Rythu Bharosa Centres
-
ఆర్బీకేల ఆక్రమణ
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో పౌరులకు సేవలందించిన సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన టీడీపీ కూటమి సర్కారు... డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను (రైతు సేవా కేంద్రాలు) సైతం ఆక్రమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లె దాటాల్సిన అవసరం లేకుండా భరోసా కల్పించిన ఆర్బీకేలను దర్జాగా కబ్జా చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను ఇప్పటికే పోలీస్స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో మిగిలిన జిల్లాల్లోనూ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు.. వాటి ఉనికే లేకుండా చేయాలనే కుట్రతో ఆ భవనాలను వివిధ శాఖలకు కేటాయిస్తుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.జగన్ ముద్ర చెరిపేయడమే లక్ష్యం..!సచివాలయాలు.. వలంటీర్లు... ఆర్బీకేల పేరు చెబితే చాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తుకొస్తారు! ప్రజల ముంగిటే పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి రెండువేల జనాభాకు ఓ సచివాలయం.. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పి వాటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు పట్టభద్రులైన 15,667 మంది వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, వెటర్నరీ సçహాయకులను నియమించారు. రైతులకు ఎనలేని సేవలందిస్తున్న వీటిని నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. రైతన్న ఇక ఎటు వెళ్లాలి..?గతంలో రైతన్నలు గ్రామ చావిడి, కూడలి లేదా కాలువ గట్లపై కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఆర్బీకేల ఏర్పాటుతో అన్నదాతలు వాటిని తమ సొంత ఇంటి మాదిరిగా భావించారు. తమ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను ఎంతో ఆదరించారు. రైతన్నలు ఉదయం పొలానికి వెళ్లే ముందు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆర్బీకేలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. విత్తనాలు, ఎరువులు, ఈ–క్రాప్, రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వివిధ రకాల వ్యవసాయ సంబంధిత మేగజైన్స్తోపాటు స్మార్ట్ టీవీ ద్వారా పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందేవి. డిజిటల్ కియోస్క్‌ల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలను బుక్ చేసుకుని వాతావరణ, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేవారు. అన్నదాతలకు గ్రామాల్లో సేవలందించేందుకు రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తయి కొన్ని చోట్ల ఆర్బీకేల కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరికొన్ని భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,387 భవనాల్లో నిర్మాణాలు దాదాపు 80 – 90 శాతం పూర్తి అయ్యాయి. కొద్దిపాటి నిధులిస్తే చాలు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
ఆర్బీకేలు అదృశ్యం!
సాక్షి, అమరావతి: నిన్న స్కూళ్లు.. సచివాలయాలు..! నేడు ఆర్బీకేల వంతు! అన్నింటికీ ఒకటే సాకు.. రేషనలైజేషన్..! కూటమి సర్కారు మూసివేతల పరంపర కొనసాగుతోంది. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ అన్నదాతలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా విత్తనం నుంచి విక్రయం దాకా సేవలందించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు (రైతు సేవా కేంద్రాలు) ఉరి వేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చి, పూర్తిగా నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు తాజాగా రేషనలైజేషన్ పేరిట వీటికి మంగళం పాడేందుకు కసరత్తు చేపట్టింది. పట్టణ ప్రాంతాలతోపాటు తీర మండలాల్లోని గ్రామాల్లో ఆర్బీకేలను పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ప్రాతిపదికన 2–3 ఆర్బీకేలను విలీనం చేసి భారీగా కుదించాలని భావిస్తోంది. దాదాపు ఐదారు వేల ఆర్బీకేలు మూత పడనుండటంతో సిబ్బందితో పాటు రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాగు ఉత్పాదకాలతో పాటు సంక్షేమ ఫలాలను రైతులకు ముంగిటే అందించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో ఒకేసారి 10,778 ఆర్బీకేల సేవలకు 2020 మే 30న వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే 10,546 ఆర్బీకేలు సేవలందిస్తున్నాయి. సగానికిపైగా మూసివేత! జనాభా ప్రాతిపదికన ఏర్పాటైన ఆర్బీకేలు కొన్నిచోట్ల ఒక సచివాలయం పరిధిలో రెండు.. అంతకు మించి ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని 232 అర్బీకేలతోపాటు తీర మండలాల్లోని 555 గ్రామాల్లోని ఆర్బీకేలను పూర్తిగా మూసి వేయాలనే నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రెండు వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే ఒక ఆర్బీకేను కేటాయించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రెండు వేల ఎకరాలకు పైబడి విస్తీర్ణం కలిగిన పరిధిలో 1,096 ఆర్బీకేలు ఉన్నాయి. వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల పరిధిలో 2,837 ఆర్బీకేలు, 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం పరిధిలో 3,583 ఆర్బీకేలు, ఐదు వందల ఎకరాల లోపు పరిధిలో 3,033 ఆర్బీకేలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలు కాగా, సగటున 1,500 నుంచి రెండు వేల ఎకరాలకు ఒకటి చొప్పున ఆరు వేల ఆర్బీకేలు సరిపోతాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని చోట్ల స్థానికంగా సాగు అయ్యే పంటలను బట్టి విస్తీర్ణం కొద్దిగా పెంచినా కనీసం 5 వేల ఆర్బీకేలు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. మూసివేసిన ఆర్బీకేలను పంట కొనుగోలు కేంద్రాలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించాలని యోచిస్తున్నారు. మూసివేసే ఆర్బీకేలలో పనిచేసే సిబ్బందిని సంబంధిత శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయడంపై కసరత్తు జరుగుతోంది. ఆర్బీకేల్లో 15,667 మంది సేవలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఆర్బీకేలకు గత ప్రభుత్వం 21,796 పోస్టులు మంజూరు చేయగా వివిధ దశల్లో నియామకాల ద్వారా 15,667 పోస్టులను భర్తీ చేశారు. 6,162 మంది వ్యవసాయ, 2,303 మంది ఉద్యాన, 377 మంది పట్టు, 6,105 మంది పశు సంవర్థక, 720 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. గోపాలమిత్రలతో పాటు వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను ఆర్బీకేలతో అనుసంధానించారు. స్థానికంగా సాగయ్యే పంటలను బట్టి వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్‌చార్జీలుగా నియమించారు. విద్యార్హతలను బట్టి అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించారు. ఆర్బీకేల ద్వారా 40 శాతం సబ్సిడీతో రూ.1,052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్డ్ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లు సమకూర్చారు. అత్యాధునిక భవనాలు.. వసతులు ప్రతి ఆర్బీకేలో డిజిటల్ కియోస్‌్క, స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, మాయిశ్చర్, సాయిల్ టెస్టింగ్ యంత్రాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమకూర్చింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా ఫీడ్, పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా.. ఇలా ఏది కావాలన్నా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేసింది. సీజన్‌కు ముందే అగ్రిల్యాబ్స్‌లో సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను గ్రామ స్థాయిలో నిల్వ చేసి దుక్కి పనులు ప్రారంభం కాకముందే, రైతులు అడిగిన మరుక్షణం అందించేలా చర్యలు తీసుకుంది. వాతావరణం, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేందుకు 9,484 ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్‌్కలు నెలకొల్పి, వాటి పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. 8,304 ఆర్బీకేలు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా, 2474 ఆర్బీకేలు అద్దె భవనాల్లో ఉన్నాయి. రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆర్బీకేలకు నూతన భవన నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వివిధ దశల్లో ఉన్న 5,387 భవనాల నిర్మాణాలు కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయాయి. అవార్డులు.. అంతర్జాతీయ ప్రశంసలు ఆర్బీకేలను వైఎస్ జగన్ నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దారు. పొలం బడులు, తోట బడులు, పట్టుబడులు, మత్స్యసాగు, పశు విజ్ఞాన బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధరలు పతనమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆర్బీకేల ద్వారా రైతు క్షేత్రం నుంచే ధాన్యంతో సహా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ క్రాప్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. పశువులకు మెరుగైన వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు అందచేశారు. ఆర్బీకేల సాంకేతికత పంజాబ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలనే కాకుండా విదేశాలను సైతం ఆకర్షించింది. ఇథియోఫియా, వియత్నాం తదితర దేశాల ప్రతినిధి బృందాలు ఆర్బీకేల సేవలను అధ్యయనం చేశాయి. ఇక ఆర్బీకేలు ప్రతిష్టాత్మక యూఎన్ చాంపియన్ అవార్డుకు నామినేట్ కావడంతో పాటు పలుమార్లు గోల్డ్ స్కోచ్తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఆర్బీకేల స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను దేశ వ్యాప్తంగా నెలకొల్పుతోంది. నాలుగేళ్లలో సేవలిలా.. ఆర్బీకేల ద్వారా నాలుగేళ్లలో 32 లక్షల మంది రైతులకు 11.88 లక్షల టన్నుల ఎరువులు, 58 లక్షల మందికి 34.09 లక్షల క్వింటాళ్ల సరి్టఫైడ్ సీడ్స్, 1.36 లక్షల లీటర్ల పురుగు మందులతో పాటు ఆక్వా, ఫిష్ ఫీడ్, పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేశారు. ప్రతి ఆర్బీకేలో రూ.5 వేల విలువైన మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా గ్రామ స్థాయిలోనే నాణ్యమైన పశు వైద్య సేవలు అందించారు. 75 శాతం సబ్సిడీపై నాలుగు లక్షల మంది పాడి రైతులకు 7,117.35 టన్నుల పశుగ్రాసం విత్తనాలను పంపిణీ చేశారు. 60 శాతం సబ్సిడీపై 78,018 టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా అందచేశారు. ఆక్వా రైతులకు రూ.15.10 కోట్ల విలువైన 2,809.76 టన్నుల ఆక్వా ఫీడ్ సరఫరా చేశారు. ఆక్వా కార్యకలాపాలకు సంబంధించి 36,300 లైసెన్సులు జారీ చేశారు. ఎరువుల కోసం రైతులు మండల కేంద్రాల చుట్టూ తిరిగి పడిగాపులు కాయాల్సిన దుస్థితి లేకుండా గ్రామంలోనే అందించడంతో రవాణా చార్జీల భారం, వ్యయ ప్రయాసలు తొలిగాయి. ఇలా మరో రూ.150 కోట్ల వరకు రైతులకు ఆదా అయినట్లు అంచనా. ఏటా కోటి మందికి పైగా ఆర్బీకేల సేవలను పొందారు. నేడు నిర్వీర్యం.. టీడీపీ కూటమి పాలనలో ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో సబ్సిడీ విత్తనాలు మినహా మిగిలిన సాగు ఉత్పాదకాల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గతంలో ఏటా సగటున నాలుగు లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా ఈ ఏడాది అతికష్టమ్మీద 1.70 లక్షల టన్నులు అందించారు. ఇక పశు వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. మత్స్య సాగుబడులు, పశు విజ్ఞాన బడులను నిలిపి వేశారు. పొలం బడులు, తోటబడులు మొక్కుబడిగా మారిపోయాయి. మరోవైపు కులగణన, పింఛన్ల పంపిణీ, ఆస్తి పన్ను వసూళ్లు, ఇంటింటి సర్వే, సాగునీటి కాలువల డ్యూటీలు, పంచాయతీ కార్యదర్శులు సూచించే ఇతర నాన్డిపార్టుమెంటల్ విధులకు సైతం ఆర్బీకేల సిబ్బందినే వినియోగించడంతో రైతులకు సేవలు అందని దుస్థితి నెలకొంది. ఆర్బీకేలను ఎత్తివేసే కుట్ర గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ఆర్బీకేలను పూర్తిగా ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. రేషనలైజేషన్ ఇందులో భాగమే. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా అందించే ఎరువులు, సాగు ఉత్పాదకాలు, వివిధ రకాల సేవలను నిలిపివేశారు. ఆర్బీకేలను కుదించడమంటే గ్రామ స్థాయిలో రైతులకు ప్రభుత్వ సేవలను దూరం చేయడమే. ఈ విషయంలో రైతుల తరఫున పోరాటం చేస్తాం. – జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం గ్రామ స్థాయి సేవలకు విఘాతం రైతులకు నష్టం జరగకుండా, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ముప్పు లేకుండా రేషనలైజేషన్ చేయాలి. అర్బన్‌తో పాటు తీర ప్రాంతాల్లో ఆర్ఎస్కేలను కుదించడంలో అభ్యంతరం లేకున్నా, ఇతర ప్రాంతాల్లో కుదించడం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. గ్రామ స్థాయిలో రైతులకు అందించే సేవలకు విఘాతం కలుగుతుంది. ఆ ఇబ్బంది లేకుండా గ్రామ స్థాయిలోనే రైతులకు సేవలందేలా సాగు విస్తీర్ణం ప్రాతిపదికన రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈవో) రైతు సేవా కేంద్రాల నుంచి మినహాయింపు ఇవ్వాలి. – డి.వేణుమాధవరావు, అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కక్ష సాధింపు చర్యే అంతర్జాతీయ ప్రశంసలందుకున్న ఆర్బీకేలను రేషనలైజేషన్ పేరిట కుదించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. వైఎస్ జగన్ ప్రభుత్వ ముద్రను తొలగించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ముందుకెళ్తోంది. ఇప్పటికే సూపర్‌సిక్స్ హామీలో పేర్కొన్న రూ.20 వేల పెట్టుబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. ఆర్ధిక భారం పేరిట ఆర్బీకేలను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించేలా ఆర్బీకేలను మరింత బలోపేతం చేయాలి. – వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్సీపీ రైతు విభాగం పని ఒత్తిడి తగ్గించాలి సిబ్బందికి ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టాలి. మిగులు సిబ్బందిని దూర ప్రాంతాలకు కాకుండా జిల్లా స్థాయిలోనే సంబంధిత శాఖల్లో సర్దుబాటు చేయాలి. సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. – జి.నాగరాజు, అధ్యక్షుడు, ఏపీ ప్లాంట్ డాక్టర్స్ అసోసియేషన్ -
నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తికానున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు చేపట్టిన రైతు పండుగ సదస్సుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ.. నూతన సాంకేతిక విధానాలు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం అక్కడే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాలొంటారు.సీఎం రాక ఇలా.. : సీఎం రేవంత్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన స్వగృహం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 3:30 గంటల వరకు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు వస్తారు. సమీపంలోని రైతు పండుగ సదస్సుకు చేరుకొని స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం నాలుగున్నర గంటలకు బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతోపాటు మరికొందరు మంత్రులు సైతం సదస్సుకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ ముగిశాక సాయంత్రం ఆరుగంటలకు తిరుగు పయనమై హైదరాబాద్‌లోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. భారీగా రైతుల సమీకరణ.. బహిరంగసభకు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రైతు పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తీసుకున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి ఆర్టీసీ 657 బస్సులను కేటాయించింది. వీటితోపాటు ప్రైవేట్ బస్సులు, జీబులు తదితర వాహనాల్లో రైతులు తరలిరానున్నారు. సుమారు లక్ష మంది వస్తారనే అంచనాతో బహిరంగసభకు తగిన ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.రుణమాఫీ, రైతు భరోసాపై ఆశలు.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాలతో పలువురు రైతులకు రుణాలు మాఫీ కాలేదు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే సేకరించిన వివరాలతో జాబితా రూపొందించగా.. దీంతోపాటు రైతు భరోసా నిధుల విడుదలపై రైతు పండుగవేళ సీఎం శుభవార్త అందిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా పంట రుణాలను మాఫీ చేస్తామని.. అయితే రూ.2 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుందని.. మిగతా మొత్తాన్ని రైతులు భరించాలని ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీపై రేవంత్‌రెడ్డి ప్రకటన చేయొచ్చనే ఆకాంక్ష అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. -
అన్నదాతకు దుఃఖమే!
సాక్షి, అమరావతి: ఆచరణ సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లకిలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసింది! ఓటాన్ అకౌంట్‌తో ఐదు నెలలు కాలక్షేపం చేయగా సోమవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లోనూ రైతుల నోట్లో మట్టి కొట్టింది. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కేటాయింపులు ఉంటాయన్న ఆశలను నీరుగార్చి నిలువు దగా చేసింది. తాము అధికారంలోకి రాగానే బేషరతుగా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తామని సూపర్ సిక్స్‌లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి పీఎం కిసాన్తో కలిపి జమ చేస్తామని రైతులను మరోసారి మోసగించింది. గత ఐదేళ్లలో 53.58లక్షల మంది రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.34,288.17 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. అయితే, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సుమారు 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,716.74 కోట్లు కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సాయం అందుకున్న వారికి మాత్రమే జమ చేసినా... ఒక్కో కుటుంబానికి ఈ ఏడాది రూ.నాలుగు వేలకు మించి పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ, భూ సాగు దారులకు పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రస్తావన ఎక్కడా లేదు. రైతుల నెత్తిన ప్రీమియం పిడుగు రైతులపై పైసా భారం పడకుండా గత ఐదేళ్లూ విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో వ్యవవసాయ శాఖ మంత్రి అచ్చెన్న అధికారికంగా ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ–2024–25 నుంచి ఈ పథకంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా రబీలో నోటిఫై చేసిన 15 పంటలకు ప్రీమియం వాటాగా రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడుతుంది.అంతేకాకుండా రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ, 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాల పంపిణీ గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధికి పైసా కూడా విదల్చలేదు. వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించేసింది. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా సర్విస్ కనెక్షన్లకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీకి కూడా పైసా కేటాయించలేదు. పథకాల పేర్లు మార్చి.. ప్రశంసిస్తూ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పలు పథకాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ ఎన్నికల్లో దు్రష్పచారం చేసిన కూటమి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాటి గొప్పతనాన్ని ప్రశంసించడం గమనార్హం. వాటి పేర్లు మార్చి తాము కొనసాగిస్తున్నట్లు తేటతెల్లం చేసింది.రూ.43,402.33 కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రబీ సీజన్ నుంచి స్పచ్ఛంద నమోదు విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేసి, పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం పేరిట అమలు చేయబోతున్నట్టు చెప్పారు. రూ.43,402.33 కోట్ల అంచనాలతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. -
రైతు భరోసా అమలుపై భిన్నాభిప్రాయాలు..
-
రైతు భరోసాపై కసరత్తు
-
కాంగ్రెస్ ఓపెన్ మైండ్ తో ఉంది..
-
దిగుబడులు పెంచుతున్న రైతు‘బడులు’
సాక్షి, అమరావతి: నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు పొలం బడులు.. పట్టు దిగుబడులు పెంచేందుకు పట్టుబడులు, ఉద్యాన రైతుల కోసం తోట బడులు, ఆక్వా రైతుల కోసం మత్స్య సాగు బడులు, పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తోంది. ‘ఈ–ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్’ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు ఉత్పత్తుల్లో నాణ్యతతో పాటు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన విషపూరిత రసాయనాలు (యాంటీìబయోటిక్స్) వినియోగానికి బ్రేకులు పడ్డాయి. పాల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో సుమారు 10 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వగలిగింది. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో.. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు క్షేత్ర ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సమగ్ర సస్యరక్షణ, పోషక, నీటి, కలుపు యాజమాన్య పద్ధతులతోపాటు కూలీల ఖర్చును తగ్గించుకునేలా అవగాహన కలి్పస్తున్నారు. సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా కాగా.. 9 నుంచి 20 శాతం మేర దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎకరాకు వరిలో 275 కేజీలు, మొక్కజొన్నలో 300 కేజీలు, పత్తిలో 45 కేజీలు, వేరుశనగలో 169 కేజీలు, అపరాల్లో 100 కేజీల అదనపు దిగుబడులు సాధించారు. అలాగే పట్టు సాగుబడుల ద్వారా పట్టుగూళ్ల ఉత్పాదకత ప్రతి వంద గుడ్లకు 60 కేజీల నుంచి 77 కేజీలకు పెరిగింది. ఆక్వా ఉత్పత్తుల్లో తగ్గిన యాంటీబయోటిక్స్ వినియోగం సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో అప్సడా, సీడ్, పీడ్ యాక్టుల్ని తీసుకురావడంతోపాటు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సరి్టఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచి్చంది. నాణ్యమైన ఆక్వా దిగుబడులు సాధించడం ద్వారా యాంటీబయోటిక్స్ వినియోగాన్ని మరింత తగ్గించే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలిస్తున్నాయి.మితిమీరిన యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల అమెరికా, చైనా సహా యూరప్, మధ్య ఆసియా దేశాలు గతంలో మన ఆక్వా ఉత్పత్తులను తిరస్కరించేవి. మత్స్య సాగుబడుల ద్వారా ఇస్తున్న శిక్షణ ఫలితంగా యాంటీబయోటిక్స్ శాతం గణనీయంగా తగ్గించగలిగారు. గతంలో 37.5 శాతం నమోదైన యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రస్తుతం 5–10 శాతం లోపే ఉంటున్నాయని చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడంతోపాటు దిగుబడులు సైతం 10–15 శాతం మేర పెరిగినట్టు గుర్తించారు. గడచిన ఐదేళ్లలో ఏపీ నుంచి రొయ్యల కన్సైన్మెంట్లను తిప్పిపంపిన ఘటనలు చోటుచేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. పశువుల్లో తగ్గిన వ్యాధులు మరోపక్క ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పశు విజ్ఞాన బడుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనలో మూగ, సన్న జీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులు 20–30 శాతం మేర తగ్గాయని గుర్తించారు. ఈనిన 3 నెలలకే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం వల్ల ఏడాదికో దూడను పొంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు. దూడలు పుట్టుక మధ్య కాలం తగ్గడంతో లీటరున్నరకు పైగా పాల దిగుబడి (15–20 శాతం) పెరిగిందని, ఆ మేరకు రైతుల ఆదాయం పెరిగిందని గుర్తించారు. దూడ పుట్టిన నాటినుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని వాటిని అవలంబించడం ద్వారా దూడల్లో మరణాల రేటు 15 శాతం, సకాలంలో పశు వైద్య సేవలందించడం వల్ల 10 శాతం మేర పశువుల మరణాలు ‡తగ్గినట్టు గుర్తించారు. హెక్టార్‌కు 4 టన్నుల దిగుబడి నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్ వేశా. మత్స్య సాగుబడుల్లో చెప్పిన సాగు విధానాలు పాటించా. సిఫార్సు చేసిన ప్రోబయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు పెడితే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు మించి ఖర్చవలేదు. గతంలో హెక్టార్‌కు 3నుంచి 3.2 టన్నుల దిగుబడి రాగా.. ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనపు ఆదాయం వచి్చంది. –పి.లక్ష్మీపతిరాజు, కరప, తూర్పు గోదావరి జిల్లాపశువిజ్ఞాన బడులతో ఎంతో మేలు మా గ్రామంలో 26 మంది రైతులు 3,600 గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రోగాలొస్తే తప్ప పశువైద్యుల దగ్గరకు వాటిని తీసుకెళ్లే వాళ్లం కాదు. తరచూ వ్యాధుల బారిన పడుతూ మృత్యువు పాలయ్యేవి. తగిన బరువు తూగక ఆరి్థకంగా నష్టపోయే వాళ్లం. పశువిజ్ఞాన బడుల వల్ల క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తుండటంతో వ్యాధులు, మరణాల రేటు తగ్గింది. సబ్సిడీపై ఇస్తున్న పచి్చమేత, సమీకృత దాణాను తీసుకోగలుగుతున్నాం. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక బరువును పొంది అధిక లాభాలను ఆర్జిస్తున్నాం. – బమ్మిడి అప్పలరాజు, తొడగువానిపాలెం, విశాఖ జిల్లా -
సాగుకు చక్కనైన సాయం
ఎన్నికలు ముగిసినా ఇంకా ఈనాడు దుగ్ధ తీరలేదు. ఏదోలా ప్రభుత్వంపైనా... అనుసరిస్తున్న విధానాలపైనా లేనిపోని విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకుంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు అందిస్తూ పైశాచికానందం పొందుతోంది. తాజాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా, పశు మత్స్యదర్శిని మ్యాగజైన్స్పైనా తన అక్కసును వెళ్లగక్కింది. దురుద్దేశంతో ఇచ్చిన ఈ కథనాన్ని ప్రభుత్వాధికారులు నిర్ద్వందంగా ఖండించారు. వారి ఆరోపణలను తిప్పి కొట్టారు.సాక్షి, అమరావతి: వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమగ్రంగా... సచిత్రంగా ఆకర్షణీయంగా అందించేందుకు రైతు భరోసా, పశుమత్స్య దర్శిని మ్యాగజైన్స్‌ను ఐదేళ్లుగా ప్రభుత్వం అందిస్తోంది. గతంలో మూస పద్ధతిలో బ్లాక్ అండ్ వైట్ కలర్లో నాణ్యత లేని మెటీరియల్‌తో ‘పాడి పంటలు’ పేరిట వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటికీ కలిపి ఒకే మాస పత్రిక అందించేవారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గతం కంటే మెరుగ్గా... ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయిల్ ప్రింట్ కవర్, అన్ని పేజీలు రంగుల్లో 44 పేజీలతో కూడిన ఈ మ్యాగజైన్‌ను ముద్రిస్తూ కేవలం రూ.25లకే అందిస్తున్నారు. గన్నవరం సమీకృత రైతు సమాచార కేంద్ర పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి దాదాపు పది మంది పర్యవేక్షణలో ఈ మ్యాగజైన్ రూపొందుతోంది.ఆర్బీకేలకు ఉచితంగా సరఫరావ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచే సాగు ఉత్పాదకాల వివరాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా సాగులో పంటల వారీగా మెలకువలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు, ఆదర్శ రైతుల అభిప్రాయాలతో విభిన్న కథనాలను అందిస్తున్నారు. 2020 జూలైలో ఈ మ్యాగజైన్‌కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రైతులకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తోంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల దాదాపు 14,300 ప్రతులను ముద్రించి ఆర్బీకేలకు వ్యవసాయ శాఖ అధికారులకు ఉచితంగా ఇస్తున్నారు. లక్షన్నర మంది చందాదారులుఆర్బీకే పరిధిలో 400–500 మంది రైతులు ఉండగా ఆర్బీకేలోని డిజిటల్ లైబ్రరీలో ఒక మాస పత్రిక మాత్రమే ఉంచడం వల్ల మెజారిటీ రైతులు చదవలేకపోతున్నారు. వీరి కోసం ఓ వైపు వ్యవసాయ, అనుబంధ శాఖల వెబ్సైట్లలో ఈ పత్రికను డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ మెజార్టీ రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు స్వచ్ఛందంగా చందాదారులుగా చేరుతున్న వారికి నేరుగా మ్యాగజైన్స్ అందజేస్తున్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఉచితకాపీలు ఏ ధరతో ముద్రిస్తున్నారో అదే ధరకు రైతులకు అందిస్తున్నారు. చందాదారులుగా చేరగోరే రైతుల నుంచి మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు. ప్రస్తుతం ఈ పత్రికల చందాదారులు లక్షన్నరకు పైగా ఉన్నారు. ఉన్నతాశయంతో నిర్వహిస్తున్న ప్రభుత్వంపై ఈనాడు బురద జల్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.స్వచ్ఛందంగానే చేరుతున్నారుఈ మాసపత్రికల కోసం రైతులు స్వచ్ఛందంగానే చందాదారులుగా చేరుతున్నారు. వారిపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. వీటి ప్రాముఖ్యతపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించాం. చందా దారులంతా ఆర్బీకే పరిధిలో ఉండే రైతులే కాబట్టి, వారికి ప్రతీ నెలా ఈ మాసపత్రికలు అందజేసే బాధ్యతను అప్పగించాం. చందాదారులుగా చేర్పించేందుకు ఆర్బీకే సిబ్బందిపై ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించలేదు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధంచేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్లో ఆర్బీకేలలో ఎరువులు లేవన్న మాట వినిపించకూడదన్న లక్ష్యంతో రైతులు కోరుకున్న ఎరువులను అందించేలా ఏర్పాట్లుచేస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల మంది రైతులకు రూ.1,311.80 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయగా, రానున్న సీజన్లో కనీసం 10 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు రూ.100 కోట్ల వరకు ఆదాసాగు ఉత్పాదకాల పంపిణీలో ఆర్బీకేలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎరువుల కోసం రైతులు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. అయినా అరకొరగానే అందేవి. ఒక్కోసారి సమయానికి దొరక్క బ్లాక్‌లో కొనాల్సి వచ్చేది. ఎరువుల వంకతో అవసరంలేని పురుగుల మందులను కొనాల్సి రావడం రైతులకు భారంగా మారేది. ప్రస్తుతం సర్టిఫై చేసిన ఎరువులను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడంతో ఎరువు కోసం రైతులు ఇబ్బందిపడిన దాఖలాలు కన్పించలేదు. లోడింగ్, అన్లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అవుతోంది. ఇలా నాలుగేళ్లలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. ఆర్బీకేలకు ఎరువుల లైసెన్సులు కేంద్రం కేటాయించిన ఎరువులను జిల్లాల వారీగా మార్క్‌ఫెడ్ గోడౌన్లలో నిల్వచేసి అక్కడ నుంచి పీఏసీఎస్, ఆర్బీకేలకు సరఫరా చేయడానికి ఏటా రూ.70 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఈ భారాన్ని గత నాలుగేళ్లుగా ప్రభుత్వమే భరిస్తోంది. వచ్చే ఏడాది నిల్వ సామర్థ్యం పెరగనుండడంతో ఇందుకు కనీసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రతీ ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో వివిధ శాఖల పరిధిలో 1,864 గోదాములు, సచివాలయ ప్రాంగణాల్లో 3,979 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేలకు అనుబంధంగా 500 టన్నుల సామర్థ్యంతో రూ.493.15 కోట్లతో 1,167 గోదాములు నిరి్మస్తుండగా, వాటిలో 664 గోదాములు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేలకు ఎరువుల విక్రయ లైసెన్సులు జారీచేశారు. ఫలితంగా సమయంతో పాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి. ఖరీఫ్–24కు 17.50 లక్షల టన్నులు ఎరువులు..ఇక ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా 37.79 లక్షల ఎకరాల్లో వరి, 14.48 లక్షల ఎకరాల్లో పత్తి, 13.88 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 5.85 లక్షల ఎకరాల్లో కందులు, 3.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 6.50 లక్షల టన్నుల యూరియా, 2.30 లక్షల టన్నుల డీఏపీ, ఏడు లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్ష టన్నుల ఎస్ఎస్పీ, 70 వేల టన్నుల ఎంఓపీ ఎరువులు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేశారు. మరోపక్క.. ఇఫ్కో ద్వారా 5 లక్షల నానో యూరియా, 2 లక్షల నానో డీఏపీ బాటిల్స్ సరఫరాకు ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల్లో కనీసం 5.60 లక్షల టన్నులు ఆర్బీకేల ద్వారా సరఫరాకు ప్రణాళిక సిద్ధంచేసారు. -
మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో..ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగావాస్తవం: మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. ఆరోపణ: సీఎం యాప్ సిగ్గు..సిగ్గువాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారువాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయివాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు. జీఎల్టీ ఖర్చులను కూడా భరిస్తూ.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. -
తెరచాటు వ్యవహారాలు మీ బాబుకే చెల్లు
ప్రతీ నెలా ఒకటో తేదీ సుప్రభాత వేళ.. పేదింటి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు అందే పింఛన్ సంతోషంలో జగన్ కనిపిస్తారు.. రైతుభరోసా సాయంలో రైతులకు ఆయన నవ్వు మోమే కనిపిస్తుంది.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది రూపాయల ఖరీదైన చికిత్స ఉచితంగా పొందే పేదల ఆరోగ్యంలోజగన్ రూపమే కనిపిస్తుంది.. ఇలా ప్రతీ పథకం లబ్ధిలోనూ రాష్ట్రమంతటికీ సీఎం జగన్ సంక్షేమాశయమే వేర్వేరు రూపాల్లో ప్రత్యక్షమవుతోంది ఒక్క రామోజీకి తప్ప. కనిపించకూడదని కళ్లు మూసుకుంటాడాయన. నిత్యం జనంతో మమేకమై వారి సమస్యలే తనవిగా తపించే నేత సీఎం జగన్.. జనానికి చిన్నపాటి అసౌకర్యమూ కలగరాదని ఆరాటపడే నాయకుడాయన. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ తక్షణ సాయం అందాల్సిన పేదలను దగ్గరకు తీసుకుని, ఆత్మీయ పరిష్వంగంతో తక్షణ భరోసా ఇస్తారాయన. ఆ భరోసాకు తగ్గట్టుగా 24 గంటలు తిరగక ముందే ఆర్థిక సాయాన్ని కలెక్టర్లే అందించేలా చూస్తున్న మానవతావాది. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా ఎన్నికల వేళ జగన్‌కు రాష్ట్ర ప్రజల నుంచి లభిస్తున్న అఖండ స్వాగతాన్ని జీర్ణించుకోలేక తత్తరపాటు, బిత్తరపాటుతో రామోజీ తొట్రుపాటు రాతలు రాస్తున్నారు. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఇన్ని రోజులూ పరదాల చాటున ఉన్నట్లు.. ఎన్నికలున్నందున ఇప్పుడే ప్రజల దగ్గరకు వెళ్తున్నట్లు అజ్ఞానంతో ఈనాడు రామోజీ సీఎం జగన్‌పై విషం కక్కారు. జగన్ అంటే జనం..జనం అంటే జగన్ అనే విషయం రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారు. ఈనాడు రామోజీకీ ఆ విషయం తెలుసు...ఆయినా నిలువునా జగన్ వ్యతిరేకతతో అక్షర కుట్రలు, కూహకాలతో ఆయనకు ప్రతీ రోజూ తెల్లారుతోంది. పథకాల అమలు సందర్భంగా సాయం అందించే క్రమంలో ఏ జిల్లాకు జగన్ వెళ్లినా నిస్సహాయులైన పేదలను స్వయంగా కలిసి, వారికి ఒక అన్నలా..తమ్ముడిలా...కొడుకులా..వారి వేదనను నివేదనను ఎంతో శ్రద్ధాసక్తులతో ఆలకిస్తారు. వారి కష్టాలను 24 గంటల్లోనే పరిష్కరిస్తారు. ఇదంతా రామోజీ ఈనాడులో రాస్తూనే ఉంటారు. జనానికి జగన్ చేస్తున్న మేలేమిటో తెలిసినా, తెలియనట్లే నటిస్తూ... ఎన్నికలు కనుక జగన్ జనంలోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. జగన్ తొలి నుంచీ జనంతో ఉండటానికే ఇష్టపడతారు తప్ప చంద్రబాబు మాదిరిగా బడా వ్యాపార వేత్తలు, పలుకుబడి గల వారితో అంటకాగడానికి ఇష్టపడరనే విషయం జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా రహదారులకు ఇరు వైపులా జనం పూలతో స్వాగతించడం, ఆయన నవ్వులు చిందిస్తూ, ఆత్మీయంగా జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగడం రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోంది. ఒక్క ఈనాడు రామోజీకి మాత్రం ఈ ముచ్చటైన దృశ్యాన్ని చూడడానికి అబద్ధాల పరదాలు అడ్డొస్తున్నాయి. వాస్తవానికి పరదాలు, తెరచాటు వ్యవహారాలు మీ చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది రామోజీ. ముఖ్యమంత్రి జగన్ పథకాల అమలుకు జిల్లాలకు వెళ్లిన సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నిస్సహాయులై అనారోగ్యంతో బాధపడే పేదలను, లేదా ఇతర ఆర్దిక సమస్యల్లో సతమతమవుతున్న పేదలను కలిసి వారి సమస్యలను శ్రద్ధగా వినడమే కాకుండా కొంత మందికి 24 గంటలు తిరగకుండానే జిల్లా కలెక్టర్ల చేత ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయిస్తున్నారు. కాలేయ మార్పిడితో పాటు గుండె, కేన్సర్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి భారీ ఆర్దిక సాయాన్నీ ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో జగన్‌ను కలిసిన ఆర్తుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సీఎంఓ కార్యాలయంలో ఒక బృందమే పనిచేస్తోంది. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇప్పటివరకు 699 మంది పేదలను స్వయంగా కలిసి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు వైద్యానికి, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందేలా జగన్ చర్యలు తీసుకున్నారు. జనం అంటే ఈ 699 మంది పేదలు కాదా ఈనాడు రామోజీ..జనంలోకి వెళ్లడం అంటే నీ అర్థం ఏంటో మరి! ఊరికో సచివాలయం.. సమస్యల పరిష్కారాలయం.. గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా, వారికి ప్రభుత్వ సేవలు అక్కడే అందేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఈ సీఎం ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల మధ్యే సీఎం జగన్ పాలన కొనసాగింది. మీ చంద్రబాబులా ప్రచార యావ కోసం జిమ్మిక్కులు చేయడం జగన్‌కు ఇష్టం ఉండదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన ఘనత మీ బాబుకే దక్కుతుంది. చంద్రబాబు 13 దేశాలకు 23 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. నిత్యం హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలతో చంద్రబాబు విహరించినప్పుడు మీకు తప్పనిపించలేదా రామోజీ?. రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానాలకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటారా?. ఎన్నికల వేళ జనంలోకి అంటూ ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే ప్రాంతాల వారీగా నాలుగు సిద్ధం సభలను నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు గురించిన ఆలోచనతో జగన్ పాలన సాగించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఎన్నుకున్న ప్రజల దగ్గరకే ప్రజాప్రతినిధులను ధైర్యంగా పంపించింది దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్. చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ధైర్యంగా ఆయన జనంలోకి వెళ్తుంటే దాన్నీ తప్పుపట్టే స్థాయికి రామోజీ దిగజారారు. ప్రజలకు ఏ కష్టం, ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన కొనసాగింది. బాబు తరహాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి. ఏదైనా ఆపద వస్తే దాన్ని ప్రచారానికి వినియోగించుకోవడం ఆయన నైజం కాదు. -
Fact Check: పట్టు రైతులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించింది. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు అండగా ఉండటానికి గ్రామాల్లోనే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500, పంట నష్టపరిహారం, రైతులకు ఉచిత విద్యుత్.. ఇలా ఒకటా రెండా దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు.. దేశవిదేశాల నుంచి ఏపీ వ్యవసాయ విధానాలపై ప్రశంసలు.. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా పచ్చకళ్ల కబోధి, ఈనాడు పత్రికాధినేత రామోజీరావుకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. పట్టు రైతులు కష్టాలు పడుతున్నారని.. పథకాలకు ప్రభుత్వం పాతరేసిందని.. రైతులకు రాయితీలు నిలిపేసిందని అసత్యాలు, అబద్ధాలతో మంగళవారం జగనన్న మంకు‘పట్టు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చారు. దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవిగో.. ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గత ఐదేళ్లుగా పట్టుసాగు భారీగా విస్తరించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో పట్టు రైతులు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు కళ్లజూస్తున్నారు. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇలా అడుగడుగునా చేయూతనిస్తుంటే ఈనాడు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఆరోపణ: గతమెంతో ఘనం.. నేడు దైన్యస్థితిలో పట్టు రైతులు వాస్తవం: 2014–15 నుంచి 2018–19 మధ్య కొత్తగా 39,433 ఎకరాల్లో 15,362 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. 25,632 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. 2019–20 నుంచి 2023–24 మధ్య కొత్తగా 40,362 ఎకరాల్లో 17,852 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. అదనంగా 30,272 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. ఇక గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తయ్యాయి. రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్క్‌రీలర్లు ఉత్పత్తి చేశారు. ఆరోపణ: రాయితీలకు కోత.. నిధుల విడుదలకు సతాయింపు వాస్తవం: ఈ ఐదేళ్లలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.19.41 కోట్ల బైవోల్టిన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.4.50 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసింది. ఇక పట్టు రీలర్లకు 4 ఏళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్స్ ఇ చ్చింది. ఈ ఏడాది మరో రూ.2.75 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది పట్టు రైతులకు రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇలా క్రమం తప్పకుండా పట్టు రైతులకు ఇన్సెంటివ్‌లు, రీలర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూంటే.. ఈనాడు పత్రిక సత్యదూరమైన ఆరోపణలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆరోపణ: 33 శాతం పైగా పెరిగిన ఉత్పత్తి వ్యయం వాస్తవం: కిలో పట్టు గూళ్లకు 2018–19లో మార్కెట్ ధర రూ.350లకు మించి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సరాసరి ధర రూ.480 నుంచి రూ.550 మధ్య పలుకుతోంది. అంటే 2018–19తో పోలిస్తే సరాసరి ఆదాయం కిలోకు అదనంగా రూ.200కు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గత ఐదేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టు గూళ్లకు కిలోకి రూ.881కు పైగా లభించింది. పైగా రైతుల పట్టుగూళ్ల ఉత్పాదకత కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రతి వంద గుడ్లకు గతంలో 60 కిలోలొస్తే, ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తోన్న పట్టు సాగు బడుల ఫలితంగా ప్రస్తుతం 70–75 కిలోలు వస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారే తప్ప ఈనాడు ఆరోపించినట్టు ఏ దశలోనూ ఇబ్బందిపడిన దాఖలాలు లేవు. ఆరోపణ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం శీతకన్ను వాస్తవం: చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్స్, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా పట్టు రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటికే 5,242 మంది రైతులు 7,720 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.3,462 కోట్ల విలువైన 66,593 టన్నుల నాణ్యమైన కకూన్స్, 13,246 టన్నుల బైవోల్టెన్ కకూన్స్‌ను ఉత్పత్తి చేశారు. రూ.3,560 కోట్ల విలువైన 9,150 టన్నుల రా సిల్క్ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఏడాదిలో పట్టు పరిశ్రమ కోసం రూ.99.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరపగా ఇప్పటికే రూ.28.80 కోట్లు విడుదల చేసింది. 2021–22లో పట్టు పరిశ్రమ స్థూలాదాయం రూ.11,638 కోట్లు ఉండగా 2022–23లో రూ.12,098 కోట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆరోపణ: యాంత్రీకరణ సహా పథకాల ఎత్తివేత వాస్తవం: క్రిమిసంహారక మందుల కొనుగోలుకు 9,525 మంది రైతులకు రూ.2.38 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. యంత్ర పరికరాల కోసం పట్టు పరిశ్రమ ద్వారా 1,524 మంది రైతులకు రూ.8.25 కోట్లు ఇచ్చింది. పట్టు రైతులు నిర్మించుకున్న షెడ్లతో పాటు మల్బరీ తోటల సాగు, రీలింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం రూ. 111.61 కోట్లు విడుదల చేసింది. పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ బకాయిలన్నింటినీ రైతుల ఖాతాకు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా యంత్ర పరికరాలకు మంగళం పాడేశారంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. -
Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే
సాక్షి, అమరావతి: రైతుకు అడుగడుగునా అండగా నిలిచి, వారిని చేయిపట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకేలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. వాటి సేవలను రైతులకు దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతోంది. ఏపల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టింది. తాజాగా ‘రైతు సేవ వట్టిదే..భరోసా దక్కదే..!’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: వేధిస్తోన్న సిబ్బంది కొరత వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, 1896 మంది అవసరమని గుర్తించి ఆ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇటీవలే ఫలితాలు విడుదల చేయగా, ఎంపికైన వారికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. నెలకు రూ.12వేల వేతనంతో తాత్కాలిక సిబ్బంది(ఎంపీఈవో)ని రెండు దఫాలుగా నియమించి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కర్ని ప్రభుత్వం తొలగించిన దాఖలాలు లేవు. ఆరోపణ: లక్ష్యాల పేరిట సిబ్బందిపై ఒత్తిళ్లు వాస్తవం: వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు సర్టిఫైడ్ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీరిపై అదనపు బాధ్యతలు మోపకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేసుకునే వాతావరణాన్ని సృష్టించిందే తప్ప లక్ష్యాల పేరిట ఏ ఒక్కర్ని ఒత్తిడికి గురిచేసిన దాఖలాలు లేవు. అలా అని ఏ ఒక్క సిబ్బంది ఫిర్యాదు చేసిన ఘటనలు లేవు. సిబ్బందికి సచివాలయ శాఖ నుంచి సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా హాజరు వేసే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఆరోపణ: అద్దె భవనాలే దిక్కు వాస్తవం: 526 గ్రామాల్లో సొంత భవనాలుండగా, 10,252 గ్రామాల్లో రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1090.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిని మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఆరోపణ: అద్దెలు, బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలేవీ? వాస్తవం: అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చుచేయగా, వచ్చే మార్చి వరకు అద్దెల నిమిత్తం సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. వచ్చే మార్చి వరకు బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా, స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేసారు. స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేర్చే‡ కార్యక్రమం చేపట్టారే తప్ప వీటి కోసం సిబ్బందికి ఎలాంటి టార్గెట్లు విధించలేదు. ఆరోపణ: ఆర్బీకేలకు ఆదరణ కరువు వాస్తవం: అదును దాటక ముందే.. సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతులకు అందిస్తున్నారు. తొలి ఏడాది(2020–21) 1.07 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా, 3వ ఏడాది (2022–23) 4 లక్షల టన్నులకు అమ్మకాలు చేరాయి. తొలి ఏడాదిలో 2.55 లక్షల మంది ఎరువులు తీసుకుంటే..గతేడాది 10.90 లక్షల మంది తీసుకున్నారు. 2023–24లో ఇప్పటివరకు 8.95లక్షల మంది రైతులు 3.89 లక్షల టన్నుల ఎరువులు తీసుకున్నారు. ఆర్బీకే ద్వారా అమ్మే ఎరువుల రవాణా, నిల్వ, అమ్మకానికి కావాల్సిన సదుపాయాల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. మరొక వైపు 34.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.1,040.39 కోట్ల రాయితీతో 58.74 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13.90 కోట్ల విలువైన 1,784.47 క్వింటాళ్ల పత్తి, మిరప, సోయాబీన్ తదితర విత్తనాలను 44వేల మంది రైతులకు సరఫరా చేశారు. 2020–22 మధ్య 1.51 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేయగా, ఈ ఏడాది ప్రస్తుత రబీలో ఇప్పటికే రూ.18.57లక్షల విలువైన 1657 లీటర్ల పురుగుల మందులను 6వేల మంది రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలు లాభాపేక్షతో కూడిన వాణిజ్య కేంద్రాలు కాదు. రైతులకు గ్రామస్థాయిలో ఏర్పాటైన సేవా కేంద్రాలన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగుల మందుల అమ్మకాలు వ్యాపారం కాదు..ఒక సదుపాయం మాత్రమే. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ఇథియోపియా, బంగ్లాదేశ్, జర్మనీ, వియత్నాం వంటి విదేశీ ప్రతినిధుల బృందాలు ఆర్బీకే సేవలను శ్లాఘిస్తున్నాయి. అనతికాలంలోనే అవార్డులు, రివార్డులతో పాటు ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఆర్బీకేలపై ఈనాడు విషం కక్కడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: ఊరిస్తున్న ఊరు
సాక్షి, అమరావతి: గ్రామంలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు.. మరో నాలుగు అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో సందడిగా ఆర్బీకేలు.. అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్.. ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలలు.. ఆ పక్కనే అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు.. సంతృప్త స్థాయిలో సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ప్రతి గ్రామంలో పది మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు.. వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధులు పొందుతూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు.. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. రాష్ట్రంలో వికేంద్రీకరణతో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. గతంలో కూలిపోయే దశలో ఉన్న సర్కారు స్కూళ్ల భవనాలు మినహా ఇతర ప్రభుత్వ భవనాలేవీ కానరాని దుస్థితి నుంచి అన్ని సదుపాయాలతో సర్వ సేవలు అందించేలా పలు కార్యాలయాలు గ్రామాల్లోనే నిర్మితమవుతున్నాయి. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఏ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులైనా గ్రామాల నుంచే పని చేసుకోవచ్చు. ► ఇప్పుడు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. బంధువులను చూడడానికి మాత్రమే ఇప్పుడు పొరుగూళ్లకు వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ప్రజలకు పథకాలు, సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని, వ్యయ ప్రయాసలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాయాల ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు. లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంఛన్‌గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య సేవలను అందజేస్తోంది. రక్త పరీక్షలు అక్కడే నిర్వహిస్తూ అవసరమైన మందులూ ఉచితంగా ఇస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ► ఐదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను మినహాయిస్తే మరే ప్రభుత్వ కార్యాలయాలు లేని పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటిన 2019కి ముందు వరకు దాదాపు 3 వేల పంచాయతీలలో కనీసం కార్యాలయం భవనాలు కూడా లేవని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇరుకు గది, చిన్న హాలు మినహా మరే వసతులు ఉండవు. కార్యదర్శుల కొరతతో అవి నెలల తరబడి మూసివేసి ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసింది. ఇప్పటికే 7,144 భవనాల నిర్మాణం పూర్తి కాగా మరో 1,888 భవనాలు నెల రోజుల్లో పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన మాగ్యజైన్లు ఉంటాయి. రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశాలకు వీలుగా స్మార్ట్ టీవీలు, వివిధ పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకునే డిజిటల్ కియోస్క్‌లు, తేమ కొలిచే యంత్రాలు, విత్తన పరీక్ష పనిముట్లు, భూసార పరీక్ష కిట్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ► గతంలో విత్తనాలు కావాలన్నా ఎరువులు అవసరమైనా వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పంటలను చీడపీడలు ఆశిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం వద్ద ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందిస్తోంది. కాల్ సెంటర్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను చేరువ చేసింది. రైతులకు సేవలు అందించేందుకు ఒక్కో ఊరిలో రూ.23.94 లక్షలు ఖర్చు పెట్టి 1,360 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. పశువైద్య సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2446 కోట్లతో 10,216 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ► గ్రామాల్లో ప్రజలకు కనీస వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్కటి రూ.17.50 లక్షల వ్యయంతో 1,185 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెల్త్ క్లినిక్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసింది. వీటిలో 3,388 నిర్మాణం పూర్తి కాగా మరో 1705 ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే దశలో ఉన్నాయి. విలేజీ హెల్త్ కిన్లిక్లలో 14 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ ప్రభుత్వం అందించింది. డెంగ్యూ, మలేరియా సహా హెచ్ఐవీ, సిఫిలిస్ లాంటి వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను అన్ని హెల్త్ క్లినిక్‌లోనూ అందుబాటులో ఉంచింది. వీటికి తోడు ప్రతి హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచింది. ► నాడు – నేడు ద్వారా రూ.11,000 కోట్ల ఖర్చుతో 38,059 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సూళ్లకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. రూ.612 కోట్లు ఖర్చు చేసి ప్రహరీ గోడలను నిర్మించింది. డిజిటల్ ల్రైబరీలను కూడా నిర్మిస్తోంది. ► ప్రభుత్వం కేవలం కార్యాలయాల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిల్లో అన్ని మౌలిక వసతులను కల్పించింది. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్లను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లుతో పాటు 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించేందుకు 2,91,590 స్మార్ట్ ఫోన్లను, సిమ్ కార్డులను అందజేసింది. ► 2020లో పలు భవన నిర్మాణాలకు అనుమతులు లభించగా వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా నిర్మాణ పనులను స్తంభించాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 16,081 భవన నిర్మాణాలు పూర్తి కాగా మరో 5095 భవనాలు నెల నుంచి నెలన్నర లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్మాణాలు జరుగుతున్న చోట్ల అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇరుకైన పంచాయతీ భవనాలు మినహా రైతులకు, ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయాలు లేకపోవడం గమనార్హం. ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సాధికారత బాట పట్టారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి పశువులు కొనుగోలు చేశారు. ఆసరా, చేయూత ద్వారా కిరాణా షాప్‌లు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. ఆమూల్, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి దిగ్గజ కంపెనీలతో అనుసంధానించి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. నాలుగు నెలల్లో నియామకాలు.. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. ఇది ఒక రికార్డు కాగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతోమంది సచివాలయాల ఉద్యోగులు ఈ నాలుగేళ్ల కాలంలో పదోన్నతులు కూడా పొందారు. టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు లేని గ్రామాల్లో నేడు సచివాలయాల ద్వారా పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు. -
కౌలురైతులు, అటవీ భూ సాగుదారులకు మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం దక్కని కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. శాచ్యురేషన్ పద్ధతిలో రైతుభరోసా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించి మూడోవిడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతుభరోసా అందించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైతుభరోసా పోర్టల్‌లో ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులతో పాటు సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద ఈ నాలుగున్నరేళ్లలో 53.53 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ సాయం అందుకున్నవారిలో ఏటా సగటున 51 లక్షల మంది భూ యజమానులు, పంటసాగుదారు హక్కుపత్రం (సీసీఆర్సీ) ఆధారంగా 1.2 లక్షల మంది కౌలురైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాతో అటవీభూమి సాగుచేసుకుంటున్నవారు 90 వేలమంది ఉన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కౌలురైతులు (సీసీఆర్సీ), ఆర్వోఎఫ్ఆర్ సాగుదారులు మొత్తం 9.39 లక్షల మందికి రూ.1,219.68 కోట్ల పెట్టుబడి సహాయం అందింది. జనవరిలో మూడోవిడత.. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. లబ్దిపొందిన వారిలో 51 లక్షల మంది భూ యజమానులు, 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. జనవరిలో మూడోవిడత సాయం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరింతమంది కౌలుదారులు, అటవీ భూ సాగుదారులకు లబ్దిచేకూర్చాలని రైతుభరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్‌ను ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఓపెన్ చేశారు. లాగిన్ ఐడీలు ఆర్బీకే సిబ్బంది నియంత్రణలోనే ఉంటాయి. అర్హత ఉండి ఇంకా అవకాశం వినియోగించుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ) పట్టాదారులు ఈ పథకంలో అర్హత సాధించటానికి రైతుభరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కౌలుదారులు సీసీఆర్సీతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, అటవీ భూమి సాగుచేసేవారు ఆర్వోఎఫ్ఆర్ పట్టా, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఆర్బీకేకి వెళ్లి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్న వారికి జనవరిలో మూడువిడతల సాయం ఒకేసారి అందించనున్నారు. విస్తృత ప్రచారం చేస్తున్నాం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తకర స్థాయి (శాచ్యురేషన్)లో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో అర్హత ఉండి ఇప్పటివరకు పెట్టుబడి సాయం పొందని కౌలుదారులు, అటవీ భూ సాగుదారులు రైతు భరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ మేరకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. – చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ -
6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...?
హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇక సర్కారు కొలువుదీరడమే తరువాయి. సీఎం అభ్యర్థిపై ఇప్పటికే ఆ పార్టీ అధి ష్టానం చర్చలు జరుపుతోంది. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఫలితాలు వెలువడి రోజైనా గడవక ముందే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే హామీలు ఇచ్చింది.. ఎలా అమలు చేస్తుంది.. అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి. బస్సుల్లో మహిళలు టిక్కెట్లు తీసుకోవద్దని, మహిళలకు డబ్బులు వస్తాయని.. ఇలా పలు రకాల ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఆరు గ్యారంటీలపై... కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే పార్టీ పేర్కొన్న పథకాలపై ప్రచారం షురూ అయ్యింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500 నగదుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్ ఉంటుందా?.. దానికే రూ.500 కలిపి అందిస్తారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సైతం మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు, వరిపంటపై రూ.500 బోనస్, తదితర అంశాలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామన్న హామీపై నిరుద్యోగుల్లో ఆశలు నెలకొన్నాయి. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5లక్షల వరకు విద్యాభరోసా కార్డు, చేయూత కింద వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, తదితర గ్యారంటీ హామీలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. -
అన్నదాతకు కొండంత అండగా రైతు భరోసా కేంద్రాలు
-
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్ల (ఆర్‌ఎల్‌యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్‌ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. వేతనం రూ.22,460 ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు ahd.aptonline.in, https://apaha- recruitment.aptonline.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తులు కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్ 11వ తేదీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా వీఏహెచ్‌ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
Fact Check: 'సర్టిఫై' చేసినా సణుగుడే..
