Saina Nehwal
-
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్‌లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్‌పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్ -
Mahakhumb 2025 : తండ్రితో కలిసి సైనా నెహ్వాల్ పడవ ప్రయాణం (ఫొటోలు)
-
పోలీస్ స్పోర్ట్స్ మీట్ సైనా నెహ్వాల్,సీపీ సీవీ ఆనంద్ సందడి (ఫొటోలు)
-
మావారి తరఫున మీకు హ్యాపీ న్యూ ఇయర్.. (ఫొటోలు)
-
భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ (ఫొటోలు)
-
గ్లామర్‌లో వేరే లెవల్.. సైనా నెహ్వాల్‌ను ఇలా ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
కీళ్లనొప్పులు.. ఆటకు గుడ్‌బై చెబుతా: సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?
ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. తాను ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని, బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకోవడానికి తన ఆరోగ్య పరిస్థితి అస్సలు సహకరించడం లేదని పేర్కొంది. తన మోకాలులోని మృదులాస్థి బాగా దెబ్బతిందని అందువల్ల ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టం. అదీగాక అత్యున్న స్థాయి ఆటగాళ్లను ఎదుర్కోవడానికి రెండు గంటల ప్రాక్టీస్ ఏ మాత్రం సరిపోదని వెల్లడించింది. సైనా వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఆమె రిటైర్మైంట్ గురించి పలు ఊహగానాలు హల్చల్ చేశాయి. నిజానికి సైనా దాని గురించి ఆలోచిసస్తున్నా అనే చెప్పిందే తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఆటగాళ్ల కెరియర్ చిన్నదే అయినా తాను 9 ఏళ్ల వయసులోనే క్రీడాకారిణిగా కెరియర్ ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఐతే ఆమె గతేడాది సింగపూర్ ఓపెన్ తర్వాత బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనలేదు. అసలు ఇలాంటి సమస్యను ఎక్కువగా క్రీడాకారులే ఎందుకు ఎదుర్కొంటారంటే..కీళ్ళలో మార్పులకు కారణమే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎడిన్‌బర్గ్‌లోని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. 2022లో చేసిన అధ్యయనంలో దీన్ని గుర్తించారు. ఈ సమస్యతో దాదాపు 3 వేల మంది రిటైర్డ్ ఒలింపియన్లు బాధపడుతున్నట్లు చెప్పారు. వారంతా మోకాలి, కటి వెన్నుముక, భుజాలు వంటి ప్రాంతాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వేసవి, శీతాకాల ఒలింపిక్ క్రీడలలో రిటైర్ కాబోతున్న ఎలైట్ అథ్లెట్ల కీళ్లలో ఈ సమస్యను గుర్తించామని చెప్పారు. ఆస్టియో ఆర్థైటిస్ అనేది భరించలేని నొప్పిని కలిగిస్తుందని అన్నారు. క్రీడల్లో ఉండే ఒకవిధమైన ఒత్తిడి, అయ్యే గాయలు కారణంగా ఈ సమస్య వస్తుంది. అయితే ఈ గాయాలు పదే పదే పునరావృతమవుతుంటే సమస్య తీవ్రమవుతుందని అన్నారు. అది కాస్త మృదులాస్థి విచ్ఛిన్నానికి దారితీసి భరించలేని నొప్పిని కలుగజేస్తుందని అన్నారు. అలాగే ఒక్కోసారి క్రీడల సమయంలో అయ్యే గాయాల కారణంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. మోకాలు, మడమల వద్ద అయ్యే గాయాలు కారణంగా ఈ ఆస్టియో ఆర్థైటిస్ సమస్య అభివృద్ధి చెందే అవకాశ ఉందని అన్నారు. దీర్థకాలిక కీళ్ల వాపులు కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. కొన్ని క్రీడల్లో వేగవంతమైన కదలిక భుజాలు, మోకాళ్లపై ఒత్తిడి ఏర్పడటంతో ఈ సమస్య వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ అని చెబుతున్నారు. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అసౌకర్యం, నొప్పిని కలుగజేసి వైకల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!) -
భరించలేని వేదన: సైనా నెహ్వాల్ వ్యాఖ్యలు వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివర్లో తాను ఆటకు స్వస్తి పలకనున్నట్లు తెలిపింది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు 34 ఏళ్ల సైనా నెహ్వాల్ వెల్లడించింది.కామన్వెల్త్లో రెండు పసిడి పతకాలుఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత సైనాది. లండన్-2012 విశ్వ క్రీడల్లో ఈ హైదరాబాదీ షట్లర్ కాంస్య పతకం గెలిచింది. గతంలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంది సైనా. అంతేకాదు కామన్వెల్త్ 2010, 2018 ఎడిషన్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె టోర్నీలకు దూరమైంది. గాయాల వల్లే ఆట విరామం తీసుకుంది.మోకాలి నొప్పి.. ఆర్థరైటిస్తాజాగా ఈ విషయాల గురించి సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు మోకాలి నొప్పి ఉంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నా. పరిస్థితి విషమంగానే ఉంది. ఇలాంటి స్థితిలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటపుడు నేను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఎలా పోటీపడగలను?తొమ్మిదవ ఏట మొదలుపెట్టానుఅందుకే.. వాస్తవాలు చేదుగా ఉన్నా ఆమోదించకతప్పదు. మోకాలి గుజ్జు అరిగిపోయే దశలో కోర్టులో ప్రత్యర్థులపై పైచేయి సాధించడం అంత తేలికేమీ కాదు. మనం అనుకున్న ఫలితాలు రాబట్టడం కష్టతరంగా మారుతుంది. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఏదేమైనా.. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఆటగాళ్ల కెరీర్ త్వరగా ముగిసిపోతుంది. నేను తొమ్మిదేళ్ల వయసులో ఆట మొదలుపెట్టాను. 35వ ఏట రిటైర్ కాబోతున్నాను’’ అని సైనా వెల్లడించింది. గర్వంగా ఉందిసుదీర్ఘకాలం షట్లర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఉందని.. ఈ ఏడాది చివరలోగా రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వెల్లడిస్తానని సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సైనా ఈ మేరకు విషయాలను వెల్లడించింది. సైనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం సైనాను పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో సత్కరించింది.సైనా ఘనతలు ఇవీఒలింపిక్ కాంస్య పతకంవరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యంకామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలుఆసియా క్రీడల్లో కాంస్యం ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతంసూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం -
Saina Nehwal: నా ఆత్మలో.. బ్యాడ్మింటన్!
మణికొండ: బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, దాన్ని ఎప్పటికీ వదలిపెట్టనని పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, అలకాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్–3 వద్ద యోనెక్స్ స్పోర్ట్స్ స్టోర్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో క్రీడాకారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులతో పాటు వారికి నచి్చన క్రీడలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు మన దేశంలో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఫిట్‌గా ఉండేలా చూసుకుని క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. రెజ్లర్ వినేష్ పోగట్‌కు మరో పథకం వస్తుందనే ఆశతోనే ఉన్నానన్నారు. కార్యక్రమంలో స్టోర్ యజమానులు అమర్, కిరణ్, వెంకట్‌తో పాటు ఆమె అభిమానులు పాల్గొన్నారు. -
సైనా నెహ్వాల్‌కు సారీ చెప్పిన కేకేఆర్ స్టార్.. అసలేం జరిగిందంటే?
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను రఘువంశీ అవహేళన చేయడమే ఇందుకు కారణం. అయితే తన తప్పు తెలుసుకున్న ఈ యువ క్రికెటర్.. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు కూడా తెలిపాడు.అసలేం జరిగిందంటే..?బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవని, కానీ అభిమానులు మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్‌కే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని సైనా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించింది."సైనా ఏం చేస్తుందో, రెజ్లర్లు, బాక్సర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రీడాకారుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఎందుకంటే మేము మేము మంచి ప్రదర్శనలు కనబరిచి తరచుగా వార్తాపత్రికలలో వస్తుంటాం. మా లాంటి క్రీడాకారుల వల్ల భారత్‌కు గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కానీ మన దేశంలో మాత్రం క్రీడా సంస్కృతి పెద్దగా లేదు. అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంటోందని కొన్నిసార్లు బాధేస్తుంది. క్రికెట్‌కు మిగితా క్రీడలకు చాలా తేడా ఉంది. క్రికెట్‌తో పోలిస్తే బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఇతర క్రీడలు శారీరకంగా చాలా కఠినమైనవి. షటిల్ తీసుకొని సర్వ్ చేసేంత సమయం కూడా ఉండదు. అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. కానీ క్రికెట్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. అయినప్పటకి క్రికెట్టే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుందని" అని నిఖిల్ సింహా పోడ్కాస్ట్లో సైనా నెహ్వాల్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సైనా వ్యాఖ్యలపై స్పందించిన రఘువంశీ వివాదస్పద ట్వీట్(ఎక్స్) చేశాడు. ‘‘బుమ్రా 150 కి.మీ వేగంతో ఆమె తలపైకి బౌన్సర్ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం’’ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వెంటనే తన తప్పును గ్రహించిన రఘువంశీ తన చేసిన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. ఆమె సారీ చెబుతూ మరో పోస్ట్ చేశాడు.అందరూ నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలను సరదగా తీసుకుంటారు అనుకున్న. కానీ తర్వాత ఆలోచిస్తే ఆర్ధంలేని జోక్‌లా అన్పించింది. నేను నా తప్పును గ్రహించాను. అందుకే హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నానని ఎక్స్‌లో రఘువంశీ మరో పోస్ట్ చేశాడు. కాగా 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన రఘువంశీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 10 ఇన్నింగ్స్ ఆడి.. 115.24 స్ట్రైక్ రేట్‌తో 163 పరుగులు చేశాడు. Saina Nehwal Stoodup and Spoken Some Harsh Facts 🔥 pic.twitter.com/gaF9fSROXc— Gems of Shorts (@Warlock_Shabby) July 11, 2024 -
రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
చెక్ రిపబ్లిక్ అందాలు ఆస్వాదిస్తున్న సైనా.. మరో బ్యూటీ ఎవరంటే? (ఫొటోలు)
-
భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్ స్టార్.. స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్? గుర్తుపట్టారా?
-
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Saina Nehwal: జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటున్న సైనా నెహ్వాల్
-
మహిళలపై ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్ ఆవేదన
బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్పందించింది. స్త్రీలను వంటగదికే పరిమితం చేయాలి అనే వ్యాఖ్యలకు కలత చెందిన సైనా నెహ్వాల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు బాధాకరం. ఆడపిల్లలు అన్నిరంగాల్లో దూసుకెళ్లాలని కలలు కంటున్నప్పుడు ఇలా అనడం సమంజసం కాదు. ఒకవైపుకు మహిళామణులను ఒక శక్తిగా భావిస్తున్నారు. మోదీ సర్కార్ మహిళల కోసం అనేక రిజర్వేషన్ బిల్లులు తీసుకువస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదని అన్నారు. దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా శివశంకరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. గాయత్రి సిద్దేశ్వరను ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. ఆమెకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసని అన్నారు. “Woman should be restricted to the kitchen"- This is what a top Karnataka leader Shamanur Shivashankarappa ji has said . This sexist jibe at @bjp4india candidate from Davanagere Gayathri Siddeshwara ji is least expected from a party that says Ladki Hoon Lad Sakti Hoon When I… — Saina Nehwal (@NSaina) March 30, 2024 -
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో బ్యాడ్మింటన్ జోడీ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ (ఫొటోలు)
-
పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్: భర్తతో కలిసి సైనా సందడి (ఫొటోలు)
-
Anant -Radhika: రాయల్ టెంట్ అదుర్స్! వీడియో షేర్ చేసిన సైనా
Anant Ambani Radhika Pre Wedding: అంబానీల వారసుడు అనంత్- రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సెలబ్రిటీ లోకం తరలివెళ్లింది. క్రీడా, సినీ ప్రముఖులు గుజరాత్లో సందడి చేస్తూ అంబానీ కుటుంబ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్దంపతులు కూడా జామ్‌నగర్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో సైనా.. ‘‘పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్’’ పేరిట తాము ఉండబోయే రాయల్ టెంట్ టూర్ వీడియో షేర్ చేసింది. ముందస్తు పెళ్లి వేడుకల కోసం వచ్చే అతిథుల కోసం దాదాపు అరవై దాకా ఈ టెంట్లు వేయించినట్లు తెలుస్తోంది. పచ్చని మైదానంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ తాత్కాలిక నివాసాన్ని నాలుగు గదులుగా విభజించారు. ఇందులో లివింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూం హైలైట్‌గా నిలిచాయి. ఇండోర్ ప్లాంట్లను కూడా జతచేసి మనసుకు హాయి కలిగించేలా.. అన్ని రకాల సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దారు. సైనా నెహ్వాల్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్- ఉపాసన దంపతులు కూడా అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు జామ్‌నగర్‌కు వెళ్లారు. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ 'సైనా నెహ్వాల్' ఇటీవల తన గ్యారేజిలో ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని చేర్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సైనా నెహ్వాల్ కొన్న కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'AMG GLE 53 4MATIC+ Coupe'. దీని ధర రూ.1.8 కోట్లు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తరువాత ఈ కారుని కొన్న వ్యక్తి 'సైనా నెహ్వాల్' కావడం విశేషం. కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది. మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ దేశీయ మార్కెట్లో ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన 'మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ' మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ గరిష్టంగా 435 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 249 కిమీ. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు 12.3 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరొకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. వీటితో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 13 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
బంజారాహిల్స్‌లో కెఫేలో సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ఆలోచన లేదు: సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ... ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన లేదని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. మోకాలి గాయంతో బాధపడుతున్న 33 ఏళ్ల సైనా గత జూన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంది. ఫలితంగా ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఆమె ప్రస్తుతం 55వ ర్యాంక్‌కు పడిపోయింది. ‘ప్రపంచ చాంపియన్ ఆన్ సె యింగ్, తై జు యింగ్, అకానె యామగుచిలాంటి స్టార్స్‌తో తలపడాలంటే కేవలం ఒక గంట శిక్షణ సరిపోదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ బరిలోకి దిగుతాను. ప్రతి ప్లేయర్ రిటైర్ అవుతాడు. నా విషయంలో మాత్రం వీడ్కోలు పలికేందుకు తుది గడువు పెట్టుకోలేదు’ అని 2019లో చివరిసారి అంతర్జాతీయ టోర్నీ టైటిల్ గెలిచిన సైనా వ్యాఖ్యానించింది. -
అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్!
Independence Day 2023: ఝాన్సీ లక్ష్మీబాయి.. బేగం హజ్రత్ మహల్.. అనీ బిసెంట్.. కమలా నెహ్రూ.. సరోజిని నాయుడు.. ఇలా ఎంతో మంది వీరవనితలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని మహిళలు ఎవరికీ తీసిపోరని నిరూపించారు. స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు బ్రిటిషర్లతో జరిగిన మహాసంగ్రామంలో తాము సైతం అంటూ ముందడుగు వేసి జాతిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తితో మరెంతో మంది స్త్రీమూర్తులు వంటింటి నుంచి బయటకు వచ్చి విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో తమ ప్రాతినిథ్యం ఉండేలా అడుగులు వేశారు. అయితే, నేటికీ స్వతంత్ర భారతంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని సంతోషంతో స్వాగతాలు పలికేది కొందరైతే.. తల్లి కడుపులో ఉండగానే ఆడ శిశువులను చిదిమేసే కిరాతకులలు ఎందరో! మహిళల ఆహారపుటలవాట్లు మొదలు వస్త్రధారణ, చేయాల్సిన ఉద్యోగం గురించి కూడా తామే నిర్ణయించే ఈ పురుషాధిక్య ప్రపంచంలో.. అసమానతలను అధిగమించి ‘విశ్వవేదిక’పై సత్తా చాటడటమంటే మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి క్రీడల్లో తలమానికమైన ఒలింపిక్స్‌లో భారత జాతి గర్వపడే విజయాలు సాధించిన బంగారు తల్లుల గురించి తెలుసుకుందాం! కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌లో మొట్టమొదటి పతకం సాధించిన భారత మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్- 2000లో వెయిట్‌లిఫ్టింగ్ 54 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. తద్వారా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. లండన్ ఒలింపిక్స్-2012లో ఈ మాజీ వరల్డ్ నంబర్ 1.. కాంస్య పతకం గెలిచింది. అంతకు ముందు బీజింగ్-2008, ఆ తర్వాత 2016- రియో ఒలింపిక్స్‌లోనూ ఆమె భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మేరీ కోమ్ భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యం అందించింది. బాక్సింగ్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచిన విజేందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది ఈ మణిపురీ ఆణిముత్యం. పీవీ సింధు ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుది అసాధారణ విజయం. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనలిస్టు అయిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు.. రజత పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ సింధు మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. గతంలో సిల్వర్ గెలిచిన ఆమె.. ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కడం విశేషం. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ భారత్‌కు కాంస్యం అందించింది. 58 కేజీల విభాగంలో మెడల్ గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. మీరాబాయి చాను 2016లో నిరాశను మిగిల్చిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మాత్రం సత్తా చాటింది. 49 కేజీల విభాగంలో వెండి పతకం గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో.. సిల్వర్ మెడల్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించింది. లవ్లీనా బొర్గొహెయిన్ అసామీ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది. కనీస వసతులు లేని గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా తన ప్రతిభతో తమ ఊరి పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు -
కశ్మీర్ ట్రిప్‌లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. వైరల్ ఫొటోలు
-
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్‌లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్‌లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్‌కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
ఆసియా క్రీడలకు సైనా దూరం! కారణమిదే
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెలెక్షన్ట్రయల్స్ టోర్నీలో సైనా నెహ్వాల్ పాల్గొనడంలేదు. ‘ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్‌లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్ జోడీ కుశాల్ రాజ్, ప్రకాశ్ రాజ్ కూడా ట్రయల్స్ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. చదవండి: ‘బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమిది’ న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు అన్ని వైపుల నుంచి సంఘీభావం లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా వేదిక వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటించాడు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అతనిపై చర్యకు వెనుకాడుతోందని సిద్ధూ విమర్శించాడు. ‘ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యం చేశారు. అందులో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు. దానిని బలహీనంగా తయారు చేశారని అర్థమవుతోంది. అన్నీ దాచేసి బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమే ఇదంతా. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అంటూ సిద్ధూ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా రెజ్లర్లకు సంఘీభావం పలకగా... రేడియోలో ‘మన్‌కీ బాత్’ కాదు, రెజ్లర్ల వద్దకు వచ్చి వారి మన్‌కీ బాత్ వినాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సూచించారు. మరోవైపు తనను ఉరి తీసినా పర్వాలేదని, రెజ్లింగ్ పోటీలు మాత్రం ఆగరాదని బ్రిజ్‌భూషణ్ అన్నాడు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. తక్షణం ఎవరి ఆధ్వర్యంలోనైనా క్యాడెట్ నేషనల్స్ నిర్వహించండి. లేదంటే వయసు పెరిగి కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. నన్ను ఉరి తీయండి కానీ ఆట మాత్రం ఆగవద్దు’ అని బ్రిజ్‌భూషణ్ చెప్పాడు. -
సైనా, సాయిప్రణీత్ ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, సాయిప్రణీత్ నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 16–21, 14–21తో తుర్కియే షట్లర్ నిష్లిహాన్ యిగిట్ చేతిలో... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 20–22, 17–21తో లీంగ్ జున్ హావో (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
సైనాకు చేదు అనుభవం
జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లో, ఇండియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది. క్వార్టర్స్‌లో లక్ష్య సేన్ ఇక రెండో గేమ్‌లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు. వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? -
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్‌తో ముందంజ వేసింది. -
సింధు ఇంటికి... సైనా ముందుకు
న్యూఢిల్లీ: ఈ ఏడాది వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నీలోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీలోనూ సింధు తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 45 నిమిషాల్లో 12–21, 20–22తో ప్రపంచ 30వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో సుపనిద చేతిలోనే ఓడిపోయిన సింధుకు ఈసారీ అదే ఫలితం ఎదురైంది. మరోవైపు భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–17, 12–21, 21–19తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లక్ష్య సేన్ శుభారంభం పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ (భారత్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–14, 21–15తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. గతవారం మలేసియా ఓపెన్ తొలి రౌండ్ లో ప్రణయ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. సాత్విక్ జోడీ ముందంజ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపి యన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో మాథ్యూ–క్రిస్టోఫర్ గ్రిమ్లే (స్కాట్లాండ్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 21–11, 23–25, 21–9తో రూబెన్ జిలీ–టియెస్ వాన్ డెర్ (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 22–20, 17–21, 21–18తో మార్గోట్ లాంబర్ట్–ఆనీ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందగా... సిక్కి రెడ్డి–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 17–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ -
సింధు పునరాగమనం
కౌలాలంపూర్: గాయంతో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీతో 2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక ... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ పోటీపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్‌లో చివరిసారి బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆ తర్వాత చీలమండ గాయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు ఇతర టోర్నీలకు ఆమె దూరంగా ఉంది. సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో కెంటా నిషిమోటో (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 10 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 87,500 డాలర్ల చొప్పున (రూ. 72 లక్షలు) అందజేస్తారు. -
సెలెక్షన్ ట్రయల్స్‌కు సైనా దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈరోజు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా మహిళల సింగిల్స్‌లో పీవీ సింధును నేరుగా జట్టులో ఎంపిక చేయగా... రెండో బెర్త్ కోసం సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్‌లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెలెక్షన్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. అయితే తాము సెలెక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాలేమని సైనా, మాళవిక ‘బాయ్’కు సమాచారం ఇచ్చారు. సైనా, మాళవిక వైదొలిగిన నేపథ్యంలో ఈ ట్రయల్స్‌కు అష్మిత చాలియాను ‘బాయ్’ ఎంపిక చేసింది. అష్మిత, ఆకర్షి మధ్య జరిగే ట్రయల్స్ మ్యాచ్‌లో గెలిచిన వారికి జట్టులో రెండో సింగిల్స్ ప్లేయర్‌గా స్థానం లభిస్తుంది. 32 ఏళ్ల సైనా గత ఏడాది 14 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి 14 మంది బరిలోకి దిగనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలను నేరుగా జట్టులోకి ఎంపిక చేశారు. మిగతా బెర్త్‌ల కోసం నేడు ట్రయల్స్‌ను ఏర్పాటు చేశారు. -
సంపాదించిన ప్రతీ రూపాయి ఇంట్లోకే: సైనా నెహ్వాల్
-
'దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురా అన్నప్పుడు నవ్వుకున్నా'
గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్' కార్యక్రమంలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా మహిళలు క్రీడల్లో రాణించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'' దేశంలో పాపులర్ క్రీడగా పేరున్న క్రికెట్‌తో బ్యాడ్మింటన్‌ను పోల్చలేము. అయితే చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌పై ఇష్టం పెంచుకున్న నాకు తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. అయితే బ్యాడ్మింటన్‌లోనూ మహిళలు, పురుషులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాతో పోలిస్తే పురుషుల బ్యాడ్మింటన్‌కు కాస్త క్రేజ్ ఎక్కువ. అలాంటి స్థితిలోనూ నేను బ్యాడ్మింటన్‌లో రాణించడం సంతోషంగా అనిపించింది. తొమ్మిది, పదేళ్ల వయస్సు నుంచి రెగ్యులర్‌గా బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనేదాన్ని. ఆ టోర్నమెంట్లో ఇచ్చిన రూ.500, 1000 ప్రైజ్‌మనీ.. ఇలా ఒక్క రూపాయి వచ్చిన ఇంట్లోనే ఇచ్చేదాన్ని. అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌లో పతకాలు అనగానే మొదటగా కొరియా,చైనా, జపాన్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయా దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటలో కత్తిలాంటి ప్లేయర్లు తయారవుతున్నారు. కానీ మన దేశంలో అలా కాదు. క్రికెట్ లాంటి పాపులర్ గేమ్ వెనుక బ్యాడ్మింటన్ లాంటివి చిన్న గేమ్స్‌గా చూస్తారు. అయితే నా తండ్రి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొడితే చూడాలని ఉందని ఒకరోజు అన్నాడు. అది విన్న నాకు నవ్వు వచ్చింది. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బ్యాడ్మింటన్‌లో రాణించాలని నా తండ్రి బలంగా కోరుకున్నాడు. అలా ఇవాళ మీ ముందు ఉన్న సైనా నెహ్వాల్ ఈరోజు స్టార్ బ్యాడ్మింటన్‌గా పేరు సంపాదించింది. ఇక కెరీర్లో ఎన్నో టైటిల్స్ గెలిచినప్పటికి ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం గర్వంగా అనిపించేది. ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా రాణించడం చూస్తే ప్రపంచంతో పోటీ పడి పరుగులు తీస్తున్నామన్న విషయం స్పష్టమవుతోంది'' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Saina Nehwal Successful Journey- Interesting Facts In Telugu: ‘మళ్లీ అమ్మాయేనా.. నేను దాని మొహం కూడా చూడను పో’.. ఆ వృద్ధురాలు చేసిన కటువైన వ్యాఖ్యకు ఉన్నత విద్యావంతుడైన ఆమె కుమారుడు కనీసం జవాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ఇంట్లో ఏడేళ్ల క్రితం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మనవడు కావాలని నానమ్మ ఆశించింది. అయితే అది జరగలేదు. పురుషులు, మహిళల నిష్పత్తిలో దేశంలోనే ఎక్కువ అంతరం ఉండే, ఆడపిల్లల పట్ల తీవ్ర వివక్ష చూపించే రాష్ట్రం హర్యానాలో.. అదీ అమ్మాయిలు పుట్టగానే నొసలు చిట్లించడమనేది ఎక్కువ మందికి అలవాటుగా ఉన్న హిస్సార్‌లో ఆమె ప్రవర్తన కొత్తగా అనిపించలేదు. చివరకు నెలరోజుల తర్వాత కొడుకు బతిమాలితే గానీ తన మనవరాలిని ఆమె చూడలేదు. కానీ అందులో ప్రేమ లేదు! ఆ సమయంలో తల్లికి ఏమీ చెప్పలేకపోయిన ఆ పాప తండ్రి మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెండో కూతురును మాత్రం అందరికంటే ప్రత్యేకంగా పెంచాలని, ఆమెను చూసి మున్ముందు అందరూ గర్వపడాలని భావించాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం క్రీడలు! ఆ హిస్సార్ బిడ్డ తర్వాతి రోజుల్లో హైదరాబాదీగా మారి ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమే సైనా నెహ్వాల్... భారత మహిళల బ్యాడ్మింటన్‌కు టార్చ్‌బేరర్‌లా నిలిచిన స్టార్ షట్లర్. అమ్మా నాన్న అండతో.. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరడంతోనే సైనా ఆటకు పునాది పడింది. సరదాగా కరాటే నేర్చుకున్నా.. స్విమ్మింగ్, సైక్లింగ్ ఎన్ని చేసినా అవి ఆమెను ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మార్చలేవని తండ్రికి అనిపించింది. పైగా కరాటే నేర్చుకుంటున్న సమయంలో ఒక మోటార్ బైక్‌ను కొందరు విద్యార్థుల చేతుల మీదుగా తీసుకుపోవాలని ఇన్స్ట్రక్టర్ సూచించాడు. అది తన వల్ల కాదంటూ కరాటేను వదిలేసేందుకే సైనా సిద్ధమైంది. దాంతో కెరీర్లో ఎదిగే ఆటను ఆయన గుర్తించాడు. ఎనిమిదేళ్ల వయసులో సైనా చేతికి బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు. షటిల్ ఆటపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి కూడా అందుకు కారణం కావచ్చు. సైనా తల్లి ఉషారాణికి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడిన అనుభవమూ ఉండటంతో ఇంట్లోనే అదనపు ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో ఆట మొదలైంది. ఫలితాల గురించి ఆలోచించే పరిస్థితి ఎనిమిదేళ్ల పాపకు రాకూడదని భావించిన హర్వీర్ ఏ దశలోనూ విజయాలు, పరాజయాల గురించి ఆ చిన్నారితో మాట్లాడలేదు. నువ్వు ఆడుతూ ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అనే భరోసాను మాత్రం కల్పించాడు. ‘ఒక ప్లేయర్ పెద్ద స్థాయికి చేరాలంటే ఆ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడనేది కాదు. ప్లేయర్‌తో పాటు కూడా తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తారనేది ముఖ్యం. మీరు మీ పిల్లల కోసం ఎంత సమయం ఇవ్వగలరు’.. ఏదైనా ఆటలో శిక్షణ కోసం అకాడమీకి వెళితే కోచ్‌ల నుంచి సాధారణంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. హర్వీర్కూ ఇదే ఎదురైంది. నేను ఎంత సమయమైనా ఇస్తానని ఆయన చెప్పాడు. రాజేంద్రనగర్‌లోని తన ఇంటి నుంచి ఎల్బీ స్టేడియం వరకు కోచింగ్‌కు వస్తూ, పోతూ సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణంలో చేతక్ స్కూటర్‌పైనే నిద్ర కూడా! ఇదే తరహాలో ఆమె శిక్షణ సాగింది. సైనా ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలో తన ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి రావడంతో తండ్రి వాటిని వదులుకున్నాడు. కూతురు కోసం దేనికైనా సిద్ధపడిన ఆయన ఆశలను సైనా వమ్ము చేయలేదు. ఎవరి వల్లా కాలేదు కోట్లాది రూపాయల ఆదాయం, ఇళ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం.. సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆటగాళ్ల గురించి అందరిలో ఉండే భావనే ఇది. కానీ ఆ స్థాయికి చేరేందుకు వారు పడిన కష్టం, శ్రమ మాత్రం బయటకు కనిపించదు. సైనా నేపథ్యం పేదదేమీ కాకపోవచ్చు. అయినా సరే ఒక ప్లేయర్‌గా మారే కోణంలో చూస్తే ఆర్థికపరమైన అడ్డంకులు తలుపు తడుతూనే ఉంటాయి. రాకెట్ కొనుగోలు మొదలు టూర్లు, ఎక్కడో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు చూస్తే పరిధి దాటుతూనే ఉంటాయి. సైనాకు 9 ఏళ్ల వయసులో ఓ అండర్ 10 టోర్నీలో ఆడేందుకు మొదటిసారి ఖరీదైన రాకెట్‌ను (1999లో రూ. 2,700) కొనిచ్చాడు తండ్రి. అయితే చెన్నైలో జరిగిన ఈ టోర్నీ సందర్భంగా దానిని ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో భోరున ఏడ్చేసిన సైనాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందుకే స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన రూ. 700 స్కాలర్షిప్, కొన్నాళ్ల తర్వాత పెట్రోలియం బోర్డు అందించిన రూ. 2,500 స్కాలర్షిప్ కూడా ఆమెకు బంగారంలా అనిపించాయి. తన భార్య ఆరోగ్యం బాగా లేదంటూ హర్వీర్ ఆరు సార్లు పీఎఫ్ ఖాతానుంచి సైనా ఆట కోసమే డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా కాలేదు. నడిచొచ్చిన విజయాలు సైనా విజయప్రస్థానంలో ఎప్పుడూ పెద్దగా ఆటుపోట్లు ఎదురు కాలేదు. అద్భుతమైన ఆట, కఠోర శ్రమ, తొందరగా నేర్చుకునే తత్వం, తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటు సైనాను శిఖరానికి తీసుకెళ్లాయి. జూనియర్ స్థాయిలో సైనా పదునైన ఆట గురించి ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే. ప్రత్యర్థులకు అందనంత రీతిలో, తిరుగులేని ప్రదర్శనతో ఆమె దూసుకుపోయింది. 15 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో న్యూఢిల్లీలో తొలి టైటిల్ (ఆసియా శాటిలైట్) గెలిచిన తర్వాత సైనా ఎక్కడా ఆగలేదు. తర్వాతి ఏడాది ప్రతిష్ఠాత్మక 4 స్టార్ ఫిలిప్పీన్స్ ఓపెన్ గెలిచిన తర్వాత సైనా సత్తా ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి తెలిసింది. 2008లో వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ప్రతిష్ఠాత్మక విజయాలు సైనా ఖాతాలో వచ్చి చేరాయి. చాలెంజర్ టోర్నీలు, గ్రాండ్ ప్రి, గ్రాండ్ ప్రి గోల్డ్, సూపర్ సిరీస్, సూపర్ సిరీస్ ప్రీమియర్... ఇలా పేరు ఏదైతేనేం విజేత సైనా మాత్రమే. తన అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో 24 అంతర్జాతీయ టైటిల్స్ సైనా గెలుచుకుంది. ఇందులో 10 సూపర్ సిరీస్‌లే ఉన్నాయి. ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్, ఇండియన్ ఓపెన్.. వేదికలు మారడమే తప్ప విజయాలు మాత్రం తనవే. కొన్ని ఘనతలు... ►ఒలింపిక్ కాంస్య పతకం ►వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం ►కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు ►ఆసియా క్రీడల్లో కాంస్యం ►ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం ► సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం భారత ప్రభుత్వం పౌర పురస్కారాలు ► పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో సైనా నెహ్వాల్‌ను గౌరవించింది. ఆ పతకం ఒక మణిహారం.. 2012 ఆగస్టు 4.. సైనా నెహ్వాల్ ఉజ్వల కెరీర్‌ను శిఖర స్థాయిలో నిలిపిన విజయం. లండన్ ఒలింపిక్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా బ్యాడ్మింటన్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వ్యక్తిగతం.. 2018లో.. సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను సైనా వివాహమాడింది. ఆమె కెరీర్ విశేషాలతో ‘సైనా’ అనే బయోపిక్ కూడా వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైనా పాత్రలో పరిణీతి చోప్రా నటించింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఓటమి
హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జర్మనీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 19–21, 21–19, 21–16తో లీ యాంగ్–లు చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
సైనా నెహ్వాల్ పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆట తొలి పోరులోనే ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–13, 17–21, 19–21తో వ్యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సైనా, ఆ తర్వాత ప్రత్యర్థి ముందు నిలబడలేకపోయింది. మరో వైపు డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో కామన్వెల్త్ చాంపియన్స్, ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 21–9, 21–13తో క్రిస్టో పొపొవ్–తొమా జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ తర్వాతి గేమ్‌లలో పుంజుకొంది. రెండో గేమ్‌ను చకచకా ముగించగా, నిర్ణాయక గేమ్‌లోనూ ఇదే ఆటతీరు కొనసాగించడంతో స్థానిక ఆటగాళ్లకు పరాజయం తప్పలేదు. ఒక గంటా 8 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జోడీ తేలిపోయింది. అయితే మిక్స్డ్, మహిళల డబుల్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. మహిళల డబుల్స్ మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట 21–23, 20–22తో ఆరో సీడ్ జాంగకొల్ఫన్ కిటితరకుల్–రవిండ ప్రజొంగ్జయ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో జోడీ 13–21, 16–21తో జపాన్‌కు చెందిన క్యోహెయ్ యమషిత–నరు షినొయా జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్
జపాన్ ఓపెన్ 2022లో బుధవారం భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా, కిదాంబి శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ 4 ఆటగాడికి షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. బుధవారం శ్రీకాంత్ ఒక్కడే తొలి రౌండ్ గండాన్ని అధిగమించాడు. శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్.. ఈ గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మిగతా గేమ్‌ల్లో లక్ష్యసేన్.. జపాన్‌కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో, సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 తేడాతో ఓడారు. పురుషుల డబుల్స్‌లో అర్జున్-కపిల ద్వయం.. చోయ్-కిమ్ చేతిలో, మహిళల డబుల్స్‌లో జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రసాద్-దేవాంగన్ జంట.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓటమి చవిచూశాయి. కాగా, ఈ టోర్నీలో మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్ -
Badminton World Championships 2022: సైనా ఓటమి.. టోర్నీ నుంచి అవుట్
Badminton World Championships: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రయాణం ముగిసింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన షట్లర్ బుసానన్ ఒంగ్బామ్రంగ్‌ఫాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో బుసానన్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. దీంతో మొదటి గేమ్‌ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న ఈ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు.. సైనా ఇంటిబాట పట్టింది. ఇక అంతకుముందు మ్యాచ్‌లో సైనా.. హాంకాంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్ వరకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. పురుషుల డబుల్స్‌లో అన్‌సీడెడ్ భారత ప్లేయర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలిసారిగా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అదే విధంగా చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. NZ vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్! స్టార్ బౌలర్ వచ్చేశాడు! Despite her best efforts @NSaina falls short against WR-12 🇹🇭's Busanan Ongbamrungphan and ends her #BWFWorldChampionships2022 campaign in R16 💔 Well fought champ 🙌#BWFWorldChampionships#BWC2022#Tokyo2022#Badminton pic.twitter.com/gr04fcsgrQ — BAI Media (@BAI_Media) August 25, 2022 -
BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు
టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్.. హైదరాబాదీ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యిపై 21-19, 21-9తో ఓడించింది. కాగా మ్యాచ్ ఫలితం 38 నిమిషాల్లోనే పూర్తయింది. కాగా రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన ఆరవ సీడ్ నవోమి ఒకుహరాతో తలపడాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఒకుహరా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్‌కు బై లభించింది. దీంతో మూడో రౌండ్లో సైనా నెహ్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య విజేతతో తలపడనుంది. శ్రీకాంత్, లక్ష్యసేన్ ముందంజ ఇక తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ముందంజ వేయగా, మరో భారత ఆటగాడు బి.సాయిప్రణీత్ పోరు మొదటి మ్యాచ్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో కూడా మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నాలుగో సీడ్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ) ముందు తలవంచాడు. చెన్ 21–15, 15–21, 21–15 స్కోరుతో సాయిప్రణీత్‌ను ఓడించాడు. 51 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగిన మరో పోరులో 12వ సీడ్ శ్రీకాంత్ 22–20, 21–19 తేడాతో ఎన్‌హట్ గుయెన్ (ఐర్లాండ్)పై విజయం సాధించాడు. 9వ సీడ్ లక్ష్య సేన్ 21–12, 21–11తో క్రిస్టియాన్ సోల్బర్గ్ (డెన్మార్క్)ను చిత్తు చేయగా, ప్రణయ్ 21–12, 21–11 స్కోరుతో ల్యూకా రాబర్ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 14–21, 12–21తో లైన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి– అశ్విని పొన్నప్పతో పాటు పూజ దండు–సంజనా సంతోష్ జోడి కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో సిక్కి–అశ్విని 21–7, 21–19తో అమీనత్ నబీహా – ఫాతిమా నబాహా (మాల్దీవులు)ను చిత్తుగా ఓడించారు. పూజ–సంజన 21–6, 10–21, 21–14తో లూసియా సలాజర్–పౌలా రీగల్ (పెరూ)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల జోడి 21–17, 17–21, 22–20తో సుపాక్ జోమ్కో– కిటునుపాంగ్ (థాయిలాండ్)ను ఓడించి ముందంజ వేయగా, మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయానికి నిరాశ ఎదురైంది. మను–సుమీత్ 11–21, 21–19, 15–21తో హిరోకి ఒకమురా–మసాయుకి ఒనొడెరా (జపాన్) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో 21–12, 21–13తో ప్యాట్రిక్ షీల్–ఫ్రాన్సిస్కా వోక్మన్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. అవకాశం ఇవ్వకుండా.. అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్‌లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది. లక్ష్యసేన్ సైతం.. అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది. శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి. అభిమానులకు ధన్యవాదాలు: సింధు సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు PC: PV Sindhu Twitter సింధు ఘనతలు: ►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. ►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు
సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సత్తా చాటింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై విజయం సాధించింది. ప్రత్యర్థిని 17-21, 21-11, 21-19 తేడాతో ఓడించి తెలుగు తేజం సింధు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు భంగపాటు తప్పలేదు. జపాన్ ప్లేయర్ ఒహరి చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్స్‌లో 13-21, 21-15, 20-22 తేడాతో సైనా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సైతం బీడబ్ల్యూఎఫ్ 500 టోర్నీ క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ కొడాయి నరోకా చేతిలో ఓడి ఇంటిబాటపట్టాడు. చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా.. -
రీ ఎంట్రీలో రెచ్చిపోతున్న సైనా.. ఐదో సీడ్ ప్లేయర్‌కు ఝలక్
సింగపూర్ ఓపెన్ 2022లో భారత షట్లర్లు రెచ్చిపోతున్నారు. పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఇదివరకే క్వార్టర్స్‌కు చేరగా.. తాజాగా వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఫైనల్ 8కు దూసుకెళ్లింది. రెండో రౌండ్లో సైనా.. చైనా షట్లర్ హి బింగ్ జియావోపై 21-19, 11-21, 21-17 తేడాతో విజయం సాధించి, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత వరల్డ్ టూర్ 500 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతకుముందు సైనా తొలి రౌండ్లో భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 2010లో చివరిసారి ఈ టైటిల్ సాధించిన సైనా.. మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన మిథున్ మంజునాథ్.. రెండో రౌండ్లో వరల్డ్ నెం.42 ర్యాంకర్ నాట్ గుయెన్ చేతిలో 10-21, 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి అర్జున్, ధృవ్ కపిలా ద్వయం ప్రపంచ నెం.12 మలేషియా జోడి గో సీ ఫెయ్ - నుర్ ఇజుదుద్దీన్పై 18-21, 24-22, 21-18 తేడాతో సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. చదవండి: కిదాంబి శ్రీకాంత్‌కు షాక్.. క్వార్టర్స్‌కు సింధు, ప్రణయ్ -
Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీలో హి బింగ్ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 21–16, 17–21, 14–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–8, 21–9తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై, కశ్యప్ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–19, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. సమీర్ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ– అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
సింధు ముందుకు.. సైనా ఇంటికి
మలేషియా ఓపెన్ 2022లో భారత్‌కు ఇవాళ (జూన్ 29) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, ప్రపంచ 7వ ర్యాంకర్ పీవీ సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించగా.. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. వరల్డ్ నంబర్ 10 ప్లేయర్ పోన్‌పావీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై సింధు 21-13, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్ చేతిలో 11-21, 17-21 తేడాతో సైనా ఓటమిపాలైంది. మరోవైపు డబుల్స్ పెయిర్ బి సుమీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప.. నెదర్లాండ్స్ జోడీ రాబిన్ టాబెలింగ్-సెలెనా పీక్ చేతిలో 15-21, 21-19 17-21 తేడాతో ఓటమిపాలవగా, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో విజయం సాధించాడు. ప్రణయ్.. స్థానిక ఆటగాడు ల్యూ డారెన్‌పై 21-14, 17-21, 21-18తేడాతో గెలుపొందాడు. చదవండి: 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
సైనా X ‘బాయ్’
హైదరాబాద్: ఒలింపిక్ కాంస్యం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో లెక్క లేనన్ని విజయాలు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. 32 ఏళ్ల వయసులో ఫామ్ కోల్పోయి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అనామక, యువ షట్లర్ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. తాను ఆడిన గత ఆరు టోర్నీలలో ఆమె రెండో రౌండ్ దాటలేకపోయింది. కరోనా కాలాన్ని పక్కన పెడితే 2019నుంచి సైనా ఒకే ఒక్క టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఇలాంటి స్థితిలో రాబోయే పెద్ద ఈవెంట్లలో సైనాకు భారత బృందంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు ఉబెర్ కప్ సెలక్షన్ ట్రయల్స్‌కు కూడా సైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నేరుగా ఎంపిక చేసిన ప్లేయర్లలో కూడా సైనా పేరు లేదు. దాంతో ఆమె ‘బాయ్’పై విమర్శలకు దిగిం ది. ఈ నేపథ్యంలో మున్ముందు రాబోయే టోర్నీల్లో సైనా ఎలా భాగం కాబోతుందనేది ఆసక్తికరం. ఏం జరిగిందంటే... ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్– ఉబెర్ కప్ కోసం నేటినుంచి ఆరు రోజుల పాటు ఈ నెల 20 వరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ‘బాయ్’ ప్రకటించింది. ఇందులో 120 మంది షట్లర్లు పాల్గొనబోతున్నారు. ట్రయల్స్‌కు ఇబ్బంది రాకూడదని కొరియా మాస్టర్స్ టోర్నీకి కూడా భారత్‌నుంచి ఎవరూ పాల్గొనకుండా ‘బాయ్’ జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాను దీనికి హాజరు కావడం లేదని సైనా ఇప్పటికే ‘బాయ్’కు వెల్లడించింది. మరో వైపు సెలక్షన్స్‌కు ఒక రోజు ముందే గురువారం పై ఈవెంట్లలో నేరుగా పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ‘బాయ్’ వెల్లడించింది. వరల్డ్ టాప్–15 ర్యాంక్‌లో ఉండటం అర్హతగా పేర్కొంటూ సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, డబుల్స్ జోడి సాత్విక్–చిరాగ్‌లను ఎంపిక చేసింది. టాప్–15లో లేకపోయినా ఇటీవలి చక్కటి ప్రదర్శనకు గుర్తింపునిస్తూ హెచ్ఎస్ ప్రణయ్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే ఫామ్‌లో లేకపోయినా, తన ఘనతలు, అనుభవం దృష్ట్యా తనకూ నేరుగా అవకాశం లభిస్తుందని సైనా ఆశించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దీనిపై సైనా స్పందించింది. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను ట్రయల్స్‌కు రావడం లేదని... పరిస్థితి చూస్తుంటే ‘బాయ్’ ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెట్టినట్లుగా ఉందని ఆమె విమర్శించింది. ట్విట్టర్లో తన వ్యాఖ్యలను ఆమె కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేసింది. దీనిపై ‘బాయ్’ ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘గత కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో నేను సాధించిన పతకాలను నిలబెట్టుకునే ఉద్దేశం నాకు లేదన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ గత మూడు వారాలుగా వరుసగా యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు ఆడటంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ కూడా ఉండటంతోనే నేను ట్రయల్స్‌కు హాజరు కావడం లేదు. రెండు వారాల వ్యవధిలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా వరుసగా ఆడటం చాలా కష్టం. గాయాల ప్రమాదం కూడా ఉంటుంది. సెలక్షన్స్‌కు తక్కువ వ్యవధి ఉండటంపై నేను ‘బాయ్’ను అడిగినా వారు స్పందించలేదు. నన్ను కామన్వెల్త్, ఆసియా క్రీడలనుంచి తప్పించడం వారికీ సంతోషం కలిగిస్తున్నట్లుంది. ప్రస్తుతం నా ప్రపంచ ర్యాంక్ 23. ఇటీవల ఆల్ ఇంగ్లండ్‌లో యమ గూచిని దాదాపుగా ఓడించాను. ఇండియా ఓపెన్‌లో ఒక్క పరాజయంతో ‘బాయ్’ నన్ను తక్కువ చేసి చూపిస్తోంది’. –సైనా నెహ్వాల్ -
సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో... భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపించడంలేదు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, థామస్ కప్ –ఉబెర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్వహించే సెలెక్షన్ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని 23వ ర్యాంకర్ సైనా నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈనెల 15న నుంచి 20 వరకు జరిగే ట్రయల్స్‌కు దూరంగా ఉంటున్నానని సైనా ‘బాయ్’కు లేఖ రాసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–15 లో ఉన్నవారికి నేరుగా చోటు లభిస్తుందని... 16 నుంచి 50 ర్యాంకింగ్స్‌లో ఉన్న వారు ట్రయల్స్‌కు హాజరుకావాలని ‘బాయ్’ తెలిపింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
సైనా, సింధు ముందంజ
బర్మింగ్‌హామ్: భారత సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పూసర్ల వెంకట సింధు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 2015 రన్నరప్ సైనా నెహ్వాల్ 21–17, 21–19తో బియట్రిజ్ కొరలెస్ (స్పెయిన్)పై గెలుపొందగా, ఆరో సీడ్ పీవీ సింధు 21–18, 21–13తో చైనా ప్రత్యర్థి వాంగ్జీ యిపై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. భమిడిపాటి సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లోనే ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో చుక్కెదురైంది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సాయిప్రణీత్ రెండో గేమ్‌లో చతికిలబడ్డాడు. చివరకు 20–22, 11–21తో అక్సెల్సన్ ధాటికి ఓటమి పాల య్యాడు. సమీర్ వర్మ 18–21, 11–21తో మార్క్ కాల్జౌ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోగా... థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్ 21–15, 24–22తో హెచ్.ఎస్.ప్రణయ్‌పై గెలిచాడు. గాయత్రి జోడీ శుభారంభం డబుల్స్ పోటీల్లోనూ భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీలు శుభారంభం చేశాయి. గాయత్రి–ట్రెసా జంట 17–21, 22–20, 21–14తో బెన్యప ఎయిమ్సర్డ్–నుంతకర్న్ ఎయిమ్సర్డ్ (థాయ్‌లాండ్) జోడీపై, ఐదో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–19తో అలెగ్జాండర్ డున్–ఆడమ్ హల్ (స్కాట్లాండ్) జంటపై గెలుపొందాయి. అయితే సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 9–21, 13–21తో రిన్ ఇవానగ–కీ నకనిషి (జపాన్) జంట చేతిలో కంగుతింది. గారగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ జోడీ 16–21, 19–21తో మార్క్ లామ్స్‌ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వయం చేతిలో, అర్జున్–ధ్రువ్ కపిల జోడీ 21–15, 12–21, 18–21తో రెండో సీడ్ మొహమ్మద్ ఎహ్సాన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పరాజయం చవిచూశాయి. -
PV Sindhu: ఏడో ర్యాంకులోనే సింధు.. ఇక సైనా మాత్రం
PV Sindhu- Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఆమె నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతోంది. గాయాలతో సుదీర్ఘ కాలంగా సతమతమవుతున్న సైనా ఇటీవల బరిలోకి దిగుతోంది. ఈ సీనియర్ షట్లర్ 28వ ర్యాంకులో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. అందువల్లే ర్యాంకు మెరుగువుతోంది. కాగా... కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు. సాయిప్రణీత్ 19వ ర్యాంకుకు దిగజారాడు. హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మలు వరుసగా 24, 26వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19వ ర్యాంకులో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాయి. చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
German Open: సింధుకు ఊహించని షాక్.. సైనా కూడా అవుట్!
