదని సమాధానం ఇచ్చారు. యువతి శరీరంలో బుల్లెట్ రెండు, మూడేళ్ల క్రితం నుంచి ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. దీనిపై నిమ్స్ ఉన్నతాధికారులు పంజగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో వీరు ఎక్కడ నివాసం ఉన్నారు..? ఆ ప్రాంతంలో ఏదైనా ఫైరింగ్ పాయింట్ ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నొప్పి మటాష్
జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగరవాసులు వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. వీటిని పెద్ద సమస్యలుగా భావించి చాలామంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ తక్కువ ఖర్చులోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకుఉపశమనం కల్పిస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్‌ఆయూష్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌వెల్‌నెస్ సెంటర్. సాక్షి, సిటీబ్యూరో: తలనొప్పి, కండరాల, మోకీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, విటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది చాలా పెద్ద జబ్బులుగా భావిస్తుంటారు. చిన్నచిన్న చిట్కాలు, సహజ పద్ధతులతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు కానీ చాలా మంది ఈ చికిత్సల కోసం కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. రకరకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, మందుల పేరుతో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వచ్చిన నొప్పి కన్నా వైద్య చికిత్సల పేరుతో చేసిన ఖర్చు గుర్తొచ్చి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సాధారణ నొప్పులతో పాటు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయూష్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్స్ పేరుతో యో గ, ఆయుర్వేద, ప్రకృతి వైద్య సేవలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్(జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు) లబ్ధిదారుల కోసం ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో ఈ సేవలను అందిస్తున్న ఆయుష్ విభాగం తాజాగా నిమ్స్‌కు వచ్చే వీఐ పీలు సహా సాధారణ రోగులకు ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ సేవలను అందిస్తుంది. ఒక్కో చికిత్సకు..ఒక్కో ప్యాకేజీ పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్, వంటి సేవలతో పాటు పకృతి వైద్య సేవలల్లో భాగంగా జనరల్ మసాజ్, స్ట్రీమ్‌బాత్, డైట్‌కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకీళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది.ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా (రూ.150 నుంచి రూ.750 వర కు)చార్జీలు వసూలు చేస్తుంది. అయితే బాధితులు ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకస్లాట్‌గా, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మరో స్లాట్‌గా నిర్ణయించారు. దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉండాలనే.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం నగరంలో చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. విటమిన్లలోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే, పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనారోగ్యం పాలవుతున్నారు. నొప్పులకు, జబ్బులకు ముందే కారణం గుర్తించగలిగితే చాలా తక్కువ ఖర్చుతో చిన్నపాటి చిట్కాలతోనే వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. జబ్బు ముదురిన తర్వాత వచ్చే కంటే ముందే ఈ చికిత్సలను చేయించుకోవడం వల్ల నొప్పుల భారీ నుంచే కాదు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా చూసేందుకే ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆయుర్వేద, ప్రకృతి వైద్య సేవలు, స్లాట్ బుకింగ్ కోసం 040–23489023, 9652292825, 9440974984 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. – ఎం.డాక్టర్ నాగలక్ష్మి, ఇంచార్జి, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్సెంటర్, నిమ్స్ -
నిమ్స్‌లో ఇకపై మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు
పంజగుట్ట: నిమ్స్ ఆస్పత్రిలో శనివారం నుంచి కొత్తగా మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు నిమ్స్ మెడికల్ డైరెక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిమ్స్‌లో ఆయన విలేకరులకు వాటి వివరాలు వెల్లడించారు. మాస్టర్ హెల్త్ చెకప్‌లో రూ.5 వేల ప్యాకేజీతో అన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలు చేస్తామన్నారు. ఇందులో మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. ఎక్స్లెంట్ హెల్త్ చెకప్ కింద ఎనిమిదివేలు చెల్లిస్తే 23 రకాల పరీక్షలు జరుపుతామన్నారు. లైఫ్ చెకప్ పరీక్షలు పురుషులకు రూ.15 వేలు, మహిళలకు రూ.16 వేలతో 29 రకాల పరీక్షలు చేస్తామన్నారు. మహిళలకు ఒక్క పరీక్ష అదనంగా ఉంటుందని అందుకే రూ.వెయ్యి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షల ద్వారా మనిషిలో ఏ వ్యాధి ఉన్నా నిర్ధారించవచ్చునన్నారు. ఈ సేవలతో పాటు ఆయుష్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వైద్యులు, రేడియాలజీ వైద్యులు, ఆయుష్ వైద్యులు ఈ ప్రత్యేక ప్యాకేజీ కేంద్రంలో ఉంటారన్నారు. నిమ్స్‌లోని పాత భవనంలో పాత కాథలాబ్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఈ సేవలు లభిస్తాయన్నారు.వివరాలకు 040–23489022 నంబరు, https://nims.edu.in, నిమ్స్ హెచ్ఎమ్ఐఎస్ తదితర యాప్‌లను సంప్రదించి ప్రత్యేక బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. ఇదే కేంద్రంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమ సేవలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యంత ఖరీదైన ఈ పరీక్షలు నిమ్స్‌లో తక్కువ ధరలకే నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని వినియోగించుకోవాలని కోరారు. -
తెగని పంచాయితీ..
సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్న 370 మంది స్టాప్ నర్సులు శాలరీ పేరుతో తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం విధులను బహిష్కరించారు. రెండు రోజుల క్రితం నిమ్స్‌కు వచ్చిన మంత్రి ఈటలను కలిసిన వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారికి సూచించారు. దీంతో ఆమె నర్సులతో సమావేశమైనా వేతనాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పెంచుతున్న వేతనం ఎంతో చెప్పాలని నర్సులు పట్టుబట్టడంతో సమస్య పరిష్కారం కాలేదు. దీనికితోడు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కూడా అర్దాతంగా ముగియడంతో సమస్య యధాతధంగా కొనసాగుతోంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో వైద్య సౌకర్యం కల్పించాలని, స్టైఫండ్ పేరుతో ఇస్తున్న వేతనాన్ని, శాలరీగా మార్పు చేయాలని నర్సులు కోరుతున్నారు. ఎటూ తేల్చని యాజమాన్యం... కాంట్రాక్ట్ స్టాప్ నర్సులకు నిమ్స్ ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.25,000 వేలు, ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్నవారికి రూ.30,000 వరకు వేతనాలు పెంచుతూ నిమ్స్ నిర్ణయం తీసుకుంది. అయితే వేతనాన్ని స్టైఫండ్‌గా పేరుతో కాకుండా శాలరీగా పేరు మార్చి ఇవ్వాలని కాంట్రాక్ట్ నర్సులు కోరుతున్నారు. స్టైఫండ్ పేరుతో వేతనాలు ఇవ్వడంతో తమకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ విద్యార్థులతో సేవలు.. నిమ్స్ ఆసుపత్రిలో అసలే నర్సింగ్ సిబ్బంది తక్కువ. పర్మనెంట్ సిబ్బందితో సమానంగా కాంట్రాక్ట్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు ఆందోళన బాట పట్టడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో యాజమాన్యం నర్సింగ్ విద్యార్థులను రంగంలోకి దించింది. విధుల్లో చేరకపోతే చర్యలు కాంట్రాక్ట్ నర్సులు తక్షణం విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని ఆసుపత్రి మెడికల్ సూరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ అన్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అనంతరం వారికి వేతనాలు పెంచామన్నారు. అయితే వారు కోరుకున్నట్లు శాలరీ పేరు పర్మనెంటు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు . స్టైఫండ్ పేరుతో ఇస్తున్న వేతనాన్ని కన్సాలిడేటెడ్ పేరుతో ఇస్తామన్నారు. ఇప్పటికైనా విధుల్లో చేరకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. –సత్యనారాయణ, నిమ్స్ సూపరింటెండెంట్ శాలరీ పేరుతో ఇవ్వాలి ఎయిమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహించిన వారికి శాలరీ పేరుతో వేతనాలు ఇస్తున్నారు. ఇది సాధ్యపడే అంశమే. అయితే నిమ్స్ యాజమాన్యం కావాలనే దాట వేస్తోంది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాకు రుణాలు ఇవ్వడం లేదు. శాలరీ పేరుతో బ్యాంకు అకౌంటులో వేస్తే మమ్ములను అన్ని విధాలుగా ఆదుకున్నవారవుతారు. –ప్రదీప్, నర్సుల ప్రతినిధి -
నిమ్స్‌కు మరో 500 పడకలు
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినట్లుగా వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనంగా మరో 500 పడకలను పెంచుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల కోసం లైబ్రరీ భవనం సమీపంలో ఓ ప్రత్యేక బ్లాక్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రిలోని మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ విభాగాల్లో రూ. 2.50 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన పలు వైద్య పరికరాలతో పాటుగా అత్యవసర విభాగంలో రూ.30.40 లక్షలతో ఏర్పాటు చేసిన బ్లడ్ ఇర్రాడియేటర్ యంత్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతోందని అందుకే జిల్లా, ఏరియా స్థాయి ఆస్పత్రులను మరింత బలోపేతం చేసి, నిమ్స్‌పై భారం పడకుండా చూస్తామని చెప్పారు. రోగులకు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ ఇర్రాడియేటర్ యంత్రం ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తం లోని టీ సెల్స్‌ను తగ్గించి, ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తకుండా చూస్తుందని చెప్పారు. పరికరాల పునరుద్ధరణకు చర్యలు నిమ్స్ సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సాంకేతిక సమస్యలతో పని చేయని వైద్యపరికరాలను పునరుద్ధరిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటుగా ఆస్పత్రి అంతర్గత నిధులు, దాతల సహకారంతో అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చడమే కాకుండా ఆయా వార్డులను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు మంత్రిని కలసి క్రమబద్దీకరించాలని కోరారు. మంత్రి వెంట డైరెక్టర్ డాక్టర్ మనో హర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
నిమ్స్ వైద్యుడిపై దాడి
సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రి వైద్యునిపై రోగి బంధువులు దాడికి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు నిరసనగా రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేపట్టారు. బాధితుడు, సీఎంఓ డాక్టర్ అన్వేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం 4.30 ప్రాంతంలో ఓ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన నిఖిల్ అనే యువకుడు చికిత్స నిమిత్తం నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చిడు. అతనితోపాటు మరో 15 మంది వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సీఎంఓ డాక్టర్ అన్వేష్, రెసిడెంట్ డాక్టర్ అనీస్ ఫాతిమా అతడికి ప్రథమ చికిత్స నిర్వహించి సీటీ స్కాన్‌కు పంపుతుండగా...వారి వెంట వచ్చిన యువకుల్లో ఒకరు ఎంతసేపు వైద్యం చేస్తారంటూ తమతో అకారణంగా గొడవకు దిగారన్నారు. తమకు నగరంలోని ఒక ముఖ్య నేత అండ ఉందని దుర్భాషలాడుతూ తనను నెట్టినట్లు తెలిపాడు. దీంతో ఆగ్రహానికి లోనైన రెసిడెంట్ డాక్టర్లు ఆస్పత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ అత్యవసర విభాగం ఎదుట ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గౌతం, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ఆస్పత్రి వద్ద 260 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరం ఉండగా..కేవలం 60 మందితో కాపలా చేపడతున్నారన్నారు. ఆసుపత్రి యాజమాన్యం తమకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. గతంలోనూ రెండు సార్లు వైద్యులపై దాడులు జరిగాయని, తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ఘటనపై వైద్యురాలు అనీస్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావ్, సీఐ మోహన్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను శిక్షించాలి: బొంతు శ్రీదేవి నిమ్స్ వైద్యునిపై దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం ఆమె వైద్యులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు నిందితులు సందీప్, సుశీల్, విజయ్ లను సోమవారం రాత్రి పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. -
నిమ్స్ ఆస్పత్రిలో రాజకీయ నేత అనుచరుల వీరంగం
-
వేతనం రూ.400 జరిమానా..రూ.500
సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ కాంట్రాక్టు విషయంలో యాజమాన్యం వింత నిబంధనను అమలు చేస్తోంది.రెండేళ్లకోసారి సెక్యూరిటీ గార్డుల సరఫరాకు నిమ్స్ యాజమాన్యం ప్రవేట్ ఏజన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆయా టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన వ్యక్తులకు కాంట్రాక్టు అప్పగిస్తారు. అంతవరకు బాగానే ఉన్నా అక్కడినుంచే అసలు కథ మొదలవుతోంది. నిమ్స్ యాజమాన్యం నుంచి సెక్యూరిటీ కాంట్రాక్టు పొందిన వ్యక్తి నుంచి రోజుకు 150 మంది గార్డులను మూడు షిప్టుల్లో ఆసుపత్రిలో డ్యూటీలో ఉంచాలని నిబంధన ఉంది. అయితే గార్డుల సరఫరాకు అనుమతి పొందిన సెక్యూరిటీ ఏజెన్సీకి అక్కడినుంచే కష్టాలు ప్రారంభవుతున్నాయి. అనుకోని పరిస్థితుల్లో గార్డులు విధులకు హాజరు కాలేకపోతే నిమ్స్ యాజమాన్యం ఎందరు గార్డులు విధులకు గైర్హాజరైతే అంత మందికి..రూ.500 చొప్పున ఫైన్ విధిస్తూ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టు వదులుకోలేక నిమ్స్ యాజమాన్యం విధించి షరతులను అంగీకరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతులెత్తేసిన పాత కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు నిమ్స్ ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డుల సరఫరాకు సాయిరాయ్ సెక్యూరిటీ ఏజన్సీ యాజమాన్యం నుంచి కాంట్రాక్టు పొందింది. ఏడాది పాటు గార్డుల సరఫరా చేసిన సదరు ఏజన్సీ ..నిమ్స్ పెద్దలతో నెలకొన్న వివాదం కారణంగా 2018 అక్టోబర్‌లో కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంది. నిమ్స్ యాజమాన్యం సకాలంలో గార్డుల సరఫరాకు సంబందించి బిల్లులను మంజూరు చేయకపోవడం..గార్డుల గైర్హాజరుకు విధించే ఫైన్లను తట్టుకోలేక వారు చేతులెత్తేశారు. ఒక్కో గార్డుకు రోజుకు అక్షరాల రూ.400 వేతనంగా చెల్లిస్తుండగా, జరిమానాగా రూ.500 వందలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఫైన్లు చెల్లించలేక సదరు ఏజెన్సీ తప్పుకోవడంతో...టెండర్ల సమయంలో రెండో స్థానంలో ఉన్న ఏషియన్ సెక్యూరిటీ ఏజెన్సీకి నామినేషన్ పద్దతిలో సెక్యూరిటీ గార్డుల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. అక్టోబర్‌లో కాంట్రాక్ట్ తీసుకున్న ఏషియన్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులు మంజూరు చేయలేదు. ఈ విషయమై యాజమాన్యాన్ని గట్టిగా అడిగితే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్ సక్రమంగా చెల్లించడం లేదు సెక్యూరిటీ గార్డుల సరఫరాకు సంబంధించి బిల్లుల విషయమై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను వివరణ కోరగా...సదరు ఏజెన్సీ గార్డులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ సక్రమంగా చెల్లించడం లేదన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు.– డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్ -
నిమ్స్ వైద్యుల సేవలు అభినందనీయం
హైదరాబాద్/సోమాజిగూడ: ‘నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అరుదైన, క్లిష్టమైన చికిత్సలను చేసిన ఘనత ఇక్కడి వైద్యుల సొంతం. సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించే ఆస్పత్రికి సాధారణ రోగులు సైతం వస్తున్నారు. ఈ రోగుల నిష్పత్తికి తగినన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది లేదు. అయినా వైద్యులు అందరికీ సేవలు అందిస్తున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సాధారణ రోగుల సంఖ్యను తగ్గించి, వైద్యులపై భారం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం తొలిసారిగా ఆయన ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్, మెడికల్ ఆంకాలజీ, కేన్సర్ విభాగాలను సందర్శించారు. ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పనుల పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా రోగుల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు రోగులు ఆస్పత్రిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న డైరెక్టర్ మనోహర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రద్దీ తగ్గిస్తాం.. హృద్రోగ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు సాధారణ రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఆస్పత్రికి రోజూ సగటున ఓపీ 2000 పైగా ఉండగా, నిత్యం 1600 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. క్లిష్టమైన, అరుదైన సమస్యలతో బాధపడుతున్న వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరం ఉంటుంది. అదే సాధారణ జబ్బులతో బాధపడుతున్న వారికి జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందించడం ద్వారా నిమ్స్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు. ఆ మేరకు ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం సహా అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిమ్స్‌వైద్యులు ఎంతో ఓపిగ్గా వైద్యసేవలు అందిస్తున్నారని, వారు చేస్తున్న ఈ సేవలు అభినందనీయమని ప్రకటించారు. చిన్న సమస్యను పెద్దగా చూపించొద్దు ఇటీవల ఓ రోగి కడుపులో కత్తెర ఉంచి కుట్టు వేసిన అంశంతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఎంతో అనుభవం నిష్ణాతులైన వైద్యులు ఇక్కడ ఉన్నారు. వైద్యసేవల్లో చిన్నచిన్న పొరపాట్లు సహజమేననీ, ప్రతీ చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి, రాద్ధాంతం చేయడం మీడియాకు తగదన్నారు. వైద్య పరికరాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదనీ, ఆస్పత్రి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అంశాలపై సలహాలు ఇస్తే..వాటిని పరిశీలించి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రిలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
కుట్లేశారు.. కత్తెర మరిచారు..