నాడు: టీడీపీ హయాంలో విత్తనాల కోసం పడరాని పాట్లు పడేవారు. ఎండనక, వాననక.. రేయనకా పగలనక రైతులు నిద్రహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడితేగానీ కాసిన్ని గింజలు దొరికేవి కావు. తమకు అనుకూలంగా ఉన్న వారు, కాస్త పలుకుబడి ఉన్న వారికి ఇవ్వగా మిగిలినవే సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. విత్తనాల కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిల్చొనే సందర్భంలో ఎండలు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి చనిపోవడం అప్పట్లో సర్వసాధారణం. నేడు.. కానీ, ఇప్పుడు చూద్దామంటే ఎక్కడా ఒక్క క్యూలైన్ కన్పించడంలేదు. విత్తనం దొరకలేదని కానీ, నాసిరకం విత్తనంవల్ల పంటలను కోల్పోయామని కానీ ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన దాఖలాల్లేవు. పైగా ఏ సీజన్‌కు ఆ సీజన్లో సకాలంలో అన్నీ అందుతున్నాయి. విత్తనాల కొరత అనే ఊసేలేదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యంలేదు. పక్కాగా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. నిజానికి ఇదొక విప్లవాత్మక మార్పు. ఈ రాష్ట్రంలో మాదిరిగా ఆర్బీకేలుగానీ, విత్తు నుంచి విక్రయం వరకూ రైతును చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. అయినా, బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు ‘శనగ విత్తన పంపిణీలో డొల్లతనం’ అంటూ రైతులను తప్పుదారి పట్టించేలా ఆదివారం అసత్యాలతో ఓ రుచీపచీలేని కథనాన్ని వండివార్చింది. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. ‘పచ్చ’కామెర్ల ‘ఈనాడు’కు ఇవేవీ కనపడవు. ఆ పత్రిక కక్కిన విషంపై ఈ ‘ఫ్యాక్ట్‌చెక్’.. ఆరోపణ: రాయితీ విత్తనంతో ఒరిగేదేంటి? వాస్తవం: 2023–24 సీజన్లో ఇప్పటికే 10.90 లక్షల మంది రైతులకు రూ.204.15 కోట్ల సబ్సిడీతో 5.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా 80 శాతం రాయితీపై 96,392 మంది రైతులకు రూ.21.44 కోట్ల సబ్సిడీతో 24,635 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశారు. అలాగే, ముందస్తు రబీ కోసం 2.96 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని కూడా సిద్ధంచేశారు. సీజన్లో సబ్సిడీ విత్తన ధరలను ఏటా రాష్ట్రస్థాయి ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయిస్తుంది. అదే రీతిలో మొన్న సెప్టెంబర్ 15 నాటికి స్థానిక మార్కెట్ ధరలను అనుసరించి విత్తన శుద్ధి, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, తాలు మినహాయింపు, ప్రాసెసింగ్ నష్టం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని శనగ విత్తన ధరలను నిర్ణయించారు. జేజీ–11 రకానికి క్వింటాకు రూ.8,100, కేఏకే–2 రకానికి రూ.14,050 చొప్పున నిర్ణయించారు. గత ఏడాది 25 శాతం రాయితీపై ఎకరాకు 25 కేజీలు సరఫరా చేయగా, ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చిన్న, సన్నకారు రైతులకు 40 శాతం రాయితీపై ఎకరాకు 40 కేజీల చొప్పున విత్తన సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోపణ: నాసిరకం అంటూ తిరుగుటపా? వాస్తవం: వ్యవసాయశాఖ నుంచి 2,59,660 క్వింటాళ్ల జేజీ–11 రకం, 36,313 క్వింటాళ్ల కేఏకే–2 రకం విత్తనం కోసం ఇండెంట్ రాగా.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం తదితర జిల్లాలకు 1.30 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 85,598 మంది రైతులకు 68,655 క్వింటాళ్ల విత్తనాన్ని వాటి ద్వారా సరఫరా చేశారు. వైఎస్సార్ జిల్లాలో 74,120 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా.. ఇప్పటికే 61,670 క్వింటాళ్లు సిద్ధంచేశారు. విత్తనం కోసం ఆర్బీకేల్లో 41,746 మంది రైతులు తమ వివరాలను నమోదు చేయగా, ఇప్పటికే 45వేల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన విత్తనాల్లో సన్నగింజ, మట్టిగడ్డలు, పుల్లలతో సరఫరా చేస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయని, నాణ్యత బాగోలేదని ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేసిన, తీసుకున్న విత్తనాన్ని వెనక్కి ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. అయినా సరే.. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు రైతులను రెచ్చగొట్టే ధోరణిలో రోజుకో తప్పుడు కథనాన్ని ప్రచురిస్తుండడంపట్ల రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆరోపణ: సన్నగింజ.. మట్టిగడ్డలు.. పుల్లలే.. వాస్తవం: సాధారణంగా విత్తన నాణ్యత ప్రమాణాలను నాలుగు దశలలో పరీక్షించిన తర్వాత ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా సర్టిఫై చేసిన సీడ్‌ను ఆ తర్వాత ఏపీ సీడ్స్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. చివరగా.. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ముందు సంబంధిత ఆర్బీకే ఇన్చార్జి, ఆయా గ్రామాల అభ్యుదయ రైతుల సమక్షంలో మొలక, భౌతిక పరీక్షలు నిర్వహించి నాణ్యత బాగుందని నిర్థారించిన తర్వాతే రైతులకు సరఫరా చేసేందుకు అనుమతిస్తారు. ఇదేరీతిలో అత్యంత శాస్త్రీయంగా, విత్తన నాణ్యతను పరీక్షించిన తర్వాతే విత్తన పంపిణీకి అనుమతిచ్చారు. -
Fact Check: ఆర్బీకేలపై ఎందుకంత అక్కసు!?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు చేస్తున్న మంచి ఏదీ రామోజీరావుకు కనిపించదు. కనిపించినా కనిపించనట్లు.. చూసినా చూడనట్లు నటిస్తారు. ఎందుకంటే.. అధికారంలో ఆయన ఆత్మబంధువు చంద్రబాబు లేడు కాబట్టి. ఆయనే కనుక ఉంటే ఆయనెన్ని తప్పులు చేసినా అవి సూపర్‌గానే కనిపిస్తాయి. తన జర్నలిజం మార్కు ఇదేనని రామోజీ నిత్యం నిరూపించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా ఆదివారం సంచికలో ‘ఇదా భరోసా సిగ్గు.. సిగ్గు’ అంటూ రైతుభరోసా కేంద్రాలపై రామోజీ నిస్సిగ్గుగా విషం కక్కిన తీరు ఈ కోవకు చెందినదే. వైఎస్సార్ రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రాలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేస్తుంటే.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే ఈనాడుకు కంటిమీద కునుకు కరువైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి అవి పాటుపడుతూ నాలుగేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా కళ్లెదుట సాక్షాత్కరిస్తుండడంతో పచ్చ మీడియాకు దిక్కుతోచడంలేదు. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు విస్తృతమైన సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఆ వ్యవస్థే వృధా అన్నట్లుగా నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది ఈనాడు. నిజానికి.. రబీ సీజన్ కోసం ముందస్తుగా ఓ వైపు ముమ్మరంగా విత్తన పంపిణీ జరుగుతోంది.. ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.. పురుగు మందుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయినా అవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఎక్కడా ఏ ఒక్క రైతు తమకు విత్తనం అందడంలేదని కానీ, ఎరువు దొరకడం లేదంటూ కనీసం ఫిర్యాదు కాదు కదా రోడ్డెక్కిన పాపాన కూడా పోలేదు. ఆర్బీకేలకు వస్తున్న ఈ ఆదరణను చూసి ఓర్వలేక రామోజీ కల్లుతాగిన కోతిల వెర్రెక్కిపోతున్నారు. ‘ఇదా భరోసా సిగ్గు.. సిగ్గు’ కథనంపై ‘ఫ్యాక్ట్‌చెక్’ చదవండి.. ఆరోపణ: నామమాత్రమైన ఆర్బీకేలు.. వాస్తవం: రైతులకు గ్రామస్థాయిలో సకాలంలో సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఆర్బీకేలు రైతుల ఆదరణ చూరగొంటున్నాయి. గతంలో వ్యయప్రయాల కోర్చి మండల కేంద్రాలకు వెళ్లి ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహారాలు మాని విత్తనాలను, ఎరువులను పురుగుల మందుల కోసం పడిగాపులు కాస్తే కాని దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం చూద్దామంటే నాలుగేళ్లలో క్యూలైన్ అనేది కన్పించలేదు. పైగా గతంలో తమ పార్టీ నేతలు, సానుభూతిపరులైన భూస్వాములు, రైతులకు పంచగా, మిగిలినవి సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. ప్రస్తుతం వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు అవసరమైన మేరకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఆరోపణ: పురుగు మందుల జాడేది? వాస్తవం: ఆర్బీకేల ద్వారా మూడేళ్లలో 1,50,822 మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. వచ్చే సీజన్ కోసం సర్టిఫై చేసిన సస్యరక్షణ మందులు, సూక్ష్మ పోషకాల పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు. ఇంతవరకు పురుగు మందులను కేవలం వివిధ పథకాల కింద మాత్రమే పంపిణీ చేయగా, 2023 రబీకాలం నుంచి ఎరువుల మాదిరిగా పురుగు మందులను కూడా సాధారణ పద్ధతిలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఆరోపణ: అక్కరకు రాని ఆర్బీకేలు.. వాస్తవం: నిజానికి.. ఆర్బీకేల ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. కేవలం సాగు ఉత్పాదకాలు రైతు ముంగిట అందించడమే కాదు.. సర్టిఫై చేసిన నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీతో పాటు రైతుల్లో సామర్థ్యం పెంపు, పరిశోధనా ఫలాలు రైతు క్షేత్రాలకు చేరవేయడం, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ–క్రాప్ బుకింగ్, రైతు సంక్షేమ పథకాల అమలులో ఆర్బీకేలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 45,226 కోట్ల విలువైన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను 26.55 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు ఈనాడుకు కన్పించకపోవడం విడ్డూరం. ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద బహిరంగ మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా కృషిచేస్తున్నారు. ఆరోపణ: ఆర్బీకేలకు రూ.మూడువేల కోట్లు వెచ్చించినా.. వాస్తవం: రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేయగా, వాటిలో 542 గ్రామాల్లో సొంత భవనాలుండగా 10,236 ఆర్బీకే భవనాల నిర్మాణం చేపట్టారు. వాటిలో 3,947 భవనాల నిర్మాణం పూర్తికాగా.. 2,948 భవనాలను ఇప్పటికే వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 5,212 భవనాలు వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 1,077 భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు భవనాల కోసం రూ.944 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.343 కోట్లు ఖర్చుచేశారు. కియోస్క్‌ల పనితీరును ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏపీ ఫైబర్‌నెట్, మొబైల్ ఇంటర్నెట్ ద్వారా కియోస్క్‌లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. 94 శాతం కియోస్క్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. రెండు విడతల్లో నియమించిన 6,246 వ్యవసాయ, 4,655 పశుసంవర్థక, 2,356 ఉద్యాన, 731 మత్స్య, 377 పట్టు సహాయకులతో పాటు అనుభవజ్ఞులైన బహుళార్ధ, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్‌తోపాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. ఆరోపణ: ఎరువుల అమ్మకాలు తూచ్.. వాస్తవం: ఆర్బీకేల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదని, రైతులకు గ్రామస్థాయిలో కల్పించిన ఓ సదుపాయం మాత్రమే. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50 శాతం వ్యాపారులకు, మిగిలిన 50 శాతం సహకార కేంద్రాలు, ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటుచేసిన తొలి ఏడాది 1.07లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా, మూడో ఏడాదికి వచ్చేసరికి అది దాదాపు నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది. ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020–21లో 2.55 లక్షల మంది ఉంటే, 2022–23లో ఏకంగా 10.89 లక్షల మందికి చేరింది. అంటే.. 428 శాతం వృద్ధి కన్పిస్తోంది. అలాగే, ఇప్పటివరకు రూ.1,196.07 కోట్ల విలువైన 10.83 లక్షల టన్నుల ఎరువులను 28.95 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. 2023–24లో ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 5.48 లక్షల మంది రైతులకు 2.13 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, ఆర్బీకేల వద్ద 80వేల టన్నులు, సొసైటీల వద్ద 36 వేల టన్నుల ఎరువులు ఇంకా అందుబాటులో ఉన్నాయి. రైతు ముంగిట ఎమ్మార్పీకే అందుబాటులో ఉండడంతో బ్యాగ్‌పై రూ.20 చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.50 కోట్లకు పైగా ఆదా అయ్యింది. ఇక సర్టిఫై చేసిన ఎరువుల పంపిణీవల్ల నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్ పడింది. ఆరోపణ: విత్తనాలు దొరకవు.. వాస్తవం: సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను రైతులు బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారికి అందిస్తున్నారు. ఇలా ఈ నాలుగేళ్లలో 55.72 లక్షల మంది రైతులకు రూ.881.47 కోట్ల విలువైన 30.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై ఆర్బీకేల ద్వారా మాత్రమే పంపిణీ చేశారు. అంతేకాదు.. రూ.12.75 కోట్ల విలువైన మిరప, పత్తి, మొక్కజొన్న వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆరోపణ: ఆర్బీకేలకు గుర్తింపేది? వాస్తవం: ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటై మూడున్నరేళ్లు కావస్తోంది. అనతికాలంలోనే ఆర్బీకేలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు పొందాయి. అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి. కేంద్ర వ్యవసాయ శాఖ, నీతి అయోగ్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలందుకున్నాయి. యూఎన్ చాంపియన్ అవారు్డకు నామినేట్ అయ్యాయి. ఆర్బీకే స్ఫూర్తితో జాతీయస్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఆర్బీకే సాంకేతికత కోసం పొరుగు రాష్ట్రాలే కాదు.. దేశ, విదేశాలు సైతం పోటీపడుతున్నాయి. ఇథియోపియా వంటి ఆఫ్రికన్ దేశం ఆర్బీకే సాంకేతికత కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఇలా ఆర్బీకేలు ఇన్ని వసతులను కల్పించి రైతుకు భరోసా ఇచ్చినా.. ఆర్బీకే వ్యవస్థను సిగ్గు సిగ్గు అని తక్కువ చేసి చూపడం రామోజీకే చెల్లింది. -
ఆర్బీకేల పనితీరు అద్భుతం
సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయంలో వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ కమిటీ బృంద సభ్యులు కితాబిచ్చారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం స్టడీ టూర్లో భాగంగా రెండు రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కమిటీ కన్వినర్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అధ్యక్షతన రాష్ట్రంలో ఎరువులు లభ్యత, పంపిణీ తదితర అంశాలపై శనివారం కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీలోని పలువురు ఎంపీలు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను సందర్శించామని, వాటి ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు దేవాలయాలతో సమానంగా ఆర్బీకేలు ఉన్నాయని, ఈ తరహా వ్యవస్థను మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడంపై అభినందనలు తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ, నానో యూరియా వంటి అత్యాధునిక పద్ధతుల గురించి చర్చించారు. డాక్టర్ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ యూరియా తదితర ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయడం వల్ల వారికి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయని, ఈ విధానానికి ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ వంటి సంస్థలు సహకరిస్తే మరింత నాణ్యంగా సేవలందించవచ్చని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల రైతులందరికీ అందుబాటులోకి రావడం లేదని, డ్రోన్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. -
80 శాతం సబ్సిడీపై విత్తనాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టింది. 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను సిద్ధం చేసింది. అధిక వర్షాలతో నారుమడులు, నాట్లు దెబ్బతిన్న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేస్తోంది. అలాగే రాయలసీమలో అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.98.92 కోట్లు ఖర్చు చేస్తోంది. 5.14 లక్షల క్వింటాళ్లు పంపిణీ ఖరీఫ్ సీజన్లో 89.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 5.73 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సమకూర్చుకుంది. ఇందులో భాగంగా 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసింది. అయితే ఊహించని రీతిలో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలైలో కురిసిన వర్షాలతో కాస్త ఊపిరిపీల్చుకున్నప్పటికీ ఆగస్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారాయి. సీజన్లో ఇప్పటివరకు 341.10 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 261.60 మి.మీ. మాత్రమే కురిసింది. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అయితే.. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో 20–59 శాతం మధ్య లోటు వర్షపాతం రికార్డైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో సుమారు 132 మండలాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నట్టుగా గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులు ఇబ్బంది పడకుండా.. గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు రాయలసీమలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను అందించారు. ఇలా 2018–19 సీజన్లో 63,052 క్వింటాళ్లు, 2019–20 సీజన్లో 57,320 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క రైతూ విత్తనం కోసం ఇబ్బందిపడకుండా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మరోవైపు అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో రైతుల కోసం తక్కువ కాలపరిమితి కలిగిన ఎంటీయూ–1121, ఎంటీయూ–1153, బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్– 34449, ఎంటీయూ–1010 రకాలకు చెందిన 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు వరి విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణాలో 1,221 క్వింటాళ్లు, ఎన్టీఆర్ జిల్లాలో 278 క్వింటాళ్లు, ఏలూరు జిల్లాలో 24 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రాయలసీమలో కూడా అపరాలు, చిరుధాన్యాల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 25,750 క్వింటాళ్లు, అనంతపురం జిల్లాలో 14,650 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాలో 11,500 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 6 వేల క్వింటాళ్లు, వైఎస్సార్ జిల్లాలో 670 క్వింటాళ్లు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 250 క్వింటాళ్ల చొప్పున ఆర్బీకేల్లో విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఉలవలు, అలసందలకు 85–90 రోజులు, కొర్రలకు 80–85 రోజులు, మినుములకు 70–75 రోజులు, పెసలకు 65–75 రోజుల పంట కాలం ఉంటుంది. కాస్త వర్షాలు కురిస్తే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నేను 20 ఎకరాల్లో ఎంటీయూ–1318 రకం వరి వేశా. వర్షాలు, వరదలతో నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.8 వేలు నష్టపోయా. ఆర్బీకే ద్వారా ఎంటీయూ 1121 రకం 4.5 క్వింటాళ్ల విత్తనాన్ని 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. సబ్సిడీపోనూ రూ.3,402 మాత్రమే చెల్లించాను. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు. గతంలో ఇంత వేగంగా స్పందించిన ప్రభుత్వాలు లేవు. – చలమలశెట్టి రామ్మోహన్ రావు, మోటూరు, గుడివాడ మండలం, కృష్ణా జిల్లా ప్రభుత్వం ఆదుకుంది 3.5 ఎకరాలు సొంతంగా, 2 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. ఖరీఫ్‌లో వరి సాగు చేస్తే జూలైలో కురిసిన కుండపోత వర్షాలతో నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఎకరాకు రూ.7 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఖరీప్ సాగుకు దూరంగా ఉండాలని భావించా. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై కోరుకున్న విత్తనం ఆర్బీకే ద్వారా అందించి ఆదుకుంది. ఆ విత్తనంతో నాట్లు వేసుకున్నాం. గతంలో ఎప్పుడూ ఇలా అదును దాటక ముందే 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేసిన దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – యెరగాని వీరరాఘవులు, దిరుసువల్లి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా -
ఎవరి కోసం మీ ‘పశు’ వాదన రామోజీ?
గ్రామానికి ఒక పశు సంవర్థక సహాయకుడు, రెండు మండలాలకు ఒక వెటర్నరీ అంబులెన్స్, ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం, సర్టిఫై చేసిన నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ, పశు పోషణ, నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా పశు విజ్ఞాన బడులు, గ్రామ స్థాయిలోనే పాడి రైతు ముంగిట నాణ్యమైన పశు వైద్య సేవలు అందరి కళ్లెదుటే కనిపిస్తున్నాయి. మూగ జీవాలకు బీమా రక్షణ, పశు పోషకులకు భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా జనరిక్ పశు ఔషధ కేంద్రాల ఏర్పాటు, జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పన.. ఇలా నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. కానీ ‘పచ్చ’ పైత్యం తలకెక్కించుకున్న ఈనాడు రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోవడం ఆశ్చర్యకరం కానేకాదు. వెటర్నరీ అంబులెన్స్ ద్వారా పశువులకు ఇంటి ముందు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది సాక్షి, అమరావతి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ పశు పోషకుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీ బాటలో పయనిస్తునాయి. పశు వైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీకి కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు.. అవార్డులు.. రివార్డులు దక్కాయి. ఇవన్నీ చూసి ఓర్వలేకపోతున్న రామోజీరావు వాస్తవాలకు ముసుగేసి అభూత కల్పనలు, అవాస్తవాలు వండి వారుస్తూ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ‘ఇది మానవత్వామా..దానవత్వమా..? అంటూ తాజాగా పాడి రైతులను తప్పుదారి పట్టించేలా అబద్ధాలను అచ్చేశారు. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం. ఆరోపణ : పశువులకు మేత కూడా ఇవ్వడం లేదు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో పశువుల శరీర ఎదుగుదలకు, పునరుత్పత్తికి ఉపయోగపడే పచ్చి పశు గ్రాసం (మాగుడు గడ్డి), దాణా వేర్వేరుగా ఇచ్చేవారు. వీటితో పాటు బహిరంగ మార్కెట్లో ఎండుగడ్డి కూడా కొనాల్సి వచ్చేది. కిలో రూ.2 చొప్పున మాగుడు గడ్డి, కిలో రూ.4.50 చొప్పున దాణా, కిలో రూ.2 చొప్పున ఎండుగడ్డి కొనేవారు. ఇలా కిలో మేతకు రూ.8.50 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. దీని వల్ల పశు పోషకులకు అదనపు భారం పడేది. ఈ పరిస్థితిని మారుస్తూ పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా, ఖనిజ లవణాలు కలిగిన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)ను 60 శాతం రాయితీపై కేవలం కిలో రూ.6.40కే ప్రభుత్వం పశు పోషకులకు అందిస్తోంది. ఈ దాణాపై రాయితీ రూపంలో రూ.9.40 భారం పడుతుంది. ఇలా నాలుగేళ్లలో ఇప్పటి వరకు 1,49,340 మంది పశు పోషకులకు ఆర్బీకేల ద్వారా రూ.117.97 కోట్ల విలువైన 74,670 టన్నుల టీఎంఆర్ను అందించింది. ఆరోపణ : పశు సంక్షేమం విస్మరించారు వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు. రూ.18.20 కోట్ల వ్యయంతో నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్సార్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు తీసుకొచ్చారు. వీటి ద్వారా పేడ, రక్త, పాల, మూత్ర, చర్మ సంబంధ వ్యాధుల, జీవ క్రియ వ్యాధుల పరీక్షలతో పాటు యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.240.69 కోట్లతో నియోజకవర్గానికి రెండు చొప్పున 340 డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను తీసుకొచ్చారు. 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన అర గంటలోనే మారుమూల గ్రామాలకు సైతం ఈ వాహనాలు చేరుకొని పశు పోషకుల గుమ్మం వద్దే నాణ్యమైన పశు వైద్య సేవలందిస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 5.25 లక్షల పశువులకు సేవలందించారు. తద్వారా 3.48 లక్షల పశు పోషకులు లబ్ధి పొందారు. ప్రమాదాలు, విపత్తుల వేళ పశువులు మృతి చెందడం వల్ల జీవనోపాధి కోల్పోయే పశు పోషకులు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకం దారులకు ధీమా కల్పించేందుకు వైఎస్సార్ పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద మరణించిన పశువుకు రూ.30 వేలు, గొర్రె లేదా మేకకు రూ.6 వేలు పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,05,043 మంది పశు పోషకులకు చెందిన 1,72,180 పశువులకు బీమా కల్పించారు. ఇప్పటి వరకు 116 చనిపోగా 3 రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించారు. ఈ ప్రభుత్వ హయాంలో కొత్తగా రూ.20 కోట్లు వెచ్చంచి 5,068 కృత్రిమ గర్భధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది కదా గుర్తింపు అంటే.. పశు పోషకుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగడం లేదని పలు రాష్ట్రాలు కితాబిస్తున్నాయి. ఏపీ బాటలో నడిచేందుకు కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇలా నాలుగేళ్లుగా ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. వరుసగా రెండేళ్ల పాటు అగ్రికల్చర్ టు డే గ్రూప్ ద్వారా ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్ షిప్ అవార్డులు వరించాయి. 2021–22 సిల్వర్ స్కోచ్, 2020లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో పాటు 2023లో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కోచ్, వెటర్నరీ టెలీ కాల్ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌తో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్ మెరిట్ అవార్డులు దక్కాయి. చంద్రబాబు సీఎం పీఠంపై లేనందున రామోజీకి ఇవన్నీ కనిపించడం లేదు. ఆరోపణ : గోకులాలకు మంగళం పాడారు వాస్తవం: గోకులాలు, మినీ గోకులాలకు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిలు దశల వారీగా చెల్లించేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నూరు శాతం పూర్తయిన గోకులాలు, మినీ గోకులాలకు గడిచిన 4 నెలల నుంచి చెల్లింపులు చేస్తున్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం రామోజీకే చెల్లింది. ఆరోపణ : పశుపోషకులకు ఏ మేలూ చేయలేదు వాస్తవం: ముందెన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలకు నెలకు రూ.2,750 విలువైన పశువుల మందులు, వైద్య పరికరాలు సరఫరా చేసి గ్రామాలలో నాణ్యమైన పశు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు మందులు, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం రూ.65.20 కోట్లు ఖర్చు చేసింది. ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 1.75 కోట్ల జీవాలకు ప్రథమ చికిత్స, 2.44 కోట్ల జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ, 2.26 కోట్ల పశువులకు టీకాలు, 16.38 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా 10.63 దూడలకు జన్మిచ్చేలా చేశారు. 34.36 లక్షల పశువులకు పశు ఆరోగ్య సంరక్షణా కార్డ్స్ పంపిణీ చేశారు. 6.14 పశువుల నుంచి నమూనాలను సేకరించి పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్ ద్వారా కచ్చతమైన వ్యాధి నిర్ధారణ జరిపి సత్వర వైద్య సేవలందించేలా కృషి చేశారు. 40 శాతం రాయితీపై రూ.17.65 కోట్ల విలువైన 5,195 గడ్డి కత్తిరించు యంత్రాలను పశు పోషకులకు అందించారు. మేలైన పశుపోషణ, నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తూ లక్షలాది మందికి పశుపోషణలో శిక్షణనిచ్చారు. ఆరోపణ : ఊరూరా పశుగ్రాసం లేదు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో ఊరూరా పశు గ్రాస క్షేత్రాల పథకం పేరుతో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయి. క్షేత్ర స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు లేకుండానే నిధులు దారి మళ్లించినట్టు పలు విచారణల్లో తేటతెల్లమైంది. ఈ అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 75 శాతం రాయితీపై నాణ్యమైన, ధృవీకరించిన పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తూ ఊరూరా పశు గ్రాసాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇలా 3,67,400 మంది రైతులకు 75 శాతం రాయితీపై 6,948 టన్నుల పశుగ్రాస విత్తనాలను సరఫరా చేశారు. వాటి ద్వారా రైతులు తమ సొంత క్షేత్రాల్లోనే ఊరూరా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 34 లక్షల టన్నులకు పైగా మేలైన పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసి పశువులకు అందించారు. ధ్రువీకరించిన నాణ్యమైన మేత, దాణ, పశుగ్రాసం అభివృద్ధికి రూ.250 కోట్లతో పశుగ్రాస భద్రతా పాలసీని అమలు చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా రామోజీ? -
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు
-
వ్యవ‘సాయం’ భేష్
సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న మార్పులకు నాంది పలికిందని సాగు వ్యయం, ధరల కమిషన్ (సీఏసీపీ) చైర్మన్ ప్రొఫెసర్ విజయ్‌పాల్ శర్మ ప్రశంసించారు. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శం, అనుసరణీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన ఆర్బీకేలు తాను విన్నదాని కంటే మరింత గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు. జాతీయ స్థాయిలో కిసాన్ కాల్ సెంటర్లు ఉన్నా ఏపీ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఓ అద్భుతం.. నాకు తెలిసి ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా పంటల కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే ఛానల్‌ను సందర్శించారు. రైతుల సందేహాలను కాల్ సెంటర్ సిబ్బంది శాస్త్రవేత్తల సహాయంతో ఎలా నివృత్తి చేస్తున్నారో స్వయంగా పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ 155251కు వస్తున్న కాల్స్‌ను నిశితంగా గమనించారు. కాల్ చేసిన పలువురు రైతులను కాల్ సెంటర్ సేవల గురించి వాకబు చేశారు. పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న తీరును çపరిశీలించి అభినందించారు. శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం ఆర్బీకే ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న రైతు ప్రాయోజిత కార్యక్రమాలను స్వయంగా తిలకించారు. చాలా బాగున్నాయంటూ కితాబిచ్చారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారుల సలహాలు, సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను పరిశీలించారు. తమ అనుభవాలను చానల్ ద్వారా తోటి రైతులకు వివరించేందుకు వచ్చిన ఆదర్శ రైతులతో ముచ్చటించారు. రైతు భరోసా మ్యాగ్జైన్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో కిసాన్ కాల్ సెంటర్స్ పనిచేస్తున్నా ఈ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల్లో కాల్ సెంటర్లు నెలకొల్పితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంటూ ఐసీసీ సెంటర్ సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పొందుపరిచారు. గండిగుంట ఆర్బీకే సందర్శన.. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామానికి చేరుకొని ఆర్బీకే –2ను సందర్శించారు. ఆర్బీకే కేంద్రం డిజైన్, సౌకర్యాలను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆరా తీసారు. ఆర్బీకేలో సిద్ధంగా ఉన్న సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను స్వయంగా పరిశీలించారు. కియోస్క్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కియోస్క్‌ను స్వయంగా ఆపరేట్ చేసి వాతావరణ సమాచారంతో పాటు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో రియల్ టైం మార్కెట్ ధరలను పరిశీలించారు. పంట కొనుగోలు కోసం ఉపయోగించే మాయిశ్చర్ యంత్రం (తేమ పరికరం) ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. పొలంబడి ప్లాట్లను పరిశీలించి పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు పాటిస్తున్న ఉత్తమ యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా పాడి రైతులకు అందిస్తున్న మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలను పరిశీలించారు. ఆర్బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుబాటులో ఉంచిన ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలను పరిశీలించారు. అనంతరం రైతులను కలుసుకుని ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ఇప్పుడు గ్రామ స్థాయిలోనే తమకు అన్ని రకాల సేవలు అందుతున్నాయని రైతులు సీఏసీపీ చైర్మన్‌కు తెలిపారు. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఏది కావాలన్నా మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. సీజన్‌కు ముందే కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేలోనే అందుబాటులో సిద్ధంగా ఉంచుతున్నారని రైతులు వెల్లడించారు. ఆర్బీకేల వల్ల అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండడంతో రవాణా, లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. గతంతో పోలిస్తే తమ ప్రాంతంలో ఎక్కువగా సాగయ్యే వరి పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయని, ఏటా గోధుమలకు పెంచుతున్న స్థాయిలో వరికి మద్దతు ధరలు పెరగడం లేదని రైతులు సీఏసీపీ చైర్మన్ దృష్టికి తేవడంతో సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అక్కడ నుంచి నేరుగా కంకిపాడులోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను సందర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సర్టిఫై చేస్తున్న తీరును పరిశీలించారు. నమూనాలు తీసుకొచ్చే రైతుల నుంచి ఏమైనా చార్జి వసూలు చేస్తున్నారా? అని ఆరా తీశారు. అలాంటిదేమి లేదని, రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగానే సర్టిఫై చేసి ఫలితాలను తెలియజేస్తున్నామని సిబ్బంది చెప్పారు. విన్న దానికంటే గొప్పగా ఉన్నాయి: విజయ్‌పాల్ శర్మ, సీఏసీపీ చైర్మన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆర్బీకేల సేవల గురించి చాలా విన్నా. వాటిని స్వయంగా చూడాలన్న ఆసక్తితో ఇక్కడకు వచ్చా. నేను విన్న దానికంటే ఆర్బీకేలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను నేనెక్కడా చూడలేదు. ఇలాంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఆర్బీకేలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కియోస్క్‌ల ద్వారా వాతావరణ సమాచారం అందిస్తున్నారు. ఆర్బీకే తరహాలో జాతీయ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ తరపున కేంద్రానికి నివేదిక సమర్పిస్తాం. -
అన్నదాతలకు అండగా ఆర్బీకేలు
-
ఏపీ విధానాలు ప్రపంచానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ‘రైతులకు సాంకేతికతను చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషి బాగుంది. మీ ఆలోచన విధానాలు ప్రపంచానికే ఆదర్శం. మాది వ్యవసాయాధారిత దేశం. మీ విధానాలు, సాంకేతికత అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అందుకు తగిన సహకారం అందించండి’ అని ఇథియోపియా దేశ ప్రతినిధి బృందం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి విచ్చేసిన ఇథియోపియా బృందానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్వాగతం పలికారు. అనంతరం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే చానల్ స్టూడియోలను ఇథియోపియా బృందం సందర్శించింది. ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వల్లూరు శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఆర్బీకే యూట్యూబ్ చానల్ స్టూడియోలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వివిధ పంటల సాగులో అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు తెగుళ్లు, పురుగుల నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయ, వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తల సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను వారు పరిశీలించారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న రైతు భరోసా సచిత్ర మాస పత్రిక గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ కృషిని ఇథియోపియా బృందం ప్రశంసించింది. తమ దేశంలోనూ రైతులకు ఈ తరహా విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు డా.ఆదిషు బెజ్ బెహ్ అలి, అన్ దువాలేమ్, అబ్రహాం టేస్ పాయె, ఆరెగా సేమెగా, ఎల్ షాడే బెలేటే తదితరులున్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అధికారి వై.అనురాధ తదితరులు పాల్గొన్నారు. నేడు గొల్లపూడి ఆర్బీకే సందర్శన ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళవారం గొల్లపూడి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించనుంది. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించి.. సంబంధిత సిబ్బంది, రైతులతో మాట్లాడనుంది. అనంతరం సమీప గ్రామాల్లో పర్యటిస్తుంది. బీమా కవరేజ్‌లో ఏపీ అద్భుతం సాక్షి, అమరావతి: కేంద్రం నోటిఫై చేసిన పంటలకు రైతులపై పైసా భారం పడకుండా.. సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర వ్యవసాయ కుటుంబ, సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) సీఈవో, నాఫెడ్ ఎండీ రితీశ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని దొడ్డిపల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు తీరుపై ఆరా తీశారు. ఈ–క్రాప్ నమోదుకు సంబంధించిన రశీదులను పరిశీలించి, ఎలా నమోదు చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గతంలో సాగు చేసిన పంటలకు కేంద్రం నిర్దేశించిన ప్రీమియం చెల్లించిన వారికే పరిహారం దక్కేదని రైతులు ఆయనకు తెలిపారు. అయితే తమ రాష్ట్రంలో ప్రస్తుతం నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి ఎకరాకు బీమా సదుపాయం లభిస్తోందని చౌహాన్‌కు వివరించారు. దీంతో ఈ తరహా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడం నిజంగా అద్భుతమని ఆయన కొనియాడారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకొని ఫసల్ బీమా యోజన నిబంధనల్లో పలు మార్పులు చేశామన్నారు. ఖరీఫ్–22 సీజన్ నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పీఎంఎఫ్‌బీవైను అనుసంధానం చేసి అమలు చేస్తున్నామని చెప్పారు. -
బాబు కళ్లతో చూశారా రామోజీ?
ఏ విధంగానూ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా పని చేస్తున్నారని ఎవరూ చెప్పకూడదు.. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాల వారెవరూ ప్రశంసించకూడదు.. ప్రభుత్వ సేవలు భేష్.. అని ఎవరైనా అన్నారంటే చాలు ఈనాడు రామోజీరావుకు పూనకం వస్తుంది. తన ఆత్మీయుడు చంద్రబాబు ఎప్పుడైతే సీఎం కుర్చీ నుంచి దిగిపోయారో అప్పటి నుంచి ఈ జాడ్యం మొదలైంది. రోజూ పనిగట్టుకుని ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రుడు ఈరోజు చక్కగా ఉన్నాడని చూపిస్తే.. వేలును చూశాడట ఓ మూర్ఖుడు.. అన్నట్లుంది రామోజీ తీరు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల గురించి దేశమంతా చర్చించుకుంటున్న ఈవేళ రామోజీకి కడుపు మండిపోతోంది. తమ బాబుకు దక్కని ఈ ఖ్యాతి మరెవరికీ దక్కరాదంటూ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు నిస్సిగ్గుగా తెగించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏమిటో మీకు తెలియదా రామోజీ? విత్తనాల కోసం రైతులు ఒక రోజు ముందుగానే వెళ్లి క్యూ లో నిలుచునే పరిస్థితి మరచిపోయారా? ఓసారి లైబ్రరీలోకి వెళ్లి నాటి పత్రికలు తిరగేయండి.. వాస్తవం మీ కళ్లకే కనిపిస్తుంది. అవునులే.. ఇప్పటికే బుద్ధి మందగించిన మీకు కంటి చూపు కూడా తగ్గిపోయి ఉంటుంది కదా! మీ సహాయకుడు ఎవరినైనా వెంటబెట్టుకుని వెళ్లి.. అతనితో చదివించి వినండి. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఏర్పడటమనేదే ఒక చరిత్ర. సొంత భవనంలోనో.. అద్దె భవనంలోనో అవన్నీ కొనసాగుతుండటం మరో చరిత్ర. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను అనుసంధానం చేయడం ఇంకో చరిత్ర. రామోజీ.. ఇవన్నీ మీరు స్వయంగా చూసి, నిర్ధారించుకోవడానికి రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్తారో మీ ఇష్టం. ఈ సాహసం మీ వల్ల అవుతుందా రామోజీ? సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఏర్పాటైన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకే అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. ఆర్బీకే సాంకేతికత కోసం దేశ, విదేశాలు పోటీ పడుతుంటే ఓర్వలేని ‘ఈనాడు’.. ‘అద్దెకు దిక్కులేని ఆర్బీకేలు.. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దుస్థితి’ అంటూ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని వండివార్చింది. గతంలో అదును దాటక ముందు విత్తనాల కోసం, విత్తుకున్న తర్వాత ఎరువుల కోసం సన్న, చిన్నకారు రైతులు పడరాని పాట్లు పడేవారు. ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడితే కాసిన్ని విత్తన గింజలు కూడా దక్కేవి కావు. ప్రైవేటు డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుల మందులను కొంటే తప్ప ఎరువులు దొరకడం గగనంగా ఉండేది. ఎండలు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి ఏటా పదుల సంఖ్యలో రైతులు మృత్యువాత పడిన సందర్భాలు కోకొల్లలు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులతో ఆశించిన దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. ఈ వాస్తవాలన్నింటినీ మరిచి ఈనాడు ప్రస్తావించిన అంశాల్లో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : జాడలేని విత్తనాలు వాస్తవం : సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటకు అందిస్తున్నారు. సాగు వేళ అన్ని కంపెనీలకు చెందిన పురుగుల మందులను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్బీకేల్లోని కియోస్క్‌ల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఇలా ఈ మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 2023–24లో రూ.222 కోట్ల విలువైన రాయితీ విత్తనాలను పంపిణీ చేయాలని ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులు 1.90 లక్షల క్వింటాళ్ల విత్తనాల కోసం నమోదు చేసుకున్నారు. ఏపీ సీడ్స్ ఆర్బీకేల్లో 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 100 శాతం పచ్చిరొట్ట విత్తనాలు (99 వేల క్వింటాళ్లు) 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు, రాయలసీమ జిల్లాల్లో 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన విత్తనాల కోసం ఆర్బీకేల్లో జోరుగా రిజిస్ట్రేషన్లు సైతం జరుగుతున్నాయి. ఆరోపణ : అరకొరగా ఎరువులు వాస్తవం : ఆర్బీకేలతో పాటు సొసైటీలు, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా కూడా పంట కాలానికి అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. 2023–24లో 10.50 లక్షల టన్నుల ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆర్బీకేల్లో 54,525 టన్నులు, సొసైటీల్లో 20,789 టన్నులు, ఏపీ మార్క్‌ఫెడ్ గోదాముల్లో 69 వేల టన్నులు నిల్వ చేశారు. 3,979 సచివాలయ గోదాములను అగ్రి ఇన్పుట్ స్టోరేజీ పాయింట్లుగా గుర్తించి గ్రామ స్థాయిలో ఎరువుల నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో మండల, బ్లాక్ స్థాయిలో విత్తన పంపిణీ జరిగేది. ఎమ్మార్పీకి మించి అమ్మేవారు. పైగా మండల, జిల్లా కేంద్రాల నుంచి తరలించు కోవడానికి రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. నేడు ఎమ్మార్పీకే తమ ఇంటి ముంగిటే అందిస్తున్నారు. బ్యాగ్‌పై రూ.20 మేర రవాణా ఆదా అవుతుంది. ఈ విధంగా 3 ఏళ్లలో రూ.35 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. సర్టిఫై చేసిన ఎరువుల పంపిణీ వల్ల నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్ పడింది. మరోవైపు ఈ మూడేళ్లలో 1,50,822 మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. వచ్చే సీజన్ కోసం సర్టిపై చేసిన సస్య రక్షణ మందులు, సూక్ష్మ పోషకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విత్తనాల కోసం ఎక్కడా క్యూలైన్ అనేదే కన్పించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే ఆందోళన లేదు. నకిలీల ఊసే లేదు. ఆరోపణ : ఆర్బీకేల అద్దెలకు దిక్కులేదు.. వాస్తవం : రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ భవనాల కొరత కారణంగా 3,830 ఆర్బీకేలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి అద్దె రూపంలో మూడేళ్లలో ప్రభుత్వం రూ.51.09 కోట్లు విడుదల చేసింది. 2023–24లో ఆర్బీకేలతోపాటు గోదాముల అద్దెల నిమిత్తం యాజమాన్యాలకు బకాయిలు లేకుండా ప్రతి 3 నెలలకోసారి చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఆరోపణ : అధికార పార్టీ వారికే యంత్ర పరికరాలు వాస్తవం : సన్న, చిన్న కారు రైతులకు గ్రామ స్థాయిలో వారికి కావాల్సిన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మరో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో 40 శాతం సబ్సిడీపై రూ. 1052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్డ్ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లు సమకూర్చారు. గతంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు రైతు రథాలు పంపిణీ చేసేవారు. పైగా ఎమ్మార్పీ కంటే కనీసం 10–30 శాతం అధికంగా కోట్ చేసి.. ఆ మేరకు జేబులు నింపుకునే వారు. ప్రస్తుతం నచ్చిన కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసే బాధ్యతను రైతు గ్రూపులకే అప్పగించారు. ఆరోపణ : కియోస్క్‌లు పని చేయడం లేదు వాస్తవం : తొలి విడతలో 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లు ఏర్పాటు చేయగా, ఇటీవల మరో 1,294 ఆర్బీకేల్లో కొత్తగా సరఫరా చేశారు. సమస్యల పరిష్కారం కోసం డాష్ బోర్డు ఏర్పాటు చేశారు. కియోస్క్‌లకు ఇంటర్నెట్ కోసం రూ.19.34 కోట్లు విడు దల చేశారు. బ్యాంకింగ్ సేవలను గ్రామ స్థాయిలో అందించేందుకు వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న 9,277 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్(బీసీ)లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. ఇండియన్ పోస్టల్ బ్యాంక్ సహకారంతో మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి చర్యలు చేపట్టారు. ఆరోపణ : అనుబంధ రంగాలకు అరకొర సేవలు వాస్తవం : ఆర్బీకేల ద్వారా మూడేళ్లలో 2 కోట్ల సేవలు అందించారు. పశుసంవర్ధక శాఖ ఆర్బీకేల ద్వారా పశుపోషకులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటి వరకు రూ.106.48 కోట్ల విలువైన 67,395 మెట్రిక్ టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా 60 శాతం సబ్సిడీ (రూ.63.89 కోట్లు)పై పంపిణీ చేశారు. రూ.49.66 కోట్ల విలువైన 5397.95 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను 75 శాతం సబ్సిడీ (రూ. 37.24 కోట్లు)పై అందించారు. రూ.115.18 కోట్ల విలువైన 3,907 గడ్డి కత్తిరించే యంత్రాలను 40 శాతం సబ్సిడీ (రూ.46.07 కోట్లు) పై పంపిణీ చేశారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటి వరకు 3.72 లక్షల పశువులు, జగనన్న జీవ క్రాంతి పథకం కింద 1.34 లక్షల మంది గొర్రెలు, మేకలు పంపిణీ చేశారు. పశు పోషకులకు 45,652 పశు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేశారు. పశువిజ్ఞాన బడుల ద్వారా 14,83,643 మందికి మెళకువలపై అవగాహన కల్పించారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగును ఈ ఫిష్ బుకింగ్ చేస్తూ గిట్టుబాటు ధర, బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఆక్వా రైతులు మత్స్యకారులకు సర్టిఫై చేసిన చేపలు, రొయ్యల ఫీడ్, చేపల సీడ్ పంపిణీ చేస్తున్నారు. ఫిషింగ్ బోట్స్ నమోదు, లైసెన్సులు జారీ చేస్తున్నారు. అప్సడా చట్టం ద్వారా ఆక్వాసాగు, ఆక్వా వ్యాపార కార్యకలాపాలు, ఫిష్ ఫీడ్, రొయ్యల సీడ్ల కోసం లైసెన్సు/ఎండార్స్మెంట్లు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 36,779 లైసెన్సులు జారీ చేశారు. 16,489 నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. వైఎస్సార్ మత్స్యసాగు బడి ద్వారా 17,945 మందికి అవగాహన కల్పించారు. అదేరీతిలో ఉద్యాన, పట్టు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. ఈ–క్రాప్, ఈ–ఫిష్ నమోదుతోపాటు పంట నష్ట పరిహారం, ఇతర పథకాలు అందిస్తున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్బీకేల స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. యూఎన్ చాంపియన్ అవార్డుకు మన రాష్ట్రం నామినేట్ అయింది. సాంకేతికత కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఇథియోపియా ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోపణ : సిబ్బంది లేకుండా సేవలా? వాస్తవం : రెండు విడతల్లో 6,246 వ్యవసాయ, 4,655 పశు సంవర్ధక, 2,356 ఉద్యాన, 731 మత్స్య, 377 పట్టు సహాయకులు పని చేస్తున్నారు. వీరే కాకుండా అనుభవజ్ఞులైన బహుళార్ద, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గోపాల మిత్రలను నియమించి రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్‌ను అనుసంధానం చేశారు. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు. -
రైతు భరోసాకు 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: 2023–24 సీజన్‌కు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కొత్తగా అర్హత పొందినవారు, గతంలో అర్హత కలిగి లబ్ధి పొందని భూ యజమాన రైతులు, అటవీ భూసాగుదారులు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగేళ్లుగా ఈ పథకం ద్వారా మే నెలలో తొలి విడత పెట్టుబడి సాయం విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకోసం అర్హత పొందినవారు సమీప ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. తమ దరఖాస్తులను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేసుకునేందుకు ఈ నెల 3 వరకు గడువునివ్వగా 90,856 మంది భూ యజమానులు, 6,632 మంది అటవీ భూసాగుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరితో పాటు 2022–23లో రైతు భరోసా కింద లబ్ధి పొందేందుకు అర్హత కలిగిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 12 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులున్నట్టుగా గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే అర్హతలు ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 15 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతేడాది లబ్ధి పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని తెలిపారు. వారికి ఈ ఏడాది కూడా యధావిధిగా రైతు భరోసా సాయం అందుతుందన్నారు. గతేడాది లబ్ధి పొంది ప్రస్తుతం మరణించినట్లైతే వారి భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు కన్నబాబు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతంటే? -
అప్పట్లో ‘కొనుగోళ్లు’ కతలెన్నో! ధాన్యం కొనుగోళ్లు అంతా రికార్డుల్లోనే..