మ్యుహెమ్ అండరుహ్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్లకు జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ కంగుతినగా, పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్‌వన్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–16, 21–23, 21–18తో చైనాకు చెందిన లుగ్వాంగ్ జుపై గెలిచాడు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో జాగ్రత్తగా ఆడు తూ పైచేయి సాధించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 24–22తో లీ చిక్ యూ (హాంకాంగ్)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌కు సిసలైన సవాలు ఎదురు కానుంది. ఒలింపిక్ చాంపియన్, టాప్‌సీడ్ విక్టర్ అక్సెసెన్ (డెన్మార్క్)తో భారత స్టార్ తలపడనున్నాడు. సింధు, సైనా అవుట్! మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సింధు 14–21, 21–15, 14–21తో జాంగ్ యిమన్ (చైనా) చేతిలో కంగుతింది. వచ్చే వారం ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కోసం కఠోరంగా శ్రమిస్తోన్న సింధుకు ఇది ఊహించని షాక్. అన్‌సీడెడ్ ప్రత్యర్థిపై ఒక గేమ్ గెలిచినా, మిగతా రెండు గేముల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సుదీర్ఘకాలంగా ఫిట్నెస్ సమస్యలెదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తున్న సైనా తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. థాయ్‌లాండ్ స్టార్, ఎనిమిదో సీడ్ రత్చనోక్ ఇంతనొన్ 21–10, 21–15తో సైనాపై అవలీలగా గెలిచింది. 31 నిమిషాల్లోనే సైనాతో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 23–21, 16–21, 21–14తో భారత్‌కే చెందిన ఇషాన్ భట్నాగర్–సాయిప్రతీక్ జంటపై గెలిచింది. చదవండి: Novak Djokovic: నంబర్ 1 ర్యాంకు కోల్పోయావు.. అయినా నువ్వు మారవా! -
చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం
Indian Shuttler Tasnim Mir Achieves Under 19 World No 1 Rank: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో 16 ఏళ్ల గుజరాత్ అమ్మాయి తస్నిమ్ మీర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అండర్ 19 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గతేడాది బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియంలలో జరిగిన టోర్నీల్లో సత్తా చాటడం ద్వారా మూడు ర్యాంకులను మెరుగుపర్చుకున్న తస్నిమ్.. అగ్రపీఠాన్ని అధిరోహించింది. ప్రస్తుతం తస్నిమ్ 10,810 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతుండగా.. మరో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. కాగా, అండర్ 19 విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో స్థానం వరకు మాత్రమే చేరుకోగలిగింది. చదవండి: నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..! -
India Open: సైనాపై మాల్విక సంచలన విజయం... క్వార్టర్స్‌లో సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ టోర్నీలో ఇవాళ భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో సునాయస విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు భంగపాటు ఎదురైంది. రెండో రౌండ్లో సింధు.. ఐరా శర్మను 21-10, 21-10 తేడాతో సునాయసంగా ఓడించగా, సైనా నెహ్వాల్.. ప్రపంచ 111వ ర్యాంకర్ మాల్విక బన్సోద్ చేతిలో 17-21, 9-21 తేడాతో ఓటమి పాలైంది. కాగా, ఇండియా ఓపెన్‌లో ఇవాళ కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. సైనాపై మాల్విక సంచలన విజయం... టాప్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లో షాక్ ఎదురైంది. భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్ 21–17, 21–9తో నాలుగో సీడ్ సైనాపై సంచలన విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో వర్ధమాన షట్లర్ మాల్విక ప్రత్యర్థిపై చెలరేగిపోయింది. 2017నుంచి చూస్తే సైనా ఒక భారత ప్లేయర్ చేతిలో ఓడటం ఇదే రెండో సారి (మరో సారి సింధు చేతిలో) మాత్రమే. సింధు 21–10, 21–10తో ఐరా శర్మ (భారత్)పై నెగ్గి సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, కేయూర 10–21, 10–21తో ఆకర్షి కశ్యప్ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ వాకోవర్‌తో, మూడో సీడ్ లక్ష్యసేన్ 21–12, 21–15తో ఫెలిక్స్ బురెస్టెండ్ (స్వీడెన్)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల డబుల్స్‌లో అశ్వినికి వైరస్ సోకడంతో భాగస్వామి సిక్కిరెడ్డికి, త్రిషాకు కరోనాతో పుల్లెల గాయత్రికి నిరాశ తప్పలేదు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–9, 21–18తో శ్యామ్ ప్రసాద్–సుంజీత్ జంటపై గెలిచి క్వార్టర్స్ చేరారు. చదవండి: ఈ కుర్రాడిని ఫీగా వదిలేయండి.. పంత్‌పై సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్ -
Indian Open Super Series: సైనా, ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సైనా తొలి గేమ్‌ను 22–20తో గెల్చుకొని, రెండో గేమ్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్లు కేయుర మోపాటి శుభారంభం చేయగా ... సామియా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. కేయుర 15–21, 21–19, 21–8తో స్మిత తోష్నివాల్ (భారత్)పై నెగ్గింది. సామియా 18–21, 9–21తో మాళవిక బన్సోద్ (భారత్) చేతిలో, సాయి ఉత్తేజిత 21–9, 12–21, 19–21తో తాన్యా (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–14, 21–7తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, లక్ష్య సేన్ 21–15, 21–7తో అధామ్ హతీమ్ ఎల్గామల్ (ఈజిప్ట్)పై గెలిచారు. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి–అశ్విని జంట మహిళల డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–7, 19–21, 21–13తో జనని–దివ్య (భారత్) జోడీపై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో శ్రీవేద్య గురజాడ (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జంట 21–9, 21–7తో మేఘ–లీలా లక్ష్మి (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–10తో రవి–చిరాగ్ అరోరా (భారత్) జంటపై గెలిచింది. విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 16–21, 16–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ట్వీట్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో సిద్ధార్ధ్
-
హీరో సిద్ధార్థ్‌పై కేసు నమోదు..
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్‌పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్ రాసిన బహిరంగ లేఖలో 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా. నువ్ నాకు ఎప్పుడూ ఛాంపియన్‌గా ఉంటావు సైనా' అని రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, దూమరం రేపుతోన్న సిద్ధార్థ్ ట్వీట్ -
Saina Nehwal: సిద్దార్థ క్షమాపణపై స్పందించిన సైనా.. ఎందుకు వైరల్ అవుతుందో..
సినీ నటుడు సిద్దార్థ తనకు క్షమాపణ చెప్పడం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మన దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయగా తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్ సింగ్, భర్త పారుపల్లి కశ్యప్ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో సైనా పేరు ట్విటర్లో మారుమోగిపోయింది. సిద్ధార్థ వ్యవహార శైలిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన అతడు... సైనాను క్షమాపణ కోరుతూ సుదీర్ఘ లేఖ రాశాడు. ‘‘నువ్వు ఎల్లప్పటికీ నా చాంపియన్‌వే’’ అని ట్వీట్ చేశాడు. తాజాగా ఈ లేఖపై స్పందించిన సైనా.. టైమ్స్ నౌతో మాట్లాడుతూ... ‘‘మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి’’ అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో.. ఈ వివాదం ఇప్పటికైనా ముగిసిపోతుందా లేదా అన్న అంశం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం విదితమే. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
సైనా నెహ్వాల్‌కు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ
Siddharth Apologises To Saina Nehwal For Rude Joke In Open Letter: భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు వస్తుండటంతో సిద్ధార్థ్ తప్పు తెలుసుకున్నాడు. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేశాడు. 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా' అంటూ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు నువ్వు ఎప్పుడూ నా చాంపియన్‌గా ఉంటావు సైనా.. అంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై.. 'దేశ ప్రధానికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిణామాల్ని ఖండిస్తున్నా' అంటూ సైనా ట్వీట్ చేయగా.. దీనిపై హీరో సిద్ధార్థ్ వ్యంగంగా బదులిస్తూ..'ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్' అంటూ సైనాపై అభ్యంతరకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన సైనా భర్త కశ్యప్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సైనాను ఉద్దేశిస్తూ సిద్దార్థ్ చేసిన ట్వీట్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని పంజాబ్‌లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండిస్తూ ‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ఈ ఘటనను తాను ఖండిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ ఆమె ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #Rihanna’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్ రచ్చకు దారి తీసింది. ఇప్పటికే సిద్ధార్థ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వెంటనే అతడి ట్వీట్ తొలిగించాలంటూ జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. సైనా తండ్రి కూడా సిద్ధార్థ్ ట్వీట్‌పై స్పందిస్తూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా సైనా భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సోమవారం ట్విట్టర్లో సిద్ధార్థ్ ట్వీట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful @Actor_Siddharth — Parupalli Kashyap (@parupallik) January 10, 2022 చదవండి: Salmana Khan-Samantha Lockwood: సల్మాన్‌తో సీక్రెట్ డేటింగ్‌పై నటి సమంత క్లారిటీ సిద్ధార్థ్‌ను ట్యాగ్ చేస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. కానీ కాస్తా మంచి పదాలు ఎంచుకోండి. ఈ రితీలో మీ అభిప్రాయాన్ని చెప్పడం చాలా హర్టింగ్గా అనిపించింది. మీరు ఇవి కూల్ వర్డ్స్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు’ అంటూ సిద్ధార్థ్‌కు కశ్యప్ చురకలు అంటించాడు. అలాగే సైనా నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా ఇంటర్య్వూలో స్పందిస్తూ.. ‘అతడు ఏం చెప్పాడో ఖచ్చితంగా నాకు తెలియదు. నేను ఒక నటుడిగా అతడిని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. ఆయన మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరుస్తాడని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful — Parupalli Kashyap (@parupallik) January 10, 2022 -
Saina Nehwal: హీరో సిద్ధార్థపై సైనా తండ్రి సంచలన వ్యాఖ్యలు...
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ హీరో సిద్దార్థకు కౌంటర్ ఇచ్చారు. తన కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచిందని.. అతడు ఏం చేశాడని ప్రశ్నించారు. కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ‘‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం సేఫ్‌గా ఉన్నామని ఎలా చెప్పుకోగలం. ఆటంకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన సిద్ధార్థ చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే అంటూ అభ్యంతరకర రీతిలో కామెంట్ చేశాడు. ఇందుకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌతో మాట్లాడిన సైనా తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్... ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అని సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భారత సమాజం గొప్ప విలువలు కలిగినది. జర్నలిస్టులు, క్రీడా ప్రముఖులు సైనాకు మద్దతుగా నిలిచారు. తను ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకుందో వాళ్లకు తెలుసు కాబట్టే.. తన విలువను గుర్తించారు’’ అని హర్వీర్ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ మహిళా కమిషన్ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒలింపియన్‌పైన ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. కాగా పలు ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. Subtle cock champion of the world... Thank God we have protectors of India. 🙏🏽 Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz — Siddharth (@Actor_Siddharth) January 6, 2022 -
సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి, ఇది మూర్ఖత్వమంటూ తీవ్ర వ్యాఖ్యలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. అంతేగాక సిద్ధార్థ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ తీవ్ర రచ్చకు దారి తీసింది. తాజాగా దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్ వ్యాఖ్యలను తప్పబట్టింది. చదవండి: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, నటుడిపై మహిళా కమిషన్ ఫైర్ ‘ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్‌పై మండిపడింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని పేర్కొంది. అయితే వాట్సాప్, లేక ఇతర వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామంటూ చిన్మయి పిలుపునిచ్చింది. -
మరో వివాదంలో సిద్దార్థ్
-
మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ
NCW Writes to DGP Maharashtra to Take Action Against Actor Siddharth: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఇండియా గ్రీవెన్స్‌ను డిమాండ్ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని పంజాబ్‌లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండించింది. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ప్రధానిపైనే దాడి యత్నం జరిగితే ఆ దేశం భద్రంగా ఉన్నట్టు ఎలా భావించగలం’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీస్తున్నాయి. సిద్ధార్థ్ ట్వీట్ సైనాను అవమానించే రీతిలో ఉందంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, స్త్రీద్వేషంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని పేర్కొంది. నటుడు సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని కమిషన్ వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేయాలని ఆదేశించారని ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళపై అసభ్యకరమైన భాషను ఉపయోగించడం పట్ల సిద్ధార్థ్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది. చదవండి: ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్‌పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై చైర్మన్ రేఖా శర్మ ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి కూడా లేఖ రాసినట్టు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ను నిలిపివేయాలని, అంతేగాక అతడి ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సింది ఆమె కోరినట్టు కమిషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలను వేరే అర్థంలో తీసుకుని తప్పుగా భావిస్తున్నారంటూ సిద్ధార్థ్ మరో ట్వీట్లో వివరణ ఇచ్చాడు. 'కాక్ అండ్ బుల్' అని కూడా పేర్కొంటుంటామని, అయితే దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం అని తెలిపాడు. ఎవరినీ అవమానపర్చాలని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు. Subtle cock champion of the world... Thank God we have protectors of India. 🙏🏽 Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz — Siddharth (@Actor_Siddharth) January 6, 2022 -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు తొలిసారి సైనా దూరం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. 2006 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీ ఆడుతున్న ఆమె ఈ ఏడాది మాత్రం తప్పుకుంది. స్పెయిన్‌లో ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఆమె మోకాలి గాయం నుంచి కోలుకుంటుంది. గత కొంతకాలంగా సైనా ఏ టోర్నీనీ పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. ఉబెర్ కప్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చి గాయంతో మధ్యలోనే వైదొలిగింది. -
ఏఐ టెక్నాలజీతో వైర్లెస్ ఇయర్ బడ్స్, సూపర్ ఫీచర్లతో
టెక్ మార్కెట్లో వైర్ లెస్ ఇయర్ బడ్స్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలు విడుదల చేసిన వైర్లెస్ ఇయర్ బడ్స్ వినియోగదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజగా మరో సంస్థ సౌండ్ కోర్ బడ్జెట్ ధరలో 'లైఫ్ నోట్ ఈ టీడబ్ల్యూఎస్' పేరుతో ఇయర్ బడ్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్లు ఆడియో టెక్నాలజీలో గ్లోబుల్ లీడర్ గా ఉన్న సౌండ్ కోర్ తాజాగా బ్యాడ్మింటన్ చాంపియన్ సైనా నెహ్వాల్ చేతులు మీదిగా 'లైఫ్ నోట్ ఈ టీడబ్ల్యూఎస్' పేరుతో ఇయర్ బడ్స్‌ను విడుదల చేసింది. ఇక ఇయర్ బడ్స్‌లోని ఫీచర్ల విషయానికొస్తే 32హెచ్ ప్లే టైమ్, 3 ఈక్యూమోడ్స్, బిగ్ బ్యాస్, ట్రిపుల్ లేయర్ 10ఎంఎం డ్రైవర్స్, 50 శాతం పవర్ ఫుల్ బ్యాస్‌తో మెస్మరైజ్ చేసేలా సౌండ్‌ను అందిస్తుంది. యూనిక్ 3 ఈ క్యూ మోడ్స్, సౌండ్ కేర్ సిగ్నేచర్స్ ఫీచర్లు ఉన్నాయి. ఏఐతో పనిచేస్తుంది ఇక ఈ లైఫ్ నోట్ ఈ ఇయర్ బడ్స్ పూర్తిగా ఏఐ టెక్నాలజీ పనిచేస్తుందని సౌండ్ కోర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు 4.6 గ్రాముల బరువు ఉండే ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ వినియోగిస్తున్నామనే ఫీలింగ్ ఉండదు. లైట్ వెయిట్‌తో పాకెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ ధర రూ.2,799 ఉండగా.. లాంచ్ సందర్భంగా రూ.1999కే అందిస్తున్నట్లు సౌండ్ కోర్ తెలిపింది. -
తొలి రౌండ్లోనే సైనా ఇంటిముఖం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో 16–21, 14–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సౌరభ్ వర్మ, కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. లక్ష్య సేన్ 21–9, 21–7తో సౌరభ్ వర్మ (భారత్)పై నెగ్గగా... ప్రణయ్ 18–21, 19–21తో జొనాథాన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. చౌ తియె చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌లో 0–3తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగాడు. చదవండి: భారత్ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్ -
స్పెయిన్‌తో మహిళలు... నెదర్లాండ్స్‌తో పురుషులు...
అర్హస్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. థామస్ కప్‌లో పురుషుల జట్టు... ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాయి. నేడు జరిగే తమ ఆరంభ పోటీల్లో గూప్ ‘సి’లో ఉన్న భారత పురుషుల టీమ్ నెదర్లాండ్స్‌తో... గ్రూప్ ’బి’లో ఉన్న మహిళల జట్టు స్పెయిన్‌తో తలపడనున్నాయి. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిలతో కూడిన భారత పురుషుల టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో పటిష్ట చైనా ఉన్నప్పటికీ... నెదర్లాండ్స్, తాహిటిలపై గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పోటీలో ఉండగా... వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోనూ టాప్–2లో నిలిచిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీకి దూరమవ్వడం మహిళల జట్టుకు ప్రతికూల అంశం. సైనా నెహ్వాల్, గాయత్రి గోపిచంద్, డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిల ఆటతీరుపైనే మహిళల జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
బర్మింగ్‌హామ్‌లో ‘బెస్టాఫ్ లక్’
సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 22వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మెగా ఈవెంట్‌కు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో ‘కౌంట్‌డౌన్’గా హైదరాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ భారత క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తదితరులతో పాటు వచ్చే క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉన్న వర్ధమాన అథ్లెట్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... క్రీడల నిర్వహణ కోసం ఇంగ్లండ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, బరి్మంగ్‌హామ్ నగర విశిష్టతల గురిం చి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యం లో సీడబ్ల్యూజీ–2022లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు అంకితా రైనా పరాజయం సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ప్లేయర్ అంకితా రైనాకు అర్హత పోరులోనే నిరాశ ఎదురైంది. హోరాహోరీగా తన సమ ఉజ్జీలాంటి ప్రత్యర్థితో సాగిన పోరులో చివరకు ప్రపంచ 193వ ర్యాంకర్ అంకితకు ఓటమి తప్పలేదు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ఆమె అమెరికాకు చెందిన ప్రపంచ 194వ ర్యాంకర్ జేమీ లోయబ్ చేతిలో 3–6, 6–2, 4–6 తేడాతో ఓటమిపాలైంది. -
మంచి ఫలితాలు చూపడమే కీలకం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తమదైన ప్రత్యేక ముద్ర వేయగలదని అంతా నమ్ముతున్నారు. ముఖ్యంగా వేర్వేరు క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం కూడా అందుకు కారణం. ఇప్పుడు క్రికెట్‌కు మాత్రమే కాకుండా ఇతర క్రీడలకూ గుర్తింపు లభిస్తుండటాన్ని మనం చూడవచ్చు. నాకు తెలిసి గత దశాబ్దకాలంలో భారత్‌లో వచ్చిన ప్రధాన మార్పు ఇది. ఇకపై మంచి ఫలితాలు సాధించి చూపడమే కీలకం. క్రీడాకారిణిగా ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి రావడంతో వ్యవస్థ పనితీరు గురించి మరో కోణంలో చూడలేకపోయాను. అయితే కొన్నేళ్లుగా సానుకూల మార్పులు వస్తున్నాయనేది నాకు అర్థమైంది. పోటీల కోసం విదేశాలకు వెళ్లేందుకు గతంలో ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాల్సిన పరిస్థితి ఉండగా... కొత్తగా ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకం ఎంతో మేలు చేసింది. గతంలో క్రీడా పరికరాలు కావాల్సిన ఉంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ‘టాప్స్’ నుంచి సహాయం పొందడం ఆటగాళ్లకు ఎంతో సులువుగా మారింది. ప్రతీ నెలా ఇస్తున్న పాకెట్ అలవెన్స్ కారణంగా క్రీడాకారులు మంచి సౌకర్యాలు పొందేందుకు అవకాశం కలిగింది. అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడే క్రమంలో నిరంతరం క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ వారు సరైన రీతిలో సన్నద్ధమయ్యేలా ప్రోత్సహిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. నా దృష్టిలో ఈ వ్యవస్థ మరింత మెరుగవుతూ ఆటగాళ్లకు ఈ విషయంలో ఎలాంటి బెంగ లేకుండా చేస్తోంది. గత 10–15 ఏళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రావడం మన అదృష్టం. అయితే భారత బ్యాడ్మింటన్‌కు ‘మార్గదర్శి’గా నిలిచానని, ఆ తర్వాత మన స్థాయి పెరిగి ఎంతో మంది టాప్–50లోకి వచ్చారని నా గురించి చెప్పినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను అనాసక్తితోనే ఆటల్లోకి వచ్చాను. అసలు ఒలింపిక్స్ ప్రాధాన్యత ఏమిటో కూడా తెలీదు. అయితే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు తొలిసారి ఎంపిౖకైనప్పుడే దాని విలువ తెలుసుకున్న నేను, టీనేజర్‌గానే భారత్‌కు ఏదైనా చేయగలనని భావించాను. అక్కడే నేను పతకం సాధించగలిగేదానిని. ఇండోనేసియాకు చెందిన మారియా యులియాంటితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మూడో గేమ్‌లో 11–3తో ఆధిక్యంలో ఉండి కూడా ఓడిపోయానంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నా. 2008లో నాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. అయితే 2012లో కాంస్యం గెలిచి పోడియం మీద నిలబడినప్పుడు భారత త్రివర్ణపతాకం ఎగురుతుంటే దాని విలువేమిటో అర్థమైంది. -
Saina Nehwal, Kidambi Srikanth: సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టోక్యో ఒలిం పిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యేలోపు ఎలాంటి క్వాలిఫయింగ్ టోర్నీలు నిర్వహించడంలేదని... జూన్ 15వ తేదీ ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్‌లు ఖరారు చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో... శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. దాంతో భారత్ నుంచి సింధు, సాయిప్రణీత్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల డబుల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
Saina Movie: ‘సైనా’ మూవీ రివ్యూ