హైదరాబాద్/ సోమాజిగూడ: నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఇటీవల ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేసి కత్తెరను కడుపులోనే మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి తరపు బంధువులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయడంతోపాటు శనివారం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసిన ఇద్దరు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నిమ్స్ ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సక్సెస్.. కానీ! హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన వ్యాపారి హర్షవర్దన్ భార్య మహేశ్వరి (33) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను అక్టోబర్ 30న నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు చూపించారు. మహేశ్వరిని పరిశీలించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ జగన్మోహన్రెడ్డిలు.. హెర్నియాతో ఆమెకు కడుపునొప్పి వస్తోందని గుర్తించి సర్జరీ చేయాలని సూచించారు. నవంబర్ 2న ఈ ఇద్దరు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా.. సర్జరీ చేసిన కత్తెరను కడుపులో మరిచిపోయి కుట్లు వేశారు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. రోగి కోలుకోవడంతో నవంబర్ 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సర్జరీ జరిగి మూడునెలలైనా.. తరచూ కడుపునొప్పి వస్తుండటంతో బాధితురాలి కుటుంబం శుక్రవారం రాత్రి మళ్లీ నిమ్స్ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్సరే తీయించగా, పొత్తి కడుపులో సర్జికల్ కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలియడంతో మహేశ్వరి భర్త, బంధువులు నిమ్స్ పరిపాలనాభవనం ముందు ఆందోళనకు దిగడంతో విషయం బయటికి పొక్కింది. ఈ ఆందోళనతో అప్రమత్తమైన వైద్యులు రోగికి మళ్లీ సర్జరీ చేసి కడుపులోని కత్తెరను బయటికి తీశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. నిమ్స్ వైద్యులు నిర్లక్ష్యపూరిత వైఖరిపై రోగి తరపు బంధువులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ నివేదిక అందజేయాలని డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రోగికి సర్జరీ చేసే ముందు, ఆ తర్వాత.. ఆపరేషన్‌లో వినియోగించిన వైద్య పరికరాలు, ఇతర వస్తువులు లెక్కిస్తారు. బ్లేడ్స్, కత్తెర, కాటన్ బెడ్స్, ఇతర సర్జికల్ ఐటమ్స్‌ను విధిగా లెక్కించి, అన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే కుట్లు వేస్తారు. కానీ నిమ్స్ ఆసుపత్రిలో ఇలాంటివేవీ జరగకుండానే పని పూర్తి చేస్తారనే ఆరోపణలున్నాయి. దురదృష్టకరం రోగి కడుపులో సర్జికల్ కత్తెర ఉంచి కుట్లు వేయడం దురదృష్టకరం. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడిన వారెంతటివారైనా ఉపేక్షించబోం. బాధ్యులను గుర్తించేందుకు ఆస్పత్రి డీన్, మెడికల్ సూపరింటిండెంట్, ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్‌తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే సదరు వైద్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ బాధ్యులపై చర్యలు తీసుకోండి నిమ్స్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది. వైద్యపరమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్న వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – హర్షవర్థన్, బాధితురాలి భర్త -
నిమ్స్‌లో ‘లైటు లేక’ మూతపడ్డ ఆపరేషన్ థియేటర్
సాక్షి,సిటీబ్యూరో: ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక ఆపరేషన్లు వాయిదా పడిన సంఘటనలు మండలాల్లో జరుగుతుంటాయి. విద్యుత్ కోతలూ అక్కడ సర్వ సాధారణం కనుక వైద్యం వాయిదా పడుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్లో లైటు లేక శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల గ్రామాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకుంటే పొరపాటే.. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లోనే జరిగింది. అదీ ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో జరగడం గమనార్హం. ఇక్కడ వైద్య పరికరాల లేమి, మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్లు న్యూరోసర్జరీ చికిత్సలకు పెద్ద అడ్డంకిగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టి, కణతులు ఏర్పడి, రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయ స్థితిలో ఇక్కడకు వస్తున్న బాధితులకు చేదు అనుభవమే ఎదరవుతోంది. నిమ్స్‌లో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ల కొరత, వైద్య పరికరాల లేమితో సర్జరీలు వాయిదా పడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు అత్యాధునిక ‘ఓయాయ్, నావిగేషన్ టెక్నాలజీ, స్టీమోటాక్సీన్, ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ’ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని న్యూరోసర్జరీ చికిత్సల్లో దూసుకుపోతుంటే.. నిమ్స్‌లో మాత్రం ఇప్పటికీ డాక్టర్ రాజారెడ్డి హయాంలో సమకూర్చిన వైద్య పరికరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొత్తవి కొనుగోలు చేయక పోగా పాత వాటికి మరమ్మతులు చేయించక క్లిష్టమైన చికిత్సలనూ వాయిదా వేయాల్సి వస్తోంది. ‘లైటు లేక’ మూతపడ్డ థియేటర్ న్యూరో సర్జరీ విభాగానికి రోజుకు సగటున 150 కేసులు వస్తుంటాయి. అత్యవసర విభాగం, న్యూరాలజీ విభాగం నుంచి రిఫరల్‌పై మరికొన్ని కేసులు వస్తుంటాయి. వీటిలో 15 శాతం మందికి సర్జరీలు అవసరం అవుతుంటాయి. మూడు యూనిట్లలో ఎమినిమిది మంది సీనియర్ ఫ్యాకల్టీలతో సహా 19 మంది రెసిడెంట్లు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు ఆపరేషన్ టేబుళ్లు కేటాయించారు. వీటిలోని ఓ ఓటీ లైటు నెల రోజుల క్రితం పాడైపోవడంంతో థియేటర్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో కీలకమైన సర్జరీలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 60 మంది వరకు ఈ చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మెదడులో ఏర్పడిన కణుతులను తొలగించే క్రమంలో వైద్యుడు ఏది టిఫ్యూనో.. ఏది కణితో గుర్తించాలి. ఇందు కోసం ప్రతి ఆపరేషన్ టేబుల్‌కు ఒక అత్యాధునిక మైక్రోస్కోప్ అవసరం కాగా, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి పనిచేయడం లేదు. ఉన్నతాధికారే స్వయంగా అత్యాధునిక మైక్రోస్కోప్‌ల కొనుగోలుకు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరాకరిస్తున్నకార్పొరేట్ ఆస్పత్రులు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ‘ఆరోగ్యశ్రీ’ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో హెడ్ ఇంజూరీ బాధితులకు రూ.లక్ష లోపే ఇస్తున్నారు. సాధారణ చికిత్సతో పోలిస్తే ఇది కొంత క్లిష్టమైంది కావడం, సర్జన్ చార్జీలతో పాటు వెంటిలేటర్, ఐసీయూ, పడక ఖర్చులకు ఇవి ఏమాత్రం సరిపోకపోవడమే ఇందుకు కారణం. హెడ్, బ్రెయిన్ ఇంజూరీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తుండడంతో వారంతా నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువ. ప్రతిరోజూ వచ్చి పడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణుతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేక వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచారని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే రోగులు జంకేవారని, ఇప్పడు ఏ చిన్న వ్యాధి వచ్చినా ప్రభుత్వాస్పత్రికే వస్తున్నారని, అందుకు నిదర్శనం నిమ్స్ ఆస్పత్రేనన్నారు. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థ రూ.10 కోట్ల వ్యయంతో నిమ్స్‌లో నిర్మించిన కేన్సర్ భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డితో కలసి గురువారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో మెఘా సంస్థ 50 పడకల కేన్సర్ విభాగాన్ని అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణకు హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజేషన్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమాజానికి సేవ చేయాలని..: పీపీ రెడ్డి సొసైటీ తమకు ఈ హోదాను ఇచ్చిందని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తాము సాధ్యమైనంత సహాయం చేస్తున్నామని మెఘా ఇంజనీరింగ్ చైర్మన్ పీపీ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీడీ భవన నిర్మాణం చేపట్టామని, నిమ్స్‌లో మరో పాత భవనాన్ని ఆధునీకరించనున్నామని ప్రకటించారు. మూడేళ్లపాటు తామే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామన్నారు. అనంతరం మహిళావార్డులను మెఘా ఇంజనీరింగ్ ఎండీ కుమారులు పీవీ ప్రణవ్‌రెడ్డి, మానస్ రెడ్డి ప్రారంభించగా, చిన్నపిల్లల వార్డును డైరెక్టర్ మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కేన్సర్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ సదాశివుడు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అంకాలజీ భవనాన్ని అపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆంకాలజీ భవనాన్ని నిర్మించడమే కాకుండా మూడు సంవత్సరాలు మెయిన్‌టెన్ చేస్తామని చెప్పటం ఆనందంగా ఉందన్నారు. వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. నిమ్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. సామాన్యులకు అందని కార్పొరేట్ వైద్యం పేదలకు నిమ్స్‌లో అందుతుందన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక రాష్ట్రంలో నార్మల్ డెలివరీలు పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో మాత శిశు మరణాలు తగ్గిపోయాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మిషన్ ఇంద్ర ధనస్సులో తెలంగాణ దేశంలో ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 45 బస్తీ దవాఖానాలు ప్రాంభిచామని.. వచ్చే ఏడాది మే నాటికి 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైద్య పరీక్షలు సైతం ప్రభుత్వమే ఉచితంగా చేస్తోందన్నారు. విజన్ ఫర్ ఆల్ నినాదంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రభత్వ రంగంలోని వైద్యులు సిబ్బంది బాగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మొదలు పెట్టాలని సూచించారు. డీన్ నియామకాన్ని రద్దు చేయాలి నిమ్స్ డీన్‌గా ఆర్వీ కుమార్ నియామకాన్ని రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన రెసిడెంట్ డాక్టర్లు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు. కాగా రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
-
నిమ్స్‌లో మరణ మృదంగం
హైదరాబాద్: ఏపీలోని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తెలంగాణలోని నిమ్స్ వైద్యశాలలో 19 మంది మరణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిమ్స్‌లో వైద్యుల ఆందోళన నేపథ్యంలో సోమవారం 10 మంది, మంగళవారం 9 మంది మరణించారు. అవినీతి ఆరోపణలున్న ఆర్.వి.కుమార్‌ను నిమ్స్‌కు నూతన డీన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి రెసిడెంట్ వైద్యులు, వైద్య బోధకులు విధుల్ని బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2 రోజుల్లోనే 19 మంది మరణించారు. ఇక బుధవారం నాటి మృత్యు గణాంకాలు నిమ్స్ రికార్డుల్లోకి ఎక్కలేదు. లిఖితపూర్వక హామీకి డిమాండ్.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో వైద్యుల సమ్మె గురించి పట్టించుకునే నాథుడు లేకపోయాడు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకారుల బృందం బుధవారం మంత్రి లక్ష్మారెడ్డిని కలసి వినతిపత్రం అందించిం ది. మంత్రితోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుశీల్ శర్మను కలసి తమ సమస్యల సాధన కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సమస్యల్ని పరిష్కరిస్తామని వారు మౌఖిక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని వైద్యులు తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టగా.. అందుకు వారు నిరాకరించారు. విదేశీ పర్యటన ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్‌లో ఈ విధమైన దయనీయ పరిస్థితులు నెలకొంటే.. నిమ్స్ డైరెక్టర్ గురువారం (13న) విదేశీ పర్యటన ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. గెస్ట్ లెక్చర్ ఇచ్చే నిమిత్తం అమెరికా వెళ్తున్న ఆయన ఈ నెల 18న వస్తారు. ఈలోగా వైద్యుల ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నాలు చేసే వారు ఉండకపోవచ్చని, ఇదే పరిస్థితి కొనసాగితే రోగుల పరిస్థితి దారుణం అవుతుందని రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పర్యవేక్షణ కీలకం.. ఆపద్ధర్మ పాలన ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య అంశాలపై గవర్నర్ పర్యవేక్షణ చాలా కీలకం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గవర్నర్ కూడా గతంలో మాదిరిగానే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు, మంత్రి వర్గానికి వదిలేస్తే.. ఇంతవరకూ ఉన్నట్టుగానే ప్రభుత్వమూ తమకే సంబంధం లేదన్నట్లుగా ఉన్న పక్షంలో హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని రోగులు చెబుతున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీ.. నిమ్స్‌లో మరణ మృదంగం మోగుతుంటే ఏ మాత్రం పట్టని పాలక పెద్దలు ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. నిమ్స్‌లో గురువారం కేన్సర్ వైద్య విభాగం రెండో అంతస్తు ప్రారంభోత్సవానికి మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ హాజరుకానున్నారు. వీరి రాక సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో నిమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు. -
మరణ యాతన!