సాక్షి అమలాపురం: తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నీతులు వల్లిస్తుండడంపై అన్నదాతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అప్పట్లో రైతులకు కావల్సిన కనీస అవసరాలేవీ అమలులో లేవు. రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే)గానీ, ఈ–క్రాప్ విధానం కానీ, మద్దతు ధర కానీ వీటి గురించి చంద్రబాబు కనీస ఆలోచన కూడా చేయలేదు. ఇవేకాదు.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం అన్న ఊసు కూడా ఎక్కడాలేదు. పైగా.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి స్థానిక రైతుల పేరు మీద చూపించి అడ్డుగోలుగా దోపిడీ చేశారు. మిల్లులు అధికంగా ఉన్నచోట ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ దోపిడీ తతంగాన్ని నడిపారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పల్లెపల్లెలో ఆర్బీకేలను ఏర్పాటుచేసి రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు అక్కడ నుంచే కల్పించడం, ఈ–క్రాప్ విధానం ప్రవేశపెట్టడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం చేస్తుంటే అన్యాయం, ఘోరం జరిగిపోయిందని టీడీపీ వెర్రెక్కిపోతూ గుండెలు బాదుకుంటోంది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కొనుగోళ్ల తీరుతెన్నులు ఎలా ఉండేవంటే.. టీడీపీ హయాంలో ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2014 నుంచి 2019 వరకు వరి ధాన్యం కొనుగోళ్లు తీసుకుంటే రైతులు ఎంతో నష్టపోయారు. ఉదాహరణకు.. ► 2015లో ఖరీఫ్ దిగుబడి 12 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులలోపు మాత్రమే. అంటే దిగుబడిలో మూడోవంతే. కొనుగోళ్లలో 90 శాతం రికార్డుల్లోనే. కొన్నది లేదు సరికదా.. రికార్డుల్లో చూపినదంతా తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి దొడ్డిదారిన తెచ్చిన ధాన్యం. ► అలాగే.. స్థానికంగా తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అప్పట్లో ధాన్యం పండించిన చోట ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కన్నా, మిల్లులు ఎక్కువగా ఉన్న బిక్కవోలు, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, అనపర్తి, రాయవరం వంటి కేంద్రాల్లో కొనుగోళ్లు అధికంగా ఉండడానికి కారణం ఈ దొడ్డిదారి వ్యవహారమే. ► అప్పట్లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1,057 ఉండేది. కానీ, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసే అవకాశంలేక రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. ► వీరి ధాన్యాన్ని తేమ, నూకలు, తాలూ తప్పల పేరుతో క్వింటాల్ ధాన్యాన్ని రూ.600ల నుంచి రూ.800లు చొప్పున కొనుగోలు చేయడంవల్ల రైతులు ఎంతగానో నష్టపోయారు. ► వీటిని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,057 పొందేవారు. ► కొనుగోలు లేకున్నా కొన్నామని చూపించడం ద్వారా కేంద్రాల నిర్వాహకులు సైతం ప్రభుత్వం నుంచి క్వింటాల్‌కు రూ.32 కమీషన్ రూపంలో నొక్కేసేవారు. ► రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను, కూలీ ఖర్చులను కూడా స్వాహా చేసేవారు. ► అంతేకాక.. అప్పట్లో ఈ–క్రాప్ లేనందున ఇష్టానుసారం బుక్ ఎంట్రీ చేసే వీలు ఉండేది. మిల్లర్లు ధాన్యం బహిరంగంగా కొనుగోలు చేసినా కొనుగోలు కేంద్రాల్లో తమకు తెలిసిన రైతుల చిరునామాలను, సర్వే నెంబర్లు మీద ధాన్యం కొనుగోలుగా చూపించేవారు. అప్పట్లో వీటిల్లో టీడీపీ నేతల హవా ఉండడంతో దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. 2015లో ధాన్యం కొనుగోలు అక్రమాలపై నాడు సాక్షిలో వచ్చిన కథనం (ఫైల్ ఫోటో) వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. టీడీపీ హాయాంలో జరిగిన విధానంలో ధాన్యం కొనుగోళ్ల తీరుతో రైతులు నష్టపోతున్న విషయాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుర్తించారు. తన ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా క్షేత్రస్థాయిలో నేరుగా ధాన్యం సేకరణ సమర్ధవంతంగా జరుగుతోంది. ఎలాగంటే.. ► రైతులకు అడుగడుగునా అండగా నిలిచే రైతుభరోసా కేంద్రాలు ఊరూరా వెలిశాయి. ► ఈ–క్రాప్ విధానంవల్ల దిగుబడిపై పక్కాగా లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు తప్పుడు రికార్డులు సృష్టించే అవకాశమేలేదు. ► క్షేత్రస్థాయిలో కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ.. సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేయడంవల్ల రైతుకు కనీస మద్దతు ధరకు ఢోకా లేకుండా పోయింది. ► చివరకు మిల్లుల వద్ద రైతులకు సమస్యలు రాకుండా కస్టోడియన్ అధికారులను ఏర్పాటుచేశారు. ► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుత రబీలోనే కాదు.. గత ఖరీఫ్‌లో సైతం రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. ► ఉమ్మడి ‘తూర్పు’లో 7.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 7.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే.. 97.84 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసింది. రైతులకు రవాణా చార్జీల రూపంలో రూ.6.51 కోట్లు సైతం చెల్లించడం విశేషం. ► ఇక ప్రస్తుత రబీ విషయానికొస్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ► ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికెళ్లి పరిష్కరిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై నిరంతర సమీక్ష చేస్తున్నారు. ► అయినప్పటికీ టీడీపీ నేతలు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగడం చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నెల 6వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తడిచిన ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు ఎగుమతి చేస్తున్న దృశ్యం నాటి విధానంతో నష్టమనే మార్పులు.. టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు విధానంవల్ల రైతులు నష్టపోయారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోలుపై సమీక్ష జరుపుతున్నారు. సమస్యలను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్షాలు, దళారులు, ఒక వర్గం మీడియా చేస్తున్న రాజకీయాలవల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదనే విష ప్రచారంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. – జిన్నూరి రామారావు (బాబీ), ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు, అల్లవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా -
గేమ్ ఛేంజర్.. ఆర్బీకే
ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం. రైతు కష్టాలన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలుస్తున్నాయి. విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. నాణ్యమైన పురుగు మందులు, ఎరువుల సరఫరా.. పంటల సాగుపై అధునాతన శిక్షణ, సాంకేతికత వినియోగం, యాంత్రీకరణ.. తదితర విధానాలతో సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఆర్బీకేల పనితీరును స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. లక్షలాది మంది రైతులకు సాగును లాభసాటిగా మార్చడంలో ఆర్బీకేల పాత్ర కీలకం. ► సంయుక్త నివేదికలో నీతి ఆయోగ్, యూఎన్డీపీ సాక్షి,అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నాయని నీతి ఆయోగ్, యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ప్రశంసించాయి. అధిక దిగుబడులు సాధించేలా, రైతుల సాగు సమస్యలన్నింటికీ ఒకే చోట పరిష్కారం చూపిస్తూ ‘వ్యవసాయం’లో గేమ్ ఛేంజర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సామాజిక రంగాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి.. నీతి ఆయోగ్, యూఎన్డీపీ తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ప్రధానంగా రైతుల ఇబ్బందులు తీర్చడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఆర్బీకేల ద్వారా అన్నదాతలకు సరైన సమయంలో సరైన సలహాలు అందుతున్నాయని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఈ నివేదిక కొనియాడింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటని, కొన్నేళ్ల క్రితం వరకు వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ రైతుల వ్యవసాయ పద్ధతులు, వివిధ పంటల క్లిష్టమైన దశల గురించి పూర్తి స్థాయి అవగాహనలేని రైతులు డీలర్లపై ఆధారపడ్డారని తెలిపింది. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా ఇన్పుట్లకు అధికంగా చెల్లించాల్సి రావడంతో పంట చేతికొచ్చే సమయానికి రైతులకు కన్నీళ్లే మిగిలేవని వివరించింది. మరోవైపు.. నాసిరకం దిగుబడులు, దళారుల ఆగడాల కారణంగా గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, ఆర్బీకేల ఏర్పాటుతో రైతులకు ఈ ఇబ్బందులన్నీ తప్పాయని తెలిపింది. ఈ నివేదికలో ఇంకా ఏముందంటే.. దేశంలోనే ఉత్తమ పద్ధతి ► రైతుల ఆదాయం, విజ్ఞానం పెంపొందించడానికి, సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని బదిలీ చేయడంతోపాటు.. ముందుగా పరీక్షించి ధ్రువీకరించిన, నాణ్యమైన ఇన్పుట్లను గ్రామ స్థాయిలో అందుబాటు ధరలకు అందించడమే లక్ష్యంగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు సేవలందిస్తున్న ఆర్బీకే వ్యవస్థ దేశంలోనే మొదటి ఉత్తమ పద్ధతి. ► ఆర్బీకేలు నాలుగు అంశాల్లో ప్రధానంగా పని చేస్తున్నాయి. ముందుగా.. పరీక్షించిన నాణ్యమైన ఇన్పుట్ల సరఫరా, నకిలీ విత్తన వ్యాప్తిని అరికట్టడం, ప్రైవేటు ఔట్లెట్లలో అధిక ధరలకు ఇన్పుట్ల అమ్మకాలు నిరోధించడం, విత్తన సీజన్‌కు ముందే ఇన్పుట్లు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పని చేస్తున్నాయి. పనితీరు నిజంగా అద్భుతం ► సేవల బట్వాడా, సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన వ్యాప్తిలో ఆర్బీకేల పనితీరు నిజంగా అద్భుతం. రైతులకు అవసరమైన సేవలను అందించడమే కాకుండా సామర్థ్యం పెంపుదలకు అవసరమైన విజ్ఞానాన్నీ ఆర్బీకేలు రైతులకు పంచుతున్నాయి. ► వ్యవసాయ యాంత్రీకరణ, ఈక్రాప్.. ఉచిత పంటల బీమా నమోదు, సీడ్–టు–సీడ్ శిక్షణ కార్యక్రమం, శాస్త్రవేత్తల శిక్షణలు, ఫీల్డ్ డయాగ్నస్టిక్ సందర్శనలు, సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పోస్టర్లు, కరపత్రాలను ఉపయోగించడం, పంటలపై సమాచార వ్యాప్తి కోసం పుస్తకాలు, వీడియో మెటీరియల్‌తో కూడిన లైబ్రరీలను నిర్వహిస్తుండటం విశేషం. కాల్ సెంటర్ ద్వారా సలహాలు ► వ్యవసాయ పద్ధతుల్లో కాల్‌సెంటర్ ద్వారా ఆర్బీకేలు రైతులకు సలహాలూ అందిస్తున్నాయి. ఇందుకోసం కాల్ సెంటర్ నిర్వహణతో ఉత్తమ పద్ధతులను అవలంబించడంలో సహాయం చేయడానికి, మద్దతు ప్యాకేజీ, దేశీయ డిమాండ్–సరఫరా అంతరాన్ని పరిష్కరించడం కోసం అగ్రి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేశారు. ► తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. రైతులకు మద్దతు ధర, ప్రోత్సాహం అందించడానికి అన్ని ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతులకు ఎంతో లాభం. రవాణా ఖర్చులు తగ్గించడంలోనూ ఆర్బీకేల పాత్ర ప్రశంసనీయం. ► పంటల కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలను ప్రకటించిన తర్వాత రైతులు తమ పంటను గ్రామంలోనే విక్రయించుకోగలుతున్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయి. -
ఈ ఏడాదీ ఆర్బీకేల్లో మిరప విత్తనం.. 35 కంపెనీలతో ఏపీ సీడ్స్ ఒప్పందం
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప సాగు గత నాలుగేళ్లుగా పెరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరిగి, మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో మిరప సాగుకు రైతులు ముందుకు వçస్తుండటంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ప్రతి ఏటా మిర్చి రైతులకు బ్లాక్ మార్కెట్, అధిక ధరలు, నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు పెద్ద సమస్యగా ఉండేవి. రైతులను ఆర్థికంగా దెబ్బతీసేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విత్తనాలను అందించడం నుంచి పంటను అమ్ముకొనే వరకు రైతులకు అండదండగా నిలుస్తోంది. దీంతో విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ, కల్తీల బారి నుంచి అన్నదాత బయటపడ్డాడు. ఈ ఖరీఫ్‌లో కూడా మిర్చి రైతులకు కల్తీ, నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా ఈ ఏడాది కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విత్తనాల కంపెనీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటోంది. డిమాండ్ ఉన్న విత్తన రకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు సాధారణంగా మేలో విత్తనాలు కొని జూన్, జూలైలో నారుపోస్తారు. సాగు విస్తీర్ణంలో 30 శాతం ఓపీ (ఓపెన్ పొలినేటెడ్), 70 శాతం హైబ్రీడ్ విత్తనం వేస్తారు. సీజన్లో 2.57 కిలోల ఓపీ, 35 వేల కిలోల హైబ్రీడ్ విత్తనం అవసరం. ఓపీ విత్తనానికి ఢోకా లేకున్నప్పటికీ, హైబ్రీడ్ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేశారు. వచ్చే ఖరీఫ్‌లో డిమాండ్ ఉన్న రకాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ సీడ్ యాక్టు కింద 35 విత్తన కంపెనీలతో ఏపీ సీడ్స్ ఎంవోయూ చేసుకుంది. అగ్రి ల్యాబ్స్‌లో జర్మినేషన్ టెస్ట్, నాణ్యతను పరీక్షించిన తర్వాతే ఆర్బీకేల ద్వారా కంపెనీలు నిర్దేశించిన ధరలకే రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు టాస్క్‌ఫోర్స్ సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో విత్తనాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మేవారు, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అధిక ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లాలవారీగా వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బందితో ఏర్పాటు చేస్తున్న ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయి. ఎవరైనా కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించినా, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటాయి. మరో వైపు నకిలీ నారు కట్టడికిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 50 శాతం మంది మార్కెట్లో కొన్న విత్తనాన్ని నారు కోసం షేడ్‌నెట్స్‌కు ఇస్తారు. మిగిలిన 50 శాతం రైతులు షేడ్‌నెట్స్ నుంచి నేరుగా నారు కొంటారు. నర్సరీలతో పాటు షేడ్‌నెట్స్‌ను కూడా నర్సరీ యాక్టు పరిధిలోకి తేవడంతో విధిగా సీడ్ రిజిస్టర్లు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. నారు అమ్మే ముందు నారుకు ఉపయోగించిన విత్తనం ఏ కంపెనీదో లాట్ నంబర్లతో సహా చెప్పాల్సి ఉంటుంది. నాణ్యమైన విత్తనం వాడలేదని తనిఖీల్లో తేలితే షేడ్‌నెట్స్ లైసెన్సులను రద్దు చేస్తారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిరప సాగవుతోంది. అత్యధికంగా పల్నాడులో 1.42 లక్షల ఎకరాలు, ప్రకాశంలో 91,347 ఎకరాలు, గుంటూరులో 67,500 ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. గత సీజన్లో గుంటూరు మిర్చి యార్డులో క్వింటాలు ధర రూ.27వేలకు పైగా, వరంగల్‌లో ఏకంగా రూ.50 వేలకు పైగా పలికింది. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో పత్తి, వేరుశనగ రైతులు కూడా పెద్ద ఎత్తున మిరప వైపు మళ్లుతున్నారు. 2021–22 లో రికార్డు స్థాయిలో 5.62 లక్షల ఎకరాలు, 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. రానున్న ఖరీఫ్‌లో మిరప సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం కొరత రానీయం రైతులకు సరిపడా హైబ్రీడ్ మిరప విత్తనాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. డిమాండ్ ఉన్న విత్తన రకాలను రైతులకు అందిస్తాం. ఎక్కడైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు కూడా రద్దు చేస్తాం. బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ ఆర్బీకేల ద్వారా విత్తనం సరఫరా విత్తనాల కోసం 35 కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం. సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తాం. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా విక్రయించాం. ఈ ఏడాది కూడా డిమాండ్ ఉన్న హైబ్రీడ్ రకాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. 29 రకాల విత్తనాలు 115 క్వింటాళ్లు అవసరమని ఉద్యాన శాఖ నుంచి ఇండెంట్ ఇచ్చింది. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. –డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ అధిక ధరలకు కొనొద్దు మిరప, పత్తి విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆతృతపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులకు సూచించారు. కల్తీ, నకిలీ విత్తనాలను, బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు జిల్లాలవారీగా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మిరప, పత్తి విత్తనాలను గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విత్తనం దొరకదన్న ఆందోళన అవసరం లేదని, డిమాండ్ ఉన్న రకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. – రైతులకు మంత్రి కాకాణి సూచన -
రైతు భరోసా కేంద్రాలు అద్భుతం: రాజస్థాన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఎండీ
తిరుపతి రూరల్: క్షేత్రస్థాయిలోనే రైతు సమస్యలకు ఉత్తమ పరిష్కార కేంద్రంగా ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అద్భుతమని రాజస్థాన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జస్వంత్‌సింగ్ కొనియాడారు. ఆయన ఆదివారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అగ్రికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని ఆర్బీకేని సందర్శించారు. వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో మాట్లాడారు. ఆర్బీకేలో రైతుల సంక్షేమం, అధిక దిగుబడి కోసం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న నాణ్యమైన క్రిమిసంహారిక మందులు, రైతులకు సీజన్ల వారీగా అందిస్తున్న సేవలను తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ప్రసాద్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్బీకేలో కియోస్క్ పనితీరు, వివిధ అవసరాలకు రైతులు కియోస్‌్కను ఉపయోగించుకుంటున్న విధానాన్ని వారు ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల అధికారులు రోజూ అందుబాటులో ఉంటున్నారని, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించామని రైతులు తెలిపారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ జస్వంత్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఆర్బీకే వంటి పథకాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోందని చెప్పారు. అందులో భాగంగానే వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో వాటిని పరిశీలించేందుకు వచి్చనట్లు తెలిపారు. నిజంగానే ఆర్బీకేలు రైతులకు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయని కితాబిచ్చారు. ఈ విషయమై తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి సంగన మమత, అగ్రికల్చర్ అసిస్టెంట్ అయేషా, రైతులు పాల్గొన్నారు. చదవండి: అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు! -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నాం. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. ఈ నాలుగేళ్ల కాలంలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందజేశాము. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ. 76,99 కోట్లు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరువు అనే మాటే లేదు. 2014-19 మధ్య గత ప్రభుత్వంలో ఓ అన్యాయస్థుడు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే ఉంది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది. నాలుగేళ్లుగా ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండాయి. రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూగర్భ జలాలు పెరిగాయి. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. నాలుగేళ్లుగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు రూ. 55వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా రూ.27వేల కోట్లు అందజేశాం. పట్టా ఉన్న రైతులకే కాకుండా అసైన్డ్ భూముల రైతులు, కౌలు రైతులలకూ రైతు భరోసా అందించాము. ఆర్బీకేల ద్వారా రైతన్నలకు విత్తనం నుంచి ఎరువుల వరకు తోడుగా నిలిచాం. మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ. 3,411 కోట్లు మాత్రమే అందించారు. మన ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా రైతులకు రూ.6,685 కోట్ల సాయం అందించాం. రైతన్నకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం తీర్చుతున్నాం. సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ,1,834 కోట్లు చెల్లించాం. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ స్ఫూర్తితో సాగుతాం :కేరళ మంత్రి
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ ప్రశంసించారు. ఏపీ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సాగుదారుల హక్కు చట్టం (సీసీఆర్సీ) తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆర్బీకేల తరహాలో వన్‌స్టాప్ సొల్యూషన్ సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందడంపై వైగా–2023 ఇంటర్నేషనల్ సెమినార్ కేరళలోని తిరువనంతపురంలో ఆదివారం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరగనున్న సెమినార్‌ను ఏపీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ శాఖల మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.ప్రసాద్, చందర్ కుమార్ ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ దూసుకెళుతోందని ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి కొనియాడారు. ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలు అద్భుతమన్నారు. ల్యాబ్ టూ ల్యాండ్ కాన్సెప్ట్ కింద ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నామని, తమ రాష్ట్రంలోనూ ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఆలోచనల ఫలితమే ఆర్బీకేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమం కోసం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలని సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆర్బీకేల ద్వారా పాడి, మత్స్య,డెయిరీ, బ్యాంకింగ్ సేవలన్నీ అందిస్తున్నామన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ నెలకొల్పామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉచిత పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ), రైతు క్షేత్రం వద్దే పంట ఉత్పత్తుల కొనుగోలు చేపట్టామన్నారు. రైతులను ఆదుకునేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ వైగా–2023 ఇంటర్నేషనల్ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్బీకే నమూనాతో పాటు వ్యవసాయ–అనుబంధ రంగాలలో తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అందిస్తున్న సేవలను కళ్లకు కట్టినట్టుగా స్టాల్ ద్వారా ప్రదర్శించారు. సెమినార్‌కు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఏపీ స్టాల్‌ను సందర్శించి ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మంత్రి కాకాణితో పాటు ఏపీ ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీసీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసాపై మడతలు కాదు.. చంద్రబాబుకు రామోజీ చిడతలు!!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రభుత్వమిస్తున్నంతటి భరోసా గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదనేది నిస్సందేహం. మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి చిత్తశుద్ధితో రైతాంగానికి మేలు చేయటం లేదనేది కూడా వాస్తవం. అందుకే విత్తనాలు ఇవ్వటం నుంచి పండించిన పంటను విక్రయించుకునే దాకా రైతుకు సహాయంగా ఉంటూ చేయి పట్టి నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఈ బృహత్ యజ్ఞాన్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశంసించలేదు. పైపెచ్చు ప్రతి పనిలోనూ రంధ్రాన్వేషణే పనిగా పెట్టుకుంది. ప్రతి ఏటా రూ.12,500 చొప్పున రూ.50 వేల సాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక ఆ హామీకన్నా మిన్నగా రైతు సంక్షేమానికి నడుం బిగించారు ముఖ్యమంత్రి. అందుకే మరో వెయ్యి అదనంగా జోడించి ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వటానికి సంకల్పించారు. దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఏటా సగటున 52.38 లక్షల మంది రైతుల చొప్పున గడిచిన మూడేళ్లలో రూ.25,971.33 కోట్ల సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీన్ని కూడా ఏనాడూ సానుకూలంగాంశంగా ప్రస్తావించని ‘ఈనాడు’... ‘రైతు భరోసాపై ఎన్ని మడతలో’... అంటూ చిత్రవిచిత్రమైన రాతలకు దిగటమే అసలైన దుర్మార్గం. 50 వేలిస్తామని చెప్పి రూ.67,500 చొప్పున ఇస్తుంటే... కోత పెట్టారని రాశారంటే రామోజీని ఏమనుకోవాలి? 42 శాతం నిధులను పిఎం కిసాన్ కింద కేంద్రమే ఇస్తోందంటే... అవి బడ్జెట్ ద్వారా రాష్ట్రానికిచ్చే నిధులే కదా? రాష్ట్రాల నుంచి పన్నుల ద్వారా సమీకరించిన మొత్తాన్ని బడ్జెట్ ద్వారా, పన్నుల్లో వాటాగా కేంద్రం రాష్ట్రాలకిస్తే... రాష్ట్రాలు వాటిని ప్రాధాన్యాల వారీగా ఖర్చుచేస్తాయి. ఈ మాత్రానికి కేంద్రమంటే ఏదో విదేశాల నుంచి తెస్తున్నట్టు ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? రైతుకు ఇస్తామని చెప్పిన మొత్తం కన్నా దాదాపు 35 శాతం అధికంగా చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఒక్క అక్షరం ముక్క కూడా రాయని మీరు... లేనిపోని అవాస్తవాలతో జనాన్ని తప్పుదోవ పట్టించేలా రాయటం భావ్యమా? చంద్రబాబు ఏం చేసినా రైటేనా? 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు బేషరతుగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి... అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తరవాత రుణమాఫీని పూరి్తగా అటకెక్కించేసినా ‘ఈనాడు’ ఏనాడూ ఒక్క అక్షరం కూడా రాయలేదెందుకు? అన్నదాతలను నమ్మించి మోసం చేయటం కరెక్టా? గద్దెనెక్కగానే రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని నమ్మించి... చివరకు రకరకాల ఆంక్షలతో కేవలం రూ.15వేల కోట్లతో రుణమాఫీ చేసేసినట్లుగా చెబితే... అది తప్పని, రైతులను మోసం చేయటమేనని ఎందుకు అడగలేదు? 2019లో ఎన్నికలు సమీపిస్తున్నాయనగా... ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ఏటా రైతులకు రూ.15వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు... అధికారంలో ఉన్నన్నాళ్లూ ఎందుకు చేయలేదని నిలదీయలేదేం? ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా... రూ.15 వేలు ఇస్తానని చెప్పి కూడా ఎన్నికలకు మూడు నెలల ముందు రైతులకు కేవలం రూ.4 వేలు చేతిలో పెట్టి, కౌలురైతులకు పూర్తిగా మొండి చెయ్యి చూపించినపుడు మీ పత్రిక ఏమైపోయింది? చంద్రబాబు ఇచ్చిన రూ.4వేలలో కూడా రూ.2వేలు కేంద్రానివే కదా? మరి అప్పుడేమైపోయింది మీ పాత్రికేయం? మరి ఇప్పుడెందుకీ మడతపేచీ రాతలు? అన్నదాత సుఖీభవతో పోల్చి చూడొచ్చుగా? సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ రైతుల కష్టాలను చూసి... తాను గెలిస్తే ఏటా రూ.12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని చూసిన చంద్రబాబు... రైతుల ఓట్లు దక్కవేమోనన్న భయంతో ఎన్నికలకు 3 నెలల ముందు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికీ రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తానంటూ 2019 ఫిబ్రవరి 17న జీవో–28ని జారీ చేశారు. జీవో ఇచ్చినా డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దాన్ని పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత రూ.1000, ఎన్నికలకు నెల రోజుల ముందు రూ.3వేల చొప్పున జమ చేసి చేతులు దులుపుకున్నారు. ఇలా చెల్లించిన సొమ్ములో రూ.675 కోట్లు పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసినవే కదా? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు రామోజీరావు గారూ? బాబు మాదిరిగా భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా... చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకూ రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించటం ఏ తరహా పాత్రికేయం? కౌలురైతులకూ పెట్టుబడి సాయం ఇక సొంత భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకే కాదు... అటవీ (ఆర్వోఎఫ్ఆర్), దేవదాయ సాగుదారులకూ పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నాడు కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకూ పైసా కూడా విదల్చలేదు చంద్రబాబు. కానీ గత మూడున్నరేళ్లలో 3,71,732 మంది కౌలుదారులు, 3,07,866 మంది అటవీ, దేవదాయ భూ సాగుదారులకు రూ.892.45 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించిందీ ప్రభుత్వం. -
AP: మరింతమంది రైతులకు పెట్టుబడి సాయం
సాక్షి, అమరావతి: సాధ్యమైనంత ఎక్కువమందికి పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద విడతకు రూ.2 వేల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా కేంద్రం పెట్టుబడి సాయం చేస్తోంది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం జమచేస్తోంది. పంట భూమి గల యజమానులకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుంటే.. అటవీ, దేవదాయ భూముల సాగుదారులతోపాటు కౌలుదారులకు సైతం రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. అయితే.. వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12.98 లక్షలమందికి పీఎం కిసాన్ సాయం అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో క్రియాశీలక రైతులు 48.43 లక్షలమంది ఉన్నారు. వీరిలో ఈ–కేవైసీ పూర్తయిన 35.45 లక్షలమంది రైతులు మాత్రమే పీఎం కిసాన్‌కు అర్హత పొందారు. మిగిలినవారికి ఈ నెల 15వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తిచేసి నూరుశాతం మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన సమస్యలు ఇవే.. ప్రధానంగా లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారు ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌ల్యాండ్, ఎన్పీసీఐ పోర్టల్‌లో మ్యాపింగ్ కాకపోవడం, ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండడం, ఆధార్ అప్డేట్ చేయడం వలన అనుసంధాన సమయంలో విఫలం కావడం, ఆర్టీజీఎస్, ఎన్ఐసీ సమస్యలు, అకౌంట్ బ్లాక్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదు కావడం, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలుండడం, చనిపోవడం వంటి వివిధ కారణాలతో వీరంతా ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర వెబ్‌ల్యాండ్ మ్యాపింగ్, ఈ–కేవైసీ పూర్తిగాకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది. ఆర్బీకే స్థాయిలో అర్హుల గుర్తింపు పెండింగ్ దరఖాస్తుల డేటాను ప్రభుత్వం మండల వ్యవసాయాధికారులతో పాటు రైతుభరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్బీకే సిబ్బంది సాయపడతారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్ పోర్టల్‌లో తగిన వివరాలను అప్లోడ్ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పోర్టల్‌తో మ్యాపింగ్ చేయించనున్నారు. తొలుత డిసెంబర్ నెలాఖరువరకు గడువునిచ్చిన కేంద్రం.. రాష్ట్రప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. గడువులోగా ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని రైతులను ఆర్బీకే స్థాయిలో గుర్తించి వారితో దగ్గరుండి ఈ–కేవైసీ చేయించాలని సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీలోగా మిగిలిన రైతులందరితో ఈ–కేవైసీ చేయించడంతోపాటు ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆర్బీకేల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది. ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా.. ప్రస్తుతం ఆర్బీకేల్లో పనిచేస్తున్న మొత్తం 14,347 మందిలో ప్రధానంగా 6,291 మంది వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య, 317 మంది పట్టు సహాయకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖల సహాయకులు స్థానిక ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన సహాయకులే ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. కొన్నిటిలో మాత్రం పట్టు, మత్స్య సహాయకులు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖలకు చెందిన సహాయకులు సెకండ్ ఇన్చార్జిలుగా సేవలందిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల పరిధిలో పాడి సంపద ఉండడంతో ప్రతి ఆర్బీకేకు ఓ పశుసంవర్ధక సహాయకుడు చొప్పున కేటాయించారు. ఇలా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే సీఎం ఆదేశాలు.. ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పొలం బడులు, తోట, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్‌ను ఆర్బీకేలకు అనుసంధానించారు. మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సచివాలయాల్లోనూ.. ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతిలోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టాం. –వై.మధుసూదనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
రైతన్నకు ‘విత్తన’ దన్ను
సాక్షి, అమరావతి: మాండూస్ తుపాను కారణంగా విత్తనాలు కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. అదును ఉన్నా మళ్లీ విత్తేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనకు గురవుతున్న అన్నదాతలపై ఆర్థికభారం పడకుండా అండగా నిలుస్తోంది. వీరికి 80 శాతం సబ్సిడీపై విత్తనాలను అందిస్తోంది. ఏ విత్తనం కావాలన్నా, సాగు విస్తీర్ణం బట్టి ఎంత కావాలన్నా సరఫరా చేస్తోంది. మాండూస్ తుపాను ఇటీవల రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రబీ సీజన్లో ముందుగా పంటలు సాగుచేసే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో వరి, శనగ, వేరుశనగ, నువ్వులు, మినుము విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. వరిలో ఎన్‌ఎల్‌ఆర్–34449, ఆర్ఎన్ఆర్–15048, శనగలో జేజీ 11, పెసలులో పీయూ 31, వేరుశనగలో కదిరి లేపాక్షి రకం విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ వచ్చింది. ఇలా ఆయా జిల్లాల నుంచి 33వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 28వేల క్వింటాళ్లను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంచేసింది. ఆర్బీకేల్లో విత్తనం కావాల్సిన రైతుల వివరాలను నమోదు చేస్తోంది. వారికి డి.క్రిష్ యాప్ ద్వారా పారదర్శకంగా విత్తన సరఫరా చేస్తోంది. 15వేల మంది రిజిస్ట్రేషన్ ఇక విత్తనాల కోసం ఇప్పటివరకు 15వేల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 10వేల మందికి 8,727 క్వింటాళ్ల విత్తనం సరఫరా చేశారు. వీరికి 4,686 క్వింటాళ్ల వరి, 3,288 క్వింటాళ్ల శనగ, 748 క్వింటాళ్ల వేరుశనగ, ఐదు క్వింటాళ్ల నువ్వుల విత్తనం సరఫరా చేశారు. జనవరి 10 కల్లా మిగిలిన వారికి 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆయా జిల్లాల్లోని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు రబీలో 8 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ వరి విత్తనం వేశా. తుపాన్ దెబ్బకు మొత్తం పోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయా. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకుని 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేశారు. మొన్న రెండు బ్యాగ్‌లు ఆర్ఎన్ఆర్ 15048 విత్తనం తీసుకున్నా. ప్రభుత్వం ఆదుకోవడం ఆనందంగా ఉంది. పంట నష్టాన్ని కూడా అంచనా వేశారు. – అట్ల కృష్ణయ్య, తునుబాక, పెల్లకూరు మండలం, తిరుపతి జిల్లా జనవరి 10కల్లా అందరికీ సరఫరా సీఎం జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై వరి, శనగ, వేరుశనగ, అపరాల విత్తనాన్ని సరఫరా చేస్తున్నాం. 33వేల క్వింటాళ్ల విత్తనం కోసం ఇండెంట్ పెట్టారు. ఇప్పటికే 28వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధంచేశాం. 8,727 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పంట దెబ్బతిన్న రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకుంటే జనవరి 10కల్లా కావాల్సిన విత్తనం సరఫరా చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం నాకున్న ఐదెకరాల్లో శనగ పంట వేశాను. వేసిన వారంలోనే తుపానువల్ల మొలక దశలోనే పంట పూర్తిగా దెబ్బతింది. 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోంది. కేవలం రూ.2,040 చెల్లించి ఆర్బీకేల్లో 1.25 క్వింటాళ్ల శనగ విత్తనం తీసుకున్నా. సబిడీపై విత్తనం ఇవ్వకపోతే చాలా ఇబ్బందిపడే వాళ్లం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – నలదల కొండయ్య, పలుకూరు, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా -
‘రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, విజయనగరం: కొన ఊపిరితో ఉన్న పార్టీని బతికించడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాటపడుతున్నారు. విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాగా, మంత్రి బొత్స శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి నిజాం వాళ్లకి అమ్మేసింది చంద్రబాబే. బాబు హయాంలో బీసీలను ఎందుకు కేంద్రమంత్రిని చేయలేదు. తోటపల్లి ప్రాజెక్ట్ చంద్రబాబు పూర్తి చేశారంటే నవ్విపోతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నమ్ముతారు అనుకుంటే ఎలా?. మేము గడప గడపకు వెళ్లి చేసింది చెప్తున్నాము. గతంలో ఏ ప్రభుత్వం అయినా చెప్పిందా?. చంద్రబాబు.. వ్యక్తి గత అంశాలు, అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఆర్బీకేలను ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అనలేదా?. ప్రజా కార్యాక్రమాలు ఎంత బాధ్యతగా చేయాలో మాకు తెలుసు. రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. చంద్రబాబుకి విజయనగరం జిల్లా గురించి, రైతులు, ఆస్పత్రులు, విద్య గురుంచి మాట్లాడే హక్కు లేదు’ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. -
ఏపీలో రైతుభరోసా కేంద్రాలతో సేవలన్నీ ఒకేచోట
సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు వన్–స్టాప్ పరిష్కారంలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుభరోసా కేంద్రాల గురించి కేంద్రానికి తెలుసని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనల సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్థ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధించిన పరిజ్ఞానం ప్రచారం వంటి రైతుల అవసరాలన్నింటికీ ఒకేచోట పరిష్కారం అందించేలా ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అగ్రి–క్లినిక్స్, అగ్రి–బిజినెస్ సెంటర్స్, సాయిల్ హెల్త్‌కార్డ్ ఇలా పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఖరీఫ్‌లో 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్లో ఈ నెల 11వ తేదీ వరకు 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర వినియోగదారులు, ఆహారశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి.. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జాతీయ సగటు కంటే ఏపీలోనే రైతు ఆదాయం ఎక్కువ జాతీయ సగటు కంటే నెలసరి రైతు ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. జాతీయ సగటు రూ.10,218 ఉండగా ఏపీలో రైతు నెలసరి ఆదాయం రూ.10,480 అని చెప్పారు. -
AP: ఇక చింతలేకుండా పంట నిల్వ
సాక్షి, అమరావతి: రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఇక ఇబ్బంది ఉండదు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బహుళ ప్రయోజన కేంద్రాల (ఎంపీఎఫ్ఎస్) తొలిదశ పనులను మార్చి నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రామస్థాయిలో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో 500 టన్నుల సామర్థ్యంతో 1,021 గోదాములు ఒక్కొక్కటి రూ. 40 లక్షల చొప్పున రూ. 408.40 కోట్లతో నిర్మిస్తుండగా, 1,000 టన్నుల సామర్థ్యంతో 113 గోదాములు ఒక్కొక్కటి రూ. 75 లక్షల చొప్పున రూ. 84.75 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 166.33 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 19 ప్యాకేజీల్లో 1,134 గోదాములు 500 టన్నుల గోదాములకు 15 సెంట్ల భూమి, 1,000 టన్నుల గోదాములకు 25 సెంట్ల భూమి అవసరం. స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. 962 చోట్ల స్థలాలను మార్కెటింగ్ శాఖకు అప్పగించారు. 500 టన్నుల గోదాములు 6,500 చ.అ.విస్తీర్ణంలోనూ, 1,000 టన్నుల గోదాములు 11 వేల చ.అ.విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్నారు. తొలిదశలో రూ. 493.15 కోట్లతో నిర్మిస్తున్న 1,134 గోదాముల కోసం 19 ప్యాకేజీల కింద టెండర్లు ఖరారయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్స్ పూర్తికాగా, పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 57 గోదాముల నిర్మాణం పూర్తయింది. ఫినిషింగ్ స్టేజ్‌లో 72, సూపర్ స్ట్రక్చర్ స్టేజ్‌లో 142, బేస్మెంట్ స్థాయిలో 290, ఫుటింగ్ స్టేజ్‌లో 179, కాంక్రీట్ స్టేజ్‌లో 89 ఉండగా, మిగిలినవి ఎర్త్ వర్క్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 88.23 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, రూ. 56.02 కోట్ల మేర చెల్లింపులు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు మరో వైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ పరికరాలు, వేయింగ్ బ్యాలెన్స్‌లు, వేయింగ్ స్కేల్స్, కంప్యూటర్లతో పాటు టార్పాలిన్స్ కొనుగోలు చేస్తున్నారు. వీటిని తొలిదశలో 2,156 కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 812 కేంద్రాల్లో వీటి కొనుగోలుకు పరిపాలనా ఆమోదం తెలిపారు. 639 కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ఎస్సైయింగ్ ఎక్యూప్మెంట్స్ (లాబ్వేర్, తేమ మీటర్లు, వెర్నియర్ కాలిపర్స్) సమకూరుస్తున్నారు. ఇప్పటికే 845 కంప్యూటర్స్, 441 తేమ పరికరాలు, 455 వెయింగ్ బాలెన్స్‌లు, 1068 వేయింగ్ స్కేల్స్‌ను రివర్స్‌టెండరింగ్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేశారు. వచ్చే సీజన్ నాటికి గోదాములు తొలిదశలో చేపట్టనున్న గోదాముల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 100 శాతం స్థలాల ఎంపిక పూర్తయ్యింది. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించాం. ఈ నెలాఖరుకల్లా కనీసం 50 శాతం పూర్తి కావాలని, మార్చి నాటికి 100 శాతం పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. – రాహుల్ పాండే, కమిషనర్ మార్కెటింగ్ శాఖ -
‘సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు’
సాక్షి, అమరావతి/కంచికచర్ల(నందిగామ): ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టికి నిదర్శనమని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ (ఏపీ, తెలంగాణ) గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. తమ దేశంలోనూ ఇలాంటివి ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ‘ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. నిజంగా ప్రపంచ శ్రేణి ఇన్నోవేషన్ ఇది. ఇన్పుట్స్ బుకింగ్ కోసం కియోస్క్‌లు, నాలెడ్జ్ హబ్‌లు, పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అంబులెన్స్‌లు, నాణ్యతకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ స్థాయిలో నెలకొల్పిన అగ్రి ల్యాబ్‌లు నిజంగా అద్భుతం’ అని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఆర్బీకేతో పాటు నందిగామలోని వైఎస్సార్ అగ్రి ల్యాబ్‌ను స్వయంగా సందర్శించి సేవలను పరిశీలించారు. రెండు గంటల పాటు ఆర్బీకేలోనే.. ఆర్బీకేలో రెండు గంటల పాటు గడిపిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. పొలంబడిని పరిశీలించారు. గ్రామస్థాయిలో ఎంపిక చేసిన రైతుక్షేత్రాల్లో 14 వారాల పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతులపై శిక్షణనిస్తున్నామని, మూడు సీజన్లలో శిక్షణ ఇచ్చిన వారికి గ్యాప్ సర్టిఫికేషన్ ఇస్తున్నామని, ఇలా మూడు విడతల్లో పొందిన వారికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. ఆర్బీకేలో కియోస్క్ ద్వారా అందిస్తున్న సేవలు, ఇన్పుట్స్ బుకింగ్ విధానాన్ని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. కియోస్క్‌ను స్వయంగా ఆపరేట్ చేసి వాతావరణ సమాచారాన్ని పరిశీలించారు. చాలా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆర్బీకేలో డిజిటల్ లైబ్రరీతో పాటు వ్యవసాయ మ్యాగజైన్స్‌ను పరిశీలించారు. స్మార్ట్‌టీవీ ద్వారా ప్రసారమవుతున్న ఆర్బీకే చానల్ కార్యక్రమాలను వీక్షించారు. ఈ – క్రాప్ బుకింగ్‌తో పాటు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలు బాగున్నాయని అభినందించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచిన పరికరాలను పరిశీలించి వినియోగంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూగజీవాలపై శ్రద్ధ.. ఆర్బీకే ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ సంచార పశుఆరోగ్య సేవారథాన్ని పరిశీలించి వినూత్నంగా ఉందని కితాబిచ్చారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పశువులను తరలించే విధానం, అంబులెన్స్‌లో మినీ లేబరేటరీ ద్వారా పరీక్షల తీరును పరిశీలించారు. మూగజీవాల కోసం ఇంత శ్రద్ధ తీసుకోవడం తానెక్కడా చూడలేదంటూ అభినందించారు. అనంతరం నందిగామలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను సందర్శించారు. సుమారు గంటకు పైగా ల్యాబ్‌లోనే గడిపి ప్రతి ఒక్కటి స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ దూరదృష్టి అద్భుతం ‘అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు అధికారులు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు. వాటిని స్వయంగా పరిశీలించేందుకే ఇక్కడకు వచ్చా’ అని బ్రిటీష్ డిప్యుటీ హై కమిషనర్ తెలిపారు. సీఎం, అ«ధికారులు చెప్పిన దాని కంటే గొప్పగా రైతులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ‘ల్యాబ్ టు ల్యాండ్, ల్యాండ్ టు ల్యాబ్ విధానంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు అందిస్తున్నారు. నాణ్యతకు పెద్ద పీట వేశారు. ప్రతీ ఇన్పుట్ను పరీక్షించి మరీ రైతులకు అందిస్తున్నారు. సాగులో అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకే సేవలు అద్భుతంగా ఉన్నాయి’ అని తెలిపారు. తొలిసారిగా అరిటాకులో భోజనం చేశానని, సంప్రదాయ పద్థతిలో వడ్డించే ఆహారం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా చేతి వేళ్లతో తిన్నానంటూ బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ట్వీట్ చేశారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఆర్బీకేల ఇన్చార్జి వల్లూరి శ్రీధర్, పొలంబడి ఇన్చార్జి బాలూనాయక్, ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి విజయభారతి, నందిగామ ఏడీ రమణమూర్తి, కంచికచర్ల మత్స్యశాఖ ఏడీ చక్రాణి, పశుసంవర్ధక శాఖ డీడీ వెంకటేశ్వరరావు, అగ్రిల్యాబ్ కోడింగ్ సెంటర్ డీడీ శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
AP: ఇక రైతులే డ్రోన్ పైలట్లు
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల్లో కిసాన్ డ్రోన్స్ (డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆర్బీకేలకు కేటాయించే డ్రోన్లను రైతులే నడిపేలా.. రైతు గ్రూపుల్లో డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేసిన వారికి ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణకు శ్రీకారం చుడుతోంది. మండలానికి 3 చొప్పున తొలి దశలో 2 వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా.. తొలిదశలో 1,961 ఆర్బీకేలను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 738 ఆర్బీకేల పరిధిలో ఐదుగురు సభ్యులతో రైతు గ్రూపులను ఏర్పాటు చేశారు. మిగిలిన ఆర్బీకేల పరిధిలో డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీజీసీఐ నిబంధనల మేరకు శిక్షణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఐ) నిబంధనల మేరకు వ్యవసాయ డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందాలంటే 18–65 ఏళ్ల వయసు కలిగి, వ్యవసాయ డిప్లొమా లేదా వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా కనీసం ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్తో విధిగా పాస్‌పోర్టు కలిగి ఉండాలి. రైతు గ్రూపుల్లో ఈ అర్హతలు కలిగిన వారిని డ్రోన్ పైలట్లుగా ఎంపిక చేశారు. ఇటీవలే వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిమోట్ పైలట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)కు డీజీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి బ్యాచ్‌కు 20 మంది చొప్పున 12 రోజులపాటు రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎన్జీ రంగా వర్సిటీ ప్రత్యేక పాఠ్యప్రణాళికను తయారు చేసింది. 10 ప్రధాన పంటల సాగులో డ్రోన్ల వినియోగంపై విధివిధానాలను రూపొందించింది. 4 రోజులపాటు క్లాస్ రూమ్ సెషన్స్, రెండ్రోజుల పాటు అనుకరణ, అసెంబ్లింగ్, మరమ్మతు, నిర్వహణలపై శిక్షణ ఇస్తారు. 6 రోజులపాటు ఫీల్డ్‌లో డ్రోన్ నిర్వహణపై ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. శిక్షణకు ఇద్దరు టెక్నికల్, ఐదుగురు ఫీల్డ్ ఫ్యాకల్టీని సిద్ధం చేశారు. ఇందుకోసం ఒక్కో రైతుకు రూ.17 వేలు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. శిక్షణ అనంతరం ఆయా రైతులకు డీజీసీఐ ద్రువీకరణతో కూడిన సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు. మార్చిలోగా తొలిదశ కిసాన్ డ్రోన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకే స్థాయిలో సాధ్యమైనంత త్వరగా కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. 50 శాతం గ్రూపుల ఎంపిక పూర్తయింది. మిగిలిన గ్రూపుల ఎంపిక సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. ఎంపిక చేసిన రైతులకు ఈ నెల 28 నుంచి ఏపీ ఎన్జీ రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ శిక్షణకు శ్రీకారం చుడుతున్నాం. మార్చిలోగా తొలి దశలో నిర్దేశించిన 2వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ దశల వారీగా శిక్షణ వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ఇటీవలే డీజీసీఐ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కిసాన్ డ్రోన్స్ కోసం ఎంపిక చేసిన రైతులకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నాం. బ్యాచ్‌కు 20 మంది చొప్పున దశల వారీగా 2వేల మందికి శిక్షణ ఇస్తాం. – డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ -
ఆర్బీకేల్లోనే గోనె సంచులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు సంక్షేమమే థ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తు దగ్గర నుంచి కోత కోసే వరకు అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. రైతు పంటకు మద్దతు «ధర దక్కేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎక్కడా నష్టపోకుండా ధాన్యాన్ని కళ్లాల వద్దే కొనుగోలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు రెండు జిల్లాల అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా రైతులకు రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేశారు. ఆర్బీకేల వద్ద వలంటీర్లు, రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారులతో ఒక టీం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్ళకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళల్లో రైతు సంఘాల నేతలు, రైస్‌మిల్లర్లు, రైతులతో జిల్లా అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గోనెసంచుల కొరతతో ఇబ్బందులు ఈ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోనెసంచుల కొరత అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటికి ఇబ్బందులు ఏర్పడకుండా గోనెసంచులు భారీ ఎత్తున అందించేందుకు అ«ధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ఆరంభంలో గోనెసంచుల కొరత ఏర్పడినప్పటికీ దానిని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గోనె సంచులను రైస్‌మిల్లర్ల నుంచి రైతులకు అందించేందుకు రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో గోనెసంచులు అందుబాటులో ఉండేలా మిల్లర్లు గోనెసంచులు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆరంభంలో మిల్లర్లు గోనెసంచులు అందించడంలో కాస్త అశ్రద్ధ వహించినప్పటికీ క్రమేపి రైతు భరోసా కేంద్రాలకు గోనెసంచులు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు. మిల్లర్ల సాయంతో గోనెసంచుల సేకరణ ఏలూరు జిల్లా వ్యాప్తంగా 745 రైతుభరోసా కేంద్రాల్లో 4.2 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా పశ్చిమగోదావరి జిల్లాలో 296 రైతుభరోసా కేంద్రాల పరిధిలో 3.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. వీటికి ఏలూరులో 1.50 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 85 లక్షలు గోనెసంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటికి అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు ఏలూరు జిల్లాలో 95 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 60 లక్షలు గోనెసంచులు అవసరం కానున్నాయి. వీటిని రైతులకు అందుబాటులో ఉన్న రైతుభరోసా కేంద్రాలకు మిల్లర్ల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.43 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ప్రస్తుత ఖరీఫ్‌లో మంచి దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో గోనెసంచులు భారీగా అవసరమయ్యాయి. గోనెసంచుల విషయంలో అధికారులు పూర్తి దృష్టి కేంద్రీకరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోనెసంచులను రీసైక్లింగ్ విధానం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ చేస్తున్నారు. కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలుకు అధికారులు వాహనాలను సైతం సిద్ధంగా ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్బీకేల వద్ద వీఆర్ఓ, ఆర్ఐలను కస్టోడియన్లుగా నియమించి మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 120 నుంచి 180 వరకు వాహనాలను అందుబాటులో ఉంచి రవాణాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేపడుతున్నాం. ఆరంభంలో గోనెసంచుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అ«ధిగమించి రైతులకు గోనెసంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్నవెంకటేష్, ఏలూరు జిల్లా కలెక్టర్ గ్రామస్థాయిలోనే రైతులకు సేవలు గ్రామ స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు సేవలందిస్తున్నాను. ప్రస్తుతం కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు అందుబాటులో గోనెసంచులు ఉంచి కొనుగోలు నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాము. రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు అ«ధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. – పి.ప్రశాంతి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ -
AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి 2021 ఖరీఫ్ సీజన్‌లోని అర్హుల జాబితా లెక్కతేలింది. ఈ సీజన్‌కు సంబంధించి 10.76 లక్షల మంది రూ.లక్ష లోపు రుణాలు పొందినట్లు గుర్తించగా, వారిలో నిర్ణీత గడువులోగా చెల్లించడం, ఈ–క్రాప్ ప్రామాణికంగా పంటలు సాగుచేసిన 5.68 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరికి రూ.115.33 కోట్లు జమచేయనున్నారు. అలాగే, రబీ 2020–21 సీజన్లో 2.54 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.45.22 కోట్లు జమచేయనున్నారు. ఈ జాబితాలను జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ఈ నెల 19–22 వరకు ప్రదర్శిస్తుండగా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీలో భాగంగా బుధవారం నుంచి 25వరకు ప్రదర్శిస్తారు. అంతేకాదు.. ఎస్వీపీఆర్ పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ హోంపేజీలో ''know your status''అనే విండోలో తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకోవచ్చు. రైతులు తమ వివరాలు సరిచూసుకుని వారి పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లలో తప్పులుంటే తగిన వివరాలు సంబంధిత ఆర్బీకే సిబ్బందికి అందించి సరిచేసుకోవాలి. అర్హత కలిగి తమ పేరులేని రైతులు బ్యాంకు అధికారి సంతకంతో ధృవీకరించి ఆర్బీకేల్లో దరఖాస్తు సమర్పిస్తే పునఃపరిశీలన చేసి అర్హత ఉంటే జాబితాల్లో చేరుస్తారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి 8.22లక్షల మంది ఖాతాలకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఈ నెల 28న సీఎం జగన్ జమ చేస్తారు. -
సచివాలయాలు భేష్
తగరపువలస (భీమిలి): రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందని న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేషన్ (ఐఐపీఏ) బృందం కితాబిచ్చింది. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యులున్న ఈ బృందం గురువారం విశాఖ జిల్లా భీమిలి మండలంలో పర్యటించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు వీరు రెండు బృందాలుగా విడిపోయి టి.నగరపాలెం, దాకమర్రి పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఎన్ఆర్ఎల్ఎం, మిషన్ అంత్యోదయ, పీఎంఏవై, ఎస్బీఎం, ఎన్‌ఆర్‌ఐఐఎం, ఎస్ఎస్ఏ అమలు తీరుపై లబ్ధిదారులతో విడివిడిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. స్థానిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల ఆరోగ్యం గురించి వారితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం పరిశీలించారు. గణితంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్యదర్శులను పిలిచి వారి బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచనని చెప్పారు. రెండు వారాలకు ఒకసారి ఫ్యామిలీ ఫిజీషియన్ సందర్శించడం బాగుందన్నారు. సామాజిక పింఛన్లు డీఎం అండ్ హెచ్‌వో పెన్షన్ల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవై హౌసింగ్ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో పంచాయతీల వారీగా మృతులు, వ్యాక్సినేషన్, తీసుకున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల్లో అమలవుతున్న ఆహారం, పౌష్టికాహార కిట్ల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలని పేర్కొన్నారు. బృందంలో అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు బృందంలో కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు ఉన్నారు. ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, భీమిలి ఎంపీపీ దంతులూరి వెంకటశివసూర్యనారాయణరాజు, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఎంపీడీవో ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శోభారాణి, సర్పంచ్‌లు పొట్నూరు ఛాయాగౌతమి, చెల్లూరు పైడప్పడు, ఎంపీటీసీ సభ్యులు పల్లా నీలిమ, చెల్లూరు నగేష్, పీహెచ్సీ వైద్యుడు ఎ.బి.మల్లికార్జునరావు, కార్యదర్శులు రఘునాథరావు, శంకర్ జగన్నాథ్, లోకేశ్వరి, తెలుగు అనువాదకుడు టి.ఎస్.వి.ప్రసాదరావు ఈ బృందానికి, ప్రజలకు సంధానకర్తలుగా వ్యవహరించారు. -
దేశ వ్యాప్తంగా ఆర్బీకేలు
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు, నాణ్యమైన ఇన్పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత వ్యవస్థ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు, డిజిటల్ కియోస్క్‌లపై అధ్యయనం చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది. బుధవారం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ–పూస)లో ప్రారంభమైన మూడు రోజుల 5వ ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్–2022 సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ విషయం చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన జాతీయ అగ్రి ఎక్స్‌పోలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆర్బీకేల నమూనా, డిజిటల్ కియోస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలు, డిజిటల్ కియోస్క్‌ల పనితీరును కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్‌తో పాటు ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విలియం దార్, రోమన్ ఫోరమ్ ప్రెసిడెంట్ మహారాజ్ ముతూ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్, సలహాదారు ఎన్కే దడ్లాని, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ (ఎన్ఆర్ఏఏ) సీఈవో అశోక్ దాల్వాయి తదితరులు అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆర్బీకే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇదే తరహా సేవలను దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చెప్పారు. ఆర్బీకేలు, వాటిలోని కియోస్క్‌లు వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చే వినూత్నమైన పరిజ్ఞానమని ఆయన కొనియాడారు. ‘ఏపీ ఆర్బీకేల గురించి చాలా వింటున్నాం. వాటి ద్వారా అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్‌ల ద్వారా ఇన్పుట్స్ బుకింగ్ విధానం అద్భుతం. వాటిని జాతీయ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో వీటిని గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా’ అని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని, డిసెంబరుకల్లా డిజిటల్ కియోస్క్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సదస్సుకు వచ్చిన మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్ కేంద్ర మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్‌చంద్ ప్రశంసలు నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్ ప్రశంసించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్ అవార్డుల్లో విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు గ్లోబల్ అగ్రి అవార్డును అందించింది. బుధవారం జరిగిన ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్‌లో ఈ అవార్డును సంజీవ్‌కుమార్ బల్యాన్, రమేష్‌చంద్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ పి.హేమసుష్మిత, ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తన పంపిణీలో ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఇదే ఆలోచనతో కేంద్రం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను తీసుకొచ్చిందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ బాటలోనే విత్తన పంపిణీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంతోనే.. విత్తు నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య సదస్సులో వివరించారు. పౌర సేవలు ప్రజల గుమ్మం వద్ద అందించాలన్న సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చారని చెప్పారు. ఆర్బీకేల్లోని డిజిటల్ కియోస్క్‌ల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను బుక్ చేసుకున్న గంటల్లోనే రైతుల ముంగిట అందిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఎకరాలో సాగయ్యే పంటల వివరాలను ఈ– క్రాప్ ద్వారా నమోదు చేయడం, ఈ డేటా ఆధారంగా పైసా భారం పడకుండా పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలు రైతులకు అందిస్తున్నామని వివరించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకే స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా కూడా మార్చి, గ్రామస్థాయిలోనే పంట ఉత్పత్తులు కొంటున్నామన్నారు. ఆర్బీకేల సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా వంటి ఆఫ్రికన్ దేశం కూడా ముందుకొచ్చిందని వివరించారు. ఆసక్తిగా విన్న పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆర్బీకేల పని తీరును మరింత లోతుగా రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, మచిలీపట్నం ఎంఏవో జీవీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రబీకి 5 లక్షల లీటర్ల నానో యూరియా నిల్వలు
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగం పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తెచ్చింది. 500 మిల్లీలీటర్ల సీసాలో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా సీసా రూ.240కే అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20 వేల మంది రైతులు 34,128 సీసాల (17 వేల లీటర్ల) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో లక్షమందికి పైగా రైతులు 5,46,012 సీసాలు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2 లక్షల లీటర్లు (4 లక్షల సీసాలు) అందుబాటులో ఉంచగా 1.25 లక్షల లీటర్లు (2.50 లక్షల సీసాలు) అమ్ముడయ్యాయి. సకాలంలో వర్షాలు పడడం, పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, తెగుళ్ల ఉద్ధృతి తక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో యూరియా నిల్వలను డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల ఆశించిన స్థాయిలో నానో యూరియా అమ్మకాలు జరగలేదని అంచనా వేస్తున్నారు. ఎరువుల వినియోగం ఎక్కువగా ఉండే ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 5 లక్షల లీటర్ల (10 లక్షల సీసాల) నానో యూరియాను అందుబాటులో ఉంచారు. డిమాండ్‌ను బట్టి వీటిలో కనీసం 25 శాతానికి తక్కువ కాకుండా ఆర్బీకేల ద్వారా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నానో యూరియా వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో పాటు పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ట్రయల్‌రన్‌లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సమృద్ధిగా నానో యూరియా నిల్వలు నానానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. గతేడాది ఖరీఫ్‌లో 17 వేల లీటర్ల విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 1.25 లక్షల లీటర్ల విక్రయాలు జరిగాయి. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రబీ సీజన్ కోసం 5 లక్షల లీటర్ల నానో యూరియా బాటిల్స్‌ను అందుబాటులో ఉంచాం. ఇంకా అవసరమైతే పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
ఏపీ సీడ్స్‌కు గ్లోబల్ అగ్రి అవార్డు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా మూడేళ్లుగా గ్రామ స్థాయిలోనే రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. వ్యవసాయ రంగంలో అత్యుత్తమ విధానాలు పాటిస్తూ ఉత్పత్తి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, అదనపు విలువ జోడింపు, మౌలిక సదుపాయాలు, ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఏటా ఇండియా అగ్రి బిజినెస్ అవార్డులను ప్రదానం చేస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు ‘గ్లోబల్ అగ్రి అవార్డు–2022’ను ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను పంపిణీ చేయడంలో ఏపీ సీడ్స్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రైతులకు సేవలందించిన ప్రభుత్వరంగ సంస్థగా ఏపీ సీడ్స్‌కు గుర్తింపు లభించింది. గతేడాది స్కోచ్ సంస్థ సిల్వర్ స్కోచ్ అవార్డు అందించగా.. గవర్నన్స్ నౌ అనే అంతర్జాతీయ సంస్థ జాతీయ స్థాయిలో పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్Š (పీఎస్‌యూ) కేటగిరీలో గవర్నెన్స్ నౌ నేషనల్ అవార్డుకు ఎంపిక చేసింది. తాజాగా ఏపీ సీడ్స్‌ను గ్లోబల్ అగ్రి అవార్డు వరించింది. ఈ అవార్డును ఈ నెల 9న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును పొందిన ఏపీ సీడ్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మూడేళ్లలో 35 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు మూడేళ్లలో 50.95 లక్షల మంది రైతులకు 34.97 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా ఏపీ సీడ్స్ పంపిణీ చేసింది. రైతుల నుంచి సేకరించిన వరి, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాసం, పచ్చిరొట్ట విత్తనాలను ఏపీ సీడ్స్ సొంతంగా ప్రాసెస్ చేసి సబ్సిడీపై అందిస్తోంది. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రతి సీజన్లోనూ 20వేల శాంపిల్స్ పరీక్షించి, వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే సీజన్‌కు ముందుగా ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతోంది. మూడేళ్ల సేవలకు గుర్తింపుగా.. మూడేళ్లుగా ఏపీ సీడ్స్ రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే ఈ అవార్డు దక్కింది. ఇది నిజంగా అరుదైన గౌరవం. గతంలో విత్తనాల కోసం రోజులు, నెలల తరబడి రైతులు ఎదురు చూసేవారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న వెంటనే పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతులకు ఏపీ సీడ్స్ చేస్తున్న సేవలకు గత ఏడాది సిల్వర్ స్కోచ్, గవర్నెన్స్ నౌ అవార్డులు దక్కాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఆనందంగా ఉంది. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ -
వ్యవసాయానికి వలంటీర్లు
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విశిష్ట సేవలందిస్తున్న వలంటీర్లు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలకూ (ఆర్బీకే) అనుబంధంగా పని చేయనున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాల్లో నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. వలంటీర్ల రాకతో ఆర్బీకేలు రైతులకు మరింత చేరువకానున్నాయి. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రభుత్వ సేవలు ప్రతీ ఇంటికీ అందేలా నియమించిన వలంటీర్లు ఇప్పుడు అన్నదాతకు కూడా సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంట దిగుబడులు వచ్చాక విక్రయానికి ఇబ్బందులు పడుతున్న రైతుల అవస్థలను గుర్తించి ధాన్యం కొనుగోలులో వలంటీర్ల సేవలను వినియోగించుకోనేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ పంటల సాగు ఆధారంగా విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజి హార్టీకల్చర్ అసిస్టెంట్, విలేజి సెరీకల్చర్ అసిస్టెంట్ పని చేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్ర స్థాయిలో గడపాల్సి వస్తుంది. ప్రధానంగా పంటల సాగు సమయంలో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాలి. వీటితో పాటు మండల, సబ్‌డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసి వేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితిలో వ్యయప్రయాసలతో మండల, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాలి. ఈ సమస్యను గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల ఎంపిక జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 597 ఉండగా, అర్బన్ ప్రాంతంలో 19 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి 597 మంది, అర్బన్ ప్రాంతంలో 9 మంది వలంటీర్లను ఆర్బీకేలకు ఎంపిక చేశారు. మిగిలిన 10 మంది వలంటీర్లను ఒంగోలు 9, కనిగిరి 1 నియమించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అదికూడా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఆర్బీకేకు ఇంటరు (బయాలజీ) చదివిన వ్యక్తిని వలంటీర్లుగా ఎంపీడీవో నియమించారు. వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కూడా ఇచ్చారు. విత్తనాల పంపిణీ, డిజిటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఆర్బీకే ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. వలంటీర్లు నేరుగా రైతు వద్దనే ధాన్యం సేకరించి వారికి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు. దేశానికే రోల్‌మోడల్‌గా ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు ఊర్లోనే ఆర్బీకేల ద్వారానే అందుతున్నాయి. దీంతో అవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి. తాజాగా ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడంతో మరో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రైవేటు డీలర్లు రసాయనిక ఎరువులను అడ్డగోలుగా అధిక ధరలకు విక్రయించే వారు. ఎంఆర్పీపై రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు కావడంతో ప్రైవేటు డీలర్ల అక్రమాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. తాజాగా వలంటీర్ల నియామకంతో మరింత మెరుగైన సేవలు రైతులకు అందుతాయి. శుభ పరిణామం ప్రతి ఆర్బీకేకు వలంటీర్‌ను నియమించడం శుభపరిణామం. దీంతో సేవలు మరింత చేరువవుతాయి. అప్పటికే ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పొందుతున్నాం. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయం. వ్యవసాయ అధికారులు రైతుల పొలాలకు వచ్చి పంటలను చూసి సూచనలు, సలహాలు ఇవ్వడంతో రైతులకు మేలు జరుగుతుంది. – బీరం కృష్ణారెడ్డి, గురుగుపాడు, రైతు గొప్ప ఆలోచన రైతుల మేలు కోసం ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడం సీఎం జగన్ మంచి ఆలోచన. విలేజీ అసిస్టెంట్లు ఏదైనా పనుల నిమిత్తం బయటకు పోతే రైతులు ఇబ్బందులు పడుతారేమోనని సమస్యను ముందుగానే గుర్తించి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించడం మంచి నిర్ణయం. రైతుల సమస్యలను గుర్తించి వలంటీర్‌ను నియమించినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – వెంకటేశ్వర్లు, రైతు, మాదాలవారిపాలెం వలంటీర్లకు సమగ్ర శిక్షణ జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఆర్బీకేలకు 606 మంది వలంటీర్ల నియామకం పూర్తయింది. అర్బన్ ప్రాంతంలో ఉన్న ఆర్బీకేలకు ఇంకా 10 మంది వలంటీర్ల నియామకం పూర్తి కాలేదు. వాటిని త్వరగా పూర్తి చేస్తాం. నియామకం పూర్తైన వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై సమగ్ర శిక్షణ కూడా ఇస్తారు. ఆర్బీకే ఇన్‌చార్జ్‌లు క్షేత్ర స్థాయిలో వెళ్లిన సమయాల్లో రైతులకు వీరే అన్ని సేవలు అందించాల్సి ఉంటుంది. – ఎస్ శ్రీనివాసరావు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఒంగోలు ఆర్బీకేలో శాఖల వారీగా అందుతున్న సేవల సంఖ్య వ్యవసాయ శాఖ: 28 ఏపీఎంఐపీ: 05 మత్స్యశాఖ: 09 ఉద్యానశాఖ: 06 పశుసంవర్ధక శాఖ: 11 పట్టు పరిశ్రమ శాఖ: 08 -
AP: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన సీఎం యాప్‌ను మరింత ఆధునీకరించి రైతులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది . ఆర్బీకే కేంద్రంగా అందించే సేవల కోసం ఏపీ మార్క్‌ఫెడ్ అభివృద్ధి చేసిన సీఎం యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో రైతులతో పాటు వ్యాపారులు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది. చదవండి: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు రైతులు తాము పండించిన పంటకు మార్కె ట్లో రేట్లు, నాణ్యత తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట, ఏ సీజన్లో సాగు చేశారు, ఎప్పుడు కోతకు వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పుడు లోడింగ్ చేశారు.. ఏ గోదాములో ఎంత కాలం నిల్వ చేశారు.. కోసినప్పుడు నాణ్యత ఎలా ఉంది.. ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ సేవలను ఆర్బీకేలలో పొందే అవకాశాన్ని కల్పించారు. ఉత్పత్తులకు రంగులు సీఎం యాప్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యూఅర్ కోడ్ (సీల్) విధానం తీసుకొచ్చారు. బ్యాగ్‌పై ముద్రించే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఉత్పత్తిని ఏ ఆర్బీకే పరిధిలో ఏ గ్రామానికి చెందిన రైతు నుంచి కొన్నారో ట్రేడర్ తెలుసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఉత్పత్తికో రంగు కేటాయించారు. సాధారణ నాణ్యతకు తెలుపు, అత్యుత్తమ నాణ్యతతో ఉంటే నీలం, సేంద్రియ పంటలకు ఆకుపచ్చ రంగు కేటాయించారు. ఈ–వేలంలో కొనుగోలుదారులు వారికి కావాల్సిన ఉత్పత్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నాణ్యతను ట్రాక్ చేయవచ్చు... కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్) ఫీచర్ ద్వారా ప్రతి లాట్ నుంచి ర్యాండమ్‌గా 2 లేదా 3 బ్యాగ్‌లను ఫొటోలు తీస్తే చాలు... వాటిపై ఉండే క్యూఆర్ కోడ్‌తో వాటి నాణ్యత, పండించిన గ్రామం, ఎప్పుడొచ్చాయి, రైతు పేరు, సేకరణ తేదీ వంటి మొత్తం వివరాలు వెంటనే వస్తాయి. ఆన్లైన్, ఈ–వేలంలో పాల్గొనే వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం. ఫార్మర్ ఆప్షన్‌తో ధరల వివరాలు సీఎం యాప్‌లో కొత్తగా ఫార్మర్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, రైతు సాధికార సంస్థ, ఆయిల్ఫె డ్, నాఫెడ్ వంటి సంస్థలు కూడా వినియోగించుకునేలా ఈ యాప్‌ని అప్‌గ్రేడ్ చేశారు. యాప్ ద్వారా ప్రస్తుతం వాయిస్ అసిస్టెన్స్, ఈ–క్రాప్, ఎస్ఎంఎస్ హెచ్చరిక, ఆటో సేకరణ షెడ్యూల్, బయోమెట్రిక్, జియో ఫెన్సిం గ్, ఈ–సైన్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆటో–జనరేషన్ బిల్లు, గూగల్ మ్యాప్స్, రియల్ టైమ్ పేమెంట్ ట్రాకింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరిగేలా రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను కూడా తీసుకొచ్చారు. రసాయన అవశేషాలనూ తెలుసుకోవచ్చు సీఎం యాప్‌లో ఇకపై పంట పండించిన విధానం, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ ఆప్షన్లు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల నుంచి నేరుగా కొనవచ్చు. యాప్‌లో రైతు సాధికార సంస్థ, ప్రైవేటు ఏజెన్సీల కెమికల్ పరీక్షల రిపోర్టులను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. -
రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తుంటే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ మండిపడ్డారు. రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలను సత్వరమే అందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలతో లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘రైతుకు భరోసా ఏది’.. శీర్షికతో ప్రచురించిన వార్తను తీవ్రంగా తప్పుబట్టారు. చదవండి: Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా పలు దేశాలు రాష్ట్రంలోని ఆర్బీకేలను మోడల్‌గా తీసుకుని అమలుచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసి వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి నాణ్యమైన ఉత్పాదకాలు అందించడంతో పాటు రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని వాటి ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ♦ఆర్బీకేల ద్వారా 42.22 లక్షల మంది రైతులకు రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను, 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశాం. ♦1.5 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను కూడా అందించాం. ♦ఎరువుల లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో బస్తాకు రూ.20 ఆదా అవుతోంది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో పంపిణీ చేసిన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా ద్వారా రైతులకు రూ.27 కోట్లు ఆదా అయింది. ♦ఆర్బీకేల్లో 6,321 మంది వ్యవసాయ, 2,356 ఉద్యాన, 378 మంది పట్టు, 4 వేల మందికి పైగా పశు సంవర్థక, 756 మంది మత్స్య సహాయకులు పనిచేస్తుండగా, మిగిలిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా చర్యలు చేపట్టాం. ♦9,277 మంది బ్యాంకు సహాయకులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి గ్రామస్థాయిలోనే ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ♦ఆర్బీకేల ద్వారా 1.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను 18.18 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ♦4.75 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీచేసి రూ.3,595 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. ♦34,550 మంది రైతులతో కమ్యూనిటీ హైరింగ్ గ్రూపులను ఏర్పాటుచేసి రూ.240.67 కోట్ల సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాం. ..ఇలాంటివెన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నా ‘ఈనాడు’ పత్రిక వాటిని పట్టించుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురించడం తగదని హరికిరణ్ హితవు పలికారు. -
కేరళలోనూ ఆర్బీకే తరహా సేవలు
సాక్షి, అమరావతి/పెనమలూరు: ఏపీలోని రైతు భరోసా కేంద్రాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని, ఎక్కడకు వెళ్లినా వీటిపైనే చర్చ జరుగుతోందని కేరళ రాష్ట్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ మంత్రి చించురాణి తెలిపారు. వీటిని ఆదర్శంగా తీసుకుని కేరళలోనూ ఆర్బీకే తరహా సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తేవాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కియోస్క్ ద్వారా సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాస విత్తనాలను రైతులు ఏ విధంగా పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే డాక్టర్ వైఎస్సార్ సంచార పశువైద్య సేవ వాహనాలు, వాటి సేవలనూ పరిశీలించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో సంచార పశు వైద్య వాహనాలను ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. అనంతరం పెదపారుపూడి మండలం ఎలమర్రులోని పుంగనూరు గో జాతి పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. జాయింట్ లయబిలిటీ గ్రూపు సభ్యులతో సంభాషించారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్బీకేలను వన్ స్టాప్ సొల్యూషన్స్ సెంటర్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రతి ఆర్బీకేను రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దారని, గ్రామ స్థాయిలో పశుసంవర్ధక సహాయకులను నియమించారని చెప్పారు. -
ఆర్బీకేల తరహాలో పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు, పురుగుమందుల నుంచి యంత్ర పరికరాల వరకు రైతులకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఎన్నో సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అడుగడుగునా తోడుగా నిలవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామానికో ఆర్బీకే చొప్పున రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలోని డిజిటల్ కియోస్క్‌ల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను బుక్ చేసుకున్న గంటల్లోనే రైతుల ముంగిటకు చేరుస్తున్నారు. ధాన్యంతో సహా పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీకేలు.. నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్), వరల్డ్ బ్యాంక్, ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు అందుకున్నాయి. వివిధ దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు సైతం ఆర్బీకేలను సందర్శించి వాటి సేవలను ప్రశంసిస్తున్నాయి. తమ రాష్ట్రాలు, దేశాల్లోనూ ఆర్బీకేలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీకేల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల (పీఎంకేఎస్కే)ను తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో రైతు సమస్యలన్నింటికీ ఒకే పరిష్కార కేంద్రంగా వీటిని తీర్చిదిద్దనుంది. తొలి దశలో అక్టోబర్ 17న 864 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఏపీలో 32 కేంద్రాలను ప్రారంభించారు. గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు.. ఇటీవలే ప్రారంభించిన వన్ నేషన్–వన్ ఫెర్టిలైజర్ కింద భారత్ బ్రాండ్ పేరిట కంపెనీల రిటైల్ అవుట్లెట్ల ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ స్ఫూర్తితో నీతి ఆయోగ్, కేంద్ర బృందాలిచ్చిన నివేదిక ఆధారంగా వీటిని బహుళ ప్రయోజనాలు అందించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ షాపులన్నింటినీ ఒకే డిజైన్, రంగులు ఉండేలా తీర్చిదిద్దనుంది. గ్రామ స్థాయిలో 150 చ.అ., బ్లాక్/ సబ్ డివిజన్ స్థాయిలో 200 చ.అ., జిల్లా స్థాయిలో 2 వేల చ.అ., విస్తీర్ణంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 864 కేంద్రాలు ఏర్పాటు దేశవ్యాప్తంగా అక్టోబర్ 17న 864 కేంద్రాలను ప్రారంభించగా.. వీటిలో 32 ఏపీలో ఉన్నాయి. వీటిలో గుంటూరులో 3, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండేసి చొప్పున, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, ఏలూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. ఇక దేశవ్యాప్తంగా మొదటి దశలో నవంబర్‌లో 37,460 జిల్లా స్థాయి, 2023 జనవరిలో 1,82,126 బ్లాక్ స్థాయి, ఫిబ్రవరిలో 1,16,049 గ్రామ స్థాయి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్బీకేల తరహాలోనే సేవలు.. గ్రామ స్థాయి కేంద్రాల్లో పీవోఎస్, క్యూఆర్ కోడ్, స్కానింగ్ మిషన్లు, వ్యవసాయ మ్యాగజైన్లు, పంట సాగు ప్రణాళికలు, భూముల సారం– పంటల మ్యాపులు, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన చార్టులు ప్రదర్శిస్తారు. స్మార్ట్ టీవీలు, భూసార, విత్తన, పురుగుల మందుల పరీక్ష కిట్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, డ్రోన్లు అందుబాటులో ఉంచుతారు. ఇక జిల్లా స్థాయి, గ్రామ, బ్లాక్ కేంద్రాల్లో భూసార, విత్తన, పురుగుల మందులు, నీటి పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఏటీఎంలు, సోలార్ ఎనర్జీ ప్యానళ్లు, హెల్ప్ డెస్క్‌లు, కామన్ సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. రైతులకు సంప్రదాయ, జీవ, సేంద్రియ ఎరువులతోపాటు నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, సూక్ష్మపోషకాలు వంటివాటిని రైతులకు సరఫరా చేస్తారు. యంత్ర పరికరాలు, డ్రోన్లు అందుబాటులో ఉంచుతారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. స్మార్ట్ టీవీల ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులు ఆదర్శ రైతుల విజయగాథలు, తాజా సాంకేతికత వివరాలు అందిస్తారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా కొత్త వినూత్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, తదితర వివరాలను పంచుకుంటారు. -
ఆర్బీకేల సేవలు అద్భుతం
సాక్షి, అమరావతి/ఉయ్యూరు/గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు అద్భుతమని కేరళ అధికారులు ప్రశంసించారు. ఏపీ తరహాలోనే సమీకృత సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్)ను కేరళలో ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల వారీగా ఏపీ ప్రభుత్వం తెస్తున్న మ్యాగజైన్లతోపాటు వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను ఈ వ్యవసాయ సీజన్ నుంచి తమ రాష్ట్రంలోనూ తెస్తామన్నారు. ఈ మేరకు కేరళ వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుభాష్ సారథ్యంలో కేరళ ప్రైస్ బోర్డు చైర్మన్ డాక్టర్ రాజశేఖరన్ నాయర్, వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి సబీర్ హుస్సేన్, అదనపు సంచాలకుడు సునీల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం రాష్ట్రంలో పర్యటించింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (ఐసీసీ), ఆర్బీకే చానల్‌ను సందర్శించింది. అనంతరం ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే–2ను సందర్శించి రైతులతో భేటీ అయ్యారు. వ్యవసాయ సలహా మండళ్ల సేవలతో పాటు పొలం బడి, డిజిటల్ బ్యాంకింగ్ సేవల వివరాలను తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.. ఆర్బీకే సందర్శన తర్వాత కేరళ బృందం విజయవాడలో అధికారులతో సమావేశమైంది. గత మూడేళ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న తీరు నిజంగా అద్భుతం. టెక్నాలజీని ఇంతలా వినియోగించుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఐసీసీ ద్వారా శాస్త్రవేత్తలతో రైతులకు సాగు సలహాలు ఇప్పించడం, ఆర్బీకేల్లోని కియోస్క్‌లో బుక్ చేసుకోగానే నేరుగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇస్తున్న విధానం చాలా బాగుంది. ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న తీరు అద్భుతం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి హ్యాట్సాఫ్. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – టీవీ సుభాష్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కేరళ -
ధాన్యం సేకరణకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చురుగ్గా ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.100 పెంచింది. దీంతో క్వింటా ఏ–గ్రేడ్ రకం రూ.2,060, సాధారణ రకం రూ.2,040కు చేరింది. వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం 10,300 మంది వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. వీరికి కొనుగోళ్ల సమయంలో నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. 3,423 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం సేకరణ ఈ ఖరీఫ్‌లో 3,423 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతోంది. ధాన్యం సేకరణ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు ఆర్బీకేలను కలిపి ఒక క్లస్టర్‌గా గుర్తిస్తోంది. ఇందులో రెండువేల టన్నులకు పైగా సేకరణ ఉండే క్లస్టర్లను ఏ, 1,000–2,000లోపు ఉంటే బీ.. 1,000లోపు ఉంటే సీ కేటగిరీలుగా విభజించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా పక్కాగా 100 శాతం ఈ–క్రాప్ నమోదును పూర్తిచేశారు. వచ్చే 16 నుంచి ఈ–క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. ఇక పంట ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తోంది. రైతులే స్వయంగా గోనె సంచులు ఏర్పాటుచేసుకుంటే క్వింటాకు రూ.12.66 ఇవ్వనున్నారు. సొంతంగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటునూ కల్పించారు. ఇందుకైన రవాణా, హమాలీ ఖర్చులు మొత్తాన్ని ధాన్యం విక్రయించిన సొమ్ముతో కలిపి 21 రోజుల్లో రైతు ఖాతాలో జమచేస్తారు. ఆర్బీకే నుంచి మిల్లుకు చేరే ధాన్యం తూకంలో వ్యత్యాసం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మిల్లు వద్ద్ద ఒక కస్టోడియన్ అధికారిని కూడా నియమించారు. దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ అలాగే, ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఆయా ఆర్బీకేలకు మిల్లులను మ్యాపింగ్ చేసేవారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఈ క్రమంలో కొందరు దళారులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడేవారు. దీనిని అధిగమించేందుకు మిల్లులను జోన్లుగా విభజించారు. చివరి నిమిషంలో మాత్రమే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో చెప్పేలా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. పారదర్శకంగా కొనుగోళ్లు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రైతులకు వంద శాతం మద్దతు ధరను అందించేలా పారదర్శక విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నాం. గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగా ఏర్పాటుచేయాలని జేసీలకు సూచించాం. ఒకవేళ రైతులే వాటిని ఏర్పాటుచేసుకుంటే ఖర్చులను వారి ఖాతాల్లో జమచేస్తాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, ఏపీ పౌరసరఫరాల శాఖ మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులు ఆర్బీకేల్లో సజావుగా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తూకంలో వ్యత్యాసం పేరుతో రైతుల మద్దతు ధరకు కోత పెడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద ఒక కస్టోడియన్ అధికారిని సైతం నియమించింది. అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణలో ప్రతి ప్రక్రియను ఫొటోతీసి అప్లోడ్ చేస్తారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ఇథియోపియాకు సహకారం అందిస్తాం
సాక్షి, అమరావతి: ఇథియోపియాలో వ్యవసాయ రంగం విస్తరణకు సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందం బుధవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. ఆర్బీకేలు, సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో తాము తెలుసుకున్న విషయాలను, అనుభవాలను సీఎంకు వివరించింది. ఈ వ్యవస్థలు రైతులకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని వివరించింది. ఆర్బీకే సాంకేతికతను తమ దేశంలోనూ ప్రవేశపెట్టడానికి సహకారం అందించాలని కోరింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఏ రూపంలో ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటాం. మీ సహాయాన్ని కూడా మేము తీసుకుంటాం ’ అని చెప్పారు. ‘మీ బృందం ఆర్బీకేలను సందర్శించడం, రైతులతో మాట్లాడడం సంతోషకరం. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలందాలి. ఈ ఆలోచనతోనే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకేలో పంటల సాగును బట్టి వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పట్టభద్రులను అందుబాటులో ఉంచాం. ప్రతి ఆర్బీకేలో కియోస్క్ పెట్టాం. ఆర్డర్ పెట్టిన వెంటనే నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నాం. తద్వారా కల్తీకి అడ్డుకట్ట వేశాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం. సాగవుతున్న ప్రతి పంటను ఈ–క్రాపింగ్ చేసి ఫిజికల్, డిజిటల్ రశీదులిస్తున్నాం. మార్కెట్లో పంట ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎం యాప్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా ధరలు తగ్గితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు నష్టం రాకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీ సాకారమవుతున్నాయి. ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటాన్ని నివారించాలన్నది మరో లక్ష్యం. ఇందుకోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్న విషయాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకువస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. సీఎం జగన్‌లో దార్శనికత కనిపిస్తోంది: ఇథియోపియా మంత్రి ‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఆర్బీకేల వ్యవస్థ మమ్మల్ని చాలా ఆకట్టుకుంది. వీటికి బీజం వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో దూరదృష్టి, దార్శనికత కనిపిస్తోంది. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి’ అని ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ సీఎంతో జరిగిన భేటీలో చెప్పారు. ‘రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం, క్షేత్రస్థాయిలో మంచి మార్పులు తేవడం మమ్మల్ని అబ్బుర పరుస్తోంది. ఏపీలో ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడుగా నిలుస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాలను ఆర్బీకేలతో అనుసంధానం చేయడం చాలా బాగుంది. డిజిటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. ఆర్బీకేల విషయంలో మీ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వ్యవసాయ రంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం అందిపుచ్చుకుంటాం. మాకున్న పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను మీతో పంచుకుంటాం’ అని ఆయన చెప్పారు. అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇథియోపియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మాండెఫ్రో నిగుస్సియా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తున్న తీరు చాలా బాగుందని చెప్పారు. ఆర్బీకేల వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తోందన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేలా వ్యవసాయ రంగాన్ని ఈ వ్యవస్థ తీర్చిదిద్దుతోందని తెలిపారు. రైతుల సందేహాలు, సమస్యలు.. తదితర అంశాలన్నింటికీ క్షేత్రస్థాయిలో వన్‌స్టాప్ పద్ధతిలో పరిష్కారాలు సూచించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతోందని అన్నారు ఇతరులకూ ఈ వ్యవస్థ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. పశువుల కోసం మొబైల్ అంబులెన్సులు ఏర్పాటు కూడా బాగుందన్నారు. ఈ విధానాలను తాము కూడా అనుసరిస్తామని చెప్పారు. ఆర్బీకేల్లో అమలు చేస్తున్న డిజిటల్ సొల్యూషన్స్‌లో తమకు సహకారం అందించాలని ఇథియోపియా బృందం అభ్యర్థించగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
ఏపీలో ఆర్బీకేలు అద్భుతం
సాక్షి, అమరావతి/ఉయ్యూరు: ‘రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేము ఊహించిన దానికంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు చాలా ఇన్నొవేటివ్‌గా ఉన్నాయి. కియోస్క్ ద్వారా రైతులే నేరుగా వారికి కావల్సిన ఇన్పుట్స్ బుక్ చేసుకోవడం, సకాలంలో వాటిని అందించడం అద్భుత విధానం. ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్ కింద పరిశోధన ఫలితాలు, విస్తరణ కార్యక్రమాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లడం నిజంగా మంచి ఆలోచన. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా సేవలందిస్తున్నట్టు వినలేదు. ఈ తరహా ఆలోచన చేసిన సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాం’ అంటూ ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ గురించి తెలుసుకున్న ఇథియోపియా ప్రభుత్వం, వాటిని తమ దేశంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్బీకే వ్యవస్థ పరిశీలనకు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమీర్ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపింది. ఆ బృందం బుధవారం తొలుత గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ), ఆర్బీకే చానల్‌ను, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బీకే–2ను సందర్శించింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో రైతుల నుంచి వస్తున్న కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటున్న తీరు, అక్కడున్న శాస్త్రవేత్తలు, అధికారులు బదులిస్తున్న తీరును పరిశీలించింది. ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారో తెలుసుకుంది. గండిగుంట ఆర్బీకేలోనే రెండున్నర గంటలు ఆర్బీకేల సేవలను తెలుసుకునేందుకు ఈ బృందం గండిగుంట ఆర్బీకేలో రెండున్నర గంటల పాటు గడిపింది. రైతులతో మమేకమైంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల స్టాల్స్‌ను లకించింది. కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుక్ చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించింది. డిజిటల్ లైబ్రరీ, కొనుగోలు కేంద్రం, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రం, వెటర్నరీ అంబులెన్స్, రైతు రథం, పొలం బడి క్షేత్రం ఇలా ప్రతి ఒక్కటీ పరిశీలించి వాటి పనితీరు, సేవలను తెలుసుకుంది. వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, విధులు, బాధ్యతలపై బృందం సభ్యులు ఆరా తీసారు. మూడేళ్లుగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకేలొచ్చిన తర్వాత వ్యవసాయ అవసరాల కోసం గ్రామం విడిచి వెళ్లడంలేదని రైతులు ఈ బృందానికి వివరించారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు. శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ బృందానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం ఆర్బీకేలు నిజంగా రోల్ మోడల్‌గా ఉన్నాయని ఇథియోపియా వ్యవసాయ మంత్రి చెప్పారు. వీటి సాంకేతికతను అందిపుచ్చుకుంటామని, తమ దేశంలో కూడా ఈ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. వ్యవసాయాధార దేశమైన ఇథియోపియాలో రైతులకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. సౌత్సౌత్ కో ఆపరేషన్ సమావేశంలో భారతప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. ఈ పర్యటనలో ఇథియోఫియా బృందం సభ్యులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్, కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ పాల్గొన్నారు. -
AP: రైతు భరోసా కేంద్రాలకు ఇథియోపియా బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇథియోపియా బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ పర్యటనలో భాగంగా ముందుగా గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌ను ఇథియోపియా బృందం సందర్శించింది. తర్వాత కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే -2 కేంద్రాన్ని సందర్శించింది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం జగన్ దార్శనికత కనిపిస్తోందని ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి. ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఆర్బీకేల వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది. ఆర్బీకేల్లో వ్యవసాయరంగంలో వివిధ విభాగాల అనుసంధానం బాగుంది. డిజటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. వ్యవసాయరంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం వినియోగించుకుంటాం. అలాగే మాకున్న పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను మీతో పంచుకుంటాం. వ్యవసాయరంగంలో రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం క్షేత్రస్థాయిలో మంచి మార్పులకు దారితీయడం మమ్మల్ని అబ్బురపరుస్తోందని’’ ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కొనసాగుతుంది. ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటాం. అలాగే మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరం. ప్రతి గ్రామానికీ కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యం, దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయి. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేశాం. అదే సమయంలో రైతుకు సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం. పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవన్నీకూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం. అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలి. ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకేలో పెట్టాం. ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్‌ను, హార్టికల్చర్ సంబంధిత గ్రాడ్యుయేడ్‌ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచాం. ఆర్బీకేల్లో కియోస్క్‌ను కూడా పెట్టాం. ఆర్డర్ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నాం. తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం. ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం ఇ– క్రాపింగ్‌ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారు. ఫిజికల్ రశీదు, డిజిటల్ రశీదును కూడా ఇస్తున్నాం. పంటలకు వచ్చే ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎంయాప్‌ను కూడా వినియోగిస్తున్నాం. ఎక్కడైనా ధరలు తగ్గితే అలర్ట్ వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని రైతులకు నష్టంరాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తున్నాం. ప్రతిరోజూకూడా విలేజ్‌అగ్రికల్చర్ అసిస్టెంట్ల నుంచి పంటల ధరలపై నివేదికలు తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ విధానాలను అనుసరిస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీకూడా సాకారమవుతున్నాయి. వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాలు వచ్చేలా కృషిచేస్తున్నాం. జీవనోపాధి కోసం పట్టణాలకు వచ్చే వలసలను నివారించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా నివారించాలన్నది మరో లక్ష్యం. దీనికోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్నదానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకు వస్తాం’’ అని సీఎం అన్నారు. ఆర్బీకేల్లో డిజిటల్ సొల్యూషన్స్ విషయంలో తమకు సహకారాన్ని అందించాల్సిందిగా ఇథియోపియా బృందం కోరగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ భేటీలో ఇథియోపియా బృందంతో పాటు వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీస్టేట్ సీడ్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ జి. శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
రైతు సేవలో మరో ముందడుగు
కడప అగ్రికల్చర్: రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న నానుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేస్తున్నారు. రైతన్నలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అన్నదాతల ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన ఆర్బీకే లలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించింది. ప్రస్తు తం రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ పంటలసాగు ఆధారంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్రస్థాయిలో గడపాల్సి వస్తోంది. ప్రధానంగా పంటలసాగు సమయంలో ఈ క్రాపు బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తోంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు మండల, సబ్ డివిజన్, జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు వీరంతా హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.అలాంటి పరిస్థితిలో వ్యవ ప్రయాసాలతో మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాలలో రైతులకు నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. దేశానికే ఆదర్శంగా ఆర్బీకేలు.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక, ఎరువులు, పురుగు మందులు, పంట విక్రయాలు వంటి అన్ని రకాల సేవలు ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. దీంతోపాటు ప్రైవేటు ఎరువులు, రసాయనిక మందుల డీలర్లు అడ్డుగోలుగా అధిక ధరలకు విక్రయించేవారు. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు అయిన తర్వాత వారి ఆగడాలకు మరింత అడ్డుకట్ట పడింది. తాజాగా వలంటీర్ల నియామకంతో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లయింది. రైతులకు మరింత చేరువలో ఆర్బీకేలు.. జిల్లాలో 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 414 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్ నియామక ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇది వరకే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 414 మంది వలంటీర్లకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. డిజటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాల, పురుగు మందులు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి అన్ని కార్యక్రమాలు ఆర్బీకే ఇన్చార్జుల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. చాలా సంతోషం రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఏదైనా పనిమీద బయటకు వెళితే ఆర్బీకేలను మూసివేయాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకతప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి వలంటీర్‌ను నియమించడం సంతోషంగా ఉంది. –ఎస్. శ్రీనివాసులరెడ్డి, గోపులాపురం, రాజుపాలెం మండలం వలంటీర్లకు సమ్రగ శిక్షణ జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వలంటీర్‌ను నియమించాం. వీరికి ఆర్బీకే నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఈ శిక్షణ ప్రారంభమైంది. ఆర్బీకే ఇన్చార్జులు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సందర్భంలో రైతులకు వీరు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
AP: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం: ‘రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన వినూత్నం.. ల్యాబ్ టూ ల్యాండ్ సాంకేతికత అద్భుతం’ అంటూ ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. వ్యవసాయాధారిత దేశాలన్నీ తప్పకుండా అందిపుచ్చుకోవాల్సిన, ఆచరించాల్సిన సాంకేతికత పరిజ్ఞానం ఇదని వారు కితాబిచ్చారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ సింపోజియంలో ‘వ్యవసాయ వ్యవస్థల పరివర్తన’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్బీకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదవండి: మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్ ఏపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలపై ఆ దేశాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. సింపోజియంకు భారత్ తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ సుభాఠాకూర్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య హాజరయ్యారు. సదస్సు రెండో రోజైన శుక్రవారం మిల్లెట్ మిషన్ ఆఫ్ ఇండియాపై సుభాఠాకూర్ ప్రసంగించగా, ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, అమలుతీరుపై పూనం మాలకొండయ్య పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే.. సీఎం జగన్ ఆలోచన నుంచి పుట్టినవే.. పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యం తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలుస్తున్నారు. ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నాం. పరిశోధనా ఫలితాలను నేరుగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు (ల్యాబ్ టూ ల్యాండ్) తీసుకెళ్తున్నాం. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు చేప, రొయ్య సీడ్, ఫీడ్, పశువుల దాణాలనూ ఆర్బీకేల్లో బుక్ చేసుకున్న గంటల్లోనే రైతులకు సరఫరా చేస్తున్నాం. సాగులో మెళకువలు నేర్పుతున్నాద్దాం. ఈ–క్రాప్, ఈ–ఫిష్ బుకింగ్ ద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లతోపాటు ప్రతీ ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.17వేల కోట్లతో గ్రామస్థాయిలో మౌలిక సదు పాయాలు కల్పిస్తున్నాం’.. అని పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ప్రతినిధులు త్వరలో తమ రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆమె ఈ సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. మా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం ఇక గేమ్ చేంజర్‌గా నిలిచిన ఆర్బీకేలు అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయని ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఆర్బీకేల గురించి తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆచరింపజేసేందుకు కృషిచేస్తామన్నారు. భారత్ వచ్చేందుకు తామూ ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ అబ్దుర్ రజాక్ కూడా చెప్పారు. థాయ్‌లాండ్‌తో పాటు యూకే, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, వియత్నాం, జపాన్, సింగపూర్, హాంకాంగ్, కంబోడియా, టాంగో, కుక్, సోలోమోన్ ఐలాండ్స్ దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, శాస్త్రవేత్తలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. అట్టడుగు స్థాయికి సేవలు సూపర్ ‘ఏపీలో రైతుభరోసా కేంద్రాల ద్వారా అట్టడుగు స్థాయి రైతులకూ సమస్త సమాచారం, ప్రభుత్వం నుంచి సహకారం అద్భుతంగా అందుతున్నాయి. ఇది నిజంగా రైతులకు మంచి ఫలితాలిస్తోంది. అలాగే, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) కూడా రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం అభినందనీయం’.. అని జర్మనీలోని హాంబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు జూలియా, రాబీర్, కార్మన్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఎఫ్‌పీవోలను వారు శుక్రవారం పరిశీలించారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. తెల్లదోమ ఆశించిన కొబ్బరి ఆకుకు డ్రైకోక్రైసా బదనికల గుడ్లు ఉన్న పేపర్ అతికించే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. మన దేశంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై అధ్యయనం చేసేందుకు వారు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌పీవోలు బాగా పనిచేస్తున్నాయి జర్మనీలో సహకార వ్యవస్థ మాత్రమే ఉందని.. అదే భారత్‌లో సహకార వ్యవస్థతో పాటు ఎఫ్‌పీవోలు కూడా బాగా పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు.. వీటిని ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా నిరోధించగలదనే అంశంపై అధ్యయనం చేసేందుకు తాము వచ్చామన్నారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, ఎఫ్పీఓల ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు.. రైతుల నుంచి ప్రభుత్వానికి సమాచారం చేరడం మంచి పరిణామమని చెప్పారు. ఈ సందర్భంగా ఎఫ్పీఓల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబీ), వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు వై. ఆనందకుమారి, ఎన్.మల్లికార్జునరావు, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎలియాజర్‌లతో వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలను, సన్న, చిన్నకారు రైతులు వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ రాష్ట్ర అధికారి శ్రీకర్ దాసరి, మద్రాస్ ఐఐటీ ఇంజినీరింగ్ విద్యార్థి రుషీకా, టాటా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సోషల్ సెక్షన్ విద్యార్థి పునీత్ పాల్గొన్నారు. -
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు..
సాక్షి, అమరావతి: పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. చదవండి: అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వో కలిపి 90 శాతం ఈ–క్రాప్‌ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్ నంబర్‌కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో పంపుతున్నామని వివరించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని తెలిపారు. -
రబీ విత్తనాలకు రిజిస్ట్రేషన్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ విత్తనాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను సీజన్‌కు ముందే రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) సిద్ధంచేశారు. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు శనగ, చిరుధాన్యాల విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ రెండు జిల్లాల్లో 1,600 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధంచేశారు. మిగిలిన జిల్లాల్లో 15వ తేదీ నుంచి అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేస్తారు. రబీలో 58.67 లక్షల ఎకరాల్లో సాగు చేయాల ని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 20.78 లక్షల ఎకరాల్లో వరి, 10.43 లక్షల ఎకరాల్లో శనగ, 9.22 లక్షల ఎకరాల్లో మినుము, ఐదు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.54 లక్షల ఎకరాల్లో జొన్న, 2.52 లక్షల ఎకరాల్లో పెసలు, 2.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేయనున్నారు. ల్యాబుల్లో పరీక్షలు.. సర్టిఫైడ్ విత్తనాలు ఇక ఈ సీజన్ కోసం మొత్తం 2,22,960 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వీటిలో ప్రధానంగా శనగ 1,26,656 క్వింటాళ్లు, వేరుశనగ 48,122, వరి 20,134, మినుము 19,693, పెసలు 6,477, ఉలవలు 513, నువ్వులు 464, కందులు 87, చిరుధాన్యాలు 264, అలసందలు (కౌపీ) 14 క్వింటాళ్లతో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు 5, పిల్లిపెసర 8, జనుము 523 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేశారు. వరి, వేరుశనగ, చిరుధాన్యాలతో పాటు 60 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతుల నుంచి సేకరించి ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌లో పరీక్షించి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లుచేస్తున్నారు. రైతన్నలకు రాయితీలు.. రబీ సీజన్లో పచ్చిరొట్ట, చిరుధాన్యాలు, ఉలవలు 50శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం, మినుము, పెసలు, కందులు, అలసందలు విత్తనాలను 30 శాతం, శనగలు 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. వరి ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున, వర్తించని జిల్లాల్లో రూ.500చొప్పున విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.50.79 కోట్లు భరించనుంది. నాణ్యత ధ్రువీకరించాకే పంపిణీ రబీ సీజన్‌కు సరిపడా సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లుచేశాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత రైతులకు అందించేలా ఏర్పాట్లుచేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ -
రైతు సేవలో వలంటీర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) వలంటీర్ల సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా రైతుల సేవలో భాగస్వాములు కానున్నారు. ఆర్బీకే సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే సమయంలో రైతుల సేవల్లో అంతరాయం కలగకుండా గ్రామాల్లో చురుగ్గా పని చేసే వలంటీర్లను ఆర్బీకేలకు ప్రభుత్వం అనుసంధానించింది. రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లోనూ ఒక్కోవలంటీర్ చొప్పున కేటాయించింది. ఇంటర్లో బయాలజీ చదివిన వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ కేవైసీ నమోదులో వలంటీర్లు ఈ పంట నమోదులో ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే 100 శాతం ఈ పంట నమోదు పూర్తయ్యింది. వీఏఏ/ వీహెచ్‌ఏలు 87 శాతం, వీఆర్ఏలు 77 శాతం ఈ కేవైసీ (వేలిముద్రలు) పూర్తి కాగా, 10 శాతం రైతుల నుంచి వేలిముద్రల సేకరణ పూర్తయ్యింది. ఈ దశలో వలంటీర్లను రైతుల ఇళ్లకు పంపి వారి వేలిముద్రల నమోదులో భాగస్వామ్యం చేశారు. స్పెషల్ డ్రైవ్ రూపంలో ఈ నెల10 కల్లా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణలోనూ భాగస్వామ్యం అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ ధాన్యం సేకరణలోనూ వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఏ కేటగిరీ ఆర్బీకేలకు నలుగురు, బి, సి కేటగిరీ ఆర్బీకేలకు ఇద్దరు చొప్పున వలంటీర్లను కేటాయిస్తున్నారు. వీరిలో ఒకరు ఆర్బీకేకు అనుసంధానించిన వలంటీర్ కూడా ఉంటారు. ధాన్యం సేకరణ అసిస్టెంట్, రూట్ అసిస్టెంట్లుగా వీరి సేవలను వినియోగించుకుంటారు. కల్లాల్లోని ధాన్యం శాంపిళ్లను తీసుకొచ్చి తేమ శాతం తదితర ఐదు రకాల పరీక్షలు నిర్వహించడం, గోనె సంచులు సిద్ధం చెయ్యడం, లోడింగ్, అన్ లోడింగ్‌కు హమాలీలు, రవాణాకు వాహనాలను సమకూర్చడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడం, మొత్తం ప్రక్రియను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయడం వంటి సేవలందిస్తారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు వీరికీ శిక్షణ ఇస్తారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరికి నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. దసరా తర్వాత రెండ్రోజుల పాటు శిక్షణ ఆర్బీకే కార్యకలాపాలపై వలంటీర్లకు దసరా తర్వాత రెండ్రోజులు శిక్షణ ఇస్తారు. ఆర్బీకేలకు వచ్చే రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్పుట్స్ కోసం కియోస్క్ ద్వారా దగ్గరుండి బుక్ చేయించడం, ఆర్బీకేలకు కేటాయించే ఇన్‌పుట్స్‌ను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పంటల వారీగా శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో కూడిన వీడియోలను స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, డిజిటల్ లైబ్రరీలో ఉండే పుస్తకాలను, ఇతర సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు ఆర్బీకే ద్వారా అందించే ఇతర సేవల్లోనూ రైతులకు తోడుగా నిలిచేలా తర్ఫీదునిస్తారు. సీఎం ఆశయాల మేరకు.. నేను పల్లంట్ల 2వ వార్డు వలంటీర్‌ను. నా పరిధిలో 93 కుటుంబాలున్నాయి. ఇప్పటివరకు వారికి అవసరమైన సేవలు మాత్రమే అందిస్తున్నా. ఇప్పుడు పల్లంట్ల ఆర్బీకేకు నన్ను అటాచ్ చేశారు. రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉంది. వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సీఎం వైఎస్ జగన్ ఆశయాల మేరకు సేవలందిస్తా. – పి.సందీప్, పల్లంట్ల ఆర్బీకే, ఏలూరు జిల్లా రైతులకు తోడుగా ఉంటా ఊళ్లో ఉన్న రైతులందరికీ సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. రైతులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టే. కొత్తగా వచ్చే తెగుళ్లు, పురుగుల సమాచారాన్ని పై అధికారులకు తెలియజేసి వాటి నివారణలో రైతులకు తోడుగా ఉంటాను. –పూల అన్వర్‌బాషా, ఎర్రగుడిదిన్నె ఆర్బీకే, నంద్యాల జిల్లా ఆర్బీకే సేవలు రైతు ముంగిటకు తీసుకెళ్తా మూడేళ్లుగా వలంటీర్‌గా సంతృకరమైన సేవలందించాను. ఇప్పుడు మా ఆర్బీకే పరిధిలో రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటా. ఆర్బీకే సేవలు రైతుల ముంగిటకు తీసుకెళ్తాను. – గంగదాసు ఉషారాణి,పెద్దవరం ఆర్బీకే, కృష్ణా జిల్లా -
ఏపీలో వినూత్న ప్రయోగం.. దేశంలోనే తొలిసారిగా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్ విశేష ఆదరణతో దూసుకుపోతోంది. రెండేళ్లలోనే 1.95 లక్షల సబ్స్క్రైబర్లను, 21.50 లక్షల వ్యూయర్షిప్ను సాధించింది. రైతులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలూ చూరగొంటోంది. శాస్త్రవేత్తలతో సందేహాల నివృత్తి.. ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన సాగు విధానాలను రైతులకు చేరువ చేసే లక్ష్యంతో యూట్యూబ్‌లో ఈ చానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రసారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆర్బీకేల పరిధిలోని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు, ఎస్ఎంఎస్ల ద్వారా సబ్స్క్రైబర్లకు తెలియజేస్తున్నారు. ఈ చానల్ కోసం గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఐసీసీ కాల్ సెంటర్)లో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ చానల్ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలను తెలియజేస్తున్నారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు వివరించేందుకు రైతు గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ చానల్ ద్వారా 371 ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన 895 రైతు ప్రాయోజిత వీడియోలను అప్లోడ్ చేశారు. ఆర్బీకే 2.0 వెర్షన్, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రసారం చేసిన కార్యక్రమానికి అత్యధికంగా 87,233 వ్యూయర్షిప్ లభించింది. రైతులు ఈ చానల్ కార్యక్రమాలను వీక్షించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్‌ను కూడా సాధించింది. అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్బీకే చానల్ అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించింది. నీతి ఆయోగ్, ఐసీఏఆర్ తదితర జాతీయ సంస్థతో పాటు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్ఏవో సహా వివిధ దేశాల ప్రముఖులు ఈ చానల్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ చానల్ కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా చానల్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు కూడా చేస్తోంది. అనూహ్య స్పందన.. ఆర్బీకే చానల్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు స్వచ్చందంగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్‌తో పాటు ఆర్బీకేల్లోని డిజిటల్ స్టూడియో ద్వారా ప్రసారాలను వీక్షిస్తున్నారు. శాస్త్రవేత్తలు, అధికారులతో మాట్లాడుతూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. – వల్లూరి శ్రీధర్, జేడీఏ, ఆర్బీకేల ఇన్చార్జి ఎంతో మేలు.. సాగు సమయంలో ఎప్పుడు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ తెగులు నివారణకు ఏం చేయాలనే వాటి గురించి ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలిస్తున్న సూచనలు బాగా ఉపయోగపడుతున్నాయి. పంటల బీమా, రైతు భరోసా, యంత్ర సేవ పరికరాలు, ఇతర సంక్షేమ పథకాల గురించి కూడా ఈ చానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. – కొండవీటి కిశోర్, విప్పర్ల రైతు, పల్నాడు జిల్లా -
ఆర్బీకేలు ఆధునిక దేవాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఆధునిక దేవాలయాలుగా మారాయని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బుధవారం ‘వ్యవసాయం–అనుబంధ రంగాలు’ పై స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను వ్యవసాయాన్ని పండుగ చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. డ్యాములు కళకళలాడుతున్నాయి. కరువు లేదు. చంద్రబాబు హయాంలో కరువు తప్ప ఇంకోటి లేదు. విత్తు దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సీఎం జగన్ రైతుకు భరోసా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టేందుకు అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మా ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపి మార్కెట్‌కంటే ఎక్కువ రేటుకే కల్లాల వద్దే ధాన్యం కొంటోంది. కోళ్ల పరిశ్రమ, ఆక్వా, సెరీకల్చర్ ఇలా అన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకుంటోంది. వ్యవసాయం అంటే బాబుకు నిర్లక్ష్యం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నాడు వైఎస్సార్ వ్యవసాయానికి ఊపిరి పోస్తే.. ఆయన తనయుడిగా సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు కట్టలేదని రైతులపై కేసులు పెట్టారు. ఎంతో మంది పల్లెలను వదిలి వలస వెళ్లిపోయారు. వారిని వైఎస్సార్ వెనక్కి తీసుకొచ్చి వ్యవసాయం చేయించారు. ఆయన ఆశయ సాధనకు సీఎం జగన్ రైతులపై రూపాయి భారం పడకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారు. 30 ఏళ్ల పాటు ఆటంకం లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగును పెంచాలి. ప్రకృతి వ్యవసాయంపైనా దృష్టి సారించాం. బాబు ఐదేళ్లలో ఒక్క గింజ కూడా కొనలేదు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రైతును మోసం చేసే వాడు భూమిపై బతికి బట్టకట్టలేడు. ఆనాడు చంద్రబాబు రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు. వ్యవసాయం దండగ అన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అందువల్లే ఆయనకు ఈ దుర్గతి పట్టింది. సీఎం జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మా దగ్గర ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదు. ఇప్పుడు మా ప్రాంతంలో రైసు మిల్లులు లేకపోయినా ధాన్యం కొని, రాయదుర్గం నుంచి చిత్తూరుకు ప్రభుత్వమే తరలిస్తోంది. మా దగ్గర ఆదర్శ భారత కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కువ లోన్లు ఇస్తున్నారు. వాటికి వడ్డీ రాయితీ రావట్లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని కోఆపరేటివ్ సొసైటీలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. రైతుల సంక్షేమం ఆగదు మాజీ ఉప సభాపతి కోన రఘుపతి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు ఆగలేదు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఒక చరిత్ర. ఒక్క రూపాయికే పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 3 వేల కోట్లు ఇవ్వడం వంటివి రైతుల గురించి ఆలోచించే వారే చేస్తారు. కోవిడ్ సమయంలోనూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. చంద్రబాబు రూ.88 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగా చేశారు. మా సీఎం జగన్ రైతు భరోసాతో వ్యవసాయానికి ఊపిరి పోశారు. ఆర్బీకేల ద్వారా 98 శాతం పంట నమోదు, విక్రయం జరుగుతోంది. పక్క రాష్ట్రాల వారు వచ్చి మన ఆర్బీకేల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆర్బీకేలను బ్యాంకులతో అనుసంధానం చేసి రైతులకు ఆర్థిక సపోర్టును మరింత పెంచాలి. ఉచిత విద్యుత్ రైతులకు వరం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైఎస్సార్ హయాంలోనే రైతుల స్వర్ణ యుగం ప్రారంభమైంది. వైఎస్సార్ తర్వాత రైతులను పట్టించుకున్న నాయకుడు సీఎం జగన్. రైతుల కోసం ఈ మూడేళ్లలో చరిత్రలో లేనన్ని పథకాలు తెచ్చారు. ఆర్బీకేలు ప్రతి గ్రామంలో ఆధునిక దేవాలయాలుగా మారాయి. పశువులకు అంబులెన్సులు వచ్చాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏరా>్పటు చేసి సాగులో మెళకువలు నేర్పుతున్నారు. గతంలో కంటే ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. -
ఏపీ: సాగుకు దన్ను
ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్స్ తీసుకొస్తున్నాం. వీటి వల్ల పురుగుల మందులు పిచికారీ వేగవంతమవుతుంది. నానో ఫెర్టిలైజర్స్‌ను ప్రోత్సహించవచ్చు. వచ్చే రెండేళ్లలో ఆర్బీకే స్థాయిలో 2 వేల డ్రోన్స్ తీసుకొచ్చే ఆలోచనతో అడుగులు వేస్తున్నాం. వీటి కోసం గుర్తించిన రైతు కమిటీల్లో ఒకరికి డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తాం. ఒక్కో డ్రోన్ కోసం రూ.10 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ప్రతి ఆర్బీకే పరిధిలో మార్చి–ఏప్రిల్ నాటికి భూసార పరీక్షలు చేసి, సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తూ సాయిల్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తద్వారా ఏ పంటకు ఏ ఎరువు ఎంత వేయాలో ప్రతి రైతుకు అవగాహన వస్తుంది. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కరువే.. 2014లో 238 మండలాలు, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో 257 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం చూశాం. అందుకే చంద్రబాబు పాలన విషయంలో ఒక నానుడి ఉంది. కరువు–బాబు ఇద్దరూ కవల పిల్లలు అంటారు. ఈ 40 నెలల పాలనలో ఏ ఒక్క ఏడాది ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం మూడున్నరేళ్లలోనే అమలు చేశాం. గ్రామ స్థాయిలో స్పష్టమైన మార్పు కన్పించేలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతన్నకు తోడుగా నిల్చుని చేయి పట్టుకొని నడిపిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చామో గమనించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన బుధవారం వ్యవసాయం–అనుబంధ రంగాలపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, దొరువులు, కాలువలు, వాగులు, వంకలు, నదులు.. అన్నింటిలో నీరు పుష్కలంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని వంశధార, నాగావళి.. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా.. నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న అద్భుత ఘట్టాన్ని చూస్తున్నామని చెప్పారు. కృష్ణ, గోదావరి డెల్టాతో పాటు రాయలసీమకు కూడా సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ద్వారా అత్యధికంగా నీరు ఇచ్చింది ఈ మూడేళ్లలోనే అని స్పష్టం చేశారు. సగటున భూగర్భ జలాలు వర్షా కాలం తర్వాత 2018లో 12.65 మీటర్లు..అంటే దాదాపు 42 అడుగుల లోతులో ఉంటే.. 2021లో 5.78 మీటర్లు.. అంటే 19 అడుగులకే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 40 నెలల్లో రూ.1.28 లక్షల కోట్ల లబ్ధి ► ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ 40 నెలల కాలంలో రైతన్నల కోసం వ్యవసాయ రంగంపై మనం చేసిన ఖర్చు రూ.1,28,634 కోట్లు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇస్తున్నాం. ► రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్ఒఎఫ్ఆర్, దేవుడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. నాలుగవ ఏడాది ఖరీఫ్ సీజన్లో తొలివిడత సాయం ఇప్పటికే అందజేశాం. అక్టోబర్‌లో రెండో విడత సాయం అందజేస్తాం. మూడేళ్లలో 52.38 లక్షల రైతున్నలకు రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం అందించాం. ► ఈ మూడేళ్లలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చింది. ఐదేళ్ల చంద్రబాబు పాలనతో పోలిస్తే సగటున 13.29 లక్షల టన్నులకు పెరిగాయి. 2014–19 మధ్య సగటున 154 లక్షల టన్నులుంటే ఈ మూడేళ్లలో 167.24 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది అంతకంటే ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రైతులే కాదు.. రైతు కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారని ఈ దిగుబడులే చెబుతున్నాయి. గత ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తున్నాం ► గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రీమియం మొత్తం ఇన్‌స్రూ?న్స్ కంపెనీలకు 2012–13కు సంబంధించి రూ.120 కోట్లు, 2018–19కి సంబంధించి రూ.596.40 కోట్లు.. మొత్తం రూ.716 కోట్లు మనం చెల్లించాం. ► ఇప్పుడు రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక ప్రభుత్వం మనదే. సీజన్ ముగియకుండానే పంటల బీమా అందిస్తున్నాం. మూడేళ్లలో 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్లు పరిహారం ఇచ్చాం. ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులకు బీమా రక్షణ కలి్పస్తున్న ప్రభుత్వం ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ నమోదు ఎలా చేస్తున్నారో తెలుసుకొని దేశమంతా అమలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ► ఈ క్రాప్‌లో నమోదు చేసుకొని రూ.లక్ష వరకు పంట రుణం తీసుకొని.. ఏడాదిలోగా తిరిగి చెల్లించిన ప్రతి రైతన్నకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీని అందిస్తున్నాం. బాబు పెట్టిన బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల రైతులకు రూ.1,282.11 కోట్ల వడ్డీ రాయితీ అందించాం. 2020–21 సీజన్‌తో పాటు ఖరీఫ్–2021కు సంబంధించి వడ్డీ రాయితీని ఈ నవంబర్‌లో జమ చేయబోతున్నాం. టీడీపీ హయాంలో అటకెక్కించిన మరో పథకం సున్నా వడ్డీ పంట రుణాల పథకం. ఈ పథకం కింద 2014 నుంచి 2019 వరకు 39.05 లక్షల మంది రైతులకు బకాయి పెట్టిన రూ.784.71 కోట్ల సున్నా వడ్డీ సొమ్ము మనం చెల్లించాం. సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం ► ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. ఇందుకోసం రూ.2 వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేశాం. ► 2020 ఖరీఫ్ నుంచి ఇప్పటి వరకు 16.67 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 12.15 లక్షల రైతులకు రూ.932.07 కోట్లు అందించాం. 2021 సెప్టెంబర్‌లో గులాబ్ తుఫాన్ వల్ల 35 వేల ఎకరాల్లో పంటను కోల్పోయిన 28 వేల మంది రైతులకు కేవలం 45 రోజుల్లోనే రూ.22 కోట్లు ఇచ్చాం. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల 10.10 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయిన 5.97 లక్షల రైతన్నలకు 90 రోజుల్లోనే రూ.542.09 కోట్లు అందించాం. ► అంతకు ముందు 2019–20లో పలు ప్రకృతి వైపరీత్యాల వల్ల 1.83 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 1.47 లక్షల మంది రైతులకు రూ.116.63 కోట్లు పెట్టుబడి రాయితీగా ఇచ్చాం. ఇలా మూడేళ్లలో వివిధ రకాల వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 20.85 లక్షల రైతన్నలకు రూ.1,795.39 కోట్లు అందజేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.430 కోట్లు మనమే చెల్లించాం. ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పులు ► ఆర్బీకేల ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వీటిలో 24,424 మంది గ్రాడ్యుయేట్లు, డిప్లమో హోల్డర్స్ గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, మత్స్య సహాయకులుగా పని చేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలను రైతుల చెంతకు తీసుకెళ్లేందుకు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేలతో అనుసంధానించాం. ► నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, యూఎన్ (ఐక్యరాజ్యసమితి)కు చెందిన ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు మన ఆర్బీకేలను చూసి ప్రశంసిస్తున్నాయి. ల్యాబ్ టూ ల్యాండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్.. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విప్లవాత్మక మార్పులను రైతులకు పొలాల వద్దకు చేరవేసే ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ► ఆర్బీకేల పరిధిలో గోదాములు, ప్రైమరీ ప్రొసెసింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, జిల్లా స్థాయిలో సెకండరీ ప్రొసెసింగ్ యూనిట్లు తీసుకొస్తున్నాం. వీటికోసం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► ఉత్పత్తుల నాణ్యతను తెలుసుకునేందుకు నిర్ధారించుకునేందుకు వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చాం. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13 ల్యాబ్స్‌తో పాటు మరో 4 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 70 ల్యాబ్‌ల సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ► వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతు కమిటీకి 40 శాతం సబ్సిడీపై యంత్రాలను అందిస్తున్నాం. వాటిని ఆ కమిటీలోని రైతులతో పాటు ఆర్బీకే పరిధిలోని మిగిలిన రైతులకు తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమమిది. ► 10,778 ఆర్బీకేల్లో రూ.15 లక్షల విలువైన సీహెచ్‌సీలు, వరి ముఖ్య పంటగా ఉన్న 1615 మండలాల్లో కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన రూ.25 లక్షలతో క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రూ.691 కోట్లు ఖర్చుచేసి ఆర్బీకే స్థాయిలో 6,781, క్లస్టర్ స్థాయిలో 391 కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ ఇతర వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశాం. -
ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జిలు
సాక్షి, అమరావతి: పంట కొనుగోళ్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళారీలు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గత వ్యవసాయ సీజన్ నుంచి ధాన్యంతో పాటు అన్ని రకాల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలుచేస్తున్నారు. ఖరీఫ్‌లో రూ.7859.30 కోట్ల విలువైన 40.38 లక్షల టన్నులు, రబీలో రూ.5245.23 కోట్ల విలువైన 26.98 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా. రైతన్నలు నష్టపోకుండా... ధాన్యంలో తేమ శాతాన్ని ఆర్బీకేల్లో ప్రస్తుతం మాయిశ్చర్ మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. కొనుగోలు తేదీలను రైతులకు వెల్లడిస్తూ గన్నీ బ్యాగ్‌లు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ సమయానికి రైతులు ధాన్యాన్ని గోతాల్లో నింపి కల్లాల వద్దే తూకం వేసి ఆర్బీకే పరిధిలోని రైసు మిల్లులకు తరలిస్తున్నారు. అయితే కల్లాల వద్ద రైతు వేసిన తూకానికి, మిల్లువద్ద వేసే తూకానికి వ్యత్యాసం వస్తోంది. కల్లాల వద్ద వెయ్యి కిలోలున్న ధాన్యం బస్తాలు మిల్లు వద్ద తూకం వేస్తుంటే 900–950 కేజీలే ఉన్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసి రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర లభించాలన్న సంకల్పంతో అవసరమైన చోట ఆర్బీకేల వద్ద వేబ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యేలోగా తొలిదశ వే బ్రిడ్జిల ఏర్పాటుకు అధికారుల సిద్ధమయ్యారు. ఐదు సెంట్ల స్థలంలో.. ఒక్కో వే బ్రిడ్జికి ఐదు సెంట్ల స్థలం అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు స్థలాలు అందుబాటులో ఉన్న ఆర్బీకేలకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు చెందిన 28 గోదాముల వద్ద ఇప్పటికే వే బ్రిడ్జిలుండగా కొత్తగా మరో 35 గోదాముల వద్ద వే బ్రిడ్జిల నిర్మాణానికి అనువైన స్థలాలున్నట్లు గుర్తించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రెండు గోదాములతో పాటు 16కిపైగా వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల వద్ద కొత్తగా వే బ్రిడ్జిలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో కనీసం 40 ఆర్బీకేల పరిధిలో కొత్తగా వే బ్రిడ్జిల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తమ్మీద 93 చోట్ల కొత్తగా వే బ్రిడ్జిల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్బీకేల పరిధిలో వీలైనంత మేరకు మరిన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ నాటికి సిద్ధం! 60 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కో వే బ్రిడ్జి కోసం రూ.19.95 లక్షలు వ్యయం కానుందని అంచనా. ఈ మొత్తంతో 9 గీ 3 మీటర్ల పిట్‌లెస్ టైప్ వే బ్రిడ్జి, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, యూపీఎస్, సిబ్బంది ఉండేందుకు వీలుగా ఎంఎస్ క్యాబిన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌కల్లా వీటిని అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు జరుగుతోంది. -
దేశానికే ఏపీ రోల్‌మోడల్
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించడంలో ఏపీ ప్రభుత్వం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ (నాస్) ప్రెసిడెంట్ టి.మహోపాత్ర ప్రశంసించారు. జాతీయ స్థాయిలో ఏపీ మోడల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు. నాస్ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మోడల్స్’ అనే అంశంపై న్యూఢిల్లీలో సోమవారం జరిగిన జాతీయ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు ఆలోచనే ఓ అద్భుతమన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, గోదాములు, శీతలీకరణ గదులు, కలెక్షన్ సెంటర్లతోపాటు నియోజకవర్గ స్థాయిలో అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. వీటిని జాతీయ స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు కేంద్రానికి నివేదిక సమర్పిస్తామన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ ఆర్బీకేల సాంకేతికత పట్ల విదేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో అమలుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీ తరహాలో సర్టిఫై చేసిన ఇన్పుట్స్ పంపిణీ, ప్రభుత్వ సేవలు, రైతు శిక్షణ కార్యక్రమాలు, పంట కొనుగోళ్లు గ్రామ స్థాయిలో చేపడితే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏకే సింగ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంతో ఐసీఏఆర్ కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఆర్బీకేల బలోపేతానికి ఐసీఎఆర్ చేయూతనిస్తుందన్నారు. సీఎం ఆలోచనల నుంచే ఆర్బీకేలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. వర్క్‌షాపులో ఆర్బీకే సేవలపై ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకే కాకుండా ఆక్వా, మత్స్యసాగు చేసే రైతులు, పాడి రైతులకు కూడా సేవలందిస్తున్నామన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ విధానాల ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అం దేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతులకు అందిస్తున్నామన్నారు. రైతుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను గ్రామ స్థాయిలోనే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సర్టిఫై చేసిన ఇన్పుట్స్ పంపిణీ కోసం నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌తో పాటు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.కార్యక్రమంలో జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మనీష్ సి.షా, నాస్ కార్యదర్శి డాక్టర్ పీకే జోషి, నాబార్డు సీజీఎం సీఎస్ఆర్ మూర్తి, మేనేజ్ డైరెక్టర్ జనరల్ పి.చంద్ర శేఖర, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించనుంది. ఇందుకోసం ప్రతీ ఆర్బీకేకు ప్రత్యేకంగా ఒక వలంటీర్‌ను నియమిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్లను ఎంపికచేసి వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను వీటి ద్వారా గ్రామస్థాయిలోనే అందిస్తోంది. ఆర్బీకేల్లో 14,435 మంది సేవలు ప్రతీ ఆర్బీకేకు ఒక వ్యవసాయ, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులను నియమించింది. వీటిల్లో ప్రస్తుతం 14,435 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరిలో 6,321 మంది గ్రామ వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్థక, 731 మంది మత్స్య, 375 మంది పట్టు సహాయకులు ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్యను బట్టి ప్రతీ ఆర్బీకేలో ఒక వ్యవసాయ, ఉద్యాన, మత్స్య సహాయకుల్లో ఒకరు ఇన్చార్జిగా ఉంటారు. స్థానికంగా ఉన్న పాడి, పట్టు విస్తీర్ణాన్ని బట్టి ఆయా సహాయకులు కూడా సేవలు అందిస్తున్నారు. ఇలా మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఒక బ్యాంకింగ్ కరస్పాండెం ట్ను కూడా అనుసంధానించారు. సిబ్బందిలేని వేళ ఇబ్బంది లేకుండా.. సాధారణంగా ప్రతిరోజు ఉ.7 నుంచి 9 గంటల వరకు, తిరిగి సా.3 నుంచి 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన సమయాల్లో పంటల నమోదు (ఈ–క్రాప్)తో పాటు రైతులకు అందించే వివిధ రకాల సేవల కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంటారు. దీంతో ఆయా సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేక ఆర్బీకేలకు వచ్చే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్బీకేలు తెరిచి ఉంచడమే కాదు.. రైతులు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆర్బీకేకి ఒకరు చొప్పున వలంటీర్లను అనుసంధానం చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ సగిలి షాన్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. వ్యవసాయ శాఖ అభ్యర్థన మేరకు గ్రామాల్లో చురుగ్గా పనిచేస్తూ సేవాతత్పరత కలిగిన వలంటీర్‌ను ఎంపిక చేయాలన్నారు. ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ ఎంపికైన వలంటీర్లకు మండల వ్యవసాయ శాఖాధికారులు, జిల్లా రిసోర్స్ సెంటర్ సిబ్బంది ద్వారా ఆర్బీకే కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు ఆర్బీకేలకు వచ్చే రైతులతో మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను కియోస్క్ ద్వారా బుక్ చేయించడం, గోడౌన్ల నుంచి వచ్చే ఇన్‌పుట్స్‌ను తీసుకుని స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం, సాగు సలహాలకు సంబంధించిన వీడియోలను రైతులకు స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, ఇతర సేవలపై తర్ఫీదు ఇస్తారు. నిరంతర సేవలే లక్ష్యంగా.. అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండాలి. సిబ్బంది లేని పక్షంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేకు ఒక గ్రామ వలంటీర్‌ను అనుసంధానం చేస్తున్నాం. వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నాం. ఈ నెల 20 నుంచి వారి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ (అగ్రికల్చర్), ఆర్బీకేల ఇన్చార్జి -
రైతుకు యంత్రాల దన్ను
ఈ ఏడాది 7,13,150 మంది రైతులకు టార్పాలిన్లు, వ్యక్తిగత యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు.. 20 శాతం మిగిలిన వర్గాల వారికి ఇవ్వాలి. అవసరమైన చోట భూ విస్తీర్ణాన్ని బట్టి పరికరాలు పంపిణీ చేయాలి. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ కేంద్రాల్లోని పరికరాలు, యంత్రాలన్నీ రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలి. ఎలాంటి పరికరాలు, వాటి అద్దె, ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో తెలిపే సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. రైతు గ్రూపులే కాదు.. ఆయా గ్రామాల్లోని రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 10,750 ఆర్బీకేలు ఉండగా, ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ ఉప కరణాల పంపిణీ పూర్తి చేశామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో 1,615 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని సంకల్పించగా, ఇప్పటికే 391 చోట్ల హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.690.87 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేయగా, ఇందులో సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లను ప్రభుత్వం అందించిందని వివరించారు. కాగా, మిగిలిన 4,225 ఆర్బీకేల్లో కూడా యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీ ఏర్పాటుకు 2022–23కు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,325 కోట్లు ఖర్చు చేయనుందని, ఇందులో వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం రూ.910 కోట్లు వెచ్చిస్తుందన్నారు. ఇందులో ప్రభుత్వం రూ.1,014 కోట్లు సబ్సిడీ భరిస్తుందని తెలిపారు. రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు, ఇతర యంత్రాలు, వ్యక్తిగత ఉపకరణాలను దశల వారీగా అందించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సత్వరమే అగ్రి ఇన్ఫ్రా పనులు ► అగ్రి ఇన్ఫ్రా కింద చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌లతో పాటు గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి. ► ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం వైఎస్సార్ చేయూత ద్వారా వారి సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలి. చేయూత పథకం కింద లబ్ధి పొందే వారికి పాడి పశువులు పంపిణీ చేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల్లో వారిని భాగస్వాములను చేయాలి. ► అమూల్, అలానా తదితర కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా చేయూత లబ్ధిదారులైన మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలి. ఇందులో భాగంగా పశువుల పెంపకానికి మరింత ప్రోత్సాహం అందించాలి. మేకలు, గొర్రెల పెంపకానికి అవసరమైన సహకారం అందించాలి. ఈ ప్రక్రియ నిరంతం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. మరింతగా పాల సేకరణ ► ప్రస్తుతం రాష్ట్రంలో 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్ సంస్థ ఇప్పటి వరకు 419.51 లక్షల లీటర్ల పాలు సేకరించింది. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజూ 1.03 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు రూ.179.65 కోట్ల చెల్లింపులు జరిగాయి. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే అదనంగా రూ.20.66 కోట్ల మేర పాడి రైతులు లబ్ధి పొందారు. ► అమూల్ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి పొందగలిగారు. ఈ నేపథ్యంలో అమూల్ ద్వారా పాల సేకరణను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి. ► అమూల్ పాల సేకరణ వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో భాగంగా ఫేజ్–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్ఎస్ శ్రీధర్, కే కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అహ్మద్ బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ధాన్యం సేకరణలో వలంటీర్లకు భాగస్వామ్యం మిల్లర్ల పాత్ర లేకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ దశలోనూ మిల్లర్లు జోక్యం చేసుకోకుండా చూడాలన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణతో రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు వివరించగా, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు. -
ఆర్బీకేలు అద్భుతం
తిరుపతి రూరల్: రైతులకు గ్రామ స్థాయిలోనే సంపూర్ణ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని తమిళనాడుకు చెందిన వ్యవయసాయాధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. తమిళనాడుకు చెందిన సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ మురళీధరన్ ఆధ్వర్యంలో 35 మంది డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వ్యవసాయాధికారుల బృందం ప్రత్యేక బస్సులో మంగళవారం తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే), చంద్రగిరిలోని నియోజకవర్గ వ్యవసాయ పరిశోధన ల్యాబ్‌ను సందర్శించింది. ఆర్బీకేలో అందిస్తున్న సేవలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ఉపయోగించే డిజిటల్ కియోస్క్‌ల ఉపయోగాలను పరిశీలించింది. వారికి వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, ఏడీ సుబ్రమణ్యంలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ ఒకే గొడుగు కింద రైతులకు అన్ని రకాల సేవలను అందించడంలో ఆర్బీకేలు అక్షయ పాత్రలుగా పనిచేస్తున్నాయని కొనియాడారు. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతలకు విప్లవాత్మక సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ముఖ్యంగా ఆర్బీకే స్థాయిలోనే ప్రతి నెలా వ్యవసాయ సలహా కమిటీ సమావేశాలు నిర్వహించి, రైతులకు సంబంధించి సమగ్రంగా చర్చించుకునే విధానం అనుసరణీయమన్నారు. ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన ల్యాబ్‌ల వల్ల కలిగే ప్రయోజనాలపై తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మురళీధరన్ వెల్లడించారు. -
ఆర్బీకేలతో రైతుకు ఎంతో మేలు: నీతి ఆయోగ్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ రమేష్ చంద్ చెప్పారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరైన ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, దాని ఆవశ్యకత, అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని, వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో రైతుల కోసం ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని పూనం మాలకొండయ్య వివరించారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని నాలెడ్జ్ హబ్‌లుగా, వన్‌స్టాప్ సెంటర్లుగా కూడా తీర్చిదిద్దామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులతోపాటు ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. పొలం బడులు, తోట, పట్టు, పశువిజ్ఞాన, మత్స్య సాగుబడుల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందిస్తున్నామన్నారు. స్పెషల్ సీఎస్ చెప్పిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా విన్న వివిధ రాష్ట్రాల అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆర్బీకే విధానం తమ రాష్ట్రాల్లో అమలుకు కృషి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఏపీలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం రమేష్ చంద్ మాట్లాడుతూ.. తాను స్వయంగా ఆర్బీకేలను పరిశీలించానని, వాటి సేవలు బాగున్నాయని తెలిపారు. వీటిని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ సేవలు అద్భుతమని కొనియాడారు. కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రమోద్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బాబు ‘అప్పు’డే లెక్క తప్పారు -
తెలంగాణలోనూ ‘ఆర్బీకే’ తరహా సేవలు!