టైటిల్: సైనా జానర్: బయోపిక్ నటీటులు: పరిణీతి చోప్రా, మానౌవ్ కౌల్, ఇషాన్ నఖ్వీ, మేఘనా మాలిక్, సుబ్రజ్యోతి బరాత్, అంకుర్ విశాల్ తదితరులు నిర్మాతలు: భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, సుజయ్ జైరాజ్, రాశేష్ దర్శకత్వం: అమోల్ గుప్త సంగీతం: అమాల్ మాలిక్ సినిమాటోగ్రఫీ: పీయూష్ షా విడుదల తేది : మార్చి 26, 2021(ఏప్రిల్ 23న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది) భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథా ఆధారంగా పరిణీతి చోప్రా కీలక పాత్రలో అమోల్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైనా’. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 50% అక్యూపెన్సీతో రన్ అవ్వడంతో సైనాకు కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. ఇప్పడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు‘సైనా’లో కొత్తగా ఏం చూపించారు? సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి మెప్పించిందా? రివ్యూలో చూద్దాం. కథ ఒక చిన్న పట్టణంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బాలిక సైనా నెహ్వాల్(పరిణీతి చోప్రా)కు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. తల్లి కూడా కుమార్తె ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంది. సైనాను ఎలాగైనా బాడ్మింటన్ ప్లేయర్‌ని చేయాలనుకుంటారు. డబ్బులు అంతగా లేకున్నా ట్రైనింగ్ కోసం ఓ కోచ్ వద్దకు పంపిస్తారు. ఒకానొక దశలో కాక్స్ కొనడానికి డబ్బులు లేకుంటే తన తండ్రి ఫీఎఫ్ లోన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? స్టార్ ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో ఎలాంటి ఆటుపోటులు ఎదురయ్యాయి? కష్టకాలంతో తనకు తోడుగా నిలిచిందెవరు? ఆట కోసం వ్యక్తిగత జీవితంలో సైనా కోల్పోయిందేంటి? తన విజయంలో కోచ్ పాత్ర ఏ మేరకు ప్రభావితం చేసిందనేదే మిగతా కథ. నటీనటులు సైనా పాత్రలో పరిణీతి చోప్రా పరకాయ ప్రవేశం చేసింది. అసలైన బ్యాడ్మింటన్ ప్లేయర్లా కనిపించడానికి పరిణీతి పడిన కష్టం అంతా తెరపై కనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా అవలీలగా, సహజసిద్దంగా చేసింది. సైనా తల్లిగా మేఘనా మాలిక్ అద్భుతంగా నటించారు. తండ్రిగా సుబ్రజ్యోతి ఉన్నంతలో పరవాలేదనిపించారు. ఇక ఈ సినిమాలో పరిణీతి తర్వాత బాగా పండిన మానవ్ కౌల్ది. సైనా కోచ్ రాజన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సైనా బాయ్‌ఫ్రెండ్ పారుపల్లి కశ్యప్ పాత్రలో ఇషాన్ నఖ్వీ ఉన్నంతలో బాగానే నటించారు. సైనా చిన్నప్పటి పాత్ర చేసిన పాప నైషా కౌర్ కూడా అద్భుతంగా నటించింది. విశ్లేషణ ప్రముఖుల జీవిత చరిత్రను తెరపై చూపించడం కత్తిమీద సాము లాంటిదే. వారి జీవితాన్ని వెండితెరపై ఎంత భావోద్వేగభరితంగా చూపించారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు అమోల్గుప్త సఫలమయ్యాడనే చెప్పాలి. స్టార్ బాడ్మింటన్గా ఎదగడానికి సైనా పడిన కష్టాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రథమార్థంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా సైనా చిన్నప్పుడు కోచింగ్‌కు తీసుకెళ్లడానికి తల్లి పడే ఆరాటం, షటిల్ కొనడానికి తండ్రి అప్పు చేసే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కోచ్ రాజన్, సైనాల మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు సినిమాకు ప్రధాన బలమని చెప్పాలి. ఫస్టాప్ అంతా సైనా బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగిన విషయాలు చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కూడా దాన్నే కంటిన్యూ చేయడం కాస్త ప్రతికూల అంశమే. అలాగే కశ్యప్‌తో ప్రేమ వ్యవహారాన్ని కూడా అంతగా చూపించలేకపోయాడు. ఇక ఈ సినిమాకు మరో బలం అమాల్ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. పీయూష్ షా సినిమాటోగ్రాఫి అద్భుతమనే చెప్పాలి. బాడ్మింటన్ కోర్టును కళ్లకు కట్టినట్లుగా చూపించారు. గేమ్ సన్నివేశాలను భావోద్వేగభరితంగా, ఉద్విగ్నంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 18–21, 21–15, 21–10తో మరీ బటోమెనె (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గింది. 51 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా... అనంతరం పుంజుకొని తర్వాతి రెండు గేముల్లోనూ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఐరా శర్మ (భారత్) 21–18, 21–13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై గెలిచి క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 22–20తో చెమ్ జునే వీ (మలేసియా)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ పోరుల్లో అర్జున్– ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–11, 21–12తో రోరీ ఇస్టోన్–జాక్ రస్ జంట (ఇంగ్లండ్)పై, కృష్ణ ప్రసాద్– విష్ణువర్ధన్ (భారత్) జోడీ 21–7, 21–13తో క్రిస్టియన్ క్రెమర్–మార్కస్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–12, 21–18తో కాల మ్ హెమ్మింగ్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరింది. సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 7–21తో నిక్లాస్ నోర్– అమలీ మెగెలండ్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడింది. -
ఓర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ: క్వార్టర్స్‌లో సైనా
పారిస్: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన 65వ సీడ్ మేరీ బాటోమెన్ను 18-21, 21-15, 21-10తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 51 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో సైనా అద్భుత ప్రదర్శన చేసి,తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా.. ర్యాంకింగ్ పాయింట్లు దక్కించుకొని ఒలింపిక్ రేసులో నిలవాలని భావిస్తుంది. కాగా, గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సైనా.. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్‌తో తలపడనుంది. ఇదే టోర్నీలో మరో భారత షట్లర్ ఇరా శర్మ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఐరా.. బల్గేరియాకు చెందిన మరియా మిట్సోవాను 21-18, 21-13 తో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ గేమ్‌లో ఐరా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇరా తన తదుపరి గేమ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫెర్సన్‌తో పోటీపడే అవకాశం ఉంది. కాగా, బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట.. డెన్మార్క్ జంట అమాలీ మాగెలుండ్, ఫ్రీజా రావ్న్పై 21-9, 17-21, 21-19తో విజయం సాధించారు. -
తొలి టైటిల్ లక్ష్యంగా సింధు, సైనా
బాసెల్: కొత్త సీజన్లో తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నారు. నేడు మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో సింధుకు సులువైన ‘డ్రా’ ఎదురుకాగా... సైనాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. రెండో సీడ్‌గా పోటీపడుతున్న ప్రస్తుత ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్లో టర్కీ క్రీడాకారిణి, ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిజిట్తో ఆడునుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. పదేళ్ల క్రితం నెస్లిహాన్తో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ జూనియర్ చాలెంజ్ టోర్నీలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు వరుస గేముల్లో గెలిచింది. మరోవైపు ప్రపంచ 19వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో థాయ్‌లాండ్ అమ్మాయి, ప్రపంచ 31వ ర్యాంకర్ ఫిటాయాపోర్న్ చైవాన్‌తో తలపడుతుంది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో చైవాన్‌తో ఆడిన సైనా వరుస గేముల్లో నెగ్గింది. సైనా తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో తలపడే అవకాశముంది. ఒకే పార్శ్వంలో సింధు, సైనా ఉండటంతో క్వార్టర్ ఫైనల్‌ను దాటితే ఈ ఇద్దరు భారత స్టార్స్ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ధ్రువ్ కపిల –అర్జున్... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప –సాత్విక్ సాయిరాజ్... సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు బరిలో ఉన్నాయి. -
సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: రైతు ఉద్యమానికి మద్దతిస్తూ.. అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు బుధవారం ఇండియాలో కలకలం రేపాయి. మా అంతర్గత విషయంలో మీ జోక్యం ఏంటి అంటూ క్రీడా, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతి విద్వేశ ప్రచారం నుంచి దేశాన్ని కాపాడే బాధ్యతలో సెలబ్రిటీలు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఏక్తా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు సోషల్ మీడియాలో ‘ఇండియాటుగెదర్’ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. ‘‘రైతుల ఉద్యమాన్ని సాకుగా తీసుకుని దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దంటూ’’ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇండియాటుగెదర్ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. వీరిదిలా సాగుతోంటే మరోవైపు దిల్జిత్ దోసాంజ్, కంగనా రనౌత్‌ల మధ్య మరో రచ్చ నడిచింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజనులు మరో ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తెచ్చి.. సెలబ్రిటీలను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు వారు గుర్తించిన ఆ ఆసక్తికర అంశం ఏంటంటే ఇండియాటుగెదర్‌లో భాగంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ చేసిన ట్వీట్స్ రెండు ఒకేలా ఉన్నాయి. అక్షరం పొల్లు పోకుండా.. సేమ్ టూ సేమ్ ఉన్నాయి. వీటిని చూసిన నెటిజనుల ‘‘ఎవర్ని ఎవరు కాపీ కొట్టి ఉంటారో అర్థమై చావడం లేదే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇద్దరి ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసి రీ ట్వీట్ చేస్తూ.. ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి ట్వీట్స్ మాత్రమే కాక మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్ అన్ని సేమ్ ఒకేలా ఉండటంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాక దేశంలో పలు ముఖ్యమైన అంశాలపై కామ్‌గా ఉండే బాలీవుడ్.. రైతుల ఉద్యమం అంశంలో మాత్రం మూకుమ్ముడిగా స్పందించడం ఏంటో అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్ వార్) అయితే సెలబ్రిటీల తీరును మరి కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తున్నారు. సెలబ్రిటీలంతా ఒకే సమయంలో ఒకేలాంటి ట్వీట్లు చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్ని పేయిడ్ ట్వీట్లు.. లేదా బలవంతంగా.. ఒత్తిడి చేయడం వల్ల ఇలా ట్వీట్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ పన్ను చేసిన ట్వీట్ ఆలోచన రేకెత్తిస్తోది. ‘‘ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక జోక్ మీ విశ్వాసాన్ని.. ఒక ప్రదర్శన మీ మత విశ్వాసాన్ని కించపరిస్తే.. అప్పుడు మీరు ప్రచార గురువుగా మారడానికి బదులు.. మీ విలువల వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలి’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: కోహ్లి మద్దతు.. నెటిజనుల విమర్శలు) If one tweet rattles your unity, one joke rattles your faith or one show rattles your religious belief then it’s you who has to work on strengthening your value system not become ‘propaganda teacher’ for others. — taapsee pannu (@taapsee) February 4, 2021 ఇక రైతులకు మద్దతుగా నిలిచిన నటి స్వరా భాస్కర్ ప్రతీ అంశంలో బాలీవుడ్‌ని నిరంతరం ప్రశ్నిస్తున్న వారిని ఎద్దేవా చేస్తూ.. మరో ట్వీట్ చేశారు. ‘రైతులకు మద్దతుగా నిలబడండి.. ఈ అంశంపై బాలీవుడ్ స్పందించాలి అనే వారికి ఇదిగో సమాధానం.. ఇప్పడేం అంటారు’ అంటూ స్వరా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. और बोलो ‘Speak Up Bollywood.. Speak up Celebrities’ 🤪🤪🤪🤪🤪🤪 — Swara Bhasker (@ReallySwara) February 3, 2021 -
కరోనా ఆడుకుంది!
గత సీజన్‌ను కరోనా ముంచేసింది. ఈ సీజన్‌నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సాయిప్రణీత్ కూడా ఆమెలాగే ఓడిపోయాడు. ఆట ఫలితాలు ఇలావుంటే మహమ్మారి ఫలితాలు మరో రకంగా ఆడుకున్నాయి. అగ్రశ్రేణి షట్లర్ సైనా, ప్రణయ్‌లను కోవిడ్ టెస్టులు కలవరపెట్టాయి. తీరా యాంటీబాడీ టెస్టులతో అవి గత అవశేషాలనీ తేలడంతో ఊపిరి పీల్చుకున్నారంతా! మరో భారత టాప్‌స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు చేసిన కరోనా టెస్టులైతే రక్తం చిందించేలా చేశాయి. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ సీజన్ పరేషాన్‌తో ప్రారంభమైంది. బ్యాంకాక్: ఆటకు ముందు నలుగురు ఆటగాళ్లకు నిర్వహించిన కోవిడ్ పీసీఆర్ పరీక్షల్లో ముగ్గురు బాధితులని రిపోర్టుల్లో వచ్చింది. ఆ ముగ్గురిలో ఇద్దరు మనవాళ్లే కావడంతో భారత జట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారినపడ్డారని ప్రకటించారు. దీంతో నిర్వాహకులు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకునే పనిలో భారత కోచ్ సహా అధికార వర్గాలను కోర్టు లోపలికి అనుమతించలేదు. బృంద సభ్యులు పాజిటివ్ కావడంతో అందులోని వారు మ్యాచ్ చూసేందుకు వస్తే మిగతావారికి సోకే ప్రమాదముందని భారత కోచ్, మేనేజర్లను హోటల్ గదులకే పరిమితం చేశారు. తదనంతరం నిర్వాహకులు సైనా, ప్రణయ్‌లతో పాటు మరో బాధితుడు జోన్స్ రాల్ఫి జాన్సన్ (జర్మనీ ప్లేయర్)లకు యాంటిబాడీ ఐజీజీ పరీక్షలు చేయించారు. ఆశ్చర్యకరంగా భారత ఆటగాళ్లిద్దరికీ పాజిటివ్ ఫలితాలొచ్చాయి. అంటే సైనా, ప్రణయ్‌లకు గతంలో ఎప్పుడో వచ్చివుం టుందని, అవి గతం తాలూకు అవశేషాలని గుర్తించింది. దీంతో వీరిద్దరికి ప్రస్తుతం వైరస్ సమస్య లేదని నిర్దారించుకున్న ఆర్గనైజింగ్ కమిటీ సైనా, ప్రణయ్‌లను ఆడేందుకు అనుమతించింది. వీళ్లతో మిగతావారికి ఎలాంటి ముప్పులేదని ప్రకటించింది. జర్మనీ ప్లేయర్ జాన్సన్‌కు యాంటిబాడీ ఐజీజీ టెస్టుల్లో ఇలాగే పాజిటివ్ రావడంతో అతడినీ ఆడేందుకు అనుమతించిన నిర్వాహకులు... హాతెమ్ ఎల్గమల్ (ఈజిప్ట్)కు నెగెటివ్ రావడంతో అతన్ని తాజా కరోనా బాధితుడిగా టోర్నీ నుంచి తప్పించింది. -
సైనా నెహ్వాల్‌కు కరోనా.. టోర్నమెంట్ నుంచి అవుట్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. నేటి నుంచి(మంగళవారం) థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళన కరంగా మారింది. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి సైనా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నిర్వాహకులు ముందస్తు చర్యల్లో భాగంగా పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు పరీక్షలను నిర్వహించారు ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. చదవండి: నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్ జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొన్న మొత్తం 824 మంది కోవిడ్ నెగిటివ్‌గా పరీక్షించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొనే వారందరూ బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు తమ దేశంలోనే కరోనా నెగటీవ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడామళ్లీ మళ్లీ కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. Badminton players Saina Nehwal, HS Prannoy and Parupalli Kashyap withdraw from Yonex Thailand Open after Nehwal and Prannoy tested positive for COVID19. While Kashyap is under quarantine due to close proximity with a player: Badminton Association of India (BAI) — ANI (@ANI) January 12, 2021 -
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో 14 ర్యాంకర్ శ్రీకాంత్ భారత్‌కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. -
‘ఇప్పుడు ఈ టోర్నీలు అవసరమా’
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత ఇంకా తగ్గని ప్రస్తుత స్థితిలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్న ఈ సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించింది. ‘మహమ్మారికి భయపడి ఏడు దేశాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సబబేనా?’ అని సైనా ట్వీట్ చేసింది. డెన్మార్క్‌లో అక్టోబర్ 3నుంచి 11వరకు థామస్, ఉబెర్ కప్ జరుగనుంది. మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు మళ్లీ ఈ టోర్నీతోనే ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆటగాళ్లకు క్వారంటీన్ వెసులుబాటు కూడా కల్పించింది. టోర్నీ కోసం డెన్మార్క్ చేరుకునే ఆటగాళ్లు ‘నెగెటివ్’గా తేలితే తప్పనిసరిగా క్వారంటీన్లో ఉండాల్సిన అవసరం లేదని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్’ ప్రకటించింది. -
బ్యాడ్మింటన్ మళ్లీ మొదలైంది...
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కోర్టులోకి అడుగు పెట్టారు. కోవిడ్–19 నిబంధనలకు లోబడి ప్రాక్టీస్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇవ్వడంతో వారంతా మళ్లీ రాకెట్ పట్టారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పర్యవేక్షణలో గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జట్టుకు ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందిని మాత్రమే ఈ క్యాంప్‌కు ‘సాయ్’ అనుమతించింది. వీరిలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, సాయిప్రణీత్, డబుల్స్ స్పెషలిస్ట్ ఎన్.సిక్కిరెడ్డి మాత్రమే తొలి రోజు శిక్షణలో పాల్గొన్నారు. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇంకా ఆట మొదలు పెట్టలేదు. మరో వైపు బెంగళూరులో ఉన్న సిక్కి భాగస్వామి అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్ జోడి ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా సాధన షురూ చేయలేదు. చిరాగ్, సాత్విక్, శ్రీకాంత్ తమ స్వస్థలాలు ముంబై, అమలాపురం, గుంటూరులలోనే ఉన్నారు. కరోనా సమస్య లేకుండా సురక్షిత వాతావరణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వెల్లడించారు. గోపీతో పాటు విదేశీ కోచ్‌లు పార్క్ టే సంగ్, ఆగస్ డ్వి సాంటోసో కూడా శిక్షణలో పాల్గొన్నారు. షట్లర్లకు కోవిడ్ పరీక్షలు... ఈ ఎనిమిది మంది ఆటగా ళ్లకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ‘సాయ్’ ఆదేశించింది. వీరితో పాటు ఎనిమిది మంది కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది ఎవరైనా కలిసి పని చేస్తుంటే వారంతా కూడా కోవిడ్ టెస్టులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సోమవారం ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. -
ఆ టోర్నీ నిర్వాహకులపై సైనా ఫైర్
హైదరాబాద్ : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ -2020 నిర్వాహకులపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ .. టోర్నీ నిర్వహించడంపై విమర్శలు గుప్పించారు. ఆటగాళ్ల సంక్షేమం, భావాలు పట్టించుకోకుండా.. కేవలం డబ్బుల కోసమే వారు టోర్నీని నిర్వహించారని ఆమె అన్నారు. అంతకుమించి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2020 నిర్వహించడానికి ఒక్క కారణం కూడా లేదని అన్నారు. ట్విటర్లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నిర్వహణకు సంబంధించి డెన్మార్క్ ఆటగాడు మాడ్స్ కాన్రాడ్ పీటర్సన్ చేసిన ట్విట్‌పై సైనా ఈ విధంగా స్పందించారు. ‘ఓవైపు కరోనా భయంతో ప్రపంచం అంతా మూత పడుతుంటే.. సాధారణ పరిస్థితుల మధ్య నేను ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడటంతో భయమేస్తుంది. 14 రోజుల పాటు నేను అనారోగ్యంగానే ఉన్నానని భావించాల్సి ఉంటుంది’ అని మాడ్స్ ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో పెద్ద పెద్ద క్రీడా ఈవెంట్లను రద్దు చేయడమో, వాయిదా వేయడమో లేక ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించడమో చేస్తున్నారు. కానీ బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌ను సాధారణ పరిస్థితుల మధ్యనే నిర్వహించారు. Only thing I can think of is that rather than the players welfare n feelings , financial reasons were given more importance. Otherwise there was no other reason for the #AllEnglandOpen2020 to go on last week .. #QuarantineLife https://t.co/yajkj7M7VX — Saina Nehwal (@NSaina) March 18, 2020 చదవండి : సైనా పయనం ఎంతవరకు? -
సైనా పయనం ఎంతవరకు?
భారత బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ది ప్రత్యేక స్థానం... దేశవ్యాప్తంగా ఆటపై ఆసక్తి పెంచడంలో, ముఖ్యంగా అమ్మాయిలు బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితులు కావడంతో సైనా స్ఫూర్తిగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరగా... పెద్ద సంఖ్యలో సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, రివార్డులు సైనా స్థాయిని చూపిస్తాయి. అయితే గత కొంత కాలంగా సైనా ఆట అంతంతమాత్రంగానే సాగుతోంది. వరుస పరాజయాలు, ఫిట్నెస్ సమస్యలు ఆమెను వెనక్కి తోస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత ఈ సారి మళ్లీ ఒలింపిక్స్‌పై ఆమె గురి పెట్టింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అసలు సైనా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలదా అనేది చూడాలి. (సాక్షి క్రీడా విభాగం): సైనా నెహ్వాల్ మంగళవారమే తన 30వ పుట్టిన రోజు జరుపుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక దశకు చేరిన తర్వాత ఆమె ముందు ఇప్పుడు పెద్ద సవాల్ నిలిచింది. మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తీసుకున్న నిర్ణయం ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 12 వరకు జరగాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. రాబోయే టోర్నీలలో రాణించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకుంటున్న షట్లర్లను ఇది షాక్‌కు గురి చేసింది. మంగళవారం జరిగిన కీలక సమావేశం అనంతరం టోక్యో ఒలింపిక్స్‌ను ఎలాగైనా నిర్వహిస్తామంటూ కమిటీ విస్పష్టంగా ప్రకటించింది. కాబట్టి బ్యాడ్మింటన్‌లో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగించేదే. వరుస వైఫల్యాలు... దాదాపు ఏడాది కాలంగా సైనా ప్రదర్శన గొప్పగా లేదు. టోర్నీ విజయాలపరంగా కూడా ఆమె టైటిల్ సాధించి చాలా రోజులైంది. 2019 జనవరిలో ఆమె చివరిసారిగా ఇండోనేసియా మాస్టర్స్ గెలిచింది. అదీ ఫైనల్లో 4–10తో వెనుకబడిన దశలో మారిన్ గాయంతో తప్పుకున్న తర్వాత దక్కింది. అంతకు ముందు చూస్తే 2017 జనవరిలో మలేసియా మాస్టర్స్ ఆమె గెలిచిన చివరి టోర్నీ. ఈ రెండు కూడా సూపర్–500 స్థాయి టోర్నీలే. సైనా ఆట సహజంగానే ఆమె ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించింది. 2019లో సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా, ఇప్పుడు 20వ ర్యాంక్‌కు చేరింది. 2020 కూడా ఆమెకు కలిసి రాలేదు. మలేసియా మాస్టర్స్, స్పెయిన్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా...ఇండోనేసియా మాస్టర్స్, థాయిలాండ్ మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్‌లలో తొలి రౌండ్లోనే చిత్తయింది. ఇప్పుడు కీలకమైన ఒలింపిక్స్‌కు ముందు జరిగే టోర్నీలో రాణించాలని భావించిన తరుణంలో టోర్నీల రద్దు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం 22వ స్థానంలో... బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసిన టోర్నీల్లో స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ కూడా ఉన్నాయి. ఇందులో స్విస్ సైనాకు గతంలోనూ బాగా కలిసి రాగా... ఈ సారి రెండు టోర్నీల్లోనూ ఆమెకు మంచి ‘డ్రా’ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత కల్పించే పాయింట్ల ప్రకారం (రేస్ టు టోక్యో) చూస్తే ఆమె ప్రస్తుతం 22వ ర్యాంకులో ఉంది. గత ఏడాది కాలంగా ఆమె ఆడిన 15 టోర్నీల ద్వారా 41,847 పాయింట్లు సైనా ఖాతాలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసిన టోర్నీలు జరిగే అవకాశం లేకపోతే...సైనా చేయడానికేమీ ఉండదు! ఎందుకంటే ఒలింపిక్ అర్హత కోసం కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 30నాటికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 16 స్థానాల్లో ఉన్నవారికే అర్హత లభిస్తుంది. తాజా పరిస్థితుల్లో ఆమె ఆ జాబితాలో రాదు. ఒక వేళ కొన్ని టోర్నీలు జరిగినా ఆమె తన అత్యుత్తమ ప్రదర్శనకు మించి ఇవ్వాల్సి ఉంది. ఫైనల్ లేదా సెమీఫైనల్ చేరితేనే సైనా ఖాతాలో పెద్ద సంఖ్యలో పాయింట్లు చేరతాయి. అయితే ఇటీవలి ఫామ్‌ను చూస్తే ఇది అంత సులువుగా అనిపించడం లేదు. గెలవాలనే పట్టుదల, అందు కోసం ఆమె తగిన విధంగా శ్రమిస్తున్నా కోర్టులో సైనా కదలికల్లో చురుకుదనం తగ్గినట్లే కనిపిస్తోంది. కొత్తగా దూసుకొస్తున్న అమ్మాయిలు చెలరేగిపోతుంటే చాలా సందర్భాల్లో సైనా వారి ముందు బేలగా కనిపిస్తోంది. ఆమె తన అత్యుత్తమ దశను దాటేసినట్లుగా ఇటీవలి ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒలింపిక్ రేసులో ఎంత వరకు ముందుకు వెళ్లగలదనేది చూడాలి. మంగళవారం తన తండ్రి హర్వీర్ సింగ్‌తో కలిసి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సైనా. -
ఈసారైనా సాధించేనా!