సోమాజిగూడ : ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రిలోని పార్థివ అంబులెన్స్‌కు మంగళం పలికారు. గతంలో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన రోగి మృతి చెందితే ఆయా వాహనాల్లో ఉచితంగా మృతదేహాన్ని ఇంటికి తరలించేవారు. దీంతో మృతుల బంధువులకు ఇబ్బందులు తప్పేవి. ఒక వాహనంలో రెండు దేహాలను తీసుకు వెళ్లే సామర్థ్యం గల రెండు అంబులెన్సులను 2016 నవంబర్‌లో కేటాయించారు. కొన్నాళ్లు సేవలు అందించిన ఈ వాహనాలు గతేడాది జూలై నుంచి సేవలు నిలిచిపోయాయి. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రస్తుతం నిమ్స్‌లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌లో పార్థివ వాహనాలు మూలన చేరడం.. వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం కృషి చేయ కపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. గాంధీలో 10, ఉస్మానియాలో నాలుగు చికిత్స కోసం వచ్చి గాంధీలో ఎవరైనా రోగి మృతి చెందితే ఆ దేహాన్ని తరలించేందుకు అక్కడ 10 పార్థివ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఉస్మానియాలోనూ నాలుగు వాహనాలు నిత్యం సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రుల కంటే ఎంతో ఖ్యాతి గాంచిన నిమ్స్‌లో మాత్రం ఆ వాహనాల సేవలను నిలిపివేశారు. ఆస్పత్రిలోని మృతదేహాన్ని వారి ఇంటికి తరలించడం బంధువులకు వ్యయంతో కూడిన శ్రమ. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత పార్థివ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. సీఎం ఆశయం మంచిదైనా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల వాహనాలు మూలకు చేరాయి. అడిగినంత ఇచ్చికోవాల్సిందే.. రోగి వైద్యానికి ఎంత వ్యయం చేసినా ఇబ్బందులు పడని వారు.. పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందితే ఆ దేహాన్ని దూరప్రాంతానికి తీసుకెళ్లడంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అర్ధరాత్రి వేళ తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉండవు. సమీపంలోని అంబులెన్సుల కోసం వెతులాట తప్పదు. అయితే వాహనం దొరికినా వారు ఎంత అడిగితే అంత ఇచ్చుకోవాలి. గతంలో నిమ్స్‌లో ఆ సమస్య ఎదురయ్యేది కాదు. సంబంధిత ఆర్ఎంను సంప్రదిస్తే వాహనం ఉచితంగా అందుబాటులోకి వచ్చేది. ఇప్పటికైనా నిమ్స్ యాజమాన్యం స్పందించి పార్థివ వాహనాన్ని అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. -
కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: ఆ బాలుడికి తల్లి జన్మనిస్తే... తండ్రి పునర్జన్మను ప్రసాదించాడు. దీనికినగరంలోని నిమ్స్ ఆస్పత్రి వేదికైంది. ఆ బాలుడి పేరు శశికిరణ్. ఆయన తండ్రి ఉప్పలయ్య. లివర్ సిరోసిస్ (కాలేయం పనితీరు దెబ్బతినడం)తో బాధపడుతున్న కుమారుడికి కాలేయం దానం చేసిన ఉప్పలయ్య ఫాదర్ ఆఫ్ శశికిరణ్ అనిపించుకున్నారు. అందరి మన్ననలుఅందుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలోనే తొలి లైవ్ లివర్ట్రాన్స్ప్లాంటేషన్గా ఇది నిలిచిపోయింది. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఈ చికిత్సవివరాలను సోమవారం ఆస్పత్రిలో వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం విడవల్లి గ్రామానికి చెందిన పోలియో బాధితుడు దొంతగాని ఉప్పలయ్య టైలర్. ఈయన కుమారుడు మాస్టర్ శశికిరణ్(14) కామెర్లతో బాధపడగా, ఏడాది క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్ప వైద్య పరీక్షలు నిర్వహించి, బాలుడు లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించారు. ఈ మేరకు జీవన్‌దాన్ సహా ఆరోగ్యశ్రీలోనూ పేరు నమోదు చేయించారు. అయితే బ్రెయిన్‌డెడ్ దాత కాలేయం లభించకపోవడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని కుమారుడికి ఇచ్చేందుకు ఉప్పలయ్య ముందుకొచ్చారు. 30 రోజులు... 8 కిలోలు వైద్యులు ఉప్పలయ్యకు పరీక్షలు నిర్వహించగా, ఆయన ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. కాలేయంలో కొవ్వు కరిగిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత చికిత్స చేయాలని వైద్యులు భావించారు. దీంతో వ్యాయామం చేయాలని సూచించారు. కుమారుడిపై ప్రేమతో ఉప్పలయ్య నెల రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గాడు. జూన్ 4న డాక్టర్ బీరప్ప నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్యబృందం 12గంటలు శ్రమించి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు. ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సెంటర్ ఫర్ లివర్ సైన్సెన్ (యూకే) డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య సహకారం అందించారు. ‘సర్కారీ’లో తొలిసారి... జీవన్‌దాన్ పథకంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటి వరకు బ్రెయిన్‌డెడ్ డోనర్ నుంచి సేకరించిన కాలేయ మార్పిడి చికిత్సలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా లైవ్ డోనర్ కాలేయ మార్పిడి చికిత్స జరగడం విశేషం. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ బీరప్ప తెలిపారు. చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుంటే.. ఆరోగ్యశ్రీ సహకారంతో నిమ్స్‌లో కేవలం రూ.10.80 లక్షలకే చేసినట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో డాక్టర్లు పద్మజ, వేణుమాధవ్, సూర్యరామచంద్రవర్మ, నవకిషోర్, జగన్‌మెహన్‌రెడ్డి, గంగాధర్, దిగ్విజయ్, అభిజిత్, హితేష్, వికాశ్, నిర్మల, మధులిక, ఇందిరా, కవిత పాల్గొన్నారు. 11వేల సర్జరీలు... ఆస్పత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో ఈ మూడేళ్ల కాలంలో సర్జరీలు రెట్టింపయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏటా 7వేల సర్జరీలు జరిగితే... 2017లో 13వేలకు పైగా సర్జరీలు నిర్వహించగా, ఈ ఏడాది ఇప్పటికే 11వేల సర్జరీలు చేశాం. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఏడుగురు బాధితులు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా కిడ్నీమార్పిడి చికిత్సలు నిర్వహించాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
నిమ్స్‌లో జూడాల ఆందోళన
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి అలజడి చెలరేగింది. మంగళవారం అర్ధరాత్రి జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. ఓ రోగి మృతిచెందడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై బాధితురాలి బందువులు దాడికి దిగారు. దీంతో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి, ఆందోళనకు దిగారు. మేడిపల్లికి చెందిన అరుణ మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్‌తో ఈ నెల 19న నిమ్స్‌లో చేరారు. వైద్యులు అమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అరుణ పరిస్థితి విషమించడంతో డాక్టర్ ఇర్ఫాన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన అరుణ బంధువులు ఇర్ఫాన్‌తో వాగ్వాదానికి దిగారు. అమె మరణించిందని చెప్పడంతో ఆయనను పరిగెత్తించి కొట్టారని జూడాలు పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, అరెస్ట్ చేసి విడిచిపెట్టారని జూడాలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘వేలు’ పెడితే కోట్లొస్తాయ్!
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఓ జిరాక్స్ మిషన్ కారణంగా ఆగిపోయాయంటే నమ్మగలరా..! కానీ.. నమ్మాల్సిందే.. అక్షరాలా రూ.6 కోట్లు వివిధ సంస్థల నుంచి నిమ్స్‌కు రావాల్సి ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఈహెచ్ ఎస్ స్కీం ద్వారా నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వచ్చి చికిత్స పొందుతారు. ఇలా చికిత్స పొందిన వారిలో ఆర్టీసీ, బీఎస్ఎన్ఎల్, సీజీహెచ్, సింగరేణి, రైల్వే, ఈఎస్ఐతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు ఉన్నారు. వారికి అవసరమైన చికిత్స నిర్వహించిన అనంతరం అందు కు సంబంధించిన బిల్లులను నిమ్స్ యాజమాన్యం ఆయా సంస్థలకు పంపి వసూలు చేస్తుంది. జిరాక్స్ మిషన్‌ను బాగుచేసేందుకు కేవలం రూ.13వేలు మాత్రమే అవుతాయి. కానీ ఆస్పత్రి ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం తో నాలుగు నెలలుగా అది మూలకు పడింది. ఎందుకీ దుస్థితి.. నిమ్స్ స్పెషాలిటీ బ్లాకులో క్రిడెట్ కలెక్షన్ యూనిట్ (సీసీయూ)ఉంది. ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ ద్వారా చికిత్స పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను ఆయా సంస్థలకు పంపి వసూలు చేయాలి. అందుకు వారికి వచ్చిన బిల్లులను నకళ్లను తీసి క్లెయిమ్ కోసం పంపించాల్సి ఉంటుంది. అందుకోసం 2011లో జిరాక్స్ మిషన్‌ను నిమ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధిత తయారీ సంస్థ ఇచ్చిన లైఫ్ 6 లక్షల కాఫీలకు మాత్రమే. అయితే సుమారు 10 లక్షల కాఫీలను తీసి మిషన్ అలసిపోయింది. నాలుగు నెలలుగా జిరాక్స్ మిషన్ మూలకు పడి ఉంటోంది. ఎమ్మార్డీ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్‌కు రాని బిల్లుల ఫైళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి బిల్లులను ఎమ్మార్డీ యూనిట్‌కు పంపుతారు. అక్కడ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్‌కు రావాల్సి ఉంది. అయితే చాలా ఫైళ్లు క్రిడెట్ కలెక్షన్ యూనిట్ రావాల్సిఉందని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఎంతో విలువైన ఫైళ్లను నిర్లక్ష్యంగా సిబ్బంది నేలపై పడేశారు. వాటిలో కోర్టు కేసులకు సంబంధించిన మెడికో లీగల్ ఫైళ్లు ఉన్నాయి. అక్కడ ర్యాకులు లేకపోవడంతో.. వర్షం వస్తే ఫైళ్లు తడిసిపోతున్నాయి. -
ఆస్పత్రికి వెళ్తున్నారా...నీళ్ల బాటిల్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారా?.. అయితే వెంట నీళ్ల బాటిల్‌ను తీసుకెళ్లండి.. అసలే ఎండాకాలం ఆపై ఆస్పత్రుల్లో మంచి నీళ్ల కరువు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నీళ్లు తాగితే.. అక్కడే అడ్మిట్ కావాల్సిన పరిస్థితి. కాచి వడపోసిన నీటినే తాగండి అని చెప్పే అధికారులు ఆస్పత్రుల వంక కన్నెత్తి చూడకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీ, పేట్ల బురుజు, సుల్తాన్ బజార్, ఈఎన్టీ, సరో జినిదేవి, ఛాతీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. మందులు వేసుకునేందుకు.. ఆహారం తినేందుకు రూ.20 చెల్లించి లీటర్ బాటిల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వార్డు ల్లో ఉన్న రిఫ్రిజిరేటర్లు పని చేయకపోవడం, ఒక వేళ పనిచేసినా నీరు లేక ఖాళీగా ఉండటంతో తాగేందుకు నీరులేక రోగులు, వారి బంధువులు తీవ్ర యాతన పడుతున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, వాటిపై సరైన మూతల్లేకపోవడంతో దుమ్మూధూళి కణాలతో పాటు పిచ్చుకల మలవిసర్జన, తోక పురుగులు కనిపిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిమ్స్‌లో నీళ్ల కరువు... నిమ్స్ ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజు కు 1,500 మంది వస్తుండగా, నిత్యం వెయ్యి మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోగుల బంధువులు, ఉద్యోగులు మరో 3వేలమంది ఉంటారు. ఇక్కడి రోగులకు పలు ఇన్సూ్యరెన్స్ కంపెనీలు మందులు, చికిత్స ఖర్చులతో పాటు ఆహారం, తాగునీటి బిల్లులూ చెల్లిస్తుంటాయి. కానీ ఈ ఆస్పత్రిలో మంచి నీరు కూడా రోగులే సమకూర్చుకోవాల్సి వస్తుండటం విశేషం. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ లబ్ధిదారులకు ఆహారం సహా స్వచ్ఛమైన నీటిని ఉచితంగా సరఫరా చేస్తుండటం కొసమెరుపు. ట్యాంకుల్లో పిచ్చుకల వ్యర్థాలు.... ఉస్మానియా ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజూ 2,000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సహాయకులుగా మరో వెయ్యి మంది ఉంటారు. వైద్య సిబ్బంది మరో 2,000 ఉంటారు. రోజుకు 50 లక్షల లీటర్లకుపైగా నీరు అవసరం కాగా 29,47,640 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని నిల్వ చేసిన ట్యాంకులపై మూతల్లేక దుమ్ము, ధూళీ చేరుతోంది. పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకులను 15 రోజులకోసారి బ్లీచింగ్‌తో శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారి కూడా చేయడం లేదు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఆర్‌ఎంఓలు వాటిని పట్టించుకోవడం లేదు. నీటి ట్యాంకుల్లో ఈకొలి బ్యాక్టీరియా... గాంధీ ఆస్పత్రిలోనూ మంచినీటికి కటకటే. ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో నీటిపై నాచు తేలియాడుతోంది. కుళాయి నీటిలో ఈకొలి బ్యాక్టీరియా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజూ 2,500 మంది, ఇన్‌పేషంట్ విభాగానికి 1,500 మంది వస్తుంటారు. మరో 2,500 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సరిపడ నీరు సరఫరా కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యులే కాదు ఎవరైనా రోగులు మందు బిల్ల వేసుకునేందుకు నీరు కావాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే. -
నిమ్స్‌లో వైద్యుడి మృతిపై కమిటీ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో ఇటీవల మృతి చెందిన రెసిడెంట్ డాక్టర్ శివతేజారెడ్డి ఘటనపై బుధవారం విచారణ కమిటీ నిమ్స్‌లో పర్యటించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, తెలంగాణ వైద్య విద్యాశాఖ డెరైక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల తొలిసారిగా విచారణ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోని 5వ ఫ్లోర్లో విచారణ ప్రారంభించారు. శివతేజారెడ్డి మార్చి 25న తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణలో భాగంగా తొలిరోజు నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానందరెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ రఘు కిషోర్, ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, రెసిడెంట్ డాక్టర్లు శోభన్, సతీశ్, వంశీకృష్ణ తదితరులు కమిటీ ముందు హాజరయ్యారు. శివతేజారెడ్డి మంచితనం, విధి నిర్వహణలో ఆయన చూపే అంకిత భావం, సామాజిక సేవా కార్యక్రమాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. శివతేజారెడ్డి మృతికి కారకులైన బోధకుల పేర్లు కూడా కమి టీ దృష్టికి తీసుకెళ్లారు. పలు విభాగాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. రెసిడెంట్లు చెప్పిన అంశాలను కమిటీ సభ్యులు విని నోట్ చేసుకున్నారు. శనివారం మరోసారి ఆయా రెసిడెంట్లతో సమావేశమై తుది నివేదికను రూపొందించనున్నారు. -
నిమ్స్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని పేషెంట్లు, బంధువులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బీబీనగర్ నిమ్స్ ఎందుకు ప్రారంభించలేదు?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో నిమ్స్ ఆస్పత్రి భవనాలు నిర్మించి ఏడేళ్లవుతున్నా నేటి వరకూ వైద్య సేవలు ఎందుకు ప్రారంభించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రూ.125 కోట్లతో నిర్మించిన ఆ భవనాలు ఎందుకు ఖాళీగా ఉంచారో వివరణివ్వాలని నోటీసులు జారీ చేసింది. జర్నలిస్ట్ కె.నరేందర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. గతంలో మంత్రులు, సీఎం కూడా సర్కారు ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందేవారని.. కానీ ఆస్పత్రుల పరిస్థితి క్షీణించడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. బీబీనగర్‌లో నిమ్స్ భవనాలు నిర్మించినా ప్రారంభించకపోవడాన్ని కాగ్ తప్పుబట్టినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నాయని, ఆరోగ్యశ్రీలో అక్రమాలు జరుగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలే చెబుతున్నాయని చెప్పారు. ‘కార్పొరేట్’లో రోగులకు మంచి వైద్యం అందించేందుకు వీలుగా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని వాదించారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ వివరించారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