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం గురువారం ఏపీలో పర్యటించబోతోంది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం.. గుంటూరు జిల్లాలోని ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, మినుము ప్రాసెసింగ్ యూనిట్, అరటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో కూడా ఏపీలోని పలుప్రాంతాల్లో పర్యటించి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలను పరిశీలించారు. తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌తో పాటు ఆర్బీకే చానల్ తరహాలో ఓ అగ్రి చానల్‌ను ప్రారంభిస్తామని నిరంజన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అలాగే ఆర్బీకేల్లోని కియోస్క్‌లను తెలంగాణలోని రైతు వేదికల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం చేరుకొని.. అరటి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి రైతు లతో మాట్లాడుతారు. అనంతరం తెనాలిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. తర్వాత అంగలకుదురులోని ఆర్బీకేను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఏటుకూరు సమీపంలోని బొంత పాడు రోడ్లో ఉన్న మినుము సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలిస్తారు. -
ఆర్బీకేలు అద్భుత ఆవిష్కరణలే
సాక్షి, అమరావతి/అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఆవిష్కరణలు అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ బ్యాంకు సీనియర్ కన్సల్టెంట్ (అగ్రికల్చర్, ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్) హిమ్మత్ పటేల్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు సేవలందించే ఆర్బీకేలు ఎంతో వినూత్నంగా ఉన్నాయని ప్రశంసించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ దేశాలన్నీ వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రప్రభుత్వ సిఫార్సు మేరకు ఆర్బీకే తరహా వ్యవస్థ ఏర్పాటుకు ఆఫ్రికాలోని ఇథియోపియా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హిమ్మత్ పటేల్ రాష్ట్రంలో పర్యటించి వీటి పనితీరును స్వయంగా పరిశీలించారు. మంగళవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కిసాన్ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను సందర్శించారు. పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే వద్ద రైతులు వినియోగించుకుంటున్న సేవలను పరిశీలించారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచుకునేం దుకు ఇథియోపియా సహకారం కోరిన సమ యంలో ఏపీలో ఆర్బీకేలు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో రైతులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. ఇంత టెక్నాలజీ ఎక్కడా లేదు.. ‘ఆర్బీకేలు వన్‌స్టాప్ సెంటర్‌గా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాల సేవలు గ్రామ స్థాయిలో అందించడంపై మాకున్న సందేహాలు ఇక్కడకు వచ్చాక పటాపంచలయ్యాయి. ఆర్బీకేల ద్వారా నిజంగా అద్భుతమైన సేవలందిస్తు న్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ని ఇంత బాగా వినియోగిస్తున్న ప్రభుత్వం బహుశా మరెక్కడా లేదు. ఈ తరహా సేవలను వ్యవసాయ ఆధారిత దేశాలన్నీ అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఏపీలో పర్యటించి రాష్ట్ర ప్రభు త్వంతో ఎంవోయూ కుదుర్చుకోనుందని వెల్లడించారు. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసే రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులు నివృత్తి చేస్తున్న తీరును హిమ్మత్ పటేల్ పరిశీలించారు. వణుకూరు ఆర్బీకేలో కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుకింగ్ చేస్తున్న తీరును పరిశీలించారు. వైఎస్సార్ సంచార వెటర్నరీ అంబులెన్స్ పనితీరును గమనించారు. ఘంట సాలలోని కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) సందర్శించారు. సీఎం జగన్ కృషి అభినందనీయం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకుని దూరదృష్టితో ఆర్బీకేలను ఏర్పాటు చేశారని, ఆయన కృషి అభినందనీయమని హిమ్మత్ పటేల్ ప్రశంసించారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకందిస్తున్న సేవలను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వివరిం చారు. శాఖల వారీగా అందిస్తున్న సేవలను వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాల కొండయ్య, స్పెషల్ కమిషనర్ హరికిరణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీ చిరంజీవి చౌదరి, ఉద్యాన, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, కె.కన్నబాబు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ Ôశేఖర్‌బాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, స్టేట్ ఆర్బీకేల ఇన్చార్జి శ్రీధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం విత్తనాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానికంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న సీఎస్హెచ్–24 జొన్న రకం పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 శాతం సబ్సిడీపై 1,503.87 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా స్థానికంగా ఉన్న పశు సంపద, డిమాండ్ ఆధారంగా ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. 20 సెంట్ల నుంచి ఎకరం వ్యవసాయ పొలం కలిగిన సన్న, చిన్నకారు రైతులకు 5 నుంచి 20 కిలోల వరకు సరఫరా చేయనున్నారు. మార్కెట్లో ఐదు కిలోల ప్యాకెట్ విలువ రూ.436.75 ఉండగా, ప్రభుత్వం రూ.327.55 సబ్సిడీగా భరిస్తుంది. రైతు కేవలం రూ.109.20 చెల్లిస్తే చాలు. వర్షాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ విత్తనం చల్లుకుంటే మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఆరేడు పశువులకు కనీసం ఆరు నెలలపాటు పశుగ్రాసానికి లోటు లేకుండా అందించవచ్చు. వీటిలో అత్యధికంగా 8–10 శాతం వరకు మాంసకృత్తులతో పాటు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆసక్తి గల రైతులు సమీప ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా బుక్ చేసుకుని సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తం చెల్లిస్తే 24 గంటల్లోనే సరఫరా చేస్తారు. ఆర్బీకేల్లో సంప్రదించండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. అర్హత, ఆసక్తి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆర్బీకేల్లోని పశుసంవర్థక సహాయకులను సంప్రదించండి. నాణ్యమైన సీఎస్హెచ్–24 విత్తనాన్ని తీసుకొని అదును దాటిపోకుండా నాటుకోవాలి. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్థక శాఖ -
ఏపీకి ప్రపంచ బ్యాంక్ బృందం రాక
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది. ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్ బ్యాంక్‌లోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ కన్సల్టెంట్ హిమ్మత్ పటేల్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు. -
పండ్లు, కూరగాయల నష్టాలకు ఇక చెక్
సాక్షి, అమరావతి: రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలకు కోత అనంతరం నష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్బీకేల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఉద్యాన పంటలు పండించే ప్రాంతాల్లో ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో నిర్మించిన ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి కాకాణి ప్రారంభించారు. 75 శాతం సబ్సిడీతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం కోసం వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో) పరిధిలో రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మంత్రి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా నిర్మిస్తున్న ఈ ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌పీవోలకు 75 శాతం, వ్యక్తిగతంగా నిర్మించుకుంటే రైతులకు 40 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాము పండించిన ఉత్పత్తుల నాణ్యతను పెంచుకునేందుకు, మంచి ధరలు పొందడానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లు, కూరగాయల కోతలు, సరైన పద్ధతిలో రవాణా, గ్రేడింగ్, ప్యాకింగ్ చేయడంపై రైతులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు గుర్తింపు కోసం సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, రైతులకు శిక్షణనివ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాన్ని మంత్రి అభినందించారు. ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటలు అధికంగా పండించే ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం చొప్పున 945 కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 505 కేంద్రాలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వగా.. 171 చోట్ల పనులు చేపట్టామన్నారు. వీటిలో 32 కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యం విస్తరిస్తోంది
ఈయన పేరు ఆర్. రామ్మోహన్‌రెడ్డి.కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేముల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.57 ఎకరాల్లో కంది, ఆముదం పంటలు సాగుచేసే వారు. 90 శాతం సబ్సిడీపై బిందు పరికరాల కోసం ఆర్బీకేలో నమోదు చేసుకున్నారు. సర్వేచేసి బిందు సేద్యానికి అనువైనదిగా గుర్తించారు. తన వాటాగా రూ.44,343 చెల్లించారు. దీంతో గతానికంటే భిన్నంగా నేడు ఎలాంటి సిఫార్సుల్లేకుండా దరఖాస్తు చేయగానే వెంటనే పరికరాలు అమర్చారు. ఇప్పుడు కొత్తగా బత్తాయి మొక్కలు వేసుకున్నారు. దీంతో రైతు రామ్మోహన్‌రెడ్డి ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతుభరోసా కేంద్రాల్లో రికార్డు స్థాయిలో రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతో పాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. ఫలితంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దిగుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులు దేశవ్యాప్తంగా సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు.. 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. సూక్ష్మ సేద్యానికి మరో 28.35 లక్షల ఎకరాలు అనువైనవి కాగా.. దశల వారీగా దీనిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. తొలివిడత కింద 2022–23లో రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడం ద్వారా 1.70 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చాలని నిర్ణయించారు. తద్వారా అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులతో రూ.1,500 కోట్లకు పైగా జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్ : అదనపు స్థూల విలువ) సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. అనంతపురంలో అత్యధికంగా.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలకు చెందిన 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు.. 50 శాతం రాయితీపై రాష్ట్రవ్యాప్తంగా తుంపర పరికరాలు అందిస్తున్నారు. పరికరాల సరఫరాకు 37 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు 3,60,120 ఎకరాల్లో బిందు పరికరాల కోసం 1,13,757 మంది.. 57,817 ఎకరాల్లో తుంపర పరికరాల కోసం 20,080 మంది రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.02 లక్షల ఎకరాలకు 28,339 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 76,140 ఎకరాలకు 22,827 మంది, ప్రకాశం జిల్లాలో 37,245 ఎకరాలకు 12,759 మంది, వైఎస్సార్ జిల్లాలో 35,780 ఎకరాలకు 11,097 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ నాటికి లక్ష్య సాధన ఈ నేపథ్యంలో.. టెక్నికల్ కమిటీలతో క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ చురుగ్గా సాగుతోంది. అర్హుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తయ్యింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అర్హత పొందిన రైతులకు తుంపర పరికరాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. బిందు పరికరాల కోసం ఇప్పటికే 20 వేల ఎకరాల్లో సర్వే పూర్తికాగా, 5వేల ఎకరాల్లో అమరిక పూర్తయ్యింది. పరికరాల అమరిక ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారం రోజుల్లోనే పరికరాలిచ్చారు. నేను 2.5 ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నా. 50 శాతం రాయితీపై తుంపర పరికరాలు తీసుకున్నాను. ఆర్బీకేలో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే పొలానికి తీసుకొచ్చి ఇచ్చారు. మిరప సాగు తర్వాత అపరాలు సాగుకు వినియోగిస్తా. – శ్యామల సత్యనారాయణరెడ్డి, రామచంద్రపురం, ఎన్టీఆర్ జిల్లా డ్రిప్‌తో రూ.75వేల నికర ఆదాయం నాకు నీటి సౌకర్యం ఉన్న ఐదెకరాల పొలం ఉంది. డ్రిప్ లేకపోతే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు ఖర్చవుతుంది.. పంట దిగుబడి తక్కువగా వస్తుంది. అదే డ్రిప్ ఉంటే రూ.15వేలు సరిపోతుంది. ఆదాయం కూడా ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.75వేల వరకు వస్తుంది. – చుక్కా లక్ష్మీనారాయణ, రేకులకుంట, అనంతపురం జిల్లా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు నేను 4.91 ఎకరాల్లో నేరేడు పంట సాగుచేస్తున్న. ఆర్బీకేలో దరఖాస్తు చేయగానే సర్వేచేసి మంజూరు ఆర్డర్ ఇచ్చారు. ఈ మధ్యే పొలంలో పరికరాలు అమర్చారు. వీటి వినియోగంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషిచేస్తా. – చమరాతి ప్రమీలమ్మ, ఓదివీడు, అన్నమయ్య జిల్లా బుడ్డశనగ కూడా వేస్తున్నా.. నేను 2.44 ఎకరాల్లో వేరుశనగ సాగుచేస్తున్నా. సబ్సిడీపై తుంపర పరికరాలు ఇటీవలే అమర్చారు. వీటి ద్వారా వేరుశనగ పంటే కాకుండా బుడ్డశనగ ఇతర పంటలను కూడా సాగుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. – సి. రామసుబ్బారెడ్డి, గడ్డంవారిపల్లి, వైఎస్సార్ జిల్లా ఈసారి దిగుబడులు పెరుగుతాయి సూక్ష్మ సాగునీటి పథకం కింద తుంపర, బిందు పరికరాల కోసం రైతుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. పెద్దఎత్తున రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేరుకున్నారు. అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరిక చురుగ్గా సాగుతోంది. డిసెంబర్ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా దిగుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. – డాక్టర్ సీబీ హరనాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
ఆర్బీకేలతో పీఏసీఏస్‌ల అనుసంధానం
సాక్షి, అమరావతి: రైతుల పరపతిని పెంచడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)తో అనుసంధానిస్తోంది. ఇప్పటికే ఆర్బీకే స్థాయిలో పీఏసీఎస్‌ల ద్వారా రైతుక్షేత్రాల వద్దే పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ విషయంలో సర్కారు మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను–పీఏసీఎస్‌లతో అనుసంధానించడం ద్వారా కౌలు, సన్న, చిన్నకారు రైతులకు పరపతి సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించింది. చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! కౌలురైతుకు రుణం అందించడమే లక్ష్యంగా.. ఏపీలోని 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట కొనుగోళ్ల వరకు ఎక్కడికక్కడ రైతులకు సేవలందిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలూ అందిస్తున్నారు. మెజారిటీ కౌలు రైతులకు రుణాలు అందని పరిస్థితి. దీనికి చెక్‌పెడుతూ గ్రామస్థాయిలో అర్హతగల ప్రతీ కౌలుదారునికి రుణం అందించడమే లక్ష్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో ఉన్న 2,037 పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే 18 జిల్లాల పరిధిలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ నెల 20లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 4.5లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్సీ కార్డులు ఇక 2022–23 వ్యవసాయ సీజన్ కోసం 5.67 లక్షల కౌలుదారులకు గుర్తింపు కార్డులు జారీచేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే 4.5 లక్షల మందికి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా కార్డులను జారీచేయాలని నిర్ణయించారు. ఇలా సీసీఆర్సీ (క్రాప్ కలి్టవేటర్ రైట్స్ కార్డు– పంటసాగు హక్కు పత్రం) ఉన్న వారితో పాటు కార్డుల్లేని వారిలో రుణాలు పొందని అర్హులను గుర్తించే బాధ్యతను బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు అప్పగించింది. అలాగే, కౌలుదారులను కనీసం 5 నుంచి పదిమందితో కలిపి జాయింట్ లయబిలిటీ గ్రూపులను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి వారికి సమీప పీఏసీఎస్‌ల ద్వారా రుణపరపతి కలి్పస్తారు. గ్రూపుల్లో ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా కిసాన్ క్రెడిట్ కార్డులూ ఇస్తారు. ప్రస్తుత సీజన్లో రూ.4వేల కోట్ల రుణాలు ప్రస్తుత వ్యవసాయ సీజన్లో కనీసం రూ.4 వేల కోట్ల మేర రుణాలను అందించాలన్నది లక్ష్యం. కౌలుదారులకే కాదు.. సొంత భూమి కల్గిన సన్న, చిన్నకారు రైతులకు కూడా పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని రూపొందించారు. తమ పరిధిలోని ఈ–పంట ఆధారంగా కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులను గుర్తిస్తారు. వారు ఏ సీజన్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు.. సాగు కోసం వారి ఆరి్థక అవసరాలను ఏమిటో తెలుసుకుంటారు. వ్యవసాయ అవసరాల కోసం వారిలో ఏ ఒక్కరూ ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా కౌన్సెలింగ్ ఇస్తారు. వీరికి పంట రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా సాప్్టవేర్ను అభివృద్ధి చేశారు. రుణ దరఖాస్తుతో రైతుల నుంచి కేవైసీ, 1బీ, అడంగల్, ఇతర ధృవీకరణ పత్రాలను స్వీకరించి వాటిని ఈ సాఫ్ట్వేర్ ద్వారా పీఏసీఏస్‌లకు అప్లోడ్ చేస్తారు. ఇలా వచ్చిన దరఖాస్తులను పీఏసీఏస్‌లు నిశితంగా పరిశీలించి రుణం పొందేందుకు అర్హుడని నిర్ధారిస్తే దరఖాస్తు అందిన మూడ్రోజుల్లో పీఏసీఏస్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. కొత్త గ్రూపులకు రుణాలు అందజేసే పీఏసీఎస్‌లకు రూ.4వేల వరకు ఇన్సెంటివ్ కూడా అందజేస్తారు. సాగుదారులందరికీ రుణ పరపతి సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ కౌలురైతుకు రుణపరపతి కల్పించడమే లక్ష్యంగా ఆర్బీకేలను పీఏసీఎస్‌లతో అనుసంధానిస్తున్నాం. ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో వారం పదిరోజుల్లో పూర్తిచేస్తాం. మ్యాపింగ్ పూర్తయిన జిల్లాల్లో రుణాలు పొందేందుకు అర్హులను గుర్తిస్తున్నాం. వారందరినీ గ్రూపులుగా ఏర్పాటుచేసి రుణపరపతి కల్పించాలని ఆదేశాలిచ్చాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
100 శాతం ‘మద్దతు’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కనీస మద్దతు ధర కంటే ఒక్క పైసా కూడా తగ్గకుండా కొనుగోళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రకు స్వస్తి పలకాలన్నారు. వే బ్రిడ్జిలను క్రమంగా దశలవారీగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి తేవడంతోపాటు గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులను ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములను చేసి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాణ్యత పరీక్షలు.. అన్నదాతలకు మేలు చేసేలా ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ, క్వాంటిటీ టెస్టింగ్ చేయాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎంఎస్పీకి సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం విస్తృతంగా కరపత్రాల ముద్రణ చేపట్టి పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నమన్వయంతో సమర్థంగా.. రైతులకు అండగా నిలుస్తూ ఆర్బీకేలు పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు.. మత్స్య, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ ఇలా అన్నీ చేస్తున్నాం. వీటిని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలంటే సంబంధిత శాఖల మధ్య (లైన్ డిపార్ట్మెంట్స్) చక్కటి సమన్వయం అవసరం. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖల మధ్య సమన్వయం సమర్థంగా ఉండాలి. ఈ ప్రక్రియలో సజావుగా ముందుకు సాగేలా పటిష్ట మార్గదర్శకాలు, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలి. భూసార పరీక్ష కార్డులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు వాడకుండా నివారించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసిన తరువాత దాదాపు రెండు నెలలు పంట విరామం ఉంటుంది. ఆ సమయంలో భూసార పరీక్షలన్నీ నిర్వహించి వాటి ఫలితాల ప్రకారం ఆ భూమికి ఎలాంటి పోషకాలు, ఎరువులు వాడాలో సూచించాలి. ప్రతి రైతుకూ తన సాగు భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా అందించే కార్యక్రమాన్ని రూపొందించాలి. ఎంత మోతాదులో ఎరువులు, పురుగు మందులు వాడాలో çస్పష్టమైన అవగాహన కల్పించాలి. డాక్టర్లా ఆర్బీకేలు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్ ఎలా సేవలందిస్తారో పంటల సాగులో ఆర్బీకేలు కూడా అదే విధంగా రైతన్నలకు ఉపయోగపడాలి. ఆర్బీకేలు ఒక రకంగా పొలం డాక్టర్ల మాదిరిగా పనిచేయాలి. వైద్యారోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ విధానం తరహాలో క్రమం తప్పకుండా గ్రామాల్లో ఆర్బీకేలు రైతులకు సలహాలు, సూచనలు అందచేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ వీరపాండ్యన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల పాత్ర ఉండకూడదు: సీఎం జగన్
-
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్ డిపార్ట్మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. అదే విధంగా సాయిల్‌కార్డులతోపాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై సలహాలు అందించాలన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని పేర్కొన్నారు. రైతులకు ఎంఎస్పీ ధర అందాల్సిందేనన్న ముఖ్యమంత్రి.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. లైన్ డిపార్ట్మెంట్లతో సమర్థవంతంగా సమన్వయం: రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా, పిషరీస్, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాయి ఈ కార్యకలాపాలు సమర్థవంతంగా ముందుకు సాగాలంటే.. సంబంధిత శాఖలతో (లైన్ డిపార్ట్మెంట్స్) చక్కటి సమన్వయం అవసరం వ్యవసాయం, ఫిషరీస్, రెవిన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖలతో సమన్వయం సమర్థవంతంగా ఉండాలి నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి వివిధ శాఖలతో కలిసి అనుసంధానమై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగేందుకు వీలుగా సమర్థవంతమైన మార్గదర్శక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశం. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు: అవసరం లేకపోయినా, విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి దీనిపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది ప్రతిరైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలి రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలి దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గుతుంది ఒక మనిషికి డాక్టర్ ఎలా ఉపయోగపడతాడో, పంటలసాగులో రైతులకు ఆర్బీకేలు అదే విధంగా ఉపయోగపడాలి ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్‌టెస్టులు చేసేవిధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తరహాలో.. ఒక కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు ఈ విషయంలో సలహాలు సూచనలు గ్రామాల్లో అందాలన్న సీఎం ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు రైతులకు ఎంఎస్పీ ధర అందాల్సిందే ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్, క్వాంటిటీ టెస్టింగ్ జరగాలన్న సీఎం. ధాన్యం కొనుగోలు ప్రక్రియమీద, ఎంఎస్పీ మీద, అనుసరించాల్సిన నియమాలమీద రైతుల్లో అవగాహన కల్పించాలన్న సీఎం. దీనికి సంబంధించి కరపత్రాలను, పోస్టర్లను, హోర్డింగ్‌లను పెట్టాలన్న సీఎం. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఆర్బీకేల స్థాయిలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలన్న సీఎం. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలన్న సీఎం. చదవండి: ఒక్క క్లిక్‌తో సమాచారమంతా.. -
ఏపీలో నవశకం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, విద్య, పాలన రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటల పాటు ఉచిత విద్యుత్ తదితర పథకాలు తీసుకొచ్చామన్నారు. బడికెళ్లడం, చదువు కోవడం అనేది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి సహా పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వివక్ష, అవినీతికి తావు లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంటల మార్పిడి, నూనె దినుసులు, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఇందుకు సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించారు. సీఎం ప్రసంగంలోని వివరాలు ఇలా ఉన్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయానికి అగ్ర స్థానం ► రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారింది. 62 శాతం మంది ప్రజలు ఈ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతం పైనే ఉంది. ఈ రంగం ప్రాముఖ్యత దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ► రైతులకు మరింత అండగా నిలుస్తూ.. వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద వీటిని ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. ► డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజు వారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ అండగా నిలుస్తున్నాం. ► ఆర్బీకే స్థాయిలోనే ఈ– క్రాప్ బుకింగ్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ లేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఈ–క్రాప్ బుకింగ్ ఎంతగానో దోహద పడుతోంది. ► ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. వారి చెంతకే అవన్నీ చేర వేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ► ఆర్బీకే, మండల, జిల్లా స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల వైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. జీఈఆర్ పెంపే లక్ష్యం ► విద్యా రంగానికి సంబంధించి బడికి వెళ్లడం, చదువు కోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. పాఠశాల మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ► ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతం కాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల్లో విద్యా రంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే ఈ రంగంలో కీలక అంశాలపై దృష్టి పెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకొచ్చాం. ► తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15 వేలు చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నాం. 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను పరిగణనలోకి తీసుకున్నాం. ► పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యా కానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్ టెక్టŠస్ బుక్స్, నోట్ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిష్ టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్ కూడా అందిస్తున్నాం. 8వ తరగతి విదార్థులకు ట్యాబ్ కూడా ఇవ్వబోతున్నాం. 55,555 స్కూళ్లలో నాడు–నేడు ► పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, పెయింటింగ్, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పిల్లలకు.. టీచర్లకు ఫర్నిచర్, గ్రీ¯Œన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇతరత్రా కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్ తరగతుల ఏర్పాటు కూడా పూర్తి చేస్తాం. ► ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ భాషకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్ చేసి, 3వ తరగతి నుంచే సబ్జెక్టు వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. ► ఉన్నత విద్య స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయట పడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యా దీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చు కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. ► అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37 వేల మందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69 వేలు వచ్చాయి. పారదర్శక పాలనతో ప్రజలకు చేరువ ► ప్రజల గడప వద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. ► ప్రతి 50–100 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. తద్వారా వారికి ఉపాధితో పాటు.. అవినీతి లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హులైన వారందరికీ ఆయా పథకాల ఫలాలు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: రైతన్నలకు శుభవార్త.. 50% సబ్సిడీపై..
సాక్షి, అమరావతి: కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలను ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అద్దె ప్రాతిపదికన అత్యాధునిక యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 50% సబ్సిడీపై రూ.403 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను అందించనుంది. రూ.2,016 కోట్ల అంచనా వ్యయంతో.. రూ.2016 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల (రూ.6 లక్షలు సబ్సిడీ) విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల (రూ.10 లక్షలు సబ్సిడీ) అంచనా వ్యయం కాగల కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల విలువైన 6,781 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే రూ.175 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో 3,800 ట్రాక్టర్లను రైతు కమిటీలకు అందించింది. వీటికి అదనంగా త్వరలో రైతన్నలకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 1.80 లక్షల మందిని సర్వే చేసి.. రైతులకు ఏ పరికరాలు అవసరమో గుర్తించేందుకు ఆర్బీకే స్థాయిలో సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి 20 మంది చొప్పున రాండమ్‌గా 1.80 లక్షల మందిని సర్వే చేసి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 34 శాతం మంది.. పీపీ ఎక్విప్మెంట్స్ (నాప్సాక్, తైవాన్, పూట్ బూమ్ తదితర కంపెనీలకు చెందిన స్ప్రేయర్లు), 25 శాతం మంది.. టార్పాలిన్స్, 15 శాతం మంది.. భూమి చదును యంత్రాలు (కల్టివేటర్స్, ఎంబీ ప్లాఫ్, లెవెలింగ్ బ్లేడ్, డిస్క్ ప్లో, డిస్క్ పడ్లెర్, రోటో పడ్లెర్ తదితర), 12 శాతం మంది.. సెల్ప్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ (పవర్ టిల్లర్, పవర్ వీడర్, క్రాప్ రేపర్, బ్రష్ కట్టర్, చాప్ కట్టర్), 9 శాతం మంది.. రోటోవేటర్స్, 4 శాతం మంది.. సీడింగ్ పరికరాలు (సీడింగ్ డ్రిల్, సీడ్ కమ్ పెర్ట్ డ్రిల్, డ్రమ్ సీడర్), ఒక శాతం మంది మిస్క్ ఎక్విప్మెంట్ కావాలని కోరారు. 50 శాతం సబ్సిడీపై పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గ్రామానికి 25 మంది చొప్పున 2.68 లక్షల మందికి రూ.15 వేల విలువైన యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే గ్రామానికి 7–8 మంది చొప్పున 80,600 మందికి రూ.50 వేల విలువైనవి 2 యూనిట్ల చొప్పున 50 శాతం సబ్సిడీపై మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ యూనిట్లను అందించడానికి రూ.403 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అర్హుల గుర్తింపు పూర్తికాగానే అమలుకు చర్యలు.. గత మూడేళ్లలో గ్రామ, క్లస్టర్ స్థాయిలో రైతు కమిటీలతో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి యంత్ర పరికరాలను అందించాం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీహెచ్‌సీలతో పాటు వ్యక్తిగతంగా రైతులకు పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అర్హుల గుర్తింపు కోసం విధివిధానాల రూపకల్పన పూర్తి కాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. –కాకాని గోవర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
ఈ–పంటతోపాటే ఈ–కేవైసీ నమోదు
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలవల్ల పంట కొనుగోలు.. సంక్షేమ పథకాల వర్తింపు విషయంలో ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ–పంట ఆధారంగానే వైఎస్సార్ రైతుభరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, దీని ప్రామాణికంగానే పంట ఉత్పత్తులను కనీస మద్దతుకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్) గడిచిన రబీ సీజన్లోనే నవీకరణ (అప్డేట్) చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. దీంతో పంట వివరాల నమోదు ఒకసారి, ఈకేవైసీ నమోదు మరోసారి చేసేవారు. ఈ విధానంవల్ల పంట కొనుగోలు ఇతర పథకాల అమలు సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ ఇక నుంచి పంట వివరాల నమోదు సమయంలోనే ఈకేవైసీ (వేలిముద్రలు) తీసుకోవాలని నిర్ణయించారు. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే ఈ–క్రాపింగ్ వెబ్‌ల్యాండ్ ఆధారంగా పంట సాగు వివరాలతోపాటు రైతు బ్యాంకు, సామాజిక వివరాలను కూడా అనుసంధానిస్తున్నారు. తొలుత ఆధార్ నెంబర్ కొట్టగానే రైతుల వ్యక్తిగత వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత సీజన్లో అతను సాగుచేసే పంట వివరాలు నమోదుచేస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఈకేవైసీ నమోదుచేస్తారు. ఇక ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది జాయింట్ అజమాయిషీ ద్వారా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఖరీఫ్ సీజన్లో ఆగస్టు నెలాఖరు వరకు జాయింట్ అజమాయిషీ కొనసాగిస్తారు. రబీ సీజన్లో అక్టోబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు, మూడో పంటకు సంబంధించి మార్చి 1 నుంచి మే 31వరకు నిర్వహించనున్నారు. ఈ జాయింట్ అజమాయిషీలో తొలుత రెవెన్యూ గ్రామాలను ఆర్బీకేలతో అనుసంధానిస్తారు. ఆ తర్వాత వీఆర్వో, గ్రామ సర్వేయర్లు (రెవెన్యూ)తో పాటు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో బృందాలను ఏర్పాటుచేస్తారు. వారికి మండల స్థాయిలో శిక్షణనిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే సంబంధిత రైతు వేలిముద్రలు (ఈకేవైసీ) కూడా నమోదుచేసి రశీదు ఇస్తారు. పంట వివరాల నమోదుకు మార్గదర్శకాలు పరిష్కారంకాని ఇనాం, ఎస్టేట్, సర్వేకాని గ్రామాల్లోని భూములు, చుక్కల భూములు, పీఓటీ ఉల్లంఘనలు, దేవదాయ, వక్ఫ్, సీజేఎఫ్ఎస్, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, సాదాబైనామా కేసులు, మ్యుటేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న భూములు, సీసీఆర్సీ కార్డుదారులు, నమోదుకాని కౌలుదారులు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న వారు, ఏపీఐఐసీ/ఏలినేటెడ్, సేకరించిన భూములు, వాటర్ బాడీలకు చెందిన భూములు, లంక భూముల్లో సాగుచేస్తున్న పంటల వివరాల నమోదుకు మార్గదర్శకాలు జారీచేశారు. నమోదైన ఈ–పంట వివరాలను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు విధిగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి. సెప్టెంబర్ 1 నుంచి 14వరకు ఈ–పంట, ఈకేవైసీ వివరాలను విధిగా ఆర్బీకేలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సెప్టెంబర్ 15న ఆర్బీకే అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పంట వివరాలను తుది జాబితాలను ప్రచురించాలి. పకడ్బందీగా పంటల నమోదు కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు సాంకేతిక లోపాలతో ఇబ్బందిపడకూడదన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాయింట్ అజమాయిషీ ద్వారా రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బంది సంయుక్తంగా ఈ–పంటతో పాటు ఈకేవైసీ ఒకేసారి నమోదు చేయనున్నారు. వివిధ రకాల ప్రభుత్వ, ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న పంట వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో మార్గదర్శకాలిచ్చాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్ వ్యవసాయ శాఖ -
AP: ఆర్బీకే వ్యవస్థకు అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టి, రాష్ట్రంలో రెండేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సాంకేతికత అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తోంది. ఆర్బీకే వ్యవస్థను ఇప్పటికే పలు రాష్ట్రాలు అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్‌లో రాష్ట్రంలోని ఆర్బీకే సాంకేతికతను కేంద్రం సిఫారసు చేసింది, దీంతో ఆర్బీకే వ్యవస్థ దేశ ఎల్లలు దాటింది. ఈ సాంకేతికతపై విదేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఆఫ్రికన్ దేశమైన ఇథియోపియా ఆర్బీకే తరహా సేవలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరింది. ఆ దేశం వచ్చే పదేళ్లలో ఏటా 6.2 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకోసం రైతుల్లో నైపుణ్యం పెంపు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, దిగుబడుల నాణ్యతపై దృష్టి పెట్టింది. ఆ దేశ అభ్యర్థన మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య నేతృత్వంలో జాతీయ స్థాయి బృందం ఇథియోపియా వెళ్తోంది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, భారత్‌లోని వరల్డ్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు, తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వీసీ సభ్యులుగా ఉంటారు. ఈ బృందం 25వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తుంది. అక్కడి వ్యవసాయ పరిస్థితులు, సాగు పద్ధతులు, రైతుల సమస్యలు, సాగుకు అనుకూలమైన భూముల విస్తీర్ణం, సాగవుతున్న పంటలు, పెట్టుబడి వ్యయం, ఉత్పత్తి, ఉత్పాదకత, సాగు ఉత్పాదకాలు రైతులకు అందుతున్న తీరును పరిశీలిస్తుంది. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అందించాల్సిన తోడ్పాటుపై అధ్యయనం చేస్తుంది. అక్కడ జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు గ్రామస్థాయిలో అందుతున్న తీరును పరిశీలిస్తుంది. ఆర్బీకే తరహాలో అక్కడ గ్రామ స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు, అందుబాటులోకి తేవాల్సిన సేవలపై ఆ దేశ వ్యవసాయ ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేస్తుంది. ఆర్బీకే సాంకేతికత అనుసంధానంపై రూట్ మ్యాప్ తయారు చేస్తుంది. ఇందుకయ్యే వ్యయాన్ని వరల్డ్ బ్యాంక్ బృందం అంచనా వేసి, ఆర్థిక సాయం చేస్తుంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం ఇథియోపియాకు అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఇథియోపియా, ప్రపంచ బ్యాంకు మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. సెప్టెంబర్‌లో రాష్ట్రానికి ఇథియోపియా బృందం ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించడానికి ఇథియోపియా వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతినిధి బృందం సెప్టెంబర్‌లో రాష్ట్రానికి రానుంది. ఇథియోపియా అధికారులు, రైతుల బృందాలకు ఏపీ శాస్త్రవేత్తలు, అధికారులు శిక్షణనిస్తారు. -
పనితీరే ప్రామాణికం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపర్చడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం, సేవల్లో నాణ్యత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లో 14,287 మంది సేవలందిస్తున్నారు. వీరు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వీరితోపాటు మండల స్థాయిలో పనిచేసే 670 మంది వ్యవసాయాధికారులు, 154 అసిస్టెంట్ డైరెక్టర్ల పనితీరునూ అంచనా వేసేందుకు ప్రత్యేకంగా వైఎస్సార్ యాప్ (ఈల్డ్ సస్టైనబులిటీ రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ)ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్బీకే సిబ్బంది పనితీరును మెరుగుపర్చేందుకు ఏర్పాటుచేసిన ఈ యాప్‌ను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కూడా వర్తింపజేస్తున్నారు. యాప్‌తో నిఘా ఇలా.. ఈ వైఎస్సార్ యాప్.. సిబ్బంది, అధికారుల పనితీరును అంచనా వేయడమే కాక.. వారు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో రికార్డుచేసే నిఘా వ్యవస్థలా పనిచేస్తుంది. ► ఆర్బీకే ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది. ► సిబ్బంది ఆర్బీకేలో ఎంతసేపు ఉన్నారు? ఫీల్డ్‌లో ఎంతసేపు ఉన్నారు? అనేది ట్రాకర్ ద్వారా రికార్డు అవుతుంది. ► ఆర్బీకే సిబ్బంది, సబ్ డివిజన్ పరిధిలో ఏడీఏలు, ఎంఏఓలు ఈ యావ్ ద్వారా నిర్ణీత సమయంలోనే హాజరు (జియో పంచ్) నమోదుచేయాలి. ► విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీతో పాటు ఇతర రైతు సేవలకు సంబంధించిన ప్రత్యేక నోటిఫికేషన్లను వీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ► మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వచ్చే రోజువారీ టాస్క్‌లకు సమయానుకూలంగా స్పందించాలి. ► క్రమం తప్పకుండా వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహిస్తూ వాటిని అప్లోడ్ చేయాలి. ► ప్రతీరోజు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం, సాగులో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలిస్తూ వారికి అందుబాటులో ఉండాలి. ► ఎప్పటికప్పుడు వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని యాప్‌లో అప్లోడ్ చేయాలి. ► ఇదే రీతిలో ఎంఏఓలు, ఏడీఎల పనితీరును కూడా ఈ యాప్ ద్వారానే క్రోడీకరిస్తూ అంచనా వేస్తుంటారు. పనితీరుకు మార్కులు ఇలా.. రోజువారీ టాస్క్‌లకు అందరికంటే వేగంగా స్పందించే ఆర్బీకే సిబ్బందికి 60 మార్కులు.. 100 శాతం హాజరు కనబర్చిన వారికి 40 మార్కులు ఇస్తారు. ఇక ఎంఏఓలకు.. ఆర్బీకేలను విజిట్చేస్తే 40 మార్కులు, వ్యక్తిగతంగా ఇచ్చే టాస్క్‌లను çపూర్తిచేస్తే 20 మార్కులు, తన పరిధిలోని ఆర్బీకేల పనితీరు ఆధారంగా 20 మార్కులు, అటెండెన్స్‌కు 20 మార్కులు ఇస్తారు. ఏడీఏలకు అయితే.. టాస్క్‌లకు 40 మార్కులు, వీరికింద పనిచేసే ఎంఏఓల పనితీరు ఆధారంగా 40 మార్కులు, అటెండెన్స్‌కు 20 మార్కులు చొప్పున ఇస్తారు. యాప్ ద్వారా అంచనా వేసిన పనితీరు ఆధారంగా 95కు పైగా మార్కులొస్తే అత్యుత్తమ (ఎక్స్లెంట్), 75–95 మధ్య మార్కులొస్తే ఉత్తమ (గుడ్), 50–75 మధ్య మార్కులొస్తే సాధారణం (ఫెయిర్), 50 మార్కుల్లోపు వస్తే బాగోలేదు (పూర్) అనే కేటగిరీలుగా విభజించి వారి పనితీరును బేరీజు వేస్తారు. అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారి ఫొటోలను ‘వైఎస్సార్ రైతుభరోసా’ మాసపత్రికల్లో ప్రచురిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 12 సార్లు బెస్ట్పెర్ఫార్మర్గా నిలిచా రైతులకు సేవచేయడం మహద్భాగ్యంగా పనిచేస్తున్నాం. మా పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. హాజరు నమోదు, నోటిఫికేషన్స్‌కు స్పందించడం, ఇచ్చిన టాస్క్‌లు పూర్తిచేసిన వారికి మార్కులు ఇస్తున్నారు. దీనివల్ల సిబ్బందిలో పోటీతత్వం పెరుగుతుంది. గడిచిన ఏడాదిన్నరలో 12 సార్లు ది బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిచాను. – ఎ.నాగసునీల్కుమార్, ఉద్యాన సహాయకుడు, యర్రగుడిదిన్నె ఆర్బీకే ఇన్చార్జి, నంద్యాల జిల్లా పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యం ఆర్బీకే సిబ్బంది పనితీరు మెరుగుపర్చడం ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వైఎస్సార్ యాప్ ద్వారా సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తాం. ప్రస్తుతం 50 శాతం మంది ఉత్తమ, అత్యుత్తమ పనితీరును కనపరుస్తున్నారు. మిగిలిన వారినీ ఇదే రీతిలో తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. – వల్లూరి శ్రీధర్, జేడీఏ, ఆర్బీకే విభాగం -
ఏపీపై నీతి ఆయోగ్ ప్రశంసలు
కృష్ణా జిల్లా: ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య. ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్ చంద్.. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయమని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేల ఏర్పాటు, వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై మాట్లాడారు. ‘ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆర్బీకేలు దేశానికే ఆదర్శం. వాటి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఆర్బీకేలు అమలు చేయాలని కేంద్రానికి సూచిస్తాం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’ -
ఏపీ వైపు దేశం చూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన వ్యవసాయ, ఉద్యాన మంత్రుల జాతీయ స్థాయి సదస్సులో మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దిశా నిర్దేçశం చేస్తూ.. ఏపీని మోడల్‌గా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థతో పాటు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ వంటి సౌకర్యాలను పరిశీలించి, మీ రాష్ట్రాల్లో కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పడంతో సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు, అధికారుల ఆరా సదస్సు ముగిసిన మర్నాడే రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా తన బృందంతో కలిసి ఏపీలో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని ఓ ఆర్బీకేను సందర్శించి, కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో పాటు.. గ్రామ స్థాయిలో అందిస్తోన్న సేవలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. తమ ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఉన్నత స్థాయి బృందాన్ని ఏపీ పర్యటనకు పంపిస్తామని ప్రకటించారు. తాజాగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, అస్సోం రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల మంత్రులు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌కు ఫోన్ చేసి, ఏపీలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఆర్బీకేల తరహాలోనే తమ రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. రైతు సంబంధిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి.. తదితర విషయాలపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే తమ రాష్ట్ర ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటిస్తాయని ప్రకటించారు. సాంకేతిక సహకారానికి సిద్ధం కేంద్రంతో సహా వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ తీసుకొస్తున్నారు. తమిళనాడులో గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. జాతీయ సదస్సు తర్వాత ప్రతి రోజు ఏదో రాష్ట్రం నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఏపీలో పర్యటించేందుకు ఆసక్తి చూపాయి. మరిన్ని రాష్ట్రాలు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుసగా ఈ బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. వారికి అవసరమైన సాంకేతికత అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
రాజస్థాన్‌లోనూ ఆర్బీకే తరహా సేవలు
సాక్షి, అమరావతి/నారాయణవనం (తిరుపతి): ఆంధ్రప్రదేశ్ రైతులకు గ్రామస్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా ప్రశంసించారు. ఇదే తరహాలో రాజస్థాన్‌లో కూడా సేవలం దించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి జి ల్లా నారాయణవనం మండలం భీమునిచెరువు ఆర్బీకేను ఆయన సందర్శించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ అగ్రి ఇన్పుట్ షాప్, లైబ్రరీ, మాయిశ్చర్ మీటర్, సీడ్ టెస్టింగ్ కిట్, కియోస్క్‌ల పని తీరు.. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు బుక్ చేసుకునే విధానాన్ని పరిశీలించారు. కియోస్క్‌లో వాతావరణం, దేశవ్యాప్త మార్కెట్ ధరల సమాచారం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కియోస్క్‌ల పనితీరును ప్రత్యేకంగా అభినందించిన ఆయన.. రాజస్థాన్‌లో కూడా వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే, ఏపీ తరహాలోనే రాజస్థాన్‌లో కూడా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏ ర్పాటుచేశామని, వాటి ద్వారా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పాడి సేవలనూ కటారియా మెచ్చుకున్నారు. మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్‌లను పరిశీలిం చి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. వీటిని తమ రాష్ట్రంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఏపీలో గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటుచేసి పంటల ప్రణాళికలో రైతులను భాగస్వామ్యం చేస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి కటారియా ఇది ఒక వినూత్నమైన ఆలోచనన్నారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా రైతులను భాగస్వామ్యం చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోళ్ల విధానాన్ని పరిశీలించిన ఆయన రాజస్థాన్‌లో కూడా ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను గ్రామస్థాయిలో ఏర్పాటుచేయబోతున్నామని చెప్పారు. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో జరుగుతున్న రైతు విస్తరణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నంతగా మరే రాష్ట్రంలోనూ జరగటంలేదన్నారు. ఏపీని మోడల్‌గా తీసుకోబోతున్నట్లు కటారియా చెప్పారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక అధికారుల బృందాన్ని మరోసారి పంపనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ నాకు మంచి స్నేహితుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు మంచి స్నేహితుడని.. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తాను కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. అనంతరం.. ఇటీవల ఈ ఆర్బీకే పరిధిలోని రైతు కమిటీకి అందజేసిన ట్రాక్టర్, యంత్ర పరికరాలను పరిశీలించారు. రైతులతో కలిసి ట్రాక్టర్‌ను నడిపారు. ఆ తర్వాత సమీప వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు. అనంతరం కటారియా.. పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
దేశానికే ఆదర్శంగా నిలిచాం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచామ ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తెచ్చే లక్ష్యంతో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతు న్నాయని తెలిపారు. బెంగళూరులో జరుగు తున్న వ్యవసాయ, ఉద్యాన మంత్రుల రెండు రోజుల జాతీయ సదస్సులో గురువారం మంత్రి కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ‘వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతలుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. సీడ్ టు సేల్’ కాన్సెప్ట్‌తో ఆర్బీకేల ద్వారా దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాం. నీతి ఆయోగ్, ఆర్బీఐ, నాబార్డు వంటి అనేక ప్రముఖ సంస్థలు, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఆర్బీకే సేవలను ప్రశంసించాయి. పలు ప్రఖ్యాత సంస్థలు మాతో పనిచేసేందుకు ముందుకు వచ్చాయి’ అని చెప్పారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, మన్సుఖ్ మాండవియా, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పల్లె సేవకు వేగంగా సిద్ధమవుతున్న భవనాలు
సాక్షి, అమరావతి: పల్లెటూళ్లలోని ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా.. సొంత ఊరిలోనే సేవలన్నీ అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన భవనాల నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. రూ. 40 లక్షలతో గ్రామ సచివాలయం, రైతులకు వ్యవసాయ సంబంధిత సహాయం, సలహాల కోసం రూ. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, గ్రామంలోనే వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా రూ. 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 12 వేల కోట్ల ఖర్చుతో 36,708 శాశ్వత భవన నిర్మాణాలను ఈ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టగా.. ఇప్పటి వరకూ 9,628 భవనాలు పూర్తయ్యాయి. మరో 4,757 భవన నిర్మాణ పనులు పైకప్పు కూడా అయిపోయి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అన్ని భవనాల నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను ఏమాత్రం ఆలస్యం లేకుండా చెల్లిస్తోంది. వేగంగా పనులు.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామ సచివాలయం భవన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రంగులు వేసే పనులు కొనసాగుతున్నాయి. మంత్రాలయం మండలం చిట్నహళ్లి గ్రామంలో హెల్త్ క్లినిక్ భవనం ప్రస్తుతం బేస్మెంట్, ఫిల్లర్ల నిర్మాణం పూర్తయి గోడల నిర్మాణం దశలో ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భవనాల నిర్మాణం పనులు వేగంగా సాగుతూ వివిధ దశల్లో ఉన్నాయి. సత్వరం బిల్లులు చెల్లింపు.. ఇప్పటిదాకా పూర్తయిన, పురోగతిలో ఉన్న భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా చెల్లించిందని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ నిర్మాణ పనులను అనుసరించి ఒక్కో దశ పూర్తయిన వెంటనే ఆ దశకు సంబంధించి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ముందస్తు కార్యచరణ సిద్ధం చేసినట్టు అధికారులు వెల్లడించారు. బిల్లులు పెండింగ్ లేకుండా చూడటంతో పాటు నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలు పూర్తికి వీలుగా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ ప్రతి వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. సిమెంట్ ధరల వల్ల పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు సిమెంట్‌ను కూడా సరఫరా చేయిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి సైతం వారం వారం ఉన్నతాధికారులతోనూ, జిల్లాల కలెక్టర్లతోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పైనుంచి కింది స్థాయి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ వరకూ నిరంతరం శ్రమిస్తు.. పనుల్లో రాజీ పడకుండా నిర్మాణ పనులు కొనసాగేలా చూస్తున్నారు. -
రైతులను అన్ని విధాలుగా అండగా ఉంటున్న సీఎం జగన్‌పై బురద చల్లుతున్నారు: కాకాణి
-
అన్నదాతపై ఆంక్షలు కాదు.. అండగా ఉంటున్నాం: మంత్రి కాకాణి
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేగా ఓడిన పవన్ కల్యాణ్, తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఎల్లో మీడియా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ప్రజలంతా చూస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాస్ బుక్ ఉన్న రైతులకు, సీసీఆర్సీ కార్డు ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు నిరూపించగలరా? నేను సవాల్ చేస్తున్నా. చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు..పవన్ కళ్యాణ్‌కి క్యారెక్టర్ లేదు. వీళ్ళ మాటల్ని పట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. అవాస్తవాలు చూపిస్తోంది. అన్నదాతలు అప్పుల సాగు కాదు.. వాస్తవంగా ఎల్లో మీడియా అబద్ధాల సాగు కనిపిస్తోంది ఇప్పుడు అంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి. ‘‘రైతులకు రూ. 7 లక్షల పరిహారం ఇస్తున్నాం. టీడీపీ హయాంలో రూ. 5 లక్షలని చెప్పి చాలా ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు ను కూడా గుర్తించకుండా వాళ్ళకి అన్యాయం చేశాడు. సుమారు 471 మంది రైతులు చంద్రబాబు హయాంలో ఇవ్వకపోతే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిహారం ఇచ్చి అండగా నిలబడింది. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు లేకపోతే లక్ష రూపాయలు బీమా కింద ఇస్తున్నాం. క్రాప్ హాలిడే అన్నదే లేదు.. ఎక్కడా కరువు మండలాల ప్రకటించలేదు. ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా ముందుగా నీళ్లు ఇస్తున్నాం. చంద్రబాబు లాగా రుణమాఫీ పేరు చెప్పి మోసం చెయ్యలేదు. ప్రతి రైతుకు ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాం’’ అని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. ప్లీనరీ తరువాత దుష్టచతుష్టయానికి కడుపు మంట పెరిగింది. అందుకే వాళ్ల కోసం చర్చించాం.ఎమ్మెల్యే గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చూస్తున్నాం. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎలా వ్యవహరిస్తుందో అసత్యపు కథనాలు, తప్పుడు రాతలే నిదర్శనం అని మంత్రి కాకాణి చెప్పారు. -
ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతం
పెదకాకాని(పొన్నూరు): ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థ సేవలు, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ సంతోష్ మెహ్రా (ఇన్వెస్టిగేషన్) ప్రశంసించారు. గుంటూరు జిల్లా పెదకాకాని సచివాలయం, నంబూరు రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ గోచిపాతల శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. ఈ బృందానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి స్వాగతం పలికారు. సచివాలయాల పనితీరు, ప్రభుత్వ పథకాలపై జేసీ రాజకుమారి సంతోష్ మెహ్రాకు వివరించారు. సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సంతోష్ మెహ్రా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు విజయవంతం కావడమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పనితీరుపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు పోషకాహారం అందించడం, ప్రతి నెలా 1వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేయడంపై ప్రశంసల జల్లు కురిపించారు. రైతు భరోసా కేంద్రాల సేవలు భేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని సంతోష్ మెహ్రా అన్నారు. నంబూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఏడీ వెంకటేశ్వర్లు వ్యవస్థ అమలు తీరును వివరించారు. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ , గ్రామ సచివాలయ జిల్లా అధికారి కావూరి గీతారాణి, ఎంపీడీవో టీవీ విజయలక్ష్మి, ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశమంతటా ‘ఆర్బీకే’ సేవలు!