గతేడాది విశ్వ విజేతగా అవతరించి అందరిచేతా శభాష్ అనిపించుకోవడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో తొలి టైటిల్ కోసం వేట మొదలు పెట్టనుంది. బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా 24 ఏళ్ల సింధు బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో మలేసియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో ఆడిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ఈ రెండు టోర్నీల తర్వాత దాదాపు 50 రోజుల విరామం లభించడంతో సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు పకడ్బందీగా సిద్ధమైంది. కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో పలువురు సహచర క్రీడాకారులు ఈ టోర్నీ నుంచి వైదొలిగినా సింధు మాత్రం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు సమాయత్తమయింది. సింధుతోపాటు మాజీ రన్నరప్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ఈ మెగా టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బర్మింగ్‌హామ్: పద్దెనిమిదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే తపనతో మరోసారి మనోళ్లు సమాయత్తమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధుతోపాటు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, లక్ష్య సేన్ సింగిల్స్ బరిలో ఉన్నారు. ముందుగా ఎంట్రీలు పంపించినా... కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఏడుగురు భారత ఆటగాళ్లు (సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ; డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు) ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే చాంపియన్స్‌గా నిలిచారు. ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఈ ఘనత వహించారు. 2001 తర్వాత 2015లో సైనా నెహ్వాల్ మాత్రమే ఒకసారి ఫైనల్‌కు చేరుకొని తుది మెట్టుపై తడబడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లోనే... 110వ సారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈసారి భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ బీవెన్ జాంగ్‌తో... ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. గెలుపోటముల ముఖాముఖి రికార్డులో సింధు 5–4తో ఆధిక్యంలో ఉండగా... సైనా మాత్రం 2–8తో వెనుకబడి ఉంది. ఒకవేళ సింధు, సైనా తొలి రౌండ్ అడ్డంకి దాటినా తర్వాత రౌండ్లలో వీరిద్దరికి క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురుకానున్నారు. సింధు తొలి రౌండ్లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుంగ్ జీ హున్ (కొరియా) లేదా నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) ఎదురుపడతారు. ఇందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారాతో సింధు ఆడే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) సింధుకు ఎదురుకావొచ్చు. మరోవైపు సైనా తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాక తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... సెమీఫైనల్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) ప్రత్యర్థులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారైనా సింధు, సైనా అద్భుతం చేస్తారో లేదో వేచి చూడాలి. శ్రీకాంత్ గాడిలో పడేనా! కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తడబడుతోన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) ఎదురుకానున్నాడు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు టోర్నీలు ఆడగా మూడింటిలో తొలి రౌండ్లోనే ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన భమి డిపాటి సాయిప్రణీత్ తొలి రౌండ్లో జావో జున్‌పెంగ్ (చైనా)తో... లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో లక్ష్య సేన్... రుస్తావిటో (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడనున్నారు. మొత్తం 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) అందజేస్తారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; దండు పూజ–సంజన సంతోష్ జోడీలు... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట బరిలో ఉన్నాయి. అశ్విని, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా, లక్ష్య సేన్ ►1900 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభమైన ఏడాది. తొలి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో మినహా మిగతా సంవత్సరాలలో ఈ టోర్నీ కొనసాగింది. ►2 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన దేశాల సంఖ్య. చైనా, డెన్మార్క్ ఆటగాళ్లు 20 సార్లు చొప్పున ఈ టోర్నీలో విజేతగా నిలిచారు. ►1 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలిచిన ప్లేయర్ రూడీ హర్తానో. ఇండోనేసియాకు చెందిన రూడీ హర్తానో ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు విజేతగా నిలువగా... 1968 నుంచి 1974 వరకు వరుసగా ఏడేళ్లు టైటిల్ గెలిచాడు. ►7 ఇప్పటివరకు సింధు ఏడుసార్లు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడింది. 2018లో సెమీఫైనల్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 2017లో క్వార్టర్ ఫైనల్ చేరిన సింధు నాలుగుసార్లు (2012, 2014, 2016, 2019) తొలి రౌండ్లో, ఒకసారి రెండో రౌండ్లో (2013) ఓడిపోయింది. ►14 ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఆడనుండటం ఇది వరుసగా 14వ ఏడాది. 2007 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఒకసారి ఫైనల్, రెండుlసార్లు సెమీస్, ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. -
వన్‌పవర్‌మెంట్
ఆట అంటేనే పవర్! షాట్ కొట్టడానికి పవర్. క్యాచ్ పట్టడానికి పవర్. షూట్ చెయ్యడానికి పవర్. లాగి వదలడానికి పవర్. పావులు కదపడానికి పవర్. పంచ్ ఇవ్వడానికి పవర్. స్ట్రయికర్ని విసరడానికి పవర్. అన్నిటా ఎంపవర్మెంట్ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్ చూపిస్తున్నారు. నెంబర్ వన్ స్థానంతో విజయానికే వన్‌పవర్‌మెంట్ తెస్తున్నారు. తల్లి కలనునిజం చేయాలని! సైనా (బ్యాడ్మింటన్) పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది. సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకొని! అపూర్వీ చండేలా (షూటింగ్) మహిళల షూటింగ్ క్రీడలో భారత్ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్ ఒలింపిక్స్ మార్చేశాయి. షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి. బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్‌లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. మకుటంలేని మహరాణి! హంపి (చెస్) మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్ ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్–10 బాలికల ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 1998లో అండర్–12... 2000లో అండర్–14 విభాగంలో ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2002లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకుంది. నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ! షఫాలీ వర్మ (క్రికెట్) భారత్‌లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 15 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్నో...ఎన్నెన్నో! సానియా మీర్జా (టెన్నిస్) ప్రపంచ మహిళల టెన్నిస్ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్‌కు చేరిన సానియా... 2007లో సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్ సాధించింది. సానియా 2009లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో... 2012లో మహేశ్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2014లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సొంతం చేసుకుంది. గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్‌తో జతగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్... 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్ ఓపెన్ టోర్నీలో నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (2015), పద్మభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ‘పంచ్’ మే దమ్ హై మేరీకోమ్ (బాక్సింగ్) క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్‌గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ రింగ్‌లో తన పంచ్ పవర్ చాటుకుంటోంది మణిపూర్ మెరిక మేరీకోమ్. 37 ఏళ్ల మేరీకోమ్ భారత్‌లో మహిళల బాక్సింగ్‌కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఒలింపిక్స్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలా ప్రతి మెగా ఈవెంట్లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్’.. ‘పద్మవిభూషణ్’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్‌ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి మేరీకోమ్ తన ఉజ్వల కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటోంది. సరదాగా మొదలై! అపూర్వ (క్యారమ్) వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్‌కు చెందిన ఎస్.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది. ఆటో డ్రైవర్ అమ్మాయి! దీపిక కుమారి (ఆర్చరీ) మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్ మహతో ఆటో డ్రైవర్‌కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్‌గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది. – కరణం నారాయణ -
సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్లు, భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 24 నుంచి జరుగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో 2017 చాంపియన్ పీవీ సింధు హాంకాంగ్‌కు చెందిన చెంగ్ నాన్ యితో ఆడనుంది. చెంగ్‌పై పైచేయి సాధిస్తే క్వార్టర్స్‌లో ఆమెకు ఏడో సీడ్ మిచెల్లీ లీ (కెనడా) ఎదురుపడే అవకాశముంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ఈ టోర్నీ బరిలోకి దిగనున్న 2015 ఇండియా ఓపెన్ విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో పెయ్ యి పు (హాంకాంగ్)తో తలపడనుంది. అంతా సవ్యంగా జరిగితే ఆమెకు రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హ్యూన్ (కొరియా) రూపంలో పెద్ద పరీక్ష ఎదురుగా నిలిచింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న భారత స్టార్ ప్లేయర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లో క్వాలిఫయర్ ఎదురుపడ్డాడు. తర్వాత రౌండ్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో శ్రీకాంత్ ఆడాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం టోక్యోకు అర్హత పొందాలంటే ఏప్రిల్ 28లోగా ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు దక్కించుకోవాలి. దీంతో మాజీ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ శ్రీకాంత్‌కు ఈ టోర్నీ ప్రదర్శన కీలకంగా మారింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హెచ్ఎస్ ప్రణయ్‌తో మూడో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్, సిత్తికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ, ఏడో సీడ్ వాంగ్ జు వెయ్ (చైనీస్ తైపీ)తో సౌరభ్ వర్మ, ఖోసిత్ పెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్ ఆడనున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తొలి రౌండ్లో జపాన్ జోడీ టకురో హోకి–యుగో కొబయాషితో ఆడుతుంది. మరోవైపు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతగా పరిగణించే ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే క్వాలిఫయింగ్ టోర్నీలను నిలిపివేసే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) పేర్కొంది. ఇప్పటికే వైరస్ కారణంగా నాలుగు ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. చైనా మాస్టర్స్, వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్, జర్మన్ ఓపెన్, పోలిష్ ఓపెన్ టోర్నీ తేదీలను సవరించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 3000 మంది మృతి చేందారు. -
సైనాకు చుక్కెదురు
బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా 20–22, 19–21తో బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. పురుషుల విభాగంలో మాత్రం అజయ్ జయరామ్ (భారత్) సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్ పోరులో అతను 21–14, 21–15తో థామస్ రౌజెల్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 21–17, 17–21, 12–21తో కున్లావుట్ విటిడ్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. -
సైనా, శ్రీకాంత్ శుభారంభం
బార్సిలోనా (స్పెయిన్): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్... బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21–16, 21–14తో వైవోని లి (జర్మనీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 23–21, 21–18తో శుభాంకర్ డే (భారత్)ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 18–21, 15–21తో డారెన్ లియు (మలేసియా) చేతిలో ఓడిపోగా... వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ మూడో గేమ్‌లో 12–14 స్కోరు వద్ద గాయంతో వైదొలిగాడు. జయరామ్ 21–14, 21–12తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) పై, సమీర్ వర్మ 21–12, 21–9తో క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 10–21, 21–16, 21–17తో క్రిస్టియాన్సెన్–బోయె (డెన్మార్క్) జోడీపై గెలిచింది. -
సైనా, శ్రీకాంత్‌లకు సవాల్
బార్సిలోనా (స్పెయిన్): ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ల కోసం పోరాడుతున్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బార్సిలోనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచిన వీరిద్దరూ... 2020 సీజన్‌ను కూడా వరుస వైఫల్యాలతో ఆరంభించారు. సైనా నెహ్వాల్ ఈ ఏడాది ఆడిన మూడు టోర్నీల్లో ఒక్కసారి మాత్రమే తొలి రౌండ్ అడ్డంకిని దాటగా... శ్రీకాంత్ ఆడిన మూడు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడాడు. ప్రస్తుతం ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో సైనా 22వ స్థానంలో ఉండగా... శ్రీకాంత్ 26వ స్థానంలో ఉన్నాడు. అయితే క్వాలిఫయింగ్ గడువు ఏప్రిల్‌తో ముగియనుండటంతో... వీరిద్దరూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే గడువు తేదీ నాటికి టాప్–16లో చేరాల్సిన అవసరం ఉంది. దాంతో ఈ టోర్నీతో పాటు తర్వాత జరిగే మరో ఆరు టోర్నీలలో సైనా, శ్రీకాంత్‌లు మెరుగైన ప్రదర్శన చేసి తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. మహిళల విభాగంలో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో వైన్నె లీ (జర్మనీ)తో ఐదో సీడ్ సైనా; పురుషుల తొలి రౌండ్ మ్యాచ్‌లో శుభాంకర్ డే (భారత్)తో శ్రీకాంత్ తలపడతారు. రెండో సీడ్‌గా బరిలో దిగాల్సిన ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిషా జిల్బెర్‌మ్యాన్ (ఇజ్రాయిల్)తో సౌరభ్ వర్మ (భారత్); వైగోర్ కొయెల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్ (భారత్); లియూ డారెన్ (మలేసియా)తో హెచ్ఎస్ ప్రణయ్ ఆడతారు. -
బీజేపీలోకి సైనా.. జ్వాలకు చీవాట్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింట్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరడంపై సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాల తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అర్థం పర్థం లేని ఆటనే ఆడావనుకున్నా కానీ అర్థం పర్థం లేని పార్టీలో కూడా చేరావా అంటూ సైనాపై గుత్తా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు సైనా స్పందించనప్పటికీ.. నెటిజన్లు మాత్రం గుత్తా జ్వాలాకు చీవాట్లు పెడుతున్నారు. సైనా అర్థం పర్థం లేని రిలేషన్ షిప్‌లు, పెళ్లిళ్లు చేసుకోలేదని ఓ నెటిజన్ ఘాటుగా విమర్శించాడు. ‘సైనాను, బీజేపీని విమర్శించేముందు నీ స్థాయి ఏంటో ముందు చూసుకో, నీ సహచర క్రీడాకారిణపై అంత అక్కసు ఎందుకు? నువ్వు కూడా నీకు నచ్చిన పార్టీలో చేరొచ్చు కదా?’అంటూ నెటిజన్లు గుత్తా జ్వాలకు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం సైనా నెహ్వాల్‌కు సంబంధించి గుత్తా జ్వాలా చేసిన ట్వీట్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు సైతం అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజీపీలో చేరిన విషయం తెలిసిందే. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని బీజేపీలో చేరిన సందర్భంగా సైనా పేర్కొన్నారు. చదవండి: హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్ మాటలు రావడం లేదు: కోబీ భార్య భావోద్వేగం -
బీజేపీలోకి సైనా
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఆమె సోదరి చంద్రాన్షు సైతం బీజేపీలో చేరారు. బుధవారం వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం పార్టీలో చేరి మీడియాతో మాట్లాడారు. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. -
బీజేపీ తీర్థం పుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా ఇక నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రవేయనున్నారు. గతంలో అనేక సార్లు సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ ఆమెకు సభ్యత్వ రసీదు చేశారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. బీజేపీ చేరడం గర్వంగా ఉందన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు తెలిపారు. 29 ఏళ్ల సైనా.. 20 ఇంటర్నేషనల్ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. 2009లో వరల్డ్ నంబర్ 2, 2015 సంవత్సరంలో వరల్డ్ నంబర్ వన్ స్థానానికి ఎదిగారు. ప్రస్తుతం ఆమె తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నారు. -
బ్యాంకాక్ వెళ్లారు...తొలి రౌండ్లో ఓడేందుకు!
బ్యాంకాక్: భారత అగ్రశ్రేణి షట్లర్లు సహా అందరూ థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీలో నిరాశపరిచారు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. దీంతో టోర్నీ మెయిన్ ‘డ్రా’ మొదలైన రోజే భారత్ కథ ముగిసింది. మెరుగైన ర్యాంకింగ్ ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఆ స్థాయి ఆటతీరేమీ పోటీల్లో కనబర్చలేదు. ఇలా వెళ్లారు... అలా ఓడారు... అన్నట్లు తమ మ్యాచ్‌ల్ని ముగించుకొని కోర్టుల నుంచి బయట పడ్డారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్, ఐదో సీడ్ సైనా 13–21, 21–17, 15–21తో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లైన్ హోజ్మార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) చేతిలో తొలిసారి ఓడిపోయింది. గతంలో జార్స్‌ఫెల్డ్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఒక్క రెండో గేమ్‌లో మాత్రమే చక్కగా ఆడగలిగింది. మిగతా రెండు గేముల్లో చేతులెత్తేసింది. గతవారం జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ ఈవెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్ స్టార్ శ్రీకాంత్ 21–12, 14–21, 12–21తో షెసర్ హెరెన్ రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్లోనే చుక్కెదురవడం ఐదో సీడ్ తెలుగు షట్లర్‌కు వరుసగా ఇది మూడోసారి. మలేసియా, ఇండోనేసియా టోరీ్నల్లోనూ అతను మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. సమీర్ 16–21, 15–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ని్రష్కమించాడు. ప్రణయ్ 17–21, 22–20, 19–21తో ల్యూ డారెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ఒక దేశం నుంచి ఇద్దరు షట్లర్లు అర్హత పొందాలంటే ఒలింపిక్ ర్యాంకింగ్స్‌లో ఆ ఇద్దరు టాప్–16లో ఉండాలి. ప్రస్తుతం భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ మాత్రమే ‘టోక్యో’ దారిలో ఉన్నారు. -
పీబీఎల్‌కు వేళాయె...
చెన్నై: భారత స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ గైర్హాజరీలో... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌కు సోమవారం తెర లేవనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సభ్యురాలిగా ఉన్న హైదరాబాద్ హంటర్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌స్టార్స్ జట్టు తలపడుతుంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రితో పీవీ సింధు తలపడుతుంది. మొత్తం రూ. ఆరు కోట్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో అవధ్ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్, పుణే సెవెన్ ఏసెస్ జట్లు టైటిల్ కోసం బరిలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ తరఫున హైదరాబాద్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ పోటీపడుతున్నాడు. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌తో లీగ్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. -
మా ఇద్దరి మధ్య చాలా పోటీ ఉంటుంది: సింధు
న్యూఢిల్లీ: గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో తన సీనియర్, భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు తనకు మధ్య ఆట పరంగా చాలా పోటీ ఉంటుందని ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తెలిపింది. తన కోచ్ పుల్లెల గోపీచంద్‌తో ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేసింది. ‘ఇండియా టుడే’ ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సింధు పలు ఆసక్తికర అంశాలపై ముచ్చటించింది. ఇందులో భాగంగా గోపీ అకాడమీకి సింధు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుందంటూ గతేడాది వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. బెంగళూరు నుంచి సైనా తిరిగి 2017లో గోపీ అకాడమీకి వచ్చిన తర్వాత ఇద్దరూ వేర్వేరు అకాడమీల్లో ప్రాక్టీస్ చేయడం ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. దీని గురించి మాట్లాడుతూ ‘గోపీ సర్‌తో అంతా బాగుంది. ప్లేయర్‌గా నేను, కోచ్‌గా ఆయన ఆట కోసం 100 శాతం కృషి చేస్తాం. ఎలాగైనా భారత్‌కు పతకం అందించాలనేదే మా ఇద్దరి లక్ష్యం. అందుకే దానిపైనే దృష్టి సారిస్తాం’ అని సింధు పేర్కొంది. క్రీడాకారులుగా సైనాకు, తనకు మధ్య ఆటపరమైన శత్రుత్వం ఎప్పడూ ఉంటుందని చెప్పింది. ‘మా మధ్య ఎప్పుడూ చాలా పోటీ, శత్రుత్వం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరం ఆటగాళ్లమే కాబట్టి ఇలాగే ఉంటుంది. బరిలో దిగాక ఇద్దరం ఎవరి ఆలోచనలకు తగినట్లుగా వాళ్లం ఆడతాం. మా మధ్య పోటీ గోపీ సర్‌కు కొత్తలో కాస్త కష్టంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఆయన కూడా మా పోటీని క్రీడా స్ఫూర్తితో తేలిగ్గా తీసుకొని ఉంటారు. మా ఇద్దరి ఆటతీరు భిన్నంగా ఉంటుంది. ఆమె ఆలోచనలకు తగినట్లుగా ఆమెతో.. నా ప్రవర్తనకు తగినట్లుగా నాతో గోపీ సర్ మాట్లాడతారు. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆయన మా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు రాలేదు. ఇద్దరు భారతీయులు ఫైనల్స్‌లో తలపడుతున్నారని ఆయన చాలా ఆనందించారు. ఒక కోచ్‌గా మా ఇద్దరిలో ఎవరూ గెలిచినా ఆయనకు అంతే సంతోషంగా ఉంటుంది’ అని సింధు తెలిపింది. -
‘అంతా సైనా నిర్ణయమే’
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం తన అకాడమీని వదిలి సైనా నెహ్వాల్ బెంగళూరు వెళ్లిపోవడం తనను తీవ్రంగా బాధించిందని... ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్ ఆమెకు నచ్చజెప్పి ఉండాల్సిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) స్పందించింది. సైనా తన ఇష్ట్రపకారమే వ్యవహరించింది తప్ప తమ పాత్ర ఏమీ లేదని ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచి్చంది. ‘గోపీచంద్ అకాడమీని వదిలి పీపీబీఏలో శిక్షణ పొందాలనేది పూర్తిగా సైనా నెహా్వల్ సొంత నిర్ణయం. అందులో మా పాత్ర అసలేమాత్రం లేదు. అయితే కష్టకాలంలో విమల్ కుమార్ కోచింగ్ ఆమెకు ఉపకరించిందనేది వాస్తవం. ఆయన మార్గనిర్దేశనంలోనే సైనా వరల్డ్ నంబర్‌వన్‌గా నిలవడంతో పాటు ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ చాంపియన్ షిప్‌లలో ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఆటగాడిగా, కోచ్‌గా గోపీచంద్ ఘనతలపై మాకు అపార గౌరవం ఉంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారు మంచి ఫలితాలు సాధించినప్పుడు అభినందించాం. ఆయనతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. గత 25 ఏళ్లుగా పీపీబీఏ షట్లర్లను తీర్చిదిద్దుతోంది. వారిని ప్రోత్సహించడమే తప్ప కెరీర్లో వేర్వేరు దశల్లో ఎక్కడైనా వెళ్లిపోతామంటే ఎప్పుడూ ఆపలేదు. అది మా విధానం కూడా. అంతర్జాతీయ ప్రొఫెషనల్ క్రీడాకారుల కెరీర్ చాలా చిన్నది. తమ లక్ష్యాలు చేరుకునే క్రమంలో దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం కాబట్టి ఏం చేయాలనేది ఆటగాళ్లే నిర్ణయించుకోవాలి’ అని పీపీబీఏ స్పష్టం చేసింది. -
వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది
న్యూఢిల్లీ: శిష్యులు గొప్ప విజయాలు సాధించిన ప్పుడు తెగ సంబరపడిపోడు! అలాగే విమర్శలొచ్చినా పట్టించుకోడు! ఎప్పుడైనా సరే తన పని తను చూసుకొనే మనస్తత్వం పుల్లెల గోపీచంద్‌ది. అలాంటి గోపీ అప్పుడెప్పుడో సైనా నెహ్వాల్‌తో వచ్చిన మనస్పర్థలపై తాజాగా స్పందించాడు. త్వరలో విడుదల కానున్న ‘డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ అనే పుస్తకంలో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్... దిగ్గజ బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ ప్రకాశ్ పదుకొనేపై కూడా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నా అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం నాకిష్టం లేదు. నా ప్రియమైన శిష్యురాలు నా నుంచి దూరమవుతోందనిపించింది. అందుకే ఆమెను అకాడమీ నుంచి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాను. కానీ ఆమె అప్పటికే ఇతరుల మాటల్ని చెవికెక్కించుకుంది. నా మాట వినలేదు. ఆమె ఆట ప్రగతి కోసం తపించినప్పటికీ నా అకాడమీలోనే ఉండే విధంగా ఒప్పించలేకపోయాను. అది మా ఇద్దరికి మంచిది కాదని తెలుసు. కానీ ఏం చేస్తాం. ఓ కోచ్‌గా సింధు ప్రదర్శనపై కూడా నమ్మకంతో ఉన్నాను. ఇది నిజమే. ఆమెకూ శిక్షణ ఇచ్చాను. అయితే అదే సమయం (2012–2014)లో సైనాకిచ్చే శిక్షణలో, ప్రాధాన్యంలో నిర్లక్ష్యమేమీ చూపలేదు. అయితే ఈ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో’ అని అప్పటి గతాన్ని ఆ పుస్తకంలోని ‘బిట్టర్ రైవలరీ’ అనే అధ్యాయంలో క్లుప్తంగా వివరించాడు గోపీచంద్. ఈ విషయంలో ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్, వీరేన్ రస్కినాలెవరూ చొరవ చూపించలేదని, తన శిక్షణలోనే ఆమెకు మంచి జరుగుతుందని వాళ్లెవరూ ఆమెతో చెప్పలేపోయారని గోపీచంద్ అన్నాడు. ‘వీళ్లంతా సైనాతో మాట్లాడి ఒప్పించవచ్చు. కానీ వాళ్లెందుకు అలా చేయలేదో తెలియదు. పైగా హైదరాబాద్ వీడేందుకు ఆమెను ప్రోత్సాహించారు కూడా! నా రోల్ మోడల్ అయిన ప్రకాశ్ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. కానీ ఆయన మాత్రం బ్యాడ్మింటన్‌కు ఇంతచేసినా నా సేవల గురించి ఎక్కడా, ఎప్పుడూ ఒక్క మంచి మాటగానీ చెప్పలేదు. ప్రశంసలుగానీ కురిపించలేదు. ఇది నాకు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే’ అని గోపీచంద్ తెలిపాడు. ప్రముఖ క్రీడా పాత్రికేయులు బొరియా మజుందార్, నళిన్ మెహతా రచించిన ఈ పుస్తకం ఈనెల 20న విడుదలవుతుంది. ఈ పుస్తకంలో సైనా భర్త, షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. ‘గోపీచంద్ తనకు మాత్రమే కోచ్‌గా ఉండాలని సైనా భావించింది. అయితే ఒక్కసారిగా సింధు మంచి ఫలితాలు సాధించడంతో గోపీచంద్ కేవలం సైనాపైనే దృష్టి పెట్టకుండా ఇతరులకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అయితే ఈ అంశాన్ని సైనా పాజిటివ్‌గా తీసుకోకుండా నెగెటివ్‌గా తీసుకుంది. నా వంతుగా సైనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె నా మాటలు పట్టించుకోలేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో సైనా గాయంతోనే ఆడింది. లీగ్ దశలోనే వెనుదిరిగింది. నిజంగా సైనాకు అది గడ్డుపరిస్థితి. గోపీ అకాడమీ నుంచి నిష్క్రమించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ హరియాణా వాసి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే చేసింది. వాళ్లంతే! తాము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. దాన్నే తలదాకా ఎక్కించుకుంటారు. ఆ గర్వమే సైనాకు నష్టం కలిగించింది’ అని చెప్పుకొచ్చాడు. 2014 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు కాంస్యం సాధించడం... సైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత గోపీచంద్ అకాడమీ వీడాలని సైనా నిర్ణయించుకొని బెంగళూరులో విమల్ కుమార్ వద్ద శిక్షణకు వెళ్లిపోయింది. రెండేళ్లపాటు విమల్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించడంతోపాటు మూడు టైటిల్స్‌ను గెలిచింది. 2015 ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రన్నరప్‌గా నిలిచింది. అయితే 2016లో గాయాల బారిన పడ్డ ఆమె పూర్తి ఫిట్నెస్ లేకుండానే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంది. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. గాయాలు తిరగబెట్టడం... ఆటతీరు గాడి తప్పడం... బెంగళూరులో తనకు స్నేహితులు లేకపోవడంతో సైనాకు ఏమి చేయాలో తోచలేదు. సన్నిహితులతో చర్చించి, కెరీర్ గాడిలో పడాలంటే ఏం చేయాలో ఆలోచించి 2017 ప్రపంచ చాంపియన్ప్ ముగిశాక గోపీచంద్ గూటికే మళ్లీ చేరాలని సైనా నిర్ణయం తీసుకుంది. -
సింధు, సైనా నిష్క్రమణ
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఆకట్టుకోలేకపోయారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో వీరిద్దరి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 16–21, 16–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 8–21, 7–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యారు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 12వ ఓటమికాగా... మారిన్ చేతిలో సైనా ఓడటం ఇది ఏడోసారి. క్వార్టర్స్‌లో ని్రష్కమించిన సింధు, సైనాలకు 2,400 డాలర్ల (రూ. లక్షా 70 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయారు..