నిమ్స్‌కు అగర్వాల్ సమాజ్ బహుమానం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోన్న అగర్వాల్ సమాజ్ సహాయత సేవా ట్రస్ట్ తాజాగా నిమ్స్ ఆస్పత్రికి పూర్తిస్థాయి ఐసీయూని బహుమానంగా అందజేసింది. నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంపు సందర్భంగా ఈ నూతన ఐసీయూని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. సుమారు రూ.60 లక్షల విలువైన ఈ అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 5 వెంటిలేటర్లు, 7 మానిటర్లు, 6 వీల్ చైర్లు, 2 ట్రాలీలు, వెయిటింగ్ రూమ్ వద్ద స్టీల్ సోఫా సెట్లు, 2 ఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. ‘ఇది వరుసగా రెండో మెగా హెల్త్ క్యాంపు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రికి డయాలసిస్ మెషీన్‌ను అందజేశాం. ఇప్పుడు నిమ్స్‌కి పూర్తిస్థాయి ఐసీయూని ఇస్తున్నాం. వచ్చే మెగా క్యాంపు నాటికి ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి మొబైల్ యూనిట్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అందించే పరికరాలు, సదుపాయాలు నిజమైన పేదవారికి అందుతాయి. అది మా ట్రస్ట్‌కి ఎంతో సంతోషం కలిగించే అంశం’అని అగర్వాల్ సమాజ్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజేశ్ అగర్వాల్ అన్నారు. -
నిమ్స్ వద్ద దాడి.. షాకింగ్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ లో విధి నిర్వహణలో ఉన్న సురేశ్ అనే సెక్యూరిటీ సూపర్ వైజర్ పై మెడికల్ రిప్రజెంటేటివ్ దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడి జరగ్గా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వాహనాలకు అనుమతి లేని స్థలంలో నిలిపినందుకు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేశ్ అభ్యంతరం తెలిపాడు. ఓ కంపెనీకి చెందిన పది మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిమ్స్ లోని క్యాంటీన్ సమీపంలో వాహనం నిలిపి అక్కడే గుంపుగా నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అధికారుల ఆదేశం మేరకు సెక్యూరిటీ సూపర్ వైజర్.. వారిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించాడు. పార్కింగ్ చేసిన వాహనాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ ను గట్టిగా నిలదీశాడు. దీంతో గుంపులోని ఓ వ్యక్తి సురేష్ పై దాడి చేశాడు. కిందపడేసి కొట్టడంతోపాటు బూతులు తిట్టాడు. ఈ విషయాన్ని సదరు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేష్ నిమ్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. పైగా దాడి చేసిన మెడికల్ రిప్రజెంటేటివ్ తో రాజీ కుదుర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సురేష్ ఫిర్యాదు చేశాడు. వాహనాల పార్కింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఓ వైపు చెబుతుండగా ఉల్లంఘన దారులతో రాజీ కుదుర్చుకోవాలని నిమ్స్ అధికారులు చెబుతుండటం వల్ల కిందిస్థాయి సిబ్బంది మనోస్థైర్యం కోల్పోతున్నారు. -
నిమ్స్ వద్ద దాడి.. షాకింగ్ వీడియో
-
నాలా కాదు.. నిమ్స్ ఆస్పత్రే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిన హైదరాబాద్ ‘నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)’ఆస్పత్రి మురికి కూపంగా మారిపోయింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, డ్రైనేజీ లీకేజీలతో పారిశుధ్య లోపం తాండవిస్తోంది. ఇక్కడికి వస్తే అనారోగ్యం తొలగిపోవడమేమిటోగానీ కొత్త రోగాలు పట్టుకుంటాయన్నంతగా పరిస్థితి తయారైంది. నిమ్స్‌లో ఉన్నతాధికారులు, అధికారులు ఉండే ఆవరణలు శుభ్రంగానే ఉన్నా.. రోగులు, వారి సహాయకులు ఉండే ప్రదేశాలు మాత్రం దారుణంగా ఉంటున్నాయి. అసలు పారిశుధ్యం కోసం సుమారు నెలకు రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించకపోవడం ఆందోళనకరం. ఆవరణ నిండా మురుగునీరు నిమ్స్ ప్రభుత్వ పరిధిలోని వైద్య సేవల సంస్థ అయినా విశ్వవిద్యాలయం హోదాతో ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కీలకమైన వైద్య సేవలను ఇక్కడే పొందుతారు. కార్పొరేట్ ఆస్పత్రుల ఖర్చులు భరించలేనివారు, ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలు నిమ్స్‌కు వస్తుంటారు. ఇలా అన్ని వర్గాలకు సేవలందించే నిమ్స్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం గమనార్హం. రోజూ వేలాది మంది వచ్చే ఈ ఆస్పత్రి ఆవరణలో.. బహిరంగ నాలాలను తలపించేలా మురుగు నీరు ప్రవహిస్తోంది. కనీసం నడుచుకుంటూ వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలోకి వచ్చి, వెళ్లే మార్గాలు దుర్గంధభరితంగా మారిపోయాయి. అసలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇంతకుముందు ఈ ఆస్పత్రికి ‘స్వచ్ఛ ఆవరణ’అవార్డు ఇవ్వడం గమనార్హం. భరించాల్సిందే.. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవల కోసం వచ్చే రోగులు, ఆస్పత్రిలో చేరిన వారికి సహాయకులుగా ఉండేవారితోపాటు రెసిడెంట్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సేవలు నిర్వహించే తాత్కాలిక సిబ్బంది అందరూ కూడా మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపోక అవస్థలు పడుతున్నారు. ఓపీ కోసం వచ్చే రోగుల కోసమైతే ఒక్క చోట కూడా ఇవి అందుబాటులో లేవు. కింది అంతస్తులో ఒకటి రెండు మూత్రశాలలు ఉన్నా తాళాలు వేసి పెడుతున్నారు. దాంతో కొందరు రోగులు, సహాయకులు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోగులు, సహాయకులు ఆస్పత్రి ఆవరణలో కనుమరుగుగా ఉండే ప్రాంతాల్లో ‘పని’కానిచ్చేస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్నా.. వాస్తవానికి నిమ్స్ ఆస్పత్రికి జాతీయ స్థాయిలో పేరుంది. వైద్యసేవల పరంగా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనూ లేని విధంగా 34 విభాగాలున్నాయి. ప్రభుత్వం కూడా పడకల సంఖ్యను 1,140 నుంచి 1,460కి పెంచింది. రోగులు కూడా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల ఫీజులకు భయపడి నిమ్స్వైపే చూస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజూ సగటున 1,500 మంది ఔట్ పేషెంట్లు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 2,500 మందికి పెరిగింది. రోజూ సగటున 150 మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు, అన్నిరకాల శస్త్రచికిత్సలు కలిపి సగటున రోజూ 100 ఆపరేషన్లు జరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు నిర్మించుకుంటూ పోతున్నారుగానీ... ఇతర మౌలిక సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణను మాత్రం గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల నుంచి వచ్చేవారితోనే ఇబ్బంది ‘‘నిమ్స్‌కు వచ్చే వారిలో ఎక్కువ మంది గ్రామీణులు ఉంటారు. ఆస్పత్రికి వచ్చేటప్పుడు మగ్గులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు తెచ్చి.. ఇక్కడే పడేస్తున్నారు. దీంతో అప్పుడప్పుడు డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల స్థాయిలో ఇక్కడ పారిశుధ్య నిర్వహణను ఆశించలేం. కానీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నంతలో మెరుగు పరుస్తున్నాం..’’ – కె.మనోహర్, నిమ్స్ డైరెక్టర్ -
‘నేరెళ్ల’ బాధితులను పంపేసిన నిమ్స్ వైద్యులు
-
‘నేరెళ్ల’ బాధితులను పంపేసిన నిమ్స్ వైద్యులు
♦ బలవంతంగా వెళ్లగొట్టారంటూ బాధితుల ఆందోళన ♦మద్దతుగా నిమ్స్ వద్ద కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతల ధర్నా హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘నేరెళ్ల’బాధితులను ఆస్పత్రి సిబ్బంది గురువారం రాత్రి డిశ్చార్జి చేసి, బయటకు పంపించారు. తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కొనసాగించాలని కోరినా బలవంతంగా బయటకు పంపేశారంటూ ఈ సందర్భంగా బాధితులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, అనిల్‌కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. చివరికి బాధితులను తీసుకెళ్లి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. వెళ్లిపోవాలని బెదిరించారు..! ‘నేరెళ్ల’ఘటనలో తీవ్రంగా గాయపడిన బానయ్య, గోపాల్, హరీశ్, ఈశ్వర్, బాలరాజు, మహేశ్ అనే ఆరుగురిని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అఖిలపక్షం నేతలు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి తగిన చికిత్స అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించి డబ్బు కూడా కట్టారు. అయితే బుధవారం నుంచి చికిత్స అందజేసిన వైద్యులు గురువారం రాత్రి వారిని డిశ్చార్జి చేశారు. కానీ తమకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కొనసాగించాలంటూ నేరెళ్ల బాధితులు ఆందోళనకు దిగారు. తమకు పైనుంచి తీవ్ర ఒత్తిడులు వస్తున్నాయని, వెళ్లిపోవాలని గురువారం మధ్యాహ్నం నుంచే ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి చేశారని వారు పేర్కొన్నారు. పోలీసులు కూడా మఫ్టీలో వచ్చి తమ వివరాలను, ఫొటోలను తీసుకుని వెళ్లారని... పంజాగుట్ట సీఐ పోలీసు సిబ్బందితో వచ్చి వెంటనే ఆసుపత్రి విడిచి వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారని ఆరోపించారు. చివరికి ఆసుపత్రి సిబ్బంది తమకు ఎక్కిస్తున్న సెలైన్లను కూడా తొలగించి బయటికి పంపించారని చెప్పారు. బాధితులను నిమ్స్ నుంచి పంపేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్, ప్రజా సంఘాల నేతలు గురువారం రాత్రి నిమ్స్ వద్దకు చేరుకుని బైఠాయించారు. -
మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత
పరకాల: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కాలు జారిపడి తలకు తీవ్ర గాయం కావడంతో ఈ నెల 9న ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. తలలో రక్తం గడ్డకట్టడంతో నిమ్స్‌లో వైద్య నిపుణుల బృందం చికిత్స అందించింది. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సమ్మయ్య.. 1979లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. మంగళవారం పరకాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
రూ.200 కోట్లతో ‘నిమ్స్’ టవర్లు
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతుండటంతో అవసరాలకు తగినట్లుగా రెండు మెడికల్ టవర్లు నిర్మించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. వాటిలో ఒకటి కిడ్నీ వ్యాధుల చికిత్సలు, మరోటి ఔట్‌పేషెంట్ (ఓపీ) కోసం నిర్మించనున్నారు. టవర్ల నిర్మాణానికి ఆంధ్రాబ్యాంకు నుంచి రూ. 200 కోట్లు రుణం తీసుకోనున్నామని, ఆ మొత్తానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలి పాయి. కిడ్నీ టవర్‌కు రూ.120 కోట్లు, ఓపీ టవర్‌కు రూ.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిమ్స్‌లోని ఖాళీ స్థలాల్లో ముందుగా కిడ్నీ, ఓపీ టవర్లు, మున్ముందు గుండె టవర్ నిర్మించనున్నారు. రాష్ట్రంలో కేన్సర్‌కు ఎంఎన్‌జే ఆస్పత్రి, కంటి చికిత్సలకు సరోజినీ ఆస్పత్రి, ఛాతీ వైద్యం కోసం ఛాతీ వైద్యశాల, ప్రసవాలకు పేట్ల బురుజు ఆస్పత్రి ఉన్నాయి. కిడ్నీ, గుండె వ్యాధులకు ప్రత్యేక ఆస్పత్రులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేస్తుండటం.. సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ రోగులూ ఇక్కడికే తరలి వస్తుండటంతో విస్తరణ తప్పనిసరైంది. గతేడాది 54,821 కిడ్నీ చికిత్సలు.. 201617లో ఆరోగ్యశ్రీ ద్వారా 2.80 లక్షల మందికి పలు రకాల చికిత్సలందించగా.. అందుకు ప్రభుత్వం రూ.748 కోట్లు ఖర్చు చేసింది. వాటిలో 54,821 కిడ్నీ వైద్య చికిత్సలు జరగగా.. 77.55 కోట్లు సర్కారు ఖర్చు చేసింది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధుల కేసులు ఏడాదికి 1015 శాతం పెరగడంతో నిమ్స్‌కు కిడ్నీ కేసులు ఏడాదికి 30 శాతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 500 పడకలతో కిడ్నీ టవర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. డయాలసిస్ యూనిట్లు, కిడ్నీ మార్పిడి థియేటర్లు, పేయింగ్ రూము లను టవర్‌లో ఏర్పాటు చేస్తారు. మరోవైపు రోజూ 2 వేల మంది రోగులు ఓపీ సేవల కోసం నిమ్స్‌కు వస్తుం డటం, వైద్య పరీక్షల నిర్వహణకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాత బ్లాక్ స్థానే అధునాతన వసతులతో ఓపీ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తాం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బీబీనగర్‌లో గల నిమ్స్ ఆస్పత్రికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు ప్రారంభించాలంటూ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నిమ్స్ వద్ద మంగళవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిమ్స్ ఆస్పత్రిని నిర్మించారని, అలాగే 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. -
ప్రముఖ సంస్థలకు జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్ఎంసీకి భారీగా పన్నులు వసూళ్లు కావడంతో ఇక మొండి బకాయిలపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా కోట్లలో బకాయిలు ఉన్న ప్రముఖ సంస్థలకు సోమవారం రెడ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో ప్రతిష్టాత్మక నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్), పార్క్ హయత్ హోటల్, సైఫాబాద్‌లోని ఏజీ కార్యాలయంతో పాటు టెలిఫోన్ భవన్ ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రి రూ.9 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సిందని జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు తెలిపారు. తక్షణం పన్ను చెల్లించకుంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2లోని పార్క్‌హయత్ హోటల్ ఈ ఏడాదికి గాను రూ.2.16 కోట్లు ఆస్తిపన్ను బకాయి ఉండడంతో రెడ్ నోటీసులు జారీ చేశారు. సైఫాబాద్‌లోని ఏజీ ఆఫీస్ రూ. 2.37 కోట్లు, టెలిఫోన్ భవన్ కూడా పెద్ద ఎత్తున బకాయిపడినట్లు అధికారులు తెలిపారు. -
బిల్లులు చెల్లిస్తేనే పేషెంట్ల డిశ్చార్జ్: వైద్యులు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. బిల్లులు చెల్లిస్తేనే చికిత్స పొందిన పేషెంట్లను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. బిల్లు చెల్లింపులను నగదు రూపంలోగానీ, క్రెడిట్ కార్డులను మాత్రమే స్వీకరిస్తామని చెప్పడంతో పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. డెబిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తామని చెప్పినా.. ఆ కార్డులకు స్వైప్ మిషన్ తమ వద్ద లేదని నిమ్స్ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. దీంతో నిమ్స్ సిబ్బందితో పేషెంట్లు, వారి బంధువులు వాగ్వివాదానికి దిగుతున్నారు. బ్యాంకుల వద్ద భారీ క్యూ లైన్లున్నాయి. డబ్బులు ఎక్కడినుంచి తీసుకొచ్చి చెల్లించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెబిట్ కార్డులను ఎందుకు అంగీకరించరని.. తమకున్న మార్గం అదేనని వారు వాపోయారు. నోట్ల రద్దుతో పాటు, కొత్తనోట్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో మార్కెట్ల వద్ద మాత్రమే కాదు ఆస్పత్రులలోనూ సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సీజనల్ వ్యాదులతో అప్రమత్తం
అఫ్జల్‌గంజ్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సి. లక్ష్మారెడ్డి కోరారు. ఆయన సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి భవనం పరిస్థితిని పరిశీలించి, పాత భవనంలోని 1,2 అంతస్తుల్లోని వార్డులను, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. వార్డులలో చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించి వారితో మాట్లాడారు. జహీరాబాద్‌కు చెందిన వెంకటనర్సింహ కిడ్నీలో రాళ్ళువచ్చాయని 45 రోజులుగా చికిత్స పొందుతున్నానని, రాత్రి వేళలో సెక్యూరిటీ సిబ్బంది లేని కారణంగా దొంగలు తిరుగుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒకరిద్దరు ముసుగులతో వచ్చి రాత్రి వేళ నిద్రించి వెళ్తున్నారన్నారు. రోగులకు భద్రత కరువైందని మంత్రికి ఫిర్యాదుచేశాడు. హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు కొరత ఉందని వారిని త్వరితగతిన నియమించాలని కోరుతూ నర్సులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సూపరిండెంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... వైద్యశాఖ అన్ని పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక వైద్య క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రి భవనాన్ని ఎప్పటికప్పుడు ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందన్నారు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు టీఎస్‌సీఎస్సీద్వారా 2118 పోస్టులకు త్వరలో నీటిపికేషన్ వెలువడనుందని అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ జీవీఎస్ మూర్తి, చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, ఆర్‌ఎంఓలు నజాఫీ, కవిత, రఫి, రాష్ట్ర వైద్యుల సంఘం అద్యక్షులు బొంగు రమేష్, నాగేందర్, ప్రవీణ్, అన్ని విభాగాల అదిపతులు, టిఆర్ఎస్ నాయకులు ఆర్వి మహేందర్, సంతోష్ గుప్త తదితరులు ఉన్నారు. నిమ్స్‌లో ఆకస్మిక తనిఖీ పంజగుట్ట: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి సోమవారం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సాయంత్రం 4:30 ప్రాంతంలో నిమ్స్‌కు వచ్చిన ఆయన అరగంటపాటు అక్కడే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన నియోజకవర్గం కార్యకర్తను పరామర్శించిన ఆయన పలువురు రోగులతో మాట్లాడి నిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశాడు. పలువురు రోగులు, సహాయకులు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని కోరగా వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, పలువురు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు. -
