Osmania hospital
-
బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్‌లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్‌ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్‌కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్‌లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్‌తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్‌కి ఉస్మానియాలోనే అపెండిక్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్‌లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్‌లు, పాస్‌లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్‌ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్‌గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్‌లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ -
30 ఏళ్ల కల సాకారమవుతోంది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో 30 ఏళ్ల కల సాకారమవుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉస్మానియా ఆస్పతి భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆస్పత్రి నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి.. అంతర్జాతీయ బ్రాండ్అనంతరం గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. వివిధ రకాల కేసులు కోర్టుల్లో ఉండటం వల్ల ఇన్నాళ్లు జాప్యం జరిగిందన్నారు. అఫ్జల్‌గంజ్ ఉస్మానియా ఆస్పత్రి అంటే ఒక అంతర్జాతీయ బ్రాండ్..ప్రజల ఆరోగ్యానికి భరోసా, అటువంటి ఆస్పత్రిని ఈ ప్రాంతానికి దగ్గర్లోనే నిర్మించాలని గోషామహల్ గ్రౌండ్‌ను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా 22 ఎకరాల్లో ఉందని, కొత్త భవన సముదాయానికి 26.32 ఎకరాలు కేటాయించామని, మరో 11 ఎకరాలు గ్రౌండ్ కోసం విడిచిపెట్టామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ, రెసిడెన్స్, ఆడిటోరియం, అకాడమీ అని ఐదు భాగాలుగా విభజించామన్నారు.రాబోయే రెండేళ్లలో పనులు పూర్తి చేసి 2 వేల పడకలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉస్మానియా సంబంధిత 9 ఆస్పత్రులు, మరో 8 కొత్త డిపార్ట్మెంట్లు కలిపి మొత్తం 40 విభాగాలు ఇక్కడ పనిచేస్తాయని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణ వ్యయం రూ.2,700 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాలుగు వైపులా విశాలమైన రహదారులు నిర్మిస్తామని, చిరు వ్యాపారులకు నష్టం లేకుండా అందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాటసారులకు ఇబ్బందులు లేకుండా స్కై వాక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సేవల కోసం హెలీప్యాడ్‌ను నిర్మించనున్నామన్నారు. ఈ శాసనసభలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారని, వారందరికీ ఈ ఆస్పత్రిపై ఆరాటం ఉందన్నారు. -
ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ
-
గోషామహల్ లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై పునరాలోచన చేయాలన్న పురుషోత్తం
-
గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మా'నయా' ఆస్పత్రి
-
సకల హంగులతో ఉస్మానయా
సాక్షి, హైదరాబాద్: కొత్త ఉస్మానియా ఆసుప్రతిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2 వేల పడకలతో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి భవనానికి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ లెవల్ పార్కింగ్ మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ‘ఏ’బ్లాకును నిర్మించనున్నారు. అదే విధంగా 7.81 ఎకరాల్లో ‘బీ’బ్లాకు ను నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో ‘సీ’బ్లాకు, 0.64 ఎకరాల్లో ‘డీ’బ్లాక్, 0.22 ఎకరాల్లో ‘ఈ’బ్లాకును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మిగిలిన స్థలంలో మిగతా బ్లాకులు నిర్మిస్తారు. ఇన్‌పేషంట్, అవుట్ పేషంట్ సరీ్వసులతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యంతోపాటు లాండ్ స్కేపింగ్, గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది. సహాయకులకు ధర్మశాల ఉచిత భోజనం ఓపీ, ఐపీ సేవలతో పాటు క్లిష్టమైన మూత్రపిండాలు, కాలేయం, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్చురీ, ఒకే గొడుగు కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నొస్టిక్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏకకాలంలో 3000–5000 మంది ఒకేచోట కూర్చొనే సామర్థ్యంతో కూడిన వెయిటింగ్ హాల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, దంత వైద్య కళాశాల కూడా ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు రోగుల సహాయకులకు ఉచిత భోజనం సరఫరా చేసే ధర్మశాల కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఫైర్ స్టేషన్, పోలీసు అవుట్ పోస్టు, ఫ్యాకల్టీ రెసిడెన్సీ సహా బోయ్స్, గరŠల్స్ హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త భవన నిర్మాణంతో రోగుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయని తెలంగాణ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ బొంగు రమేష్ నేతృత్యంలోని వైద్య బృందం గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.వ్యతిరేకిస్తున్న స్థానికులు!నిజానికి పురాతన భవనం కూల్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుత ప్రాంగణంలోనే మరో కొత్త భవనం నిర్మించేందుకు అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. కులీకుతుబ్‌షా భవనం నుంచి ధోబీఘాట్ వరకు 8 ఎకరాల విస్త్రీర్ణం అందుబాటులో ఉందని, ఇక్కడ రెండు భారీ టవర్లు నిర్మించవచ్చని అంటున్నారు. ఇందుకు భిన్నంగా చుట్టూ ప్లైవుడ్ గోదాములు, ఇరుకైన రోడ్లతో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతంలో ఉస్మానియా కొత్త భవనం నిర్మించడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు.ఇక్కడ ఆస్పత్రి నిర్మాణాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టుకు ప్రభుత్వం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 104 ఎకరాలు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో కోర్టు రాజేంద్రనగర్‌కు తరలి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు మూసీపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ఈ రెండు వైపులా ఉన్న ఈ రెండు చారిత్రక భవనాలను అనుసంధానించడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. -
గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉన్న దాదాపు 32 ఎకరాల్లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని, ఇందుకు గాను వెంటనే ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులపై తొలిసారిగా మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్పీడ్ ప్రణాళికలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణంతో పాటు కొత్తగా 15 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లకు తగినట్టుగా కొత్త ఆస్పత్రి‘రాబోయే 50 సంవత్సరాల అవసరాలను అంచనా వేసి దానికనుగుణంగా కొత్త ఆసుపత్రి డిజైన్‌ను రూపొందించాలి. ఆసుపత్రి నలుదిశలా రోడ్లు ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలి. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలి. కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు మాత్రమే ప్రధానం కాదు. ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండాలి. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అందుబాటులోకి రావాలి. ఇందుకు గాను అనుభవజు్ఞలైన ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు తయారు చేయించాలి. గోషామహల్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేసినందుకు గాను పోలీసు విభాగానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి. పేట్లబురుజులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీల చుట్టూ ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్సును అక్కడకు తరలించేలా చూడాలి. రాష్ట్రంలో కొత్త ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. 15 నర్సింగ్ కళాశాలల భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలి. కళాశాలలను తాత్కాలికంగా అద్దె భవనాల్లో నిర్వహించాలి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా హెరిటేజ్ కట్టడాలు గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎస్‌హెచ్‌జీలకు కొత్త భవనాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు భవనాలు లేని 22 జిల్లాల్లో కొత్త భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి జిల్లా సమాఖ్యకు ఎకరం భూమి కేటాయించేందుకు అంగీకరించిన సీఎం.. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడెకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని, మహిళా శక్తి సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను అక్కడ ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎగ్జిబిషన్ తరహాలో వివిధ రకాల ఉత్పత్తులను అక్కడ అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. -
ఏదయా.. ఉస్మా‘నయా’
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణంతో పాటు ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పేద రోగుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేబూని పెద్దపెట్టున నినదించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే సచివాలయ నిర్మాణం ఎలా పూర్తయిందని ప్రశ్నించారు. పాతబస్తీలోని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒవైసీ సోదరులు ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అయిదు రోజుల పాటు వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు పల్లం ప్రవీణ్, బొంగు రమేష్, అజ్మీరా రంగా, లాలూ నాయక్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. – అఫ్జల్‌గంజ్ -
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్‌చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్‌లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
రవీందర్‌కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్‌కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్‌కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించిన గవర్నర్ తమిళసై (ఫొటోలు)
-
మా మంచి పనులు ఎందుకు కన్పించవు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధిలాగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్ కోఠి లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరం. భవన నిర్మాణంపై మొదట స్పందించింది ముఖ్యమంత్రి కేసీఆరే. 2015 జూలైలో సీఎం ఆసుపత్రిని సందర్శించారు. నూతన భవన నిర్మాణానికి అప్పుడే రూ.200 కోట్లు ప్రకటించారు. అయితే ఆగస్టు 5వ తేదీన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. అందువల్ల అది ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ ఐఐటీ నిపుణులు, పురావస్తు శాఖ డైరెక్టర్‌తో ప్రభుత్వం స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ ఆసుపత్రి నిర్వహణకు భవనం పనికిరాదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం కోర్టుకు ఇదే విషయం చెప్పింది. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. అది రాగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురద జల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న మంచి పనులు గవర్నర్‌కి కని పించవా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాం.. అది గవర్నర్‌కి కనిపించదు. ‘‘మంచి కనబడదు.. మంచి వినబడదు.. మంచి చూడం’’అన్నట్టుగా గవర్నర్ తీరు ఉంది..’అని హరీశ్‌రావు విమర్శించారు. చెడు మాత్రమే చూస్తామంటే ఎలా? ‘గవర్నర్ తీరులో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైద్యురాలిగా గవర్నర్ వైద్య ఆరోగ్యశాఖ కష్టాన్ని గుర్తించడం లేదు. 2014తో పోల్చితే పరిస్థితి మారింది. నీతి ఆయోగ్ నివేదికలో వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నిమ్స్‌లో పడకల సంఖ్యను 1,500కు పెంచాం. కొత్తగా 2,000 పడకలతో విస్తరిస్తున్నాం. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను తగ్గించాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచాం. దేశంలో 100 శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. కంటి వెలుగు చాలా బాగా చేశాం. ఇవేవీ గవర్నర్ గుర్తించరు. ప్రశంసించడానికి మనసు రాదు. అభినందిస్తూ కనీసం ఒక ట్వీట్ కూడా చేయరు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్ దవాఖానకు అనే స్థాయికి చేర్చాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102కు పెంచాం. గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నారు. బస్తీ దవాఖానాలను కూడా నీతి అయోగ్ ప్రశంసించింది. ఇవేమీ గవర్నర్‌కు ఎందుకు కనిపించండలేదు? ఎందుకు అభినందించరు? ఎందుకు స్పందించరు? ఒక డాక్టర్గానైనా గవర్నర్ అభినందించాలి కదా? వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? ప్రశంసిస్తే మేమింకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా? అలా కాకుండా చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే మాట్లాడతాం అన్నట్టుగా వ్యవహరించడం గవర్నర్‌కు తగదు. బీజేపీలా రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరం..’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో పారా మెడికల్ స్టాఫ్ ఆందోళన
-
సీజే ఉజ్జల్ భుయాన్: చలించి... మానవత్వాన్ని చాటి...
చార్మినార్(హైదరాబాద్): రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రాంతం అది. రెండు నెలలుగా ఓ మతిస్థిమతం లేని వ్యక్తి ఆ ప్రాంతంలోని రోడ్డుపై తిండిలేక దీనావస్థకు చేరాడు. నడలేని స్థితిలో ఉన్న అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అతన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మదీనా సర్కిల్ ఫుట్‌పాత్‌పై గురువారం అతన్ని చూసి చలించిపోయారు. చింపిరి తల, మాసిన దుస్తులతో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాదికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్దన్రెడ్డిని సీజే ఆదేశించారు. స్పందించిన గోవర్దన్‌రెడ్డి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిటీ సివిల్ కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి కె.మురళీమోహన్ను కోరారు. అలాగే ఇదే విషయంపై సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ రేణుక యారా సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురళీమోహన్‌తో పాటు మీర్‌చౌక్ పోలీసులు అక్కడికి వచ్చి అతనికి కొత్త దుస్తులు వేసి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌గా గుర్తింపు... అతన్ని ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన గనెగోని శ్రీనివాస్‌గా గుర్తించారు. అవివాహితుడైన అతనికి ప్రవీణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు సోదరులున్నారన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్.. ప్రవీణ్ జీఎస్ఐ కార్యాలయంలో పని చేస్తున్నారంటూ శ్రీనివాస్ ఒక పేపర్‌పై రాసి చూపించాడు. కుటుంబ తగాదాల కారణంగా తాను ఇంటి నుంచి వచ్చేసి 2 నెలలుగా మదీనా సెంటర్ వద్ద ఉన్నానని పేర్కొన్నాడు. -
మళ్లీ ‘కు.ని.’ కలకలం.. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఘటన?
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి/షాద్‌నగర్‌రూరల్: పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళ ప్రసవానంతరం తీవ్ర అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో బంధువులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిందంటూ గురువారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మహిళకు సిజేరియన్ మాత్రమే జరిగిందని, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయలేదని ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటన మరవకముందే ఈ ఉదంతం చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రెండురోజులు ఆరోగ్యంగానే.. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మొగలిగిద్ద గ్రామానికి చెందిన సురేందర్ భార్య అలివేలు (26) ఈ నెల 4వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభు త్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. శిశువు కాళ్లు అడ్డం తిరిగి ఉండటంతో వై ద్యులు సిజేరియన్ ఆపరే షన్ నిర్వహించగా మగ శిశు వుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2 రోజులు ఆరోగ్యంగానే ఉన్న అలివేలుకు జ్వరం వచ్చి తగ్గింది. 7వ తేదీన తిరిగి జ్వరం, వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గు రి కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందింది. అయితే పేట్లబురుజు ఆసు పత్రిలో సిబ్బంది.. ప్రసవానంతరం అలివేలుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు భర్త సంతకాలు తీసుకోవడంతో, ఆ ఆపరేషన్ వల్ల నే ఆమె మరణించిందంటూ బంధువులు ఆ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. కు.ని ఆపరేషన్ జరగలేదు: ఆసుపత్రి సూపరింటెండెంట్ అలివేలుకు వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి తెలిపారు. ప్రసవానంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, అలివేలుకు కు.ని శస్త్రచికిత్స చేయలేదని స్పష్టం చేశారు. అయితే రెండురోజుల తర్వాత అనారోగ్యానికి గురైందని, ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. అలివేలుకు కోవిడ్ పరీక్ష కూడా నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే రోజు 40 ప్రసవాలు కాగా.. అందులో 16 ఆపరేషన్లు జరిగినట్లు ఆమె తెలిపారు. అలివేలు మృతికి వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అయి ఉండవచ్చునని ఉస్మానియా వైద్యులు పేర్కొన్నారు. మహిళ మృతి కలకలం సృష్టించడంతో గురువారం డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. కు.ని ఆపరేషన్ కారణం కాదు ఆ మహిళ డెలివరీ కోసం ఆసుపత్రిలో జేరింది. సిజేరియన్ సెక్షన్లో వైద్యులు ఆపరేషన్ చేశారు. అంతే తప్ప ఆమెకు కు.ని ఆపరేషన్ చేయలేదు. అయితే రెండవరోజు కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. – డా.కె.రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకుడు -
Hyderabad: ఉస్మానియా.. ఆస్పత్రికి పనికిరాదు
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉంది. ఇప్పడున్న పరిస్థితుల్లో ఆస్పత్రి కొనసాగింపునకు పనికిరాదు. పునరుద్ధరణ, మరమ్మతులు చేస్తే భవన జీవితకాలం కొన్నేళ్లు పెంచొచ్చు. ఆ తర్వాత ఆస్పత్రి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. వారసత్వ భవన జాబితాలో ఉన్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఆక్సిజన్ పైప్లైన్లు, గ్యాస్ లైన్లు, ఏసీలు, వాటర్ పైప్లైన్ల లాంటివి ఏర్పాటు చేస్తే దాని భవన ధృడత్వం మరింత దెబ్బతింటుంది’.. ఇదీ ఉస్మానియా ఆస్పత్రి భవన ధృడత్వంపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక. కాగా, ఉస్మానియా ఆసుపత్రిని అదే భవనంలో కొనసాగించాలని కొందరు.. ఆ భవనంలో వద్దని మరికొందరు కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్లు) దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలో హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎంత బలంగా ఉందో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలు, జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్లతో కమిటీ వేసింది. వరంగల్ ఎన్ఐటీ నిపుణుల సాయంతో ఆస్పత్రి భవనాన్ని గత మార్చి 19న పరిశీలన, పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కమిటీలో అందరూ స్టేట్ ఆఫీషియల్స్ ఉండటంతో హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్, ఆర్కెయాలజీ ఆఫ్ ఇండియా ఎస్ఈ, స్టెడ్రంట్ టెక్నోకక్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు కమిటీలో స్థానం కల్పించింది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. నివేదిక అధ్యయనానికి గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం.. నివేదిక ప్రతులను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ అందజేయాలని సూచించింది. దానిపై అధ్యయనం చేసి.. ఆగస్టు 25కు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. -
8 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి.. పురిటి నొప్పులతో తల్లడిల్లి.. కూతురికి జన్మనిచ్చిన ఆ తల్లి.. చావుబతుకుల్లో ఉన్న పేగుబంధానికి తన కాలేయాన్ని దానం చేసి మరోసారి ఆమె పునర్జన్మనిచ్చింది. ఉస్మానియా, నిలోఫర్ వైద్యుల బృందం ఎనిమిది నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే నాలుగోది కాగా దేశంలోనే మొదటిదని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్ వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రేమలత అంగన్వాడీ వర్కర్. భర్త నారాయణ కూలీ పనులు చేస్తుంటారు. వీరిది మేనరికపు వివాహం. గతంలో ఈ దంపతులకు జన్మించిన తొలి బిడ్డ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించింది. వీరి రెండో కూతురు ఎనిమిది నెలల చిన్నారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నిలోఫర్ ఆస్పత్రిలో చూపించగా కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నట్లు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్య పరీక్షలు చేసిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్, చిన్నారికి కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. తల్లి కాలేయం నుంచి కొంత భాగాన్ని సేకరించి గత నెల 17న దాదాపు 18 గంటల పాటు శ్రమించి చిన్నారికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. సాధారణంగా మేనరికపు పెళ్లి, అనువంశికంగా ఇలాంటి జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయని వైద్యులు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సహకారంతోనే చిన్నారికి కాలేయ మార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు. బిడ్డ కోసం కాలేయ దానం చేసిన తల్లి ప్రేమలతను వైద్యులు సన్మానించారు. (క్లిక్: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ..) -
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన.. వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
-
ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది. చాదర్‌ఘాట్‌లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పడంతో గొడవ మొదలైంది. వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. వాళ్లపై జులుం ప్రదర్శించారు. తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది వీరంగం సృష్టించారు. బంధువులతో వాగ్వివాదానికి దిగిన మార్చురీ సిబ్బంది వ్యవహారంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. -
హైదరాబాద్ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు. ► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. ► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. నిలోఫర్‌లో సర్జరీలు వాయిదా నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్ 4 ప్యాక్డ్ సెల్స్, ఏడు ప్లాటింగ్ ప్యాక్చర్స్ (క్రయోన్స్) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది. దాతలు ముందుకు రావడం లేదు కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం. – లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్‌బ్యాంక్స్ అసోసియేషన్ బ్లడ్ బ్యాంక్‌లన్నీ తిరిగాను మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్‌కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. – సీహెచ్.లక్ష్మి, బడంగ్పేట్ -
మా అనుమతి లేకుండా కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: తమ అనుమతి లేకుండా ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని పురాతన భవనాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవనాల పటిష్టతపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఐఐటీ హైదరాబాద్ విభాగం డైరెక్టర్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) హైదరాబాద్ విభాగం అధిపతి లేదా ఆయన సూచించిన అధికారిని కూడా కమిటీలో సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో చారిత్రక పురాతన హెరిటేజ్ కట్టడాలను కూల్చివేయకుండా ఆదేశించాలని కొందరు, పురాతన భవనాలను కూల్చి నూతన భవనాలను నిర్మించేలా ఆదేశించాలంటూ మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
థర్డ్‌వేవ్ వచ్చినా కట్టడి చేద్దాం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రభావం ఎలా ఉందో ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలని, దీనిపై రోజువారీ పరిశీలన చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్, థర్డ్‌వేవ్ సన్నద్ధతపై మంగళవారం బీఆర్కే భవన్లో హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 27,996 పడకలకుగాను 25,826 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం పూర్తయిందని, మిగతా పడకలకు వేగంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో ఔషధాల నిల్వలను కచ్చితంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా.. అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఆధునిక సౌకర్యా లతో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రూ.8 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్, సీటీ స్కాన్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, ఫరూఖ్ హుసేన్‌లతో కలసి ప్రారంభించారు. తర్వాత వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో సిబ్బంది కొరత, ఏఏ పరికరాలు కావాలనే విషయమై ఉన్నతాధికారులతో చర్చించా రు. ఉస్మానియాతోపాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులను అభివృద్ధి చేసి ఆరోగ్య తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. గాంధీ ఆసుపత్రితోపాటు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మరో నాలుగు క్యాథ్‌ల్యాబ్‌లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ‘ఉస్మానియా ఆసుపత్రికి ఎన్ఏబీహెచ్ (జాతీయ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల గుర్తింపు మండలి) గుర్తింపు కోసం దరఖాస్తు చేస్తున్నాం. దీనివల్ల ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాలు అందుతాయి. దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మార్చురీ నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం’ అని హరీశ్‌రావు చెప్పారు. గోవాతోపాటు ఇతర దేశాల్లోని అత్యాధునిక మార్చురీలను సందర్శించి అక్కడి పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులను ఆదేశించారు. -
ఆందోళనలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది
-
Hyderabad: ఖరీదైన కాస్మొటిక్ సర్జరీ ఇక ఉస్మానియాలో కూడా..
సాక్షి, అఫ్జల్‌గంజ్(హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన కాస్మొటిక్ సర్జరీని ఉస్మానియా వైద్యులు ఉచితంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్ వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినికి కుడివైపు రొమ్ము పెరగకపోవడంతో ఆగస్టులో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. అమ్మాయికి వైద్యులు ఓపీ ద్వారా చికిత్స అందించి మళ్లీ రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఈ నెల మొదటి తేదీన ఆస్పత్రికి రాగా అదేరోజు ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి నేతృత్వంలో డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, డాక్టర్ అశ్వన్ కిషోర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ మధులిక, డాక్టర్ అజయ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని డాక్టర్ పావని, డాక్టర్ అనుపమ, డాక్టర్ ఆనంద్ బృందం దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి ఆగ్మెంటేషన్ మమోప్లాస్టీ శస్త్ర చికిత్సను సిలికాన్ ఇన్‌ప్లాంట్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్‌ను అమర్చి పూర్తి చేశామన్నారు. శస్త్ర చికిత్స జరిగి పదిహేను రోజులు గడిచిందని, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్ర చికిత్సకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఉస్మానియాలో అన్నో అభివృద్ది పనులు జరుగుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చదవండి: రాజు మృతి: సింగరేణి ఊపిరి పీల్చుకుంది -
ఆసుపత్రిని కూల్చవద్దంటూ నిరసన చేపట్టిన వామపక్షాలు
-
Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కిన్ బ్యాంక్: కాలిన చోట చర్మం వేస్తారు
హైదరాబాద్: ఈస్ట్ రోటరీ క్లబ్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఉస్మానియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా స్కిన్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ మధుసూదన్ నాయక్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వై.వి.గిరిలు మాట్లాడారు. శరీరం కాలిపోయిన కేసు ల్లో 40 శాతం కన్నా ఎక్కువ బర్న్ అయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ప్రతిరోజూ డ్రస్సింగ్ చేయాల్సి ఉంటుందని, డ్రస్సింగ్ చేసే సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారన్నారు. అదే స్కిన్ బ్యాంకు ఉంటే కాలినచోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రస్సింగ్ అవసరం ఉండదని చెప్పారు. భారతదేశంలో మొత్తం 15 స్కిన్ బ్యాంకులు ఉండగా అందులో 9 రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినవే కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సుధీష్‌రెడ్డి, చౌదరి, సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉస్మానియా ఆసుపత్రిలో పాపం పసిపాప!