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. ఈరోజు(శుక్రవారం) జరిగిన మహిళల సింగిల్స్ పోరులో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఓటమి పాలయ్యారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టడంతో భారత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 16-21, 17-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చెందగా, సైనా నెహ్వాల్ 8-21, 7-21 తేడాతో మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చెందారు. ఈ సీజన్ ఆరంభపు టోర్నీని ఘనంగా ఆరంభించాలని చూసిన సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయారు. ఇది తై జు యింగ్ చేతిలో సింధుకు వరుసగా రెండో పరాజయం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధును తై జు యింగ్ ఓడించారు. తై జు యింగ్ తాజా విజయంతో ముఖాముఖి రికార్డును 12-5 తేడాతో మరింత పెంచుకుంది. ఇక సైనా నెహ్వాల్ అరగంటలోనే చేతులెత్తేశారు. -
సైనా నెహ్వాల్ ప్రతీకార విజయం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రి క్వార్టర్స్‌లో సైనా 25-23, 21-12 తేడాతో వరల్డ్ తొమ్మిదో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరారు. రెండు వరుస గేమ్‌ల్లో సైనా విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఇరువురి మధ్య తొలి గేమ్ హోరీ హోరీగా సాగింది. తొలి గేమ్‌లో సైనా ఐదు పాయింట్లతో ఆధిక్యంలో నిలవగా, ఆపై ఆన్ సెంగ్ పుంజుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి స్కోరు 23-23గా సమంగా నిలిచింది. ఆపై సైనా వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్ ఏకపక్షంగా జరిగింది. ఆన్ సె యంగ్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధిస్తూ సైనా దూసుకుపోయారు. ఫలితంగా 10 పాయింట్ల తేడాతో ఆన్ సె యంగ్‌పై పైచేయి సాధించిన సైనా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నారు. ఆన్ సె యంగ్‌పై సైనాకు ఇది తొలి విజయం. గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనాపై ఆన్ సె యంగ్ విజయం సాధించారు. తాజా గెలుపుతో దానికి సైనా ప్రతీకారం తీర్చుకున్నారు. తదుపరి గేమ్‌లో స్పెయిన్ స్టార్ కరోలినా మార్టిన్‌తో సైనా తలపడనున్నారు. -
‘మంచి భార్య రావాలని కోరుకోలేదు’
‘ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని నేను ఏనాడు కోరుకోలేదు. మనం ఒక్కటై గడిచిన.. ఈ ఏడాదిని అద్భుతంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన భార్య, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ప్రేమ చాటుకున్నాడు. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో సైనా- కశ్యప్‌లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. కాగా దాదాపు పదేళ్లపాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సైనా- కశ్యప్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని సైనా నివాసం ఓరియన్ విల్లాలో ఈ రాకెట్ స్టార్స్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం సినీ, క్రీడా ప్రముఖుల కోసం ఈ జంట నోవాటెల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇక భారత బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన సైనా.. ఈ విభాగంలో భారత్‌కు ఒలింపిక్ పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రపంచ బ్మాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సైనా జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా సైనాగా అలరించనున్నారు. కాగా పారుపల్లి కశ్యప్ సైతం కీలక మ్యాచుల్లో విజయం సాధించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఇక వీరిద్దరు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి క్రీడా ప్రస్థానం మొదలుపెట్టారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram You are simply the most amazing woman in the world. I couldn’t ask for a better wife. Thanks for making the first year together so wonderful. I love you so much. Happy anniversary!! 😘😘❤️ A post shared by Kashyap Parupalli (@parupallikashyap) on Dec 16, 2019 at 11:09am PST -
ఎన్‌కౌంటర్‌పై గుత్తా జ్వాల సూటి ప్రశ్న
హైదరాబాద్: దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు హైదరాబాద్ పోలీసుల్ని ప్రశంసించగా, తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సైతం స్పందించారు. ‘ గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీసు. వుయ్ సెల్యూట్ యు’ అని సోషల్ మీడియాలో కొనియాడారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కూడా హైదరాబాద్ పోలీసుల్ని ప్రశంసించారు. ‘హైదరాబాద్ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్ పవర్‌ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి’ రాథోడ్ పేర్కొన్నారు. ఇక మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్వీటర్ అకౌంట్లో స్పందిస్తూ తెలంగాణ పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. ‘ భవిష్యత్తులో అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలన్నారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా హత్యాచార ఘటనలకు పాల్పడతారో వారికే ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా. అత్యాచారానికి పాల్పడిన ప్రతీ ఒక్కర్నీ ఇలానే శిక్షిస్తారా’ ఇదే ‘ముఖ్యమైన ప్రశ్న’ అంటూ జ్వాల ప్రశ్నించారు. దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్లో హతమయ్యారు. నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Will this stop the future rapists?? And an important question Will every rapist be treated the same way...irrespective of their social standing?! — Gutta Jwala (@Guttajwala) December 6, 2019 ఇక్కడ చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు -
బాలీవుడ్ లేడీస్
టైటిల్ కార్డ్స్‌లో ఫస్ట్ హీరో పేరే పడుతుంది. ఆ తర్వాతే హీరోయిన్‌ది. కథ హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయినేమో హీరో చుట్టూ తిరుగుతుంది. హీరో విలన్‌తో ఫైట్ చేస్తే, హీరోతో హీరోయిన్ డ్యూయెట్ పాడుతుంది. ఒకప్పుడు కథని లాగాలంటే హీరోనే కావాలి అన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రతీ జనరేషన్లో కొందరు హీరోయిన్లు ఆ విధానాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకొని సోలో సినిమాలు చేశారు. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ముందు తమకో మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ జనరేషన్లో ఓ నలుగురు హీరోయిన్లు నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆ నలుగురిలో ఒక్క పరిణీతీ చోప్రా మినహా మిగతా ముగ్గురు కెరీర్లో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. అయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సగం రిస్క్ అనుకుంటే మిగతా సగం మారుతున్న ఆడియన్స్ టేస్ట్ అనుకోవచ్చు. బాలీవుడ్లో లీడ్ క్యారెక్టర్స్‌కి సై చెప్పి, లీడింగ్ లేడీస్ అయిన తారల విశేషాలు... సక్సెస్ సక్సేనా... తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. ‘ధడక్’తో కథానాయికగా పరిచయమై, రెండో సినిమాకే లేడీ ఓరియంటెడ్ సినిమా ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు జాన్వీ కపూర్. గుంజన్ సక్సేనాకు, జాన్వీకు ఓ పోలిక పెట్టొచ్చు. గుంజన్ సక్సేనా పైలెట్ అవ్వాలి, గాల్లో విహరించాలి అని కలలు కన్నారు. అవన్నీ ఉత్తి గాలి మాటలు అనుకున్నారు. ‘అమ్మాయిలు పైలెట్ కాలేరు’ అని ఆమెను తేలికగా తీసుకున్నారు. కానీ గుంజన్ తన కలను సీరియస్‌గా తీసుకున్నారు. పట్టుదలతో పైలెట్‌గా మారారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్‌గా చరిత్రలో నిలిచిపోయారు. తను విహరించిన ఫ్లైట్ నుంచి చూస్తే తనని హేళన చేసిన వాళ్లు కనిపించి కూడా ఉండరు. ఇది ఆమె సక్సెస్. జాన్వీకి నటిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ‘సేఫ్ గేమ్ ఆడుకోవచ్చుగా. అప్పుడే సోలో సినిమానా!’ అనే సెటైర్లూ వినిపించాయి. జాన్వీ తన రోల్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. పైలెట్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. తన నిర్ణయం కరెక్టో కాదో వచ్చే ఏడాది మార్చి 13న తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్‌కి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ విధంగా ప్రస్తుతానికి జాన్వీ సక్సెస్ అయ్యారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. టీనా.. కెటీనా అయింది కొందరికి చేతి నిండా ఉంగరాలుంటాయి. ఏంటీ అంటే మా జ్యోతిష్కుడు చెప్పాడంటారు. పేరులో ఒక అక్షరం పెరుగుతుంది. ఎందుకు? అంటే మళ్లీ అదే కారణం. మూఢ నమ్మకాల మీద సెటైరికల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెటీనా’. మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. అందుకే ఈ కథ అంటున్నారు దిశా పటానీ. ఏక్తా కపూర్ నిర్మాణంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. మూఢ నమ్మకలను పాటించే టీనా అనే టీనేజ్ అమ్మాయిగా దిశా కనిపిస్తారు. వాస్తవానికి తన పేరు టీనా. పేరుకి ముందు కె కలిపితే కలిసొస్తుందని జోత్యిష్కుడు చెబుతాడు. దాంతో టీనా కాస్తా కెటీనా అవుతుంది. హాట్ క్యారెక్టర్స్‌లో కనిపించే దిశా పటానీ ఇందులో ఓ మధ్య తరగతి అమ్మా యిలా కనిపిస్తారట. డబుల్ ధమాకా పరిణీతీ చోప్రా హీరోయిన్గా మారి ఎనిమిదేళ్లు కావస్తోంది. డజన్ సినిమాల వరకూ చేశారు. కెరీర్లో తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారామె. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఇందులో సైనా పాత్ర చేస్తున్నారు పరిణీతి. సైనాగా మారడానికి శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్ ఆడుతూ గాయపడ్డారు కూడా. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా చేస్తున్నారు. అదే టైటిల్‌తో వచ్చిన ఇంగ్లీష్ సినిమాకి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలోనూ పరిణీతీ చోప్రానే లీడింగ్ లేడీ. రిబ్బు దాస్ గుప్తా దర్శకుడు. ఇందులో పరిణీతితో పాటు అదితీ రావ్ హైదరీ, కృతీ కుల్హరీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పరిణీతీ చోప్రా. నెట్లో పడతాడా? ‘పదహారూ ప్రాయంలో నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి. నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి...’ అని పాడుతున్నారు ఇందూ. తనకి తగినవాడు, తన బాయ్‌ఫ్రెండ్ దొరికే వరకూ డేటింగ్ యాప్స్ అన్నీ తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ను వడకడుతున్నారు. మరి డేటింగ్ యాప్స్‌లో ఆమె వేసిన నెట్లో ఎవరు పడతారు? ఎలా పడతారు? అనేది సినిమా కీలకాంశం. డేటింగ్ యాప్స్ వల్ల ఇబ్బందులు పడే ఇందూగా కియారా అద్వానీ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఇందూ కీ జవానీ’ టైటిల్. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అబిర్‌సేన్ గుప్త దర్శకుడు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఆ హిట్ సినిమాలో ఉన్న హీరోయిన్ తన భూజాల మీద సినిమాని మోయగలదని నిరూపించుకుంటుంది. మరి.. బలనిరూపణలో ఈ నలుగురు తారలు ఎంత స్కోర్ చేస్తారనేది తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా ఒప్పుకున్నారు కాబట్టి.. కమర్షియల్ సినిమాలకు ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చేంత మార్కెట్ వారికి ఏర్పడాలని ఆశిద్దాం. – గౌతమ్ మల్లాది ∙దిశా పటానీ -
పీబీఎల్ నుంచి వైదొలిగిన సైనా
న్యూఢిల్లీ: కొంత కాలంగా పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వచ్చే ఏడాది జనవరిలో ఆరంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నేను పీబీఎల్ ఐదో సీజన్ ఆడటం లేదు. గాయాలు, అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. అందుకే పీబీఎల్ సీజన్ సమయాన్ని నా ఆట మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. తర్వాతి సీజన్లో ఆడేందుకు ప్రయతి్నస్తాను’ అని ట్విట్టర్లో తెలిపింది. పీబీఎల్‌లో సైనా హైదరాబాద్, అవ«ద్, నార్త్ ఈస్టర్న్ తరఫున సైనా బరిలో దిగింది. -
గాయపడ్డ హీరోయిన్.. మెడకు బ్యాండేజ్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్... ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత బ్యాడ్మింటన్ ఆడేందుకు మళ్లీ సిద్ధమైపోతాను అని పరిణీతి ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. మెడకు బ్యాండేజ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో పరిణీతి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇష్క్‌జాదే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన పరిణీతి.. శుద్ధ్ దేశీ రొమాన్స్, దావత్-ఏ-ఇష్క్, నమస్తే ఇంగ్లండ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన కేసరి, జబరియా జోడి సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా.. ప్రస్తుతం ఆమె సైనా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌ను తీసుకోగా.. ఇతర సినిమాల కారణంగా కాల్షీటు సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ అవకాశం పరిణీతి వరించింది. కాగా పరిణీతి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రో కజిన్ అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Dude. Me and the entire team of Saina have been taking so much care that I shouldn't get an injury, but shit happens. Will rest it as much as I can before I can start playing badminton again. 🙏 #SainaNehwalBiopic A post shared by Parineeti Chopra (@parineetichopra) on Nov 15, 2019 at 4:33am PST -
సైనా ఇంటికి... సింధు ముందుకు
హాంకాంగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ... హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ సింధు కేవలం 36 నిమిషాల్లో 21–15, 21–16తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. అయితే భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. సైనా 13–21, 20–22తో కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడింది. సైనా తాను ఆడిన గత ఆరు టో ర్నీల్లో ఐదుసార్లు తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ పరాజయం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రపంచ పదో ర్యాంకర్ సాయిప్రణీత్ 21–11, 18–21, 12–21తో మూడో సీడ్ షి యుకి (చైనా) చేతిలో... సమీర్ వర్మ 11–21, 21–13, 8–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. పారుపల్లి కశ్యప్ 21–18, 16–21, 21–10తో కెంటా నిషిమోటో (జపాన్)పై, ప్రణయ్ 21–17, 21–17తో హువాంగ్ జియాంగ్ (చైనా)పై, సౌరభ్ వర్మ 21–11, 21–15తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శ్రీకాంత్‌కు టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది. సాత్విక్–చిరాగ్ జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయి రాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–17, 16–21, 17–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంట చేతిలో.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 12–21తో మైకెన్–సారా తిగెసన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యాయి. -
సింధు, సైనాల పోరు ఎందాకా?
హాంకాంగ్: గత కొన్నాళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో ఆరంభం దశలోనే ని్రష్కమిస్తున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్‌లో ముందంజ వేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ –500 టోర్నమెంట్లో సంచలన జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలపై అందరి దృష్టి పడింది. ఇటీవల ఈ జంట అద్భుతమైన విజయాలతో దూసుకెళుతోంది. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించేందుకు ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జోడీ సిద్ధమైంది. మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సింధు, సైనా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షి ప్ టైటిల్ తర్వాత సింధు ఆశ్చర్యకరంగా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమిస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ మినహా బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలోనూ ఒకట్రెండు రౌండ్లకే ఇంటిదారి పడుతోంది. సైనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ టోర్నీ ద్వారా గాడిన పడాలని ఇద్దరు పట్టుదలతో ఉన్నారు. తొలిరోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆరో సీడ్ సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గ ఇయున్ (కొరియా)తో; ఎనిమిదో సీడ్ సైనా... కాయ్ యాన్ యాన్ (చైనా)తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో పోటీపడతాడు. మూడో సీడ్ షి యుకీ (చైనా)తో సాయిప్రణీత్... వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో సమీర్ వర్మ... కెంటా నిషిమోటో (జపాన్)తో కశ్యప్ తలపడతారు. -
సాయిప్రణీత్ శుభారంభం
ఫుజౌ (చైనా): ఆరంభంలో తడబడ్డా... వెంటనే తేరుకున్న భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–12, 21–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ టామీ సుగియార్తోపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సుగియార్తోపై సాయిప్రణీత్కిది వరుసగా మూడో విజయం. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా... తదుపరి రెండు గేముల్లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచాక... ఒక్కసారిగా విజృంభించి వరుసగా 10 పాయింట్లు స్కోరు చేసి 10–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు. సాయిప్రణీత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 44 నిమిషాల్లో 21–14, 21–13తో ప్రపంచ 21వ ర్యాంకర్ సిథికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. ఈ విజయంతో ఇటీవల డెన్మార్క్ ఓపెన్‌లో థమాసిన్ చేతిలో ఎదురైన ఓటమికి కశ్యప్ బదులు తీర్చుకున్నాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 18–21తో ప్రపంచ 28వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కశ్యప్ ఆడతాడు. 23 నిమిషాల్లోనే... మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. మంగళవారం ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టగా... సింధు సరసన సైనా నెహ్వాల్ కూడా చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా కేవలం 23 నిమిషాల్లో 9–21, 12–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గత నెలన్నర కాలంలో సైనా ఐదు టోర్నీలు ఆడగా... ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగతా నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లోనే ని్రష్కమించడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 14–21తో వాంగ్ చి లిన్–చెంగ్ చి యా (చైనీస్ తైపీ) చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) 21–23, 19–21తో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
పాత్రలా మారిపోవాలని
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నైహ్వాల్ బయోపిక్ సిద్ధం అవుతోంది. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటించనున్నారు. సైనా పాత్ర కోసం రోజుకి రెండుగంటల పాటు బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారు పరిణీతి. సైనాను కలసి ఆమె ఆలోచనలు, హావభావాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంటిని సందర్శించనున్నారు పరిణీతి. ‘‘ఈ సినిమా కోసం సైనా పాత్రను కేవలం పోషించడం కాదు పూర్తిగా సైనాలా మారిపోవాలనుకుంటున్నాను. వాళ్ల ఇంటికి వెళ్లి తన రోజువారీ జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేనొస్తున్నానని ప్రత్యేకంగా ఏం వంటలు తయారు చేయొద్దని, రోజూ వాళ్లు తినే భోజనాన్ని నాకు వడ్డించమని సైనా ఫ్యామిలీని కోరాను’’ అని పరిణీతి తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. -
సైనా ముందడుగు వేసేనా!
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహా్వల్ సార్లోర్లక్స్ ఓపెన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. జర్మనీలోని సార్‌బ్రకెన్ నగరంలో నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో హైదరాబాదీ సీనియర్ స్టార్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమె జర్మనీకి చెందిన ఫాబియెన్నె డిప్రెజ్‌తో తలపడుతుంది. జనవరిలో ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన సైనా... తర్వాత వరుస వైఫల్యాలతో నిరాశపరిచింది. ఏకంగా మూడు టోర్నీల్లో తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్‌కు ఎనిమిదో సీడ్ దక్కింది. ఈ సీజన్లో బెల్జియన్ ఇంటర్నేషనల్ ఓపెన్, డచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఈ భారత ఆటగాడు మూడో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. తొలిరౌండ్లో అతనికి బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్లో లక్ష్యసేన్ రాకెట్ పట్టనున్నాడు. ఈతు హీనో (ఫిన్లాండ్), ఎలియస్ బ్రాకే (బెల్జియం)ల మధ్య జరిగే తొలిరౌండ్ మ్యాచ్ విజేతతో లక్ష్యసేన్ రెండోరౌండ్లో తలపడతాడు. వీళ్లిద్దరితో పాటు ఈ టోర్నీలో కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్, రాహుల్ భరద్వాజ్ పాల్గొంటున్నారు. -
సూపర్‌గా ఆడి... సెమీస్‌కు చేరి...