నిమ్స్ కౌంటర్లో రూ.40 వేలు చోరీ
పంజగుట్ట: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నిమ్స్ ఆసుపత్రి ఓపీలో రెప్పపాటులో రూ. 40 వేలు చోరీ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా గార్డు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ... నాంపల్లికి చెందిన గౌసియా బేగం (32) బుధవారం మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రి ఓపీ వద్దకు వచ్చింది. ఓపీలోని ఓ మహిళా ఉద్యోగి పక్కనే ఉన్న మరో ఉద్యోగితో మాట్లాడుతుండగా సెకండ్ల వ్యవధిలో కౌంటర్లో ఉన్న రూ. 40 వేలు దొంగిలించింది. అక్కడే విధుల్లో ఉన్న మహిళా గార్డు ఇది గమనించి వెంటనే గౌసియా బేగంను పట్టుకుంది. అప్పటికే ఆమె మద్యం మత్తులో ఉన్న ఆమెను నిమ్స్ సెక్యూరిటీ అధికారులు పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్‌లో కేసీఅర్ హరిత హరం
-
ఈఎస్ఐసీ, నిమ్స్ మధ్య ఒప్పందం
సాక్షి, హైదరాబాద్ : వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు తదితరాలను ఇచ్చిపుచ్చుకునేలా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజ్, నిమ్స్ ఆస్పత్రుల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి సమక్షంలో అధికారులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలోని అత్యాధునిక లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్, ఎమర్జెన్సీ విభాగాలను నిమ్స్ ఆస్పత్రి ఉపయోగించుకునేందుకు ఈఎస్ఐసీ అంగీకరించింది. అలాగే నిమ్స్ ఆస్పత్రిలోని నిపుణులైన వైద్య సిబ్బంది, స్పెషలిస్టులు ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీకి అవసరమైనప్పుడు ఉపయోగపడేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. -
నిమ్స్‌లో గుండె, కాలేయ మార్పిడి టవర్స్
- నిమ్స్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి - రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాల కొనుగోలు - స్టెమ్‌సెల్ రీసెర్చ్ సెంటర్, అధునాతన డయాగ్నొస్టిక్స్ ల్యాబ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం మరో రెండు అధునాతన టవర్స్ నిర్మిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు నిమ్స్‌లో అందుతున్న వైద్య సదుపాయాలు... రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఏఎంసీ, సూపర్‌స్పెషాలిటీ, ఎమర్జెన్సీ మిలీనియం బ్లాక్, పాత భవనం ఇలా అన్ని వార్డుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో దేశంలోనే తొలి స్టెమ్‌సెల్ థెరపీ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిలీనియం బ్లాక్‌లో అడ్వాన్స్డ్ డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రూ.27 కోట్లతో వివిధ వైద్య పరికరాల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని, మరో రూ.36 కోట్ల విలువ చేసే వైద్య పరికరాల కొనుగోలుకు త్వ రలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించామని, త్వరలోనే ఇన్ పేషెంట్ సర్వీసులను కూడా అందజేస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి బీబీనగర్ నిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె, కాలేయ, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామన్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కేడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు మాత్రమే జరుగుతున్నాయని, ఇకపై లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే వైద్యసేవల్లో జరుగుతున్న జాప్యం, ఆస్పత్రిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది ఆరోగ్యశ్రీ రోగులు యత్నించగా సెక్యురిటీ సిబ్బంది వారిని నిలువరించారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కొసమెరుపు. -
ఆస్పత్రుల్లో ఆ‘పరేషాన్’
► ‘మత్తు’ వైద్యులు లేక శస్త్రచికిత్సలకు బ్రేక్ ► ఆపరేషన్ థియేటర్ల ముందు రోగుల పడిగాపులు ► గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లోనూ అదే తీరు సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజలు ఆపద వస్తే దేవుణ్ని.. ఆరోగ్యం పాడైతే వైద్యుణ్ని వేడుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రోగుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శస్త్ర చికిత్సల్లో అతి ముఖ్యమైన ‘మత్తు’ ఇచ్చే వైద్యులు నగరంలోని ప్రభుత్వాస్పత్రుల్లో లేకపోవడంతో అత్యవసర ఆపరేషన్లు సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓపక్క రోగులు చస్తున్నా ప్రభుత్వం మాత్రం ‘మత్తు’ వీడటం లేదు. రోగుల నిష్పత్తికి తగినంత మంది మత్తు మందు వైద్యులు లేకపోవడంతో అత్యవయసర శస్త్రచికిత్సల కోసం ఆస్పత్ర ుల్లో చేరిన రోగులకు ఆపరేషన్ థియేటర్ల వద్ద చేదు అనుభవమే ఎదురవుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా పడకల సామర్థ్యం, సర్జన్స్, యూనిట్ల సంఖ్యా పెంచారు. అదే స్థాయిలో మత్తు వైద్యుల సంఖ్య మాత్రం పెంచలేదు. క్లిష్టమైన గుండె, మూత్రపిండాలు, కాలేయ, మెదడు, వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్సలే కాదు సాధారణ శస్త్రచికిత్సల కోసం కూడా రోజుల తరబడి ఆస్పత్రిలోనే నిరీక్షించాల్సి వస్తోంది. గత్యంతరం లేక కొంతమంది అక్కడే పడిగాపులు కాస్తుంటే.. మరికొం దరు అప్పుచేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. హే గాంధీ.. సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిని 1998లో వెయ్యి పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పడకల సామర్థ్యాన్ని రెండు వేలకు పెంచారు. ఆపరేషన్ థియేటర్లను 12 నుంచి 31కి పెంచారు. ఇక్కడ రోజుకు సగటున 60-70 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 28 అనస్థీషియన్ పోస్టులకు 17 మంది వైద్యులే సేవలు అందిస్తున్నారు. సర్జన్లు, ఆపరేషన్ థియేటర్ల నిష్పత్తికి తగినంత మంది మత్తుమందు వైద్యులు లేరు. వెంటిలేర్‌పై ఉన్న రోగులు, ఏఎంసీ, ఆర్‌ఐసీయూలోని రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. నిమ్స్‌లోనూ అంతే.. నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు 2300-2500 మంది రోగులు వస్తుంటారు. నిత్యం ఇక్కడ 1200 మంది చికిత్స పొందుతుంటారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 18 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున 30-40 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా అందరు కలుపుకుని 20 మంది మత్తు మందు వైద్య నిపుణులు ఉన్నారు. ఇక్కడ మరో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగుల నిష్పత్తికి తగినంత మంది అనస్థీషియన్లు లేకపోవడంతో శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. న్యూరోసర్జరీ, కార్డియో థొరాసిక్, ఆర్థోపెడిక్, మూత్రపిండాలు, క్యాన్సర్ విభాగాల్లో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఉస్మానియాలో మరింత దారణం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో రోజుకు సగటున 50 శస్త్రచికిత్సలు జరుగుతాయి. 18 అనస్థీషియన్ పోస్టులకు ఐదు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిలో కూడా రోజుకు ముగ్గురు, నలుగురు వైద్యులు సెలవుల్లో వెళ్తున్నారు. శస్త్రచికిత్సల సమయంలో అనస్థీషియన్ అందుబాటులోలేక వాయిదా పడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోగం నయం కాకపోగా మరింత ముదురుతోంది. -
నిమ్స్‌లో కోల్డ్‌వార్
► ఇమడలేక వీడిపోతున్న వైద్యులు ► దీర్ఘకాలిక సెలవులో సర్జికల్ ఆంకాలజిస్ట్ ► సీనియర్లు లేక మూతపడుతున్న థియేటర్లు సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని కొంతమంది వైద్యుల మధ్య నెల కొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వైద్యులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. విభాగాధిపతులు, ఉన్నతాధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రతిభావంతులైన పలువురు సీనియర్ వైద్యులు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆస్పత్రిలో 70కి పైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. అంతర్గత పోరు, వనరుల లేమికి తోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఇదే కారణంతో ఆస్పత్రిని వీడుతున్నట్టు అధికారులే అంగీకరిస్తున్నారు. మనస్తాపంతో దీర్ఘకాలిక సెలవు సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాదే పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ఆ పోస్టులు భర్తీ చేయక పోవడంతో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో 50 పడకలను సర్జికల్ ఆంకాలజీ రోగులకు కేటాయించారు. ఇక్కడ నిత్యం 50-60 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికి కేటాయించిన రెండు ఆపరేషన్ థియేటర్లలో రోజుకు సగటున 8-10 శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. సర్జికల్ ఆం కాలజీ విభాగానికి మూడు ఐసీయూ బెడ్స్‌ను కేటాయించారు. వీటిని కూడా జనరల్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యుడు కబ్జా చేశాడు. దీంతో ఇరు విభాగాధిపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ అంశాన్ని డెరైక్టర్ దృష్టికి తీసుకెళితే.. తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. మెడికల్ సూపరింటిండెం ట్ కూడా జనరల్ సర్జరీ విభాగాధిపతికి కొమ్ముకాస్తున్నారు. మనస్తాపం చెందిన సదరు సర్జికల్ ఆంకాలజీ అధిపతి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుని వారం రోజుల్లో ఇంటికి తిరిగి వెళ్తామని భావించి వచ్చిన రోగులు నెలల తరబడి వార్డుల్లోనే మగ్గాల్సి వస్తోంది. వేధింపులతో ఇమడలేక.. న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి ఇప్పటికే వెళ్లిపోగా, సీని యర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా నిమ్స్ ను వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇం దుకు కారణమని తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీ నామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు 10-15 శాతానికి పడిపోవడానికి కూడా ఇదే కారణం. పాత భవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు. ల్యామినర్ ఎయిర్ ఫ్లో లేదు. చిన్నపాటి వ ర్షం కురిసినా పైకప్పు కారుతోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండడం వల్ల రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్పై వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడడం గమనార్హం. -
నిమ్స్‌కు ఉక్కపోత
► పని చేయని ఏసీలు ► ఉక్కపోతతో బాధితుల అవస్థలు ► రోగులే ఫ్యాన్లు సమకూర్చుకుంటున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: వారు వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు. ఒంటినిండా సిమెం ట్ కట్లు...ఆపై భరించలేని నొప్పి.... చల్లని గాలికి సేద తీరాల్సిన క్షతగాత్రులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో గాయాలు మానక పోగా, ఉక్కపోతకు దురద పెట్టి ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో ఏసీలు, ఫ్యాన్లు పని చేయక రోగుల అవస్థలు వర్ణణాతీతం. సాధారణ వార్డుల్లోని రోగులే కాకుండా..వివిధ శస్త్రచికిత్సలు చేయించుకుని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఏసీ గదుల్లో ఉన్నవారు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. ఉపశమనం కోసం ప్రత్యామ్నాయంగా ఎవరికి వారే ఫ్యాన్లు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లీకేజీ వల్ల కొన్ని.. గ్యాస్ లేక మరికొన్నిః ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా మరో వెయ్యిమందికి పైగా చి కిత్స పొందుతుంటారు. వీరిలో ఎక్కువ మంది క్షతగాత్రులు, హృద్రోగులు, న్యూరో సంబంధ రోగులు, కిడ్నీ బాధితులే ఉన్నారు. వీవీఐపీలు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 60 ఏసీ పెయింగ్ గదులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పదేళ్ల క్రితం అమర్చినవి కావడంతో నిర్వహణ లోపం వల్ల తరచూ మెరాయిస్తున్నాయి. 40 పడకలు ఉన్న ఐసీసీయూలో గ్యాస్ లీకై ఏసీలు పని చేయకపోగా, సీటీఐసీయూలో గ్యాస్ కొరత కారణంగా మొండికేశాయి. ఆర్ఐసీయూలోనూ ఇదే దుస్థితి. సాధారణ వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వార్డు నెంబర్ 10-ఎ లోని 12 పడకలు ఉండగా, నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి. ఇవి ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో సరిగా పని చేయడం లేదు. ఆర్థోపెడిక్ వార్డులో ఒంటినిండా సిమెంట్ కట్లతో ఏటూ కదల్లేపోతున్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతకు పట్టీలు వేసిన చోట దురద పుట్టి గాయం మానకుండా చేస్తుంది. డయాలసిస్ వార్డులో కంప్రెషర్ పోవడంతో కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇక రోగులు డబ్బు చెల్లించి తీసుకున్న ఏసీ గదుల్లోనూ ఏసీలు పని చేయక పోవడంతో వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు తీరినవైనందునే ఆస్పత్రిలో చాలా వరకు పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాన్లే ఉన్నాయి. ఏసీల గడువు కూడా దాటిపోయింది. వీటిని కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికి ఉష్ణోగ్రతల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వీటిని పునరుద్ధరిస్తాం. రెం డు మూడు రోజుల్లో ఆర్ఐసీయూలో ఏసీ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తాం. -డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, నిమ్స్ -
స్పీకర్ కోలుకోవాలని పూజలు
చిట్యాల : భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి తొందరగా కోలుకోవాలని మండలంలోని మసీదులలో శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ ఇటీవల వడదెబ్బకు గురై నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఈ మేరకు చల్లగరిగె, వెలిశాల, చిట్యాల, టేకుమట్ల, గోపాలపురం గ్రామాలలోని మసీదులలో మైనార్టీ సెల్ మండల నాయకులు ఎండీ రబ్బాని, కమ్రోద్దిన్, రాజ్‌మహ్మద్ ఆధ్వర్యంలో స్పీకర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నమాజ్ చేసారు. కొడకండ్లలో.. కోల్‌బెల్ట్ : తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరుతూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గని వద్ద శుక్రవారం కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గని ఆవరణలో గల ఆలయంలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ బాషనపల్లి కుమారస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి స్పీకర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరారు. అనంతరం గని ఆవరణలో కార్మికులకు ఉగాది పచ్చడిని పంచారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు ఏరుకొండ సంపత్, ఆలయ కమిటీ చైర్మన్ డి. సాంబరెడ్డి, సభ్యులు అయిలయ్య, రవి, రాజ్‌కుమార్, సాంబయ్య, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దృష్టి మళ్లించి.. కార్డు మార్చేసి !!