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల స్ఫూర్తితో దేశంలోని రైతులందరికీ ఆ తరహా సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని రైతులకు గ్రామస్థాయిలోనే సేవలందించే సంకల్పంతో రెండేళ్ల క్రితం నెలకొల్పిన ఆర్బీకే వ్యవస్థపై వివిధ రాష్ట్రాలతోపాటు ఆఫ్రికన్ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మన ఆర్బీకే వ్యవస్థను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రతిష్టాత్మక చాంపియన్ అవార్డుకు నామినేట్ చేసిన కేంద్రం.. ఈ తరహా సేవలను దేశమంతటా అమలు చేయాలని అడుగులు వేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆర్బీకే తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. ఎఫ్ఏవో, నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఎఆర్), ఆర్బీఐ, కేంద్ర బృందాలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ఆర్బీకేల పనితీరును అధ్యయనం చేసి వెళ్లాయి. తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర బృందం పర్యటన ఇలా.. రాష్ట్రంలో పర్యటించే బృందంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి రితీష్ చౌహాన్, వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునిల్, నోడల్ అధికారి అజయ్ కరణ్ సభ్యులుగా ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఈ బృందం నేరుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను సందర్శిస్తుంది. అక్కడ సమీకృత రైతు సమాచార కేంద్రంతో పాటు ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలిస్తుంది. అనంతరం నేరుగా కంకిపాడు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను సందర్శిస్తుంది. ఈ ల్యాబ్ ద్వారా రైతులకు అందుతున్న సేవలను బృందం సభ్యులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉయ్యూరు మండలం పెదఓగిరాల ఆర్బీకేను సందర్శిస్తారు. ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను పరిశీలించి స్థానిక రైతులతో భేటీ అవుతారు. ఈ పంట నమోదుతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు తీరును పరిశీలిస్తారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు? పీఎంఎఫ్‌బీవైకు ఈ పథకానికి ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? కేంద్ర పథకంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ఈ పథకంలో పలు రాష్ట్రాలు చేరకపోవడానికి ప్రధాన కారణాలలేమిటి? వంటి అంశాలను కూడా కేంద్ర బృందం అధ్యయనం చేస్తుంది. సీఎంతో భేటీకి ఛాన్స్ క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కేంద్ర బృందంలోని సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ఆర్బీకే తరహా సేవలను జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర బృందం మన రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పారు. -
ఉరిమిన ఉత్సాహం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ముందస్తుగా పలకరించిన రుతుపవనాలు, ఏరువాక ఆరంభంతో అన్నదాతలు కాడెడ్లను అదిలిస్తూ ఉత్సాహంగా ఖరీఫ్ సాగులో నిమగ్నమయ్యారు. ఊరు దాటాల్సిన పనిలేకుండా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుతుండటంతో పొలాల బాట పడుతున్నారు. పంటల సాగు కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించిన పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నవరత్న పథకాలు గ్రామసీమల్లో వెలుగులు నింపుతున్నాయి. అన్నదాతకు సాయం.. ఇలా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన ద్వారా ఏటా రూ.13,500 చొప్పున మూడేళ్లలో రెండు కోట్లకుపైగా కుటుంబాలకు రూ.23,875.59 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. ఎకరం వరి సాగు చేసేందుకు పెట్టుబడి అంచనా వ్యయం రూ.25 వేలు కాగా రైతు భరోసా ద్వారా సగానికిపైగా సాయం అందుతోంది. ఇక మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. రూ.6,684.84 కోట్లను రైతులకు పంటల బీమా పరిహారం కింద చెల్లించారు. మూడేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.79,642.18 కోట్ల మేర ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది. సగటున రూ.20 కోట్ల లబ్ధి కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం గ్రామానికి 2020– 21లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.6,49,92,155 మేర లబ్ధి కలిగింది. గ్రామ జనాభా 4,378 కాగా లబ్ధిదారుల సంఖ్య 4,159. అంటే 95 శాతం జనాభాకు మేలు జరిగింది. పెట్టుబడుల కోసం తమ గ్రామస్తులు అప్పులు చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ’సాక్షి’తో పేర్కొన్నారు. అన్ని పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 4,500 – 5,000 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి మూడేళ్లలో సగటున రూ.20 కోట్ల వరకు ప్రయోజనం చేకూరిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 67% చిన్న రైతులే... ఖరీఫ్, రబీ సీజన్లలో సాధారణ సాగు విస్తీర్ణం 60 లక్షల హెక్టార్లు కాగా ఉద్యాన పంటలు 17 లక్షల హెక్టార్లలో సాగవుతుంటాయి. రైతు కుటుంబాలు దాదాపు 80 లక్షల వరకు ఉండగా 67 శాతం చిన్న రైతులే ఉన్నారు. వీరిలో ఒక్కో కుటుంబానికి 1.05 ఎకరాల లోపే ఉంది. మరో 20 శాతం కుటుంబాలకు మూడు ఎకరాల లోపు ఉంటుందని అంచనా. తక్కిన 13 శాతం కుటుంబాలకు మాత్రమే మూడు ఎకరాలకు మించి ఉంది. బడ్జెట్లో పెద్దపీట ఏటా బడ్జెట్లో వ్యవసాయశాఖకు కేటాయింపులను ప్రభుత్వం పెంచుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బడ్జెట్లో కనిష్టంగా 9.98 శాతం, గరిష్టంగా 12.54 శాతం కేటాయింపులు ఉండగా ఇప్పుడు 2022–23 బడ్జెట్లో 16.80 శాతం నిర్దేశించడం వ్యవసాయ రంగం పట్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతను వెల్లడిస్తోంది. పథకాలే ఆదుకుంటున్నాయి... ఖరీఫ్‌లో సాగుకు ఏటా రూ.3 లక్షలు అప్పులు చేసి కనీసం రూ.50 వేలు వడ్డీ కింద చెల్లిస్తుంటా. కానీ ఇప్పుడు పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన అగత్యం లేదు. మూడు విడతలుగా వైఎస్సార్ రైతు భరోసా సాయం అందింది. నా భార్యకు పొదుపు సంఘంలో సున్నా వడ్డీ కింద రెండుసార్లు డబ్బులు వచ్చాయి. పిల్లాడి చదువుకు అమ్మ ఒడి అందింది. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. – తాడిబోయిన చంద్రశేఖర్, వల్లభాపురం, గుంటూరు జిల్లా. అప్పులు లేని సేద్యం.. వైఎస్సార్ రైతు భరోసాతోపాటు ఇన్పుట్ సబ్సిడీ రూ.6 వేలు అందాయి. నా బిడ్డకు అమ్మ ఒడి వచ్చింది. పంట నష్టపోతే పరిహారం ఇస్తున్నారు. పెట్టుబడి, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది. – కడిమిశెట్టి విజయ భాస్కరరెడ్డి, గోర్స, కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా. భయం లేదు... భరోసానే క్రమం తప్పకుండా రైతు భరోసా అందుతోంది. గత ఏడాది పంట నష్టపోతే రూ.12 వేలు ఇచ్చారు. బీమా పరిహారం రూ.35,044 అందింది. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చింది. మొత్తంగా మాకు ఏడాది వ్యవధిలో రూ.79,294 అందాయి. ఇప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేదు. పంట పోతే సొమ్ములు రావనే భయం కూడా లేదు. – పితాని అనసూయ, మహిళా రైతు, తాండవపల్లి, అమలాపురం, కోనసీమ. కౌలు కార్డుతో బ్యాంకు రుణం ప్రభుత్వం కౌలు కార్డు (సీసీఆర్సీ) జారీ చేయటంతో పంట సాగుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. గతంలో మాకు వడ్డీ వ్యాపారులే దిక్కు. పంట చేతికి రాకముందే వేధింపులు మొదలయ్యేవి. ఇప్పుడా దుస్థితి లేదు. –సయ్యద్ సుభాని, రైతు, పెదపులిపాక, పెనమలూరు. -
రైతుల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం
కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ఆలోచనా విధానాల ఆధారంగానే రైతుల జీవితాలు మారతాయని, క్షేత్ర స్థాయి నుంచి రైతుల జీవితాలను మెరుగు పర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను సాగులో వినియోగించాలని చెప్పారు. గతేడాది చెరువుల నిండా నీరున్నా.. వరి సాగు చేసేందుకు రైతులు ముందు రాలేదని గుర్తు చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు కింద వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదన్నారు. ఆర్బీకేలు సంపూర్ణ రైతు సేవా కేంద్రాలుగా మారాయన్నారు. సీహెచ్‌సీ గ్రూపుల ద్వారా రూ.15 లక్షల విలువైన పనిముట్లను అందుబాటులో ఉంచుతుందని, నిరుద్యోగులైన వ్యవసాయ పట్టభద్రులకు రూ.10 లక్షల విలువైన కిసాన్ డ్రోన్లను సరఫరా చేస్తుందని తెలిపారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్ పడిందని, ఎక్కడా కూడా నకిలీ విత్తనం అనే మాట వినిపించడం లేదన్నారు. కందుకూరు ప్రాంతంలో వరి, శనగ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేశామని, తాజాగా జొన్నల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నంద్యాలలో పండే రకం జొన్నను ఈ ప్రాంత రైతులు సాగు చేసి విజయం సాధించారని తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటైందన్నారు. రూ.2,738 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు రూ.1000 నుంచి రూ.1500 వరకు ధాన్యం కొనుగోళ్లలో నష్టపోవాల్సి వచ్చిందని, అటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి జొన్నలు ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ ఎస్.పవన్‌కుమార్, వ్యవసాయశాఖ ఏడీఏ శేషగిరి, ఏఓ అబ్దుల్‌రహీం, నాయకులు గణేశం గంగిరెడ్డి, వసంతరావు, ఎం శ్రీనివాసులు, గేరా మనోహర్, కామాక్షినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గడప గడపకీ విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ గత మూడేళ్లుగా రాష్ట్రంలో గడప వద్దకే బ్యాంకింగ్ సేవలు గణనీయంగా విస్తరించాయి. డిపాజిట్లు, రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు, బ్యాంకు శాఖల విస్తరణ, ఏటీఎంలు ఇలా అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) తాజా నివేదికలో పేర్కొంది. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆర్థిక సేవల సమ్మిళిత వృద్ధి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)’ కార్యక్రమంలో భాగంగా రాష్రంలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ)ల సేవలు గణనీయంగా పెరిగాయి. 2020 మార్చి నాటికి 6,264 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండగా 2022 మార్చి నాటికి 38,295 మందికి చేరింది. ఇండియన్ పోస్టల్ బ్యాంక్, ఫినోపేమెంట్ బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల నగదు బదిలీ నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు రాష్ట్ర ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 5,000 జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలన్న ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 567 గ్రామాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలను (సీబీఎస్) అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 5 కిలోమీటర్లకు బ్యాంకింగ్ సేవలు ఉండాలన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 243 గ్రామాలను గుర్తించారు. ఇందులో 229 గ్రామాలకు బీసీలు, పోస్టాఫీసుల ద్వారా సేవలు అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో 334 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతు భరోసా కేంద్రం, సచివాలయాల వద్ద బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. లక్ష్యానికి మించి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గత మూడేళ్లుగా రాష్ట్రంలో మొత్తం రుణాలు లక్ష్యానికి మించి మంజూరవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక రంగం కాకుండా ఇతర రంగాలకు మొత్తం రూ.2,83,380 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఏకంగా 33 శాతం అధికంగా రూ.3,77,436 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మొత్తం రుణాల్లో 40 శాతం ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఇది మన రాష్ట్రంలో 64.97 శాతంగా ఉంది. 2021–22 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.3,26,871 కోట్లు మంజూరయ్యాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి బ్యాంకులు కనీసం 18 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉండగా 42.17% రుణాలను మంజూరు చేశాయి. వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్దేశించుకుంటే బ్యాంకులు ఏకంగా రూ.2,12,170 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి రూ.44,500 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.44,815 కోట్లు మంజూరు చేశాయి. -
ఏపీలో ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ.. రైతుల్లో ఆనందం
-
Andhra Pradesh: రైతన్నలకు రూ.92,000 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: వర్షాలు, తుపాన్ల బారిన పడి రైతన్నలు పంటలు నష్ట పోరాదనే ఉద్దేశంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది. మరోవైపు ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ.71,000 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలుగా మరో రూ.21,000 కోట్లను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాలవారీగా బ్యాంకర్ల కమిటీ సమావేశాలను నిర్వహించి లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసింది. ఈ ఏడాది 5.8 లక్షల మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్) కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్బీకేల వారీగా కౌలు రైతులను గుర్తించి సీసీఆర్ కార్డులను జారీ చేయడంతోపాటు ఇ–క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. గోదావరి డెల్టాకు విడుదలైన సాగునీరు ఖరీఫ్‌లో ముందస్తు సాగునీటి విడుదలకు సంబంధించి ఆయకట్టు వారీగా తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు విడుదల చేసేలా సాగునీటి శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే గోదావరి డెల్టాకు సాగునీటిని ఈ నెల 1వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు సాగునీటి విడుదలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆర్బీకేల స్థాయిలో ఈ నెలలో తొలి శుక్రవారం, మండల స్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశాలను విధిగా నిర్వహించాలని పేర్కొంది. పంటల ప్రణాళికలను ఖరారు చేసి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్బీకేల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నాణ్యత పరీక్షలు నిర్వహించిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 84,542 క్వింటాళ్ల పచ్చి ఎరువు విత్తనాలు, 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 1,71,234 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 19.02 లక్షల టన్నుల ఎరువులను ఖరీఫ్‌లో పంపిణీ చేయనున్నారు. -
ఆర్బీకేల్లోనూ నానో యూరియా
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన నానో యూరియా వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. రానున్న ఖరీఫ్‌లో ఈ యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు వారికి మరింత అందుబాటులోకి ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) నానో టెక్నాలజీ ద్వారా లిక్విడ్ రూపంలో ఈ నానో యూరియాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 500 మిల్లీ లీటర్ల బాటిల్లో ఉండే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానం. బస్తా యూరియా మార్కెట్లో రూ.266.50 ఉండగా, నానో యూరియా బాటిల్ కేవలం రూ.240కే అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, 20వేల మంది రైతులు 34,128 బాటిళ్లు (17వేల లీటర్లు) యూరియాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రబీలో సుమారు లక్ష మందికి పైగా 5,46,012 బాటిళ్లు (2.73 లక్షల లీటర్లు) కొనుగోలు చేశారు. కొరత లేకుండా నిల్వలు.. ముందస్తు ఖరీఫ్ కోసం ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్లో రైతులకు ఏ దశలోనూ ఎరువుల కొరత రానీయకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఖరీఫ్‌లో 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 6.19లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేసింది. సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 2022–23 సీజన్ కోసం 16లక్షల బాటిళ్ల (8లక్షల లీటర్లు) ఇఫ్కో ఏపీకి కేటాయించింది. వీటిలో కనీసం 10లక్షల బాటిళ్లు (5 లక్షల లీటర్లు) ఖరీఫ్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వీటిలో కనీసం 25 శాతం ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ, జింక్, కాపర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయిల్ రన్లో ఉన్న ఈ ఉత్పత్తులను ఖరీఫ్–2023 సీజన్ నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కావాల్సినంత నిల్వలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీలో నానో యూరియా వినియోగం పెరుగుతోంది. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఖరీఫ్ సీజన్ కోసం 8లక్షల లీటర్ల నానో యూరియా బాటిళ్లను ఏపీకి కేటాయించాం. అవసరమైతే కేటాయింపులు మరింత పెంచేందుకు ఇఫ్కో సిద్ధంగా ఉంది. – శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
రైతులకు రూ.700 కోట్లు జమ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం తెలిపారు. ఈ సీజన్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి 21 రోజులు దాటిన రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. -
ముందస్తు ఏరువాకకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ముందస్తు తొలకరికి అన్నదాతలు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. సాగునీటి ప్రణాళికతో పాటు చానళ్ల వారీగా నీటి విడుదల షెడ్యూల్ ఖరారు కావడంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని అదునులో విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవైపు ఆర్బీకేల ద్వారా ప్రచారం చేస్తూ మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నాడు ముక్కారు పంటలు.. ఒకప్పుడు ముక్కారు పంటలు పండిన కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా ప్రాంతాల్లో 2 పంటలు చేతికి రావడం గగనమైపోయింది. ఆంగ్లేయుల కాలం నుంచి ఏప్రిల్–మేలో నిలిపివేసి మే–జూన్‌లో కాలువలకు నీటిని విడుదల చేసేవారు. 1980కు ముందు వరకు ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత పనుల్లో జాప్యం కారణంగా నీటి నిలిపివేత వ్యవధిని 2 నెలలకు పెంచడంతో పాటు మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డెల్టాలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారడంతో ఒకదశలో సాగు సమ్మెకు సైతం సిద్ధపడ్డారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సమృద్ధిగా నీరు మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రైతన్నలు ఏటా సిరుల పంట పండిస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల తర్వాత ముందస్తు సాగుకు సన్నాహాలు చేస్తోంది. అదనపు ఆదాయం.. భూమి సారవంతం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటలను విత్తుకుంటే అక్టోబర్ చివరికి కోతలు పూర్తి కానున్నాయి. మార్చి చివరికల్లా రబీ ముగించుకొని మూడోపంటగా అపరాలు సాగు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా అక్టోబర్–నవంబర్‌లో ఖరీఫ్ పంట, మేలో రబీ పంట వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా కాపాడవచ్చు. మూడో పంటగా అపరాలు సాగు చేస్తే ఎకరాకు కనీసం రూ.30 వేలకు పైగా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. అపరాల కోతల తర్వాత దుక్కులు దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. సీజన్‌కు ముందే ఎరువులు, విత్తనాలు 2022 ఖరీఫ్‌లో 95,23,217 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. సాధారణంగా ఈ సీజన్లో ఏప్రిల్–మేలో 2 లక్షల టన్నులు, జూన్–జూలైలో 3 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయిస్తుంది. ముందస్తు సాగు నేపథ్యంలో వీటిని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించడంతో సరిపడా నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 5.8 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా కాగా 1.50 లక్షల టన్నులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు. జూన్–జూలైలో కనీసం 6 లక్షల టన్నులు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్టిఫై చేసిన 6.52 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేయగా ఇప్పటికే వేరుశనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వరితో సహా మిగిలిన విత్తనాలను జూన్ 1 నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉంచారు. తొలిసారిగా వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మొత్తం వినియోగంలో కనీసం 20–30 శాతం ఎరువులు, 5–10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్బీకేల్లో విస్తృత ప్రచారం గతంతో పోలిస్తే ఈసారి 15–30 రోజులు ముందుగా సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న గోదావరి డెల్టాకు, జూన్ 10న కృష్ణా డెల్టా, పెన్నా ప్రాజెక్టు కింద, జూన్ చివరి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు కింద నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా నీటి పారుదల సలహా మండలి సమావేశాల్లో చానళ్ల వారీగా నీటి విడుదలను, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో పంటల ప్రణాళికలను ఖరారు చేశారు. రైతులను సన్నద్ధం చేసేందుకు ఆర్బీకేల ద్వారా పోస్టర్లు, కరపత్రాలు, టముకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. పాలనకు ప్రకృతి సహకారం... సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల నిండా సమృద్ధిగా నీళ్లుండడంతో దశాబ్దాల తర్వాత రైతులకు ముందస్తుగా నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి ఏర్పాట్లు పూర్తి ముందస్తు సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది?
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? పతాక శీర్షికల్లో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? మీరేం రాస్తే అది నిజమైపోవటానికి ఇవి వైస్రాయ్ రోజులనుకున్నారా రామోజీరావు గారూ? కూలీల ఫొటోలు తీసి వారు రైతులంటూ.. దోపిడీకి గురయ్యారంటూ దుర్మార్గపు రాతలు రాస్తే ఎలా? వారి చేతికందిన సొమ్మును కూడా అందలేదని రాస్తే ఎలా? ఏది నిజమో... ఏది మీ నైజమో చెప్పటానికి మరో మీడియా లేదనుకున్నారా? ఫోటోలతో సహా మీరు వేసిన అబద్ధాలను... వీడియోలతో సహా వివరించడానికి ‘సాక్షి’ ఉందిక్కడ. మీ ‘బాబు’ కోసం జనం మెదళ్లలో ప్రభుత్వంపై విద్వేష భావాలు నాటడానికి ఈ వయసులో కూడా ఇన్ని కాకిలెక్కలు మీకు అవసరమా? కనీసం ఇన్నాళ్లు మీ పత్రికను నమ్మిన జనం కోసమైనా నిజాలు చెప్పరా? ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాలకు పొరుగు రాష్ట్రాలే కాదు.. కేంద్రంతో పాటు అంతర్జాతీయ సమాజమూ సలాం కొడుతోంది. ‘విత్తు నుంచి విక్రయం వరకూ’ అనే నినాదంతో ఊరూరా రైతన్నకు భరోసాగా నిలుస్తున్న ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. అందుకే రామోజీ పథకం ప్రకారం గురువారం ‘ఈనాడు’ పతాక శీర్షికలో ‘ధాన్యంలో దోపిడీ’ అంటూ వీలైనన్ని అబద్ధాలు పోగేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతకు భరోసాయే దక్కటం లేదంటూ మొత్తం వ్యవస్థపైనే విషం గక్కారు. విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో రైతు భరోసా కేంద్రాల మాట అటుంచి.. రైతుకు భరోసాయే లేదు. ధాన్యం సేకరించాలంటూ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే అప్పుడు కొనుగోళ్లకు ఉపక్రమించిన చరిత్ర బాబుది. ఆయన ఐదేళ్ల పాలనలో 2.81 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ఇందుకు రూ.43,134 కోట్లు అయితే, ఇందులోనుంచి రూ.4,838 కోట్లను ఎన్నికల్లో గెలుపుకోసం పసుపు కుంకుమకు మళ్లించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్ ఆ బకాయిలనూ తీర్చి రైతులను గట్టెక్కించారు. అంతేకాదు.. జగన్ ఈ మూడేళ్లలోనే 2.33 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి, ఏకంగా 43,549 కోట్లు చెల్లించారు. రామోజీది ఎంత నిఖార్సయిన జర్నలిజం అంటే.. బాబు ఏమిచేసినా ఆయనకు తప్పు అనిపించదు. ఇప్పుడు ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ చెప్పరు!!. అప్పట్లో సేకరించలేదనికానీ... ఇప్పుడు సేకరిస్తున్న విషయాన్ని కానీ నిజాయితీగా అంగీకరించరు. ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం 6.68 లక్షల రైతులకి చెందిన 52.54 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందంటే రైతులకు ఎంత దన్నుగా నిలుస్తున్నదో అర్థమవుతుంది. ఆర్బీకే అంటేనే... భరోసా పంట విక్రయానికి సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాలన్నదే ఆర్బీకేల లక్ష్యం. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నేరుగా కొనుగోలు చేయడానికే ఈ ఏర్పాటు. ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు అమ్మాలనుకున్న రైతులు తొలుత వారి పంట, బ్యాంకు ఖాతా వివరాలను ఈ–క్రాప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవటం తప్పనిసరి. దీన్నిబట్టే ఆర్బీకేలు సేకరణ మొదలెడతాయి. ఇక రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్లైన్లో నగదు చేరిపోతుంది. 16నే మేకా సూర్యనారాయణకు హమాలీ చార్జీని చెల్లించిన చెక్కు ఈ మేరకు వీలు కల్పించే ధాన్యం సేకరణ పోర్టల్‌ను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా టీసీఎస్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోకున్నా... కౌలు రైతు కార్డు లేకున్నా అలాంటి వారు ఒకరో ఇద్దరో ఇబ్బంది పడొచ్చు. కానీ దాన్ని సార్వత్రికం చేస్తూ... యావత్తు రైతాంగం దోపిడీకి గురయిపోతున్నారని రామోజీ ఆక్రోశించటమే దుష్ప్రచార యుద్ధంలో కీలక ఘట్టం. ఆర్బీకేల ద్వారా సమీకరించేందుకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే సరఫరా చేయటంతో పాటు... హమాలీ చార్జీలనూ అందజేస్తోంది. అందరి ఖాతాల్లోనూ ఈ సొమ్ము పడుతున్నా... ఎవ్వరికీ దీని గురించి తెలియదన్నట్లుగా రాయటమే చిత్రాతిచిత్రం. నాణ్యమైన బియ్యం కోసం.. బాబు హయాంలో సేకరించటమే అరకొరయితే... అలా సేకరించిన దాన్లో ముక్కిపోయిన, నూకలుగా మారిపోయిన బియ్యాన్ని మాత్రమే రేషన్ డిపోలకు సరఫరా చేసేవారు. అప్పట్లో రేషన్ బియ్యం తినేవారు అతితక్కువ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయటానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలూ తీసుకోవటంతో... దీనికి అవసరమైన సార్టెక్స్ రైస్‌ను మిల్లింగ్ చేయడానికి రైస్ మిల్లులకు అదనంగా క్వింటాలుకు రూ.110 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఫోర్టిఫైడ్ బ్లెండింగ్ కోసమూ అదనపు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తున్నారు. అందుకే నాణ్యమైన బియ్యం రేషన్ కార్డు దారులకు చేరుతోంది. వారంతా తమ ఇళ్లలో వీటిని వాడుతున్నారు. కాకపోతే ఈ నిజాలేవీ ‘ఈనాడు’ రాయదు. రైతు కూలీల్ని ఫోటోలు తీసి... రైతులంటూ అబద్ధపు రాతలు మాత్రం రాస్తుంది. ఎందుకంటే రామోజీ లక్ష్యం... అడ్డూ అదుపూ లేని దుష్ప్రచారం మరి!!. రామోజీ రాసిన ఈ రైతుల సంగతి చూస్తే... ఇన్నాళ్లూ అబద్ధాలను ‘ఈనాడు’ ఎంత అందంగా అచ్చేసిందో అర్థమవుతుంది. ఒక్కో రైతు కథనూ చూస్తే... ‘ఈనాడు’ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉండవల్లి వీరభద్రరావు నాలుగెకరాల్లో వరి వేశారు. షావుకారులే కొంటున్నారని, బస్తాకు రూ.1,380 ఇస్తామన్నారని, అంతకన్నా ఎక్కువ జమయితే తెచ్చి కమీషన్ దారుకు ఇవ్వాలన్నారని ఆయన చెప్పినట్లు రాశేశారు. పోయిన పంటకూ ఇలాగే చేసారని, హమాలీ, రవాణా చార్జీలు ఇస్తారనే విషయం తమకు తెలియదన్నట్లు కూడా రాశారు. కానీ నిజమేంటో తెలుసా? ఉండవల్లి వీరభద్ర రావు పేరిట పొలం లేదు. ఆయన భార్య ఉండవల్లి పద్మావతి పేరిట పొలం ఉండటంతో అమ్మిన ధాన్యం సొమ్ము ఈ ఏడాది జనవరి 3న NPCI ద్వారా నేరుగా రైతు ఖాతాలో (యూనియన్ బ్యాంక్ ) జమ అయింది. హమాలీ చార్జీల రూపేణా ఈ నెల 4న రూ.1,740 జమయింది. దీన్ని పద్మావతి స్వయంగా చెప్పారు. ఐదు నెలల కిందట సొమ్ము జమైనా... నెల కిందట హమాలీ చార్జీలు వచ్చినా... ఈ అబద్ధపు రాతలెందుకు? ఎవరిని నమ్మించడానికి? రామోజీ రాతల ప్రకారం రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మేకా వీర సూర్యనారాయణ 12 ఎకరాల్లో వచ్చిన ధాన్యం అమ్మారు. లిస్టులో పేరున్నా డబ్బులివ్వడం లేదు. అమ్మి 5 నెలలైనా ఇప్పటిదాకా హమాలీ చార్జీలు ఇవ్వలేదు. డీసీసీబీకి వెళ్లినా పనికాలేదు!!. ఆర్బీకే ఇచ్చిన రసీదు ఇక వాస్తవం చూద్దాం... రైతు మేకా వీర సూర్యనారాయణ అమ్మిన ధాన్యము యొక్క హమాలీ చార్జీలు రూ.2,520 ఈ నెల 16నే చెక్కు రూపంలో ఆయనకు అందాయి. ఇది ఆయనే అంగీకరించారు. కానీ.. రామోజీ తనకు తోచినట్లు రాసేశారు. ‘ఈనాడు’ కథనం మేరకు... రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన కొండపల్లి వెంకట సత్యనారాయణ అనే రైతు ఐదున్నర ఎకరాల్లో వరి వేశారు. బస్తా రూ.1,380కి అమ్మారు. తామే మిల్లుకు తీసుకెళితే బస్తాకు రూ.1,455 ఇస్తారన్నారని, లేకుంటే రూ.1,380 ఇస్తామన్నారని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెమ్ము చేరిందన్నారని, ఎంత తరుగు తీసేస్తారో తెలియడం లేదని ఆయన వాపోయినట్లు రాసిపారేశారు. కానీ వాస్తవమేంటో తెలుసా? కొండపల్లి వెంకట సత్యనారాయణ కౌలు రైతు అని ‘ఈనాడు’ రాసింది తప్ప... ఆయన ఎక్కడ కౌలు రైతుగా నమోదు చేసుకున్నారో రాయలేదు. ఆయన కూడా... తానెక్కడా నమోదు చేసుకోలేదని, తనకు సీసీఆర్సీ కార్డు కూడా లేదని స్పష్టం చేశారు. మరి ఈ–క్రాప్‌లో నమోదు కాకుండా ఆ పంటనెలా కొంటారు? సీసీఆర్సీ కార్డు లేనిదే కౌలు రైతు ఎలా అవుతారు? రాసేముందు ఈ మాత్రం చూసుకోవద్దా రామోజీరావు గారూ? ఇక రామోజీ రాతల్లో డొల్లెంతో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రత్తిపాడు గ్రామంలో మన్యం గోపాలకృష్ణ ఐదెకరాల్లో వరి వేసారని, ఎకరాకు 30–35 బస్తాలొస్తుండగా 3 రోజులుగా ఎండబెడుతున్నారని రాశారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఈ తిప్పలు పడలేరు, కమీషన్.దారులకు ఇచ్చేయమన్నారని... మిల్లులకు తీసుకెళితే తేమ, నూక తేడా ఉంటే బస్తాకు రూ.200/– కోత పెడతామన్నారని, ఆర్బీకేల్లో సంచులు ఇవ్వడం లేదని ఆయన , చెప్పినట్లుగా రాసేశారు. అందుకే కమీషన్ దారులకు ధాన్యం ఇస్తున్నారని సూత్రీకరించారు. ‘ఈనాడు’ రాయని నిజమేంటంటే మన్యం గోపాల కృష్ణ వ్యవసాయ కూలీ. తనకు పొలం లేదు. ఆయన పొలంలో ధాన్యం పట్టుబడి చేస్తుంటే ‘ఈనాడు’ బృందం వెళ్లి ఫోటో తీసుకుంది. పేపర్లో ఏం రాశారో తనకు తెలియదని, తానైతే వాళ్లతో ఏమీ చెప్పలేదని ఆయన వాపోయాడు. తమ గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నారని, సంచుల కొరత లేదని కూడా చెప్పాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరిస్తున్నాయి.. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక రైతుల కోసం రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, అధిక మద్దతు ధర, ఉచిత విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన, కస్టమ్ హైరింగ్ సెంటర్ల వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల రైసు మిలర్ల పాత్ర వల్ల రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో మొత్తం వ్యవస్థ తప్పుగా ఉందని నేనన్నట్లు వక్రీకరించి రాశారు. ఇది సరికాదు. నేను ఈ అంశాన్ని చెప్పిన వెంటనే వ్యవసాయ మంత్రి, పౌర సరఫరాల మంత్రులు నాతో మాట్లాడి దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు. – పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ నిజానికి రైతు భరోసా కేంద్రాలు ఎంత అండగా నిలుస్తున్నాయో ఏ ఊళ్లో ఏ రైతును కదిలించినా తెలుస్తుంది. అలాంటి కొందరు రైతుల అభిప్రాయాలివీ.. పంట నష్టం కూడా అందింది... మాకు రామచంద్రపురం మండలం చోడవరంలో మూడెకరాల వరిపొలం ఉంది. ప్రతి సీజన్లో పంట నమోదు చేస్తున్నా. మూడేళ్లుగా రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయం అందుతోంది. తొలకరిలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయినా... ఆర్బీకేలోని గ్రామ వ్యవసాయ సహాయకుడు దాని వివరాలు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందింది. నేను పండించిన ధాన్యాన్ని మూడేళ్లుగా ఆర్బీకే ద్వారానే విక్రయిస్తున్నా. ఖరీఫ్‌లో క్వింటాలుకు రూ.1940 ధాన్యం సొమ్ము గతంలో 21 రోజులకు అందింది. హమాలీ ఖర్చులు క్వింటాలుకు రూ.25 చొప్పున చోడవరం సొసైటీ ద్వారా చెక్కు రూపంలో అందజేశారు. ఎరువుల కోసం తిప్పలు లేకుండా ఆర్బీకే నుంచే యూరియా, డీఏపీ అందాయి. – గుణ్ణం రామకృష్ణ, రైతు, చోడవరం, కోనసీమ జిల్లా తూకం.. లెక్కల్లో తేడాలు లేవు.. ఐదెకరాలు కౌలుకు తీసుకుని రబీ పంట సాగు చేశా. రెండెకరాల్లో కోత కోశా. 77 బస్తాల ధాన్యం వచ్చింది. ఆర్బీకేలో గురువారం విక్రయించాను. బస్తాకు రూ.1,455 చొప్పున 77 బస్తాలకు రూ.1,12,035 నగదు ఇస్తామని రసీదు ఇచ్చారు. హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.25 ఇస్తున్నారు. తూకం, లెక్కల్లో తేడాల్లేవు. అదే ధాన్యాన్ని గ్రామంలోని దళారి వద్దకు తీసుకెళితే బస్తాకు రూ.1,300 ఇస్తానన్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే న్యాయం జరుగుతోంది. మిగిలిన మూడెకరాలూ కోత కోశాక ఆర్బీకేలోనే విక్రయిస్తా. – మొర్త అప్పారావు, కేశనకుర్రు గ్రామం, పెదలంక -
అన్నదాతలకు ఆత్మస్థైర్యమై..