సాక్షి, అఫ్జల్‌గంజ్: పసిపాపను ఓతల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పసిపాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తీసుకు వచ్చింది. వైద్యులు పాపను మెరుగైన చికిత్స నిమిత్తం ఏఎంసీ వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తర్వాత ఇప్పుడే వస్తాను, పాపను చూడండి అని ప్రక్క బెడ్‌పై ఉన్న పేషంట్‌కు చెప్పి సదరు మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా? ఆడపిల్ల అని వదిలి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స అనంతరం పాపను శిశు విహార్‌కు తరలిస్తామని తెలిపారు. చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
కొత్తగా నిర్మిస్తారా.. పునర్నిర్మిస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న చారిత్రక ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిని పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అనే విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నాలుగు వారాల్లో ఒక వైఖరి వెల్లడించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అయితే వారసత్వ కట్టడాలు కూల్చవద్దనే వాదనను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి గుర్తుచేసింది. ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మించాలన్న పిల్స్‌పై గురువారం హైకోర్టు విచారణ చేసింది. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కూల్చవద్దన్న పిల్స్‌ను పరిశీలించి ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలన్ని కలిపి విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. -
‘పేషెంట్ చనిపోయారనేది అవాస్తవం’
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగి చనిపోయారనేది అవాస్తవమని ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుష్మా అన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఓ రోగి చనిపోయారని, దీంతో అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వమనేసరికి ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఆస్పత్రిపై దుష్ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా కష్ట సమయంలో ఎంతో శ్రమిస్తున్న వైద్యులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎంతో మంది పేద రోగులు ఆస్పత్రికి వస్తున్నారని, ఇలాంటి సమయంలో తప్పుడు ప్రచారం చేసి వారిని అయోమయంలో పడేయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ వాహనం ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: ప్రమాదవశాత్తు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ వి షాద ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. మంగళహాట్ గుఫ్పా నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ వృత్తిరీత్యా మెకానిక్. ఆయన భార్య రేణుక. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు హర్షవర్ధన్ బుధవారం మధ్యాహ్నం షాపు వద్ద భోజనం తిని ప్లేటు కడుగుతున్నాడు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం టైర్లల్లో గాలి నింపించేందుకు వచ్చింది. అందులో డ్రైవర్ భగవంత్‌రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్ ఉన్నాడు. వాహనాన్ని వెనక్కు తీసే క్రమంలో డ్రైవర్ బాలుడిపైకి ఎక్కించేశాడు. అక్కడి వారు కేకలు వేయడంతో డ్రైవర్ వాహనాన్ని నిలిపేశాడు. స్థానికుల సాయంతో వాహనాన్ని పైకి ఎత్తి బాలుడిని తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్/అఫ్జల్‌గంజ్: తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ రవీంద్రభారతి రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీకి కూతవేటు దూరంలోని రవీంద్రభారతి సమీపంలో ఒంటికి మంటలు అంటుకొని అరుపులతో రోడ్డుమీదకు వచ్చిన వ్యక్తిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే నాగులు అనే ఆ వ్యక్తి ఒంటిపై మంటల్ని ఆర్పారు. ఆ వెంటనే అతడిని పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 63 శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు (55) చిన్నప్పటి నుంచి తెలంగాణ కోసం ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పాల్గొనడమే కాకుండా ఉద్యమంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నాడు. చాలా కాలం కిందటే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. నాగులు కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్ ఇద్దరూ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం వీరు ఈసీఐఎల్ పరిధిలోని బండ్లగూడ, రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. నాగులు బంజారాహిల్స్ రోడ్‌నం–2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కాగా, అతను గురువారం ఉదయం ఓ బాటిల్లో పెట్రోల్ పోయించుకొని రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా.. అది ఇవ్వలేకపోతున్నానని, ప్రభుత్వమే తన కుటుంబాన్ని, పిల్లల్ని ఆదుకోవాలని నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. ఇదిలా ఉండగా నాగులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అతడి శరీరం దాదాపు 62 శాతం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయని, తెలంగాణ కోసం తన ప్రాణం కూడా ఇస్తానని అనేవాడని నాగులు భార్య స్వరూప తెలిపింది. పోలీసులు ఫోన్ చేసి మీ భర్త ఉస్మానియాలో గాలిన గాయాలతో ఉన్నాడని చెప్పగానే తట్టుకోలేక పోయానని స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తకు మంచి చికిత్స అందించాలని కోరింది. తన భర్త తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని తరచూ బాధ పడేవాడని, తమ కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మంత్రి ఈటల వాకబు.. అసెంబ్లీ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారని, నాగులుకు మెరుగైన చికిత్స అందించాలని తనకు సూచించారని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. -
చరిత్రలో నిలిచిపోయే కట్టడాలు నిర్మించాలి
సాక్షి, హైదరాబాద్: ‘హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, ఆర్ట్స్ కళాశాల, ట్యాంక్‌బండ్ లాంటి నిర్మాణాలను చూసినప్పుడల్లా నిజాం గుర్తుకొస్తారు. నిజాం పాలన అంతమై 70 ఏళ్లు గడిచినా ఆ కట్టడాలను ఇప్పటికీ తల్చుకుంటాం. ఇలాంటి పది కాలాల పాటు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలి’అని హైకోర్టు సూచించింది. ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని హెరిటేజ్ భవనాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణాలను చేపట్టాలా? లేదా? ఆ భవనాన్ని అలాగే ఉంచి ఖాళీ స్థలంలో నూతన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించాలా? అన్నది లోతుగా విచారించి తేల్చాల్సిన అంశమని స్పష్టం చేసింది. ఆస్పత్రి ఆవరణలోని హెరిటేజ్ భవనాన్ని కాపాడాలని కొందరు, కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలంటూ మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యా లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు ఆస్పత్రి ఆవరణకు సంబంధించిన గూగుల్ మ్యాప్, భవనాల సైట్ ప్లాన్‌ను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమర్పించారు. ఈ మ్యాప్‌లను పరిశీలిస్తే ఆస్పత్రి భవన సముదాయంలో ఖాళీ స్థలాలు ఏమీ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. 26 ఎకరాల్లో ఆస్పత్రి విస్తరించి ఉందని, అయితే ప్రభుత్వం మా త్రం 16.2 ఎకరాల్లో మాత్రమే ఉందని ఎలా చెబుతుందో అర్థం కావడం లేదని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి అభ్యంతరం వ్య క్తం చేశారు. 2013లో ప్రభుత్వం నియమిం చిన క్షేత్రా డెవలపర్స్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మ్యాప్‌లు, సైట్‌మ్యాప్‌లను పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని ఏజీకి ధర్మాసనం సూచించింది. 6 ఏళ్ల నుంచి ట్విన్ టవర్స్ నిర్మాణం... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉస్మానియాలో వెంటనే నూతన భవనాల నిర్మాణం చేపట్టేలా ఆదేశించాలంటూ ఓ పిటిషనర్ తర ఫున న్యాయవాది సందీప్‌రెడ్డి హైకోర్టుకు నివే దించారు. ఈ మేరకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘తాజ్‌మహాల్ నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పో లీసు ట్విన్ టవర్స్‌ను ఆరేళ్ల నుంచి నిర్మిస్తు న్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికిప్పుడు నూతన భవనాల నిర్మాణం ప్రారంభించినా కనీసం పూర్తి కావడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. కొత్త నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలన్న దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. కేసులను భౌతికంగా విచారించేందుకు కోర్టు సిద్ధంగా ఉన్నా న్యాయవాదులు హాజరు కావడానికి జంకుతున్నారు. భౌతిక కోర్టులు ప్రారంభించాలని కోరిన న్యాయవాదులే ఇప్పుడు మరో 4 వారాలపాటు ఆన్లైన్లోనే కేసులను విచారించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భౌతికంగా ఈ కేసును విచారించాల్సిన అవసరముంది’ అని పేర్కొంటూ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది. -
రోగులకు ఆ..‘పరేషాన్’
చేవెళ్లకు చెందిన సత్యనారాయణ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు రాడ్డు అమర్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కాలులోని రాడ్డును తీసివేస్తామని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు. అత్యవసర సర్జరీలు మినహా ఎలక్టివ్ సర్జరీలన్నీ వాయిదా వేసినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేదేమీ లేక సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రాడ్డు తొలగింపు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. బాలాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి కొంతకాలంగా తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్‌తో సతమతమవుతున్నాడు. చికిత్స కోసం నిమ్స్ వైద్యులను సంప్రదించగా ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, సంబంధిత విభాగం వైద్యులు క్వారంటైన్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన అనేక మంది బాధితులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఇదే సమయంలో గాంధీ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 3,000 నుంచి 3,500 మంది రోగులు వచ్చేవారు. రోజుకు సగటున 250 సర్జరీలు జరిగేవి. ఇటీవల ప్రభుత్వం ఈ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో సాధారణ రోగులకు చికిత్సలు అందడం లేదు. గాంధీ, కింగ్‌కోఠి, జిల్లా ఆస్పత్రుల్లో మేజర్, మైనర్ సర్జరీలు చేయించుకుని ఫాలో అప్ చికిత్సలు, మందుల కోసం వచ్చే రోగులు ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోయారు. నిమ్స్ సహా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు, ఆపరేషన్ థియేటర్ల కొరత ఉంది. అక్కడ అత్యవసర చికిత్సలు మినహా ఎలక్టివ్ చికిత్సలు చేయకపోవడంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. కోవిడ్.. క్వారంటైన్ సెలవులు ఉస్మానియా ఆస్పత్రిలోని పాత భవనంలోకి ఇటీవల వర్షపునీరు చేరడంతో అక్కడి పడకలను ఖాళీ చేసి, కులీకుతుబ్‌షా, ఓపీ బ్లాక్‌లకు తరలించారు. ఆస్పత్రికి వస్తున్న అనేకమంది అసింప్టమేటిక్ కోవిడ్‌తో బాధపడుతున్నారు. వీరిని ముట్టుకోవడంతో వైద్యులు, టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇలా 212 మంది వైద్యులకు కోవిడ్ సోకింది. వైద్యుల్లో 60 శాతం మంది వి«ధుల్లో ఉంటే.. 40 శాతం మంది క్వారంటైన్ సెలవుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటుండగా... మరికొంత మంది తాత్కాలికంగా మందులపై నెట్టుకొస్తున్నారు. పాతభవనం ఖాళీ చేయడంతో ఆపరేషన్ థియేటర్ల సమస్య తలెత్తింది. పాతభవనంలోని రోగులకు ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసినప్పటికీ పోస్టు ఆపరేటివ్ వార్డులకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం, ఉన్న ఆపరేషన్ థియేటర్లు ఇతర చికిత్సలతో బిజీగా మారడంతో అత్యధిక రోగులకు చికిత్సలు అందడంలేదు. -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం
అఫ్జల్‌గంజ్: సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం పడింది. ఇన్నాళ్లూ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాత భవనంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పుడేం జరుగుతుందోననే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీశారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు పాత భవనంలోకి నీరు చేరడంతో రోగులు,సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం పాతభవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి పరిపాలనా విభాగం అధికారులు భవనాన్ని ఖాళీ చేసి సోమవారం తాళం వేశారు. పాత భవనంలోని పలు వార్డులను కులీకుతుబ్‌షా భవనంలోకి సర్దుబాటు చేశారు. పాతభవనంలోనే ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనికి మార్చారు. వెంటనే నూతన భవనం నిర్మించాలి.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం వేయడంతో ఇక్కడి రోగులను ఇతర భవనాల్లోని వార్డుల్లోకి సర్దుబాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచాల కొరత ఏర్పడుతుండడంతో అవస్థలు పడుతుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని కోరారు. -
ఉస్మానియాలో హెరిటేజ్ భవనాలున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో హెరిటేజ్ భవనాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనం ప్రమాదకరంగా ఉందని, దాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి రోగులను నూతన భవనంలోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జారీ చేసిన మెమోను ధర్మాసనానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ సమర్పించారు. కొన్ని భవనాలు మాత్రమే హెరిటేజ్ భవనాల కేటగిరీ కిందకి వస్తాయని వాటిని వదిలేసి గతేడాది ఆగస్టు నుంచి ఇతర భవనాలకు మరమ్మతులు (రెనోవేషన్) చేస్తున్నామని తెలిపారు. 2019 జూలైలో ఉస్మానియా ఆసుపత్రిని ప్రత్యేక బృందం సందర్శించి నివేదిక ఇచ్చిందని, దాన్ని ధర్మాసనం పరిశీలన కోసం సమర్పించామని వెల్లడించారు. ‘హెరిటేజ్ భవనం కూల్చరాదని ఒకరు, ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించాలని మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ భవనమా.. కాదా? ఎంత భాగం హెరిటేజ్ కేటగిరీ కిందకు వస్తుంది? ఇవేవీ తెలియజేయకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తాం. ప్రస్తుతం అక్కడ చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించండి’ అని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం మూసివేత
-
ఉస్మానియా పాత భవనానికి సీల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్ వేయాలన్నారు. ఓల్డ్ బ్లాక్‌లోని డిపార్ట్మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. (కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి) కాగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో పేషెంట్లు, వైద్యులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.(మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు) -
వెంటిలేటర్‌పై ఆస్పత్రి
-
ఉస్మానియాలో రిపోర్టుల తారుమారు!
బషీరాబాద్: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చిం దని వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయా డు. అనుమానం వచ్చి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా తెలిం ది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన మేఘనాథ్ గౌడ్ విద్యావాలంటీర్. ఈ నెల 3న అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతడికి వైద్యులు కరోనా పరీక్ష చేయగా.. ఈ నెల 7న రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రిపోర్టులో ఫోన్ నంబర్, ఇంటి పేరు తప్పు గా ఉండటంతో అనుమానం వచ్చి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా నెగెటివ్‌గా తేలింది. అతడికి కరోనా లేదని, నిమోనియా తో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు తెలి పారు. ఇదే విషయమై ఉస్మానియా వైద్యులను కుటుంబసభ్యులు నిలదీయగా పొరపాటున తారుమారయ్యాయని చెప్పి చేతులు దులుపుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, సమయానికి చికిత్స అందక ఆరోగ్యం క్షీణించిందని, ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని, రూ.11 లక్షలు ఖర్చయిందని, ఇంకా రూ.15 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. దాతలు తమను ఆదుకోవాలని కోరారు. -
ఉస్మానియాలో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి రోగులను మురుగు ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆస్పత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ శిథిలమవడంతో వర్షపునీరు వెళ్లే మార్గంలేక అంతర్గత రోడ్లపైనే పొంగిపొర్లుతోంది. సెక్యూరిటీ ఆఫీసు సమీపం నుంచి పాతభవనంలోకి నీరు చేరుతోంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం గురువారం ఆస్పత్రికి చేరుకుని తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది. వార్డులోకి చేరిన నీటిని పాతభవనం డోమ్ గేట్ ద్వారా బయటికి ఎత్తిపోసింది. తడిసిన పడకలు, పీపీఈ కిట్బాక్స్లను ఆరబెట్టింది. అయితే, డ్రైనేజీ లైన్లను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో మళ్లీ వర్షం వస్తే వార్డుల్లోకి వరదనీరు చేరే ప్రమాదముందని పాతభవనంలోని రోగులు, వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నవారందరినీ గురువారం ఫస్ట్‌ఫ్లోర్‌కు తరలించారు. కానీ, ఆయావార్డులను శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఇదే ప్రాంగణంలో ఉన్న మరో భవనం(కులీకుతుబ్ షా) ఐదో అంతస్తులోకి కూడా వర్షపునీరు లీక్ అవుతోంది. దీంతో ఆ వార్డులో ఉన్న డయాలసిస్ యంత్రాలపై నీరుపడి పాడైపోయాయి. ఈ భవనంపై అదనపు అంతస్థు నిర్మిస్తుండటం, నిర్మాణ సమయంలో స్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడటంవల్ల వర్షపునీరు కిందికి ఇంకుతున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. -
వాన నీటిలోనే ఉస్మానియా ఆసుపత్రి
-
ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుడు మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసింది. నేరేడ్మెట్ సాయినగర్‌కు చెందిన గొల్ల శ్రీధర్ శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీధర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స సమయంలో తనకు శ్వాస ఆడటం లేదని, ఆక్సిజన్ పెట్టమని చెప్పినప్పటికీ ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కుటుంబ సభ్యులకు వివరించినట్లు ఒక ఆడియో బయటికి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టకపోవడం వల్లే శ్రీధర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేద ని, ఆ పేరుతో ఉన్న యువకుడు చనిపోయినట్లు ఆస్పత్రి మృతుల జాబితాలో కూడా లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు. -
ఉస్మానియాలో నిర్వాకం.. బతికుండగానే
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులు వరుస శవ పంచాయితీలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకమొకటి బయటపడింది. బతికున్న మహిళ చనిపోయినట్టుగా ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఇటీవల ఉస్మానియాలో చేరారు. వారిలో ఒకరు కరోనాతో, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా బాధితురాలు మృతి చెందింది. అయితే, శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నతన తల్లి ఎలా చనిపోయిందని బాధితురాలి కూతరు నిలదీసింది. తప్పుడు సమాచారం ఇచ్చి భయభ్రాంతులకు గురిచేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. (చదవండి: గాంధీలో మరో శవ పంచాయితీ) (వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన) -
మందుల్లేవ్!
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మాస్పత్రులు దగా పడుతున్నాయి. రోగుల అవసరాలతో సంబంధం లేని, గడువు సమీపించిన నాసిరకం మందులు కొనుగోలు చేయడం, తీరా అవి ఎక్స్‌ఫైరీ అయినట్లు పేర్కొని గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం ఇటీవల పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఖరీదైన మందుల సంగతేమో గానీ, బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు మందుల చీటీ పట్టుకుని ప్రైవేటు ఫార్మసీలను ఆశ్రƬంచాల్సిన దుస్థితి తలెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల మందులకు భారీగా బడ్జెట్కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులతో కొనుగోలు చేసినా.. రోగుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేక పోతున్నారు. ఫలితంగా ఇన్‌పేషెంట్లతో పాటు అవుట్ పేషెంట్లకు మందుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కొరతపై ఉస్మానియా ఆస్పత్రి అధికారులు ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు లేఖ రాయడం గమనార్హం. మందుల సరఫరా బంద్ ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 2 వేల మంది రోగులు వస్తుండగా, ఇన్‌పేషెంట్ వార్డుల్లో వేయి మందికి పైగా చికిత్స పొందుతుంటారు. చిన్న, పెద్దా కలిపి ఇక్కడ రోజుకు 150–200 చికిత్సలు జరుగుతుంటాయి. సర్జకల్ డిస్పోజల్స్, సర్జికల్ బ్లేడ్స్, గ్లౌజులు సహా ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ ఫిలిమ్స్ సహా హెచ్ఐవీ రాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. అంతేకాదు డిసైక్లోఫెనిక్ సోడియం 50 ఎంజీ, ఎల్పీఎం 4 ఎంజీ, అజింత్రో, స్టెరిలేన్ వాటర్ ఫర్ ఇంజక్షన్ 10 ఎంఎల్, టెటనస్ టాక్సెడ్, ల్యాక్టోసెల్ సొల్యూషన్, యాసిడ్ కార్బల్ 100 ఎంజీ, లైసోల్ 500ఎంజీ, పారసిటమాల్ 100 ఎంజీ, సోడియం హైడ్రోక్లోరైడ్, కెటమిన్ 50ఎంజీ, డోపమిన్ 200 ఎంజీ, హెపటైటీస్–బి, హిమోగ్లోబిన్ సహా మొత్తం 120 రకాల మందులకు ఇరువై రోజుల క్రితమే టీఎస్ఎంఐడీసీకి ఇండెంట్ పంపారు. కానీ ఇప్పటి దాకా ఆయా మందులు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది మధుమేహులు వస్తుంటారు. టీఎస్ఎంఐడీసీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో వారంతా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.150 వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని కొనుగోలు చేసే శక్తి లేక మధుమేహులు తరచూ ఆందోళనకు దిగుతుండటం గమనార్హం. ఇలా ఒక్క ఉస్మానియాలోనే కాదు గాంధీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవసరాలకు భిన్నంగా కొనుగోళ్లు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఆస్పత్రులు, రోగుల అవసరాలతో సంబంధం లేకుండా ఇతర మందులు కొనుగోలు చేస్తుండడం, వినియోగం లేక ఏళ్ల తరబడి స్టోర్స్‌లోనే మగ్గిపోతుండడం, తీరా గడువు ముగియడంతో గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. సర్జరీలు చేసే ఆస్పత్రులకు సరఫరా చేసే ‘ట్రమడాల్’ వంటి పెయిన్ కిల్లర్ మందులను అవసరం లేకపోయినా ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయడం తెలిసిందే. ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ తర్వాత పారసిటమాల్‌కు బదులు పిల్లలకు ట్రమడాల్ ఇవ్వడం, ఇద్దరు పిల్లలు చనిపోవడం, ఆ సంస్థపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పరిశీలిస్తే మందుల సరఫరా ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం మందుల కోసం కేటాయించిన బడ్జెట్లో 80 శాతం నిధులు టీఎస్ఎంఐడీసికి, 20 శాతం నిధులు ఆస్పత్రికి కేటాయిస్తుంది. ఇలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ఏటా రూ.30 కోట్లకు పైగా కేటాయిస్తుంది. టీఎస్ఎంఐడీసీ సరఫరా చేయని మందులను ఆస్పత్రి వైద్యులే 20 శాతం వాటా నుంచి కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీజన్లో రోజు వారి సగటు ఓపీ మూడు వేలకుపైగా నమోదైంది. అంచనాలకు మించి రోగులు రావడంతో మందుల కొరత తీవ్రమైంది. ఆరోగ్యశ్రీ, నిధులతో కొన్ని రకాల మందులు కొనుగోలు చేస్తున్నప్పటికీ రోగుల పూర్తిస్థాయి అవసరాలు తీర్చలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్ మేనేజ్మెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందులను సాధారణ రోగులకు సర్ధుబాటు చేయాల్సి వస్తోందని ఆయా ఆస్పత్రుల అధికారులు వాపోతున్నారు. -
సురేష్ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్‌కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరించారు. -
ఎమ్మార్వో హత్య కేసు : నిందితుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతని ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మెయిల్ బర్నింగ్ వార్డులో నిందితుడు చికిత్స పొందుతున్నాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరో బర్న్ షాక్‌లో ఉన్నట్టు తెలిపారు. మరో 24 గంటలు దాటితే సురేష్ స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిపారు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ.. చికిత్స అందిస్తున్నారు. -
ఉస్మానియా..యమ డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఇన్‌పేషంట్లు చికిత్స పొందే పాతభవనంలోని పలు వార్డులు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడిపడుతుండగా, తాజాగా గురువారం తెల్లవారుజామున ఓపీ భవనంలోని జనరల్ సర్జరీ విభాగం ఇన్‌పేషంట్ వార్డులో సీలింగ్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు రోగులకు స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో పైన ఉన్న సీలింగ్ ఒక్కసారిగా కూలి కిందపడటంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారికి సహాయంగా ఉన్న బంధువులు, చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రోగులను వెంటనే మరో వార్డుకు తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
నిలబడి నిలబడి ప్రాణం పోతోంది
సిటీకి జ్వరమొచ్చింది. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో జనంఅల్లాడుతున్నారు. విషజ్వరాల ప్రభావం తీవ్రమవడంతో రోగులు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. నగరంలోని గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రులకు సోమవారం వేల సంఖ్యలో రోగులు వచ్చారు. రోగుల సంఖ్యకు తగిన వసతులు లేక నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ వద్ద చాంతాడంతలైను ఉండడంతో చాలా మంది అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిల్చొని నీరసించిపోయారు. గాంధీలోనూ గంటలతరబడి రోగులు వేచిఉండడం కన్పించింది. గాంధీఆస్పత్రి : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి సోమవారం రోగులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా చిట్టీ కౌంటర్లు పెంపు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఓపీ చిట్టీలు, వైద్యసేవల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. వీల్ఛైర్లు, స్ట్రెచర్లు అందుబాటులోలేక దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. కుటుంబీకులే రోగులకు ఎత్తుకుని వైద్యసేవల కోసం తీసుకువెళ్లారు. సోమవారం రికార్డు స్థాయిలో ఓపీ రోగుల సంఖ్య నమోదైంది. సాధారణ రోజుల్లో గాంధీ ఓపీలో 3000 నుంచి 3500 మంది చికిత్సకువస్తుండగా సోమవారం మాత్రం 4వేల మంది చికిత్స కోసం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇన్‌పేషెంట్ విభాగంలో ఆరోగ్యశ్రీ రోగులు 30శాతం పెరిగినట్లు సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఉస్మానియాలో.. అఫ్జల్‌గంజ్ : ఉస్మానియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. దాదాపు 1600మంది చికిత్స కోసం వచ్చారు. రోగుల సౌకర్యార్థం అన్ని విభాగాల్లోని వైద్యులను అత్యవసర సేవలకు వినియోగించామని సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం ఓపీ సహా ఐపీ విభాగాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓపీ సహా ఫార్మసీలో రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేకపోవడంతో మందులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసలే జ్వరం ఆపై గంటల తరబడి క్యూలైన్లో నిల బడాల్సి వచ్చింది. సాధారణంగా రోజుకు సగటున వెయ్యి నుంచి 1200 మంది రోగులు వస్తుండగా సోమవారం ఈ సంఖ్య రెండు వేలు దాటింది. -
ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
అఫ్జల్‌గంజ్: ప్రమాదవశాత్తు సేప్టీ పిన్‌మింగిన బాలుడికి శస్త్రచికిత్స చేసి తొలగించిన సంఘటన ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అనూష దంపతుల కుమారుడు (8 నెలలు) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ సేఫ్టీ పిన్ మింగాడు. దీనిని గుర్తించిన అతడి తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఎక్స్‌రే తీసిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు బాలుడిని నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రెఫర్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఎమర్జెన్సీ విభాగానికి రాగా, గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగాధిపతి డాక్టర్ రమేష్ నేతృత్వంలో 15 నిమిషాల్లోనే ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీ పిన్ను బయటికి తీశారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... ఎండోస్కోపి ద్వారా ఫారిన్ బాడీ స్కాన్‌చేసి తీయడం పెద్దవారిలో సహజమే అయినా 8 నెలల పసికందుకు ఎండోస్కోపి ద్వారా ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీపిన్ తీసివేయడం క్లిష్టమైన, అరుదైన విషయమన్నారు. చికిత్స నిర్వహించిన డాక్టర్ రమేష్, సహకరించిన ఇతర డాక్టర్లను ఆయన అభినందించారు. తమ బిడ్డను కాపాడిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
జనం గుండెల్లో.. హిస్స్..
సాక్షి, హైదరాబాద్: చీమలు పెట్టన పుట్టలో పాములు దూరినట్లు... పాముల పుట్టల ప్రాంతాల్లో జనావాసాలు వెలుస్తున్నాయి. నగరంలో జనాభా పెరగడంతో శివారు ప్రాంతాలు కూడా సిటీలో కలిసిపోతున్నాయి. శివారు ప్రాంతాలను ఆక్రమించి చెట్టూపుట్టా అంటూ లేకుండా వెంచర్లు, నిర్మాణాలు చేపడుతుండటంతో పాములు ఇళ్ల మధ్యకు వచ్చి బుస కొడుతున్నాయి. దీంతో పాము కాటు బాధితులు పెరిగిపోతున్నారు. చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కేవలం నెలన్నర రోజుల్లోనే ఉస్మానియాలో 92 కేసులు, గాంధీలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు మరో యాభై మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పాము కాటు కేసులు పెరగడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని వైద్యులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పాముల పుట్టల్లోకి జనావాసాలు... నగరం శివారు ప్రాంతాలకు కూడా విస్తరించింది. రోజుకో కొత్త వెంచర్ ఏర్పడటంతో పాటు నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిటీకి దూరంగా ఉన్న కాలనీల్లో వీధిలైట్లు లేవు. ఉన్నవాటిలో చాలా వెలగడం లేదు. చాలా చోట్ల ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండటం, అవి చెట్ల పొదలు, రాళ్లు, పుట్టలతో నిండిపోతున్నాయి. నిర్మాణ సమయంలో పిల్లర్ల కోసం గుంతలు తవ్వాల్సి వచ్చినప్పుడు పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. అక్కడ పని చేసేందుకు వచ్చిన కార్మికులు బయట నిద్రించేటప్పుడో, రాత్రిపూట మలమూత్ర విసర్జనకు వెళ్లినప్పుడో కాటేస్తున్నాయి. వైద్యులు అందుబాటులో లేక... నగరం నాలుగు వైపులా 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను అంబులెన్స్‌లో తీసుకుని సిటీ రోడ్లపై రద్దీని దాటుకుని ఆస్పత్రులకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాతపడుతున్నారు. బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మలక్‌పేట్‌లో ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అయితే వాటిలో వైద్య పరికరాలు, మందులు, తక్షణ సేవలు అందించే వైద్యులు లేకపోవడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల బాధితులు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఆందోళన వద్దు.. పాముకాటుకు గురైన వెంటనే కాటు వేసిన చోటుకు పైభాగాన తాడుతో గట్టిగా కట్టాలి. వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. 10 నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. పాముకాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురై రక్త ప్రసరణ పెరిగి విషం శరీరమంతా వ్యాపించి చనిపోతున్నారు. ఆ వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. – డాక్టర్ శ్రవణ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, ఉస్మానియా ఆస్పత్రి -
ఆరోగ్య ప్రదాయినికి ఆయుష్షు!
సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యం చెడిపోయి పోతాయనుకున్న ప్రాణాలు సైతం ఆ ఆస్పత్రికి వెళితే నిలిచిపోతాయని రోగుల నమ్మకం. ఎన్నో ప్రయోగాలు, మరెన్నో అద్భుతాలకు వేదిక.. లక్షలాది మంది రోగుల ఆరోగ్య ప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి. చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తరచు పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండో అంతస్తును ఖాళీ చేయించారు. దాన్ని కూల్చివేసి అక్కడ రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం 2014లోనే సంకల్పించింది. ప్రతిపక్షాలు, చరిత్రకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పాత భవనాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆర్కియాలజీ విభాగానికి పంపింది. ఈ భవనానికి మెరుగులు దిద్దడంవల్ల మరో 25 ఏళ్ల వరకు ఆ కట్టడానికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు పాత భవనాన్ని ఆధునికీకరిస్తూనే.. మరోవైపు ఇదే ప్రాంగణంలో కొత్తగా మరో నాలుగు బ్లాకులు నిర్మించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ప్రకటించారు. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా దెబ్బతిన్న రూఫ్‌టాప్‌ను సరిచేయడం, గోడలపై మొలిచిన చెట్లను తొలగించడం, గోడల పగుళ్లును బాగుచేయడం, వాటర్ ఫ్రూఫింగ్ చేసి లీకేజీలను అరికట్టడంతో పాటు, డ్రైనేజీ లైన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్డలను పూర్తిగా పునరుద్ధరించడం వంటివి చేపడతారు. తద్వారా ఈ భవనాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. చారిత్రక నేపథ్యం ఇదీ.. గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలిసిన ఓ బస్తీ. పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం నసీరుద్దౌలా బ్రిటిష్ తరహా వైద్యం చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్య గ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించగా ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. 1866 నాటికి అది ‘అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి’గా వైద్య సేవలు ప్రారంభించింది. అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటిష్ సైనికులకు మాత్రమే అందిన విదేశీ వైద్యం ఈ ఆస్పత్రి ప్రారంభంతో ఇక్కడి సామాన్యులకు కూడా చేరువైంది. కానీ ఆ ఆస్పత్రి 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చోటుచేసుకున్న విషాదమిది. తర్వాత కొంత కాలానికే ఆయన కూడా కాలధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి.. ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో సుమారు 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. రూ.50 వేల ఖర్చుతో నిర్మాణం ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి 1918లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్థానీ, గ్రీక్, రోమన్, శైలిలో దీన్ని కట్టారు. సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు శ్రమించి కట్టారు. ఆరోజుల్లో ఈ భవన నిర్మాణానికి రూ.50 వేల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. 1925లో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో 110 అడుగుల ఎత్తయిన విశాలమైన డోమ్‌లు ఆస్పత్రికి ప్రత్యేక ఆకర్షణ. చార్మినార్‌లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆస్పత్రి భవనంపై కట్టారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగాలి, వెలుతురు వచ్చేలా నిర్మించారు. ప్రపంచంలోతొలి ‘క్లోరోఫామ్’ చికిత్స ఇక్కడే ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలుఆవిష్కరణలకు వేదిక. ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారి క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్స చేశారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. ఎంతో మంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆస్పత్రి అభివృద్ధి చెందింది. డాక్టర్ ఎడ్వర్డ్ లారీ, డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించా రు. 1846లోనే డాక్టర్ విలియం మెక్లిన్ నేతృత్వంలో నిజామ్స్ మెడికల్ స్కూల్ వైద్య విద్యాబోధన ప్రారంభమైంది. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కథ ఇదీ.. నిర్మాణానికి ప్రతిపాదన 1918 నిర్మాణం పూర్తయింది 1925 విస్తీర్ణం 27 ఎకరాలు నిర్మాణ ఖర్చు రూ.50 వేలు నిర్మాణ శైలి ఇండో,పర్షియన్తొలిరోజుల్లో పడకలు 450 ప్రస్తుత పడకలు 1100 ఓపీ రోజుకు (సగటున) 2000 నుంచి 2500 మంది ఇన్ పేషెంట్ల సంఖ్య 200–300 మైనర్ ఆపరేషన్లు(రోజుకు) 120–135 మేజర్ ఆపరేషన్లు 30–35 మొత్తం విభాగాలు 33 సూపర్ స్పెషాలిటీ విభాగాలు 7 -
ఏళ్లుగా లేరంట.. ఇవ్వలేరంట..!
ఆరేళ్ల తర్వాత ఓయూ స్నాతకోత్సవంజరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవం ఇది. 2014లోటీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కుఓయూ గౌవర డాక్టరేట్ ఇవ్వాలనిప్రతిపాదించగా... విద్యార్థి సంఘాలువ్యతిరేకించడంతో విరమించుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక మహోన్నతమైన విజ్ఞానభూమి. బోధన, పరిశోధనే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వవిద్యాలయం. వేల ఏళ్ల మానవ ప్రస్థానాన్ని, చరిత్ర గమనాన్ని అధ్యయనం చేస్తూ పరిశోధిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో ఒక తరం నుంచి మరో తరానికి విజ్ఞాన వారధిగా నిలిచిన ఈ యూనివర్సిటీ... విద్య, బోధన, పరిశోధన మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించడంలో, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సముపార్జించిన ఎంతోమంది అతిరథ మహారథులకు గౌరవ డాక్టరేట్లను అందజేసి సముచితంగా గౌరవించింది. తన కీర్తి ప్రతిష్ఠలను విశ్వవిఖ్యాతం చేసుకుంది. అయితే ఇదంతా గత వైభవమే. గడిచిన 18 ఏళ్లుగా ఒక్క గౌరవ డాక్టరేట్‌ను కూడా ఇవ్వలేదు. ఇంచుమించు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మరెంతో మంది తమ ప్రతిభా పాటవాలతోపరిశోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ అలాంటి ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. చరిత్ర, సైన్స్, కళలు, సాహిత్యం, సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు, రాజకీయ రంగాల్లో గొప్ప కృషి చేసిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడమంటే ఆ వ్యక్తులను సమున్నతంగా గౌరవించడమే కాకుండా... ఉస్మానియా విశ్వవిద్యాలయం తనను తాను గౌరవించుకున్నట్లవుతుంది. కానీ ఈ 18 ఏళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం గమనార్హం. ఆనాటి వెలుగులేవీ? ఆరేళ్ల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 17న వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఆరేళ్లలో పరిశోధనలు పూర్తి చేసిన ఎంతోమంది విద్యార్థులు పట్టాలందుకోనున్నారు. సుమారు 2,800 మందికి పైగా విద్యార్ధులు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. వారిలో ఇప్పటికే 1,800 మంది పట్టాలు పొందారు. మరో 1,096 మందికి ఈ స్నాతకోత్సవ వేడుకల్లో పట్టాలందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇప్పటి వరకు సుమారు 680 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన 270 మంది టాప్‌మోస్ట్ విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌ను అందుకోనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అలాంటి స్నాతకోత్సవ సంరంభంలో యూనివర్సిటీ హోదాను, గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేసే గౌరవ డాక్టరేట్లు మాత్రం లేవు. ఎందుకిలా? గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయకపోవడానికి అనేక కారణాలున్నాయి. 2001 నుంచి దశాబ్దానికి పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. సమాజంలో ఒక బలమైన ఆందోళన కొనసాగుతున్న సమయంలో వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులను గుర్తించి అవార్డులను అందజేయడం అసాధ్యంగా మారింది. 2014లో కేసీఆర్‌కు ఇవ్వాలనుకున్నప్పటికీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ఇవ్వడంలో యూనివర్సిటీ పాలకమండలిలో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. మరోవైపు రాజకీయ పార్టీల ప్రభావం కారణంగా ఎంపికపై ఎవరికి వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఇవ్వాలనుకున్నా అందరికీ, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన నేతల ఎంపిక కూడా కష్టంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానుభావులకు, ఎంతోమంది వైజ్ఞానిక రంగ ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం ద్వారా ఇతర యూనివర్సిటీల కంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో వైవిధ్యాన్ని కనబరిచింది. అదేస్థాయి వ్యక్తులను ఎంపిక చేయడంలో ఈ 18 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదు. ఎందరో మహానువుభావులు... నిజానికి వర్సిటీ ఆరంభం నుంచే గొప్ప సంస్కృతిని చాటుకుంది. మేధావులను, ఆయా రంగాల్లో అపారమైన సేవలందజేసిన వారిని గుర్తించి డాక్టరేట్లతో గౌరవించింది. అలా 1917లోనే అప్పటి అరబిక్ ప్రొఫెసర్, ఆరో నిజాం రాజు మహబూబ్అలీకి ఎంతో ప్రియమైన వ్యక్తి అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్‌కు తొలి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈయన ప్రెసిడెన్సీ కాలేజీలో, బెంగాల్, లక్నో కళాశాలల్లోనూ అధ్యాపకులుగా పని చేశారు. నిజాం ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1938 ఫిబ్రవరి 28న గౌరవ డాక్టరేట్ అందజేసింది. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్’ అవార్డును అందుకున్న తొలి సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్. అదే సంవత్సరం ప్రముఖ కవి ఇక్బాల్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. బికనూర్ ప్రభువు మహారాజ్ ఆదిరాజ్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఆ తర్వాత ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చీఫ్ ఇంజినీర్ అయిన నవాబ్ అలీజంగ్కు 1949 మార్చి 19న ‘డాక్టరేట్ ఆఫ్ సైన్స్’ విభాగంలో అందజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు 1953లో గౌరవ డాక్టరేట్ అందజేసే అరుదైన అవకాశం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. ఈ అపూర్వ ఘట్టంతో ఓయూ కీర్తిప్రతిష్టలు మరింత రెపరెపలాడాయి. అప్పటికే 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందజేసి సముచితంగా గౌరవించింది. బెల్ లెబోరేటరీస్ అధినేత, వైజ్ఞానిక రంగ నిపుణులు అయిన డాక్టర్ అరుణ్ నేత్రావలికి 2001 ఆగస్టు 8న గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న 47వ వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. 2014లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ విద్యార్ధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రముఖులు వీరే... 1. నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ – 1917 2. నవాబ్ సర్ అమీన్‌జంగ్ బహదూర్ – 1918 3. నవాబ్ మసూద్ జంగ్ బహదూర్ – 1923 4. మహరాజ్ సర్ కిషన్ పరిషద్ బహదూర్ – 1938 5. సర్ తేజ్ బహదూర్ సిప్రూ – 1938 6. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ – 1938 7. సర్ మహ్మద్ ఇక్బాల్ – 1938 8. మహరాజ్ ఆదిరాజ్ బికనూర్ ప్రభువు –1939 9. ప్రిన్స్ ఆజం జాహ్ బహదూర్ – 1939 10. ప్రిన్స్ మోజం జాహ్ బహదూర్ – 1940 11. నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహదూర్ –1943 12. సి.రాజగోపాలాచారి – 1944 13. దివాన్ బహదూర్ సర్ రామస్వామి మొదలియార్ – 1945 14. సర్ జాన్ సర్ గేంట్ – 1947 15. పండిత్ జవహర్లాల్ నెహ్రూ – 1947 16. మేజర్ జనరల్ చౌదరి – 1949 17. బాబు రాజేంద్రప్రసాద్ – 1951 18. టింగ్ సి–లిన్ – 1951 19. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1953 20. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ – 1953 21. ఎంకే వెల్లోడి – 1953 22. కేఎం మున్షీ – 1954 23. వీకే కృష్ణమీనన్ – 1956 24. బూర్గుల రామకృష్ణరావు – 1956 25. ఆలియార్ జంగ్ – 1956 26. షేక్ అహ్మద్ యామనీ – 1975 27. డాక్టర్ జర్హర్ట్ హెర్డ్ బెర్గ్ – 1976 28. ప్రొఫెసర్ సయ్యద్ నురుల్ హసన్ – 1977 29. డాక్టర్ కలియంపూడి రాధాకృష్ణ – 1977 30. తాలాహ్ ఈ దైని తరాజీ – 1979 31. యాసర్ హరాఫత్ – 1982 32. డాక్టర్ వై.నాయుడమ్మ – 1982 33. ప్రొఫెసర్ రాంజోషి – 1982 34. జి.పార్థసారథి – 1982 35. డాక్టర్ జహీర్ అహ్మద్ – 1982 36. జస్టిస్ మహ్మద్ బౌడ్జౌయ్ – 1985 37. జస్టిస్ నాగేందర్‌సింగ్ – 1986 38. జస్టిస్ ని ఝంగ్యూ – 1986 39. ఆర్.వెంకట్రామన్ – 1986 40. ప్రొఫెసర్ సీఎస్ఆర్ రావు – 1986 41. జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి – 1986 42. డాక్టర్ రాజా రామన్న – 1990 43. బీపీఆర్ విఠల్ – 1993 44. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి – 1993 45. డాక్టర్ లక్ష్మీ ఎం.సింగ్వీ – 1994 46. డాక్టర్ మన్మోహన్సింగ్ – 1996 47. డాక్టర్ అరుణ్ నేత్రావలి – 2001 -
ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి..
ఏదైనా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నారా..? అయితే మీ వెంట కచ్చితంగా ఓ ఫ్యాన్ కూడా తీసుకువెళ్లండి.. లేకపోతే అక్కడ మీరు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఎందుకంటే నగరంలో పేరుమోసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానికిపైగా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం లేదు.. మీరు ఒక రోగంతో ఆసుపత్రికి వెళితే.. మరో రోగంతో బయటకు రావాల్సి వస్తుంది. మన ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరు దారుణంగా ఉంది..! సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతుంటే.. ప్రభుత్వాసుపత్రులలో ఫ్యాన్లు, ఏసీలు పని చేయకపోవడంతో రోగులు చుక్కలు చూస్తున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రతిష్టాత్మాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పని చేయకుండా పోయిన ఏసీలు, ఫ్యాన్లను ఎప్పటికప్పుడు రిపేర్లు నిర్వహించి అందుబాటులోకి తీసుకురావాల్సిన వైద్యాధికారులు ఇవేవీ పట్టించుకోక పోవడంతో రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కట్లు, కుట్లకు ఇన్ఫెక్షన్ల బెడద.. ప్రతిష్టాత్మాక ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని పాత భవనం సహా కులీకుతుబ్‌షా భవనం, ఓపీ భవనాలు ఉన్నాయి. ఇక్కడ అధికారికంగా 1168 పడకలు ఉండగా, అనధికారికంగా 1385 పడకలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ఓపీకి రోజుకు సగటున 2500 మంది వస్తుండగా, మరో 1400 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే ఒకటి, రెండో అంతస్థులను ఖాళీ చేయించి, ఆయా పడకలను గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే సర్దుబాటు చేశారు. విశాలమైన ప్రదేశంలో ఉండాల్సిన పడకలు ఇరుకుగా.. కనీసం గాలి వెలుతురు కూడా సోకని ప్రదేశంలో ఉండిపోయాయి. అసలే ఉక్కపోత ఆ పై వార్డుల్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గాయాలకు కట్టిన కట్లకు, సిజేరియన్ ప్రసవాలు, ఇతర సర్జరీల సమయంలో వేసిన కుట్లు వద్ద ఉక్కపోతతో చెమట పొక్కులు వస్తున్నాయి. దురద పెట్టడంతో వాటిని గిల్లుతుంటారు. సర్జరీ తర్వాత నాలుగైదు రోజుల్లో మానాల్సిన కుట్లు, ఇతర గాయాలు ఉక్కపోత, చెమట పొక్కులతో దురద రావడం, వాటిని గిల్లడం వల్ల వారం పది రోజులైనా మానడం లేదు. అంతేకాదు ఇన్ఫెక్షన్ల బారీ నుంచి రోగులను కాపాడేందుకు మోతాదుకు మించి యాంటిబయోటిక్స్ వాడాల్సి వస్తోంది. పరోక్షంగా రోగుల ఆరోగ్యం మరింత దెబ్బతినడాకి కారణమవుతోంది. కంప్యూటర్లు, వైద్యపరికరాలకు ముప్పు ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆసుపత్రిలో అధికారికంగా 1012 పడకలు ఉండగా, అనధికారికంగా రెండువేల పడకలు కొనసాగుతున్నాయి. అత్యవసర విభాగం సహా ఇంటెన్సీవ్‌కేర్ యూనిట్లలోనూ ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులే కాదు ఆయా విభాగాల్లోన్ని కంప్యూటర్లు, వైద్యపరికరాలు వేడిమికి దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 2400 వైద్యపరికరాలు ఉండగా, ప్రస్తుతం వీటిలో 525 వైద్యపరికరాలతో పాటు అనేక కంప్యూటర్లు పని చేయడం లేదు. పోస్ట్ ఆపరేటీవ్, గైనకాలజీ, పీడీయాట్రిక్ విభాగాల్లోని రోగులు ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి, నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం సహా సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోని రోగులు సైతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి, వినియోగంలోకి తీసుకురావాల్సిన ఆసుపత్రి యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. నగదు తీసుకునే నిమ్స్‌లోనూ అంతే.. ఉస్మానియా, గాంధీ ఇతర ధర్మాస్పత్రులతో పోలిస్తే నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) కొంత భిన్నమైంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఆస్పత్రి ఇది. ఇక్కడ ఉచిత సేవలు ఉండవు. డబ్బు చెల్లించే రోగులకు మాత్రమే ఇక్కడ సేవలు అందుతాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే వైద్య ఖర్చులు కొంత తక్కువగా ఉండటమే కాదు మెరుగైన వైద్యం అందు తుందనే ఆశతో రోగులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ జనరల్ వార్డులతో పాటు పేయింగ్ రూమ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఏసీ రూమ్‌లు కూడా ఉన్నాయి. నగదు చెల్లించినప్పటికీ గదుల్లో ఏసీలు పని చేయడం లేదు. షేరింగ్ రూముల్లోనూ ఫ్యాన్లు తిరగడం లేదు. ఆసుత్రిలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. వసతులు మాత్రం మెరుగుపడటం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంతే.. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, ఫీవర్, సరోజినిదేవి కంటి ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, ఛాతి ఆసుపత్రి సహా సుల్తాన్ బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోనే కాదు.. రోగులు నగదు చెల్లించి చికిత్సలు పొందే నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) లోనూ నిర్వహణ లోపం వల్ల సగానికి పైగా ఫ్యాన్లు, ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగులు ఉక్కపోతకు చెమట, దురద, ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తడమే కాదు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వైద్యపరికరాలు, కంప్యూటర్లు పాడైపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్రభుత్వాస్పత్రుల్లో ‘నకిలీలు’
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో వైద్యులకు పట్టుబడడంతో దందా వెలుగు చూసింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో హల్చల్ చేసి వైద్యులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఒక్క ఈ ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. ఆస్పత్రిలో 240 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తుండగా, వీరిలో 28 మంది లాంగ్లివ్లో ఉన్నారు. కొంతమందికి ఉద్యోగంతో పాటు ప్రైవేటు మందుల దుకాణాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉండడం.. మరికొంత మంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు విధులకు హాజరుకాకపోగా వారి స్థానంలో ఇతరులకు తక్కువ మొత్తంలో నెలసరి వేతనాలు చెల్లించి ఆస్పత్రులకు పంపుతున్నారు. వీరిలో చాలా మందికి వైద్యంపై కనీస అవగాహన లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు అసలు ఆస్పత్రికి రాకపోయినా వచ్చినట్లు హాజరు నమోదు చేసి, అకౌంట్లలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఇందుకు సహకరించిన హెల్త్ ఇన్స్పెక్టర్లకు భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నట్లు తెలిసింది. ఒకరి పేరుతో మరొకరు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, ఛాతి, మానసిక చికిత్సాలయం, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, కింగ్‌కోఠి, మలక్‌పేట్, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి ఏరియా ఆస్పత్రులు సహా మరో వందకు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30వేల మంది పని చేస్తున్నారు. పేషెంట్‌కేర్ ప్రొవైడర్స్ సహా శానిటేషన్ సెక్యురిటీ విభాగాల్లో మరో 10వేలకు పైగా సిబ్బంది ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి ఆయా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ ఏర్పాటు చేశారు. విధులకు గైర్హాజరయ్యే వారిని ఇట్టే గుర్తించడంతో పాటు వేతనాల చెల్లింపును నిలిపివేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్ ప్రతిపాదికన పనిచేస్తూ నెలకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులకు సీనియర్ ఆర్‌ఎంఓలు రోస్టర్, డ్యూటీలు వేసి, వారి హాజరును పర్యవేక్షిస్తుండగా... నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరును హెల్త్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. వీరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ విధులకు గైర్హాజరైన వారిని సైతం హాజరైనట్లు రికార్డుల్లో చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలోనే ఉండరు... ప్రతిష్టాత్మక నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం నిలోఫర్‌లో ఉద్యోగుల విధి నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. నిత్యం వెయ్యి మంది చిన్నారులు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో 18 మంది ఆర్‌ఎంఓలు ఉన్నప్పటికీ.. ముగ్గురు మినహా మిగిలిన వారంతా వేళకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 10:30గంటల తర్వాత ఆస్పత్రికి రావడం, మధ్యాహ్నం 2గంటల తర్వాత వెళ్లడం వీరి పని. ఇక నైట్డ్యూటీలోనూ రెగ్యులర్ ఉద్యోగులు కన్పించడం లేదు. కీలకమైన విభాగాల్లోనూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందే దర్శనమిస్తున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు రోస్టర్ విధానంతో పాటు డ్యూటీలు వేయాల్సిన బాధ్యతతో పాటు రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరు నమోదు బాధ్యత హెల్త్ ఇన్స్పెక్టర్లపై ఉంది. కానీ ఇక్కడి హెల్త్ ఇన్స్పెక్టర్లు రాత్రి విధులకు గైర్హాజరవుతున్నారు. వారి స్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పని చేయిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. నవజాత శిశువులు చికిత్స పొందే కీలకమైన ఈ ఆస్పత్రితో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు కొనసాగు తోంది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. -
ఇక ఈవినింగ్ ఓపీ సేవలు
సుల్తాన్‌బజార్: పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో పేద ప్రజలు, ఉద్యోగులకు ఓపీ సేవలను అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రి పాలక వర్గం సిద్ధమవుతోంది. గతంలో ఆసుపత్రిలో ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకుగాను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పేరుతో ఈహెచ్ఎస్ క్లినిక్‌ను ఓపీ బ్లాక్‌లో ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పలు విభాగాల వైద్యులు వైద్య సేవలు అందించేవారు. కాగా ఈ ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రి పాలక వర్గం ఈసారి ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా వైద్య సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈవినింగ్ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. నిత్యం రద్దీ పెరగడంతోనే.. ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులతో పాటు రోగులకు అందుబాటులో ఉండే విధంగా ఈవినింగ్ క్లినిక్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిత్యం దవాఖానాలోని ఓపీలో నిత్యం సేవలు అందిస్తున్న ఆసుపత్రి పాలక వర్గం.. ఇక ముందు సాయంత్రం సమయాల్లో కూడా వైద్య సేవ అందుబాటులో ఉంటాయి. ఈవినింగ్ క్లినిక్‌లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటు ఉండి సేవల అందిస్తారు. గతంలో ఈహెచ్ఎస్ కొనసాగిన గదులలోనే తిరిగి ఈవినింగ్ క్లినిక్‌ను ప్రారంభించేందుకు పాలక వర్గం అన్ని విధాలా కసరత్తు చేస్తోంది. -
బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సందర్శకులపై ఆంక్షలు విధించారు. నిమ్స్ ఆసుపత్రిలోనూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు. ఇష్టారాజ్యంగా ఎవరుపడితే వారు ఆసుపత్రుల్లో ని రోగుల వార్డుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుం టున్నారు. పాసులున్న వారు మాత్రమే నిర్ణీత వేళ ల్లో వెళ్లొచ్చేలా నిబంధనలు కట్టుదిట్టం చేశారు. బోధనాసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల (జూడా)పై రోగుల బంధువులు తరచూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ ఆంక్షలున్నా పూర్తిస్థాయి లో అమలు కావట్లేదని, ఇకపై కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. జూడాలపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ పోస్టర్లు అంటించాలని నిర్ణయించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం.. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆస్పత్రులకు రోజూ దాదాపు 20 వేల మంది చొప్పున వస్తుంటారు. దీంతో వారికి వసతి సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారుతోంది. మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించడం గగనం గా మారుతోంది. పేదలు కావడంతో రాత్రిళ్లు కూడా ఆరు బయట లేదా రోగుల వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. బోధనాసుపత్రుల వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు తక్కువ ధరకే భోజనం అం దిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఉచితంగా టిఫిన్, భోజనం అందజేస్తున్నాయి. దీంతో రోగుల సహా యకులు ఎక్కువ మంది వస్తూ ఇక్కడే ఉండిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. భారీగా రోగుల బంధువులు, స్నేహితులు గుమిగూడుతుండటం తో ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. రోగుల వద్దకు ఒక సహాయకుడే వెళ్లాల్సి ఉండ గా, గేట్ల వద్ద ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకుని లోపలికి పంపుతున్నారన్న విమర్శలున్నా యి. ఆసుపత్రిలో రోగుల బంధువులు, సహాయకులతోనే నిండిపోతున్నాయి. డబ్బులు తీసుకుని లోపలికి పంపే వారిపై కూడా చర్యలకు ఉపక్రమించారు. ఒక్కోసారి రోగి చనిపోతే బంధువులు డాక్టర్లపై దాడులు చేస్తున్నారు. దీంతో వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. -
ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో నిర్మితమైన ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే దశలో ఉందని, దీని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్‌కుమార్ దీన్ని దాఖలు చేశారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక సౌకర్యాలతో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. ఆసుపత్రి భవనం వైద్యులు, నర్సులు, సిబ్బంది, రోగులకు ప్రమాదకరంగా మారిందని పిటిషనర్ తెలిపారు. ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడుతున్నాయని, గతంలో కూడా పలువురు గాయపడ్డారని వివరించారు. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రస్తుత అవసరాలకు అనుగుణం లేదన్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఈ ఆసుపత్రి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పాయని ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రిని సందర్శించి, కొత్త భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు. -
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