ఏటీఎం కేటుగాడి అరెస్టు రూ. 77 వేలు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం పంజగుట్ట: ఏటీఎం సెంటర్ వద్ద కాపుకాసి... డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్టు నటించి.. వారి ఏటీఎం కార్డు మార్చేసి డబ్బు డ్రా చేసుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా వెల్ధుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.సిద్దేశ్ (25) ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులు చేసేవాడు. గ్రామంలో ఒకసారి ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం మిషీన్ ఆపరేటింగ్ రాక తికమకపడుతుంటే సిద్దేశ్ అతనికి సాయం చేశాడు. ఇద్దరి ఏటీఎం కార్డులు ఒకే బ్యాంక్‌వి కావడంతో డబ్బులు డ్రా చేసే సమయంలో మారిపోయాయి. సిద్దేశ్ అకౌంట్ లో కేవ లం రూ. 3 వేలు ఉండగా... గుర్తుతెలియని వ్యక్తి అకౌం ట్లో రూ. 40 వేలు ఉన్నాయి. ఆ కార్డు పిన్ నెంబర్ తెలియడంతో సిద్దేశ్ ఆ డబ్బు డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తరహా మోసాలు మొదలెట్టాడు. ఇదే కేసులో గతంలో కర్నూలులో అరెస్టై జైలుకెళ్లాడు. నగరానికి మకాం మార్చి... జైలు నుంచి బయటకు వచ్చాక తన మకాం నగరానికి మార్చాడు. ఎర్రగడ్డలో స్నేహితుడు లక్షీ్ష్మకాతం ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు తన కొడుకును కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం నిమ్స్‌లో చేర్పించాడు. ఫిబ్రవరి 3న నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించగా రాలేదు. అప్పటికే అక్కడ కాపుకాసిన సిద్దేశ్ తాను సాయం చేస్తానని కార్డు తీసుకుని, ఏటీఎం పిన్ తెలుసుకున్నాడు. నాగేశ్వర్రావు దృష్టి మరల్చి అతని ఏటీఎం కార్డుకు బదులు అదే బ్యాంక్‌కు చెందిన మరో కార్డు అతడి చేతిలో పెట్టి.. ‘‘ఈ ఏటీఎంలో నగదు లేదు, వేరే ఏటీఎంకు వెళ్లి డ్రా చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత నాగేశ్వర్రావు కార్డుతో సోమాజిగూడలోని మరో ఏటీఎం నుంచి రూ.22 వేలు డ్రా చేశాడు. ఆ మరుసటి రోజే సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న నాగలక్ష్మి కార్డును కూడా ఇదే విధంగా మార్చేసి రూ. 30 వేలు డ్రా చేశాడు. ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే టాక్స్ పడుతుందని ఫిబ్రవరి 17న ఎస్సార్ నగర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు ప్రేమ్‌నగర్‌కు చెందిన బి.సూర్యనారాయణ అనే కూలీ రూ. 50 వేలు ఆన్లైన్ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన స్నేహితుడి అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న సిద్దేశ్ ‘‘ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. నీ అకౌంట్లో ఉన్న నగదు పోతుంది. నా అకౌంట్లో నగదు ఉంది. అకౌంట్ టు అకౌంట్ మారిస్తే ట్యాక్స్ పడదు’’ అని నమ్మబలికాడు. దీంతో సూర్యనారాయణ తన వద్ద ఉన్న రూ. 50 వేలు సిద్దేశ్‌కు ఇచ్చాడు. సిద్దేశ్ తన బ్యాంక్ ఏటీఎం కార్డును మిషీన్లో పెట్టి మినీ స్టేట్మెంట్ తీసి దానిని సూర్యనారాయణకు ఇచ్చి నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని నమ్మబలికాడు. చదువు రాని సూర్యనారాయణ నిజమే అనుకుని వెళ్లిపోయి.. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి వాకబు చేయగా డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సూర్యనారాయణ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టివేత... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. బుధవారం రాజీవ్‌నగర్ ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా... ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 77 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్పై కర్నూలులో 3, గుత్తిలో 2, పంజగుట్టలో 2, ఎస్సార్ నగర్లో 1 మెత్తం 8 కేసులు ఉన్నాయని, ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, డీఐ షేక్ జిలానీ, ఎస్సై శ్రీనివాస్ నిందితున్ని గుర్తించిన హోంగార్డు తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
దశలవారీగా 'నిమ్స్' అభివృద్ధి
బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు ప్రకటన భువనగిరి (నల్లగొండ జిల్లా) : నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి నిమ్స్ ఓపీ సేవల ప్రారంభోత్సవంలో ప్రకటించారు. ఆదివారం ఉదయం బీబీనగర్‌లోని 'నిమ్స్' ఓపీ సేవలను ప్రారంభించిన అనంతరం వారు మట్లాడుతూ ఆసుపత్రిని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు. -
నేడు బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవం
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్న నిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హాజరవుతారు. నిమ్స్ డెరైక్టర్ ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
మాతృత్వపు సెలవుపై వెళ్లిన నర్సులపై నిమ్స్ వేటు!
కాంట్రాక్టు ఉద్యోగినులకు అన్యాయం సాక్షి, హైదరాబాద్: మాతృత్వపు సెలవులపై వెళ్లి తిరిగి బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన నర్సులపై నిమ్స్ యంత్రాంగం వేటు వేసింది. వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైనప్పటికీ మాతృత్వపు సెలవులు తీసుకోవడానికి వారు అర్హులే. 15మంది నర్సులను తప్పిస్తూ నిమ్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని బాధితులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డికి ఈ విషయాన్ని విన్నవించామని.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా.. ఆయన మాటకు విలువనివ్వకుండా నిమ్స్ యాజమాన్యం తమను తొలగించిందని ఆరోపించారు. మాతృత్వపు సెలవులు ముగియక ముందే కొందరు చేరడానికి వచ్చారని.. అయినా తొలగించడం అన్యాయమన్నారు. నిమ్స్ నిర్వహించిన రాత పరీక్షలో తాము ప్రతిభతో నెగ్గి కాంట్రాక్టు ఉద్యోగం సంపాదించామని.. అర్థంతరంగా విధుల్లోంచి తొలగిస్తే.. మేం బతికేదెలా? అని వారు ఆవేదన చెందారు. నిమ్స్‌లో కొందరు డబ్బులు తీసుకొని కొత్తవారిని నియమించడానికే.. తమను ఇలా ఆకస్మికంగా తొలగించారని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. -
నిమ్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తూ ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం పాతబిల్డింగ్ ఏఎంసీ బ్లాక్‌లోని రెండో అంతస్తులో శుభ్రం చేస్తుండగా కళ్లు తిరగడంతో సదానంద్(40) అనే కార్మికుడు కిందపడ్డాడు. ఆ సమయంలో ఎవరు అతనిని గమనించకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. కాసేపటి తర్వాత గమనించిన వారు అతనిని ఐసీయూకు తరలించారు. అప్పటికే సదానంద్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
నిమ్స్‌లో సాయంత్రం ఓపీ సేవలూ బంద్!
పంజగుట్ట (హైదరాబాద్): నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. శుక్రవారం సాయంత్రం ఓపీ సేవలు బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ డిమాండ్ల సాధనకు మున్ముందు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. శనివారం నుంచి ఆసుపత్రి అసోసియేట్ డీన్స్ నలుగురూ విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తనను కలిసిన ఫ్యాకల్టీ అసోసియేషన్, జూనియర్ వైద్యుల బృందం ప్రతినిధులను ఉద్దేశించి నిమ్స్ డెరైక్టర్... ఇక్కడి సర్జన్స్ కన్నా గుంటూరు హౌస్ సర్జన్స్ ఎంతో నయం అని అనడంతో వైద్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గత ఐదు రోజులుగా శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నా తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని వారు అసహనం వ్యక్తం చేశారు. డైరెక్టర్ తన మాటలు ఉపసంహరించుకోవాలని, పాత విధానం ద్వారానే ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీభూషన్ రాజు, కృష్ణారెడ్డితో పాటు వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
నిమ్స్‌కు వస్తే నరకమే: ఎమ్మెల్సీ ప్రభాకర్
పంజగుట్ట (హైదరాబాద్): నిమ్స్ ఆస్పత్రి రోగుల పాలిట నరకప్రాయంగా మారిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. నిమ్స్ చైర్మన్‌గా ఉన్న సీఎం కేసీఆర్ ఆస్పత్రి అభివృద్ధి గురించి పట్టించుకోకుండా స్వచ్ఛ హైదరాబాద్ అంటూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. నిమ్స్ ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రభాకర్ మూడు రోజుల క్రితం వచ్చారు. అన్ని పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. మంగళవారం పరీక్ష చేసే ముందు వైద్య సిబ్బంది ప్రభాకర్‌తో 20 మాత్రలను కూడా మింగించారు. తీరా మిషన్ పనిచేయడం లేదని, రేపు చేద్దామని చెప్పడంతో ఆయన ఖంగుతిన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవంపై ప్రభాకర్ మంగళవారం ఆస్పత్రి బెడ్ వద్దే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు సరిగా లేవన్నారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే ఇలా జరిగితే సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. యాంజియోగ్రామ్ పరీక్ష మొదలైన తర్వాత మిషన్ పనిచేయడం ఆగిపోతే ఏం జరిగేదన్నారు. వార్డుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, బొద్దింకలు, నల్లులతో రోగులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. 309 మంది వైద్యులకు కేవలం 102 మందే ఉన్నారని, ముందులు కూడా సరిగా లభించడం లేదన్నారు. చివరకు టీటీ ఇంజక్షన్ కూడా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌పై కూడా ఆరోపణలు చేశారు. -
ఉర్దూ ప్యాలెస్
పంజాబీ సాహిత్యం నుంచి ఉర్దూ భాష ఆవిర్భవించిందని సాహితీకారుల అభిప్రాయం. దిల్లీలో అధికంగా మాట్లాడే ఖడీబోలీ - హిందీ భాషల నుంచి ఉర్దూ వ్యాప్తి చెందిందని మరికొందరి వాదన. ఉర్దూ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, దక్షిణాది ప్రాంతాల్లో వాడుక భాషలైన ఉర్దూ-తెలుగు-హిందీ సాహిత్యాలపై తగిన తులనాత్మక పరిశోధనలకోసం ‘ఉర్దూ ప్యాలెస్’(ఐవాన్-ఇ-ఉర్దూ)ను డాక్టర్ సయ్యద్ ఖాద్రీజోర్ స్థాపించారు. పంజగుట్టలో నిమ్స్ ఆస్పత్రికి ఎదురుగా ఈ ప్యాలెస్ ఉంది. హైదరాబాద్‌ను పాలించిన మహ్మద్ కులీ కుతుబ్‌షాను ప్రముఖ కవి పండితుడుగా ఉర్దూ భాషాభిమానులు కీర్తిస్తారు. 16వ శతాబ్దంలో ఉర్దూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాడుక భాషగా పరిఢవిల్లింది. ఉర్దూ రచయితలను ప్రోత్సహించడానికి, ఉర్దూ సాహిత్యంపై పరిశోధనలు, దక్కను ప్రాంత చర్రిత, సాహిత్య-సంస్కృతులను చాటి చెప్పేందుకు ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పాలని మొయినుద్దీన్ ఖాద్రీజోర్ 1920లోప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకు ఇదారా-ఇ-అదబియాత్-ఇ-ఉర్దూ(ఉర్దూ సాహిత్య సంస్థ), ఐవాన్-ఇ-ఉర్దూ(ఉర్దూ ప్యాలెస్) లను 1931 జనవరి 25న నెలకొల్పారు. 1955లో సంస్థ రజతోత్సవాల సందర్బంగా శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఖాద్రీజోర్ భార్య తన తరపున పంజగుట్టలోని వెయ్యి గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఈ భవన సముదాయానికి ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం కూడా అందజేశారు. మూడువైపుల క్రైస్తవ చర్చి మాదిరి అరవై అడుగుల ఎత్తై టవర్లు కనబడతాయి. ఎల్లోరా గుహల మాదిరిగా 12 అడుగుల ఎత్తులో ప్రవేశ ద్వారం, ఆ ద్వారం పైభాగాన తామర పూలను పోలిన లతాకృతుల చెక్కడాలు చక్కగా కనిపిస్తాయి. కర్ణాటక-బహమనీ, స్పానిష్-మూరిష్ ఆర్కిటెక్చర్ కూడా భవననిర్మాణంలో కనిపిస్తుంది. ఆకర్షణీయమైన ఉర్దూ ప్యాలెస్‌లోని లోపలిభాగంలో చక్కని ఆడిటోరియం ఉంది. లైబ్రరీ, మ్యూజియం, రీసెర్చ్ స్కాలర్స్ కోసం రిఫరెన్స్ గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో 40వేలకు పైగా గ్రంథాలున్నాయి. ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ, పంజాబీలో చాలా అరుదుగా దొరికే చారిత్రక ఆధార రాతప్రతులు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని ఆరు సంపుటాలలో గ్రంథస్థం చేశారు. వీటిలో 16వ శతాబ్దం నాటి నవాబుల ఫర్మానాలు, నాటి ప్రముఖుల చేవ్రాలుతో ఉన్న లేఖలు, ఆనాటి చారిత్రక చిత్రాలు, భాషాసాహిత్యపరమైన మ్యాపులు, చార్టులు, రాతిశిలా ఫలకాలు, ఫొటో ఆల్బమ్స్... ఇలా అమూల్యమైన సమాచారం ఉంది. ఈ సంస్థ 1938 నుంచి ‘సబ్రాస్’ అనే మాసపత్రికను ప్రచురిస్తోంది. ప్రతిఏటా మహ్మద్ కులీకుతుబ్ షాహీల రాజ్యస్థాపక దినోత్సవాన్ని ఉర్దూప్యాలెస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్థాపనలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ సయ్యద్ జోర్ ఉస్మానియా, కశ్మీర్ విశ్వవిద్యాలయాల్లో ఉర్దూ ఆచార్యులుగా పనిచేశారు. ఈయన అనేక గ్రంథాలు రాశారు. దక్కను ప్రాంత చరిత్ర, సంస్కృతులపై జోర్ చేసిన రచనలు నేటికీ ఉపయోగపడుతున్నాయి. 80 సంవత్సరాల చరిత్రను తమలో దాచుకున్న ఈ గ్రంథాలయంలోని పుస్తకాలను కంప్యూటరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కాలపు గుర్తులు చెదిరిపోకుండా తగిన మరమ్మతులు చేపట్టి సంస్థను ఆధునీకరించాల్సిన అవసరమూ ఉంది. కవులు, రచయితలు, రీసెర్చ్ స్కాలర్స్, చరిత్ర-భాషా సంస్కృతి అభిమానులు, ఉర్దూ విద్యార్థులతో ఇవన్-ఇ-ఉర్దూ భవనం నిత్యం బిజీగా ఉండే ఉర్దూ ప్యాలెస్‌ను ఒక్కసారైనా సందర్శించాలి. ఔత్సాహికుల కోసం... కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’ ద్వారా డీటీపీ కమ్ గ్రాఫిక్ డిజైన్స్, కాలిగ్రఫీల్లో పరీక్షలు ఏడాదిలో రెండు దఫాలు నిర్వహిస్తున్నారు. డిప్లొమా ఇన్ మల్టీ లింగ్వల్స్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఉర్దూ నేర్చుకోవాలనే తృష్ణ ఉన్నవారికోసం ప్రత్యేక పరీక్షలు ప్రతిఏటా రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు ప్రతి ఏటా 40 నుంచి 50 వేల మంది హాజరవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఏడో తరగతితో సమానమైన ఉర్దూ మహిన్, మెట్రిక్యులేషన్‌తో సమానమైన ఉర్దూ అలిమ్, ఇంటర్మీడియట్ స్థాయి ఉన్న ఉర్దూ ఫజిల్ పరీక్షలను కండక్ట్ చేస్తున్నారు. ముస్లిం యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
ఆదిలాబాద్: రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ కేసులో రిమాండ్‌లో ఉన్న బషీర్ అనే ఖైదీ బాత్రూంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో బషీర్‌ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
సచివాలయంలో మంత్రి ‘పల్లె’కు గాయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని తన కార్యాలయంలోని టేబుల్ తగలడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలికి గాయమైంది. కాలు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న సిబ్బంది మంత్రిని హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. సచివాలయం నుంచిబయటకు వస్తుండగా మంత్రి కుడికాలుకు టేబుల్ తగిలింది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు అత్యవసర చికిత్సలు అందించారు.ఆయనను సహచర మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు ఫోన్లో పరామర్శించారు. -
కలిచెర్లకు జగన్ పరామర్శ
పంజగుట్ట: కర్నూలు వద్ద మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. నిమ్స్ మిలీనియం బ్లాక్ 124 రూంలో చికిత్స పొందుతున్న ఆయనను జగన్ పరామర్శించి ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కలిచెర్లకు నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రూపమ్ వైద్యం అందిస్తున్నారు. నిమ్స్‌కు వచ్చిన జగన్‌ను చూసేందుకు రోగుల బంధువులు పోటీ పడ్డారు. నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన పార్వతమ్మ జగన్ వద్దకు వచ్చి తన కొడుకు నరేష్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడని చెప్పడంతో జగన్ అక్కడ ఉన్న జూనియర్ వైద్యులకు డా.శేషగిరిరావుతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
హైదరాబాద్ నిమ్స్‌లో భూమా నాగిరెడ్డి