పారిస్: అంతర్జాతీయ వేదికపై పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరోసారి సత్తా చాటుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–13, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించింది. గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్ మొహమ్మద్ హసన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా)లపై నెగ్గి సంచలనం సృష్టించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ అదే జోరులో మరో గొప్ప విజయం నమోదు చేసి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీస్‌కు చేరారు. గతంలో కిమ్–ఆండెర్స్‌లతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సాతి్వక్–చిరాగ్ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. తొలి గేమ్‌లో చెలరేగి ఆడిన భారత జంట ఆరంభంలోనే 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకుంటూ గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో డెన్మార్క్ జోడీ పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 4–0తో ముందంజ వేసింది. అయితే వెంటనే తేరుకున్న భారత జంట 9–9 వద్ద స్కోరును సమం చేసింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి 16–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్టువదలని డెన్మార్క్ జంట పాయింట్లు సాధించి 20–19తో గేమ్‌ను గెలిచే దిశగా నిలిచింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేయకుండా ఆడిన సాతి్వక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈసారి సైనాను... మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు, సైనా క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. డెన్మార్క్ ఓపెన్‌లో సింధును ఓడించిన 17 ఏళ్ల కొరియా అమ్మాయి యాన్ సె యంగ్ ఈసారి సైనాకు షాక్ ఇచ్చింది. 49 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యాన్ సె యంగ్ 22–20, 23–21తో సైనాను ఓడించి సెమీస్‌కు చేరింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో 75 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ఆరోర్యాంకర్ సింధు 16–21, 26–24, 17–21తో ఓడిపోయింది. ప్రపంచ చాంపియన్ అయ్యాక తాను పాల్గొన్న నాలుగో టోర్నమెంట్లోనూ సింధు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోవడం గమనార్హం. -
క్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్ జోడీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ రెండో సీడ్‌ను కంగుతినిపించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జంట 21–18, 18–21, 21–13తో మొహమ్మద్ హసన్– హెండ్రా సెతియావాన్ (సింగపూర్) ద్వయంపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్‌ను గెల్చుకున్న సాయిరాజ్ జంట రెండో గేమ్‌ను కోల్పోయినా... మూడో గేమ్‌లో పుంజుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహా్వల్ నిలకడగా ఆడుతున్నారు. ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో తమ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు. టోర్నీ ఐదో సీడ్ సింధు 21–10, 21–13తో యో జియా మిన్ (సింగపూర్)పై సునాయాస విజయం సాధించిం ది. మరో ప్రిక్వార్టర్ పోరులో సెనా నెహ్వాల్ 21–10, 21–11తో లినె హోజ్మార్క్ జెర్స్‌ఫెట్ (డెన్మార్క్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శుభాంకర్ డే (భారత్) 6–21, 13–21తో శెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. -
సైనా, శ్రీకాంత్‌లకు షాక్
ఒడెన్స్: ఈ సీజన్లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు మరోసారి నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ ఇద్దరు మాజీ చాంపియన్స్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోరీ్నల్లో బరిలోకి దిగని శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 14–21, 18–21తో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. 2017 ప్రపంచ చాంపియన్íÙప్లో ఆంటోన్సెన్పై ఇదే స్కోరుతో శ్రీకాంత్ గెలుపొందడం విశేషం. గత రెండేళ్లలో ఆంటోన్సెన్ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపించింది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్, బార్సిలోనా మాస్టర్స్, యూరోపియన్ గేమ్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన ఆంటోన్సెన్ ప్రపంచ చాంపియన్íÙప్లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయామ (జపాన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 21–16, 21–11తో మారి్వన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై నెగ్గింది. రెండో సీడ్ వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప జంట వాకోవర్ ఇచి్చంది. -
సైనాకు చుక్కెదురు
ఓదెన్స్(డెన్మార్క్): గత కొంతకాలంగా తొలి రౌండ్లోనే వెనుదిరుగుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి అదే ఫలితం పునరావృతమైంది. డెన్మార్క్ ఓపెన్ సూప ర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధ వారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 21–23తో తక హాషి(జపాన్) చేతిలో ఓటమి చవిచూసిం ది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజే త, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా ఈ మ్యాచ్‌లో తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయింది. తొలి సెట్‌ను చేజార్చు కున్నాక హోరాహోరీగా సాగిన రెండో సెట్లో సైనా పోరాడినప్పటికీ చివరికి ప్రత్యర్థి ధాటికి పరాజయం పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయమ (జపాన్) ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో చెన్ లాంగ్(చైనా)తో సమీర్ తలపడతాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 21–16, 21–11తో సీడెల్–ఎఫ్లర్(జర్మనీ) జోడీపై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరగా, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–అశ్వని పొన్నప్ప ద్వయం ప్రత్యర్థి జోడీ వాంగ్–హువాంగ్(చైనా)కు వాకోవర్ ఇచ్చి పోటీ నుంచి తప్పుకొంది. -
సింధుకు మళ్లీ నిరాశ
ప్రపంచ చాంపియన్ షిప్ విజయం తర్వాత పీవీ సింధుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. మొన్న చైనా ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లోనే ఓటమి ఎదురవగా... తాజాగా కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్లోనే ఆమె ఇంటిముఖం పట్టింది. సింధుతో పాటు ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సైనా నెహా్వల్ గాయాల కారణంగా తొలిరౌండ్ మ్యాచ్ మధ్యలోనే వైదొలగగా... పారుపల్లి కశ్యప్ ముందంజ వేశాడు. ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టూర్ వేదికపై ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు చుక్కెదురైంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ టైటిలే లక్ష్యంగా బరిలో దిగిన ఈ ప్రపంచ చాంపియన్... తొలి రౌండ్లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–7, 22–24, 15–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. అదిరే ఆరంభం లభించినా... బీవెన్ జాంగ్‌తో పోరులో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుకు అదిరే ఆరంభం లభించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆమె ప్రత్యర్థికి ఏడు పాయింట్లను మాత్రమే కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ గేమ్‌లో సింధు వరుసగా 12 పాయింట్లు సాధించడం విశేషం. రెండో గేమ్‌లో హోరాహోరీగా తలపడ్డారు. కీలక సమయంలో అసాధారణమైన ఆటతీరుతో జాంగ్ 24–22తో గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో సింధు చేతులెత్తేసింది. గేమ్ ఆరంభంలో గట్టి పోటీ ఇచి్చన సింధు... మ్యాచ్ సాగే కొద్ది పాయింట్లు సాధించడంలో వెనుకపడింది. 17–14తో ఉన్న సమయంలో ప్రత్యర్థి వరుసగా నాలుగు పాయింట్లు సాధించడంతో సింధు టైటిల్ ఆశలకు తొలి రౌండ్లోనే బ్రేకులు పడ్డాయి. గాయాలతో వైదొలిగిన సాయి, సైనా పతకంపై ఆశలు పెట్టుకున్న భారత షట్లర్లు సాయి ప్రణీత్, సైనా నెహా్వల్లను గాయాలు దెబ్బతీశాయి. పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 9–21, 7–11తో ఉన్న సమయంలో కాలి మడమ గాయం కారణంగా వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో కిమ్ గా ఉన్ (దక్షిణ కొరియా)తో మ్యాచ్‌లో సైనా నెహా్వల్ 21–19, 18–21, 1–8తో ఉండగా గాయంతో తప్పుకుంది. కశ్యప్ ముందంజ పారుపల్లి కశ్యప్ మాత్రమే తొలి రౌండ్ అడ్డంకిని దాటి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. అతను 21–16, 21–16తో లు చియా హుంగ్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. నేటి ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో లూయీ డారెన్ (మలేసియా)తో కశ్యప్ తలపడతాడు. పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్ పోరులో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 19–21, 21–18, 18–21తో నాలుగో సీడ్ తకేషి కముర– కిగో సొనొడ (జపాన్) జోడీ చేతిలో, మను అత్రి– సుమిత్ రెడ్డి జోడీ 16–21 21–19, 18–21తో క్వాలిఫయర్స్ హ్యూంగ్ కై జియాంగ్– లియు చెంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
సింధు ముందుకు... సైనా ఇంటికి
చాంగ్జౌ (చైనా): మరో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. అయితే మరో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు కేవలం 34 నిమిషాల్లో 21–18, 21–12తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై అలవోకగా గెలిచింది. ఎనిమిదో సీడ్ సైనా 10–21, 17–21తో ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్íÙప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 72 నిమిషాల్లో 21–12, 21–23, 21–14తో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై శ్రమించి నెగ్గగా... పారుపల్లి కశ్యప్ 21–12, 21–15తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
ప్రిక్వార్టర్స్‌కు సింధు.. సైనా ఇంటిబాట
చాంగ్జౌ(చైనా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచి జోరుమీదున్న తెలుగు తేజాలు పీవీ సింధు, సాయిప్రణీత్ చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పసిడి పతక విజేత సింధు 21–18, 21–12తో మాజీ ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్(చైనా)పై గెలిచింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ ఆఖర్లో సింధు ధాటికి జురుయ్ తలవంచింది. ఇక రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేయడంతో మ్యాచ్ సింధు వశమైంది. కాగా, మరో భారత క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 10–21 17–21తో బుసానన్ అంగ్బమ్రంగ్పన్(థాయ్‌లాండ్) చేతిలో అనూహ్య పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి సెట్‌ను చేజార్చుకున్నాక రెండో సెట్లో పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించాక అనంతరం ఏ టోర్నీలోనూ సైనా కనీసం సెమీస్‌కు కూడా చేరలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–23, 21–14తో సుపన్యు అవిహింగ్సనన్ (థాయ్‌లాండ్)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జోడీ సైతం తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ ద్వయం 21–13తో తొలి సెట్‌ను దక్కించుకొని రెండో సెట్లో 11–8తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి జంట చిన్ చెన్ లీ– చి యా చెంగ్ తప్పుకొంది. కాగా, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా–సిక్కిరెడ్డి ద్వయం 12–21, 21–23తో మార్క్ లామ్స్‌ఫస్–ఇసాబెల్ హెర్ట్రిచ్(జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. -
వైదొలిగిన సైనా
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నేటి నుంచి మొదలయ్యే చైనీస్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వెదొలిగింది. పురుషుల సింగిల్స్ నుంచి సౌరభ్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్‌లు కూడా తప్పుకున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు రియా ముఖర్జీ (భారత్) అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె 9–21, 21–16, 23–21తో సుపనిద కటెథొంగ్ (థాయ్‌లాండ్)పై అద్భుత విజయం సాధించి మెయిన్ ‘డ్రా’ లో ప్రవేశించింది. -
మొదలైంది వేట
గత ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు పతకాలు అందించిన స్టార్ క్రీడాకారిణులు పూసర్ల వెంకట (పీవీ) సింధు, సైనా నెహ్వాల్ మరోసారి పతకాల వేట ప్రారంభించారు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సింధు, సైనా అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత జోడీల పోరాటం ముగిసింది. బాసెల్ (స్విట్జర్లాండ్): అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకం అందుకోవాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఐదో సీడ్ పీవీ సింధు, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–14, 21–15తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై... సైనా 21–10, 21–11తో సొరాయ డివిష్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధుకు అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో 11–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. రెండో గేమ్‌లో పాయ్ యు పో తేరుకునే ప్రయత్నం చేసినా సింధు దూకుడు పెంచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు; 12వ సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) 16–21, 19–21తో హాన్ చెంగ్ కాయ్–హావో డాంగ్ జౌ (చైనా) చేతిలో... అర్జున్–శ్లోక్ 14–21, 13–21తో లియు చెంగ్–నాన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని 20–22, 16–21తో ఏడో సీడ్ డు యువె–లిన్ యిన్ హుయ్ (చైనా) చేతిలో... మేఘన–పూర్వీషా 8–21, 18–21తో షిహో తనాక–కొహారు (జపాన్) చేతిలో ఓడారు. శ్రీకాంత్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ శ్రీకాంత్ (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో జరిగిన రెండో రౌండ్లో శ్రీకాంత్ 13–21, 21–13, 21–16తో నెగ్గాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్; ఆంథోని (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; కాంతాపోన్(థాయ్‌లాండ్)తో శ్రీకాంత్ పోటీపడతారు. -
నిరీక్షణ ఫలించేనా?
గత ఐదు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు కనీసం కాంస్యం లేదంటే రజతం వచ్చింది. గత రెండు పర్యాయాల్లోనైతే త్రుటిలో స్వర్ణ పతకాలు చేజారాయి. అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకాన్ని ఈసారైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతుండగా... పురుషుల సింగిల్స్ విభాగంలో 36 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఏడాది మహిళల సింగిల్స్‌తోపాటు పురుషుల సింగిల్స్‌లోనూ భారత స్టార్స్ ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడంతో తుది ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. బాసెల్ (స్విట్జర్లాండ్): ఈ సీజన్లో నిరాశాజనక ఫలితాలు లభించినా... వాటన్నింటినీ మర్చిపోయేలా... తాజా ప్రదర్శనను అభిమానులందరూ గుర్తుపెట్టుకునేలా... తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేయాలనే పట్టుదలతో... నేటి నుంచి మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్‌లో భారత టాప్–4 క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ పోటీపడనున్నారు. ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో పదో ర్యాంకర్ శ్రీకాంత్... 34వ ర్యాంకర్ లోకీన్ యెవ్ (సింగపూర్)తో 14వ ర్యాంకర్ సమీర్ వర్మ... 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో షుయె (కెనడా)తో 19వ ర్యాంకర్ సాయిప్రణీత్; 93వ ర్యాంర్ ఈటు హీనో (ఫిన్లాండ్)తో 30వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నారు. అత్యున్నతస్థాయి టోర్నీ కావడంతో ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా భారత ఆటగాళ్లందరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే తొలి రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సాయిప్రణీత్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే రెండో రౌండ్లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో ప్రణయ్... లీ డాంగ్ కెయున్ (కొరియా)తో సాయిప్రణీత్ ఆడే అవకాశముంది. రెండో రౌండ్‌ను కూడా దాటితే మూడో రౌండ్లో ప్రణయ్‌కు డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్); సాయిప్రణీత్‌కు ఆరో సీడ్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) ఎదురుకావొచ్చు. మరోవైపు శ్రీకాంత్‌కు క్వార్టర్ ఫైనల్ వరకు కఠిన ప్రత్యర్థి దారిలో లేడు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిస్తే పతకం ఖాయమవుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం. 1983లో ప్రకాశ్ పదుకొనే సెమీస్‌లో ఓడి కాంస్య పతకాన్ని సాధించాడు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఇప్పటివరకు భారత్ నుంచి ఎవ్వరూ సెమీఫైనల్ చేరుకోలేదు. 2018లో సాయిప్రణీత్... 2017లో శ్రీకాంత్... 2013లో పారుపల్లి కశ్యప్... 2007లో అనూప్ శ్రీధర్.. 2001లో పుల్లెల గోపీచంద్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి త్రుటిలో పతకాలకు దూరమయ్యారు. ఒకే పార్శ్వంలో సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సింధు, ఎనిమిదో సీడ్ సైనా ఒకే పార్శ్శంలో ఉండటంతో వీరిద్దరు సెమీఫైనల్లో ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్లో వీరిద్దరికీ ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడతారు. రెండో రౌండ్లో సబ్రీనా (స్విట్జర్లాండ్)తో సైనా... పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో సింధు ఆడే చాన్స్ ఉంది. క్వార్టర్ ఫైనల్లో సైనాకు నాలుగో సీడ్ చెన్ యుఫె (చైనా)... సింధుకు రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ప్రత్యర్థులుగా ఉండే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్), మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్) సెమీస్ చేరుకోవచ్చు. మిక్స్డ్ డబుల్స్‌లో లేని ప్రాతినిధ్యం... డబుల్స్ విషయానికొస్తే భారత్‌కు ఈసారీ పతకావకాశాలు లేవనే చెప్పవచ్చు. ఇటీవల థాయ్‌లాండ్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట చివరి నిమిషంలో ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. సుమీత్ రెడ్డి–మనూ అత్రి... శ్లోక్ రామచంద్రన్–అర్జున్ జోడీలు బరిలో ఉన్నా... రెండో రౌండ్లోనే వీరికి చైనా జంటలు ఎదురుకానున్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; మేఘన–పూర్వీషా; సంజన–పూజ జోడీలు రెండో రౌండ్ దాటిముందుకెళ్లడం కష్టమే. మిక్స్డ్ డబుల్స్‌లో ఈసారి భారత ప్రాతినిధ్యం లేదు. వాస్తవానికి అశ్విని–సాత్విక్; సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలకు ఎంట్రీ లభించినా... సాత్విక్, ప్రణవ్‌లకు గాయాలు కావడంతో ఈ రెండు జోడీలు వైదొలిగాయి. -
సింధు, సైనాలకు ‘బై’
కౌలాలంపూర్ (మలేసియా): అందని ద్రాక్షగా ఉన్న స్వర్ణ పతకమే లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పోటీపడనున్న భారత మహిళా స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు ఒకింత క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 19 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని బాసెల్ నగరంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి సోమవారం కౌలాలంపూర్‌లో ‘డ్రా’ విడుదల చేశారు. ఈ ఏడాది అంతగా ఫామ్‌లో లేని సింధు ఐదో సీడ్‌గా, సైనా ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. సింధు, సైనాలతోపాటు సీడింగ్ పొందిన 16 మంది క్రీడాకారిణులకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో వారందరూ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడనున్నారు. పై పార్శ్వంలో ఉన్న సైనాకు రెండో రౌండ్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్), ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ మిచెల్లి లీ (కెనడా) లేదా ఫిత్రియాని (ఇండోనేసియా)లలో ఒకరు ఎదురుకావొచ్చు. ఈ అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ చెన్ యు ఫె (చైనా) లేదా తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)లలో ఒకరితో సైనా ఆడే అవకాశముంటుంది. సైనా సెమీస్ చేరితే అక్కడ ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్) లేదా ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉంటారు. కింది పార్శ్వంలో ఉన్న సింధు తన స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్‌కు సులువుగా చేరుకోవచ్చు. క్వార్టర్ ఫైనల్లోనే సింధుకు మాజీ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) రూపంలో అసలు పరీక్ష ఎదురయ్యే చాన్స్ ఉంది. ఈ అవరోధాన్ని అధిగమిస్తే సింధుకు సెమీస్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్) లేదా ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. శ్రీకాంత్‌కు సదవకాశం: పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున నలుగురు ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఏడో సీడ్‌గా కిడాంబి శ్రీకాంత్, పదో సీడ్‌గా సమీర్ వర్మ, 16వ సీడ్‌గా సాయిప్రణీత్, అన్‌సీడెడ్‌గా ప్రణయ్ బరిలో ఉన్నారు. శ్రీకాంత్ సహజశైలిలో ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరే చాన్స్ ఉంది. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఉంటాడు. మారిన్ దూరం: మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గాయం కారణంగా ఈ పోటీల నుంచి వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ విశ్వవిజేత అక్సెల్సన్ (డెన్మార్క్), రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) కూడా తప్పుకున్నారు. -
ప్రణీత్ ఒక్కడే క్వార్టర్స్‌కు
బ్యాంకాక్: టైటిల్ వేటలో భారత షట్లర్ల ఆటలు థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ సాగడంలేదు. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే కంగుతిన్నారు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో ఇప్పుడు భారత్ ఆశలన్నీ భమిడిపాటి సాయిప్రణీత్‌పైనే ఉన్నాయి. ఈ అన్‌సీడెడ్ షట్లర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి చుక్కెదురైంది. సాయి ప్రణీత్ అలవోక విజయం మిగతా భారత షట్లర్లకు విదేశీ ఆటగాళ్లు ఎదురుకాగా... సాయిప్రణీత్‌తో సహచరుడు శుభాంకర్ డే తలపడ్డాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను వరుస గేముల్లో 21–18, 21–19తో శుభాంకర్‌పై గెలుపొందాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శుభాంకర్ ప్రతీ గేమ్‌లోనూ పోరాడాడు. కానీ అతనికంటే మేటి ఆటగాడైన ప్రణీత్ ముందు ఎదురు నిలువలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–11, 16–21, 12–21తో స్థానిక ఆటగాడు కొసిట్ ఫెప్రదబ్ చేతిలో కంగుతిన్నాడు. మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) ధాటికి 21–9, 21–14తో పారుపల్లి కశ్యప్ నిలువలేకపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ ఆటను జపాన్‌కు చెందిన కెంటో నిషిమోటో వరుస గేముల్లోనే ముగించాడు. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరోసీడ్ నిషిమోటో 21–17, 21–10తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. సైనా పోరాటం సరిపోలేదు మహిళల సింగిల్స్‌లో సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. తర్వాత గేమ్‌లలో పోరాడే ప్రయత్నం చేసినా... జపాన్ ప్రత్యర్థి సయాక తకహాషి జోరు ముందు అదేమాత్రం సరిపోలేదు. చివరకు ఏడో సీడ్ భారత స్టార్ 21–16, 11–21, 14–21తో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–17, 21–19తో ఆరోసీడ్ ఫజర్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–19తో అల్ఫియాన్–మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. సిక్కిరెడ్డి–ప్రణవ్ జోడీ 16–21, 11–21తో ఎనిమిదో సీడ్ తంగ్చన్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
టాప్ టెన్‌లో సింధు, సైనా
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా, సైనా నెహ్వాల్ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. వీరిద్దరూ గత స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ముగ్ధ అగ్రే, రితుపర్న దాస్ వారి స్థానాలను మెరుగుపరుచుకుని 62, 65వ స్థానాలకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి రెండు స్థానాలు దిగజారి 24 ర్యాంక్‌కు పడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రనవ్ జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి 22వ స్థానంలో, పొన్నప్ప- రాంకిరెడ్డి జోడీ 23వ స్థానంలో స్థిరపడ్డారు. కాగా పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మలు 10, 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. జపాన్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో కెంటో మొమొటా చేతిలో ఓడిపోయిన సాయి ప్రణీత్ నాలుగు స్థానాలు ఎగబాకి పురుషుల సింగిల్స్‌లో 20వ స్థానానికి చేరుకున్నాడు. హెచ్ఎస్ ప్రణయ్(31), పారుపల్లి కశ్యప్(35), శుభంకర్‌దే(41), సౌరభ్, వర్మ(44) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 67వ స్థానంలో ఉండగా లక్షయ్ సెన్ 69వ స్థానంలో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి రెండు స్థానాలు ఎగబాకి 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మను అత్రి-సుమిత్ రెడ్డిలు 25వ స్థానంలో ఉన్నారు. -
వైదొలిగిన సింధు
బ్యాంకాక్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత నంబర్‌వన్ మహిళా షట్లర్ పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. రెండు వారాల క్రితం ఇండోనేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఈ రెండు టోర్నీల్లోనూ జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి చేతిలో సింధు ఓడిపోయింది. సింధు గైర్హాజరీలో... మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌పై ఆధారపడ్డాయి. ఈ ఏడాది ఆరంభంంలో ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్లకు ఎంట్రీలు పంపించి... ఆ తర్వాత వైదొలిగింది. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ సాధించడంతో ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా ఆడుతుంది. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు కెనడా ప్లేయర్ బ్రిట్నీ టామ్‌తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, శుభాంకర్ డే బరిలో ఉన్నారు. -
సైనాకు షాక్
స్థాయికి తగ్గట్టు ఆడితే కనీసం ఫైనల్ చేరుకోవాల్సిన టోర్నీలో భారత స్టార్ సైనా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒక్కోసారి ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని ఈ టోర్నీలో నిరూపితమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 212వ స్థానంలో ఉన్న చైనాకు చెందిన 19 ఏళ్ల అమ్మాయి వాంగ్ జియి ధాటికి తొమ్మిదో ర్యాంకర్ సైనా చేతులెత్తేసింది. ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. రెండో సీడ్ సైనా నెహ్వాల్‌తోపాటు అనురా ప్రభుదేశాయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 16–21, 23–21, 4–21తో ప్రపంచ 212వ ర్యాంకర్ వాంగ్ జియి (చైనా) చేతిలో... అనురా 9–21, 10–21తో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. వాంగ్ జియితో తొలిసారి ఆడిన సైనా తొలి గేమ్ ఆరంభంలోనే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత వాంగ్ అదే జోరును కొనసాగించి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకదశలో సైనా 12–17తో వెనుకబడినా పుంజుకొని స్కోరును సమం చేయడంతోపాటు కీలకదశలో పాయింట్లు నెగ్గి గేమ్‌ను గెల్చుకొని మ్యాచ్‌లో నిలిచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ఏడాది ఏడు టోర్నీల్లో పాల్గొన్న సైనా మలేసియా ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్లలో తొలి రౌండ్లో ఓడిపోగా... ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచి, మలేసియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు చేరింది. ఆల్ ఇంగ్లండ్, సింగపూర్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... లక్ష్య సేన్, శుభాంకర్ డే తొలి రౌండ్లో నిష్క్రమించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్ 21–17, 19–21, 21–15తో సహచరుడు శుభాంకర్ డేపై కష్టపడి నెగ్గగా... ప్రణయ్ 21–15, 21–14తో లో కీన్ యె (సింగపూర్)ను అలవోకగా ఓడించాడు. క్వాలిఫయర్ లక్ష్య సేన్ 21–15, 18–21, 10–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో ప్రణయ్ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 21–7, 21–10తో ఫెంగ్ జాషువా–జాక్ జియాంగ్ (న్యూజిలాండ్) జోడీని ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14–21, 23–21, 14–21తో లియు జువాన్జువాన్–జియా యుటింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
స్టార్ ఆటగాళ్లతో బరిలోకి
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన భారత బృందం... ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో పతకంతో తిరిగి రావాలనే లక్ష్యంతో స్టార్ ఆటగాళ్లందరినీ బరిలోకి దించాలని నిర్ణయించింది. చైనాలోని నానింగ్ నగరంలో మే 19 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) మంగళవారం ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, రెండో ర్యాంకర్ సమీర్ వర్మలను ఎంపిక చేశారు. 2017 సుదిర్మన్ కప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని చైనా చేతిలో ఓడిపోయింది. ఈసారి ఎనిమిదో సీడ్‌గా భారత్ పోటీపడనుంది. గ్రూప్ ‘డి’లో మాజీ చాంపియన్ చైనా, మలేసియాలతోపాటు భారత్‌కు చోటు కల్పించారు. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫలితంగా భారత్ ముందంజ వేయాలంటే లీగ్ దశలో కచ్చితంగా మలేసియాపై గెలవాల్సి ఉంటుంది. మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ గైర్హాజరీలో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశాలున్నాయి. సుదర్మిన్ కప్‌లో భాగంగా ఒక మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఒక్కో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. పురుషుల జట్టు: శ్రీకాంత్, సమీర్ వర్మ (సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి, మనూ అత్రి, ప్రణవ్ చోప్రా (డబుల్స్). మహిళల జట్టు: పీవీ సింధు, సైనా నెహ్వాల్ (సింగిల్స్), నేలకుర్తి సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, మేఘన, పూర్వీషా రామ్ (డబుల్స్). -
సైనా సాధించేనా?
ఆక్లాండ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యూజిలాండ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి ఈ సీజన్లో మరో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలో దిగుతోంది. తొలి రోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. సింగిల్స్ తొలి రౌండ్లో వాంగ్ జియి (చైనా)తో సైనా ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారమైతే సైనా తన స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్ చేరుకునే అవకాశముంది. మరో పార్శ్వంలో టాప్ సీడ్, ఆసియా చాంపియన్ అకానె యామగుచి (జపాన్) తుది పోరుకు చేరుకునే చాన్స్ ఉంది. ఈ ఏడాది భారత్ నుంచి సైనా నెహ్వాల్ మాత్రమే అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. ఆమె ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో అజయ్ జయరామ్, లక్ష్య సేన్, పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. మెయిన్ ‘డ్రా’లో హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్, శుభాంకర్ డేలకు చోటు లభించింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జోడీ... మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంటలు పోటీపడనున్నాయి. -
ఈసారి రిక్త హస్తాలతో...