హైదరాబాద్: గన్‌ఫౌండ్రీ డివిజన్లోని ఫతే మైదాన్ క్లబ్‌కు ఎదురుగా ఉన్న ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. ఎనిమిదంతస్తుల భవనంలో ఐదవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని 5, 6, 7 అంత స్తులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తికి స్వల్ప గాయాల య్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని పోలీసులు కాపాడారు. ప్రముఖ ఉర్దూ దినపత్రిక అధినేత ఖాన్ లతీఫ్ ఖాన్‌కు చెందిన ఈ భవనంలో అన్నీ వాణిజ్య సముదాయాలే ఉన్నాయి. ఇదే భవనం నుంచి ఉర్దూ దినపత్రిక మున్సిఫ్ను నడుపుతున్నారు. బుధవారం భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక అబిడ్స్ ఠాణా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది భవనంలో ఏర్పాటు చేసిన ఫైర్ నెట్వర్క్ ద్వారా మంటలను ఆర్పేందుకు యత్నించగా ఫలించలేదు. ఆక్సిజన్ సిలిండర్లు తెరుచుకోకపోవడంతో మంటలు మరిన్ని అంతస్తులకు వ్యాపించాయి. మొత్తం 14 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా మంటలు రావడంతో.. భవనంలో కార్పొరేట్ స్థాయి కార్యాలయాలు, సెల్‌ఫోన్ షోరూమ్స్, కంటి అద్దాల దుకాణాలు, వస్త్ర దుకాణాలు, సెల్ఫోన్ల కంపెనీలతోపాటు కాల్సెంట ర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనంలో ఐదవ అంతస్తులో అడ్వాంటేజ్ వన్ కాల్‌సెంటర్ ఉంది. ఈ కార్యాలయంలో బుధవారం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు, పొగ వ్యాపించడంతో భయపడిన ఉద్యోగులు కిందకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన ఒకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏసీలో వచ్చిన షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. యాజమాన్యానికి నోటీసులు.. భవనంలోని 5, 6, 7 అంతస్తులను సీజ్ చేశామని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ తెలిపారు. భవనానికి ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేనట్టుగా ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతి పత్రాలు, భద్రత, ఫైర్ ఎన్ఓసీ, చేపట్టిన భద్రతా చర్యలపై గురువారం ఉదయంలోగా వివరణ సమర్పించాలని భవన యాజమాన్యానికి నోటీసులు అందించామన్నారు. భవనంలో అమర్చిన ఫైర్ నెట్వర్క్ పనిచేయకపోవడం వల్లే భారీ ఆస్తినష్టం వాటిల్లిందని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఐడియాతో పాటు మరికొన్ని నెట్‌వర్క్‌లు కొన్ని గంటల పాటు పనిచేయలేదు. రాత్రి 7.30 తర్వాత వీటి సేవలను పునరుద్ధరించారు. -
ఉస్మానియాలో ఇంటర్న్‌షిప్ రగడ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల జారీ వివాదాస్పదంగా మారింది. అడిగినంత ముట్టజెప్పితే చాలు డ్యూటీలకు రాకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై కొంతమంది విద్యార్థులు బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ పరిధిలోని వివిధ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న జూనియర్ వైద్యులతో పాటు చైనా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఉస్మానియాలో 200 మంది, గాంధీలో 200 మంది అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ చేస్తుంటారు. ఉస్మానియాలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, క్యాజువాలిటీ విభాగాల్లో 200 మంది హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. వైద్య చికిత్సపై సమగ్ర అవగాహన కల్పించేందుకు రెండు నెలలు మెడిసిన్, రెండు నెలలు జనరల్ సర్జరీ, ఒక నెల పీడియాట్రిక్, 15 రోజులు ఈఎన్టీ, మరో పదిహేను రోజులు కంటి ఆస్పత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆయా విభాగాల్లో సీట్లు పొందిన అభ్యర్థుల్లో వంద మంది ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలో చదువుకున్న వారు ఉంటే మరో వంద మంది ఇతర కాలేజీల్లో చదువుకున్నవారుంటారు. అయితే వీరిపై సరైన నిఘా లేకపోవడంతో వీరిలో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. కానీ వారికి ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రిలో పని చేస్తున్న కొంత మంది క్లర్కులు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌ను వివరణ కోరగా సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆయా విభాగాధిపతుల నుంచి వివరణ కూడా కోరినట్లు నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
ఉస్మానియాలో అరుదైన శస్త్ర చికిత్సలు
అఫ్జల్‌గంజ్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇద్దరు చిన్నారులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలాజి హెచ్‌వోడి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం వివరాలు వెల్లడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన తేజస్విని (11 నెలలు) ఆడుకుంటుండగా బటన్ బ్యాటరీ నోట్లో పెట్టుకుని మింగేసింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన పాప తల్లి సరస్వతి చిన్నారని వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గ్యాస్ట్రోఎంట్రాలాజి వైద్యులు గంటపాటు శ్రమించి ప్రత్యేక చికిత్స ద్వారా గొంతులో ఇరుక్కున్న బ్యాటరీని ఎండోస్కోపిక్ రిమువల్ బాటరి ఇన్ ద్వారా తొలగించారు. అలాగే నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన అలిజ (4) ఈ నెల 3న రూ.2 నాణెంతో ఆడుకుంటూ నోటిలో పెట్టుకొని మింగింది. దీనిని గమనించిన ఆమె తండ్రి మహ్మద్ ఇంతియాజు బాలికను కింగ్‌కోఠిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు పరీక్షలు చేసి ఎండోస్కోపిక్ రిమువల్ ఇన్ టూ రూపీస్ చికిత్స చేసి రెండు నాణేన్ని బయటికి తీశారు. వైద్య బృందంలో హెచ్‌వోడి రమేష్‌తో పాటు ఇతర వైద్యులు, అనస్తీషియా వైద్యులు పాల్గొన్నారు. వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ అభినందించారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 20 మంది మృతిచెందారు. అధికారులు మాత్రం 12 మందే మరణించినట్లు చెబుతున్నారు. ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే స్వైన్‌ఫ్లూతో 10 మంది మరణించినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. చలికాలం ప్రారంభం కావడంతో స్వైన్‌ఫ్లూ మరింత విజృంభిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ఎన్నికల సమయం కావడంతో కిందిస్థాయి వైద్య సిబ్బందిని కూడా ఉపయోగించుకోవడంతో గ్రామాలు మొదలు కార్పొరేషన్ల వరకు అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ తొలిసారి అన్ని జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ నియంత్రణను పర్యవేక్షించేందుకు నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక నోడల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు.. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కోరంటి ఫీవర్ ఆసుపత్రులతో పాటు 30 జిల్లాల్లోని 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను అందుబాటులో ఉంచారు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 467 పడకలను సిద్ధం చేశారు. వైరస్ నిర్ధారణ పరీక్షలను నారాయణగూడ ఐపీఎంతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమూనాలు సేకరించేందుకు అవసరమైన కిట్స్‌ను అందుబాటులో ఉంచారు. స్వైన్ ఫ్లూ సోకిన వారి కోసం లక్ష డోసుల వసల్టావీర్ టాబ్లెట్లు, సిరప్ సిద్ధంగా ఉంచామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. చలికాలంలో హెచ్1 ఎన్1 వైరస్ వ్యాపించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు వైద్యులు, నర్సులు తదితర పారామెడికల్ సిబ్బందికి అవసరమైన మాస్కులు, టీకాలు, ఇతర ఔషధాలు సిద్ధం చేశామని చెప్పారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన రోగులకు తక్షణం పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్సకు గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వివరించారు. -
మృత్యు ఘంటికలు మోగిస్తోన్న స్వైన్‌ఫ్లూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ వైరస్.. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గురువారం ఒక్కరోజే ఇద్దరు మహిళలు స్వైన్ ఫ్లూతో మృత్యువాత పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం మరో 20 మం దికిపైగా బాధితులు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 140కి పైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. వీటిలో వందకుపైగా గ్రేటర్‌లోనే నమోదయ్యాయి. ప్రస్తుత ఫ్లూ బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. గాంధీలో వెంటిలేటర్ల కొరత.. గాంధీ నోడల్ కేంద్రానికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఆస్పత్రి డిజాస్టర్ వార్డులో 10 వెంటిలేటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పటికే వీటిని రోగులకు అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర విభాగాల్లోని వెంటిలేటర్లు వినియోగించుకోవచ్చని భావించినా.. ఆయా వార్డుల్లోని రోగులకే వెంటిలేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని స్వైన్ ఫ్లూ నోడల్ కేంద్రంగా ప్రకటించినప్పటికీ.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పాలనా యంత్రాంగం కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మంది ఫ్లూ పాజిటివ్ బాధితులు ఆస్పత్రిలో చేరగా, వీరిలో నలుగురు మృతి చెందారు. మేడ్చల్ మహిళ మృతి.. గాంధీ ఆస్పత్రిలో వారం రోజుల్లో 10 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఈ నెల 8న గాంధీలో చేరిన మేడ్చల్ జిల్లా బండ్లగూడకు చెందిన మహిళ (56) స్వైన్ ఫ్లూతో గురువారం మృతి చెందింది. ప్రస్తుతం మరో 14 మంది ఆస్పత్రి డిజాస్టర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో సిద్దిపేట మహిళ(55), వనపర్తి మహిళ(50), బాన్సువాడ పురుషుడు(60), కుత్బుల్లాపూర్ మహిళ(55), భువనగిరి పురుషుడు(45), కాచిగూడ గర్భిణి(29), మహేశ్వరం పురుషుడు(45), మహబూబ్‌నగర్ మహిళ(54), ముషీరాబాద్ మహిళ(32), విద్యానగర్ మహిళ(32)లు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. బాధితులందరికీ వెంటిలేటర్ సహాయంతో చికిత్స చేస్తున్నారు. ఉస్మానియాలో గర్భిణి మృతి.. ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 15 మంది చేరగా, వీరిలో ముగ్గురికి ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో సనత్‌నగర్‌కు చెందిన లతీఫ్(57) అక్టోబర్ రెండున మృతి చెందగా, తాజాగా గురువారం ఉదయం తలాబ్‌కట్టకు చెందిన గర్భిణి (27) మృతి చెందింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ బాధితులు చనిపోయిన తర్వాతే స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 2 పాజిటివ్ కేసులు, మరో 10 అనుమానాస్పద కేసులకు చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో గ్రేటర్ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్పత్రి స్వైన్ ఫ్లూ డిజాస్టర్ వార్డు ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 10 పడకలు ఉండగా, ఒక వెంటిలేటర్ అందుబాటులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఏఎంసీ వార్డులోని వెంటిలేటర్లను వినియోగిస్తామని తెలిపారు. ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందే... - సాధారణ ఫ్లూ, స్వైన్ ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. - నిజానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువ. - సాధారణ ఫ్లూ, స్వైన్ ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. - బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. 3 రోజులు కంటే ఎక్కువగా ఈ లక్షణాలు వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. - ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించడం ద్వారా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శ్రీధర్, స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి,ఉస్మానియా ఆస్పత్రి -
చెట్టు కింద డాక్టర్
పాడుబడి, పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి వైద్యులు వినూత్న నిరసనకు దిగారు. శిథిల భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కొన్నాళ్లుగా వైద్యులు కోరుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో గురువారం చెట్ల కిందే రోగులకు సేవలు అందించారు. సాక్షి, సిటీబ్యూరో: కొత్త భవన నిర్మాణం కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు గురువారం వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఇప్పటికే గత కొంత కాలంగా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపిన వైద్యులు తాజాగా భవనం నుంచి బయటికి వచ్చి బయటి రోగులకు చెట్లకిందే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు రోజుకో ప్రాంతంలో పెచ్చులూడి పడుతున్నాయి. ఇప్పటికే పలువురు రోగులు గాయాలపాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆస్పత్రి పాతభవనం దుస్థితి..ఎదరవుతున్న ఇబ్బందులపై వైద్యాధికారులు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చివరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. రోగులకే కాదు వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని పాత భవనంలో చికిత్సలు అందించలేమని స్పష్టం చేస్తూ గురు వారం ఓపీ ప్రధాన ద్వారం బయటే చెట్ల కింద రోగులకు సేవలు అందించి నిరసన తెలిపారు. ఇదే సమయంలో ఔట్‌పేషెంట్ విభాగంలో ఓపీ టోకెన్లు జారీ చేసే కంప్యూటర్ మెరాయించడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
బీ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన ఉస్మానియా ఆస్పత్రికి ‘బీ అలర్ట్’ అంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ చేయగా, ఇంజినీరింగ్ విభాగం రెండు రోజుల క్రితం నిర్మాణాన్ని పరిశీలించింది. రెండు మూడు రోజుల్లో ఆ విభాగం కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఐదుసార్లు భవనం పైకప్పు పెచ్చులూడడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందాల్సినపరిస్థితి నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ కూడా తమకేం సంబంధం లేదని నోటీసులు జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక వైద్యాధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండడంతో... ఇప్పట్లో కొత్త భవన నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశంపై ఆయా విభాగాల అధిపతులతో చర్చింది ఓ నిర్ణయం తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ భావించారు. ఈ మేరకు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నాలుగేళ్లయినా... నిర్వహణ లోపంతో పాతభవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో... అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు ఎకరాల్లో ఏడు అంతస్తుల కొత్త భవనం నిర్మించాలని భావించారు. ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. ఓ పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదు అంతస్తులకు కుదించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాదిరాయి కూడా పడలేదు. ఇప్పట్లో మోక్షం లేనట్లే... పాతభవనంలో రోగులకు చికిత్సలు ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరించడంతో ఏడాది క్రితం రెండో అంతస్తులోని రోగులను ఖాళీ చేయించింది. వీరికి ప్రత్యామ్నాయంగా కింగ్‌కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగుల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో అది కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ప్లేస్లో తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఇదే సమయంలో వైద్యులు, సిబ్బంది జేఏసీగా ఏర్పడి సుమారు 100 రోజులు నిరసన వ్యక్తం చేశారు. వరుస ఘటనలు, వైద్యుల ఆందోళనలకు స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. కనీసం కొత్త భవనాల నమూనాలు కూడా ఆమోదం పొందలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండటంతో కొత్త భవనానికి ఇప్పట్లో మోక్షం లభించే అవకాశం కూడా లేకపోవడంతో వైద్యులతో పాటు రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మందు కొట్టాడా..లేదా?
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ‘డ్రంక్ అండ్ డ్రైవ్’తనిఖీల్లో విచిత్రం చోటుచేసుకుంది. శ్వాస పరీక్ష యంత్రంతో ఓ యువకుడిని పరీక్షించగా మద్యం తాగినట్లు రీడింగ్ వచ్చింది. అదే యువకుడు శాంతిభద్రతల విభాగం పోలీసుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు. అతడు మద్యం తాగలేదంటూ వైద్యులు తేల్చారు. వైద్యులు రక్తపరీక్షలు చేయలేదని, ఈ వ్యవహారాన్ని అభియోగపత్రాల్లో కోర్టుకు సమర్పిస్తామని సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్రాజు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది వారాంతం నేపథ్యంలో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి కాచిగూడలోని ఐనాక్స్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి 9.05 గంటల ప్రాంతంలో ఇన్నోవాలో వచ్చిన హాజిపుర వాసి సయ్యద్ జహిరుద్దీన్ ఖాద్రీని (21) ఆపి శ్వాసపరీక్ష యంత్రంతో తనిఖీ చేశారు. దీంతో యంత్రం రీడింగ్‌లో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 43గా చూపింది. నిబంధనల ప్రకారం 35కంటే ఎక్కువ వస్తే అది ఉల్లంఘన కావడంతో ట్రాఫిక్ పోలీసులు జహీరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. అయితే తాను మద్యం తాగలేదంటూ వాదించిన ఆయన మరోసారి పరీక్ష చేయమన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం అలా చేయడం కుదరదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో సవాల్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో జహీరుద్దీన్ నేరుగా సుల్తాన్‌బజార్ శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని ఆశ్రయించి ట్రాఫిక్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. దీంతో విధుల్లో ఉన్న ఎస్సై ఓ కానిస్టేబుల్‌ను ఇచ్చి జహీరుద్దీన్‌ను రాత్రి 11.35 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. రక్తపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కిట్స్ అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న వైద్యులు జహీరుద్దీన్ నడక, కళ్ళు, మాటతీరు పరిశీలిం చడం ద్వారా మద్యం తాగలేదంటూ నివేదిక ఇచ్చారు. పోలీసులు తనపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని జహీరుద్దీన్ ఆరోపిం చారు. దీనిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్రాజు ’సాక్షి’తో మాట్లాడుతూ, ‘జహీరుద్దీన్‌కు నిబంధన ప్రకారమే పరీక్షలు నిర్వహించాం. మావద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తాం. అభ్యంతరాలు ఉంటే కోర్టులో చాలెంజ్ చేయవచ్చు. వైద్యులు రక్తపరీక్షలు చేయాల్సి ఉండగా ఉస్మానియాలో అలా జరగలేదు’అని అన్నారు. -
ఐసీయూలో ఉస్మానియా
లక్షలాది మందికి ఆరోగ్యప్రదాయిని ఉస్మానియా ఆస్పత్రి ప్రమాదకరంగా మారింది. ఎన్నో ప్రయోగాలకు, వైద్య అద్భుతాలకు వేదికైన ఈ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పైకప్పు గురువారం మళ్లీ పెచ్చులూడింది. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు కూలడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాది మందిచికిత్స పొందుతున్న ఈ భవనంలో వైద్యం అందించడం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ప్రభుత్వం ఈ విషయాన్ని పెడచెవిన పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుగురు ముఖ్యమంత్రుల కాలంలో ఎన్నో సార్లు నిధులు కేటాయించినా భవన నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు పడగకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో: గోల్సావాడి.. మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్స చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేపట్టగా ఐదో నిజాం అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. అలా 1866 నాటికి అప్జల్‌గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఆధునిక వైద్యం సామాన్యులకూ చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో మూసీ వరదల్లో నేలమట్టమైంది. అయితే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అప్జల్‌గంజ్ ఆస్పత్రి స్ఫూర్తిని బతికించాలని భావించి 27 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న ఆధునిర భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి చేసుకుంది. గొప్పగొప్ప వైద్యులుసేవలందించిన ఆస్పత్రి 1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇండో పర్షియన్ శైలికి రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేసి ఈ భవనాన్ని నిర్మించగా 1925లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది. ఆస్పత్రి సూపరింటిండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్యబృందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు. ప్రతిపాదించి పదేళ్లైనా.. నిర్వహణ లేక పాతభవనం శిథిలమైంది. ఇది రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేయడంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.50 కోట్లు కేటాయించి భవన నిర్మాణానికి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చి పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కు తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. అక్కడన్నారు..ఇక్కడన్నారు.. ప్రమాదకరంగా మారిన పాతభవనంలోని రోగుల కోసం ఏడాది క్రితం కింగ్‌కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్ల వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగులను తరలింపు ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్ప్లేస్లో తాత్కాలిక రేకుల షెడ్లు వేయాలని ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడే నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. పలు సూచనలు చేసిన ‘ఇంటాక్’.. ♦ చారిత్ర పాతభవనం ఇప్పటికీ పటిష్టంగానే ఉందని 2014లో దీన్ని పరిశీలించిన ఇంటాక్ ప్రతనిధులు తెలిపారు. కనీస మరమతులకు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, పూర్తిస్థాయిలో మరమతులకు రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రకటించారు. ♦ ఉస్మానియా ప్రాంగణం 26.5 ఎకరాలు ఉంది. ఇందులో పాత భవనం 2.5 ఎకరాలు మాత్రమే విస్తరించి ఉంది. రోగుల అవసరాల దృష్ట్యా కొత్త భవనం కట్టాలనుకుంటే పాత భవనాన్ని అలాగే ఉంచి, పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనం కట్టవచ్చు. ♦ హెరిటేజ్ భవనానికి ఎటూ వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఎత్తయిన భవనాలు నిర్మించరాదనే నిబంధన ఉంది. ప్రజావసరాల దష్ట్యా ఇలాంటి అభ్యంతరాలపై హెరిటేజ్ నుంచి మినహాయింపు పొందవచ్చు. మూడు నెలలైనా.. కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల వరుసగా 90 రోజుల పాటు ఆందోళన చేశాం. ఆరోగ్యశాఖ మంత్రి జేఏసీ నేతలతో చర్చించి, 15 రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు నెలలైనా ప్లానింగ్ కాపీ కూడా ఆమోదముద్ర పొందలేదు. ప్రాణాలకు కనీస రక్షణ లేని ఈ భవనంలో వైద్యం అందించలేం. – డాక్టర్ పాండునాయక్, చైర్మన్,ఉస్మానియా వైద్యుల జేఏసీ -
మళ్లీ కూలింది..
చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు అనంతయ్య(60). షాద్‌నగర్ తొండపల్లికి చెందిన ఈయనకు 20 రోజుల క్రితం బైక్ ఢీకొట్టింది. కాలుకు ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనం లోని ఆర్థోపెడిక్ వార్డులో ఇటీవల ఇన్‌పేషంట్‌గా చేరాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి ఆయనపై పడింది. ఆయన్ను వెంటనే ఐసీయూకు తరలించారు. అదేవార్డులోని రోగులంతా భయంతో బయటికి పరుగులు తీయాల్సి వచ్చింది. నెలలోనే 3సార్లు పెచ్చులూడి పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, హైదరాబాద్: లక్షలాది రోగుల ఆరోగ్యప్రదాయిని అయిన ఉస్మానియా ఆస్పత్రి నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో పైకప్పు గురువారం ఉదయం మళ్లీ పెచ్చులూడి పడింది. అసలే వర్షాకాలం.. ఆపై పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపు తున్నారు. భవనం నిర్మించి సుమారు వందేళ్లు కావొస్తుం డటం, ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ నెల 19న 12 ఫీట్ల ఎత్తున్న దోబీఘాట్ గోడ కూలగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నెల 13న ఓపీ భవన ప్రధాన ద్వారం ఫోర్టికో పైకప్పు కూలింది. భారీ శబ్దం రావడంతో ఓపీలోని రోగులు భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. నెల క్రితం పాత భవనం రెండో అంతస్తులో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఇప్పటికే ఈ విభాగాన్ని ఖాళీ చేయడంతో పెద్ద ప్రమాదం త ప్పింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే పాత భవనం రెండో అంతస్తును ఖాళీ చేయించాం. అందులోని 240 పడకల ను ఫస్ట్, గ్రౌండ్ ఫ్లోర్లో సర్దుబాటు చేశాం. పాత భవనం దుస్థితిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వర్షానికి స్లాబ్‌లు, గోడల నాని బలహీనంగా తయారయ్యాయి. - డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి -
మళ్లీ కూలిన ‘ఉస్మానియా’ పైకప్పు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీ భవనం ప్రవేశద్వారం పైకప్పు మళ్లీ కుప్పకూలింది. వందల మంది చికిత్స పొందుతున్న ఈ భవనంలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పైకప్పు పెచ్చులూడి కింద పడటంతో భారీ శబ్దం వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అసలే వర్షాకాలం..ఆపై రోజుకో చోట పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు ఆందోళేన చెందుతున్నారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులకు ఇది సురక్షితం కాదని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. దీంతో అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి.. 2009లో రూ.5 కోట్లు మం జూరు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనం స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలుసహా పురావస్తు శాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. -
ఉస్మానియాలో గుట్కా, సిగరెట్లపై నిషేధం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సిగరెట్, గుట్కా, తంబాకు, పాన్‌మాసాలలను నిషేధిస్తూ ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ నాగేందర్ బుధవారం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీ చేయాలని సూచించారు. అటెండెంట్లు ఆస్పత్రిలో వచ్చి సిగరెట్ తాగడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తక్షణమే వీటిపై నిషేధం అమలు చేయాలని అన్ని శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటి మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రోగులు వారి అటెండర్లకు చెందిన లగేజీలు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
కాటేస్తున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నే సమయంలో పుట్టలు, ఏపుగా పెరిగిన గడ్డి నుంచి పాములు బయటికి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి 149 పాము కేసులు వచ్చాయి. ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం గమనార్హం. పాము కాటుతో పాటు ఇతర విషపు పురుగులు కుట్టి ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ స్నేక్ వీనం మందుతో పాటు వెంటిలేటర్ సపోర్ట్, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియాకు పరుగులు తీస్తున్నారు. పాము కాటును గుర్తించి, ఆస్పత్రికి తరలింపులో తీవ్రజాప్యం జరుగుతుండటంతో బాధితులు మృత్యువాతపడుతున్నారు. మూడు గంటలు మించితే ప్రాణాపాయమే.. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్లు ఓ అంచనా. మన దేశంలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. దేశంలో దాదాపు 250 జాతుల పాములంటే వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో కనిపించే పాముల్లో 5 జాతులు మాత్రం అత్యంత విషపూరితమైని. ఇవి కాటేసిన మూడు గంటల్లో మనిషి చనిపోతాడు. ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు తప్పదు. కాటువేసిన పాము విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. ఒకటి లేదా రెండు కాట్లు ఉంటే విషపూరితమైందని.. మూడు అంతకంటే ఎక్కువ ఉంటే విషరహితమైందిగా గుర్తించాలి. విషపూరిత సర్పం కాటువేస్తే గాయమైన ప్రాంతం నుంచి విషం శరీరంలోకి చేరుతుంది. అక్కడి నుంచి గుండెకు, గుండె నుంచి ఇతర శరీర భాగాలు, మెదడుకు రక్తం ద్వారా చేరుకుంటుంది. పాము విషం అన్ని శరీర భాగాలకు చేరడానికి మూడు గంటలు పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. విషపూరిత సర్పం కరిచిన వెంటనే గాయంపై అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని పాము కాటువేసిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. మొదట రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తమని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేస్తే ఆ వ్యక్తి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ఎంఎల్ నుంచి 2 ఎంఎల్ వరకు మాత్రమే. అలాగే కేవలం రూ.5 నుంచి రూ.10 విలువుండే నాజా 200 అనే 5ఎంఎల్ హోమియోపతి ఔషధం ఇంట్లో ఉంచుకోవాలి. దీనిని పాము కాటుకు గురైన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి మూడుసార్లు వేస్తే త్వరగా కోలుకుంటాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. -
సర్జరీల్లో ఘనాపాఠి!