* ఛాతీలో నొప్పి రావడంతో కర్నూలుకు తరలించిన పోలీసులు * వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్/కర్నూలు: టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ ముఖ్య నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ పాత భవనం ఐసీపీయూ బెడ్ నెంబర్ 6లో అడ్మిట్ చేశా రు. వైద్యులు ఆయన ఛాతీని ఎక్స్‌రే తీశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాం డ్లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు మధ్యాహ్నం 3.25 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గుండె వ్యాధుల చికిత్స విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయిం చారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి వైద్యులతో మాట్లాడారు. సాయంత్రం 6.20 గంటలకు కార్డియాలజీ ఐసీసీయూ విభాగం నుంచి వీల్‌చైర్‌లో బయటికి వచ్చిన భూమానాగిరెడ్డిని అంబులెన్స్‌లో పోలీసు ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు తరలించారు. -
గోసుల కృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్
హైదరాబాద్: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన గోసుల కృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పరామర్శించారు. కృష్ణారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి స్నేహితుడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చిన జగన్మోహన్రెడ్డి దాదాపు గంట సేపు ఆసుపత్రిలో గడిపారు. కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు కూడా పరామర్శించారు. -
అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటాం
భూదాన్‌పోచంపల్లి : భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుం టామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి వేదిక వద్ద ఏర్పాటు చేసిన అభినందన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలి పారు. నవ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు చెప్పారని, వాస్తవానికి రూ.4కోట్లు కూడా లే వని అన్నారు. నిమ్స్, నియోజకవర్గంలోని బునాదిగాని, పిలాయిపల్లి కాలువలను వెంటనే పూర్తిచేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చేనేత రుణమాఫీతోపాటు, బ్యాంకుల ద్వారా కొత్తరుణాలు ఇప్పించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. బీబీనగర్ నిమ్స్‌ను ఆది వారం ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య సందర్శించనున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ సర్పంచ్‌లు... దంతూర్, ఇంద్రియాల, గౌస్‌కొండ, జూలూరు, దోతిగూడెం గ్రామాల టీడీపీ సర్పంచ్‌లు బత్తుల శ్రీశైలం, బండి కృష్ణ, రమావత్ లక్ష్మయ్య, గోదాసు విజయలక్ష్మిపాండు, బాలెం మల్లేష్లతోపాటు ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే పోచంపల్లి2, జూలూరు స్వతంత్ర ఎంపీటీసీలు కర్నాటి రవీందర్, బండారు లలిత కూడా టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయం ప్రారంభం..... మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డితో కలిసి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. అనంతరం మార్కేండేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్ కళాబృందంచే నిర్వహించిన తెలంగాణ ధూం.. ధాం అలరించింది. కళాకారులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే సైతం డ్యాన్స్ చేసి ఆక ర్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, చంద్రం, భిక్షపతి, రామాంజనేయులు, కందాడి రఘుమారెడ్డి, పొనమోని శ్రీశైలం, ఐలయ్య, సిలువేరు బాలు, ఆర్ల వెంకటేశం, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
అక్రమాలకు నిలయమైన నిమ్స్
ఆస్పత్రి అకౌంట్స్ నిర్వహణపై ఆడిట్ విభాగం అభ్యంతరం వైద్య పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపు పనుల్లో అవినీతే కారణం సాక్షి, సిటీబ్యూరో : గత కొంతకాలంగా ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) అవినీతికి నిలయంగా మారింది. కొంతమంది అధికారులు రోగుల సొమ్మును పందికొక్కుల్లా మింగేస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోళ్లు, అకౌంట్స్ నిర్వహణ, బకాయిల వ సూళ్లు, చెల్లింపుల్లో భారీఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం టెండర్ కూడా పిలవకుండానే ఇష్టం వచ్చినట్లు నిర్మాణపు పనులు కేటాయించడం, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ఆస్పత్రికోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. గత 13 నెలల నుంచి ఆస్పత్రి ఆదాయ, వ్యయాలపై ఆడిట్స్ నిర్వహించకపోగా, ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్ ప్రభుత్వానికి సమర్పించిన బిల్లుల్లో అన్ని లోపాలే ఉన్నట్లు విజిలెన్స్ విభాగం స్పష్టం చేసింది. అన్ని అవకతవకలే... బీబీనగర్‌లో రూ.93 కోట్లతో, నిమ్స్‌లో రూ.100 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ, ట్రామాకేర్ బ్లాక్‌లను నిర్మించారు. రూ.3 కోట్లతో మిలీ నియం బ్లాక్ నిర్మించారు. మిలీనియం బ్లాక్‌తో పాటు బీబీనగర్ నిమ్స్ నిర్మాణపు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. సూపర్ స్పెషాలిటీ, ట్రామా బ్లాక్ నిర్మాణ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా టెండర్లో ఐదు శాతం ఎక్కువ కోడ్ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. అప్పటి డెరైక్టర్ ప్రసాదరావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, ఫైనాన్సియల్ కంట్రోలర్ శ్రీధర్, టెక్నికల్ అడ్వైజర్ మజారుద్దీన్, ఇంజనీర్ సమ్‌దానీలపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని ఇటీవల ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నిమ్స్ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించడం విశేషం. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై వేటు నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై ఆస్పత్రి యాజమాన్యం శనివారం వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వ హణ, అకౌంట్స్, ఆడిటింగ్‌లో లోపాలకు ఆయన్ను బాధ్యుడిని చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి ఆయన పంపిన ఆడిట్స్‌పై విజిలెన్స్ విభాగం అనేక అభ్యంతరాలు చెప్పడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వల్లే ఈ పని చేయాల్సి వచ్చిందని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాధ్ స్పష్టం చేశారు. -
ఇదో! డబ్బు గబ్బు
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుధాకర్ తన భార్యకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో నిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు. పరిస్థితి ప్రమాధకరంగా ఉండడంతో రూ. 5 వేలు చెల్లించి అడ్మిట్ చేశాడు. మూడు రోజుల తర్వాత బిల్లు రూ. 50 వేలు అయింది అని చెప్పడంతో డ్రైవర్‌గా పనిచేసే తన వద్ద అంత డబ్బులేదు.. ఎస్టిమేషన్ వేసి ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బును సమకూర్చుకుంటానని డాక్టర్‌కు చెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన వైద్యుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే తమ ఆసుపత్రి ఈ దుస్థితి ఎదుర్కొంటోందని అదే అడ్మిట్ చేసే సమయంలో చెబితే...ఏ గాంధీకో లేదా ఉస్మానియాకో పంపేవాణ్ని కదా అంటూ రోగి సహాయకులపై విరుచుకుపడ్డాడు. డబ్బులు లేనివాడివి నిమ్స్‌కు ఎందుకు వచ్చావ్.? అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం సుధాకర్ ఒక్కరికే కాదు ఇలా ప్రతి రోజు అన్ని డిపార్ట్మెంట్లలో ఎందరో రోగులకు ఎదురౌతోన్న పరిస్థితి ఇది. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి రోగులను చేర్చుకోవడానికి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే రోగులకు మాత్రం వెంటనే బెడ్లు మంజూరు చేస్తూ వైద్యం అందిస్తున్నారు. అదే ప్రభుత్వ పథకాలు ఉన్న రోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పగా చెప్పుకునే నిమ్స్‌లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. ఇక ఓపీల విషయానికి వస్తే ఉదయం ఓపీల్లో వైద్యులు 8 గంటలకు రావాల్సి ఉండగా చాలా మంది వైద్యులు 11, 12 గంటలకు కూడా రావడం లేదు. ఉదయం ఓపీల్లో పేద రోగులకు కేవలం రూ. 50కే చూడాల్సి రావడమే కారణం. అదే సాయంత్రం ఓపీల్లో మాత్రం రూ. 300లు వసూలు చేసి, అందులో 150 నిమ్స్‌కు, మరో 150 వైద్యుని ఖాతాలో జమ చేస్తుంటారు. దాంతో అందరూ వైద్యులు సాయంత్రం ఓపీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దాంతో పేద రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులు బయట మెడికల్ షాపులతో సంబంధాలు పెట్టుకొని కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని స్వయంగా నిమ్స్ ఉద్యోగులే అంటున్నారు. తాను సూచించిన మెడికల్ షాపులోనే ఈ మందులు దొరుకుతాయి. అక్కడే తీసుకోవాలి అని సూచిస్తున్నట్లు తెలిసింది. అవినీతిని రూపుమాపి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని నిమ్స్ ఉన్నతాధికారులు పేర్కొంటుంటారు. వారు తమ ఆసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రోగులు, రోగుల సహాయకులు కోరుతున్నారు. -
గవర్నర్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆయనకు 11.35 దాకా వైద్యులు పలు పరీక్షలు జరిపారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్‌తో పాటు డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ లిజా రాజశేఖర్ గవర్నర్‌కు వైద్య సేవలు నిర్వహించారు. నిమ్స్ పాత భవనంలో సిటీ స్కాన్, కొత్తగా కట్టిన స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో పల్మనరి ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్‌టీ) జరిగాయి. సాధారణ రక్త పరీక్ష తదితరాలు కూడా జరిపారు. -
నిమ్స్‌కు సుస్తీ
న్యూరో, యూరో విభాగంలో పేషెంట్ల పడిగాపులు సీటీసర్జరీ, స్పైన్ విభాగాల్లో పని చేయని యంత్రాలు మృత్యువాత పడుతున్న క్షతగాత్రులు, హృద్రోగులు సాక్షి, సిటీబ్యూరో : మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.వెంకటయ్య ప్రమాదవశాత్తూ నిద్రలో మంచంపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతి ంది. చికిత్స కోసం రెండు రోజుల క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో సియరమ్ పరికరం పనిచేయడం లేదని, శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేయడంతో మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శౌరిని చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సీటీ సర్జరీ(కార్డియో థొరాసిక్) విభాగంలో ఛాతీపై కోత కోసే ఓ చిన్న యంత్రం పాడైపోవడంతో సకాలంలో చికిత్స అందక ఆయన ఇటీవల నిమ్స్ ముందే మృతి చెందారు. చిన్నచిన్న వైద్య పరికరాలు పని చేయడం లేదనే సాకుతో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు, హృద్రోగులకు చికిత్సకు నిరాకరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోమాలో స్పైన్ విభాగం సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. వీరి లో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెల రోజుల క్రితం పాడైపోయింది. రిపేరు చేయించే అవకాశం ఉన్నా సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్యపరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. యూరో, న్యూరో సేవల్లో తీవ్ర జాప్యం ఇక తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధపడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూ డా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తుండటం తో వీరంతా నిమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీ చేయించుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. హృద్రోగులకు సర్జరీ చేసే సీటీ విభాగంలో ఛాతీపై కోత కోసే మిషన్ పనిచేయక పోవడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్జరీ చేయక పోవడంతో హృద్రోగంతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగాలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేక పోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఇక్కడ రోగులకు పడకలు కూడా దొరకడం లేదు. -
గదులపై బాదేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులకు పెద్ద దిక్కైన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు మోత మోగించనున్నాయి! అక్కడకు వెళ్లాలంటేనే వణుకు పుట్టేలా గదుల చార్జీలు పెంచి రోగుల నడ్డి విరిచింది. నిమ్స్‌లో వైద్యసేవలు ఇక ఖరీదు కానున్నాయి. ఆస్పత్రికి ఆన్లైన్ హంగులు, అంతర్గత ఆదాయాన్ని పెంచేందుకు రోగులు చికిత్స పొందే గదుల అద్దెలను భారీగా పెంచుతూ ఆస్పత్రి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి అధ్యక్షతన శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తాజా నిర్ణయం వల్ల కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేద, మధ్యతరగతి రోగులపై 3 రెట్ల భారీ భారం పడింది. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు (మంచినీరు, మరుగుదొడ్లు, శానిటేషన్, నర్సింగ్, ల్యాబ్ సర్వీసులు) మెరుగుపర్చకుండా రోగులు విశ్రాంతి తీసుకునే పడకల చార్జీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ నిర్ణయాలు... నిమ్స్ ఆస్పత్రిలో పనిలో పారదర్శకత కోసం సిడాక్ సహకారంతో రూ.13.7 కోట్లతో ‘హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. దీనిద్వారా మందులు, ఇతర యంత్ర పరికరాల కొనుగోలు, అమ్మకాలు, ఓపీ, ఐపీ రోగులు, ఏ విభాగంలో ఎంత మంది వైద్యులు, నర్సులు పని చేస్తున్నారు? ఎంత మంది చికిత్స పొందుతున్నారు తదితర వివరాలతో పాటు మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఏ ఆస్పత్రికైనా 30% ఆదాయం ఫార్మసీ నుంచే ఇప్పటి వరకు ఆస్పత్రిలో ఫార్మసీ లేకపోవడం వల్ల రోగులు బయటి మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో నిమ్స్ ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్స్‌లో సొంత ఫార్మసీని నెలకొల్పాలని నిర్ణయించారు. జనరిక్ మందులతో పాటు రోగుల అవసరాల దృష్ట్యా బ్రాండెడ్ ఔషధాలు కూడా విక్రయిస్తారు. పారదర్శకత కోసం ఫార్మసీలో స్టాక్, విక్రయాల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఇకపై వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల జారీలో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు. ట్రామా కేర్‌లో చికిత్స పొందుతున్న రోగుల కోసం అక్కడే మరో ల్యాబ్ ఏర్పాటు. ల్యాబ్‌లను ఆధునీకరించి ఆన్లైన్ ద్వారా నేరుగా ఆయా విభాగాలకు వైద్య పరీక్ష నివేదికలు జారీ. ఉద్యోగులు ఆర్జిత సెలవులు(ఈఎల్స్) ఎన్‌క్యాష్ చేసుకునేలా సవరణ. బీబీనగర్ నిమ్స్‌లో మధ్యలో నిలిచిపోయిన పనులను తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తయారు చేశారు. వచ్చే నవంబర్ నాటికి కనీసం 200 పడకల ఆస్పత్రినైనా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. ఇతర ఆస్పత్రులతో పోలిస్తే తక్కువే.. నిమ్స్‌కు వస్తున్న రోగుల్లో 40 శాతం మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులు కాగా మరో 40 శాతం మంది సీజీహెచ్ఎస్ కార్డుదారులున్నారు. 20 శాతం మంది మాత్రమే డబ్బు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు. సీజీహెచ్ఎస్ పథకంలో బెడ్ చార్జీ రూ.1000 చెల్లిస్తుంటే నిమ్స్ లో రూ.200 మాత్రమే ఉంది. టారిఫ్‌లో వ్యత్యాసం వల్ల ఆస్పత్రి భారీగా నష్టపోవాల్సి వస్తోంది. సామాన్యులను, ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 12 ఏళ్ల తర్వాత అద్దెలను సవరించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సేవలను మరింత మెరుగుపరిచి అంతర్గత వనరుల నుంచి ఆదాయం సమకూర్చుకోవటంపై ఉద్యోగుల అభిప్రాయాలు కోరాం. ఇందులో 17 సూచనలు వచ్చాయి. అందరి ఆలోచన ప్రకారమే చార్జీలు పెంచాం. ఇవి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే 50 శాతం తక్కువే. - డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ డెరైక్టర్ రూ.3,000 చెల్లిస్తే 15 పరీక్షలు ‘మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీ’లో భాగంగా నిమ్స్ ఆస్పత్రి రూ.3,000కు పలు పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ పిక్చర్, ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ అబ్డామల్, షుగర్, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటిన్, సీరమ్ క్యాల్షియం, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2 డీ ఎకో, లివర్ ఫనితీరు, థైరాయిడ్, బ్లడ్ గ్రూప్ లాంటి పరీక్షలతో పాటు జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నారు. సత్వర సేవల కోసం ల్యాబ్‌లోని యంత్రాల్లో కొన్నింటిని పూర్తిగా వీరి అవసరాలకే కేటాయించారు. నిమ్స్ ఆస్పత్రిలో గదుల రేట్లు(రోజుకు రూ.ల్లో) విభాగం పాత చార్జీ కొత్త చార్జీ జనరల్ వార్డు 200 600 ట్రిపుల్ షేరింగ్ 400 800 నాన్ ఏసీ గది 800 1,200 ఏసీ షేరింగ్ గది 1,200 2,000 ఏసీ సింగిల్ గది 2,000 3,000 ఐసీయూ చార్జీలు 1,500 3,000 -