ఆత్మకూరు (చేజర్ల): వ్యవసాయ రంగంలో మహిళలు గురువుల పాత్ర పోషిస్తున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు సంబంధించి భూమిని సాగుకు సిద్ధం చేయడం దగ్గరి నుంచి.. నూర్పిడి, విత్తనాల నిల్వ వరకు వ్యవసాయ క్షేత్ర సహాయకులుగా, అధికారులుగా, శాస్త్రవేత్తలుగా బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అండగా ఉంటూ విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పంటల్లో నూతన ప్రయోగాలు చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంపై ఆసక్తితో అభ్యసించిన చదువు పది మందికి ఉపయోగపడాలనే ఆశయంతో ఈ రంగాన్ని ఎంచుకుని పలువురు క్షేత్ర సహాయకుల నుంచి శాస్త్రవేత్తల వరకు రాణిస్తున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం 10,441 చదరపు కి.మీ. విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా అవతరించిన సింహపురి.. అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. జిల్లాలోని 38 మండలాల్లో దాదాపు 15 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వరితో పాటు ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. ఆయా శాఖల్లో అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు 291 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో అత్యధికులది వ్యవసాయ కుటుంబ నేపథ్యం కాగా, మరి కొందరు ఉద్యోగ, వ్యాపార నేపథ్య కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. జిల్లాలోని 38 మండలాల్లో (కొత్తగా కలిసిన కందుకూరుతో కలిపి) వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో 50 శాతానికి పైగా మహిళలే పని చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ (ఏఆర్సీ), కిసాన్ వికాస్ కేంద్రం (కేవీకే)ల్లోనూ మహిళలే అధికంగా ఉన్నారు. సేద్యంలో.. సేవల్లో సంపూర్ణం వ్యవసాయశాఖలో బహుముఖ పాత్రలు పోషిస్తున్న మహిళలు సేవల్లో సంపూర్ణతగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పారదర్శకంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకే చేరేలా బాధ్యత వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో వాటి అమలు కోసం నిత్యం రైతుల మధ్యనే వ్యవసాయాధికారిణులు సిబ్బంది ఉండాల్సిన పరిస్థితి. అను నిత్యం రైతులతో మమేకమై వారి అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ఉత్తమ అవార్డులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. వీరు పురుషులకు దీటుగా తమ విధులు నిర్వహిస్తూ పలువురికి వ్యవసాయంపై ఆసక్తి కలిగేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రైతులు ఆనందంగా ఉండాలి నా తండ్రి రాజశేఖర్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో మేనమామ పీర్ల సుబ్బయ్య నన్ను చదివించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. దీంతో నాకు వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. ఎంతో కష్టపడే రైతులు ఆనందంగా ఉండాలంటే వారికి ప్రభుత్వ సహకారం, అధికారుల అండదండలు తప్పనిసరి. రైతులకు సేవలు అందించే ఈ ఉద్యోగంలో చేరేందుకు నాకు స్ఫూర్తిగా నిలిచింది. యనమదల ఆర్బీకేలో రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులందరికీ అందేలా చేస్తున్నా. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పొలాలకే వెళ్లి పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాను. – వీ హేమలత, ఏఏఓ, యనమదల రైతుల అభ్యున్నతికి కృషి మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు వెంకటరమణయ్య, వెంకటసుబ్బమ్మ. కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం మా స్వగ్రామం. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయశాఖలో ఉద్యోగం సంపాదించి వారి అభ్యున్నతికి నా వంతు కృషి చేద్దామని ఆసక్తితో ఈ విధుల్లో చేరా. సొంత మండలంలోనే ఆరేళ్లు ఏఓగా పని చేసి నా శక్తి మేర రైతులకు సహకరించాను. ప్రస్తుతం ఏడీగా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లో రైతుల అభివృద్ధి కోసం ఏఓలను, ఏఏఓలను సమాయత్తం చేస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాను. మహిమలూరులో రైతులను ప్రోత్సహించి గతంలో కంటే ఎక్కువ ధాన్యం దిగుబడులు సాధించేలా చేయడం నాకు సంతోషం కలిగించిన విషయం. నా సేవలను గుర్తించి ఉత్తమ వ్యవసాయాధికారిణిగా జిల్లా స్థాయిలో అవార్డు సాధించడం మరువలేని విషయం. – వట్టూరు దేవసేన, ఏడీ, ఆత్మకూరు నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యం మా తల్లిదండ్రులు పెద్ది పోశయ్య, కొమరమ్మలతో చిన్న వయస్సు నుంచే తోటల్లో తిరగడం నాకు అలవాటు. దీంతో వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. జిల్లాలోని కొన్ని భూముల్లో నీటి లభ్యత తక్కువగా ఉండడం, ధాన్యం తదితర పంటలు ఆ భూముల్లో సాగు చేసే కంటే ఉద్యానవన పంటల సాగుకు ఆ భూములు అనుకూలంగా ఉండడంతో ఆ దిశగా గ్రామాల్లో రైతులను ప్రోత్సహించి నాణ్యమైన ఉత్పత్తులు సాధించే లక్ష్యంతో కృషి చేస్తున్నాను. జిల్లాలో సుమారు 38 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. రైతలకు పెరిగిన సాంకేతిక గురించి వివరిస్తూ ఉద్యానవన పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి ఉపయోగపడేలా చేస్తున్నా. నా పరిధిలోని మూడు మండలాల్లో నిమ్మ, మామిడి, సపోటా, జామ, బొప్పాయి తోటలు సాగవుతున్నాయి. ఉద్యానవన సాగు కోసం రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను వారికి అందేలా చేయడంలో సహకరిస్తున్నాను. – ఉద్యానవనశాఖ అధికారిణి, పెద్ది లక్ష్మి, చేజర్ల ఇష్టంతో చేస్తున్నా మా తాతయ్య దగ్గర పెరుగుతూ ఏఎస్‌పేట మండలం గుంపర్లపాడులో ఆయనతో కలిసి పొలాలకు వెళ్తూ ఉండడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగం సైతం రైతులకు అందుబాటులో ఉంటూ ఇష్టంతోనే పని చేస్తున్నాను. నా ఆర్బీకే పరిధిలో రైతులకు అందుబాటులో ఉంటూ సబ్సిడీ పథకాలతో వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు వారికి అందేలా చూస్తున్నా. గతంలో బట్టేపాడు ఆర్బీకే కేంద్రంలో పని చేస్తున్న క్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఏఏఓగా అవార్డు పొందాను. దీంతో విధులపై మరింత బాధ్యత పెరిగింది. మా తండ్రి మల్లెం కొండయ్య, వసంతమ్మ ఆత్మకూరులో చిన్న నాటి వ్యాపారం చేస్తున్నారు. నేను చేజర్ల మండలం మడపల్లి ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్నాను. – ఏ మమత, ఏఏఓ, మడపల్లి -
ఈనాడు విషపు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: ఈనాడు విషపు రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ‘పొలమే లేని వ్యక్తి ఆర్బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించింది. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారు. రైతులకి మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నాం. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదు’ అని మంత్రి అన్నారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. 68 వేల రైతులు తూర్పుగోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని, ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అదికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
20 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం నాణ్యమైన, ధ్రువీకరించిన వేరుశనగ విత్తనాలను ఈ నెల 20వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కె–6, నారాయణి, కదిరి లేపాక్షి (కె–1812) రకాల విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి రైతులకు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. గత సీజన్లో మాదిరిగానే ఈ విత్తనాల్లో మూడోవంతును సొంతంగా అభివృద్ధి చేసిన వాటినే పంపిణీ చేయనుంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 17.90 లక్షల ఎకరాలు కాగా గతేడాది 18.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 5.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.5,550 కాగా గతేడాది రూ.6,500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలు కాగా, మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధర లభిస్తుండడంతో ఈసారి కూడా లక్ష్యానికి మించే సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సర్టిఫై చేసిన సొంత విత్తనం సబ్సిడీ విత్తనం కోసం గతంలో పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడే వాళ్లు. కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే సబ్సిడీపై పంపిణీ చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ కనీసం మూడోవంతు విత్తనమైనా సొంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత సీజన్ నుంచి సొంత విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. రబీ 2020–21లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, ఆ తర్వాత సర్టిఫై చేసి ఖరీఫ్–2021లో పంపిణీ చేశారు. గడిచిన రబీ 2021–22లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లలో సర్టిఫై చేసి ఖరీఫ్ సీజన్ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న 3,95,761 క్వింటాళ్ల విత్తనాల్లో.. లక్ష క్వింటాళ్లు రబీలో రైతులు ఉత్పత్తి చేసినవే. టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించే మిగిలిన విత్తనాన్ని సైతం ర్యాండమ్‌గా అగ్రి ల్యాబ్స్‌లో సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. అదేరోజు నుంచి కిలో రూ.85.80 ధర ఉన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను రూ.51.48కి రైతులకు పంపిణీ చేయనున్నారు. రైతుకు నాణ్యమైన విత్తనం విత్తనోత్పత్తి చేసే రైతు నుంచి నేరుగా విత్తనాలు సేకరిస్తున్నాం. ప్రతి పైసా వారి ఖాతాకే జమచేస్తున్నాం. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సాగుచేసే రైతుకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పోటీపడుతున్నాయి. సర్టిఫై చేసిన విత్తనాన్ని ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
ఉద్యాన విస్తరణకు డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వన్‌స్టాప్ కేంద్రాలుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ స్ఫూర్తితో ఉద్యానరంగంలో డిజిటల్ విస్తరణ సేవలకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా వర్సిటీకి అనుబంధంగా ఉన్న 42 సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానిస్తూ ‘రీచింగ్ ది అన్ రీచ్డ్’ అనే నినాదంతో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. డిజిటల్ సమాచార వ్యవస్థను శాటిలైట్ సమాచార వ్యవస్థకు అనుసంధానం చేస్తూ పరిశోధనల ఫలితాలతో పాటు సాంకేతిక సమాచారాన్ని నేరుగా రైతులకు చేరవేస్తోంది. అందుబాటులోకి తీసుకొచ్చిన విస్తరణ సేవలిలా.. రైతు సలహా కేంద్రం ద్వారా వర్సిటీలోని 42 సంస్థలను అనుసంధానం చేసి సాంకేతికతను బదలాయిస్తున్నారు. ఫోన్ నంబరు 96180 21200 ద్వారా రైతులకు విస్తరణ సేవలతోపాటు నిరంతర సలహాలందిస్తున్నారు. మొక్కల పరిరక్షణ సలహా కేంద్రం (ప్లాంట్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సెల్) ద్వారా వివిధ ఉద్యాన పంటలను ఆశిస్తున్న చీడపీడలపై నిఘా ఉంచుతూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉద్యాన నైపుణ్య శిక్షణ కేంద్రంలో రైతులతో పాటు యువత, మహిళలకు నైపుణ్యతలో శిక్షణనిస్తున్నారు. అడ్వాన్స్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, పనస, తాటి, జీడిమామిడి తదితర పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్–విలువ జోడింపు, అడ్వాన్స్ నర్సరీ యాజమాన్యం, చిన్న తరహా పౌల్ట్రీ ఫామ్స్ నిర్వహణ, ఆక్వాసాగు, పుట్టగొడుగుల పెంపకం, జీవనియంత్రణ కారకాల ఉత్పత్తి–వాడకం వంటి విషయాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హార్టీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్’ ద్వారా ఉద్యాన, వ్యవసాయ పట్టభద్రులతోపాటు గ్రామీణ యువత, మహిళలను ఉద్యానరంగంలో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కౌన్సెలింగ్, టెక్నికల్–బిజినెస్ మానిటరింగ్, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెన్సీ, బిజినెస్ ప్లాన్ తయారీ, ఇంక్యుబేషన్, పైలెట్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్ శిక్షణ కేంద్రం ద్వారా వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కియోస్క్ ద్వారా ఉద్యానపంటల సాగు విధానాలు, సస్యరక్షణ చర్యలు, సాంకేతిక విధానాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. రైతులతో వెబినార్లు, శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యానవాణి–90.8 ఎఫ్ఎం (కమ్యూనిటీ రేడియో స్టేషన్) ద్వారా రోజు వాతావరణం, నెలవారీ ఉద్యానపంటల్లో చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన సలహాలు సూచనలు ప్రసారం చేస్తున్నారు. వర్సిటీ కార్యక్రమాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడే రైతుల కోసం అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఉద్యానబంధు యాప్ ద్వారా 33 రకాల ఉద్యానపంటల సాగు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఇతర ప్రముఖ చానళ్ల ద్వారా ఫోన్ ఇన్ లైవ్, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 50కిపైగా పంటల వారీగా రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు, ఆర్బీకే సిబ్బందిని భాగస్వామ్యం చేశారు. వీటిద్వారా రైతులతోపాటు గ్రామీణ యువత, మహిళలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వర్సిటీ అనుబంధ సంస్థలను ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్, ఆర్బీకే చానల్ ద్వారా పరిశోధన ఫలితాలు, సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్ విభాగం ద్వారా నూతన సాంకేతిక విధానాలపై శాస్త్రవేత్తలు, çసంబంధిత నిపుణులతో రికార్డు చేసి ఆర్బీకేల్లోని స్మార్ట్ టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆర్బీకేలకు అనుసంధానించాం గుణాత్మక విద్య, పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేసే లక్ష్యంతో విస్తరణ విభాగాన్ని బలోపేతం చేశాం. వర్సిటీలోని 42 సంస్థల ద్వారా నిరంతరం ప్రత్యక్ష, అంతర్జాల మాధ్యమాల ద్వారా పలు సంప్రదాయ విస్తరణ కార్యక్రమాలను రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. శాస్త్ర, సాంకేతిక సమాచారం అందించడం ప్రధాన లక్ష్యంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఇవి పనిచేస్తున్నాయి. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్ -
ఖరీఫ్‌కు ముందే ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్‌కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘వైఎస్సార్ రైతు భరోసా’ నగదు అందజేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 1,12,843 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.84.63 కోట్లు జమ కానుంది. పల్నాడు జిల్లాలో 2,43,492 మంది రైతులకుగాను రూ. 182.62 కోట్ల జమ కానున్నాయి. బాపట్ల జిల్లాలో 1,63,692 మంది రైతులకు రూ. 122.76 కోట్ల లబ్ధి కలగనుంది. ముందస్తుగా సాయం... ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఇందులో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా సోమవారం పీఎం కిసాన్తో కలిపి రూ.7,500 జమ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓలు, సచివాల య అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అర్హులందరికీ వర్తించేలా... వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు, దేవదాయ, అటవీ, వక్ఫ్ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధీమాతో సాగుకు సై... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేలా విత్తు మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోంది. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తుండటంతో రైతులు ధీమాతో సాగుకు సై అంటున్నారు. (చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
ఆఫ్రికాలో ఆర్బీకేలు!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల వరకు గ్రామస్థాయిలో రైతన్నలకు సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆఫ్రికా దేశాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆర్బీకేలు అనుసరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక చేయూతను అందించనుంది. ఇథియోపియా ప్రతినిధి బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పు వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఆర్బీకే వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. 10,778 ఆర్బీకేలు రైతులకు ఇంటి ముంగిటే అన్ని సేవలు అందిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, మిశ్రమ దాణా, రొయ్యలు, చేపల మేత.. ఇలా సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేలు సమకూరుస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కళ్లాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. వీటి సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఒ) ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘చాంపియన్’ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయి. ఇథియోపియాలో సమృద్ధిగా సాగు భూములు ఆఫ్రికాలో అత్యంత పేద దేశమైన ఇథియోపియాకు వ్యవసాయం, పాడి రంగాలే ఆర్ధిక పునాది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 46.3 శాతం ఈ రంగాల నుంచే వస్తున్నప్పటికీ ఏటా 4.6 మిలియన్ల మంది ఆహార కొరతతో సతమతమవుతున్నారు. మొక్కజొన్న, కాఫీ, పప్పులు, తృణధాన్యాల సాగులో ప్రత్యేక స్థానం పొందిన ఇథియోపియాలో సాగు యోగ్యమైన భూములు విస్తారంగా ఉన్నాయి. సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తేవడం, రైతుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, ఉత్పత్తి ఖర్చులను నియంత్రించడం, నాణ్యతతో కూడిన దిగుబడులను సాధించే లక్ష్యంతో సౌత్సౌత్ కో ఆపరేషన్ భాగస్వామి దేశాల్లో అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇథియోపియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్బీకేల తరహాలో అక్కడ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్బీకేలను సిఫార్సు చేసిన కేంద్రం ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్‌లో ఆర్బీకేల సేవల గురించి ప్రపంచ బ్యాంకు బృందానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఆర్బీకే తరహా వ్యవస్థను ఇథియోపియాలో ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో మరోసారి భేటీ కానున్న ఇథియోపియా–వరల్డ్ బ్యాంక్ –కేంద్ర బృందాలు అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. జూన్ లేదా జూలైలో ఇథియోపియా వ్యవసాయశాఖ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఆర్బీకేల సేవలు, విస్తరణ కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. అనంతరం మన రాష్ట్ర ప్రతినిధి బృందం ఇథియోపియాలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తుంది. మన శాస్త్రవేత్తలు, అధికారులు ఇథోయోపియాలో సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆర్బీకేల సాంకేతికతను తీసుకురావడంపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలైన ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. ఐరాస –ఎఫ్ఏవో చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలను నామినేట్ చేసిన కేంద్రం తాజాగా ఏషియన్ ఫసిపిక్ సమ్మిట్‌లో ఇథియోపియా కోసం వీటిని వరల్డ్ బ్యాంక్‌కు సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూతతో ఈ ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇది మన ఆర్బీకేలకు దక్కిన మరో గౌరవం. –పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను
అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన ఇతడి పేరు ఉయ్యూరు రామనరేష్. రెండు గేదెలు, రెండు ఆవులున్నాయి. గతంలో మార్కెట్లో దొరికే నాసిరకం దాణా వినియోగించటం వల్ల ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వచ్చేది కాదు. పైగా పశువులు తరచూ అనారోగ్యం బారిన పడేవి. దీంతో ఆర్బీకేల ద్వారా ఇస్తున్న నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్) తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడి పశువులు రోజుకు 1–2 లీటర్ల పాలను అధికంగా ఇస్తున్నాయి. ఆ పాలలో వెన్న శాతం కూడా పెరగడంతో మంచి ఆదాయం వస్తోందని, తానిప్పటి వరకు కిలో రూ.6.50 చొప్పున 200 కిలోల టీఎంఆర్ తీసుకున్నానని రామనరేష్ ఆనందంతో చెబుతున్నారు. సాక్షి, అమరావతి: పాడి పశువులకు నాణ్యమైన పశుగ్రాసం, దాణా అందిస్తే అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పాలను ఇస్తాయి. మరోవైపు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. నాణ్యమైన పాల దిగుబడి వస్తే పాడి రైతుల ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్నాళ్లూ పశుగ్రాసం, దాణా కోసం పాడి రైతులు పాట్లు పడేవారు. వాటికి చెక్ పెడుతూ ఏడాదిగా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్న పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్), నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాలు, లివర్ టానిక్స్ తదితర పోషక మిశ్రమాలతోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు (చాప్ కట్టర్స్) వంటి వాటిని సబ్సిడీపై ఇస్తుండటంతో రైతుల వెతలు తీరుతున్నాయి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ 11ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. సర్టిఫై చేసిన పశుగ్రాసం.. సంపూర్ణ మిశ్రమ దాణా పశుగ్రాసం కొరతకు చెక్ పెట్టేందుకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన జొన్న (సీఎస్హెచ్–24 ఎంఎఫ్ రకం), మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ రకం) పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదిలో 1.41 లక్షల మంది రైతులకు రూ.15.81 కోట్ల విలువైన 1,500 టన్నుల జొన్న, 489 టన్నుల మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు సరఫరా చేసింది. వీటిని 1,05,531 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 4.21 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని రైతులు ఉత్పత్తి చేసుకుని పశుగ్రాసం కొరతను అధిగమించారు. మరోవైపు అత్యంత పోషక విలువలు గల సంపూర్ణ మిశ్రమ దాణాæ(టీఎంఆర్)ను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. దీనిని వాడటం వల్ల పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇతర దాణాలేవీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సర్టిఫై చేసిన మిశ్రమ దాణా కిలో రూ.15.80 కాగా.. రైతులకు సబ్సిడీపై రూ.6.50కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతి పాడి రైతుకు రెండు నెలలకు ఒకసారి 60 శాతం సబ్సిడీపై గరిష్టంగా 1,800 కిలోల చొప్పున ఇస్తోంది. ఇప్పటివరకు రూ.29.43 కోట్ల విలువైన 18,625 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ దాణాను 46,563 మంది రైతులకు పంపిణీ చేసింది. మరోవైపు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు ఆర్బీకేల ద్వారా 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తోంది. 2 హెచ్‌పీ 3 బ్లేడ్ చాప్ కట్టర్ ఖరీదు రూ.33,970 కాగా, సబ్సిడీ పోనూ రూ.20,382కే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.4.52 కోట్ల విలువైన 2,173 చాప్ కట్టర్స్‌ను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా గతంలో నాణ్యమైన దాణా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఆర్బీకే ద్వారా ఇప్పటివరకు 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా. బుక్ చేసుకున్న వారం లోపే అందిస్తున్నారు. దీని వినియోగంతో పాల దిగుబడి, నాణ్యత కూడా పెరిగింది. – పద్మజా భాను, దేవికొక్కిరపల్లి, యలమంచిలి పశుగ్రాసం వృథా కావడం లేదు నాకు 12 గేదెలు, 3 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. మాది కరువు ప్రాంతం కావడంతో పశుగ్రాసం కొరత ఎక్కువ. దూరప్రాంతాల నుంచి పశుగ్రాసం తెచ్చుకున్నా చాలావరకు వృథా అయ్యేది. 2 హెచ్‌పీ సామర్థ్యం గల చాప్ కట్టర్ కోసం ఆర్బీకేలో బుక్ చేశా. దీన్ని ఉపయోగించడం వల్ల పశుగ్రాసం వృథా కావడం లేదు. – డి.మోహన్‌దాస్, వీరుపాపురం, కర్నూలు జిల్లా ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, సర్టిఫై చేసిన పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, ఖనిజ లవణ మిశ్రమాలతో పాటు గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నాం. వీటివల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు తోడుగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడంతోపాటు తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక అవార్డు ‘చాంపియన్’కు నామినేట్ అయిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు)అందిస్తున్న సేవలను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. వన్ స్టాప్ సెంటర్.. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకే చేర్చే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. నాలెడ్జ్ హబ్‌లుగా రూపుదిద్దుకుని నాణ్యమైన ఇన్పుట్స్ అందిస్తున్నాయి. వైఎస్సార్ పొలం బడులతో పాటు తోట, పట్టు, పశు విజ్ఞాన, మత్స్యసాగులో రైతులకు మెళకువలు సూచిస్తున్నాయి. పంట ఉత్పత్తులను గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. కూలీల కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, మార్కెటింగ్ కోసం మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే ఛానల్‌ను తీసుకొచ్చింది. ఇలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ‘వన్ స్టాప్’ సెంటర్ కింద అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ సంస్థల అధ్యయనం.. పలు రాష్ట్రాలు ఆర్బీకేల తరహా వ్యవస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు ఏపీలో పర్యటించి ఆర్బీకేల పనితీరుపై అధ్యయనం చేశాయి. నీతి ఆయోగ్, నాబార్డు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆర్బీఐ.. ఇలా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలపై అధ్యయనం చేపట్టాయి. కాల్‌సెంటర్ సేవలు... టోల్‌ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఇప్పటి వరకు 4.50 లక్షల మంది రైతులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కాల్ సెంటర్లో శాస్త్రవేత్తలు, 70 మందికి పైగా సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామ సేవలందిస్తున్నారు. 1.75 లక్షల సబ్‌స్క్రిప్షన్‌తో ఆర్బీకే ఛానల్ అంతర్జాతీయ మన్నన్నలందుకుంటోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 680కు పైగా వీడియోలను ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. తెలంగాణలో కాల్ సెంటర్, రైతు ఛానల్ ఆర్బీకేల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ‘రైతు వేదిక’ల ద్వారా సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఆర్బీకేలను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వాటి సేవలు ఎంతో బాగున్నాయని అభినందించారు. ఆర్బీకే వ్యవస్థ వినూత్నమని ప్రశంసించారు. ఈ సేవలను తెలంగాణ రైతులకు కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, స్పెషల్ కమిషనర్ కేజే హనుమంత్ నేతృత్వంలోని బృందాలు కూడా పలు దఫాలు ఆర్బీకేలపై అధ్యయనం చేశాయి. ఆ బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆర్బీకేల తరహా సేవలను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సమీకృత రైతు సమాచార కేంద్రం (కాల్ సెంటర్), ఆర్బీకే ఛానల్ తరహాలో రైతు ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్బీకేల్లో డిజిటల్ లైబ్రరీలతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో శాఖలవారీగా ఆకట్టుకునే రీతిలో మ్యాగజైన్లను తెస్తున్నారు. లక్ష మందికిపైగా చందాదారులతో రైతుభరోసా మ్యాగజైన్ విశేష ఆదరణ æపొందుతోంది. తెలంగాణలో కూడా శాఖలవారీగా మ్యాగజైన్లు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. -
15న వైఎస్సార్ రైతుభరోసా నిధుల జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 15వ తేదీన తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగించడంతోపాటు జాబితాలో చోటుదక్కని అర్హులెవరైనా ఉంటే వారి అభ్యర్థనలను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హతను నిర్ధారించుకున్న తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. 2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయం అందించారు. 2022–23లో 48.77 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి మొదటి విడతగా ఈ నెల 15న రూ.3,657.87 కోట్ల సాయం అందించబోతున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాగుదారులను గుర్తించాల్సి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన అర్హులైన కౌలు రైతులకు ప్రస్తుతం సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్టు) కార్డుల జారీచేస్తునారు. ఈ కార్డుల ఆధారంగా వారికి తొలివిడత సాయం అందించనున్నారు. కాగా, వైఎస్సార్ రైతుభరోసాకి అర్హుల జాబితాలను నేటినుంచి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆర్బీకేల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
ఆర్బీకేలను పీఏసీఎస్‌లతో అనుసంధానించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను అనుసంధానం చేసి గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశించారు. విజయవాడలోని ఆప్కాబ్ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్పర్సన్లు, సీఈవోలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని సూచించారు. 2021–22లో 40 శాతం వృద్ధి రేటుతో ఆప్కాబ్ మంచి ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఆప్కాబ్‌తో సహా డీసీసీబీలన్నీ లాభాల బాట పట్టాయంటే అందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణమన్నారు. అనంతరం పీఏసీఎస్ అడాప్షన్ పాలసీ, 59వ వార్షిక పరిపాలనా రిపోర్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ పాలసీ, ఉద్యోగుల కోసం రూపొందించిన ‘కాబ్‌నెట్’ మొబైల్ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం
మక్కువ : పంట కాలంలో 14 వారాల పాటు శిక్షణ ఇచ్చి రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కె. తిరుపతిరావు అన్నారు. సరయ్యవలస రైతుభరోసా కేంద్రం పరిధిలోని బంగారువలసలో సోమవారం నిర్వహించిన పొలంబడి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేసిన పంటలో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నిరంతర పంటల పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్రామ రైతులందరూ రాబోయే ఖరీఫ్ సీజన్లో నిర్వహించే పొలంబడికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సర్పంచ్ శంబంగి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు తొందరగా అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి. శ్రీరాములు, వీఏఏ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. (చదవండి: పంట భద్రుడు...ఆదర్శ రైతుగా మారిన ఉపాధ్యాయుడు) -
ఏపీలో మాత్రమే.. ఎరువుల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం గ్రామస్థాయిలో వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సేవలందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కేటాయింపులు, పంపిణీ అమలు తీరుపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా.. ఏపీలో మాత్రమే గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీ జరుగుతున్నదన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో సైతం ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే రైతులకు అందించడంలో ఆర్బీకేలు కీలకభూమిక పోషిస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్ 2022 కోసం 19.02 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని, వాటిని నెలవారీగా నిర్ధేశించిన మేరకు రాష్ట్రానికి కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు గోదాముల నుంచి ఆర్బీకేలకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ ఖర్చులను కేంద్రం భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఏపీ ఎరువులకు ఇస్తున్న రాయితీలను కాంప్లెక్స్ ఎరువులకు కూడా ఇచ్చి ధరల వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయ సూచించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు, రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగినప్పటికీ.. సబ్సిడీని పెంచిన విషయాన్ని గుర్తించాలన్నారు. -
‘చాంపియన్’.. ఆర్బీకే!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో).. అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్’’ అవార్డుకు ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం గమనార్హం. గ్రామగ్రామాన రైతన్నకు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం.. పేరుకు తగ్గట్టుగానే ప్రతి గ్రామంలో అన్నదాతకు అండదండగా నిలుస్తోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రైతులకు అన్ని రకాల సేవలందిస్తున్న ఓ వినూత్న, విప్లవాత్మక వ్యవస్థ ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయ్యాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన ఆర్బీకేలను మన దేశం తరపున ఐరాస అనుబంధ సంస్థ ఎఫ్ఏవో అందించే ఛాంపియన్ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. రెండేళ్ల క్రితం రూపుదిద్దుకుని.. ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పం మేరకు రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 2020 మే 30న శ్రీకారం చుట్టిన ఈ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్త సేవలన్నీ రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు.. ఇలా నాణ్యమైన సాగు ఉత్పాదకాలన్నీ అందించడమే కాకుండా రైతు పండించిన పంటను కూడా నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దిన ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలను సందర్శించి వాటి సేవలను ప్రశంసించాయి. తాజాగా ఎఫ్ఏవో అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకు నామినేట్ కావడం మరో అరుదైన గౌరవమని అధికారులు పేర్కొంటున్నారు. ‘ఆహార భద్రత – 2030’ లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా మానవాళి చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ‘ఆహార భద్రత – 2030’ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్ఏవో కృషి చేస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోంది. అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలను ఏటా అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూఎస్ డాలర్లను అందజేస్తారు. పలు దశల్లో వడపోత.. ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డు కోసం ఎఫ్ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ ఆర్బీకేలను రోల్ మోడల్‌గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మన దేశం తరపున ఈ అవార్డు కోసం ఎఫ్‌ఏవోకు నామినేట్ చేసింది. అందరికీ సుస్థిర ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చిన మార్పులు, ఉత్పత్తి, పోషకాహారం, పర్యావరణం, జీవన విధానాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు లాంటి అంశాలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకుంటారు. వివిధ దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో వడపోస్తారు. చివరిగా అంశాల వారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐరాస అత్యున్నత కౌన్సిల్ ఎంపిక చేస్తుంది. జూన్ 13 నుంచి 17వతేదీ వరకు ఐక్యరాజ్య సమితిలో జరిగే ఎఫ్ఏవో 169వ కౌన్సిల్ సమావేశంలో డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు / ప్రభుత్వాలకు ఛాంపియన్ అవార్డును ప్రదానం చేస్తారు. అందరికీ ఆదర్శం... ఆర్బీకే వ్యవస్థ వినూత్నం, విప్లవాత్మకం. దేశమంతా అమలు చేయతగ్గ ఓ ప్రయోగం. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేలా సిఫార్సు చేస్తాం. ఆర్బీకేలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వీటి పనితీరును మరింత మెరుగు పరిచేందుకు లోతైన అధ్యయనం కూడా చేస్తుంది. – డాక్టర్ ఏకే సింగ్, ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దేశమంతా అనుసరించాలి... ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలు జాతీయ స్థాయిలో అమలు చేయతగ్గవి. ఈ– క్రాప్ ద్వారా పంటలవారీగా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను నమోదు చేస్తున్న తీరు బాగుంది. వాస్తవ సాగుదారులకు పంట రుణాలతో పాటు అన్నిరకాల రాయితీలు అందేలా ఈ–క్రాప్‌ను ఈ కేవైసీతో అనుసంధానించడం మంచి ఆలోచన. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకేల్లో గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడం గొప్ప విషయం. ఈ తరహా ప్రయత్నం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు చూడలేదు. – కయా త్రిపాఠి, సోనాలి సేన్ గుప్తా, ఆర్బీఐ సీజీఎంలు మనకు గర్వ కారణం... అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్ఏవో అందజేసే ఛాంపియన్ అవార్డుకు మన ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం గర్వకారణం. ఎఫ్ఏవో కంట్రీ హెడ్ టోమియో షిచిరీ బృందం గతంలో ఆర్బీకేలను స్వయంగా పరిశీలించి ప్రశంసించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు మెరుగైన సాంకేతిక సామర్థ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ప్రపంచంలో మరెక్కడా లేని ఆర్బీకేల వ్యవస్థకు ఛాంపియన్ అవార్డు కచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ ఇలాంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదు.. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే స్టూడియోలు ఓ వినూత్న ఆలోచన. వీటి ద్వారా గ్రామస్థాయిలో రైతు ముంగిటకు నేరుగా నాణ్యమైన సేవలందించడం నిజంగా ప్రశంసనీయం. ఆర్బీకేల బలోపేతానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. – ఆర్బీకేల సందర్శన సందర్భంగా టోమియో షిచిరీ, ఎఫ్ఏవో కంట్రీ హెడ్ -
గ్రామాల్లో ‘ఎనీ టైం మనీ’
సాక్షి, అమరావతి: చాలా గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఉన్నా అరకొరగానే ఉంటాయి. ఏటీఎంల సంగతి సరేసరి. డబ్బులు తీసుకోవాలంటే మైళ్లకొద్దీ దూరం వెళ్లాలి. తీరా అక్కడికి వెళ్లాక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎంకి ప్రయాణం కట్టాలి. ఇది గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న కష్టం. ఈ కష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఆర్బీకేలలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయిసున్నారు. వాటిలో ఎప్పుడూ నగదు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామీణులకు వ్యవసాయ ఉత్పాదకాలు, ఉపకరణాలతోపాటు నగదు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణే ఈ రైతు.. పేరు ఆచంట శ్రీనివాసరావు. తూర్పు గోదావరి జిల్లా కురుకూరు. గతంలో ఏది కావాలన్నా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లికి వెళ్లేవారు. గ్రామంలో ఆర్బీకే ఏర్పాటు చేశాక ఇప్పుడు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామం దాటి వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు కూడా పొందుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లంట్ల ఆర్బీకే వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే, ఏటీఎంల వల్ల వ్యయప్రయాసలు తగ్గాయని శ్రీనివాసరావు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేలకు అనుసంధానం చేసింది. ప్రతి ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. రైతుల్లో ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం, మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని (పేపర్‌లెస్) ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులోకి వచ్చారు. మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. పైలట్ ఏటీఎంలకు అనూహ్య స్పందన ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్బీకేల వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేసింది. వీటి పనితీరుపై బ్యాంక్ అధ్యయనం చేసింది. ఈ ఏటీఎంలను ఆర్బీకేల పరిధిలోని ఏడు నుంచి పది గ్రామాలకు చెందిన పదివేల మందికి పైగా రైతులు, ప్రజలు వినియోగించుకుంటున్నట్టు గుర్తించారు. ప్రతి రోజూ 50 నుంచి 100 హిట్స్ వస్తున్నాయని, ప్రతి ఏటీఎం నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు నగదు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పల్లంట్ల ఆర్బీకే ఏటీఎం ది బెస్ట్ తూర్పు గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం పల్లంట్ల ఆర్బీకేలో తొలి ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇది బెస్ట్ ఏటీఎంగా నిలిచినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. పల్లంట్లతో పాటు కురుకూరు, లక్ష్మీపురం, త్యాజంపూడి, చిక్కాల, దూమంతుని గూడేనికి చెందిన 10 వేల మందికిపైగా ఈ ఏటీఎంను ఉపయోగించుకుంటున్నారు. గతంలో వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి (మండల కేంద్రం)కి వెళ్లేవారు. గత సంవత్సరం నవంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ ఏటీఎంను రోజుకు 75 నుంచి 100 మంది వరకు ఉపయోగించుకుంటున్నట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. రోజుకు సుమారు రూ.4 లక్షలు విత్‌డ్రా అవుతున్నట్లు వెల్లడైంది. ఏ సమయానికి వెళ్లినా నగదు అందుబాటులో ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నో క్యాష్ బోర్డు చూడలేదు నేను 16 ఎకరాల్లో మిరప, మొక్కజొన్న, కర్రపెండలం సాగు చేస్తున్నా. గతంలో ఏది కావాలన్నా దేవరాపల్లి వెళ్లే వాళ్లం. ఇప్పుడు పల్లంట్లలో ఏర్పాటు చేసిన ఆర్బీకే మా అవసరాలన్నీ తీరుస్తోంది. ఇక్కడి ఏటీఎంలో ఎప్పుడు వెళ్లినా డబ్బు ఉంటుంది. నో క్యాష్ బోర్డు ఎప్పుడూ చూడలేదు. –వి.కిషోర్, లక్ష్మీపురం, తూర్పు గోదావరి చాలా సౌకర్యంగా ఉంది నేను 18 ఎకరాల్లో ఆయిల్ పామ్, వరి, మినుము, జీడిమామిడి సాగుచేస్తా. ఇంతకు ముందు డబ్బుల కోసం చాలా అవస్థలు పడే వాడిని. ఏటీఎం, బ్యాంకు శాఖలకు వెళ్లాలంటే చాలా సమయం, ఖర్చు ఎక్కువగా ఉండేది. ఇప్పుడా అవస్థలు లేవు. మా గ్రామం ఆర్బీకేలోనే ఏటీఎం ఏర్పాటు చేయడంతో చాలా సౌకర్యంగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాం. – గాంధీప్రసాద్, పల్లంట్ల, తూర్పు గోదావరి ఆర్బీకే ఏటీఎంలకు స్పందన బాగుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేల వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఏటీఎంలకు మంచి స్పందన లభిస్తోంది. మండల కేంద్రాలు, నగరాల్లో చాలా ఏటీఎంలకు లభించని ఆదరణ ఇక్కడ లభిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేల వద్ద ఏటీఎంల ఏర్పాటుకు మిగిలిన బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి. మలి దశలో కనీసం 100 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
ఆర్బీకేలు.. అద్భుతం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలోకి తెచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన చర్యలు తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కీలక అంశాలను సదస్సు దృష్టికి తెచ్చినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసిందన్నారు. ఆర్బీకేల సేవలు అభినందనీయం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పని తీరును డాక్టర్ రాజీవ్‌కుమార్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని, అవి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. -
సేంద్రియ సాగుకు ‘భరోసా’
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడంతోపాటు ఆర్బీకేల ద్వారా చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి సేద్యంపై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రైతులను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా ఆర్బీకేల్లో నియమించి శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడంలో ఈ చర్యలు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ప్రతి 2 వేల జనాభాకు ఒక ఆర్బీకేను ఏర్పాటు చేసి రైతన్నలు కోరిన ఏ సేవలనైనా గ్రామంలోనే అందచేస్తున్నట్లు వివరించారు. సహజ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై నీతి ఆయోగ్ సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఇంకా ఆయనేమన్నారంటే.. వన్‌స్టాప్ సెంటర్లుగా ఆర్బీకేలు గ్రామీణ ప్రాంతాల్లో 10,778 ఆర్బీకేలను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ కూడా అందిస్తోంది. రైతులకు సాగు విధానాలపై మెరుగైన పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా వ్యవహరిస్తున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలకు వన్‌స్టాప్ సెంటర్లుగా ఆర్బీకేలు నిలుస్తున్నాయి. ఈ–క్రాప్.. పొలంబడులు.. సలహా మండళ్లు ఆర్బీకేలు సాగు చేస్తున్న రైతుల సమాచారాన్ని ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసి ప్రభుత్వ పథకాలు, సేవలను అనుసంధానం చేస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటలబీమా, సాగుచేస్తున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటలకు ఎంఎస్పీ ధరలు... ఇవన్నీ సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ–క్రాప్ డేటా ఉపయోగపడుతుంది. ఈ–క్రాప్ చేయించుకున్న రైతులకు భౌతికంగా రశీదు ఇవ్వడంతోపాటు డిజిటల్ రశీదులు కూడా ఇస్తున్నాం. సామాజిక తనిఖీ కోసం పేర్లను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. ల్యాబ్‌లతోనూ ఆర్బీకేలు అనుసంధానమయ్యాయి. నిపుణుడైన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (వీఏఏ) ప్రతి ఆర్బీకేలో ఉంటారు. వ్యవసాయ క్షేత్రాల్లో వీరు పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగు ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ అనుకూల విధానాలతో మంచి దిగుబడులను సాధించేలా రైతులకు ఈ కార్యక్రమాలు తోడుగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను కూడా నియమించాం. పంటల ప్రణాళికను సూచించడం, ఆర్బీకేల కార్యక్రమాల పర్యవేక్షణ, సమర్థంగా అమలుకు వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం. వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న 80,359 మంది ప్రగతిశీల రైతులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీ కన్నా ధర తగ్గితే నేరుగా మార్కెట్లో జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు చెల్లించేలా ఈ నిధిని వినియోగిస్తున్నాం. ఎంఎస్పీ ధర నిర్ణయించని పంటలను సాగు చేస్తున్న రైతులను కూడా ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకుంటున్నాం. హెక్టారులో సగం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 50 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టారు అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా వీరికి అందిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 80 శాతం పంటలకు 50 నుంచి 80 శాతం వరకూ పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా ద్వారా అందచేస్తున్నాం. వ్యవసాయానికి ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్తు అందిస్తూ రైతులకు మద్దతుగా నిలిచే కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. -
AP: అన్నదాతకు ఆత్మస్థైర్యం
సాక్షి, అమరావతి: ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి రాకూడదు. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడితే... పాలకులు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాలి. కానీ చంద్రబాబు హయాంలో... పరిహారం కోసమే ప్రాణాలు తీసుకుంటున్నారని వారిని ఎగతాళి చేశారు. సాయాన్నీ గాలికొదిలేశారు. ‘ప్రశ్నిస్తా!’ అని పదేపదే అరిచే జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ దురాగతంపై నోరెత్తితే ఒట్టు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలపై రీసర్వే చేయించారు. చంద్రబాబు హయాంలో మరణించిన 469 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచి మరీ అందజేశారు. దీన్ని ప్రశ్నించలేని జనసేనాని కొత్త రాగం అందుకున్నారు. రైతుల ఊసెత్తకుండా.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయలేదంటున్నారు. ఏం! కౌలు రైతుల వివరాల్ని గ్రామ సచివాలయాల స్థాయిలో నమోదు చేసుకుని లక్షల మందికి సీసీఆర్సీ (గుర్తింపుకార్డులు) ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? వారందరికీ రైతు భరోసా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏపీ కాదా? పంటల బీమా సహా రైతులకిచ్చే అన్ని పథకాలనూ కౌలు రైతులకూ వర్తింపజేసింది ఈ ప్రభుత్వం కాదా? ఎవరు చనిపోయినా కౌలు రైతే అంటే ఎలా? కౌలురైతులు కాని సామాన్యులు ఆత్మహత్యకు పాల్పడినా వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం సాయం అందిస్తుండటం మీకు తెలీదా? చంద్రబాబు హయాంలో రైతులకు సైతం సాయం ఎగవేస్తే ప్రశ్నించలేదు ఈ దత్తపుత్రుడు. ఇపుడు కౌలు రైతులంటూ ఎందుకీ డ్రామా అన్నదే అందరి ప్రశ్న!!. ► మట్టినే నమ్ముకుని సేద్యం చేస్తున్న కౌలు రైతుల కడగండ్లను గుర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా రైతు భరోసా నుంచి పంటల బీమా దాకా అన్ని రకాల ప్రయోజనాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందచేస్తోంది. లక్షల మంది కౌలు రైతులకూ గ్రామ సచివాలయాల ద్వారా సీసీఆర్సీ కార్డులను ఇచ్చి పంట రుణాలు సమకూర్చి వెన్ను తడుతోంది. గత సర్కారు హయాంలో వంచనకు గురై ఆత్మహత్యలకు ఒడిగట్టిన 469 మంది అన్నదాతల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం కింద రూ.23.45 కోట్లను చెల్లించింది. రుణమాఫీ పేరుతో మోసపోయిన రైతన్నలకు సాంత్వన చేకూరుస్తోంది. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి అన్ని సేవలను అక్కడే అందచేస్తోంది. విత్తనం నుంచి నూర్పిళ్ల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండే బాధ్యతను సంతోషంగా స్వీకరించింది. సాయంపై సేనాని బుకాయింపు గత సర్కారుకు రైతుల ఆత్మహత్యలను గుర్తించేందుకే మనసు రాలేదు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఆ డబ్బుల కోసమే చనిపోతారని వ్యాఖ్యానిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో పరిహారాన్ని చంద్రబాబు ఎత్తివేశారు. రైతుల ప్రాణాలకు వెల కట్టి చులకనగా మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కౌలు రైతులతో సహా రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటం, తాను వచ్చాకే సాయం అందుతోందంటూ బుకాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాపరికం లేకుండా.. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2019 జూన్ 1వతేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ వరకు ఆత్మహత్యలు చేసుకున్న 41 మంది రైతన్నల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. గత సర్కారు రైతుల ఆత్మహత్యలను కనీసం నమోదు చేయకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాపరికం లేకుండా పారదర్శకంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తోంది. ఎప్పటికప్పుడు వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకుంటోంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతు శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల వివరాలు సేకరించి ఆదుకోవాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మే 31 వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డ 773 మంది రైతులకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని నిర్దేశించారు. విచారణ అనంతరం 469 రైతు కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు అర్హులని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పన మొత్తం రూ.23.45 కోట్లను చెల్లించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 19 మంది కూడా ఉన్నారు. పరిహారం పెంపు.. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2019 అక్టోబర్ 14న జీవో 102 జారీ అయింది. పెంచిన పరిహారాన్ని 01–06–2019 నుంచి వర్తింప చేసేందుకు వీలుగా 20–02–2020న మరో జీవో 43 జారీ చేశారు. ఈ జీవోల ప్రకారం 01–06–2019 నుంచి 31–12–2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న 308 మంది రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.21.56 కోట్లను ఎక్స్‌గ్రేషియాగా చెల్లించారు. ఇదే ప్రకారం 2020 సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్న 260 రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.18.20 కోట్లను పరిహారంగా చెల్లించారు. ఇక 2021 సంవత్సరంలో 126 రైతు కుటుంబాలకు రూ.8.82 కోట్లను అందచేశారు. గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలతో కలిపి 2021 వరకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.72.145 కోట్లను చెల్లించారు. కలెక్టర్ల వద్ద కార్పస్ నిధి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లా కలెక్టర్ వద్ద కార్పస్ నిధిగా కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచింది. 2021–22 బడ్జెట్లో బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రూ.20 కోట్లను కేటాయించగా రూ.15.345 కోట్లు వ్యయం చేసింది. 2022–23 బడ్జెట్లోనూ పరిహారం కోసం రూ.20 కోట్లను కేటాయించారు. పశ్చిమలో 41 కుటుంబాలకు పరిహారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 జూన్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 2 వరకు 41 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా ప్రభుత్వం అందరికీ పరిహారం చెల్లించింది. సాగు చేస్తున్నట్లు నిర్థారించిన 26 మందికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా ఇతరులకు అలాంటి రుజువులు లేకున్నా మానవత్వంతో వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించారు. ఇందులో నాలుగు రైతు కుటుంబాలకు రూ.రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించగా 11 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. పరిహారంతో పాటు పథకాలూ.. బాధిత కుటుంబాలకు కేవలం ఎక్స్‌గ్రేషియా మాత్రమే కాకుండా వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఒక్కో కుటుంబానికి కనిష్టంగా రెండు.. గరిష్టంగా ఏడు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాలను ఆ కుటుంబాలకు వర్తింప చేస్తున్నారు. -
కలిసి 'సాగు'దాం
రైతు భరోసా కేంద్రం... ఓ విప్లవం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.. వేటికీ ఊరు దాటివెళ్లాల్సిన పనిలేకుండా... ఆఖరికి పంట విక్రయానికి కూడా అక్కరకొచ్చేలా ఊళ్లో వెలసిన సేద్యాలయం. రైతాంగం స్థితిగతుల్ని సమూలంగా మార్చే శక్తి కలిగిన ఈ ఆర్బీకే.. యావత్తు దేశానికీ ఓ రోల్‌మోడల్. దీనికి అనుబంధంగా రైతులకు పనిముట్లు అందించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు... తదుపరి అడుగుగా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయాలు... ఇవన్నీ ఇప్పుడు యావద్దేశాన్నీ ఆకర్షిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఏపీకి వచ్చి వెళ్లాయి. ఏపీ మాదిరి సేంద్రియ సాగుకు ఇప్పటికే ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సిద్ధంకాగా... మరో ఏడు రాష్ట్రాలు ఇదే బాటలో నడవనున్నాయి. దీనిపై ఏపీతో కలసి పనిచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ త్వరలోనే ఒప్పందం చేసుకుంటోంది కూడా!!. ఇక వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అద్దె ప్రాతిపదికన రైతన్నలకు వ్యవసాయ ఉపకరణాలను అందిస్తున్న కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ప్రత్యక్షం కానున్నాయి. ఇదే తరహాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అద్దెకు యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే... వైఎస్ జగన్ ఏపీలో ఆరంభించినట్లే తామూ ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని శుక్రవారం అసెంబ్లీ ముఖంగా తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రకటించటం మరో ఎత్తు. ఏపీలో విమర్శలు మాత్రమే తెలిసిన విపక్షాలకు ఇవన్నీ అర్థం కాకున్నా... యావత్తు దేశమూ బాగానే అర్థం చేసుకుంటోంది.!! ప్రతి ఆదివారం... ప్రత్యేకం ‘నిన్నటికంటే నేడు బాగుండటం... రేపు మరింత బాగుంటామనే ఆశ కల్పించటం’ ఇదే అభివృద్ధికి నిర్వచనమంటూ విద్య, వ్యవసాయ, ఆరోగ్య రంగాలను అత్యంత ప్రాధాన్య రంగాలుగా చేసుకుని... సమూల సంస్కరణలతో ముందుకెళుతున్న ఏపీ ఇపుడు పలు రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. సచివాలయాల నుంచి మొదలుపెడితే... సంచార పశువైద్య శాలలు, సేంద్రియ సాగు విధానాలు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, రేషన్ డోర్ డెలివరీ, సరికొత్త ఆక్వా కల్చర్ చట్టం, ఆర్బీకేలు, విద్యాసంస్థలు– ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు... ఇవన్నీ పలు రాష్ట్రాల్లో అమల్లోకి రాబోతున్నాయి. పొరుగునున్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అధికారులు వచ్చి వీటిని అధ్యయనం చేసి వెళుతున్నారు. కొన్నింటిని ఏకంగా కేంద్రమే దేశవ్యాప్తంగా తేవాలనుకుంటోంది. ఆ వివరాలతో... ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఇస్తున్న కథనాల్లో రెండవ కథనమిది. నెల్లూరు జిల్లా అల్లూరు ఆర్బీకే సీహెచ్‌సీలో రైతు కమిటీకి ఇచ్చిన యంత్ర పరికరాలు ఏపీలో అద్భుత ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సాగు అమలవుతున్న తీరును పరిశీలించాం. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇదే తరహాలో ఎరువులు, రసాయన పురుగు మందులను వినియోగించకుండా సహజసిద్ధ ఆహార ఉత్పత్తులను పండించేలా రైతులను ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఎంవోయూ కుదుర్చుకోనుంది. ఖరీఫ్ నుంచి దశలవారీగా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తాం. ఇందుకు అవసరమైన క్షేత్ర స్థాయి వ్యవస్థ ఏర్పాటులో ఏపీ రైతు సాధికారసంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. సిబ్బందితో పాటు రైతులకు కూడా శిక్షణ ఇవ్వనుంది. – భగవాన్‌దాస్ బైసర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, మాండ్లా జిల్లా, మధ్యప్రదేశ్ మనవైపు దేశం చూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం వల్ల ప్రకృతి సాగులో అద్భుత ఫలితాలు నమోదవుతున్నాయి. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంఓయూ చేసుకోనుంది. రాష్ట్రంలో ప్రకృతి సాగును పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అమలు దశకు చేరుకోగా మరో ఏడు రాష్ట్రాలు చర్చల దశలో ఉన్నాయి. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ మోడల్.. మోడర్న్ సాగుబాట వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వినూత్న విధానాలు జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అద్దెకు గ్రామాల్లో యంత్ర పరికరాలు సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తేవాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఆర్బీకేలకు అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ.1,615 కోట్లతో గ్రామ స్థాయిలో 10,750 సీహెచ్‌సీ (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), వరి సాగయ్యే జిల్లాల్లో రూ.404 కోట్లతో క్లస్టర్ స్థాయిలో 1,615 కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో సీహెచ్‌సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం కింద ఆర్బీకే స్థాయిలో గరిష్టంగా రూ.15 లక్షలు, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన యంత్రాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.645 కోట్లతో 4,061 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీలు, రూ.161.50 కోట్లతో 142 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే స్థాయిలో మరో 4,105 సీహెచ్‌సీలతో పాటు 491 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలను త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇక మిగిలిన సీహెచ్‌సీలను జూన్ కల్లా గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సీహెచ్‌సీల ఏర్పాటుతో విత్తనం నుంచి నూర్పిడి వరకు అన్నదాతలు ఎదుర్కొంటున్న కూలీల కొరతకు ప్రభుత్వం చెక్ పెట్టగలిగింది. పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతోంది. ట్రాక్టర్లు కూడా.. ఆర్బీకేల స్థాయిలోనే ట్రాక్టర్లను కూడా అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతగా 3,500 ట్రాక్టర్లను మే నెలలో రైతు కమిటీలకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ తరహాలో అండగా నిలిచేలా.. గ్రామాల్లో రైతు గ్రూపులకు యంత్ర పరికరాలను అందించి అద్దె ప్రాతిపదికన మిగిలిన అన్నదాతల అవసరాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవా పథకం కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. ఇదే రీతిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)కు అద్దె ప్రాతిపదికన యంత్రాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పరిధి పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో అండగా నిలవాలని నిర్ణయించింది. 2022–23 కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా చేశారు. యాంత్రీకరణ దిశగా శిక్షణ.. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రోత్సహించడం, హై ప్రొడక్టివ్ ఫామ్ మిషనరీ అందుబాటులోకి తేవడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించాలని కేంద్రం భావిస్తోంది. 40–50 శాతం రాయితీని కొనసాగిస్తూ బ్యాంకుల ద్వారా ఆర్ధిక చేయూతనందించేలా కేంద్ర వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో డిమాండ్ ఉన్న ఆర్బీకేల్లో అదనంగా రెండో సీహెచ్‌సీ ఏర్పాటుతోపాటు రైతులకు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో 40 శాతం సబ్సిడీపై వీటిని నెలకొల్పనున్నారు. ‘ప్రకృతి’లో ఆదర్శం ప్రకృతి సాగు విధానాలలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో ఎంవోయూ చేసుకోనుంది. సేంద్రియ సేద్యంపై యూనివర్సిటీల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీని ఆదర్శంగా తీసుకొని ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్రకృతి సాగును ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేయగా కేరళ, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్ మన రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే మన రాష్ట్రంతో ఒడిశా ప్రభుత్వం ఎంవోయూ చేసుకోగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ నెలాఖరులో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సాగు ఇలా.. రాష్ట్రంలో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ కింద రూపుదిద్దుకున్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)గా అమలవుతోంది. గత ఖరీఫ్‌లో 3,730 గ్రామాల్లో 5.92 లక్షల మంది రైతులు 6.71 లక్షల ఎకరాల్లో దీన్ని అనుసరించారు. ప్రస్తుత రబీలో 71 వేల మంది రైతులు 76 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశారు. మధ్యప్రదేశ్‌లో వంద గ్రామాల్లో.. మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో 4 బ్లాకుల (మండలాలు) పరిధిలో సహజ వ్యవసాయ పరివర్తన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తొలుత బిచియా బ్లాకులోని 3 క్లస్టర్స్, నివాస్ బ్లాకులోని ఓ క్లస్టర్‌ను ఇందుకు ఎంపిక చేసి వంద గ్రామాల్లో అమలు చేస్తున్నారు. 18,750 ఎకరాల్లో 15 వేల మందికిపైగా గిరిజన రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ రైతు సాధికార సంస్థ టెక్నికల్ ఏజెన్సీగా, వాసన్ సంస్థ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా వరి, ఉల్లి, కందులు, శనగలు (చనా), అరికెలు (కోడా), సామలు (కుట్కి), కూరగాయలు సాగవుతాయి. గ్రామ స్థాయిలో సీఆర్పీ వ్యవస్థ ప్రకృతిసాగు అమలు కోసం మధ్యప్రదేశ్‌లో సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్) వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. గ్రామానికి ఇద్దరు చొప్పున కనీసం 200 మందిని సిద్ధం చేస్తారు. సీఆర్పీలతో పాటు క్లస్టర్, బ్లాకు స్థాయిలో సమన్వయం కోసం ఐసీఆర్పీ(ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్)తో పాటు ఎఫ్ఈఎస్ (ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ), ఎంపీఎస్ ఆర్ఎల్ఎం (మధ్యప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్)కు చెందిన సీబీఓ(కమ్యూనిటీ బేస్ట్ ఆర్గనైజషన్) సభ్యులకు సహజ వ్యవసాయ నమూనాలు, ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణనిస్తారు. ఎంపిక చేసిన 8 గ్రామ పంచాయతీల్లో డెమాన్‌స్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. ఆయా గ్రామాల్లో ఇన్పుట్ కమ్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఘన జీవామృతాలు, కషాయాల తయారీ విధానంతో పాటు వినియోగంపై రైతులకు శిక్షణనిస్తారు. రెండు రౌండ్లలో 45 రోజుల పాటు మరో రెండు రౌండ్లలో 30 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది. -
ఆరోగ్య సిరులు!