ధనార్జనే ధ్యేయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవృత్తిని దైవంగా భావించి పేదల పాలిట వైద్య నారాయణుడిగా మారారు ఆయన. తండ్రి చూపిన సేవా మార్గంలో పయనిస్తూ వేలాది శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఆయన. ప్రభుత్వ దవాఖానాలపై విశ్వాసం కలిగేలా విధులు నిర్వర్తిస్తూ.. గడిచిన ఆరున్నరేళ్లలో 13,139 శస్త్ర చికిత్సలు చేశారు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్లాస్టిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్. అఫ్జల్‌గంజ్ : నాగప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం. తండ్రి కృష్ణమూర్తి చీఫ్ ఇంజినీర్. తల్లి పుష్పలత. వీరి కుటుంబం హైదరబాద్‌లో స్థిరపడింది. కృష్ణమూర్తి దంపతులకు నాగప్రసాద్, శ్రీనివాస్ ఇద్దరు కుమారులు. నాగప్రసాద్ వైద్యరంగంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాగప్రసాద్ 1994లో సూపర్ స్పెషలిటీ (ప్లాస్టిక్ సర్జన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 1997లో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2004లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మూడేళ్లు పని చేసి 300 శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం బదిలీపై నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. 2012 నుంచి ఇప్పటివరకు 13,139 శస్త్ర చికిత్సలు చేశారు. ప్రతి ఏటా వెయ్యికిపైగా శస్త్ర చికిత్సలు చేసి పేదోల పాలిట ప్రాణదాతగా నిలుస్తురు. ఉస్మానియాలోనూ కార్పొరేట్ వైద్యం.. పేదోలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కార్పొరేట్ స్థాయిలో ఉస్మానియా ఆస్పత్రిలోనూ వైద్యం అందుతోంది. పేదవాళ్లు డబ్బులు వృథా చేసుకోకుండా ఉస్మానియాలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేసుకోవాలి. – డాక్టర్ నాగప్రసాద్ -
పెళ్లి విషయమై వాగ్వివాదం
శంషాబాద్: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం తో పోలీసులను ఆశ్రయించడానికి బయలుదేరిన ఓ జంట మార్గమధ్యలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మొయినాబాద్ మండలం ఎల్కగూడకి చెందిన జోషి(21) అదే మండలం చిల్కూరుకు చెందిన నయోమి(22) ప్రేమించుకుంటున్నారు. ఇటీవల నయోమికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో వెంటనే పెళ్లి చేసుకుందామని జోషిపై ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో శనివారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మార్గమధ్యలో జోషి మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని నయోమితో చెప్పాడు. ఈ విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అసహనంతో జోషి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో నయోమి కూడా అతడిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరికీ మంటలంటుకున్నాయి. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పోలీసుల దిగ్బంధనంలో ఉస్మానియా ఆస్పత్రి!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు అనూహ్యంగా శనివారం సాయంత్రం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఏకంగా 100 మంది ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రిని దిగ్బంధనం చేశారు. ఆస్పత్రిలో పలు అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ ఆకస్మిక కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆస్పత్రిలోని రోగులు, వారి సహాయకుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ఇన్సూరెన్స్ బ్రోకర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని రోగులను మాయమాటలతో మోసం చేసే దళారులనూ అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ ఇప్పిస్తామంటూ రోగులను మోసం చేస్తున్న బోకర్ల బాగోతం కార్డాన్ సెర్చ్‌లో బహిర్గతం అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి. -
ఉస్మానియాలో ఆకస్మిక తనిఖీలు : లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి అనారోగ్యంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని ఆయన కు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సూపర్డెంట్కు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులను మీరు ఏ సమస్యల వలన ఆసుపత్రికి వచ్చారు, మీకు వైద్యం సరిగ్గా అందుతందా లేదా అని మంత్రి అడుగగా దానికి వారు భాగనే ఉందని సమాదానం ఇచ్చారు. రోగులకు ఐసీయు లోని వివిధ విభాగాలను పరిశీలిచి, తాగు నీరు, డోర్స్, వెంటిలేటర్లు, లిఫ్ట్, ఆక్సిజన్ వంటి అంశాలను పరిశీలించారు. లిఫ్ట్ మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. మంత్రి వెంట ఉస్మానియా సూపర్డెంట్ నాగేందర్ ఆర్‌ఎంఓలు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం కోసం ఉస్మానియాకు.. మహిళపై దారుణం!
సాక్షి, హైదరాబాద్ : భర్త కొట్టాడని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళకు దారుణమైన అనుభవం ఎదురైంది. వైద్యం కోసం పోలీసులు నిర్లక్ష్యంగా ఆమెను ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రి పంపించడంతో.. కీచకులు బాధితురాలిపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త తనను కొట్టాడంతో ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైద్యం కోసం బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లడంతో.. అక్కడ తనపై వార్డ్బాయ్ నాగరాజు, హోంగార్డ్ ఒమర్ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
వైద్యం అందక రోగి మృతి
హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 17 రోజు ల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన శనివారం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని కార్వాన్కు చెందిన కోరని బాగ్యలక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త చి న్నా ఆమెను లంగర్‌హౌజ్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. దీం తో ఆమెను ఈ నెల 3న ఉస్మానియాకు తరలించగా, 5న అడ్మిట్ చేసుకున్నారు. బాగ్యలక్ష్మిని పరీక్షించిన వైద్యులు ‘బలహీనంగా ఉంది. అడ్మిట్ వద్దు. సమయానికి తినిపించండి. బాగవుతుంది. మందు బిళ్లలు వేయడం మరవద్దు’అని చెప్పి పంపించారు. -
పాత భవనంలో పనిచేయలేం..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పనిచేయలేమంటూ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైద్య, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. వైద్యులు, ఉద్యోగులు తొలిరోజు సోమవారం ఉదయం గంటపాటు ఔట్‌పేషంట్ (ఓపీ) సేవలను నిలిపివేశారు. నల్లబ్యాడ్జీలు ధరిం చి పరిపాలనా భవనం ముందు ధర్నా చేశారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, తరచూ పైకప్పు పెచ్చులూడుతున్నాయని వైద్యులు తెలిపారు. బిక్కుబిక్కుమంటూ సేవలందించలేమని స్పష్టం చేశా రు. రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని, వెంటనే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. ప్రభు త్వం హామీ వచ్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నిరసన లో పాల్గొనడంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రోగులు ఇబ్బందిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం నిర్వహణాలోపంతో శిథిలావస్థకు చేరుకుంది. వైద్యచికిత్సలకు ఈ భవ నం సురక్షితం కాదని, వెంటనే ఖాళీ చేయాలని పదేళ్ల క్రితమే ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఉస్మానియా వైద్యాధికారుల్లో కదలిక
సాక్షి, హైదరాబాద్: సిబ్బంది పనితీరుపై మరింత దృష్టి సారించాలని ఉస్మానియా ఆస్పత్రి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది రాకపోకలు, రోగులపట్ల అనుసరిస్తున్న తీరు, వార్డుల్లోని సేవలు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు ఓ అంచనాకు రావాలని యోచిస్తున్నారు. అత్యవసర విభాగంలో అర్ధరాత్రి సేవలు నిలిచిపోయిన ఘటనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ స్పందించారు. సోమవారం క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు(సీఎంవో), డ్యూటీ ఆర్ఎంవోలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఈ విభాగంలో మెరుగైన సేవలు అందించేందుకు మెడిసిన్, సర్జరీల నుంచి ఒక్కో పీజీని కేటాయించేందుకు అంగీకరించారు. ఆర్ఎంవోలతో రోజూ మధ్యాహ్నం సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని, సూపరింటెండెంట్ స్థాయిలో సాధ్యంకాకపోతే డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఔట్‌పేషెంట్ విభాగానికి రోజుకు సగటున 2,500 మంది రోగులు వస్తున్నారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. రోగులకు సరిపడ సంఖ్యలో వైద్యులున్నా అత్యవసర పరిస్థితుల్లో ఎవరూ అందుబాటులో ఉండటంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వల్ల డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది తరచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కా హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ అటెండెన్స్‌ను వినియోగించుకోవడంతోపాటు సీసీ కెమెరాల ద్వారా వార్డులపై నిఘా పెంచాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఇకపై మరింత కఠిన నిర్ణయాలు నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. రోగులందరికీ సేవలు అందేవిధంగా చూస్తాం. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు, ఆర్ఎంవోలు, సిబ్బంది సమన్వయంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా -
ఉస్మానియా ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలోని శవాలను ఎలుకలు, పంది కొక్కులు పీక్కుతింటున్న వైనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘శవాలను పీక్కుతింటున్నాయి’ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్.. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ నెల 28లోగా నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, టీఎస్ఎంఐడీసీ ఇంజనీర్లు బుధవారం మార్చురీని సంద ర్శించి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వివాదాస్పదంగా మార్చురీ నిర్వహణ.. ఉస్మానియా మార్చురీ నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. ఆ బాధ్యత తమది కాదంటే తమదికాదంటూ ఫోరెన్సిక్, ఆస్పత్రి వైద్యులు తప్పించుకుంటున్నారు. ‘శవాలకు పోస్టుమార్టం చేయడం వరకే మా పని’అని ఫోరెన్సిక్ వైద్యులు స్పష్టం చేస్తుండగా.. ‘పోస్టుమార్టం సహా శవాలను భద్రపరచడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలను ఇప్పటి వరకు వైద్య కళాశాలకు చెందిన ఫోరెన్సిక్ విభాగమే చూసుకునేది’అని ఆస్పత్రి వైద్యులు చెబుతు న్నారు. మార్చురీకి ఆస్పత్రికి సంబంధం లేదని, అది పూర్తిగా వైద్య కళాశాలకు అనుబంధమని, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నందు వల్లే మంచినీరు, విద్యుత్ సరఫరా చేస్తున్నామని, అంతకు మించి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 11 మంది ఆర్‌ఎంఓలు ఉన్నా.. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి న్యాయపరమైన అంశాలతో ముడిపడిన(మెడికో లీగల్ కేసులు) మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకొస్తారు. వీటిని నేరుగా మార్చురీకి తరలిస్తుండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారి వివరాలను ఎంఎల్సీ రిజిస్టర్లో నమోదు చేయాలి. నిబంధనల ప్రకారం ఈ పనులను సంబంధిత మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి. బంధువులు కోరితే పోస్టుమార్టం తర్వాత ఉచిత అంబులెన్స్‌ను బుక్ చేసి, శవాన్ని వారి సొంతూరుకు పంపాలి. కానీ ఉస్మానియాలో 11 మంది ఆర్‌ఎంఓలు ఉన్నా.. ఏ ఒక్కరూ ఈ పని చేయడం లేదు. శవాల తరలింపు పనులను కూడా పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన హెల్త్ ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తున్నారు. -
శవాలను పీక్కుతింటున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: మనిషి బతికున్నప్పుడు గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. చనిపోయిన తర్వాత శవానికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అయితే.. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. మార్చురీ సిబ్బంది వచ్చిన శవాలకు సకాలంలో పోస్టుమార్టం చేయకపోవడమే కాక.. ఉన్నవాటికీ రక్షణ కల్పించలేక పోతున్నారు. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్ రూమ్‌లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఓ శవాన్ని ఎలుకలు, పందికొక్కులు పీక్కుతినడం చర్చనీయాంశమైంది. సమయం మించిందని అప్పగించి వెళితే.. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన ఉమ(21) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటికే సాయంత్రం ఆరు కావడంతో ఫోరెన్సిక్ నిపుణులు విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో యువతి బంధు వులు శవాన్ని మార్చురీ సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి శవాన్ని పరిశీలించగా.. ముక్కు, పెదాలు, మెడ భాగం ఛిద్రమై కన్పించాయి. దీంతో మార్చురీ సిబ్బందిపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. కుప్పలుగా శవాలు.. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మార్చురీ కొనసాగుతోంది. ఇక్కడికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలే కాక గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి మెడికో లీగల్ కేసులకు సంబంధించిన శవాలు వస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 20–25 శవాలు వస్తుంటాయి. రోజుకు సగటున 15 శవాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. వీటిని భద్రపరిచేందుకు 32 ్రíఫీజర్ బాక్సులు, ప్రత్యేకంగా ఓ గది ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత మూడు రోజుల వరకు బాడీలను భద్రపరిచే వీలుంది. అప్పటికే బాడీ డీకంపోజ్ అయితే డంప్ రూమ్‌లోకి తరలిస్తారు. బంధువులు శవాలను గుర్తించి తీసుకెళ్లగా, మిగిలిన వాటిని అనాథ శవాలుగా పరిగణించి జీహెచ్ఎంసీకి అప్పగిస్తారు. వీటిని ప్రతి పది రోజులకు ఓసారి సామూహిక దహనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో భారీగా శవాలు పేరుకుపోతున్నాయి. తగిన బాక్స్‌లు లేకపోవడం వల్లే.. నిర్దేశిత సమయంలో వచ్చిన శవాలకు అదే రోజు పోస్టుమార్టం చేస్తుండగా, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చిన వాటిని ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచి, పోలీసుల పంచనామా తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు పంచనామా ఇన్‌టైమ్‌లో చేయకపోవడం, బంధువులు సకాలంలో రాకపోవడం వల్ల కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు శవాన్ని బాక్స్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫ్రిజర్ బాక్సులన్నీ శవాలతో నిండిపోవడంతో ఆ తర్వాత వచ్చిన వాటిని వార్డులో ఓ మూల పడేయాల్సి వస్తోంది. వస్తున్న శవాల నిష్పత్తికి తగ్గట్టు మార్చురీని అభివృద్ధి చేయకపోవడం.. ఎప్పటికప్పుడు శవాలను దహనానికి తరలిం చకపోవడం ఇందుకు కారణాలని వైద్యనిపు ణులు చెపుతున్నారు. ఉస్మానియా మార్చురీ మూసీ నదిని ఆనుకుని ఉంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి భవనానికి మరమ్మతులు నిర్వహించక పోవ డంతో పందికొక్కులు, ఎలుకలు, కుక్కలకు నిలయంగా మారింది. వీటిని నియంత్రించా ల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిజానికి ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచిన శవాలను పందికొక్కులు, ఎలుకలు కొరికే అవకాశం లేదు. బాక్స్‌లో కాకుండా వార్డులో ఓ మూలన పడేస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
విజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు కాలే విజయ్ సాయి(40) మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. నేటి సాయంత్రం విజయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల యూసుఫ్ గూడలోని సొంత ఫ్లాట్‌లో విజయ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్యకు ముందు నాలుగు నిమిషాల నిడివి సెల్ఫీ వీడియోలో విజయ్ మాట్లాడుతూ.. భార్య వనితతో పాటు ముగ్గురిపై ఆరోపణలు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య వనిత కూడా తీవ్రస్థాయిలో విజయ్‌పై ఆరోపణలు చేయడంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. 'తన చావుకు భార్య వనితతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త శశిధర్(నవయుగ సంస్థ), అడ్వొకేట్ శ్రీనివాస్ కారణం. వనిత తనకు వాల్‌పోస్టర్ సినిమా షూటింగ్లో పరిచయమైందని, పెళ్ళైన తర్వాతే ఆమె నిజస్వరూపం తెలిసింది. నా కుమార్తె కుందన(7)ను మీరు పెంచాలి. నా భార్య వద్ద పెరగకూడదు. ఐ లయ్ యూ డాడీ.. ఎవరినీ వదిలిపెట్టొద్దు.. అందరికీ శిక్ష పడేలా చేయండి డాడీ' అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్ తన అవేదనను వ్యక్తం చేశారు. కాగా, ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్ ధరించిన వస్త్రాలు, వీడియోలో ఉన్న వాటిని పోల్చిన పోలీసులు.. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే దాన్ని చిత్రీకరించినట్లు గుర్తించారు. దీన్ని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. నటుడు విజయ్ అమ్మాయిలు అబ్బాయిలు, ఒకరికి ఒకరు, మంగళ, వరప్రసాద్ పొట్టిప్రసాద్, బొమ్మరిల్లు తదితర సినిమాల్లో నటించారు. -
ఉస్మానియా ఆసుపత్రిలో మహిళ అనుమానస్పద మృతి
-
ఉస్మానియా ఆస్పత్రిలో కారు బీభత్సం
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి వద్ద గురువారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపు తప్పిన రోగులపైకి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉస్మానియాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో పేషెంట్లు ఉన్న వార్డుల్లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. -
డాక్టర్..పేషెంట్..మధ్యలో పోలీస్
హైదరాబాద్: ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో పోలీసు పహార మధ్య వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నలుగురు జూనియర్ వైద్యులపై దాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం ఆసుపత్రిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం జూనియర్ డాక్టరుపై ఓ రోగి బంధువులు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర సేవలను నిలిపివేయడంతో ఐపీ, ఓపీ, కులీకుత్భ్షా ఇలా అన్ని భవనాలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత రెండు రోజులుగా తమకు రక్షణ కల్పించాలంటూ ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో చర్చలు సఫలమవడంతో బుధవారం జూడాలు సమ్మె విరమించి వైద్య సేవలు ప్రారంభించారు. -
రెండో రోజు జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు తమ ఆందోళనను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. రోగి బంధువులు ఆదివారం రాత్రి ఓ జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారంటూ జూనియర్ వైద్యులు సోమవారం ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వారితో సోమవారం చర్చలు జరిపినప్పటికీ జూనియర్ డాక్టర్లు తమ పట్టు వదల్లేదు. దీంతో వారి డిమాండ్లపై కమిటీ వేశారు. కమిటీ నివేదిక గురువారం వచ్చే అవకాశముండగా.. నివేదికలోని అంశాలను చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు అభిషేక్ తెలిపారు. -
ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
-
హాస్టల్లో ఇమడలేక.. బిల్డింగ్‌పై నుంచి దూకాడు
- విద్యార్థి తలకు బలమైన గాయాలు.. ఉస్మానియాలో చికిత్స - ఆగాపురా గురుకులంలో ఘటన.. ఆందోళనలో విద్యార్థులు హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆరో తరగతి చదివే ఓ విద్యార్థి గురుకులం మూడో అంతస్తు నుంచి కిందికి దూకడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగాపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. ఆగాపురాలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు నాంపల్లి దర్గాషా ఖామూస్ ప్రాంతానికి చెందిన అయేష్ అనే ఆరో తరగతి విద్యార్థి హాస్టల్ వాతావరణంలో ఉండలేక మూడో అంతస్తు నుంచి కిందికి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. సెంట్రల్ కేఫ్ ఎదురుగా ఉన్న ఇసుకలోకి దూకేందుకు యత్నించగా పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో విద్యార్థి తలకు బలమైన గాయాలయ్యాయి. అయేష్ను తొలుత ఏరియా ఆసుపత్రికి.. అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రారంభమైన రోజే.. మైనార్టీ గురుకుల విద్యాలయం ప్రారంభమైన రోజే ఇమ్రాన్, అక్రమ్ అనే ఇద్దరు విద్యార్థులు భవనం రెండో అంతస్తు నుంచి పక్కింటి మేడ మీదకు దూకారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పక్కింటి యజమానులు విద్యార్థులను పట్టుకుని హాస్టల్లో అప్పగించారు. బుధవారం నాటి ఘటనతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురుకులానికి చేరుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. హాస్టల్లోని విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు బలగాలను మొహరించారు. ఈ ఘటనపై మైనార్టీ శాఖ ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించారు. -
కేటాయింపు 200 కోట్లు.. ఇచ్చింది 6 కోట్లు
- ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంపై సీనియర్ సిటిజన్స్ లేఖ - పిల్‌గా పరిగణించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదంటూ సీనియర్ సిటిజన్స్ స్వచ్ఛంద సంస్థ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఉస్మానియా ఆస్పత్రిలో చాలాభాగం కూలిపోయే దశలో ఉందని, కొత్త ఆస్పత్రి భవనానికి రూ.200 కోట్లు కేటాయించిందని పేర్కొంది. ఇప్పటి వరకు రూ.6 కోట్లే విడుదల చేశారని తెలిపింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరింది. దీనిపై స్పందించిన కోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది. -
నాటి బీజం... నేటి సేవా వృక్షం
బంధువులు కానీ స్నేహితులు కానీ హాస్పిటల్లో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? పండ్లు తీసుకెళ్లి ఆత్మీయంగా పలకరిస్తారు. ఆదరంగా మాట్లాడతారు. ఏమీ కాదని ధైర్యం చెబుతారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తారు... ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అయితే... మౌలానా గియాజ్ అహ్మద్ రషాదీ అంతటితో ఆగిపోలేదు. హైదరాబాద్, ఉస్మానియా హాస్పిటల్లో తన బంధువుని పరామర్శించి, మరో బెడ్ మీద ఏకాకిగా ఉన్న 65 ఏళ్ల పేషెంటును కూడా పలకరించాడు. కుశలం అడుగుతూ... ‘మీకు ఎవరూ లేరా? మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ రాలేదేమిటి’? అని అడిగాడు. అప్పుడా పెద్దాయన ‘నాకు ఎవరూ లేరని, అల్లా నా కోసం నిన్ను పంపించాడు’ అన్నాడు. ఆ మాట రషాదీ మార్గాన్ని మార్చేసింది. ఇప్పుడు రషాదీ గొప్ప సమాజసేవకుడు. ఆ పెద్దాయనతో మొదలు పెట్టిన సహాయం... నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. పదకొండు రాష్ట్రాల్లో ‘సఫా బైతుల్ మాల్’ ఆపన్నులకు సేవలందిస్తోంది. రంజాన్ మాసంలో అన్నం పెడుతోంది. వందలాది ఇళ్లలో ఈదుల్ ఫిత్ర్ పండుగ చేస్తోంది. ఉస్మానియాతో మొదలు! ఉస్మానియాలో పరిచయమైన ఆ పెద్దాయనకు ఆహారం, మందులు తెచ్చి ఇచ్చాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అలాగే చేశాడు. అలా సమాజంలో ఎంతమంది ఉన్నారోననే ఆలోచన. అది బీజంలా నాటుకుంది. స్నేహితులను కలుపుకుని 2006లో ‘సఫా బైతుల్ మాల్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించాడు. ఈ పదేళ్లలో అది నగరంలోని 70 బస్తీలకు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడ, ఒరిస్సా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు విస్తరించింది. ఎక్కడెక్కడ అవసరం? రషాదీ హైదరాబాద్, ఓల్డ్ మలక్‌పేటలో అరబిక్ టీచర్. మదర్సాలలో చదువుకునే విద్యార్థుల్లో ఈ సేవాగుణాన్ని అలవరిచి, వారినే స్వచ్ఛంద సహాయకులుగా మార్చుకున్నారు. విద్య, వైద్యంతోపాటు అనారోగ్యంతో ఉన్న వారికి మందులు, తిండి లేని వారికి దినుసులు ఇస్తారు. పిల్లల పోషణ భారంతో కుంగిపోతున్న మహిళలు, వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డును పోలిన కార్డును మంజూరు చేస్తున్నారు. నెలనెలా బస్తీల్లో 4,500 కుటుంబాలకు సరుకులను పంచుతారు. రెండొందలకు పైగా వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తున్నారు. మానసిక, శారీరక వికలాంగులకు వైద్యంతోపాటు పెన్షన్ ఇస్తున్నారు. ఒక వ్యక్తిలో మొదలైన ఒక మంచి ఆలోచన... మంచి ఫలాలనే ఇస్తుందని మరోసారి నిరూపితమైంది. రషాదీ ఆ పని చేసి చూపించారు. – మంజూర్ ⇔ రంజాన్ నెలలో పేదవారికి బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు ఇస్తారు. రంజాన్ పండగ చేసుకోవడానికి ఈద్ ప్యాక్‌లు ఇస్తారు. ⇔ ఆనాథ పిల్లల కోసం ప్రత్యేక హాస్టల్ కమ్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇందులో నగరంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన 330 మంది పిల్లలున్నారు. ⇔ పేదలకు అంత్యక్రియలు, ఆనాథలైన ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. సంస్థ నిర్వహణ! ⇔ ఐదు వందలకు మించిన విరాళం తీసుకోరు. ఇంట్లో పాత పేపర్లు, పాత సమాను కూడా ఇవ్వవచ్చు. ఇందుకోసం జీపీఎస్‌తో అనుసంధానమైన సంస్థ వాహనాలు బస్తీల్లో తిరుగుతాయి. ⇔ ఇల్లు, ఊరు మారే వాళ్లు వద్దనుకున్న సామాను, దుస్తులను ఇచ్చేస్తుంటారు. ఈ సంస్థ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే వాహనం వెళ్తుంది. వైద్యం ఒక్కటే చాలదు! ఈ పదేళ్లలో లక్షల మందికి విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సహయపడుతున్నాం. మొదట్లో రోగులకు మందులు ఇవ్వాలనుకున్నాం. పేదల బస్తీల్లో సర్వే చేసినప్పడు వారుపడుతున్న ఇబ్బందులను చూశాక వైద్యం ఒక్కటే చాలదనిపించింది. దాంతో విద్య, ఇతర సంక్షేమాలను కూడా చేర్చాం. రంజాన్ శుభ మాసం సందర్భంగా... సంస్థ ద్వారా జకాత్, సదకాత్, ఫిత్రా ఇవ్వాలంటే హెల్ప్‌లైన్ (09394419820). – మౌలానా గియాజ్ అహ్మద్ రషాదీ సఫా బైతుల్ మాల్ అధ్యక్షులు మందులు... పెన్షన్ కూడా! నా భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్‌తో బాధపడుతున్నాను. సఫా బైతుల్ మాల్ సభ్యులు తెల్లకార్డు ఇచ్చారు. మూడేళ్ల నుంచి ప్రతి నెలా వైద్యం చేసి మందులు, వితంతు భృతి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. – మహెమూద్ బీ ఫలక్‌నుమా, హైదరాబాద్ క్యాన్సర్‌కు వైద్యం! నేను ఆటో డ్రైవర్ని. రెండేళ్ల క్రితం క్యాన్స్ర్ వచ్చింది. సఫా బైతుల్ మాల్ వారు వైద్యం చేయిస్తున్నారు. నా కుటుంబాన్ని పోషిస్తున్నారు. – మహ్మద్ షుకూర్, హైదరాబాద్ -
మృతదేహాన్ని పరిశీలిస్తూ మృత్యువాత
- తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు ఢీకొని యాచకుడి మృతి - మృతదేహాన్ని చూస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టిన మరో కారు మహేశ్వరం: తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై యాచకుడు నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద గోల్కొండ నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించగా, ఆ మృతదేహం రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో కీసరకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి శంషాబాద్ నుంచి స్విఫ్ట్ కారులో అటువైపుగా వస్తున్నాడు. రోడ్డుపై ఉన్న మృతదేహాన్ని చూసి ఆగి పరిశీలిస్తున్నాడు. ఇంతలోనే రోడ్డుపై నుంచి వేగంగా వచ్చిన మరోకారు శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టింది. దీంతో అతడు కూడా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్‌రింగ్ రోడ్డుపై జరిగింది. శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టింది సైదాబాద్ బోజిరెడ్డి కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకులను పోలీసులు విచారిస్తున్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని , మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
మళ్లీ వికటించిన చికిత్సలు
సాక్షి, హైదరాబాద్: నలుగురు బాలింతలు బలైనా ప్రభుత్వ ఆసుపత్రులకు పట్టిన నిర్లక్ష్యం జబ్బు వదలడం లేదు. వరుస మరణాలు సంభవిస్తున్నా మార్పు కనిపించడంలేదు. తాజాగా సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మళ్లీ చికిత్సలు వికటించాయి. ఆరుగురు బాలింతల పరిస్థితి విషమంగా మారింది. వీరిలో నలుగురిని గాంధీ జనరల్ ఆసుపత్రికి, మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలతో ప్రభుత్వం తాత్కాలికంగా సిజేరియన్లును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేసి, ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇటీవల మళ్లీ వాటిని తెరిచారు. పడిపోయిన బీపీ... తీవ్ర రక్తస్రావం...: ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన బాధితుల్లో పది మందికి గురువారం సిజేరియన్ చేయగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా బీపీ పడి పోవడంతో పాటు అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మౌనిక, మీనాక్షి, రజిత, సాజియా బేగంను గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా, స్వప్న, యమునలను ఉస్మానియాకు తరలించారు. ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడం వల్లే బాధితుల ఆరోగ్య పరిస్థితి విష మించిందని బంధువులు ఆరోపి స్తుండగా, తమ వద్దకు వచ్చిన వారంతా హైరిస్క్ బాధితులని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సెలైన్ బాటిళ్లు వెనక్కి...: కాగా, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్న ‘ప్రెసీనియస్’కంపెనీ సెలైన్ బాటిళ్ల వినియోగాన్ని నిలిపి వేశారు. వాటి ని వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు తిప్పి పంపాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడి కల్ ఎడ్యుకేషన్ ఆయా ఆసుపత్రు లకు ఆదేశాలు జారీ చేసింది. -
పురుడుకోసం వస్తే పాడెక్కిస్తున్నారు..!