ఆస్పత్రి నుంచి ఇంటికి జగన్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిగా కోలుకోవడంతో శనివారం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే ఆయన ఇంకా బాగా నీరసంగా ఉన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ ఉదయం నుంచి జగన్మోహన్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పోలీసులు జగన్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించడమే కాకుండా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కీటోన్స్(గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వు శక్తి రూపంలో వినియోగం అవుతున్నపుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) ప్రమాదకర స్థాయికి చేరుకున్న దశలో ఆయనను ఆస్పత్రికి తరలించగా రెండు రోజులుగా అందుతున్న చికిత్స నేపథ్యంలో కీటోన్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని వైద్యులు చెప్పారు. అలాగే రక్తంలో చక్కెర నిల్వలు, రక్తపోటు, సోడియం నిల్వలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు నిమ్స్ వైద్యులు డాక్టర్ లక్ష్మీ భాస్కర్ చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, యాంటీ బయాటిక్స్ మందులు వాడుతూ కచ్చితంగా కనీసం మూడు రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావొచ్చని సూచించామని, అయితే తప్పనిసరిగా విశ్రాంతి అవసరమని అన్నారు. వరుస దీక్షలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. దాదాపు నెల రోజుల తేడాతోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జగన్ ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపినట్టు వైద్యులు తెలిపారు. ఇకముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దీక్షలు చేయరాదని వారించారు. జగన్‌ను డిశ్చార్జి చేసిన అనంతరం నిమ్స్ వైద్యుడు లక్ష్మీ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ జగన్ దాదాపు పూర్తిగా కోలుకున్నారని, ఇక నివాసానికి వెళ్లవచ్చని చెప్పామన్నారు. జగన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినపుడు ఆయన సతీమణి వైఎస్ భారతి వెంట ఉన్నారు. జగన్ డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు కొణతాల రామకృష్ణ, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు రంగారెడ్డి జిల్లా నేతలు ఉదయం నిమ్స్ వద్దకు వచ్చారు. -
నిమ్స్‌లో కోలుకుంటున్న జగన్
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఐదురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నిమ్స్‌లో కోలుకుంటున్నారు. కీటోన్స్ మినహా చక్కెర స్థాయి, యూరియా తదితరాలు అన్నీ సాధారణ స్థితికి వచ్చినట్లుగా శుక్రవారంనాటి వైద్యపరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసిన అనంతరం నిమ్స్ వైద్యులు డా.లక్ష్మీభాస్కర్, డా.నాగేశ్వరరావు, డా.వంశీ తదితరులు మీడియాతో మాట్లాడారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని చెప్పారు. కీటోన్స్ ప్రమాదకర స్థాయి నుంచి తగ్గాయని, త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. శ్వాసకోశ సంబంధిత సమస్య (రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్) ఉండటంతో రోగనిరోధక మందులు ఇస్తున్నామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఐవీ ఫ్లూయిడ్స్ మాత్రమే ఇచ్చామని, అయితే త్వరగా కోలుకోవడంతో పాటు శరీరంలో కీటోన్స్ తగ్గేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించామన్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి పళ్లరసాలు ఇస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సుగర్ నిల్వలు 101గా ఉన్నట్టు, కీటోన్స్ నిమ్స్‌లో చేరిన రోజు 4 ప్లస్ ఉండగా, ఇప్పుడు 1ప్లస్‌కు చేరినట్టు పరీక్షల్లో తేలింది. కీటోన్స్ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి శనివారం జగన్‌ను డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు. జగన్‌కు కుటుంబ సభ్యులు, పార్టీ నేతల పరామర్శ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జగన్మోహన్రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు శుక్రవారం పరామర్శించారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు, సోదరి షర్మిలతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, మాజీ మంత్రి పి.విశ్వరూప్ తదితరులు పరామర్శించినవారిలో ఉన్నారు. -
వెనువెంటనే దీక్షతో తీవ్ర దుష్ర్పభావం
* వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యంపై నిమ్స్ వైద్యులు * కీటోన్స్ స్థాయి ఇంకా ఆందోళనకరం * సాధారణ స్థితికి రావాలంటే సమయం పడుతుంది సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెను వెంటనే రెండుసార్లు నిరాహార దీక్ష చేపట్టడంతో అది ఆయనఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపిందని నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగన్మోహన్రెడ్డిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి బలవంతంగా నిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి నెల రోజుల కిందట దీక్ష చేసినప్పుడే కీ టోన్స్(గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తిరూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) ఎక్కువగా ఉన్నాయని, తిరిగి నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్స్ విడుదల కావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ప్రస్తుతం కీటోన్స్ అధికంగా ఉన్నాయని(బుధవారం రాత్రి నిమ్స్‌కు వచ్చే సమయానికి కీటోన్స్ 4 ప్లస్‌గా ఉన్నాయి) అవి తగ్గడానికి సమయం పడుతుందని అన్నారు. పళ్లరసాలు తీసుకోవాలని సూచన.. వైద్య పరీక్షల అనంతరం సుగర్ లెవల్ 113కు పెరిగిందని, (నిమ్స్‌కు తీసుకొచ్చే సమయానికి సుగర్ లెవల్ 54గా ఉంది) సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, ఇంకా ఆయన ఎలాంటి ఆహారమూ తీసుకోవడం లేదని, పళ్లరసాలు తదితరం ఏవైనా (ఓరల్ ఫ్లూయిడ్స్) తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తిరిగి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, త్వరగా కోలుకునేందుకు తాము కృషి చేస్తున్నామని వైద్య బృందం పేర్కొంది. ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వలన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందని ఓ వైద్యుడు పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడం, పల్స్ రేటు, రక్తపోటు తదితరాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తెలిపారు. పదే పదే కీటోన్స్ శరీరంలో విడుదల అవుతుండటం భవిష్యత్‌లో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సీనియర్ వైద్యులొకరు ‘సాక్షి’తో అన్నారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు డా. ఎం.నాగేశ్వరరావు(జనరల్ మెడిసిన్), డా.శేషగిరిరావు(కార్డియాలజీ), డా.గంగాధర్(నెఫ్రాలజీ), డా.లక్ష్మీభాస్కర్ తదితరులు జగన్మోహన్రెడ్డిని పర్యవేక్షిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకే డిశ్చార్జి: వైఎస్ భారతి వైద్య పరీక్షల ఫలితాలు, వైద్యుల నిర్ణయం తర్వాతే వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిశ్చార్జి చేస్తారని ఆయన సతీమణి వైఎస్ భారతి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రిలో గురువారం జగన్‌ను భారతి పరామర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పలు జాతీయ టీవీచానళ్ల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. ‘‘దీక్ష భగ్నం సమయంలో కీటోన్ బాడీస్ అత్యంత ఉన్నతస్థాయికి చేరాయి. రక్తంలో చక్కెర స్థాయి 50కి పడిపోయింది. అనంతరం వైద్యులు జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నుంచి రక్తం నమూనాలు సేకరించారు. ఈ ఫలితాల వచ్చిన తర్వాత రేపు(శుక్రవారం) ఉదయం డిశ్చార్జిపై నిర్ణయం ఉంటుంది’’ అని ఆమె తెలిపారు. -
జగన్‌కు రాత్రి వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కించారు-YS భారతి
-
మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణ రెడ్డి కన్నుమూత
న్యూస్‌లైన్, పీలేరు : పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ యోధుడు, పీలేరు మాజీ ఎమ్మెల్యే సీకే. నారాయణరెడ్డి(85) ఇకలేరన్న వార్త పీలేరు ప్రజలను కలచివేసింది. 1962 నుంచి 1967 వరకు పీలేరు ఎమ్మెల్యేగా పని చేసిన నారాయణరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ శుక్రవారం పరమవదించారు. రొంపిచెర్ల క్రాస్ చల్లావారిపల్లెకు చెందిన నారాయణరెడ్డి భారత కమ్యూనిష్టు పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి 1962లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. తన పదవీ కాలంలో పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. పీలేరు పట్టణంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషిచేయడంతోపాటు పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా హాస్టల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన ఆహార పదార్థాలను దాతల నుంచి సేకరించి హాస్టల్‌ను నిర్వహించేవారు. ఆయన సతీమణి జయప్రద బీఎడ్ సైన్స్ అసిస్టెంట్ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసి ఆదర్శ ఉపాధ్యాయినిగా గుర్తింపు పొందారు. రాజకీయ నేతల ఒత్తిళ్ల ప్రభావంతో పదేపదే బదిలీలకు గురవుతుండడంతో మనస్తాపం చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం భార్యభర్తలు హైదరాబాద్‌లో స్థిరపడి అక్కడ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి విద్యాసంస్థ ఏర్పాటు చేశారు. దీంతోపాటు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరుతో అనేక సాహితీ ప్రచురణలను ముద్రించి సామాన్య పాఠకులకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు. స్వతహాగా ఆయనిది జమీందారీ కుటుంబం అయినప్పటికీ తన ఆస్తులన్నీ పేదలకు దానం చేశారు. నారాయణరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గౌతమ్, కోడలు ఇరువురూ వైద్యవృత్తిని స్వీకరించి మదనపల్లెలో వైద్యసేవలందించేవారు. 90వ దశకంలో బెంగళూరులో జరిగిన సార్క్ సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద కుమార్తెను అనంతపురంలో ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె హైదరాబాద్ డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఆమె వద్ద వృద్ధ దంపతులు ఉంటున్నారు. సీకే. నారాయణరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే శాసనమండలి సభ్యులు యండ పల్లె శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వి. సిద్దరామిరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో నారాయణరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
‘సాక్షి’తో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎల్.నరేంద్రనాథ్
సాక్షి, సిటీబ్యూరో : ‘ఆపదలో ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి వైద్యం అందించడమే మా లక్ష్యం. పేషంట్ కేర్‌కు పెద్దపీట వేస్తాం. వైద్యులందరి సహకారంతో ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయికి తీసుకెళ్తాం. అత్యవసర విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రోగులను ఆదుకుంటాం’ అని ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డెరైక్టర్ పద్మశ్రీ ఎల్.నరేంద్రనాథ్ స్పష్టం చేశా రు. నిమ్స్ డెరైక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నరేంద్రనాథ్ గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...! ఆస్పత్రిలో మొత్తం 1030 పడకలు ఉండగా, ఆక్యుపెన్షీ రేషియో మాత్రం 80 శాతానికి మించడం లేదు. అంటే సుమారు 200 పడకలు వినియోగానికి నోచుకోవడం లేదు. పడకల కొరత పేరుతో అత్యవసర విభాగంతోపాటు న్యూరో, యూరాలజీ విభాగాల్లో కొత్త రోగులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. నిజానికి ఏ వార్డుల్లో ఎన్ని పడకలు ఉన్నాయి? వాటి వినియోగం? తదితర అంశాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. వార్డుల్లో ఖాళీగా ఉన్న పడకలను రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న విభాగాలకు తరలిస్తాం. పడకల కొరత లేకుండా చూస్తాం. రోగుల బంధువులకు మరుగుదొడ్ల ఏర్పాటు ఆస్పత్రిలో నిత్యం వెయ్యిమందికి పైగా చికిత్స పొందుతుంటే వారికి సాయంగా వచ్చిన మరో 1500 -2000 మంది ఆస్పత్రి బయటే పడిగాపులు కాయాల్సి వస్తోంది. వీరికోసం ఈ నెలాఖరుక ల్లా అవసరమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తాం. ప్రతి వార్డులోనూ ఫ్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేసి మంచినీటి కొరతను తీరుస్తాం. ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి ఇక్కడ చికిత్స పొందుతున్న రోగుల్లో 80-90 శాతం మంది ఆరోగ్యశ్రీ బాధితులే. రాష్ట్రంలో ఏ ఆస్పత్రీ ఇంతమంది రోగులకు సేవ చేయడం లేదు. కానీ కొంతమంది ఇక్కడ ఉచిత పరీక్షలు చేయించుకుని, రిపోర్టులు వచ్చిన తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఆస్పత్రి విలువైన సమయంతోపాటు ఆదాయాన్నీ కోల్పొవాల్సి వస్తోం ది. రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడం లేదనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి రోగుల ఆరోగ్యం కాపాడటమే కాదు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. ప్రభుత్వం గత రెండేళ్లుగా వార్షిక బడ్జెట్లో ఆస్పత్రికి రూ.50 కోట్లకు పైగా కేటాయిస్తుండగా, అంతర్గత రోగుల నుంచి నెలకు మరో రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతుంది. సిబ్బం ది నెలసరి వేతనాలకు రూ.8 కోట్లు, నిర్వహణ ఖర్చులకు మరో రూ.2 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిం చి ప్రస్తుతం వారి నుంచి సమకూరుతున్న ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. స్థానికులకే ప్రాధాన్యం బీబీనగర్ నిమ్స్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. స్థానికుల అవసరాలకే ఇక్కడ తొలి ప్రాధాన్యం. ఇక్కడ ఒక రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు ట్రామా కేర్ యూనిట్‌తో పాటు గ్రామీణ మహిళల అవసరాల కోసం ఓ గైనిక్ వార్డును సైతం ఏర్పాటు చేస్తాం. స్థానికుల అవసరాలు పూర్తిగా తీర్చిన తర్వాతే ఈ క్యాంపస్‌ను ఇతర అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శక పాలన వైద్య పరికరాలు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, మోకాలి మార్పిడి చిప్పల కొనుగోళ్ల వ్యవహారంపై గతంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన మాట వాస్తవమే. ఇకపై ఏ చిన్న విమర్శకూ తావివ్వం. పరిపాలనలో పారదర్శకత కోసం ఇకపై ప్రతి వస్తువు ఆన్లైన్ టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తాం. కొత్త ఉద్యోగుల నియమాకాల్లోనూ ఇదే పద్ధతిని పాటిస్తాం.