వుహాన్ (చైనా): పతకాలకు విజయం దూరంలో ఉన్నప్పటికీ... అందరి అంచనాలను వమ్ము చేస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, సమీర్ వర్మ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ) నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ సింధు, ఏడో సీడ్ సైనా... పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ పరాజయం పాలయ్యారు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 13–21, 23–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా యామగుచి చేతిలో సైనాకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. గతంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన సైనా... 69 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 11–6తో, 14–11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. సైనా 14–11తో ముందంజలో ఉన్నపుడు యామగుచి ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 17–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సైనా కేవలం రెండు పాయింట్లు గెలిచి, నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది. ప్రపంచ 17వ ర్యాంకర్ కాయ్ యాన్యాన్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 19–21, 9–21తో ఓడింది. 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మెరుగ్గా ఆడిన సింధు రెండో గేమ్‌లో మాత్రం తేలిపోయింది. ఈ గెలుపుతో ఈ నెలారంభంలో సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి కాయ్ యాన్యాన్ బదులు తీర్చుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 10–21, 12–21తో పరాజయం పాలయ్యాడు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆరంభంలో మినహా సమీర్ తన ప్రత్యర్థి ముందు ఎదురు నిలువలేకపోయాడు. క్వార్టర్స్‌లో పరాజయం నిరాశ పరిచింది. మూడో గేమ్ మొదలయ్యేసరికి నేను అలసిపోయాను. ఈ గేమ్‌లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ పరిస్థితిని అనుకూలంగా మల్చుకోలేకపోయాను. – సైనా నెహ్వాల్ ఇటీవల కోచ్‌ల మార్పు ఆటగాళ్ల ఆటతీరును ప్రభావితం చేసింది. మన ఆటగాళ్లలో అపార ప్రతిభ ఉంది. వారందరూ తప్పకుండా పుంజుకుంటారు. గొప్ప విజయాలతో పునరాగమనం చేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాను. – మొహమ్మద్ సియాదత్, భారత కోచ్ -
సైనా, సింధు ముందుకు...
వుహాన్ (చైనా): గత ఏడాది ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్‌కు సింగిల్స్ విభాగాల్లో ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈసారి ఏకంగా మూడు పతకాలు మన ఖాతాలో జమయ్యే అవకాశముంది. తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ చేరుకొని పతకానికి విజయం దూరంలో నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు సైనా మూడు కాంస్య పతకాలను (2010, 2016, 2018లలో)... సింధు (2014లో) ఒక కాంస్య పతకాన్ని సాధించారు. గత ఏడాది పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ సైనా 21–13, 21–13తో కిమ్ గా యున్ (కొరియా)పై గెలుపొందగా... నాలుగో సీడ్ సింధు 21–15, 21–19తో చురిన్నిసా (ఇండోనేసియా)ను ఓడించింది. కిమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. చురిన్నిసాతో జరిగిన మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సింధు 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి విజయతీరాలకు చేరింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21–12, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉత్కర్‡్ష–కరిష్మా (భారత్) ద్వయం 10–21, 15–21తో ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్–జూహీ దేవాంగన్ (భారత్) జంట 10–21, 9–21తో వాంగ్ యిలు–హువాంగ్ డాంగ్పింగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
క్వార్టర్స్‌లో సైనా, సింధు
వుహాన్(చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్ ప్రిక్వార్టర్ పోరులో సైనా, సింధులు వరుస సెట్లలో తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. పీవీ సింధు 21-15, 21-19 తేడాతో చోరన్నిసా(ఇండోనేసియా)పై విజయం సాధించగా, సైనా నెహ్వాల్ 21-13, 21-13 తేడాతో కిమ్ గా ఎన్(దక్షిణకొరియా)పై గెలుపొందారు. మరొకవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21-12, 21-19 తేడాతో కా లాంగ్ ఆంగస్(హాంకాంగ్)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారుడి చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు టోర్నీల్లో ఆడిన శ్రీకాంత్ ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, మిగతా ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయాడు. వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే చేతులెత్తేయగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచ 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 20–22తో ఓడిపోయాడు. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్‌కిది రెండో పరాజయం కావడం విశేషం. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తలపడగా అప్పుడు కూడా రుస్తావిటో పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సింధు 21–14, 21–7తో సయాక తకహాషి (జపాన్)పై కేవలం 28 నిమిషాల్లో నెగ్గగా... ఏడో సీడ్ సైనా 12–21, 21–11, 21–17తో హాన్ యువె (చైనా)పై శ్రమించి విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) 13–21, 16–21తో జాంగ్ కొల్ఫాన్–రవింద (థాయ్‌లాండ్) చేతిలో; దండు పూజ–సంజన సంతోష్ (భారత్) 13–21, 21–12, 12–21తో ప్రమోదిక–కవిది (శ్రీలంక) చేతిలో; అపర్ణ బాలన్–శ్రుతి (భారత్) 12–21, 10–21తో యుజియా జిన్–మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18–21, 15–21తో హి జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
సింధు మిగిలింది!
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ లో పీవీ సింధు ఆట మాత్రమే మిగిలింది. ఈ నాలుగో సీడ్ తెలుగుతేజం మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఇంకా టైటిల్ బోణీ కొట్టని సింధు ఇప్పుడు ఆ వేటలో రెండడుగుల దూరంలో ఉంది. ఆమె మినహా మిగతా భారత షట్లర్లు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లోనే కంగుతిన్నారు. మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్‌తో పాటు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ పరాజయం చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ కూడా ఓడిపోయింది. శ్రమించి సెమీస్‌కు... భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధుకు ప్రపంచ 18వ ర్యాంకర్ కై యన్యన్ (చైనా) గట్టిపోటీనిచ్చింది. దీంతో మ్యాచ్ గెలిచేందుకు నాలుగో సీడ్ సింధు చెమటోడ్చాల్సివచ్చింది. గంటపాటు జరిగిన ఈ పోరులో చివరకు 21–13, 17–21, 21–14తో చైనా ప్రత్యర్థిని కంగుతినిపించింది. మరో క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 8–21, 13–21తో రెండో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు (శనివారం) జరిగే సెమీఫైనల్లో సింధు... ఈ మాజీ ప్రపంచ చాంపియన్ ఒకుహరతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 18–21, 21–19, 9–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, సమీర్ వర్మ 10–21, 21–15, 15–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 14–21, 16–21తో మూడో సీడ్ డెచపొల్ పువరనుక్రొ–సప్సిరి టెరతనచయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో కంగుతింది. -
సెమీస్‌లో పీవీ సింధు
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 21-13, 17-21, 21-14 తేడాతో యాన్యాన్(చైనా)పై విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌ను సింధు అవలీలగా గెలవగా, రెండో గేమ్‌లో యాన్యాన్ పుంజుకుంది. ఫలితంగా రెండో గేమ్‌లో సింధుకు ఓటమి తప్పలేదు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు జోరును కొనసాగించింది. మూడో గేమ్‌లో తన జోరును కొనసాగించిన సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక మరో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. సైనా నెహ్వాల్ 8-21, 13-21 తేడాతో ఒకుహరా(జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. ఏ దశలోనూ ఒకుహరాకు పోటీ ఇవ్వని సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో పీవీ సింధుతో ఒకుహరా తలపడనుంది. -
క్వార్టర్స్‌లో సింధు, సైనా
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు, హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ కూడా క్వార్టర్స్ చేరారు. అయితే సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్.ప్రణయ్లిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెమటోడ్చిన సైనా మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 21–16, 18–21, 21–19తో థాయ్‌లాండ్‌కు చెందిన పొర్న్‌పవి చొచువాంగ్‌పై చెమటోడ్చి గెలిచింది. ఇటీవల మలేసియా ఓపెన్‌లో థాయ్ షట్లర్ చేతిలో తనకెదురైన పరాజయానికి హైదరాబాదీ స్టార్ బదులు తీర్చుకుంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనాకు 21వ ర్యాంకులో ఉన్న చొచువాంగ్ గట్టిపోటీనిచ్చింది. మూడు గేమ్‌ల వరకు హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు సైనా పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 21–13, 21–19తో మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)ను వరుస గేముల్లో కంగుతినిపించింది. కేవలం 40 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–12, 23–21తో డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టిన్ సోల్బెర్గ్పై గెలుపొందగా, సమీర్ వర్మ 21–15, 21–18తో లు గ్వాంగ్జూ (చైనా)పై అలవోక విజయం సాధించాడు. పోరాడి ఓడిన కశ్యప్ పారుపల్లి కశ్యప్‌కు 9–21, 21–15, 16–21తో నాలుగో సీడ్ చెన్‌లాంగ్ (చైనా) చేతిలో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ భారత సీనియర్ షట్లర్... చైనా సీడెడ్ ఆటగాడికి గట్టిపోటీ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) 21–11, 21–11తో వరుస గేముల్లోనే హెచ్.ఎస్.ప్రణయ్ ఆటకట్టించాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–17, 6–21, 21–19తో హాంకాంగ్‌కు చెందిన ఐదో సీడ్ తంగ్ చున్ మన్– సె యింగ్ సుయెట్ జంటకు షాకిచ్చింది. -
భారత స్టార్ల శుభారంభం
సింగపూర్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లంతా శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్స్ చేరారు. అయితే భమిడిపాటి సాయిప్రణీత్... టాప్ సీడ్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లోనూ భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింధు 27 నిమిషాల్లోనే... మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సింధు సునాయాస విజయం సాధించింది. సింధు 21–9, 21–7తో ఇండోనేసియాకు చెందిన లియాని అలెసండ్ర మయినకిని చిత్తుగా ఓడించింది. కేవలం 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. మరో మ్యాచ్‌లో సైనా 21–16, 21–11తో యులియా యుసెఫిన్ సుశాంటో (ఇండోనేసియా)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–18తో సితికోమ్ తమసిన్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 11–21, 21–16, 21–18తో ఫ్రాన్స్‌కు చెందిన బ్రైస్ లెవెర్డెజ్పై గెలుపొందగా, సమీర్ వర్మ 21–14, 21–6తో సుపన్యు అవిహింగ్సనన్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ డ్రాకు చేరిన పారుపల్లి కశ్యప్ 21–19, 21–14తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)పై విజయం సాధించాడు. పోరాడి ఓడిన సాయిప్రణీత్ భారత సహచరులంతా ముందంజ వేయగా సాయిప్రణీత్ ఆట తొలిరౌండ్లోనే ముగిసింది. అతను 21–19, 14–21, 20–22తో మొమొటా చేతిలో పోరాడి ఓడాడు. సిక్కి జోడీ గెలిచింది మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 21–18, 21–7తో భారత్‌కే చెందిన మనీష–అర్జున్ జోడీపై గెలుపొందింది. సౌరభ్ శర్మ–అనుష్క పారిఖ్ జోడీ 12–21, 12–21తో డెచపొల్ పువరనుక్రొ–తెరతనచయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 13–21, 17–21తో డానీ క్రిస్నంటా– కియన్ హీన్ (సింగపూర్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
సైనాకు తొలిరౌండ్లోనే షాక్
కౌలాలంపూర్: భారత వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. గత వారం ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన హెచ్.ఎస్.ప్రణయ్ ఈ టోర్నీలో తొలిరౌండ్ దాటలేకపోయాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 22–20, 15–21, 10–21తో పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ థాయ్ ప్రత్యర్థిపై గెలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా తొలిసారి తనకన్నా తక్కువ ర్యాంకులో ఉన్న పొర్న్‌పవీ (21 ర్యాంకు) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 22–20, 21–12తో జపాన్‌కు చెందిన అయ ఒహొరిపై గెలుపొందింది. ఆమెపై సింధుకిది ఆరో విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–18, 21–16తో ఇసాన్ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–12, 16–21, 14–21తో సితికొమ్ తమసిన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున సింధు, శ్రీకాంత్‌లే మిగిలారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 16–21, 6–21తో ఏడో సీడ్ హన్ చెంగ్‌కై–జౌ హొడాంగ్ (చైనా) జంట చేతిలో చిత్తుగా ఓడింది. నేడు జరిగే మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ మలేసియాకు చెందిన తన్ కిన్ మెంగ్–లై పి జింగ్ జంటతో తలపడుతుంది. సింగిల్స్‌లో సింధు కొరియాకు చెందిన సుంగ్ జీ హ్యూన్తో, శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఆటగాడు కొసిట్ ఫెట్‌ప్రదబ్‌తో పోటీ పడతారు. -
ఇండియా ఓపెన్ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ వేదికగా ఈనెల 26 నుంచి జరిగే ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వైదొలిగింది. కడుపు నొప్పి నుంచి తాను ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు సైనా సమాచారం ఇచ్చింది. 2015లో ఇండియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సైనా వైదొలగడంతో... మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ప్రస్తుతం భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే బరిలో ఉంది. -
శ్రద్ధా అవుట్.... పరిణీతి ఇన్
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వదిలేసిన బ్యాడ్మింటన్ రాకెట్‌ను మరో బ్యూటీ పరిణీతీ చోప్రా అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైనా’. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా సైనా నెహ్వాల్ పాత్రకు శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు అకస్మాత్తుగా టైటిల్ రోల్లో పరిణీతీ చోప్రా నటించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. ‘‘చిచోరే, స్ట్రీట్ డ్యాన్సర్ 3, భాఘీ 3, సాహో’ చిత్రాలతో శ్రద్ధాకపూర్ చాలా బిజీగా ఉన్నారు. ‘సైనా’ చిత్రాన్ని ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి 2020లో విడుదల చేయాలనుకుంటున్నాం. మా ప్లాన్‌కి తగ్గట్టుగా శ్రద్ధా డేట్స్ కుదిరేట్లు లేవు. అందుకే ఆమె స్థానంలో పరిణీతీ చోప్రాను తీసుకున్నాం. ఈ మార్పు పరస్పర అంగీకారం ప్రకారం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పరిణీతీకి బాగా నచ్చింది. త్వరలోనే ఆమె బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు’’ అని చిత్రబృందం వెల్లడించింది. -
సైనాకు అనారోగ్యం.. స్విస్ ఓపెన్ నుంచి ఔట్
బాసెల్(స్విట్జర్లాండ్): అనారోగ్యం కారణంగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనా అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. స్విస్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లిన సైనాకు కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో సైనా పోస్ట్ చేశారు. ‘ఇది నిజంగానే నాకు చేదు వార్త. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అన్నాశయ సంబంధిత సమస్యగా చెప్పారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా’ అని సైనా అని తెలిపారు. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో కశ్యప్ 21-19, 21-17తో ఫెలిక్స్ బ్యూరెస్‌డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21-19, 21-17తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరారు. -
భార్యను మందలించిన కశ్యప్
బర్మింగ్హమ్ : ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు సైతం మళ్లీ ఓటమి తప్పలేదు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సైనా వరుసగా 13వసారి ఓటమి చవిచూసింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. అనవసర తప్పిదాలు చేస్తూ మ్యాచ్ చేజార్చుకుంటున్న సైనాను చూసి కశ్యప్ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ బ్రేక్ టైంలో ‘ఓయ్.. నువ్వు చెత్త షాట్స్ ఆడుతున్నావ్.. మ్యాచ్ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు.’ అంటూ మందలించాడు. దీంతో సైనా కొంత పోరాట పటిమను ప్రదర్శించినప్పటికి తై జుయింగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక తొలి గేమ్ అనంతరం మరోసారి కశ్యప్ సైనాకు సలహాలిచ్చాడు. ‘ఆచితూచి షాట్స్ ఆడు. అనవసర షాట్స్ ఆడుతూ పదేపదే తప్పు చేస్తున్నావ్. కోర్టును వదిలేస్తున్నావ్. ఆమె మాత్రం ఛాలెంజింగ్‌గా తీసుకుని పరిస్థితులకు తగ్గట్లు ఆడుతోంది. అది గమనించు. ఆమె ఆడుతున్న తీరును చూడు’ అంటూ సలహా ఇచ్చాడు. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా 15–21, 19–21తో ఓటమి చవిచూసింది. ఇక బ్యాడ్మింటన్ ప్రేమ జంట కశ్యప్, సైనా గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. -
సైనా... వరుసగా 13వ‘సారీ’
బర్మింగ్హమ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్స్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 18 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరదించుతారని భావిస్తే అలాంటిదేమీ జరగలేదు. మనోళ్లందరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయారు. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. 2015లో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ నంబర్‌వన్, చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. 37 నిమిషాల్లోనే ముగిసిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 15–21, 19–21తో టాప్ సీడ్ తై జు యింగ్ చేతిలో ఓటమి చవిచూసింది. గతేడాది ఇదే టోర్నీ తొలి రౌండ్లో తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ చైనీస్ తైపీ చేతిలో ఆమెకిది 15వ ఓటమి. 2013లో స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌పై గెలిచిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణిని ఓడించలేకపోయింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 16–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మొమోటా చేతిలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్‌కిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. వాంతులు, విరేచనాలతో బాధపడ్డాను. కడుపులో నొప్పి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌లు ఆడి గెలవగలిగాను. తై జు యింగ్‌తో పదే పదే ఆడటం మంచిదే. ఆమెను ఎలా ఓడించాలనే విషయం నేర్చుకోవాల్సి ఉంది. సైనా నెహ్వాల్ -
సైనా అద్భుత విజయం
8–21... ప్రిక్వార్టర్స్‌లో సైనా తొలి గేమ్ స్కోరిది... కొద్ది నిమిషాల వ్యవధిలోనే సైనా ఆ గేమ్‌ని కోల్పోయింది. ఇక మ్యాచేం గెలుస్తుందిలే అనుకున్నారంతా! కానీ ఆమె గెలిచి చూపించింది. రెండు, మూడో గేముల్ని వరుసగా గెలిచి క్వారర్స్కు దూసుకెళ్లింది. ఈ రెండు గేముల్లోనూ ఆమె జోరు చూస్తే మునుపటి సైనాలా కనిపించింది. ఇదే కసితో మరోసారి ఫైనల్ చేరుతుందేమో చూడాలి. బర్మింగ్‌హామ్: భారత వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ అద్భుత విజయంతో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఎనిమిదో సీడ్ భారత సీనియర్ షట్లర్ 8–21, 21–16, 21–13తో లైన్ హోజ్మర్క్ జేర్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు. అతను 21–17, 11–21, 21–12తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. డబుల్స్ మాత్రం భారత ఆటగాళ్లకు కలిసిరాలేదు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు పరాజయం చవిచూశాయి. సూపర్ సైనా తొలిరౌండ్ పోరులో 21–17, 21–18తో స్కాట్లాండ్కు చెందిన క్రిస్టీ గిల్మోర్‌పై విజయంతో ప్రతిష్టాత్మక టోర్నీలో శుభారంభం చేసిన సైనా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముందు తడబడింది. ప్రత్యర్థి హోజ్మర్క్ ధాటికి నిమిషాల వ్యవధిలోనే 8–21తో తొలిగేమ్‌ను కోల్పోయింది. అయితే ఈ గేమ్‌ను ఎంత త్వరగా కోల్పోయిందో అంతే త్వరగా కోలుకుంది. రెండో గేమ్‌లో తన అనుభవాన్ని జోడించి షాట్లకు పదునుపెట్టింది. 2015 ఫైనలిస్ట్ అయిన సైనా రెండో గేమ్‌లో దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే 6–4తో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. అయితే ఈ దశలో హోజ్మర్క్ కూడా టచ్‌లోకి రావడంతో 8–8 వద్ద స్కోరు సమమైంది. తర్వాత కోర్టులో చురుగ్గా కదిలిన భారత క్రీడాకారిణి ఒక్కో పాయింట్‌తో ప్రత్యర్థిని అధిగమించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 16–12కు చేరిన ఆమెకు ఈ గేమ్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా జోరు ముందు డెన్మార్క్ షట్లర్ నిలువలేకపోయింది. 2–0తో తర్వాత 5–1తో ఇలా హైదరాబాదీ రాకెట్ దూసుకెళ్తుంటే... ప్రత్యర్థి మాత్రం చేతులెత్తేసింది. 18–12తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచే స్థితిలోకి వచ్చిన సైనా తన ప్రత్యర్థి ఒక పాయింట్ చేసేలోపే మూడు పాయింట్లు చేసి గెలిచింది. మొత్తంగా 51 నిమిషాల్లో ఆటను ముగించి క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. ఆసియా చాంప్కు శ్రీకాంత్ షాక్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలుగు షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ గెలుపొందగా... భమిడిపాటి సాయిప్రణీత్‌కు పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడల చాంపియన్ జొనాథన్ క్రిస్టీకి భారత స్టార్ శ్రీకాంత్ షాకిచ్చాడు. గత రెండు మ్యాచ్‌లలో అతని చేతిలో ఓడిన శ్రీకాంత్ మేటి టోర్నమెంట్లో మాత్రం పైచేయి సాధించాడు. సుమారు గంట (58 నిమిషాలు) పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ 21–17, 11–21, 21–12తో ఇండోనేసియా ప్రత్యర్థిపై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో భారత ఆటగాడు... టాప్‌సీడ్ కెంటో మొమోటా (జపాన్)తో తలపడనున్నాడు. సాయిప్రణీత్ మాత్రం వరుస గేముల్లో 12–21, 17–21తో ఎన్జీ క లాంగ్ అంగస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. సమీర్ వర్మకు తొలి రౌండ్లో చుక్కెదురైంది. అతను 21–16, 18–21, 14–21తో మాజీ ప్రపంచ చాంపియన్, నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి ద్వయం 19–21, 21–16, 14–21తో ఒయు జుయాన్యి–రెన్ జియాంగ్యు (చైనా) జోడీ చేతిలో కంగుతినగా... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 21–23, 17–21తో చంగ్ తక్ చింగ్–వింగ్ యంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. -
నిరీక్షణ ముగిసేనా?
బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్లోని అతి పురాతన టోర్నమెంట్లలో ఒకటైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ పోటీలకు నేడు తెరలేవనుంది. 2001లో పుల్లెల గోపీచంద్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులకు టైటిల్ లభించలేదు. 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది పీవీ సింధు పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అయితే కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటే... ఈసారి కూడా మనోళ్లు టైటిల్ రేసులో ఉన్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్లపై భారీ అంచనాలు ఉన్నాయి. మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడం... ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఫామ్‌లో లేకపోవడం.. జపాన్ క్రీడాకారిణులు నొజోమి ఒకుహారా, అకానె యామగుచిలపై మంచి రికార్డు ఉండటంతో... సింధు, సైనాలు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే వారికి ఈసారి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఐదో ర్యాంకర్ పీవీ సింధు... కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 8–6తో సుంగ్ జీ హున్‌పై... సైనా 6–0తో గిల్మోర్‌పై ఆధిక్యంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా నలుగురు బరిలో ఉన్నారు. మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్; ప్రణయ్‌తో సాయిప్రణీత్; అక్సెల్సన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఒయు జువాని–రెన్ జియాంగ్యు (చైనా) జోడీతో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో షిమో తనాకా–కొహారు యోనెమోటో (జపాన్) ద్వయంతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ తలపడతాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ఆడతారు. -
సింధుపై సైనాదే పైచేయి
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేతగా నిలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21–18, 21–15తో టాప్ సీడ్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. గత జాతీయ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సింధునే ఓడించి సైనా టైటిల్ నెగ్గింది. ఓవరాల్‌గా జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం సైనాకిది నాలుగోసారి. గతంలో ఆమె 2006, 2007, 2017లలో విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న సైనా అదే జోరును ఇక్కడా కొనసాగించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో సింధును ఓడించి స్వర్ణ పతకం సాధించిన సైనా ఈసారీ వ్యూహాత్మకంగా ఆడింది. కోర్టు అవతల నుంచి భర్త పారుపల్లి కశ్యప్ అందించిన సలహాలు సైనాకు ఉపకరించాయి. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే స్కోరు 9–10 వద్ద సైనా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సైనా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను 27 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో గేమ్ మొదట్లో మళ్లీ ఈ ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా... స్కోరు 6–7 వద్ద సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–7తో ముందంజ వేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగిస్తూ సింధు ఆట కట్టించి సైనా విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన సైనాకు రూ. 3 లక్షల 25 వేలు ... రన్నరప్ సింధుకు రూ. లక్షా 70 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) గెలుచుకున్నాడు. ఫైనల్లో సౌరభ్ వర్మ 21–18, 21–13తో ఆసియా జూనియర్ చాంపియన్, 17 ఏళ్ల లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై గెలుపొందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ వర్మ జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించడం ఇది మూడోసారి. గతంలో అతను 2011, 2017లలో గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలుగు అమ్మాయి కె.మనీషా (ఆర్బీఐ)–మనూ అత్రి (పీఎస్‌పీబీ) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో మనీషా–మనూ అత్రి ద్వయం 18–21, 21–17, 21–16తో టాప్ సీడ్ రోహన్ కపూర్ (ఎయిరిండియా)–కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్) జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట 21–13, 22–20తో ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–శ్లోక్ రామచంద్రన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జంట 21–16, 22–20తో టాప్ సీడ్ జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (ఆర్బీఐ) జోడీపై నెగ్గింది. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపు
జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సైనా నెహ్వాల్ నిలిచారు. ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపొందారు. 21-18, 21-15 తేడాతో పీవీ సింధుపై సైనా విజయం సాధించారు. వరుసగా రెండో ఏడాది సింధుపై సైనా గెలిచారు. ఈ విజయంతో నాలుగోసారి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా సైనా నిలిచారు.