సాక్షి, అమరావతి: అన్నదాత ఇంట చిరుధాన్యాలు సిరులు కురిపించనున్నాయి. ప్రజలకు ఆరోగ్య భాగ్యాన్ని చేకూర్చనున్నాయి. అటు రైతులకు రొక్కం ఇటు ప్రజలకు ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ మిల్లెట్’కు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి సరికొత్త వ్యవసాయ విప్లవం దిశగా కార్యాచరణ చేపట్టింది. విత్తనాల సరఫరా నుంచి 100 శాతం పంట కొనుగోలు బాధ్యత స్వీకరించడం ద్వారా రైతులకు భరోసా కల్పించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలను సరఫరా చేయడంతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం.. ప్రభుత్వ హాస్టళ్లలో పోషక విలువలతో కూడిన ఈ ఆహారాన్ని అందించడం ద్వారా భావితరం ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించింది. లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఇదీ... 10 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం... రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్ మిషన్’కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. మేజర్ మిల్లెట్స్‌గా పరిగణించే సజ్జలు, జొన్నలు, మైనర్ మిల్లెట్స్‌గా పరిగణించే రాగులు, కొర్రలు, వరిగ, ఊద, సామలు, అరిక పంటలను సాగు చేయడం ద్వారా ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర చిరు ధాన్యాలైన సజ్జ, జొన్న, వరిగ, ఊద, సామ, అరిక సాగును కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అనువైన ప్రాంతాల మ్యాపింగ్... చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కార్యాచరణకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తారు. అందుకోసం రూ.82.95 కోట్లతో 17,282 ఎకరాల్లో రాగులు, రూ.30.88 కోట్లతో 7,720 ఎకరాల్లో కొర్రలను ‘క్లస్టర్ డెమో’గా గుర్తించి సాగు చేపడతారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు రూ.103.69 కోట్లతో 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందచేస్తారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.8.13 కోట్లతో 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు రూ.15.07 కోట్ల అంచనాతో ఎంపిక చేసిన చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులతో.. చిరుధాన్యాల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్) గుర్తింపునిస్తారు. వీటి సాగు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొండలు, గిరిజన ప్రాంతాలతో పాటు మెట్ట భూములు వీటికి అనుకూలం. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటాయి. కందులు, ఆముదం లాంటి ఇతర పంటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగెకరాల్లో చిరుధాన్యాలను పండించొచ్చు. తక్కువ విద్యుత్, పరిమితంగా ఎరువుల వినియోగం, తక్కువ కాలపరిమితితో సాగు చేయడం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. సజ్జలు, జొన్నలు, రాగులకు కేంద్రం మద్దతు ధర ప్రకటించగా మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కని ప్రతీసారి ప్రభుత్వం జోక్యం చేసుకొని చిరు ధాన్యాలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. చిరుధాన్యాలను సాగు చేస్తే ఎకరాకు రూ.10 వేల లోపే ఖర్చు అవుతుంది. మార్కెట్లో ధర బాగుంటే ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. పైగా వీటి సాగు కాలం చాలా తక్కువ. విత్తు నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వమే.. చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. పంట రుణాలు, కొనుగోలు, పంపిణీ బాధ్యతలన్నీ చేపడుతుంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తుంది. ‘మిషన్ మిల్లెట్’ ద్వారా రైతులకు పంట రుణాలు అందచేసి ఉచిత పంటల బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేస్తారు. మార్కెటింగ్ లింకేజ్ కల్పిస్తారు. పంటలను ప్రాసెస్ చేయడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తుంది. ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. తద్వారా చిరుధాన్యాల సాగు లాభదాయకమని, అనుకూలమని రైతులకు భరోసా కల్పిస్తారు. హాస్టళ్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో.. కొనుగోలు చేసిన చిరు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, వైద్యశాఖ ద్వారా గర్భిణీలకు పంపిణీ చేస్తారు. పాఠశాలల్లో వారానికోసారి మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్ వంటకాలను అందిస్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మిల్లెట్ ఆహారంతో పాటు వారానికి రెండుసార్లు వాటితో చేసిన బిస్కెట్స్, స్నాక్స్ అందిస్తారు. అన్ని ప్రభుత్వ క్యాంటీన్ల మెనూల్లో వీటితో తయారైన వంటకాలను చేరుస్తారు. మిల్లెట్ల ఆహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫుడ్ మేళాలు నిర్వíహిస్తారు. మిల్లెట్ వంటకాలు, చిట్కాలపై ఆర్బీకేలు, ఆర్బీకే చానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రత్యేక ప్యాకేజింగ్, బ్రాండింగ్‌తో రైతుబజార్లతో పాటు డీమార్ట్, జియో మార్ట్, స్పెన్సర్స్, మోర్ లాంటి సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఐటీసీ, ఎఫ్పీఓలతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఇలా చిరుధాన్యాల సాగు అటు రైతులకు ప్రయోజనకరంగా ఇటు సామాన్యులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ.. చిరుధాన్యాల సాగు కార్యాచరణను పక్కాగా పర్యవేక్షించేందుకు ‘స్టేట్ మిల్లెట్ గ్రూప్’ పేరుతో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వచ్చే ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా కమిటీ కార్యాచరణను వేగవంతం చేసింది. వరికి ప్రత్యామ్నాయంగా.. రాష్ట్రాన్ని చిరుధాన్యాల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు మిషన్ మిల్లెట్ కార్యాచరణ రూపొందించాం. రానున్న ఐదేళ్లలో వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తాం. వీటిని సాగు చేసే రైతులకు అన్ని రకాలుగా చేయూతనందిస్తాం. వారు పండించిన పంటను ఆర్బీకేల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ నిదానంగా అరుగుదల.. ప్రస్తుతం మనం తింటున్న పాలీష్ పట్టిన బియ్యం, ఇతర పప్పులు తిన్న వెంటనే అరిగిపోతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. పాలీష్ చేయని చిరుధాన్యాలు తీసుకుంటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌తో పాటు విటమిన్స్ కూడా సమపాళ్లలో అందుతాయి. ఫోర్టిఫైడ్ రైస్‌తో చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రజలకు చిరుధాన్యాలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం. – డాక్టర్ కె.సుధాకర్, అదనపు డీఎంఈ సాగుకు ప్రోత్సాహం ► ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 5.79 లక్షల ఎకరాల్లో చిరు ధాన్యాలను పండిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో అదనంగా మరో 5 లక్షల ఎకరాలు పెంచనున్నారు. రాగుల సాగును 3,45,625 ఎకరాలకు, కొర్రల సాగును 1,54,375 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అనువైన ప్రాంతాలను మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 50 ఎకరాల చొప్పున చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తుంది. ► రైతులకు 69,125 తుంపర సేద్యం యూనిట్లు అందజేస్తారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 650 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దిగుబడుల్లో నాణ్యతను పెంచేందుకు చిరుధాన్యాల క్షేత్రాల్లో 13,825 పొలం బడులు నిర్వహిస్తారు. -
ఆర్బీకేల ద్వారానే పత్తి విత్తన విక్రయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ సీజన్లో నిర్ధేశించిన సాగు లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఆదేశించారు. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కంపెనీలు ఎంవోయూలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తన ఉత్పత్తిదారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 5.82 లక్షల హెక్టార్లు కాగా, రానున్న ఖరీఫ్ సీజన్లో 6.17 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇందుకోసం 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమన్నారు. ఆ మేరకు జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) ఆమోదించిన నాణ్యమైన బీటీ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తివిత్తన విక్రయ ధర (475 గ్రాముల ప్యాకెట్) బీజీ–1కు రూ.635, బీజీ–2 ప్యాకెట్‌కు రూ.810గా నిర్ణయించిందన్నారు. అంతకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీఈఏసీ నిషేధించిన హెచ్‌టీ పత్తివిత్తనాలను విక్రయించరాదని, ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు తమదృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో 47 లక్షల విత్తన ప్యాకెట్లు సరఫరా చేయగలమని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. -
సేంద్రియ గ్రామాలు
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగును రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. సహజ సాగు విధానాలను కేవలం ప్రయోగశాలలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికీ అవగాహన పెంపొందించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంపై గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయినబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో చర్చించారు. వ్యవసాయదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ధరల్లో వ్యత్యాసం కనిపించాలి.. సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించి ప్రోత్సహించేలా సర్టిఫికేషన్ చేపట్టాలి. సాధారణ సాగు పద్ధతుల ఉత్పత్తులకు, సహజ సాగు ఉత్పత్తుల ధరల మధ్య తేడా స్పష్టంగా కనిపించాలి. రసాయనాలు, కృత్రిమ ఎరువులను వినియోగించి పండించే ఆహార ఉత్పత్తులు కేన్సర్ లాంటి వ్యాధులకు దారి తీస్తున్నాయి. ప్రత్యేకంగా యూనివర్సిటీ సహజసాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో అమలు కావాలి. మన దగ్గరున్న ఆర్బీకేలు లాంటి వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా సహజ సాగు విధానం ద్వారా ఆశించిన మార్పులను సాధించగలుగుతాం. మీ సహకారంతో వ్యవస్ధలో మంచి మార్పులు తేవచ్చు. సహజ సాగులో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టేలా ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సహజసాగులో గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించాం. తద్వారా మెరుగైన శిక్షణ పొందిన విద్యార్ధులు బయటకు వస్తారు. గ్రామాల్లో సరికొత్త వ్యవస్థ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రంగంలో సరికొత్త వ్యవస్ధను తీసుకొచ్చాం. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉండగా 10,777 రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఆర్బీకేల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో కియోస్క్‌ను కూడా ఏర్పాటు చేశాం. గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ రైతును చేయి పట్టుకుని నడిపించే బాధ్యత తీసుకున్నాం. సకాలంలో అందించడంతోపాటు నకిలీలు, కల్తీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఆర్బీకేలు కేంద్రంగా విక్రయాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వమే విత్తనాలు, ఎరువుల నాణ్యతను నిర్ధారించిన తర్వాత రైతులకు అందిస్తున్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను దగ్గరుండి చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి పంటనూ, ప్రతి ఎకరాను ఇ–క్రాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రైతుతో పాటు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేస్తున్నాం. తద్వారా రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని రాయితీలు అందేలా చర్యలు తీసుకున్నాం. పంట నష్టపోతే ఈ వివరాల సాయంతో పరిహారాన్ని వేగంగా చెల్లిస్తున్నాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతుకూ ఇ–క్రాప్ ద్వారా పారదర్శకంగా సాయం అందచేస్తున్నాం. సహజ సాగు కేంద్రాలుగా ఆర్బీకేలు ఆర్బీకేలు భవిష్యత్తులో సహజ సాగుకు కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 2 వేల మందికి ఒక ఆర్బీకే అందుబాటులో ఉంది. సహజసాగు విధానాలను ప్రోత్సహించేలా వీటిని సాంకేతికంగా పటిష్టం చేస్తాం. సహజ సాగు కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ) ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఉపకరణాలను అందుబాటులో ఉంచడం ద్వారా రైతన్నలకు అవగాహన పెరుగుతుంది. వ్యర్థాలపై స్పష్టమైన విధానం.. ఎకో టూరిజం ద్వారా పెద్ద సంఖ్యలో స్ధానిక యవతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. దీనిపై అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చి సముద్ర తీరాలను శుభ్రం చేయడం అభినందనీయం. రాష్ట్రంలో ఇప్పటికే ఇలాంటి వ్యర్ధాల సేకరణపై స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. నాన్ బయో డీ గ్రేడబుల్ వ్యర్థాల రీ సైక్లింగ్, పునర్వినియోగానికి సంబంధించి జీఏఎస్‌పీ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటాం. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, జీఏఎస్‌పీ ఛైర్మన్ ఎరిక్ సోలమ్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ సత్య త్రిపాఠి, పార్లీ ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరల్ గట్చ్, ఎకో టూరిజం ఇన్వెస్టర్ అదితి బల్బిర్, ఎస్ 4 కేపిటల్ పీఎల్సీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పోరన్ మలాని పాల్గొన్నారు. -
ప్రతి పార్లమెంటు స్థానంలో నైపుణ్య కాలేజీ
సాక్షి, అమరావతి: ఆయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో శుక్రవారం నైపుణ్య శిక్షణకు సంబంధించిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. స్థానికంగా ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. వివిధ రంగాల నిపుణులు, విద్యా సంస్థలు పేరుగాంచిన శిక్షణా భాగస్వాముల ద్వారా యువతలో నైపుణ్యాలు, నైపుణ్యాల స్థాయిని పెంచుతున్నట్లు తెలిపారు. అత్యాధునిక నైపుణ్య కోర్సులను అందించడానికి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కళాశాలలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. తిరుపతి వద్ద స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు. విజ్ఞాన కేంద్రాలుగా ఆర్బీకేలు మరో ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 10,778 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. ఆ కేంద్రాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుచేస్తున్నామని, శాస్త్రవేత్తల సూచనలు అక్కడి నుంచే అందించే ఏర్పాటు చేశామన్నారు. పొలం బడుల్ని వాటికి అనుసంధానం చేశామన్నారు. అంతేకాక.. రైతులకు సంబంధించిన అన్ని సేవల్ని ఈ కేంద్రాల ద్వారా అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇవి అన్ని రకాల పంటలకు సేకరణ కేంద్రాలుగా కూడా ఉన్నాయన్నారు. -
త్వరలో మిల్లెట్ మిషన్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ‘మిల్లెట్ మిషన్ పాలసీ’ని తీసుకొస్తామని, దీనిద్వారా చిరుధాన్యాల సాగుకు మరింత ఊతమిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థ ఒక విప్లవమని, దీని ద్వారా ప్రతి గ్రామంలోను రైతుకు సొంత కార్యాలయం ఉందనే ధీమా కలిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసన మండలిలో గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రైతులకు కావాల్సిన ప్రతి సేవా ఆర్బీకేల్లో అందుతోందన్నారు. ఎమ్మెల్సీలు సైతం తమతమ గ్రామాల్లో వీటిని సందర్శించాలని కన్నబాబు విజ్ఞప్తిచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్‌లో వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని.. స్కోచ్ తదితర అవార్డులు మన వ్యవసాయ రంగానికి దక్కాయని కన్నబాబు తెలిపారు. ఇక.. రాష్ట్రంలో ప్రతి పంటకూ ఈ–క్రాప్ బుకింగ్ సిస్టమ్ ద్వారా బీమాను వర్తింపజేస్తున్నామని, వచ్చే సీజన్ నుంచి బీమా నమోదుకు సంబంధించి రశీదులిచ్చే విధానాన్ని అమలుచేస్తామని కూడా ఆయన వెల్లడించారు. భూ యజమాని అనుమతితో సంబంధంలేకుండానే ఈ–క్రాప్‌లో కౌలురైతులనూ నమోదు చేసి వారికి మేలు చేస్తున్నామని.. పెట్టుబడి సాయం అందించేలాకూడా వారికి సీసీఆర్సీ కార్డులను జారీచేస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా సుబాబుల్, సరుగుడు కొనుగోలు సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటనూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు చెప్పారు. పేపర్ పరిశ్రమకు ముడిసరుకుగా ఉపయోగపడే సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడుకు ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ధర దక్కడంలేదన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే వాటి కటింగ్ ఆర్డర్ కోసం ఆర్బీకేల ద్వారా నమోదు చేసే పద్ధతిని చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో కొత్తగా ఉద్యోగ నియామకాలు అయ్యే వరకు ఎంపీఈఓలను కొనసాగిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో స్మశాన వాటికల ఆక్రమణ, కొరత తదితర ఇబ్బందులపై చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బదులిచ్చారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా రాష్ట్రంలో అంగన్వాడీల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తీçసుకుంటున్న ప్రత్యేక చర్యలతో మాత, శిశు మరణాల రేటు తగ్గిందని మరో మంత్రి తానేటి వనిత బదులిచ్చారు. వచ్చే నెలలో ఆర్బీకేను సందర్శించనున్న గవర్నర్ రాష్ట్రంలో ఏదో ఒక రైతుభరోసా కేంద్రాన్ని స్వయంగా పరిశీలించేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకరించారని మంత్రి కన్నబాబు గురువారం ‘మండలి’లో తెలిపారు. ఏప్రిల్‌లో ఆయన సందర్శించే అవకాశముందని.. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారన్నారు. -
పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. శనగలు క్వింటాల్ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ (ఈ–హస్తాక్షర్) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. -
AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం
సాక్షి, అమరావతి: అన్నదాతలకు తోడుగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సాగుదారుల ప్రతి అవసరాన్నీ తీరుస్తున్నాయి. పల్లెపట్టున విశేష సేవలందిస్తున్న ఆర్బీకేలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్బీకేల రాకతో తెల్లవారగానే మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో రైతన్నలు పరుగులు తీయాల్సిన దుస్థితి తొలగిపోయింది. గంటల తరబడి కి.మీ. పొడవున క్యూలైన్లలో నిలబడాల్సిన అవస్థలు ఇప్పుడు లేవు. రవాణా ఖర్చులతో పాటు సమయం ఆదా అవుతోంది. సాగు ఉత్పాదకాల కోసమే కాకుండా సలహాలు, సూచనల కోసం కూడా రైతన్నలు ఆర్బీకేల తలుపు తడుతున్నారు. అలాంటి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలపై ఓ వర్గం మీడియా బురద చల్లుతూ అసత్య కథనాలను ప్రచురించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..? ఎరువుల రవాణా చార్జీల్లోనే రూ.18 కోట్లు ఆదా గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలు అన్నదాతలకు అన్ని రకాల సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల సేవలకు గుర్తింపుగా ఇటీవలే గోల్డెన్ స్కోచ్ అవార్డు దక్కింది. ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత దళారులు, బ్లాక్ మార్కెటింగ్ బెడద తొలగిపోయింది. నకిలీలు, నాసిరకం భయం లేదు. గత 20 నెలల్లో 46.03 లక్షల మందికి పైగా రైతులు ఆర్బీకేల ద్వారా రూ.1,074.52 కోట్ల విలువైన సాగు ఉత్పాదకాలను పొందగా కోటిమందికి పైగా వివిధ రకాల సేవలు అందాయి. ఒక్క ఎరువులను తీసుకుంటే లోడింగ్, అన్లోడింగ్ చార్జీల కింద సగటున బస్తా ఎరువుపై రూ.20 చొప్పున రైతులకు ఇప్పటివరకు రూ.18.20 కోట్లు ఆదా కావడం గమనార్హం. ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్క్‌లు రైతుల అవసరాలను తీరుస్తూ వారి నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. శాఖల వారీగా తెస్తున్న మాస పత్రికలు రైతుల ఆదరణ చూరగొంటున్నాయి. ఆర్బీకేల ద్వారా 20 నెలల్లో కొన్ని సేవలిలా.. ►ఆర్బీకేల ద్వారా 127.56లక్షల ఎంటీల పంట ఉత్పత్తులను సేకరించారు. ►81,529 మంది ఆదర్శ రైతులతో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్లు ఆర్బీకేల ద్వారా రైతులకు సలహాలు ఇస్తున్నాయి. 63,842 మంది రైతులకు 2,991 క్షేత్ర సందర్శనలు నిర్వహించారు. ►పొలం బడుల ద్వారా 10,47,210 మందికి, తోట బడుల ద్వారా 8.50 లక్షల మందికి, పట్టు బడుల ద్వారా 1.20 లక్షల మంది పట్టు రైతులకు, పశు విజ్ఞాన బడుల ద్వారా 11.85 లక్షల మంది పాడి రైతులకు, మత్స్య సాగుబడుల ద్వారా 27,744 మందికి శిక్షణనిచ్చారు. ►ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల పశువులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. 1.17 కోట్ల పశువులకు ప్రథమ చికిత్స అందింది. 9,160 మంది కరస్పాండెంట్లు ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేలో ఏటీఎం సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. ►ఆర్బీకే చానల్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకున్న 1.71 లక్షల మంది రైతులు పంటల వారీగా సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. ►ఆర్బీకేలు వేదికగా ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయాలు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కడుపు మంటతోనే.. ఆర్బీకేలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఆస్థాన పత్రిక ‘ఈనాడు’ కడుపు మంటతో అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుతున్నాయి. జాతీయ స్థాయిలో అమలు చేయడంపై కేంద్రం ఆలోచన చేస్తోంది. పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు అధ్యయనం చేస్తున్నాయి. ఇవేమీ ఈనాడుకు కానరావా? – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి -
AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు
పులిచెర్ల(కల్లూరు)/చిత్తూరు జిల్లా: వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించింది. సాగుకు సరైన సమయంలో సాయం అందించాలని ఆర్బీకే సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అన్నదాతలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించింది. రైతాంగానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సర్కారు ఆశయాలను మతుకువారిపల్లె రైతు భరోసా కేంద్రం అందిపుచ్చుకుంది. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విశేష సేవలందిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచి ఐఎస్ఓ గుర్తింపు సాధించింది. చదవండి: ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు బాబూ? మండలంలోని మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి విశిష్ట గుర్తింపు లభించింది. ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది. అన్నదాతలకు అవసరమైన సలహాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందుల పంపిణీ, పండించిన పంటల మార్కెటింగ్, అత్యుత్తమ నాణ్యతా సౌకర్యాలు భవనం తదితరాలను ఐఎస్ఓ ప్రామాణికంగా తీసుకుంది. విశిష్ట పురస్కారం సాధించిన మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సేవలు.. సౌకర్యాలు మతుకువారిపల్లెలో 1,180 మంది రైతులు ఉన్నారు. సుమారు 715 హెక్టార్ల భూమి సాగులో ఉంది. గ్రామంలో అధికంగా మామిడి, మిరప, చెరుకు, వరి, టమాట పంటలను సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2020 మే 30వ తేదీన మతుకువారిపల్లెలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించింది. దీని పరిధిలో మూడు పంచాయతీలను చేర్చింది. ఈ ఆర్బీకే భవనంలో డిజిటల్ లైబ్రరీ, వ్యవసాయ సంబంధిత పుస్తకాలు, టీవీ అందుబాటులో ఉంచింది. దీనికితోడు ఆర్బీకేలో విధులు నిర్వర్తిస్తున్న వ్యవసాయ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు రైతులకు చిత్తశుద్ధితో సేవలందించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలను పొలాల సందర్శనకు తీసుకువచ్చి రైతులకు సలహాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పథకాలను పారదర్శంగా అర్హులందరికీ పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుభరోసా సొమ్ము అన్నదాతలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి పంటకు రక్షణ కల్పిస్తున్నారు. భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించి ఏ సమయంలో ఏయే పంటలు సాగు చేయాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తగ్గిన వ్యయం.. పెరిగిన దిగుబడి మతుకువారిపల్లె రైతులు గతంలో ఎరువుల కోసం పీలేరు, సదుం, కల్లూరుకు వెళ్లేవారు. ఇందుకోసం అదనంగా ఒక్కో రైతుకు రూ.200 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యేది. అయితే రైతుభరోసా కేంద్రంలోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులోకి రావడంతో అదనపు వ్యయం తప్పింది. కియోస్క్ మిషన్ ద్వారా ఎరువులు, మందుల వివరాలతోపాటు మార్కెట్ ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఆర్బీకే సిబ్బంది పనితీరు కారణంగా గ్రామంలోని రైతులు మంచి ఫలితాలను సాధించారు. ఆధునిక పనిముట్ల వినియోగంతో అధిక దిగుబడి పొందుతున్నారు. వ్యవసాయానికి అండగా నిలిచి, అన్నదాతల ఆరి్ధకాభివృద్ధికి సహకరిస్తూ, అత్యుత్తమ సేవలందిస్తున్న మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రాన్ని ఐఎస్ఓ ప్రశంసించింది. ఉత్తమ సరి్టఫికెట్‌ను ప్రదానం చేసింది. సిబ్బంది కృషిని అభినందించింది. సకాలంలో ఎరువులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత మాకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి. బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు మా పొలాలను సందర్శించి సలహాలు అందిస్తున్నారు. మా ఆర్బీకే ఇప్పుడు ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉంది. – సి.రాణి, రైతు, మతుకువారిపల్లె జగనన్నకు కృతజ్ఞతలు రైతుభరోసా కేంద్రాల ద్వారా మాకు ఇన్ని సేవలందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. ఆర్బీకే సిబ్బంది మాకు ఎప్పడూ అందుబాటులో ఉంటారు. ఒక పర్యాయం రైతుభరోసా సొమ్ము రాకపోతే వెంటనే ఆధార్ అనుసంధానం చేయించి నగదు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆధునిక పనిముట్ల వినియోగంపై మాకు అవగాహన కల్పించారు. – పి.తాతప్ప, రైతు, బోడిరెడ్డిగారిపల్లె ఆనందంగా ఉంది మా రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ సరి్టఫికెట్ రావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేం పనిచేశాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన బాటలో నడిచాం. అన్నదాత ఎప్పుడూ నష్టపోకూడదు అనే సంకల్పంతో విధులు నిర్వర్తించాం. ఆర్బీకే ద్వారా సకాలంలో సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మా కష్టానికి గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాం. –రోహిణి, వ్యవసాయ అసిస్టెంట్, మతుకువారిపల్లె ఆర్బీకే -
ఆర్బీకేల సేవలు ఆదర్శనీయం
సాక్షి, అమరావతి: ఏకగవాక్ష విధానంలో రైతులకు అవసరమైన సేవలన్నీ అందిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దళారుల పాత్ర లేకుండా చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం రైతులకు భరోసాను ఇస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో గురువారం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య భేటీ అయ్యారు. ఆర్బీకేల పనితీరు నివేదికను గవర్నర్‌కు సమర్పించారు. త్వరలో తాను ఆర్బీకేలను సందర్శిస్తానని గవర్నర్ చెప్పారు.5 రాష్ట్రాల ప్రతినిధులు ఏపీలోని ఆర్బీకేలను సందర్శించి అధ్యయనం చేశారని గవర్నర్‌కు పూనం మాలకొండయ్య వివరించారు. చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆప్కో చైర్మన్ మోహనరావు గురువారం భేటీ అయ్యి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను వివరించారు. గన్నవరం, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో ఆప్కో కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. చేనేత రంగాన్ని కేంద్రం జీఎస్టీ నుంచి మినహాయింపునకు చొరవ చూపాలని గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందిస్తూ జీఎస్టీ మినహాయింపు అంశంలో పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు మోహనరావు తెలిపారు. సుహృద్భావాన్ని పెంపొందించే హోలీ హోలీ పండుగ సమాజంలో సహృద్భావం, సద్భావనను పెంపొందిస్తుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచే హోలీ పండుగ సామాజిక నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ సూచించినట్టుగా రాజ్‌భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ఆర్బీకేలకు డిజిటల్ దన్ను
సాక్షి, అమరావతి: వ్యవసాయ భూమిని ఏ మేరకు చదును చేయాలో లేజర్ గైడెడ్ ల్యాండ్ లెవలర్స్లో సెట్ చేస్తే ఆ మేరకు చదును చేసేస్తుంది. పంపుసెట్లు నిర్ణీత సమయానికి పని చేసేలా.. నిర్దేశిత సమయానికి ఆగిపోయేలా సెట్ చేసుకోవడం ద్వారా సమయాన్ని, విద్యుత్‌ను ఆదా చేయడమే కాకుండా పొలానికి సరిపడా నీరందించవచ్చు. పురుగు మందులు, నానో యూరియా పిచికారీలో డ్రోన్స్ వినియోగించడం ద్వారా పొలంలో ప్రతి మొక్కకూ తగిన మోతాదులో అవి చేరతాయి. కావాల్సిన పోషకాలు భూమిలోని వేర్లకు కూడా అందుతాయి. ఫ్లోరీ కల్చర్, మరికొన్ని రకాల పంటలకు తేమ శాతాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. హార్వెస్టర్స్కు జీపీఎస్ బిగించడం ద్వారా ఎవరి పొలంలో అది ఎన్ని గంటలు పనిచేసిందో తెలుసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట ఉత్పాదకతను, నాణ్యతను పెంచుకోవడమే కాకుండా ఖర్చును తగ్గించుకోవచ్చు. కూలీల కొరతను సైతం అధిగమించవచ్చు. ఇలా సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయాన్ని డిజిటల్ బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతు భరోసా కేంద్రాల వేదికగా డిజిటల్ వ్యవసాయ విధానాలను రైతులకు అందుబాటులోకి తెస్తోంది. ఆర్బీకేల కంప్యూటరీకరణతో డిజిటల్ వైపు.. ఆర్బీకేలను కంప్యూటరీకరించడం ద్వారా వాటిని సాంకేతికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్నారు. వీటిలో డిజిటల్ కియోస్క్‌లు, స్మార్ట్ టీవీలు, డిజిటల్ లైబ్రరీలతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతీ ఆర్బీకేకు హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఆర్బీకే సేవలను మరింత వేగంగా అందించడంతోపాటు డిజిటలైజ్డ్ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేలను కంప్యూటరీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలిదశలో 7,859 ఆర్బీకేల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం టెక్నికల్ కమిటీ ఖరారు చేసిన స్పెసిఫికేషన్ల ఆధారంగా ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా గ్లోబల్ టెండర్ పిలిచారు. వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా.. రూ.18.20 కోట్ల ఆదా అయ్యింది. టెండర్‌దారుకు ఇటీవలే కొనుగోలు ఆర్డర్స్ కూడా జారీ చేశారు. వీటిని ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి నేరుగా ఆర్బీకేలకు నేరుగా డెలివరీ చేయాలని ఆదేశించారు. అంతకుముందే ఏపీ టెక్నాలజీస్ (ఏపీటీ) ద్వారా వాటి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించారు. దశలవారీగా అన్ని ఆర్బీకేలను కంప్యూటరీకరించిన తర్వాత ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తారు. సేవల్లో నాణ్యతను పెంచడమే లక్ష్యం డిజిటల్ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, ఆర్బీకే సేవల్లో నాణ్యతను పెంచడం లక్ష్యంగా కంప్యూటరీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేలో కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.18.20 కోట్లు ఆదా చేశాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
36,75,996 టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: శాసన సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుకొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ సంబంధిత శాఖల మంత్రులు సమాధానం చెప్పినట్లుగానే భావించాలని సభాపతి కోరారు. సభలో పలువురు వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇలా ఉన్నాయి.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్నాం. ఇందుకోసం 7,000 వరి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వరి సేకరణలో 21,000 మంది నిమగ్నమై ఉన్నారు. రైతు క్షేత్రం నుంచి మిల్లు వరకు అన్ని రకాల వ్యయాలను ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు 36,75,996 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశాం. రైతులకు రూ.4,676.96 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,282.11 కోట్ల చెల్లింపులు రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలపై ఏడు శాతం వడ్డీని విధిస్తున్నాయి. ఇందులో రూ.లక్ష లోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం 3 శాతం వడ్డీ సబ్సిడీగా ఇస్తుంటే, రాష్ట్రం వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 4 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 65,65,191 మంది రైతులకు రూ.1,282.11 కోట్లు చెల్లించాం. రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6,16,689 మంది నిరుద్యోగులు ఉండగా అందులో 4,22,055 మంది పురుషులు, 1,94,634 మంది మహిళలు ఉన్నారు. కోవిడ్ చికిత్సకు రూ.2,893.41 కోట్లు రాష్ట్రంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం రూ.2,893.41 కోట్లు వ్యయం చేశాం. వ్యాక్సిన్ కోసం రూ.85.79 కోట్లు ఖర్చు చేశాం. ఓటీఎస్‌కు డిమాండ్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా నివాసం ఉంటున్న వారికి ఇంటిపై పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం కోసం ఇప్పటివరకు 9,86,966 దరఖాస్తులు రాగా 2022 మార్చి 2 నాటికి 4,47,713 మందికి యాజమాన్య హక్కులు ఇచ్చాం. రూ.36,303.86 కోట్ల పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఔట్రీచ్ పేరిట పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిద్వారా 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.36,303.86 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపం దాల్చి, 91 మెగా ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 70మెగా ప్రాజెక్టులకు రూ.1,61,154.85 కోట్ల పెట్టుబడులు క్రియాశీలకంగా అమల్లో ఉన్నాయి. మరో రూ.41,434 కోట్ల పెట్టుబడులతో 31 ప్రాజెకులు ప్రారంభ దశలో ఉన్నాయి. -
ఆర్బీకేలకు నాబార్డు చేయూత
సాక్షి, అమరావతి: ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సహకార సొసైటీల పరిధిలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ తీసుకురావడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ఆర్బీకే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను తీసుకు రావడం శుభపరిణామం అని చెప్పారు. సహకార రుణ పరపతి పునర్ వ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్పర్సన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్ క్యాపిటల్ కావాలంటే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఎంత కావాలంటే అంత సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫెషనల్‌గా తయారవుతాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60 వస్తుంటే, ప్రాసెస్ చేసి మార్కెట్లో రూ.200కు పైగా అమ్ముతున్నారని చెప్పారు. ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వాల్యూఎడిషన్ చేయడం అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూ చైన్ ఫైనాన్స్ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మనమిచ్చేది రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58 వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ పథకం 100% రీ పేమెంట్ జరుగుతోందన్నారు. అదే రీతిలో కౌలు రైతులను జాయింట్ లయబులిటి గ్రూప్స్ (జేఎల్‌జీ)గా ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చన్నారు. డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి, సహకార బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆప్కాబ్‌కు రూ.100 కోట్లు, డీసీసీబీలకు రూ.190 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్ఆర్ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఆర్బీకే–పీఏసీఎస్‌లను అనుసంధానించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా.. లేదా అనే అంశం పై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. మండలానికో బ్రాంచ్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంన్నారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: అన్నదాతకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు. వంద శాతం లక్ష్యం దిశగా.. 2021–22 సీజన్లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్‌లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. ఇబ్బంది లేకుండా రుణం.. ప్రస్తుత రబీ సీజన్లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది. – పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 2021–22 సీజన్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
AP: ‘అగ్రి’లో నంబర్ వన్
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చాం. దీన్ని మరో మెట్టు పైకి తీసుకెళుతూ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉపకరణాల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. వీటికి మీ సహకారం కావాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనే వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలతో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు)ల అనుసంధానం, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నియామకంతో సహకార బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగేలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తద్వారా రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాలకు రక్షిత మంచి నీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ నాబార్డు, బ్యాంకులు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో వివిధ రంగాల్లో రుణ ఆవశ్యకత అంచనాలతో నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పత్రాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సుస్థిర ఆర్థిక ప్రగతికి రుణాలు దోహదం ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది. 2022 ఫిబ్రవరి 11 నాటికి దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.115 లక్షల కోట్లు. ఈ విషయంలో ఏటా 7.86 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం. ఈ విషయంలో కొత్త వ్యూహాల దిశగా అడుగులు వేయాలి. ► కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం, దాని అనుంధ రంగాలు 4.16 శాతం ప్రగతిని సాధించాయి. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు మంచి సహకారం అందించినందుకు ధన్యవాదాలు. తద్వారా రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నాం. సాగు రంగంలో ఆర్బీకేలు కీలక పాత్ర ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం రైతు భరోసా, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని పంట రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తోంది. ► ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ఇ–క్రాప్ చేస్తున్నాం. ఇదో విప్లవాత్మక చర్య. గతంలో కొంత మంది మాత్రమే చేసుకునే వారు. చేసుకోలేని వారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున నష్టపోయేవారు. ఇలా జరగకూడదని రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ► సబ్సిడీ మీద వ్యవసాయ ఉప కరణాలను రైతులకు వ్యక్తిగతంగా సరఫరా చేయడంతో పాటు సీహెచ్‌సీల(కస్టమ్ హైరింగ్ సెంటర్స్) ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 10,700 ఆర్బీకేలు సాగు రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ► ఆర్బీకేలు రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ చేదోడుగా నిలుస్తున్నాయి. రూరల్ నియోజకవర్గాల స్థాయిలో (147 నియోజకవర్గాలు) అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. బ్యాంకులతో కలిసి కార్యాచరణ ► సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం. ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు.. బ్యాంకులు, సొసైటీలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించాను. ► ఫుడ్ ప్రాసెసింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టి పెట్టాం. ఆర్బీకే, ఇ –క్రాపింగ్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు 542 సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం. ► బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. రుణ సదుపాయం కల్పనలో ఆర్బీకేలు సంధానకర్తలుగా ఉండాలి. అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణం అందాలి. ఈ మేరకు అమలు చేసేందుకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాళిక, ఎస్ఓపీ తయారు చేయాలి. ► ఇప్పుడు మనం నానోఫెర్టిలైజర్స్ వంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్న ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు రావాలని, వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామ స్థాయిలోనే అభివృద్ధి చేయాలనే నాబార్డ్ చైర్మన్ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. దాన్ని అందుకునే దిశగా వ్యవసాయ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై కూడా దృష్టి పెడతాం. విద్య, వైద్య రంగంలో వాస్తవిక సంస్కరణలు ► నాడు–నేడు ద్వారా విద్య, వైద్య రంగంలో వాస్తవిక సంస్కరణలు చేపట్టాం. 16 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 27 మెడికల్ కాలేజీలు వస్తాయి. ► నాడు–నేడు కింద స్కూళ్లలో నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. మంచి నీరు, శుభ్రమైన బాత్రూమ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, బ్లాక్ బోర్డ్స్, స్కూల్ అంతా మంచి పెయింటింగ్ వంటివి చేపట్టాం. ► ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నాం. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బైలింగువల్ పాఠ్యపుస్తకాలను ముద్రించాం. భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా అభివృద్ధి చెందుతారు. ► తద్వారా గ్రామ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఫ్లోరోసిస్ సమస్యను అధిగమించాలి ► ఫ్లోరోసిస్ సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని చోట్ల నీటి కొరత అధికంగా ఉండడం వల్ల రవాణాకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్ధితి. వీరికి రక్షిత తాగు నీటిని అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇలా ఎంపిక చేసిన చోట్ల బ్యాంకులు మరింత ముందుకొచ్చి సాయం చేయాల్సి ఉంది. ► మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వలస వెళ్లకుండా రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం. ► కరువు నివారణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్రాలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ► ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పనితీరు ప్రశంసనీయం నాబార్డ్ అధికారులుగానీ, రిజర్వ్ బ్యాంకు అధికారులు గానీ రాష్ట్రాలకు వెళ్లి చర్చిస్తున్నప్పుడు క్రెడిట్ రేషియోను చూసి పనితీరు బాగోలేదంటూ చర్చను ప్రారంభించాల్సి వస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా భిన్నం. రాష్ట్రంలో క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 140 శాతం నుంచి 150 శాతం దాకా ఉంది. ఇది గర్వపడాల్సిన విషయం. భూ రికార్డుల డిజిటలైజేషన్ గురించి వివిధ రాష్ట్రాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చూడండని చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయడమే కాకుండా, దాన్ని బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయడం గొప్ప విషయం. ఇది దేశం మొత్తం జరగాలి. రైతులందరికీ రుణాలు లభించాలి. వ్యవసాయం సహా అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. ఆర్బీకేల విషయంలో రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్నాను. సీఎం జగన్ పట్టుదలతో పని చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక సమావేశంలో వీటి గురించి నాకు గొప్పగా చెప్పారు. వీటిని ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. – డాక్టర్ చింతల గోవిందరాజులు, నాబార్డ్ చైర్మన్ -
ఐఎస్వో సర్టిఫికేషన్ దిశగా ఆర్బీకేలు, అగ్రి ల్యాబ్స్ అడుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవన సముదాయాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయిలో సేవలందిస్తున్న ఆర్బీకేల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఐఎస్వో గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా.. 7 ఆర్బీకేలకు ఇటీవలే ఐఎస్వో సర్టిఫికేషన్ లభించింది. తొలి విడతలో దరఖాస్తు చేసిన మరో 6 ఆర్బీకేలను ఇటీవలే ఐఎస్వో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లింది. వీటికి వచ్చే నెల మొదటి వారంలో ఐఎస్వో గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఆర్బీకేలకు దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. అగ్రి ల్యాబ్స్‌కూ దశల వారీగా దరఖాస్తు మరోవైపు నియోజకవర్గ, జిల్లా, రీజనల్, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు కూడా దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్‌లతో పాటు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్రస్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 70 ల్యాబ్స్ అందుబాటులోకొచ్చాయి. వీటికి అనుబంధంగానే పాడి, ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మత్స్య శాఖకు సంబంధించి 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 35 వాటర్ సాయిల్ ఎనాలసిస్, 35 మైక్రో బయాలజీ, 14 ఫీడ్ ఎనాలసిస్, 17 పీసీఆర్, 13 క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్, జిల్లా స్థాయిలో 10, రీజనల్ స్థాయిలో 4, పులివెందులలో రిఫరల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 60 ల్యాబ్స్‌లో సేవలు అందిస్తున్నారు. దశల వారీగా అన్నిటికీ.. ఇప్పటికే ఏడు ఆర్బీకేలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. త్వరలో మరో ఆరు ఆర్బీకేలకు గుర్తింపు రానుంది. ఇదే రీతిలో మిగిలిన ఆర్బీకేలతో పాటు వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు కూడా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించే దిశగా కృషి చేస్తున్నాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్ -
వైఎస్సార్ ఆర్బీకేల సేవలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా నాణ్యమైన సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఇదే తరహాలో తమ రాష్ట్రంలోనూ రైతులకు అందిస్తున్న సేవలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తున్న దన్నారు. స్పెషల్ కమిషనర్ హనుమంత్ నాయకత్వంలోని తెలంగాణా వ్యవసాయ శాఖ అధికారుల బృందం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే కేంద్రాన్ని శనివారం సందర్శించింది. సిబ్బందివివరాలు, రైతులకు అందే సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేలో ఉన్న పురుగుల మందుల నాణ్యతను స్వయంగా టెస్ట్ కిట్‌పై పరీక్షించి చూశారు. కియోస్క్ పనితీరు, ప్రయోజనాలపై ఆరా తీశారు. అదేసమయంలో ఆర్బీకేకు వచ్చిన రాజారావు అనే రైతు కియోస్క్ ద్వారా ఎరువులు బుక్ చేసుకున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఆర్బీకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలో ఉన్న రైతు భరోసా తదితర మేగజైన్స్‌ను పరిశీలించారు. అనంతరం కంకిపాడు మార్కెట్ యార్డులోని ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్‌ల్యాబ్‌ను సందర్శించారు. ఇక్కడ ఫిషరీస్ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక పరికరాల పని తీరును పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. కాల్ సెంటర్లో నిర్వహిస్తోన్న ఆర్బీకే చానల్ ద్వారా ఉద్యాన శాస్త్రవేత్త రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించారు. వచ్చిన అధికారుల్లో ఒకరు బయటకు వెళ్లి ఓ రైతు మాదిరిగా కాల్ సెంటర్‌కు కాల్ చేసి తమకున్న సందే హాన్ని అడుగగా దానికి ఆ శాస్త్రవేత్త చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుబంధ విభాగాల పనితీరును రాష్ట్ర జేడీఏ శ్రీధర్ వారికి వివరించారు. తమ రాష్ట్రంలోనూ ఓ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఛానల్ ప్రారంభించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, కమిషనర్ హనుమంత్ తెలిపారు. తెలంగాణ వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్–2 కె.విజయకుమార్, రైతు వేదిక ఏడీఏ అనిత, సీడ్స్, ఎరువుల జేడీఏ, డీడీఏలు పాల్గొన్నారు. -
ఆర్బీకేలతో ‘సహకారం’
సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింతగా బలోపేతం చేయడానికి ఆర్బీకే వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇందుకు ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసేలా కియోస్క్‌ల్లో మార్పులు చేయాలి. అటు ఖాతాదారులు, ఇటు బ్యాంకులకు మేలు జరిగేలా పటిష్టమైన ఎస్ఓపీలు రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఆర్బీకేలతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి మండలంలో పీఏసీఎస్‌లను మ్యాపింగ్ చేసి, వాటి పరిధిలోకి ఏయే ఆర్బీకేలు వస్తాయో నిర్ణయించాలని చెప్పారు. తద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగుతాయని, రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో సహకార శాఖ కార్యకలాపాలకు సంబంధించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాలన్నారు. అంతిమంగా ఆర్బీకేలు, ఆర్బీకేల్లోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు.. రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధికారులు బ్యాంకింగ్ నిపుణులతో మాట్లాడి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దాలి ► బ్యాంకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను మరింత బలోపేతం చేయాలి. పోటీని తట్టుకునేందుకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలి. ► నాణ్యమైన రుణ సదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధి చెందుతాయి. మంచి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను పాటించేలా చూడటంతో పాటు డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. డీసీసీబీలు పటిష్టంగా ఉంటేనే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. సహకార బ్యాంకులను కాపాడుకోవాలి ► సహకార బ్యాంకులు మన బ్యాంకులు. వాటిని మనం కాపాడుకోవాలి. తద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి. దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. ఎంత వీలైతే అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపార పరంగా లబ్ధి పొందుతున్నాయి. ఈ రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులూ సద్వినియోగం చేసుకోవాలి. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలిలిచ్చి ఖాతాదారులను తమ వైపునకు తిప్పుకోవచ్చు. తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుంది. ప్రతి రైతుకూ మేలు జరగాలి ► జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలి. అంతిమంగా ప్రతి ఎకరా సాగు చేస్తున్న ప్రతి రైతుకూ మేలు జరగాలి. ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారు చేసి నాకు (సీఎంకు) నివేదించాలి. ► వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో బ్యాంకింగ్ రంగంపై రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి వాటిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రికల్చ ర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులకు విశ్వాసం కలిగించాలి ► వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో రాజీ వద్దు. రాజకీయాలకు చోటు ఉండకూడదు. ► అవినీతికి, సిఫార్సులకు తావు లేకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల కార్యకలాపాలు సాగాలి. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పాలనలో సమర్థతతో పాటు, అవినీతి రహిత, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. -
'అగ్రి' తాంబూలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అన్నదాతకు అడుగడుగునా అండగా నిలుస్తూ చేయూతనిస్తోంది. పొలం దమ్ముల నుంచి పంటల విక్రయం వరకూ అన్నిదశల్లోనూ ఆసరాగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జై కిసాన్ అంటూ.. వ్యవసాయాన్ని పండుగ చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. విపత్తులతో పంట నష్టపోయిన కర్షకులను నేనున్నాంటూ ఆదుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 లక్షల ఎకరాలకుపైగా.. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉండగా, ఖరీఫ్‌లో పూర్తి సాగు ఉంది. రబీ సీజన్లో 6.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, పొగాకు, ఆయిల్‌పామ్, అపరాలు, ఉద్యాన పంటల సాగు అధికంగా ఉంది. ప్రభుత్వం విత్తు నుంచి పంటల విక్రయం వరకూ సేవలందిస్తున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు, యంత్రాలను రాయితీపై పంపిణీ, ఉచిత పంటల బీమా, పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధరలు, పంట నష్టపరిహారం అందజేత, పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి పథకాలతో రెండున్నరేళ్లలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. భరోసా.. రైతు కులాసా జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా ఏడాదికి రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. మొదటి రెండేళ్లలో రూ.917.25 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. 2021–22లో ఇప్పటివరకూ 3.19 లక్షల మంది రైతులకు రూ.430.30 కోట్లు అందించారు. సున్నా వడ్డీ రుణాలు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.లక్ష రుణం తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించిన రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తోంది. 2019–20లో 1.30 లక్షల మందికి రూ.29.19 కోట్లు, 2020 (ఖరీఫ్)లో 78,417 మందికి రూ.19.60 కోట్లను అందించారు. యంత్ర సాయం వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు, అధునాతన యంత్రాలు అందిస్తున్నారు. జిల్లాలో క్లస్టర్ సీహెచ్‌సీల ద్వారా 22 వరి కోత యంత్రాలను రూ.1.94 కోట్ల రాయితీపై అందించారు. 1.39 లక్షల మందికి హక్కు పత్రాలు జిల్లాలో 2021–22లో 1.39 లక్షల మందికి పంట సాగుదారుల హక్కుల పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. వీరిలో 43,525 మందికి రూ.197 కోట్ల రుణాలు అందించారు. బీమాతో ధీమా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద జిల్లాలో ఈ–క్రాప్‌ను పెద్ద ఎత్తున నమోదు చేశారు. రైతులందరికీ ఉచితంగా పంటల బీమాను వర్తింపజేస్తున్నారు. 2020లో ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన 1,02,140 మంది రైతులకు రూ.170 కోట్లు అందించారు. 2020–21లో సంభవించిన ఆరు ప్రకృతి వైపరీత్యాల్లో 54 వేల హెక్టార్ల పంట నష్టపోగా బాధిత 1.12 లక్షల మంది రైతులకు రూ.81 కోట్లను పరిహారంగా అందించారు. 2021 ఏప్రిల్, నవంబర్ మాసాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన 29,624 మంది రైతులకు ఈనెల 15న రూ.20.97 కోట్లను అందించి ప్రభుత్వం వారిని ఆదుకుంది. రాయితీపై బ్యాటరీ స్ప్రేయర్ నాకు ప్రభుత్వం సబ్సిడీపై బ్యాటర్ స్ప్రేయర్ అందించింది. దీంతో చీడపీడల నివారణకు మందు పిచికారీ చేస్తున్నాను. రైతు భరోసా కేంద్రం ద్వారా రాయితీపై ఎరువులు కొంటున్నాను. అలాగే ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్ కూడా ఇక్కడ నుంచే కొనుగోలు చేశాను. ఇలా ప్రభుత్వం అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటోంది. రైతు భరోసా కేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. –అంకం వరప్రసాద్, చొదిమెళ్ల, ఏలూరు రూరల్ సేంద్రియ ఎరువులతో భూసారం నేను రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి పొలం భూసార పరీక్ష చేయించాను. సేంద్రియ ఎరువులతో భూసారం పెంచుకోవాలని అక్కడ సిబ్బంది సూచించారు. జీలుగు, మినుము తదితర నవధాన్యాల కిట్ తీసుకుని ఐదెకరాల్లో వెదజల్లాను. ప్రస్తుతం ఏపుగా పచ్చిరొట్ట పెరిగింది. దీనిని దున్ని పొలాన్ని సారవంతం చేసుకుంటాను. దీనిద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. –మాగంటి సుబ్రహ్మణ్యం, చొదిమెళ్ల, ఏలూరు రూరల్ -
ఆర్బీకేల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవల్లో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారంలేని రీతిలో మరింత వేగంగా, పారదర్శకంగా సేవలందించే ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యమైన ఎరువులు, సబ్సిడీ, నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, దాణా, రొయ్యలు, చేపల మేత చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలను ప్రారంభిస్తోంది. రైతులు ఆర్బీకేల్లో తమకు అవసరమైన వాటిని బుక్ చేసుకునే ముందు సబ్సిడీని మినహాయించుకొని మిగతా మొత్తాన్ని సంబంధిత ఏజెన్సీలకు లేదా ఆర్బీకే ఖాతాలకు జమ చేసేవారు. ఈ రసీదును చూపిస్తే సిబ్బంది ఇండెంట్ పెట్టేవారు. ఈ ప్రక్రియతో సమయం వృధా అవుతోంది. సాంకేతిక సమస్యలూ వస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు ఆర్బీకేల్లోనే నగదు చెల్లింపులకు అనుమతినిచ్చారు. ఈ సొమ్ము నాలుగైదు రోజులకోసారి ఆర్బీకే ఖాతాల నుంచి సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు జమ చేసే వారు. నగదు చేతికొచ్చాక వీఏఏలు ఇండెంట్ పెట్టేవారు. తమ ఖాతాలకు జమ కాలేదన్న కారణంతో ఏజెన్సీలు సరుకు పంపడంలో జాప్యం జరిగేది. పైగా వసూలు చేసిన నగదును ఆర్బీకే సిబ్బంది రెండు మూడు రోజులు తమ వద్దే ఉంచుకోవడం, కొన్ని చోట్ల పక్కదారి పట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల జాప్యం, అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా పంపిణీ చేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ముందుగా విత్తనాలకు ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీలో విత్తనాభివృద్ధి సంస్థదే కీలక పాత్ర. ఏటా రాష్ట్రంలో రూ.1,500 కోట్ల విత్తనాలు విక్రయిస్తున్నారు. దాంట్లో రూ.670 కోట్ల విలువైన సబ్సిడీ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుంది. సబ్సిడీ పోను రైతుల నుంచి రూ.400 కోట్లు వసూలు చేస్తుంది. రానున్న ఖరీఫ్ నుంచి సబ్సిడీతో పాటు కనీసం పది శాతం నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాలెట్స్ ద్వారా నేరుగా సంస్త ఖాతాకు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకుతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ప్రతి ఆర్బీకేకు ఓ క్యూ ఆర్ కోడ్ ఇస్తారు. చెల్లింపులు బయటకు విన్పించేలా ఓ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్‌ను అందిస్తారు. రైతులు వారికి అవసరమైన వాటిని బుక్ చేసుకొనే సమయంలో తగిన సొమ్మును స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లించాలి. వెంటనే వారికి విత్తనాలను అందిస్తారు. డిజిటల్ చెల్లింపులను దశలవారీగా ఎరువులు, పురుగుల మందులు, పశువుల దాణా, రొయ్యలు, చేపల మేతకు కూడా అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు రైతుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుడుతున్నాం. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి డిజిటల్ చెల్లింపులతోనే ఆర్బీకేల ద్వారా జరిగే విత్తన విక్రయాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
ఈ క్రాప్‌లో సాంకేతిక సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ సమస్యలకు చెక్ పెట్టింది. పంటల నమోదు కోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్)యాప్‌ను అప్డేట్ చేసింది. ఇందుకోసం గడిచిన 45 రోజులుగా నిలిపి వేసిన పంటల నమోదును మంగళవారం తిరిగి ప్రారంభించింది. పంటల నమోదును ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు యాప్‌లో గ్రామం పేరు కొట్టగానే కొన్ని సందర్భాల్లో ఇతర జిల్లాల్లో అదే పేరుతో ఉన్న గ్రామాల జాబితా ప్రత్యక్షమవుతుండటంతో రైతు ఏ గ్రామానికి చెందిన వారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ క్రాప్ డేటా–సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డేటాతో పూర్తి స్థాయిలో అనుసంధానంకాకపోవడం వల్ల కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్లో రైతులు, సిబ్బందికి ఎదురైన వివిధ రకాల సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ ఆర్బీ యూడీపీ యాప్‌ను అప్డేట్ చేశారు. ఇలా చేశారు.. ► ఆర్బీకేల పరిధిలోని రెవెన్యూ గ్రామాలను గుర్తించేందుకు రెవెన్యూ వెబ్‌ల్యాండ్ మాస్టర్ డేటాతో ఆర్బీకేలను మ్యాపింగ్ చేశారు. ► యాప్‌లో జిల్లా, మండలం, గ్రామం పేర్లు సెలక్ట్ చేయగానే భూమి ఖాతా, సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ భూముల వివరాలు వచ్చేలా మార్పుచేశారు. ► ఆయా వివరాలను ఎంపిక చేసుకున్న తర్వాత రైతు పేరు నమోదు చేసి ఏ రకం పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో కూడా నమోదు చేయొచ్చు. ► మనుగడలో ఉన్న వంగడాల వివరాలతో సహా ఉద్యాన, వ్యవసాయ పంటల వివరాలు నమోదుచేసేలా డేటా బేస్‌లో వాటి వివరాలను పొందుపర్చారు. ► సంప్రదాయ, సేంద్రియ, ప్రకృతి, సహజ ఇలా ఏ తరహా వ్యవసాయ పద్ధతులైనా నమోదు చేసేలా ఈక్రాప్‌లో మార్పు చేశారు. ► భూ వివాదాల నేపథ్యంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని వ్యవసాయ భూములను యాడ్‌ల్యాండ్ ఆప్షన్లో నాన్‌వెబ్‌ల్యాండ్ కేటగిరి కింద నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ► వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించిన ఈక్రాప్ డేటాను సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ రూపొందించిన కొనుగోలు యాప్‌తో అనుసంధానిస్తున్నారు. ► రబీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పంటలు తొలుత కోతకొచ్చే అవకాశం ఉన్నందున ఆ జిల్లాల్లో పంటల నమోదుకు తొలుత ప్రాధాన్యతనిస్తారు. మిగిలిన జిల్లాల్లో కూడా నెలాఖరులోగా పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పగడ్బందీగా పంటల నమోదు సాంకేతికలోపాలతో కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి లోపాలకు ఆస్కారంలేని రీతిలో ఆధునీకరించిన యాప్ ద్వారా పంటల నమోదును పగడ్బందీగా చేపడుతున్నారు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పంట నమోదు రసీదు గడిచిన ఖరీఫ్ సీజన్లో మాదిరిగా కాకుండా ప్రతి వాస్తవ సాగుదారుడి వివరాలు నమోదు చేసేలా యాప్‌ను అప్డేట్ చేసాం. ఈకేవైసీ నమోదు చేసుకున్న రైతులు ఆర్బీకేలకు వెళ్లనవసరం లేదు. క్షేత్ర స్థాయి పరిశీలనలోనే ప్రతీ రైతుకు పంట నమోదు రసీదు ఇస్తారు. పంటల నమోదును వేగవంతం చేసేందుకు వీలుగా ప్రతీ ఆర్బీకేకు ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ అందజేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఎరువులు ఫుల్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, యూరియా సహా అన్నిరకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. గుంటూరులోని చుట్టుగుంటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద ప్రస్తుత రబీకి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఉన్నట్టు సాగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు ఎరువుల నిల్వలు ఉంచామన్నారు. ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో యూరియా కొరత ఉన్నట్టు మీడియా ద్వారా తెలిసిందని, అక్కడ అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయం రబీ అవసరాలకు 23.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల పంపిణీకి ప్రణాళికలు వేశామని అరుణ్‌కుమార్ తెలిపారు. ఇందులో యూరియా 9 లక్షల టన్నులని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 6.97 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి రాష్ట్రానికి 12.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని చెప్పారు. ఇందులో ఆదివారం నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని తెలిపారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 1.74 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలిపి మొత్తం 4.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరి నెలకు కేంద్రం నుంచి రావాల్సిన 2.95 లక్షల టన్నుల ఎరువులు కేటాయింపులు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 49,736 మెట్రిక్ టన్నుల యూరియా జనవరి నెల సరఫరాలో లోటు కింద కేటాయించిందని చెప్పారు. ఫిబ్రవరి నెలకు మరో 20,500 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. వీటిని తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో తూర్పు గోదావరికి 17,230 మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరికి 18వేల మెట్రిక్ టన్నులు, ఉత్తర కోస్తా జిల్లాలకు 14 వేల మెట్రిక్ టన్నులు, గుంటూరుకు 19,250 మెట్రిక్ టన్నులు, నెల్లూరు జిల్లాకు 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నామని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి రైతు భరోసా కేంద్రాల వ్యవస్ధ ద్వారా ఎరువుల విక్రయాల్లో పారదర్శకత వచ్చిందని కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిల్వలు, అధిక రేట్లపై వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం దుకాణాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా డీలర్లు అక్రమంగా ఎరువుల నిల్వ ఉంచినా, అధిక ధరలకు అమ్మినా టోల్ ఫ్రీ నంబర్ 155251కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 15న రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. -
AP: రూ.16,320 కోట్లతో 15 ప్రాజెక్టులు
సద్వినియోగం చేసుకోవాలి ‘‘రైతుల కోసం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రూ.16,320.83 కోట్ల వ్యయంతో 15 రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టాం. ఈ ఏడాది వీటిలో గణనీయమైన పురోగతి కనిపించాలి. సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి’’ – సీఎం జగన్ సాక్షి, అమరావతి: వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన ప్రాజెక్టుల ఫలాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించాలని, క్షేత్రస్థాయిలో మార్పులు కచ్చితంగా కనిపించాలని నిర్దేశించారు. గోదాములు సహా అన్ని రకాల నిర్మాణాలు ఊపందుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచే విప్లవాత్మక 15 రకాల ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సేంద్రీయ రైతులకు ప్రోత్సాహకాలు.. సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాల ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయంపై కస్టమ్ హైర్ సెంటర్ వచ్చే ఏడాది నాటికి ఏర్పాటయ్యేలా ప్రణాళిక రూపొందించాలి. సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలకు సంబంధించిన యంత్రాలు, పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చి ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చూడాలి. రైతులకు ప్రోత్సాహకాలు అందించేలా ఒక విధానం తేవాలి. 1,165 గోదాముల నిర్మాణం గోడౌన్ల నిర్మాణానికి జిల్లాల్లో స్థల సేకరణ దాదాపుగా పూర్తైందని, 1,165 చోట్ల వీటిని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 278 చోట్ల గోడౌన్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రైతులు మోసాలకు గురికాకుండా బరువు, తేమ కొలిచే పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రొక్యూర్మెంట్లో వినియోగించే 6,293 పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. యంత్ర పరికరాలు.. వైఎస్సార్ యంత్రసేవ ద్వారా రైతులకు అందుబాటులోకి తెస్తున్న వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, పరికరాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటికే 3,497 యూనిట్లను రైతులకు అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. 33 ప్రాసెసింగ్ సెంటర్లు.. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన 33 చోట్ల విత్తనాలు, మిల్లెట్స్ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. 2022 ఖరీఫ్ నుంచి ప్రాసెసింగ్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. చిరుధాన్యాలు, పప్పు దినుసులు పండించే రైతులు వీటిని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రాసెస్ చేయడం వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయి. ఉత్పత్తులు కూడా నాణ్యంగా ఉంటాయి. సెకండరీ ప్రాసెసింగ్దారులు, సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి మెరుగైన ముడి పదార్థాలు లభిస్తాయి. 13 సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 13 యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న రైతులకు అందుబాటులో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు పనులపై సీఎం జగన్ సమీక్షించారు. మార్చిలో పశువుల అంబులెన్సులు పశువులకు వైద్య సేవలందించేందుకు 175 అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులోకి రానున్నాయి. మార్చిలో అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు. పాలవెల్లువతో అదనంగా రూ.14.68 కోట్ల లబ్ధి దాదాపు 1,100 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభించి నెలకు 28,00,502 లీటర్లకుపైగా సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 2.03 కోట్ల లీటర్లకుపైగా పాలను సేకరించి రైతులకు రూ.86.58 కోట్లు చెల్లించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు రూ.14.68 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. అమూల్ రాకతో ఇతర డైయిరీలు తప్పనిసరిగా పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని అధికారులు పేర్కొన్నారు. తూనికల్లో తేడాలు, ఫ్యాట్ నిర్దారణలో తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి రైతులు మోసాలకు గురికాకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. గేదె పాలలో ఒక్క శాతం తేడా రావడం వల్ల రైతులు లీటర్‌కు దాదాపు రూ.7 వరకు నష్టపోతున్నారని వివరించారు. వచ్చే నెలలో విశాఖ జిల్లాల్లో .. బీఎంసీ, ఏంఎసీల ప్రగతిని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే నెలలో విశాఖ జిల్లాలో అమూల్ పాలసేకరణ ప్రారంభం కానుంది. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో పాల ఉత్పత్తుల యూనిట్లను అమూల్ ప్రారంభించనుంది. ఆక్వా హబ్‌లతో 80 వేల మందికి ఉపాధి ఆక్వారంగంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆక్వాహబ్‌లు, స్పోక్స్ ద్వారా భారీగా ఉపాధి కల్పన జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 80 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. స్థానికంగా వినియోగం పెరుగుతోంది. జూన్ నాటికి 70 ఆక్వాహబ్‌లు, 14వేల స్పోక్స్ ఏర్పాటు దిశగా సాగుతున్నట్లు చెప్పారు. 23 ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 10 ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 9 సొసైటీలు ఏర్పాటయ్యాయి. 4 నెలల్లో తొలివిడత ఫిషింగ్ హార్బర్లు మొదటి విడతలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నంలో ఫిషింగ్ హార్బర్ల పనులు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పాడలో కూడా పనులను వేగవంతం చేస్తామన్నారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. రెండో విడతలో పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నంలో పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. 15 రకాల ప్రాజెక్టులు ఇవీ డ్రై స్టోరేజీ– డ్రైయింగ్ ఫ్లాట్‌ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్ఫ్రా, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, పశుసంవర్థక శాఖలో మౌలిక సదుపాయాలపై తీసుకున్న చర్యలు, నిధుల సేకరణ తదితరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులకు దాదాపు రూ.16,320.83 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.