-
ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు బాలింతలు మృతి
-
ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి లక్ష మరణాలు
⇒ గాంధీలో రోజుకు 25–30 మంది మృతి: మంత్రి లక్ష్మారెడ్డి ⇒ చివరి దశలో వస్తుంటారు.. ⇒ సాధారణ మరణాలుగా పరిగణించాలని వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల మంది జన్మిస్తుండగా.. అదే సమయంలో 3 లక్షల మంది చని పోతున్నారని.. అందులో లక్ష మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసు పత్రిలో రోజుకు 25 నుంచి 30 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 20 నుంచి 25 మంది చనిపోతు న్నారని, ఇది ప్రత్యేకమైన విషయం కాదన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశోత్తరాల సమయంలో గీతారెడ్డి, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సీరియస్ కేసులు.. చివరి దశలో ప్రభుత్వాసుపత్రులకు ముఖ్యంగా ఉస్మా నియా, గాంధీ ఆసుపత్రులకు వస్తుంటాయని మంత్రి చెప్పారు. అందుకే మరణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయని, ఇది సర్వసాధారణమన్న విష యాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. నీలోఫర్‌లో బాలింతల మరణాలపై కలెక్టర్ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2,118 వైద్య సిబ్బంది పోస్టులను త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రం లో గర్భిణీల కోసం ఇప్పటికే 41 వాహనాలు నడు స్తున్నాయని, అదనంగా మరో 200 వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్వైన్ ఫ్లూతో కొన్ని మరణాలు సంభవించాయని.. వాటిల్లో అనేకం ఇతరత్రా అనారోగ్య కారణా లతో సంభవించాయన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి స్వైన్‌ఫ్లూ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే ఆయన నిమ్స్‌లో చేరలేదన్నారు. 12 ప్లేట్లెట్ సెపరేట్ మిషన్లను తాము కొనుగోలు చేశామని చెప్పారు. కాంగ్రె స్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 108 తీసు కొచ్చి పేదలకు వైద్య సేవలు అందించారని.. 104 సర్వీ సుతో ఉచితంగా మందులు అందజేశారన్నారు. 123పై కోర్టు కెళ్లి స్టే తీసుకొచ్చారు: హరీశ్ 123 జీవోపై కాంగ్రెస్ పెట్టిన కేసులను వెనక్కు తీసుకుంటే నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు 10 నెలల్లో పూర్తి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భక్త రామదాసును 11 నెలల్లో పూర్తి చేసిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పట్టించుకోలేదని.. ఇప్పుడూ అంతేనన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను తాను దగ్గరుండి చేయిస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. హరీశ్ స్పందిస్తూ.. ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది కాంగ్రెస్సే అన్నారు. ‘2013 చట్టం వచ్చాక దేశంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లలేదు.. అదో గుదిబండగా మారింది’ అని మంత్రి అన్నారు. 800 ఎకరాల భూసేకరణకు రైతులు అంగీకరించారని.. కానీ మన కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని.. 123 జీవోపై కోర్టుకెళ్లి స్టే తెచ్చారన్నారు. రైతు కేసు వేస్తే సరేనని.. కానీ భూమిలేని రైతులతోనూ కాంగ్రెస్ కేసులు వేయించిందని మండిపడ్డారు. పాసు పుస్తకాలు రద్దు చేయలేదు: మహమూద్ అలీ పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయలేదని.. వాటిని హై సెక్యురిటీతో పాస్‌పోర్టు తరహాలో మార్పు చేసి రైతులకిస్తామని జీవన్‌రెడ్డి, సంపత్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానమిచ్చారు. పాసు పుస్తకాలు రద్దు చేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు. సభ్యుల సలహా మేరకు చిన్న కార్డుల తరహాలో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కాగా, ‘రద్దు’ ప్రచారంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయని జీవన్‌రెడ్డి ప్రస్తావించారు. -
తొమ్మిదో అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి!
హైదరాబాద్: ఐఎస్బీకి చెందిన ఓ పరిశోధక విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చైతన్య బయాన్వాలా(26) ఐఎస్బీలో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి. చైతన్య గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్లో 12వ బ్లాక్‌లో నివాసం ఉండేవాడు. అయితే శనివారం రాత్రి దాదాపు పదిన్నర గంటల సమయంలో తొమ్మిదవ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. చైతన్య రూమ్మేట్స్ అయిన స్వప్నిల్, పియూష్ రాత్రి 10 గంటలకు షాపింగ్ చేయడానికి బయటకు వెళ్లారు. కొద్ది సమయం తర్వాత అపార్ట్‌మెంట్‌కు రాగానే జరిగిన విషయాన్ని ఇతర ఫ్లాట్ వాళ్లు తమకు చెప్పారని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ చైతన్య బయాన్వాలాను చికిత్స నిమిత్తం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చైతన్య అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత మృతదేహాన్ని అతడి బంధువులకు అప్పగించారని సమాచారం. ఈ ఘటనపై చైతన్య రూమ్మేట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చలించరా..?
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో చలి తీవ్రత పెరిగి మామూలు జనమే ఇక్కట్లు పడుతుండగా..ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రాత్రి పూట చలితో వణికే పరిస్థితి ఉన్నా కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక రోగులు, వారి సహాయకులు నానా పాట్లు పడుతున్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్ టీ, ఛాతి, సరిజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక చికిత్సలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు చలికి విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం..ఆపై చలేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో వారు బతికుండగానే నరకం చూస్తున్నారు. ఒక వైపు పడుకునేందుకు పడకల్లేక పోగా, ఉన్న పడకలపై చిరిగిన పరుపులు..మాసిపోయిన దుప్పట్లే దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్సలో కనీస సదుపాయాలు లేక రోగికి సహాయంగా వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రోగులకు ఇవ్వకుండా బీరువాలోనే... ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. గాంధీలో ఇటీవల రెండు రంగుల దుప్పట్లు అందజేసినప్పటికీ.. వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో పడుకునేందుకు మంచాలే కాదు, రాత్రి చలేస్తే కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేక శిశువులు గజగజ వణుకుతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. టెండర్ దాటని కొనుగోళ్లు ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఇన్ఫెక్షన్రేటును తగ్గించి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ భావించింది. రోజుకో రంగు చొప్పున వారానికి ఏడు రంగుల దుప్పట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దేశంలోని 19 ప్రధాన ఆస్పత్రుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పైలెట్ ప్రాజెక్ట్‌గా గాంధీ జనరల్ ఆస్పత్రిని ఎంపిక చేసింది. నెల రోజుల క్రితం 303 పడకలకు రెండు రంగుల దుప్పట్లను సరఫరా చేసింది. తొలుత రోజుకో కలర్ చొప్పున ఏడు రంగుల దుప్పట్లను సరఫరా చేయాలని భావించి..చివరకు అది సాధ్యపడక పోవడంతో తెలుపు, గులాబీ, బ్లూ, స్కై బ్లూ రంగులకు కుదించింది. తెలుపు, గులాబి రంగు దుప్పట్లను సాధారణ పడకలపై, బ్లూ, స్కై బ్లూ దుప్పట్లను ఐసీయూ, డాక్టర్లు, నర్సులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 20 వేల పడకలు ఉండగా, వీటిలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎ¯ŒSజే క్యాన్సర్, సరోజినీదేవి వంటి బోధనాసుపత్రుల్లోనే 8,374 పడకలున్నాయి. మొత్తం లక్ష దుప్పట్లు అవసరం కాగా 40 వేలు తెలుపు, 40 వేలు గులాబీ, 10 వేలు స్కై బ్లూ, మరో 10 వేలు నీలి రంగు దుప్పట్లు కొనుగోలు చేస్తుంది. ఇందు కోసం ఇప్పటికే ఆసక్తిగల కంపెనీల నుంచి టెండర్ ఆహ్వానించగా ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. అయితే కేటాయింపు అంశం ఇంకా ఫైనల్ కాలేదు. -
‘ఉస్మానియా’లో అరుదైన చికిత్సలు
గన్‌ఫౌండ్రీ: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకేరోజు రెండు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఓమహిళ కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించారు. అంతేకాక ఓ బీటెక్ విద్యార్థిని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించి నూతన రూపం ఇచ్చారు. వివరాలు.. ► కరీంనగర్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన లింగమ్మ కూతురు రజిత(26)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిపాటు సజావుగా సాగిన వారి కాపురంలో భర్త శ్రీనుకు అనుమానం రావడంతో ఆమెను పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. ఈ నేపథ్యంలో భార్యపై మరింత అనుమానం పెంచుకున్న శ్రీను ఆమె ముక్కును కోశాడు. దీంతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతున్న ఆమె వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి పంపించడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు శనివారం రాత్రి ఆమెకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించి అరుదైన చికిత్సను నిర్వహించారు. ► మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేటకు చెందిన చెన్నయ్య కుమార్తె కనకదుర్గ బీటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుంచి ఆమెకు కుడివైపు ముఖంపై చిన్నమచ్చలతో క్రమక్రమంగా ముఖంగాపై గుంతలు ఏర్పడి అందవికారంగా మారింది. చికిత్సల కోసం ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించింది. ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ నిర్వహించి ఆమెకు నూతన రూపం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోని బర్న్స్ వార్డ్‌లో చికిత్స పొందుతోంది. ఈ రెండు చికిత్సలలో హెచ్‌వోడీ డాక్టర్ నాగ ప్రసాద్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మధుసూదన్‌నాయక్, డాక్టర్ జైపాల్ రాథోడ్, రెహ్మాన్ ఖురేషీ, కృష్ణమూర్తి, గంగాభవానీ, జ్యోతి, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉస్మానియాలో కాలేయ మార్పిడి
యువతికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు సాక్షి, హైదరాబాద్ : ఓ నిరుపేద యువతికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు. కుషాయిగూడకు చెందిన కావ్య(20) నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తరచూ కామెర్లు, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలతో బాధపడుతోంది. చికిత్స కోసం ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలోని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్‌ను ఆశ్రయించింది. శరీరంలో కాపర్ శాతం ఎక్కువ ఉండటం వల్లే కాలేయ పనితీరు దెబ్బతిన్నట్లు ఆయన గుర్తించారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నెట్వర్క్, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించారు. కాగా, గొల్లపల్లి వద్ద ఈ నెల 4న జరిగిన ప్రమాదంలో గాయపడి ఉస్మానియాలో చేరిన ఎస్.శ్రీనివాస్(40) బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యు ధ్రువీకరించారు. జీవన్‌దాన్ సిబ్బంది సూచన మేరకు శ్రీనివాస్ అవయవాలను దానం చేసేందుకు ఆయన భార్య ఈశ్వరమ్మ అంగీకరించారు. చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడుతున్న కావ్యకు శ్రీనివాస్ కాలేయాన్ని అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం రఘురామ్, కోదండపాణి, రవిమోహన్, ప్రసూన, పాండు, మాధవి, బేబీరాణి ఈ నెల 5న సుమారు పది గంటల పాటు శ్రమించి ఈ కాలేయాన్ని అమర్చారు. ఇదిలావుంటే... బాధితురాలి సోదరి గౌతమి(14) కూడా ఇదే సమస్యతో బాధపడుతోంది. ఆమెకు కూడా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
హైదరాబాద్: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ కుమారుడు మహ్మద్ జహంగీర్ (26) మార్బుల్ ఫ్లోరింగ్ పని చేస్తుంటాడు. భార్యను తీసుకెళ్లడానికి జహంగీర్ అత్తగారింటికి వచ్చాడు. భార్య ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లడానికి గురువారం రాత్రి యాకత్‌పుర - ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉస్మానియాలో పేషంట్ల 'నీటి' ఇబ్బందులు
హైదరాబాద్: పేదల కల్పతరువుగా పేరున్న ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో నీరు కరువైంది. గత మూడు రోజులుగా నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో కొన్ని ఆపరేషన్లు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎమర్జన్సీ ఆపరేషన్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేందుకు శనివారం ఏర్పాట్లు చేసిటన్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో వైపు కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క రోగులు, వారి బంధువులు ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు వాటర్ వర్క్స్ పైప్లైన్లకు చేపట్టాల్సిన మరమ్మతుల ఆలస్యమే కారణమని తెలుస్తోంది. నీటి కొరత కారణంగా ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం మరింత తీవ్రమైంది. -
తెలంగాణ రాష్ట్రానికి కొత్త హెరిటేజ్ చట్టం
- వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు - శిథిలావస్థలో ఉన్న కట్టడాలను కూల్చివేసే వెసులుబాటు - కట్టడాలతోపాటు కొత్త జాబితాలో సంస్కృతి సంప్రదాయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త వారసత్వ (హెరిటేజ్) చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం పురాతన కట్టడాలకు మాత్రమే పరిమితమైన కేంద్ర వారసత్వ చట్టాన్ని పునర్నిర్వచించనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు కట్టూ బొట్టూ, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలన్నీ వారసత్వ సంపద జాబితాలో చేరుస్తూ కొత్త చట్టం చేయనుంది. రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలు, గుళ్లూ గోపురాలు, ప్రార్థనా మందిరాలన్నీ ఈ చట్టం పరిధిలోకి తీసుకువస్తారు. గతంలో హెరిటేజ్ జాబితాలో ఉన్న కట్టడాలను సైతం పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో యోగ్యమైన చారిత్రక కట్టడాలను మాత్రమే చట్టంలో పొందుపరిచి రక్షణ కల్పించాలని, శిథిలావస్థకు చేరిన వాటిని కూల్చి వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూలిపోయే వాటిని తొలగించటం ద్వారా ప్రమాదాలను నివారించటంతో పాటు ఆ భవనాలకు చెందిన స్థలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాలను కూల్చివేసి అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని గత ఏడాది ప్రభుత్వం పావులు కదిపింది. కానీ అది హెరిటేజ్ చట్టం పరిధిలో ఉండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి, సెక్రటేరియట్‌లోని జీ బ్లాక్ భవనం కూల్చి వేసే ప్రతిపాదనలన్నింటికీ వారసత్వ చట్టం అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలోనే వారసత్వ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం భావించింది. వారసత్వ కట్టడాలను గుర్తించేందుకు గత ఏడాది జూలైలో సీఎం నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ వైస్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ, టూరిజం శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్ల అధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో వారసత్వ కట్టడాల గుర్తింపు బాధ్యతను జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అప్పగించారు. ఈ కమిటీల సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తెలంగాణకు కొత్త వారసత్వ చట్టం రూపకల్పనకు మొగ్గు చూపింది. ప్రస్తుతమున్న చారిత్రక కట్టడాలన్నీ కేంద్ర పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రాంతాలు, అవశేషాల చట్టం 1958, 2010 ప్రకారం ప్రభుత్వ రక్షణలో ఉన్నాయి. కానీ ఈ చట్టం అమలుపై భిన్నాభిప్రాయాలు రావడం, శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలను కూల్చే పరిస్థితి లేకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పట్టపగలే వైద్యుడిని దోచుకున్నారు!
అబిడ్స్: మీరు రోడ్డుపై వెళుతుంటే.. ఎవరైనా వ్యక్తి వచ్చి లిప్ట్ ఇస్తానంటే ఏం చేస్తారు.. అమ్మయ్యా! సమయానికి దేవుడిలా వచ్చాడంటూ గబగబా ఎక్కేస్తారు కదా! .. సరిగ్గా ఇలానే అనుకున్నాడో ఉస్మానియా ఆస్పత్రికి వెళుతున్న వైద్యుడు. వచ్చిన వాడు దేవుడైతే.. మంచిదే.. కానీ వచ్చింది దొంగ మరీ.. అసలు బుద్ది చూపించాడు.. లిఫ్టు పేరుతో వైద్యుడిని ఆటోలో ఎక్కించుకుని.. ఆపై అతడి వద్ద ఉన్న డబ్బును దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంజే బ్రిడ్జి వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం. రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. లంగర్‌హౌస్‌లో నివాసముండే ఆర్థోపెడీషియన్ డాక్టర్ మీర్ అలియాస్ అలీ(54) సోమవారం మధ్యాహ్నం పాతబస్తీ జర్జ్ఖానా ఆస్పత్రి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి నడిచి వెళ్తున్నారు. ఇంతలోనే ఓ ఆటో డ్రైవర్ ఎంజే బ్రిడ్జిపై ఆటోను ఆపి ఉస్మానియా ఆస్పత్రి వరకు లిఫ్ట్ ఇస్తానంటూ డాక్టర్‌ను ఆటోలో ఎక్కించుకున్నాడు. అప్పటికే ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత.. ముందు పోలీసుల తనిఖీలున్నాయని, వెంటనే దిగిపోవాలని డాక్టర్‌కు సూచించారు. దీంతో అలియాస్ అలీ ఆటోదిగి రూ.20 ఆటోవాలాకు ఇవ్వబోయాడు. అయితే, ఆటోలోని వారంతా అప్పటికే కిందికి దిగి డాక్టర్‌ను చుట్టుముట్టారు. బలవంతంగా ఆయన జేబులో ఉన్న రూ.20వేల నగదును లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. దీంతో కంగుతిన్న బాధితుడు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం.. ఆ అవ్వ చనిపోయింది
ఉసురుతీసిన ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యం అఫ్జల్‌గంజ్: పాపం... ఆ అవ్వ చనిపోయింది. ఏ దిక్కూలేని ఆమెకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో చివరికి కన్ను మూసింది. వైద్యో నారాయణో హరి అంటారు. అయితే, ఇక్కడి వైద్యులు ఆ మాటకు అర్థాన్ని మార్చేశారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అపస్మారకస్థితిలో ఉన్న వృద్ధురాలిని పోలీసులు వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు, సిబ్బంది ఆమె వెంట సహాయకులు లేరనే కారణంతో ఈ నెల 13వ తేదీ అర్దరాత్రి ఆసుపత్రి నుంచి గెంటివేశారు. మరుసటి రోజు ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డికి ఈ విషయం తెలిసి వైద్యులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రిలో చేర్చుకొని రెండు రోజుల పాటు వైద్యం అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రి నుంచి బయటికి గెంటివేయకుండా వైద్యం అందించి ఉంటే ఆమె మరికొన్ని రోజులు ఈ లోకంలో ఉండేదేమో.. సరైన వైద్యం అందకపోవడంతో గురువారం రాత్రి కన్నుమూసింది. ఎవ్వరూ లేని అనాధగా మిగిలిపోవడం ఆ అవ్వ చేసిన పాపమా.. లేక సరైన సమయంలో వైద్యం అందించని ఉస్మానియా వైద్యులదా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చురీలో మృతదేహం: వృద్ధురాలి సంబంధీకులు ఎవ్వరూ లేకపోవ డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అనాధ శవంగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులుంటే అఫ్జల్‌గంజ్ ఠాణాలో సంప్రదించాలని కోరారు. -
ఆయన ఆస్తి.. దేశ బడ్జెట్ కంటే రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: ఆయన ఆస్తి భారతదేశ బడ్జెట్‌కు రెండింతలు.. సొంత విమానాశ్రయం, సొంత రైల్వే, సొంత బ్యాంకు.. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు..మిలమిలా మెరిసే 185 కేరెట్ల జాకబ్ వజ్రం ఆయన బల్లపై పేపర్ వెయిట్..1937లో ఫిబ్రవరి 22న టైం మేగజైన్ కవర్‌పేజీపై ‘రిచెస్ట్ మెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో ప్రచురితమైన కథనం ఆయనదే... ఆయనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. అసఫ్‌జాహీ వంశంలో చివరి రాజు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేట్‌ను పాలిస్తున్న రాజు. 1940వ దశకంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటల్లోకి ఎక్కిన ఏడో నిజాం.. ప్రపంచ నలుమూలలకూ మేలిమి వజ్రాలను సరఫరా చేసినవాడిగా కూడా రికార్డు సాధించారు. అదే ఆయనను ప్రపంచ ధనికుడిని చేసింది. అమెరికా మొత్తం సంపదలో రెండు శాతంతో సమంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద ఉండేది. అప్పట్లోనే ఆయన సంపద విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అప్పుడు భారతదేశ వార్షికాదాయం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే. అంతేకాదు హైదరాబాద్ సంస్థానం బడ్జెట్ అప్పట్లోనే రూ.కోట్లలో ఉండేది. మొత్తం బడ్జెట్లో 11 నుంచి 15 శాతం దాకా విద్యా రంగానికే కేటాయించే వారు. ఇళ్లకు విద్యుత్ వెలుగులు, నిజాం విశ్వవిద్యాలయం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, నిజాం చక్కెర కర్మాగారం.. ఇవన్నీ ఆయన బడ్జెట్ కానుకలే. ప్రస్తుతం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా కొనసాగుతున్న బ్యాంకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంతంగా స్థాపించిన బ్యాంకే. -
అత్తను భవనంపై నుంచి తోసేసిన అల్లుడు
అబిడ్స్: భార్యను తనతో పంపాలంటూ అత్తతో గొడవకు దిగిన ఓ అల్లుడు అత్తను భవనంపై నుంచి కోపంతో నెట్టివేశాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కార్వాన్ జోషివాడిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బండారి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతంలో నివాసముండే గోపాల్, రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే గోపాల్ ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. భార్యను కొడుతూ రోజూ తగవు పెట్టుకుంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాణి రెండు రోజుల క్రితం కార్వాన్ జోషివాడిలో నివాసముండే తల్లి యశోదా బాయి(60) వద్దకు వచ్చింది. గోపాల్ గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నేరుగా రాణి ఉంటున్న ఇంటికి వచ్చి అత్త యశోదాబాయితో వాగ్వాదానికి దిగాడు. అయితే, తన కుమార్తెకు నిత్యం నరకం చూపిస్తున్నందున పంపేది లేదని గోపాల్‌తో తెగేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన గోపాల్ ఆమెను రెండో అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి నెట్టివేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో టప్పాచబుత్ర పోలీసులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును టప్పాచబుత్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలు విరిగిన శిశువుకు ప్రత్యేక చికిత్స
హైదరాబాద్: ‘కళ్లు తెరవకముందే కాలు విరిచారు’ అనే సాక్షి కథనంపై సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. లింగస్వామి, లక్ష్మిలకు పుట్టిన శిశువుకు నాణ్యమైన వైద్యం అందించాలని శనివారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి సైతం ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆ శిశువుకు చికిత్సలు అందించారు. ఉమ్మనీరు హెచ్చుతగ్గుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని సుల్తాన్‌బజార్ ప్రభు త్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నకుమారి వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని వైద్యులకు సూచించామని తెలిపారు. -
ఉస్మానియా నుంచి మూసా డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: సినీఫక్కీలో మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన దక్షిణాఫ్రికాకు చెందిన మూసియా మూసా(32)ను ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు బుధవారం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్రమంగా పొత్తికడుపులో రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో మూసా పట్టుబడిన విషయం తెలిసిందే. నార్కోటిక్ అధికారులు ఆమెను ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె పొత్తి కడుపు నుంచి మొత్తం 51 డ్రగ్ ప్యాకెట్లను వెలికి తీశారు. -
బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు
-
బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ మూసియా మూసా శరీర భాగం నుంచి కొకైన్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. దుబాయి నుంచి కొకైన్ అక్రమ రవాణా చేస్తూ దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అనే మహిళ నిన్న దొరికిపోయిన విషయం తెలిసిందే. ఉస్మానియ ఆస్పత్రి నుంచి మూసా శరీరం నుంచి ఇప్పటి వరకూ 24 కొకైన్ ప్యాకెట్లను వైద్యులు వెలికి తీశారు. కాగా అదుపులోకి తీసుకున్న మూసాను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు తొలుత ఆమెకు సీటీ స్కాన్, ఆ తర్వాతా ఎండోస్కోపీ చేశారు. కడుపులో ఆరు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించారు. వీటిని జననేంద్రియం, మలద్వారం నుంచి పొత్తి కడుపులోకి ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. నిన్న సెలవు రోజు కావడంతో ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యులే పొత్తి కడుపులో ఉన్న ఒక ప్యాకెట్‌ను బయటికి తీశారు. మిగిలిన ప్యాకెట్లు తీయడం సాధ్యం కాకపోవడంతో సర్జికల్ వార్డుకు తరలించారు. రాత్రి ఏడు గంటలకు 'ఎనిమా' ఇచ్చారు. దాంతో మలద్వారం నుంచి 16-20 (క్యాప్సూల్స్ రూపంలో ఉన్నవి) డ్రగ్స్ బయట పడ్డాయి. ఒక్కో క్యాప్సూల్ ఒక అంగుళం మందం నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లు సహజంగా బయటకు రాకుంటే పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స చేసి వెలికి తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. -
అనారోగ్యంతోనే పద్మ మృతి: డీసీపీ
హైదరాబాద్: అసిఫ్ నగర్లో పద్మ అనే మహిళది లాకప్ డెత్ కాదని.. అనారోగ్యంతోనే మరణించిందని డీసీపీ సత్యానారాయణ అన్నారు. పద్మపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. అనారోగ్యంగా ఉన్న పద్మను విచారణలోకి తీసుకున్న ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ఓ ఆసుపత్రిలో చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలున్నాయంటూ.. అసిఫ్ నగర్ పోలీసులు పద్మను వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి చోరీకి సంబంధించి ఆమెను తీవ్రంగా హింసించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల వేధింపులు తాళలేక శనివారం అర్ధరాత్రి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసుల విచారణలోనే పోలీస్ స్టేషన్లో పద్మ మృతి చెందిందని.. అనంతరం ఉస్మానియాకు తరలించారని సమాచారం. అయితే.. పద్మది లాకప్ డెత్ కాదని, అనారోగ్యంతోనే మృతిచెందిందని పోలీసులు వివరణ ఇచ్చారు. -
‘ఉస్మానియా’కు రాజకీయం జబ్బు
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు కూడా ప్రకటనలకు పరిమితం కాకుంటే మంచిది. అదే ఆవరణలో, లేదా మరో అనువైన చోట మంచి భవన సముదాయాన్ని నిర్మించి అక్కడికి దానిని తరలించి, పాత భవనాలకు మరమ్మతులు చేసి నిజాం నిర్మించిన ఆ భవనాన్ని పర్యాటక స్థలంగా మారిస్తే ప్రభుత్వానికి పేరూ వస్తుంది, వివాదాలకూ తావుండదు. అయినా నిరంకుశ నిజాం ప్రభువును పొగిడినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మీద కన్నెర్ర చేసిన వారికి ఇప్పుడు ఆ నిజాం కట్టిన భవనాలను కూల్చేస్తామంటే అభ్యంతరమెందుకో? మనుషుల ప్రాణాలకు, అందులోనూ కదలలేని స్థితిలోని రోగుల ప్రాణా లకు ముప్పు ఉందనుకున్నప్పుడు, వారిని రక్షించడానికి ప్రభుత్వం ఎటు వంటి చర్యలు తీసుకున్నా అభినందించాల్సిందే. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పేద రోగులకు ఉస్మానియా దవాఖానా ఎంతో కాలంగా పెద్ద దిక్కుగా ఉంది. హైదరాబాద్ చుట్ట్టు పక్కల నుంచేగాక, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే వేలాది మంది రోగులకు, ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి జీవులకు అది ఎంతో ఉపయోగ పడుతోంది. ఇప్పుడు దానికే ‘జబ్బు’ చేసింది. ఇప్పుడో అప్పుడో కూలిపోయేట్టుగా ఉంది కాబట్టి, ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైద రాబాద్ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఆ భవనాలను ఎట్లా కూల్చే స్తారని ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, కొందరు మేధావులూ ప్రశ్నిస్తున్నారు. కూల్చడానికి వీల్లేదని ఉద్యమమూ మొదలు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదనే అనుకుందాం. పాతదై, శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా దవాఖానా భవనాలు... జరగరానిదే జరిగి, ఎప్పుడో కూలితే ఏమిటి పరిస్థితి? స్వయం రక్షణ చేసుకోలేని రోగుల గతి ఏం కాను? దురదృష్టవశాత్తూ నిజంగానే అలాంటి దుర్ఘటనేదైనా జరిగితే ప్రభు త్వం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉస్మానియాను ముట్టడానికి వీల్లేదంటున్న ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, మేధావులు దాన్ని బతకనిస్తారా? అసలు ప్రభుత్వం ఉంటుందా? తెలంగాణ సంస్కృతంటే ఆ భవనాలేనా? ఉస్మానియా ఆసుపత్రి భవనాలను కూలగొట్టి అక్కడ జంట ఆకాశ హర్మ్యా లను (ట్విన్ టవర్స్) నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఇది ఎంత వరకు సబబు? ఇందులో వేరే మతలబులు ఏమయినా ఉన్నాయా? ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది? అన్న విషయాలను చర్చిస్తే మంచిది. ఇప్పటికైతే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కొంత కాలం పాటూ వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తున్నది. నిపుణుల కమిటీ సిఫార్సుల కోసం వేచి చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. మంచిదే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు నిజంగానే అవసరమైతే, ఆ భవనాలు పూర్తిగానే శిథిలమై ఇప్పుడో, అప్పుడో కూలే పెద్ద ఉపద్రవానికి అవకాశం ఉందంటే వద్దని ఎవరూ అనరు. అంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి వారిని ప్రభుత్వం లెక్క చెయ్యాల్సిన పనే లేదు. కానీ ఉస్మానియా దవాఖానా భవనాల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నిపుణులు సైతం పరస్పర విరుద్ధమైన అభిప్రా యాలను వ్యక్తం చేస్తున్నారు. వారిలో పురాతన కట్టడాల నాణ్యతను బేరీజు వెయ్యగల సంస్థలూ, వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ భవన సముదాయం ఇంకా ఎంతకాలం మనగలుగుతుంది? ఎప్పట్లోగా కూలిపోతుంది? అనే అంశాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒకరు అయిదేళ్ళ కంటే ఉండదంటుంటే, మరొకరు మరమ్మతులు చేస్తే మరి కొన్ని వందల ఏళ్లపాటూ ఢోకా లేదం టున్నారు. ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఎవరి మాట వినాలి? రోగులకు మెరు గైన సేవలు అందించడానికి, రోగులు, సిబ్బంది సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఆహ్వానించాల్సిందే. ఉస్మానియా దవాఖానా భవనాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నాలేమీ కావు, వాటిని కూల్చేసినందు వల్ల తెలంగాణ సంస్కృతికి వచ్చే నష్టం ఏమీ ఉండదు అని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిసున్నవారి వాదన. ఆ నిర్ణయాన్ని సమర్థించే మీడియాలోని ఒక వర్గం గాంధీ ఆస్పత్రి భవనాలను ముషీరాబాద్ జైలు ఆవరణకు తరలించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? అంటున్నారు. అప్పుడు మాట్లాడని వ్వనందుకే కదా తెలంగాణ కావాలంది. ఇప్పుడు కూడా మాట్లాడనివ్వం అంటే అప్పటికి, తెలంగాణ రాష్ర్టం సాధించాక ఇప్పటికి తేడా ఏమిటి? తరలింపుతో కాదు..ఏకపక్ష నిర్ణయంతోనే తంటా సరైన చోట లేదనుకుంటే, వైద్య సదుపాయాలకు అనువుగా లేదనుకుంటే, చికిత్స కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందనుకుంటే... ఏ ఆసుప త్రినైనా మరింత మెరుగైన చోటికి మారుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టకూడదు. గాంధీ ఆసుపత్రి తరలింపును అలాగే చూడాలి. అంతేగానీ సమైక్య రాష్ర్టంలో తరలిస్తే తప్పు, తెలంగాణలో తరలిస్తే ఒప్పు అని వేర్వే రుగా ఉండదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పటికి, ముషీరాబాద్ జైలు ఆవరణలోని కొత్త భవనాలకు మారినప్పటికీ గాంధీ ఆసుపత్రిలో ఎంత తేడా వచ్చిందో గమనించిన వారు ఉస్మానియాను మరో చోటికి మార్చడాన్ని వ్యతిరేకించరు. అసలు ముషీరాబాద్ జైలు తరలింపునే ఇంకొందరు తప్పు పడుతున్నారు. ఆ జైలుకో గొప్ప చరిత్ర ఉందంటున్నారు. ఈ వాదన చేస్తున్న వారు ఒకసారి చర్లపల్లి జైలును చూసి వస్తే బాగుంటుంది. అంతెందుకు, బేగంపేట విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు తరలించినప్పుడూ ఊరి మధ్యలో నుంచి ఎక్కడికో దూరంగా తరలిస్తారా? అని విమర్శించిన వారు న్నారు. నగరం విస్తరిస్త్తున్నది, జనాభాతో బాటు అవసరాలూ పెరుగుతు న్నాయి. ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసర మనుకుంటే ఉస్మానియా దవాఖానాను ఆ భవనాల నుంచి మార్చొచ్చు. అదే ఆవరణలోని ఖాళీ స్థలాల్లో కొత్త భవనాలను నిర్మించవొచ్చు. సరిపోదను కుంటే దగ్గరలోనే ప్రత్యామ్నాయ స్థలంలో కొత్త భవనాలను నిర్మించి శాశ్వతంగా ఉస్మానియా దవాఖానాను వాటిలోకి తరలించవొచ్చు. అందు కోసం ఇప్పుడున్న ఉస్మానియా దవాఖానా భవన సముదాయాన్ని శాశ్వ తంగా కూల్చేయనక్కర లేదు. మన ప్రభుత్వం ఎంతో అభిమానించే నిజాం రాజుల నజారానాను మర మ్మతులు చేసి పర్యాటకుల సందర్శన స్థలంగా ఉండనివ్వవచ్చు. ఎవరూ ఆక్షేపించరు. మరి ఎందుకీ వ్యతిరేకత? ఉస్మానియా దవాఖానా భవనాలు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి, వాటిని మరమ్మతు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉందని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు, నిపుణులు సహా నలుగురితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ప్రభుత్వం అటువంటి పని చెయ్యకపోవడం వల్లనే సందే హాలు. పైగా ఏ నిమిషానికి ఏమి తోస్తే అది ప్రకటించేయడం ఈ ప్రభు త్వానికి అలవాటైందన్న అభి ప్రాయమూ ప్రజల్లో బలంగా ఉంది. ‘ఉస్మానియా’ కారాదు ఊహా సౌధం ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం ఏర్పడి, కొత్త ప్రభుత్వం వచ్చాక బోలెడన్ని భవనాలను కూల్చేయడం, కొత్తవి కట్టేయడం అంటూ ఎన్నో ప్రతి పాదనలు వినీ ఉన్నాం. మరునాటికే అవి అటక ఎక్కడమూ చూశాం. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారుస్తామన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి సముదాయాన్ని వికారాబాద్ దగ్గరి అనంతగిరికి తరలిస్తామన్నారు. రవీంద్ర భారతిని కూలగొట్టి, మరో కొత్త భారతిని నిర్మిస్తామన్నారు. హుస్సేన్ సాగర్‌లోని నీళ్లన్నీ తోడి. అవతల పారబోసి దాన్ని స్వచ్ఛమైన మంటి నీటి సరస్సుగా చేసేస్తామన్నారు. వినాయక నిమజ్జనం దగ్గరికొస్తున్నదిగానీ, అందుకోసం ఇందిరా పార్క్‌లో తవ్విస్తామన్న కొత్త సరస్సు ఊసే లేదు. ఇక సంజీవయ్య పార్క్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్‌ను నిర్మి స్తామన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించి హైదరా బాద్‌ను డల్లస్ నగరం చేస్తామన్నారు. ఈ ఏడాదికాలంలో ఇలాంటి ప్రకట నలు చాలానే వచ్చాయి. అన్నీ ఒక్క రోజులో అయిపోయేవి కావు నిజమే. కానీ అవి కనీసం ప్రతిపాదనల దశకైనా చేరక పోవడంతో ప్రభుత్వం నవ్వుల పాలవుతోంది. ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనాలను సమకూర్చే పథకం కూడా వాటిలా ప్రకటనలకు పరిమితం కాకుంటే మంచిది. అదే ఆవరణలో, లేదా మరో అనువైన చోట మంచి భవన సముదాయాన్ని నిర్మిం చి అక్కడికి ఉస్మానియా దవాఖానాను తరలించి, పాత భవనాలకు మరమ్మ తులు చేసి ఒకప్పటి నిజాం నిర్మించిన దవాఖానాగా పర్యాటకుల సందర్శ నార్థం ఉంచితే ప్రభుత్వానికి మంచి పేరూ వస్తుంది, వివాదాలకూ తావుం డదు. చివరగా ఒక్క మాట నిరంకుశ నిజాం ప్రభువును పొగిడినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మీద కన్నెర్ర చేసిన వారికి ఇప్పుడు ఆ నిజాం కట్టిన భవనాలను కూల్చేస్తామంటే అభ్యంతరమెందుకో? datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్ -
'ఉస్మానియా తరలింపుపై అనవసర రాద్ధాంతం'
రహమత్‌నగర్: ఉస్మానియా ఆస్పత్రిని తరలించడంపై రాద్ధాంతం చేయడం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం బోర్డు సభ్యుడు గంధం అంజన్న సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న ఆస్పత్రి భవనాన్ని అనివార్య పరిస్థితుల్లో తొలగించక తప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు. రహమత్‌నగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కట్టడం అంటూ కొంత మంది నాయకులు రాద్ధాంతం చేయడంలో అర్థం లేదని, పాత భవనాలు ఎప్పుడు కూలిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంచి నిర్ణయం తీసుకొని ఆస్పత్రిని తరలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని వాటిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరని అంజన్న అన్నారు. -
'ఉస్మానియా'ను రాత్రికిరాత్రే కూల్చలేరు కదా
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 'ఉస్మానియా ఆస్పత్రిని రాత్రికి రాత్రే కూల్చలేరు కదా' అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వకుండా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ పిటిషనర్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఉస్మానియా కూల్చివేతపై జీవో కాపీలు దాఖలు చేయాలని పిటిషనర్ కు తెలిపింది. ఆస్సత్రి కూల్చివేతపై తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి తరలింపు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవటంతో ఆ భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రోగులను కూడా ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. -
'ఉస్మానియా ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తున్నాం'
నల్లగొండ: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంత్రులకు అధికారాలు లేవని, ఏక పక్ష పాలన కొనసాగుతోందన్నారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేసి నివారించడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో దాఖలైన్ పిల్ రేపు(మంగళవారం) విచారణకు రానుంది. -
గత వైభవ వెలుగులు
చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, భాగ్యనగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది! లక్షలాది మంది రోగులకు సేవలందజేసి, వేలాది మంది వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చి, ఎన్నో ప్రయోగాలకు, మరెన్నో అద్భుతాలకు చిరునామాగా నిలిచిన ఈ భవనం కూల్చివేత ప్రతిపాదనలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చరిత్రపై దాని సంతకం, భవనం చారిత్రక విశేషాలు, నిర్మాణ కౌశలంపై ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ * చారిత్రక వారసత్వానికి చిరునామా ఉస్మానియా ఆస్పత్రి * ఏడో నిజాం పాలనలో పూర్తయిన మహాసౌధం ఎందరో గొప్ప వైద్యులకు నిలయం ఎంతోమంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆసుపత్రి అభివృద్ధి చెందింది. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీత భత్యాలను, పెన్షన్ మొత్తాన్ని ఆసుపత్రిలోని పేద రోగులకు పాలు, బ్రెడ్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డీకర్, డాక్టర్ రోనాల్డ్ రాస్ వంటి ప్రముఖ వైద్యులు ఆసుపత్రిలో సేవలందజేశారు. పునాదులు పడ్డాయిలా.. గోల్సావాడి.. వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీ నది ఒడ్డ్డున వెలసిన ఓ బస్తీ! పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్సలు చేసే ఆసుపత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతోపాటు, బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా డాక్టర్లకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. 1866 నాటికి అది ‘అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి’గా వైద్య సేవలను ప్రారంభించింది. ఫలితంగా హైదరాబాద్ సంస్థానంలోని బ్రిటిష్ కంటోన్మెంట్లలో సైనికులకు మాత్రమే లభించే ఆధునిక వైద్య సేవలు.. సామాన్యుల చెంతకు చేరాయి. కానీ ఆ ఆసుపత్రి ఎంతోకాలం మనుగడ కొనసాగించలేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చోటుచేసుకున్న మహావిషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాల ధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పగ్గాలు చేపట్టారు. ‘అఫ్జల్‌గంజ్’ ఆసుపత్రి స్ఫూర్తిని బతికించాలని భావించిన ఆయన.. సుమారు 27 ఎకరాల సువిశాల ప్రదేశంలో 1925 నాటికి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది. మూసీ ఒడ్డునే ఎందుకు? మూసీ వరదలు విలయాన్నే సృష్టించాయి. వేలాది మంది మృత్యువాత పడ్డారు. మరోసారి అలాంటి వరదలు రాకుండా, వచ్చినా తట్టుకునేలా నది లోతును పెంచి దానికి ఇరువైపులా పెద్దపెద్ద గోడలు కట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మూసీ పరిర క్షణే లక్ష్యంగా ఎత్తై భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. అలా సిటీ కాలేజ్, హైకోర్టు భవనం,పేట్లబురుజు ఆసుపత్రి, లక్కల్కోట వెలిశాయి. మూసీ నదికి ఉత్తరాన నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆ విధంగానే వెలసింది. పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తై చెట్లు, స్వచ్ఛమైన మూసీ ప్రవాహం, ఆహ్లాదకరమైన వాతావరణం రోగులు త్వరగా కోలుకొనేందుకు సహకరిస్తాయని భావించారు. ఎలాంటి మొండి రోగాలైనా సరే అక్కడి గాలి పీలిస్తే నయమవుతాయని ప్రజలు భావించేవారు. ప్రపంచంలోనే తొలి ‘క్లోరోఫామ్’ శస్త్రచికిత్స ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలు, ఆవిష్కరణలకు వేదికైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘క్లోరోఫామ్’ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు శస్త్ర చికిత్సను అందజేసింది. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఇదే ఆస్పత్రిలో జరిగింది. ఆ రోజుల్లోనే రూ.50 వేల ఖర్చు! 1918-20లో ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్తానీ, గ్రీకు, రోమన్ శైలి నిర్మాణ పద్ధతులనూ జత చేశారు. సుమారు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు కష్టపడి కట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేలు ఖర్చయినట్లు అంచనా. 1925లో కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తై విశాలమైన డోమ్‌లు ఆసుపత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తై గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగలను ప్రతిబింబించే ఆకృతులను చిత్రించారు. చార్మినార్‌లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆసుపత్రి భవనంపైన కట్టించారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా భవనంలోకి గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళల్లో, విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి ఏర్పాటు ఉంది. కూలుతున్న పైకప్పులు... ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేయకపోవడంతో ఆసుపత్రి పెచ్చులూడుతోంది. ఐదేళ్ల కిందట సూపరింటెండెంట్ తన కార్యాలయంలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలింది. డాక్టర్ డీవీఎస్ ప్రతాప్, డాక్టర్ రవీందర్ గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు సహా ఇద్దరు రోగులపైన పెచ్చులు పడి గాయాలయ్యాయి. ఇటీవల జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలింది. వారం తిరగకుండానే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, ఉద్యోగ సంఘాలన్నీ కలసి ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి ప్రాణాలకు రక్షణ లేని ఈ ఆస్పత్రిలో పని చేయలేమని స్పష్టం చేశారు. మంత్రి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవనంపై అధ్యయనం చేసిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు కూడా రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. దీంతో కొత్త భవనం నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇంకా వందల ఏళ్ల దాకా కాపాడవచ్చు.. చారిత్రక ఉస్మానియా భవనాన్ని కూల్చడం కన్నా అత్యాధునిక పద్ధతుల్లో మరమ్మతులు చేసి అలాగే కొన సాగించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. భవనం పటుత్వంపై అనుమానాలు అక్కర్లేదని, నిరంతర నిర్వహణ పనులు చేస్తే కొన్ని వందల ఏళ్ల వరకు దాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి నిలువెత్తు దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను పదిలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు. ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ఉంది’’ అని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు హను మంతరావు తెలిపారు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చని ఆయన సూచించారు. చూస్తూ ఊరుకోం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కో కట్టడం ఒక్కో ప్రత్యేకత. కొత్త భవ న నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు, ఆ పేరుతో వారసత్వ సంపదను ధ్వంసం చేయాలని చూడటం దారుణం. దీన్ని చూస్తూ ఊర్కోబోం. -వేదకుమార్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వైద్యం నిర్వీర్యం చేసేందుకే ఇలా కూల్చివేసుకుంటూ వె ళ్తే వారసత్వ కట్టడాలే ఉండవు. పాత భవనం కూల్చివేత, కొత్త భవన నిర్మాణం పేరుతో రోగులను అయోమయానికి గురి చేసి ప్రజావైద్యాన్ని నిర్వీర్యం చేసేందుకు పన్నిన కుట్ర ఇది. - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు కొత్త భవనం కావాల్సిందే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పని చేయలేం. రోగులు, వైద్యుల సంక్షేమం దృష్ట్యా వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలి. -బొంగు రమేశ్, టీజీడీఏ -
‘ఉస్మానియా’ కూల్చివేత తగదు
- ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం - తెలంగాణ పీసీసీ నేతల స్పష్టీకరణ అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి పాతభవనం చుట్టూ ఉన్న డోమ్ గేట్, పేయింగ్ రూమ్స్, దోబీఘాట్, నర్సింగ్హాస్టల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత భవనంలోని చాంబర్లో సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురాంతో సమావేశమయ్యారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మిస్తామనడం సరికాదన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తానని కేసీఆర్ చెప్పిన మాటలను ఇంకా ఎవరూ మరిచిపోలేదన్నారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ ఉస్మానియాకు ఎంతో గట్టితనం ఉందన్నారు. దీనికి మరమ్మతులు చేయిస్తే మరో వందేళ్లు రోగులకు సేవలందించవచ్చని అన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ ఎప్పుడూ నిజాం పాలనను పొగిడే ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను ఎందుకు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తానన్న కేసీఆర్ ఉస్మానియాను కూల్చివేస్తాననడం సరికాదన్నారు. రాజకీయం చేయొద్దు టీజీవీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రమేష్ ఉస్మానియా ఆసుపత్రిని నిజాం ప్రభువు వందేళ్ల దూరదృష్టితో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి నిర్మించిన విషయాన్ని ఎవరూ విస్మరించరాదని తెలంగాణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.రమేష్ అన్నారు. శనివారం ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఇప్పుడు వందేళ్ల ఈ భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించాలనుకోవడం తప్పుకాదన్నారు. చార్మినార్ కట్టడంగానో, చౌమహల్లా ప్యాలెస్గానో నిర్మించింది కాదన్నారు. దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దని కోరారు. నిజాం ప్రభుత్వ ఇంటిని కూల్చివేసి కింగ్‌కోఠి ఆసుపత్రిని నిర్మించినప్పుడు వీరంతా ఎక్కడికి పోయార న్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అనేక చారిత్రక కట్టడాలు కనుమరుగయ్యాయని గుర్తు చేశారు. ప్రజా అవసరాల కోసం వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇదే తరహాలో 3డి డిజైనింగ్ చేసి నిజాం నిర్మించిన భవనానికి గుర్తుగా ఇదేశైలిలో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దానిని పరిపాలన భవనంగా చేసి దీని వెనుక ఉన్న స్థలంలో ట్విన్ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఒకవేళ అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వైద్యుల సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. -
కేసీఆర్‌కు సొంత అజెండా ఉన్నట్టుంది
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడం... ఆ కట్టడాన్ని కూలగొట్టడం సరికాదని టీపీసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్, దానం, సుధీర్‌రెడ్డి తదితర నేతలు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కానీ చారిత్రక కట్టడాలు కూల్చగొట్టవదంటూ ప్రభుత్వానికి సూచించారు. చారిత్రక కట్టడాలు కూల్చగొట్టకూడదని నాడు అసెంబ్లీ ముందు మెట్రోలైన్ అలైన్‌మెంట్‌నే గతంలో కేసీఆర్ మార్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మరి ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టాలనుకోవడం వెనుక కేసీఆర్‌కి సొంత అజెండా ఉన్నట్టుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని కూల్చాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని వారు స్పష్టం చేశారు. -
‘ఉస్మానియా’ తరలింపు మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆగమేఘాల మీద రోగుల తరలింపు ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం తీరా కొంత మంది వైద్యులు, రోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో మళ్లీ పునరాలోచనలో పడింది. తాజాగా శుక్రవారం మంత్రి సి.లక్ష్మారెడ్డి ఉస్మానియాకు వచ్చిన వైద్యాధికారులతో విస్తృతంగా చర్చించారు. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రి వైద్యుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ ఆస్పత్రిని అక్కడి నుంచి పేట్లబురుజుకు తరలించకపోవడమే మంచిదనే భావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే పాత భవనంలోని రోగులను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి మూడు, నాలుగో అంతస్తుకు తరలించాలా? లేక ప్రస్తుత ఓపీ బ్లాక్‌లోనే సర్దుబాటు చేయా లా? అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. సూపర్‌స్పెషాలిటీ విభాగాలపై చర్చ... ఆస్పత్రికి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది రోగులు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ బాధితులే. కేవలం 10 శాతం మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ బాధితులు ఉంటారు. రోగుల ఒత్తిడి ఎక్కువగా ఉన్న జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాలను ఓపీ బ్లాక్, కులీకుతుబ్‌షా బ్లాక్‌లో సర్దుబాటు చేసి, అక్కడ ఉన్న బర్నింగ్ వార్డు సహా నెఫ్రాలజీ, పాథాలజీ, కార్డియాలజీ విభాగాలను తరలిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా వచ్చింది. భవిష్యత్తులో వైద్యుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా విభాగాల వైద్యులను సంప్రదించి వారీ అంగీకారం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. భారీగా తగ్గిన ఓపీ రోగులు ఉస్మానియా తరలింపు నేపథ్యంలో ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి వస్తున్న రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 700-800కు తగ్గింది. ఇన్‌పేషంట్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం కొసమెరుపు. -
‘కింగ్‌కోఠి’కి ఉస్మానియా రోగులు
* తొలి విడతగా 24 మంది రోగులు.. పలువురు వైద్య సిబ్బంది తరలింపు * దశలవారీగా మిగిలిన విభాగాలు.. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే.. * రోగుల తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు * రెండు వర్గాలుగా విడిపోయి.. వాగ్వాదానికి దిగిన వైద్యులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి రోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా బుధవారం సాయంత్రం 24 మంది రోగులను రెండు అంబులెన్సుల్లో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా పాత భవనంలో 130 ఆర్థోపెడిక్ పడకలుండగా.. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పురుషులు, 12 మంది మహిళలను తరలించారు. వీరితో పాటు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏడుగురు స్పెషలిస్టులు, ఆరుగురు జూనియర్ డాక్టర్లు, ఒక డీఎస్వో, 14 మంది స్టాఫ్ నర్సులను కూడా తరలించారు. మిగిలిన వారిని దశలవారీగా తరలించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చి మరో భవనం కట్టాలని కొంతమంది వైద్యులు వాదిస్తుంటే.. పాతభవనం ఉన్న రెండెకరాల స్థలాన్ని వదిలేసి, మిగిలిన ప్రాంతంలో భవన నిర్మాణం చేపట్టవచ్చని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఒకరిద్దరితో మాట్లాడి ఏకపక్షంగా రోగులను తరలించడం ఎంత వరకు సమంజసమని కార్డియో థొరాసిక్ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ప్రశ్నించగా.. తెలంగాణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు బొంగు రమేష్ అడ్డుతగలడంతో వాగ్వాదం చోటు చేసుకుని.. ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన ఉస్మానియా పాత భవనంలో 875 పడకలున్నాయి. వీటిలో 130 పడకల ఎముకల విభాగాన్ని కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్‌లోని 8 యూనిట్లు, జనరల్ సర్జరీలోని 8 యూనిట్లు, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్, గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్‌ను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని భావించింది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డుల్లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తై తర్వాతే ఉస్మానియా రోగులను తరలించాలని నిర్ణయించింది. అయితే తమ ఆస్పత్రిని తరలించవద్దంటూ సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యులు బుధవారం ఆందోళనకు దిగారు. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే.. ఉస్మానియా పాత భవనం ప్రమాదకరంగా మారడంతో దానిని ఖాళీ చేయడం అనివార్యమైంది. అయితే క్యాజువాలిటీ సహా అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలు మాత్రం ఉస్మానియాలోనే అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే క్షతగాత్రులకు ఇక్కడే చికిత్స లభించనుంది. ఎమర్జెన్సీ రోగులను కాక ఎలక్టివ్ పేషెంట్లను మాత్రమే నిర్దేశిత ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఆయా ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఓపీ సేవలతోపాటు ఇన్‌పేషెంట్ల అడ్మిషన్ ప్రక్రియంతా ఉస్మానియా నుంచే జరుగుతుందని ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ రఘురామ్ తెలిపారు. -
ఉస్మానియాలో పేషంట్ల తరలింపు ప్రారంభం
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి పేషంట్ల తరలింపు ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆస్పత్రిలోని నాలుగు విభాగాలు జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, సర్టకల్ గ్యాస్ర్టో , మెడికట్ గ్యాస్ర్టో విభాగాలను సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పటిల్ కు తరలించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి అర్థోపెడిక్ విభాగాన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలిస్తారు. మొత్తం 740 పడకలు సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగనున్నాయి. ఈ సేవలు కేవలం ఏడాది పాటు అక్కడ కొనసాగతాయి. ఓపీ సేవలు యథాతథం కాగా ఉస్మానియాలోని అవుట్పేషంట్ (ఓపీ) తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యధావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రి సూపరిండెంటెంట్ రఘు తెలిపారు. ఓపీ పేషంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. -
'ఉస్మానియా' నుంచి రోగుల తరలింపుపై పరిశీలన
ఉస్మానియా ఆస్పత్రి వార్డులను, అందులోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు గల అవకాశాలను సర్కారు పరిశీలిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రికి త్వరలో కొత్త టవర్స్‌ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శుక్రవారం ఉదయం నాంపల్లి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, వసతులపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. సాయంత్రం ఆయన వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని పరిశీలించనున్నారు. -
వారంలోగా ఉస్మానియా ఖాళీ
ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ ♦ హెరిటేజ్ కన్నా..రోగులు, వైద్యుల ప్రాణాలే ముఖ్యం ♦ పాత భవనంలో చికిత్స ఏమాత్రం సురక్షితం కాదు ♦ కొనసాగిస్తే వందల మంది చనిపోయే ప్రమాదం ♦ ఆస్పత్రి దుస్థితిపై గవర్నర్, హైకోర్టు సీజేలకు స్వయంగా వివరిస్తా ♦ వారం రోజుల్లో రోగులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల తరలింపు సాక్షి, హైదరాబాద్: ‘ఉస్మానియా ఆస్పత్రి రోగులకు ఏమాత్రం సురక్షితం కాదు. వారసత్వ కట్టడాల పేరుతో రోగులు, వైద్యులు, నర్సులను చంపుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయిస్తా. ఇందు కోసం అవసరమైతే గవర్నర్, హైకోర్టు సీజే, ఎంసీఐతో స్వయం గా మాట్లాడుతా. ఆస్పత్రి పరిస్థితిని వివరిస్తా’అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ రమణిలతో కలసి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రధాన భవనంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌తోపాటు ఇన్‌పేషంట్ వార్డులు, పేయింగ్ బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌ను సందర్శించారు. పాత భవనం దుస్థితి, కొత్త భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులు.. ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని 110 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇది చాలా వరకు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. భవనం స్థితి గతులపై జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులతో ఇప్పటికే అధ్యయనం చేయించాం. ఇది రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని వారు స్పష్టం చేశారు. వర్షాలకు పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు, నర్సు ల తలలు పగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ రోగులను ఉంచడం క్షేమం కాదు. రోగులను వారం రోజుల్లో ఇతర ఆస్పత్రులకు తరలిస్తాం’ అని సీఎం అన్నారు. ‘వైద్య విద్యార్థులు, నర్సులు, వైద్యులకు ఇబ్బంది కలగకుండా మెడికల్ కాలేజీకి సమీపంలోనే ఏదైనా ప్రైవేటు భవ నం అద్దెకు తీసుకుని వీరందరిని అందులోకి షిఫ్ట్ చేస్తాం. మెడికల్ సీట్లకు ఇబ్బంది కలగకుండా ఎంసీఐ అనుమతి కూడా తీసుకుంటాం. అడ్డం కులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిస్థితిని వివరిస్తాం. ఆస్పత్రిని సందర్శించాల్సిందిగా వారిని కోరుతాం. వారసత్వ కట్టడాల జాబితా నుంచి భవనాన్ని తొలగింపజేసే ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టాం. అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగిన ఉస్మానియా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా శిథిలమైంది’ కేసీఆర్ వివరించారు. ‘రోగుల సౌకర్యార్థం ఇక్కడే ట్విన్ టవర్స్ నిర్మించాలని నిర్ణయించాం. వైద్యులు, అధికారులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాం. గచ్చిబౌలిలో ఒక ప్రభుత్వ భవనం ఉంది. దాన్ని శుక్రవారం సందరిస్తాను.’ సీఎం పేర్కొన్నారు. సీఎం వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘురామ్, ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నాగేం దర్, తెలంగాణ వైద్యుల సంఘం బి.రమేష్ ఉన్నారు. వైద్యం సరిగా అందడంలేదని శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న అనురాధ సీఎంకు ఫిర్యాదు చేయగా, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఫీవర్‌కు ఉస్మానియా జనరల్ మెడిసిన్ : లక్ష్మారెడ్డి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని పురాతన భవనంలో ఉన్న జనరల్ మెడిసిన్ విభాగాన్ని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి మార్చనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలోని పురాతన భవనంలో ఉన్న 870 పడకల్లో 150 నుంచి 200 పడకలను ఫీవర్‌కు తరలిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి గురువారం సాయంత్రం ఫీవర్ ఆసుపత్రిని సందర్శించారు. ఏ విభాగాన్ని పీవర్‌కు తరలిస్తే బాగుంటుందనే విషయాలను డీఎంఈ రమణి, ఫీవర్ సూపరింటెండెంట్ కె.శంకర్, సీఎస్ ఆర్ఎంఓ చిత్రలేఖ తదితరులతో మంత్రి చర్చించారు. -
ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. పాత భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆస్పత్రిని సందర్శించినట్లు సమాచారం. ఆయనతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె. లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. -
'ఉస్మానియా' భవనం తొలగింపు!
-
'ఉస్మానియా' భవనం తొలగింపు!
- ఆసుపత్రి భవనాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించే ప్రయత్నాలు షురూ - హెరిటేజ్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన సర్కారు - ఆ స్థానంలో 20 అంతస్తులు గల రెండు టవర్లతో భారీ ఆసుపత్రి - నూతన భవనం రూపురేఖలపై ఆర్కిటెక్ట్‌లతో వైద్య మంత్రి భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. దాన్ని వారసత్వ హోదా (హెరిటేజ్) నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. సంబంధిత ప్రతిపాదనను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి పంపారు. ఆ కమిటీ సమావేశమై తొలగింపునకు ఆమోదం తెలపగానే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణ భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని తొలగించి ఆ స్థానంలో 20 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తారు. అయితే పాత భవనానికి గుర్తుగా నమూనా భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం రాష్ట్రంలోని ప్రముఖ ఆర్టిటెక్ట్లతో సమావేశం నిర్వహించారు. భవనం లేఔట్ ఎలా ఉండాలో చర్చించారు. నూతన భవన ఊహా చిత్రాలు రూపొందించి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పాత భవనం కంటే అత్యంత వైభవంగా... అత్యాధునికంగా ఉండేలా చేయాలని సూచించారు. వీలైనంత త్వరలో కొత్త భవనాలను నిర్మించాలని సర్కారు భావిస్తోంది. అయితే ఎంతైనా అధిక సమయం తీసుకునే అవకాశం ఉన్నందున పాత భవనాన్ని తొలగించాక వైద్య సేవల కోసం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంచేయాలన్న అంశంపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. వందేళ్లకు పైగా ఘన చరిత్ర 1910లో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసమే నిర్మించారు. రెండంతస్తులున్న (జి+2) ఈ భవ నాన్ని పురావస్తుశాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రస్తుతం అందులో 1,500 పడకలున్నాయి. నిత్యం 2 వేల మందికిపైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. నిజాం కాలంలో నిర్మించిన ప్రతీ భవనం కూడా ఇలాంటి ప్రత్యేకతలనే సంతరించుకున్నాయి. చూడ టానికి ఎంతో అపురూపంగా ఉంటుందీ ఈ భవనం. అయితే ప్రస్తుతం దాని పరిస్థితి శిథిలావస్థలో ఉంది. ఐదారేళ్ల కంటే కూడా ఆ భవనం ఉండదని జేఎన్టీయూ నిపుణులు కూడా ప్రభుత్వానికి విన్నవించారు. దాన్ని ఆధునీకరించడానికి కూడా సాధ్యపడటం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళనలు కూడా అందరినీ వేధిస్తున్నాయి. పైగా అత్యాధునిక వైద్య సేవలు కల్పించడం కష్టంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా ఉంటోంది. అయితే దాన్ని తొలగించాలన్న నిర్ణయంతో వారసత్వ సంపద పరిరక్షకుల నుంచి అనేక విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని కేవలం ఆసుపత్రి కోసమే నిర్మించినందున కూల్చి వేయడం తప్పుకాదని... పైగా దాని స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో మరో భవనం నిర్మిస్తామని సర్కారు చెబుతోంది. పైగా వారసత్వ కట్టడాల స్థానంలో కొత్త వాటిని నిర్మించి ప్రజలకు సేవ చేస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఒకవేళ దాన్ని అలాగే ఉంచి పక్కన మరో భవనం నిర్మించాలన్నా పాత భవనానికి మించి అంతస్తులు కట్టడానికి కూడా వీలుండదంటున్నారు. కాబట్టి దీన్ని తొలగించడమే సరైన నిర్ణయంగా సర్కారు భావిస్తోంది. దీనిపై వారసత్వ హోదా కమిటీ ప్రభుత్వం చెప్పే వాదనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. ఇదంతా లాంఛనప్రాయమే కానుంది. -
సండ్రకు ముగిసిన వైద్య పరీక్షలు
-
సండ్రకు ముగిసిన వైద్య పరీక్షలు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆయనను మంగళవారం ఉదయం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్రను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏసీబీ అధికారులు సోమవారం కొన్ని గంటల పాటు విచారించగా నోరువిప్పని కారణంతో సాయంత్రం సండ్రను అరెస్టు చేసిన తెలిసిందే. ఏసీబీ ఈ కేసును త్వరగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఉస్మానియాలో పాము కలకలం
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం సష్టించింది. దీంతో ఒక్కసారిగా రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి పాతభవనంలోని సూపరింటెండెంట్ కార్యాలయం పక్కన ఉన్న ఎంఎం1 వార్డులో మంగళవారం పాము కనిపించడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో వారు ఆసుపత్రి ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.జి. రఘురామ్ నగరంలోని స్నేక్సొసైటీకి సమాచారం అందించారు. పాతబస్తీకి చెందిన స్నేక్సొసైటీ అధ్యక్షుడు ఆదిల్ ఉస్మానియా ఆస్పత్రి పాతభవనానికి చేరుకొని ఎంఎం1 వార్డులో పామును చాకచక్యంగా పట్టుకొన్నారు. అనంతరం ఆ పామును జూకు తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో అనేక సంఘటనలు.... గతంలో కూడా ఉస్మానియా ఆస్పత్రిలోని ఆర్ఎంవో1 కార్యాలయం వద్ద ఓ పాము కలకలం సష్టించింది. ఉస్మానియా ఆస్పత్రిలో దట్టమైన చెట్లు, చెట్ల పొదలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు నిత్యం రోగులు, వారి సహాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. -
రేవంత్‌కు ఉస్మానియాలో వైద్య పరీక్షలు
-
బాబోయ్ మార్చురీ!
♦ ఉస్మానియాలో పనిచేయని ఫ్రీజర్లు ♦ గుట్టలుగా పేరుకుపోతున్న మృతదేహాలు ♦ పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు ♦ ఆందోళనలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్జల్‌గంజ్ : ఉస్మానియా ఆసుపత్రి శవాల కంపు కొడుతోంది. మార్చురీలోని ఫ్రీజర్లు పని చేయడంలేదు. దీనికి తోడు అనాథ శవాలు గుట్టుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిని బయట పెట్టడంతో ఎండల తీవ్రత కారణంగా త్వరగా కుళ్లిపోయి కిలో మీటరు మేర దుర్వాసన వెదజల్లుతోంది. కొంతకాలం క్రితం మార్చురీని ఆధునీకరించి 38 వరకు శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 3 మాత్రమే పని చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో నగరంలో మృతుల సంఖ్య పెరిగింది. పుట్‌పాత్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద ఉండే యాచకులు, వృద్ధులు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఇలా మార్చురీకి రోజు 3 నుంచి 4 వరకు అనాథ శవాలు చేరుతున్నాయి. పోస్టుమార్టం నిర్వహించాక మార్చురీలో భద్రపరుస్తున్నారు. మృతదేహాల వద్ద లభించిన సమాచారాన్ని బట్టి కొన్నింటిని వారి బంధువులకు అప్పగిస్తున్నారు. మిగితా వాటిని కొన్ని రోజుల తర్వాత మార్చురీలో ఉన్న ఓ గదిలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ గది పూర్తిగా శవాల గుట్టగా మారిపోయింది. అనాథ శవాల విషయంలో అటు ఆసుపత్రి యాజమాన్యంగాని, ఇటు జీహెచ్ఎంసీ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. దీంతో రోజుల తరబడి శవాలు మార్చురీలోనే కుళ్లిపోతున్నాయి. వెదజల్లుతున్న దుర్వాసన ఉస్మానియా మార్చురీలో ప్రస్తుతం 80కి పైగా మృతదేహాలు కుళ్లిపోయే దశలో ఉన్నాయి. వీటన్నింటినీ ఫ్రీజర్ల నుంచి తీసి ఓ గదిలో పడేశారు. వీటి నుంచి ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వస్తోంది. కుళ్లిపోయిన శవాలపైన వాలిన ఈగలు, దోమల పలు రకాల వ్యాధులను వ్యాపింప చేస్తున్నాయి. ఉస్మానియా మార్చురీ వెనుక భాగంలో ప్రధాన రహదారి ఉంది. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణిస్తుంటారు.ఉస్మానియా మార్చురీకి దగ్గరలోనే పీజీ విద్యార్థుల క్వార్టర్స్, ఆసుపత్రి పరిపాలనా విభాగం, మార్చురీ ప్రహరీ ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నాయి. మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసనతో ఆసుపత్రి సిబ్బంది,రోగులు ఇబ్బందిపడుతున్నారు. పట్టించుకోని జీహెచ్ఎంసీ... గతంలో అనాథ శవాలను సత్యహరిశ్ఛద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురానాపూల్, అంబర్‌పేట, నల్లకుంట, బన్సీలాల్‌పేట్ శ్మశాన వాటికల్లో మూకుమ్ముడిగా దహనం చేసేవారు. ఆయ ప్రాంతాల వారి నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను జీహెచ్ఎంసీ చూస్తోంది. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. మార్చురీలోని ఫ్రీజర్ల మరమ్మతులకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పేరుకుపోయిన మృతదేహాలను జీహెచ్ఎంసీ అధికారులు తరలించి ఖననం చేయాలని ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు. లేదంటే పరిస్థితి విషమించి పలు రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి...
- వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘటన - ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాధితుడు చాంద్రాయణగుట్ట: వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో సిగరేట్ విషయమై ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కాగా. నిందితుడు వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాప్‌కు వెళ్లి కత్తి తీసుకొచ్చి దాడి చేయడం గమనార్హం. ఇన్స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ కథనం ప్రకారం....తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నవీద్ (28), తన స్నేహితుడు షరీఫ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం గౌలిపురా మార్కెట్ ప్రాంతంలోని మాత వైన్స్‌లో మద్యం తాగేందుకు వచ్చాడు. అదే సమయంలో సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మద్యం తాగడానికి అదే వైన్స్‌కు వచ్చారు. అంతా కలిసి సిట్టింగ్ రూమ్‌లో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు నవీద్‌ను సిగరేట్ అడిగాడు. సిగరేట్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే చిత్తుగా తాగి ఉన్న ఆ యువకుడు ఆగ్రహంతో వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాపు వద్దకు పరుగెత్తికెళ్లాడు. మటన్ వ్యాపారి వద్ద ఉన్న కత్తిని లాక్కొని సిట్టింగ్ రూంలోకి వెళ్లి నవీద్‌పై దాడి చేశాడు. మెడ భాగంలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నవీద్ అడ్డుకోవడంతో ఎడమ చంక భాగంలో పొడిచారు. బాధితుడు, నిందితుడు పెనుగులాడుకుంటూ బయటికి వచ్చారు. బయట ఉన్న జనాన్ని చూసి నిందితుడు పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మాత వైన్స్‌ను బంద్ చేయించారు. పోలీ సులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉస్మానియా ఆస్పత్రిలో కార్డన్‌సెర్చ్
అప్జల్‌గంజ్ (హైదరాబాద్): ఉస్మానియా ఆస్పత్రిలో అప్జల్‌గంజ్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ నేతృత్వంలో చాదర్‌ఘాట్, సుల్తాన్‌బజార్, అప్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లకు చెందిన దాదాపు 100 మంది పోలీసులు ఈ కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్, ఇన్ పేషెంట్ బ్లాక్‌లతో పాటు అన్ని వార్డులలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియాలో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏసీపీ రావుల గిరిధర్, అప్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. -
ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి
అఫ్జ్జల్‌గంజ్ (హైదరాబాద్) : ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఖైదీ చనిపోయాడు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హత్య కేసులో శిక్ష పడి వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్నాటి బాబూరావు(29) అనే వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా గత నెల 29వ తేదీన వరంగల్ జైలు నుంచి అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న బాబూరావు పరిస్థితి విషమించి సోమవారం అర్థరాత్రి మృతి చెందాడు. అతనిది ఖమ్మం జిల్లా చింతూరు. మంగళవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఉస్మానియా ఆసుపత్రి భవనం తొలగింపు?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. దాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించాలని.. ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రతిపాదిస్తూ ఫైలు పంపింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపితే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ అందుకు అంగీకరిస్తే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణమైన భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని కూల్చివేసి దానిస్థానంలో 24 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తారు. ‘ఉస్మానియా’కు వందేళ్లకుపైగా చరిత్ర.. 1910 సంవత్సరంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసం నిర్మించారు. రెండంతస్తులున్న (జీ+2) ఈ భవ నాన్ని గతంలో పురావస్తు శాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపై వారసత్వ హోదా కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. -
ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో 24 అంతస్థులు!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో 24 అంతస్థులతో ట్విన్ హాస్పటల్ టవర్స్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సుదీర్ఘ చర్చ జరిపారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులతో ఆయన దాదాపు ఆరు గంటలసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యసేవలు ఆధునీకరించాలని తీర్మానించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకలతో అత్యాధునిక ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించారు. -
యువకుడి దారుణ హత్య
హయత్‌నగర్: పీకలదాకా మద్యం తాగించి.. ఆపై విచక్షణా రహితంగా కొట్టి, మెడకు ఉరి బిగించి గుర్తు తెలియని యువకుడిని హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొహెడ నుంచి మంగళ్‌పల్లి వెళ్లే దారిలో సీతారామ హౌసింగ్ వెంచర్లో రోడ్డుకు కొంత దూరంలో చెట్ల పొదల్లో ఓ యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి సుమారు 25-30 ఏళ్లు ఉండవచ్చని మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు అతన్ని తీసుకొచ్చి మద్యం తాగించి కొట్టి, ఆపై మెడకు ఉరేసి ఆటోకు కట్టి సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రక్తం మరకలతో పాటు కొద్ది దూరంలో మద్యం సీసాలు లభించాయి. తల, ముఖం, చేతులు, కళ్లు, మర్మాంగాలపై గాయాలున్నాయని, పథకం ప్రకారమే యువకుడిని ఇక్కడికి తీసుకొచ్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని షర్టుపై మైటెక్స్ డబీర్‌పురా అనే లేబుల్ ఉందని, అతను ఆటోడ్రైవర్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం శోధించారు. -
బాంబు బెదిరింపుతో హడలిన ఉస్మానియా
హైదరాబాద్: బాంబు బెదిరింపు కాల్‌తో ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది బెంబేలెత్తి పోయారు. ఎవరో ఆకతాయి అర్ధరాత్రి సమయంలో బాంబు పెట్టినట్టు కాల్ చేయడంతో సిబ్బంది, అక్కడి రోగుల సంబంధీకులు భయంతో బయటకు పరుగులు తీశారు. అఫ్జల్ గంజ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రి అంతటా తనిఖీలు నిర్వహించారు. బాంబు ఏమీ లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ క్రైం: బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మహ్మద్ అష్ఫాఖ్(43) అనే వ్యక్తి గత కొంతకాలంగా మతిస్థిమితం లేక బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతని చెవిలోంచి రక్తం వస్తోందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అష్ఫాఖ్ మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉస్మానియా ఆసుపత్రి
let's see చూసొద్దాం రండి రాష్ట్రంలోనే అతిపెద్ద ధర్మాసుపత్రిగా ప్రసిద్ధికెక్కింది ఉస్మానియా. మూసీ నదీ తీరంలో 1866 ప్రాంతంలో నిర్మించిన ఈ ఆసుపత్రి నాడే రెండు అంతస్థుల భవనంలో ఆధునిక వైద్య సేవలు అందించేది. ఆ రోజుల్లో దీన్ని అఫ్జల్‌గంజ్ దవాఖానా అనేవారు. అయితే ఈ ఆసుపత్రి భవనాలు 1908లో వచ్చిన మూసీ వరదల తాకిడికి పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో ఏడో నిజాం 1920లో తిరిగి ఇదే ప్రాంతంలో ఆసుపత్రి కోసం నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల కాలంలో పనులన్నీ పూర్తి చేసుకుని 1925లో నూతన ఆసుపత్రి ప్రారంభమైంది. అప్పటి నుంచి దీన్ని ఉస్మానియా ఆసుపత్రిగా పిలుస్తున్నారు. భవిష్యత్‌లో ఎప్పుడైనా మూసీకి వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులూ లేని రీతిలో దీన్ని నిర్మించారు. భవనాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వెయ్యి పడకల ఆసుపత్రిగా ఎందరో పేద రోగులకు ఆధునిక వ్యై సేవలు అందిస్తున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ప్రధాన భవనంలోకి ప్రవేశించగానే... సుమారు 110 అడుగుల ఎత్తై ద్వారం స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. ఆసుపత్రి లోపల భాగంలో నిజాం మహబూబ్ అలీఖాన్ (1869-1911), నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1948) నిలువెత్తు చిత్రపటాలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రధాన హాలు లోపలి భాగాలు కూడా సుమారు 70-80 అడుగుల ఎత్తులో నాలుగు కమాన్లతో ఎంతో అందంగా కనిపిస్తుంది. కమాన్ల పైభాగాన నిజాం ప్రభువులు ఉపయోగించిన తలపాగా ఆకారంలోని కుడ్య చిత్రాలు నేటికీ చెక్కు చెదరలేదు. భవనం లోపల కూడా నాటి చిత్రకారులు గీసిన లతలు, పుష్పాలు ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఏడు లక్షల మంది ఔట్ పేషెంట్లకు, అలాగే మరెందరో ఇన్‌పేషెంట్స్‌కు వైద్య సేవలందిస్తున్నారు. 250 మంది వైద్యులు, 300 మంది హౌస్ సర్జన్లు, 500 మందికి పైగా నర్సింగ్, 800 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఉస్మానియా భవనాలు 27 ఎకరాల్లో విస్తరించాయి. 1160 పడకల ఆసుపత్రిగా నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే పేద రోగులతో కిటకిటలాడుతోంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
ఆత్మహత్యా లేక హత్యా?
హైదరాబాద్ సిటీ: నగరంలోని ఇబ్రహీం బాగ్ దగ్గర ఉన్న జేకే ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో ఓ చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకున్న స్థితిలో స్థానికులకు శనివారం కనిపించాడు. స్థానికులు సమాచారాన్ని గోల్కొండ పోలీసులకు తెలపడంతో.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి వయసు సమారు 45 ఉండవచ్చు. ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా లేక తనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: నగరంలో యాకత్‌పూర రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గాయ పడిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళ, పురుషుడిని నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్వైన్‌ప్లూ డెంజర్ బెల్స్
-
డాక్టర్లనూ వదలని స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ..ఈ పేరు చెబితే చాలు, ఇప్పటివరకు సామాన్య ప్రజలే వణికి పోయేవారు. ఇప్పుడు ఆ వంతు డాక్టర్లకు కూడా వచ్చింది. వ్యాధిని నివారించాల్సిన డాక్టర్లే ఇప్పుడు వ్యాధి బారిన పడ్డారు. దీనికి నిదర్శనమే ఈ ఉదంతం.. ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకింది. ఎన్ 95 మాస్కులు సప్లై ఆగిపోయినందువల్లే స్వైన్ ఫ్లూ సోకిందని గురువారం ఉస్మానియా అస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. ఎన్95 మాస్కులను అన్ని వార్డుల్లో పనిచేసే జూడాలకు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరి మృతి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టోలీచౌకీకి చెందిన అజ్మత్ సుల్తానా(55) బుధవారం ఉదయం మృతిచెందింది. నగర శివార్లలోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది. కాగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జ్ కాగా, మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 35 మంది చికిత్స పొందుతుగా.. మరో 20 మంది రక్త నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. ఉస్మానియా ఆస్పత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో మహిళా హౌస్‌సర్జన్(24) కూడా ఉన్నారు. మరో 11 మంది నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంకు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
స్వైన్‌ఫ్లూపై చర్యలు తీసుకోవాలి: పొంగులేటి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధి బారినపడిన వారిని ఆదుకోవాలని, నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించేలా చూడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. స్వైన్‌ఫ్లూపై ప్రజల్లో అవగాహన పెంచి, చైతన్యాన్ని కలిగించాలన్నారు. ప్రభుత్వపరంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పొంగులేటి కోరారు.